ఆకర్షణ
ప్రకృతి దృశ్యాలు చూడనెంచి కాళ్ళు కదిపే
చినుకులు రాలగ జలదరించి వళ్ళు తడిసే
జలాశయమున కమలము మనసు కుదిపే
కమలాన్ని అందు కోవాలని ఆరాటం పెరిగే
కడు విశాల నేత్రములు కలిగి నట్టి
కను విందు చెస్తూ కదులు తున్నట్టి
జలక మాడుతున్న జలకన్య కాబట్టి
కన్య సౌందర్యం చూసి నామతి చెడింది
కన్య సౌందర్యం వర్ణింప నా తరమా
సుందర ప్రభ వలే ఉన్న చెందమామా
బరువైన పిరుదులపైఉన్న కేశజాలమా
బరువుతో కదులుతున్న వక్షోజాలము
కవ్వించే హృదయం గాలిలో తేలగా
బంగారు వర్ణం మదిలో నిలువగా
ఆకర్షించే నేత్రములు త్రిప్పు చుండగా
బ్రహ్మకైన భామను చూస్తే తిక్కరేగుతుంది
ఒడ్డున చేరిన జవరాలు వంగి వంగి చీర కట్టి
పాలిండ్లపై పావడాను ఊపి ఊపి ఆర బెట్టి
వయ్యారంగా నడుంపెట్టి ముఖంపై బొట్టు పెట్టి
జలములో ముఖం చూసుకొని నవ్వు కుంది
చెట్టు చాటున అంతా చూసి ఉండ బట్ట లేక
వంపుసొంపు నడకచూసి తపనకు తట్టుకోలేక
భువి నుండి దివికి వచ్చిన నవరత్న మాలిక
దరిచేరి ఆమెను పలకరించే మనసు నిలవక
హే లావాన్య ఎవరి బిడ్డవు ఎచ్చట ఉందువు
నా కంటికి నీవు సుకమార సుందర వనితవు
ఇది స్వప్నము కాదు ప్రత్యక్ష శృంగార దేవతవు
యవ్వనంలో ఉన్న బ్రాహ్మణ పుత్రిక ఐ ఉందువు
తాపసి గారాల ముద్దు బిడ్డవను కున్నాను
దేహకాంతి చూసి ఆగలేక నీముందుకు వచ్చాను
మనసులో ఉన్న కోరికను తెలియ పరుస్తున్నాను
చిరునవ్వుతో మాట్లాడితే ముత్యాలు రాలునా
మందహాసపు మాటలు వినాలని ఉంది
విశ్వమంత విశాల హ్రుదయము ఉంది
కోకిల గానంతో వరుస కలపాలని ఉంది
చిలుక పలుకుల చిన్నారి మాటలు రావా
సుధలు చిందు నధరాలు కదలాడ
బిడియ మేళ విన్న వించు జాడ
మదిని శాంత పరుచు నివసించు వాడ
మాటలాడక నా హృదయంలో పెంచకు దడ
మౌనమేల వహింతువు మనసు చెప్పు మాలినీ
వచ్చి నాను నీవెంట, పలకవు అందాల భామినీ
నన్ను గానక, వేగంగా నడుస్తున్నావు సునయనీ
వేడుకొందును, మనసు తెలుపవా కామిని
నా మీద నీకు జాలి కలుగుట లేదా
అలుక మానుటకు నీకు ఏమి చెప్పేదా
నా మదిలో మెదిలిన కోరిక తెలిపెదా
కన్య వైనచో నీతొడు నేనే ఉండాలి సదా
పుడమి పై ఇంద్ర భవనము నిర్మించేదను
వజ్ర వైఢూర్యముల తొ నగలు చేయించేదను
సుందర ప్రాంతములు నిత్యమూ చూపించెదను
లలనా కష్ట పెట్టకుండా నిన్ను సుఖ పెట్టగలను
నీ మదిలో మెదిలిన కాంక్షను తీర్చెదను
నీ అడుగు జాడలలో నడుచు కొందును
నీ హృదయమును సంతసింప చేయుదును
నీవు నామనసు అర్ధం చేసుకొని పలుకుము
కుటీరము చేరిన వనిత కను సైగ చేసి లోనికి రమ్మనె
అందున్నవి సర్ది ఉచితాసనము ఏర్పాటు చేసి కూర్చొమనె
మంచములో ఉన్న మనుజుని చూపి నా భర్తని చెప్పె
చల్లార్చిన పాలు చేతపట్టి అతనికి ఆమె తాగిమ్చె
ఆమె నాసీనురాలయ్యె అతని చెంతన
మగధీరుడతడు నామది మెచ్చి దోచిన
బ్రహ్మాన కుటుంబములో పుట్టినందున
ప్రతిరోజూ ఉల్లాసముగా తిరిగేవారము జగాన
మా అయన పేరుఆంజనేయ అందరూ పిలుస్తారు అంజి
పట్టణానికి పోయి బ్రతకాలని చేరే గంజి
మాఆయనకు యాక్సిడెంటు జరిగింది అబ్దుల్ గంజి
హాస్పటల్లో చేర్చగా నడుము మాత్రము లేవదు అని చెప్పె
డాక్టర్ మాత్రము పరీక్ష చేసి ప్రాణగండం తప్పిందని
అందరూ అన్నారు పసుపు కుంకుమ నిలబడ్డాయని
మాగళ్యం ముందు మరణం కనుచూపులొ లేదని
ఆరోగ్యము కొరకు అనేక మందులు వాడుతున్నానని
ఆనాటి నుండి మ్రోక్కని దేవత లేదు
పసరు మందు నూనె వ్రాయని రోజు లేదు
అన్నా నీవు డాక్టర్ ఐతే చెప్పు మంచి మందు
ఆశతొ బ్రతుకుతున్న భర్తరోగం నయం చేయాలని
పల్లె పడచు కాదు ఈమె జీవిత వినత శీల
మాంగల్య బలంతో బ్రతుకుతుంది ఈవెళ
తప్పుతెలుసుకున్నాను వర్నిమ్చకూడదు శృంగార కళ
వ్యామోహం అనేది నాకు ఒక పీడ కళ
పతిని వీడక కాలం వెల్ల పుచ్చు చుంటిని
జన్మాంతర పాపమని భావించు చుంటిని
పాపముచేయక బ్రతకోసం బ్రతుకుచుంటిని
దేవుడు కరుణిస్తాడని ఆశతొజీవిమ్చు చుంటిని
పొమ్మనక భర్త కధ చెప్పి కళ్ళు తెరిపించే
స్త్రీని చూసి కోరికపెమ్చుకోవటం నాదే తప్పు
మంచివైద్యునికి చూపమని సలహా ఇచ్చే
తనవద్ద ఉన్న కొంత పైకము ఇచ్చి వెనుతిరిగె
నాధుని ప్రాణము కాపాడుట ధర్మమని తలచె
ప్రాణముంన్నంతవరకు పతిసేవ పరమార్ధమని భావించే
శరీరసుఖముకన్న ప్రేమ భంధము ముఖ్యమని తలచె
నా ప్రవర్తన నీ మనస్సును నొప్పిస్తే శిక్షకు భాద్యురాలను
సావిత్రి పతి ప్రాణములు యమునితో పోరాడి సాధించలేదా
సుమతి పతి శాపవిముక్తి కల్పించి పంతము నేరవేర్చుకోలేదా
సుకన్య పతి అంధత్వం తొలగించి సుమ్దరునిగా చేయలేదా
అనసూయ త్రిమూర్తులను పిల్లలుగా మార్చి ఆడిమ్చలేదా
చెల్లి నా తప్పు తెలుసు కున్నాను అన్నగా సహాయపడతాను
పర స్త్రీలను తల్లిగా, అక్కగా, చెల్లిగా, గోరవిమ్చి ఆదరిస్తాను
నీభర్త క్షేమంగా ఉండాలని ఆ దేవుణ్ణి నేను కూడా ప్రార్ధిస్తాను
నేను చేసిన వెకిల చేష్టలన్నీ క్షేమిమ్చుము చెల్లి
పడక కూర్చీలొ పడుకొని సువర్చల పగటి కల కంటుంది
అమ్మా అని శిరీష పిలుపుకు ఒక్కసారి నిద్రలేచింది
నిద్రలోకూడా గతస్మృతులు గుర్తుకు తెచ్చుకొని భాదెమ్దుకుభాదెమ్దుకు ఈ ఆంజనేయులు ఒక్క గంతు వేసాడంటే
ఒక్కటే నవ్వులు, నవ్వులు మీద నవ్వులు
" ఆకర్షణ కన్నా - ప్రేమ భంధం మిన్నా "
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి