ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
నవ నాగరికము నాంది, మనసే మగువకు నాంది
- తనువే తమకము నాంది, వలపే వరుసకు నాంది
రంగువే మమతకు నాంది, వరుసే వలపుకు నాంది
- మెరుపే చినుకుకు నాంది, జిగురే అతుకుకు నాంది
వికసించు లతకు నాంది, పరికించు వయసు నాంది
- అరుపే అలకుకు నాంది, రగిలే సెగలు పగ నాంది
విరహం పరువము నాంది, వయసే వలపుకు నాంది
- తపనే కలతకు నాంది, పలుకే మనసుకు నాంది
నాంది అనగా ప్రారంభం
నాంది అనగా పునాది
నాంది అనగా మొదలు
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--
అధిక్షేప ప్రేమ లీల - ప్రాంజలి ప్రభ .కం
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఆలోచన ముందు ఆవేశం అధికం
- అయినా ఆలోచింపచేసేదే శాశ్వితం
నిరుత్సాహము ముందు ఉత్సాహం అధికం
- అయినా నిరుత్సాహమే శాశ్వితం
చిరునవ్వుల ముందు ప్రేమానందం అధికం
- అయినా చిరునవ్వులే శాశ్వితం
స్త్రీ చూపుల ముందు పరిమళం అధికం
- అయినా చూపుల్లో చిక్కే శాశ్వితం
శృంగారము ముందు మధువు అధికం
- అయినా స్త్రీ శృంగారమే శాశ్వితం
పరిమళం ముందు స్నేహమే అధికం
- అయినా పరిమళమే శాశ్వితం
ఆశయము ముందు మౌనమే అధికం
- అయినా ఆశయమే శాశ్వితం
సంసారము ముందు సంపదే అధికం
- అయినా సంసారమే శాశ్వితం
ఏది ఏమైనా కాలాన్ని వ్యర్థం
చేయక నడిచే వాడే శాశ్వితం
ప్రేమించి ప్రేమింపబడేవాడే శాశ్వితం
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
అధిక్షేప ప్రేమ లీల - Prnjali prabha.com
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
విద్య బోధించే ముందు గణపతిని మర్చిపోతున్నాను
- అభ్యసించుట ముందు అద్దుకోవటం మర్చి పోతున్నాను
ముద్దలు తినే ముందు ఆత్మారాముణ్ణి మర్చి పోతున్నాను
- ఉద్యోగం చేసే ముందు అధికారాన్ని మర్చి పోతున్నాను
మంత్రం చదివే ముందు అమ్మవారిని మర్చి పోతున్నాను
- ప్రార్ధన చేసే ముందు ఆలోచనను మర్చి పోతున్నాను
ప్రేమను పంచె ముందు అనుభూతిని మర్చి పోతున్నాను
- సుఖాన్ని పొందే ముందు గుండెచప్పుడు మర్చి పోతున్నాను
మెప్పుని పొందే ముందు శ్రమ ఫలితం మర్చి పోతున్నాను
- శ్రమను పంచే ముందు కష్టసమయం మర్చి పోతున్నాను
స్నేహాన్ని పొందే ముందు అభిపాయాన్ని మర్చిపోతున్నాను
- ద్వేషాన్ని చూపే ముందు మౌన నీడల్ని మర్చి పోతున్నాను
దైవ ప్రార్ధన ముందు ఆత్మ ధైర్యాన్ని మర్చిపోతున్నాను
- తల్లి తండ్రుల ముందు ప్రేమ భావాన్ని మర్చి పోతున్నాను
దేశ సేవల ముందు ఆశాగుణాన్ని మర్చి పోతున్నాను
- ప్రేమత్యాగాల ముందు దేహ ఆరోగ్యం మర్చి పోతున్నాను
తల్లి తండ్రుల ప్రేమను
అర్ధనారీశ్వర తత్వమును
సత్య ధర్మ న్యాయాన్ని
మాత్రం మరువకు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
ఆధిక్షేప ప్రేమ లీల- Pranjali Prabha.com
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
చిరునవ్వుకు సరితూగే, మల్లెపువ్వు శాశ్వితమా
- మతి భ్రమకు సరితూగే, సంపెంగము శాశ్వితమా
గుండె కోతకు సరితూగే, జీవనము శాశ్వితమా
- మది చురుకు సరితూగే, ప్రణయము శాశ్వితమా
క్షణ సుఖంకు సరితూగే. సంసారము శాశ్వితమా
- నిత్య శోకంకు సరితూగే, కుటుంబము శాశ్వితమా
దాహం మధువు సరితూగే, అనుభందం శాశ్వితమా
- వయసు ప్రేమ సరితూగే, స్వర్గమైన శాశ్వితమా
మౌనం కుదుపు సరితూగే, సంద్రమైన శాశ్వితమా
- తల్లీ తండ్రికి సరితూగే, దైవమైన శాశ్వితమా
శీలం బాధకు సరితూగే, కొడుకైనా శాశ్వితమా
- ప్రేమ శృతికి సరితూగే, భర్త ఐనా శాశ్వితమా
చెలి ప్రేమకు సరితూగే, సుఖమైనా శాశ్వితమా
- గీత బోధకు సరితూగే, ఆచరణ శాశ్వి తమా
గాణ విద్యకు సరితూగే, సంగీతము శాశ్వి తమా
- విద్య భోదకు సరితూగే, సహాయము శాశ్వితమా
దాసదాసీ జనము, నౌకర్లు,
కొడుకు, బంధువు, వస్తువులు,
వాహనములు, ధనసమృద్ది ధాన్య సమృద్ది యను
శాశ్వితము కావు ఒక్క దైవ ప్రార్ధనే శాశ్వితం
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
-((**))--
అధిక్షేప ప్రేమ లీల - Pranjali Prabha. com
రచయత: మాప్రగడ రామకృష్ణ
ప్రపంచ సౌలభ్య ఉన్నతికి సలహాలు ఇచ్చేవారెవరు
- ప్రపంచ కర్మల ప్రారబ్దాన్ని అనుభవించేటి వారెవరు
ప్రపంచ ప్రమాదాల నుండి ప్రజలను రక్షించే వారెవరు
- ప్రపంచ ప్రజల ఆకలిని తీర్చి ఆదుకొనే వారెవరు
ప్రపంచ అనారోగ్యులకు మందులిచ్చి కాపాడే వారెవరు
- ప్రపంచ మేధావులను గుర్తించియు గౌరవించే వారెవరు
ప్రపంచ విద్యా సేవా బోధకులను సన్మానించే వారెవరు
- ప్రపంచలో ధర్మం, న్యాయం, సత్యంగా సంపాదించే వారెవరు
ఎవరు ఎసరు అనకు
మంచి చెడు గమనించి మనిషిగా
నీవే ఎందుకు కాకూడదు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
ప్రేమ లీల చిత్ర పద్యాలు - ప్రాంజలి ప్రభ. (5)*
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
చిరు హాస పల్కులకు భయ భీతియు పెరిగే
మణి పూస వెల్గులకు నిజ శాంతియు పెరిగే
నయనాల చూపులకు నవనీతము కరిగే
సోయగాల మెరుపుకు అభిమానము పెరిగే
నయనాల చూపులకు నవనీతము కరిగే
సోయగాల మెరుపుకు అభిమానము పెరిగే
పరువాల వెన్నెలకు పరిమళము కరిగే
మద లీల వేషముకు మనసు జత కరిగే
మదిలీల మగువకు చమత్కారము పెరిగే
చలిగోల మగనికి బలత్కారము పెరిగే
చలిగోల మగనికి బలత్కారము పెరిగే
వింత గోల వయసుకు విపరీతము కలిగే
కాంత హేల సమయము అపరాధము కలిగే
సంత గోల వనితకు ఉపోద్ఘాతము పెరిగే
సంత గోల వనితకు ఉపోద్ఘాతము పెరిగే
వింత మాట మగనిలొ ఉపోద్ఘాతము పెరిగే
విధి లీల మనసుకు భయమోహము కలిగే
నిధి గోల వయసున పరుగెత్తుట జరిగే
ప్రేమ లీల మహిళకు సుఖభారము పెరిగే
ప్రేమ గోల మగనికి ముఖభారము కలిగే
ప్రేమ గోల మగనికి ముఖభారము కలిగే
శుభము యో భారము గనుయో భయ్య మొవ్వు
భయము లే ద్వేష మోహ దాహమ్ము అవ్వు
మోహ తాపమో జాప్యము కలిగి ఉండు
సతిపతియు గాను పతిసతి గాను లీల
సతిపతియు గాను పతిసతి గాను లీల
అదియే వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి