అరు ణేoద్ర
సీస పద్యము
...
*వార్ధక్యం* అరుణేoద్ర
పసి జీవనం మిసి యవ్వనమ్ము గాను
నేడన్ని మాయల నీడలగుట
దుడుకుతనం నిత్య దూర్త లక్షణమ్ము
జీవిత నౌకయె తీర మందు
సాగాలి తీరము సామరశ్వ మగుట
ఏ దరి చుక్కాని ఏమిచేయ
మాయల జాలమై మనసు దోచు చుండు
గందరగోళమే కాల మగుట
తే.సుందరమనె సుఖము ఏది శుభతరుణము
ఒక్కటే ననె సౌఖ్యము ఓర్పు మార్చు
స్వప్నమే కనె మనిషికి స్వర్ణ ఆశ
కల్లలాయెను బుద్దియు కాల మాయ
.....
అరు ణేoద్ర
అనుభవం అనుభూతి ఆదరణ కళలగు
బహు కాంక్షలు విధి బంధ మవ్వు
శూలాలై మంటలై సూత్ర మగుట ఏల
సంవేదన కథలు పంత మేది
వదిలని తోడులే వలపు తలపు మలువు
కదిలెడి జోడులే కలలు తీరు
ప్రేమ పాశంలో న ప్రతిభ సూణ్య మగుట
విలయములోకథ వింత తీరు
గీ. సర్వ మిచ్చెను మహిళగా సమయమందు
ప్రేమ సర్వము పంచెను ప్రియుని చెంత
త్యాగ బుద్దియు నిర్మల తత్వ మగుట
ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభల గీత
.....
నేటి కవిత--- సత్యయజ్ఞం
ప్రకృతిలో సహజ సమస్త
ద్రవ్యములన్ని
సృష్టి వ్యవస్థలో భగవంతుని
ఫలము లగుట వెలుగే
సూర్యుడు నిలకడ గా
వేడి వెలుగునూ
పృథ్వి నుండియె ప్రాణులకు
పోషణ గనులే ఆహారమ్ముగా
వాయువు దేహంలో
జీవశక్తిని చేర్చు
శబ్దతరంగ శక్తిగను
ప్రసరణకు మూలమగుటే
దోహద పడుతుంది
మనము పీల్చే గాలి
నడిచేటి నేలా త్రాగే నీరూ
సుఖములే ప్రకృతి సృష్టియే
సృష్టి చక్రంలో,
మనం ఉండి
వ్యవస్థ కోసం
వీధి విధింప వినయం
వాత్సల్యం ధర్మార్థం
స్వపరరక్షణ
నిత్య కర్తవ్య దీక్ష
సమయ పాలన
సహధర్మచారి
సహన బుద్ధితోడుగా
సత్య యజ్ఞమే
((()))
ప్రాంజలి ప్రభ .... లలిత శృంగారలీలామృతము (14 )
పెనవేసె లక్షణ మంత కలిమి
పెనుమాయ కమ్మిన అంతరా లమునందు
మానవ సంభంద హృదయ బలిమి
ఎన్నడూ కరగని ప్రేమను అందించి
సుఖముల వెలుగులు కమ్మె చెలిమి
నవ్వుల మాలను విసిరియు కళలను
నెరవేర్చి వెతలను తీర్చు కృష్ణ
ధరణిఁ ధేనువు పితుకంగ దలచితేని
జనుల బోషింపు మధిప వత్సముల మాడ్కి
జనులు పోషింప బడుచుండ జగతి కల్ప
లత తెఱంగున సకల ఫలంబు లొసఁగు
--(())--
ప్రాంజలి ప్రభ .... లలిత శృంగారలీలామృతము (13 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
పలుకుల రాగము నీవైతె మనసుకు
శృతికల్సి ఉండెటి శక్తి నివ్వు
వలపుల భావన వెయ్యెళ్ల వెన్నెల
మాకును అందింప చేయు కృష్ణ
తలపుల ప్రేమను పంచియు పొందియు
సౌఖ్యము కల్పించు బాల కృష్ణ
తలుపులు నీకోసం తెరచియు ఉంచాను
నాహృద యములోన ఉండు కృష్ణ
తేటగీత
బువ్వ తిన్నాక ఆకలి తీరు కృష్ణ
నీళ్లు తాగాక దాహము తీరు కృష్ణ
గాలి పీల్చాక ఆరోగ్య మేను కృష్ణ
గూడు చేరాక శాంతితొ భక్తి కృష్ణ
--(())_-
ప్రాంజలి ప్రభ .... లలిత శృంగారలీలామృతము (12 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మధురమో చిరునవ్వు మలయాడు చున్నట్టి
ముద్దులు జిలుకు నెమ్మొగము వాడు
పింఛ భూషణములచే వెలయు కుంతలములు
సింగారములు కల్గు రంగుకాడు
వెడద కన్నులతోడ వేడ్క గొల్పెడివాడు
మదన మోహనుడైన మన్మధుండు
శబ్దాది విషయ విషామిషంబులు గోరు
చున్న నా మనమున నున్నవాడు
దివ్య తేజంబు కన్నులు తెరిచి నంత
గానబడుచుండు నాకు నిక్కంబు పెద్ద
కాల మాజ్యోతిగాంచితి కరణ తోడ
నన్ను రక్షింప శ్రీకృష్ణు సన్నుతింతు
--(())--
ప్రాంజలి ప్రభ .... లలిత శృంగారలీలామృతము (11 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నడక తో నాజూకు కృష్ణ కులుకు
పైయద మెరుపుల కదలిక మనసును
అదుపు చేయడం కష్ట మయ్యె
సూరీడు ఎర్రగా మారియు చూడగా
కృష్ణ నుదుటి బొట్టు ఎర్ర వెలుగు
ఏమని కోరేది నవ్వులు చూపేటి
కృష్ణుని ప్రేమల వలలొ పడితి
తేటగీతి
నేను వలలోన చిక్కితి ఏమి అడుగ
లేను నీచూపు నీరూపు హృదయ మంత
నిండి యుండియు శాంతిని పొందియున్న
అడగ కుండగ కోర్కలు తీర్చె కృష్ణ
--(()) - -
ప్రాంజలి ప్రభ .... లలిత శృంగారలీలామృతము (10 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
వజ్రపు మెరుపులు నన్ను పిలిచె
కనకపు పాదాలు కాళ్ళకు గజ్జలు
కట్టినకంఠసరులేలు వెలుగు
మొనసి వడ్డాణ మొగపుల మొలనులు
ఉరముపై కౌస్తుభము మెరియు చుండె
ఘనభుజకీర్తులు కట్టాణి ముత్యాల
మాలలు ధరించు చిన్ని కృష్ణ
తేటగీతి
ముగ్ధ మోహన రూపము చెప్ప నెవరి
తరము లీలలు కొల్లలు ఏంత తెలిపి
నా మనసు నందు తన్మయ మాయ
కప్పి సమ్మోహ పరిచియు చిన్ని కృష్ణ
ప్రాంజలి ప్రభ .... లలిత శృంగారలీలామృతము (9)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
శ్రీ అప్సర స్త్రీల చేతి పూవుల తోడ
నిండార మునిగిన అందగాడు
స్తుతవేణునాద విసృతలహరీ సుఖం
బుల జొక్కి సోలెడు కులుకులాడు
స్రస్తమైపోవు చేలములబట్టుచు, గోపి
కలు జుట్టుముట్టిన చెలువు కాడు
మ్రొక్కెడివారికి మోక్షంబు నరచేత
బట్టియిచ్చెడినట్టి బాలకుండు
ఎల్ల దేవతాళి యుల్లంబుగొన్నట్టి
బాలరూపమైన బ్రహ్మయోగి
నాదు పలుకు లందు మోదంబు లొసగుచు
నాట్యమాడుగాన బాలకుండు
UI UIU - II UIU .. 3001
మౌన మేలనే - చిరు హాసినీ
సేవ చేసితీ - సుఖ భోగినీ
పేరు మార్చకే - నవ మోహినీ
పేరు తెల్పవే - మధు హాలినీ
ఆశ వద్దులే - కల మొహినీ
కాల మడ్డులే - జవ రాలువీ
జాలమేలరా - సర సమ్ముతో
సాదనం ముందే - వయ సుందిలే
మారు పల్కగా - మది నింపరా
ఆరు నూరుగా - ఇది సత్యమే
కారు మబ్బులే - మన పొందురా
వాన చిన్కులే - మన హాయిరా
మ్రోల రమ్మురా - మురిపెమ్ముతోఁ
గాల మయ్యెరా - కరుణించరా
ప్రేమ ఉందిరా - పదిలమ్ముతో
పూల స్పర్శతో - మురిపించరా
--((**))--
అమ్మలుగన్నఅమ్మ
వృద్ధాప్యం -
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మనిషి యద్భవ తత్భావ మేను అనక
మనసు భౌతిక వాస్తవ మేది గనక
వినయ భావపు మర్మము తెల్సు కొనక
విషయ వాంఛల వెంటన ఉండు కనుక ......
యుక్త మధ్యమ వృద్ధాప్య భావ మెలదు
త్యాగ బుద్ధియు ఉన్నదో లేదొ గనుము
శక్తి అంతయు ఖర్చును చేసి గనుము
తార తమ్యము తెలిసికో ఆట గనుము ........
దేహ కాంతియు వృద్ధాప్య మందు తగ్గు
మేధ శక్తియు వృద్ధాప్య మందు పెర్గు
మూడు కాళ్ళను మోసియు ఉండు చుండు
చూపు మంద గిస్తుందని తెల్సి ఉండు ........
ప్రకృతి మౌనముండినదని పూజ చేయి
వికృతి తాండవించినదని సేవ చేయి
సుకృతి ఇదియును అదియును తెల్సి బతుకు
ఎశృతి విన్నను మంచిని తెల్పి కదులు ......
మనకు నైతిక భౌతిక విలువ లుండు
మనము అద్భుత ఆధ్యాత్మికములొ నుండు
మనసు చట్రంలొ చిక్కితే కష్ట ముండు
మనమె ఆచార సాంప్రదాయముతొ నుండు ......
నీలొ నమ్మక వ్యవస్థ తిరుగు చుండు
కాల నిర్ణయ మార్పులు చూస్తు ఉండు
హోళి ఆడేటి కాంక్షయు లేక యుండు
జాలి చూపియు సంపద పంచి ఉండు .........
ఒకరి కొక్కరు తోడుగ ఉండు చుండు
అకట ఆకలి తీర్చియు తోడు ఉండు
అకము పంచియు పొందియు వేచి ఉండు
శకము మారిన వృధాప్య బతుకు ఉండు ..........
--(())--
నమో నమో తిరుమల తిరుపతి వెంకటేశా (1 )
ప్రాంజలి ప్రభ తేటగీతి పద్యాలు
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ
వేంకటేశ్వర మేలుకో తెల్ల వారె
సుప్రజా రామ తూర్పున వెలుగు వచ్చె
నిత్య కర్తవ్య దైవఆహ్నికాలు చేయ
లెమ్ము కౌసల్య పుత్ర శోభ కలి గింపు...... 1
వందనమ్ము శ్రీ వెంకట రమణ లక్ష్మి
వల్ల భాప్రసన్న వదనా సర్వ రక్ష
పద్మములువంటి కన్నుల శ్రీ మతీతొ
కలసి ముచ్చట్లు జరిపియు ఏలుకోవ...... 2
వేంకటేశ్వర నికి చెందిన భార్యగా
బీబి నాంచారి భక్తితో లీన మయ్యె
ముస్లిమా హిందువా అని భెదమేది
లేదు నిష్ట కలియుగ దైవసతి భక్తి........ 3
గురువు బోధాంమృతపు శక్తి యుక్తి ముక్తి
విద్యార్థి చైతన్యపు పరి శోధనలు సాక్షి
ఆత్మబంధువు సేవలు పొందు తీరు
రాకపోకలు లేని స్థితి గతి తెల్పు........... 4
ఎవ్వ రైనా త లఁచినఫు డే ప్రసన్ను
డైకొలిచిన వారికి కూరిమి కలి గించి
వేద మంత్రములను వింటు పరవశమ్ము
పొంది ఆపదలు మాపుము వేంకటేశ ...... 5
ఋతువులు కదిలినా ఋష్య మూక పర్వ
తమ్ము పైఉన్న ఋక్షరాజు డే సహాయ
మిచ్చి ఉన్నను రుణగ్రస్తు డేఅనకయు
ఋషుల మంత్ర పఠనములు వేంకటేశ ...... 6
ఉవ్వి లూరేటి మనసును పొంద లేదు
వయసు ఉరవడి నుండియు రక్ష కల్పు
వాదనను చేయ లేను తృప్తి కల్గ చేయు
శ్రీనివాస ఫలమును కోర ఆశ లేదు ............. 7
కీర్తి
నలుగురి కొరకు శ్రమించి మనిషి తోడు
నీడగా ఉండి సంపద నంత దాన
మిచ్చు విద్యా ఉపాధిని కలసి పెంచి
పోషణ స్త్రీ పురుష విధేయతయె కీర్తి ....... 8
క్షమ
ఓర్పు ఓదార్పు కలిగినట్టి తరుణి బతుకు
నిత్య మంగళ శోభ తో భర్త బిడ్డ
అత్త మామల అనురాగ బంధ నేర్పు
స్త్రీ సహజ గుణ క్షమ శోభ కలిగి ఉండు ..... 9
సీస పద్యము ... వేంకటేశ
పెళ్ళాడుటకు కుబేరునివద్ద ధనమును
అర్ధించి వడ్డీలకు వడ్డి కట్టి
పద్మావతిని పరిణయమాడి, అన్నయు
గోవింద రాజుఅప్పు తీర్చ మన్న
నీలాద్రి కోరికి మీరనీలాలు ఇచ్చు
వారికి సుఖము శాంతు లిచ్చు
నిగ్రహముతొ నిను ఆరాధించు వారికి
తక్షణ మే నువు మోక్షమిచ్చు
ఆటవెలది
నిజము చెప్పు వారి బాధలు తెలపగా
విన్న మాట లన్ని లాల కించె
బతుకు మార్పు కొరకు సహాయ మునుచేసి
నిత్య శోభ నిచ్చు వేంకటేశ
సీసపద్యము - కరోనా 71
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ :
బతుకుబండి జరుపు భాద తగదు
పుణ్యమా ర్గమువీడి పాపమే చేసియు
ధర్మమే మరచియు దారి ఏల
నిష్టగా ఉండక నిత్యచాపల్యము
చూపుట వల్లన చింత కలుగు
విలువలన్ విడనాడి-పెడదారులెలరా
చిరుహాస మున్నను చాలు బతుకు
తేటగీతి
మేడ మిద్దెల హంగులన్-జూడబోకు
ఉన్న దాని లోనె తృప్తి వెతుకు .
నగల ధగధగలన్ గని-వగచబోకు.
కాల మెప్పు డూను మారు చుండు
--(())--
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ :
చూడులే ఈమాయ చూసినా తప్పదూ
సుడి గుండము లోబడి నీచ బతుకు
సకుటుంబ పరివార సభ్యులు అందరూ
కలసి ఉండి మనసు కదలి సేవ
ఎవరెవరినొ జూచి యెందుకు కుమిలావు.
తెలిసిన విద్యను తెలిపి బతుకు
ఆత్యంత ఓర్పుతో నానంద మేకోరు
విశ్వాస భావము విజయ వాక్కు
తేటగీత
విశ్వ మాయను ఏమియు చేయ లేవు
కన్నవారుల మాటను నమ్మి బతుకు
నమ్మి మేలైన జాగ్రత్త చేసి ఉండు
మందు వాడియు ఇల్లు శుభ్ర పరచు
--(())--
సీస పద్యము - 69
సర్వంబు విడనాడి సరిగమ పలుకుతో
సరసము తోడుగ సర్దు తుండె
యుక్తి మార్గమువోయి యున్నత సేవలు
ధర్మాత్ములెందరో దాన బుద్ది
విద్య సాగరమందు విశ్వాసమే చూపి
కళలతో కలసియు సంఘ రక్ష
వినయంగ విధిమాయ వివరించా లన్నది
ఆశలు లేకుండ బతుకు బండి
మానసంబున గ్రమ్మిన మబ్బు తీసి
కాలమాయనంత జయించు బుద్ధి మార్చు
దేశ సేవను చేసిన లక్ష్య సిద్ధి
ఎంత రోగము జీవితం లోన రాదు
--(())--
సీస పధ్యము .. వద్దు ,,,, ప్రాంజలి ప్రభ 29
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
పనిలోన చిన్నని .... పెద్దని అణకులే
పనికాని నిదురపో .... పెదిమి వద్దు
చిరుహాస ముంచులే ... చిరుతలా ఉరకకు
చపలము చూపకు ... చేరు వద్దు
కురులుకోమలములు ... కళకైపులను పెంచు
కలువ కలలన్ని యు ... కళ్ళ వద్దు
కమనీయ మైనట్టి ... కౌగిళి పొందక
కల్లబొల్లి పలుకు ..... ఇకను వద్దు
ఆటవెలది
దేని పనియు దాని కియు ఉంటె తృప్తియు
దాన్ని దీన్ని కలిపి మాట వద్దు
పరువు మంత అడవి కాచిన వెన్నెల
కాక ముద్దు చేసి సద్దు మొగుడ
--(())--
సీస పధ్యము .. పిట్ట ,,,, ప్రాంజలి ప్రభ 28
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సోమరి లాగుండి ... సోంబేరి లనుమారి
సోకులు దేనికే ..... సొగసు పిట్ట
ఏపని చేయక ... ఎదలోన ఉండక
ఎప్పుడూ కావాలి ..... ఎదలొ పిట్ట
ఏరువాకయు పొంగు .. ఏర్పాటు దేనికే
ఏతము వేసియు .... లాగు పిట్ట
ఎరుకగలనునేను ... యదమార్పు కోరావు
ఏమిచేయను ఇక ... ఉండు పిట్ట
ఆటవెలది
ఆశ పాశ మున్న జీవితము సుఖము
గొప్ప పోకు ఉన్న దాన్ని చూడు
ఎండు లేని సుఖము ఇందుయే ఉండును
పొంగు చల్ల పర్చు కోవె పిట్ట
--(())--
సీస పధ్యము .. మల్లె,,,, ప్రాంజలి ప్రభ 27
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ముద్దులొ లకకులే .... ముక్కెర తెస్తాను
మేనకలా గుండు ... ముత్య మల్లె
మేలిముసుగు వలె ... మేలిమై ఉండును
మెలికలు తిరగకే .... మోజు మల్లె
మదిని గ్రహించవే ... మడతపేచీలొద్దె
నెమలిలా నాట్యమే ..... మంచుమల్లె
మదనుడు పిలుపుకు ... మమతను పంచవే
మకరంద మివ్వవే ... మెఱుపు మల్లె
ఆటవెలది
శ్వాస తోను వచ్చి వెచ్చని కౌగిలి
ఇచ్చి పుచ్చు కొనుట ధర్మ మేను
తీరు సరియు చేసి సుఖమును పొందుము
సర్వ లోక మాయ ఇందు లోనె
--(())--
సీస పద్యము.. కృష్ణ మాయ . ప్రాంజలి ప్రభ 26
రచయత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నవనీత చోరుడా ... నెమలీక మకుటమా
వేణుగానములతో .. వెతలు తాకు
పిడికెడు అటుకులు... ప్రియము అన్నావు
చెలికాని ప్రేమించి .... చేయి చాచి
వెర్రిగొళ్లలవెంట .... వేకువనేతిరిగి
వెర్రిచేష్టలతోను ... వింత చూపి
భూషణములు పూలు ... భూమికి గిలిగింత
అభిషేక ములు అన్ని ... అరుపు నవ్వు
విందును వదలి వెన్నను లార గించు
ఆకలి అరటి తొక్కను లారగించి
చెలుల హృదయాల నంటిని లారగించి
భయము తొలగించి పాపాలు లారగించె
--(())--
సీస పద్యము.. లోకం తీరు . ప్రాంజలి ప్రభ 25
రచయత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
తోలుబొమ్మలఆట .. తోలుతిత్తి బతుకు
తోడుఉన్నను లేక ... తిత్తి బతుకు
నయనాల పొరలన్ని ... నమ్మించె చూపులు
నటనకు నాందియు ... నమ్మ బతుకు
రక్తసంబంధాలు ... రమ్యత చూపేవి
పలువిధాల పలుకు ... పాప బతుకు
జీవన మార్గము ... జతకూడి జరుగుట
అదియేను కలియుగ ... మోక్ష బతుకు
సర్వ మెవ్వరు చూడరు జగతి లోన
బతుకు బండియు సాగును కళల లోన
జీవితములు కావడి లాగ కదులు చుండు
ఒకరి కొకరుక లసి మెల సి కల బతుకు
--(())--
సీస పద్యము.. లోకం తీరు . ప్రాంజలి ప్రభ 23
రచయత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
శ్రీకృష్ణ నామము..... శ్రీనిధి చేర్చును
పొగ డ్త కాదిది ..... పరమ విధియు
ఇవ్వటం ఉండినా ... ఈప్సితమ్ము కలుగు
శిష్యుడై జీవించు ... శీఘ్ర గతియు
సవతులు దేనికి .... సమరము చేరును
మనసులు కలతయే ... మౌన గతియు
దూరమున్నను నీవు ... దగ్గరుండగలవు
నిజముతెలిపి బత్కు ... నీవె గతియు
ఆటవెలది
పిరికివాడు గాను ... బతుకుటెందుకు నీవు
కృష్ణ నామ జపము చేసి బతుకు
విజయ లక్ష్మి తోడు ... వెనకనే ఉన్నది
భయము వదలి ఓర్పు చూపి చూడు
--(())--
సీస పద్యము.. లోకం తీరు . ప్రాంజలి ప్రభ 22
రచయత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
రోగమొచ్చినను విరోధం మంచిది కాదు
రాపిడితో నిద్ర - రాత్రి రాదు
శత్రువు బలమున్న .. శోకము తప్పదు
నీతులు చెప్పిన ... నిద్ర రాదు
చోరవృత్తిల లోను ... చేతివాటము పోదు
నిజమని చెప్పిన .... నిద్ర రాదు
స్త్రీద్యాస ఉన్నను .... స్త్రీలోలుడును కాదు
స్త్రీ వెంట ఉన్నను ... నిద్ర రాదు
ఆటవెలది
అనవసర విషయము ... ఎప్పుడూ పలకకు
పల్కు లోన తప్పు పట్ట వచ్చు
నిద్రపట్ట కుండు ... అధికార మోహముకు
పదవి దక్క కున్న ఆశ బతుకు
--(())--
ప్రాంజలి ప్రభ... దేహమే 21
సీస పద్యము
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అందానికి ప్రతి ఆలోచన ప్రశ్న
ఆరాట పోరాట అనుభ వమ్ము
అలకల మోనము ఆదర్శ వైనము
అధరమ్మ పొందుటే అనుభవమ్ము
వస్త్ర వివస్త్రనవనవ లాడేటిది
దేహమ్ము అర్పన అనుభవమ్మ
మగవాని మతిపోగ మతిమరుపు మరిచి
మనసును అర్పించు అనుభవమ్ము
తేటగీతి
మధురిమ, మనోహర నయనాల పిలుపులతొ
మనసు దోచేటి ప్రకృతిసౌం దర్య మంత
మగని సొంతము చేసియు తృప్తి పొంది
దేహ ఆరోగ్య మంతయు తెల్పు చుండు
**(())**
ప్రాంజలి ప్రభ 20
సీస పద్యము .. మోహనా
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మనసు పొగనుకమ్మె మమతపలు వెతలు
మానస వీణయు మ్రోగు చుండె
మనుగడ ప్రశ్నగా మోనమ్ము తెల్పుతూ
మృత్యువు పిలుపులు మ్రోగు చుండె
మది తలపులు కళ మలుపులు తిరిగెను
మసక చీకటి ఘంట మ్రోగు చుండె
మోహన కృష్ణయ్య మా మాయ తొలగించు
మనసుకు ప్రేమను శాంతి నివ్వు
ఊపిరి సలపకయు హరి నామజపము
కలలు కల్లలు అయ్యెను దేవ దేవ
జన్మ ధన్యకా రణమును తెల్పు దేవ
ఎంత వెదికినా శ్రీహరీ కాన రావె
--(())--
సీస పద్యము . 19
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ :
పార్వతీ పతి తెల్పు -పాలసంద్రము తెల్పు.l
కామధేనువు తెల్పు - కంచు తెల్పు ||.
అరుణోదయ మెర్పు -అరుణాచల మెర్పు . ll
అర్కమండలమెరుపు - అ గ్ని మెర్పు ||.
ఇంద్రాచలము నల్పు - ఇంద్రవజ్రము నల్పు.ll
ఇంద్రనీలము నల్పు - యముడు నల్పు ||
రుక్మిణీ పతి నల్పు ప్రేమలు నిజ సల్పు!!
జ్ఞానము తెల్పు - జ్ఞాని తెల్పు
ఏమి తెల్పిన తెల్పక ఉండి ఉన్న
కాల చక్రము తిరుగుతూ ఉండి యుండు
ఉన్న లేకున్నా బతుకులు మారు చుండు
నారు పోసిన నీరుపో సేది వాడు
వాడు అనగా సర్వేశ్వరుడు .ఇదే మాయ
.--(())--
ప్రాంజలి ప్రభ 18
సీస పద్యము.. అబల కాదు .ప్రకృతి
రచయిత..మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మహిళల ఆయుష్షు మన్నన బట్టియు
మనసుకు నచ్చితే మోన మీడు
జవసత్వ ములు అన్ని జీవితానికి ఇచ్చి
జప తాప ములు పంచి జీవ మీడు
నెత్తురు గుడ్డుగా నారిగను పెరిగి
నెత్తురు గుడ్డుకు ప్రాణ మిచ్చి
అబలకాదు మహిల ఆత్మ రక్షణను ధై
ర్యమును శక్తిని పంచు ప్రకృతి మాత
తేటగీతి
స్వేశ్చ లేనిబతుకు కాదు జీవి తాన
స్త్రిల మనసును అర్ధము తెల్సుకొమ్ము
స్త్రీల హృదయము శాంతిని పంచు చుండు
స్త్రీలు లేకుంటే పరుషుడు లేడు లేడు
**(())**
ప్రాంజలి ప్రభ
సీస పద్యము .. మోహనా 17
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మనసు పొగనుకమ్మె మమతపలు వెతలు
మానస వీణయు మ్రోగు చుండె
మనుగడ ప్రశ్నగా మోనమ్ము తెల్పుతూ
మృత్యువు పిలుపులు మ్రోగు చుండె
మది తలపులు కళ మలుపులు తిరిగెను
మసక చీకటి ఘంట మ్రోగు చుండె
మోహన కృష్ణయ్య మా మాయ తొలగించు
మనసుకు ప్రేమను శాంతి నివ్వు
ఊపిరి సలపకయు హరి నామజపము
కలలు కల్లలు అయ్యెను దేవ దేవ
జన్మ ధన్యకా రణమును తెల్పు దేవ
ఎంత వెదికినా శ్రీహరీ కాన రావె
--/////--
ప్రాంజలి ప్రభ
సీస పద్యము (ఆర్తి )
: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఆర్తితో ఉన్నాను ఆరాధిస్తున్నాను
ఆర్భాట మొద్దుయు ఆర్తి చాలు
ఆకలితో ఉన్న ఆశను తీర్చుము
ఆశయ సిద్ధికి ఆర్తి చాలు
అహరహము పిలిచి అసురుసురు పలుకు
ఆనంద పరిచేటి ఆర్తి చాలు
ఆగ్రహ ముంచక అతిధిగా చూడుము
ఆత్మీయత సలుపు ఆర్తి చాలు
తేటగీతి
అరమరికలు లేనిప్రేమ చూపు చాలు
అనుకరణన వసరములే ప్రేమ చాలు
అభినయనము తో అలకల ప్రేమ చాలు
ఆదమరచియు ఉండవలదు ముద్దు కృష్ణ
--(())--
తేటగీతి పద్యాలు (ఉదయరాగ కీర్తన )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ముసి ముసి నవ్వుల మువ్వగోపాలా
మురిప మిచ్చి ముద్దు చేయవా గోపాలా .....
సరిగమలు సరిచేయవా గోపాలా
పదనిసలు సలిపి వెళ్ళవా గోపాలా
హృదయ మందును ప్రణయము నిలిచి ఉండె
ప్రణయ మైనను ప్రియతమా పల్కరించు
స్వర్గము కొరకు స్వప్నము కలిగి ఉండె
స్వప్నమై కన్ను ల్లోనుండు ప్రాణ నాధ
రాయ లేనట్టి ప్రేమను పొందు భాష
భాష తెల్ప లేకయ లేఖ రాసి ఉన్న
మూగ గొంతుకు వెలుగేటి ఉదయ భాష
ప్రేమ నంతయు తెల్పితి ముద్దు కృష్ణ
ఉదయ విల యాలు తెల్పుచు ఉండి ఉన్న
క్షణపు ఓర్పును నీ కొరకును నె దాచి
వెన్నెలగ ఉన్న మనసిచ్చి మురిప మించి
వేణు గానము నకు లోంగె ముద్దు కృష్ణ
ముసి ముసి నవ్వుల మువ్వగోపాలా
మురిపమిచ్చి ముద్దు చేయవా గోపాలా .....
సరిగమలు సరిచేయవా గోపాలా
పదనిసలు సలిపి వెళ్ళు గోపాలా
--(())--
.
ప్రాంజలి ప్రభ
సీస పద్యము (ఆర్తి ) 16
రచాయిట: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఆర్తితో ఉన్నాను ఆరాధిస్తున్నాను
ఆర్భాట మొద్దుయు ఆర్తి చాలు
ఆకలితో ఉన్న ఆశను తీర్చుము
ఆశయ సిద్ధికి ఆర్తి చాలు
అహరహము పిలిచి అసురుసురు పలుకు
ఆనంద పరిచేటి ఆర్తి చాలు
ఆగ్రహ ముంచక అతిధిగా చూడుము
ఆత్మీయత సలుపు ఆర్తి చాలు
తేటగీతి
అరమరికలు లేనిప్రేమ చూపు చాలు
అనుకరణన వసరములే ప్రేమ చాలు
అభినయనము తో అలకల ప్రేమ చాలు
ఆదమరచియు ఉండవలదు ముద్దు కృష్ణ
--(())--
ప్రాంజలి ప్రభ
సీస పద్యము ...్ 15
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
కలువ రేకులులాగ విప్పిన కన్నులు
కమనీయ దృశ్యము హృదయ మందు
కను రెప్ప కదలికలు పిలుచుచూ రమ్మని
చూపులు చేరెను హృదయ మందు
కళ్ళ మెరుపులు వలపుల సురులు పంచి
మైకమ్ము తీర్చియు హృదయ మందు
ముసీమిసి నగవుల రసిక నిధులు అన్ని
నాకు సొంతము చేయు హృదయ మందు
ఆటవెలది
కళ్లు విప్పి కామ మంతయు చూపియు
కని కరముగ కనులు పిలుపు తెలుపు
కావ్య నాయక యగు వనితా హృదయ మందు
నిత్య సత్య ధర్మ పరుడు ఉండె
**)())(*
ప్రాంజలి ప్రభ .. హృదయ
సీసపద్యము 14
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
కమ్మగ గొంతుని నువ్విచ్చి తల్లులు
ఊయలలో జోల పాట హృదయ
పొత్తిళ్ళ పాపను ముద్దాడు తల్లుల
ఆలపించేదియు తత్వ హృదయ
పికమల్లె పాడును జగతి పరవశించు
పిల్లల నవ్వుల మాతృ హృదయ
తావివిరుల అందమే దోచు మకరంద
మత్తును పెంచును మమత హృదయ
తేటగీతి
పుట్ట తేనెయు తీపి, చెరకుర సమ్ము
అమృత మునుకన్న అమ్మపాటలియు తీపి
భవి తవ్యమును తలుపు అమ్మ పాట
హృదయ తత్వము తెలుపును నాన్న మాట
--(())--
సీస పద్యము... 13
ఇకలేరు అనకండి పండితా రాధ్యులు
గంధర్వ సంగీత గాయకుండు
గుర్తుగా సినమా నటులకు గళము ఇచ్చి
నటనా ప్రతిభ గల నాయ కుండు
దర్శక నిర్మాత పలు చిత్ర ములను తీ
సియు జనుల హృదయ గాయ కుండు
శక్తిమే రుకుసహాయము చేసి పలుభాష
గాన గంధర్వుడు సుబ్రహ్మణ్య
నరుల హృదయ మందు సంగీత నాయకా
మనసు దోచె శాంతి గాయ కుండు
అత్మ ఘోష పడక ఆనంద పరిచేటి
స్వర హేళ తృఫ్తి నిచ్చు లీల
***(())**
సీస పద్యము .... 12
ఏమి చెప్పెదనయ్య ఏమేమి తెల్పను
ఏది అన్నను యద పొంగు బాధ
ఏఝాము ఏమియో ఏమార్పు తెచ్చును
ఎరుక లేక మనసు చెందు బాధ
ఏ లక్ష్య సిధ్ధికి ఏకంగ ఏలేను
నీశక్తి అంతయు మమ్మ కాచు
ఏమన్న ఏడు కొండలవాడ ఆదుకో
ఏ తీరు మముకాచి ఏలుతావొ
తేటగీతి
కలి యుగాన వెలసినట్టి దేవ దేవ
మేలి భూషణ ధారి దర్శనము ఇచ్చి
ఏలు సర్వ లోకాలకు సూత్ర ధారి
భార్య లతొ దర్శనము కల్పి స్తున్న దేవ
**(())**
సీస పద్యము .... 11
వడివడి నడకల వెతలను భరించి
వేకువ ఝామున మోదమున్ను
ఓపిక లేకయు ఓర్పును చూపియు
నామము చెప్పుచూ చేరు చున్న
దర్శన భాగ్యము దోబూచు లాడెనె
అయినను చేరెనీ మంది రమ్ము
వేంకటే శ్వరా కరుణ చూపి మాయందు
మీ వీక్షనములను మాకు ఇమ్ము
పరుగు పరుగునా రాలేక మనసు పెట్టి
ఒరిగి పోవుచూ వేంకటేశ్వర అంటు
మరిగి బంధాన్ని వదలక బాధ తెల్పు
చుండితిని అలవేలుమంగ వసుధపతి
మమ్ము ఆదుకోవయ్య
గోవిందా.... హరి గోవిందా
సీస పద్యము
సత్యమనసు తెల్పి సందర్బమునుతెల్పి
దైవమునకు తెల్పె దారి లేక
నిత్య పత్యము చేసి నిలకడ మనసుతో
నామము పఠనము నమ్మి చేయు
నిత్య పనులనేవి నమ్రత తొ తెలిపి
బుధ్ధితో పూజలు బతుకు కొరకు
నిత్య నడకలను నరకము అయినను
దైవదర్శనములు దారి కొరకు
తేటగీతి
కలత చెందియు ప్రార్ధించు కోరుచుంటి
కాస్త బద్దకమును మాపి కాపు కాయు
కాస్త ఓపిక తో అర్చనలలు చెసితి
వేంకటేశ్వర మమ్ముకాపాడు దేవ
**(())**(
సీస పద్యము ...
అమ్మ అనిపిలుపులొ ఆత్మీయ తయెవుంది
అనురాగములతోను అమ్మ భాష
నాన్న అనుటలో ఆరాధ్య ము పెరుగు
అనురాగ ఆకర్ష మాతృ భాష
తల్లితండ్రుల కళ తేటతెల్లమగను
భవితవ్యమునుతెల్పు భవ్య భాష
గురువు నేర్పిన విద్య గమ్యము తెలిపేను
పంచునదియు నిత్య పుడమి భాష
తేటగీతి
అంధులుసహితము చూడు ఆంధ్ర భాష
ఆంద్ర మన్నది మేధస్సు పెంచు భాష
తెలుగు నుడికారము మమత తలపు భష
అందరికి అనుకూలమే అద్భుతమ్ము
--(())--
0సీసపద్యము...
ఫురుషుని హుందాకు పుడమికే తలపులు
ఉండేటి బుద్ధియు ఉత్తరీము
పెద్దరికము వల్ల పరిణత పూర్ణత
సూచిక గమనము చూపు తృప్తి
విశ్వాసపు గుణము వినయ హుందాతనం
దైవసన్నిధినను ధర్మ మొవ్వు
సర్వము నిర్మల సమభావ మహిమయే
విశ్వ మాయలు అన్ని వస్త్ర మోను
తేటగీతి
పంచ కట్టులో ఆంద్రుల పట్టు పంచ
ఉత్త రీయము హుందాగ ఉండు చుండు
మగవ ఆకర్షణకు మరో మడచి కట్టు
వస్త్రము మగవానిలొ గొప్ప వలపు గుట్టు
**(())**
-
సీస పద్యము ..
జనులతో అప్పుల జూదము ఆడేను
చులకన చేసియు జుట్టు పట్టె
అరచేతి బెల్లము అరువవుగా ఇచ్చి
దోచేటి సలహాలు దగ్గరవ్వు
పలుకల నేర్పుతో పల్లకి ఎక్కించి
మనసును దోచేటి మందు చెప్పు
చేతికందినదియు చక్కగా పొందియు
లేదని అరిచేటి వారు ఉండు
తేటగీతి
సిగ్గు ఎగ్గయు లేదునూ చింత లేదు
దోచి సిగ్గవిడిచియు శీ ధనము దోచె
ఆశచూపియు రోగము అంట గట్టి
నంగ నాచిలా జూదపు నటన పుట్టె
**(())**
సీస పద్యము ...
కంటిలో వెలుగులు కలకాల ముండును
కనతకు నెప్పియు కాన రాదు
కంటినీరు నిలవ కదలియు హృద్యమ్మ
చేరియు బాధయు జాడ్య మవ్వు
కన్ను రెపరెపలు కలకాల ముండియు
కన్నులు రక్షణ కామ్య తగును
కంటి పాపయు సర్వమును చూసి గ్రహించి
మనిషికి నడవడి మౌన మవ్వు
తేటగీత
కనుల నల్లకలువరెప్ప కాపు కాసి
కంటి నీరుయు ఉడికిన కాటుకాపు
కల్ల చూపుల కలువలు కామితార్ధ
మిచ్చి ఆకర్ష మిచ్చియు ప్రేమచూపు
--(())---
సీస పద్యము ...
కామము మనసుకు గరళము లాంటిది
గమ్యపు గోచరం క్రోధ మవ్వు
ఆవేశము కలిగి ఆదుర్ద పెరిగేను
మనసులోభ మోహమ్ము మనుగడవ్వు
మదమువిజ్రుంభించి మాత్సర్యము మరచి
శకునిలా బుధ్ధికి శాప మొవ్వు
పట్టిప పట్టుగ మనసుకు వీరంగ
మంతయు చూపుట ప్రేమ కొరకు
తేటగీతి
సంయమనము పాటించి న సుఖముండు
వినయము వినమ్రత కలిగి ఓర్పు చూపు
సహజ ఓదార్పు చూపిన సౌమ్య మవ్వు
మనిషి బాగుంటె నడకకు ప్రేమ పుట్టు
**(())**
సీ.
----
కార్మిక సోదర కళ్యాణ పర్వమ్ము
నేఁడేయనిజగత్తు నిర్ణయంబు
కార్మికు లకిఁటమం గళమేది..విశ్వాన..?
రహదారివాసమే మహదుపకృతి ??
పాలకవర్గాలు పనులనులాక్కొని
వీథిలోపడవైచి వేడ్కఁజూడ
దయగలమేధావిదళమప్డు ముదమార
ప్రతిభను గుర్తించి రాజుఁజేసె
గీ.
--
బాలతరుణవృద్ధజనులు చాల గలరు
కార్మికులుగ లోకమ్మున పేర్మిలేక
కొంతవిశ్రాంతి నిడవలె కూర్మిఁబంచి
వారినెల్లరు కనవలె భూరిమతిని !!! "
------------
సీస పద్యము .. ..
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
విశ్రాంతి సమయమే వీలుగ తల్లీతండ్రి
మనసు ప్రశాంతత పొందు చుండె
ధీమాగ హాయిగ దర్జాగ ఉండేది
సుఖమును పంచేది స్నేహ మొకటి
రాజసం కలిగించి రమ్యత చెందును
ఆలోచనల నిద్ర హాయి గుండు
వచ్చిన బిడ్డలూ వారికి మర్యాద
అలసటల ను తీర్చి హాయి గుండు
తేటగీతి
అమ్మ విశ్రాంతి పొందాక అలుపు తగ్గు
నాన్న ఆదమరిచి కలలు నడుమ నుండు
గురువు విద్యను బోదించి గుర్తు గుండు
అందరూ శాంతి కొరకునే అరుగు దెంచు
**(())**
ప్రాంజలి ప్రభ..2
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సీస పద్యము
జనని గా సార్ధక జన్మను అందించి
బిడ్డల మనసంత నుండ గలుగు
జననిగా ధర్మాన్ని జాతికి అందించి
క్రమ శిక్షణగపెంచు గమ్య మొవ్వు
జననిగా భర్తకు చేదోడు వాదిగా
కష్టములను తెల్ప కుంచ గలుగు
జననిగా భయమును తరిమియు ధైర్యము
ప్రేమతో శాంతిని పంచ గలుగు
తేటగీతి
సర్వ రక్షిత జననియే సహజ మవ్వు
ధైర్య మిచ్చియు జననిగా ధర్మమవ్వు
మర్మ.మన్నది లేనిప్రే మలను నివ్వు
ధర్మ మార్గము బిడ్డల్ని త్రాసు గుంచు
***(())**
సీసపద్యములు
సీస పద్యము
వేదాల విభజించి .. వేదన తొలగించు
వేకువ వెల్లువ ... వ్యాసు డయ్యె
భారతం రచనతో.. భరతఖ్యాతిగను
పెంచి యు విశ్వంలొ ప్రేమ పెంచె
భాగవతమ్మున.. భక్తిని తెలిపెను
పరమాత్మ లీలలు... భాగ్య మయ్యె
భరతవంశమునకు.. బాధ్యత జూపియు
కురువృద్దుడయ్యెను .. కులము నందు
తేటగీతి
సకల శాస్త్రములు రచనతో సక్క భరించి
జగతి లోని వ్యాసుని కృషి జయము పంచు
భారతమ్ము రచించిన భాగ్యశీలి
భాగవతమును పంచిన భక్త వ్యాస ----- 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి