అనుభందం
దేవాలయములో ఉపన్యాసం వినటానికి రోజు పరందామయ్య్యగారు
భార్యతో వచ్చి వినేవారు అదే రోజు స్త్రీ పురుషులు గురించి చెపుతున్నారు
ఆదిపరాశక్తి దృష్టిలొ స్త్రీ పురుషులు సమానమే
స్త్రీ పురుషుల వివక్షత సృష్టించినది కలియుగమే
ఆశయాల కోశమ్ ఇరువురు శ్రమించడం సహజమే
ఆధిపత్యం కోసం ఇరువురి మద్యపోరాటం సహజమే
కృత్రిమ సృష్టి అనేది కుల మత, జాతి, మాత్రమే
లైంగిక హింసలు స్త్రీ పురుషుల మద్య ఉండటమే
స్త్రీ పురుషుల హక్కుల కోసం నిరంతరం పోరాటమే
స్త్రీ పురుషులు ప్రేమను పంచుకుంటే జీవితమ్ సుఖమే
మహావిష్ణు నాభినుండి బ్రహ్మ పుట్టడం పురాణం
నేను సగం నీవు సగం అనటం అర్ధనారీశ్వర తత్త్వం
దాపత్యం అంటేఇష్ట పూర్వకంగా స్త్రీ పురుషులు సంగమం
పిల్లలు పుట్టడం, పెంచడం భార్య భర్తల కనీస ధర్మం
భారతీయ ఔవ్నత్యాన్ని గుర్తిస్తూ కలసి మెలసి జీవిమ్చడమే
సమభావాన్ని గ్రహించి గొప్పలకు పోక సర్దుకొని జీవిమ్చడమే
సూర్య చంద్రులు ఉన్నంతవరకు ఒకరి నొకరు సహకరించడమే
ప్రక్రుతి ననుసరించి హేచ్చు తగ్గులు లేకుండా బ్రతకటమే
పురాణం ఒకవైపు స్నేహితులు మాటలు మరోవైపు
పంతులుగారు బాగున్నారా, నన్ను గుర్తు పట్టారా
మీతో బాటు చదువుకున్న ఐ.యమ్.పి.సత్యం ను
జ్ఞాపక శక్తి తగ్గింది గుంటూరులో సత్యానివి కదూ
హమ్మయ్య ఇప్పుడు గుర్తు పట్టారు చాలా సంతోషం
నా భాదలు ఎవరికి చెప్పిన ఫలితము లేదు
నేనున్న పరిస్తితి ఎవరికి చెప్పిన అర్ధం కాదు
ఓదార్చే స్నేహితులు నాకు గుర్తింపు లేదు
అందరికి దూరంగా ఇక్కడ జీవితము గడుపుతున్న
ఎం చెప్పేది నేను చేసిన కంపేనీ దివాళా తీసింది
చాలా మందికి డబ్బు ఎగ్గొట్టి కంపేనీ బోర్డు తిప్పేసింది
దాచుకున్న పైకము రాక చివరకు బాధ మిగిలింది
ఆప్పులు తీర్చుటకు ఉన్న కొంత అమ్మటం జరిగింది
ఏదో కొంత డబ్బుతో అద్దె కొంపలో ఉంటున్నా
కూరలు పెంచి బజారులో అమ్మి బ్రతుకు తున్నా
వృద్ధులకు మూగజీవులకు ఆశ్రమం కల్పిస్తున్నా
ప్రకృతి ప్రశాంత వాతావరణములో బ్రతుకుతున్న
నా విషయం అట్లా ఉంచు మీ విషయం తెలియపరుచు
పిల్లలెందరు వారి వివరాలు వివరముగా తెలియ పరుచు
నీ భార్య ఆరోగ్యం, నీపిల్లల విద్యాభివృద్ధి గురించి వివరించు
కుటుంబ గౌరవ సంపాదన ఉన్నత స్తితి గురించి వివరించు
నాకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు
వారు చదివిన చదువుకు వచ్చెను, ఉద్యోగాలు
వారందరికి పెద్దలమై చేసాను, వివాహ వేడుకలు
పిల్లలకు ఊడిగం చెయ్యుటకు పనికొస్తారు పెద్దలు
ఏదయినా అడిగితే నాకు ఏమి చేసావు నాన్న
పైచదువు చదివిమ్చమంటే చదివిమ్చలేదు నాన్న
ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాము కాబట్టి ఇల్లు జరుగును నాన్న
ఒకరివద్ద ఉండ మంటే ఉండరెందుకు సలహాలు ఇవ్వాలని చూస్తారు
మనమిక్కడ కలవడం ఆదేవుడు కల్పించాడు
వొకరి భాద ఒకరు చెప్పుకోవటానికి వీలు కల్పించాడు
వయస్సుకు తగ్గ ముచ్చట్లుకు అవకాశ మిచ్చాడు
జీవిత మజలీలు ఇంకా ఎన్ని ఎదురుచూస్తూ బ్రతకాలి
కృష్ణాష్టకం చదువుతూ ఉపన్యాసం ముగించారు
వసుదేవసుతం దేవం కంస చాణూరమర్ధనం!
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం!!(1)
అతపీపుష్పసంకాశం, హారమాపురశోభితం!
రత్నకక్కణకేయూరం, కృష్ణం వందే జగద్గురం!!(2)
కుటిలాలకసమ్యుక్తం, పూర్ణ్చంద్రనిభాననం!
విలసత్ కుండలధరం, కృష్ణం వందే జగద్గురం!!(3)
మందారగంధసమ్యుక్తం, చారుహాసం చతుర్భుజం!
బర్హి పించానచూడాక్గం, కృష్ణం వందే జగద్గురం!!(4)
ఉత్పల్ల పద్మపత్రాక్షం, నీలజీమీతపన్నిభం!
యాదవానాం శిరోరత్నం, కృష్ణం వందే జగద్గురం!!(5)
రుక్మిణీ కేళిసమ్యుక్తం, పీతాంబరసుశోభితం!
అవాస్తతు తులసీగంధం, కృష్ణం వందే జగద్గురం!!(6)
గోపీకానాం కుచద్వంద్వకుంకుమాంకితఫక్షసం!
శ్రీనికేతం మహేష్వాసం, కృష్ణం వందే జగద్గురం!!(7)
శ్రీ ఫత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితం!
శంఖ చక్రధరం దేవం, కృష్ణం వందే జగద్గురం!!(8)
కృ ష్ణా షటక మిదం పుణ్యం ప్రాతరుత్ధాయ య: పఠేత్!
కోటీజన్మ కృతం పాపం, స్మరణేన వినశ్యతి!!.(9)
శ్రీ కృష్ణ భగావాన్ని ధ్యానం చేయందే మేము నిద్రపోం
గీతా సారాంశాన్ని అర్ధం చేసుకొని బ్రతుకు సాగిస్తాం
మూగజీవులను, పెద్దలను గురువులను ఆరాధిస్తాం
మమ్మల్ని నడిపించేది ఆదెవదేవుడని మేము భావిస్తాం
మా ఇంటిదాకా పోదాం పదా ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి
నా భార్య పూజ పునస్కారాలమ్టూ పిల్లలకు సేవ చేస్తుంది
పిల్లలు పుట్టరని తెలుసుకొని భాద లేకుండా ప్రవర్తిస్తుంది
చిలుకలను, కుక్కలను, కుందేల్లను పెంచుతుంది
ఇంట్లో అడుగుపెట్టగానే నమస్తే అంటుంది చిలుక
తోకాడిస్తూ మనష్యుల చుట్టూ తిరుగుతుంది శునకం
గంతులు వెస్తూ సందడి చేస్తుంది కుందేలు
కిలకిల శబ్దాలతో సందడి చేస్తాయి చెట్లపై పక్షులు
ఇంతకీ నీవిషయమ్ చెప్పుతూ మద్యలో ఆపావు
ఇదిగో ఈ కాఫీ త్రాగుతూ చెప్పు నీ వెక్కడ ఉంటావో చెప్పుము
ఒక్కసారి మేమిద్దరం మీపిల్లలను వచ్చి చూస్తాము
చిరునామా తెలియపరిస్తే వీలు చూసుకొని వస్తాము
పిల్లలు ఉన్న సుఖం అనేది లేకుండా నేను బ్రతుకుతున్నాను
నేను చేసిన పెద్ద పొరపాటు మొగపిల్లలని ఎక్కువచదివించాను
తక్కువ చదువులతో కూతుర్లకు వివాహము చేసాను
ఈ వయసులో చేతిలో డబ్బుల్లేక భాద వ్యక్త పరుస్తున్నాను
ఎందుకులే నీకు శ్రమ నేను మావిడ కలసి వస్తాం
మీరంతగా చూడాలని పిస్తే పిల్లలను కూడా తెస్తాం
మా ఫామ్లికి సంభందించిన ఫోటోలు కూడా తెస్తాం
కానీ మీరు రావద్దు, మరీ మరీ కోరుకొనే మీ నేస్తం
చిన్న పిల్లలంటే నాకెంతో ఇష్టం అని నీకు తెలుసు కదా
మనవళ్ళతో సరదాగా ఆడు కోవాలని మాకు ఉంది కదా
ఇక్కడ పిల్లలను చూసి సరదా మీరు పడవచ్చు కదా
నీ పిల్లలపై స్వతంత్రం ఉంటుంది పరాయి పిల్లలపై ఉంటుందా
మా అడ్రస్సు మీకు చెప్పి మిమ్మల్ని భాధపెట్టలేము
సందుల్లో విశాలమైన మైదానములో ఉన్న భవనము
దానిని పెద్దలకు బంగారు భవిషత్ చూపె వృద్ధా శ్రమము
దేవుని కృపవల్ల కొడుకులు కూతుర్లు ఉన్నా ఇక్కడే ఉన్నాము
కొన్నాళ్ళు నేను మాఆవిడ కొడుకులు ఇళ్ళల్లో ఉన్నాము
మరి కోన్నాళ్ళు కూతుర్ల వద్ద కాలం వెల్ల బుచ్చాము
పనిచేసి నంతకాలం ఎవరూ వేలెత్తి చూపలేదు మమ్ము
వయస్సు పెరగడం వళ్ళ కొంత వచ్చింది అనారోగ్యము
మేము స్వేచ్చగా జీవిమ్చాలని తలంచి బయటకొచ్చాము
మాకున్న దానిలో మేము కొడుకులకు కూతుర్లకు పంచాము
ధనం ఉంటే వృద్ధాశ్రమములో కట్టి దేవున్ని వెడుకుంటున్నాము
నా భాధలు నా కొడుకులకు కూతుర్లకు రాకూడదని అంటున్నా
నోరున్న జీవులైన నాకు ఆత్మీయులు కారు
ఎ విషయములో సహాయము చేయుటకు రారు
మేము వద్దంటే మీరు చేరారు అందరూ అన్నారు
వేలకు తిండి కంటి నిండా నిద్ర దొరుకుతుంది ఆశ్రమంలో
నేనొకటి నీకు చెప్పదలచు కున్నా
నేను అనాధనే నా అన్నవారు ఉన్నా
నా దగ్గరకు రావద్దని వేడు కుంటున్నా
ఒకరి భాధను పంచుకొనే శక్తి నాకు లేదన్న
నోరులేని మూగజీవులే నీకు అనుభంధాలు
ప్రకృతి ఇచ్చే చల్ల గాలులే మీ సొంతాలు
ఫలించు పుష్పాలు కాయగూరలు మీనేస్తాలు
ఇతరులకు సహాయ పడటమే మీకున్న ధైర్యాలు
సత్యం చెప్పిన కధ విని కల్లవెంబడి నీరు వచ్చింది ఆదంపతులకు
అన్నయ్యగారు మీ భార్యను తీసుకొని ఎప్పుడైనా రావచ్చు, ఇది మీ
పుట్టిల్లు అనుకోండి మాకు ఎవరూ తోడూ లేరు మీరు ఎప్పుడైనా రావచ్చు
ఆ శ్రీ కృష్ణ భగవానుణ్ణి ఆరాధిస్తూ మాధవసేవే మానవసేవే అని జీవిద్దామ్
.............................