మోటక-తోటక వృత్తములు
==
మోటకము లేక మోటనకము - నాట్యశాస్త్రము
తోటకము (ఛిత్తక, నందినీ, భ్రమారావళి) - నాట్యశాస్త్రము, పింగళ ఛందస్సు
==
1
1 Co
దోధక తామరసములకు కూడ ఒక్క లయయే!
==
దోధకము కూడ ఒక పురాతనమైన వృత్తమే. ఇది పింగళ ఛందస్సులో, రత్నమంజూష, వృత్తజాతి సముచ్చయములలో పేర్కొనబడినది. దీనికి తరంగకము, భిత్తకము అని కూడ పేరులు గలవు. దీనిని వరాహమిహిరుడు మొట్టమొదట వాడినట్లున్నది. దోధకమునందలి మొదటి గురువును రెండు లఘువులుగా చేసినప్పుడు మనకు తామరసము లభిస్తుంది. దీనిని జయకీర్తి హేమచంద్రులు పేర్కొన్నారు. వీటి గతి నాల్గు మాత్రల చతురస్రగతి.
==
దోధకము - భ/భ/భ/గగ UII UII - UII UU
11 త్రిష్టుప్పు 439
==
తల్లికి మించిన - దైవము లేదా
తెల్లని వస్త్రపు - దేవత గాదా
మల్లెల మాలల - మాయని గంధం
బెల్లెడ నిండుచు - నింపు నొసంగున్
==
ప్రేమ విశాలము - ప్రేమ గభీరం
బీమది దీపము - ప్రేమకు దేవీ
యామని పూవుల - యందము చందం
బీమధు మాసము - ప్రేమకు గుర్తే
==
రాముని రూపుకు - రంగుల లాలీ
సోముని కాంతికి - సొంపుల లాలీ
కాముని నవ్వుకుఁ - గమ్మని లాలీ
దేముని బిడ్డకు - దీవెన లాలీ
==
తామరసము - న/జ/జ/య IIII UII - UII UU
12 జగతి 880
==
మనసు తలంపుల - మల్లెలు నీకే
కనులను దివ్వెల - కాంతులు నీకే
తనువను తీవియ - తావియు నీకే
విను మిఁక నాహృది - ప్రేమము నీకే
==
సరసునఁ దామర-సమ్ముల యందం
బరయఁగఁ గన్గవ - యయ్యెను నీకో
వరమిడు లక్కిమి - వల్లభ నీయా
కరములతో మము - గావుము సామీ
==
ప్రియతమ కల్వలు - విచ్చెను నీకై
నయమగు నీరవ - నక్తము నీకై
వయసిడు వెన్నెల - వన్నెలు నీకై
రయముగఁ జేరఁగ - రమ్మిట నాకై
==
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
0
ఒకే లయ కలిగిన కొన్ని అతి లఘు వృత్తములు
==
శ్రీ (గౌ) - U
మే/మే/మా/మా/ నే /నూ / నీ
కా/కీ/కే/కీ/ కూ / కో
తా/తా/తై/తై / తో
లా/ లా/ లే/ లై/ లో
--
బలి (మద, మధు, పుష్ప) - II
హరి/హర/సుర/వర
తెలి/మల/తళ/తళ
కమ/లము/లమ/లము
==
సార (దుఃఖ, జన్ను) - UI
చేర/రార/వీర/మార
తాళఁ/జాల/జాల/మేల
కావ/రావు/దేవ/నీవు
--
కమల (దృక్కు) - III
కలల/కడలి/యలల/సడులు
చలికిఁ/దలఁపు/చెలియ/వలపు
కురుల/విరులు/వఱలు/సిరులు
==
పద్మ (నౌ, కామ, స్త్రీ) - UU
మాఁవా/మాఁవా/రావా/మాఁవా
గాన/మ్మే నా/ప్రాణ/మ్మౌనా
వ్యక్తుల్/రక్తుల్/భక్తుల్/ముక్తుల్
--
రజనీ (ప్రవర, రమణ, మదన) - IIU
నిశిలో/శశి, యూ/ర్వశి యే/దిశలో
కవితా/రవ మా/శివ తాం/డవమే
చెలి యా/శిలయో/వలపే/వలయో
==
విధేయుడు - జెజ్ఝాల కృష్ణ మోహన రావు
నేటి ఛందస్సు UIUIII - UIUIU - రథోద్ధతము
రామచంద్రునిలొ - త్యాగబుద్ధియే
రమ్యమైనదియు - రామరాజ్యమే
సౌమ్యతార్దముయు - సామరస్యమే
జామురాత్రి కళ - కామ్య మర్మమే
రాజ్యమేలుటయె - ధ్యానదీక్షయే
ఆజ్ఞ చేయుటయె - ఆశ తీర్చుటే
ప్రజ్ఞ ప్రాభవము - ప్రీతి నిచ్చుటే
ప్రజ్వలించుటయుఁ - ప్రేమ తీర్చుటే
వైరివీర రస-వైద్య మన్మథా
వీర భావ పస - వేద సద్గుణా
కార ధీర పర-గండ భైరవా
దారకీర్తి రానా - ధర్మ పండితా
కాల మాయలులె - కర్మ ధర్మమే
గాల మేయుటయె - గర్వ మర్మమే
మాల వేయుటయె - మంచి మార్గమే
వేళ పర్వముయె - వేదనమ్ముయే
ప్రేమ ప్రేమికులు - ప్రీతి చూపుటే
స్వామితీర్ధములు - చాలు ఇప్పుడే
కామితార్ధమును - కాలయాపనే
ఏమి జీవితమొ - యెందుకో కదా
నా మనస్సు నవ - నాట్య మాడఁగా
నా వయస్సు వడ - గాలి మార్పుగా
నా తమస్సు కధ - బాధ నివ్వగా
ఈ ఉషస్సు కళ - ఇచ్ఛ తిర్చగా
___****____
0
ఒకే లయతో రెండు వృత్తములు - రథోద్ధతా - ప్రియంవద
==
xUIUIII - UIUIU - రథోద్ధతము
IIIUIII – UIUIU - ప్రియంవద
ఈ రెండు వృత్తములకు ప్రతి పాదములో రెండు చతుర్మాత్రలు కాని రెండు అష్టమాత్రలు. ఇట్టి అష్టమాత్రా వృత్తములను గుఱించిన నా వ్యాసమొకటి ఈమాటలో గలదు. రథోద్ధతము చాల పురాతన వృత్తము. ఇది నాట్యశాస్త్రములో, పింగళ ఛందస్సులో పేర్కొనబడినది. కాలిదాసాది కవులు సర్గలనే రథోద్ధతములో వ్రాసియున్నారు. క్రింద భారతములోని నన్నయ వ్రాసిన ఒకే ఒక రథోద్ధతము:
హార హీర ధవ-ళాంశు నిర్మలో-
దారకీర్తి రణ - దర్ప సద్గుణా
వైరివీర రస-వైద్య మన్మథా-
కార ధీర పర-గండ భైరవా
- నన్నయ భారతము, సభాపర్వము, రెండవ ఆశ్వాసాంతము.
==
ప్రియంవద హేమచంద్రుని ఛందోనుశాసనములో, ఇదే వృత్తము మత్తకోకిల అని జయకీర్తి ఛందోనుశాసనములో తెలుపబడినది.
==
రథోద్ధతము - ర/న/ర/లగ UIUIII - UIUIU
11 త్రిష్టుప్పు 699
==
ఏమి జీవితమొ - యెందుకో కదా
భూమి భారముగఁ - బుట్టినానుగా
నేమి సాధనల - నేను జేయుటో
స్వామి దల్చు నది - చాలు మన్కిలో
(సాధనలన్ + ఏను)
==
శ్యామలాభ్రమునఁ - జంద్రకాంతిగాఁ
బ్రేమలోకమున - వెలుగు నిండెఁగా
నామనస్సు నవ - నాట్య మాడఁగా
వ్యోమమయ్యె నొక - యుత్సవమ్ముగా
==
ప్రియంవద - న/భ/జ/ర IIIUIII – UIUIU
12 జగతి 1400
==
కలల మత్తు నను - గ్రమ్ముచుండెరా
వలపు కౌగిలుల - వాలిపోదురా
చెలియ వెల్గులిడు - స్నేహదీపమే
పిలుపు వేగ విను - ప్రేమ తాపమే
==
ఉరము పొంగె నిట - నోప్రియంవదా
కరములన్నృపతి - కౌగిలించునో
విరహ మిచ్చు సెగ - వేడి తాళలే
నిరులులో నిదుర - యెండమావియే
==
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
ఇది కూడ మందాక్రాంతమే!
==
వనమయూరపు నడకతో లాలసరాగ అను సార్థకనామ గణాక్షర వృత్తము:
లాలసరాగ - న/స/ర/ర/గ IIIII UUI - UUI UU
13 అతిజగతి 1184
==
దినము నిను నేఁదల్తు - దేహమ్ము నీకే
మనమునను నేఁగొల్తు - మంత్రమ్ము నీవే
వనజనయనా నేను - వాంఛింతు నిన్నే
ప్రణయ మొక యందాల - ప్రస్థానమేగా
==
దీనికి ముందు నాలుగు గురువులను ఉంచితే అబ్రాకడబ్రా, ఇది మందాక్రాంతము అవుతుంది। కాని మామూలు మందాక్రాంతపు విఱుపులోని బరువు ఇందులో లేదు। కావున పదాల విఱుపు పద్యాలలో చాల ముఖ్యము। దీనిని సంస్కృత కవులు అర్థము చేసికొన్నారు। కన్నడ తెలుగు కవులు చేసికోలేదు। వీళ్లకు వృత్తపు చట్రము ముఖ్యము, కాని పదాల విఱుపు, పద్యపు నడక కాదు!
==
ఉత్తమ మైనది సమయఉ
ష్ణోగ్రత సహజమ్ముగాను పనియందేలే
గ్రమ్యత పొందే స్వచ్ఛత
తపమై పనియందులే కళ రూపము పొందే
సమస్యను పూరించుట ।।।।।।।।
బంగరు లింగకాయ గల భామిని వైష్ణవ కాంతయే జుమీ
ఉత్పలమాల
శృంగము భంగమాయణులె సొంగను కార్చుట తొందరెందుకో
వ్యంగము తెల్పుట ఇదియు వంగియు వాటము ఆత్రమెందుకో
చెంగున దూకుటే లనులె చేరువ ఉన్నది మర్చి పావుటే
బంగరు లింగకాయ గల భామిని వైష్ణవ కాంతయే జుమీ
*******
స్రగ్ధర - మహాస్రగ్ధ్ర
==
xUUUU IUU - IIII IIU - UIU UIUU - స్రగ్ధర
xUUUU xxx - IIIx IIU - UIU UIUU - మందాక్రాంతము
IIUUU IUU - IIII IIU - UIU UIUU - మహాస్రగ్ధర
IIUUU xxx - IIIx IIU - UIU UIUU - మందారమాల
==
స్రగ్ధర ఒక పురాతనమైన వృత్తము. దీనిని మొట్టమొదట అశ్వఘోషుడు కావ్యములో వాడినాడు. మహస్రగ్ధర శ్రావణబెళగొళ శాసనములో సుమారు క్రీ.శ. 700 ప్రాంతములో లిఖించబడినది. తెలుగు భారతములో రెండింటిని కవిత్రయము వాడెను. నన్నెచోడుని కుమారసంభవము స్రగ్ధరా వృత్తముతో ప్రారంభమవుతుంది.
==
స్రగ్ధర - మ/ర/భ/న/య/య/య UUUU IUU - IIII IIU - UIU UIUU
21 ప్రకృతి 302993
==
జీవమ్మీవందు రామా - చెలువపు ప్రతిమా - చిన్మయాకార రూపా
భావమ్మీవందు రామా - భవభయ హరణా - భాసితాంగప్రదీపా
దైవమ్మీవందు రామా - దినకరకులజా - దివ్యతేజోవిలాసా
త్రోవన్ జూపంగ రావా - తురితముగను నో - తోయజాక్షా సుహాసా
==
నీవేగాదా మురారీ - నిజముగ మదిలో - నిండుగా నుందు సొంపై
రావా నాకై ముకుందా - రయముగ నిచటన్ - రాగదీపార్చి వంపై
జీవానందా విహారీ - చెలువుల విరియై - చేరుమా కామరాజా
దైవమ్మీవే సుధాబ్ధీ - తరుణిని గనరా - దస్సితిన్ గల్పభూజా
==
ఇందులోని మందాక్రాంతము:
మందాక్రాంతము - మ/భ/న/త/త/గగ UUUU - IIIIIU - UIU UIUU
17 అత్యష్టి 18929
==
నీవేగాదా - నిజము మదిలో - నిండుగా నుందు సొంపై
రావా నాకై - రయముగ నిచటన్ - రాగదీపార్చి వంపై
జీవానందా - చెలువు విరియై - చేరుమా కామరాజా
దైవమ్మీవే - తరుణిఁ గనరా - దస్సితిన్ గల్పభూజా
==
మహాస్రగ్ధర - స/త/త/న/స/ర/ర/గ
IIUUU IUU - IIII IIU - UIU UIUU
22 ఆకృతి 605988
==
మనుజాధీశా ముదమ్మీ - మనమున గనఁగా - మాధురిన్ నీదు రూపం,
బనఘా నీవే నిజమ్మై - యమరఁగ నెదలో - హాయి హర్షమ్ములేగా
వనజాస్యా యీ లతాంగిన్ - వదలకుము, సదా - వాంఛతో నుందు నీకై
విను నాయీ విన్నపమ్ముల్ - విరహము సయిచన్ - బ్రేమలో మాడిపోదున్
==
మదిలో నీవే సుగమ్మై - మధురముగను నా - మాయలో నన్ను ముంచన్
సదనమ్మందున్ స్థితమ్మై - సరసతను మహా - స్రగ్ధరుండై వెలుంగన్
ముదమయ్యెన్గా నవమ్మై - పులకలు గలిగెన్ - మోహనా ముగ్ధరూపా
యిదియే గాదా నిజమ్మై - యిహమును బరమున్ - నిత్య సత్యప్రదీపా
==
ఇందులోని మందారమాల (లలితాక్రాంత):
మందారమాలా - స/త/న/య/య/య IIUUU - IIIIIU - UIUUIUU
18 ధృతి 37860
==
మదిలో నీవే - మధురముగ నా - మాయలో నన్ను ముంచన్
సదనమ్మందున్ - సరసత మహా - స్రగ్ధరుండై వెలుంగన్
ముదమయ్యెన్గా - పులక గలిగెన్ - మోహనా ముగ్ధరూపా
యిదియే గాదా - యిహము బరమున్ - నిత్య సత్యప్రదీపా
==
హోలీ పండుగ రాత్రి పున్నమిలో రాసక్రీడకు చర్చరీనృత్యమును చేసేవారట. ఈ చర్చరీ నాట్యమునకు అనువైన వృత్తము తో(త్రో)టకము అని నేను చదివియున్నాను. క్రింద కొన్ని పద్యములు ఈ వృత్తములో. తోటక వృత్తమునకు ప్రతి పాదములో నాలుగు స-గణములు. తెలుగులో అక్షరసామ్య యతిని తొమ్మిదవ అక్షరముపైన ఉంచుతారు. నేను పాదమును రెండు అర్ధ భాగములుగా విఱిచి ఏడవ అక్షరముపై యతిని ఉంచుతాను.
==
తోటకము - స/స/స/స IIU IIU - IIU IIU
12 జగతి 1756
==
ఇది పున్నమిరా - యిది వెన్నెలరా
యిది రాతిరిరా - యిది రమ్యమురా
యిది పాటకమే - యిది త్రోటకమే
యిది పూవులతో - మృదు నృత్యమురా
==
వని బృందమురా - బహు చందమురా
వనమోహినులే - వనమోహనులే
పినవారలతోఁ - బెదవారలతోఁ
గను విందగురా - కళలీనునురా
==
మధుసూదన రా - మధుమాసములో
మధువీయఁగ రా - మధుచంద్రికలో
మధురమ్ము గదా - మది నింపు సదా
మధురాకృతిలో - మధురాధిపతీ
==
నయగారముతో - నటనమ్ములతోఁ
బ్రియ పాడుదమా - విన మాధురితో
వయసాసొగసే - వలపాతలఁపే
జయమంగళ మీ - జగమందుఁ గదా
==
మురియంగ సదా - ముదమిచ్చును చ-
ర్చరి వెన్నెలలో - సరసమ్ములతో
హరి వృత్తములో - నగు కేంద్రముగాఁ
గరతాళములం - గడు మోహనమై
==
కాకవిన్ వృత్తము "సోయగంపువల"
==
UII UIU III - UII UII UIUIU - ఉత్పలమాల 20 కృతి 355799
UII UIU III - UII IIII UIUIU - కుసుమవిలసితము 21 ప్రకృతి 720343
UII UIU III - UII IIII UIUIIIU - సోయగంపువల 23 వికృతి 3866071
==
సోయగంపువల - భ/ర/న/భ/న/జ/భ/లగ
UII UIU III - UII IIII UIUIIIU
23 వికృతి 3866071
==
చూడకు నీవు నన్నటుల - సుందరి యెడఁదయు నిల్చిపోవును గదా
వాడిగ నుండు చూపు లవి - వంతల మునుగఁగఁ జేయు నొక్క త్రుటిలో
వేడిగ నుండు తూపులవి - వేగము తనువును వేగఁజేయుఁ గద నా
వాడని ప్రేమ పుష్పమిది - భాషల మలచఁగ సాధ్యమా ప్రియతమా
==
చూపులతోడ గ్రుచ్చకుము - సొమ్మసిలును హృది సోయగంపు వలలోఁ
జేఁపయు తాళలేక పలు - చిందుల నిడు వవశత్వమొంది సెలలోఁ
దాపము పొందె నీతనువు - తాఁకుము నిజమిది, చల్లచేయు త్వరగా
రా పథమందు నిద్దరము - రమ్యత పయనము సేయఁగా సుఖముగా
==
నీవొక తార యభ్రమున, - నేను మఱొక యుడువౌదు నాపరిధిలో,
నీవిధి యీడ్వఁ ద్రోవలవి - యేకముగ నిపుడు మారె నబ్బురముగాఁ,
గావున జంట తారలకుఁ - గక్ష్యలు నొకటిగ నయ్యెఁ, బోవుదము రా,
జీవితయాత్రలోనఁ బలు - చిత్రమగు ననుభవమ్ము లొందఁగఁ బ్రియా
లలితగతి లేక సురభి
==
నాకు నచ్చిన తాళ వృత్తములలో లలితగతి లేక సురభి ఒకటి. దీనిని జయకీర్తి హేమచంద్రులు పేర్కొన్నారు. శ్రీకృష్ణకర్ణామృతములో, శివకర్ణామృతములో, శ్రీకృష్ణలీలాతరంగిణిలో ఈ అమరిక లేక దీని ఛాయలు ఉన్నాయి.
==లలితగతి లేక సురభి - స/న/జ/న/భ/స IIUII - IIUII - IIUII IIU
18 ధృతి 126844
==
ప్రాసయతితో:
==
విరజాజులు - విరి పూయగ - వినయమ్ముకననులే
మరుమల్లెలు - మనసమ్మును - మధుపమ్ముగ కదిలే
సరిలేరులె -- సమయమ్మున - సమసఖ్యతగనులే
సిరిచేరెను -- శిఖపట్టులు - సిరిమువ్వకదలికే
మనలోననె - మధురమ్ముగ - మదజిహ్వతపములే
కనలేనిది - కమణియముఁ - కనుచూపుకదలికే
తనువెందుకు - నినుతాకక - తపనెందుకు పరుగై
వినకుండెను - వనజాక్షుఁడు - పనిజేయుట మొదలై
ప్రతిభే ఇది - ప్రగతీ ఇది - ప్రముఖమ్మున జయమే
ప్రతినిత్యము - ప్రియమాయెను - ప్రమదావనముననే
ప్రతిగమ్యము - పతివల్లనె - ప్రియసౌఖ్యము మెరిసే
పతిలక్ష్యము - సతి వల్లనె - ప్రతివాక్కుయు జేరువై
0
లలితగతి లేక సురభి - స/న/జ/న/భ/స IIUII - IIUII - IIUII IIU
18 ధృతి 126844
==
ప్రాసయతితో:
==
మనసెందుకు - నిను దల్చుచు - మనుచున్నది బరువై
గనుదోయియు - నిను గానక - చినబోయెను జెరువై
తనువెందుకు - నిను దాఁకక - తనరారెడు తునకే
వనజాక్షుఁడు - వినకుండె న-వని నొంటరి బ్రతుకే
==
ఉదయించెను - ముదమారఁగ - మధుమాసము గనుమా
మృదుకోకిల - పదమొక్కటి - మధురమ్ముగ వినుమా
మది పూవుల - నిధి దీనికి - తుద లేదిక చెలియా
హృదయమ్మున - సుధ వెల్లువ - నది యయ్యెను సకియా
==
అక్షరసామ్య యతితో:
==
విమలమ్ముగ - వినువీథిని - విహఁగమ్ముల సడిలోఁ
గమలమ్ములు - కడు సొంపుగఁ - గమలాకరములలో
రమణమ్ముగ - రతనమ్ముగ - రవి తోఁచెను దివిలో
నమలుంగన - నతివేగము - నరుదెంచుము గుడిలో
==
ఒక మాటయు - నొక మానిని - యొక బాణము భువిపై
నకలంకుఁడు - హరిరూపుఁడు - హనుమంతుని గురువై
మొకమందునఁ - బులకించఁగ - ముదమిచ్చెడు నగుతో
సకలేశుని - శరణమ్మన - సమకూరును శుభమే
==
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
3 Co
ద్విపద - శుభరాత్రి
నిను నేను చూడగా నిజమును కోరె
నిను నేను తాకగా నిర్మల మయ్యె
వేడిగా తాకింది వేషము మార్చె
వాడి గా మారింది వాటము మార్చె
భావాల రొదలన్ని భవ్యమై వెలిఁగె
కోవాల కర్గియు కోపమే మఱిగె
సొగసులు కలయిక సర్వమంగళము
బిగువుల బడలిక భవ్య మంగళము
వెచ్చని నీడన వేకువ యగుట
విచ్చిన పువ్వుయు వీడక నలిగె
మదిలోన మర్మము మాయమే యగుట
గదిలోని ధర్మము గమ్యమే యగుట
సమయమే కదిలేను సంయమ మందు
సుమమాల నలిగియే సుఖమును పొందు
అంబరమై సుఖ మాత్రయు పొందు
సంబరమై సుఖ సూత్రము పొందు
వేకువ కిరణాల వెల్లువ ఇదియు
మక్కువ సమయమ్ము మన్నన ఇదియు
చీకటి వెలుగుల చిత్తము ఇదియు
చాకిరి వల్లనా చమటయు ఇదియు
రేపటి రోజుకు రమ్యత పరుచు
రెప్పల మాటున రంజిల్ల పరుచు
అడ్డుగోడలులేవు ఆటకు ఇపుడు
కడ్డుస్థితియుగాదు కలలకు ఇపుడు
****
కాకవిన్ వృత్తము వజ్రకేతక
==
శ్రీ శారదాంబకు .. పాదాభివందనములతో
*
చతుః పంచాశత్ వృత్తమాలిక ( మొదటి భాగము )
------------------------------------------
*
1. శ్రీ వృత్తము - గ
*
శ్రీ విఘ్నేశా
జేజేస్వామీ
భాషాయోషా
శ్లాఘింతున్ నిన్
*
2. స్ను /హరి వృ - లఘువు
*
వినతులు
శుభకర
ప్రణతులు
విధిసతి
*
3.చారు /జత్రు /సార /దుఃఖ - గల (హ)
*
కావరావె దేవదేవి
*
4. మహీ/రమా /ముఖ - లగ ( వ)
*
వరా చిరా పరాత్పరీ
నమో నమో రమా ప్రమా
*
5. మధు/పుష్ప/మద /వలి - లల
*
పలుకుల చెలి లలి
ప్రముదము శమదము
*
6. స్త్రీ /శ్రీపెంపు/కామ /పద్మ వృ. - గగ
*
దేవీ శ్రీవాణీ వాగ్దేవీ
రమ్మా యిమ్మా సమ్మోదమ్మున్
*
7. హరణి /కమల/దృక్ వృ. - న గణము
*
వెలుఁగులొలికి పలుకుకలికి
తెలుఁగులలరఁ బలుకవలెను
*
8. నారీ/శ్యామాంగీ/శ్రీకారయుక్త / తాలీ వృ.- మ గణము
*
నీవేనా భావమ్మై రావే నా భావేశీ
రాగమ్మై యోగమ్మై శ్రీగంగా వేగమ్మై
*
9.రమణః /రజనీ /ప్రవర వృ. -- స గణము
*
అమలా విమలా ప్రమదా సుముఖీ
నవమై భవమై శివమై కవితల్
ప్రియమై నయమై స్మయమై జయమౌ
*
10 బలాకా/కేశా /ధూః /ధృతి/వన/శశీ వృ. - య గణము
*
అవిద్యా లవిత్రా పవిత్రా సవిత్రీ
అజస్రం బజానిన్ భజింతున్ యజింతున్
*
11.మందర /హృద్య వృ. -- భ గణము
*
కోరికలూరని తీరును గోరుదు
పారముఁ జేరఁగ భారము తీరును
*
12. మృగీ /భారతీ/ప్రియా వృ. -- ర గణము
*
ధారణా కారణా శారదా నారదా
వేలుగాఁ బూలతో మాలలే మేలుగా
*
13. పాంచాలి, పంచల సేనా వృ. - త గణము
*
సర్వేశి, సర్వజ్ఞ, సర్వస్థ, సర్వేడ్య
శ్రీవిద్య నీవంచు భావించి సేవింతు
*
14. మృగేన్ద్ర /సువస్తు వృ. - జ గణము
*
సమత్వము ముద్దు విముక్తియు ముద్దు
దయామయి యిమ్ము ప్రియమ్ము రయాన
*
15. సతీ/మృగవధూ/ మధు వృ. - నగ గణము
*
అభవ నీ ప్రభలతో నభయమున్ శుభములే
తెలివితో వెలుఁగుచుం గొలువ నిన్ బలుకుతో
*
16. పటు / దయి వృ. - నల గణము
*
పలుకుల లలనవు వెలుఁగుల వెలఁదివి
కలుముల చెలువవు తెలివికిఁ దెలివివి
*
17. కదలీ /కారు వృ. - సల గణము
*
కవనాల స్తవనాల భువిమెచ్చఁ దవ గాథ
నవినాశి భువనేశి ఠవణించి వివరింతు
*
18. సుమతి / భ్రమరీ / డోలా/ హేయగము వృ. - సగ గణము
*
అనయమ్మున్ వినయమ్మున్ మనసా నిన్ బ్రణుతింతున్
నళినాక్షీ కులదేవీ కలవాణీ లలితాంబా
*
సుప్రభ
9:45 AM
02-03-2022
*
ఆసక్తి యున్నవారికి వివిధ ఛందస్సులను దెలిసికొన నవకాశము. నాకు తెలిసినంతవరకు వివిధవృత్తముల నామాంతరములను గూడ పేర్కొనుట జరిగినది. విషయము మాత్రము మామూలే. పైవారు కలమెలా త్రిప్పితే అలా సాగినవి.
ఏకాక్షరముతో మొదలయి క్రమక్రమముగా రకరకాల గణములతో కూర్చబడినవి .
ప్రతివరుస లో ఒక పద్యమున్నది . కొన్ని చోట్ల ఒకే వృత్తమునకు రెండు, మూడు పద్యములు వ్రాయబడినాయి. ఒకేసారి 108 రకములుగా కూర్చదలచుకున్నా, 54 వ్రాసేసరికి విరామము అవసరమనిపించి ఆపవలసి వచ్చినది.
0
మీకు తెలుసా?
==
సమ వృత్తములను ఎందుకు పాదమునకు 26 అక్షరములకు మాత్రమే పరిమితము చేసినారు? 1 నుండి 5 అక్షరముల వఱకు ఉండే వృత్తములను శాస్త్రరీత్యా ఉదాహరించినారు, కాని వాటిని ఎక్కువగా వాడరు. 6 - 12 అక్షరముల వృత్తములను గాయత్ర్యాదులు అంటారు. 13 - 19 అక్షరముల వృత్తములను అతిజగత్యాదులు అంటారు. 20 - 26 అక్షరముల వృత్తములను కృత్యాదులు అంటారు. ఈ మూడు తరగతులలో ప్రతిదానిలో 7 ఛందములు గలవు. అలా పిదప వెళ్లవలయునంటే 27 - 33 అక్షరముల వఱకు వెళ్లాలి. అది శ్రమ భరితము. అందువలన సంస్కృత ఛందస్సులో 26 అక్షరములవద్ద ఆపినారు. 27 అక్షరములు, అంతకన్న ఎక్కువ అక్షరముల వృత్తములను దండకములు అంటారు. గమనికలో ఉంచుకొనండి: ఈ దండకములు అన్నియు చతుష్పదులు, తెలుగులోని ఉద్ధురమాలా వృత్తములవలె.
==
విధేయుడు - మోహన
0 Co
చతుః పంచాశత్ వృత్తమాలిక- 2వ భాగము (18-36)
--------------------------------------------------------
*
18. సుమతి / భ్రమరీ / డోలా/ హేయగము వృ. - సగ గణము
*
కులదేవీ -నళినాక్షీ- కలవాణీ- లలితాంబా
అనయమ్మున్ - వినయమ్మున్ -మనసా నిన్- బ్రణుతింతున్
*
19. ధరా /తారా /సోమప్రియా వృ. - తగ గణము
*
గోదావరీ- నాదమ్ములే -వేదమ్ములై -మోదింతువా
*
20.తావురి/త్రపు వృ. -- తల గణము
*
జ్ఞానేశ్వరి- జ్ఞానప్రద -వీణాధరి -వాణీమయి
*
21. సుముఖీ /వలా /లలిత వృ. -- భ,గురువు
*
పూజలిడ- భూజనులు- నైజమగు- తేజమున
వాసర సం-వాసినిగా- భాసిలు దీ-వో సుముఖీ
నిత్యవయి- సత్యమయి -స్తుత్యవయి - ప్రత్యహము
*
22. నందః /ఋద్ధి వృ. - రగ
*
సారసాక్షీ- వీరమాతా -శారదాంబా -సూరివంద్యా
*
23. ధారీ /వర్త్మ వృ.-- రల
*
చేతమందు- భీతి బాపి- ప్రీతి గూర్చు -మాతవీవు
త్రాతవీవు - నేతవీవు - జోతలిత్తు - ధాతృపత్ని
*
24. కలా /సుకాంతి/జయా/లాసినీ/విలాసినీ /నగానితా వృ -- జగ
*
సదాతనీ- ముదాకరీ- హృదీశ్వరీ- సుధామయీ
*
25. ఋజు / జపా వృ. -- జల
*
స్థిరమ్మగు -విరాగము- వరించెదఁ - దరించెద
*
26. క్రీడా/వ్రీడా /వృద్ధి వృ. -- యగ
*
గిరాందేవీ- పరేశానీ -నిరాలంబా -వరంబీవే
*
27. వారి/ సద్మ వృ. - యల
*
సురోచిస్సు-ల రాజిల్ల-ధరిత్రీ ప్ర- జరంజిల్లు-
*
28. కన్యా /గీతి /తీర్ణా వృ -- మ గురువు
*
రాజీవాస్యా- రాజీవాభా- జేజేలమ్మా - తేజోమూర్తీ
*
29. ముగ్ధమ్ / వల్లీ -- మ, లఘువు
*
నీవే తల్లి- నీవే తండ్రి - నీవే గుర్వు - నీవే యాత్మ
నీవే కల్మి -నీవే బల్మి -నీవే కాంతి - నీవే శక్తి
*
30. మలహరి /సులూః వృ. -- నవ (న లగ )
*
చెలువముతో -నలరు సఖీ- పలుకుఁజెలీ- లలిత రుచీ
*
31. కలలి వృ. -- న,గగ
*
వచనమీవే - రచనమీవే -రుచివినీవే -శుచివి నీవే
*
32. హలి / యమక వృ. -- న,లల
*
కరుణఁగొని- త్వరనిడఁగ - దరిసెనము - హరుసమగు
*
33. పాంశు వృ. -- న,గల { న,హ )
*
పెరిమనింక - వరము నిచ్చి -మురిపెమీయ -సరణి గాద
*
34. ఉపవలి వృ. - న,న
*
తడవ తడవ - గుడులకరిగి - ముడుపులొసఁగి - యడుగవలెన
*
35. విట్ వృ. - భ,హ
*
అంబర గామి -తుంబురగేయ -యంబరమంట - సంబరమిమ్ము
*
36. పంక్తి / అక్షరపంక్తి /కాంచనమాలా -- భ,గగ
*
చోద్యముగాగా -హృద్యములౌ ప-ల్పద్యములే నై- వేద్యములౌనే
మక్కువ నట్లే -మ్రొక్కుదు నిచ్చల్ .- నిక్కపు మాటే - చక్కని తల్లీ
*
సుప్రభ
9:45 ఆం
02-03-2022
*
చతుః పంచాశత్ = 54
3 రోజుల క్రితము మొదటి భాగము ప్రచురించబడినది.
నాకు తెలిసినంతవరకు పై వివిధవృత్తముల నామాంతరములను గూడ పేర్కొనుట జరిగినది.
ఏకాక్షరముతో మొదలయి క్రమక్రమముగా రకరకాల గణములతో కూర్చబడినవి .
ప్రతివరుస లో ఒక పద్యమున్నది . పాదముల మధ్య - ఉంచబడినది .
కొన్ని చోట్ల ఒకే వృత్తమునకు రెండు, మూడు పద్యములు వ్రాయబడినాయి.
0
వదనమది వ్యధలో - వసివాడిపోనా
సీసము - తేటగీతి ఊహాగానము!
==
ఒకప్పుడు సంగభట్ల నరసయ్య గారు, సీసము ఆఱు పాదముల ఆటవెలది అన్నారు. అనగా సీసమును ఆటవెలదివలె (and vice versa) వ్రాయ వీలగును, ఉదా:
UI III UI - ఇం/ఇం // UI III UI - సూ/సూ - ఆటవెలది
UII IIUI - ఇం/ఇం // UII IIUI - సూ/సూ - సీసము
అందువల్లనే సీసమునకు ఎత్తు గీతిగా ఆటవెలదిని ప్రప్రథమముగా వాడినారని అనుకొంటాను. కాని తేటగీతి ఎలా వచ్చినది?
==
సీసపాదములోని ద్వితీయార్ధమును తీసికొందామా? దాని అమరిక: ఇం/ఇం - సూ/సూ. చివరి సీసపాదము పిదప ఎత్తుగీతి వస్తుంది. ఈ సీసపు ద్వితీయార్ధమునకు ముందు ఒక సూర్య గణమును ఉంచితే మనకు తేటగీతి (సూ + సీసపు ద్వితీయార్ధము, అనగా సూ/ఇం/ఇం - సూ/సూ) లభిస్తుంది. అనగా సీసమునుండి ఎత్తుగీతికి మార్పు లయబద్ధముగా, సునాయాసముగా జరుగుతుంది. నా ఉద్దేశములో తేటగీతిని ఇలా ఎత్తుగీతిగా అమర్చి యుండ వచ్చును. లేక ఇలా అమర్చబడిన తేటగీతిని సీసపు టెత్తుగీతిగా వాడి యుండవచ్చును.
==
విధేయుడు - మోహన
0
వెలఁది యాట!
==
సరి పాదములు: ఆటవెలఁది బేసి పాదములు
బేసి పాదములు: ఆటవెలఁది సరి పాదములు
==
వెలఁదియాట: సూ/సూ/సూ - సూ/సూ // సూ/సూ/సూ - ఇం/ఇం
==
పిలిచి పిలిచి నిన్ను - బిచ్చి నైతి
వలపు నన్ను ముంచె - వంతలోఁ జింతలో
కలలు గన్న రోజు - కరగిపోయె
నలరు లేల నాకు - నలరింత లేకుండ
==
చెరువులోని చేఁప - చెరువు నుండఁ
జెఱుపు లేదు కాని - చెరువు వీడఁగ నద్ది
మఱు నిముసమునందు - మడయుఁ గాదె
చెరువు నీవె యంటిఁ - జేఁపగా నేనుంటి
==
రెండవ పాదములోని మొదటి సూర్య గణము వరణముగా:
==
రేయియందు నాకుఁ - బ్రేమ లేదు - నీవు
ఱాయివైతి - రజనిలో సుకమేది
హాయిలేని బ్రతుకు - హరుస మేది - నీదు
మాయలేల - మనసు తాళఁగ లేదు
==
చందమామ లేని - చదలు నాది - నీవె
చందమామ - సౌందర్యమును నింపు
చిందు మందమైన - యిందుకాంతి - ప్రేమ
సంద్రమందు - స్నాన మాడఁగ రమ్ము
==
నాదు జీవిత మెల్ల - నీదె గాదె - నీవె
మోద మెపుడు - ఖేద మదియుఁ గూడ
లేదు నీవు లేక - హ్లాద మిందు - నాకు
నాద మౌచు - నగుచు రమ్ము త్వరగ
(ఇందులో అన్ని పాదాలలో సూర్య గణాలే!)
==
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
0
హిమమణి = ఆధారము: వర్గము: ఇంద్రవజ్ర (5,4 - 5,4 మాత్రలు)
==
0
రుక్మవతీ, షట్పదిగా రుక్మవతీ - శరషట్పది: UII UU / UII UU / UII UU - UIIU
==
మాధవ నాయా- రాధన నీవే - శోధన లేలా - సోలితిరా
కాదనకోయీ లేదనకోయీ - దరి రావా - నాదమయా
==
ఆత్రముగా నా
గాత్రములో నీ
స్తోత్ర జపమ్మే - శోకములో
రాత్రుల నీకై
ధాత్రిని నాయీ
నేత్రములే ము-న్నీరగురా
==
నాకరమందా
నీకరముంచం
జేకురు నెన్నో - శ్రీలు గదా
చీఁకటిలో నీ
యాకృతి చూడన్
నాకగునో యీ - నాకగునో
==
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
0
అర్ధసమ చతుష్పదిగా మానినీ వృత్తము:
==
మానిని - (భ)7/గ
అర్ధసమచతుష్పది: భ/భ - భ/భ // భ/భ - భ/గురు
నా ఉదాహరణములు క్రింద:
==
ఏమని పాడెద - నిప్పుడు చెప్పుము
భామిని డెందము - భగ్గుమనె(న్)
శ్యామలవర్ణుని - సంగతి చెప్పకు
నామనసౌనొక - నాగముగా
==
ప్రేమము ద్వేషము - రెండిఱు వైపులు
నామదిలోఁగల - నాణెముపైఁ
బ్రేమము లేదన - ద్వేషము గల్గును
యామినిలో నొక - యాచకికి(న్)
==
కాలము సర్పము - కాటును వేయునొ
లీలను రత్నము - లిచ్చునొకో
హాలహలమ్మునొ - హా యమృతమ్మునొ
కాలుఁడొసంగును - గానుకగా
==
తేలుచు మున్గుచు - దిక్కులఁ జూచుచు
నీలపు సంద్రపు - నీరముపై
గాలి నెదుర్చుచుఁ - గన్నుల నీరిడి
వ్రాలుట జీవన - వైభవమా
==
పై నాలుగు చతుష్పదులు రెండు మానినీ వృత్తములుగా:
==
ఏమని పాడెద - నిప్పుడు చెప్పుము - భామిని డెందము - భగ్గుమనె(న్)
శ్యామలవర్ణుని - సంగతి చెప్పకు - నామనసౌనొక - నాగముగాఁ
బ్రేమము ద్వేషము - రెండిఱు వైపులు - నామదిలోఁగల - నాణెముపైఁ
బ్రేమము లేదన - ద్వేషము గల్గును - యామినిలో నొక - యాచకికి(న్)
==
కాలము సర్పము - కాటును వేయునొ - లీలను రత్నము - లిచ్చునొకో
హాలహలమ్మునొ - హా యమృతమ్మునొ - కాలుఁడొసంగును - గానుకగాఁ
దేలుచు మున్గుచు - దిక్కులఁ జూచుచు - నీలపు సంద్రపు - నీరముపై
గాలి నెదుర్చుచుఁ - గన్నుల నీరిడి - వ్రాలుట జీవన - వైభవమా
==
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
0
నార్చుకుందాం - తెలుగుని బతికిద్దాం
నేటి ఛందస్సు --- లలితా.. UUIUII I. UI UIU -(1)
అమ్మా మనోమయము ..హాసనమ్ముగా
సమ్మోహమే సకల ..సమ్మతమ్ముగా
సన్మానమే విజయ ..విస్మయమ్ముగా
తన్మాయయే వినయ.. వాంఛ దేవతా
కాలాన్ని బట్టి కధ కామితార్ధమై
కల్లోల మయ్యె కల సమ్మతమ్ముగై
సల్లాప చర్య సహ నమ్ము సమ్మతై
బాల్యమ్ము నందు విధి ఆట లక్ష్యమై
సర్వార్థ సాధనకు..ప్రేమ నుంచుటే
కార్యార్ధ సిధ్ధిగను.. సేవ పంచుటే
ధర్మార్థ బోధగను... ధ్యాన ముంచుటే
ఆరోగ్య కర్మలను.....రక్ష దేవతే
--((()))_--
హిమమణి - న/న/జ/జ/గగ IIIII IIU - IIUI UU
14 శక్వరి 2944
==
కమలములఁ గనఁగాఁ - గమలాక్షి రావా
విమలమగు నుషలో - వెలుఁగీయలేవా
సుమము లిట వనిలో - సొగసార నీకై
హిమమణులు విరిపై - నివి చాలు నాకై
==
మణిరంగ వృత్తం 7/10 ---UIU IIU IIU U (3)
సర్వదా శతధా సమధర్మం
ధర్మమే వివిధా దృతి మర్మం
మర్మమే వరమై మాయ సత్యం
సత్యమే సహజం సాము నిత్యం
. భగవద్గీత - పద్యానుకరణ
గ్రుడ్డిరాజూ - మహామేధా విఐగీతా వినాలిని
వ్యాసుడే సం- జయుడ్కిచ్చే - ప్పిన యుద్ధం విశేషము
వృద్ధుడూ బీ ష్మడూయేలా పడిపోయే - శిఖండివ
ల్ల అనీ చెప్పె కర్మాకర్మల శక్తే వినాలని
పాండు పుత్రుల్ మహావేగం మరుభూమీ చేరెణులె
సైన్య మెల్లన్ను దుర్యోధన్ కనుచూపే చూచెనులె
ద్రోణ చార్యున్ చెరీ భయ్యం తెలిపెనే బీరు వలె
అంతరాత్మన్ జయమ్మంతా గురువర్యా మీ ముదమే
భీమ అర్జుల్ మహా యోధుల్, కురు వీరుల్ మేధవులె
భూమి పుత్రల్ గుణా డ్యుల్ లే వధ చేసే భావములె
ధైర్య వంతుల్ మహా రాజుల్ , జయ శ్రేష్ఠుల్ యుద్ధములె
వీర మాతల్ మహా ధన్యుల్ , సమరోత్సాహం ఇదిలె ....
--(())--
U II UIU III UIU IUI UIU
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సు:: చక్కని చుక్కకై పరుగు పెంచెనే మనస్సు చేష్టలే
చిక్కులు తెచ్చెనే భయము పెంచెనే వయస్సు కోర్కెల్లో
మక్కువ పెర్గెనే కపము కమ్మియే యశస్సు తగ్గెనే
చుక్కల చీరలో మగువ ముచ్చిక ఉషస్సు సోకినే
సు: వేషము మారెనే మగణి రోషమే సమత్వ బుద్ధితో
శేషము పెంచెనే అవని పాశమే సమత్వ భందమై
ఇష్టపు మార్పులో వనిత వేషమే సమత్వ శక్తిగా
కష్టము నుండియే వినయ చేష్టలే ప్రెమత్వ ముక్తిగా
సు:: దీపపు వెల్గులో సుఖము ఏదెదో చరిత్ర సృష్టికై
మాపని ముస్గులో జయము కమ్మగా ధరిత్రి నవ్వెనే
కోపము చల్లగా జఱిగి ఏకమై పవిత్ర పొందులో
లోపము లేదులే వలపు లోలకం సునంద సంతసమ్
సు:: రోగము చెప్పఁకే తొలగి మార్పుకై చిరాకు చేరుటే
భోగము పూర్తిగా మరిగి మగ్గుటే మనస్సు మారుటే
యోగము మారెనే తపము వేగమే జగాన చేరుటే
యోగ్యత చెప్పఁకే కలిగి చెంగున మదీయ మార్పులే
--(())--
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
పువ్వు గా నలిగియున్ పరిమళించేది ఒక మెట్టు
నవ్వుగా పిలిచియున్ మురిపించేది మరో మెట్టు
జువ్వలా వెలిగియున్ బుద్ధిని వెలిగించేది ఇంకో మెట్టు
మక్కువగా ప్రక్కన చేర్చుకొని ఆదరించేది మెట్ల ప్రస్తానం
సాహిత్య సహకారమే మానవ జీవితానికి ఒక మెట్టు
భాషా అభివృద్ధికి శ్రీకారం దిద్దటమే మరో మెట్టు
నవ నవాభ్యుదయ మార్గ చరిత్రయే ఇంకో మెట్టు
కలియుగ జీవనమే మెట్ల కావ్య నాందిప్రస్తానం
లలిత కళలను అభివృద్ధి పరిచే తోరణమే ఒక మెట్టు
రచనా చమత్కార వచనాలతో నవ్వించాటమే మరో మెట్టు
జీవితంలో అనుభవాలు మనస్సును మార్చేది ఇంకో మెట్టు
మనస్సుకు తెలిపి ఊరడించేది మెట్ల కావ్య నాందిప్రస్తానం
పెదవి పద విభజనయే మూలవ్యాకరణం ఒక మెట్టు
బంధువులతో ముడి సరుకుల మయం మరో మెట్టు
స్త్రీ అలంకారానికి ఆకర్షన చిహ్నమే ఇంకో మెట్టు
నగిషి గొప్పతనానికి ఒక మెట్ల కావ్య నాందిప్రస్తానం
దివ్వెగా వెలుఁగుచున్ ప్రేనందించేది ఒక మెట్టు
గువ్వగాఁ బలుకుచున్ ఊరడించేది మరో మెట్టు
మువ్వగాఁ మొరయుచున్ నవ్వించేది ఇంకోమెట్టు
మక్కువగా ప్రక్కన చేర్చుకొని ఆదరించేది మెట్ల ప్రస్తానం
రక్త మాంసాదులతో ఉండే దేహ పోషణ ఒక మెట్టు
ధర్మా, ధర్మాదులను తెలిపే వాక్యం మరో మెట్టు
మనసు పరి తపించేదే మూలభావం ఇంకో మెట్టు
గుండెచప్పుడే మనిషి మెట్ల కావ్య నాందిప్రస్తానం
జల, సాకామ్బర మేలికలయక రసం ఒక మెట్టు
సుఖదు:ఖాల జీవిత సమరమే మరో మెట్టు
మనసుకు ఉల్లాస పరిచేది హృద్యమే ఇంకో మెట్టు
సంఘటనల పరిమళం కధా కధనం మెట్ల ప్రస్తానం
అక్షరాలకు రెక్కలు వస్తే ఆశయాలతో ఒక మెట్టు
దిక్కులు లేని గమ్యాలను మార్చ గలిగేది మరో మెట్టు
సంకల్పానికి బుద్ధి బలం చేకూర్చుటే ఇంకో మెట్టు
ఆశల సీతాకోక చిలుకలు ఎగిరే మెట్ల ప్రస్తానం
ఆశా జీవులకు కన్నీళ్ళు రావటం ఒక మెట్టు
కళ్ళల్లో మధురస్వప్నాలు చూడటం మరో మెట్టు
ఓదార్పుతో మౌనాన్ని కూడా ఛేదించే ఇంకో మెట్టు
నిరాశ, నిస్పృహలను తొలగించే మెట్ల ప్రస్తానం
కోరికలే గుర్రాలై వెంబదించటం ఒక మెట్టు
మస్తిష్కంలోని పుస్తకాలు వేడెక్కించే మరో మెట్టు
కావ్యాలనే గుర్తించక మరనాన్ని ప్రాదించే ఇంకో మెట్టు
జీవితాలన్నీ తిరగబడి చిక్కును విడదీసే మెట్ల ప్రస్తానం
ప్రేమ కోసం జ్ఞాపకాలకే నీల్లొదిలేసేది ఒక మెట్టు
నవ్వుల వెలుగుల్ని దూరము చేసే మరో మెట్టు
ప్రేమ సంకెళ్ళకే ఎడబాటు తెప్పించే ఇంకో మెట్టు
చీకటి రాత్రులు నరకంగా మారేటి మెట్ల ప్రస్తానం
ముఖారవిందం మెరుపులా మెరిసేది ఒక మెట్టు
సుఖసంసారం లో తృప్తిని మిగిల్చేది మరో మెట్టు
తనువుల తపన నిత్య సుగంధమనిపించే ఇంకో మెట్టు
గాత్రం నిత్యం స్వస్చసుమధుర స్వరం మెట్ల ప్రస్తానం
మనసే వేదాంత సంగ్రహాలా పుట్ట ఒక మెట్టు
గమనం నిత్య ధర్మభోదా మార్గపుట్ట మరో మెట్టు
విషయ సుఖం, ద్వందాలు, సహజమే ఇంకో మెట్టు
ఆశలు మంచులా కరిగిన వదలని విశ్వాస మెట్ల ప్రస్తానం
-((**))--
త త త త త త త గ గ - పద్మనాభ -12
UUI UUI UUI UUI UUI UUI UUI UU
నేటి కవిత్వం - పద్మనాభ
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సాహిత్య సమ్మోహ సద్భావ మేగా
సంతృప్తి ఆరోగ్య రాగమ్ము విశ్వాస
ఔనత్య ఔ పోస ఔదార్య మేగా
కాలాన్ని కామించు కామ్యమ్ము లోలాక
కర్తవ్య కర్తుత్వ కర్మత్వ మేగా
కారుణ్య లాలిత్వ జాలిత్వ లోలాక
సద్భోద సందర్భ సంభావ మేగా
నేత్రమ్ము నేమిష్ట నేమించు జన్మాన
నేలంచు నేలంత నేస్తమ్ము యేగా
నాదించు నాదేయ నాదేయి జన్మాన
నైపద్య నైపుణ్య నైర్మల్య మేగా
నేటి *ప్రేమలో పట్టు
అలక చెప్పక ఆశగ వచ్చు చుండు
మొలక గాలిని నీటిని త్రాగి వచ్చు
పలక బలపము వ్రాసిన గుర్తు తెచ్చు
నలక కంటిలో నీటిని శుభ్ర పర్చు
సరిగ మలరాగ మతిశయ మల్లు చుండు
చిరునగవు సేవ అతిఆశ కోస ముండు
పరిమితియు విశ్వ మంతటి లోన గుట్టు
అరగని అనురాగమును నమ్మి ఉండు
కడలి పొంగును చల్లపర్చేటి పట్టు
మడమ తిప్పక నీరుకార్చేటి పట్టు
ఎడమ చేతివాటమురుచి చూసి పట్టు
కుడియడమల భములను మట్టు పెట్టు
కలలు పండించు కోవాలి ఏల అనకు
కళల వల్లన జీవితం శోభ కలుగు
చలము నీటిని త్రాగితే తృప్తి కలుగు
జలము పల్లము ఎరుగు ఆశ విరుగు
--(())--
మేఘధ్వనిపూర -
క్రొత్త బుధ గురు గణములతో గు/బు - గు/బు అమరిక గల వృత్తములలో నొకటి ఈ మేఘధ్వనిపూర వృత్తము. గురువులతో నిండిన ఈ వృత్తమును వ్రాయుట కొద్దిగా కష్టమే. క్రింద నా ఉదాహరణములు -
భ భ భ భ భ భ భ గ -- మానిని -12
UII UII UII UII UII UII UII U
నేటి కవిత్వం - రెక్కలు ముక్కలు
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
రెక్కలు ముక్కలు చేసిన డొక్కర నిండదు ఎందుకు ఈ బతుకే
మక్కువ చూపిన తిన్నది కక్కుము దుర్భర పల్కులు కోపముగా
ఎక్కువ మాటలు చెప్పకు లొంగియె తిండికి రూకలు తీసుకుపో
తక్కువ చాలవు భాదతొ కోరితి రేపటి నుంచియు రాకుఆనే
కాలపు మాయకు చిక్కితి చేయక చేసిన తప్పును పట్టితిరే
చాలక ఆశకు పోయితి వారిజ మాటలు భాధను పెట్టెనులే
ఏలిక తన్నులు తిట్టులు కల్సియె ఆకలి చచ్చియు పోయనులే
మాలిక బత్కుకు దారియు చూపుము అన్నను చూచియు పోవుదురే
సాధన చేయగ నెచ్చట మానస వేగము ఆపుట నాపరమే అగునా
వేదము చద్విన ఆకలి మానవ జీవిత భాగము తప్పదులే అవునా
వేదన తప్పదు ప్రేమను చూపియు సంపద లేకయు లోకములో
యుద్ధము చేసెద బత్కుల బండియె లాగుట తధ్యము దేశములో
--(())--
భ భ భ త ర న గ గ
UII UII UII UUI UIU III UU
నేటి కవిత్వం ... "అంబురుహము.----
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మా మతి శ్రీ పతి సేవలు వాక్సుధ్ది మంత్రిగా మతిశబ్దదా
తామస పంచియు ఆశలు తీర్చేటి తృప్తిగా కమలాసనీ
రమ్యపు భావము తీర్చెది ధర్మమ్ము లాహిరీ మదిగోప్యమే
కామపు మాయను తెల్పుతు విశ్వాస కానుకా సుమమాలినీ
కాలము ఎప్పుడు నీ దను కోలేవు కాస్త సేవలను పంచీ
గాళము వేసియు సాధక బాధల్ని గుట్టు ఓర్పుగ భరించీ
తాళపు గోలలు చేయక మోనాన్ని తప్పుగా తెలపకా సే
వాలలితాంబకు చెయ్యెత్తి వాక్కుతో నిజము చెప్పే
వేదము విన్నను చద్విన కాయాన్ని ఉజ్వలంగ మెరిపించే
సాధన తాత్విక భావము లేకుండా సామరస్యముగ ఉంచే
గాధలు ఎన్నియు ఉన్నను వేదాన్ని గాంచినా మనసు తీరూ
శోధన చేష్టలు నుండియు శాంతమ్ము శోభ తృప్తి కలిగేలే
భారతి ! వాగధి దేవత! గాయత్రి ! భాషదా ! మతిశబ్దదా !
శ్రీ రమ సంపదధిష్టిత ! భార్గవి ! శేవధి రూపిణీ !కమలాసనీ !
సారసలోచని ! దుర్గమ తారిణి ! శాంభవి ! దైత్యభండనభీకరీ !
సారస కామ్యవరమ్ములఁగోరెద సౌమ్యసౌహృదులమ్మలో!!!"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి