19, ఆగస్టు 2018, ఆదివారం

తాత మానవుడి - (చిన్న కధలు)

తాత మాకధ నవుడి చిన్న కధలు -13 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

తాతా దేవుడున్నాడా?  లేడా ? నాకు చెప్పు తాతా   
ఒరే మనవుడా నా చిన్నప్పుడు విన్న కథను మరలా చెపుతా విను, విన్న తర్వాత నీవు ఉన్నాడంటే ఉన్నాడు .......   లేడంటే లేడు ... అంత  తొందరెందుకు ఒక్క సంఘటన చెపుతా విను  అన్నాడు తాతయ్య మనవుడితో   
  
కొత్తగా లెక్కల మాష్టారు గారు క్లాసురూం లో అడుగు పెట్టారు, నల్ల బల్ల మీద వినాయకుని బొమ్మ వేసారు పిల్లలు, అది చూసి దేవుడున్నాడని మీరు నమ్ముతారా ? అని గాట్టిగా అన్నారు మాష్టార్, అంటే గట్టిగా మీరు నమ్మరా అని సమాధానముగా చెప్పారు పిల్లలు.

 " భగవంతున్ని ఎవరైనా తాకారా, మాట్లాడారా, చూసారా "  లేదు కనుక దేవుడు లేడని నమ్మవచ్చా  అన్న మాష్టార్  మాటలకు" ఒక విద్యార్ధి లేచి దేవుడు లేడన్న వారు ఎందుకు తలిచారు,  ఇప్పుడు. ఉన్నారని మేము నిరూ పిస్తాము,  మాకు మీరు ఏమి ఇస్తారు మాష్టార్. నిరూపించండి చూద్దామ్, మీ అందరి ఫీజులు నేను కడతాను అన్నాడు మాష్టార్.

కుక్క క్లాసురూం లోకి వస్తున్నది,  వెంటనే తరమండి అన్నాడు మాష్టార్, "ఆకలేస్తే అన్నం పెట్టేవాడని ఏమంటారు మాష్టార్ అని అడిగాడు ఒక విద్యార్ధి" ,  దేవుడుతో  సమానము.అన్నాడు మాష్టార్,  ఆ కుక్క నోటిలో "నా అన్నం కారేజ్ ఉన్నది నా ఆకలి తీర్చటానికి ఆహారం తెచ్చింది" అది దేవుడితో సమానము కదా మాష్టార్. మాష్టార్ కు అవుననక తప్పలేదు.

         ఎవరు క్లాసులో టపాసులు కాలుస్తున్నారు, పిల్లలు టపాసులు కాల్చుట కాదు మాష్టార్,  కరంట్ వైర్ తగల బడుతున్నది, త్వరలో ఈ భవనపు కప్పు కూల బోతున్నది, దేవుడు ముందుగా హెచ్చరిస్తున్నాడు, దేవుడు లేడన్నవారు ఉండండి, ఉన్నాడు అన్నవారు బయటకు రండి, మాష్టార్ అందరూ వెళ్ళాక నెమ్మదిగా బయటకు వస్తూనే భవణం పెద్ద శబ్దంతో నేలకు ఒరిగింది. దేవుడున్నాడు కదా మాష్టార్ గారు అన్నారు పిల్లలు.

పిల్లలందరూ అక్కడ ఉన్న ప్రయోగశాల వద్దకు చేరారు, అందరూ వెంటనే నవ్వటం మొదలు పెట్టారు, విద్యారుల వద్దకు మాష్టారు వచ్చి ఎందుకు నవ్వుతారు, దేవుణ్ణి చూసి మేము నవ్వు తున్నాము, మాష్టర్ కూడా నవ్వుతున్నాడు, మాష్టార్ మీరు కూడా దేవుడ్ని చూసారు కదూ నవ్వు తున్నారు, ఆ చూసాను నవ్వు అపుకో లేక పోతున్నను. మీ అందరి ఫీజులు నేనే కడతాను దేవుడున్నాడు నమ్ముతున్నాను అన్నాడు గట్టిగా మాష్టార్ (వెంటనే ఒక విద్యార్ధి నైట్రోజన్ గ్యాసు బిగించి  వచ్చాడు అందరి నవ్వులు ఆగినాయి).

మాష్టర్ ఒకే సారి నశించే వస్తువులు ఏవో చెప్పగలరా అని అడిగాడు ఒక విద్యార్థి?, పిల్లలముందు మాష్టార్  నోరు ఎత్తలేక పోయారు. ఒక విద్యార్ధి తెలియ పరిచాడు "మనకు వెలుగు నిచ్చి ఆరిపోయే అగ్గి పుల్లను, మన ఆకలి తీర్చే పండ్లను సృష్టించినది దేవుడే కదండి", సమస్త లోకల్ని రక్షించేది దేవుడే గదండి. అవును పిల్లలారా దేవుడున్నాడు.
మనవుడా దేవుడున్నాడని నమ్ముతావా 
అప్పటి లెక్కల మాష్టర్ మీరే కదా తాత, అవునురా నీ తెలివి అమోఘం, మనుషుల్లో ఉన్న దేవుణ్ణి గమనించి బతకటమే జీవితం అది తెలుసుకో
నిజమే తాత నీవు చెప్పినవి అక్షరాలా పాటిస్తున్నాను కదా ? 
ఏమిటి ఇప్పుడు చెప్పినది విని మరలాచెప్పమనటమా ?    
అవును తాత నేను చిన్న పిల్లవాడిని కదా ? అంటూ లేచాడు 
--((**))--


తాత మనవుడి  చిన్న కధలు -12
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

"ఎందుకు నిజం చెప్పాలి, ఎందుకు అబద్ద మాడకూడదు " నాకు కొంచం వివరంగా చెపుతారా అని మనవుడు అడిగాడు తాతగారిని.    

ఒరే మనవుడా నీమాటలు చూస్తే పెద్దవిగా ఉన్నాయి, వయస్సు చిన్నదిగా ఉన్నది. కనీసం నిజం ఎదో, అబద్దమేదో తెలుసుకొనే వయసు కాదు నీది అన్నాడు తాతగారు.

నాది చిన్న వయస్సైనా, మీమాటలు నేను ఒక్కడినే విన్నా, అందరికి కధలు కధలుగా  చెపుతాను తాతయ్యా అన్నాడు మనవుడు. 

నీవు బలే మాట్లాడు తావురా అయినా నాకు తెలిసిన విషయాన్ని నీకు చెపుతా విను. 


బలిచక్రవర్తి వామన మూర్తిని ఆహ్వానించి ఏదైనా వరము కోరు కోమని అడుగగా అదేసమయమున రాక్షస మంత్రి శుక్రాచార్యులు వచ్చినది విష్ణుమూర్తి అని తెలుసుకొని, మీరు అబద్ధమాడుట తప్పు లేదు, మనం రాక్షసులం, నేను చెప్పేది వక్కసారి ఆలోచించండి అని "వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవితా మానభంగమందు బొంకవచ్చు " అని చెప్పాడు. అప్పుడు ఏ పరిస్తుతులలో కుడా అబద్ధమాడ కూడదు అని  బలిచక్త్రవర్తి తలచి, మూడడుగుల నేల వామన మూర్తి అడుగగా ఇస్తానన్నాడు.  ఇవ్వగా వామనమూర్తి విశ్వరూపం దాల్చి, ఒక అడుగు ఆకాశం, రెండవ అడుగు భూమి, మూడోవ  అడుగు తన శిరస్సు అని చూపగా, పాతాళ  లోకం నొక్కబడ్డాడు.


మనవుడా ఎన్ని కష్టాలొచ్చినా, ఏ పరిస్థితిలో కూడా అబద్ధ మాడ కూడదు.  తెలిసిందా అని అన్నాడు తాతగారు.                       

అట్లాగే తాత సత్యం గూర్చి కూడా తెలియపరుచు తాత.  

శకుంతల తన భర్త దుష్యన్తుడికి సత్యం గురించి హితభోద చేసింది.
అది ఏమిటి తాతగారు 
అంట తొందర వద్దు 
సరే చెప్పు తాత. 

మంచినీల్లున్న నూతులు కన్నా ఒక బావి, వంద బావులకన్నా ఒక యజ్ఞం, వంద యజ్ఞాలకన్నా ఒక సుతుడు, వంద సుతుల కన్నా ఒక సత్య వాక్యం మంచిది. దాంపత్య బంధంలో సత్య వాక్కు లున్నంత వరకు ఎటువంటి సమస్యలురావు, వచ్చిన ఆక్షణంలో తీరిపోతాయి. 

ఇప్పుడు కాలం మారుతున్నది, అనుమానాలు, అపార్ధాలు, అనర్ధాలు పెరిగి పోతున్నాయి, ఆలోచనలు మారుతున్నాయి,  ఇటువంటి పరిస్థితిలో నిజం చెప్పినా నమ్మరు , అబద్ధం చెప్పినా నమ్మరు. 

ఇతరులకు పనికిరాని నిజాన్ని నిదానంగా చెప్పాలి, మనసు విప్పి మాట్లాడు కుంటే  ఏది నిజమో,  ఏది అబద్దమో తెలుసుకొనే శక్తి మానవులుగా ఉపయోగపడుతుంది. 
కళ్ళతో చూసేవి అన్నీ  నిజాలు కావు, చూడని అన్నీ అభద్దాలు కావు. 

తాత మీరు చెప్పే విషయాలు, కొన్ని అర్ధమైనట్లు, కొన్ని అర్ధం కానట్లు ఉన్నాయి తాతగారు. 
మొత్తం అర్ధం కానవసరం లేదు, విన్నది ఏమిటో చెప్పు చాలు అన్నాడు తాతగారు. 

తాతగారు నిజం నిదానంగా అర్ధమౌతుందని, అబద్దం వేగంగా ఆకర్షణతో అర్ధమవుతుందని తెలుస్తున్నది. 

చాలు అంతవరకు మిగాతా విషయాలు తర్వాత తెలుసుకుందానివిలే అంటూ లేచాడు తాత గారు.                       

--((**))--

తాతామానవుడి చిన్న కధలు -12 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ   

తాతా నాయకుడంటే ఎవరు తెలియపరుస్తావా అని అడిగాడు మనవుడు

ఒక మంచి పని చేయాలన్న, మంచి మనిషిని గుర్తించాలన్న నలుగురు కలిస్తే మంచిది, నలుగురిలో ఉన్న మేధావి చెప్పిన మాటలను అనుకరిస్తే జీవితము, జీవిత సాఫల్యానికి ఒక్క మాటతో సరిపోదు సిరి సంపదలు, వనరులు, ప్రకృతి సహకారములు, అధికారుల ఓదార్పులు, అధికారులవల్ల, చదివిన విద్యవల్ల పొందే ఉద్యోగాలు. 

ప్రతి పనిలో పోటీ ఉంటుంది. పోటీ పటిష్టం కావాలంటే మనం నమ్ముకున్న వాని వళ్ళ మనకు ప్రయోజనం ఉంటుందని వాణ్ని అందలం లెక్కించుటకు కృషి చేయాలి, ఇది కూడా నలుగురిలో ఒకరిని ఎన్నుకోవటం సహజం. అతడు ధనమున్న వాడైతే ఇంకా మంచిది, గుణం మంచిదైతే ఇంకా మంచిది, కరుణ రసం చూపిస్తే ఇంకా మంచిది. ఇటువంటి వాడు మనిషిని మనిషిగా గుర్తించి, అడిగిన మాటకు సహాయము చేసి సహకరించి, తెలపవలసిన విషయాన్ని తేటతెల్లముగా తెలిపి, రెండు నాలుకలా పాములా ఉండక, చెప్పింది చేస్తూ, చెయ్యాల్సినది ప్రభుత్వముద్వార చేయిస్తూ, పరులసొమ్ము నష్టము చేయకుండా, ప్రభుత్వ సొమ్ము బొక్కకుండా, ఉచిత ప్రజా సేవ చేస్తూ నిరంతరమూ ప్రజల హృదయాల్లో ఉండేవాడే నిజమైన నాయకుడు.   

తాత  అటువంటి నాయకుడు ఉన్నాడా, ఒకనాడు గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన మహానాయకుడు నందమూరి తారక రామ రావు గారు,  ఇంకా ఎందరో ఉన్నారు మనవడా .
తాత ఇప్పుడున్నవారెవరైనా ఉన్నారా లేకే ఉన్నారు నీకు విద్య నేర్పిన గురువు ఒక నాయకుడు, నిన్ను పోషించే తండ్రి మరో నాయకుడు, అందరికన్నా ముఖ్యమైన నాయకురాలు తల్లి.   వీరేకాక దేశాన్ని ఏలే ప్రధాణమంత్రి,   రాష్ట్రాన్ని ఏలే  ముఖ్యమంత్రి, మరి ఇంకా ఎందరో నాయకులున్నారు     
     
శ్లో === దాతృత్వం ప్రియ వక్తృత్వం ధీరత్వ ముచితజ్ఞాతా | 
అభ్యాసేన నలభ్యన్తే చత్వారః సహజగుణాః || 

భావము === దానగుణం మంచిగా మాట్లాడటం దైర్యము ఉచితానుచితములు తెలిసియుండుట  ఈ నాలుగు గుణములు పుట్టుకతో రావలేనే గాని చూచి నేర్చుకోనేవి కావు అట్టి వారే నిజమైన నాయకులు .

           
--((**))--

Pranjali Prabha.com 
తాత మనవుడు చిన్న కధలు -10
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

తాత "ధర్మం" అంటే ఏమిటి అని అడిగాడు మనవుడు, తాత ఏమి ఆలోచిస్తున్నావు, మన ఇంటికొచ్చే "బిజ్జగాడు ధర్మం చెయ్యండి" అని అరుస్తాడు  దానికి దీనికి భేదం ఏమిటి అని అడిగాడు. 
దానికర్ధం తెలుసుకోవాలంటే నీ వయసు, నా వయసు సరిపోదు, భగవాన్ భోధించిన భగవద్ గీత పూర్తిగా అర్ధం చేసుకున్నవారికి "ధర్మం" విలువ తెలుస్తుంది.  అయినా నాకు తెలిసిన కొన్ని విషయాలు తెలియపరుస్తా విని ఆచరిస్తే అదే మానవ లోకానికి ధర్మం. 
అట్లాగే తాతా తెలియపరచండి అన్నాడు మనవుడు. 
1 . "తనకు కీడు కలుగునప్పుడు దైవమును నిందించుట తప్పు", ఎందువల్ల జరిగింది, దానికి కారణము ఎవరు, నావల్ల ఎమన్నా జరిగిందా, నా కుటుంబము వారు ఎమన్నా చేసారా అని 5  నిముషాలు ఆలోచించగలిగితే మనస్సు స్థిరపడి ఏవిధంగా ప్రవర్తించాలి, ఏ ధర్మాన్ని అనుసరించాలి అనేది తెలుస్తుంది. అట్లాగే మంచి జరిగి నప్పుడు ఇది నా కష్టార్జితము, నా కుటుంబ శ్రమ ఫలితము అని భావించ కూడదు, ఇది దేవుని మహత్యమని భావించుట ధర్మం 
ముఖ్యంగా చెప్పిన పని చెప్పినట్లు చేయుట ధర్మం, ఎందుకు, ఏమిటి, దీని వళ్ళ ఎవరికి ఉపయోగం అని ప్రశ్నలు వేసి చేసినా అది ధర్మం కాదు. నేను చెప్పేది ఒక్కటే మంచి చెడ్డలు కావడి లోని కుండల వలె సమానమని ఎంచి దైవ నిందకు పాల్పడ కుండుట, ప్రేమించి ప్రేమ పొందుటే నిజమైన ధర్మం.       
లోకం లో డబ్బులేనివాడు దు:ఖిస్తాడు,వాడికంటే అప్పు వున్నవాడు ఎక్కువగా దుఖిస్తాడు, వాడికంటే రోగ గ్రస్తుడైనవాడు ఎక్కువ దుఖిస్తాడు, వీళ్ళందరి కంటే గయ్యాళి భార్య వున్నవాడు ఎక్కువ దుఃఖితుడు. వీళ్లందరి కంటే ధర్మం తప్పిన వాడు ఇంకా ఎక్కువ దుఃఖిస్తాడు. దుఃఖము లేకుండా ఉండాలంటే దేవుడు శాసించాడు, నేను చేస్తున్నాను అని భావించి నట్లైతే ధర్మం తప్పని మానవునిగా జీవించ గలుగుతాడు. 
లోకంలో కొందరు పరిస్థితుల ప్రభావము, సంపాదన వేరొక మార్గము లేక, కుటుంబ పోషణకు బిక్షాటన చేయుట అనాదిగా వస్తున్నది, చులకన చేయవద్దు, మీ సంపాదనలో కొంత దానం చేయుట తప్పు కాదు. ఇది కూడా ఒకవిధముగా ధర్మమే. 
మనవుడా ధర్మ విశేషాలు రేపు కూడా కొన్ని తెలుసుకుందాం 
ఇంతకీ నీకేమైనా అర్ధమయిందా, తాత నాకు అర్ధమైంది ఒక్కటే అదే ఎక్కువ విని, తక్కువ మాట్లాడి, ప్రేమించి ప్రేమ పొందటమే ధర్మం కదా తాతా 
అవునురా మనవుడా అదే ధర్మం.                   

--((**))--


తాత మనవుడి చిన్న కధలు -9 Pranjali pabha.com  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  
  
తాత త్రాగాడు ఏ వయసులో త్రాగితే మంచిదో చెపుతావా అన్నాడు మనవుడు. త్రాగుడు,సిగరెట్ కు బానిస కాకూడదు ఏ వయసులో కూడా .ఒక  కధ చెపుతా విను. ఒక కుటుంబంలో త్రాగుడు వళ్ళ ఏమైనదో వినుము అని చెప్పటం మొదలు పెట్టాడు.         

అమ్మ అరుంధతి గారు! మరోసారి ఆలోచించండి.
మీకు వృద్దాప్యము,అనారోగ్యము,ఆర్దిక సమస్యలు. మీ ఆయన చాలా మంచివారు. ఈ పరిస్తితులలో విడాకులు సమంజసం కాదని నా అభిప్రాయము. అన్నాడు లాయరు 

లాయర్ గారూ! నిజంగా మా ఆయన దేముడేనండీ! ఆయన లేనిదే నాకు  రోజు గడవదు.
నా అంతట నేనేమీ చేసుకోలేని నిస్సహాయురాల్ని. ఆయనంటే నాకు గౌరవం, ప్రేమ, అభిమానం, జాలి.  

మరింకేమిటమ్మా ?

ఆయన బాగా త్రాగి వచ్చి నా మనసును తీవ్రాతి తీవ్రంగా గాయ పరుస్తున్నాడు. ఎప్పుడు మేల్కుంటాడో తెలీదు. నా యుక్తవయసు నుండి నా విషయాలు చిలువలు పలువలుగా తెలుసుకుని, అనేక కట్టు కధలు వండి వార్చుకుని, అభూత కల్పనల కన్నా గోప్ప పాత్రలు
సృష్టించుకుని నాకు సంబందం లేని పాత్రలకు నాతో ముడి పెట్టి ప్రశ్నల పరంపరలతో నా మనసును కకలా వికలం చేస్తున్నారు. 

ఆ ఓక్క క్షణం నెమ్మదిగా మట్లాడితే?
అవును.
నెమ్మదిగా మాట్లాడితే ఇంత అవమానకర విషయాన్ని సహించేవంటే నువ్వు తప్పు చేసేవనీ, గట్టిగా మాట్లాడితే చింత చచ్చినా పులుపు చావలేదని నిలదీస్తారు!!!
ఇదండీ అందుకే నేను విడాకులు ఇప్పించండి లేదా త్రాగుడు నిషేధించండి అని కోరుతున్నది .  
చూడమ్మా : నీ అభ్యర్ధన విన్నాము ప్రభుత్వం వారికి త్రాగుడు నిషిధించమని సలహా ఇస్తాం, నీభర్తకు మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నాము, మిమ్మల్ని హింసించినట్లు తెలిపితే, తక్షణం అరెష్టు చేసి కోర్టులో ప్రెవేశపెట్టాలి, అప్పడు తగిన శిక్ష విధించటం జరుగుతుంది అని జడ్జి తీర్పు ఇచ్చాడు.         
అక్కడే ఉన్న భర్త జేబులో తెచ్చుకున్న బాటిల్ త్రాగి జడ్జి గారు ఏ కేసులో లంచం తీసుకున్నారో అన్ని చెప్పటం మొదలు పెట్టాడు అంతే తక్షణం అరెష్టు చేసి జైల్లో పెట్టారు. 
ఇదే కలియుగ త్రాగుడు మహిమరా అని ముగించాడు తాత.         

--((**))--


తాత మనవడి చిన్న కధలు -8 Pranjali Prabha.com 
రచయత : మల్లాప్రగడ రామ కృష్ణ 

తాతయ్య వంట మనిషి వచ్చింది ఎమన్నా అడగాలా అని అడిగాడు మనవడు, నేను అడిగేదే ముందిరా మీనాన్నకు, మీ అమ్మకు, నచ్చాలి ముందు వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళు అన్నాడు. 
  
అంతలో అమ్మ, అమ్మొమ్మ ఎదురొస్తున్నారు, అమ్మ వంట మనిషి వచ్చింది. 
నీ వాళకం చూస్తే ఇక్కడ వంట చేసేటట్లు లేవు అన్నారు వారు, అసలు అట్ల పిండి ఎంత కలపాలి, ఎలావెయ్యాలి, ఏ అట్టు బాగా చేయగలవు, నీకు వచ్చో కాదో మేము తెలుసుకోవాలి వాటి పేర్లు చెప్పగలవా అని అడిగింది అమ్మ. 

ఏవమ్మో నేను 5 స్టార్ హోటల్ ల్లో పనిచేసాను, నేను అట్ల పేర్లు చెబుతాను, మీకు ఏది ఇష్టమో   మీరే చెప్పండి అంటూ చెప్పటం మొదలు పెట్టింది.            

మినపట్టు, పెసరట్టు, రవ్వట్టు , ఉల్లి పేపర్ అట్టు, మసాల అట్టు, అల్లం, మిర్చి, ఉల్లి అట్టు, కొబ్బరి అట్టు, గోధుమ అట్టు, అటుకుల అట్టు, సగ్గుబియ్యం అట్టు, బియ్యపు పిండి అట్లు, పుల్లట్టు ఉప్మా అట్టు, రాగి అట్టు, చీజ్ పాలక్ అట్టు. అంటూ చెప్పింది.

ఇంకా స్వీట్ ఏమీ చేయటం వచ్చో  చెపుతా వినండి అమ్మగారు అంటూ మొదలు పెట్టింది 

అరిసెలు, బూరెలు, కొబ్బరి బూరెలు, పచ్చి బూరెలు, తైదు బూరెలు, మైదాపిండితో పాల బూరెలు, సజ్జ బూరెలు, గోధుమ బూరెలు, చలిమిడి, కొబ్బరి పూర్ణాలు, గోధుమ పిండితో పూర్ణాలు, పూత రేకులు, జొన్న బూరెలు, బూంది లడ్డు, రవ్వ లడ్డు, తొక్కుడు లడ్డు, మినప ముద్దలు, సున్నుండలు, బాదుషా, మడత కాజా, తీపి కాజాలు, మైసుర్ పాకు, జాంగ్రి, పూస మిఠాయి, కోవా , కజ్జి కాయలు,తీపి గవ్వలు, జీడిపప్పు పాకం, శనగపప్పు పాకం, వేరుశనగపప్పు ముద్దలు, మరమరాల ముద్దలు, డ్రైఫ్రూట్స్ హల్వా, నువ్వుల లడ్డు (చిమ్మిరిముద్ద), కోవా కజ్జికాయ, మిల్క్ మైసూర్‌ పాక్, కాజు క్యారెట్, బటర్ బర్ఫీ, కిస్‌మిస్ కలాకండ్, బూంది మిఠాయి, పాపిడి, చాంద్ బిస్కట్స్ , ఖర్జూరం స్వీట్, సేమ్యాతో అరిసెలు, కొబ్బరి ఖర్జూరం, బాదంపాకము, బాంబే హల్వా 
వీటిల్లో మీకు ఇష్టమైనది ఎదో చెప్పండి అన్నది  ఆయాసంతో .

ఆ మాటలకు అమ్మ పడి పోయింది,  అమ్మొమ్మ మాత్రం ఇంకా అడిగింది పొడులు చెయ్యటం వచ్చా అన్నది. అమ్మొమ్మ ఇక చాలు ఆమెకు అన్ని వచ్చు నీవేం అడగవద్దు అక్కడ తాతాయ్య పిలుస్తున్నాడు అనగానే అయ్యో రామా మంచి నీళ్లు అడిగి చాలాసేపైంది అంటూ కదిలింది.   నీవు వంటగది గది  చూపరా అంటూ తల్లి లేచి నెమ్మదిగా లోపలి వీళ్లింది.

మనిషిని నమ్మాలి, ఒక మెతుకు పట్టి అన్నం ఉడికిందో లేదో చెప్పగలగాలి, మోసపోతే అనుభవం వచ్చిందని సరుకు పోవాలి  తాతయ్య నవ్వు తూ పలికాడు.    


--((**))--


తాత మానవుడి చిన్న కధలు -7
రచయత: మల్లాప్రగడ రామ కృష్ణ : 

తాతగారు కధ చెప్పటం ప్రారంభించారు తామరపూవు వికసించింది అమృతాన్ని త్రాగటానికి తుమ్మెద చేరింది, ఆశ తగ్గక ఇంక త్రాగాలి అంటూ అక్కడే ఉండి పోయింది. కానీ సాయంత్రం అయిపోయి, తామరపూవు ముడుచుకొపోయే లోపల తప్పించుకోలేక పొరపాటున ఆ పూవులో ఇరుక్కొపోయింది. ఆ తుమ్మెద గత్యంతరం లేక రాత్రియంతా ఉండి త్వరగా ఉదయించవయ్యా సూర్య భగవానా అని ప్రార్ధించి కదలలేక ఉండి ఆలోచిస్తుండగా ఒక ఏనుగు వచ్చి తొండముతో చెట్టుమొత్తము పీకి నేలకు కొట్టింది తుమ్మెద చనిపోయింది. 

తాత మీరు చెప్పిన కధ చాలా బాగున్నది కాని ఇప్పటి వారికి అర్ధమయ్యేవిధముగా ఇదే కధ మరో విధముగా చెప్పండి అని అడిగాడు. తాత  కొద్దీ సేపు ఆలోచించి ఈవిధముగా చెప్పటం మొదలు పెట్టాడు. గుడ్డుని పొదిగి నప్పుడే పిల్ల బయటకు వస్తుంది, గుడ్డుని పగలు గొడితే రాదు అని   తెలుసుకోవాలి అట్లాగే మనశక్తికి  కావలసిన ఆహారము తినాలి మించి తిన్నా జీర్ణం చేసుకొనే శక్తి ఉండదు అత్యాశకు పోయిన తుమ్మెదగా మారుతుంది అన్నాడు తాతగారు. 
మనవడు మరొక్కసారి మారోవిధముగా చెప్పండి తాతగారు అన్నాడు మరలా చెప్పటం మొదలు పెట్టాడు.    
చూడు మనవడా చెప్పింది వినటం ఆచరిచటం ముందు నేర్చుకో ముందు నేను ఆడిన ప్రశ్నకు సమాధానము నీవే చెప్పు సూర్య ప్రతాపానికి కమలం తప్ప మరొకటి వికసించేది ఉంది అది ఏమిటో ముందు నీవు చెప్పు అని అడిగాడు. తాత నాకు తెలియుటలేదు మీరేచెప్పండి అన్నాడు మనవుడు. నీవు యువకుడవు ఆలోచించు సమాధానము రేపటి కధలో చెపుతా అంటూ లేచాడు                   
అంతే మనవుడు తలగోక్కోవటం మొదలు పెట్టాడు ..... గోక్కోకు జుట్టు ఊడి బట్టతల వస్తే 
పెళ్లవ్వటం కష్టం రా బాబు ఆ.....   ఆ.... అంటూ నవ్వు కున్నారు ఇద్దరు. మీకెవరకన్నా తెలిస్తే  చెప్పండి మా తాతగారు నా మెదడు తినేస్తారు ...   .. 
--((**))--

తాత మనవడి (చిన్న కధలు-  5
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

తాతయ్య మనవడ్ని ప్రక్కన కూర్చోపెట్టుకొని చిన్న ఆద్యాత్మిక ఉపన్యాసం చెప్పటం మొదలి పెట్టాడు.    
సమస్త జీవరాసిలోనూ పరమాత్మను దర్శించగల శక్తి  మానవునకే ఉన్నది.   "ఒక చేతి వ్రేళ్ళు ఒకటిగా ఉండవు " అయినా విశ్వమంతా సౌందర్యమయంగా కనబడుతుంది ప్రతి ఒక్కరికి. దూరమునుండి కొండ చుస్తే నున్నగా కనబడుతుంది దగ్గరకు వెళ్ళితేగాని దాని విశ్వ రూపం తెలియదు.  ప్రతి మానవుడు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ధర్మిక శక్తి సాధించు కోగలిగితే ప్రపంచంలోని స్థితిగతులన్నీ మారుతాయి. " ఒకడికున్నదని ఏడిస్తే ఒక కన్ను పోతుంది - తనకు లేదని ఏడిస్తే రెండో కన్ను పోతుంది " గుడ్డి వాడిగా మారితే ఫలితము ఎమన్నా ఉన్నదా .  కలతలు కార్పణ్యాలు ప్రబలిన చోటే శాంతి స్థాపన చేయుట మన కర్తవ్యము అని భావించి ముందుకు సాగాలి.  ఘర్షణకు తావు లేకుండా, ద్వేషం దారి ఇవ్వకుండా,  అసూయ ఆవకాశమివ్వకుండా, పూర్తిగా మనో నిబ్బర శక్తితో ప్రతిఒక్కరిని శక్తి వంచన లేకుండా ఆదుకుంటూ జీవితం సాగించాలి.   "చెడు  వినకు, చెడు అనకు, చెడు కనకు."   "ఒకడిని చూస్తే పెట్టబుద్ధి - ఉంకొకడిని చూస్తే మెట్టబుద్ధి" అయినా  ఆదర్శమైన ప్రేమ సర్వత్ర వ్యాపించి ఉన్నది, అయినా  అసూయా ద్వేషాలకతీతంగా మానవులుగా ఆ పరమాత్ముని ప్రార్ధిస్తూ కర్తవ్యదీక్షతో కంకణ బద్దులుగా మారి మనుష్యుల్లో ఉన్న పరమాత్ముని గమనిస్తూ  ప్రవర్తించే వాడే నిజమైన మానవుడు.
తాత నేను నిజమైన మానవుడ్ని కానా అన్నాడు మానవుడు,. ఎందుకు కావు వయసుని బట్టి ప్రవర్తనే 
మన:శాంతి కలిగించే విధముగా ఉంటె చాలు ఈ కలియుగంలో. 
అలాగే తాతయ్య ఎవ్వరికి కష్టం కలిగించకుండా ఉంటా. సరేరా బాబు ఉంటా ... ఆ ఉంటా 
ఆ.. ఉంటా అని వెళ్లి పోతావే. 
తాతయ్య మీరే చెప్పారు ఒకనాడు అవునంటే కాదని, కాదంటే అవునని వస్తా ...  కాదు కాదు వీళ్ళొస్తా ... అంటూ బయలు దేరాడు మనవుడు         


--((**))--


తాత మనవుడి -చిన్న కధలు -4 
తాత నాకు ఏదైనా కధ చెప్పు అని అడిగాడు మనవడు సరే చెపుతా విను అని మొదలు పెట్టాడు " కొందరు చెపితే వినరు, గిల్లెతే ఏడుస్తారు" తను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళని వాదిస్తారు, మోసపోయిన గర్వంతో ఒట్రిస్తారు అని చెప్పటం మొదలు పెట్టాడు తాత కధను .      
అనగనగా ఒక ఊళ్ళో పశువుల వ్యాపారి ఒకడు ఉండేవాడు. అతని భార్య వెంగమ్మ నిజంగానే ఒట్టి వెర్రి వెంగళమ్మ. ఒక రోజున వ్యాపారి ప్రక్క ఊరి సంతకు ప్రయాణం అయ్యాడు. వెళ్తూ వెళ్తూ అతను భార్యతో చెప్పి వెళ్ళాడు- "నేను రెండు రోజుల వరకూ తిరిగి రాను వెంగమ్మా! అయితే రేపు మన దగ్గరున్న మూడు ఆవుల్నీ కొనేందుకు బేరగాళ్ళు వస్తారు. ఒక్కో ఆవూ వంద నాణాల లెక్కన, మూడు ఆవులనూ మూడు వందల నాణాలకి అమ్ము. సరేనా?! వాళ్ళు అంతకంటే తక్కువకి బేరం అడిగితే మటుకు ఏమాత్రం ఒప్పుకోకు. అర్థం అయిందా, నేను చెప్పేది?!” అని. “మీరేం కంగారు పడకండి, ప్రశాంతంగా వెళ్ళి రండి. అదంతా నేను చూసుకుంటాగా!" అంది వెంగమ్మ. 

“ఏంటోనే, నువ్వు ఎప్పుడూ అలాగే చెప్తావు; కానీ ఏదో రకంగా పిచ్చి పనులు చేసి మోసపోతావు! ఈ విషయంలో ఏమీ తప్పులు జరగకుండా ఉండాలనే ఇంత చెప్తున్నాను- మూడు వందలు ఇస్తేనే ఆవుల్ని ఇవ్వు. అర్థమైందా, ఏమి?! నేను చెప్పేది వింటున్నావా?!” అన్నాడు. 

“ఆఁ విన్నా, విన్నా!" అన్నదామె, తల ఊపుతూ. 

వ్యాపారి ప్రయాణమై వెళ్ళిపోయాడు. 

తర్వాతి రోజున అనుకున్నట్లుగానే బేరగాడు వచ్చాడు. ఆవులను చూసి, ఆమెతో బేరం మొదలు పెట్టాడు. మాట్లాడటం మొదలు పెట్టిన కొద్దిసేపటికే వెంగమ్మ ఎంత అమాయకురాలో గ్రహించేశాడు ఆ బేరగాడు. బేరం ఇంకా పూర్తి కూడా కాకనే, వాడు పశువుల పాక దగ్గరికి వెళ్ళి "సరే అక్కా! ఇంక ఆవులను నేను కొనుక్కున్నాను!" అంటూ ఆవులకు కట్టిన పలుపుతాళ్ళు విప్పి వాటిని బయటకి తోలటం మొదలు పెట్టాడు గడుసుగా. వెంగళమ్మ అమాయకురాలే అయినా, మరీ ఇంత గడుసుదనాన్ని గమనించకుండా ఉండలేకపోయింది. పోయి కొట్టం గడప దగ్గర నిలబడి "ఒక్క నాణెం తక్కువైనా ఆవులను ఇవ్వను- ముందు మొత్తం మూడు వందల నాణాలు ఇచ్చి, ఆ తర్వాతనే ఆవులను బయటకి తోలండి!" అంది మొండిగా. 

"ఇబ్బంది వచ్చి పడిందే-" అనుకున్నాడు బేరగాడు. అయినా మరో బాణం వేసి చూద్దామని, "అయ్యో అక్కా! నా దగ్గరుండగా నీ డబ్బు ఎక్కడికి పోతుంది? అయినా ఇవాళ్ళ డబ్బుల మూటను తీసుకురావడం మర్చిపోయానే, ఏం చేయను? -సరే, ఒక పని చేద్దాం! ఈ మూడు ఆవుల్లోనూ ఒక దాన్ని నీ దగ్గరే హామీగా వదిలి వెళతాను. ఇంటికి వెళ్ళి, మూడు వందల నాణాలు తెచ్చి ఇచ్చాక గానీ ఈ ఆవును విడిపించుకు పోను!" అన్నాడు, ఆ మూడు ఆవుల్లో‌నే ఒకదాన్ని గాటానికి తిరిగి కట్టేస్తూ. వెంగమ్మ ముఖం వెలిగింది. “ఆఁ అదీ మరి! ఏమీ హామీ లేకపోతే ఎలా?! అలా చెయ్యి. ఆ మూడో ఆవుని ఇక్కడే ఉంచి వెళ్ళు. డబ్బు నా చేతిలో పడ్డాకే, ఈ ఆవుని వదిలేది!" అంది గట్టిగా. 

బేరగాడి పంట పండింది. ఉత్సాహంతో మురిసిపోయి, అతి మర్యాద నటిస్తూ, తాను ఆసరికే కట్టేసిన ఆవును అక్కడే వదిలి, మిగిలిన రెండు ఆవులనీ తోలుకుని చక్కా పోయాడు వాడు. 

మూడో రోజున భర్త రాగానే తాను చేసిన ఘనకార్యాన్ని భర్తతో సంతోషంగా చెప్పింది వెంగమ్మ. వ్యాపారికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు- కోపం ముంచుకుని వచ్చింది. 

“ఛీ! ఛీ! నీ కంటే తెలివి తక్కువ మనిషి ఈ లోకంలో లేరు. వాడు మళ్ళీ‌ వస్తాడుటే, నీ వెర్రి గానీ?!" అని అరిచాడు ఆవేశంగా. “అబ్బో! తెలివి నీ ఒక్కడిదేగా?" అంది వెంగమ్మ వెటకారంగా. "నేను అందరి కంటే తెలివి తక్కువ దాన్నా?! ఆ సంగతి నీకెలా తెలుసు? అసలు ఈ లోకంలో ఎట్లాంటి వాళ్ళుంటారో తెలీనిది నీకే. వెళ్ళి ఓసారి దేశం అంతా తిరిగి, చూసిరా!” అంది ఈసడిస్తున్నట్లు. 
తర్వాత ఏమైంది తాత ఏముంది భార్యను ఏమి అనలేక ఊరిలోకి మోసగాడని పట్టి బందిఖానాలో  
పెట్టిచ్చాడు అంతే .....    అంతేనా .....  ఆ ..  ఆ   

--((**))--

తాత మనవుడి - చిన్న కధలు -3 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

తాత నాకు ఒక కధ చెప్పు అని అడిగాడు మనవుడు. అప్పుడు తాత "తినే ప్రాప్తి ఉంటె వడ్డించేవాడు మనవాడవుతాడు అన్నాడు" అవును తాత దేవుడి మీద నమ్మకం ఉంటె ఎంతటి  రోగమైన క్షణంలో పోతుంది అన్నాడు మనవుడు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు కదా తాత అవునురా మనవుడా ఒక్కోసారి దేవుడే నీవుకష్ట పడకుండా నిదగ్గరే వచ్చి నీకు సేవ చేస్తాడు నీవు చేసిన పుణ్యాన్ని బట్టి అన్నాడు. ఏదన్న ఉదాహరణ చెప్పు తాత నందు మనవుడు. 

సరే సెహెపుతా విను అని చెప్పటం మొదలు పెట్టాడు తాత.              
స్టీఫెన్ అనే ఒక ప్రఖ్యాత డాక్టర్, వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప అవార్డును అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. రెండూ గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది. కాన్‌ఫరెన్సుకు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒకా కారు అద్దెకు తీసుకుని ప్రయాణం కొనసాగించాడు. మళ్ళి కొంతసేపు అయిన తరువాత, విపరీతమైన గాలివాన, వర్షం..దానితో ఈ వాతావరణంలో ముందుకు సాగలేక ఆగిపోయాడు. భరించలేని ఆకలి, అలసట, వేళకు వెళ్ళలేకపోతున్నాను అనే చికాకులతో ఉన్నాడు ఆ డాక్టరు. కొంతదూరం ముందుకు వెళ్ళాక, అతనికి ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఆ ఇంట్లోకి వెళ్ళి వారి ఫోను ఉపయోగించుకుందాము అనుకున్న ఆ డాక్టరుకు ఆ ఇంటి తలుపు తీసిన ఒక ముసలామె తన ఇంట్లో కరంటు, ఫోను సౌకర్యాలు లేవు అని, బాగా వర్షంలో తడిసిపోయినందున తన ఇంట్లో కొంత సేపు విశ్రాంతి తీసుకోమని, వెచ్చగా ఉండేందుకు టీ, కొంత ఆహారం టేబుల్ మీద పెట్టి తను ప్రార్ధన చేసుకోవడానికి వెళ్ళింది. ఆమె పక్కన ఉయ్యాలలో ఒక పసివాడు ఉన్నాడు. ఆమె గురించిన వివరాలు తెలుసుకుందామనుకున్నా, ఆమె ప్రార్ధనలు ఎంతకీ పూర్తి అవటం లేదు. ఎట్టకేలకు ఆమె ప్రార్ధనలు ముగించి వచ్చిన తరువాత, ఆమె మంచి మనసుకు ఆమె చేసిన ప్రార్ధనలు అన్నీ ఆ భగవంతుడు వింటాడు అని భరోసా ఇచ్చాడు. ఆ ముసలామె చిరునవ్వు నవ్వి, భగవంతుడు నేను కోరిన అన్ని కోరికలూ తీర్చాడు ఒక్కటి తప్ప, ఎందుకనో ఈ కోరిక మాత్రం తీర్చడం లేదు అని చెప్పింది. 

ఆమెకు అభ్యంతరం లేకపోతే, ఆమెకు కల కోరిక ఏమిటో చెప్పమని, తాను సాధ్యమైనంత సహాయపడతానని చెప్పాదు వైద్యుడు. ఆమె ఇలా చెప్పటం ప్రారంభించింది. "ఈ ఉయ్యాలలో ఉన్నవాడు నా మనుమడు. అతనికి ఒక అరుదైన క్యాన్సర్ వ్యాధి సోకింది. ఎంతో మంది వైద్యులకు చూపించాము. ఎవ్వరూ నయం చేయలేకపోయారు. ఒక్క స్టీఫెన్ అన్న ఆయన మాత్రమే ఈ వ్యాధి తగ్గించగలడు, ఆయన ఇక్కడికి చాలా దూరంలో ఉన్నాడు. అందుకే వైద్యం మీద ఆశ వదిలేసి, భగవత్ ప్రార్ధనలతో జీవితం గడిపేస్తున్నాను అని చెప్పింది. వింటున్న డాక్టరు కళ్ళల్లో నీళ్ళు. "భగవంతుడు దయామయుడు. ఆయన మీ ప్రార్ధనలు వినడమే కాదు, ఆ డాక్టరును మీ వద్దకే తీసుకువచ్చాడు కూడా. విమానం పాడయ్యి, గాలివానలో చిక్కుకుని, నేను మీ ఇంటికి వచ్చాను. కాదు కాదు, ఈ పరిస్థితి సృష్టించి ఆయనే నన్ను మీ వద్దకు పంపాడు. ఆ డాక్టర్ స్టీఫెన్ ను నేనే." అని బదులిచ్చాడు. అప్పుడు ఆ క్షణం అతను అందుకోవలసిన అవార్డు అతనికి గుర్తు రాలేదు. 

భగవత్ ప్రార్ధన లోని మహత్యం అదే. మనం వెళ్ళలేని చోటుకు కూడా దాని శక్తి వెళుతుంది. కావలసినది నమ్మకం అంతే. 1.అడగడం, 2. నమ్మడం, 3.అందుకోవడం...ఇవే ప్రార్ధనకు కావలసిన అంశాలు. భగవంతుని నమ్మి మనం ప్రార్ధిస్తే, మనకు కావలసినది ఆయన తప్పక మనకు లభింపచేస్తాడు. అని చెప్పాడు తాత కధ ముగిస్తూ 

--((**))--


తాత మనవుడి చిన్న కధ -2
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

తాతగారు ఏమిటి మీ కంట నీరు కారుతున్నది అని అడిగాడు మనవడు. ఏమిలేదురా బాబు " ఒక కంట  సున్నం మరో కంట వెన్న"  ఉందిరా అవి కరిగి నీకు అట్లా కనిపిస్తున్నది. సున్నంకు వెన్నకు  తేడా ఏమిటి తాతయ్య,  ఏమిలేదురా బాబు మీ అమ్మమ్మ వెన్న రా మీ నాన్న సున్నం రా అంతే తేడా, రెండు తెల్లగానే ఉంటాయి కదా తాతగారు ఉంటాయి "ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక ఉండు" రుచులు వేరుకదా అట్లాగే ఇవి కూడా వేరు.       

బాబు " ఒక కన్ను కన్నూ కాదు - ఒక కొడుకు కొడుకూ కాదు - ఒక చెట్టు తోపూ కాదు" తెలుసుకో "   ఒక చెట్టు కాయలు ఒకటిగా ఉండవు " నా కొడుకులు కూతుర్లు వాళ్ళ బుద్దులు వేరు అందుకే వారిని ఏమీ అడగను, వారి నుండి ఏమి ఆశించను, నాకు ఓపిక ఉన్నంతవరకు నాపని నేను చేసు కుంటాను, చేయలేని పని ఉంటె మీ అమ్మమ్మను సహాయము అడుగుతా. ఒకరికొకరు సహాయము చేసుకుంటేనే కుటుంబము. పెద్దల మాటలు పిల్లలువింటే ఆ ఇల్లు స్వర్గాన్ని మించి ఉంటుంది        
అది నిజమా తాతయ్య అని అడిగాడు మనవడు అది నువ్వే చెప్పాలి, నేను పెద్దయ్యాక చెపుతాలే తాతయ్య, బలే మాటలు నేర్చా వురా ...       ఆ  ...      ఆ ..  


--((**))--


తాత మనవుడి - (చిన్న కధలు) -1
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

తాతగారు రోజూ ఎదో చెపుతుంటారు, అర్ధం అయిందని తలకాయ ఊపితే కానీ ఆపరు. ఒకరోజు లేవటమే దంత ధావనం కోసం వెతకటం మొదలు పెట్టాడు, "ఒంటి కంటే జంట మేలన్నారు పెద్దలు" అంటే ఏమిటి తాత అని మనవడు అడిగాడు, అమ్మొమ్మ ప్రక్కన ఉంటె ఇన్ని  తిప్పలు ఉండవురా అన్నాడు, పిలవమంటారా అని అడిగాడు, వద్దులే నాకు జంట దొరికిందిగా అన్నాడు. అదేంటి తాత జంట అంటావు అమ్మొమ్మ రానిదే,  అదేరా నా కళ్ళజోడు కనిపించిందిగా, ఎంచక్కగా వేపపుల్ల వెతుక్కొని ముఖం కడుకుంటా అన్నాడు తాతయ్య. తాతయ్య ఈ వయసులో కూడా కష్ట పడాలా అని అడిగాడు " ఒకడి పాటు - పది మంది సాపాటు " రా బాబు . అర్ధం కాలేదు తాతయ్య అన్నాడు మనవుడు. "సంపాదించేవారు ఒక్కరైతే తినే వాళ్ళు పది మంది" .                

పెద్డయ్యాక నేను నీకు సహాయం చేస్తా అప్పుడు తొమ్మిది మందే అవుతారు కదా తాతా, నీ బుద్ధి నీ తండ్రికి ఉంటె నాకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు కదా. "ఔను - కాదు అనే మాటలెంత చిన్నవో వాటిని అనటం అంత కష్టం " ఇదేరా ప్రేమ - ఈ ప్రేమే మనందరినీ బ్రతికిస్తుంది. "ఔననటానికీ, కాదనటానికీ అత్తకు అధికారం గానీ కోడలికేం వుంటుంది? " ఒకరికి ఒకరు తోడైతేనే జీవితం ఎవ్వరు ఏమి  చేయలరు కాలం తోపాటు నడవటమే ఇది మనం చేసుకున్న అదృష్టం అని సర్డుకు పోవటమే అని చెప్పాడు తాత.    
సరే తాత నేను నీళ్లు తీసుకు వస్తా , తీసుకురా ఇక్కడే కడుకుంటా అన్నాడు తాతయ్య . 

రేపు ఇంకో చిన్న కదా తెలుసుకుందాం 

--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి