0 Co
17-సత్య దర్శనము
వేమన - రమణులు 17.జ్ఞాని - అజ్ఞాని
దేహాత్మ భావే జడౌ సమానా;
వేకస్య దేహే హృది దీప్త ఆత్మా
ఆక్రమ్యదేహం చ జగచ్చ పూర్ణంః
పరస్య మేయం తను మాత్ర మాత్మా! - సద్దర్శనము.
అర్థము : - దేహాత్మ భావముతో అజ్ఞాని తన పరిమితి తన దేహము వరకే అని భావించును. ఇతరములన్నియు తనకు వేరని అనుకొనును. జ్ఞాని అట్లు కాక తనలో ప్రకాశించే అంతరాత్మను తెలిసికొని, తాను సంకుచితమైన దేహము కాదని ఆత్మయే తానని భావించును.
వివరణ : - ' తత్వమసి ' ఆ బ్రహ్మము నీవే అని మహావాక్యము చెప్పుచున్నది . జ్ఞాని , ' అహం బ్రహ్మాస్మి ' నేను బ్రహ్మమును అను ఆత్మానుభూతిని పొందును.
ఇట్టిట్టనరాని బ్రహ్మము తానే యగును." అయమాత్మా బ్రహ్మ " అనుట చేత తానే సర్వవ్యాపకమైన ఆత్మగా తెలిసికొనును. దేహ పరిధులను దాటి జగత్తు అంతా తానేనని గ్రహించును . అందరిలోను అన్నిటిలోను ఆత్మ ఉన్నదని భావించును.
" మత్త పరతరం నాన్యత కించి దస్తి ధనంజయ " గీత. తనకు వేరుగా ఏమి లేదు అని భావించును. సర్వము తానేయైన వాడు ' అందరిని సమభావముతో చూచును. ' ఆత్మాపమ్యేన సర్వత్రసమం పశ్యతి " ఆత్మకున్ సములుగా జింతించు "
అజ్ఞాని దేహాత్మభావము కలిగి తన పరిమితి దేహమువరకు, ఇతరులను జగత్తును వేరని చూచును. దేహములలో స్త్రీ పురుష భేదము గుర్తించును " నేను వచ్చినాను " " నేను నడచినాను " అన్నప్పుడు ఈదేహమే తాను రా!
ఇదియే జ్ఞానికి అజ్ఞానికి గల భేదము . అజ్ఞానిది దేహాత్మభావము జ్ఞానం మన కలిగియుండును.
భావము:-
తాను తనువుననుచు త్రయమని యెంచెడు
మోహవారి రాశి మునిగి యున్న
జనులకెట్లు మోక్ష సంగతి సిద్ధించు ?
వేమన జ్ఞానమార్గ పద్యములు -
తాను దేహమని , స్థూల , సూక్ష్మ , కారణ దేహములు అనగా తనుత్రయము యెంచెడి వానికి మోక్షమెట్లు సిద్ధించును ?
తొమ్మిది కంతుల తిత్తికి
నిమ్ముగ సామ్ములును కులము నేటికి చెపుమా
నమ్మకు దేహము నీవని
బమ్మము నేననుచుదెలియబలుకు రవేమా!
వేమన జ్ఞానమార్గ పద్యములు - సి.పి. బ్రౌన్
శ్రీరమణులు పశుపక్షి మృగాదులను కూడ ప్రేమతో చూచేవారు. కొండలో తగవులాడే రెండు కోతుల సమూహముల మధ్య సామరస్యము కుదిర్చిరి. ఒక గోవునకు లక్ష్మి అను పేరు పెట్టి దయతో పోషించిరి.
కొమ్మలన్నిటిని నరికి వేసిన ఒక చెట్టును కొండపై చూచి కన్నీరు కార్చిరి. తులసి ఆకులను పూజకై తీసుక వెళ్ళు భక్తునిలో " తులసి చెట్టు ఆకులను గిల్లినట్లే నీవు కూడ నీ దేహమును గిల్లికొని చూడు " అని రమణులు చెప్పిరి.
శ్రీ రమణ భగవానులు దయా సముద్రులు అని ఎవరో అనగా "సముద్రమునకు చెలియలికట్ట అను పరిమితి ఉన్నది. నా దయకు అట్టి పరిమితి" లేదనిరి.
((())))
19-సత్య దర్శనము
వేమన - రమణులు -- ప్రారబ్ధము - స్వయం కృషి
శ్లో ॥ విదేశి ప్రయత్నస్యచ కోపి వాద స్తయోర్ద్వయో ర్మూల మజానతాం స్యాత్!
విధేః ప్రయత్న స్యచ మూల వస్తు సంజానతాం నైవ విధి : నయత్నః II - సద్దర్శనము
అర్థము:- ప్రారబ్ధము , పురుష ప్రయత్నము , ఈ రెండింటిని గూర్చి చేయు వాదములు నిష్ప్రయోజనములు. వీటికి మూలమైన ఆత్మను తెలిసికొన్న యెడల ఈ రెండును ఉండవు.
వివరణ:- ప్రారబ్దము వలన జరుగవలసినది జరుగును. పురుష ప్రయత్నము వలన ప్రయోజనము లేదని కొందరు అందురు.
కొందరు మేము ప్రారబ్ధము నెదిరించి కార్యములను సాధించగలమని వారింతురు వీటికి మూలమైన ఆత్మను తెలిసికొన్ని యెడల ఈ రెండును ఉండవు.
ప్రారబ్దము నిద్రలో లేదు జాగ్రత్ స్వప్నావస్థలలో ఉండును. కాబట్టి జాగ్రత్ స్వప్నములలో ఉన్న మనస్సు యొక్క విలాసమే ప్రారబ్ధము.
పురుష ప్రయత్నమును గూర్చి వేమన ఇట్లనిరి.
+ నవగ్రహముల రాశి జరియించు చుండిన
మంచి చెడుగు గానిపించుచున్న
పురుష యత్నమునుచు పాంగుడు లేలరా ? - వేమన
గోచారము వలన కలుగు మంచి చెడ్డలు తెలియక పురుష ప్రయత్నమని చెప్పుట తగదని వేమన సూచించెను.
జ్ఞానికి ప్రారబ్ధము కలదా ?
శ్లో " ప్రారబ్ధం భోగతో నశ్యత్ శేషం జ్ఞానేనదహ్యతే!
శరీరం త్వతరత్కర్మ తదోష ప్రియ వాదినోః!!
సంచిత కర్మ అనగా వెనుకటి జన్మలలో ఏర్పడిన కర్మ ఫలితము. ఆగామి కర్మ అనగా రాబోవు జన్మలలో ఏర్పడునది.
ఆత్మ సాక్షాత్కారమై జ్ఞానము పొందిన తరువాత సంచిత కర్మ నశించును. జ్ఞానికి పునర్జన్మ లేదు కాబట్టి ఆగామి కర్మ లేదు. ఈ జన్మలో అనుభవించ వలసిన కర్మ అనగా ప్రారబ్ధ కర్మ అనుభవించిన నశించునని పై శ్లోకము చెప్పుచున్నది.
కాని భగవాన్ రమణులు ప్రారబ్ధము కూడ జ్ఞానికి లేదన్నారు. తాను దేహము కాదని , కర్త కానని జ్ఞానియైన తరువాత తెలియవచ్చును. కర్త లేక పోయిన కర్మ ఎక్కడిది ?
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం - గీత . జ్ఞానాగ్నిచే మూడు కర్మలు దహించ బడును.
మహర్షి ఇచ్చిన ఉదాహరణము చూడండి. ముగ్గురు భార్యలు ( కర్మలు ) ఉన్న మనిషి చనిపోయిన ముగ్గురు భార్యలు విధవలౌదురు. కాని ఒకరు ( ప్రారబ్దము ) విధవ కాదని ఎట్లు చెప్పగలము ?
1. కర్మము జ్ఞానికి దవ్వగు కర్మమువకు జ్ఞాని దవ్వు!
2. కర్మ పురాణ మగాధమురా కర్మములో శివుగానమురా!
189-195 వేమన రానమార్గ పద్యములు - సి.పి. బ్రౌన్
'కామఃకర్తా నాహం కర్తా , కామఃకరోతి నాహం కరోమి " కామమే కర్తయని నేను కర్తను కాదనీ , కామమే కర్మ చేయుచున్నది , నేను చేయలేదని , వేదంలో చెప్పబడినది. తాను కర్తనని భావించుట తెలివిలేని తనమే. జ్ఞానిని కర్మలు బాధించవు.
జ్ఞాని చేయు కర్మ నిష్కామ కర్మ అగుటచేత అతనికి పాపము అంటదు. శ్రీరమణులను కర్మయోగ మనగా ఏమని ఒక భక్తుడు ప్రశ్నింపగా, తాను కర్తను కాదని తెలిసికొనుటయే కర్మ యోగమనిరి.
బ్రహ్మనందములో తేలుచున్న జ్ఞానికి కర్మాను భవమెక్కడిది ?
“ యస్మిన్ స్థితి న దుఃఖేన గురణాపి విచాల్యతే " గీత. సహజ సమాధిలో బ్రహ్మానందమనుభవించు జ్ఞానికి ఎంతటి బాధ కలిగిననూ చలించడు.
1948 లో మహర్షి ఎడమచేతి పై ఏర్పడిన కురుపు బాధను , దేహము తనది కాదన్నట్లు శాంతముగా భరించెను. వైద్యుడు " మీకు నొప్పిలేదా ? " అని ప్రశ్నింపగా " నేను నొప్పిని అనుభవించుట లేదు . ' మిథ్యానేను ' లేక అహంకారమునకు అస్తిత్వము లేకున్నను బాధను అనుభవించినట్లు భావించుచున్నది. నాకు బాధ తెలియనట్లు చేయు మందు ( Local Anasthesia ) అవసరము లేదు. " అని చెప్పి ధైర్యముగా చేయి చాచి శస్త్రచికిత్స చేయుమని కోరిరి.
(((())))
20-సత్య దర్శనము
వేమన - రమణులు - నిజమైన దేవతా దర్శనము
శ్లో ॥ య దీశితు ర్వీక్షణ మీక్షతార
మవీక్ష్య తన్మానసికేక్షణం స్యాత్ ,
నద్ర ష్టు రన్యః పరమో హితస్య
వీక్షా స్వమూలే ప్రవిలీయనిష్ణా || - సద్దర్శనము
అర్థము :- ఆత్మ సాక్షాత్కారము పొందనివాడు తాను ఉపాసించే దేవత దర్శన మిచ్చినదని చెప్పుట మనము వినుచున్నాము. ఆత్మకు మించి వేరే దేవుడు లేడు. ఉపాస్య దేవతను చూచుట అనునది మనస్సు యొక్క ఆలోచనా విశేషమే ( మానసికేక్షణం ). మనస్సును ఆత్మ సంస్థము చేసి ఆత్మసాక్షాత్కారము పొందుట నిజమైన దేవతా దర్శనము.
వివరణ :- త్రిమూర్తులు మీకు దర్శన మిచ్చిన మీరు ఏమి చేయుదురు అని కపాలిశాస్త్రి గారు భగవాన్ రమణులను ప్రశ్నించిరి. త్రిమూర్తులు నాకు దర్శనము ఇవ్వరని శ్రీ రమణులు తెలిపిరి, సర్వదేవతా మూర్తియైన ఆత్మగా తాను ఉండగా వేరు దేవతలు దర్శన మెట్లు ఇవ్వగలరని భావము.
దేవతా మూర్తులలో గృహదైవము , ఇష్టదైవము ఉందురు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లు చెప్పిరి.
శ్లో ॥ యోయో యాంయాం తనుం భక్తః
శ్రద్ధయా 2_రితు మిచ్ఛతి
తస్యతస్యాచలం శ్రద్ధాం
తామేవ విదధా మ్యహం - గీత 7-21
ఏ మూర్తి యందు ఎవరికి శ్రద్ధ కలిగి యుండునో ఆ మూర్తి యందే అతనికి శ్రద్ధ నేనే కలుగజేయు చున్నాను.
అట్టి శ్రద్ధచే ప్రార్థించిన భక్తుడొకప్పుడు తనకు తన ఉపాస్యదేవత దర్శనము ఇచ్చినదని చెప్పుట మనకు తెలిసినదే.
"అహమాత్మా గుడాకేశ! " అర్జునా ! నేను ఆత్మను అని చెప్పుకొన్న శ్రీ కృష్ణ పరమాత్మ సర్వ దేవతా మూర్తి కావున భక్తుని కోర్కెలను ఉపాస్యదేవతా మూర్తి రూపములో ప్రసాదించును.
"దేవతలను గొల్చువారు దేవతలను , శ్రీకృష్ణ పరమాత్మను గొల్చువారు తనను చేరుదురని " శ్రీకష్ణుడు తెలిపెను. కావున ఆత్మ సాక్షాత్కారముతో పునర్జన్మ లేని ముక్తిని పొందగలము.
గోపికా వస్త్రాపహరణము :-
భాగవతమున గోపికలు కాత్యాయనీ దేవిని ఆరాధించుటకై వివస్త్రలై స్నానము చేయుచుండిరి. శ్రీ కృష్ణుడు వారి వస్త్రములను అపహరించి చెట్టుపై కూర్చుండెను.
ఆత్మరూపుడైన శ్రీకృష్ణుడు గోపికల హృదయముల యందుండెను కదా ? ( సర్వ భూతాశయ స్థితః ) అతనికి తెలియని గోపికల దేహమర్మము లేమున్నవి ? వివస్త్రులైన వారిని నీటి నుండి బయటికి రమ్మని కోరెను.
మ | వ్రతముల్ సేయుచు నొక్కమాటయిన నెవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మాను - భాగవతము 10-842
కాత్యాయనీ వ్రతమును ఆచరింపగోరిన గోపికలు వివస్త్రలై స్నానము చేసిన వ్రతభంగమగును.
వ్రత భంగమును ఆపుటకై పరమాత్మయగు శ్రీ కృష్ణుడు గోపికలను దేహాత్మ భావము వదిలి నీటి నుండి బయటకు వచ్చి మ్రొక్కుమనెను. శ్రీకృష్ణుడే కాత్యాయనీ దేవతా రూపమున గోపికలకు ఫలమును ప్రసాదించు వాడు కదా ?
+ తన్నెఱుగుట నన్నెఱుగుట;
తన్నెరుగని వాడు నన్ను తానేమెఱుగున్ - వేమన.
((()))
21-సత్య దర్శనము వేమన - రమణులు అహంకారనాశము
శ్లో || ఆత్మాన మీ`త పరం ప్రపశ్యే
దిత్యాగ మోకే : సులభన భావః;
నాల్మైవ దృశ్యోయది కా కథేశ ?
స్వయం తదన్నీ భవనం తదీదా " - సద్దర్శనము.
అర్థము :-
తన్నెరుగుట నన్నెరుగుట ;
తన్నెరుగని వాడు నన్ను తానే మెరుగున్ ? - వేమన
తన్నుదాను జూచుటే ఈశ్వరుని జూచుటయని వేదములు చెప్పుచున్నవి. దీని అర్థమేమి ? తనకన్న వేరులేని ఆత్మగా తానైనప్పుడు , వేరు ఈశ్వరుని జూచుట పొసగదు . చూచుట చూడబడునది ఆత్మలో లేవు.
అయినచో ఆత్మ సాక్షాత్కారమెట్లు కలుగును ? ఇంద్రియాలను , మనస్సును , అహంకారమును ఆత్మార్పణము చేయుటచే వేరులేని ఆత్మయే మిగులును ఇదియే ఈశ్వర దర్శనము.
వివరణ : - వేదములు తన్నుతాను తెలిసికొని ఆత్మసాక్షాత్కారము పొందుటయే నిజమైన ఈశ్వర దర్శనము అని చెప్పినవి. అహం బ్రహ్మస్మి తానే బ్రహ్మము వేరే ఈశ్వరుడుడెక్కడ ఉండగలడు ?
చూచేవాడు , చూడబడేది , చూపు అనే త్రిపుటి చేత మనస్సు బాహ్యజగత్తును చూచును. ఆ మనస్సు అంతర్ముఖమైన ఆలోచనలు ఆగిపోవును. ఆలోచనలు లేని మనస్సులోనే ఆత్మదర్శనము సాధ్యమగును.
ఆలోచనలనాపి గాని ఎవరు ఆత్మ దర్శనము పొందలేదు. ఆలోచనలు లేని మనస్సు ఆత్మలో లీనమై పోవును. ఆత్మ దర్శనము కావలెనన్నచో , ఇంద్రియములను , మనస్సును , అహంకారమును ఆత్మార్పణము చేయమని భావము.
+ 1. నిను నీవెరుగ దలచిన మనమున సంకల్పములను మానగవలెరా !
+ 2. తన మనంబు తెలియతానె పోబ్రహ్మంబు. + ఆత్మ యందు జ్యోతి యమరుట లింగంబు
తెలిసి జూడగాని తేట బడదు. అదియు గురువులేక అబ్బునా తెలియంగ - వేమన.
(((()))
శ్రీరమణుల సందేశాలు [4]
10. హృదయం అంటే 'కేంద్రం' అని అర్థం. అక్కడి నుండే అన్ని భావాలు ఉదయిస్తాయి. దాని మీదే ఆధారపడి అందులోనే లయమైపోతాయి. మనసు భావాల సమూహం. భావాలే ప్రపంచానికి రూపాన్నిస్తాయి. అన్నిటికీ కేంద్రం హృదయమే. బ్రహ్మం నుండే జీవులన్నీ ఉద్భవిస్తాయని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అదే హృదయం. బ్రహ్మమే హృదయం !
11. నేనున్నానని అననివారెవ్వరూ ఉండరు. ఈ'శరీరమేనేననే' తప్పుభావమే దీనంతటికీ మూలం. ఈ మిధ్యాజ్ఞానం పోవాలి. అదే సాక్ష్యాత్కారం. దేనినో కొత్తగా పొందటం కాదు సాక్ష్యాత్కారం అంటే. ఒక కొత్త శక్తిని సంపాదించడమూ కాదు. పై పొరనుతీసి వేయటమే !
12. అంటే సుషుప్తి మెలకువ అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నట్లే కదా ! ఆ అవిచ్ఛిన్నత ఏమిటి ?
ఆ స్థితి స్వచ్ఛమైన ఉనికే.
అయినా రెండు స్ధితులకు బేధం ఉంది. ఆ బేధం ఏమిటి ?
శరీరమూ, ప్రపంచమూ మెలకువలో ఉంటాయి. కానీ సుషుప్తిలో మాయమవుతాయి అంతే !!
"{గ్రంథం : సత్యదర్శనం}"
"శ్రీరమణమహర్షి - శ్రీజిడ్డు కృష్ణమూర్తి గారల బోధనల్లోని ఏకాత్మతా విశ్లేషణ
శ్రీరమణుల సందేశాలు [5]
13. ప్రశ్న : సాపేక్షంగా చూస్తే మెలకువకంటే సుషుప్తి అవస్థే శుద్ధ చైతన్యానికి కొంత చేరువ కదా ?
సుషుప్తి నుండి మెలకువలోకి వచ్చేప్పుడు 'నేను' అనే భావముదయించాలి, మనసు రంగంలోకి దిగాలి. అప్పుడు భావాలు వస్తాయి. శరీర వ్యాపకాలు ప్రారంభమవుతాయి. ఇవన్నీ కలిసి ఇప్పుడే మనం మేల్కొన్నామంటాం. ఈ సమ్మేళనం లేకపోవడమే సుషుప్తి లక్షణం !
14. భగవత్సాక్షాత్కారమన్నా, ఆత్మసాక్షాత్కారమన్నా వేరే ఏమీ కాదు !
15. ప్రశ్న : అహంకారమెట్లా ఉదయించింది ?
అహంకారమంటూ ఏమీలేదు. అది ఉన్నట్లయితే రెండు 'నేను'లు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది. అహంకారం లేకుండా అవిద్య ఎలా ఉండగలదు !?
"{గ్రంథం : సత్యదర్శనం}"
"శ్రీరమణమహర్షి - శ్రీజిడ్డు కృష్ణమూర్తి గారల బోధనల్లోని ఏకాత్మతా విశ్లేషణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి