14, డిసెంబర్ 2013, శనివారం

ఓం శ్రీ రాం - మనస్సాంతికి మార్గాలు

  ఓం శ్రీ రాం - మనస్సాంతికి మార్గాలు




11. శిష్యుడు : భూమిని సృష్టించుటకు పూర్వము ఎవరున్నారు ?

గరువు : పంచ భూతములు ఈశ్వరుడు.

2. శిష్యుడు : భూమిని జీవ రాసిని ఎవరు సృష్టించారు ?

గరువు : ఈశ్వరుడు.

3. శిష్యుడు : సృష్టిని ఎవ్వరు వృద్ది పరుస్తారు ?

గరువు : బ్రహ్మ దేవుడు.

4. శిష్యుడు : బ్రహ్మ దేవుడు ఎవరు ?

గరువు : ఆది పరా శక్తి

5. శిష్యుడు : సృష్టిని పాలిమ్చేదెవరు ?

గరువు : శ్రీ మహా విష్ణువు

6. శిష్యుడు : విష్ణువు ఎవరు ?

గరువు : ఈశ్వర శక్తి

7. శిష్యుడు : సృష్టిని లయము, ధ్వంసం చేసేదెవరు ?

గరువు : ఈశ్వర శక్తి

8. శిష్యుడు : బ్రహ్మిణి ఎవరు ?

గరువు : బ్రహ్మదేవుని శక్తి

9. శిష్యుడు : లక్ష్మీ దేవి ఎవరు ?

గరువు : విష్ణువు యొక్క శక్తి

10.శిష్యుడు : పార్వతి ఎవరు ?

గరువు : ఈశ్వర శక్తి




11. శిష్యుడు: సంసార సాగరాన్ని తరిమ్పచేసేదెవరు?

గురువు: ఈశ్వరుదు

12. శిష్యుడు: భంధం అంటే ఏమిటి ?

గురువు: విషయాను రక్తి .

13. శిష్యుడు: ముక్తి అంటే ఏమిటి ?

గురువు: విషయం వళ్ళ విరక్తి చెంది ఈశ్వరునిలో లీనము కావడం.

14. శిష్యుడు: ఘోరమైన నరకము ఏది ?

గురువు: మానవ శరీరమ్ .

15. శిష్యుడు: స్వర్గం ఎక్కడ ఉన్నది ?

గురువు: ఆశలు అంతరిస్తే ఈ భూమె స్వర్గం.

16. శిష్యుడు: సంసార భంధం ఎట్లా తొలగి పోతుంది ?

గురువు: ఆత్మ జ్ఞానము వలన.

17. శిష్యుడు: ఏమి చేస్తే ముక్తి లభిస్తుంది ?

గురువు: తత్వజ్ఞానము వలన .

18. శిష్యుడు: నరకమునకు కారణమేది ?

గురువు: ఆశ, తృప్తి లేక పోవడం.

19. శిష్యుడు: స్వర్గ ప్ర్రాప్తికి కారణ మేమి ?

గురువు: అహింస, దాన గుణం, గౌరవించే లక్షణం.

20. శిష్యుడు: మనిషికి శత్రువు ఎవరు ?

గురువు: అతని ఇంద్రియాలు








21. శిష్యుడు: మనిషికి మిత్రు డెవరు ?

గురువు: వశీక్రుతములైన ఇంద్రియాలు

22. శిష్యుడు: దరిద్రు డెవరు ?

గురువు: పరమ లోభి ఐనవాడు

23. శిష్యుడు: ఇశ్వర్య వంతు డెవడు ?

గురువు: ఎప్పుదూ సంతృప్తిగా ఉండేవాడు

24. శిష్యుడు: జీవన్ మృత్యు డెవడు ?

గురువు: ప్రయత్నమే చేయని పురుషుడు.

25. శిష్యుడు: మాయ అంటే ఏమిటి ?

గురువు: అతి ప్రేమ

26. శిష్యుడు: మహా అందు డెవడు ?

గురువు: కామాతురుడు.

27. శిష్యుడు: మ్రుత్యు వంటే ఏమిటి ?

గురువు: అపకీర్తి.

28. శిష్యుడు: చిరకాలము ఉండే రోగం ?

గురువు: సంసారం .

29. శిష్యుడు:రోగమునకు మందేమిటి ?

గురువు: నిర్లపుడై ఉండటం, దయానం చేయడం

30. శిష్యుడు:ప్రధాన తీర్ధమేది ?

గురువు: పవిత్రమైన మనస్సు




31. శిష్యుడు: త్యాజ్య మేది?

గురువు: అర్ధము- దురాశ

32. శిష్యుడు: వినదగినదేది ?

గురువు: గురు సంనిధిలో వేదాంత భోధ

33. శిష్యుడు: బ్రహ్మ ప్రాప్తికి ఉపాయమేమి ?

గురువు: సత్ సాంగత్యం, స్త్రీ సహకారం

34. శిష్యుడు: సాధువు ఎవడు ?

గురువు: మోహము, అనురాగము లేనివాడు

35. శిష్యుడు: జీవునికి జ్వరమేది ?

గురువు: చింత, అనుమానం

36. శిష్యుడు: మూర్ఖు డనేవాడేవడు ?

గురువు: అవివేకి, ఆశావాది

37. శిష్యుడు: నాస్తికుడనె వాడేవడు ?

గురువు: ఈశ్వరుని సకితి తెలియనివాడు

38. శిష్యుడు: నిగ్రహ శక్తి నిచ్చేవాడు ?

గురువు: ఈశ్వరామ్శ గలవాడు

39. శిష్యుడు: పండితు డనే వాడేవడు?

గురువు: మహా జ్ఞాని

40. శిష్యుడు: ధార్మికుడు డనే వాడేవడు?

గురువు:యదార్ధ పండితుడు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి