19, డిసెంబర్ 2013, గురువారం

96. Sita Rama kalyanam -10


                                                
      


జనక మహారాజు దశరధ మహారాజుకు సీతా రాముల వివాహము జరుపుటకు నిశ్చ ఇమ్చినామని లగ్న పత్రిక తెలియ పరుస్తూ దూత ద్వారా తెలియ పరిచాడు.

1. రామ నామం చేయండి
    ఆస్వాదించండి
    ఆస్వాదించి ఆనందించండి
    ఆనందించి తరించండి

2.కన్యా దాత జనక మహారాజు దూతల ద్వారా దశరధునికి పంపే సందేశం
   ఓ మహారాజ మీ రాజ్యము యోక్కయునగ్ని హోత్ర సహేతంగా అడిగే కుశలం
   నా కుమార్తెను వీర్య శుల్కముగా ప్రకటించగా శ్రీ రాముడి పొందే విజయం  
   విశ్వామిత్ర వెంట వచ్చిన రాముడు నే పెట్టిన పరీక్షలొ  పొందే విజయం

3. నా కుమార్తెను నీ కుమారునికి ఇచ్చి వివాహము చేయుటకు అనుమతికి ఆహ్వానం
    నీకుమారునిఆనందం కోసం పురోహితాది సకలపరివారముతో వచ్చి జరిపించాలి శుభకార్యం
    విశ్వామిత్రుని యనుజ్ఞ గైకొని, శతానందుని యనుజ్ఞ గైకొని మీ రాక కొరకు నిరీక్షన
    వసిష్ఠ, వామ, దేవాది ఋషులు తో కలసి దశరధ మహారాజ చేయుదము కుశల సంభాషణం

4. సకల పరివారముతో ఒక క్రమ పద్ధతిలో చేరే మిదులా నగరం
    దశరధ్ మహారాజు పరివారాన్ని చేర్చ విడిది గృహం
    కౌసల్యా, సుమిత్ర, కైకెఇ కి రామున్ని చూసి కలిగే ఆనందం
    వశిష్ట మహర్షి సంప్రదించి తేలి శుభ ముహూర్తం   

5. ఓ జనక మహారాజా మీరు దానంచేయుమహాత్ములు మీ గౌరవమే మా గౌరవం
    మేము ప్రతిగ్రహీతులమ్ దాతల హృదయం ఆనందింప చేయుటయే మా ధర్మం
    కన్యాదాత మనస్సును కిమ్చుకైన భాధకల్గిమ్చక మగపెళ్లివారు ఉంటారుసహనం
    దశరధ మహారాజు యొక్క మాటలు విని జనకమహారాజుకు కలిగే ఆశ్చర్యం

6. దానము లలో కెల్లా ఉత్తమ మైనది కన్య దానం
    దాతకును ప్రతి గ్రహీతకును కల్గించును పుణ్యం
    పురుషార్ధ సిద్ధిని కల్గిమ్చ్ వివాహము స్వధర్మం
    కన్యా దానం వళ్ళ ఉభయులకు కల్గు శ్రేయస్కరం

7. ఎవరి కొరకు వేచి యుండనవసరం లేదు ఇది మా గృహం
    మీ కు కావలసినవి తెలియ పరిస్తే క్షణంలో చేస్తాం
    స్నానానికి సుగంధ పరిమళాళ తో ఉన్న జలం ఏర్పాటు చేస్తాం
    సత్కరించి ఇష్టాన్న భోజనం ఏర్పాటు చేసి ఇచ్చే తామ్బూల0 
                                          


8.మామిడి చిగుళ్ళు తోరణాలతో అరటి చెట్లతో
           ఏర్పాటు చేసారుకళ్యాణ మండపం           
బంగారు  ఆసనములు, పూర్ణకుమ్భాలతో
     పుత్తడి పళ్ళెములుమ్చిరి  దూతగణం
మూకుళ్ళు, సమిధలు, ఆవు నెయ్యి మెదలైన
వాటితో అగ్నిహోత్రమునకుచేసారు సిద్ధం     
సుఘంధ ద్రవ్యాలు, పేలాలు, నక్షతలు, ఉండిన
     బంగారుపాత్రలు ఉంచారు కళ్యాణ మండపం
                                   
ప్రజల ఆనందానికి అవధులు లేవు            

9.ప్రతి హృదయంలో పరమాత్మ స్తిర నివాసం
ప్రతి ఒక్కరి హృదయం ఒక  ఆనంద నిలయం
ప్రతి ఒక్కరిలొ ఉండే పరమాత్మ పేరు సచ్చిదానందం
ప్రతి పనిలో  సంతృప్తి పడితే పొందేది జీవితానందం

10.బ్రతికినంతకాలం ఇతరులకు సహాయముచేసి పొందాలి ఆనందం
చంకలో బిడ్డను ఉంచుకొని వెతికే అమాయకపు తల్లి ఆనందం
ఇంద్రియాల సుఖం, మనస్సుకు సంతోషం కలిగే ప్రక్రుతి ఆనందం
గాడాందకారంలో పండు వెన్నెలను కురిపించే చెంద్రుని ఆనందం

11.నువ్వు నేను మనం అనుకుంటేనే ఆనందం
నాకు నేనే నాది కష్టార్జితం అంటే లేదు ఆనందం
ధనం కూడపెడితెరాదు పంచితే వస్తుంది ఆనందం
అమ్దరూ సహపంతిభోజనం చేస్తే ఉంటుంది ఆనందం

12.ప్రత్యాషకిరణాలతొ తుషార బిందువుల ఆనందం
పున్నమి వెన్నెల జల్లు హృదయానికి ఆనందం
చలికివణుకుతున్న వానికి అగ్నిని చూస్తె ఆనందం      
వర్షం పడుతున్నప్పుడు క్షత్రంతో తిరుగుట ఆనందం 

13.వయస్సుకు తగ్గ వారితో ఆడే ఆటలో ఉంటుంది ఆనందం
మనస్సుకు సంతోషం కలిగిన మాటలు వింటే ఆనందం
పిల్లలు అడుగులో అడుగువేసుకుంటూ నడుస్తుంటే ఆనందం
దాహం వెసినప్పుడు అమృతం త్రాగితే మరి ఎంతో ఆనందం

14.మనో మాలిన్య్యం తొలగి బుద్ధి ప్రకాశవమ్తమైతే ఆనందం  
ప్రతిఒక్కరు చిత్తశుద్ధితో చేసే పనిలో ఉంటుంది ఆనందం
గమ్యం లేనివానికి గమ్యం చూపితె అంతులేని ఆనందం
ఎక్కడోకాదు దేవుడు నీలొ నాలో ఉన్నాడు అంటే  ఆనందం



15.తల్లి, తండ్రి, గురువు గ్రహిమ్చుము ప్రత్యక్ష దైవం
వేదాద్యయము నందు ఇవ్వాలి ముందు ప్రాధాన్యం 
పితృదేవతలకు చేయు కర్మలకు ఇవ్వాలి ప్రాదాన్యం
అభ్యుదయ మార్గములో నడుస్తూ చేయాలి సంసారం

16.వివాహమనేది గ్రుహస్తాశ్రమమునకు అమ్కురార్పణం
వివాహ ప్రక్రియతో ఏర్పడుతుంది దాపత్య భంధం
జీవసృష్టి వృద్ధిపొందటానికి దాంపత్య భందమే మార్గం
జగతిలో జన్మ లన్నిటిలో మానవ జన్మ ఉత్తమం   
                                      


   వివాహ ప్రక్రియలు

17.సమావర్తనము, కన్యావరణము, కన్యాదానం
వివాహ హోమం, అగ్నిప్రిచర్య, పాణిగ్రహణం
లాజ హోమం, సప్త పది , నక్షత్ర  దర్సనం
అప్పగింతలు, గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం

18.మణి కంకణములు, పమ్చలచాఅపు, గొడుగు
చెప్పుల జత ఉత్తరీయమ్, దండం
నలుగుపిమ్ది, అంజనం, అనులేపనం టపాగా
దీక్షావస్త్రాలు, పట్టు వస్త్రాలు, పావుకోళ్ళు

19.భాషా భ్యాసం నేర్పేది అమ్మతత్వం
మాద్యమం పిత్రార్జితం
బ్రాత్రు విత్తంచ అధమం
స్త్రీ విత్తం అధమాధమం

20కనులు మిరమిట్లు గొలుపు బంగారు చాయా రూపం
సర్వావయవ సౌందర్య  రాశి ఐన అపరంజి భావం
ధర్మ మార్గమున సర్వదా నీడవలె  ఉండే కిరణం
రూప యవ్వన సుగుణాల రాశి అని చెప్పుట ఉత్తమం

21.రాజ గృహిణి కోరికల కన్నా ప్రజల సుఖాలే ముఖ్యం
రాజ్యం సంరక్షిమ్చుటకు నేతల త్యాగం ముఖ్యం
ప్రజల సంస్కృతిని నేతల గౌరవం కాపాడుట ముఖ్యం
క్రమశిక్షణతో, ధర్మ రక్షణతో పాలించుట అతి ముఖ్యం

22.వివాహవేడుకలు ఆచారప్రకరముగా జరుపుట అవసరం      
రెండు కుటుంబాలు భందువులతో కలసి చేసే సంబరం
బ్రాహ్మణులు, గురువులు, పెద్దలు దీవెనలు పోమ్దేవరం
సన్నాఇమెళాళలొ "తాళి కట్టి " ఏర్పడే మూడుముళ్ళ భంధం

23.కన్నతల్లి మోసేది కొంతకాలం, గురువు విద్యనేర్పేది కొంతకాలం 
సూర్య చంద్ర గమనాన్ని బట్టి  ప్రకృతిలో  జీవిమ్చాలి కలకాలం
భార్తననుసరిమ్చి పెద్దలకు సెవచెస్తూ సుఖంగాఉండు జీవిత కాలం
భూమికి భారం కాకుండా, బాకి లేకుండ ఉండాలి అంతిమ  కాలం

24.సీతతో పానిగ్రహ మోనరిమ్చుట నీకు శుభం
భార్యయే నీ కీర్తి ప్రతిష్టలకు మూల కారణం
భార్య పాతివ్రత్యమే భర్తకు ఆయురారోగ్య భాగ్యం
శ్రీరాముడు ధరాపూర్వకముగా సీతకన్యకను పొందే దానం


25.శ్రీ రామునకు సీతను, లక్ష్మణునకు ఊర్మిలను చేసే పాణిగ్రహం
భరతునకు మామ్దవీను, సత్రుఘ్ననునకు శుతకీరితి చేసే పాణిగ్రహం
నూతన వధూవరులు అగ్నిహోత్రమునకు చేసే ప్రదక్షణం
లాంచన ప్రాయముగా వెడుకొలు చేసి ప్రతిఒక్కరు సంతోషం 
                                         
26.జీలకర్ర బెల్లముతో కలిపిన ముద్దను ఒకరిరి తలపై
         ఒకరు చేతితో అదిమి పేటి ఉంచడం
వేదకల్పము తెలిసిన పెద్దలు పరస్పర జీవ శక్తులు
         ఆకర్షణకు స్ప్రుసిమ్చటం
పుత్తడి పల్లెములలో ఉన్న ముత్యములు,తలబ్రాలు
         మంత్రాలతో సిరస్సులపై పోసుకోవడం
గుప్పెడుతో అక్షతలు తీసుకోని నూతన వధూవరులను
         ఋషులు,పెద్దలు అందరు అశీర్వదించటం

27.దేవదుందుభులు మారుమోగే మాంగల్యం కట్టే సమయం   
అప్సరసలు నాట్యమాడిరి గంధర్వులు గానము చేసిరి ఆసమయం
పుస్పవర్షము కరతలముల ధ్వనుల మద్య కురిసే ఆ సమయం   
ప్రతిఒక్కరు అక్షతలు చల్లి సీతారాములను దీవిమ్చారు ఆసమయం
 

                                                        

28. భార్గవుడు కోపముతో చేత ఒక ధనుస్సు ధరించి చేరే రాజ భవనం
భార్గావుని సామ్తపరుచుటకు జనక మహారాజు చేసే ప్రయత్నం
దశరధమహారాజుకూడా ప్రాధేయ పూర్వ కముగా చేసే వచనం
విశ్వామిత్రుడు, వసిష్టుడు, భార్గావునికి తెలిపే ఉండాలి శాంతం

29.రామ ఈ వైష్ణవధనస్సును సంధించు తెలుస్తుంది నీ ప్రతాపం
విశ్వామిత్ర సలహాప్రకారముగా అందుకొని చేసే ప్రయోగం
తనశక్తిని  తెలుసుకొని పరశురాముడు వహించే మౌనం
రామునికి అందరికి నమస్కరించి చేరే మహేంద్రగిరి పర్వతం 

                                                    
                                         

2 కామెంట్‌లు: