5, నవంబర్ 2021, శుక్రవారం

ఆరాధ్య భక్తి లీల (3)

 



ద్విపద - రాధాకృష్ణ లీలలు - 11


రమణీ లలామవు రమ్యత రాశి

కమనీయ కనులతో కామ్య త రాశి


రాధవు రాసలీలలు వేళ ఇదియె

వేధన మాపేటి వెలుగు గా ఇదియె


వేణు గోపాలడు వేడుక లీల

అణువణువు తపించు యానంద లీల


చిన్న వాడివి యైన చిలిపిగా చేష్ట

వెన్న ముద్దలు ఆరగించావు చేష్ట


మోమున మంద హాసము తోడ పిలుపు

కాముని మరిపించె కధలుగా పిలుపు


నువ్వుల రేడువై నటనలే నేడు

పువ్వుల మధ్యనే పురివిప్పె నేడు


పుత్తడి బమ్మైన పుడమియే రాధ

చిత్తము తెల్పును చన్మయ రాధ


చోరుడై శోభను పొందిన ఘనుడు

వీరుడై విజయము నిచ్చిన ఘనుడు


వేణు  గో పాల వే డుకొనగబాల

అణు వణు వెరిగిన యానంద పాల


చిన్న కృ ష్ణానీవు చిరునవ్వునవ్వ

వెన్నదొంగా నాకువెలుగులే నివ్వ


యమునా తటమునయదునంద గావ 

మోమున మదుహాస  మొలికింపదేవ


పువ్వులా రాధమ్మ పుత్తడీ బొమ్మ

నవ్వులా ఱేడుకు నచ్చినా వమ్మ


శొభగులా చెలికాడు సోకు లే దోచు

శోభ నే యిచ్చిన  చోరుడై దాచు


కాచిన పాలనూ కడుపార  గ్రోవి

దోచిన వన్నెలను  దొరుకునే తావి


మంతనములు చేయు మధుర కిట్టయ్య

చెంత నే చేరినా చెలిమి కిట్టయ్య


కోపమొచ్చినయమ్మ రోటినే గట్టి

పాపమనుచు మళ్ళ పరుగులే  పెట్టి


రేపల్లెలో వెల్గు నంద గోపాల

మాపల్లె   సుకుమార మధుర  గోపాల


గోవుతఱువులతో గోకులా నంద

కావు యడవినమమ్ముకమలనంద

*****

మౌనాలు మదిలోకి ముత్యమై పిలిచాయి

గుండెల్లొ శబ్దాలు  గురుతుల్ని తడిమాయి 

బాధలే నా వెంట  బంధమై నడిచాయి 

చిరునవ్వు  దీవెన చెలిమిగా  మరిచాయి.. శ్రీ వేంకటేశా


ఆశలే అలలుగా ఆకులై రాలాయి 

నిశలన్ని కాలమై నా వెంట తరలాయి

తపనతో మనసుగా తరలేది ఎటకోయి 

చినుకులే నా వెంట చెలిమిగా నడిచాయి .. శ్రీ వెంకటేశా


రాలాయి కన్నీళ్ళు రవ్వలా ఎందుకోయి 

జల్లుల్లొ తడిసియు జపముగా కలిశాయి  

దూరంగ రమ్మంటు పూర్తిగా పిలిచెయి 

విచ్చిన దారంత మిణుకుల్ని పరిచాయి... శ్రీ వెంకటేశా 


చినుకుగా నిశబ్దము చీల్చింది చిరుహాయి 

నవ్వులే వర్షంలొ నటనలై  రాలాయి 

కన్నీటి తరగల కలలగు చెలిహాయి 

ఓప్రేమ తెమ్మెర ఓర్పుయై వీచాయి...... శ్రీ వెంకటేశా 


నడకగా తడబాటు నగుబాటు కలహాయి 

పరికించు హృదయపు పాదాలు తడిమాయి 

ఎంతెంత దూరమో ఎలసాగు తున్నాయి 

గమ్యాలు దరికిగా కాలమై చేరాయి.... శ్రీ వెంకటేశా

***

రాధాకృష్ణ రాసలీల - 10


నీ నవ్వు పిలుపే నాహృద్య0మందేను ప్రేమలే 

నీ నవ్వు వెలుగే  నాకన్నుల్లో చూపు   ప్రేమలే 

 

నీ లక్ష్యము యె ఈ బుద్దీ - మేధస్సు గానులే చ్చెలీ   

నీ దాహము యె ఈ శక్తీ   - నీమాట లేనులే చ్చెలీ 

నీ నిర్మల విభావమ్మే - ఈ మానసమ్ములే చ్చెలీ     

ఔ నంటివిలె కాదన్నా - నేబత్క లేనులేచ్చెలీ 

 

నీ మాట వినయమ్మేలే -  నీ స్పర్శ కామమే చ్చెలీ 

నీ ఆట సహనమ్మేలే  - నీ పొందు సౌమ్యమే చ్చెలీ 

నీ వేట మధురమ్మే లే -  నీ చూపు ధర్మమే చ్చెలీ 

నీ బాట సమయమ్మే లే - నీ ఆశ దాహమే చ్చెలీ 


జీవమ్ము ముడి ఐనావే  - జీతమ్ము కోరికే చ్చెలీ 

భావమ్ము దడి  ఐనావే  - భాగ్యమ్ము ఆశలే చ్చెలీ 

రోగమ్ము కథ ఐనావే - రమ్యమ్ము వాసనే చ్చెలీ  

దైవమ్ము కరుణమ్మేలే  - ధర్మమ్ము రీతినే చ్చెలీ 

     

నీ నవ్వు పిలుపే నాహృద్య0మందేను ప్రేమలే 

నీ నవ్వు వెలుగే  నాకన్నుల్లో చూపు   ప్రేమలే 


--((()))--

*****

రాధాకృష్ణ - రాసలీల శోభ -9


రాధా సుఖము లన్నీ ప్రతిభ చుట్టూ 

ప్రేమ వలయానికి చిక్కిన శోభలే

కమ్మటి కలలకు చంద్రోదయం శోభగా

హృదయానికి అందాలి సూర్యోదయం శోభలే


సుందర దరహాస చంద్రబింబమై

విందుగ వినసొంపు ప్రతిబింబ మై

పొందుకు మనసాయినే ప్రతిభ గా

చిందుకు మదిలో వినమ్రత వజ్రమే


కన్నుల కాంతుల ప్రతిభయే

వెన్నెల మోమున ప్రభలుగా

మన్నిక దర్పణం ప్రతిమలుగా

కొలనులో వివస్త్ర చూపు వజ్రమ్ముయే


చూపు మేర నిలిచే చిత్ర ప్రభ లే

చిత్తమునందించే చంచల ప్రభ లే

జాలి చూపు సఖి హృదయ ప్రభ లే

ఎంత వింత మోహపు మనసు ప్రభ లే


వయ్యారాల నృత్య భంగిమ ప్రభ లై

సొగసు సోయగాల మల్లెల ప్రభ లై

శృంగారం ఒలికించే హంసనడక ప్రభ లై

సవ్వడులు సృష్టించే కలయికలో ప్రభ లే


మధురంగా మారిన ప్రకృతిలో శోభ లే

అధరాలపై రసగుళికల చందన శోభ లే

జాలువారు తుషారబిందువుల శోభ లే

తన్మయత్వంతో మనసులోమ్రోగే శోభ లే


రాధా సుఖము లన్నీ ప్రతిభ చుట్టూ 

ప్రేమ వలయానికి చిక్కిన శోభలే 

కమ్మటి కలలకు చంద్రోదయం శోభగ

హృదయానికి అందాలి సూర్యోదయం శోభలే

--((()))--


రాధా కృష్ణ రాసలీల - ప్రణయమిదే (😎

రాధా మౌనంబు ఏలా -రగులుతు కులుకై - 

రమ్య దాహమ్ము పిల్పే 

బాధా దాహంబు తీర్చా -  బ్రతుకున వెలుఁగై - 

భాగ్యమంతయు నేర్పే 

చేదా మోహంబు ఆశా  - చరితకు పిలుపై  - 

చిత్త చాంచల్య మల్పే 

భేదా భావంబు వద్దే  -  బలమున పనికై  -  

భద్రతా ప్రేమ  నీదే   

నీవే సర్వమ్ము  గాదా - నిజమున పిలుపై - 

నేడు ప్రేమమ్ము రాధా 

నీకై  వేచేను రాధా -   నియమము తలపై - 

నేడు పర్వమ్ము రాదా 

నిన్నే కోరేను రావా -  నిలకడ మనసై  - 

నేడు సర్వమ్ము రాధా   

నన్నే మార్చేవ రాధా - నటనల తెలివై - 

నాకు ధైర్యమ్ము బోథా 

పూవీ డెందమ్ము నీకే - ముదముల సెలయీ - 

మోవి యందమ్ము నీదే 

ఊవీ ఉయ్యాల నీవే -  ఉదకము వరమూ  - 

ఊపిరందమ్ముఁ నీదే 

తావీ పువ్వైన నీవే  -- తమకము తపమూ  -  

తాప సమ్మేను నీదే    

భావీ భాగ్యమ్ము నీకే - భద్రతయు కనుమా - 

భావ భావమ్ము నీదే 

రావా చూడంగ రాధా - బ్రతుకున వెలుఁగై - 

బాట చూపంగ లేవా 

కావా హృద్యమ్ము నీవే - కలలుగ కొలువై  - 

కాల మంతాను నీదే 

లేవా మానంబు నీదే  -  లయలుగ నళినై - 

లాలీ పాడంగ రావా 

జావా ఉంచాను నీకే  -  జలజల  నదివై - 

జాత రంటాను నీకే 

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ    

స్రగ్ధర UU UUIUU - IIII IIU - UI UUIUU 

21 ప్రకృతి 302993

******

రాధా కృష్ణ రాస లీలలు- (7) 


రాధా ఇది ఒక చక్రం 

చక్రమే కాలం  కలం       

కలం వ్రాతలు కవిత్వం 

కవిత్వమే మనసుకు శాంతం 


అవునా ఇంకా 


పుస్తకము దేహముయె

దేహముయె దాహముతొ  

దేహముయె కాలం


దేహముయె కాలము తొ 

కాలము యె  మిత్రముతొ 

మిత్రుడుయె కాలం 


మాటలుయె ఆకాలితొ 

ఆకాలి యె సాధనతొ  

సాధనతొ కాలం 


సాధన యె శోధనతొ 

శోధన యె ఆశల తొ 

ఆశలు తొ  కాలం


ఆసలుయె ప్రేమలు తొ   

ప్రేమలుయె జీవితమె  

జీవిత మె కాలం 


జీవితమె ప్రొద్భవమె  

ప్రొద్భవమె ప్రేరణయె 

ప్రేరణ తొ  కాలం 


ప్రేరణయె ఆయుధము 

ఆయుధమె ఆశయము

ఆశయమె కాలం 


దీపముయె వెల్గులుగఁ 

వెల్గులు యె జిల్గులుగ

జిల్గులు కాలం 


దేహముకు గాయములు 

గాయములు రోగములు 

రోగములె కాలం 


గొప్పలకు తిప్పలుగఁ 

తిప్పలకు ముప్పలుగఁ 

ముప్పులులె కాలం


మురిపించి మరిపించి 

మరిపించి ధాహముతీర్చి

దేహతృప్తి నిచ్చు కాలం ఇదే కృష్ణా 


మనకు కాలంతో పనియేమిటి 

నిత్య వసంతం రాధా 

కృష్ణా రాధా --- కృష్ణారాధా  -- కృష్ణ రాధా 

   ****

0 Com

రాధాకృష్ణా రాసలీల -- రాధా వయ్యారమ్ (6)

కృష్ణుని  పలుకులు   


చక్కని, చిక్కిన చెక్కిలి, చెక్కెర పాకమా 

మక్కవ ఏక్కువ మెక్కిన టెక్కుల దేహమా 

పిక్కల నొక్కులు బొక్కలు కక్కుల దాహమా

అక్కడ ఇక్కడ ఎక్కడ నొక్కిన మైకమా 


చిగురుల అంచుల సుకుమారపు కోమలమా 

సొగసులు చూపియు సమదాహపు కోమలమా 

బిగిసిన కోకయు కద లించుచు కోమలమా 

మగసిరి కోసము ఎకసెక్కము కోమలమా 


వెన్నెల్లో కాంతులను విరజిమ్మే చల్లని నక్షత్రమా   

కన్నెల్లో  కామకుని మరిపించే వెచ్చని నక్షత్రమా 

మన్నేంల్లో మాయలను తలపించే చల్లని నక్షత్రమా 

కన్నుల్లో కైపులను చవిజూపే కాంతుల నక్షత్రమా 


శృంగార సామ్రాజ్య హృదయ మనోహర రూప లావణ్యా 

బంగారు హారమ్ము  సహజ  ముఖాలయ దీప లావణ్యా 

అంగాంగ ఆత్రమ్ము కళల  వినోదము  వెల్గు లావణ్యా 

వేగమ్ము  దేహమ్ము మెరుపు సుధామధు దాహ లావణ్యా 


ఎదలోన పొంగిన భావత రంగాల కావ్య మణిరత్నమా

మధురాన మోహము దేహము వజ్రాల కాంతి మణిరత్నమా    

చదువంత చూపెను చక్కటి నవ్వుల్తొ వాణి మణిరత్నమా 

పెదవంత ఇచ్చెడి బుగ్గల బూరల్తొ రాణి మణిరత్నమా

0 Comments


రాధాకృష్ణ రాసలీల -5


రారమ్మా రారయ్యా గోపికా కృష్ణ లీలలు  

గోపమ్మా గోపయ్యా  దైవ లీలలు

చూడాలి గోపయ్య మాట తీరు లీలలు 

చూడాలి కొలవాలి చిన్ని కృష్ణ లీలలు   


మనసు శాంత పరుచు అందరికీ నవ్వుల చూపు 

వయసు వేడి పరచు కొందరికీ నవ్వుల చూపు 

నిర్మల మైన మనసుతో పువ్వులా చిన్న నవ్వు   

నిర్మల మైన కరుణతో  నవ్వులా చిన్న పువ్వు 


శ్రీ రమ్య చరితమ్ము గలగి కాంతుల్ని అందరికీ పంచు 

శ్రీ గమ్య చరణమ్ము కలిగి పున్నమి వెలుగుల్ని పంచు  


సకల చూపులు చూచెడి మనసు దోచెడి కృష్ణలీల   

నయనాల లోను మెరవు మనసు తిప్పేటి కృష్ణ లీల   

యశోదమ్మ ముద్దుల బాలకృష్ణుడు పిల్లలతో అల్లరి చేయు లీల 

నిత్య ముద్దులు కురిపించు మనసులోన మాయ తుంచు లీల   


మదిలోన నుండెటి ప్రశాంతుడు అందరికీ మేలు కల్పించు లీల 

తప్పులన్నిటి సరి దిద్దేవాడు మానవులలొ మనసు పంచు లీల 

అందర్నీ కాపాడు చుండేడి చెప్పుడు మాటలు నమ్మని లీల    

నిజము ఎపుడు చెప్పెయు మనసు మరీ మాయ చేయు లీల  


రారమ్మా రారయ్యా గోపికా కృష్ణ లీలలు     

గోపమ్మా గోపయ్యా  దైవ లీలలు  

చూడాలి గోపయ్య మాట తీరు లీలలు   

చూడాలీ కొలవాలి చిన్ని కృష్ణ లీలలు  

****

0 Comments


ప్రాంజలి ప్రభ అంతర్జాల పాతరైక 

సేకరణ / రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… 

జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… 
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా

గరుడ వాహనా కృష్ణ గోపిక పతే…
నయన మోహనా కృష్ణ నీరజేక్షణా…

జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…

సుజన బాంధవా కృష్ణ సుందరాకృతే… 
మదన కోమలా కృష్ణ మాధవా హరే
వసుమతీ పతే కృష్ణ వాసవానుజా… 
వరగుణాకర కృష్ణ వైష్ణవాక్రుతే…

సురుచిరానన కృష్ణ శౌర్యవారిదే… 
మురహరా విభొ కృష్ణ ముక్తిదాయకా
విమలపాలక కృష్ణా వల్లభీపతే… 
కమలలోచన కృష్ణ కామ్యదాయకా…

జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…

విమల గాత్రనే కృష్ణ భక్తవత్సలా… 
చరణ పల్లవం కృష్ణ కరుణ కోమలం
కువల ఏక్షణా కృష్ణ కోమలాకృతే… 
తవ పదాంబుజం కృష్ణ శరణామాశ్రయే…

భువన నాయకా కృష్ణ పావనాకృతే… 
గుణగణోజ్వల కృష్ణ నలినలోచనా
ప్రణయ వారిధే కృష్ణ గుణగణాకరా… 
దామసోదర కృష్ణ దీన వత్సలా

జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…

కామసుందరా కృష్ణ పాహి సర్వదా… 
నరక నాశనా కృష్ణ నరసహాయకా
దేవకీ సుతా కృష్ణ కారుణ్యమ్భుదే… 
కంస నాశనా కృష్ణ ద్వారకాస్థితా…

పావనాత్మక కృష్ణ దేహి మంగళం… 
త్వత్పదామ్బుజం కృష్ణ శ్యామ కోమలం
భక్తవత్సలా కృష్ణ కామ్యదాయకా… 
పాలిసెన్నను కృష్ణ శ్రీహరి నమో

జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…

భక్తదాసనా కృష్ణ హరసు నీ సదా… 
కాదు నింటెనా కృష్ణ శలహెయ విభో
గరుడ వాహనా కృష్ణ గోపిక పతే… 
నయన మోహనా కృష్ణ నీరజేక్షన…

జయ  జనార్ధన కృష్ణ రాధిక పతే… 
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
గరుడ వాహనా కృష్ణ గోపిక పతే…
నయన మోహనా కృష్ణ నీరజేక్షణా…

జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…


--(())--

నేటి ఆద్యాత్మిక భావ మే జీవితం 


సృష్టి చైతన్యం ప్రకృతి

ఆత్మా చైతన్య ఆకృతి

దైవ చైతన్యం స్వీకృతి

పుర్ష చతన్యం జాగృతి

సర్వం ఆనందం ధర్మమే ఈశ్వరా  


ఆత్మ తత్త్వం తెలుసు కోలేని జన్మ

యోగ తత్త్వం కనికరించలేని జన్మ 

మౌన తత్త్వం ఆచరించుటయే జన్మ

ప్రేమ తత్త్వం తో భక్తియే కలియుగ జన్మ 

సర్వ శ్రేయస్సు కు జ్ఞాన ముపంచె జన్మ ఇవ్వు ఈశ్వరా 


పరాత్పర శబ్దము గ్రహించలేము

పశ్యంతీ, శబ్దము వినిపించుకోలేము

మధ్యమ శబ్దము బతికి బతికించ గలము  

వైఖరీ శబ్దము 84  లక్షల ప్రాణుల భాష ఫలము 

సృష్టి ధర్మము అనుసరించి బత్కి బతికించుటే ఈశ్వరా 


సర్వోత్కృష్ట  శబ్దం ఓంకార నాదము 

ఆచరించిన వానికి జన్మ పరిపక్వత శబ్దము 

మోక్షదాయక సులభ మార్గమే దేహము 

ఇదియే కలియుగ జీవిత సత్యమే కదా ఈశ్వరా  


-(())--


      మూకపంచిత -కటాక్ష పంచ పది శతకం 


(o1) మొహమ నే చీకట్లు నశింప జేయు 

       మూగ మనస్సుకే కవిత్వం అందజేయు 

       దయతో కూడిన కన్నులను చూపియు    

       లోకాలన్నిటినీ నిత్యమూ చల్లబరిచియు 

       ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా 

 

(02) మమకారమనెడి దెయ్యము నుండి 

       ఇంద్ర నీల మణుల ఆశల నుండి 

       వరాలు పొందిన దుర్మార్గులనుండి 

       మూడు లోకాలకు రక్షణగా చూస్తూ  ఉండి 

       ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా


(03) అమ్మ దయా ధ్యాన సముద్ర మాయే 

       మన్మధ ప్రేరణ తంత్ర ఆనంద మాయే 

       చూపులు సుడిగుండంలా తిరుగు టాయే   

       చెవుల హద్దులు దాటిన చూపుపల్కులయే  

       ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా


(04) కరుణాసాగర తరంగమనేకన్ను 

        దయాసముద్రముతో వంగిన కన్ను 

       చిరునవ్వులు చిందుచున్న కన్ను 

       సంసార తాపతప్తులను రక్షించు కన్ను  

       ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా


(05)  అమ్మ వారి కడకంటి కాంతి చెవి సమీపంగా  

        అమ్మవారి నవ్వులకాంతి సహాయముగా 

        సర్వ పాండవ సేనకు కాంతి పుంజముగా 

        శివుని చిత్తమునకు సంతోష పరిచేదిగా 

        ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా


(06) పరితాపమనే సూర్య కాంతి అస్తమింప జేసి 

        చల్లని కటాక్ష వీక్షణాలను విస్తరింప జేసి 

        చంద్రప్రకాశ చీకట్లను జనులకు అందజేసి 

        ఆనంద వెల్లివిరియు హృదయం చల్లఁ జెసి 

        ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా


(07) కర్ణ భూషణాల లోని ముత్యము కాంతులు 

        సమస్త లోకాలకు విస్తరించు దంత కాంతులు 

        కటాక్షమనే కారుణ్య పరిచేటి దివ్య కాంతులు 

        సమూలంగా దుర్మార్గాన్ని పెకలించు కాంతులు 

        ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా


(08)  కడగంటిఁ కాంతి యనెడి కల్పవృక్షము  

        దయ యనెడి పుష్పరస సమూహము 

        లోకముకు నీడనిచ్చి తొలగించె పరితాపము 

        కమ్ముల చిగురుటాకుల కాంతి విస్తారము 

        ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా


(09) సూర్యుని ఆశ్రయమునందు ప్రేమ గలది 

        యమునాదిగా ఎఱ్ఱ కలువల కాంతి గలది 

        నదిగా ఈశ్వర సముద్రాన్ని సంతృప్తి గలది 

        శివముఖ కాంతితో కలసి కటాక్ష కంటి గలది 

        ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా


(10) చూపు కదలికలో కళ ఒక  సతి  పక్షపాతము 

        విలాసపుంద్రికి ముక్తి వధువునకు ఐకమత్యము

        జన్మ జన్మల బంధము అమ్మవారి కటాక్షము 

        కంటిచూపు పుణ్యవంతులపై తక్షణం మోక్షము                         

       ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా



(11) కడగంటి చూపు శివునికి కుతూహలమే        

       దేవతల నరులకు నీ చూపు అనుగ్రహమే 

       కనుబొమ్మ ఇంద్రధనుస్సు లా  ప్రకాశమే  

      మేఘము కర్గియే జలము తో అభిషేకమే 

       ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా


(12) కడగంటి చూపు ల వెలుగులో ప్రసారం

       శివుని రొమ్మున నల్ల కలువల హారం

       జలాశయములో నాచు మెరుపు వైనం

       ముఖం కాంతి చిరు నవ్వే చూపు జలం

       ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా


(13) హృదయ పొలమునందు నీ చూపు కాంతి

       మోలకెత్తు మొక్క విస్తరించుటకు చూపె కాంతి

       నాలుక యనేడి సంస్కారము తెలుపు కాంతి

       సుభాషిత ప్రవాహం వాక్కుల పర్వపు కాంతి

       ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా


(14) దయగల చూపుతో జనులకు కైవల్యం

        వేద మార్గమే మెలకువతో సాఫల్యం

        చపలత్వం తో విడువ కుండా విచిత్రం

        కడగంటి చూపు కార్చు జల మేఘం

        ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా


(15) నీ యోక్క వీక్షణల తో మన్మధుని కళలు

        శివుని సమ్మైహపు అభినయం చేష్టలు

        మమతానుగ్రహము కొరకు జాగ్రత్తలు

        నీ చూపే సంజీవని లక్ష్య సౌఖ్యములు

        ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా


(16) వెన్నెలనే చిలికి నట్లు కడగంటి చూపు 

       మెరపులు తారలనే పొదిగినట్లు చూపు 

       శివుని హృదయం బంధించేటి చూపు 

       భజించిన బంధాన్ని తొలగించు చూపు 

       ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా


(17) హొయల కరిమబ్బే అడిగినట్లు చూపు

        చెంచల మనస్సు అధికార భక్తి చూపు   

        వంకరనమస్కారించినా సమభావ చూపు 

        భక్తిని దృఢపర్చి రాగ భావముల చూపు 

        ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా


(18) దేహాను భవాను రాగ రాహిత్యముకు చూపు       

        శ్రీ రాముడు సీత యందు ప్రేమించు చూపు 

        మాకు వచ్చు ఆపదలు నశింప చేయు చూపు 

        మనసుమాట వినిపించు సొగసులుగా చూపు 

        ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా


(19)  మదనుడికే మరోజన్మ అమ్మ కల్పించి నట్లు

         స్త్రీ పురుష రతీ వాంఛ చూపులతో గుచ్చినట్లు

         శివునికే కటాక్ష ప్రసారమనే పొలముగాను న్నట్లు     

        స్త్రీ కామకోటిపీఠ స్వరూపిణి వైన దేవి చూపైనట్లు  

       ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా


(20)  అమ్నా నీ విజృంభన ప్రేమ చూపు వల్లనే

        అగస్త్యుడు వింధ్య గిరిని శాసించె నే

        నీ శక్తి తో సముద్రాన్ని ఔపోసన పట్టె నే

        శివుని ఆరాధించి జ్ఞానామ్ము వల్ల నే

        ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా



(21)

ఈ ప్రేమ విషయమే అమృతం వర్షించు  

నాటకం ఏమాత్రం కాదు చల్లగా వికసించు 

మనసం లోన  వెన్నెలను పదిల పరుచు 

అమ్మ వెన్నెల నక్షత్రాలతో శాంత పరుచు   

 ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా

(22)

ప్రార్థనై కమలవనంలో శివుని వసించే  

ఆడ తుమ్మెదై విడువక స్పృశింసించే 

భక్తులయందు పక్షపాతము వికసించే 

కమలవనంలో ముల్లకాంతి జ్వలించే 

 ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా

(23)

దయ అను నటి దొబూచులాడే నాటకం గా 

అమ్మవారి నల్లని కళ్ళ కాంతి తో పందిరిగా 

అమ్మ చెవుల కుండలాలు మణుల దీపాలుగా 

కటాక్ష కాంతియే సర్వ జనుల రంగస్థలముగా 

 ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా

(24)

అమ్మ నీ చూపు అరక్షణం జాగృత మొనర్చు 

చిరునవ్వు  అపార కృప తో ఆనందమొనర్చు 

మన్మధ విలాస జనులకు సహకారంచేకూర్చు  

తలపులో చేరుతూ, మధువు లన్నీ  చేకూర్చు 

 ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా

(25)

సిగ్గు ఒకవైపు ప్రేమ మరోవైపు లాగుచుండగా 

ఊయలలో శివుణిచేంత దోబూచులాడుచుండగా 

మిక్కిలి కుతూహలమై శివుని కి ఆనందడోలికగా 

కన్నుల చూపులు ఏకమై లోకాన్ని చూచు చుండగా 

 ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా

((())))


(26)

హరిణ లోచనీ  కరుణ జూపు శరీరానికి  

దురిత మోచనీ త్వరిత మాపు మోక్షానికి  

నరుల కష్టాల వరుస నీవు సుభాశిస్సులకి  

శరణు శరణంటి కరుణా కటాక్ష చూపులకి  

 ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా

(27)

అమ్మకు శివుని శరీరమే నిత్యమూ భవనము 

నిత్య కరుణ ప్రావాహమే విహార నదీ వనము 

ఇంద్రాది దేవత సేవకులై పొందు కటాక్షము 

అమ్మ కటాక్ష రాజుకు విశ్వమే పరిపాలనీయము 

 ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా

(28)

అమ్మా నీ చూపు సోకగానే సరస్వతి సహచారిగా 

లక్ష్మీదేవి అక్నుసిగ్గను అనుసరించి సేవలుగా 

అందరికి సుఖపు భువనములే గృహములుగా  

త్రిలోక నయనామృతము ను పంచే  అమ్మగా 

 ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా

(29)

ధైర్యమనే చూపుల మీనంగా సముద్రమందుండే  

మన్మధుడనే పరమేశ్వరుని  వలకు చిక్కి వుండే 

మహేశ్వరుని మనస్సు ఆనంద డోలికల్లో ఉండే 

మీనంగా సహాయ సహకారంగా జన్మసుఖమైవుండే

  ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా

(30)

నామనస్సను అడవియందు ఏనుగు జడత్వము 

నీ చూపు అంకుశంచేత గజాన్ని అణిచివేయుము 

నాయొక్క జ్ఞానమనే  సరస్సును కలచివేయుము 

నా మనస్సు లో నిన్నే ధ్యానించేటట్లు ఉంచుము   

 ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా


(31)

నీ చూపుల బాణాలే మృగరాజు ప్రేరేపనగా

మొహమనే లేళ్ళ  గుంపులు గా పరిగెట్టగా 

తరువుల తీగల గుంపులు పైపైకి ఎగబాకగా 

అందమైన విలాసముతో నీ కనుచూపులుగా 

 ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా

(32)

ముసలి ధ్వజముగల మన్మధుడు విజృంభణ 

కటాక్ష కృపాణముతో నల్లని కలువలు విజృంభణ  

స్నేహమనే ప్రేమతో చూసే చూపులు విజృంభణ

కత్తి  ధరించి కాముని జాయించే శక్తి విజృంభణ

 ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా

(33)

మునులయొక్క స్మృతి మార్గము కల్పిస్తూ 

వక్రత్వము ఛేంచ లత్వము తొలగిస్తూ 

కమలకాంతుల దొంగతనము తొలగిస్తూ 

కంటి చూపులు సృతి మార్గముగా అందిస్తూ 

 ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా

(34)

గురుస్వామి ప్రేమతో నల్లధనము ఏర్పరుస్తూ 

నీ చెవి వేదమును పరిచయము ను చేస్తూ 

ప్రేమ గంధమోయి హృదయాన్ని అందిస్తూ  

కరుణించే వేలుపులా జనులను పరీక్షిస్తూ 

 ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా

(35)

కన్నుల కాంతి చిరునవ్వు అనెడి నురుగులు గుంప

సమూహమనెడి సముద్ర కెరటాల ఉరవడి గుంపు 

నీ చూపులతో జలము వడ్డుకు చేరి తిరిగే గుంపు 

తాళలేని విరహమేమొ మోస్తు కదలిక గుంపు 

 ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా


((()))

(36)

భావాలను పండించే త్రిపురములలో సుందరివై 

దట్టమైన కనుపాపలు తళుకు కాంతి  కలదానివై 

వెన్నెల కలదై కలువల తో చకోరాల తో పోటీ వై  

చూపులతో ఈశ్వరుణ్నే పరితపింప చేయు దానివై 

ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా

(37)

అమ్మవారి నిరీక్షణ శివునికి చెందినట్లు 

లోకాల్ని నీ నేత్రములు తో రక్షించినట్లు 

మంచు కొండకు బిడ్డ వై కరుణించినట్లు 

నిరీక్షణ కాంతులు సర్వం గ్రహించినట్లు 

ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా

(38)

నేత్రకాంతులలో నీలిమ యొక్క నిపుణత 

మన్మదాగ్ని కలిగించుఁ పోగలతో నిపుణత 

శివునికనుల లో హర్షోదయముచే  నిపుణత 

కాంతి చినుకులా అంద్భుతమైన నిపుణత 

ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా

(39)

నీ చూపులతో జనులు నమ్రత ను 

నీ చూపులతో జనులు సర్వజ్ఞతను  

నీ చూపులతో జనులు సమర్దతను  

నీ చూపులతో కీర్తిని జ్ఞానాన్ని పొందును 

ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా

(40)

నీ చూపులతో సంతాపము హరించును 

నీ చూపులతో మేఘమాలను కరించును 

నీ చూపులతో స్నేహాన్ని అభివృద్ధి పఱచును 

చూపులతో హృదయాలలో నివసించును 

ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా


(41)
గురువనుగ్రహము తోడుగా 
నడుచుటకు కష్టతరముగా 
మోక్షమార్గముయే ఇరుకుగా 
నిత్య కైవల్యానందామముగా 
ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా

(42)
చిత్తము ఏనుగు స్తంభించకుండే  
భక్తి శృంగలముచేత భండన ఉండే
అమ్మ క్రీగంటి చూపుకాంతి కల్గి ఉండే
ఇంద్ర నీలమణి వెల్గు విస్తరించి ఉండే  

ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా


(43)
కాటుక ధరించిన కళ్ళలో నిర్మలత్వము 
భక్త హృదయాలలో అందించు స్థిరతము 
చంచలమైన మనస్సుకు సమానత్వము 
కడగంటి చూపులతో పెంచు కళల తత్వము   

ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా


(44)
మణి కుండలములు కదలిక వెలుగు 
సమూహాలను చల్లఁబరి చేటి వెలుగు 
దిక్కులు పెక్కటిల్లే కళ్ళ కాంతి వెలుగు 
ఉద్యాన వనంలా వికసించు కళ్ళ వెలుగు 
ప్రాంజలి తో వందనాలు కామాక్షీజ్ఞానేశ్వరా






*ఆరాధ్య భక్తి లీ ల* 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
(01)

నాకు నీవు నీకు నేను, ఒకరికొకరం,  కలసిపోయే బంధమాయె 
ఏమి సోధ్యమో, ఏమి ఫలమో ఎఱుకలేను శ్రీ శ్రీ శ్రీ వేంకటేశా   

దండము పెట్టుట నావంతు - తప్పుల రక్షణ నీవంతు 
ధర్మము పల్కుట నావంతు - అర్ధము చెప్పుట నీవంతు   
కప్పము కట్టుట నావంతు - శక్తిని ఇచ్చుట నీవంతు 
దైవము కొల్చుట నావంతు - అల్పుని దీవెన నీవంతు  ---నా 

అండగ ఉండుట నావంతు  - బంధన ముక్తియు నీవంతు  
దాసుగ పండుట నావంతు - కర్తను గాచుట నీవంతు 
స్మరణ జొచ్చుట నావంతు - కర్మను తీర్చుట నీవంతు 
పూలతొ పూజించు నావంతు - సంపద పంచుట నీవంతు --- నా       

మోక్కులు తీర్చుట నావంతు - శాంతిని ఇచ్చుట నీవంతు  
కోరిక చెప్పుట  నావంతు - మాటను నిల్పుట నీవంతు 
దేశము రక్షణ నావంతు - ధైర్యము ఇచ్చుట నీవంతు 
ప్రేమను పంచుట నావంతు - సోఖ్యము ఇచ్చుట నీవంతు -- నా 

పరమపురుష శ్రీపతివి  పరిపూర్ణ లక్ష్మీ పతివి భక్తులకు పరమాత్మవి  
ఈర్ష్యలేని శ్రీ వెంకటేశ్వరుడివి మమ్ము ఆదుకొనే లోకపాలకుడివి 

నాకు నీవు నీకు---  నేను, ఒకరికొకరం,  కలసిపోయే బంధమాయె 
ఏమి సోధ్యమో, ఏమి ఫలమో ఎఱుకలేను  శ్రీ శ్రీ శ్రీ వేంకటేశా  
నమో నమో తిరుమల తిరుపతి శ్రీనివాస, గోవిందా గోవిందా గోవిందా  
--((**))--


*ఆరాధ్య భక్తి లీల* (2)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఆణువణువూ నిండిన దైవం, నిరంతర స్మరణ దైవం 
మమ్ము రక్షించే మా దైవం శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 
గోవిందా గోవిందా గోవిందా 

నమోవెంకటేశా - నమోశ్రీనివాసా
నమో లక్ష్మిదేవీ - నమోశ్రీదెవీ

సదాసేవ చేస్తా - సదా పూజ చేస్తా
సదా వేడు కుంటా  - సదా ప్రార్దిస్తా

సుఖం కోరు కోనే - దుఃఖం కోరు తానే
మోసం జోలు పోనే - మౌనం పాటిస్తా   

కళా పూర్ణ రూపా - కధా న్యాయ రూపా
మనో సంత రూపా - మనో దర్శకా

ప్రజా మాయ నీదే  - ప్రజా వెల్గు నీదే
ప్రజా శక్తి నీదే - ప్రజా బాధ్యతే     

మనోనేత్ర మాయా - మనో పృథ్వి దేవా 
మనో దివ్య తేజా - మనో అర్పితా      

రమా బంధ రూపా - రమా మోక్ష రూపా 
రమా తేజ రూపా - రమా దైవమే   

అరాళమ్ము లాశా - స్వరూపమ్ము గాదా
మరాళమ్మువోలెన్ - మదిన్ నిల్వ రా

నమోవెంకటేశా - నమోశ్రీనివాసా
నమో లక్ష్మిదేవీ - నమోశ్రీదెవీ

ఆణువణువూ నిండిన దైవం, నిరంతర స్మరణ దైవం 
మమ్ము రక్షించే మా దైవం శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 
గోవిందా గోవిందా గోవిందా 
--((**))--

కళాపూర్ణ - IUU IUU - IUU IUU // IUU IUU - IUUIU
ఆరాధ్య భక్తి లీల (3) 
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

నిన్నూ, చేరుకునే, సత్య ఉపాయము ఏదయ్యా 
ఆది, నంత్యము లేని, అచ్యుత మూర్తి నీవయ్యా 
అందుకే అన్యధా శరణం నాస్తి। తమ్వేవ శరణం గోవిందా।

నిన్ను, చేరుకునే, నిత్య ఉపాయము ఏదయ్యా 
ఆది, నంత్యము లేని, అచ్యుత మూర్తి నీవయ్యా 

నీ గుణాల్ని పొగడి నిన్నూ చేరాలనుందయ్యా  
నీవు గుణాలను దాటిన గుణ రహితుడ వయ్యా  
నిన్నూ నా మనసులో నిల్పుకోవాలినుందయ్యా 
నీవు అంతులేని మహిమగల విశ్వవ్యాప్తుడయ్యా 

చేతులారా పూజిస్తూ, ప్రార్ధించాలని ఉందయ్యా 
నీవేమో, అనంత శరీరం తో, వి స్వవ్యాప్తుడవయ్యా   
నీ కోరిక ఏదన్నా ఉంటే, తీర్చాలనీ ఉందయ్యా 
నీ వేమో, సమస్త కోరికలు తీరిన వాడవయ్యా 

నిన్నూ కనులారా చూసి, తరిద్దామని ఉందయ్యా 
నీ వేమో చూపుకే దొర్కని, ఆగోచర మూర్తివయ్యా 
ఉపాయంతో నిన్నూ చేరలేనని, అర్ధం ఆయిందయ్యా 
శ్రీనివాసుని శరణు కోరటమే, నాకు దిక్కయ్యా 

నిన్నూ, చేరుకునే, సత్య ఉపాయము ఏదయ్యా 
ఆది, నంత్యము లేని, అచ్యుత మూర్తి నీవయ్యా 
అందుకే అన్యధా శరణం నాస్తి। తమ్వేవ శరణం గోవిందా।
గోవిందా గోవిందా గోవిందా 
--))**((--
ఆరాధ్య భక్తి లీల (4)

ప|| ఏమి పలకను నిను చూడ ఏల బ్రతుకు
ఏమి అనకు ము మతి లేదు ఏల బ్రతుకు
ఏమి కాము కపు మనసు ఏల బ్రతుకు
ఏమి కడ మొదలు ను లేదు ఏల బ్రతుకు

చ|| పత్తి లోపలి నూనె గా  జీవ నమ్ము 
విత్తు మీదటి పొల్లు గా దేహ మయ్యె |
బత్తి సేయుట యేమి యో పాసి పొయ్యె  
పొత్తుల సుఖంబులకు మేను పొర బ్రతుకు

చ|| ఆకశాన పాకాశ మే ఆశ్రి తమ్ము 
 లోక రంజ కంబు తమలో  సమ్మ తమ్ము
చాకి మణుగుల జాడగా సంప దయ్యె 
చేకొనిన నేమి యివి చెదిరిన ను బ్రతుకు

చ|| గాదె పోసిన కొలుచును జీవ నంబు  
వేదు విడువని కూడుగా వెతల బదుకు 
వేదనల నెడతెగుట యే వేంకటేశ 
మోదము వడసి మోక్షంబు వేంకటేశ

గోవిందా గోవిందా గోవిందా
1
ఆరాధ్య భక్తి లీల।।(5)

హరవి నీవెను సర్వము రక్ష కుడవు
యిరవది ఒకటి భావన నీయ రక్ష
సరియగు మనసు పలికే ను సరయు దీక్ష
చరణము లె మాకు చరిత్రగా వేంకటేశ

చూడక ను ఉండలేవు లే  కన్నులన్ని
ఏడ నే వైనయితరము ఏల కొన్ని
నీడల తొ నింత నీరూపములతొఅన్ని
ఈడు వదని తెలివి గాను నమ్మె నిన్ను

పార మానదు పాపపు పాక మనసు
ఈరసములతో ఎంతైనా నీకు సేవ
నీరజాక్ష నీ మయమేను నటన బ్రతుకు
పారు ఈరీతు లతలతో పలుకు నెంచె

కలుగుటయె కాయపు సుఖము కళ్లు నేర్పు
ఇలలొ లోపల గల విన్న పాలు లన్ని
అలరిన తలపు తెల్పితి వేంకటేశ
యిలనర్పితమను చేసె ఇహము నీవె

నమో నమో తిరుమల తిరుపతి వేంకటేశ్వర
గోవిందా గోవిందా గోవిందా
0
ప్రాంజలి ప్రభ
చిలకలపల్కు యె కినుకులవల్లనె
గలగలసాగు నది పరుగల వెల్లువె
అలకలు మాని సతి కులుకుల మక్కువె
పలుకుల ఆట పతి పరుగుల కెక్కువె
తలవని కోరిక తలుపులు చేరులె 
తలవని మోక్కన ఘుమ ఘుమలే లులె
వలపుల వేల్పులకళ వరుసాయిలె
మలుపుల మేలు మనసునయె మాయలె
కలకల రావము కధ తెలిపేది లె
చిలచిల తోటన కదులుట చిందులె
తశతళ మెర్యుట చినుకులవెల్గులె
జలజలపువ్వులు పడుట సగాలిలె
 అలము వలే కదలికలను సాగులె
కలుగుట యే మధురిమ గను పొంగులె
చలనము యే చరితము గను సాగులె
మలుపుల మానసిక కవులు గాధ లె
ఇక చిరునవ్వు పలుకు మనసాయలె
ఒకరికి ఒక్క రుకళలుగ పంచెలె
చెకుముకి పక్షి వలెను పొడిచేనులె
సుఖము తొ గంతులు కళ కలిగేనులె
న జ న స ల ల .. యతి 8
కదలి పోతున్న దిప్రవాహము కడలిన
జ్ణాపకాలను దాచేను కాల గుణము
మైలు రాళ్లను ఈదుతూ మనసు కదలె
నడుపు కుంటూను కదిలేది నిర్మలముయె
విధేయుడు..మల్లాప్రగడ రామకృష్ణ
0 Com

ఆరాధ్య భక్తి లీల (6)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

మనసు మనసులో లేదు మనుగడ ప్రశ్నగా మారే 
మమతలన్నీ మాయల చుట్టూ తిరిగేను న ప్రాణం 

తిరుమల తిరుపతి వేంకటేశ నీవే నాకు ప్రాణం
దాసుడుగా, సేవా భక్తుడుగా, ఉండాలనున్నది ప్రాణం   
నిన్ను గూర్చి నిత్యం పాడు కోకండా ఉండలేదు ఈ ప్రాణం  
నీవు తోడు లేకపోతే క్షణం కూడా నిలవదు  ప్రాణం 

మనసును తృప్తి పరచినా నిన్ను విడువదు ప్రాణం 
నీ శ్వాసల వెన్నెలనే వీడలేదు నిను గాంచు ప్రాణం    
విసుకనేది ఉండదు నిత్య ప్రార్ధనలే నాకు ప్రాణం  
నీ చూపుల ఉయ్యాలను నిత్యం వదలలేదు ఈ ప్రాణం 

మనసు మనసులో లేదు మనుగడ ప్రశ్నగా మారే 
మమతలన్నీ మాయల చుట్టూ తిరిగేను న ప్రాణం 
కలియుగంలో ధర్మ, సత్య, న్యాయ, సాక్షి శ్రీ వేంకటేశ  
మానసిక ప్రాణాన్ని రక్షించే తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ     

--((**))--
ఆరాధ్య భక్తి లీల --- 7 
రచయత"మల్లాప్రగడ రామకృష్ణ "
భావము : మోక్ష ప్రాప్తికి జీవుడు చాలా కష్టపడాలి। గట్టి ప్రయత్నం చేయాలి

ఊరకే దొరకునా, ఉన్నతోన్నత సుఖమూ
ఆశలొదలి శ్రమిస్తే, మోక్షమే సులభమూ 

చింతల వలయం నుండే, బయటకు రమ్మూ   
శాంతి ఉన్నప్పుడే తృప్తితో,  కల్గును మోక్షమ్మూ    
కలుషిత కర్మల నుండీ,  బయటకు రమ్మూ  
మన జన్మ జన్మల పుణ్య మార్గమ్మే మోక్షమ్మూ  

మాలిన్యం తొలిచీ, నిర్మల మనస్సుతో రమ్మూ 
శ్రీనివాసుని హృదయంతో, స్మరిస్తే మోక్షమ్మూ   
చదివిన చదువులో ఉన్న, శాంతితో రమ్మూ  
శ్రీ వేంకటేశ్వరుని దాస్యము ఉంటె, మోక్షమ్మూ 

చిమ్మ చీకటిని తరిమే, వెలుగులా రమ్మూ  
నిత్యమూ ధైర్యంతో, దైవాన్ని పూజిస్తే మోక్షమ్మూ  
సంసార సాగరము, ఒడ్డు చేర్చుటకు రమ్మూ  
కష్టాన్ని తొలగించి, శాంతి కల్పిస్తే మోక్షమ్మూ  

ఊరకే దొరకునా, ఉన్నతోన్నత సుఖమూ
ఆశలొదలి శ్రమిస్తే, మోక్షము సులభమూ 

--((**))--

ఆరాధ్య భక్తి లీల (8)
ఓం శ్రీరామ - శ్రీ మాత్రేనమ:
 రచయత"మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ "

భావము :ఈ కీర్తనలో జ్ఞానులకు అజ్ఞానులకు కల భేదం 

జ్ఞానులకు, అజ్ఞానులకు మధ్య భేదం 
 సందర్భాన్ని బట్టి, తెలిపే ఓ మనసా 

మితిమీరిన పనులు వచ్చినా చలించక 
పర్వతమ్ వలే స్థిరం ఉండేవాడు యోగీంద్రుడు
కోపం తెచ్చే పరిస్థితి వచ్చిన చలించక              
ప్రశాంత హృదయముతో పల్కేవాడే ధీరుడు ।।।। జ్ఞా ।।  

సూదులువంటి మాటల్ని విన్ననూ చలించక
వాదులతో వాదము పెట్టని వాడే దేవుడు  
సంసారంలో వచ్చేటి చిక్కులకు చలించక 
నిగ్రహంగా సమర్ధించిన వాడే పుణ్యాత్ముడు ।।।। జ్ఞా ।। 

గాలం వంటి కొందరి ఆశలకు చలించక  
ఓర్పు వహించి నిలబడ్డ వాడే గొప్పవాడు  
ఏ పరిస్థితిలో ధైర్యం కోల్పోయి చలించక 
నిగ్రహం తో శ్రీనివాసుని కొలిచే నిత్యుడు  ।।।। జ్ఞా ।।

జ్ఞానులకు, అజ్ఞానులకు మధ్య భేదం 
 సందర్భాన్ని బట్టి, తెలిపే ఓ మనసా 

--((**))--

ఆరాధ్య భక్తి లీల---9
రచయత:  మల్లాప్రగడ రామకృష్ణ
 భావము :మానవుడు ప్రయత్నిస్తే దేనినైనా సాధించవచ్చు

మానవ జన్మా, పురుషార్ధక సాధన జన్మ 
జరామరణాల నుండీ, మోక్షాన్ని పొందే జన్మ ।।।।। మా  

వెదకి తలచు కుంటే, విష్ణుడు కానవచ్చు
చేతకాదని కూర్చొంటే, లోకం చీకటవ్వచ్చు ।।।2  
పట్టుదలే నీలో ఉంటే, లోకం చుట్టి రావచ్చు     
నిదురించితే కాలము నిముషమై పోవచ్చు ।।।। మా 

ఇష్టంగా చదివితే, వేద శాస్త్రజ్ఞుడవ్వచ్చు 
చదువు నాకెందు కనుకుంటే, మూర్ఖుడవ్వచ్చు।।। 2   
నిగ్రహంతో పనిచేస్తే, ఉత్తముడవ్వవచ్చు 
సోమరిగా కూర్చుంటే, గుణ హీనుడవ్వవచ్చు ।।।। మా 

శ్రీ వేంకటేశ్వరుని ప్రార్ధిస్తే మోక్షం రావచ్చు 
బద్దకించితే జీవితమే వ్యర్ధమై పోవచ్చు 
శరణంటే మనిషి జన్మ సార్ధకమవ్వచ్చు 
సందేహిస్తూ ఉంటే మనస్సే నాశన మవ్వచ్చు ।।।। మా  

మానవ జన్మా, పురుషార్ధక సాధన జన్మా 
జరామరణాల నుండీ, మోక్షాన్ని పొందే జన్మా ।।।।। మా  

--((**))--
స్రగ్విణీ వృ.. ర ర ర ర .7

శ్రావ్యమై సాధ్యమే సాక్షిగా సాధనై
కర్త వై కావ్యమై కాలమై కానుకై
భవ్యమై బంధమై భావమై బాధ్యతై 
ప్రాభవం ప్రేరణం ప్రాకృతిం ప్రాణమై

వట్టి మాటేఇదీ వంతపల్కే ఇదీ
గట్టిమాటే ఇదీ గట్టు దాటేటిదీ
పట్టు పట్టేటిదీ పొట్టనింపేటిదీ
రైతుపంటేఇదీ రైతురాజ్యమిదీ
అన్నదాతేమదీ ఆత్మరక్షే ఇదీ ఈశ్వరా

 మట్టినే నమ్మెనే మోక్కనే నమ్మెనే
లాభమే తగ్గెనే లాశ్యమే పెర్గెనే
పంటయే తగ్గెనే పంతమే పెర్గెనే
అప్పుయే పెర్గెనే ఆస్తియే తర్గెనే
అన్నదాతేమరీ ఆకలేతీర్చెనే ఈశ్వరా
Comment
Share

12 Co


Gpraoo Gade, Venkateswara Reddy Geevi and 2 others
6 Comments
11 Shares
Like
Comment
Share

భారతి సుప్రభ బంధము గనే
భార్గవ దుర్గప లక్ష్యము గనే
నీరద ధార్మిక వాక్యము గనే
శారద మానస మంత్రము గనే
శ్రీ రమ ప్రాభవ మాటలు గనే విఘ్నేశ్వరా
ధర్మము కాదిది ఏలను అనే
మర్మము దేహము దాస్యము అనే
కర్మలు దేహిక ధర్మము అనే
నిర్మల వాహిని నిమ్నత అనే
శ్రీ రమ ప్రాభవ ప్రేమలు గనే విఘ్నేశ్వరా
చలచల్లని వేళలలో కలలై
తలపించనులే తపనే వలలై
విలపించునులే విధిలో హొయలై
వరుసాయనులే వలచే దడిలై
తరుణమ్మదిలే మనసే మధనం విఘ్నేశ్వరా
మత్తు తో గమ్మత్తు గ నృత్య మేను ప్రగతి
చిత్తు చిత్తుగా నలుగు టే చిత్ర జగతి
దమ్ము కొట్టి ధైర్యము చూపె దారి వికృతి
నమ్ము రొమ్మువిరచి ధైర్య నృత్య సుకృతి
ఎన్ని అన్ననూ ఈ విధి ఏల మాకు విఘ్నేశ్వరా
మనసుకు మగత వల్లనే మార్గ మైంది
మతము మత్తులో జగతి న మదము చెంది
వెతలు అన్నియు సౌఖ్యపు వలపు నాంది
ప్రగతి లేక యే కధలు గా ప్రాప్తి చెంది
తరుణమిది అన్న విషయమే తపన మాది విఘ్నేశ్వరా
కలువ కిరణాల కొరకునే కలవరింత
రేఖలను విప్పు శక్తియే లేక చింత
ఇతరులతొ బంధ మవుటయే యిలను వింత
తరుణ మంతయు తపనతో తృప్తి ఎంత
తెల్ల మనుగురు లైనను తెలుపు నంత విఘ్నేశ్వరా
May be an illustration


21 Comments

నేటి పద్యాలు.. ప్రాంజలి ప్రభ
కాలమ్ము సహాయము కాదంది విధానము
దాహమ్ము సకాలము దారుంది నిదానము
దేహమ్ము వికాసము మారింది సమానము
మోహమ్ము అకాలము చేరింది ప్రధానము
జీవమ్ము విస్వాసము ప్రోత్సాహమే కృష్ణుడా
కూడేది పదార్ధము కూర్చేది యధార్ధము
పాడేది నిదానము ఆరాట విధానము
వీడేది వివాదము మారాలి విషాదము
ఆడేది సకాలము చేరాలి సమానము
జ్నానమ్ము సహాయము ప్రోత్సాహమే కృష్ణుడా
ప్రాధాణ్య మనేదియు ప్రాకార ము ఏదియు
విశ్వాస మనేదియు వాక్యార్ధ ము ఏదియు
ధర్మార్థ మనేదియు సర్వార్ధ ము ఏదియు
సంభావ్య మనేదియు సంధర్భ ము ఏదియు
జీవమ్ము కు ధైర్యము ప్రోత్సాహమే కృష్ణుడా
చింతేల సుఖానికి చాతుర్యము చూపుము
వింతేల సకాలము మాదుర్యము పొందుము
పొత్తేల అకాలము సామాన్యము అందుము
తత్వమ్ము వికాసము ప్రాధాన్యత పొందుము
దేహమ్ముకు దాహము ప్రోత్సాహము కృష్ణుడా
కందిరీగలు వెంట వుండెను కంది పోయెను 
దేహమే కాని దంటుయు లేటుగా
ఒంపు సొంపులు ఎన్ని వున్నను విశ్వ జన్మకు దేహమే 
ఓర్పు చూపెను లేటుగా
విందుగాముదమీయు దేహము ప్రేమసూచన కుట్టగా 
ప్రీతి పంచెను లేటుగా
వంద పుర్గులు కుమ్మి వేసెను వాంఛ తీర్చెను ప్రీతిగా 
వచ్చిముద్దిడు లేటుగా
ఏమి చేసినను వీలు లేదులె ఎంతొకొంతయు బాధయే 
బుధ్ధి మారదు కృష్ణుడా
0 Com
పంచపాది..ప్రాంజలి ప్రభ
మనిషి తత్వ మనుట వల్ల మేలు ఏది
మృగము తత్వం మనుట వల్ల మృత్యు వేది
బాహ్య ముననిర్మలత్వము భావ మేది
అంతరము దైవ మున్నను ఆశ వుంది
నేటి మనిషిగా వున్నా ను ఈశ్వరా
 మనలొ ధర్మాన్ని ఆచరణలు గ ఏది
సకల ముశుభాలుగ వీలు సరళి ఏది
భావి పౌరులకు కళల భాగ్య మేది
జ్ఞాన సంపద తరలించ జ్ఞాన మేది
 వ్యాకరణం సంపద ఫలం ఈశ్వరా
 మాతృభాషలో మాధుర్య పలుకు ఏది
తెలుగు చక్కటి భాషగా తీర్పు ఏది
స్వజనులను చూడు గొప్పగ స్వరము ఏది
సర్వ సిద్ధిని పొందినా శక్తి ఏది
మేలు చేయు బుధ్ధియు యిమ్ము ఈశ్వరా
ఘంట గంటకు కొట్టేటి గంట ఏది
గుట్టు చప్పుడు కానట్టి గడప ఏది
వొంటి మార్పుకారణముయు ఒకటి ఏది
గట్టి పోటీకి శిక్షణ గుణము ఏది
కాలం నిర్ణయం తీర్పగానే ఉన్నా ఈశ్వరా
0 Com
పంచపాది .. కుంభకోణం
మాతా నామాట నమ్ముతావా లేదా
ఖాతా యే నీది విప్పుతా వా లేదా
తాతా నావీపు గోకుతావా లేదా
వాతా నీవైన పెట్టుతావా లేదా
మోత్తం నీమాయ నమ్ముతున్నా  నేనే ఈశ్వరా
 రెప్ప వాలని కనులతో రభస వద్దు
 అంత రంగపు అర్ధము అసలు వద్దు 
వేదనలు వల్ల ఏమియు వదల వద్దు
మనసు చిరుణామ వెతుకుట మాన వద్దు
ఏమి జరిగినా దిగులని ఏడ్వ లేను ఈశ్వరా
 దత్తపది.. గాడిద,దున్న,కుక్క,పంది
గాడిదప్పని శాంతియె గరము గుండు
కాక మీదున్న మనిషియే గరము గుండు
కుక్క లరుపులు దొంగకు గరము గుండు
దేశమున పందిరులతొవే గరము గుండు
గరము పెరిగుయు మనసుకు గాయ మవుట ఈశ్వరా
ర జ ర గ .. 6..మయూరసారి
Uiu iui uiuu..ప్రాంజలి ప్రభ
సంఘమే మహాసభా విశాలం
సంభవం మనస్సు సానుకూలం
సంతసం సమస్య సామరశ్యం
నమ్మకం విధాన మే సహాయం
 స్వాగతం సుఖాసనం సమర్ధం
యోగ్యతాం సహాయమే సకాలం
భాగ్యతాం మనోభవం అనూహ్యం
సంఘమే మహాసభా యశస్సే
సంభవం మనస్సు సానుకూలం
ప్రాభవం సుఖప్రయాణమే‌నే
వైభవం నవాభ్యు మార్గమయ్యే
అంబరం అహమ్ము సావధానం
 అంతరంగమే సమాంతరమ్మే
వింతభావమే వనాలయమ్మే
సొంతఖర్చుయే సమానమ్మే
పంతమాయనే భయానమ్మే
ఇష్టమై వినాలి శాంతిపొందూ
కష్టమై పరోక్ష వాదనమ్మే
నష్టమే సమాన కాలమాయే
దృష్టి యే మరేదొ కోర్కయేనే
0
కుంభకోణం
ऊँ !
----
"మార్కండేయ వరదం , తం ,
శ్రీభ్రమరాంబికాపతిమ్..
భక్తపాలం కృష్ణ వశ్యం ,
విశ్వేశ్వరం నమామ్యహమ్ !!!
--
మాత్రిక
కోరన్నది మనసునకు కాలమ్ముగనే
వేరన్నది తరువునకు మూలమ్ముగనే
నారున్నది పొలము నకు ఆహారముగా
నోరున్నది మగని దిట్ట నొప్పించుటకే
ऊँ !
----
"మారునిసతిరూపమునన్
చారుమతియెపూజ్యమౌను చానను కనఁగన్
శ్రీరోషిణియై.., తలఁచును
" నోరున్నది మగనిఁదిట్టి నొప్పించుటకే !? "
----
(ఇందులో చివరి పాదమే...సమస్య )..
----------------------------------------
ఏమి అనలేని పనులన్ని ఏల చెప్ప
సుమతి శతకము చదివితే సుఖము చెప్ప
నాది అనుకుంటె కష్టమే నన్ను చెప్ప
ధార ఏదైన ధరణిలో ధనము గొప్ప
0
మ స జ గ .. సుద్ధవిరాట్.5
దైవ మ్మే విధి మానస మ్ము యే
కావ్య మ్మే సుఖ దుఃఖ భావమే
భావ్య మ్మే సుభ శోభ మాయ యే
సవ్య మ్మే దిశగా సమానమే
ప్రాణ మ్మే ఉపకారము యే ఈశ్వరా
భాగ్య మ్మే సుభ దేవ మాయ యే
వేగ మ్మే అవ హేళ నా జయే
రోగ మ్మే  అరివీర బోదయే
యోగ మ్మే అయమేవ శోభయే
ప్రాంతీయం ఉపహార గ ఈశ్వరా
కాల మ్మే వికసించుటే కదా
గాళ మ్మే సుగుణాలు లే కదా
వేళ మ్మే అవినాశలే కదా
కల్లోలం సకలమ్ములే కదా
ముల్లోకం సముపార్జనే ఈశ్వరా
1 Comment

మధురై..పంచపాది
 అంగి ఆభరణము మేను అర్ధ రక్ష
నింగి విస్తృత స్థాయిలో నిగమ దీక్ష
కృంగి పోవుట అవముని కృపగ దీక్ష
చెంగి ధైర్యము లేకయే చింత దీక్ష
సాగి పోతున్న పాముని నేను ఈశ్వరా
మ మ య ల..మధురై
రాగంగాణమ్మే నీ మనోరక్తి
యోగందైవమ్మే ఈశ్వరా శక్తి
భోగం భాధ్యమ్మే బాధ్యతే యంక్తీ
వేగంవాదమ్మే విధ్యకై ముక్తి
మాంగశ్యంసేవే మా ధ్యమై నాదే ఈశ్వరా
ర స స గ ... 6 మణిరంగ
రమ్మనే మధురం విధి అయ్యే
ఇమ్మనే మదియే తిధి అయ్యే
కమ్మనీ వయసే మది అయ్యే
తెమ్మనీ మతమే నిధి అయ్యే
సర్వమే మనసై సహనమ్మే
పర్వమే సముపార్జన కమ్మే
కార్యమే సమకాలము నమ్మే
శౌర్యమే వికసమ్ముగ చిమ్మే
కళ్ళు కలియుట కవులుగా కాల మాయ
కళ్ళు లేకుండ బ్రతుకు లో కధలు సాగు
కల్ల లాడుట కధలుగా కరుణ మతము
ఇల్లు గూలిన కష్టము లేల గలుగు
 స్వరమాయే గమనామృతం సహణము ప్రాధాన్య ఉత్తేజితమ్
వరమాయే వినయామృతం విలువల సౌకర్య సూత్రాంచితమ్
చరణాలే చరితామృతం చదువుల సామర్ధ్య సంతోషనమ్
తరుణానే సహనామృతం తడిపొడి కారుణ్య తాపత్రియమ్
 అంగి మోహనసుధ అంగ మంద గమన సిధ్ధి శుభ్ర బుధ్ధి      
నింగి యుందు వెలయు  నిత్య శోభితుండ సర్వ నీడ నిచ్చె         
కృంగుటేల నీకు  కాల వేషకునికి తలను వంచ నేల
 చెంగి దైర్యమ్ముగ చింత  వలదు నీకు సర్వ శక్తి తోడు
0 Com
5.5 మాత్రలతో ఒకపాట
వరదలా వచ్చావు
ఎగిరెగిరి పడ్డా వు
ఎదురేగి చూసావు
మరచి యే వెళ్ళావు
కరుణేది నామీద
బ్రతుకులో పోయేది
కలలోన కలిశావు
కథలన్ని తెలిపొవు
కాలాన్ని మింగావు
కనుమరుగు యైనావు
కరుణేది నామీద
బ్రతుకులో పసయేది
ఇక నాకు దారేల
మర్చిపోను టి ఏల 
కరిగి పోను టి ఎల
నిను పొందుట ను ఎలా
కరుణేది నామీద
బ్రతుకులో పోయేది
మెరిసేటి పువ్వు వై
వెలుగే టి దివ్వె వై
కాలి కేటి నువ్వు వై
సెలయేటి పొంగువై
కరుణేది నామీద
బ్రతుకులో పసయేది
తనువు లో తపన లే
అనువు లో నీవు లే
కనుల లో నీరు లే
మనసు నీ మాయ లే
కరుణేది నామీద
బ్రతుకు లో పసయేది
కరుణేది నామీద
బ్రతుకు లో పసయేది
విధేయుడు..మల్లాప్రగడ రామకృష్ణ
0 Com
రామేశ్వరం..17-12-2021
న తు తు గ కౌముది...5
మనసు సమాన వికాస మే
మనవి విమర్శల కోస మే
కనని నివేదిక భావ మే
వినని వివేకపు కాల మే
అనని సహాయ సమాన మే దైవమా
అణువు అనేక రకాలు గా
తనువు సహాయ సుఖాలు గా
కణుపు సుదూర కణాలు గా
కినుకు వినాశ మృణాలి గా
చినుకు అనాది నినాది గా దైవమా
పలుకు ఉపాధి కి నాంది యే
చిలుకు పిపాసి కి మోహ మే
కులుకు సుపూజ కి బంధమే
మెలిక సమీపు ని కాంక్ష యే
గుళిక నిఘూడ ని రోగి యే దైవమా
కనులు ముఖానికి అందమే
పనులు ఉపాధికి చిహ్న మే
మునులు సుపూజితమ్ము యే
గనులు నిఘూడపు వజ్రమే
వినుము అకాశ పు శబ్దమే దైవమా
రామేశ్వరం నుండి
దివ్య ప్రభ తో విరాజిల్లే
సర్వమూ తానై వర్ధిల్లే
రక్త వర్ణ శోభిత రూపమల్లే
గ్రహ రూప నిత్య సంచారుడల్లే
ఉదయించియు అస్తమించే ను దైవమా
ఉత్పలమాల
చెప్పెది మేముయే వినుము చెప్పిన మాటలు ఆచరించుటన్
తప్పులు కావులే కనుము తాపము వీడుము కన్నులేల చూచుటన్ 
మెప్పుగ ప్రేమసూపుచును మీరిన కాంక్ష ను నీవు చూడగన్
ఒప్పులకుప్ప లైదుగు రయోధ్యకు జేరిరి రామపత్నులై
0
బహులయ వృత్తము రనగ
కన్యాకుమారి ప్రాంతము నుండి 
రామచంద్రుడడు గో
రమ్మనే పిలుపు గా
చక్కనీ పలుకు గా
తెల్పె నూ మనకు లే
రాఘ వేంద్రుడడు గో
రవ్వ వెల్గు లవి గో
రమ్య చూపు లవి గో
రమ్మనీ పల్కు లవి గో
భాగ్య దత్తుడడు గో
భార మంతతడి దే
భాధ్య తా అతని దే
భయ్యమే మరవు లే
సూర్యడై వెలుగు లే
సర్వు డై అతను లే
కార్య ధక్షుడుగ లే
ధర్మ రక్షకుడు లే
నమ్మితిన్ నరహరీ
తెల్పితిన్ మురహరీ
ఒప్పితిన్ విధి హరీ
మార్గమున్ మది హరీ
జ్ణాన మోక్షము హరీ
ధ్యాన దీక్ష కు హరీ
మౌన రక్షకు హరీ
మేను కాంక్ష కు హరీ
వేంకటేశ్వరుడు గా
సక్యతా పరుడు గా
యైక్యతా పరుడు గా
సమ్మోహా పరుడు లే
0 Com

న ర జ గ .. మనోరమ.6..కన్యాకుమారి నుండి
మనసు మోనమే సుజాత మై
వయసు వెల్లువే సుదీర్ఘ మై
సొగసు చూసుకో విశేష మై
తెలుసు ఆతృతే ప్రభావ మై
అలుసు ఆకలే సజీవమే హృదయమా
గురువు దీవెనే మనో మయమ్
మెరువు వల్లనే జలో దయమ్       
తెరువు జ్ణానమే ఉషో దయమ్    
నెరుగు నిర్మలమ్ రమా మయమ్
పరుగు దేనికో  కధా పరమ్ హృదయమా
చెలిమి వల్లనే సదా సుఖమ్
కలిమి  వల్లనే సదా భయమ్
బలిమి వల్లనే సదా జయమ్
చెలియ వల్లనే సదా నయమ్
కళల వల్లనే సదా వ్యయమ్ హృదయమా
 చినుకు ముత్యమై ప్రభాశితమ్
తనువు ఆత్రతే ప్రమోదనమ్
అణువు కోపమే ప్రభంజనమ్
మనువు మార్గమే ప్రభావితమ్.     
మనకు తృప్తి యే శుభోదయమ్ హృదయమా
ఇదియె చీకటీ ఎలా ఎలా
కదిలె కాలమే కలా కలా
మదిలొ కష్టమే విలా విలా
గదిలొ కోరికే కళా కళా
బతుకు లో ప్రభా చికాకుగా హృదయమా
0 Comments


కన్యాకుమారి అమ్మవారి సన్నిధిలో
చేరితీ ఈశ్వరీ పరమేశ్వరి
నను కావవే ఈశ్వరీ జగదీశ్వరి
మది పల్కలే ఈశ్వరీ మహేశ్వరి
కల తీర్చుమా ఈశ్వరీ కన్యాకుమారి
చిరునగవు నీ మోము
నను పిలిచె నీ నీడ
తరుణములొ నీ శక్తి
కరుణగనె నా కివ్వు
చేరితీ ఈశ్వరీ పరమేశ్వరి
ననుకావవే ఈశ్వరీ జగదీశ్వరి
నా మది పిలిచింది నాదమై
వేణువు పలికింది గానమై
రాగము చిలికింది యోగమై
భావము తెలిపింది ధ్యానమై
చేరితీ ఈశ్వరీ పరమేశ్వరి
నను కావవే ఈశ్వరీ జగదీశ్వరి
కడలి కొలువై పొంగు
కదలి జనులై పొంగు
మెదిలి కధలై పొంగు 
వదలి అనువై పొంగు
మది పల్కులే ఈశ్వరీ మాహేశ్వరి
కల తీర్చుమా ఈశ్వరీ కన్యాకుమారి
మాతా ముక్కెర మెరుపు
కన్యా కుమారి తెరువు
ఆశా సహాయ తరువు
మాలో తగ్గేను అరువు
అమ్మే తీర్చేను బరువు
కాలం మార్చేను పరువు
మది పల్కులే ఈశ్వరీ మాహేశ్వరి
కల తీర్చుమా ఈశ్వరీ కన్యాకుమారి
చీకటిని చీల్చుకొని
వేకువను గెల్చుకొని
జీవితము మల్చు కొని
చేరితిని తల్చు కొని ఈశ్వరీ కన్యాకుమారి
మోక్కితిని మార్చ మని
చిక్కితిని తేల్చ మని
మక్కువతొ తెల్పితిని
అమ్మవని నీకు తెలిపె ఈశ్వరీ కన్యాకుమారి
మానస యోగమే ఇది నాకు
కానిది ఏదియో చెప్ప లేను
వాకలి నున్న నూ కథ నీది
ఏమని చెప్పను మది పల్కులు
చేరితీ ఈశ్వరీ పరమేశ్వరీ
కల తీర్చుమా ఈశ్వరీ కన్యాకుమారి
0 Com

అనంతపద్మనాభ స్వామి వారిని చూసేందుకు మూడు భాగాలుగా విభజించారు దేనికో నిర్మించినారు పూర్తి దర్శన మోక్షము ఎప్పుడో
ఏమిటో నీ మాయ పద్మనాభ స్వామి
ఆశ నిరాశ గా మారేను పద్మనాభ స్వామి సన్నిధిలో
మమ్ము మన్నించి మాకు కరుణించవా అనంత పద్మనాభ స్వామి నమోనమః కమలాకర కామేశ్వర కారణ్య కార్యదక్ష మాకు పూర్తి దర్శన మియ్యవా , భూదేవి, శ్రీ దేవి మీరన్నా చెప్పండమ్మా అయ్యవారిని దర్శిస్తావమ్మా
చూడలె ఏమి కలి కాలమా
 ఏమిటి మాయ కల వైన మా
చేరితి మందిరము విధి మౌనమా
చెప్పక చెప్పితిని కలలు తీర్చు స్వామి
దూరము యైన నెను వచ్చి తీ
భారము వున్న నువు తీర్చ వా
వైరము లేదును లె మర్చి తీ
ధైర్యము కోరితిని నేను నిను స్వామి
గానము చేయ దలి చాను లే
ఆకలి తీర్చ మని కోరె లే
వాకిలి వెంట నిను తల్చె లే
సేవలు చేసితిని బ్రతుకు తేల్చు స్వామి
లౌక్యము తెల్వకనె కోరి తీ
సౌఖ్యము కోరి నిను చేరి తీ
భాగ్యము లేక నిను కల్సి తీ
మ్రోక్కెద నేను ఇక నాకు నీవే దిక్కు స్వామి
ఉజ్వల కాంతి ఇక ఎక్కడా
సద్విని యోగ పరమెక్కడా
దుర్వినియోగ మయెమిక్కడా
కన్నులు ఉన్న చూడలేని బ్రతుకాయెస్వామి
విశ్వము యోగ మయమే కదా
నిత్యము శాంతి ధనమే కదా
తత్వము నీదు మహిమే కదా
చింతల ఏల మాకు పద్మనాభ స్వామి
" శ్రీ దాససంకటార్తిఘ్నం ,
శ్రీ మలయప్ప దైవతమ్ ..
భూపద్మహృదయేశం , తం ,
శ్రీధరం ప్రణమామ్యహమ్ !!!


వృత్తమంజరి
-------------------
*
తిలకా - స,స
*
పలుకుంజెలివో - లలితాంబికవో -తెలితేజముతో -
విలసిల్లెదవే
*
సౌరభి- భ,స
కూరిమిఁ గను ని- న్నేరకముగ నే -పేరునఁ గొలుతున్ - 
వారిజనయనా
*
తిలకా -స,స
*
సురభారతిగాఁ - బరికించుటయే- గురురూపిణిగా - 
గురుతించుటయే
*
సరి - న,స   
*
అలఁతినగవున్ - బొలుచు  ప్రియనై - కలికితనమున్
వెలుఁగు శుభనే
*
వసుమతీ - త,స
*
తుంగాతటము నా-శృంగాద్రిపయినన్-సంగీతములతో
బొంగారు పరనే
*
పఙ్క్తి - భ,గగ
*
అన్నియు నేనై - యున్నటి శక్తిన్ - సన్నుతి గొంచున్ - 
గ్రన్నన గాతున్ 
*
నిస్కా - మ,స 
*
సర్వజ్ఞత్వముతో- సర్వవ్యాపినినై- సర్వారాథితనౌ
సర్వేశిన్, సరసన్
*
కుహీ - జ,స
*
విరించి సతిగా-స్వరాల ధునిగా -విరాళి గొను నీ -
వరాల తలినే
*
మశగా - య,స
*
విధానంబు గనన్ - బుధాళిస్తుతమే -విధీంద్రాదులకున్
సదా గారవమే
*
సుధాసింధువునే - చిదానందినినే - సదా గానములే - 
ముదా దానములే
*
కర్మదా - ర,స
*
మీఱు ప్రేమముతో -దారిఁ జూపఁగ నిన్ -జేరి పల్కెడి శ్రీ -
శారదాంబికనే
*
పేర్మి పెంచెడి  యో - నిర్మలాత్మికనే -శర్మకారిణినే- ధర్మచారిణినే-   
*
నిరసికా - న,ర
*
చెలిమి మీఱఁగాఁ - -దెలిపితంతయున్ - - గలఁతలేకెటుల్ - కొలుచుకొంచు నీ
కులము వొంగఁగా -వెలుఁగు నాతిగా -నిలకు మేలుగాఁ   -బలుకులల్లుకో
*  
వలీముఖీ - జ,ర
*
బుధగ్రహంబు తా -సదా సహాయమౌ-సుధీముదమ్ముగాఁ
బదాల నల్లఁగా 
*
శునకమ్ - భ,ర
*
సాధన పూర్తియై -నీ దగు శైలిలో-బోధన సేయఁగా 
హ్లాదమె సర్వదా 
*
శిలా - జ,వ
*
చిరాయువుతో-నిరంతరమీ-సురేశ్వరికై -చరించుమిఁకన్
*
సుధామయమౌ- పదంబులతో- విధాత్రి కృపన్ 
గ్రథించి కృతుల్
*
వరేణ్యవుగా - గురూత్తముఁడున్ -స్మరించ సదా -
తరించు జనిన్
*
5:18 PM  
12-18-2021
*
నిడివి తగ్గించుటకై పద్యములు పైవిధముగా నమర్చబడినవి ఒక్కొక వరుస ఒక పద్యము.  నిరసికా , శిలా వృత్తములలో వరుసగా 2, 3 పద్యములున్నాయి.  ప్రతిపద్యములో పాదముల మధ్య  - గుర్తు ఉంచబడినది. 
 *


గురువాయూర్. శ్రీ కృష్ణ భగవానుని సన్నిధిలో
బాలకృష్ణుని పలకరిస్తూ "రుక్మిణి " ప్రేమతో సహాయ మంటే చెప్పవా ?
మేఘశ్యామం జనులకే సహాయమ్
సద్భావమ్మే మన లొనే సహాయమ్
సంఘర్షంమ్మే విధి గ నే సహాయమ్
సంతృప్తే నీకుయును నా సహాయమ్
సంతోషమ్మే కళలు గా సహాయమ్
అధ్వాన్నం గా మనము యే సహాయమ్
సౌందర్యం హృద్యమున కే సహాయమ్
ఆదర్శం ఇంద్రియముల కే సహాయమ్
ఆద్యంతం ఆత్మయు మునకే సహాయమ్
వాదమ్మే విశ్వాసమును కే సహాయమ్
కర్తవ్యం ఏమిటి అన కే సహాయమ్
కారుణ్యం చూపుయు సహనం సహాయమ్
ఆరోగ్యం పొందుటకు యే సహాయమ్
వైరాగ్యం చేరుటకు నే సహాయమ్
సర్వమ్మే దానముగ యే సహాయమ్
విశ్వాసం చూపుటకు యే సహాయమ్
ఆశ్చర్యం చెందుటకు యే సహాయమ్
ఉశ్చాహం పొందుటకు యే సహాయమ్
పాశమ్మే బంధమునకే సహాయమ్
సశ్యశ్యామం   హృదయము కే సహాయమ్
సమ్మోహం ప్రేమికులకు యే సహాయమ్
సన్మానం నాయకుల కే సహాయమ్
తన్మాయే ప్రేక్షకుల లొ నే సహాయమ్
ప్రాముఖ్యం పేంచుట లొ నే సహాయమ్
గమ్యమ్మే ఏర్పడును యే సహాయమ్
1

చిరునవ్వుతో ను చిందులేసేను
మరుమల్లిగాను మత్తు పెంచేను
కరుణ గతిగాను మదిమలుపు గాను 
కరువు తీర్చేను కధలు తెల్పేను
స్నేహ మయ్యేను సంత సించేను
దాహమయ్యేను దారి చూపేను
దేహ కోర్కలను తీర్చ కలిగే ను
అహము అనిచేను సేవ చేసేను
ధనము పంచేను నీతి తెల్పేను
వినుట మాటగను కనుట హాయిగను
అనుట తప్పుగను చెప్ప గలిగేను
మనము అనవలెను మంచి తెల్పేను
ఉల్లము ఝల్లై ఉవ్విలూరేను
మల్లెల మెర్పై మన్సె దోచేను
అల్లరి చేసే ఆశె పెంచేను
జల్లులొ తుడ్సే చింత తొల్గేను
ధైర్య మిచ్చేను ద్యాస పెంచేను
కార్య మయ్యేను కాలమింతేను
ఆర్య పల్కేను ఆశ తీర్చేను
సర్వ మయ్యేను దైవ నీడేను
0


సత్యం దమ స్తప శ్సౌచం సంతోషో హ్రీ: క్షమార్జవం 
జ్ఞానం శమో దయా ధ్యానం ఏష ధర్మ స్సనాతనః

అర్థము:-సత్యము,యింద్రియ నిగ్రహము,తపము,శుచి,సంతోషము,లజ్జ,ఓర్పు, ఋజుత్వము,జ్ఞానము,మనో నిగ్రహము, ధ్యానము  ---  ఇవన్నియు సంతోషాన్నీ, సుఖాన్నిస్తాయి యిది సనాతన ధర్మము.

సత్యానృతా చ పరుషా ప్రియా భాషిణీ చ 
హింస్రా దయాళురపి చార్థపరా వదాన్వా
నిత్యవ్యయా ప్రచుర నిత్యా ధనాగమా చ
వారాంగనేవ రానేకరీతి:

తా:-- రాజనీతి వారాంగనవలె పలువిధముల ప్రవర్తించు నట్టిది,  పరస్పర విరుద్ధ గుణములు గలదియై  సమయానుకూల వర్తన కలిగియుండును. సత్యము, అసత్యము, 
పారుష్యము, ప్రియవాక్కు, హింస,  దయాళువు, లోభి,  దానశీల, బాగుగా ఆర్జించునది, విచ్చలవిడిగా వ్యయము చేయునది  ఈ రీతిగా విరుద్ధముగా ప్రవర్తించునట్టిది.
సంసార సర్ప దుష్టానాం జంతూనా మవివేకినాం 
చంద్రశేఖర పాదాబ్జ స్మరణంపరమౌషధం 

తా:- సంసారమనే విషసర్పముచే కాటువేయబడి, స్మారకం లేకుండా పోయిన అవివేకి 
జంతువులకు చంద్రశేఖరుని పాదాబ్జ స్మరణము తప్ప వేరు ఔషధము లేదు. ఆ మహాత్ముడే కదా భుజగా భూషణుడు, కాలాహితపతీనూ నపాణి పాదప పలో

స నేత్రప పలో స్వజ -- నస్యాత్ వాక్చపల శ్చైవ 
న పరద్రోహ కర్మథ: 

తా:--ఊరక కాలు చేతు లాడించుట, కండ్లుత్రిప్పుట,  వికారచేష్టలు, అధికప్రసంగములు 
పరులకు నష్టము కలిగించే పనులలో బుద్ధిని పోనిచ్చుట  -- యివి బుద్ధిమంతుడైనవాడు చేయరాదు.

  
షట్పదీకామావతారము***
==
కామావతారము లేక సారంగరూపకమునకు ప్రతి పాదములో నాలుగు త-గణములు. ఈ వృత్తపు సరిపాదములలో చివరి త-గణమునకు బదులు గురువును ఉంచి వ్రాసినది యిది. ఇది కుసుమషట్పదియొక్క ఒక ప్రత్యేకత.
==
జీవమ్ము నీదైన 
భావాలు నీవౌను 
నావేమి లేదిందు - నాదైవమా 
ఈవేళ నీతోడ 
నేవేళ నీతోడ 
రావేల నాతోడ - రాగాంబుధీ 
==
కాలమ్ము రాత్రయ్యె 
నీలమ్ము వ్యోమమ్ము 
వేళయ్యె రావేల - ప్రేమమ్ముతోఁ 
బాలించవా నన్ను  
దేలించవా నన్ను 
లాలించవా నన్ను - రమ్యమ్ముగా 
==
నామానసమ్మందు 
నీముద్దు రూపమ్మె 
సోమద్యుతుల్ నింపె - సొంపీయఁగా 
కామావతారుండ 
ప్రేమావతారుండ 
శ్యామావతారుండ - చల్లంగ రా 
==
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
0

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి