17, డిసెంబర్ 2013, మంగళవారం

95. Sitarama kalyanam-9



పెళ్లి అని మనసులోకి ప్రవేశిస్తే వారి ఆలోచనలు ఊహలు ఎలా ఉంటాయో సీతా రామ కళ్యాణ సందర్బముగా 
ఇందు ఉదహరిస్తున్నాను.(ఇవి నా ఆత్య ప్రాస భావాలు మాత్రమె         
1.  నా జీవితములో కల నిజ సౌందర్య మైనది
     ఎన్నాళ్ళ కైనా, ఎన్నేల్లకైన మనసే మారనిది
     తొలిచూపులొ మనసు ప్రభవించి కలువమన్నది
     మాడుహుద్య్యాల కళా కండ అందించాలని ఉంది

2. మంచుకంటే చల్లగా ఉన్న హృదయం వేడెక్కింది
    తలవని తలంపుగా ఒక్క లలితగీతమ్ వినబడింది
    బ్రతుకులో జోడు ముడిపడే సమయం ఐనది
    కలగా మేనుకు చందన పూత పరిమళమైనది

3. తప: ఫలముతో పున్నమిలో పంచుకొనే పంట
    వద్దు  కావాలి కావాలి అని మురిపిమ్చుకొనే ఆట   
    పండువెన్నెలలో కోరికలను పంచుకొనే తొలి పంట
    మధురాతి మధురస్మృతులను పంచుకొనేపెళ్ళంట

4.
నిన్ను చూసిన తొలి క్షణంఅమ్కురిమ్చే ప్రణయ భావం
   ఒకరి నొకరు చూసుకొన్న క్షణం ఆత్మాను సందానం    
   మనస్సులో ఎన్నో ఊహలు అపోహలు వచ్చుట నిజం
   కలసి మెలసి తిరిగితే ఏర్పడును అనుభూతి తరంగం

5. నీ వదనం లో చివురించిన లజ్జ దరహాసం
    నీవు విరిసిన తెల్లటి నందివర్ధన కుసుమం
    నీవు సిగ్గుతెరలతో వాలు చూపుల వదనం
    నీ ముగ్దత్వంవళ్ళ హృదయములో పరవశం

6. నన్ను ఉద్ధరించుటకు దివినుండి భువికి వచ్చావు
    నీవు జన్మ జన్మల భమ్దముగా  సక్షాత్కారిమ్చావు
    నా హృదయం క్షీరసాగరమ్ అవటానికి కారణం నీవు
    నా గుండెలో పొంగు పంచుకోటానికి కారకుడవు
నీవు 
 
7. మనసులో చెలరేగు అపురూప భావాలను పంచుకుందాం
    హ్రుదయసీమలతొ హత్తుకొని పరవశంతో ఆనందిమ్చుదాం
    తోడు నీడగా,
ప్రాణాతి ప్రాణముగా కలసిమెలసి జీవిద్దా0
    గారాబంతో అను రాగంతో ఆడుతూ పాడుతూ ఉందాం

8. నీటి తరగలన్న, మంచు పొగలన్న, ఎంతో  ఇష్టం    
    అరవిమ్ద నయనాలలో నా రూపమ్ ఉంటే ఇష్టం
    కనురెప్పలు ఎత్తిచూసి చూడనట్లు ఉంటే ఇష్టం
    ఆలింగన బలం లో చిక్కి బ్రతాకాలని మరీ ఇష్టం 


9. నిన్ను కాసేపు ముద్దిచ్చి నవ్వించాలని ఉంది
    మట్టెల సన్నని మోతతో ఉడికించాలని ఉంది
    గాజులతో సమ్గీతస్వరము వినిపించాలని ఉంది 
    వదలకుండా మత్తుగా శయనిమ్చాలని ఉంది

10. ఉషోదయపు ఎర్రని బింబం నీ ముఖారవిందం
      అరుణకిరణాలకు నీ మొము పుత్తడి మేరుపందం
      చెమ్పల మీద కెంపు రంగొచ్చి
ముద్ద మందారం
     సిరోజాలలోఉన్న మల్లెపూల సౌరభానికి   
 
     ఆహ్లాదం                                      

11. కంటికింపుగా కనువిందు చేసిన వేళ
     తరలి వచ్చి తపము పండించిన వేళ
     కమ్ముకున్న మబ్బు తెర తొలగించిన వేళ
     తరుణి దయతో కరుణించి తరించిన వేళ

12. నును సిగ్గు దొమ్తరుల దొరసానివి నీవు
      ఓరకంట చూపుతో మనసు  దోచినావు
      అభ్యంతరాల ముసుగులో దాగివున్నావు 
      తనివి తీరగ చూసిన మరవ లేకున్నాను

13. లేత రెమ్మల మాటున మొగ్గావు నీవు
     కళ్ళు తెరచి చూసి పరిమలిస్తున్నావు
     రెమ్మ నుండి వీడి ఎరుగనిదేశం చేరావు 
     నాకొరకు విరహముతొ విధిగా ఉన్నావు

14. నాకళ్ళను చూస్తె నీ వంటికి చలువపూత చల్లదనం 
      నా  మేనును చూస్తె చందన  సుగంధ  పరిమళం
      నా వయస్సు చూస్తె నీకు మరువలేని  సుఘమ్ధం
      నా రూపు దివ్యలోక సుఖాలనమిమ్చే యవ్వనఘమ్ధం

15. సాహిత్య రత్న రాశిని తెచ్చిన మల్లికవు
      జన్మసమ్స్కారముతొ ఓర్పుగల దానవు
      మాటలలోను, నడకలలోను స్వర్ణరేఖవు
      నవరత్నాల మేళవింపు కాంతి గలదానావు

16. నీ రూపమును నా మదిలో ఉంచిన సృష్టి కర్తకు వందనం
      నిద్రాహారాలు మాని  నీ గురించి  కలిగిన తన్మయత్వం
      నేనొక్కదానినే పుత్తడి బొమ్మ అని బ్రామ్తికలిగిమ్చే సౌరభం
      నీవు నా అంతరంగం దోచి అందుకో మధుర అధరామృతం 

17.  నీకు నామీద నవ  నవోన్మెష రక్తి
      చెప్పకనే తెలుస్తుంది నీలొ యుక్తి
      నిన్ను కలవాలని నాలో కలిగిన ఆశక్తి
      నీ వదనం వెలుగులు చిమ్ముతుంటే రక్తి

18. నిన్ను చూస్తె ఒళ్లంతా స్వేదంతో నిండి పోతుంది
      దాహం తీరక నా నాలుక పిడచ కట్టుకు పోతుంది       
      సిరోజాలువేడెక్కి తపన తగ్గే మార్గం చెప్పమంటుంది 
      అదేమి చిత్రమో,అదే
మి ఆరాధనొ తెలియ నంటుంది 

19. నా అనురాగాల ముద్దుల శాంతి దేవత 
     పారి జాతమ్ము ప్రేమ జీవన విభాత 
     భవ్య లోక సుఖా లందిమ్చే దివ్యలత
     నా  సుఖ  సౌక్యాలందిమ్చే  ప్రదాత

20. పువ్వుల మేఘమా నా భాద తెలుపు  
     నా కన్నీల్లను తుడిచి పొమ్మని తెలుపు
     తన్మయత్వంతో ఉన్నాను రమ్మని తెలుపు
     తపన తగ్గించి దప్పిక తీర్చుకొని పొమ్మని తెలుపు

                                       

 21. ప్రచండ గ్రీష్మ తాపాన్ని ఉపశమిమ్ప చెస్తావు
     కరుణతో  పుడమి  తల్లిని  పులరింప చేస్తావు 
     మెరుపువల్లె మెరిసి నామనసు రంజిల్లపరుస్తావు
     గుండెలో ఉన్న దడను తగ్గించి సంతోశాపరుస్తావు

22. రాత్రి నిద్రపట్టక చంద్రునితో నీ గురించి ముచ్చటిస్తా 
      నవమి నాటి వెన్నెలను ముందుగా నీకు పంపిస్తా
      మాన నీయమైన గుణం అర్ధం చేసుకొని ప్రవర్తిస్తా
      కన్నుల్లొఉండే కారుణ్య రేఖతో పులకితున్ని చేస్తా

23. నా సృష్టి దైవ నిర్ణయం
      నా జీవిత కరుణా మయం
      నా ప్రేమ అనురాగ మయం
      నా హృదయ్యం చైతన్య భరితం

24; సంవత్చరానికి ఒక్కసారి వచ్చే వసంతానివి కావు 
      ఒక్క రోజు సువాసన అందించే గులాబివి కావు
      ఒక్క క్షణం నింగిలో మెరిసే మెరుపువు కావు
      నా ఊహలు సఫలం చేసే సౌమ్దర్యవు నీవు

25. నెల కొకసారి వచ్చే పున్నమి జాబిల్లివి కావు
      వెలుగును కమ్మే నల్లని మేఘానివి  కావు
      శబ్దాలు చెస్తూ సమయాన్ని తెలియపరచవు
      రంజిమ్పచేసి రసడోలికలో ముంచేదానావు నీవు

26. తెరలు తెరలుగా పైరు గాలి వీచినట్లు రమ్మనకు  
      సొగసుచూడమని పరదాలు తొలగించి రమ్మనకు
      ప్రకృతిలో అందచందాలతో ఆటలకు నన్నురమ్మనకు
      రమ్మని పిలిచి ఆనవ్వు దొమ్తరలతో నన్ను వేదిమ్చకు

27. తొలి మబ్బు తెరచాటు చెమ్దమామవు
      గగన పధ  విహార విహంగ  పతుడవు
      చీకటినితరిమే వెలుగును చూసి తప్పుకుంటావు  
      అందరికి చల్లదనము వెన్నెలను పంచుతావు
 
                                       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి