31, ఆగస్టు 2021, మంగళవారం

సీస పద్యములు



  సీస పద్యములు 


మక్కవాయలే..మానసమ్మును పంచు

మమతివ్వ కున్నను... మనసు పంచె

నవ్వు లేదుగా నటనమ్ము చెరలోన

నీవె నాపల్కులో.. నెర జానవు

నేడు నిన్ను నే నిజముగా కోరితీ

నేను నీకును ...నాకు నీవును

ఒకరికొకరు ఓర్పు చూపితే

వురవడి యేరాదు... ఉరక లేదు

తేటగీతి

 నాటి సుఖము ను నేడు ను నన్ను నేను

 ఆదరమ్ముగ నిన్ను కోరె ఆశ వలన

విద్య నంతయు చూపితి విధముగనులె

నేడు పేదప్రే మనుటయే ననగ తెలిపె

((())))



సీస పద్యాలు ,, రామ లక్ష్మణ సంభాషణ 

ప్రాణానికి మనసు --- పలుకునై ఉన్నాను 

కనుల రెప్పవలెను -- కాపు కాయు 

నాప్రయత్నమునకు -- అడ్డుచెప్పకు రామ 

దుష్టస్త్రీకి గుణము --- తప్పు కాయు 

తప్పదు శిక్షగా -- తప్పు వేలును చాపె  

ముక్కుచెవులు కోసి --- ముప్పు కాయు 

నీతి అన్నదియులే --  నటనలు కావులే 

నాణ్యమైనపనియు --- ఒప్పు కాయు 


పొంచి ఉన్నది ప్రమాదం పుడమి నందు 

దుష్ట శిక్షణ తప్పదు దమన రామ 

దారి తప్పిన వారికీ దండ మిదియె  

నోరు విప్పలేని పనులు న్యాయ మగును 

--(())

సీసపద్యము... సీతతో రాముని ముచ్చట్లు..

సంతుష్టి వంతుడే... సుఖమను కళ్లతో
చిరకాలమునశాంతి ...  చరిత మవ్వు
చిత్తము కలిగుంటె.. చిరకాల ఐశ్వర్యం
శాంతపురుషులకు.. శాంతి యవ్వు
విశ్వాస రాజ్యాలు.....విజయాలు పొందేను
తృణమల్లె ధైర్యము ...  తీపి యవ్వు
సంసార దశలందు ..సుఖమునే పొందాలి
దారిద్య్రరేఖలు దరియు రావు

తేటగీతి
ప్రాప్తి అనునది కోరిక పోరు సలుపు
లేని వాడై న మనుజుడు లేక వుండు
ఎవని మనసున సంతృప్తి ఎరుక లేవు
స్వయము గాప్రయత్నము చేసి సుఖము పొందు.

సీస పద్యాలు 

ఏదైతే చూసావ   ఏదైన వినినావ  
ఏదైనా అనినావ  యదలొ మంట   
ఏది నీదియు కాదు  ఏ నియమము లేదు 
ఏదన్న అదృష్టం  ఏక మొవ్వు 
ఏమైన దరిద్రం   ఏ కరవులుగాను 
ఏబ్రాంతి ఉండదు ఏడ్చి యున్న 
ఏలక్ష్యం ఆపదు ఏమార్గం మారదు 
ఏ జ్ఞానం వదలదు  ఎల్ల లవ్వు 

 తేటగీతి 

శుధ్ధ చైతన్యం బ్రహ్మము శ్రద్ద నిచ్చు 
శ్రద్ధ సౌజన్యం శ్రావ్యము సిద్ధి నిచ్చు 
సిద్ధి ధర్మము లక్ష్యము  స్వేశ్చ నిచ్చు 
సాదు భావమ్ము బతుకునే సాగ నిచ్చు
((()))

సీస పద్యాలు

అలుక లేల చిలక  అధరము  అందించు
ఆదమరవ కుండి  ఆశ దీర్చు
వెన్నెల వేళ లొ  వేచిన మక్కువ
నయనాల వెలుగుల నదము నింపె
నవ్వుల వెల్లువే  నటనల నవరక్తి
నాట్యమయూరివై నర్తకి గను
నిలవదె మదినాదె నిజమునే గుర్తించు
నన్నుచేరుముఇక చెలియ నీవె

వలపు తలపు ఘటన వరుసగా వెల్లువ
మనసు మలుపు కళలు మెరుపు నిచ్చు
అలుక లసలువద్దు అవగాహనలముద్దు
రావె రవ్వ వెలుగు ముద్దు రాణి

సీస పద్యము

తరతరాల ప్రగతి తారు మారిన నేమి
తప్పుల తలరాత తప్ప లేదు
తలుపుల వలపులు తర్కము పోరుగా
తప్పు నీ దయ నాది తప్ప లేదు
తారతమ్యాలు గా  తన్ను కో వటమే లె
తప్పు ఒప్పులు తెల్పు తప్పలేదు
తరుణ మే ధనము గా తాపత్రయమ్ము గా
జీవికి తోడు గా తప్ప లేదు

తేటగీతి
తప్పుల తడకగా ఉండె తృణపు  నీతి
మెప్పు కోసమే జీవితం మడమ తీరు
పరువు అంటూ నె గోగుట పులుసు పాప
చేరు వయ్యేటి చెలిమి యే చరిత ప్రగతి
----

బంగారు జింక కోరే ముందు రాముని పొగడిన సీత


నీవు దలచుకొన్న నేలను నింగిని
ఏకమ్ము చేసేటి ఎరుక శక్తి
నీవు దలచుకొన్న జయము యుక్తిగాను
సర్వశ్రేయస్సుగా సమయ శక్తి
నీవు దలచుకొన్న మనసునైనను మార్చి
నిశ్చల తత్వము .. నిలుపు శక్తి
నీవు దలచుకొన్న కళలు నిజము చేయు
ప్రజలలో దాహమ్ము బాప శక్తి

నిన్ను మనసార నమ్మితి నయన రామ
ప్రతి దిన మెక సారియు పలుక రించు 
యోగ విద్య ను తెలిపియే యూరడించు
ప్రాంజలి ఘటించి తెలిపి తి ప్రేమ పంచు
0 Co
0

సీతతో రాముడు పలికే


ఎంత ఓర్పు గాను,  ఎంత నేర్పుగా ను, యదలొ వున్నావు లె

ఎంత దూర మైన, ఎంతొ దగ్గరగా, చూపె గౌరవమే

ఎంత ఎక్కువైన, ఎంత తక్క వైన, మనసులో ప్రేమే

ఇంక ఆశ యేల, ఇల్లు చక్క దిద్దు శాంతి కలుగు చుండె


రామ నేను పీల్చు శ్వాస రమ్య మైన దైందిలే

రామ హృద్యముందు నీవు రవ్వ వెల్గు యైతివీ

రామ దాహమున్ను తీర్చి రాజు నాకు యైతివీ

రామ వీడి వుండ లేను రాత్రి యెంత భయ్యమౌ


మంచ మీద తృప్తి చెంది మనసు కోర్కె ఎందుకో

ఎంచు ఓర్పు  తోడు నీడ ఒకటి గాను ఉండుటే

మంచు లాగ కరిగి పోవు మనసు‌ ఉంది నీకులే  

నచ్చ చెప్పు చున్న ఇపుడు నన్ను పలుక నివ్వవే


మనువు చక్ర వర్తి చేయు జపము కర్మ మోక్షమే

జనులు నిత్య పూజ సేవ చేయు ధర్మ మార్గమే

వినుము లోక ముందు జూపు వినయ పలుకు రక్ష యే

కనుక నిర్ణయమ్ము మేలు కర్మ కు తగు వాడివే


తప్ప దాయె నేను చెప్పి తెల్పు చున్న మాటలే

ఒప్పు గాను భావ ముంచి ఓర్పు గాను ఉండుటే

ముప్పు ఏమి కాదు రాదు మాయ యేను నమ్ముమూ

తప్పు నాదు పైన నీకు తప్పు చూపు లేల లక్ష్మణా


మనో సుశీల సుందరి విశాల విందు శాంభవి

సుఖాల సీమ మంజరి విశేష భావ నందిని

సహాయ సేవ చంద్రిక సుదీర్ఘ లక్ష్య దీపిక

సకాల  మాయ మోహన వినోద దివ్య వస్తుని

0 Com


సీత బంగారుజింకను చూపి తెమ్మనే రామునితో  


యందము చూపుచు ఉండెను --- యాశలకై నేడు పలుకులతో 

ముందుగ తెల్పుచు వేడెను ---- మోహముతో నేడు పరవశమై 

డెందము వెతుకుచు నుండెను --- బంధములో ప్రేమ తలపులతో 

వాదము దేనికి వెల్లెద ---- వేగముతో నేడు తెచ్చెద లే 

 

మాటలతో ముందు మనసునే --- దోచి పలుకలేక ఉండుటయే 

ముందుగా నిలిచి మాయ మగును -- పుత్తడిశ్రుంగియు పుడమినే

యేమని చెప్పను విధి యని  --- పుడమియు సర్వమ్ము పులకితమే 

జాగ్రత్త గానుండు తెచ్చెద ---- నీ ఆశ తీర్చెద ఇప్పుడునే 

 

చిఱు చిఱు చెందము లన్నియు --- మురిపించు హృదయ వాంఛలుగనులే 

మరి మరి మెరుపులు అన్నియు ---- పిడులు పడియు శబ్ద పిలులుగా లే 

జరజర సాగే సెలయేరులు  ----  కడలిలో కలియుట కు ముదముగా 

జలజల రాలె చెట్ల లతలు  -----  సరిగమలు పలుకు సరసాలు గా            

 


సీస పధ్యములు 4 

సమ లోక రక్షితం -  సమ భక్త మోక్షతం 
తంస్మరామి మనసు ,,,, తత్త్వ మాయ        
ఆనంద శోభితం - ఆత్మీయ వత్సలం 
స్వర శక్తి వందనం - సమయ లీల    
విశ్వాస మోహితం --- విజయమ్ము మార్గమే  
దివ్యమ్ము దేహినం -- దివ్య చరిత  
న్యాయమే నియమము -- నిర్ణయం ధర్మమే 
నిర్మలం శోభితం --- నిజము నీడ 

తేటగీతి 
విద్య శోభితం వివరమ్ము వినయ ముగను  
విశ్వ మోహితం సహజమ్ము విషయ వాంఛ 
వాద వాదితం సహనమ్ము వరస కలుపు 
సేవ పూజితం నిశ్చయం సకల కళలు 
  
-(())--


సీసపద్యాలు..5

ఆశించు గెలుపుయే.. ఆదరణ కరువే
ఆరాట మున్నను .. అలుపు పెరిగె
లక్ష్యమేదైనను... లాలన పాలన
పేరుకు మాత్రమే.. పదవి ఆశ
చెప్పెది ఒకటియు ...చేయు వేరొకటియు
జనులకు సేవలే..... జయము అంటు
అందుకు న్నంతయే... ఆదాయమును పెంచి
అందరి దృష్టి నే...  అదర గొట్టె

ఆటవెలది

రాజ్య మేలు నటన రమ్యమ్ము సాగేను
రాజ కీయ బతుకు తెరువు ధనము
రవ్వ వెలుగు నీడ పొందేటి బుధ్ధియే
వ్యాధి రాజ కీయ మయ్యె రీతి

సీస పద్యాలు ...6 

సూర్యచంద్రుల వలె --సర్వవ్యాప్తి వెలుగు  
తామర పువ్వుల -- తళుకు మెఱుపు  
పద్మాల రేకులు -- పుడమిన విప్పారే 
మేనితో వెలుగొందు -- మోహ కాంతి    
భవదీయ కళలను --- మాయయు మొహమై 
మనసుకు విపరీత -- మాయ చేరు 
మహనీయ లందరు --- ఆనంద లహరిలో 
ఓల లాడుచురమ్మ -- ఓర్పు తోను  
      
తేటగీతి 
అమ్మ కనులప్రేమ ఇపుడు ఆశ పెంచు   
పిల్ల పాపలు ప్రీతిని పలక రింపు  
ఇంటి దీపము వెలుగులు ఈశ్వరేశ్చ  
అమ్మ ఆనంద ముందరి అభయ మొవ్వు 

--(())--

సీస పధ్యాలు ---7--  శ్రీ రామ 

నీదృష్టి సోకినా నీమనసు తలచి   
మునిపత్ని శాప విముక్తి నందె 
నీపిల్పు వినినంత నిలువెళ్ల పులకించి  
శబరితత్ క్షణమె మోక్షమ్ము నందె     
నీభాన ధాటికి నిల్వలేక సముద్ర 
నీ పద పద్మములు మంటి మ్రొక్కె 
నీ శరణము కోరు నియమ రక్కసులను 
రక్షణకల్పించె రామ చరిత    

రామ నినునమ్మి కొలిచితి రమ్యమగును 
కన్న తల్లి తండ్రుల కోరికను తీర్చు 
ప్రాంజలి ఘటియించి కొలిచే ప్రకృతి మాత 
సమరము నా మన:శాంతి రామ 
    
--(())--


తారక రాముని -- తెలిపేది మనసు   
కోర్కల పుట్టయు -- కరగ గుండు 
భజియించు దాసాను బద్ధుడై ఉన్నాను 
నాపైన దయజూపు నయన రామ  
నీపాద సాయుధ్య నియమాల ముక్తిగా  
క్షణమున క్షణరక్ష కొరకు రామ  
ఎన్నెన్నొ జబ్బులు నన్నువేధించినన్ 
మనసున నమ్మిన మేలు తెలిపె 

తేట గీత 
కనుము నేనిపుడే వేడు కొనుచు ఉన్న 
నన్ను నీపాద సేవ అనుమతి ఇవ్వు  
సర్వ ము ను నీకు తెల్పుచు సంబరమ్ము  
పంజలిఘటించి వేడుక పలుక లిచ్చె     

--(())--..

పచ్చని నునురెక్క.. పైటదాల్చిన చిల్క
వెచ్చని నీటిలో... వేగుచుక్క
నచ్చెను మల్లికా ..నాలాగ ఉండవే
కమ్మని వాసన...  కాల మెరుపు
మెచ్చిన వానిలో... ప్రేమలో మలుపులు
మచ్చిక యగుటయే...మనసు వేట
విచ్చిన పువ్వులా...  విజయమ్ము చూపుటే
ఐచ్ఛిక సుఖముగా... యైన యదలొ

ఆటవెలది

ఆట పాట సొలసి అలసి నా ప్రేమలే
మాట మీద నిలిచి మనసు లీల
ఆమె అతడు కలిసి ఆటగా ప్రేమలే
నాడు మనము కలిసి నేడు కృతి గ

--(())--

ఏమని తెల్పను .. ఎదలోన మాటలు
తలవని తాలింపు... తలలొ తిక్క
ఏమైన సరినీవు....  కుడి ఎడ మైనను
చెప్పెడి తత్వము... చేరువయ్యె
కలలోని రాజ్యము... కలకాల ముండదు
పలుకులు భోగము.. పదవి నందు
చేసిన తప్పుకు... .. చలకన భావము
చేతులు కాలిన.... ఛాయ గవును

తేటగీతి

తీరు మారని బతుకులో తీట ఏమి
ఆరు నూరుగా పలికేటి ఆట ఏమి
చేరు వయ్యాక తిట్టేటి జలగ లాగ
మార్పు రాజకీయము లోని మలుపు ఎపుడు

--(())-+


[11:28, 18/10/2021] Mallapragada Ramakrishna: సీస పద్యము

గురు మిత్ర బంధమ్ము గురుతుల విద్యలో
భారత జాతి కి - భాగ్య మెరువు
గురు విద్య వేదమ్ము గురుతర ధక్షత
తెలుగు వెలుగు లయ్యె..తత్వ మెరుపు
గురు సత్య వాక్కులు .. గౌరవ బాధ్యత
ఆచరణ జరిపి .. అల్లికగు ట
గురు శిష్య బంధమే.. గురుపాద పూజగా
గురువు ని మించిన .. గాత్ర మగుటె
[11:49, 18/10/2021] Mallapragada Sridevi: పంచపది

చేతి నుండి విసిరిన రాయి వెనక్కి రాదు
చేజారిన అవకాశం మళ్ళీ రాదు
 వయసు యవ్వనం కరిగాక మళ్ళీ రాదు
గడచి పోయిన కాలం మళ్ళీ రాదు
నోటి నుండి వెలువడిన మాటరాదు ఈశ్వరా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి