ఇల్లును మనకు జాగృతీ కావాలి నిలయ మై
ముల్లుల వలన ఆశయం మారేను కరుణతో
జల్లులె మనసు బుద్ధి యే హృద్యమ్ము సుఖము తో
కల్లున కలలు కాలమే బ్రాంతియే భయము తో
Uii III UIU UUI III U
దత్తపది: ఇది నిజముగా దత్తపద, కాని వాడుకలో దత్తపది అయినది. పదముల ఛందస్సును పృచ్ఛకుడు ఇవ్వవచ్చును, ఇవ్వకుండా ఉండవచ్చును. పదములు స్వార్థములో (అదే అర్థములో) లేక పరార్థములో (వేఱు అర్థములో) నుండవచ్చును. లేక రెండింటితో కూడ ఉండవచ్చును. దానిని పృచ్ఛకుడు తెలుపవచ్చును, తెలుపకుండా ఉండవచ్చును. పదములు ప్రారంభములోనే ఉండవలసిన అవసరము లేదు. పదములు సామాన్యముగా ఇచ్చిన క్రమములోనే ఉపయోగిస్తారు. అప్పుడప్పుడు వరుసను మార్చవచ్చును.
న్యస్తాక్షరి: నాలుగు అక్షరములు అర్థవంతముగా నుండాలి. అర్థవంతము కాకుండా కూడ అక్షరములను ఇవ్వవచ్చును. అప్పుడు న్యస్తాక్షరి దత్తపదిగా కూడ మారుతుంది. అవి ఎన్నవ అక్షరముగా నుండాలి అనే విషయము కూడ పృచ్ఛకుని నిర్ణయమే. అది ఏ ఇతివృత్తమును గుఱించి అన్నది పృచ్ఛకుడు చెప్పుతాడు. ఛందస్సును ఇస్తారు, ఇవ్వకుండ కూడ ఉండ వచ్చును. నాలుగు పాదములు ఒకే మారు పూరించబడవు. ఒక్కొక్క పాదము చొప్పున పూరిస్తాడు అవధాని, పాదముల మధ్య కొద్ది కాలము ఉంటుంది. ఆంగ్లములోని అక్షరములను ఇచ్చి వాటితో ప్రారంభమయ్యే తెలుగు పదములను వాడమని కూడ చెప్పవచ్చును.
మఱొక ముఖ్య విషయము: పృచ్ఛకుడు తాను కూడ సమస్యలను పూరించి ఉంచుకోవాలి.
****
న్యస్తాక్షరి అర్థవంతమైన పదం అని నియమం లేదు మోహన్ గారు . ఎలా అయినా ఇవ్వవచ్చును . కొందరు క వర్గం , చ వర్గం , ట వర్గం ఇలా కూడ ఇస్తారు లేదా వారికి నచ్చిన అక్షరాలు ( క , చ , ప , మ ) అని ఇలా కూడా ఇస్తారు . దత్త పది , న్యస్తాక్షరి , సమస్య , వర్ణన , నిషిద్దాక్షరి ఈ ముఖ్యమైన అంశాలు అన్నిటికీ పృచ్ఛకుడు వద్ద సమాధానం సిద్దంగా ఉండాలి . అవధానం అయ్యిన తరువాత వారి భావం ( ప్రుచ్చకులు ) చెప్పాలి .
నేటి తేటగీతి పద్యాలు
ఒక్క సారిగా కురిసింది వాన నాలొ
మక్కు వంతయు చూపాను మప్పు డపుడు
నక్క బుద్ధియు చూపక నేను ఉన్న
కుక్క బుద్దిగా విశ్వాస కన్ను ఉంచు
నా మనసున ఎడారె నన్ను మార్చె
మొక్క నాటి ప్రయత్నము ముందు చేసి
యున్న నేనెప్పు డొస్తాను యనక వుండు
చూస్తు విశ్వాస ప్రేమను చూపియున్న
వెన్నెలలొ కంటి కానరా వేదమవ్వు
స్థిరము గానుండ కయు బాధ స్థితియు తలపు
నాకు ఆశ్చర్యమును కల్గి నన్ను మార్చు
అంతరార్దమును తెలిపె ఆత్మ ముందు
సేద తీరుమార్గముల ను సేవ చుట్టు
కాల నిర్ణయ మన్నన కోసమవ్వు
మౌన మంతయు చూపుట మోక్షమవ్వు
ప్రేమ బతికియు బతికించు మార్గ ముండె
అంత రంగమున తరంగ మార్గ మువ్వె
ఏదొ అపశృతి వెంటాడి ఎదలు మండె
నాకు మాత్రము తెలిసిన నామమవ్వు
జీవితమునకు ఆధార జాడ్యమవ్వు
****
సంతుష్టుఁడీ మూఁడు జగములఁ బూజ్యుండు;
సంతోషి కెప్పుడుఁ జరుఁగు సుఖము
సంతోషిఁ గాకుంట సంసార హేతువు;
సంతసంబున ముక్తిసతియు దొరకుఁ
బూఁటపూఁటకు జగంబుల యదృచ్ఛాలాభ;
తుష్టిని దేజంబు తోన పెరుఁగుఁ
బరితోష హీనతఁ బ్రభ చెడిపోవును;
జలధార ననలంబు సమయునట్లు
ఆటవెలది
నీవు రాజ వనుచు నిఖిలంబు నడుగుట
దగవు గాదు నాకుఁ; దగిన కొలఁది
యేను వేఁడికొనిన యీ పదత్రయమునుఁ
జాల దనక యిమ్ము; చాలుఁజాలు. "
తాత్పర్యము
తృప్తిపడేవాడు ముల్లోకాల్లోనూ గౌరవింపబడతాడు. తృప్తునికి ఎప్పుడూ సుఖం కలుగుతుంది. సంతోషం లేకపోవడమే తిరిగి పుట్టడానికి కారణం. సంతోషంవల్ల మోక్షం కూడా సమకూరుతుంది. పూటపూటకూ తనంతతానుగా దొరికినదానితో సంతోషపడుతుంటే తేజస్సు పెరుగుతుంది. నీళ్ళ వలన నిప్పు చల్లారినట్లుగా సంతోషం లేకపోతే తేజస్సు తగ్గిపోతుంది. నీవు రాజువు కదా అని అవి ఇవి అన్నీ అడగడం భావ్యం కాదు. నాకు తగినట్లుగా నేను అడిగిన మూడుఅడుగులూ కాదనకుండా ఇమ్ము. అంతే చాలు. అదే చాలు. ”
నేటి ఆద్యాత్మిక భావం
సృష్టి చైతన్యం ప్రకృతి
ఆత్మా చైతన్య ఆకృతి
దైవ చైతన్యం స్వీకృతి
పుర్ష చతన్యం జాగృతి
ఆత్మ తత్త్వం తెలుసు కోలేని జన్మ
యోగ తత్త్వం కనికరించలేని జన్మ
మౌన తత్త్వం ఆచరించుటయే జన్మ
ప్రేమ తత్త్వం తో భక్తియే కలియుగ జన్మ
పరాత్పర శబ్దము గ్రహించలేము
పశ్యంతీ, శబ్దము వినిపించుకోలేము
మధ్యమ శబ్దము బతికి బతికించుటే
వైఖరీ శబ్దము 84 లక్షల ప్రాణుల భాషయే
సర్వోత్కృష్ట శబ్దం ఓంకార నాదం
ఆచరించిన వానికి జన్మ పరిపక్వత
మోక్షదాయక సులభ మార్గం
ఇదియే కలియుగ జీవిత సత్యం
-(())--
నేటి నా కవిత్వం
వేదపండితులు శ్రీరామ్ నగర్ కాలనీ లో సీతారామకళ్యాణం జరప నిర్ణయించారు
సమస్త ప్రజానీకము కల్యాణోత్సావానికి వచ్చి తీర్ధ ప్రసాదములు స్వీకరించి శ్రీ సీతారామాంజనేయుని కృపాకటాక్షాన్ని పొందగలరు
శ్రీ సీతా రామా కళ్యాణం చూద్దాం రారండీ
రా మా ప్రేమా పొందాలీ పిల్లా పెద్దా రండీ
మాంగల్యా కళ్యానో త్సాహాన్నీ చూదాం రండీ
నానీ నీనా పల్కాకే సంబారం రారండీ
గానాంమృత్వంగా సీతా రామా అందాం రండీ
రుత్వీక్కూలా వేదా మంత్రా లే విందాం రండీ
కారుణ్యా మందీరానా పెళ్లీ చూద్దాం రండీ
లాలీ లీలా సంతోషంతో కల్సుందాం రండీ
నీలామేఘశ్యామా సీతమ్మానే చూడండీ
హైహై అంటూ నాట్యం చేస్తూ చూద్దాం రారండీ
దారిద్రాన్నీ తొల్గించే దైవాన్నీ కొల్వండీ
రామా సీతా తత్వాన్నీ తెల్సు కుందాం రండీ
రామ శక్తి తెలుసు కుందాం రండీ
ఒక్క మాటయు ఒక్క భాణము ఒక్క పత్నియు లక్ష్య మే
దిక్కు చూపియు తండ్రి సేవయు గుర్వు మార్గము లక్ష్య మే
చక్కు లన్నియు తల్లి పల్కుతొ దాన ధర్మము లక్ష్య మే
మెక్కి వేడితే సర్వ శోభయు సీత రాముల లక్ష మే
సీత శక్తిని తెలుసు కుందాం రండీ
విశ్వ వాణియె విశ్వ నేత్రిగ విశ్వ భాష్యము పంచగా
విశ్వ యీశ్వరి విశ్వ శక్తిగ విశ్వ మాయను తుంచగా
విశ్వ వాహిని విశ్వ భావని విశ్వ సంపద పెంచగా
విశ్వ ధాత్రివి విశ్వ తీర్పుగ విశ్వ మంతయు రక్ష గా
విశ్వ భార్గవి విశ్వ భావిత విశ్వ మాతగ నుండగా
విశ్వ భారతి విశ్వ దేవిగ విశ్వ సత్యము పల్కగా
విశ్వ దేవత విశ్వ మార్పుకు విశ్వ తీర్పును పంచగా
విశ్వ యోగిని విశ్వ విశ్వ శాంతిగ విశ్వ మంతయు రక్ష గా
--(())--
కలితానందదాతారం నమామ్యహమహర్నిశమ్
హృదయానందదాతారం నమామ్యహమహర్నిశమ్
మహితానందదాతారం నమామ్యహమహర్నిశమ్
మనసా నందదాతారం నమామ్యహమహర్నిశమ్
పుల్ల కుసుమ భాస్వరం శ్యామాంచిత దళ ప్రదామ్
పృధ్వి కుసుమ శాస్వితం ప్రేమాంచిత దళ ప్రదామ్
సూర్య కుసుమ భావ్యతం దీపావళి దళ ప్రదామ్
మంచు కుసుమ శ్రావ్యతం మా ధుర్యత దళ ప్రదామ్
--(())--
గౌరవనీయులైన సభ్యులందర్కి నమస్కారము తెలియపరుస్తున్నాను 2012 నుండి 10 బ్లాగుల్లో తెలుగు సాహిత్యాన్ని వ్రాసుకొని పేస్ బుక్ లో గత మూడునెలలనుంచి రోజువారీ దినపత్రికగా పోస్టు చేయటం జరిగింది
ఎవ్వరూ చూడనందున గత్యంతరం లేక ఇక్కడ పోస్టు చెతున్నాను
--(())--
నేటి పద్యాలు..ప్రాంజలి ప్రభు.. నవరత్నాలు
గురువు:- తాను ఉంటేనే ప్రత్యక్షమైనా, పరోక్షమైనా ఉండేది. కాబట్టి తానే 'అపరోక్షం'.
ॐॐॐॐॐ
భక్తి అనేది జోలపాట; జ్ఞానం అనేది మేలుకొలుపు పాట.
ॐॐॐॐॐ
జనన మరణాల మధ్య లో తానుంటే తాను జీవుడు.
తనలో జనన మరణాలు ఉంటే తాను దేవుడు.
🕉🌞🌎🌙🌟🚩
--(()) - -
అందరికి దీపావళి మరొక్కసారి ప్రాంజలి ప్రభ శుభాకాంక్షలు 05-11-2021 తెలుపుతున్నది
రెండురోజులు నేను వ్రాసిన పద్యాలు పొందుపరుస్తున్నాను
మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ
ఉమాత్మజం గజేంద్రాస్యం ,
కుమారాగ్రేసరం వరమ్ !
రమేశాది సురైర్వంద్యం ,
నమస్యంతం స్మరామ్యహమ్ !!! "
"దీపావళీశుభాలను
దీపాలవెలుఁగుజగతికి దివ్యాకృతియున్
పాపహరణంపు ఫలమును
సాపేక్షముగనొసంగును ' శార్ఙ్గి ' ముదమునన్ !!! "
ఉత్పలమాల
కయ్యము వల్లనే విషయ కావ్యము పెర్గియు బాధాకల్గుటన్
నెయ్యము వల్లనే మనసు నాణ్యత తగ్గియు చెప్పఁలేకయున్
కాయము వల్లనే కధలు కానివి పల్కులు నమ్ముటేయగున్
సాయము జేయువాడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్
కాలుమోపడె ఆంజనేయుడు కాలనిర్ణయ మేలు గన్
మేలుచేసెడె భక్తి శిధ్ధుడు మాయనంతయు తెంపెనన్
ఆలియైనది సీతమాతయు రామచంద్రుని శక్తియున్
రాలిపోయెడి దుష్ట బుధ్ధి యు రావణాసుర పుణ్యమున్
ధన్య వాదము తెల్పు చుంటిని ధ్యాన శర్మకు వందనం
మాన్యవర్యులు మోనమేలను మానసమ్ముకు వందనం
శూన్యతెందుకు విద్యవేక్తవు సర్వశ్రేష్టవి వందనం
అన్య దోషము వల్లనైనను మీకు తెల్పెద వందనం
పంజలి ప్రభ గా నేటికీ "9" సంవత్సరాలు ఆదరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు
ప్రాంజలి ప్రభ -- నేటి పద్యాలు -- 03-11-2021
నునుపైనచందురుమొగము
కనువిందగురూపుసొగసు కౌశలబుద్ధిన్
మనమున స్మరింతు నీదున్
సులభవరఫలద ! దయాబ్ధి..'సుబ్రహ్మణ్యా' !!! "
----
కాలు ఉన్నవి క్షేత్రములు తిరుగుటకు,
చేతులున్నవి దేవుని మొక్కుటకు,
ముక్కుఉన్నది పరిమళాలు ఆఘ్రానించుటకు,
నోరు ఉన్నది దైవ స్మరణ చేయిటకు,
ఇందు ఛందస్సులేదు,అలా వచ్చినవి రాశాను,
తెరువు జీవుల కెల్లను తెలుపు చేయి
కాలు మోపెను బలిపైన కళల మాయ
ముక్కుతో వాసనలు పెట్టి మనసు చెప్పు
నోటి వాక్కి లు తప్పిన నరక మయ్యె
నోరు మంచిదైతే ఊరు నచ్చ వచ్చు
చేయి చాచి బిచ్చమడిగే చేతకాక
కాలు ఊపికూర్చొనుటయు కాల మాయ
ముక్కు మూసి జపము ఫలం మనసు మార్చు
నోరు విప్పి నటన చూపి నచ్చ జెప్పు
మారు మాట మనసు వేట చేయి జాచు
చేరు వారు చేత నైన కాలు చూపె
కోరు కొనుట కరణ జూపు మక్కు తపన
ఉత్పలమాల
నోరుతొ పల్కులే మనసు నాట్యము చేయుట సంభవమ్ముగన్
చేరువుగాను చేయి పని చామర మూపుట వక్తమవ్వుటన్
బోరున ఎడ్చేనే పవన మందక ముక్కన రోగముండుటన్
ఆరును నూరైనా పలుకు ఆటల కాలుడు మూర్ఖపల్కులే
((()))
మాత్రా సిద్ధము..19
కాలజ్ణానము మనము పొందే దెప్పుడు
సమయాను కూలములగ మారే దెప్పుడు
మనలో విషయ వాంఛలు తీరే దెప్పుడు
మనము నిజముగా బ్రతుకు సాగే దెప్పుడు
మనలొ జీవిత సమరం మారే దెప్పుడు
మన ఇరువురి కలలు నెరవేరే దెప్పుడు
పాపాలు కోపాలు తీరే దెప్పుడు
ఈ పృధ్వీ శాంతి తో ఉండే దెప్పుడు
ప్రకృతి మనకు రక్షణగ ఉండే చెప్పుడు
చల్లని గాలి దేహం తాకే దెప్పుడు
దేహములొ తాపము చల్లబడే దెప్పుడు
అదునుగా వర్షములే కర్యుట దెప్పుడు
ఇడ్లీ వడా సాంబారు తినే దెప్పుడు
పెసర దోసె ఉప్మా తో తినే దెప్పుడు
పూరి ఆలు ఉల్లి కూర తినే దెప్పుడు
అల్పాహారం తొ కడుపు నిండే దెప్పుడు
ప్రాంజలి ప్రభ -- నేటి పద్యాలు 1--11--2021
నమశ్శివాయ సోమాయ ,
కపర్దినే భవాయ చ !
సికత్యాయ చ ప్రవాహ్యాయ ,
రుద్రాయ హి నమోనమః !!! "
IIIIII -- UIUIU నేటి ఛందస్సు
కలల మెరుపు... కావ్య మాయలే
కళలు గెలుపు.... కల్లొలమ్ము లే
మలుపు కథలు.. మానసమ్ములే
గెలుపు మనిషి ... గమ్యమౌనులే
మరువ వలదు... మాన్య బత్కులే
కరుణ గుణము... చూపవచ్చులే
తరుణ మయిన... తత్వమాయలే
బరువు మరుచు.. . భాగ్యమేనులే
నవవిధ మున .. నాట్యమాడు లే
అవయవములు... ఆట పల్కు లే
భవభవములు... బాధ్యత వ్వులే
సవరమలులె... సాధ్యమౌను లే
మధురిమలుగ.. మల్లెజాజులే ..సమ
విధి వల్లను ....విద్య పొందుటే
పంచ పది
మాటలొప్రేమ మనసుకే మగువ బంది
చేటు గాఉన్న మత్తుయే చెదలు నాంది
కాటు వేయు మానవతకు కాటె నాంది
ఆటు పోట్లను ఎదుర్కోవాలి బంది
అటుయిటుఎటైన తప్పఁదా జీవికి ఈశ్వరా
శార్దూలం
కాలమ్మే కలగా సహాయ తలపే గాయమ్ము తెల్పేను లే
భోలేగా వుము నాకహానియగు మామూలడ్డు నీకేటికిన్
ఆ లేహ్యం తినగా సుఖాల వలపే ఆదర్శ దా౦పత్యమే
కల్లోల౦ మనకే విశాల వినయం కావ్యమ్ము సాహిత్యమే
(()))
శిఖామణి
ససజగ.. సభరలగ. IIU II..UIUIU..IIUUII..UIUIU
చరితార్ధము జాతినంతనే
వరమాయేనులె సామదానమే
కురిపించిన కార్యమెక్కడో
మరిపించేనులె మోహమెక్కడో
తరుణమ్మున తాపమంతయే
అరుణోద్వైతము వేల్గు లన్నియే
పరువన్నది బాధతోనులే
పరువాలేదని మానసమ్ముగా
(309)శ్రమకు జారేది చమటతో రవ్వ చుక్క
ఎరువు తో పెర్గు అనుబంధ ఎదలొ మోక్క
మనసు మాటలే బతుకు లో మేలు లెక్క
ప్రేమ పంచి యు ప్రేమించి ప్రభల గుక్క
ప్రణయ కావ్యము పక్కా చెప్పు అక్క ఈశ్వరా
(310) వర్షమే రైతు బంధువు వలపు పిలుపు
పుడమి తల్లి సేద్యానికి పులక రింపు
ఎరువు మాగాణి భూములు యదను కలుపు
తరువు లన్నియు ఎదుగుట తపన తెలుపు
మనిషిని గమనించే సింధువే ఈశ్వరా
(311)కలలొ కామించు మనసులు కావు ఒకటి
మనలొ ప్రేమించు హృదయాల మనసు ఒకటి
చెరలొ చిక్కిన చైతన్య చరిత ఒకటి
ఇలలొ ఈశ్వర లీలల ఇల్లె ఒకటి
వేరుగా అనేది ఏది లేదు నీమాయే ఈశ్వరా
(312) మనసు సక్రమ రీతిలో మార్చు కొనుము
మాన నీయత బ్రతికించు మనసు వినుము
గౌర వించడం నేర్చుకో గురువు తనము
తోటి వాళ్ళని ప్రేమించే ఓర్పు గనుము
నిస్వార్థంగా కృషి యె నిత్య తృప్తి యే ఈశ్వరా
చంపకమాల
కలకల లాపమైన కలకావడి కుండల కావ్య నాదమే
కలువల కాంతులైన కళ కాంతిగ వుండుట దివ్య ధామమే
పలుకుల భాష యైన పలు పాపపు మాటలు పల్కె కక్షగా
వలపను పాప మెట్టి పగవారల కుంవలదింక దైవమా
వృత్తము
అండగ ఉండుటయు ఆర్తి విషయములగుటన్
బండన బీముడుగ యుద్ధ మలుపు గలుగుటన్
దండన దోషములు ముందె తెలియ పరుచుటన్
ఖండితశీర్షములు నవ్వె కదనతలమునన్
ఉత్పలమాల
అండగ నుండెనే సకల ఆత్రుత సేవలు మెండుగవ్వుటన్
బండన భీముడే మనసు బాధ్యత పొందియు మేలుచెయ్యుటన్
దండన తిర్పుగా దమన దారిగ పోవుట ధూర్తలక్షణమ్
ఖండిత శీర్షగుచ్ఛము, పకాలుననవ్వెను యుద్ధభూమిలో
పాండి బజారులో వెలుగు పైకము లేకనె ఖర్చుకై సదా
మండిన పొట్టతో కనలి మాడిన మాన్యులు రామరావెగా
భండన భీముడై చరిచె భారత భూమిన యోడెగా భయం
ఖండిత శీర్షగుచ్ఛము, పకాలుననవ్వెను యుద్ధభూమిలో
((()))
దత్తపది 30-10-2021 అపుడు, ఇపుడు, ఎపుడు, ఎక్కడ, :తే గీ.లో
ధర్మ దేవత నడయాడె ధరణి "నపుడు "
ధర్మ దేవత విడనాడె ధరణి ""నిపుడు
ధర్మ దేవత నిలుచునో ధరణి "నెపుడు "
ప్రజలు సుఖ శాంతు లొందుదు "రెక్కడైన !!..
కాల మాయలు మంత్రాలు కళలు అపుడు
గోల ఆటలు వేడుక గొప్పలిపుడు
యెల్ల వేలలు కష్టాలు ఏడ్పు నెపుడు
ఏది అన్నను నమ్మరు ఎక్కడైన
మాట ఏది అన్న మనసు బాధ నపుడు
వట్టి పలుకు అన్న వణుకు నిపుడు
ప్రజల సుఖశాంతి పొందేను రెక్క డైన
సత్య వాక్కు ఫలము సరయు నెపుడు
ఆమెలొ కన్నులు కోరెను.. నేనును అందులొ చుక్కలుగా
ఊహలు వెల్లువ వెచ్చన... నేనును వాస్తవ ఊహలుగా
మారని బొమ్మల పక్షి ని...నేనును అందము పొందిక గా
గమ్యము ఒక్కటి అయ్యెను.. ఆమెవి పాదన పొందికగా
నిన్నటి చీకటి నైతిని...రేపటి వెన్నెల గుంటినిఈశ్వరా
రానని రానని రాణిగ రంజుగ రాతిరి రాగిని గా
చాలని చాలని జాతక చామర కాపులు ఊపులుగా
మేలని మేలని మాలిని మేదిని మోహము మేనులుగా
ఆకలి ఆకలి ఆత్రము ఆత్రుత ఆశలు తీర్ఛెనుగా
పూలను గృచ్చితి మాలగ మాలిక నందముగా ఈశ్వరా
ప్రతి ది అందమే మనసును బట్టి మారు
పలుకు అందమే వ్రాతను బట్టి మారు
అలుక అందమే ఆరాద్య బట్టి మారు
చినుకు అందమే ఉనికిని బట్టి మారు
వయసు అందమే కొన్నాళ్ళు వరస తెల్పుఈశ్వరా.
నమ్మి న నమ్మక మంతయు చూసిన చెప్పుట లేదుకదా
కమ్మిన మాయలు కాలము తీర్చును వారును లేరుకదా
చిమ్మిన చోటున చిత్రము చూడుము అన్నిట లేదుకదా
నమ్మక మున్నను నాన్యత మేలును మంచిది ఔను కదా
అమ్మగ మాటలు తెల్పి తి బిడ్డగ అర్ధము ఉండు కదా ఈశ్వరా
నీవును ఊహగ తెల్పితి తెల్లని చల్లని నీడలు గా
నేనును వాస్తవ మైనది నెమ్మది పల్కిత వేడుక గా
నీవును కళ్లలొ ఆశలు తీర్చును సోయగ సొంపులు గా
నేనును నమ్మక మైనది ప్రేమను పెంచును ఆత్రుత గా
అప్పుడు ఇప్పుడు నెప్పుడు అక్కడ ఇక్కడ శోభ ఈశ్వరా
అపుడు తిండి కైతె పదిమంది వసంతి
ఇపుడు తండులాలు గృహ మందు నసంతి
ఎపుడు కుండ బొచ్చల పరం విలసంతి
ఎక్కడ రండ నా కొడుకు లెల్ల హసంతి
వచ్చునా మా మధ్య వసంత మా ఈశ్వరా.
ఏమని పాడెద నిప్పుడు నేనిట నీహృది వేదనలో
సోముని వెన్నెల సొంపులు లేవిట సుందర యామినిలో
నామది నీమది ఒక్కటె మేలును కోరును ఈవనిలో
నమ్మిక వీడక నాట్యము చేయకు నేనుగ నీవుగ కల్సుటలో
నామదిలోగల మాటల పల్లకి మోయును ఎవ్వరు తెల్పుములే ఈశ్వరా
అపుడే మనలో కథలే కదిలే
ఇపుడే ఇలలో ఇదిగా మెదిలే
ఎప్పుడో అనెనా అదియే నిజమా
కలి ఎక్కడ ఉండిన అక్కడకలే
మనసే మనదై మమతే మధువే ఈశ్వరా...
వంట గదిని మల్లెపూల వాసన వీచెన్
ఎట్టి కధలు యైన మాయ పల్కుల వల్లెన్
మట్టి మహిమ తెల్సి పూజ చేయుట వీలున్
గట్టి అనిన ఓటి అయ్యె మాటల వల్లన్
మేటి మనసు మారి మేలు జర్గట ఏలన్ ఈశ్వరా..
సోయగాలు
ఆప్తులు ఆదరణ కలలే --- అపుడు ఆశ మిగులు
ఇప్పటి పలుకులన్ని కలే -- ఇపుడు ఏమి మిగులు
ఎప్పుడో అన్నవాక్కులు బట్టి -- ఎపుడు తీర్చు అప్పు
ఎక్కడ ఏదైన జరిగినా -- అక్కడ అలక లేలు
ప్రాంజలి ప్రభసోయగములు
సీస పద్యము
జీవన యానమే ఈతలవైనము
ఎగుడు దిగుడులను .. ఎక్కడనరు
యవ్వనం కదలిక .. యరుక తెల్పనులేరు
కధలని వదిలారు..యపుడనరలె
వ్యసనాలు వల్లనే ..వలలోకి చిక్కే ను
చదువులో మాయలు ఎపుడు అనను
విచ్చల విడిగా ను ... వివరణాత్మక గాను
విధి ఆట అయ్యేను.. వినయ మెపుడు
పంచపది
మమేక మానాని మనోవితాని
అనేక నామాని విశేషతాని
వివేక వేషాన్ని వివాదనాని
వివేశ సాతాని నికేతనాని
జనేన సామర్థ్య పరీక్ష తాని ఈశ్వరా
((())))
తప్పు పలి (కారు) గద్యమే తగదు నీకు
వాక్కు ధార(లా రి)మరి మ వరద లాగ
కధలు గబగ(బ సు)ఖముగా కళలు తెల్పె
కొందరు ఎదు(రై లు)ప్తము కలలు తెల్పె
గురువు లఘువు చేసి కుంచించి కుంచించి
లఘువు గురువు చేసి లాగి లాగి
కవిత చెప్పు నట్టి కవిగులామును బట్టి
ముక్కు కోయ వలయు నొక్కి పట్టి
శిష్య నడిగె గురువు శివుడు గొప్పా గంగా
పార్వతీ న ఎవరు గొప్ప తెలుపు
బుర్ర గోగి తెలిపె కవిని నేకానులే
అందు లోను గురువు చెప్ప గలరు
లేదు ఓటమి యు కరోన లలిత మాయ
నేడు రష్యా లో నేనున్నా ననియె గుర్తు
నీలి నీడలు కమ్మె నాన్య త స్పుత్నిక్
బతుకు జనులలో నిజము భయముగా తోడు
బస్సు వేగప్రయాణము భరిత ముగను
కారు సుఖమిచ్చు అతివేగ కలలు తీర్చు
లారి వస్తుసామగ్రిని లాహిరి గను
రైలు విశ్రాంతి గకదలి రమ్య పరచు
29-10-2021
రైలు సఖముగా హాయి రంజిల్లు నిద్ర
బస్సు వనికించి వణుకు భవ్యమే శోభ
కారు విడిదిగా ఆగి కదులుట వీలు
లారి ప్రకృతి సంపదకు లాహిరి లలన
తమరు పలి (కారు )గా!నిట తప్పు లేక
వాక్సుధా ధార( లారీ )తి వరద గాగ
నేటి కాల కొలం (బస్సు )నిక్క మిదియె
ప్రాంజలి ప్రభల( రైలి )ట పరుగువెట్టె
(ధారలు +ఆరీతి=ధార లారీ తి 🌹రైలు +ఇట =రైలిట 🤣
ప్రాంజలి ప్రభ।। నేటి పద్యాలు।।28-10-2021
రచయిత।।మల్లాప్రగడ రామకృష్ణ శర్మగారు
వెంకటేశ్వరరావుగారు, గోపాలాచార్యులుగారు ప్రాంజలి ప్రభకు పంపినవి
"కరిముఖ గణేశ నిన్నున్
గిరిధరపూజిత ! యనిశము కేలుముడుచుచున్.
సురవరభూజసమానా..
మఱి - మఱి కోరెద సమస్త మాన్యసుబుద్ధిన్ !!! "
----
నీల కంఠుని లీలల నీడ లోన।
స్నేహబంధమై నిల్చె నే, చెన్ను మీర ।
సాధనంబున తెలుగు ఝరులు సాగ
ప్రాంజలిఘటించి తెల్పితి ప్రభల శోభ
🙏🙏
విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ
లంబోదరాయ సకలాయ జగద్ధితాయ ।
నాగాననాయ శృతియజ్ఞ-విభూషితాయ
గౌరీసుతాయ గణనాథాయ
వక్రతుండాయ నమో నమస్తే ఈశ్వరా
సమస్యను పూరించుట ।।।।।
బ్రతికి యున్నాడ జీవచ్చవంబ నగుచు
తేటగీతి
చితికి పొయ్యేటి వయసు కు చింత లేల
మతికి మాయలు చేరుట మార్గ మయ్యె
వెతికి వేసారి పోతిని వేకువ మును
బ్రతికి యున్నాడ జీవచ్చవంబ నగచు
తప్పు చేసి యు తప్పించి తిరుగు వాని
ముప్పు రాదు లే అనుటయు ముసుగు తీసి
అట్టి మనిషిగ మృగము యే మనన ఏల
బ్రతికి యున్నాడ జీవచ్ఛవంబు నగుచు
ప్రకృతి లీల స్పర్శ లు చేరి ప్రీతి కొరకు
ఇంద్రియాలు గా భీభత్స ఈప్శితమగు
భౌతికము జీవ వైవిధ్య భాగ్య రోగి
బ్రతికి యున్నాడ జీవచ్ఛవంబు నగుచు
ఆ।వె।
ఆకసానలేవు ఆర్కుని రేఖలు
నీలమైనవేళ నిజము చూడు
పొందులోని సుఖము బుద్ధినే యేమార్చు
నీలమెఱ్ఱబాఱె నీలవేణి
ఆశపాశమున్న ఆత్రత యే యున్న
ఆలి మాట విలువ లిచ్చి బ్రతుకు
మనసు చేరి ప్రీతి మనిషిగా బ్రతికిన
నీలమెర్రబారె నీలవేణి
ఆ।। వె।। అంశం ::నీలము +ఎర్రబారె =నీలమెర్ర బారె నీలవేణి!
గరళ కంఠు కంఠ కాంతి యేమి? సతిని
గాంచ!గంగ కనుల కాంతి యేమి?
భవుడు తాండ వించు పాదంబు నెవరిదో?
నీల మెర్ర బారు నీలవేణి!!
హనుమ తెల్పితి యోగక్షే మములు అడుగు
రామ లక్ష్మణ వానర రానతిగను
స్త్రీ ల దుఃఖము తెల్వదా సరయు చున్న
బ్రతికి యుంటిని జీవచ్చవంబు నగుచు
బ్రతికి యుంటిని జీవచ్చవంబు నగుచు 🌹అర్జునుడు 🌹
తే, గీ,//అతిరధ మహారధ కుటిల యాజి యందు //
ఘోర కర్కశ వ్రేటుల గూలిన నిజ //
పుత్రుడభి మన్యు గాంచి పార్ధు డనియె //
బ్రతికి యుంటిని జీవచ్చవంబు నగుచు //🌹🌹
[ మంత్ర ఆగమ వైదిక మందిరములు
విశ్వ విజ్ఞాన సంపద విజయ వాంఛ
లోక జనుల హృదయ శాంతి కోరు జపము
సంఘసంస్కరణ గ దైవ సతత నిలయ
రూప రసరమ్య భావమే రమ్య పరిచె
దీప వెలితిగా మనసునే దీప్తి పరచె
ప్రాప్తి భీతి తో మహిళను పలక రించె
తృప్తి కలిగించె మదిలోన తృణము గాను
మతమోడ్యమునకు చిక్కె
యువతరం ప్రేమంటూ కక్కె
ఆస్తుల తో అహంకారం దక్కె
ప్రేమల పెంపకానికి డబ్బు దిక్కె
చరమ గీతం పాడాలని మోక్కె ఈశ్వరా
నావడిని వీడి జాబిలి జాడ జేరి
నవ్వుతూ నటనలె జూపితి నాకు ఇపుడు
పున్నమి వెలుగు మించిన పుడమి జూపు
కన్నతల్లి కీ కృష్ణ య్యా కళలు తీర్చు
గాంధీ పుట్టిన దేశమా ఇది
గాడ్సే లు ఉన్న రాజ్యమా ఇది
గాయాన్ని పెంచే దేశ రోగమ్మది
శాంతి లేక దౌర్భాగ్య స్థి ఇది
కపోతాలను కాల్చుకు తినే ఈశ్వరా
ఉ// కాలము మించి పోవగనె కార్యము సాగునె సారసాక్షిరో
మేలపు యాటలన్ మురువ మేలగు కార్యము వీగిపోవదే
చాలునె రైతుబిడ్డవుగ శారదరాత్రులు యాటజూడగా
నీలము లెఱ్ఱబాఱెరమణీ రమణీయవిలాసరేఖలన్।
కాలము నీదినాదియును కొదులె కార్యము సక్యతేయగున్
గాలము వేసినా మనసు గాయము చెందుటె అవ్వు చుండు టన్
మేళము లేలనో మనకు మాయల రాత్రులు యాటజూడగన్
నీలము లెర్ర బారె రమణీ రమణీయ విలాసరేఖలన్
ప్రాంజలి ప్రభ।। నేటి పద్యాలు।।27-10-2021
రచయిత।।మల్లాప్రగడ రామకృష్ణ శర్మగారు
ఉడుపతిసొగసుల రాముని
నిడుదఁపు భక్తుఁడ మగఁటిమి నిపుణతనీదౌ
కడుకరుణార్ద్రహృదయమున
వడిగావచ్చిననుఁగనుమ।। పావని।।జోతల్ !!! "
----
"ఉడుపతిసొబగులవదనా।।
నిడుదఁపులావునుమగఁటిమినిపుణతనీదౌ
కడుకరుణార్ద్రహృదయమున
సుడిబ్రతుకునణఁచు 'సుబ్రహ్మణ్యా' !!! "
---- (వెంకటేశ్వరరావు గారు)
అంశం : కాలు, చేయి, నోరు, ముక్కు (దత్తపది)
కాలు కాలిన పిల్లిలా కల్ల లాడు
చేయి చాచియు లంచము జపము జేయు
నోరు విప్పియు నిజముగా నటన చూపు
ముక్కు ముక్కెర మోజుగా మక్కు వాయె
కాలు తోను నడక వ్యాయామము మనకు
చేయి చాచి నన్ను నడిగి జూడు
నోరు మాట లేల ఒక్కపనియు చాలు
ముక్కు మూసి జపము మనకు వద్దు
కాలు కదులునపుడు కష్టించి బ్రతుకక
చేయితోటి సేవ చేయకుండ
నోటి పలుకులందు నొప్పింప జేయుచు
ముక్కు మూయువాడు మూఢుడతడు!
(ఈరంకి శర్మ )
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువు చుండ
చేత జప మాల దాల్చియు శివుని దల్ప
ముక్కు నోరు మూసుకొనుచు మూల నున్న
కాలుని పరివార వెతలు గలుగ వెపుడు
ఉదయ కాలమందేగ!మా కోదనంబు!
ప్రభలు ""ప్రభవి""గా స్వాగతింప వెలుగులవె!
యింటి యిల్లాలి చూపులు యింత దనుక!
వెదకు చుండును ""సంధ్య ""యై వేడ్క తోడ!!
ముక్కుచు నుండెడి నహల్య పుణ్య మేమొ?
కాలువ గుహుడు దాటింప ఘనత యేమొ?
చేయి యొసగ విభీషణు శీల మేమొ?
నోరు శబరి పండ్లు తినగ నోము యేమొ?
(గోపాలాచార్యులు)
అధికార అహముయే తోడు నీడలే
విధిగ విజృంభణ।। వినయ వేటలే
ప్రాణాల పరముగా ।। పదవి ఆటలే
గాల్లో దీపాలుగా ।। గాలి మాటలే
వాగ్దాన వాక్కులు।।।జనుల ఆశలే ఈశ్వరా
మానస మౌనుని మాధురి వాదిని
మాకల తీర్చని మాయల మోహిని
మాదశ బుద్ధిని మాధవ మానిని
మాలిని యాశని మాతృక వాసిని
మంగళమాయెను మానసమందును ఈశ్వరా
ఉడుపతిసొగసుల రాముని
నిడుదఁపు భక్తుఁడ మగఁటిమి నిపుణతనీదౌ
కడుకరుణార్ద్రహృదయమున
వడిగావచ్చిననుఁగనుమ.. పావని..జోతల్ !!! "
----
"ఉడుపతిసొబగులవదనా..
నిడుదఁపులావునుమగఁటిమినిపుణతనీదౌ
కడుకరుణార్ద్రహృదయమున
సుడిబ్రతుకునణఁచు 'సుబ్రహ్మణ్యా' !!! "
---- (వెంకటేశ్వరరావు గారు)
ఓం
రిప్లయితొలగించండి