8, ఆగస్టు 2017, మంగళవారం

విశ్వములో జీవితం -42

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

ప్రాంజలి ప్రభ

నువ్వు నువ్వుగా ఉండగలిగితే
లోక మంతా నీకు దాసోహం
ఇంద్రియాలను జయించ గలిగితే
దైవంతో ఉండు నీకు స్నేహం

నీవు ప్రకృతిని ప్రేమించ గలిగితే
నీ యద నిండా ఉండు మొహం
నీవు ఆశయాలతో ఉండగలిగితే
నీ బుద్ధి ఉండు నిరంతరం దాహం

నీవు విధిని మార్చుకో గలిగితే
నీ సంకల్పమే నీకు ఆవాహం
సమయాన్ని ఉపయోగించకో గలిగితే 
ప్రతి ఒక్కరు నీకు సమ్మోహం

కృతనిశ్చయం నిలుపుకో గలిగితే 
మనసుకు రాదు ఎప్పడు అహం
ఆలోచన నిజం చేసు కోగలిగితే
జీవితమంతా ఉండు వ్యూహం
--((*))--

ప్రాంజలి ప్రభ
కుసుమ సౌరభము

కుసుమమా ఏమి నీ సౌందర్యము
పరిమళాలతో ఎప్పుడు ప్రభంజనము
మనసు కదలికకై సుమ కోమలము
మదినిఁదోచు మరులు గొలుపు సుమము

నిత్య నూతన యవ్వన కుసుమము
ప్రకృతి తో సమాన మైన వైభవము
పత్రముల మధ్య పుష్ప మయము
కిరణాలతో సహజ కుసుమ తేజము

వెన్నెలలో విరాజిల్లే స్వీకృతము
తుషార బిందువుల తో సమము
కారు చీకటి లో స్వేత వర్ణము    
విసించి వీక్షకులకు అద్భుతము 

మత్తును పంచే పారిజాతము
మమతను పెంచే మధురిమము
కురులలో కుసుమ విరాజితము
అందరికి ఇష్టమైన పుష్ప రాజము

ప్రాంజలి ప్రభ 

వయసు పెరిగే కొద్దీ
విద్య , సమయుము, ఉండి శక్తి తగ్గు 
బుధ్ధి పెరిగే కొద్దీ
ఆలోచన, భయము, ఉండి సమయము తగ్గు 

మమత పెరిగే కొద్దీ
మంచి, చెడులు, ఉండి ప్రేమలు తగ్గు
విద్య పెరిగే కొద్దీ  
గర్వము, ధనము, ఉండి వినయము తగ్గు

మనిషికి పెళ్ళైన కొద్దీ
ప్రేమ, అంకితము, ఉండి ఆశయాలు తగ్గు  
కాలం కలిసొచ్చిన కొద్దీ
ధనము, ఆకలి, ఉండి భ్రమలు తగ్గు  

పుత్తడి పెరిగిన కొద్దీ
దాపరికం, భయము, ఉండి ధరించుట తగ్గు
ధనము పెరిగిన కొద్దీ
నమ్మకము, సమయము, ఉండి సుఖము తగ్గు

వైరాగ్యం పెరిగే కొద్దీ
భక్తి , సమయము, ఉండి మమత తగ్గు
జ్ఞానము పెరిగే కొద్దీ
విజ్ఞానము, వైరాగ్యము, ఉండి అజ్ఞానము తగ్గు

కన్నీరు పెరిగే కొద్దీ
కరుణ, ప్రేమ, ఉండి  అబద్ధము తగ్గు
ఆవేశం పెరిగిన కొద్దీ
కోపము, కోట్లాట ఉండి ఆలోచన తగ్గు   



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి