8, ఆగస్టు 2018, బుధవారంవాజ్ పేయి కి అశ్రు నివాళి! 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఊపిరిపోసి పార్టీకి కొత్త శక్తి తెచ్చావు 
- ప్రజాసేవ కోసం నిరంతరము తపించావు

గరళం మింగి అమృతం ప్రజలకు పంచావు 
- రాజకీయము రక్షించుటకు కృషి చేసావు    

సమస్యల వలయాన్ని ధర్మంతో జయించావు 
- ప్రధాని,రచయితగా నిస్వార్ధ పరుడవు 

ఐక్యరాజ సమితిలో వాగ్ధాటిని చూపావు  
- ప్రజల నమ్మకాన్ని న్యాయంగా నిలబెట్టావు  

పార్టీ సభ్యులను ఏకం చేసే చతురుడవు 
- రాబోయే కాలము అంతా మాదేనని చాటావు

 నీవు ఎవరిని నొప్పించని నాయకుడవు 
-రాజ్యాంగాన్ని ఔపోసన పట్టిన ధీరుడవు 

 రాజకీయములో బ్రహచారైన భీష్ముడవు 
- భరత జాతి గర్వించే మహా నాయకుడవు 

మూడుసార్లు ప్రధాని ఐన అజాతశత్రువు
- ప్రజల హృదయాలలో ఉన్న ఆత్మబంధువు 

జీవికి మరణం తప్పదు 
మరణానికి పుట్టుక తప్పదు    
ధర్మం, సత్యం, న్యాయానికి చావు ఉండదు 
ఇది వేణుగోపాల రాజకీయ లీల సుమా   
--((**))--


అధిక్షేప ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ   

కన్ను రెప్ప వాల్చ నంటుంది నిన్ను చూస్తే 
- మనసు ఉరకలు ఏస్తుంది ఎందుకో 

హృదయం దడ దడ లాడు నిన్ను చుస్తే 
- మంచులా కరిగి పొమ్మంటుంది ఎందుకో 

మాట పాటగా మారుతుంది నిన్ను చూస్తే
- సెలయేరులా మారమంటుంది ఎందుకో 

ప్రేమ శిక్ష నాకు ఎందుకు నిన్ను చూస్తే
- కళ్లెంలేని గుర్రంలా పరుగు ఎందుకో  

నాలో మెఱుపు తీగ విధ్యుత్ నిన్ను చూస్తే
- చినుకు పూల సంబరం నాలో ఎందుకో

చిరునవ్వు గల తలపు నిన్ను చూస్తే 
- అధరామృతం అందివ్వ మంది ఎందుకో

పెదవి సొంగ కారుస్తుంది నిన్ను చూస్తే  
 - తేట నీరు అందుకో  అంటుంది ఎందుకో 

 బొడ్డు చీర నిల్వ నంటుంది నిన్ను చూస్తే
- తనువు ఎదో కావాలంటుంది ఎందుకో

వయసు వయసు పంచుకో
సిగ్గు విడిచి తృప్తి అందుకో 
నిత్యం ధర్మ బుద్ధి నిలుపుకో
ఇది వేణుగోపాల ప్రేమ సుమా

--((**))--    


Image may contain: 1 person

అధిక్షేప ప్రేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

హృదయంలో దాగి ఉన్నాడు గుర్తు పట్టనట్లు భేటీ  
- పరువంలో ఉండి ఉన్నాడు చూసి చూడనట్లు కోటీ  

పాషాణంగా ఉన్న మనస్సును మార్చ లేనట్లు పోటీ   
- నవ పారిజాతం గా  నీవు నాకు దక్కనట్లు శాటీ  

ముసుగులో ఉంచి నాకు తెస్తున్నావు ఇక్కట్లు ఘోటీ 
- నవ్వుని పంచ లేక పడుతున్న అగచాట్లు చీటీ  

ఇత్తడి పుత్తడి అయినా  బుద్ధి మారనట్లు ధాటీ 
- ప్రకృతి పరంగా నిత్యం ఆనందించటం పరిపాటీ   

మణీకిరణ కోటీ
గంధ కుచశాటీ
లేదు ఎప్పుడు పోటీ 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--


అధిక్షేప ప్రేమ లీల 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

మధుతోటి చెలిమి మీరా మనసాయే
- మగువ తోటి జాలి జోల పాటలాయే    

తెలివి తోటి విద్యయే సంపాదనాయే 
- బలిమి తోటి నీ బుద్ధియే స్వార్దమాయే

ఆశయం తోటి శక్తి ప్రభావిత మాయే 
- కోపం తోటి పలు మాటలు ద్వందాలాయే

పగటి తోటి రేయి శాశ్విత చెలిమాయే 
- ప్రేమ తోటి పరిణయం శాశ్విత మాయే

పరువం తోటి వయసు ఉరకలాయే
- వినయం తోటి ప్రేమ ప్రభావితమాయే   

సమయం తోటి బ్రతుకే  ప్రధానమాయే 
- విరహం తోటి తరుణం సుఖాల మాయే    

కంటి తోటి లవణ నీరు తోడు ఆయే
- కళ్ళ తోటి చూపులు దయ చిహ్నమాయే 

తల్లి తోటి తండ్రి ప్రాణంకి  ప్రాణమాయే
- దైవం తోటి ధర్మం సత్యం జీవితమాయే 


కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన 
గుండెల్లో గుండె కలిపి చూసిన
ప్రకృతి  వింతనాటకములో పావులమాయే 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--     స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
అధిక్షేప ప్రేమ లీల  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ప్రతి నిముషం వ్యర్ధం చేయక జీవిద్దాం 
- ప్రతిదీ సద్విని యోగంతో  బ్రతికేద్దాం  

జగమంతా పచ్చదనాలతో నింపెద్దాం
- నేలనంతా హరిత వనంగా మారుద్దాం  

ఆరోగ్యమే మహాబాగ్యంగా ప్రవర్తిద్దాం 
- మన దేశ సంపదను వృద్ధికి తెద్దాం 

"శ్వాస, ధ్యాస ఇచ్చే ప్రకృతిని ప్రేమిద్దాం "
- హింస మాని అహింసా సూత్రాన్ని పాటిద్దాం 

దేశ ధర్మాన్ని అనుకరిస్తూ జీవిద్దాం  
- శాంతి నిచ్చే ఆరాధ్య దేవుణ్ణి ప్రార్దిద్దాం 

తెలిసింది చెప్పి మంచి మార్గం నడుద్దాం   
- కృషితో దుర్భిక్షం లేకుండా ప్రయత్నిద్దాం 

నిగ్రహ శక్తిని పెంచేవి మాట్లాడుదాం 
- సత్యం, ధర్మం, న్యాయం గా జీవిద్దాం

భారాత మాత సాక్షిగా ప్రమాణం చేద్దాం   
- అందరమూ ప్రగతికి చేయుత నిద్దాం  

దేశం నాకేమిచ్చింది 
తల్లి తండ్రులు నాకేమిచ్చారు
అనక దేశానికి, పెద్దలకు 
నీ సహాయం ఎదో చెప్పు   
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--


అధిక్షేప పేమ లీల 
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ 

మన మస్తిష్కం లో శక్తి దాగి ఉందిలే
- మన జాతికి ప్రగతికి కావాలిలే 

 అవనిలో సాధ్యము కానిది లోదులే 
- అద్భుతములు సృష్టించేది మనుష్యులే

మన తెలివెప్పుడు సహాయడునులే 
- మమతన్నది మనుగడ భందువులే

శక్తి అభ్యదయానికి అడ్డు రాదులే 
- ప్రకృతి వ్రాసేటి  తెల్ల కాగితములే  

 సూర్య శక్తికి అడ్డు ఏదియు లేదులే  
- ఆనంద స్వప్నాలు మన ఊపిరిలే 

మన ఆలోచనలే అమృత వాక్కులే
- స్వప్నాలు కావ్యాల  ప్రేమ తీపి గుర్తులే 

కాలక్షేపం కవి వ్రాత చమత్కారాలే  
- మనసంతా సంతృప్తి ఆకలి సెగలే  

అధరామృతమే జీవానికి నాందిలే
అమ్మానాన్న పాదసేవే జీవితములే   

అవునన్నది కాదులే 
కాదన్నది అవునులే 
ఆత్మ యోగి వేదములే 
ఇది వేణు  గోపాల ప్రేమలీల   
 --((**))--


"భారత దేశ ప్రజలందరికి " స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా 
ప్రాంజలి ప్రభ శుభాకాంక్షలు - తెలియపరుస్తున్నది 
   
అధిక్షేప ప్రేమ లీల
రచయత:మల్లాప్రగడ రామకృష్ణ 

దేశమంటే మట్టి కాదోయ్ - అక్షర మాలాయే  
- అక్షర మాలే వేదాంతమాయ్ - నీ వేలుగాయే 

మనుష్యుల వెలుగు మయమ్ - జీవన మాయే
- దేశ నవాభ్యుదయమ్ - ఉద్యోగ భద్రతాయే        

స్త్రీ పురుష లోకమ్ - కష్ట సుఖ జీవులాయే  
- నిరంతరం పుట్టే జీవమ్ - కష్టతరం లాయే

ఆరోగ్యం మందులాయ్ - మన:శాంతి కరువాయే
- ఉమ్మడి కుటుంబాల్ - ప్రస్నార్ధకము లాయే 
    
రాజకీయ నాయకుల్ - స్వలాభ ప్రజ లాయే     
- సామాన్య ప్రజానీకమ్ - ఆశకు  బద్ధు లాయే
  
కీర్తి, ధనం కోసమ్ - దీక్ష కర్తవ్యం లేదాయే
- అనుభవ జ్ఞానమ్ - అగమ్య గోచరమాయే

మేధస్సుకు అంతర్ జ్వాలమ్ - మరో జ్ఞాణ మాయే       
- అనారోగ్య మాయా జాలమ్ - ఆకర్షణ మాయే 

జీవితమ్ - శక్తి సామర్ధ్యాలకు ప్రశ్నలాయే 
- అమ్మ ప్రేమ, నాన్న ప్రత్సాహమ్ - ప్రపంచమాయే   

మారుతున్న కాలం తో మారాలోయ్ 
మనవాభ్యదయం బతికించాలోయ్
కలసి దేశానికి సహకరించాలోయ్  
ఇది వేణు గోపాల్ ప్రేమ సుమా
--((**))--PRANJALI PABHA.COM
అధిక్షేప ప్రేమ లీల 
రచయత : మల్లాప్రగడ రామ కృష్ణ 

శుద్ధమైన మనసుకు నిద్దురేలా 
- మానవత్వానికి మచ్చ చూపు లీలా

ఇష్టమైన రోజుకు కష్టాలు ఏలా
- కష్టమైనప్పుడు శాంతి లేని లీలా   

హనుమ ధర్మ వాక్కు అద్భుత లీలా
- రామ నామ మహిమ జీవిత లీలా    

ఇంద్రియాలపై మాయ మహిమ లీలా
- కర్మ, జ్ఞాణ, అంతర్గత మోక్ష లీలా    

పరమాత్మ యోగ సాధనల లీలా
- అనుష్టానముతో అనుబంధ లీలా  

శ్రీ హరి యోగవేదాంత ప్రేమ లీలా 
- శరణాగతి పొందిన మోక్ష లీలా
  
జిహ్వతో సంసారి మనస్సుపై లీలా 
- స్త్రీ ఓర్పుతో గుణాతీతా బంధ లీలా 

తల్లి, తండ్రి, గురువుల బోధ లీలా 
- తరుణ నియోగ దేహ శక్తి లీలా

సృష్టి స్థితి లయకారుని లీలా 
సరస్వతి, లక్ష్మి, పార్వతి లీలా 
పాప పుణ్యాలతో ప్రజా లీలా 
ఇది వేణుగోపాల ప్రేమ లీల 
--((**))--అధిక్షేప ప్రేమ లీల 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

గిరిగీచుక కూర్చొణ బోకు,  సరిలేదనుకోకు  
- మర్యాద లేదనీ, మర్చిపోయి ప్రవర్తించుటెందుకు  

నా కెవరు సరి రారన్నట్లు, పదమాలికేందుకు
- మదం పెంచెడి, అహంకారపు మాటలెందుకు
     
తృప్తి నిచ్చేడి హృదయాన్ని, నీవు పంచలే వెందుకు   
- కరుణతో జనుల సహాయం తీసుకొన వెందుకు    

సద్వినియోగం చేసుకోక నీ బాధ పంచుటెందుకు 
- తరుణమ్మను వ్యర్ధము చేసి బ్రతుకుట ఎందుకు 

సమభావంతో ఉండక నీ దౌర్జన్యం చూపుటెందుకు 
- సానుభూతి తెల్పక దర్పపు పలుకులు ఎందుకు  

సృష్టి రచన గూర్చి అడిగే హక్కు, నీకు ఎందుకు   
- నిరుపేదను తూలనాడుట అవసరమా నీకు 

సరసంబుగా బాసలాడి మోసగించుట ఎందుకు
- మతి నుంచక అతిగా గొప్పలు చెప్పుట ఎందుకు  

ప్రాప్తమైన దాని తోడ తృప్తిగా బ్రతక వెందుకు 
- తల్లి, తండ్రి, గురువు, సేవించక తిరుగు డెందుకు

చెవిటి వాని ముందు శంఖం ఊదటం 
మొండి వానికి హిత బోధ చేయటం
కరి తొండాన్ని ఊపద్దనటం 
కుక్క తోక వంకరతీయుట వ్యర్థం 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--
   

అధిక్షేప ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

లేత లేత మొగ్గలం,  చదువుతున్న బాలలం 
- తీపి తీపి ఆశలం, ఆశయం ఉన్న బాలలం     

వీధి వీధి ప్రియులం, ప్రేమతో ఉన్న బాలలం 
- దేశ వాస బిడ్డలం, ధైర్యంతో ఉన్న బాలలం

గురు మాట బద్ధులం, ధ్యేయంతో ఉన్న బాలలం
- తల్లి తండ్రి సేవలం, బాధ్యత ఉన్న బాలలం 

ఘుమ ఘుమ పువ్వులం, గుభాలిస్తున్న బాలలం
- మండే వెల్గు దివ్వెలం, ఓర్పుతో ఉన్న బాలలం       

దేశ సేవ పాత్రులం, నేర్పుతో ఉన్న బాలలం 
- భక్తి యుక్తి జీవులం, స్నేహంతో ఉన్న బాలలం

మంచి చెడు పావులం, ప్రాణంతో ఉన్న బాలలం 
- పుణ్య్ పాప పోరులం, కర్మతో ఉన్న బాలలం 
   
అమ్మ ప్రేమ వాసులం, శుభ్రంగా ఉన్న బాలలం 
- నాన్న కోర్క తీరులం, ధర్మంగా ఉన్న బాలలం 
   
వేద గుణ వైద్యులం, భాష్యంగా ఉన్న బాలలం 
- భవ్య దివ్య వెల్గులం, శాంతంగా ఉన్న బాలలం 
  
తల్లి తండ్రి ధర్మ వాక్కు 
గురువు సత్య వాక్కు
బాలలకు న్యాయవాక్కు 
బాల వాక్కు బ్రహ్మ వాక్కు
ఇదే వేణు గోపాల ప్రేమ సుమా 

-((**))--


అధిక్షేప ప్రేమ లీల - ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

నా మాటల మర్మం నీవు అర్ధం చేసుకోవా
- మనసు కలవ టానికి ప్రయత్నించవా

నీలో కమ్మిన మాయ తొలగించు కోలేవా     
- నావంతు సహాయం చేయుటకు ఒప్పుకోవా  

నీలో ఈ పట్టుదల ఎందుకో చెప్పలేవా  
- బిడియం వదలి కలువుటకు రాలేవా

నాకు ఓకే నవ్వు చూపి మాయ మవుతావా
- నా దరి చేరి సుఖం పొందుట కొప్పుకోవా

 లతలతో మైమరిపించుటకు రాలేవా 
- అధరామృతాన్ని అందించి అందుకోలేవా  

  నీవు సుఖించి జీవ నాడిగా మారలేవా
-  నా ప్రేమకోసం కట్టుబాటు దాటి రాలేవా

ప్రేమ అందించి నాలో శక్తిని పెంచలేవా 
- నీ ప్రాణానికి నా ప్రాణమని గ్రహించావా

నా ఊహల పట్టపు రాణిగా ఉండలేవా
- నాగుండె మంటను చల్లార్చుటకు రాలేవా 
  
తాడు తెగే దాకా లాగ కూడదు   
ప్రేమ ముదిరేదాకా ఉండకూడదు
ప్రేమ పండేదాకా ఓర్పు ఉండాలి 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

 --((**))--
Drawings

అధిక్షేప ప్రేమ లీల - ప్రాంజలి  ప్రభ 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

నాకున్నది నీకు, నీకున్నది నాకు లేదోయి  
లేనిదాని గూర్చి ఆలోచించుట ఎందుకోయి 

నామాట నీమాట ఒకే రకంగా ఉండదోయి
సర్దుకుపోయే గుణం 'నీనా' మనలో ఉందోయి 

నీ కోరిక నా కోరికా ఏ నాడు కల్వదోయి    
ఆరోగ్యం పంచుకొనే బుద్ధి ఉంటే చాలునోయి 

వయసు కోరికలు తిర్చలేక ఉన్నఓయి
క్షణ ఓర్పు వహించా వంటే అంతా సుఖమోయి  

మాటి మాటికీ కోపం మన మధ్య ఎందుకోయి
బలహీనత భయం తో వచ్చే లక్షణ మోయి    

మంచి చెడును గూర్చి ఎందుకు చెర్చించవోయి  
మంచి భావనతో ఉంటె దుర్భుద్ధి ఉండదోయి 

జాగర్త గూర్చి నీ వెందుకు ఆలోచించ వోయి
ఆకలి తీర్చటం తప్ప ఏమీ చేయ లేమోయి

అర్హత లేని ఆశలతో ఉంటా వెందుకోయి
జీవితం ఆశయంగా జాగర్త పడ తానోయి

మూడుముళ్ల పెళ్లి గౌరవించు 
మూడునాళ్ళ ముచ్చట కాదు 
జీవించినన్నాళ్లు అది నీకు తోడు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--    

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి