30, ఆగస్టు 2017, బుధవారం


* ప్రాంజలి ప్రభ

సుఖార్థి చేత్ త్యజే ద్విద్యామ్, విద్యార్థి చేత్ త్యజేత్ సుఖం!
సుఖార్థిన: కుతో విద్యా,  కుతో విద్యార్ధి న స్సుఖం !!

తా: భౌతిక సుఖాన్ని మాత్రమే కోరెడు విద్యార్థికి విద్యాభ్యాసమును విడువవలసి వచ్చును.  ఇక విద్యనే కోరెడు  విద్యార్థి సుఖమును ఆపేక్షింపరాదు. సుఖాన్ని కోరేవానికి విద్య అబ్బదు. విద్యనే కోరేవానికి సుఖాపేక్ష ఉండరాదు.

29, ఆగస్టు 2017, మంగళవారం


ప్రాంజలి ప్రభ
శా:
నాన్నా నా మదిలో నిలోన ఒకటే భావంబు ఈనాడు నీ
మార్గాలే మదియంత నిండి తెలిపే నీ భావ గానంబులే
సమ్మోదంబును గూర్చ గల్గి మదికిన్ సర్వజ్ఞవౌ తండ్రిగా 
భాషాజ్ఞానము వృద్ధి చేసి వడిగా మేల్కొల్పి కాపాడితీ    

కాలంబంతయు నిన్ను తక్కువ చెసే నాపంత మేమేమియో
మేలైనట్టిది ఏపనీ తలప లేదే నింత మేపాటికీ
నీలో కొంత సహాయ భావ యదలో వాణీ ప్రసాదంబుగా     
మన్నింపున్‌ గొన నిత్యమీ ప్రగతిలో మాకెంతొ సంతోషమౌ


కామంతో కనురెప్పలే గరుకుగా బంధాన్ని ఆందోళనమ్
కల్గించే సగలే మనస్సు చెరచే ఆద్యంత కష్టా లు లే 
నీఆలో చనలే నిరంతరముగా సద్భావ సాహిత్యమే        
కాలంతో కమనీయభావ కలలే సంతృప్తి కల్గించు లే 

నేనేంతో తపనా భావంతొ కొలిచే భాగ్యంబు కోల్పోయనే
కాలంతో జరిగే ఎమార్పు మనసే
స్వాతంత్రం ఎపుడూ తమంత తరుణం వచ్చేవిధంగా 

18, ఆగస్టు 2017, శుక్రవారం

భావ రస మంజరి-2


 ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
శ్రీ మహాగణాధిపతయే నమ:

1. శ్లో: వాగీశాద్యా: సుమనస: సర్వార్ధానా ముపక్రమే !
     యం నత్వా కృతకృత్యాస్స్యు: తం నమామి గజాననం!!

తా: బ్రహ్మ మొదలైన దేవతలు ఏ దేవునికి మొదట నమస్కరించి, తమతమ పనులయందు కార్యసిద్ధికలవారై నారో అట్టి మహిమకల విఘేనశ్వరునికి నేను మొట్టమొదట నమ
 స్కరించెదను.
Pranjali prabha
2. క// ధరణీ దిశ ప్రసారిత ;
గురుకర నికరంబు లుడిచికొని దీర్ఘనిరం ;//
తరగతి ఖిన్నుడ పోలెను;

హరిదశ్వుడు విశ్రమించె నస్తాద్రిదరిన్


దీర్ఘనిరం తరగతిన్= ఎడతెగని నడక చేత //
ఖిన్నము =భేదము నొందినది //

ఖిన్నుడ పోలెను= అలసెనో అనునట్లు//
కరము =కిరణము ,చెయి


విరామము లేని సుదీర్ఘ గతిచేత అలిసెనో యనునట్లు ; 

సూర్యుడు భూమిపై చాపిన స్వీయ కిరణములనే చేతులను అస్తగిరిగుహ లోకి ముడుచుకొని విశ్రమించాడు .

అందమైన ఉత్ప్రేక్షలంకారము


ప్రాంజలి ప్రభ - 3
యదాచిత్తం తథావాచ: యథా వాచ: తథా క్రియా:!
చిత్తే వాచి క్రియా యాం చ మహతాం ఏక రూపతా!!

మనస్సులో ఉన్న భావాన్ని చెపుతారు, వారు చెప్పినట్లు చేసి చూపుతారు, అనగా " మనస్సు, మాట, పని," ఈ  మూ డింటి యందును సమాన భావమును చూపునాదే త్రికరణ శుద్ధి అంటారు. (ప్రతిఒక్కరు అదేవిధముగా ఉండుటకు ప్రయత్నిమ్చాలి ) అట్టి వారినే మహాత్ములంటారు. లోకశ్రేయస్సే ధ్యేయంగా ఉంటారు.

ప్రాంజలి ప్రభ - 4  (శ్లోకభావం)

నాస్తి విద్యాసమం చక్షు: నాస్తి సత్య సమం తప:!
నాస్తి రాగసమం దు:ఖం, నాస్తి త్యాగసమం సుఖం!!

విద్యతో సమానమైన నేత్రము లేదు, ఇట్లే సత్య వాక్కుతో సమానమైన తపస్సు కాని, భౌతిక ప్రేమతో సమానమైన దుఃఖము కాని, కర్మఫలత్యాగముతో సమానమైన సుఖఃముకాని లేదు.    


ప్రాంజలి ప్రభ - 5  (శ్లోకం )  

విభూషణం శీలసమంచ నాణ్యత్
సంతోష తుల్యధనమస్తి నాణ్యత్


భావం : మానవులకు ఉత్తమ శీలంతో సమానమైన మరో ఆభారణం కాని, సంతోషంతో సమానమయిన మరొక ధనము కాని జగత్తులో లేదు. 

ప్రాంజలి ప్రభ - 6  (శ్లోకం )  

యోవనం ధనసంపత్తి: పభుత్వమవివేకితా !
ఏకై కమప్యనర్ధాయ, కిముయత్ర చతుష్టయం!!

భావం: మానవుడు కన్నుమిన్ను గానని నడియవ్వనములో నుండుట, అప్పుడు ధనసంపదకల్గుట, అట్టి సంపద సమయంలో ఉన్నతో ద్యోగం లబించుట, ఈ మూడింటికి తోడుగా అట్టివానికి అవివేకం అ బ్బును అనే ఈ నాలుగు సన్నివేశాలలో మానవునకు ఏ ఒక్కటి ఉన్ననూ అది అతనిని

అనర్ధములలో  పడవేయును, పైని చెప్పిన నాల్గును కలసి ఉన్నవాడు మూర్ఖాటి మూర్ఖుడై పతితుడై పోవును.  

ప్రాంజలి ప్రభ: 8 (శ్లోకం)

వికృతం, నైవ గచ్ఛంతి, సంగదోషేణ సాధన:!
అవేష్టితం మహాసర్పే: చందనం న విషాయతే !!

తా:: సత్పురుషులు (సజ్జనులు) చెడ్డ వస్తువలులతో తమకు సంబంధం ఉన్నాను ఆ వస్తువుల చెడ్డ తనం మంచి వారిలో ఏవిధమైన మార్పు ను లేక వికారములు కలిగించ జాలదు. ఎట్లనగా మంచిగంధపు చెట్టును విషముగల సర్పములు చుట్టుకొని ఉండును. ఐనను వాటి విషము ఆ గంధపు చెట్టుకు ఎట్టి  మార్పును కలిగించ లేదు. 


తెలుగు భాష దినోత్సవము సందర్భముగా అందిరికి శుభాకాంక్షలు "తెలుగులో మాట్లాడండి - తెలుగును బ్రతికించండి "

ప్రాంజలి ప్రభ- 9 

సత్యం బ్రుయాత్ ప్రియం బ్రుయాత్ బ్రుయాత్ సత్య మ ప్రియం!
ప్రియం చ నా వృతం బ్రుయాత్ ఏషధర్మ స్సనాతప:!!

తా: సత్యమునే పలుకవలెను.  ఆ సత్యము వినువానికి ప్రియముగా ఉండవలెను. అప్రియమైన సత్యమునుగాని, ప్రియంగా వున్న అసత్యమునుగాని పలుక రాదు. ఇది సనాతనమైన, అనగా ఎప్పుడూ మార్పు చెందని ధర్మము అని మనుస్మృతి చెప్పుచున్నది.

--((*))--

తెలుగు భాష దినోత్సవము సందర్భముగా అందిరికి శుభాకాంక్షలు "తెలుగులో మాట్లాడండి - తెలుగును బ్రతికించండి "

ప్రాంజలి ప్రభ- 10 

మన: ప్రసాదస్సౌమ్యత్వమో నమాత్మ వినిగ్రహ:1
భావ సంశుద్ది రిత్యేతత్ తప: మానస ముధ్యతే !!


మనస్సును ప్రసన్నముగా ఉంచుట, శాంత స్వభావము కలిగి ఉండుట,  మౌనము అనగా మనన శీలుడై యుండుట, మనోనిగ్రహము, శుద్ధమైన భావము కలిగి యుండుట అనే ఇవి మనస్సు చేత చేయతగిన తపస్సు అనబడును.  

--((*))--

తెలుగు భాష దినోత్సవము సందర్భముగా అందిరికి శుభాకాంక్షలు "తెలుగులో మాట్లాడండి - తెలుగును బ్రతికించండి "

ప్రాంజలి ప్రభ- 11

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ !
స్వాధ్యాయాభ్యాససం చై  వ వాజ్మయం తప ఉచ్యతే!!

తా: మానవుడు మాట్లాడు మాట వినువారికి దు:ఖమును కాని, క్షోభనుకాని కలిగించ కుండా ఉండ వలెను. ఇంకనూ ఆ మాట సత్యమయినది గాను, ప్రియమైనది గాను, హితమైనదిగాను ఉండ వలెను, ఇట్లే వేదాధ్యయనము యొక్క అభ్యాసమును అనే ఇవి వాచికమైన అనగా వాక్కుచే చేయ దగిన తపస్సు అని చెప్పబడుచున్నది.

    




*ప్రాంజలి ప్రభ - భావ రస మంజరి-2
5
. జ్ఞాత య్యవన : యవ్వనం వచ్చిందని తెలుసుకున్నది

అందంబులు పంచేద
సరస మధుర నవరస ఘటికా  
సరసంబులు నీసొంతం
సమయము వ్యర్థం చేయక రావోయ్

కాటుక కన్నుల పిలుపు
కలలు పండించు కోటానికి రావాలోయ్
చిరు నవ్వుల వలపు
సమయా సమయం చూసి దోచవోయ్

కలువల కులుకు జూసి
నన్ను మరువకోయ్
కన్నులలో నిన్నిలిపిన
నన్ను వీడకోయ్

సల్లనైన పైరగాలి
పులకరింప జేసేనోయ్
సల్లనైన యెన్నెల్లో
సరస మాడు కుందామోయ్

స్నానమాడి ఉన్నా
పరిమళంతో రంజిల్లుతున్నానోయ్
కనుచూపు మారక
సమయం కోసం వేచి ఉన్నానోయ్

చలిత మధుపాలకాకీర్ణ జలజ వదన
శంభువు స్వయంభు వైన నీచారు కుచయు
గమ్ము ఏ ధన్యజీవి నఖక్షతమ్ము
చేత చంద్రచూడమ్ముగా చేయబడునొ
--((*))--


ప్రాంజలి ప్రభ - భావ రస మంజరి-2
6. ధీర : వ్యంగంగా కోపాన్ని వెల్లడించేది

దెయ్యము పట్టిన రీతిన
కయ్యము లాడిన తీరున
వియ్యము చేయక వగచిన
కొయ్యవలె మారి కోపము చూపెనే

సముఖము దొరకక దొరికిన
సముఖుండే దరిచేరి తొందర చేసిన
విముఖంగా కవ్వించి వలదని 
నీ ముఖమున రసభావ కళ లేదనే    

ఆకు వక్క రుచి తెలియని చుక్కను
సోకు చుక్క అలవాటులేని రేచుక్కను
యేకు ముక్క మెత్తదనములేని పగటి చుక్కను
తాకుట మక్కువ చూపక గడసరి  ఋక్కు నే

ఉల్లము రంజిల్లనీయకు
బెల్లఁము రుచిని చూపకు
గొళ్ళెము బిగువును తీయకు
బల్లెములాంటి మాటలతో భాద పెట్టకు  

వానల పస పైరుకు
సానల పస వజ్రముకు
సేనల పస రాజుకు
కన్నులపస ఇక నీకే

 ఇంటికి పదిలము బీగము 
జంటికి పదిలము రెవికయు 
కంటికి పదిలము రెప్పయు 
వంటికి పదిలము ఈకోపము 
 --((*))--

 ప్రాంజలి ప్రభ - భావ రస మంజరి-2
7. వాక్చతురుడు : సంభోగాభిలాషను మాటలతో సూచించేవాడు 

ఓ మగువా  నీవేషము చూస్తే 
నా మది తలపులను తట్టి లేపుతున్నది
నీ కళ్ళ నిషా చూపులు చూస్తే
కవ్వింత కాగడాల వెలుగు కనబడుతున్నది 

నీ పయ్యెద కదలికలు చూస్తే
శృంగారభావం హృదయాన్ని తాకి మెరుస్తుంది  
నీ వాలు జడ కదలిక చూస్తే
మరిచిపోలేని నితంబులకదలిక కనబడుతుంది
 
నీ కొప్పులో విరజాజులు చూస్తే
పరిమళాల మత్తుకు చిక్కి ఉండి పోవాలిని ఉంది
గులాబి రేకలు రాలుట చూస్తే
వలువలు లేని వయ్యారిని చూడాలని పిస్తుంది

8. అనుకూలుడు:పరస్త్రీని పరాన్ముఖుడై నాయకనే ప్రేమించే వాడు

ప్రేమయే ప్రగతి, సుగతి, సుమతి
ప్రేమయే క్షణము, యుగము, జగము
ప్రేమయే నభము, శుభము, భోగము
ప్రేమయే భవము, శివము, హృదయము

నీవొక మేఘము, జలము, పుష్పము
నీవొక మల్లికవు, మమతవు, మధువువు
నీవొక జ్వాలవు, జ్వలితవు, జ్యోతివి
నీవొక కలవు, కోరికవు, కనువుందువు    

మదిలో వెచ్చగా సెలయేరులా పొంగే
వెన్నెల కాంతి మదిలో నాట్యము చేసే
సరస చల్లాపమునకు కళ వేలాయనే      
హృదయాంతరమునందు విరయు సోంపు

నుల్లము మురిసి పొంగాలని తపన
పల్లకిని చేరి త్వర త్వరగా మీటవా
స్వర మాధుర్యముతో మెప్పించవా 
చల్లని గాలితో వార్త పంపుతున్న రావా 
--((*))--
 
ప్రాంజలి ప్రభ 

పృథ్విపై బ్రతికే ఒక కవి 
హృదయంలో కదిలిన బీజాలివి 
బీజాలే ఆలోచనా ఉషస్సులివి
మేఘాలు దట్టంగా కమ్ము కుంటున్నాయి
మిలమిల లాడే మెరుపులు మెరుస్తున్నాయి 
గాలితో కలసి మేఘాలు వర్షం కురుస్తున్నాయి 
సప్తవర్ణాల హరివిల్లు నింగిలో, 
పృద్యిపై కవి బీజం మొలకెత్తే మోక్కలో
ఎదుగుటకు పోసే పాండిత్య జలమును  
వికసించిన సుందర సుకుమార పుష్పాలు  
పుష్పాలు నిండుగా ఉన్న తోటల పరిమళాలతో
పరిమళాలే కవితా పుష్పాల ఉషస్సులే 
మనుష్యుల మనస్సుకు చేరే గీతికలు 
కావ్య గీతికలు హృదయంలో చేరే కిరణాలు  
వసంత కాలంలో చిగురుల్లా 
మధుమాసంలా కోయల కూతల్లా
నిత్యము రాలి పడే పారిజాతముల్లా 
పరిమళించే కవి హృదయ పుష్పాలే        
కవితాక్షరాల పుష్పగుచ్చాలివి 

కవిమలచిన సుందర సౌందర్య శిల్పాలివి 
ప్రాంజలి ప్రభ - (పాల -సంపద)

ప్రాపంచంలో తోలి వాకిలి
అమ్మలకు సంపూర్ణ స్తన్య సంపద
తోలి ఆరోగ్య సంరక్షణ వాకిలి
సమగ్రపోషక ఆహారం తల్లి పాల సంపద

ఆలుమగల పరమాద్భుతము అవ్వాలి
బిడ్డకు తల్లి కావటం స్త్రీజన్మ సంపద
భర్త, స్త్రీలో మాతృత్వ మార్పు చూడాలి
నలుసు కడుపులో పడితే అదే సంపద

దేవుడు మనుష్యులపై ప్రేమ చూపాలి 
పిల్లలకోసం బ్రతికి గుండెధైర్యమే సంపద
కెవ్వున స్నిగ్ధమందరము కేక వినబడాలి
తల్లి ఆనందం స్తన్యాలతో పొందే సంపద

జగతికి సార్వభౌమత్వం సైతం ఆమ్మ కావాలి
మోహన కృష్ణుడు తెల్పే పాలే ఆరోగ్య సంపద
చుబుక్ చుబుక్ అని మూతిపెట్టి పాలు త్రాగాలి
నిర్జర నిర్ఘర ధారలే యాగోద్భవమృతమే సంపద

తల్లి రక్తం దారం పోసి, ప్రేమరసం రంగరించాలి
పెరిగే పాలిండ్ల సొగసు తగ్గునని అనారోగ్య సంపద      
ఆలుమగల హృదయాలు పరవసించాలి
స్తన్య పాలు ఇవ్వడమే తల్లికి బిడ్డకు ఆరోగ్య సంపద


--((*))--


16, ఆగస్టు 2017, బుధవారం

భావ రస మంజరి

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

 ప్రాంజలి ప్రభ
ప్రాంజలి ప్రభ - 6  (శ్లోకం )
జనకులు మదీయ జీవితమునకె కాదు
నా మనో వికాసమునకే, నా కవిత్వ
తత్త్వమునకె, నా తల్లియు తండ్రి -వారే
గురులు దైవమ్ములు నుతింతు పరమభక్తి 

ప్రాంజలి ప్రభ - భావ రస మంజరి


1 . స్వీయ : భర్త యడల మాత్రమే అనురాగం గల నాయిక

కోర్కెలూగు చూపులు కంటి కొనల నాగు
స్మితము కులవధూటికి విశ్రమించు నధర
మందె-పతికర్ణ యుగలికే విందు వాక్కు
అలుక ఎపుడేని కలిగెనే నడగు నెడద
(రసమంజరి లో పద్యం )

*కలల్లో దాహం గమనించి
- కల్లోలాన్నీ తొలగించు
కనువిందు చూపు అందించి
- కొనలనాగు కోరిక తృప్తి పరచు

నవ్వులతో నయనాల కదలిక
-హృదయ స్పందనవు మేలి కలయక
నధరాల అమృతం మరువలేక
-విశ్రాంతి కల్పించి విందు చేయుచు        

ప్రేమకు సమానమైన విద్య లేదు
-విద్యకు సమానమైన నేత్రము లేదు
పతిదేవునికి వాక్కు మించినది లేదు
-సత్యవాక్కుకు సమానమైన తపస్సు లేదు

సుఖానికి మించిన తపస్సు లేదు
-తపస్సే సుఖానికి నాంది అ
క తప్పదు
అలుకలేని కాపురం అందమైన
ది కాదు
-స్వీయ తపనలు పతి కౌగిలింతకు నాంది


మనసు, మాట, పని, ఒకే మాదిరి
సర్వ కార్య సిద్ధికి ఇరువురిదీ ఒకేదారి 
త్రికరణ శుద్ధిగా  ఏకమై బ్రతుకే దారి 
అభ్యుదయమే హృదయానందానికి దారి 

--((*))-- 




2. నాయకుడు :పతి = యధావిధిగా వివాహము చేసుకున్నవాడు 
(భార్య దృష్టి లో భర్త )

ఎంతెంతో దీర్గాష్యుమంతుడవై 
బహు మిగులు బుద్ధిమంతుడవై 
సతి పట్ల శ్రీమంతుడవై 
లక్ష్మీ కృప కల్గిన పతివై 

బహు చూపులు కలవాడివై 
బాహువుకు చిక్కిన వాడవై 
బహురూప సుందరుడువై 
బహు భాషా కోవిదుడవై 

చల్లగా నమృతము నింపే చంద్రుడివై 
మెల్లగా వీచే గాలితోకలిసే భోగేంద్రుడువై 
స్వరవాహినితో చల్లబరిచే ఇంద్రుడువై 
జలము లోసి జ్వాలనే మింగినవాడవై  
 

మార్గా యాసయై మది తొలచిన వాడవై 
మత్తరుణికి ప్రేమానంద భరితుడవై 
అది ఇది అనక రసాస్వాద చరితుడవై 
దధికిటధిమిధిమ్మను తాళము వేసేవాడవై 

రేపు మాపు అనక నేడే ఆశ తీర్చినవాడవై      
ఆనందము పెంచే కవితలను చెప్పు వాడవై
రసాస్వాదమును బహుగా వర్ణించినవాడవై 
లజ్జా సతిని మురిపించి మెప్పించిన వాడవై 

వివేకముతో వినయముతో వినమృతతో
వీనుల విందుగా విషయమును తీర్పు తో 
వేడుకతీర్చు, వేదన తగ్గించే బహుఓర్పుతో   

స్వశ్చతా స్వేశ్చను కల్పించే బహు నేర్పుతో 
 __((*))__


3. ఆజ్ఞాత యవ్వన = యౌవనమొచ్చిందని కుడా తెలుసుకోలేని యువతి

శ్రీకారము మదవతి
మదితలపులు పులకించే సతి
శుభములు చేకూర్చాలని రీతి
మరువలేని పరిస్థితి

బహుదోషములు వెంబడించిన
మనసు కుదుట పడక పోయిన
అనురాగము అందించ కుండిన
ఆప్యాయత తగ్గును తెలియకనే

చెప్పాలని ఉన్నా చెప్పలేక
కలవాలన్నా  కలవ లేక
బిడియము వదలి రాలేక
తపన ఏదో తెలుసుకో లేకే

తరుణిగా దరి చేరి
నీడగా నీవెంటే చేరి
తడి అంటని పువ్వులా మారి 
ఎండమావులుగా మారే

శ్రోణిభార మంచారయు లేక
సుఖ ప్రాప్తి అనేది తెలుసుకోక
సుఖ జీవనమ్మేదో కానరాక
ఊట ఊరని చలముగా మారే  

--((*))--


4. ప్రాంజలి ప్రభ - భావ రసమంజరి - 4
ముదిత : కోరిక తీరుతుందని సంతోషించునది 

మనసిజ పుష్ప బాణము మాటికి గ్రుచ్చగా
వయ సొచ్చిన వగ లాడి సిగ పట్టు లాడగా
వయ్యారి వగలాడి వలపుతడిసి పట్టుపట్టగా
గుట్టు రట్టు చేసి బెట్టు బెట్టు అంటావే మ
గాడా 

నీ చూపుల్లో కాంతి - ఉషోదయ కాంతితో సరికాదు
నీ దంతాల్లో కాంతి - మాణిక్య కాంతితో సరికాదు
నీ పలుకుల్లో కాంతి - వక్భూషనాలతో సరికాదు
నీ అడుగుళ్ళోకాంతి - సప్తపదులతో సరిపోదు

నీ కదలికల్లో కాంతి - నెమలి పించాల కదలికతో సరికాదు
నీ ఆశయాలల్లో కాంతి - మబ్బులో మేరుపలతో సరికాదు
నీ వలువలల్లో కాంతి - చాందినీ గుడ్డలతో సరికాదు
నీ
మనసులో కాంతి - మెరిసేటి హరివిల్లుతో సరిపోదు 

విరహ విదితమౌ ననురాగా మెరిగి ప్రియుడు
వేగవచ్చి భాగ్యంబు  లర్పించు నంచు
మరిచములు నేత్రముల నుంచి, పురవ ధూటి 
ద్వారాసీమ గూర్చుండి భాష్పాలు విడుచు 
    --((*))--


వాసన లేని పువ్వు, బుధ వర్గము లేని పురంబు,
భక్తి విస్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడున్,
సదాభ్యాసము లేని విద్య, పరిహాసము లేని వాచ్య ప్రసంగముల్,
గ్రాసము లేని కొలువు, కొఱగానివి పెమ్మయ సింగ ధీమణీ.

గారెలు లేని విందు , సహకారము లేని వనంబు ,
తొలుత ఓంకారము లేని మంత్రము , అధికారము లేని ప్రతిజ్ఞ ,
వాక్చమత్కారము లేని తెల్వి, గుణకారము లేనటువంటి లెక్క,
వాసము లేని ఇల్లు , కొఱగానివి పెమ్మయ సింగ ధీమణీ.

మచ్జిక లేని చోట అనుమానం వచ్చిన చోట
మెండుగా కుత్యిలున్న చోట రాజు కరునించని చోట
వివేకు లున్నచో అచ్చట మోసమండ్రు
కరుణాకర పెమ్మయ సింగ ధీమణీ.

-- జక్కన చెప్పిన 'పెమ్మయ సింగధీమణి' శతకము నుంచి



















        
         

9, ఆగస్టు 2017, బుధవారం

విశ్వములో జీవితం -

విశ్వములో జీవితం - 
ప్రాంజలి ప్రభ  -  (కలలు- కళలు)

కలలు కల్లలు కావు
మానవుల స్వభావాల వెల్లువ
కలలు కళలు కావు
కళాభిరుచే కనే కలలు వెల్లువ

కలలు ఆకర్షితులు కావు
మనోవికాస విభిన్న రుచుల వెల్లువ
కలలు చీకటి వెలుగులు కావు
శాంతి అశాంతి మధ్య నలిగే వెల్లువ

కలలో కనిపించేవి నిజాలు కావు
జీవితాల్లో తారసపడే గుణాల వెల్లువ
కలలు కనటం తప్పు మాత్రం కాదు
కళలను సార్ధకం  చేసుకోవటం వెల్లువ

స్వప్న సృష్టి ఎవ్వరికీ చెప్పేవి కావు
జగత్తులో ఉండనివి వెంబడించే వెల్లువ
ఊహల్లో కన్న కలలన్నిఆచరణం కావు
కీడు మేలు చేసే కొత్త విషయాల వెల్లువ

శిశుప్రాయం కళ వర్ధిల్లి తేనే
బాల్య ప్రాయ వికాస వెల్లువ
బాల్య ప్రాయం విరబూస్తేనే
యవ్వన సుమం విచ్చే వెల్లువ

యవ్వన ప్రాయం విస్తరిస్తేనే
ఎదనిండా కళ పరిమళాల వెల్లువ
మధ్యస్థ ప్రాయం అనుభవిస్తేనే
సుఖ దుఃఖాల మెలికలయక వెల్లువ

వృద్ధాప్యం ప్రేమను ప్రేమిస్తే
నిత్య సౌభాగ్య తోరణాల వెల్లువ
వృద్ధాప్య ప్రాయం దైవాన్ని ప్రేమిస్తేనే
సమయ సద్వినియోగ కళలు వెల్లువ 

కల్లోలం కలలే కలంక తరుణం సందేహ సంమ్మేళణం
విల్లాపం వినుటే భయంకర మయం విద్రోహ సమ్మోహణం
తెల్లారే పయణం అబద్ధ కలలే విశ్వాస రాహిత్యమే
మూల్యంకమ్ కనుటే సువర్ణ సెగలే ప్రేమత్వ బాంధవ్యమే   
 
సమయాన్ని సద్వినియోగం చేసుకోక, సందేహ సమ్మేళనంలో మునిగేవారికి కల్లోలం కలలే,
విద్రోహులతో కలిస్తే భయంకరమైన భాదను చూడ గలుగుతారు,  విస్వాస పాత్రులను నమ్మించి అబద్దాలతో వేగా ప్రయాణం చేయిస్తే వచ్చే కలలే, ప్రేమతో ఏర్పడే బంధాలే బంగారం కలలుగా ఏర్పడుతాయి      
   చిరు నవ్వుతో స్నేహము చిగురించు
చమటపెట్టె సుమలోచన వెంబడించు
చమత్కార చిరుసంభాషణతో గడించు
చపలత్వం వదిలే తరుణ మనిపించు  

చదరంగము ఆడి గెలవాలనిపించు
చతురంగ బలంతో గెలవాలనిపించు
చామంతులతో ఇప్పుడాడాలనిపించు
చేయి చేయి కలిపి సాగాలనిపించు

చెక్కిలి నొక్కి ముచ్చట తీర్చాలనిపించు
చింతలుతొలగించి సంతోష పెట్టాలనిపించు
     
  ప్రాంజలి ప్రభ

నమ్మితే రాజ భోగము -
నమ్మించుటలో ఉంది రాజకీయము
జీవితమే చదరంగము  -
ఎత్తుకు పైఎత్తులు వేయటమే రాజకీయము

కుటుంబమే కొందరికి లోకము -
కులాలను వృద్ధిపరచటమే రాజకీయము
ప్రేమను పంచి నలుగురితో బ్రతకటము -
ధనముతో సేవ వళ్ళ వచ్చే ఓట్లు రాజకీయము        

భవిషత్తు ఎవ్వరూ చెప్పలేరు -
కొందరిని నమ్మించటమే వేరు
ఆటుపోటులతో సహజ పోరు -
ఆకర్షించుటలో నాయకుల జోరు

నమ్మితేనే జీవితము కదులు -
నమ్మించటంలోనే నాయకులు కదులు
ప్రజలకు కూడు గుడ్డ గృహము చాలు -
ప్రజల ఓట్లు నాయకులకు చాలు

తెలపరు ఆర్ధికమైన నష్టమును
తెలపరు మనసులోని పరితాపమును
తెలపరు తన గృహ విషయాలను
తెలపరు పరులవళ్ళ కల్గిన మోసాలను

ప్రజల సేవే దీక్షగా భావించును
ప్రజల బాగోగులకే ప్రాధాన్యత నిచ్చును
ప్రజలే దేవుళ్లుగా నమ్మి బ్రతుకును
విజయమే ధ్యేయంగా ఉండేదే రాజకీయము 

8, ఆగస్టు 2017, మంగళవారం

విశ్వములో జీవితం -42

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

ప్రాంజలి ప్రభ

నువ్వు నువ్వుగా ఉండగలిగితే
లోక మంతా నీకు దాసోహం
ఇంద్రియాలను జయించ గలిగితే
దైవంతో ఉండు నీకు స్నేహం

నీవు ప్రకృతిని ప్రేమించ గలిగితే
నీ యద నిండా ఉండు మొహం
నీవు ఆశయాలతో ఉండగలిగితే
నీ బుద్ధి ఉండు నిరంతరం దాహం

నీవు విధిని మార్చుకో గలిగితే
నీ సంకల్పమే నీకు ఆవాహం
సమయాన్ని ఉపయోగించకో గలిగితే 
ప్రతి ఒక్కరు నీకు సమ్మోహం

కృతనిశ్చయం నిలుపుకో గలిగితే 
మనసుకు రాదు ఎప్పడు అహం
ఆలోచన నిజం చేసు కోగలిగితే
జీవితమంతా ఉండు వ్యూహం
--((*))--

ప్రాంజలి ప్రభ
కుసుమ సౌరభము

కుసుమమా ఏమి నీ సౌందర్యము
పరిమళాలతో ఎప్పుడు ప్రభంజనము
మనసు కదలికకై సుమ కోమలము
మదినిఁదోచు మరులు గొలుపు సుమము

నిత్య నూతన యవ్వన కుసుమము
ప్రకృతి తో సమాన మైన వైభవము
పత్రముల మధ్య పుష్ప మయము
కిరణాలతో సహజ కుసుమ తేజము

వెన్నెలలో విరాజిల్లే స్వీకృతము
తుషార బిందువుల తో సమము
కారు చీకటి లో స్వేత వర్ణము    
విసించి వీక్షకులకు అద్భుతము 

మత్తును పంచే పారిజాతము
మమతను పెంచే మధురిమము
కురులలో కుసుమ విరాజితము
అందరికి ఇష్టమైన పుష్ప రాజము

ప్రాంజలి ప్రభ 

వయసు పెరిగే కొద్దీ
విద్య , సమయుము, ఉండి శక్తి తగ్గు 
బుధ్ధి పెరిగే కొద్దీ
ఆలోచన, భయము, ఉండి సమయము తగ్గు 

మమత పెరిగే కొద్దీ
మంచి, చెడులు, ఉండి ప్రేమలు తగ్గు
విద్య పెరిగే కొద్దీ  
గర్వము, ధనము, ఉండి వినయము తగ్గు

మనిషికి పెళ్ళైన కొద్దీ
ప్రేమ, అంకితము, ఉండి ఆశయాలు తగ్గు  
కాలం కలిసొచ్చిన కొద్దీ
ధనము, ఆకలి, ఉండి భ్రమలు తగ్గు  

పుత్తడి పెరిగిన కొద్దీ
దాపరికం, భయము, ఉండి ధరించుట తగ్గు
ధనము పెరిగిన కొద్దీ
నమ్మకము, సమయము, ఉండి సుఖము తగ్గు

వైరాగ్యం పెరిగే కొద్దీ
భక్తి , సమయము, ఉండి మమత తగ్గు
జ్ఞానము పెరిగే కొద్దీ
విజ్ఞానము, వైరాగ్యము, ఉండి అజ్ఞానము తగ్గు

కన్నీరు పెరిగే కొద్దీ
కరుణ, ప్రేమ, ఉండి  అబద్ధము తగ్గు
ఆవేశం పెరిగిన కొద్దీ
కోపము, కోట్లాట ఉండి ఆలోచన తగ్గు