నమశ్శివాయ శతకం (1 /3 )
ఇచ్ఛ మాయ వెలుగు నిండె నిత్య సేవ లే నమశ్శివాయ
మచ్చ లున్న చంద్ర మలపు మేలు కోరు టే నమశ్శివాయ
స్వచ్ఛ మైన దియును వలపు సమయ మనసు యే నమశ్శివాయ
స్వేచ్ఛ కోరు అంద మేను స్వేత వర్ణ మే నమశ్శివాయ ...... ...... .....
వెలుగు నీడ భయము వెంట వేకువ పలుకే నమశ్శివాయ
పిలుపు మేలుకొలుపు భయము పిచ్చి అనుట యే నమశ్శివాయ
అలుక హక్కుగాను భయము వెలుగు నీడ లే నమశ్శివాయ
మలుపు మూగ భక్తి తెలిపె మాయ పూజ లే నమశ్శివాయ ...... .......
చూసె దాని కన్న నిలుపు చూపు గలుగు టే నమశ్శివాయ
వ్రాసె కన్న వినుట మేలు వాది సత్య మే నమశ్శివాయ
ప్రాస చదువు పుడమి విద్య జ్ణాపకాలు యే నమశ్శివాయ
ధ్యాస చదువు బ్రతుకు నేర్పు ధైర్య శ్రద్ధయే నమశ్శివాయ ..... .....
కాల భీత విప్ర బాల పాల సహనమే నమశ్శివాయ
సూళ భిన్న దండ ధార పాల విజ్ఞతే నమశ్శివాయ
పాల యూధునాదయాల వాల ఆశయం నమశ్శివాయ
మూలకారణాయ కాల కాల విజయతే నమశ్శివాయ
నాయకుండ ఘనము గుణము నగవుల సిరియే నమశ్శివాయ
ఛాయ నీడలన్ని పెరిగె బాధ లగుటయే నమశ్శివాయ
శోయగంబు పకృతి జూసి సొబగు చంద్రుడే నమశ్శివాయ
పాయస ఫల దళగరికలు ప్రణతి తెలుపుటే నమశ్శివాయ
పావన హనుమంతు పరమ పావనుండు యే నమశ్శివాయ
కావగ కరుణాంత కడలి దాటి పోవు టే నమశ్శివాయ
సేవనంబు పవన పుత్ర చేరి పూజ లే నమశ్శివాయ
రావణ యుగ కళల మార్చు రాజ్య దూత వై నమశ్శివాయ
అమ్మ నాన్న బిడ్డ కొలిచె ఆత్మ తృప్తి యే నమఃశివాయ
నమ్మ కమ్ము వమ్ము కాదు నమ్మి కొలిచితీ నమఃశివాయ
సమ్మతిగను తల్లి తండ్రి సమయ నీడలే నమః శివాయ
చెమ్మ నీరు దేహమాయె చేష్ట లగుటయే నమః శివాయ
వేణు నాదమే వినోద విద్య యగుతయే నమః శివాయ
వాణి సహన చూపు కళల వేద మవ్వుతే నమః శివాయ
ఆణిముత్య మెరుపు చూపు ఆటగుతయే నమః శివాయ
బోణి నీదు భక్తి మాకు భోగ భాగ్యమే నమః శివాయ
నిక్క మైన మంచి నివ్వు నీల మోక్కటే నమః శివాయ
ఒక్క మాట నొక్క పత్ని ఓర్పు పంచుటే నమః శివాయ
మక్కు వైన భక్తి నిచ్చు మాన సమ్ముయే నమః శివాయ
తక్కు వెక్కువ వదు బుద్ధి తప్పుఒప్పులే నమః శివాయ
ఇష్ట వస్తు దానమేను ముఖ్యహేతు వే నమః శివాయ
దుష్టదైత్య వంశ ధీర ధూమకేత వే నమః శివాయ
అష్ట శిద్ది మూర్తయే వృషేంద్ర కేత వే నమః శివాయ
సృష్టికారణాయ సర్వ ధర్మ సేత వే నమఃశివాయ
****
దోష హృదయ మేను ఏల కోపమాయ యే నమఃశివాయ
వేష విషయ జీవితమ్ము వినయ వాంచ్ఛ లే నమః శివాయ
భాష దేవుని కృప జీవ భవిత భాగ్య మే నమః శివాయ
పోషణ మది గోవు పాలు గోప్యమగుట యే నమఃశివాయ
అలల పరుగు జీవితమ్ము హాయి గొలుపు మా నమః శివాయ
నిలయ వినయ సహనమేను నిత్య పలుకు గా నమఃశివాయ
యలసట కళ పయనమేను యంతము బ్రతుకే నమః శివాయ
సలపరింత భక్తిగాను సమయ తృప్తి యే నమఃశివాయ
పూర్ణయనుచుకాశి పురము నందు నే నమశ్శివాయ
కర్ణకుండలధరి వీవు కాలపాశ మే నమశ్శివాయ
పౌర్ణమి తిధి బిక్షుకుండు బౌద్ధ సేవలే నమశ్శివాయ
వర్ణ వరద రాజశివుని వరదయాశయే నమశ్శివాయ
వందనంబు చేతునీకు వరగణ విజయా నమశ్శివాయ
మంద చూపుతోను నేను మధపు పొందుటే నమశ్శివాయ
చందనధరి శివము నీవు శరభ వల్లివై నమశ్శివాయ
అంద మన్న ఆశలేని వాడి వైతి నే నమశ్శివాయ
వేదమాత వేల్పు వెల్గి చెలిమినిచ్చుటే నమశ్శివాయ
చేద జ్ఞానగనివి చెప్ప చేర్చ తరముయే నమశ్శివాయ
మోదమిచ్చుమాత మోక్షఁగామి మ్రొక్కులే నమశ్శివాయ
కాద కనకరాశి పొంద కమల చెలిమియే నమశ్శివాయ
కాంచనంబునీవు నిత్య కల్ప వృక్షమే నమశ్శివాయ
కాంచు జనులనెల్ల నిన్ను కనుల విందుగా నమశ్శివాయ
సంచలనముగావ భరిత సకల జీవమై నమశ్శివాయ
అంచలంచ లుగను గొల్వ యంబరమున నే నమశ్శివాయ
శ్రీ మదాత్మనే గుణైక సింధు నిత్య మై నమః శివాయ
దామ లేశ దూత లోక బంధ ధర్మ మై నమః శివాయ
నామ సోషితాద్భ ... వాంధ దివ్య మై నమః శివాయ
పామ రేతర ప్రధాన బంధ లక్ష్య మై నమ: శివాయ
సర్వసృష్టి నిర్వికార సమయ తీర్పు యే నమఃశివాయ
కార్య దీక్ష తన్మయమ్ము కాల ఓర్పు యే నమః శివాయ
నిర్వి రామ కృషియు సలుపు నీడ మార్పు యే నమఃశివాయ
ఆర్య లక్షణాలు జూపి ఆత్మ తృప్తి యే నమః శివాయ
సర్వ జీవ రక్షణైక శాలి నీటి వే నమఃశివాయ
సర్వ రీశ ధారినే కాపాలి గాలి వే నమఃశివాయ
దుర్వి దగ్ధ దైత్య సైన్య దాహి అగ్ని వే నమఃశివాయ
పార్వతీప్రి యాయ భక్త పాలి తృప్తి వే నమఃశివాయ
కనులు మోడ్చి ధ్యాన భక్తి కార్య ముద్ర కై నమఃశివాయ
పనులు కూర్చి నలత ఏడ్చి పాట గాన మై నమఃశివాయ
అణువు సాధ్య సాధ్య మేను ధాత్రి లీన మై నమఃశివాయ
తనువు తృప్తి తపన తీర్పు దారి మోక్ష మై నమఃశివాయ
****
భ్రమణ చక్ర భ్రమర మౌను రక్తిప్రేర ణే నమ:శివాయ
సమయ భంగురమ్ము కాల శాంతి వీక్షనే నమ:శివాయ
సామ దాన భేద దండ శాంతి సాక్షి యే నమ:శివాయ
విమల రసల దివ్య రూప విజయ కాంక్షయే నమ:శివాయ
నిత్య వస్తు దాన అవని నీతి హేతువే నమఃశివాయ
సత్య దైత్య వంశ అవని సామ రస్య మే నమఃశివాయ
నిత్య మూర్తియగుట అవని నీడ కేతవే నమఃశివాయ
సత్య కారణాయ అవని సహన సేతవే నమఃశివాయ
గలదు లేదనేది బుద్ది కాలమాయాలో నమఃశివాయ
వలదు వలదనెడిది గుణము వాద నీడలో నమఃశివాయ
కలదు నాది యనెడి అహము కష్ట వేటలో నమఃశివాయ
వలదు వలపు ఆట ఆశ వ్యాధి యగుటలో నమఃశివాయ
సుడివడిన కడుపున కటక సూత్ర ధారి యే నమఃశివాయ
ముడిపడి కడదాక యుండు ముఖ్య నేత్రమే నమఃశివాయ
నడవడి అటు ఇటును కదలి నాట్యమేలనో నమఃశివాయ
తడి పొడి తపనల తడబడి తారు మారుయే నమఃశివాయ
నవ్వులతొలకరిలొ విరియు వెన్నలగుటయే నమఃశివాయ
పువ్వుల పలుకులు కలకళ పున్నమి కధలే నమఃశివాయ
నువ్వు నేను బంధ మాయె నూతనమ్ముగా నమఃశివాయ
రివ్వుమని జగతి కడెలెను రెప్పల కళ నమఃశివాయ
దినమణి శశాంక ధారి దివ్య లలితమై నమఃశివాయ
అనుపమ రవి బింబ ధారి ఆస్రిత హృదయం నమఃశివాయ
అణువణువు గలిగిన ధారి ఆత్మ బంధువై నమఃశివాయ
గణ గణ గుణముగల ధారి కాల నిర్ణ యమ్ నమఃశివాయ
వినదగు పలుకు విని నంత వేగ పడుట యే నమఃశివాయ
కనుల కలయిక నిజమేను కథలు ఏలనో నమఃశివాయ
మనిషి మనిషి మధ్య నీడ మార్గ మగుట యే నమఃశివాయ
మనుజ నీతి వికట మయ్యె మానసమ్ముయే నమఃశివాయ
అవని మురిసి మనసు కాంచె యరుణ కాంతుడై నమఃశివాయ
వివిధ వాంఛలన్ని తరిమె విద్య పొందుటే నమఃశివాయ
అవధి మార్పు చెందు తీరు ఆశయమగుటే నమఃశివాయ
నవవిధాన విధిగ పూజ నయన మూర్తిగా నమఃశివాయ
దినమణి శశాంక ధారి దివ్య లలితమై నమఃశివాయ
అనుపమ రవి బింబ ధారి ఆస్రిత హృదయం నమఃశివాయ
అణువణువు గలిగిన ధారి ఆత్మ బంధువై నమఃశివాయ
గణ గణ గుణముగల ధారి కాల నిర్ణ యమ్ నమఃశివాయ
పదవి ఆశ కీర్తి ఆస్తి పేరు అంత మే నమఃశివాయ
విధిగ ప్రేమ గాఢ మైన వినయ విద్య యే నమఃశివాయ
మదిలొ అత్మిక అనుభూతి మాన నిగ్రహం నమఃశివాయ
ఆది ధ్యాసనిప్రశాంతి అనుభవాన్నిగా నమఃశివాయ
***
లక్ష్య సిద్ధి ఒక్క కర్మ వల్ల జరుగుటే నమఃశివాయ
సాక్ష్య మేది అయిన బ్రతుకు సాధనగుటయే నమః శివాయ
శిక్ష్య ణయిది జీవి బుద్ధి సేతు బంధమే నమఃశివాయ
కక్ష్య లేని బ్రతుకునందు కావ్య తృప్తియే నమఃశివాయ
ముగ్ద మోము గనుము నయన మోహ నాంగడై నమః శివాయ
దగ్ధ వాంఛలాన్ని విధి దయార్ధ హృదయమే నమః శివాయ
దగ్ధి క తపననల జీవి దక్షిణాగ్ని యే నమఃశివాయ
దుగ్ధ మిచ్చు మహిళతోడు పుడమి నీదయే నమః శివాయ
దేవ రాజ సేవ్య మాన దేవ మహిమ యే నమః శివాయ
సేవకాలమంబు జాక్ష శ్రీకరమ్ము యే నమఃశివాయ
భావ పాశ దండపాణి భాగ్య మనసుయే నమఃశివాయ
పావనమ్ము హృదయ వాంఛ పాఠమగుటయే నమఃశివాయ
మనిషి లోని అహము విషము మనసు చేటు యే నమఃశివాయ
ప్రేమ ఉన్న పడతి అధిక మేలు చేయు టే నమఃశివాయ
కామ కేళి పరుగు పెట్టు కామ్య వొద్దులే నమఃశివాయ
నెమలి లాగ ఆడి తిప్పి నేస్త మునుటయే నమఃశివాయ
అలక వద్దు హాయి గాను ఆశ్ర యమ్ముయే నమఃశివాయ
పలుకు యందు బాధ వద్దు బంధ మంత్రమే నమఃశివాయ
కులుకు లన్ని పత్ని వేను పూజలర్ధమే నమఃశివాయ
తెలివి రవ్వ వెలుగు లాగ తేట తనముయే నమఃశివాయ
బదులు చెప్ప లేక బుద్ధి భార మగుటయే నమఃశివాయ
మనసు బాధ ఎంత నున్న మార్పు లున్న వే నమఃశివాయ
చెదరని చిరునవ్వు చూపు సహన సమయ మే నమఃశివాయ
అదియు ఇదియు సౌఖ్య మిచ్చి అనక ఆలి యే సౌఖ్య మిచ్చి
మనిషి మనిషి మధ్య మనసు మంచి చెడులుగా నమః శివాయ
మనసు ముసుగు తీసి చూడు మేలు చేయు టే నమః శివాయ
చినుకు చింత తొలగ చుండు చిత్ర మగుటయే నమః శివాయ
అనిన వినిన కనిన బతుకు ఆదరణలుకే నమః శివాయ
ఎరుగ జీవనోషదముయు లేరు భాధ లన్ నమః శివాయ
దరల తేజ తధ్య జాడ్య లేదు మిక్కి లిన్ నమః శివాయ
మెరయు నున్న వాడు దైన్య నొంద డింక నే నమః శివాయ
తెరగు దివ్య వెలుగు లేదు వీని లక్ష్య మే నమఃశివాయ
ఈ పదాలపైన కలుగు ఇంటిలో కధే నమఃశివాయ
ఈ పెను కళయికయె బ్రతుకు జీవమాయ నే నమఃశివాయ
ఈ ప్రకృతి కళలతొ విధిగ భీకరమగు టే నమఃశివాయ
ఈ పుడమి మనసుయె శుభము విజయ వేడు కే నమఃశివాయ
కట్టుబాటుమధ్య బ్రతుకు కాల నిర్ణయం నమఃశివాయ
పట్టు కోని మనసు గలిగి పాప బుద్ధి యే నమః శివాయ
చెట్టు లాగ సుఖము పంచి చీడ పట్టి తీ నమః శివాయ
గుట్టు రట్టు చేయ ఒట్టు కులము నందు నే నమఃశివాయ
****
నాడు తెలియ జేయ లేక నేను నవ్వులై నమఃశివాయ
నేడు తెలియ జేయ దలచి నాది నమ్మకమ్ నమఃశివాయ
యీడు నాడు తెలియ లేదు ఇఛ్ఛ కళయే నమఃశివాయ
నేడు జోడు తోను కలిసి నేస్త మవ్వుటే నమఃశివాయ....1
....
ఆస్తి ఏది అనకు నీకు ఆత్మ ఉండుటే నమఃశివాయ
శాస్తి జరుగ గుండు నీకు సౌఖ్యమేనులే నమఃశివాయ
సిస్తు కట్ట గలిగె ధర్మ సిరులు చాలునే నమఃశివాయ
త్రాసు మల్లె చెలిమి నుంచి తృణము ఉండుటే నమఃశివాయ..౨
....
కమలము కమలాప్తుని కళ కనుల మాయలే నమఃశివాయ
కమల నయనములును తెరుచు కొనుట లీలయే నమఃశివాయ
కమల నాధుని కళ లన్ని కామ్య మవ్వు టే నమఃశివాయ
సుమధుర లత లన్నియు వికసింప చేయుటే నమఃశివాయ.౨
.....
మురికి పట్టి ఉన్న అద్ద మందు మాయయే నమఃశివాయ
చిరుగు లెన్ని ఉన్న గుడ్డ సిగ్గు అడ్డ మేనమఃశివాయ
కరుడు గట్టి గుండె పోటు కలలు తీర్చు టేనమఃశివాయ
చెరను ఉన్న కధల బుద్ధి చెరచు చుండుటే నమఃశివాయ..త్రీ
....
కాయ పండు గాను మారి కాల చక్రమే నమఃశివాయ
కాయ మగును పంచ భూత కళల నిత్యమే నమఃశివాయ
మాయ చేత రోత బతుకు మహిమ ఉండుటే నమఃశివాయ
చేయు నిత్య గీత పఠన చేర్చు మోక్షమే నమఃశివాయ. ..౪
.....
గలగలమని నీరు పారె గమ్య మవ్వుటే నమఃశివాయ
విలువలెరుగ జలచరములు విధిగ జిక్కెటే నమఃశివాయ
జల్లు గాను జారు చున్న జలము జాడ్య మే నమఃశివాయ
చెల్లు బాటు లేని దేది జాలి జూఫుటే నమఃశివాయ...5
.....
చక్కనైన చిన్న చూపు జాత రువ్వుటే నమఃశివాయ
ఎక్కి దూకి ఎత్త మన్న ఎత్తె జువ్వనే నమఃశివాయ
ఒక్కమారు వయసు బట్టి ఒత్తి చూడుటే నమఃశివాయ
బక్క చిక్కి ఉన్న ఏమి పడచు బుద్ధిగా నమఃశివాయ...౬
.....
ఎవరిని ఎవరనుటవలదు ఎన్ని చెప్పినా నమఃశివాయ
హావ భావ ఎరుక పరిచి హాయి కాలమే నమఃశివాయ
సేవ చేసి యున్న మనిషి స్వేచ్చ భావమే నమఃశివాయ
నావ లాగ కదలి జీవ నటన నీకులే నమఃశివాయ ...౭
.....
కల్ప నేన కవిత నచ్చు కన్నె ఊపు వల్లనే నమఃశివాయ
స్వల్పమైన నడ్డి ఊపు సరళ కైపు నే నమఃశివాయ
శిల్పమేన జగతి నందు సంగ మవుటే నమఃశివాయ
వేల్పులైన తెల్పు లైన వేడి వల్లనే. నమఃశివాయ ..8
....
తల్పమేన హాయి గొనుట తప్పు కాదులే నమఃశివాయ
అల్పమేన జీవి తమ్ము అధిక వేడిఏ నమఃశివాయ
బల్పమేన అక్ష రమ్ము బంధ మవ్వుటే నమఃశివాయ
పప్పు అన్న మున్న తిండి ప్రగతి భావమే నమఃశివాయ .౯
.....
చప్ప నైన కార మైన చొప్ప కూడులే నమఃశివాయ
చిప్ప కూడు బిచ్చగాళ్ల చింత తీర్చులే నమఃశివాయ
తప్పు చేయు వారి బాధ తిప్ప కల్గుటే నమఃశివాయ
ఒప్పు వాద నంత నిత్య ఓర్పు పంచుటే నమఃశివాయ..౧౦
....
ఆగదు నిముషముయు కొరకు అర్ధ మయ్యెలే నమఃశివాయ
వేగము వలదు మెరు పైన వయసు ఆశఏ నమఃశివాయ
భాగ మేది అయిన చెడిన బాగు ధైర్యమే నమఃశివాయ
సాగు జీవితాన కధలు శాంతి నిచ్చుటే నమఃశివాయ....11
....
బ్రహ్మ యు, హరి, శివుడు, నిత్య భక్తి నిచ్చునే నమఃశివాయ
బాహ్య అంతరములు నయన భావ హర్షి తే నమఃశివాయ
అహము వదిలి మనసు పెట్టు ఆట తెల్సునే నమఃశివాయ
సహన ముంచి సామరశ్యసేవ వెల్గుయే నమఃశివాయ
.....
కరుణ జూపె నిత్య గరళ కంఠ ఆదుపే నమఃశివాయ
మరణ రక్ష చూపు శూల పాణి సేవలే నమఃశివాయ
శరణ మన్న ఆదు కొనును శంకరుండులే నమఃశివాయ
తరుణ మయ్యె చిన్న పెద్ద చేరి పూజకై నమఃశివాయ
....
నరుల దృష్టి వల్ల జగతి నాశనమ్ము ఏ నమఃశివాయ
సిరుల విషము వైపరీత్య చిత్త చెంచలమ్ నమఃశివాయ
భీరు లయ్యె వర్ష నీరు పారి కూలెనే నమఃశివాయ
వరద పొంగు వల్ల హతులు వేల కర్మయే నమఃశివాయ
....
నేను ఏమిటోను అర్ధ నడక గమ్య మే నమఃశివాయ
నేను అన్న పదము సుఖము నిచ్చు లోకమే నమఃశివాయ
నేను వున్న చోటు నీవు నేస్తమవ్వు టే నమఃశివాయ
నేను అయిన ఆత్మకు పని నిర్మలమ్ముగనే నమఃశివాయ
....
విశ్వ గురువు సత్య వాక్కు వలన మనసులో నమఃశివాయ
విశ్వ హిందు ధర్మ మంటె విద్య నేర్పుగా నమఃశివాయ
విశ్వ మందు ఆధునికము వలన తెలివియే నమఃశివాయ
విశ్వ శాంతి కొరకు మనిషి వింత పోకడేనమఃశివాయ
....
మనసు వేదన మధనము యె మమత తిర్గుటే నమఃశివాయ
మనము తిరుగు ఎవరి కొరకు మాయ బత్కటే నమఃశివాయ
చనువు భావమందు నీటి చుక్క లోకమే నమఃశివాయ
తనను తాను కనుగొనుట యె తెల్సి బత్కుటే నమఃశివాయ
....
స్త్రీలలో న వుండు కళలు శీల కాలమే నమఃశివాయ
మల్లె పువ్వు పుట్టగానె మత్తు శక్తియే నమఃశివాయ
తెల్ల నైన నల్ల నేన తప్ప కుండుటే నమఃశివాయ
కలలను కను చున్న విధియు కవిహృదయములే నమఃశివాయ
....
రవ్వ వెలుగు శక్తి ఇవ్వు రమ్య పరుచు టే నమఃశివాయ
మువ్వ శబ్దమేను శక్తి ముందు మనసు గా నమఃశివాయ
అవ్వ బువ్వ తినుట శక్తి ఆత్మ జాలి గా నమఃశివాయ
దివ్య మైన ఆత్మ శక్తి దీన బంధు వే నమఃశివాయ
భవ్య మైన బంధ శక్తి భాద్య తగు టే నమఃశివాయ
సవ్య మైన సర్వ శక్తి స్వర్ణ వెలుగులే నమఃశివాయ
నవ్య మైన నమ్మ శక్తి నాట కమ్ము లే నమఃశివాయ
కవ్వ మైన కావ్య శక్తి కమ్మ నైన దే నమఃశివాయ
తరుణ మాయ లన్ని చేరి తాప పాపమే నమఃశివాయ
కరుణ చూపులన్ని కలసి కాల కోర్కెలే నమఃశివాయ
నరక లోక వాసి కైన నాకదమ్ముయే నమఃశివాయ
విరసమతికి నైన నరువివేకదమ్ముయే నమఃశివాయ
అల్ప పుణ్యమతుల కెందు ఆత్మ నందనిది నమఃశివాయ
కల్పకోటిశతము లందు గళము కందనిది నమఃశివాయ
స్వల్ప కాల నిర్ణయమ్ము సహన మార్గమే నమః శివాయ
నిల్ప లేని మనసు మాది నిజము కల్పనే నమఃశివాయ
భూతనాధ చరణకమల పూజనమ్ము యే నమఃశివాయ
ప్రాతత ప్రశస్త వస్తు భావజనమ్ము యే నమఃశివాయ
మాత నాద మేను హృదయ మంత నిండుటే నమఃశివాయ
ఖ్యాతి కోర దేవుడు భక్తి కాల ప్రతిభయే నమఃశివాయ
శరణగణ గణాధినాథ శాతనమ్ము యే నమఃశివాయ
నరసురేశ వినుతనత సనాతనమ్ము యే నమఃశివాయ
మారమధన పరులలోని మంత నమ్ము యే నమఃశివాయ
చేరి శివుని గొలుచువారి చింతనమ్ముయే నమఃశివాయ
కధలు చెప్ప వినయ వికాస భావము ఇదిలే నమః శివాయ
మొదలు విప్ప మనసు భావము మొహము మిదియు లే నమః శివాయ
నుదురు చూప సుధలు మదియు నులక ఇదియు లే నమః శివాయ
యదను తట్ట అలసి యాస ఆత్రము ఇది లే నమః శివాయ
పదము లన్ని కల్సి జయ వాక్య మార్గ ము ఇది లే నమః శివాయ
యదలు లన్ని కల్సి మదిన యాస మార్గ మే నమః శివాయ
మదము లన్ని కల్సి నిధిగ మోహ మార్గము ఇది లే నమః శివాయ
విధములన్ని తెల్పి విధిగ దేహ తత్వము ఇదిలే నమః శివాయ
చెదలు పట్టెనే మనసు లొ మచ్చ మాత్రము ఇదిలే నమః శివాయ
వదులు తెల్పకే సొగసు లొ వంపు మాత్రము ఇదిలే నమః శివాయ
పదును చూపవే పలుకు లొ సోంపు చేష్టలు ఇదిలే నమః శివాయ
మొదలు తెల్వదే ఇహపరమో సమాన మెదిలే నమః శివాయ
జనన మేఇదీ జగతికి మేలు సృష్టియు ఇదిలే నమః శివాయ
మనన మీ ఇదీ ప్రగతికి మేలు సత్యము ఇదిలే నమః శివాయ
తనకు తానుగా ప్రతిభకు మేలు నిత్యము ఇదిలే నమః శివాయ
వినయ వాదనే విపులకు వేద భుత్యము ఇదిలే నమః శివాయ
మనన మానసం మగువకు మేలు చేయుట ఇది లే నమః శివాయ
తనువు తామసం తపనకు మేలు కోరుట ఇది లే నమః శివాయ
చనువు చేయటం జపముకు చాలు వాక్కులు ఇది లే నమః శివాయ
ఖనన మవ్వ సర్వ మగుట మేలు భావము ఇదిలే నమః శివాయ
వినయ లక్ష్యమే విజయము వేగ పర్చుట ఇదిలే నమః శివాయ
అణువు దేహమే సమయము ఆశ తీర్చుట ఇదిలే నమః శివాయ
కణము లన్నియూ కలియుట కాల మార్పుగ ఇదిలే నమః శివాయ
తృణము తీర్పుయే తెలుపుట తృప్తి పర్చుట ఇదిలే నమః శివాయ
ప్రణయ నాదమే ప్రగతికి మూల మేనని మెదిలే నమః శివాయ
వినయ వాదమే వివరణ గీత మేనని మెదిలే నమః శివాయ
అణువు వంతదేహమున అదేదొ ఆశలు మెదిలే నమః శివాయ
తనువు తాపమంతయును సమాన ప్రేమగ మెదిలే నమః శివాయ
మనసు లన్ని తెల్పు కధలు దేహ భావము మెదిలే నమః శివాయ
పనులు అన్ని మార్పు కలలు మోహ లక్ష్యము మెదిలే నమః శివాయ
చిణుకు లన్ని తెల్పు కళలు దాహ భావము మెదిలే నమః శివాయ
కణములన్ని కల్సి కదులు కామ్య భావము మెదిలే నమః శివాయ .....
జ్ఞాన మోక్ష మార్గ తృప్తి జ్ఞప్తి దీక్ష యే నమః శివాయ
జ్ఞాన బిక్ష ధర్మ మగుట జ్ఞప్తి రక్షయే నమఃశివాయ
జ్ఞాన విద్య సర్వ మగుట జ్ఞప్తి శిక్షయే నమఃశివాయ
జ్ఞాన దృష్టి సృష్టి యగుట జ్ఞప్తి దక్షతే నమః శివాయ
.....
శబ్ద అర్ధము అదియేను శాంతి భావమే నమఃశివాయ
లబ్ది పొందు దారి యేను లయలు లక్ష్యమే నమఃశివాయ
స్వార్ధ బుద్ధి తొలచు టేను సమర ధైర్యమే నమఃశివాయ
అర్థ కర్మ చేయు టేను అణువు విజయమే నమః శివాయ
......
ఏమి సేతు రామ లింగ ఏల చెప్పెదా నమః శివాయ
కామి తార్ది భోగ లింగ కాల మాయయే నమః శివాయ
సామి నీవు స్వేచ్ఛ లింగ సాధు తృప్తి యే నమః శివాయ
లేమి భక్తి నీదు దయయు రేఖ చంద్రుడే నమః శివాయ
......
మరుపురాని వెలుగు నిచ్చు మధుర శక్తియే నమఃశివాయ
మనసు దోచు మాట లొలకు మార్గ మిచ్చెనె నమః శివాయ
అంచెలంచెలుగను కవుల ఆశయమ్ములే నమః శివాయ
అమ్మ ప్రేమలా అమూల్యమైన భాషయే నమః శివాయ
.......
తేనె కన్న తియ్య నైంది తెలుగు భాష యే నమః శివాయ
దేశభాషలందు తెలుగు లెస్సై భాషయే నమః శివాయ
పలుకుబళ్ళ ఇంపుతోను పగలు రాత్రియే నమః శివాయ
సాటి లేని రాచబాట సహన మిచ్చె నే నమః శివాయ
.....
యక్షరాజ బంధవే దయాళ వేనులే నమః శివాయ
దక్షపాణి సోభి కాంచనాల వేనులే నమఃశివాయ
అక్ష పాద విభత పూత తా లవేను లే నమఃశివాయ
వచ్చే రాజవాహ హృత్క పాల వేనులే నమశ్శివాయ
" मंदाक्रांते ..
--
నీలగ్రీవంసురగణనుతం శ్రీధరం పార్వతీశం ,
కాలవ్యాళంధవళరుచిరూపం విరూపాక్షమనీహమ్..
మాలారుండైఃకలితశుభదం వ్యోమకేశం మహేశం ,
లీలాభూషేందువరలసితం లోకమర్చ్యం హి వందే !!! "
----
చుక్క చుక్క లెక్క బెట్ట సూణ్య మన్ననే నమః శివాయ
డొక్క సిద్ధి లేక యున్న బోధ చేయుటే నమః శివాయ
చిక్కు తెచ్చు వడ్డి లెక్క చేయ కుండుటే నమః శివాయ
లెక్క వచ్చి కవిత చెప్ప నేర్ప జనులకే నమః శివాయ
....
నిన్ను కలుసు కొనుట మంచి నీడ దొర్కుటే నమః శివాయ
మన్ను తిన్న పాము లాగ మాన సమ్ముయే నమః శివాయ
మెన్ను విరిగి అహము తగ్గి మోక్ష మందుటే నమః శివాయ
కన్ను మిన్ను ఒప్ప లేక కదలి వచ్చితీ నమః శివాయ
.....
నేర్చు కొనుట మనిషి తీరు నేర్పు నీదియే నమః శివాయ
మార్చు కొనుట మచ్చలేక మహిమ కాదులే నమః శివాయ
తీర్చు పుణ్య భాగ మంత తీర్పు నీదిలే నమః శివాయ
చేర్చు జీవితాన సుఖము చింత వద్దు లే నమః శివాయ
........
కాల మాయ యున్న నేడు గడలన్ని ఏ నమః శివాయ
గోల లెన్ని చేయు చున్న గొప్ప పూజలే నమః శివాయ
పాలు పెర్గు తేనె నీరు పాద పూజ కే నమః శివాయ
బేల ఆశ చూపి యున్న గీత భావమే నమః శివాయ
తల్లి తండ్రి గుర్వు ఆలి తన్మయమ్ముగా నమః శివాయ
చల్ల నమ్మి బత్కు తున్న భక్తి పెంచుటే నమః శివాయ
చల్ల నైన నీదు మాట చింత మాపుటే నమః శివాయ
చల్ల గాను వెచ్చ గాను చపల చిత్తమై నమః శివాయ
కళ్ళ లాడ కుండ వేద కామ్య మాయయే నమః శివాయ
జల్లు కుర్సి యున్న చెట్టు జాగృ తీగనే నమః శివాయ
ఇల్లు కట్టి సేవ లన్ని ఇష్ట మవ్వుటే నమః శివాయ
కళ్ళు తెర్చి దుష్ట మాయ కార్య మాయయే నమః శివాయ
గాలి నిచ్చి బుద్ధి నిచ్చి గమ్యమే విధీ నమః శివాయ
జాలి లేని మూర్ఖ భావ జాతి లోననే నమః శివాయ
మాలి లాగ ఉన్న నేను మానసమ్ముగా నమః శివాయ
ఆలి చేయ మన్న వన్ని ఆశగా చెసే నమః శివాయ
అర్ధ మవని తెలివి యున్న ఆశయమ్ముగా నమః శివాయ
స్వార్ధ బుద్ది చేరి యున్న సామ రశ్యమే నమః శివాయ
తీర్ధ యాత్ర చేయు చుండ తేట గీతియే నమః శివాయ
ప్ర్రార్ధ నలులె పగలు రాత్రి ప్రాంజలి కళలే నమః శివాయ
........
ఎన్ని కళలు చూపు చున్న ఏదొ వెల్తి యే నమః శివాయ
అన్న మాట తెలుపు చున్న ఆశ ఏలనో నమః శివాయ
ఉన్న దాన్ని తృప్త పరచ ఊహ లేలనో నమః శివాయ
కన్న వారి దీవెనలగు కాల తీర్పుయే నమఃశివాయ
.......
నమః శివాయ
"శ్రీ నీలకంఠభుజగాభిభూషం ,
గంగాధరం విధుశిరోऽభిభూషమ్ !
గౌర్యర్ధదేహలసితాభిభూషం ,
తంవామదేవమభవం నమామి !!!
----
నేటి నానీలు
ఆన్ లైన్ క్లాసులు
సెల్లు అలవాటుగా
భయాన్ని పేంచే ఆటలు
ఆత్మ హత్య లు పెరిగే
తల్లి తండ్రుల లో
భయమే కలిగే
గురిగింజ కు,
రాజకీయం కు సిగ్గుయే
సిగ్గు
మిడిసిపడు
కోరు కోవడం తౌ లభించేవి - శాపాలు.
వచ్చినవి ఏకీభవిస్తే - వరాలు.
రక్షణా వ్యవస్థ లో
పాక్ చైనా మధ్యలో
క్షిపణి కంపనలు
మారం చేసే వయసు
నాది
అమ్మ ఉంచు అదుపులో
మనసు
నేను నవ్వితే
నవరత్నాలు రాలు
అమ్మా ప్రేమ తోను పాలు
జాతీయ చిహ్నం
ప్రగతి కి చిహ్నం
ప్రతిభకు ఉండేటి చిహ్నం
చెప్పే ది నీతి
చేసేది అవినీతి
రాజకీయులలో ఖ్యాతి
తరతరాలుగా పీడనకు
బతుకు నేర్పు పాఠాలు నీకు
ఉదా శీనత ఉదాహరణ
ఓర్పు ఓదార్పు గా నిర్వా హణ
అవసరం కోసం
కలుపుకునే స్నేహం
కాలేదులే శాశ్వతం
06-10-2021 ..ప్రాంజలి ప్రభ
గజాననం భూత గణాధి సేవితమ్
కపిత్థ జంబూ ఫల సార భక్షితమ్
ఉమా సుతం శోక వినాశ కారణమ్
నమామి విఘ్నేశ్వర పాద పంకజమ్
తాత్పర్యం: గజ ముఖుడు, భూత గణములచే సేవించ బడే వాడు, వెలగ మరియు రేగు పండ్ల గుజ్జును భక్షించు వాడు, పార్వతీ పుత్రుడు, దుఃఖమును నశింప జేయుటకు కారణమైన వాడు అయిన విఘ్నేశ్వరుని పాద పద్మములకు నమస్కరిస్తున్నాను.
నేటి సమస్యాపూరకము
((()))
వివిధ రూపాలతో అమ్మ విధిగ తెలుపు
బౌద్ధికము గాను వాచిక బుధ్ధి తెలుపు
కాల పరముగా వివరణే యుక్తి తెలుపు
వేడుక ప్రజల లొ భక్తిగా ముక్తి తెలుపు
మంచి జేయ మనిషి మాయ జేరు
మంచి పనియె మనసు యశము మారు
కత్తికంటె కలము గొప్ప తీరు
ప్రేమదీప్తి ప్రియము అగుట వేరు
జనులకెపుడు శాంతి ధరణి పోరు
ఒకరి కొకరు ఓడి గెలుచు నిజము
సాయ మనిన సాము అగుట శుభము
దయను పంచు ధర్మమగుట కలము
బుద్ధి వళ్ళ భక్తి పెరిఁగి జయము
శుభము వల్ల శాంతి సౌఖ్య మయము
గొడవ లేని గూటి నుంట జయము
మడమ తిప్పి మాయ చేయు భయము
ప్రేమ పంచి పడక పంచు శుభము
దాత నెంచి దాన మిచ్చు గుణము
చేత కాని చేష్ట వలదు మదము
((())))
సాంగత్యం .. వి .. ఇంద్ర..UUU,IIUU, బ్ర. సూర్య.UUIIU
వివి..వివి..వివి..బ్ర.. సాంగత్యం
వివి..వివి..వబ్రవి..బేల
.
కాలము మోహమ్మే మనొ వాంఛా
ఫలసిధ్ధి పొందాకే సుఖ మాయే
కార్యము సాఫల్యం కళ తీర్పే
ప్రేమతో సద్భావం మది నేర్పే
స్నేహమే పొందాకే శృతి మార్పే
ఆశలు మౌనంబే విధి ఆటే
దైవ తీర్మానము యే
మానస సౌందర్యం మమతాయే
ఆశయ ఆదర్శం వెను వెంటే
శోధన సాహిత్యం సమ మాయే
సాధన శిధ్ధాంతం సుఖ మిచ్చే
పావన పాట్యాంశం వరమాయే
సర్వ సంతృప్తి గనే
సేవల సందర్బం సహజమ్మే
(()))
05/10 సమస్యను పూరించుట ...
న్యాయము నీకు నమ్మకము నావలు లాగనె తీర్పులే యగున్
మ్రోయరె చెడ్డ బుద్ధులను మోహము ఉన్నను పుణ్యరీతిగన్
చేయరు చెప్పు చేతలగ చేష్టలు ఎప్పుడు పాప భీతిగన్
వ్రాయరె యెల్ల లోకముల వారలు జేసిన పుణ్య పాపముల్
పంచ రవళి
జీవితమున చింత నిన్ను తుడుపు
పరులకొరకు పరగమేలు జరుపు
మితము మాట మించకుం డ గడుపు
చేతనైన చిట్టి మాట విడుపు
సాధు భాష సాగు జాతి కడుపు
సంతసంబు సగము బలము పలుకు
మహినమంచి మనిషి బతుకు చిలుకు
సత్యశక్తి సేవ నందు జిలుకు
మంచినెపుడు మాన సముకు కులుకు
జాతి సేవ జపము జేయ బెరుకు
శ్రమనునమ్ము శాంతి కలుగుతుంది
కష్టఫలము కాంతి లాగ వుంది
జనులమనము జెప్పు పలుక వుంది
శాంతిపథము సర్వ జగము వుంది
దయను పొందు దాత ఘన ము అంది
((()))
(4) ఇంద్ర - (2) ఇంద్ర -(1) సూర్య
గోపాల లీలలు...ఎంత విన్న తనివి
తీరవు మనుసులో హాయి
గోపాల గానము ..వేణువు నాదము
మనసుకే హాయిగా నుంచు
నవ్వుల నాట్యము తో నయనాల వెల్గు
విరజిమ్మె ముద్దుల కృష్ణ
వచ్చిరాని పలుకు .. దొంగచూపులు కళ
పడుచులు ప్రేమయె కృష్ణ
బాలుడైన బలము చూపియు రక్కసి
పూతన నే కొరికి చంపె
శకటాశురిని యే పాదాలతో తన్నె
నింగిచూపులతోను చచ్చె
ఆవుల మందును తోలుచు పిల్లల
ఆటలు ఆడెను కృష్ణ
వెన్నముద్దల కోరి ఇల్ల లో చేరియు
ధైర్యము తోవెన్న దోచె
నిత్యజీ వితము న మనసుయే ముత్యమై
సత్య పూర్వకము గ నుండె
నిత్య గమనము యే సేవగా
కష్టాలే కనబడ కుండె
నీ పలుగాకి పనులకు గోపెమ్మయు .
కోపించి బంధించె నంట
ఊపున బోయయు మాకుల కూలిచి
శాపాలు బాపితి వంట
శుద్ధిగా బుధ్ధిగా నుండ వలయునని
కొద్ది కొద్దిగ నైన సేవ
మొద్దు బతుకుల తోను సుఖము
పుడమిన ప్రేమను పంచె
కళ్యాణ పురుషా య ఉద్ధవా! సూర్యుడు,
అగ్ని, బ్రాహ్మణుడుగా కృష్ణ
ఆకాశము, సకలప్రాణులు అనునది
పూజ మందిరము గా కృష్ణ
[04/10, 07:33]
సమస్యను పూరించుట..
వేదాంత రహస్య మెల్ల వేమన యెరుగున్.
❤️❤️❤️❤️❤️
రాద్ధాంతమనేది చెప్ప వీలుగ కధలన్
శిధ్ధాంత సమస్య తెల్ప లేక యు వెతలన్
సద్భుధ్ధి తొ కాల విద్య పొందు ట సుఖమున్
వేదాంత రహస్య మెల్ల వేమన యెరుగున్
రాళ్లు విసిరితే.........!!!
వీధి కుక్కల పై రాయి విసిరి చూడు
అరుపు తో భయమును చూడు మరణ ముక్తి
తేనె తుట్టెపై రాయిని విసిరి చూడు
తిరగబడి వెంట బడుట తీర్పు యుక్తి
గుర్తు పెట్టుకో ఐకమత్య గురువు తెలివి
మనిషి పై రాయి విసిరితే మనసు దెబ్బ
మనసు పై మాట విసిరితే మమత దెబ్బ
మానవత్వంపై రాయి యే మూగ దెబ్బ
ఎదుటి వారిపై రాయియే ఎదురు దెబ్బ
బురద మీదపై రాయియే బురద దెబ్బ
రాళ్లు విసిరినా మనసుకు రేటు దెబ్బ
రేటు తేలిన చేష్టలు రాళ్ల పాలు
--(())--
ప్రాంజలి ప్రభ - నేటి కవిత .. పువ్వు
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
మళ్ళి మళ్ళి పిలుస్తుంది మనసులోన మహిమ పువ్వు
పరిమళంతొ మత్తెక్కించె మధువునే పంచె పువ్వు
మనసు దోచి నవ్వించే సువాసనలు మనసు పువ్వు
ఆకర్షణతోను అంకురింపచేసె మమత పువ్వు
దేవుని పాదాలు తాకి పరవశించే జాజి పువ్వు
దారంలో చీక్కి మాలగామారును మల్లె పువ్వు
ఏరోజుకారోజు శోభాయమానంగా లిల్లి పువ్వు
స్త్రీల కొప్పును చేరి శ్రృంగారించే బంతి పువ్వు
ఏమరపాటు (దుఃఖం) మరిపించే నవ్వె పువ్వు
మమేకం ( శాంతి) తో ఆనందపరిచే ముళ్ల పువ్వు
సృజనాత్మకత శక్తిని వృద్ధి పరచేటి మొగలి పువ్వు
ప్రేమికులను ఏకంచేసి ఉల్లాసపరిచే మనసు పువ్వు
--(())_-
ప్రాంజలి ప్రభ... వార్తా
ఎంత విన్నా తనివి తీరని హాయని గొలుపు పలుకు
ఆనంద డోలికలలొ ఊయలూగి నట్లు వార్తా
కోకిల పలుకుల్లా వినసొంపుగా ఉండే పలుకు
మృదువైన ముచ్చట గొలిపె భావాల తోను వార్తా
చక్కని హావభావాలతో విశ్లేషణల పలుకు
విషయాల వివరణాత్మకము గ పరిశీలన వార్తా
అనుబంధ ఆత్మీయత అనురాగ అభివృద్ధి పలుకు
చల్లగా చక్కగా వినిపించు వినువారి వార్తా
ప్రేక్షకుల మనసు కదిలే తరుణా నందంగా పలుకు
నమ్మకమ్ము వమ్ము చెయ్యని రంజిల్లుగా వార్తా
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే
నాడ పడచు సిరియె పొందు నాటి నుండి
మనిషి నిరతంబు సంపద మేను చుట్టు
గురుతుగ దిగుట బావిలో గొప్ప దగు ను
పడచు సిరితోను తినువొడు పోటు బడును
1 Co
మంగళమణి -
==
ఆధారము: కొక్కొండ వేంకటరత్నముపంతులుగారి బిల్వేశ్వరీయము
==
మంగళమణి - భ/స/న/జ/న/గ
16 అష్టి 31711
==
UII IIU IIII - UII IIU విఱుపుతో:
==
చూపెను మదిలో మహిమను - చూపుల వదనా
మాపెను వెతలే సుఖముగ - మాయల నయనా
తెల్పెను కధలే విషయము - తేటల మదనా
కల్పెను విధిగా వినయము - కాలము కరుణా
సుందర వరరాజ మహిమ - శోభల తలపే
మందిర మనసే తనువగు -- మాయల మలుపే
వందన చరితం తరుణికి -- భావపు మెరుపే
నందన వనమే వరుసకు -- నాందిగ సుఖమే
వేకువ తలపే జయమగు -- వేదన మలుపే
ఆకలి అరుపే భయమగు -- ఆశల వలపే
వాకిలి తెరిచే వినయము -- వాంఛల జిలుగే
మక్కువ మెరుపే మనసుకు -- మాయల గెలుపే
మంగళమణిగాఁ దలఁతును - మంజుల వదనా
అంగనఁ గన రా రయమున - నంబుజ నయనా
పొంగెడు మదిలో నవముగ - మోహన రవమే
రంగనిఁ గనఁగా ధర నిఁక - రక్తియు భవమే
==
సుందర మగు నీ యవనియు - శోభల కిరవే
మందిర మిదియే యతనికి - మానస తరువే
వందన సుమమే తలఁపది - భావన లతలోఁ
జిందిడు మధువే పదముల - చెల్వము మతిలో
==
UIIII UIIII - UIIIIU విఱుపుతో:
==
కాలమయము కార్యమగును -- కామితములు గా
శీల చరిత శీఘ్రమగును -- శీతలములు గా
ఏల అనిన ఏ మరుపుగ -- ఏరు కదలి కే
గోల అనక గోప్యమగుచు -- గొప్పతనముగా
రుద్రమయము రౌద్రమగును -- రాశి జనితమే
భద్రమయము బంధమగును -- భావవిదితమే
క్షుద్రమయము దర్పమగును -- క్షద్ర వినయమే
నిద్ర మయము విశ్వమగును -- నిమ్నగుణముగా
రాగమయము జీవనమిది - రమ్మిటఁ గనఁగా
మూఁగమనసు పాడఁదొడఁగె - మోహన యనఁగా
యోగ మనెద నేఁడు జరుగు - నుత్సవ మిదియే
సాఁగు లలితమైన బ్రతుకు - చక్కని నదియే
==
రాముఁడనెద సోముఁడనెద - రంగఁ దనెద నా
స్వామి కెడఁద నాలయమగు - భక్తికి గుఱుతై
కామితముల కల్పతరువు - కంజనయనుఁడే
క్షేమ మొసఁగు శాంతి నొసఁగు -చిన్మయకరుఁడే
==
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
పంచ రవళి .... 03-10-2021
బ్రతుకు పరుల భయము తెచ్చు డబ్బు
కష్ట మైన కాల మెదుకు డబ్బు
ఆశ్రయమ్ము ఆశ పెంచు డబ్బు
శ్రమ కోరి శాంత పరచు డబ్బు
దారి చూపి దరిని చేర్చు డబ్బు
లక్ష్య మున్న లౌక్య మగుటె డబ్బు
ప్రేమ ఉన్న పెదవి పంచు డబ్బు
స్నేహ మన్న శాంతి నిచ్చు డబ్బు
జీవ మన్న జీత కళలు డబ్బు
జాతి గెలుపు జపము ఆశ డబ్బ
అద్దె కున్న అప్పు రాని డబ్బు
సొంత మన్న సుఖము లేని డబ్బు
జ్ఞాని కుండు జీర్ణ విద్య డబ్బు
ఖాలి అన్న ఖరము లాగె డబ్బు
దేహ సుఖము దహన పరచు డబ్బు
నిజము తెల్పు నిలకడగను డబ్బు
మనసు తెల్పు మాట తెచ్చు డబ్బు
కథల వల్ల కలసి వచ్చు డబ్బు
ఒకరి వల్ల ఒకరు పుచ్చు డబ్బు
గుర్తు తెచ్చి గరము పెంచు డబ్బు
వ్యర్థ మైన విషయ వాంఛ డబ్బు
కాల మాయ కలలు తెచ్చు డబ్బు
చింత దీర్చి చక్క బిరుదు డబ్బు
గడుపు లోన గండ మయ్యె డబ్బు
సంప దగను స్థితికి మార్చు డబ్బు
రోగి మధ్య రగడ బతుకు డబ్బు
రోగమనెది రాగ చదువు డబ్బు
మనసు పొంది మాన మయ్యె డబ్బు
ప్రేమ చినుకు పెళ్లి జరుగు డబ్బు
బ్రతుకు నీడ బంధ మయ్యె డబ్బు
నేటి ప్రాంజలిప్రభ - పాట - జ్యోతి 03-102021
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ
చూడు మా నీలోన నాలోన వెలుగులే నయనాలు
ప్రేమనే చూపించు ధైవముగాను జ్యోతి వెలుగులు
కాల మాయల్ని తొల్గించు
మానవత్వాన్ని రక్షించు మహిమ వెలుగులే
లోకం లో ధర్మ ప్రవర్తనతో
కాలం లో సత్యాన్ని పలికించే వెలుగులే
స్నేహం తో న్యాయ పోరాట
విశ్వం లో వేద బోధాంమృతపు వెలుగులే
సంసారం లో దక్షత కర్తవ్య బోధల
సంగీతం లో రక్షిత కారుణ్యమయిన వెలుగులే
సమ్మోహం లో అర్పిత భావత్వ పు
సల్లాపం లో సంతతి ధారుడ్యపు వెలుగులే
పత్తీ పత్తి కల్పిన వచ్చే పత్తి కదలిక
పతి పత్ని కల్శిన వచ్చే బిడ్డ లోన వెలుగులే
మంచు అగ్గి కల్శిన వచ్చే ద్రవపు
నింగి నేల కల్శిన. వచ్చే బ్రహ్మ మయపు వెలుగులే
అంతర్జాతీయ స్థాయిలో నిత్యమూ సత్య
ఆత్మతత్వపు బోధ లో మనస్సు ప్రక్షాళన వెలుగులే
అంధకారాన్ని తరిమే సూర్యని
కళ్ళు కళ్ళు కల్శొచ్చె ప్రేమలుపుట్టే వెలుగులే
ప్రేమ తత్వపు స్త్రీ పురుషుఁ లలో సత్య
హృద్యతత్వపు అర్ధం తో ప్రేమలో వెలుగులే
చూడు మా నీలోన నాలోన వెలుగులే నయనాలు
ప్రేమనే చూపించు ధైవముగాను జ్యోతి వెలుగులు
--(()) - -
III
తారక వృత్తము - స/న/జ/జ/న/గగ IIUII IIUII - UIIII UU
17 అత్యష్టి 31612
తలపే ఇది వయసే యది -- పాల తెలుపు నువ్వే
కలగా మది మెదిలే నది --- కాల మెరుపు నువ్వే
వలలోనయె కదిలే గది --- గాల తలపు నువ్వే
చలమేనులొ చెదిరే మది --- చేల వలపు నువ్వే
వ్యధ మారును కధ చేరెను -- గాధ సహన మయ్యే
అంద మాయెను సుందరమ్మున -- బాధ విదిత మయ్యే
మొద్దు వైనను సిద్దు డైనను --- స్వేద బిందువు అయ్యే
అద్ద మైనను ఆదరమ్ముగ -- అందు కొనుట అయ్యే
((()))
0
[[03/10, 07:35🙏
సమస్యను పూరించుట..
రా?తంజావూరు విజయ రాఘవ నృపతీ
🔴🔴🔴
జీతాలే లేవు పనులు చేసిన బతికే
అంతామాయే ఇదియు ను ఎవ్వరి నడిగే
శాంతేలేకా కరువుతొ బత్కుల పడకే
రా? తంజావూరు విజయం రాఘవ నృపతీ
((()))
తేటగీతి
నింపు నాకు అనంత శక్తియును దేవి
ఇవ్వు తేజస్సు మాకు నూ ఇలలొ దేవి
ఇవ్వు మాకునులె బలాన్ని ఇపుడు దేవి
మాకు ఓజశ్సక్తిని పంచు మనసు దేవి
((()))
సీసమాలిక
గడియార ముల్లులు..ఘడియ ఘడియ తిర్గు
కాలము తిరుగు టే.. కధలు కదులు
మందులు వాడొచ్చు..మనసును కొనలేవు
ఆరోగ్యమే శోభ.. అవసరము యె
ఇల్లుని కొనవచ్చు... ఇల్లాలి కోరిక
ఆత్మీయులుండచ్చు... అర్ధ ముగను
ఆహార భద్రత...ఆకలి తీర్చుట
జీవిత కాలము..జీర్ణ శక్తి
విజ్ఞాన సంపద... వినయము తోడుగా
జ్ణానము అనంత..జ్ణాపకము యు
మంచాన్ని కొనవచ్చు.. మాతృత్వం కొనలేవు
మంచి గా పలుకు లు..మనసు నీడ
తేటగీతి
మాకు ధైర్యాని పెంచుము మహిమదేవి
మాలొ ఓర్పును నేర్పును మృదుల దేవి
ప్రకృతి తెలిపేది తెలుపుము ప్రేమ దేవి
కాల మాయను తప్పించు కళల దేవి
((()))
03/10, నేటి కవిత. తేనీరు..టి
మాయాజాలం మదిలో ఉల్లాసం ఉరక లేసే
ఉత్సాహంగా మార్పే వయసు ఉడుకు తేనీరే
నీతొ నాతొ నిలకడగా స్నేహం చూపు ఆశలే
తన్నుతాను మరచి మరిగి శక్తి నిచ్చె తేనీరే
నువ్వుంటే దరిదాపుకు నిద్ర రాదు ప్రాణం లా
నిన్ను కలిపి మనసు కుదిపి మాయ జేయు తేనీరే
నలుగురు కలిసి నప్పుడే నాలుగు మాటలు వచ్చే
ఏదో మాయ లాగ మైకమును పెంచే తేనీరే
ధనిక బీద భేదము లేదు అందరి లొ సంతోషం
మెదడుకు పదును పెట్టే అవకాశమే తేనీరే
పనికి పనికి మధ్యే విశ్రాంతి విడి దిగా దాహం
తీర్చే పానీయం అందరూ త్రాగు తేనీరే
మాయ మర్మం తెలియదే పాలు టియాకు మరిగే
చిక్కని ద్రవం మనిషి కి ఉల్లాసం తేనీరే
ఆనందంతో పొందే ఆతిధ్యం ఇదేనులే
సభ, సమావేశా, పెళ్లిలో నీతో ఆరంభం
నీవు ఉంటేనే రాజకీయ నాయకులు తెలివియె
నీవు ఉంటేనే విద్యార్థులలో చదులలో తెలివియె
నీవు ఉంటేనే భవిష్యత్తులో మంచి తెలివియె
తేనీరే తేనీరే తేనీ రే తేనీరే
0 Comments
వృద్ధుల దినోత్సవం.సందర్భముగా
నేటి కవిత ..
నేటి పరిస్థితి లో వృద్ధులు
తేగలో చంద మామగా
నీటిలో బుడగ తేలుట
చినిగిన బతుకు కాగితం
పెద్ద వయసులో బతుకంత
క్రొవ్వువత్తి గను కరిగేను
చినిగిన బతుకు నీడలా
కళ్ళజోడు తొ కఱ్ఱ తోడు
అరిగిన చెప్పుల జోడు
ఉడిగిన ఆకులా కలిగి
నలిగిన పూలుగా మిగిలె
విరిగిన కొమ్మలా ఒరిగె
మాగిన పండులా మిగిలె
బట్ట తలగాను బతకగా
వాడిన బొట్టు వాడక
ఈనాటి వృద్ధుల లీల
ప్రేమలు వెల్లువ కళలు
దర్జాగా బ్రతక లేకయే
దగ్గుతూ మింగుతూ బతుకె
వ్యర్ధ పదార్దము కాదు
సలహాల తండ్రిగా తోడు
మంచిరోజులు నిండు వెలుగు
ప్రేమతో తాత పలుకులు
స్వార్దము లేని జీవియే
ఆదుకునే పెద్ద తరముయే
మనసు పెట్టి చూడ గలుగుటే
చిన్న పిల్లల లాగుండు
ఆరోగ్యమే రక్ష సలుపు
మానవత్వమును నిల్పవలె
వృద్ధులందరికి పాదాభి వందనాలు
మీరే మాసంపద మా మనోధైర్యం
మీ విధేయుడు
మల్లాప్రగడ రామకృష్ణ
--((())--
0
గాంధీ జయంతి సందర్భంగా కృతజ్ఞతలు।। 02।।10।।2021
సీస పద్యము
అహింసా వాదం।।। ఆత్మబంధువు గాంధి
మహాత్ముడు బాపు గా।। మహానేత దేశం
గనలేవు రాజ్యమే।। కాలగతిగ మారెలె
కనులకు విలువేది।।। కదలాలి ఇకనైన
మనసుగా తెలుగు కు।।। కళ్ల నీరు గవచ్చె
అణువణువున గాను।।। ఆశలమహాత్ముడు
గుండేలో చోటుయే।। గొప్పగ పితామహుడు
బండనే మార్చెనే।।। బుద్ధిమంతుడు గాను
దాండిలొ సత్యాగ్రహం।। అహింసా మార్గమే
ఆడి తప్పు చేయని।।అందరి లొ గాంధీ
ఆశయం వెలుగులే ।।। ఆరాట పోటీ లు
విశ్వాస పరీక్షలు।।। విజయానికి మార్గం
సుశ్యామ సఫలమే।।। సకలంలొ శోభలే
దేశభక్తి చూపిన।।। దేశపిత గ గాంధీ
((())))
నేటి శీర్షిక పూరించిన పద్యం।।। చంపకమాల
వడిననె చేరె పిల్లలు భవాని సుఖాల తొనమ్ర తత్వమున్
నడవడి కోరె కాలపు కణాలు విశాల వినమ్ర తత్వమున్
గుడిబడి మారె దేశము నగాలి సుఖాల తొవెంట తత్వమున్
గుడికిని సత్రశాలకును కూపతటాక వన ప్రతిష్టకున్
కమనీయం కనునాధ మమ్ము గన సౌఖ్యమ్మే సేవమ్ములే
రమణీయం శుభమేగ సమ్మతము సంరంభం సౌందర్య మే
గమనాలే సుఖమేలు విశ్వ జన సాంగత్యం సాహిత్య మే
మమకారం నిజమేలు సర్వ సహ సామాన్యం గా ప్రేమయే
))(((0
తారక వృత్తము
బ్రతుకన్నది విజయమ్ముగ ।। భాగ్యములను పొందే
మతి యున్నది కళ అన్నది ।।। మోహములను తెల్పే
గతిమాయయు సుఖ కాలము।।। గోప్యముగను ఉండే
జతగుండియు గతిగమ్యము।।। జాగిళముగ సాగే
విలపించెను వినయమ్ముగ ।।। వాదములుగ సాగే
పలుకేనులె పదిలమ్ముగ।।।।।। పాదములను పట్టే
మలుపేగనె మహితమ్ముగ।।। మానస మును చుట్టే
తలపేవినె తపనమ్ముగ।।। తామసముగ బుధ్ధే
విధి ఆటలు। మృధుభాష్యము ।। వేదములగ సాగే
మది మోహము తనువంతయు ।।మోదముగను ఉండే
హృదయమ్ముగ ముదమోందియు ।। హాయి మలుపు చెందే
ఉదయమ్ముగ మతిపొందియు।।।। ఊహలవల చిక్కే
(((())))
మన మహాత్ముడు గాంధీ జీ
గుజరాత్ రాష్ట్రంలో పుట్టి,
బారిస్టర్ చదువు చేపట్టి,
దక్షిణాఫ్రికయందు అడుగెట్టి
అవమానములను ఎదురొడ్డి
అహమును తరిమి కొట్టియు
దుర్మార్గులను తరిమి వేసి
ప్రక్షాళనం కునడుము చుట్టి
\కర్రచేపట్టియు నడిచి యు
భరత దేశాన్ని దర్శించి,
హింసను వ్యతిరేకించి,
అవేమిటో అహింసను ఎంచి,
గ్రామస్వరాజ్యాన్ని స్థాపించి,
సంసమాజమును నిర్మించి,
బానిస బతుకులు మార్చి
నవభారతాన్నీ రచించిన
బోసినవ్వులతొ బాపూజీ,
భావితరానికి దిక్షుచి।।।।।!
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం,
మనుషులను మనిషిగా చూడని సమాజం,
తారతమ్యాలు లేని సరికొత్త భారతం,
శాంతి,అహింసలే తన ఆయుధం,
బడుగు బలహీన వర్గాలకు ఆశాకిరణం,
స్వాతంత్ర పోరాట స్ఫూర్తికి కేతనం।।।!
ఒంటరిగా పోరాడిన వీరుడు,
హింసను విడనాడిన ధీరుడు,
అహింసను చేపట్టిన దేవుడు,
ఐక్యతను చాటిన నాయకుడు,
ఐన్ స్టీన్ కు ఆదర్శప్రాయుడు,
హిట్లర్ ను ఆలోచింపచేసిన ఘనుడు,
గ్రామగ్రామాలలో,
వాడవాడలలో,
స్వదేశంలో,
విదేశంలో
వినుతి కెక్కిన విశ్వవిఖ్యాతి
మన మహాత్ముడు।।।।।। గాంధీ
0
"శ్రీపద్మేశం ఘనతనురుచింపద్మాయతాక్షం సుశీలం ,
ఆపద్బంధుం దురితహరణం పద్మనాభం సలీలావిభూతిమ్ !
రూపాతీతం కలివిదరణం పద్మపాదం హి కృష్ణం ,
భూపాలం తం విహగగమనం నిత్యసేవాంకరోమి !!!
----
శ్రీ విశ్వేశం జనుల సమధర్మన్యాయ భావం సుశీలం
శ్రీ సౌందర్యం మెరుగు పరుచేశక్తీ సమానం సుశీలం
శ్రీ సర్వాత్మా సకల విషవాంఛాప్రేమ తత్త్వం సుశీలం
శ్రీ పద్మేశం ఘనతనురుచిపద్మాయతాక్షం సుశీలం
ప్రేమద్బంధం మనసువిదితమ్ సర్వమోహం సకాల విభూతిమ్
విశ్వాసమ్మే విజయ చరితమ్ న్యాయ భావం విశాల విభూతిమ్
ధర్మార్ధమ్మే వినయ భరితమ్ ధ్యాన ధైర్యం సుఖాల విభూతిమ్
ఆపద్బంధుం దురితహరణం పద్మనాభం సలీల విభూతిమ్
మోహావేశం మనసుమదనం సేవలక్ష్యం హిబ్రహ్మం
ఆశాపాశం విషయ వినయం ప్రేమభాష్యం హివిశ్వం
ప్రేమాతత్వం కరుణ తరుణం కార్య సాధ్యం సుధర్మం
రూపాతీతం కలివిదరణం పద్మపాదం హికృష్ణం
ప్రేమార్పితం విషయచరితం విశ్వాసమ్మే కరోమి
స్నేహార్పిత్వం విమళ గమనం సర్వార్ధమ్మే కరోమి
రామార్పితం సహనవినయం సత్యన్యాయం కరోమి
భూపాలంతం విహగగమనం నిత్య సేవాంకరోమి
0 Com
సీసము లో పాట
నవ్వులు రాయుడు ... నవ్వుతు నుండుట
వెన్నెల వేళలొ.... వెన్న ముద్ద
కన్నుల చూపులో.. కన్నీళ్లు రానీకు
వెన్నెల వేళలో... వేదన తేనీకు
తిన్నగ ఆటలో... తిట్టులు రానీకు
మన్నన మాటలో... మనసు జేరు
అక్కడ అప్పుడు.. ఆశలు రాజీకి
ఇక్కడ ఇప్పుడు .. ఈశ్వర పూజకి
మక్కువ చప్పుడు... మానస కూటికి
ఎక్కువ తక్కువ... ఎల్లలు జేరు
ఇచ్చెడు వానికి ... ఇచ్చిన ధైర్యము
జొచ్చెడు వానికి... జొచ్చిన వైరము
నచ్చిన వ్యక్తికి... నచ్చని మోహము
మెచ్చిన వాళ్లకి.... మేలు జేరు
(((())))
సప్తవర్ణి...పంచమాత్రల సీసము పాట
కలమారె కధమారె .. కనువిందు చేయు మా
కల లాట నిజ మాయె.. వింత రగడ
మది లోన మాయేను... మనువాడ మన్నాది
కధ లాగ కదిలే ను ... కనికరం గాను లే
విధి ఆట అయ్యేను... వింతగా నిజ మాయె
మదిలోన పలుకులే... మనసు లాయె
కలలన్ని తీరును లె... కన్నులా కదిలే ను
గలుగు లే సుఖములు .. కలుసునే కరములు
తలపులే సహజమే.. తపనలే తీరునే
మలుపు లే హృదయాన...మేలు కొలువు
ఒకరికి ఒకరుగా నె ... ఒకటి గా వెలుగులే
మకుటము కొరకు లే.. నువ్వు లతొ నావలే
సుఖము ల రోజులే.. సహనపు ఆటలే
సకలము సృష్టి యే... సుఖము చాలు
....
విధేయుడు..మల్లాప్రగడ రామకృష్ణ
(((())))
0
అమ్మపాట ---- --2--
అమ్మా, అమ్మా పసుపు కుంకుమతో
గాజులు వేసి పూజిస్తున్నా మమ్మా
నీ మాహిమలూ మాకు చూపి మా
తప్పులు తిద్ధి మమ్ము ఆదుకోవమ్మా
బ్రహ్మ సృష్టికి నీవే మూలం కదమ్మా
మా శక్తి సామర్ధ్యాలకు నీ తేజమే నమ్మా
మా ఆలోచన అంతా నీ కరుణయే నమ్మా
మా బిడ్డల పోషణ భాధ్యత నీవే నమ్మా
మా బిడ్డల విద్యా బుద్ధులకు
గురువుగా సరస్వతి వైనవమ్మా
మాకు ఆరోగ్య సంపాదన కల్పించి
క్రమ బుద్ధి కల్పించే మహాలక్ష్మివమ్మా
కుటుంబానికి పౌష్టిక ఆహారాన్ని అందించి
ఆత్మానందం అందించే అన్నపూర్ణవమ్మా
మాకు దృఢ సంకల్పం శక్తినిచ్చి
సన్మార్గంలో నడిపించే పార్వతివమ్మా
సహాయసహకారు అందిస్తూ దుష్టులను
ఎదుర్కొనే శక్తినిచ్చే మాహాకాళివమ్మా
దుర్మార్గాన్ని అణిచే శక్తినిచ్చి
న్యాయ మార్గంలో ఉంచే దుర్గవమ్మా
ప్రకృతిలో సహకరించి వికృతి
చేష్టలు, మాటలను మార్చే మర్దినివమ్మా
స్త్రీని అగౌరపరచి పరస్త్రీవ్యామోహంలో
ఉన్న వారిని మార్చే చండివమ్మా
అమ్మా, అమ్మా పసుపు కుంకుమతో
గాజులు వేసి పూజిస్తున్నామమ్మా
నీ మాహిమలూ మాకు చూపి
మా తప్పులు తిద్ధి మమ్ము ఆదుకోవమ్మా
తే.గీ.
ముగ్ధ మోహన రూపము - మహిమతోను !
సుందరమ్మగనులే లావణ్య - సొమ్ము నీవు .!
హృదయ వీణలు పంచేను - ఉదయ కరుణ .!
పులక రించే తల్లి పలుకు -- పుడమి నందు !
--((***))----
వృద్ధుల దినోత్సవం.సందర్భముగా
నేటి కవిత .. 01-10--2021
నేటి పరిస్థితి లో వృద్ధులు
తేగలో చంద మామగా
నీటిలో బుడగ తేలుట
చినిగిన బతుకు కాగితం
పెద్ద వయసులో బతుకంత
క్రొవ్వువత్తి గను కరిగేను
చినిగిన బతుకు నీడలా
కళ్ళజోడు తొ కఱ్ఱ తోడు
అరిగిన చెప్పుల జోడు
ఉడిగిన ఆకులా కలిగి
నలిగిన పూలుగా మిగిలె
విరిగిన కొమ్మలా ఒరిగె
మాగిన పండులా మిగిలె
బట్ట తలగాను బతకగా
వాడిన బొట్టు వాడక
ఈనాటి వృద్ధుల లీల
ప్రేమలు వెల్లువ కళలు
దర్జాగా బ్రతక లేకయే
దగ్గుతూ మింగుతూ బతుకె
వ్యర్ధ పదార్దము కాదు
సలహాల తండ్రిగా తోడు
మంచిరోజులు నిండు వెలుగు
ప్రేమతో తాత పలుకులు
స్వార్దము లేని జీవియే
ఆదుకునే పెద్ద తరముయే
మనసు పెట్టి చూడ గలుగుటే
చిన్న పిల్లల లాగుండు
ఆరోగ్యమే రక్ష సలుపు
మానవత్వమును నిల్పవలె
వృద్ధులందరికి పాదాభి వందనాలు
మీరే మాసంపద మా మనోధైర్యం
మీ విధేయుడు
మల్లాప్రగడ రామకృష్ణ
--((())--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి