17, డిసెంబర్ 2013, మంగళవారం

మన మనస్సాంతికి మార్గాలు-2

ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
పంజలి ప్రభ - మన మనస్సాంతికి మార్గాలు
సర్వేజనా సుఖినోభవంతు

81వినయం ఎట్లా ఏర్పడుతుంది?

గురువులను విద్య వంతులను, సేవిమ్చాడంవల్ల వినయం అలవడుతుంది
82ఆత్మ సంపాదనం అంటే ఏమిటి?

పెద్దల సహవాసం చేసి సంపాదించుకొన్న విజ్ఞానంచేత తనను సంపాదించుకోవాలి. వినయం,

విజ్ఞానం ఈ రెండూ లేనివాడు తనను తానూ కోల్ఫోఇనట్లే. ఈరెండూ ఉన్నవాడు తనను తానూ చక్క

బరచుకొన్న వాడవుతాడు, ఆత్మ సంపాదనం అంటే ఇదే.
83రాజ్యపాలనకు అవసరమైనవి ఏవి?

అమాత్యులు, మిత్రులు,ధనాగారం,రాష్ట్రం,దుర్గం, సైన్యం ఈ ఆరింటిని వక్రుతులని పేరు.

రాజ్యపాలను కావలసినవి ఇవే.
84మంత్రులంటే ఎవరు?

ఏది చేయ్యాలి, ఏది చెయ్యకూడదు అనే విషయాన్ని బాగా తెలుసుకో గలికిన వాళ్ళే నిజమైన

మంత్రులు.
85మంత్రిగా ఎవరిని తీసుకొవాలి?

శాస్త్రజ్ఞానం ఉన్న, ఎ ప్రలోభానికీ లొమ్గనివాణ్ణి మంత్రిగా చేసుకోవాలి, ధనం, స్త్రీ మెదలైనవాటిని

ఎరచూపి రహస్యముగా పరీక్షిమ్చడమ్ అలాంటి పరిక్షలలో పరిసుద్ధుడుగా తెలినవాడు

"ఉపధాశుద్ధుడు"
86రహస్యం ఎట్లా బయటబడుతుమ్ది?

ముగ్గురు కలిస్తే వాళ్ళు ఒకేమాట మీద ఉంటారనేదె నమ్మజాలని విషయం. ఆలాంటప్పుడు

ఇద్దరుచేసిన మంతనాలు మూదొవాడికి తెలిస్తే దాగుతాయా?
87రాజ్య తంత్రం అంటే ఏమిటి?

లేనిదాన్ని సంపాదించడం, సంపాదిమ్చినదాన్ని రక్షించుకోవడం దాన్ని వృద్ధి పోమ్దిమ్చుకోవడం,

తగిన రీతిలొ వినియోగించడం. ఈ నాలుగే రాజ్యతంత్రం (రాజ్య వ్యవహారం) అంటారు.
88అన్ని పనులకు మూలమ్ ఏమిటి?

అన్ని పనులకీ మూలమ్ మంత్రం (మంచి ఆలోచన)
90ఎవరితో విరోధం పెట్టుకో కూడదు ?

బలంగా ఉన్నవాడు తనకంటే తక్కువ బలం ఉన్న వాడితో విరోధం పెట్టు కోవాలి, తనకంటే

ఎక్కువ బలం ఉన్న వాడితో గాని, సమునితొ గాని విరోధం పెట్టుకోకూడదు.


91ఆత్మ రక్షణ అంటే ఏమిటి?

శత్రువులతో విరోధం వల్ల అనగా శత్రువులు విరోధం చూపు తున్నప్పుడు ఆత్మ రక్షణ చేసికోవాలి

లేదా శత్రువులతో విరోధంకంటే ఆత్మ రక్షణకు ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.
92శక్తి లేనివాడు ఏమిచేయాలి?

బలవంతుని ఆశ్ర ఇమ్చాలి, దుర్బలున్ని ఆశ్రయిస్తే కష్టాలు తెచ్చిపెట్టుకున్నట్లే.
93ఇంద్రియాలకు లోమ్గినవాడెమవుతాడు?

ఇంద్రియాలకు లొంగి పోఇనవాడు చతురంగబలం ఉన్న నశిస్తాడు. గజ-తురగ-రాధా-పదాతు లానే చతురంగాబలం ఆనాడు,

వాయుసేనా, జలసేనా, యుద్ధసకట, సైనికులనేవి ఈనాడు

చతురంగబలం.
94శిష్యుడు:దండ నీతి అంటే ఏమిటి?

దండం అనగా అపరాదుల్ని శిక్షిమ్చడమ్, రాజ్య్యాన్ని పాలించాడం. శత్రువు దండ నీతికిలోమ్గుతాడు.

దండంలో పరుషంగా ఉంటే అమ్దరికీ ద్వేష పాత్రుడు అవుతాడు.
95శిష్యుడు:పురుష ప్రయత్నం అంటే ఏమిటి?

దైవం పురుషప్రయత్నాన్ని అనుసరించి ఉంటుంది. అనగా పురుష ప్రయత్నం చేస్తే దైవం కూడా దానంతట అదే తోడ్పడుతుంది.

96అనుకున్నవి జరుగక పోవడం కారణం?

దైవదోషం చేతా, మానవ దోషంచేతా పనులు జరుగవు.
97లోకం ఎవరిని గౌరవించదు?

గురువు: ఎంత చదువు వడైనా శక్తి లేని వాణ్ణి లోకం గౌరవించదు.
98అర్ధం - అనర్ధం అంటే ఏమిటే?

స్త్రీ రిద్వారా వచ్చిన అర్ధం (ధనం) దానికి విపరీతమ్గా 'అనర్ధం' (అపకార హేతువు) అవుతుంది.
99ఎవరిని నమ్మ కూడదు ?

చడీలు చెప్పే వారిని నమ్మకూడదు. చాడీలు చెప్పే వారిని భార్య పుత్రులు కుడా విడిచి పెడతారు.


100ముసలి తనం అంటే ఏమిటి ?

పురుషుడికి మైధునం ముసలితనం (దౌర్బల్య హేతువు), స్త్రీకి మైధునం లేకపోవడం ముసలితనం.



101. సంతోషం ఎట్లా వస్తుంది?.
       అసంతుష్టుడైన వ్యక్తీ ఎవరినీ సంతుష్టుని చెయ్యలేడు. సంతుష్టుడైన వ్యక్తీ అందరిని సంతోషపరుచగలడు 
102. అనర్ధాలకు మూలమేది ? 
       అన్ని అనర్ధాలకు మూలము ఆలస్యమే అందువలన ఎన్ని ప్రయత్నాలు చేసి అయినా ఆలస్యాన్ని 
       పరిత్యజిమ్చాలి.
103. పరీక్ష అనగానేమి?
       ఈ ప్రపంచమునందు ధర్మాధర్మములకు పరీక్షాస్థలము. అందువలన సావధాన చిత్తులై, ధర్మాధర్మ పరీక్ష
       చేసి పనులను చేయాలి.
104. సహవాసమంటే (స్నేహం) ఏమిటి?
  .    సజ్జన స్నేహం స్వర్గం, దుర్జన స్నేహం నరకం.
105. హింస అంటే ఏమిటి?
       ఎవరినీ ఎప్పుడూ హింసించకూడదు. మంచి ఉద్దేస్యమితొ కాని చెడు ఉద్దేస్యముతో కాని ఎ ప్రాణిని ఎ
       సమయములో హింసించ కూడదు.
106. మొక్షమునకు మార్గాము లేవి?
        ఆత్మజ్ఞానము, సత్పాత్రదానం,సంతోషముగా ఉండటమే మొక్షమునకు మార్గాము
107. చింతన అంటే ఏమిటి?
       చింతన శీలము (ఆత్మవిమర్శన) అమరత్వము పొందడానికి మార్గం.అధర్మ చింతనయే మృత్యువుకు
       మార్గం     
108. శత్రువు ఎవరు?
       చేడుమార్గాములో నడిచే మనస్సు.
109. విద్య సముపార్జన అంటే ఏమిటి ?
       తేనటీగ పూల సౌందర్యము సుగంధములు చెడకుండా తేనెను మాత్రం ఎట్లా గ్రహిసుమ్దో, అట్లాగే నీవు
       కూడా పాపములు అంటకుండా విద్య సముపార్జన చేయాలి.
110. జయమంటే ఏమిటి ?
       యుద్ధములో లక్షమందిని జఇమ్చిన వాడు నిజమైన విజేత కాడు,తనను తానూ జ ఇమ్చిన వాడె
       నిజమైన విజేత, అదే నిజమైన  జయం. 

                                               
     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి