18, ఆగస్టు 2018, శనివారం



తాత మానవుడి చిన్న కధలు -10 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
  
తాత మాట గొప్పతనము ఏమిటి అని అడిగాడు మానవుడు 

మాత నుండి వచ్చింది మాట, మొదటి మాట అమ్మా అమ్మా అని ఏడవటం అది క్రమేపి ప్రేమ ప్రేమ అని తలచటం తదుపరి రామ కృష్ణ అని ప్రార్ధించడం అన్నాడు తాతగారు. 
అర్ధం కాలేదు వివరించండి అన్నాడు మనవుడు. 

చెట్టు సారం పండులో ఉన్నట్లు మనిషి శక్తి సారం మాటాలో ఉంటుంది. మాటలో దయ కలిగిస్తే
హాయి, కోపం చూపిస్తే తిట్టు, జ్ఞానంతో బోధిస్తే ప్రవచనం. పసిడి హారాలు, పన్నీటి జలాలు, సొగసులు, శరీర సౌష్టవాలు ఇవి ఏమి కావు ఆభరణాలు కావు, కేవలము మాట ఒక్కటే ఆభరణం అది గుర్తుంచుకో. జారి పడ్డా లేవచ్చు, మాట తప్పితే మనిషిగా గుర్తింపు కోల్పోతావు. నీవు నోటి ద్వారా ఏమి తిన్నావని అడగరు, నీ పెదాలనుండి ఏ మాట వచ్చిందా అని అడుగుతారు ఇదే కలియుగం. 
ఒక వ్యాపారస్తుడు ఒక ఊరిలోకి పోయి ఈ ఊరు మంచిదా అని అడిగాడు, వెంటనే అక్కడ ఉన్నవారు, నీ నోటి మాట మంచిదైతే ఇక్కడంతా మంచివారే తేడా వస్తే ఇక్కడుండే దుర్మార్గులు మరెక్కడా ఉండరు అన్నారు వారు. మనిషికి మాటే ధైర్యాన్ని నింపుతుంది భయాన్ని తొలగిస్తుంది. లంకలో హనుమంతుని భీకర నాదానికే భయబ్రాంతులయ్యారు రాక్షసులు " రాక్షసులలో యుద్దము చేయాలన్న కోరికకన్నా చచ్చి పోదుమన్న హెచ్చు భీతి కలిగింది" అట్లాగే రాముని కలసి నప్పుడు మాటచాతుర్యముతో సుగ్రీవుని వద్దకు తీసుకెళ్ళి మైత్రి కలిపాడు, లంకలో ఉన్న సీతకు 
ధైర్యం చెప్పి రామునికి తెలియ పరచి ఓదార్చాడు, రామునికి రావణ సోదరుడగు విభీషునునితో  స్నేహం కలుపుకుంటే ఉపయోగం అని తెలిపి, అతని సహాయము  దుర్మార్గుడైన రావణుని సంహారించుటకు ఒక ఆధారము అని తెలిపాడు. అందుకే అన్నారు పెద్దలు మాట తీరు మంచిగా ఉంటె నాయకులు ఏమి చేయకపోయినా నమ్మించగలిగిన శక్తి మాటకు మాత్రమే ఉన్నది ఇదే లోక రీతి.    చివరిగా ఒకటే చెప్పేది రెండు నాలుకల ధోరణితో మాట్లాడే వారుంటారు, పైన చెప్పెది ఒకటి చేసేది మరొకటి. మాటలతో కౌగలించు కుంటారు బలహీనతలను గమనించి ఉన్నదనటా దోచుకు పోతారు ఇదే మాటలో ఉన్న మహత్యం. 
ఇంతకీ మీది రాముని వాక్కా, హరిచంద్రుని వాక్కా అని అడిగాడు మనవుడు. 
నీవే ఆలో చించు నా వాక్కు ఎవరిదో అన్నాడు తాతయ్య. 

--((**))--        

చిన్న కధ -Panjali Prabha.com 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఓకే ఊరిలో సుబ్బారాయుడు ఒకడు ఉన్నాడు, అతడు గొప్పలు చెప్పఁటంలో ప్రసిద్ధి, ఒక రోజు పిల్లందరి మద్య కూర్చొని కధలు పిల్లలకు చెపుతున్నాడు. సముద్రం నీళ్లు ఎవరైన త్రాగుతారా? అని అడిగాడు.  త్రాగుతాయి అన్నారు పిల్లలు, ముందు మీరు ఇవి త్రాగండి అన్నారు పిల్లలు గ్లాసు నీళ్లు ఉంచి, ఓసి ఇవేగా త్రాగుతా చూడండి అంటూ నోట్లో పోసుకున్నాడు అంతే ఒక్కసారి బోళ్ళుమని కక్కాడు సుబ్బారాయుడు ఎవరు ఉప్పు కల్పిన నీరు పెట్టింది అన్నాడు కోపంగా. వెంటనే పిల్లలు మీరు తిమింగళంగా మారండి అప్పుడు సముద్రం నీరు త్రాగవచ్చు అంటూ నవ్వు కుంటూ వెళ్లారు పిల్లలు.  కారణం లేకుండా నవ్వుతున్నారు మీరు అన్నాడు. మీరు చెప్పే గొప్పలకు కారణం కూడా ఉండాలా అన్నారు పిల్లలు వెళుతూ. అప్పుడే సుబ్బారావు భార్య బయటకు వస్తూ, పిల్లల దగ్గర చులకనై పోతారు, పిట్టల దగ్గర చులకనై పోతారు ఎం బతుకండి అన్నది. అప్పుడే సంస్కృతం బుక్కు ఒకటి ఉంటె చదివాడు, దుర్మార్గులను, మూర్ఖులను ఎవ్వరు మార్చలేరు అని పెద్దగా చదివాడు. అబ్బా ఆపండి చదువు మీరు ఆకోవకు చెందిన వారైతే ఇపాటి కళ్ళ, ఆ  ఇపాటికల్లా మిమ్ము వదిలేసి వేరొకడితో లేచిపొయ్యేదాన్ని అన్నది భార్య. అయితే నన్ను మంచివాడిగా గుర్తించావుగా అన్నాడు.  ఆ మంచి వాడివే గోరంతది కొండత చేసి మాట్లాడుతావు అది అవసరమా ? విను ముందు తర్వాత మాట్లాడ వచ్చు అన్నది భార్య. 

   నీలాంటి వాడు ఒకడు నడిరోడ్డులో రెడ్ లైట్ పడ్డ ఆగక పో బొయ్యాడు, ఒకతను గట్టిగా ఆపి అట్లా పోకండి క్రమ శిక్షణ తప్పి ప్రవర్తించకండి అన్నాడు. పోలీసులకు నేను భయపడను, అసలు మృత్యువుకే భయపడను అన్నాడు. వారిద్దరికీ భయపడ నవసరము లేదు. మా పిల్లలు చూస్తే చెడిపోతారని మా భయం అంతే అంటూ ఈ శ్లోకం చెప్పాడు ఆ పెద్ద మనిషి తెలుసా అంటూ చదివిన్పించింది ఆ ఇల్లాలు.                                  

నీతి శాస్త్రము - పండిత పరిష్కృతము 
శ్లో === బాలసఖత్వ మకారణ హాస్యం | స్త్రిషువివాద మసజ్జన సేవా |
గార్ధభయాన మసంస్కృత వాణీ | షట్సు నరో లఘుతా ముపయాతి||

భావము === చిన్న వారితో స్నేహము, కారణము లేని నవ్వు, స్త్రీమూలక వివాదము, దుర్మార్గుల సేవ, గాడిదనెక్కి తిరుగుట, సంస్కృత భాషను చదువకుమ్దుట అను నీ ఆరింటిచే పురుషుడు చులకనై పోవును.
--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి