హలముఖి రలస..పంచపాది
(401)
అంచగా తెలుప తలపుల్
పంచుకో నిజము వలపుల్
మంచినే మనకు మలుపుల్
ఎందుకో అనక సుఖముల్
మౌనమే ఇదియు ఈశ్వరా
(402)
అందమౌ చిలుకు కులుకుల్
ఛందమౌ తెలిపి వలపుల్
విందుగా బ్రతుకు మెతుకుల్
అందుకో సుఖము బ్రతుకుల్
మౌనమే ఇదియు ఈశ్వరా
(403)
దైవమే మనకు దరియున్
భావమే తెలుపు కళలన్
పోవుట అనకు పలుకున్
త్రోవయే ఇదియు మనకున్
మౌనమే ఇదియు ఈశ్వరా
(404)
దేవియే మనసు తెలుపున్
నీవుగా పలుకు నిజమున్
మౌవిపై హృదయ జతగన్
పూవులే సొగసు తెలుపున్
మౌనమే ఇదియు ఈశ్వరా
(405)
మేలుగా మనసు మధురమ్
ఏలెనే. సొగసు అధరమ్
మెల్లగా వలపు వినయమ్
కాలమే కదలె సమయమ్
మౌనమే ఇదియు ఈశ్వరా
(406)
ధర్మ మే మనకు సహనమ్
ధైర్యమే మనకు వినయమ్
మర్మమే మనకు తరునమ్
కర్మయే మనకు జపతమ్
మౌనమే ఇదియు ఈశ్వరా
(407)
నీవుగా తెలుపు బ్రతుకున్
తావుగాగా తెలిపె తిధియున్
నీవుగా తెలిపె విధియున్
కావు గా తెలిపె మధియున్
మౌనమే ఇదియు ఈశ్వరా
(408)
పాములే విషము చిందించున్
తేలుయే భయము తెప్పించున్
కప్ప లే జలము నేలందున్
పీతలే తెలుపు కష్టమున్
ప్రాణులై బ్రతుకు ఈశ్వరా
(409)
స్నేహమే మనసు ఛేదించున్
మొహమే ప్రతిభ తగ్గించున్
దాహమే తపన వేదించున్
వేషమే వినుము వాందించున్చు
వ్యూహమే ఇదియు ఈశ్వరా
((()))
మయూరసారి - రజరగ-6
(410)
శక్తికై మనస్సు భక్తితోనే
భక్తికై తపస్సు సూక్తితోనే
సూక్తికై యశస్సు యుక్తితోనే
యుక్తికై వయస్సు ముక్తితోనే
ముక్తికై ఉషస్సు యె ఈశ్వరా
(411)
మంచినే తలంచు నిత్యమాయే
యోచనే మధించు సత్యమాయే
అంచనే ఫలించు పైత్యమాయే
పంచనే జపించు తత్వమాయే
యాచనే జయమ్ముగా ఈశ్వరా
(412)
విందుయే సుఖాలు అందుకోవా
దేవియే ముఖాన సర్దుకోవా
భావమై భయాన్ని మార్చుకోవా
మౌనమై మొహాన్ని పంచుకోవా
అందమే అనంతమే ఈశ్వరా
(413)
బుద్దితో విశాల దృక్పధమ్మే
వృద్ధితో అనేక మార్గమమ్మే
సిద్ధితో సహాయ భావనమ్మే
విద్దెతో వివేక భోదనమ్మే
పద్దుయేను మాది లే ఈశ్వరా
(414)
మక్కుతోను నేను చుడాలిలే
కక్కు పాట నేను ఆడాలిలే
అక్కడానె నున్న కావాలిలే
ఇక్కడా నె నున్న పొందాలిలే
చక్క నయ్యగాను లే ఈశ్వరా
కైతసెల - న/మ/న/గ - పంచపాది
మనవు నీతో మందిరములో
దినము నీతో అందరములో
వనజ నేత్రా సుందరములో
ప్రణయ గీతా మందగములో
మనసు ఆటా ఈశ్వర ములో
శిలగ మారే చిత్తమవఁగా
కలల తీరే నమ్మకముగా
వెలుఁగు పొందే వేలపరగా
కలుగు నేమో కైత సెలగా
మెలగ నేమో ఈశ్వరునిగా
అమిత తేజా హర్ష వలయా
కమల తేజా కామ కలయా
విమల చిత్తా విశ్వ నిలయా
శమన తేజా సత్య వలయా
అమిత తేజా ఈశ్వర మయా
సమము చిత్తా సాధనముగా
విముఖ చిత్తా వేదనముగా
గమన చిత్తా గోలయనగా
కమల చిత్తా కామితముగా
విమల చిత్తా ఈశ్వరని గా
పలుకు లన్నీ పాఠములుగా
పిలుపులన్నీ పీఠములుగా
మలుపులన్నీ మానసముగా
తలుపులన్నీ తామసముగా
అలక లన్నీ ఈశ్వరునిగా
వరములన్నీ వాడకముగా
తరువులన్నీ తేటతముగా
కరవు లన్నీ కామితముగా
బరువులన్నీ బాధ్యతముగా
కరములన్నీ ఈశ్వరునిగా
పంచపాది IIUI -UIII
వినయమ్ము చూపుటయు
కలమాయ మాపుటయు
బల మంత వేదనయు
కళ లన్ని నేర్చుటయు
విధి రాత శంకరుడు
చిరునవ్వు పంచుటయు
మరి తెల్పి ఆగుటయు
దరిచేరి వేడుటయు
కరిలాగ సాగుటయు
విధి రాత శంకరుడు
పరువాన ఉండుటయు
దరహాస మాడుటయు
విరి సొంపు మాటలయు
మరుమల్లె వాసనయు
విధి రాత శంకరుడు
సకలమ్ము కారణము
మకుటమ్ము పాలనము
సకటమ్ము ఆధారము
వికటమ్ముఁ వాదనము
విధి రాత శంకరుడు
మనసంత రోదనము
రణమంత దారుణము
వినునంత ఆదరము
కణమంత కోమరము
విధి రాత శంకరుడు
మదిలోని మచ్చలుయె
గదిలోని వెచ్చనియె
విధిరాత ఆటలుయె
నిధికోస మాటలుయె
విధి రాత శంకరుడు
చతురత్వ విద్యయును
చతురత్వ భాషయును
చతురత్వ కోపమును
చతురత్వ తాపమును
విధి రాత శంకరుడు
మరుజన్మ యన్నదియు
చిరుగాలి మన్ననయు
కరి మాయ కోరికయు
విరజాజి వెల్గులయు
విధి రాత శంకరుడు
దరహాస తీరు దయ
విరజాజి మారు దయ
అరవింద తీరుదయ
కరువంత పెర్గు దయ
విధి రాత శంకరుడు
UUU UI III UU
లోకంలో ప్రాంత కళల వృధ్ధే
సౌఖ్యంగా సేవ సమయ బుధ్ధే
చక్రంలా తిర్గు వినయ శుధ్ధే
శ్రీ కారం తెల్పె మనిషి విధ్యే
సౌకర్యం ఈశ్వర కృషి పృద్వీ
లోకంలో ప్రేమ పరుగు నిప్పే
సక్యత్వం వల్ల చలువ ఒప్ఫే
వక్కానిచ్చే తరుణము మెప్పే
చుక్కానిచ్చే మలుపులు చెప్పే
సౌకర్యం ఈశ్వర కృషి గొప్పే
లోకంలో ప్రేయసి కళ ఓర్పే
చీకూచింతా కళ నిజ మార్పే
చీకట్లే మార్చు వెలగు నేర్పే
వాకిట్లో కల్సి బతుకు కూర్పే
సౌకర్యం ఈశ్వర కృషి తీర్పే
లోకంలో ప్రీతి యనున దేదీ
లేకుండే కాని మన సనేదీ
ఏకంగా ప్రేమ కళ కనేదీ
ఈ కొద్దీ సాంబ మధుమనేదీ
సద్భావమ్మే మనసున శక్తే
దర్భమ్మే కరుణతొ యుక్తే
సౌందర్యమ్మే వయసున రక్తే
సమ్మోహమ్మే సమయము ముక్తే
సందర్ మ్భమ్మే సహనము శంభో
IIUII UUI - IIUII UI U
సమభాగము పంచేను
నిముషమ్ముగ చూచేను
విముఖముగా పల్కెను
సముఖము గా వచ్చెను
తిమిరమైను ఈశ్వరా
చరణమ్ముల నీవిరా
చరణమ్ములఁ గొల్తురా
హరియంచిల నేనురా
హరుసమ్మున దల్తురా
పరువమ్ము యె ఈశ్వరా
మదణమ్ములు నీవంతు
తరుణమ్ములు నావంతు
చిరుహాసము నీవంతు
పరిహాసము నావంతు
మనసమ్ముయె ఈశ్వరా
సరసమ్ముగ రమ్మురా
సరసీరుహ సొమ్మురా
వరమీయఁగ దమ్మురా
వరదా పరమాత్మరా
అరుణోదయ ఈశ్వరా
సమయమ్ముగ ఆడగా
సమయాసమ నేతగా
తమసీయగ మాటగా
సమయా పరమాత్మగా
తనుమాయయె ఈశ్వరా
--((**))--
శ్రీ కృష్ణ వాణి ---పంచపాది -- పద్యాలు
(1)
లయానుగణుడై చరణాగతుడై
ప్రకాశించు వెలుగై దృష్టి దోష శక్తుడై
చల్లని వెన్నెల దారై అమానుష స్ధితిపరుడై
దిక్కులేనివారికి దికై ఆశ్చర్యానికి ఆచారుడై
ముల్లోకాల్లోఇడుగో ఇడుగో వచ్చే కృష్ణుడై
(2)
కనపడి కనపడనివాడై
తిరుగుచున్న కన్నులున్నవాడై
చిత్రవిచిత్రాలు చేయువాడై
సొంపుగా తనువునే మార్చువాడై
పిల్లగ్రోవి కలవాడై ప్రత్యక్ష కృష్ణుడై
(3)
ముఖంలో కళవాడై వేషధారుడై
గొల్లపల్లెవాడైకళలకే ఆకర్షితుడై
హస్తాలకు కంకణధారుడై
శిరమున పింఛముధారుడై
ముల్లోకాల్లో ఇడుగో ఇడుగో కృష్ణుడై
(4)
కళ్ళలో మెరుపు చూపువాడై
నవ్వుచూ చంద్రునివంటివాడై
కనక వజ్రా భరణ దారుడై
కళ్ళు తిప్పుచు ఆనందపరుచువాడై
చల్లని ఒక పదార్ధుడై కృష్ణుడై
(5)
ప్రత్యక్ష కృష్ణుడై వచ్చి ఆదుకునే వాడై
వచ్చే చిన్న పిల్లోడై ప్రత్యక్ష కృష్ణుడై
వచ్చే పాదాలకు మువ్వల ధారుడై
ప్రత్యక్ష కృష్ణుడై వచ్చి ఆదుకునే వాడై
పాదాలకు మువ్వల ధారి కృష్ణుడై
(6)
ముల్లోకాల్లో గొల్లవారి అలంకారుడై
ఇడుగో ఇడుగో వచ్చే స్మిత భాషుడై
బేలుకుచూపులు కలవాడై
మందహాసముతోఁ మెచ్చువాఁడై
సమ్మోహనారూపుడుగా కృష్ణుడై
(7)
పాలబుగ్గల కలవాడై
చల్లగా వచ్చి చక్కపెట్టువాడై
మనస్సును ఉడికించు వాడై
సంపదను పంచువాడై
ఆదుకునే వాడు ప్రత్యక్ష కృష్ణుడై
(😎
యోగులను కాపాడిన వాడై
యోగుల తాపము పోగొట్టువాడై
గోపికల చీరలు దోచినవాడై
ఇంద్రుని గర్వం అణచినవాడై
వచ్చి ఆదుకునే వాడు కృష్ణుడై
(9)
లోకాలను రక్షించిన వాడై
దొంగ భక్తిని అణచినవాడై
నామస్మరణకు లొంగిన వాడై
గోపికలను ఆడించినవాడై
చిత్తమునకు వశమై ప్రత్యక్ష కృష్ణుడై
((())))
ప్రాంజలి ప్రభ
నేటి కవిత : మేళకర్త
నేనులేక బీజమేది।।
నేనులేక వృక్షమేది।।!?
నేను లేక వంశమేది
నేను లేక సృష్టి ఏది ।।।?
ఈశ్వరా మనకు ఏది ?
మనసులేక రాగమేది।।
మనసులేక భోగమేది।।!?
మనసులేక తృప్తి ఏది
మనసు లేక మోక్షమేది ।।।?
ఈశ్వరా మనసు ఏది ?
ప్రేమఅడవి దారితప్పి।।
ప్రేమ చెలిమి చేరు ఒప్పి ।।।।?
ప్రేమ మడుగు దారితిప్పి
ప్రేమ సంద్రము చేరు ఒప్పి ।।।।। ?
ఈశ్వరా వనము ఏది ?
తలపులేక తాపమేది।।
తలపులేక బంధమేది।।!?
తలుపులేని వాకిలేది
తలుపు తెర్చె శక్తి ఏది ।।।?
ఈశ్వరా వనము ఏది ?
మాటగుడియె మౌనంలో।।
ఉందన్నది చెప్పాలో ।। ?
కాల వలపు మాయలో ।।।।।
కాల ముందన్నది చెప్పాలో ।।?
ఈశ్వరా వనము ఏది ?
సెగలులేని దేహమేది ।।।
సెగలులేని గుండ మేది।।।। ?
వలపులేక మోహమేది।।
వలపులేక గంధమేది।।!?
ఈశ్వరా వలపు వనము ఏది ?
నిప్పుపూల కడలిలోన।।
మునకలేగా జీవితాన ।।। ?
విప్పిచెప్పు కవిలోన ।।।
కళలు ఏగా జీవితాన ।।।।।। ?
ఈశ్వరా జీవితము ఏది ?
తపములేక సాధ్యమేది।।
తపములేక సౌఖ్యమేది।।!?
జపములేక భక్తియేది ।।।।।
జపములేక శక్తి ఏది ।।।। ?
ఈశ్వరా జీవితశక్తి ఏది ?
కనురెప్పల పాటలోనా ।।
స్వరమధురిమ అందేనా।।?
చలిమంటలు గాలిలోనా ।।।
తృప్తి సరిగమ అందేనా ।।। ?
ఈశ్వరా జీవితము ఏది ?
మెఱుపులేక మంత్రమేది।।
మెఱుపులేక జ్ఞానమేది।।!?
చదువులేక తంత్రమేది ।।।।
చదువులేక యంత్రమేది ।।।?
ఈశ్వరా జీవితము ఏది ?
తోడులేక దీపమేది।।
తోడులేక స్వర్గమేది।।!?
ఈడు లేక జీవియేది ।।।
ఈడు లేక మోక్షమేది ।।। ?
ఈశ్వరా జీవితము ఏది ?
హంసధ్వని కల్యాణీ।।
సింహధ్వని శర్వాణి
స్వరకర్త మానవస్వరూపిణి
మేళకర్త మాధవ త్రినయని ।।
ఈశ్వరా జీవితము ఏది ?
--(())--
పంచపాది
భయము నీకేలరా మనసు లేదేమిరా
మనసు వాదమ్మురా మధిర త్రాగుమురా
వయసు పొంగేనురా సొగసు పంచేనురా
సొగసు చిందేనురా వారు పందేనురా
ఉషస్సు పిల్పేనురా సౌకరాయ్ మీశ్వరా
ఆకలే అణకురా జాతరే తెలపకురా
మోహమే అనకురా సేవలే మనకురా
అసలు నీకేనురా కొసరు కోరేనురా
వెతలు నీకేనురా పసరు మింగాలిరా
బాధలు నాకెనురా భారము నీదే ఈశ్వరా
తక్కువ చేయనురా ఎక్కువ చేయనురా
మక్కువ చూపుమురా చక్కగ ఉండుమురా
భాధలు ఎందుకురా వేదన ఎందుకురా
సేవలు నీకునురా స్వేదము ఎందుకురా
ఎక్కువన్న నీవే తక్కివన్న నీవే ఈశ్వరా
తాపము చూడుమురా తమకం విడువుమురా
కోపము వద్దునురా లాస్యము ఆడకురా
భాద్యత నాదియురా భారము నాదియురా
భాగ్యము నాదియురా భావము నీదియురా
భద్రతగా ఉంచితిరా భవిష్యత్ నీదె ఈశ్వరా
అంతయు పొందుమురా సాంతము నీదియురా
బ్రాంతియు వద్దునురా సొంతము చెప్పకురా
దాహము తీర్చుకోరా దాపరికం వద్దురా
ప్రేమను పొందాలిరా దాస్యరికం హద్దురా
సర్వము నీదేనురా సహనము పంచు ఈశ్వరా
వనిత నేనుండ వలపుతో వగలు నిండ
చెరువు నీరుండ కలువల తొ బురద నిండ
తగువు లేకుండ సుఖముగా తపన ఉండ
సహన మేవుండ సహజమే స్నేహ ముండ
చిరుత ప్రాయము వల్లనే చలిత మయ్యె ఈశ్వరా
మనసు చేసేది నిత్యమ మగువ మాయ
మతము చెప్పేది జరిగిన మలుపు మాయ
గురువు తెల్పేది నేర్చిన గుణము మాయ
కాల మెప్పుడు చెప్పెది గాధ మాయ
వేష మేదైన లీలయే విధిగ మాయ ఈశ్వరా
ముసుగు అసమర్ధుడు తెలుపు మునక మాయ
మగువ ఆభరణం మతి మధుర మాయ
యువత బద్ధకం విద్యకు యుగపు మాయ
మనిషి మమతను కధలను మగని మాయ
వినయ జీవితం లీలయే విధిగ మాయ ఈశ్వరా
పలుకు చెయలేని గొప్పల పగటి కర్ర
అలక శోధనకు సాధనకు అమలు కర్ర
పనికి సంపద శక్తియే పలుకు కర్ర
వినయము బతికి బతికించు విమల కర్ర
కథలు తెల్పుచు లీలయే కళల మాయ ఈశ్వరా
మగని మనశాంతి తెగువను మగువ కర్ర
తరుణి మనశాంతి తపననుఁ తరుణ కర్ర
వలపు ఉయ్యాల పిల్లలు వరుస కర్ర
తలఁపుఁ తువ్వాల తిండిని తపన కర్ర
మలుపు లెన్నైన కదలాలి మనసు మాయ ఈశ్వరా
సీస పద్యము
చీర ఏల మెరుపు చిత్ర మేల తలపు
హృదయమందు మలుపు హాయి గొలుపు
శృంగార జీవితం సుగుణాల బ్రతుకు గా
సోయగం చూపుతూ సోకు గుండె
చిన్మయ రూపము చూపుల కవ్వింత
చురుకుదనమ్ముగా చుక్క గాను
పుష్పమై చిందులే పుడమిన నక్షత్రం
పురివిప్పి నాట్య మై పలక రింపు
ఎర్ర ఎర్రని మందార ఎదను చూడు
నేల చూపుల పువ్వులు నటన చూడు
ఏది రక్షణంబు యువతి కీడు జోడు
మాట పల్కులేని పెరుగు మనసు చూడు
((()))
పంచ పాది . ప్రకృతి
కామ్యభాగ్యము గాను మోక్షద వనిత ,
సౌమ్యము గాత్రము మోహనమ్ జగతి .
రమ్యము నామము శోభితం పొలఁతి ,
గమ్యదం లలన గా ప్రణయమై పడఁతి
శ్రీ హేమమాలిని ఆశ్రయం ఈశ్వరా
ఛందమై తానైన సాద్వీమ జగతి
బంధముల్ విడిపించు భవ్యత వనిత
అందమున్ కల్గించు నయనాల పడతి
చిందులు తోసుఖం చూపించు పొలఁతి
కసిగాను ప్రేమతో నలిపేను ఈశ్వరా
గెలుపుకై పట్టుదల కష్టమే జగతి
మలుపుకు కృషిచేయ దలిచాను పడతి
సంతోష పరుచుటే నీవంతు పొలఁతి
విత్తుగా నీలోన నేనులే వనిత
సఖి కంటి భాషయే ఇదియేను ఈశ్వరా
కడలిని నేనైతె నదిగాను జగతి
కడిగిన ముత్యము నేనేను యువతి
గాలిగా నీవెంట నేనేను పొలఁతి
జాలిగా కాదులో శ్వాసను వనిత
చెలియ కవ్వింపు కధలుగా ఈశ్వరా
మందార మకరంద మాధుర్య మధువుగా
విందార వివరించు విస్తరి విరుపుగా
కామ్యమ్ము భగ్యమ్ము మోక్షమ్ము కాంతగా
సోమ్యమ్ము రమ్యమ్ము గమ్యమ్ము సొంపుగా
వైభోగ రంజనీ రసమయం ఈశ్వరా
కడలి లోనది కలియును కాల మాయ
నదిని వేరు చేయను లేము నటన మాయ
కడచినట్టి కఫ్టము రాదు కాల మాయ
ప్రేమ కానరాదు జగతి ప్రేమ మాయ
మంచి చెడుతెల్సి ఉన్నాను మాయె కనుక ఈశ్వరా
మడత దాచుకున్న మనసు ముద్దు లగును
రేపు అయిననూ రేపు యే రవ్వ లగును
నిజము దాచుట వేషమే నటన లయ్యె
జాబి లమ్మగ కదిలేను జాతి వెలుగె
కలుషమ్ము తొలగించి -- కలకాల ముండు ..
కనికరం చూపించి - కాలమ్ము చూడు
కలలన్ని తీర్చేట్లు -గలగల నుండు...
కనుమరుగవుతున్న - కధలను చూడు
అలలులా కదిలేను - అలుకలే లేక ...
తలపులు తెల్పుచూ - తరతమ మొద్దు
కళలన్ని చూపియు - కలతల ఓర్పు..
వలపుల దాంపత్య - వాదన తీర్పు
****
తరుణము ఇదియెగా --తడిపొడి తపన--
తనువులు అనకుమా -- తరతమ బ్రతుకు
మురిపాలు కలలుగా --- మురిపము తపన
మునుగుట దేనికే -- మునసబు బ్రతుకు
విరజాజి పువ్వుగా -- విరిసేను తపన
విరిమల్లె మాధురి --విరుపాయె బ్రతుకు
కరుణతో కధలుగా-- కారుణ్య తపన
కర్కశ బోధనా-- కాదులే బ్రతుకు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి