22, ఆగస్టు 2021, ఆదివారం

చంద్రిక

మంచు తెల్ల నదీ మల్లె మోగ్గవలే మాయ వెలుగు నిండె

మచ్చ లున్న చంద్ర మలపు వెన్నెలిచ్చె ముసుగు కమ్మె నీడ

స్వచ్ఛ మైన దియును శీతల మజ్జిగే తెల్ల శంఖంమ్మే

స్వేచ్ఛ కోరు పిల్ల స్వేతవర్ణ ముగను  పండు వెలగ పండె


వెలుగు నీడ భయము వెంట పడునేమో కంటి నలక లాగ

పిలుపు మేలుకొలుపు భయము పిచ్చి అనునె మనిషి వేట లాగ

అలుక హక్కుగాను ఆశ  ఆర్భాటం భయము నీడలాగ

 మలుపు కోసం మ్మే మూగ భక్తి తెలిపె భయపు పూజ లాగ


 చూసె దాని కన్న చూపు అర్ధమ్మును తెలుప, గలిగి వుండు

వ్రాసె దాని కన్న వినుట మేలు తెల్పి, సత్య వాది గవ్వు

ప్రాస చదువు కన్న పుడమి విద్య విజయమ్ము, ఉంచు జ్ణాపకాలు

ధ్యాస తోను చదువు ధైర్యము శ్రద్ధయే, మనిషి కి విజయమ్ము.......


వద్దు వృద్ధాప్యం వయసు పెరిగి వున్న  మంద మతియు పెరుగు

హద్దు లన్ని తెలుపు హాయి గొలుపు పెద్ద మాడు కాళ్ల మనిషి

వృధ్ధ ఆశ్రమాలు వేల సంఖ్యలలో వెలసి యున్న తీరు

వృద్ధుడైన తెలివి వృద్ధి జరుగు చుండు మంచి తెలియ జేయు 


అంతర్జాల సదస్సుకు వర్గం గురించి చంద్రిక పద్యాలు


వర్గ‌ సౌభాగ్యము  వరుస మార నంత లక్ష ణము సఖ్యతె

వర్గ కరుణకొరకు వంద మంది కలువు జనుల గోల తెలుపు

వర్గ సిద్ధి కొరకు విజయ వాంఛ తెల్పు బతుకు తెరువు తెలుపు

వర్గ నుపాసించు వలదు అన్న సేవ చేసి తరించుటే

                                   

వర్గ వరము లొంది వసుధ నిష్ట తోడ సేవ చేయు విధము

వర్గం శరణు అన్న ఓర్పు చూపి  శక్తి నంద చేయు 

వర్గ సిరుల పొంది వలస వెళ్ళు వారి కి దయ కృపను చూపు

వర్గ వైషమ్యం వర్గ వైపరీత్యం కొంత ఆశయమ్ము


వర్గ వర్ణసిరిని వంత పాడతారు  నదియె ఘనతయొప్పు

వర్గ ధనిక బీద భువిని చేరిపోతుంది రాజు కీయముగా

వర్గ రాజ్యలక్ష్మి  కనక వీణ పట్టి కాల మహిమ చూపె

వర్గ శ్రీమాతా వందనమ్ము పలికె కలి సుఖముయె

నేటి పద్యములు


శత్రువు వల్లనే వివర సక్యత మారును మిధ్య మవ్వుటన్ 

మిత్రుల భావమే వినయ మోకిక బుద్ధియె శాశ్వతమ్ముగన్ 

ఆత్రుత పెర్గుటే మదిలొ అర్ధము దుఃఖము ఆకలవ్వుటన్

పుత్రుని ప్రేమలే సహజ బంధము తీర్చుట పుష్పమవ్వుటన్


సంకట మొచ్చుటే సమయ సాధన చేర్పులు సంభమవ్వుటన్ 

మక్కువ పెర్గుటే వినయ మానస పాశము మన్ననవ్వుటన్ 

ఇంకొక ఆశయం అలలు  ఈశ్వర లీలలు ఇప్సితమ్ముగన్ 

దక్కని కోర్కలే మనసు దాచుట ఆశతొ తప్పుచేయుటన్


ఆపద వొచ్చినా మనసు ఆగదు  ఆశలు అప దాపుచున్

ఓపిక  ఓర్పుయే ఉదయ ఔషద వల్లనె వచ్చు చుండునన్ 

సంపద వచ్చినం బ్రతుకు సర్వము నాశన మౌను చూడగన్

పాపము శాపమే మనకు పావన మువ్వురు  పల్కువల్లనన్


 తెల్ల నగురేయీ తేట తెల్ల గానె తెలుగు వెలుగు లాగ

మల్లి  ఘభాలింపు మమత మోహరింపు మనుగడ హాయిగా

కొల్లలుగా హృదయ కమల వికాసమే కనుల పండుగాయె

చల్లగ చిరుగాలి చింత తీర్చిదిద్ది శోభ కలిగించే


కాల మొకనది గా కావ్య చరితము గా సాగి పోవు చుండు

ఏల అనకవిను ము ఏది యైన అదియు కర్మ ఫలము అగును

గాల మేసి పట్టి గాలి లాగ దూరి బతుకు మారు చుండు

గోల లేల నీకు గళము ఏల వాడు చుండు టేలఇపుడు


వెల్లువ వెన్నెలే వలపు ఊయలవ్వు ఊహలో చిక్కే

పల్లవి తో పాట పలుకు వెలుగు లాయే పదనిసలకు చిక్కి

నల్ల నగు రాత్రే నయన కలుపు వెలుగు నీడ లాగ చిక్కి

పిల్ల నైన నేను పడచు హాయి నివ్వ పెదవి వలన చిక్కి


మెల్ల మెల్లగాను మేను తాకి వేడి చల్ల బరుచు టయే

యల్లసము పరుగుని యెల్ల లన్ని పాకి ఆకలియే తీర్చి

నుల్లము అనుభూతి లయలు లయలు గాను హాయి గొలిపి చిందె

తల్లడిల్లి యైన తపన తీర్చి దిద్ది తనువు హాయి గొలిపె


మానసము మలుపేను మన్ననయు మరుపేను మోనముయు మరిచేనులే

మేనుయిది మధురమ్ము మాను యిది వినయమ్ము ఔను యిది సహనమ్ములే

మైనముయు కరిగేను గానముయు చెదిరేను వైనముయు మరిచేనులే

ఆనతియు పలుకేను వానలు గ చిలికేను మేనక గ కదిలేనులే


బాణము లీలగా మదిలొ పానము మానిని కోరు సంబరమ్ 

మానము బోవగా నొదవె మానిని  మోమున సంతసంబహో....

గానము చేయగా మనసు కాలము చుట్టును చేరు చుండుటన్ 

జానిని కోరగా సహజ జాడ్యము చూపెను తొంద రెందుకన్


 సమయ సుఖమే సందర్భోజ్యం సావధాన మవ్వుటే

సమర మదిలో సంతోషమ్మే శాసనమ్ము అవ్వుటే

విమల చరితం విశ్వంమ్మాయే విశ్వ వాహినవ్వుటే

గమన చరణం గమ్యంమయ్యే కావ్యనాయకవ్వుటే


అంగ వైకల్యం అన్న దెవరు ఇపుడు అందరి కోసమే

మూగ లాగ కాక మదిని తట్టి లేపి మధుర కవిత్వమే

యోగ అభ్యాసము యుగ యుగాల చరిత తెల్పగలగే నులె

ఆగదు ఎప్పుడూ ధైర్యమే నాకులె ఆయుధమ్ము కలము

ప్రకృతి పులకరించి పలకరించు చుండు సర్వ జగతి నందు

ప్రకృతి జలపాతం పుడమి వయ్యారము సొగసులతో నుండు

ప్రకృతి తళుకు బెళుకు పడగ విప్పి నాట్య మాడు చుండు

ప్రకృతి కనుల కింపు పాఠ మవ్వుచుండు సిద్ధి పొందు కొరకు


బలము తెలివి నీది బల్లెమై  నిలివుము భరత జాతి కొరకు

కలము చెలిమి లాగ కాల నిజము గాను తెల్పగలవు నీవు

వెలుగు నీడలన్ని వెంట వుండవచ్చు అదర బెదరవద్దు

గళము తెల్పి మంచి గాయ పడక చూడు సత్యమేవ జయతె


ఎక్కడుంది నీతి ఎక్కడి న్యాయం ఎవరె వరికి తెలుసు

మక్కు వన్నదేది ముందు కానరాదు మహిమ జరిగి నట్లు

ఎక్కువ తక్కువే ఎగబడియు చెప్పే లోక మిదియేలే

చక్క దనము వున్న చులకన భావమే వర్గ కుల భేదం


మోస మన్నదేను మనుగడప్రశ్నయె గుర్తు అడగ లేరు

వ్యసన ముకు బానిస వలదు అన్న మాట కోప మోచ్చి తిట్టు

శ్వాస వుంటే శివ శ్వాస లేక శవం ప్రాణికొచ్చె నిజము

త్రాసు లాగ కదలి ధర్మ మే జరిపే మానవులున్నారు


పాత రోత కాదు పదవి కొత్త కాదు పరి తపించుటేను

మాత చెప్పు టేను మమత పంచుటేను గుణము మార్చ లేదు

దాత అవుతాడా నేత అవుతాడా తెల్పలేరెవరే

భ్రాంతి కలుగుతుంది భజన జరుగుతుంది భాగ్యము కొరకులే



పలుకు శక్తి మనకు పదము తెలుపు గలము బాధ సంతసమ్ము

పలుకు మేధస్సు కు పరమ పావనమ్ము గాను కల్గి యుండు

పలుకు సృష్టి లోన ఫలము లిచ్చు చుండు మంచి చేయుట కే

పలుకు జీవ యుక్తి పుడమి తల్లి కరుణ ఆశ పాశమ్ము యే


ఎదిగిన కొద్దియు ఎదను పంచు చుండి ఒదిగి ఉండట యే

మదిలొ భావాల్నీ మనుగడ అనుభవము తెల్పి కదలుటయే

చెదిరిన హృదయాల్ని చేరువ చేసియే ధరణి తృప్తి పరచు

అదరకబెదరక యే ఆశయాలు తెల్పి జీవితము పంచు


చూడ లేని దాన్ని చూచి తరించాలి మనుగడే మార్చకు

ఆడి మనస్సు లో ఆశ పల్కు లేక ఆదరించ గలవు

ఓడినా అనుభవము ఓర్పు వహించు టే జగతికి మూల మే

దాడి చేయ వద్దు ధర్మము మరవద్దు ధైర్యము నీ హద్దు


నా రహస్య మ్మే  నన్ను బతికించే తెల్పలేకున్నా

నీ రహస్య మ్మే నిన్ను మార్చేను లె బాధ ఉందేమో

కారు చిచ్చి నైన కన్న వారి నైన మరచి బతుకు టేల

ఆరు నూరైనా ఆడిన మాటను చెప్ప లేను నాతి


ప్రియము యైన చెలిమి పిలుపు గాను చేరు జీవ వైవిధ్యం

ప్రియము అప్రియము పలుకు బట్టి మారు మహిళా పలుకు నందు

ప్రియము వల్లభునీ ప్రీతిని తెలిసియే ధన్య పరుచు చుండు

ప్రియుని వాక్కు లోన  ప్రెయసి మనసు దాగు జాగృతిగా చెలిమి


సక్కనైన రూపు సొక్క మైన చూపు ఉల్లి పొరల చీర

నిక్కమైన నడుము నీటు గుండు ఛాతి ఎత్తు పొంగు లేలు

పిక్క బలము వుంది తక్కువేమికాదు కిక్కు ఇచ్చు చుండె

దిక్కు లన్ని చూసి పక్కకు రమ్మనే చెక్క నైన చుక్క


 విరజాజే గది చెప్పదు అనుటే మూర్ఖత్వమె మాలికా

దరితో గూడిన ధర్మమ్మే మనుగడగా స్త్రీ శక్తి యు ఏలికా

దరితో గూడి సుఖింప న్యాయమటరా దర్వీకర ధ్వంసకా

సిరితో చేరి సుఖింప ధర్మమటరా సర్వోన్నత ధార్మికా


కాకులు మూగి అర్చుటయు కాలము మార్పు ను తెల్పుటే మన

స్వీకర శక్తి యే తెలుపు సాధన శోధన ధర్మ మే మన

వ్యాకుల యుక్తి యే సహజ వాదుల శక్తి యు సర్వ ముక్తి యే

నూకలు నాని పోవుటకు నూరు యుగమ్ముల కాల మయ్యెడిన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి