"చేతిలో పైకము లేకుండా చేసే పెళ్లి"
రంగురంగుల నక్షత్ర కాంతుల వెలుగులు, తారాజువ్వలలాగా ఆకాశములో మిణుగురులు, ఎటు చూసిన అందమైన పట్టు చీరలలొ స్త్రీలు కొందరు, జుట్టు విరపొసుకొని బొడ్డుకు బెత్తడు క్రిన్దగా లంగాలు కట్టుకొని, పైటలను విసుర్తూ యవ్వనమునకు వచ్చిన ముద్దుగుమ్మలు, అందమైన లాల్చి ఫైజమాలతొ, సూటు బూటు ఇన్ షర్ట్ వేసుకున్న వారు కొందరు, జరీ అంచు పంచలలొ బ్రాహ్మణులు, అల్లరి చేస్తూ ముద్దు ముద్దుగా మాట్లాడు కుంటూ ఉన్న చిన్న పాపాలు బాబులు ఒకరేమిటి ప్రతిఒక్కరు ఇది మనందరం కలసి చూస్తున్న పెళ్లి అదే "స్తీతారామయ్యగారు మనవరాలి పెళ్లి ".
మొదలు నరకిన అరటి చెట్లు, వాటి మద్య ఒక వైపు అరటిపూలు, మరొకవైపు అరటిగేలలు, ఒక చిన్న కుటీరమువలె కొబ్బరిఆకులతో కాగితపు పూలతొ, మల్లెపూలు ఉన్న తీగలతొ అద్బుతముగా కళ్యాణ మండపమును అలంకరించారు "సీతారమయ్యగారి శిష్యులు".
అది ఒక గొప్ప ఇంట్లో జరిగె పెళ్లిలా ( రాజకీయనాయకుల, సినమానటుల ) కానీ విని ఎరుగని విధముగా చేస్తున్నారు "పద్మావతి శ్రీనివాస కల్యాణం ".
నారదుడు భూలోక సంచారిగా ఇక్కడకు వచ్చి, అక్కడ ఉన్న వ్యక్తిని పిలిచి, ఈ పెళ్లి ఎంత ఖర్చు చేసి యుంటారు, అని అడిగారు ఏమో నాకేం తెలుసు అందరూ అంటుంటే విన్నాను ఇది "చేతిలో పైసా లేకుండా పెళ్లి " అని.
చాలా ఆశ్చర్యముగా ఉన్నదే, ఇట్లా కూర్చొ, ఒక్కసారి నీకు తెలిసిన కధ చెప్పు నాకు వినాలని ఉన్నది అన్నాడు నారదుడు అక్కడున్న తుమ్బురునితొ.
ఐదురోజుల్లో పెళ్లి చేస్తానని ఒప్పుకున్నావు నాన్న, ఎలా చేస్తావు? " చేతిలో పైసా లేదు " నీ ధైర్యాన్ని చూస్తె నాకు భయమేస్తుంది కొంత సమయము అడగమంటే "కక్కు వచ్చిన కళ్యాణ ఘడియ వచ్చిన ఆగ దంటావు", ఆ భగవంతుడు నాతొ చేస్తున్న పెళ్లి అంటావు, మీ రందరూ చేస్తున్నారు నేను నిమిత్త మాత్రునంటావు.
పెళ్ళికి లక్షలు కర్చు అవుతాయి, మనకు రావలసినవి సమయానికి అందుతాయో , అమ్దవొ నని భయము ఈ ఐదు రోజుల్లో "అన్ని పెళ్లి పనులు" చెయలంటేనె కష్టము, నాకు "లోను" వస్తుందని నమ్మకము కని పిన్చుటలేదు, అన్నాడు కొడుకు పురుషోత్తముడు తండ్రి సీతారామయ్యతొ.
సీతారామయ్యగారు ఇంట్లో ఉన్న వారినందరినీ (భార్య జానకిని, కోడలు లక్ష్మిని, మనవరాలు పద్మావతిని ) పిలిచి తను చేయదలుచుకున్న పెళ్లి గురించి అందరికి చెప్పాడు. మీరన్దరు చాలా కోపముగా ఉన్నారు నా ఉద్దేశ్యము చెపుతున్నాను " ఇది సలక్షణమైన సంభంధం, పిల్లవాడికి గవర్నమెంటు ఉద్యోగము ఉంది, ఎర్రగా ఉన్న ఆరడుగుల అందగాడు, మన అమ్మాయిని కాని కట్నం లేకుండా చేసుకుంటామని "ఫోటో, వీడియోకు , పెళ్లి బ్రాహ్మణునికి, బ్యాండు మేళానికి అయ్యెఖర్చు వాళ్ళే పెట్టుకుంటామని ఒప్పుకున్నారు, ఐదురోజుల్లో పెళ్లి చేయమని, తరువాత మంచి లగ్గాలు లేవని, వారు చెప్పగా నేను ఒప్పుకున్నాను, మనము ఆరాధించే ఆ ఆంజనేయులువారు నిర్ణ ఇమ్చిన లగ్నమని, నేను ముందుకు వచ్చాను.
ఒక మంచి పని చేస్తున్నప్పుడు అన్దరూ సహకరించాలి, కోపతాపాలు లేకుండా ఎవరు చేయాల్సిన పనులు వారు చేయండి, అన్ని మీకు ఎప్పటికప్పుడు చెపుతాను, జెట్ ప్లైన్ పోయినట్లు, వెగమ్పెంచి, సంతోషముగా, పనులు చేసుకుందాము అన్నారు " సీతారామయ్యగారు "
ముందు "కొడుకు, కోడలు " ను పిలిచి సమయము తక్కువ ఉన్నది, మన భన్ధువలన్దరికి శుభలేఖలు సమయానికి చేరినా చెరక పోయిన "ఫోన్ ద్వారా మిమ్మల్ని పెండ్లికి భందు మిత్ర సమేతముగా " కాలేజి గ్రౌండ్ లో " అహ్వానిస్తున్నామని పిలవండి" అని పురమాఇంచాడు.
భార్య జానకిని, మనరాలు పద్మావతిని, పిలిచి మీరు ఆ సంచీలొ అందమైన కార్డలు ఉన్నాయి వాటిలో కొన్ని తీసి లోపల పత్రికలను తీసి " మానవరాళ కమ్పూటర్ ప్రింటర్ ద్వారా మంచి పెపార్ పై బ్రహ్మణుడు వ్రాసిన సుభలేఖను అక్షరాలూ తప్పులు లేకుండా " కాలేజి గ్రౌండ్ లో " మాచే ఏర్పాటు చేసిన కల్యాణ మండపం లొ "పెళ్లి "ముద్రించి తయారుచేయటం మీ వంతు అని పురమాఇంచాడు.
ఇంటి దగ్గరగ ఉన్న తను చదివిన కాలేజి "యాన్యువల్ ఫన్షన్" తన మనవరాలి పెళ్లి ముందు రొజెనని తెలుసు కున్నాడు, వెంటనే కాలేజి డైరక్టరు వద్దకు బయలుదేరి కలిసాడు, కాలెజీ స్తలములో మనవరాలి పెళ్లి గురించి వారిని అడిగాడు " కల్యాణ మండపాలు దొరకలేదు, మీరెమను కోకుంటే శనివారం మీ ఫన్షన్ ఆదివారం మా మనవరాలి పెళ్లి "మీరు వేసిన టెంట్లు, అలంకరించిన బల్బులు, తెచ్చిన వంటసామగ్రి, కుర్చీలు బల్లలు ఆదివారము కూడా ఉండేటట్లు చేస్తే చాలు" అన్నాడు.
పంతులుగారు మీరు అంత చెప్పాలా షామ్యానా వానికి నేను ఫోన్ చేసి చెపుతాను ఒక్కరోజు అధికముగా ఉంచ మని అన్నారు కాలేజి డైరక్టరు, సంతోషము చిన్నవాడివైన ఒప్పుకున్నావు ఆ దేవుని క్రుపవల్ల అందరికి మనసు ప్రశాంతముగా ఉండాలిని ఆ దేవునిని కోరు కోవటం తప్ప నేనేం చేయలేను ప్రస్తుతం అన్నాడు.
కాలేజి నుండి తిరిగివస్తు అద్దెకు ఇల్లు అనే బోర్డు చూసి లోపలకు పోయి ఎవరున్నారు ఇంట్లో అని అడిగారు సీతారామయ్య గారు.
లోపలనుండి పంతులుగారు మీరు ఇటు వచ్చారేమిటి, కాకికితొకబురు పంపితే నేనే మీ దగ్గరకి వచ్చేవాడ్ని మీ శిష్యుడ్ని గుర్తు పట్టలేదా, మీరు పెద్దవారు ముందు ఈ కాసిని మంచినీరు త్రాగండి అంటూ నీరు అందించారు ముందు దప్పిక తిర్చావు సగం పని అయింది, "అద్దెకు ఇల్లు " అడగటానికి వచ్చారా, కాదు ఒక్కరోజు నా మనవరాలి పెళ్ళికి వచ్చేవారికి, పెళ్ళివారికి విడిది కోసం మిమ్మల్ని అర్ధించ టానికి వచ్చాను. అంత పెద్ద మాటలు అనకండి నేను శిష్యుడ్ని ఇంతకీ మీకు ఎప్పుడుకావాలి " ఈ ఆదివారంనాడు " ఇప్పుడే రంగులు వేసి యున్నాము, ఒక్కరోజు కాదు మూడు రోజు వాడుకోండి, ఒక్క రోజు చాలు అంటూ సంతోషము చిన్నవాడివైన ఒప్పుకున్నావు ఆ దేవుని క్రుపవల్ల అందరికి మనసు ప్రశాంతముగా ఉండాలిని ఆ దేవునిని కోరుకోవటం తప్ప నేనేం చేయలేను అన్నాడు.
ఏమిటి గురువుగారు చెపుతూ చెపుతూ కధ ఆపారు, నేను ఆపలేదు ఆడపెళ్లి వారు అలసిపోయారు మీరు "టిఫిన్ తిని కాఫీ త్రాగ మంటున్నారు" ఐతే ఒక పట్టు పట్టుదాం అంటావు తప్పదుకదా గురువుగారు. వంట చెసినవారెవరో , నలుడో, భీముడో వచ్చి చేసినట్టుంది, నా పొట్ట పట్టలేదు ఇంకా తినాలనిపించింది.
ఆ ఇక కధ మొదలు పెడతావా, తినపొతె రుచి అడగ కూడదు, పెల్లికూతురిని శోభనం నాడు అనుభవం ఉందా అడుగ కూడదు, కధవినబొతు సస్స్పెన్సు చెప్పమన కూడదు, నీరు పల్లము కాకుండా ఎగువపొమ్మన కూడదు.
నిదానంగా ఇంటికి చేరాడు సీతారామయ్యగారు, ఏమండి మీరొక్కరె కష్టపడుతుంటే నాగుండె తరిగిపోతుంది, అట్లా అనకూడదె, "అందరు మనబిడ్దలే ", మనలో శక్తి ఉన్నంతవరకు ఇతరులకు సహాయపడటం లో ఉంది సంతోషం. ఇదిగోనండి చల్లని మజ్జిగ అంటూ ఇచ్చింది గబగబా త్రాగి మడత కూర్చిలొ కాసేపు నడుం వాల్చి విశ్రాంతి తీసుకున్నాడు.
అంతలో ఫోన్ "ఈ ఫోన్ ఎవరి దండి", ఫోన్ చేసి ఫోన్ ఎవరి దండి అంటావు, కాని ఈ ఫోన్ ఒక ఆఫర్ వచ్చింది, అన్నారు అవతల నుంచి ఇక్కడ ఎవరు "జోకర్లు " అయ్యేవారు ఎవరు లేరమ్మ నీమాటలకు, నామాట నమ్మండి నెచెప్పెది అభధమ్ కాదు, మీరు పెద్దవారి లాగున్నారు " మీ మీద ఒట్టు, మీరు ఆరాధించే దేవుడి మీద ఒట్టు" అన్నామాటలకు ఒట్టు లెన్దుకమ్మ చెప్పేదేదో చెప్పు అన్నాడు.
ఫోనులో ఏమివిన్నాడో వెంటనే కండవా సర్దుకొని, చేతికర్ర తీసుకోని నేను ఇప్పుడే వస్తాను మీరు పెళ్ళికి కావలసినవి, పెళ్లి వారికి పెట్ట వలసినవి, బంగారం నగల విషయంలో అన్ని వ్రాసుకొని ఉంచండి, అంటూ చేతిలో బ్యాంకు డిపాజిట్ కాగితము తీసుకోని బయలు దేరాడు.
ఫాదర్ & మదర్ బిగ్ బజార్ చేరాడు, మేనేజర్ను కలిసాడు, ముందు ఫోన్ విషయము నిజమాకాదా అని తెలుసుకున్నాడు "నిజమే అని తెలిసిన తర్వాత సంతోషం పొందాడు, వెంటనే ఫోన్ ద్వారా కొడుకు ,కోడలు,మనవరాలు అన్దరైని బిగ్బజార్ రమ్మనమని అందరిని కావలసినవి కొనుక్కోమని చెప్పాడు.
అందరికి అనుమానం వచ్చింది, చేతిలో డబ్బులులేవు, అంత పెద్ద షాపుకు రమ్మన్నాడు, అనుకోని అన్దరూ వచ్చారు, మీకు కావలసినవి తీసు కొండి, డబ్బులు గురించి ఆలొచించద్దు అన్నమాట ప్రకారముగా పెళ్ళికి కావలసినవి అన్ని తీసుకొవటానికి ఒక్క రోజు పట్టింది. అన్దరూ సంతోషముగా తీసుకెళ్ళారు.
తాతగారు డబ్బులు ఎపుడు కట్టారో అర్ధం కాలేదు మనవరాలుకి, భార్య జానకి కూడా సీతారామయ్యగారి ప్రవర్తన అర్ధం కాలేదు, అడుగదామంటే భయం, ఏదైతే ముందు పెళ్ళికి కావలసినవన్నీ వచ్చాయి తర్వాత కనుకుమ్దామ్ అనుకున్నారు అందరు. ఇంటికి రావటముతోనే సీతారామయ్యగారు, బాబు నీవు వంట వానికి ఫోన్ చేసావా, పెల్లింకా రెండే రోజులున్నాయి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, వేగం పెంచండి. అన్నాడు.
లేదు నాన్నగారు ఫోన్ కలవటం లేదు, ఎందుకైనా మంచిది నీవు ముందు వెళ్లి కనుక్కో అన్నాడు, నాన్న అంటూ ఏమిటి చెప్పు, ఏమిలేదు నాన్న నాకు రావలసిన "లోను" ఇంకా రెండు రోజులు పడుతుండట, పెళ్లి ఖర్చుకు అందు తుందో లేదో అనుమానముగా ఉన్నది, నేను చెప్పిన పని చేయి నీవు ఏమి ఆలో చించకు అన్నింటికీ ఆదేవుడున్నాడు నివు భయపడకు అన్నాడు. సరే వెళుతున్నాను నాన్న
అంతలో సెల్ లో మెసేజ్ ఉండటం చూసాడు, వెంటనే తలారా స్నానం చేసి దేవుడి గదిలొ కూర్చొని ప్రార్ధనలు చేస్తున్నాడు. ఎం జరిగిందో ఎవ్వరికి అర్ధం కాలేదు.
వెళ్ళిన కొడుకు వెనక్కు వచ్చి నాన్న వంట చేసే వాని ఇల్లు తాళం ఉన్నది అంటుండగా భార్య విమల వచ్చి మీనాన్న గారు ఈ సెల్లో ఏదో చూసి దేవుని గదిలో పూజ చేస్తున్నారు, ఒక సారి చూడండి, అన్నమాటలకు భర్త ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు, ఏమైందిరా బాబు చెప్పు అంటూ వచ్చింది అల్లి, మనం వప్పుకున్న వంట వానికి యాక్సిడెంటు జరిగిందట నాకు రావటము కుదరదు వేరొకరిని పెట్టుకోండి అని రెండు రొజుల క్రితమ్ మెసేజ్ ఇచ్చాడు క్షమించండి అనికూడా వ్రాసాడు.
వెంటనే జానకమ్మగారు ఏమి ఆలోచించకు నేను చెప్పిన పని చేయి, మీ నాన్నగారికి నేను చెప్పుకుంటాను, ఇవన్న కోపము వచ్చిన పర్వాలేదు, నాకు ముందు పెళ్లి ఆగ కూడదు, అని ఉండు లోపాలకి వెళ్లి తన నగల సంచి తెచ్చి కొడుకు ముందు పెట్టింది తల్లి జానకమ్మ, వెంటనే నీవు మంచి హోటల్ కు పోయి పెళ్ళివారి అయ్యె టిఫిన్, భొజనము కర్చు కనీసము 500 మందికి సరిపడే వంట చేయమని చెప్పి, ఈ నగలు ఎక్కడైనా తాకట్టు పెట్టి, ముందు ఏర్పాటు చెయ్ అన్నది, ఆగండి అంటూ భార్య విమల కూడా నగల ఇచ్చి మనమ్మాయి పెళ్లి కదండీ ముందు పని అయ్యేటట్లు చూడండి,. సరే నాన్న పూజ నుండి వచ్చాక అన్ని వివరముగా చెప్పండి అంటూ బయటకు నడిచాడు పురుషోత్తముడు.
అంతలో పెళ్లి ఇంటిలో అంతా నిశబ్ధంగ ఉన్నదేంటి అంటూ సూర్యా కాంతం అడుగుపెట్టింది. ఇదిగో అమ్మాయి పెళ్లి కి మీరేం కష్ట పడు తారని నేనే చేసి "సారే "నాలుగు రకాల స్వీటులు, ఒక కారా ఇంకా మీకన్దరికి బట్టలు నేను తెచ్చాను, ముందు అవన్నీ లోపల పెట్టండి. జానకమ్మగరు, విమల, సూర్యాకాంతం విలువ తెలుసు కాబట్టి ఏమి మాట్లాడకుండా లోపల సర్దారు.
సీతారామయ్యగారు బయటకు వచ్చి సూర్యాకాంతం నిన్ను చూసి చాలా రోజులైంది, ఎట్లా ఉన్నావు అన్నాడు, నాగురించే ఎమ్చెప్పెది ముందు మనింట్లో పెళ్లి హడావిడి ఏది, రేపే అంటున్నారు, నువ్వు వచ్చావుగా కాస్త హడావిడి చేయి, నవ్వు కుంటూ లోపలకు వెళ్ళాడు.
"సీతారామయ్యగారు ఎవరండి అంటూ ఒక తెల్లని ప్యాంటు, తెల్లని షర్టు వేసుకొని ఉన్న కుర్రావాడు వచ్చాడు.
రేపు పెళ్లి టిఫిన్ కు, భోజనమునకు మేము ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో చూపండి, అన్న మాటలకు అందరు ఆశ్చర్యపొయారు, అంతలో సూర్యా కాంతం ఏమిటే, అందరు తెల్ల మొఖాలు వేసుకొని చూస్తున్నరు, వచ్చింది వంటవాడు, కల్యాణ మండపం చూప మంటున్నాడు.
అంతలో భర్త నుండి విమలకు ఫోన్ వచ్చింది, ఇక్కడ నగలు తాకట్టు పెట్టుకొనేవారు దొరుకుటలేదు, అన్న మాటలకు మీరు వచ్చేయండి "క్యాటరిన్ వారు వచ్చారు".
వెంటనే వచ్చి, వాళ్ళని పెళ్లి మండపము వద్దకు తీసుకెళ్ళాడు, నగలన్నీ ఇంట్లో నే ఉంచారు.
జానకిని పిలిచి మిరొకటి చేద్దామను కున్నారు, చేయలేక పోయారు, నా కంతా తెలుసు, నగలన్నీ ఎవరికీ వారు పెట్టు కొండి, మరెప్పుడు సొంత ప్రయత్నం చేయకండి, అని బయటకు నడిచాడు ప్రశాంతముగా "సీతారామయ్యగారు"
అక్కడ ఉన్న వృద్ధాస్రమమునకు పోయి అందరిని భోజనమునకు రమ్మని ఆహ్వానించాడు మరియు తన ఇంటి చుట్టువున్నా వారిని కూడా పిలిచాడు.
పెళ్లి వారు రావటం బ్యాండు మేళాలతో పెళ్లి వారిని పిలవడం, అందరు కలసి ఆనందముగా నృత్యము చేయటం, ఒకరిని ఒకరు కలుసుకొని వివరాలు అడగటం, మేలతాలాల మద్య "పద్మావతి శ్రీనివాస్ " వివాహము వైభవముగా జరగటం, అందరికి భోజనాలతో సంతృప్తి పరచటం, స్వర్గలోకంలో తలపించే విధముగా పెళ్లి జరిగింది, మీరు కూడా చూస్తున్నారు అంటూ తుమ్పురుడు ముగించాడు.
నారదుడు తుమ్బురుని అడిగాడు, భోజనాలు ఖర్చు, నగలు బట్టలు ఎట్లా కొన్నారు అని అడిగాడు అన్ని నెచెప్పితె నా కధ కు విలువెమున్ది అని నెమ్మదిగా జారుకున్నాడు తుంబురుడు.
నారదుడు పెళ్లిని చూసి అక్షంతలు వేసి దీవించి వైకున్టం చేరాడు దిగులుగా.
నారాయణుడు అడిగాడు ఏమి నారద వెల్లెతప్పుద్ హుషారుగా వెళ్లావు వఛదప్పుదు దిగులుగా ఉన్నావు పెళ్లి " ఆ పెల్లిఘనమ్గా జరిగింది" నా సమస్యమాతరము తీరలేదు. బట్టలు నగలు ఖర్చు ఎవరు పెట్టారు, భోజనాలకు ఎవరు ఇచ్చారు అని అనుమానము. త్రిలోక సంచారులు మీకు తెలియలేదా ఇంత చిన్న విషయం
సహనం. సంకల్పం, సహకారం, ఉంటె విజయము తధ్యం అక్కడ అపజయం ఉండదు. అందులో హనుమంతుని భక్తుని పరీక్షిన్దామనుకున్నావు నివే పెళ్లిని మెచ్చుకొని తిరిగి వచ్చావు.
"సీతారామయ్యగారు తనదగ్గరున్న నెలరొజులలో మారే తన 50,000 రూపాయల డిపాజిట్ పెట్టి రెండు లక్షల నగలు బట్టాలు కొనుకొఛారు అంతే.
ఆంటే 50,000/- వేలకే 2,00,000 తీసుకోమని ఇచ్చారా.
అక్కడే ఉంది ఆ బిగ్ బజార్ ఓనర్ తల్లి తండ్రులు పుట్టిన రోజు నాడే చని పోయి నారు, వారిని తలుచుకుంటూ ఫోన్ చేసిన గంటలో కొన్నవారికి మాత్రమే 2,00,000/- ల పైన ఎంతైనా తీసుకొ వచ్చు బిల్లు పై నాలుగొవంతు వన్తమాత్రమె కట్టాలి అన్నాడు నారాయణుడు.
అదా విషయం
మరి భోజనాలు
క్యాటరిన్ వప్పుకున్న వాడు తనకు జరిగిన యాక్సిడెంటు విషయం సీతారామయ్యగరికి తెలియపరిచాడు, కొడుక్కు తెలియపరుస్తూ బొంబాయి నుండి రమ్మన్నన్దుకు ఏమనకు,. నీవు డాక్టర్వి నా ఆరోగ్యం గురించి ఆలోచించకు, మాటకు కట్టుపడి ఉండే వంశం, ముందు పెళ్లి ఆగకుండా ఉండేవిధముగా చేస్తావని ఆశిస్తున్నాను, వస్తావని అనుకున్నాను.
కొడుకు రావడం హోటల్లో "టిఫిన్, భోజనాలు" బుక్ చేయటం, తండ్రికి మంచి మందులు, మంచి డాక్టర్ని కలసి కొలుకొనే దాక దగ్గర ఉండి తండ్రి ఋణం తీర్చుకున్నాడు.
ఇక్కడ నాన్న, మా అమ్మాయి పెళ్లికి "లోను " ఈరొజు వచ్చింది ఈ డబ్బులు తీసుకొ న్నాన్న . నీవు ఎక్కడ తెచ్చావో అక్కడ తిరిగి ఇచ్చేయి, ఇప్పుడు లొనుతొ పనిలేదు, చిల్లర ఖర్చులు అమ్మాయికి వచ్చిన, చదివింపులు వాడాను, నివే నన్ను క్షమించాలి బాబు అన్న మాటలకు కళ్ళంబడి ఆనంద భాష్పాలు రాలి భార్యను పిలిచి తల్లి తండ్రులను కూర్చొ బెట్టి పాదాలు కడిగారు. నాన్న నీకె సాధ్యమైంది " పైసా లేకుండా పెల్లిచెసిన ఘనత "
ఇందులో నాగోప్ప ఏమిలేదు అ రామభక్త హనుమంతుని నమ్మనివారికి జయము ఖాయం అని మీకన్దరికి తెలిసింది "హనుమంతుని కొలుద్దాం హయిగా జీవిద్దామ్"
ఈ కధ వ్రాసు కున్నప్పుడు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు "దివ్యదామం" చెందటం జరిగింది. వారి ఆత్మా శాంతి జరగాలని ఈ కధను వారికి అంకితం చేస్తున్నాను.