10, జనవరి 2014, శుక్రవారం

102. *Comedy Love Story-6 ( పూజా ఫలం ) ***

                                                                 



 పూజా ఫలం                                                                            మోహేశుడు ఆరడుగుల అందగాడు, మాటలతో మనుష్యు లను మభ్య పెట్టి మనసును దోచే మహావీరుడు, స్త్రీలను చూసి వలలో వేసుకోవాలనే తాపత్రయం  గలవాడు, అట్టి మోహేశుకు అందము తక్కువ వున్న వయస్సు లో వున్న ఓ అమ్మాయితో పరిచయ మైనది. ఇద్దరి అభి ప్రాయాలు  కలసినవి, మాట మాట కలసి  పరిణయము నకు  సిద్ధమైనారు.

తక్కువరంగు, తక్కువ చదువు, చురికైన యవ్వనవతి, అదృష్టం కొద్ది పెళ్ళికి సిద్ధమైన రూపవతి, స్నేహితు లందరికీ  తను ప్రేమించిన మోహేశును చూపి నా అంత అదృష్ట వంతురాలు లేదు అని గర్వంగా  అందరికి చెప్పు కుంది.

ఒక శుభముహుర్తాన పెద్దల సమక్షమున ప్రభ మోహేశుకు వివాహము జరిగింది. పెద్దలు ప్రతి ఒక్కరూ నూతన వధూ వరులను ఆశీర్వదిమ్చి పెళ్లి భోజనాలతో సంతోషపడి పసందైన జంట అంటు, అందులో అబ్బాయి చాలా బాగున్నాడు అమ్మాయి కన్నా అని కొందరు అనటం కూడా జరిగింది. మొత్తము మీద వివాహ వేడుకల ఘనముగా జరిగినవి.

పెళ్లికి వచ్చిన ఆడవారు అందమైన భర్త వచ్చాడని ప్రభను ఆట పట్టించారు. నవ్వులాటగా మోహేశుతో మా ఇంటికి  రండి, మీ అందానికి లొంగి పోతానని అన్నది ఒక పడచు, మావారు లేనప్పుడు రండి మనసంతా రంగరిచి, పంచాలని వుంది అని మరొక పడచు, ఓ అందగాడా మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి అన్న పడచుల మాటలు అన్నీ విన్న"ప్రభ" ఇక చాల్లే మీ మాటలు మా ఆయనను ఆట పట్టించు చున్నారు నాకు కోపమొస్తుంది అన్నది ప్రభ.

స్నేహితులమాటలకు తన భర్తను లొంగ దీసుకుంటారని భయ మేర్పడినది,  ప్రతి ఆడదాని చూపు మావారిపై పడితే  మావారు మారితే నా గతెం కావాలి, ఆడవాళ్ళ మాటలకు భయపడి తన కాపురాన్ని పాడు చేసుకొనే మూర్ఖురాలను నేను కాను, నా భర్తను నా చెప్పు చేతలలోకి తీసుకుంటాను.

మోహేశు అన్నాడు  అసూయ నీలో పెరిగింది " ప్రభ " అది తొలగించు, అనుమానం రానీయక మనస్సును బిగించు,  పరుల మాటలు విని పరవశాన్ని పాడు చేసుకోకు, మనువాడిన వాడ్ని ఉడికించి కౌగిట్లో భందించు ఆ మాటలకు సిగ్గుతో తల వంచింది ప్రభ.              

పున్నమి రాత్రికి ఏకాంతము కుదిరింది, తన్మయత్వముతో తనువూ తనువూ కలసి యవ్వన ఫలితము పొందే సమయము వచ్చింది, వెన్నెలలలో అందం వికసించి, ముద్దులలలో మునిగి పారవశ్యముతో మనసు మనసు కలసి అనుకోని ఆనందాన్ని పంచుకొని,  జన్మ జన్మల భంధముగా భావించి సుఖాల అంచులలో తేలి నిద్రలో మునిగి పోయారు నవ దంపతులు.

ఒక రోజు ప్రభ మొహేశు ఇద్దరుకలసి బస్సులో ప్రయాణము చేస్తున్నారు ఆ బస్సులో మోహేశు యొక్క కాలేజీలో  చదివిన విద్యార్ధులు ఉన్నారు.

మోహేశుపెళ్లి చేసుకోన్నావుటా,  మమ్మల్ని వదిలించుకొని ఎ అమ్మాయి బుట్టలో పడ్డావు, చదువుకొనే టప్పుడు ప్రేమకోసం మా వెంట పడ్డావు, మాకు పెళ్లి అయిందని తెలిసి తొకముడిచావు, ఇప్పుడు నీకు కూడ పెళ్ళైమ్దిగా మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు.

అమెమాటలకు ప్రభకు బాగా కోపం వచ్చింది. ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడు తున్నావు, ఆ ఏమిలేదు మీరు కోపగించు కోకండి సరదాగా మాట్లాడాను అంతే. 

ఇది లక్జరి బస్సు ముగ్గురు కూర్చొవాలి కొద్దిగా జరగండి, ఇదేమీ  ఇల్లు కాదు అన్న మాటలకు ప్రభ జరిగింది. కూర్చుంటునే " హలో మోహేశ్ నువ్వా నేను గుర్తుపట్టలేదు చాలా మారిపోయావు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు మమ్మల్ని పిలిచేది లేదా మరచిపోతే  ఎట్లా మీ కాలెజీ గరల్సను మరచి పోకోడదు, ఇంతకు మాకు స్పెషల్ పార్టీ  ఎప్పుడిస్తావు, అంటు మోహేశ్ చేయి పట్టుకొని నడుందాకా లాగటం గమనించింది ప్రభ, అంతలో ఏమిటి ఇది ఎవరైనా చూస్తారు అంటు చేయి లాక్కొని ,ముందు  ప్రక్కకు జరుగు అని గట్టిగా అరిచాడు మోహేశ్ అందరూ ఎదో జరిగిందని చూస్తున్నారు.

అంతే బస్ స్టాపులో గబగబా దిగింది ప్రభ, వెనకాల మోహేశ్ ఇంటిదాకా నడక ప్రారంభించారు. ఆరోజు పస్తు మరుసటి రోజు యదా ప్రకారముగా కాఫీ త్రాగండి అంటు కాఫీ అందించింది. నేనె తప్పు చేయలేదు నిన్న బస్సులో  " నేనడిగాన" నేనేమి చిన్నపిల్లను కాను అర్ధం చేసు కోగలను. 

అంటు ప్రక్కన చేరి నాకుమీరు పార్టీ ఇవ్వాలి ఎందుకు మీ వంశాంకురాన్ని మోస్తున్నందుకు, ఇది నిజమా మరి చెప్పవే, ఇంత ఆలస్యముగా చెప్పేది, అందరిని పిలిచి పెద్దపార్టీ ఇస్తాను అంటు ఒక్కసారిపైకి ఎత్తాడు,  మహానుభావా దించు దించు ఒక్కటే నవ్వులు.                              

ఏమండి నేనడి గానని ఏమను కోకండి నేను మా అమ్మగారి దగ్గర ఉండి పండంటి మగపిల్లవాడిని కని ఇవ్వాలని  ఉందండి మీరు అనుమతిస్తే ఈ రోజే బయలు దేరుదామను కుంటున్నాను. ఎందుకు అంత తొందర నేను వచ్చి మీ ఇంట్లో దించుతాను. మా అమ్మను నాన్నను చూడాలని ఉంది. మీ ఉద్యోగము సెలవు పెట్టి ఇప్పుడే రా నవసరము లేదు, నేను కబురు చేస్తా మీ సెల్ ఫోన్ మీ జేబులోనే ఉంచు కోండి ఇప్పటికి చాలా ఫోన్స్ పారేశారు.

నీ మాటను ఎప్పుడు కాదన్నాను, ఈ రోజే నేను బస్సు ఎక్కించి పంపుతాను. ఈ పైకము చేతి ఖర్చు క్రింద ఉంచు , వేళకు పాలు పండ్లు తీసుకో, నా మనసంతా నీ మీదె ఉంటుంది అని మరువకు, దిగిన వెంటనే ఫోన్చేయి, ఆరోగ్యం జాగర్త అంటు బస్సు కదిలేదాకా ఉండి,  వెను దిరిగాడు మోహేశ్. ఏదో అలోచిస్తూ ఇంటికి చేరాడు.


నిద్రలేస్తూ పాపరు చదివాడు, ఒక్క సారిగా కుప్ప కూలిపొయాడు, పేపరులో బస్సు బెంగులూరు చేరే ముంది గోడకు కొట్టుకొని ఆయిల్టాకర్ పగిలి బస్సు భస్మమైనది,  బస్సులో ఉన్న వారందరూ చనిపోయి నట్లు చదివాడు. ఒకటికి రెండు సార్లు చూసాడు ప్రభ ఎక్కిన బస్సు ఏ నా అనితెలుసుకొని  అంతే  డ్రస్సు మార్చుకొని అద్దె టాక్సీ తీసుకొని యాక్సిడెంటు జరిగిన స్పాటుకు చేరాడు మోహేస్.                         

ఎటు చూసిన చనిపోయిన శెవాలు గుర్తు పట్టలేని విధముగా నల్లగా మాడిపోయి ఉన్నాయ్, టికెట్టు రెసిడెన్సియల్  ప్రూఫ్లు చూపిస్తె శెవాలు అందిస్తామని అక్కడ ఉన్న అధికారులు చెపుతున్నారు. నోటమాట రాలేదు బస్సులో ఉన్నవారి పేర్ల లిష్టులో "ప్రభ" ఉండటం చూసి మరీ ద:ఖం ఆగలేదు. అధికారులను అడిగితె మార్చరీకి పంపాము వచ్చాక మీరు తీసుకొనిపోవచ్చు అనిచెప్పగా కొయ్యగా మారి అట్లాగే నిల్చుమ్డి పోయాడు అప్పుడే జేబులో ఉన్న సెల్ అక్కడే పడి పోయింది.

మొహెశ్ మనసు మనసులో లేదు, నాకే ఎందుకు ఇలా జరిగింది, ఎంతో ప్రేమగా ప్రేమించిన ప్రభ నాకు దూరమైనది. దీనికి కారణము నేనేనా, నేను కూడా ప్రభ తో పొతే ఎంత బాగుండునూ దేవుడున్నాడు మరి నా యందు   దయలేకున్నాడు, కాదు నన్ను పరీక్షిస్తున్నాడు, నాహృదయము చెపుతున్నది నాభార్య కు ఏమీ జరుగలేదు "యిది నిజము"  ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అది తెలుసుకుంటే నాభార్య ఉన్నదని తెలుస్తుంది అంటూ ఆఫీసుకు కూడ పోకుండా అత్తగారికి ఫోన్ చేసిన ఎవ్వరూ తీయక పోవుటవలన చేసేది లేక ఊరుకున్నాడు.


మోహెశ్ కు రోజువారి కార్యక్రమాలు తారుమారైనాయి ఏమి తింటున్నాడో ,  ఏమి చేస్తున్నాడో  ఎవ్వరికి అర్ధం కాక పోవుటవలన ఉన్న ఉద్యోగము పొయినది, ఉన్న ఆప్రాంతము మారినాడు, తన భావాలను కవితలుగా వ్రాసు కుం టున్నాడు.

పరిస్తుతుల చేతుల్లో నలిగి పోయిన నిస్సహాయతవు నీవు
జ్ఞాన భోధ చేసి వద్దు వద్దని భోధించ లేని నిస్సహాయతను నేను
నాకీరోజు గుర్తుకు వస్తుంది మనది వీడలేని భందమన్నావు నీవు
ఆవేశానికి లోనై ఆలోచనలేకుండా నిన్ను ఎన్నో సార్లు తిట్టినానునేను

ఆకలలు నన్ను, మనస్సును, గుచ్చుతూ వెధిస్తున్నాయి
నీ కళ్ళలో అనాడు కలిగిన ఆత్రుత నాకు గుర్తుకొస్తున్నాయి
నానుంచి దూరమైన నీ కళ్ళు నా కాళ్ళలో మెరుస్తున్నాయి               
పోగొట్టుకొన్న హృదయం నాకు దొరికినట్టు అనిపిస్తున్నది

కొన్ని గాయాలు తగ్గినట్లు ఉన్నా,కాని మచ్చ ఎక్కిరిస్తుంది
ఇది కల, నిజమా అని తెలిసే లోపు మాయ కమ్ముకుంటుంది 
పగిలిన అద్దంలో క్షణంలో జీవితము ముగిసి పోతుంది
నీవు వస్తావని నాప్రతిబిమ్బాన్ని చూస్తానని నమ్మకముంది

జీవిత శిఖరాన్ని అందుకోవటానికి నీకోసం వేచి ఉంటా
ఏదైనా అద్బుతము జరిగి మనల్ని కలపాలని ఆశగా ఉంది  
ప్రేమను పొందలేని వ్యక్తి జీవిమ్చుట వ్యర్ధమని నేనంటా
నీ కోర్కలు తీర్చు కోవటానికి వస్తావని నామనసు చెపుతుంది.

ప్రేయసి నీవు వస్తే మల్లి నాకు వెలు గొస్తుంది 
నీకు చేసిన వాగ్దానము నాకు ఇంకా గుర్తుంది      
మనిషి మనిషిగా గుర్తుకు స్త్రీ సహాయము కావాలంది 
మనజీవితము సుఖము చేయాలని దేవుడ్ని కోరాలని ఉంది

రక్తాన్ని మరగిస్తున్నాయి చేసిన బాసలెన్నో 
మీటిన వీణ మరుగాయి అయిన అనురాగాలెన్నో 

వసంతము కరువాయి అయిన కోయిల కూతలెన్నో 
భయము వేమ్బడిస్తుంది అయిన అనుభూతులెన్నో 

చిక్కని చీకట్లో చిక్కి కళ్ళు కాన రాకున్నాను      
మందు టెమ్డలొ మాడి నీడనేది లేకున్నాను
హృదయమే పాషాణముగా మర్చి బ్రతుకుతున్నాను
ఈచీకటి ప్రాణము వెలుగును చూడ లేకుమ్డా ఉన్నది

ఎకాంతము కోసం పొతే వినబడు తుంది గత ధ్వని
చేసిన  తప్పు పదే  పదే గుర్తు  చేస్తుంది ప్రతి ధ్వని
భూమి ఆకాశం ఎప్పుడూ కలవాలని గాలి ధ్వని
తప్పు చేసినవారిలో జ్వలిస్తుంది  శంఖ ధ్వని

గంప క్రింద కోడి అరచి మేలుకో మంది
గొంగళి ప్రక్కకు జరిగింది చలి లేదంది
కొవ్వొత్తి కరిగి వెలుగుని విరజిమ్మిది
ఎండిన చెట్టు వికసించి పూలు కాయలు కాసింది 

మోహేస్ నిరాశ నిస్పృహలో పడి పోయాడు, గడ్డాలు పెంచి పిచ్చోడుగా తిరుగుతున్నాడు, ఎవరు ఏదడిగినా పరద్యానంగా ఉంటున్నాడు, మనస్సుని నిగ్రహించుకొని హనుమంతుని ప్రార్ధించు తున్నాడు.
ఆఫీసు బయట ప్లాట్ ఫాంపై నడుస్తున్నాడు, మంచి హోదాలో ఉండి  దర్జాగా తిరిగేవాడు ఇప్పుడు ఎవ్వరూ గుర్తుపట్టలేని స్తితిలో తిరుగు తున్నాడు, ఆ సమయానా ఎవరో వెనుకనుండి మోహేశ్ అనే పిలుపు విని వెనుతిరిగాడు.

ఎవరవు నీవు అని అడిగాడు మోహేశ్ నన్ను గుర్తు పట్టలేదా నేను మీ పాత అద్దె ఇంటి ప్రక్కవాడిని, ఆ గుర్తుకొచ్చింది బాగున్నావా సుబ్బారావ్ అమ్మయ్య గుర్తుకొచ్చాను దేవుడా నీకు  వంద నమస్కారాలు అంటు మీ ఆవిడ నుండి ఉత్తరాలు వచ్చాయి.

" మా ఆవిడ ఎక్కడుంది ఆత్మగా మారిందిగా, నాలో ఆశలు లేపి అనందం పంచి ఆహుతై పోయి0దిగా , అనురాగం ఆత్మీయత పంచిన "ప్రభ"  ఇక నాకు లేదుగా, ఈ జీవితము ఎ మలుపు తిరుగు తుందో ఎవరూ  చెప్ప లేరుగా "

" నేను అభద్ధం చెప్పటం లేదు, నీవు ఇల్లు మారిన తర్వాత వచ్చాయి ఈ ఉత్తరాలు, నీకు చాలా సార్లు అందించాలని ప్రయత్నించాను చివరకు నాకు ఇక్కడ కనిపించావు, నీకు నమ్మకము లేకపోతే ఈ ఉత్తరాలు చూడు నీకె అర్ధమవుతుంది అంటు చేతిలో పెట్టి వెళ్తూ " పెళ్ళాం మోసం చేసిందేమో,  ప్రేమ పిచ్చోడుగా మారాడు " అంటు వెళ్లి పోయాడు.

 సుబ్బారావు పెట్టిన ఉత్తరాలు గాలిలోకి ఎగిరి పోయాయి, అవి అన్నీ  ఆకాసంలో పావురాలలా మారి చెట్టుపైకి చేరాయి కొన్ని, గడ్డిపై పడ్డాయి కొన్ని,  అక్కడ దగ్గరగా  ఉన్న రామాలయము దగ్గర  మోహేశ్ కూర్చున్నాడు పరద్యానంగా.

" ప్రసాదం అంటు ప్రత్యక్షమయ్యాడు బాల భీముడు, ప్రసాదం గబగబా తింటూ ఉత్తరంలో "ప్రభ" అనే రెండక్షరాలు కనబడగానే కళ్ళు చెమ్మగిల్లాయి, ఈ ఉత్తరం నీకు ఎట్లా వచ్చింది ఎవరు పంపించారు ఈ ప్రసాదమును, అని అడుగగా ఏమో బాబుగారు నాకేం తెలుసు ఆ రామయ్యగారు ప్రసాదం పెట్ట మన్నారు నేను పెట్టాను అంతే,  అన్నాడు బాల భీముడు."

" అంజనేయ నీవు నాతో ఉన్నావయ్య నిన్ను గుర్తించ లేక పోయాను నన్ను క్షమించు తండ్రి "

ఉత్తరం  చదివాడు గబగబా, సర్దాడు బ్యాగును గబగబా, ఎరో డ్రో ముకు పరిగెత్తాడు గబగబా, ప్లేన్ ఎక్కి బెంగులూరు దిగాడు గబగబా, టాక్సీ మాట్లాడుకున్నాడు. చెప్పిన గమ్యానికి చేర్చాడు టాక్సీ వాడు, నెమ్మదిగా నడుస్తూ వెళ్లి అత్తగారి ఇంటి తలుపు గొట్టాడు.

కిటికిలోంచి చూసి "ప్రభ "  ఎవరో గడ్డ మున్న వ్యక్తి తలుపు 
కొడుతున్నాడు అమ్మా తీయవే అన్న మాటలు వినబడుతున్నాయి, తలుపుతీస్తె అల్లుడుగారు మీరా ఎంత మారి పోయారు, లోపలకి రండి లోపలకి రండి, నిదానంగా తడబడు నోటి మాటతో "ప్రభ" ",ప్రభ" ఉన్నదా ..............
ఏమండి ఈ ఆరు నెలల్లో ఇలా చిక్కి పోయారెంటి అంటు వచ్చి గట్టిగ కౌగలిమ్చుకుంది  "ప్రభావతి " ఎంత అందముగా ఉండే వారు ఎట్లా మారిపోయారు, వేలకు తిండి తినమని చెప్పాగా, తినుట లేదా ప్రశ్నల వర్షం కురిపించింది.
"నేను - నీవు"  చేసిన పూజా ఫలం వళ్ళ ఇద్దరం కలవగలిగాము అంటు దగ్గారగా హత్తుకున్నాడు  "మోహేశ్".
అసలు నిన్ను చూస్తాననుకోలేదు. మంచి వారికెప్పుడూ దేవుడు సహాయము చేస్తాడని నాకు నమ్మకము పెరిగింది.
మీరు బస్సు ఎక్కించిన తర్వాత బస్సు కదిలింది. అప్పుడే నాన్న  సెల్ మోగింది.  " అమ్మాయి మేము నీదగ్గరకు వ స్తున్నాము నీవు ఇంట్లో నే ఉన్నావా. నేను బెంగులూర్ బస్సు ఎక్కి పది నిముషాలు అయింది. ఐతే మేము మేడ్చల్ స్టాపు దగ్గర ఉన్నాము . అక్కడ దిగి నీవు ఫోన్ చేయ్,  అక్కడ నుండి మేము కారులో తీసి కెల్తాము అనటం జరిగింది అట్లాగే దిగటం జరిగింది. అక్కడే  ఒక పెళ్లిని చూసుకొని తరువాత బయలు దేరాము అందరం బెంగుళూర్ .
ప్రొద్దున్నే పేపరు చూస్తే  నేను ఎక్కిన బస్సు తగలబడి నట్లు అందరూ  చనిపోయినట్లు తెలుసుకొని చాలా భాదపడినాను,  మిమ్మల్ని కలవాటానికి ఎంతో ప్రయత్నించాను, మానాన్న గారు కూడా మీ ఆఫీసుకు వెళ్లి మీ గురించి సమాచారము అడిగినా తెలియదన్నారు.  నేను ఉట్టి మనిషిని కాదుగదా అని ఇక్కడే ఉండి పోయాను అంతే, అత్తయ్యగారు వచ్చి అంతే జరిగింది , మావయ్యగారుకూడా వచ్చి అన్నారు అంతే జరిగింది . ఇది అంతా ఆ బాల భీముని లీలా , ఎవరండీ ఆ భీముడు పదా చూపిస్తా అంటూ  హనుమంతుని పఠం చూపించాడు మోహేష్  తో పాటు అందరూ నమస్కరించారు అలా ముగిసింది ఈ కధ .

--((***))--


1 కామెంట్‌:

  1. katha chaala baavundi. melodrama appealing ga vundi. appropriate place lo punctuation marks katha lo sama thulyam ga bhaasisthayi. madhya lo kavithalu lekunda poorthi vachanam lo katha nadipinchandi. pathrikallo raasthe inka chala mandiki katha reach ayye avakasam vuntundi. katha, sannivesalu superb.
    raghupathi rao

    రిప్లయితొలగించండి