17, ఆగస్టు 2018, శుక్రవారం

అధిక్షేప ప్రేమ లీల-3


ఆదిక్షేప ప్రేమ లీల  - ప్రాంజలి ప్రభ.కం 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 
ఈ రోజు పెళ్లి రోజు జరుపుకునే వారికి శుభాకాంక్షలు 

సన్న నవ్వుల కోరిక కన్నా, కావలిసిందేమిటి జంటకి 
- నిత్య పువ్వుల వాసన కన్నా, పరిమళమేమిటి జంటకి

సత్య వాక్కుల బోధల కన్నా, మాటలు ఇంకేమిటి జంటకి   
- ఉన్న దానితో సంతృప్తి కన్నా, ఆశ ఎక్కువేమిటి జంటకి 

ఆశయముతో బ్రతుకు కన్నా, బాధ కష్టమేమిటి జంటకి   
- మనసు దాటని మాట కన్నా, ఓపిక తీర్పేమిటి జంటకి  

నీడలా ఉండుట తృప్తి కన్నా, పొందేటి సేవేమిటి జంటకి   
- ఇంటిలో ప్రేమ పంచుట కన్నా, వేడుకలు ఏమిటి జంటకి  

ఒక రొకరు నమ్ముటం కన్నా, బ్రతుకు మార్పేమిటి జంటకి 
- ఉన్నది దానం చేయుట కన్నా, పొందు పాశమేమిటి జంటకి  

చెలిమి ఊయల పాట కన్నా, గుణ స్వర మేమిటి జంటకి 
- చిలిపి కోర్కల మాట  కన్నా,  మనో రాగమేమిటి జంటకి 

తల్లి తండ్రుల ప్రేమలు కన్నా,  కావలసిన దేమిటి జంటకి    
- దైవ సన్నిధి పూజలు కన్నా, మనో  తృప్తి ఏమిటి జంటకి

పసిడి వెలుగు బాట కన్నా, వెన్నెల పొందేమిటి జంటకి
- మనసు వాంఛ తీర్చుటకన్నా, ధనం పని ఏమిటి జంటకి   

లోకవ్యవహారము, భయము ,సిగ్గు,
 దాక్షిణ్యము, ధర్మసీలత 
ఈ యైదును లేనివారితో స్నేహము కూడదు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--

అధిక్షేప పేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

పండువెన్నెల వన్నెలెన్నో చూశా, తెల్లారే వేళలో  
- నది పరుగు కడలిలో చూశా, వర్షపు వేళలో 

తొలి ముద్దు పెదవియందు చూశా, మొదటి రాత్రిలో  
- నళిని వలచిన శశి చూశా, అంబరం ఆశలో 

యుగ యుగాల ఆశను చూశా, జగతి లీళలో   
- కలికి వెన్నెల సఖిని  చూశా, ప్రకృతి వడిలో  

అలుక తీర్చే ఆకలిని చూశా, శ్రీమతి వడిలో 
- గుండె వీణియ తడిని చూశా, ఆత్రుత మదిలో 

కలి బలిమి గర్వమును చూశా, నాయక వేటలో 
- యేటి గట్టున సొగసును చూశా, యవ్వన ఆశలో 

మెరుపుతో మేఘం పన్నీరు చూశా, శ్రావణ మాసంలో    
- ఆశతో పుడమి ఆత్రుత చూశా, తెలుగు భాషలో 

విత్తు విచ్చి విజ్ఞాన తేజం చూశా, సామాన్య శాస్త్రంలో 
- పెంపకంలో అమ్మ ప్రేమను చూశా, జీవన గమ్యంలో  

మల్లె పూల సువాసనను చూశా, శృంగార లీలలో  
- దిగులు పడు యవ్వనాన్ని చూశా, మగువ మత్తులో 

జాబిల్లి ఆశా, భానుప్రతాపం చూశా
ప్రకృతి ఆశా, కాల మహిమ చూశా      
ఆనందం ఆరోగ్యం ఆధ్యాత్మికం చూశా 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))- 





ఆదిక్షేప ప్రేమ లీల-
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

ఎప్పుడో ఇంకెప్పుడో మనం ఏకమయ్యే దెప్పుడో 
ఎందుకో మరెందుకో మనం ఒక్కటయ్యే దెప్పుడో 

ఒప్పుకో ఊపందుకో మనం సరిఅయ్యే దెప్పుడో 
చెప్పుకో చెలిమికో మనం చేరువయ్యే దెప్పుడో

తప్పుకో తప్పించుకో మనం దగ్గిరయ్యే దెప్పుడో 
అందుకో అందమంతా మనం వరుసయ్యే దెప్పుడో 

ప్రేమతో ప్రేమించటం మనం సొంతమయ్యే దెప్పుడో
గుణంతో సేవించటం  మనం పెళ్లి ఆయ్యే దెప్పుడో

ప్రేమను బతికించుకో 
పెళ్లి బంధాన్ని పెంచుకో   
జీవితాన్ని సార్ధకం చేసుకో     
ఇది వేణుగోపాల ప్రేమ సుమా

 --((**))--




అధిక్షేప ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
  
నవ్వి నవ్విస్తూ ఉంటె నవ్వుల పాలు కావు
- ఏడ్చి ఏడిపిస్తే మాత్రం చులకనై పోతావు

నవ్వు ముదిరితే  పిచ్చి వాడవై పోతావు
- తీరా ఏడిస్తే పిరికి వాడవై పోతావు

మర్యాదగా ఉంటె నాయకుడవై పోతావు 
- అమర్యాదగా ఉంటె మూర్ఖుడవై పోతావు 

స్వార్ధం పెరిగితే ఆశ పరుడవుతావు
- నిస్వార్ధమే బ్రతుకుదారి వాడ వైతావు 

జ్ఞానం బోధిస్తే గర్విష్టిగా మారిపోతావు          
- జ్ఞానాన్ని దాచుకుంటే పిసినారివైతావు

నిర్లక్ష్యంతో కళ్ళున్నా గుడ్డివాడవౌతావు  
- మాటలు మీరితే వగురు బోతవుతావు 

చెడు వాదిస్తే మొండి వాని వనిపిస్తావు
- మౌనం పాటిస్తే అమాయకుడవవుతావు  

 ప్రేమను పంచితే ప్రేమికుడవవుతావు 
- దేవుణ్ణి ప్రార్ధిస్తే శాంతిని పొందగలవు 

మనసుంటే మార్గాలు అనేకం 
ధనమంటే బంధాలు అనేకం
వయసుంటే కోరికలు అనేకం 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి