.
రాజహంస వృత్తం ....త త త త త త త త గ.... 13వ అక్షరం యతి
...
ఓంకారదేవాయ భూ విశ్వ రూపాయ ఓం శక్తి దేహాయ దారుధ్య ధర్మాత్మవే
ఓంకామ్య కారుణ్య శర్వాని కర్మార్ధ ఓంయుక్తి నిత్యమ్ము సేవించ యోగాత్మరా
ఓం కార్య సేవార్ధ దేవారియై జేర ఓం సత్యమే ప్రేమతో నాద వర్ణమ్ము గా
ఓం కర్త దైవంబు నన్ జేర దీవించు ఓం నామదీ తీర్చ రా దేవరా భూవరా
.........
మా లోన నీవేనులే నానుడీ కార మాసర్వతోముఖ్య భద్రమ్ము భావమ్ము రా
మాలోన లక్ష్యమ్ము ధీర్ఘమ్ము ధర్మమ్ము మాణిక్య మై వెల్గు ధైర్యమ్ము నీదేనురా
మాలోన సత్యమ్ము సర్వమ్ము నీమాయ మాబుద్ది కర్మంబు సర్వార్ధ తీర్ధమ్ము రా
మాలోన మర్మమ్ము మొహమ్ము దాహమ్ము మాధ్యేయ దేహాధ్య కర్తవ్య మేతెల్ప రా
...
శ్రీన్నారసింహాయ నిర్మాణ దేహాయ శ్రీవత్య హృద్యాయ శ్రీ సత్య నారాయణా
ఉన్మాద రాక్షశ్య నిర్యాణ దీక్షాయ ఉత్ప్రే ర లక్ష్యాయ శ్రీ నిత్యపారాయణా
తన్మాయ తత్త్వమ్ము తాదృశ్య దేహమ్ము దాహమ్ము తీర్చేటి కారుణ్య పాదాయణా
జన్మాల దుఃఖమ్ము మాపేటి ధీరాయ జాడ్జ్యమ్ము తీర్చేటి శ్రీ సిద్ధి వేదాయణా
.......
శ్రీపావనాకార ! కాకుత్సవంశాత్మ! శ్రీరామ! శ్రీలక్ష్మి దేవేరియై జేరగా
శ్రీపాద పద్మాల నిత్యమ్ము సేవించ క్షీరాబ్ధి చిన్ముద్ర తోనుండు యోగాత్మ! రా
శ్రీ పారి జాతాల గొల్పంగ శ్రీనాథ! శ్రేయమ్ము లేగూర్చరా దేవ! నన్ బ్రోవగా
నాపాలి దైవంబ!నిన్ జేర దీవించు నాకోర్కెలే దీర్చరా దేవరా! భూవరా!!
చిన్నడు చింత మాప కళ చేష్టల జాగృతి చేరువవ్వుటన్
మన్నన చూడ కుండగనె మానస గానము తెల్ప గల్గుటన్
ఉన్నత మోహనమ్ము గను ఉజ్వల హృధ్యము సంత సమ్ముగన్
నన్నును ఉద్దరించగను నాదపు ధారణ ధర్మ వైనమై
.
వేణువు సామరస్యమును వేకువ నెంచియు గాన మోహనా
ప్రాణపు నాడు లన్నియునె రాగము తాళము పల్లవే యగున్
వాణి విశేష విద్యలను భాష్యము గీతము జేసె నప్పుడే
మానస లక్ష్యమే తెలప బాలుడు కృష్ణుడు గాన హృద్యమై
.......
*వేణువు నూదు కృష్ణుడిలవేకువ జాగృతి మేలుకొల్పుగా
ప్రాణము నాదమై లయలురాగముయోగముభోగమైమదిన్
వాణి విశేష సంపదల భాషణ జేసెను గీత పేరుతో
రేణువురేణువందునవరేఖలనింపెవినోదమొందగన్
...
నిన్ను నిన్నుగ కొల్వ కల్గితి నీడనివ్వుము మోహనా
నన్ను నేనుగ సేవ చేసెద నిత్య సత్యము మోహనా
కన్ను లాయను నీదు భక్తికి కామ్య మివ్వుము మోహనా
విన్నపమ్ములు చేయు తప్పులు వేగ మార్చుము మోహనా
వేణువు చేతబట్టి కర విద్యయు పంచెను విశ్వ మోహనా
జ్ణానము పంచుశక్తి కళ జ్ణాపక దీపిక విశ్వ మోహనా
మౌనము యుక్తి గా కదలి మార్గము జూపిన విశ్వమోహనా
మానస ముక్తినిచ్చి విధి మాయయు మాపెటి విశ్వ మోహనా
......
ప్రేమయు నాదు మానసము ప్రీతిని జేయర నిన్ను జేర..నా
ప్రేమను పొంది దాహమును తీర్చుము నిక్కము నీదు కాలమే
ప్రేమగ అర్పనే మనసు తీపియు జేయుము మానకన్ మదీ
ప్రేమసుఖమ్మురా శుభము దివ్వెల కాంతులు నీదు మాయలే
.......
కొంటె కృష్ణుడు కళ్ళగంతల గొప్ప ఆటను చూపినే
చాటు మాటున దూరి చూసియు చప్పరించియు వెన్ననే
ఆటమాదిరి ముద్దుముచ్చట ఆదమర్చియు చెప్పుటే
పట్టె దగ్గరకొచ్చి పాద మే కలిపేసుచిత్రము ముద్దుగా
........
.
శా.నీపై ఈ మనసయ్యె రోజు సుఖమై నీదివ్య భావమ్ము రా నీపై మాటలుగాను తృప్తి యు యశస్సే భవ్య మార్గమ్ము వ
చ్చే ప్రేమే విజయమ్మగా సుఖముగా చిత్తమ్ము ధైర్యమ్ముగా
నీపై నేనుసుమా నివృత్తి సహనమ్మే న్యాయ మౌనమ్ముగా
అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై.
భావము:- ఆపదలలో చిక్కుకున్న వారిని కాపాడే ఆ భగవంతుడు ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అక్కడ అంతఃపురంలో ఒక పక్కన ఉండే మేడకు సమీపంలో ఒక అమృత సరస్సుంది. దానికి దగ్గరలో చంద్రకాంతశిలల అరుగుమీద కలువపూల పాన్పుపై లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. అప్పుడు భయంతో స్వాధీనం తప్పిన గజేంద్రుడు కాపాడమని పెట్టే మొర విన్నాడు. గజరాజుని కాపాడడానికి వేగిరపడ్డాడు.
అవిద్యా హృదయ గ్రంథి: బంధమోక్షో భవేద్యతః
తమేవ గురు గురు రిత్యాహు : గురు శబ్దార్థవేదినః
తా:-- అజ్ఞాన జనిత మగు హృదయగ్రంథిని భేదించు నేర్పు ఎవని వలన కలుగునో వారే గురువు లని శబ్దార్ధ వేదులగుపెద్దలు చెప్పుచున్నారు.
మనయేవ జగత్సర్వం మనయేవ మహా రిపు:
మనయేవ హి సంసారో మనయేవ జగత్రయం
తా:-- ఈ మనస్సేసర్వజగత్తున్నూ ;మనస్సే పరమశత్రువు,అదియే సంసారహేతువు,
అదే మూడులోకములు కూడా యగుచున్నది.మనస్సును స్వాధీనము గావించుకొనినచో
జగములన్నియు స్వాధీనమగును.
స్వామిద్రోహము చేసి వేరొకనిఁ కొల్వన్ బోతినో? కాక నే
నీ మాట ల్విననొల్ల కుండితినో? నిన్నే దిక్కుగాఁ జూడనో?
యేమీ, యిట్టి వృధాపరాధి నగు న న్నీ దు:ఖవారాశి వీ
చీ మధ్యంబున ముంచి యుంపదగునా? శ్రీ కాళహస్తీశ్వరా!
ఈశ్వరా! నిన్ను కాదని స్వామి ద్రోహము చేసి, మరొక దేవుని సేవించానా? పోనీ, నీవు చెప్పిన వేదవాక్యములపై నమ్మకము లేక నిరాదరణ చేసి, నాస్తికుడనైతినా? నిన్నే దిక్కుగా భావించలేదా? ఏ తప్పూ చేయని నన్ను, ఈ సంసార దు:ఖసముద్రంలో ముంచి, చూసి వినోదించటం నీకు న్యాయమా? నన్ను ఉద్ధరించటం నీ కర్తవ్యం కాదా? (పరమేశ్వరుని ముఖము నుండి వేదాలు పుట్టినవని ప్రసిద్ధి. వారిని నమ్మినవారిని నాస్తికులంటారు.)
అక్కరపాటు వచ్చు సమయంబున జుట్టము లొక్కరొక్కరిన్
మక్కువ నుద్ధరించుటలు మైత్రికి జూడగ యుక్తమే సుమీ
యొక్కట నీటిలో మెరక నోడల బండ్లును బండ్ల నోడలున్
దక్కకవచ్చు చుండుట నిదానం గాదె తలంప భాస్కరా!
తా:-- భాస్కరా! ఒక్కొక్కప్పుడు నీటిలో నడుచు ఓడల మీద బండ్లును,నేలమీద నడుచు బండ్లమీద ఓడలను వచ్చుచుండుట నంబరు చూచుచున్నదియె కదా! అట్లే తగిన అవసరము వచ్చినపుడు బంధువు లొకరికొకరు కాపాడుకొనుట మిత్రత్వమునకు మిక్క్కిలి మంచిది.
5
గణముల, జగముల, ఘన నామ రూప భే;
దములతో మెఱయించి తగ నడంచు,
నెవ్వఁడు మనము బుద్ధీంద్రియంబులుఁ దాన;
యై,గుణ సంప్రవాహంబు నెఱపు,
స్త్రీనపుంసక పురుష మూర్తియునుఁ గాక,
తిర్య గమర నరాది మూర్తియునుఁ గాక,
కర్మ గుణ భేద సదసత్ప్రకాశిఁ గాక,
వెనుక నన్నియుఁ దా నగు విభుఁ దలంతు.
భావము:- అగ్ని మంటలను, సూర్యుడు వెలుగుని ప్రసరింజేసి మళ్ళీ శమింపజేసే విధంగానే భగవంతుడు తన కిరణాలచేత బ్రహ్మదేవుడు మొదలైన దేవత లను, సకల జీవరాసులను, సమస్త లోకాలను నానా విధాలైన నామ రూప భేదాలతో సృష్టించి లయింపజేస్తాడు. ఆయన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ తానే అయ్యి గుణాలను ప్రవర్తింప జేస్తాడు. ఆయన స్త్రీ, పురుష, నపుంసక, జంతు, దేవతల, నరులు మొదలగు వారిలో వేటి ఒక్క రూపము కలవాడు కాదు. ఆయన కర్మ గుణ భేదాలకి సత్తు అసత్తులకి అతీతుడు. అంతే కాకుండా అవన్ని కూడ తానే అయ్యి ఉంటాడు. అటువంటి ఆ ప్రభువును నేను స్మరిస్తాను.
అతి బాల్యము లోనైనను
బ్రతికూలపు మార్గమూల బ్రవర్తింపక స
ద్గతి మీరమెల్లగా నేర్చిన
నతనికి లోకమున సౌఖ్యమగును కుమారా!
తా:--ఎవడు లోకమునందు చిన్నతనమునందే విరుద్ధముగా నడవక మంచిమార్గమునందే నడుచు చుండునో వాడు లోకమున సుఖముగా జీవింపగలడు ఎటువంటి శ్రమలను పొందడు.
."త్యజ దుర్జన సంసర్గం భజ సాదు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యమనిత్యతాం
ర్పడ్డ వివేక రీతి; రుచి పాకము నాలుక గా కెఱుంగునే?
తెడ్డది కూరలో గలయతా:--దుష్ట సహవాసము చేయవద్దు. సాధుజనులతోడి మైత్రిని ఎప్పుడూ
చేస్తూవుండుము. పుణ్యకార్యముల నొనర్చుచుండుము.సతతము శరీరము యొక్క అనిత్యత్వమును గుర్తుంచుకొని మసలుతుండుము.
విజ్ఞానం వరదలా పొంగాలి అజ్ఞానం మంచులా కరగాలి
జిజ్ఞాస పర్వతం లా పెరగాలి జిజ్ఞాస పెరిగితే కదా విజ్ఞానం
పొంగేది అజ్ఞానం కరిగేది (జిజ్ఞాస=తెలుసుకోవాలనే కోరిక)
అమృతం చైవ మృత్యుశ్చ ద్వయం దేహే ప్రతిష్ఠితం
మృత్యు రాపద్యతే మోహాత్ సత్యే నాపద్యతే మృతం
తా:-- అమృతము, మృత్యువు; ఈరెండూ దేహమునందే వుంచబడి వున్నాయి.
మోహము లేక కోరిక వలన మృత్యువును, సత్యదర్శనము వలన అమృతత్వమును
మానవులు పొందగలరు.
భక్తానా మనురక్తానాం ఆశ్రితానం చ రక్షితా
దయావాన్ సర్వభూతేషు పరత్ర సుఖ మేధతే
ఆజ్ఞ యొనెర్చెడి వృత్తుల
లో జ్ఞానము గలిగి మెలగు లోకులు మెచ్చన్
బ్రాజ్ఞతను గలిగి యున్నన్
బ్రాజ్ఞులలో బ్రాజ్ఞుడవుగ ప్రబలు కుమారా!
తా:-ఇతరులకు ఉత్తర్వులిచ్చెడి పనులలో వివేకము గలిగి నడుచుకొనుము.లోకమునందు
అందరూ మెచ్చుకొను నట్లుగా వివేకము గలిగి యుండిన యెడల నిన్ను బుద్ధిమంతులలో బుద్ధిమంతుడవుగా నెంతురు.
స్థాన విశేష మాత్రమున తామర పాకున నీటిబొట్ట నిన్
పూనిక మౌక్తికం బనుచు పోల్చిన మాత్రన యింత గర్వమా
మానవతీ శిరోమణుల మాలికలందున గూర్పగ వత్తువో
కానుక లీయ వత్తువో వికాసము నిత్తువో విల్వ దెత్తువో
అర్థము:-- తామరాకు పైని నీటిబొట్టును ముత్యముతో పోలుస్తుంటారు. నీవు వున్న ఆ స్థానము పై ముత్యములాగున కనపడుతున్నావు కనుక నిన్ను ముత్యము లాగ మెరుస్తున్నావు అని పొగిడి నంత మాత్రమున గర్వ పడకు. ఆడవాళ్ళు వేసుకొనే నగల్లో కూర్చడానికి, కానుక లివ్వడానికి, నీవు పనికి వస్తావా?వికాసాన్ని యిస్తావా? విలువ ఏమైనా వుందా నీకు?అలాగే అధికారం లో వున్నప్పుడు అందరు పొగుడుతారు. తర్వాత నీకు విలువేముంటుంది?ఆ స్థానానికే గౌరవము కానీ నీకు కాదు అని తెలుసుకొని మెలగు అని కవి హెచ్చరిస్తున్నాడు.
తెలియక నాశహేతు వగు తీవ్రత రానల కీల లోపలన్
శలభము జోచ్చుగాక మతిచాలక మీనము తాను గాలపుం గొనం
గల పిశితంబు తామెసగు గాక యెరింగియు మేము దుఃఖపు
హేల వనితా సుఖంబు విడనాడము మోహ మహత్వ మెట్టిదో
అర్థము:-- తాను మాడిపోవుదునని తెలియని మిడుత దీపముచుట్టూ తిరిగి మాడిపోవును.తాను గాలమునకు తగిలి చనిపోవుదునని తెలియక చేప ఎరను తినును మనుషులు జీవితము అశాశ్వత మని తెలిసి కూడా భోగేచ్చమానలే కున్నారు ఆహా!అజ్ఞానమునకు ఎంతటి మహిమ యున్నదో గదా!
నిన్న౦ జూడరో మొన్న జూడరో జనుల్ నిత్యంబు జావంగ నా పన్నుల్గన్న నిధాన మయ్యెడి ధన భ్రా౦తిన్ విసర్జింప లే కున్నా రెన్నడు నిన్ను గందురిక మర్త్వుల్ గొల్వరేమో నినున్
విన్నంబోవకుండు నెడలన్ శ్రీ కాళహస్తీశ్వరా!
తా:--- హే కాళహస్తీశ్వరా! నిత్యమూ జనులు చచ్చుచుండుట చూచి కూడా, యీ మానవులు నిన్ను సేవింపలేక, ధనముపై వ్యామోహము చంపుకొనలేక నిన్ను మఱచి పోవు చున్నారు. వారికి నీపాద సంసేవాసక్తి ఎపుడు కలుగునో వారి యీ అవివేకమును మన్నించి నీవు కాపాడనిచో వారి గతి ఏమి? లేనిచో జన్మజన్మములలో నిన్ను మఱచి అధోగతి పాలగుదురు గదా! కావున నీవే వారిని కరుణించి కాపాడుము తండ్రీ!
కవికానివాని వ్రాతయు,
నవరసభావములు లేని నాథుల వలపున్
దవిలిచను పందినేయని
వివిధాయుద్ధ కౌశలంబు వృథరా సుమతీ!
తా:-- సుమతీ! స్వయముగా కవిగానివాడు చేసిన రచన, శృంగారాదులైన తొమ్మిది రసాలు, భావాలూ లేని కా౦త వలపు, విడవకుండా పరిగెత్తే అడవి పందిని బాణముతో కొట్టలేని వాని ఆయుధ సంపత్తీ ,నేర్పు వృథా.విత్తము గలవాని వీపున పుండైన
వసుధలోన వార్తకెక్కు
బేదవానియింట పెండ్లైన నెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమ
తా :--- ధనవంతుడి యింటిలో ఎవరికైనా వీపులో పుండైనా లోకములో అదొక వార్తగా ప్రసిద్ధి కెక్కుతుంది. పేదవానింటిలో పెండ్లయినా ఎవరూ పట్టించుకోరు.
జంతువులకి,పక్షులకి,చెట్లకీ వీటికి దేవుడు లేడు.. అవేమీ దేవుడి కోసం తపించడం లేదు.హాయిగా ప్రశాంతము గా జీవిస్తున్నాయి.మనిషికి లాగా వాటికి ఆశ,దురాశ ల్లేవు .పులుల్లో(అన్ని జంతువులలో,పక్షులలో ) ఆడపులి,మగ పులే వుంటాయి,తప్ప ముస్లిం పులి,క్రిస్టియన్ పులి వుండవు.బహుశా అవి మనిషిని చూసి నవ్వుకుంటూఉంటాయేమో! మనుషులు మాత్రమే మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప,మా మతం గొప్పది అని వీటన్నిటి కోసం కొట్లాడుకుంటూ,చంపుకుంటూ వుంటారు.
0 Comments
వలిభిర్ముఖ మాక్రాంతం పలితై రంకితం శిరః
గాత్ర్రాణి శిధిలా యంతే తృష్ణై కా తరుణాయతే (భర్తృహరి సుభాషితం)
కరాచరణా ద్యవయవంబుల భర ముడిగెన్, వళులు మొగముపై నిండారెన్
శిరసెల్ల తెల్లబారెను దరిమాలిన తృష్ణ యొకడె తరుణత బూనె
(ఏనుగు లక్ష్మణ కవి అనువాదము)
అర్థము:--ముఖమంతా ముడుతలు బడినవి, తల యంత నెరసి పోయినది,అంగములు పట్టు దప్పినవి,
అయిననూ కోరిక,ఆశ మాత్రము విజ్రుమ్భించు చున్నవి.అవి మాత్రము యవ్వనమును వదులుట లేదు).
వదంతు శాస్త్రాణి యజంతు దేవాన్
కుర్వన్తు కర్మాణి భజంతు దేవతాః
ఆత్మైక్య బోధేన వినా విముక్తి:
న సి ద్ధ్యతి బ్రహ్మా శతాంతరేపి
అర్థము:--ఒకరు ఎన్ని శాస్త్ర ప్రసంగముల నైనను వివరింప వచ్చును, ఎందరు దేవతలను
ఉద్దేశించి యైనను యజ్ఞవిధులనాచరించవచ్చును,ఎన్ని శుభకర్మము లైనను చేయవచ్చును,కానీ వారికి బ్రహ్మము,ఆత్మయు,నొక్కటియే యను జ్ఞానము కలుగనంతవరకు నూర్గురు బ్రహ్మల కాలము గడచిననూ ముక్తి లభియింపదు.
("చతుర్యుగ సహస్రాణి బ్రహ్మణో దిన ముచ్యతే"అనగా నాలుగువేల యుగముల కాలము
బ్రహ్మ యొక్క ఆయువులో ఒక్కదినము.అంతియే కాలము రేయి యగుచుండును. ఈ
క్రమమున నూఱుయేండ్లు అయినచో ఒక కల్పముగా బ్రహ్మయొక్క ఆయువగును.
(వివేకచూడామణి)
అర్థాతురాణాం నగురుర్నబంధు:
విద్యాతురాణాం న సుఖం న నిద్రా
కామాతురాణాం నభయం న లజ్జా
క్షుధాతురాణాం న రుచిర్నపక్వం
డబ్బు సంపాదనే పరమావధిగా భావించేవారు గురువును గానీ, బంధువులను గానీ లెక్కచేయరు.విద్యనార్జించవలెనని ఆతురత పడేవారికి సుఖమూ,నిద్రా రెండూ వుండవు.(వుండకూడదు) కోరికలతో తపించేవారికి భయమూ,సిగ్గూ రెండూ వుండవు.
ముఖం పద్మ దళా కారం
వచ శ్చందన శీతలం
హృత్కర్తరి సమం చా
అతి వినయం ధూర్త లక్షణం
తా :--ముఖము తామరరేకుల్లాగా అందంగా వుంటుందట.మాటలు గంధము వలే చల్లగానూ,విన సొంపుగానూ వుంటాయట.కానీ మనస్సు మాత్రం కత్తెరలాగా మనకు హాని చేసేదిగా వుంటుందట.అలాంటి
అతివినయము చూపించే వ్యక్తులతో జాగ్రత్తగా వుండమని హెచ్చరిస్తున్నాడు.కవి.
వన్నే యేనుగుతోలు దుప్పటము, బువ్వా కాలకూటంబు చే
గిన్నే బ్రహ్మకపాలముగ్ర మగు భోగే కంఠహారంబు మే
ల్నిన్నీ లాగున నుంటయుందెలిసియున్ నీ పాదపద్మంబు చే
ర్చె న్నారాయణుడెట్లు మానసము దా శ్రీకాళహస్తీశ్వరా!
తా:--- హేకాళహస్తీశ్వరా! నీవు కట్టుబట్ట ఏనుగుతోలు, నీ ఆహారము కాలకూట విషము, చేతిలోని గిన్నె బ్రహ్మకపాలము,భయంకరమైన సర్పము నీకు కంఠహారము, నీవీ రూపముతో నుందువని తెలిసికూడా యా విష్ణువు నీ పాదపద్మములనే తన మనమున నిలిపి నిరంతరము ధ్యానించుచుండును గదా! అనగా శ్రీహరి స్వయముగా మహా సంపన్నుడై యుండి కూడా ఆదిభిక్షువగు నిన్ను ధ్యానించు చుండుట విచిత్రమని భావము.
క్రూర మనస్కులౌ పతుల గొల్చి వసించిన మంచివారికిన్
వారి గుణంబె పట్టి చెడు వర్తన వాటిలు, మాధురీ జలో
దారలు గౌతమీ ముఖ మహా నదులంబుధి గూడినంతనే
క్షారము జెందవే మొదలి కట్టడ లన్నియు దప్పి భాస్కరా!
తా:-- తియ్య్యని జలముతో నిండియున్న గోదావరి మొదలగు మహానదులు సముద్రమును గూడినంత మాత్రముననే మొదటి గుణములను విడిచి యుప్పదనము పొందుచున్నవి. అట్లే క్రూర బుద్ధి కలిగిన ప్రభువు నాశ్రయించిన వారు మంచివారైననూ తమ మంచి గుణములను వదిలి యా ప్రభువుల గుణములనే పొంది చెడు నడతగలవారుగా మారుదురు.
కానివాని చేత గాసు వీసం బిచ్చి
వెంట దిరుగు వాడె వెఱ్ఱివాడు
పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా
విశ్వదాభిరామ వినురవేమ
తా:-- వడ్డీకి ఆశపడి హీనునకు డబ్బిచ్చి, దానిని వసూలు చేయుటకు వాని వెంట తిరుగువాడు వెఱ్ఱివాడు.పిల్లిచే తినబడిన కోడి పిలిస్తే పలుకుతుందా? అలాగే ఆ డబ్బు కూడా తిరిగిరాదు.
ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవు కడనున్న వృషభము
జదువని యా నీచు కడకు జనకుర సుమతీ!
తా:-- సుమతీ! నీరుత్రాగే గుఱ్ఱాన్నీ, క్రొవ్వుతో చెలరేగుతున్న మదపుటేనుగునూ, యెద
పట్టిన గోవువద్ద వున్న ఆబోతును, విద్యాహీనుడైన కారణము చేత చెడ్డబుద్ధిగలవాడి వద్దకు వెళ్ళవద్దు. నీరుత్రాగే గుఱ్ఱము వద్దకు పోతే త్రాగనివ్వరేమో ననే అనుమానంతో ముందుకు వెడితే కరుస్తుంది, వెనక్కి వెళితే తంతుంది. క్రొవ్వు కారుతున్నమదపుటేనుగు దగ్గరికి వెళితే ఆ మత్తులో అది క్రోధంతో ఒళ్ళు తెలియకుండా ఉంటుంది కనుక దంతాలతో కుమ్మి తొండముతో ఎత్తి పడవేస్తుంది. యెద పట్టిన ఆవు దగ్గరనున్న ఆబోతును సమీపిస్తే అది తనకు ఆవును దూరం చెయ్యడానికి వచ్చారన్న
అనుమానంతో పొడిచి చంపేయగలదు. వీటికి ప్రత్యేక పరిస్థితులలో ఒళ్ళు తెలియనందున తమకు మేత పెట్టిన వానినైనా అపకారం చేయడం సహజమే.
విద్య లేనివాడు వింత పశువు,అంటారు కదా వాడు కూడా పశువులాగే అపకారం చేస్తాడు.
ఊహ గలంగి జీవనపుటోలమునం బడి పోరుచున్ మహా
మోహలతా నిబద్ధపదమున్ విడిపించుకొనంగ లేక సం
దేహముఁ బొందు దేహి క్రియ దీనదశన్ గజ ముండె భీషణ
గ్రాహ దురంత దంత పరిఘట్టిత పాదఖురాగ్ర శల్యమై.
భావము:- బ్రతుకుతెరువులో పడిపోయి మోహం అనే తీగచే కట్టు బడిన పాదాలు విడిపించుకోడం చేతకాక సందేహానికి గురైన జీవుడి వలె గజేంద్రుడు భయంకరమైన ఆ మొసలి కోరలకు చిక్కి శల్యావశిష్టమైన కాలిగిట్టలు కలవాడై దీనంగా అలమటిస్తున్నాడు.
ఎందఱు దేవతల్ చనిరి యెందఱు తాపసులట్టె భ్రష్టులై
రెందఱు రాజులేగిరి మరెందఱు యోగులు జోగులైరి గో
విందుని పాదపద్మములు వీడని భక్తి భజింప నేర కా
చందము వొందకీవు మనసా! హరిపాదము లాశ్రయింపుమా!
గోవిందుని పాదపద్మములను భక్తి తో పూజ చేయకుండా
ఎందరో దేవతలు,ఎందరో తాపసులు భ్రష్టులై పోయారు. రాజులు కూడా అలాగే వెళ్లిపోయారు.
ఎంతోమంది యోగులు పనికిమాలిన వారై పోయారు, వారిలాగా నీవు కాకుండా శ్రీహరి
పాదముల నాశ్రయించుమా మనసా!
ఉపభోగ కాతరాణాం
పురుషాణామార్తా సంచయపరాణాం
కన్యామణి రివ సదనే
తిష్ఠత్యర్థ: పరస్యార్థే
ధనసంపాదనాపరులై దానిని అనుభవించుటకు భయపడు వారి ధనము. తన యింటి
కన్య తనయింట పెరిగి పెళ్లి యైన తర్వాత పరుల సొత్తయినట్లు౦డును. అంటే శ్రమయే గానీ అనుభవించేది వేరే వాళ్ళగుదురు. (లేక చనిపోయినతర్వాత భార్యా బిడ్డలకే
అనుభవయోగ్యమగును)
----------------------------------
క్షమయు,సత్యంబు,గృపయు, శౌచమును గురుల
వలని భక్తియు,నాయువు పొలుపునిచ్చు
నాలుక,బొంకు,క్రూరత,శుచి తాప గమము
గురువిరోధ,మాయువు గడు గుందజేయు
ఓర్పు,సత్యం,దయ,శుచి,గురుభక్తి ఆయుష్షు పెంచితే; కోపము,అబద్ధమాడటం ,క్రూరత్వం,
శుభ్రతను వదిలేయడం,గురువులతో విరోధం ఆయుష్షును తగ్గిస్తాయి
కోపులు గురువధ కోడరు
కోపులు పరనింద సేయ గొంకరు కోపం
బాపదల కెల్ల మూలము
కోపము పాపముల పొత్తు కోపానలమున్
కోపం వచ్చినవాళ్లు గురువును చంపడానికి కూడా వెనుకాడరు,పరులను నిందించడానికి జంకరు,కోపము యాపదల లకెల్ల మూలము,కోపము పాపములకు స్నేహితుడు,కోపము అగ్ని వంటిది అది మనలని దహించివేస్తుంది..
----------------------------------
సంసార విష వృక్షస్య
ద్వే ఫలే అమృతోపమే
కావ్యామృత రసాస్వాదః
సంగమ స్సజ్జనై స్సహ
అర్థము:-- సంసారమనే యీ విషవృక్షమునకు రెండే రెండు అమృత ఫలములు వున్నవి.
మొదటిది కావ్యామృత రసాస్వాదనము,రెండవది సత్పురుషుల సహవాసము.
కంద
యోగాగ్ని దగ్ధకర్ములు
యోగీశ్వరు లే మహాత్ము నొండెఱుఁగక స
ద్యోగవిభాసిత మనముల
బాగుగ వీక్షింతు రట్టి పరము భజింతున్.
భావము:- యోగీంద్రులు యోగం అనే అగ్నితో తమ సర్వ పూర్వ కర్మలను కాల్చివేసి. ఇతరమైనది మరేది తలచకుండ ప్రకాశించే తమ మనసులలో ఆ దేవదేవుని చూస్తు ఉంటారు. అట్టి ఆ మహానుభావుడిని నేను సేవిస్తాను.
రామనామ పఠన చే మహి వాల్మీకి
పరగ బోయ యయ్యు బాపడయ్యె
కులము ఘనము గాదు గుణము ఘనమురా
విశ్వదాభిరామ వినుర వేమ
----------------------------
నరుని వృద్ధి కంటే చలమ లక్ష్యము లేదు
నరుని జగతి విడిచి పరము లేదు
నరుడు లేని చోట నారాయణుడె లేడు
వాస్తవమ్ము నార్ల వారి మాట
----------------------------------------------
ప్రియము లేని విందు పిండివంటల చేటు
భక్తిలేని పూజ పత్రి చేటు
పాత్ర మెరుగనీవి బంగారు చేటురా
విశ్వదాభిరామ వినుర వేమ
----------------------------
విద్యయే మనుజుల వికసింప జేసెడు
మహిత సాధనంబు మనుజులందు
విశ్వ హితము లేని విద్వేష పూర్ణమౌ
విద్య వున్నవాడు వింత పశువు (డా. మూలే రామముని రెడ్డి, ప్రొద్దుటూరు)
కసుగాయఁ గఱచి చూచిన
మసలక తన యొగరుగాక మధురంబగునా
పసగలుగు పడతులుండగఁ
బసిబాలల బొందువాఁడు పశువుర సుమతీ!
మాటకు ప్రాణము సత్యము
కోటకు ప్రాణంబు సుభటకోటి ధరిత్రిన్
బోటికి ప్రాణము మానము
చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!
అక్షరాలతీరు ఆణిముత్యపు పేరు
సొగసు సోయగాల సోంపు మీరు
కావ్య పఠన జేయ కమ్మదనపు రీతి
మధుర తెనుగు భాష మంజులంబు
తెలుగు తేట తెల్లపు భాష
తెలుగు లెస్స యైన తేనె మూస
తెలుగు తెలుగ టన్న తెగువ చూపెడు ప్రాస
దేశ భాష లందు తెలుగు లెస్సా?
ప్రాస తెలుగు లో తప్ప ఇతర భాషలలో లేదు.దేశ భాషలలో
తెలుగు లెస్ (తక్కువ) ఐందా?కానే కాదు.(మాడుగుల నాగఫణి శర్మ)
అర్థా గృహే నివర్తన్తి స్మశానే మిత్ర బాంధవా
సుకృతం దుష్కృతం చైవ గచ్చంత మను గచ్చతి
Must read article on సీసము, నవసీసకము -
ఈ అమరికను తీసికొందామా? - UI U III I - UI | UI III
- గుర్తు ఆటవెలఁది, సీసపు యతి
| గుర్తు తేటగీతి యతి
దీనినుండి జనించినవి:
సీస పాదము = UIU IIII - UIU IIII / UIU IIII - UI UI
ఆటవెలఁది = UI UI III - UIU IIII / UI UI III - UI UI
తేటగీతి = UI UII IIUI - UI III
మాధవుం గనఁగను మాకు | మంచి దినము
శ్రీధరుం బొగడఁగఁ జేరు | సిరులు మనకు
రాధికాధవుఁ డిడు రమ్య | రాగ రవము
యాదవుం డనఁగను హాయి | యౌను మనసు ... (1)
నందసూను మొగపు నవ్వు | నంద మొసఁగు
వంద వీణల నుడి వాని | వాణి సొగసు
చందమామ వెలుఁగు సార|సాక్షుని కళ
చిందుఁగా సుధలను జెల్వుఁ | డిందు విడక ... (2)
తెల్లనౌ విరులను దెచ్చి | తృప్తి గలుగఁ
జల్లఁగా గొలుతుము నల్ల | సామి నిపుడు
నిల్లు మాయెడఁదయు నీ మ|హిన్ సతతము
పిల్లఁగోవి స్వరము ప్రేమ | పిలుపు నిజము ... (3)
మాధవుం గనఁగను - మాకు మంచి దినము
శ్రీధరుం బొగడఁగఁ - జేరు సిరులు
రాధికాధవుఁ డిడు - రమ్య రాగ రవము
యాదవుం డనఁగను - హాయి యౌను ... (4)
నందసూను మొగపు - నవ్వు నంద మొసఁగు
వంద వీణల నుడి - వాని వాణి
చందమామ వెలుఁగు - సారసాక్షుని కళ
చిందుఁగా సుధలను - జెల్వుఁ డిందు ... (5)
తెల్లనౌ విరులను - దెచ్చి తృప్తి గలుగఁ
జల్లఁగా గొలుతుము - నల్ల సామి
నిల్లు మాయెడఁదయు - నీ మహిన్ సతతము
పిల్లఁగోవి స్వరము - ప్రేమ పిలుపు ... (6)
(4), (5), (6) పద్యములలో (1), (2), (3) సరి పాదములలో చివరి న-గణము తొలగించబడినది.
సీసము = (4), (5), (6)
ఆటవెలఁది = (4), (5), (6)
తేటగీతి = (1), (2), (3)
ఇవి పూర్తిగా ఆటవెలఁదులు లేక తేటగీతులు.
అంతే కాక ఆటవెలఁది లేక తేటగీతి ఎత్తు గీతితో సీసములు.
అన్నిటికి ప్రాసలు ఉన్నాయి; యతియో ప్రాసయతియో చెల్లుతుంది.
సీస పద్యము = సీ. [(4) + (5)] + ఎత్తుగీతి తే. (3) లేక ఆ. (6)
ఇప్పుడు ఒక క్రొత్త సీసపద్యమును కల్పిద్దామా?
నవసీసకము -
==
నవసీసకము - ఇం/ఇం - ఇం/ఇం // ఇం/ఇం - సూ/సూ/సూ
==
హేమంతఋతువులో - నీసంధ్య వెలుఁగులోఁ
బ్రేమాగ్ని మండెనే - ప్రియతమా దినమ్ము
నామానసములోన - నటనమ్ము చేసినా
వేమయ్యె నది నేఁడు - విరహ బాధ మిగిలె
వ్యోమవీథులలోన - ధూమమ్మువలెఁ జుక్క
లీమహీస్థలిపైన - నిరులు నిండె జూడు
నీమనోఽభీష్టమ్ము - నేనెఱుంగను గాదె
సేమమై యుండుమా - చేరకున్న నేమి
==
తేటగీతి - సూ/ఇం/ఇం - సూ/సూ
==
నీవు నాకింక లేవేమొ - దైవలీల
నీవు చూడంగ రావేమొ - నేనెఱుంగ
చావు బ్రతుకుల మధ్యలో - సాఁగిపోదు
దేవుఁ డిచ్చిన దింతియే - తెలిసికొంటి!
==
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
0
అర్థము:--మనము చనిపోయినప్పుడు ధనము యింటి వద్దనే వుంటుంది, బంధుమిత్రులు స్మశానము వరకే వస్తారు. మనము చేసిన పాప పుణ్యాలే మన వెంట వస్తాయి.
దరిద్రాయ కృతం దానం శూన్య లింగస్య పూజనం
అనాధ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదు:
అర్థము:-- బీదవానికి చేయబడిన దానము, పూజ లేని లింగమునకు పూజ గలుగ జేయుట,దిక్కులేని పీనుగకు దహన సంస్కారము
చేయుట ఈ మూడునూ అశ్వమేధము చేసినదానితో సమానము.
సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం
సర్వేంద్రి యాణం నయనం ప్రధానం
షన్నాం రసానం లవణం ప్రధానం
భవేన్నదీనాం ఉదకం ప్రధానం
అర్థము:శరీరములో అన్నింటికంటే తల ప్రధాన మైనది, అన్ని ఇంద్రయాలలో కన్ను ప్రధాన మైనది, ఆరు రుచులలో ఉప్పు ప్రధాన మైనది, అన్ని నదులకు నీరే ప్రధాన మైనది.
0 Comments
------------ --ఉపాధ్యాయ పూజా దినోత్సవ సందర్బంగా ------------------
గురుర్బ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః
గురు: సాక్షాత్ పరం బ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః
ఒజ్జ, గురువు - ఉపాధ్యాయుడు - ఆచార్యుడు
-------------------------------------------
1. గురువు
గురుర్బన్ధురబన్ధూనాం గురుశ్చక్షు రచక్షుషామ్ I
గురుః పితాచ మాతాచ సర్వేషా న్యాయాయవర్తినామ్ ఇఇ
బంధువులెవరూ లేనివారికి గురువే బంధువు.కళ్ళు లేని వారికి గురువే కంటి చూపు.గురువే తల్లి, గురువే తండ్రి. యదార్థజ్ఞాన ప్రదర్శకుడు.న్యాయమార్గంలో ప్రవర్తింపచేయువాడు గురువు.
2. ఉపాధ్యాయుడు.
ఏకదేశం తు వేదస్య వేదాఙ్గాన్యపి వా పునః I
యో2ధ్యాపయతి వృత్యర్థమ్ ఉపాధ్యాయస్య ఉచ్యతే ఇఇ
వృత్యర్థం వేదాన్నీ వేదాంగాలనీ ఎవరైతే అధ్యాపనం (బోధన) చేస్తారో వారు ఉపాధ్యాయులు.
3. ఆచార్యుడు
ఆచినోతి హి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి I
స్వయమాచరతే యస్మాత్ తస్మాదాచార్య ఉచ్యతే ఇఇ
కేవలం శాస్తార్థాలను బోధించడమే కాక, తాను వాటిని ఆచరిస్తూ, సమాజ హితం కోసం ఆదర్శంగా ఆచరింప చేసేవాడు ఆచార్యుడు. రామాయణ శర్మ ,భద్రాచలం
విశేషం
* విద్య పొందాలంటే,మనకి దాన్ని అందించగలిగే వానికి,
అ)విషయ పరిజ్ఞానం కలిగియుండాలి.
ఆ)దాన్ని బోధించే సంకల్పం ఉండాలి.
ఇ)అర్ఠమయ్యేలాగు చెప్పగలగాలి.
* బాహ్య సౌందర్యం( ఉదా॥ అష్టావక్రుడు) ఎలా ఉన్నా, అంతస్సౌందర్యం ముఖ్యం.
ఉపాధ్యాయాన్ దశా చార్యః ఆచార్యాణం శతం పితా
సహస్రంతు పితుర్మాతా గౌరవేణా తిరిచ్యతి
అర్థము:--- పది మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు అధికుదు..నూరు మంది ఆచార్యుల కంటే ఒక తండ్రి అధికుదు. నూరు మంది తండ్రుల కంటే ఒక తల్లి గౌరవము అధికమని చెప్పబడినది.
అన్నదానాత్పరం దానం విద్యా దానమతః పరం
అన్నైన క్షణికా తృప్తి: యావజ్జీవంచ విద్యయా
అర్థము:--అన్నదానం గొప్పదే కానీ అంతకంటే గొప్పది విద్యాదానం. అన్నదానము చేసిన తిన్నవాడికి క్షణిక
మైన తృప్తియె కలుగును. కానీ విద్యా దానము వల్ల అజ్ఞానమనే చీకటి విడిపోయి జీవిత మంతయు సుఖ
శాంతులు లభిస్తాయి కదా!
గురువులారా! దయచేసి పిల్లలకు సరియైన జ్ఞానమును ప్రసాదించండి.
విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం
విద్యా భోగకరీ యశసుఖకరీ విద్యా గురూణాం గురు:
విద్యా బంధు జనో విదేశ గమనే విద్యా పరం లోచనం
విద్యా రాజసుపూజ్యతే నహిధనం విద్యా హీనఃపశు:(భర్తృహరి సుభాషితము)
అర్థము:మానవులకు విద్యయేఎక్కువ సౌందర్యము నిచ్చునది . అదియే గుప్త ధనము;చదువే
కీర్తిని,సుఖమును,భోగమును కలిగించును; విద్యయే గురువులకు గురువైనది
విదేశ ములకు పోయినప్పుడు విద్యయే బంధువు:అదియే మరియొక కన్ను వంటిది;
రాజ సభలలో పూజార్హత విద్యకే గానీ ధనమునకు కాదు;ఇటువంటి విద్య లేని నరుడు
వింత పశువు గా పిలువ పడుతాడు.
పొడగానం బడకుండ డాఁగు; వెలికిం బోవంగ దా నడ్డమై
పొడచూపుం; జరణంబులం బెనగొనుం; బో రాక రా రాక బె
గ్గడిలం గూలఁగఁదాఁచు; లేచుతఱి నుద్ఘాటించు; లంఘించుఁ; బ
ల్విడిఁ జీరుం; దలఁగున్; మలంగు; నొడియన్ వేధించుఁ; గ్రోధించుచున్.
భావము:- మొసలి కనబడకుండా నీళ్ళల్లో దాగి ఉంటుంది. ఏనుగు గట్టుపైకి పోతుంటే అడ్డంగా వస్తుంది. కనబడి కాళ్ళకు చుట్టుకు పోతుంది. అటునిటు కదలకుండ చేసి భయంతో కూలిపోయేలా తోకతో కొడుతుంది. లేచినప్పుడు ఒళ్ళు జాడించి పైపైకి గెంతుతుంది. చటుక్కున తప్పుకుంటుంది. గోళ్లతో గీరుతుంది. ఒడిసి పట్టి వేధించి, కోపం చూపెడుతుంది.
అవతార దశ :మాతృ మూర్తి గర్భములో యీదుతూ ఎదిగే మత్స్యం ( చేప)
నీటినుంచి నేలకు పాకే బాల్యం ఒక కూర్మం.
వయసులోని జంతు ప్రవర్తన ఒక వరాహం.
మృగం నుంచి మనిషిగా మారే దశ నరసింహం.
మనిషిగా మారినా ఎదగాలని ఎరిగితే వాడు వామనుడు.
ఎదిగినా క్రోధం తగదన్ తెలిస్తే వాడు పరశురాముడు.
సత్య,ధర్మ,శాంతి,ప్రేమలతో తానె ఒక శ్రీరాముడు.
విశ్వమంతా తానె అని విశ్వసిస్తే వాడే శ్రీకృష్ణుడు.
ధ్యాని అయి జ్ఞాని అయి జన్మ కారణ మెరిగిన వాడే బుద్ధుదు.
కర్తవ్య మొనరించి జన్మ సార్థకత తో కాగలడు కల్కి భగవానుడు.
తెలుసుకుంటే కర్మ యొక్క ప్రతి దశ లోని అంతరం మలుచుకుంటే జన్మ
ఒక్కటి లోనే మనిషి దశావతారం.
(తెలుగు వెలుగు సౌజన్యముతో)రచయిత:ఉగ్గిన.తారకేస్వర రావు
తరగల్ పిప్పల పత్రముల్ మెఱుగు టద్దంబుల్ మరుద్దీపముల్
కరికర్ణాంతము లెండమావులతతుల్ ఖద్యోతకీట ప్రభల్
సురవీధి లిఖితాక్షరంబు లసువుల్ జ్యోత్స్నా పయః పిండముల్
సిరులందేల మదాంధులౌదురో జనుల్ శ్రీకాళహస్తీశ్వరా!
తా:-- ప్రాణములు నీటి కెరటములు (అస్థిరమైనవి)రావియాకులు, అద్దపుమెరుగులు,
గాలిలోని దీపాలు, గజములు చెవుల చివర చివుళ్లు, ఎండమావులు, మిణుగురు పురుగుల కాంతులు, యివన్నీ అశాశ్వతమైనవి కదా!సంపదలన్నియు వెన్నెలలో పాలను పరువు చేసినట్లున్నవి. అవి స్థిరములు గావు. అయినా జనులు ప్రాణముల తోడను,సంపదలతోడను మదాంధులగుచున్నారు. స్వామీ!
ఇభకుంభముల మీది కెగిరెడి సింగంబు ముత్తునే కుఱుచైన మూషికమును,
నవచుట పత్రముల్ నములుచున్న పైకంబు కోరుకునే జిల్లేడు కోణాలు నోట
అరవింద మకరంద మనుభవించెడి తేటి పోవునే పల్లేరు పూలకడకు
లలితమైన రసాల ఫలము గోరెడి చిల్క మెసఁవునే భ్రమత నుమ్మెత్తకాయ
ఇలను నీ కీర్తనలు పాడ నేర్చినతడు
పరుల కీర్తన పాడునే యరసి జూడ
భూషణ వికాస! శ్రీధర్మపురి నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
తా:-- ఓ నరసింహస్వామీ! ఏనుగు కుంభస్థలంపై కురుకు సింహము చిట్టెలుకను పట్టుకొన్నాడుజూడు . లేత మామిడి చిగుళ్ళను తిను కోకిల జిల్లేడుపూల కొనలను కొరకదు.
పద్మాలందలి తేనెను భ్రమరము పల్లేరు పూవులా చెంతకు పోదు.
మామిడి పండ్లను తిను చిలుక ఉమ్మెత్త కాయలను తినదు. అట్లే నీ కీర్తనలు పాడ నేర్చిన భక్తులు పరులను పొగడెడి పాటలను పడలేరు.స్వామీ!
ఒక్కడు మాంస మిచ్చె మఱి యొక్కడుచర్మము గోసి యిచ్చె వె
ఱొక్కరు డస్థి నిచ్చె నిక నొక్కడు ప్రాణములిచ్చె వీరిలో
నొక్క పట్టునన్ బ్రదుక నోపక యిచ్చిరో కీర్తి కిచ్చిరో
చక్కగ జూడు మంత్రి కులసంభవ! రాయణమంత్రి భాస్కరా!
తా:--- ఒకరు శరీరములోని మాంసము కోసి యిచ్చినాడు (శిబిచక్రవర్తి) యింద్రుడడిగితే సహజ కవచ కుండలాలనిచ్చినాడు కర్ణుడు, రాక్షస సంహారానికై
వెన్నెముక నిచ్చినాడు దధీచి, వామనుడడిగితే ప్రాణములనిచ్చుటకు సిద్ధపడినాడు బలిచక్రవర్తి. వీరంతా బ్రతుకలేక ఈపనులు చేశారా? కీర్తి కోసం చేశారా? ఆలోచించి చూడు రాయనమంత్రి భాస్కరా ?
పాదద్వంద్వము నేలమోపి, పవనున్ బంధించి, పంచేంద్రియో
న్మాదంబుం బరిమార్చి, బుద్ధిలతకున్ మాఱాకు హత్తించి, ని
ష్ఖేదబ్రహ్మపదావలంబనరతిం గ్రీడించు యోగీంద్రు మ
ర్యాదన్ నక్రము విక్రమించెఁ గరిపాదాక్రాంతనిర్వక్రమై.
భావము:- మహాయోగి వాయువులు బంధించి తన పంచేంద్రియాల ఆడంబరాన్ని అణగార్చి, బుద్ధి అనే తీగకు మారాకు పట్టించి, పట్టుదలగా దుఃఖ రాహిత్య ఆనందమయ పరబ్రహ్మ పదాన్ని అందుకొని ఆనందిస్తాడు. అలానే మొసలి తన రెండుకాళ్ళు నేలమీద గట్టిగా ఆనించి ఊపిరి బిగబట్టి పట్టిన ఏనుగు కాళ్ళను వదలకుండ జయింపరానిదై విజృంభించింది.
ఔదుంబ రాణి పుష్పాణీ : శ్వేత వర్ణంచ వాయసం
మత్స్య పాదం జలే :పశ్యే న్ననారీ హృదయ స్థితం:
అర్థము---మేడి పుష్పమునైనా చూడ వచ్చునేమో, తెల్లని కాకినైనా చూడవచ్చు నేమో,
నీళ్ళ లోని చేప జాడ నైనా చూడ వచ్చునేమో కానీ ఆడదాని మనస్సులో ఏమి ఉన్నదో
చూడ లేము. (శ్రీ కృష్ణ ఉవాచ)
వైద్య రాజ నమ స్తుభ్యం
యమరాజ సహోదరః
యమస్తు హరతి ప్రాణాన్
వైద్యో ప్రాణాన్ ధనానిచ
అర్థము:--యమధర్మ రాజుకు సహోదరుడా నీకు ఒక నమస్కారం. యముడు ప్రాణాలను
మాత్రమె తీసుకెళతాడు,వైద్య్డుడు ప్రాణాల్నీ ధనాన్నీరెండింటినీ హరిస్తాడు.
"శరీరే,జర్జరీ భూతే, వ్యాధి గ్రస్తే, కళేబరే, ఔషధం జాహ్నవీ తోయం,వైద్యో నారాయణో
హరి :"అని "శిధిల మైన, రోగ గ్రస్త మైన ఈ శరీరానికి ఔషధం గంగాజాలం తో సమానం.
శ్రీమన్నారాయణుడైన హరియే వైద్యుడు. ఈ శ్లోకం చెప్పుకుంటూ మందు తీసుకుంటే
మరింత త్వరగా పని చేస్తుందని పూర్వకాలం లో ఒక నమ్మకం. కాలం మారిపోయింది
ధనమే అన్నిటికీ మూలమై పోయింది. యిప్పటి వైద్యులు కొత్త కొత్త పద్ధతులతో వైద్యం
చేస్తూ రోగి యొక్క ధన ప్రాణాలని హరిస్తున్నారు. అందరు వైద్యులూ అలా ఉంటారని కాదు.
దానం ప్రియ వాక్సహితం జ్ఞాన
మగర్వం క్షమాన్వితం శౌర్యం
విత్తం చ త్యాగనియుక్తం
దుర్లభ మే తచ్చతు ర్భద్రం
తా:--ప్రియవచనములతో గూడిన దానమున్నూ,గర్వము లేని విద్య యున్నూ, క్షమ
గలిగిన శౌర్యము న్నూ, త్యాగముతో గూడిన ధనమున్నూ , ఈ నాలుగూఎక్కడో
అరుదుగా వుంటాయి.
యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం తస్య కరోతి కిమ్
లోచనాభ్యాం విహీనస్య దర్పణః కిమ్ కరిష్యతి (హితోపదేశం)
అర్థము:-స్వయముగా ప్రజ్ఞ లేనివాడికి శాస్త్రము వలన ప్రయోజనం మేమీ వుండజాలదు.
కండ్లు లేనివాడికి అద్దము వలన లాభమేముంటుంది?
యస్య సర్వే సమారంభా: కామ సంకల్ప వర్జితాః
జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం త మాహు: పండితం బుధా:
అర్థము:--ఏ మహనీయుని కర్మలన్నీ కామసంకల్ప వర్జితములు గా వుంటాయో వానినే
పండితుడంటున్నారుతెలిసినవారు.అట్టివాని కర్మలన్నీ జ్ఞానమనే అగ్నిచే దగ్ధ మైపోయి
ఫలరహితములై యుండుటచే కర్తను బంధించవు.(భగవద్గీత)
చేటు వచ్చు కాలమున జెడనాడు దైవంబు
మేలు కలిగెనేని మెచ్చుకొనును
గరిమ మేలు కీళ్ళు కావడి కుండలు
విశ్వదాభి రామ వినుర వేమా!
అర్థము:--తమకు కీడు కలిగిందంటే దైవాన్ని దూషించుట ,మేలు కలిగితే మెచ్చుకొనుట
మానవ స్వభావము.కానీ మంచి చెడ్డలు అనేవి కావడికుండలు వాటిని సమానముగా
చూడమని వేమన ప్రబోధిస్తున్నాడు..
చెఱుకు రసంబునకన్ననును జేడెల కన్నను,తేనెకన్న,భా
సుర సుధకన్నదియ్యనైన చూత ఫలంబుల కన్న,ఖండ శ
ర్కర కన్న,ధాత్రి మధురమయి తోచు వివేకి యౌ మహా
సరసుని తోడ ముచ్చటలు సారెకు సల్పుచున్న భైరవా!
చెరుకురసము,ఆడవారిసాంగత్యము,తేనె,అమృతము,తియ్యనైన మామిడి పండ్లు,కలకండ వీటి అన్నిటికన్నా ప్రపంచములో వివేకి యైన సరసుని తో మాటి మాటికీ జరుపు గోష్టి చాలా తియ్యనైనది.
డంబము మాని మూఢులకు డంకము లీయక దేశకాల పా
త్రంబు లెరింగియిచ్చిన పదార్థము వన్నియ కెక్కు ధాత్రి పై
నంబుధి నున్న శుక్తికము లందున జెందిన స్వాతి వాన ము
త్యంబులు గావె?ధన్యులకు హారములై వసింప భైరవా!
గొప్పలు మాని మూఢు లకు ధనము యివ్వకుండా దేశ,కాల,పాత్రత లెరిగి యిచ్చు
లోకములో వన్నెకెక్కును.ఎలా అయితే స్వాతి వాన ముత్యపుచిప్పలొ పడి ముత్యమై పండితుల మెడలో ముత్యాల హారములై మెరియునట్లువన్నెకెక్కును
సరసుని తారతమ్యము సాధు డెరుంగు గాని మూఢు డే
మెరుగును?రంభ గూడి సుఖియించుట జూడగ బాకశాసనుం
డెరుగునుగాని బానిసల నెప్పటికిన్ రమియించు చుండు వా
డెరుగునె దేవకాంత వలపించుట యించుక యైన భైరవా!
సరసుని సంగతి మంచి వాడికే తెలియును ,మూఢు నికేమి తెలియును?రంభను కూడి సుఖించుట సురకాంతను రంజింప జేయుట ఇంద్రుడికి తెలిసినట్లు మామూలు ఆడవాళ్లదగ్గరికి పోవు వాడికేమి తెలియును?
దానములేని సంపదలు ధాన్యము లేని గృహంబు,శిష్ట సం
తానము లేని వంశమును తాలిమి లేని జపంబు,నాత్మ వి
జ్ఞానము లేని విద్యయు బ్రసన్నత లేని నృపాలు సేవయున్
వానలు లేని సస్యములు,వన్నె కెక్కవు ధర్మనందనా!
దానము చెయ్యని ధనము,ధాన్యములు లేని గృహము,మంచి సంతానము లేని వంశము,ఓర్పు లేని జపము,ఆత్మజ్ఞానము లేని విద్య,ఎప్పుడూ చిర్రుబుర్రులాడే రాజు దగ్గర కొలువు,వానలు లేని పంటలు వన్నెకెక్కవు.
సారము లేని వంట సరసత నెరుంగని యీవి గొంట భూ
సారము లేని పంట పనిసల్పని బానిస యింట నీరు వి
స్తారము లేని కుంట పురుషార్థము లేని ధనంబు లుంట యోం
కారము లేని గంట కొరగావు ద్వారక వేంకటేశ్వరా!
రుచిలేని వంట,సరసత తెలియని వాడిదగ్గర దానము తీసికొనుట,భూమిలో సారము లేని పంట,పనిచేయని సేవకుడు,దండిగా నీళ్ళు లేని చెరువు,దానము చేయని ధనము ఓంకారము లేని గంట పనికి రావు.
అక్షరాన్ని నేనక్షరాన్ని శబ్దం నా లక్షణం
పదే పదే ప్రయోగిస్తే భావం న లక్ష్యం
నా లక్ష్యంతోనే లక్ష్యాన్ని సాధించే మధుర క్షణాన్ని
లక్ష్యం నుండే నా జననం
లక్ష్యం లోకే నా పయనం
అక్షరాన్ని నేనక్షరాన్ని
విడిగా చూస్తె నా జీవితం అరక్షణం
నిఘంటువులో నా లోతు అహోబిలం
నా పరిధి శతసహస్ర జ్యోతిర్వర్షం
శ బ్దార్థ సర్వస్వమూనా సాక్షాత్కారం
అరుణ కిరణపు తీక్షణాన్ని ధైర్య వంతుల లక్షణాన్ని
క్షరాన్ని కాదు నేనక్షరాన్ని క్షయాన్నికాదు నేనక్షయాన్ని .(రచన యశస్వి )
0
కరిఁ దిగుచు మకరి సరసికిఁ
గరి దరికిని మకరిఁ దిగుచు గరకరి బెరయన్
గరికి మకరి మకరికిఁ గరి
భర మనుచును నతల కుతల భటు లరుదు పడన్.
భావము:- మొసలి ఏనుగును మడుగులోకి లాగింది. ఏనుగు మొసలిని గట్టు పైకి ఈడ్చింది. రెండు ద్వేషం పట్టుదలలు పెంచుకొన్నాయి. “మొసలిని ఏనుగు తట్టుకోలేదు, ఏనుగుని మొసలి తట్టుకోలేదు” అనుకుంటు పాతాళ, భూ లోకాల శూరులూ ఆశ్చర్య పోయారు.
ఆశ కోసివేసి యనలంబు చల్లార్చి
గోచి బిగియగట్టి గుట్టు దెలిసి
నిలిచినట్టి వాడె నెఱయోగి యె౦దైన
విశ్వదాభిరామ వినురవేమ
తా:-- ఆశను కోసి అగ్నిని చల్లార్చి తన గోచి బిగియగట్టి, ఈ జన్మ లక్షణములను తెలిసికొని నిలిచినవాడే యతీశ్వరుడు, వాడినే యోగి యందురు.
అడవి పక్షుల కెవ్వడాహారమిచ్చెను ? మృగజాతి కెవ్వడు మేత బెట్టె?
వనచరాదులకు భోజన మెవ్వడిప్పించె? జెట్లకెవ్వడు నీళ్లు జేది పోసె?
స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు పెంచె? ఫణుల కెవ్వడు పోసె పరగ పాలు?
మధుపాళి కెవ్వడు మకరంద మొనరించెఁ? బసుల కెవ్వడొస౦గె బచ్చి పూరి?
జీవకోట్లను బోషింప నీవెగాని
వేరెయొక్క దాత లేడయ్య వెదకి జూడ
భూషణ వికాస! శ్రీ ధర్మపురి నివాస!
దుష్టసంహార ! నరసింహ! దురితదూర!
తా:- అడవిలోనున్న పక్షులకు ఆహార మెవ్వడిచ్చినాడు?మృగములకు యెవ్వడు మేత
ఏర్పాటు చేసినాడు?అడవిలోని జంతువులకు ఆహారము ఎవ్వడిపించినాడు?
అడవిలోని చెట్లకు నీళ్ళెవరు పోసినారు? స్త్రీల గర్భములోని శిశువు నెవరు పెంచారు?
పాముల కెవడు పాలు పోసినాడు? తుమ్మెదలు మకరంద మెవ్వరు ఏర్పాటు చేసినారు?
పశువులకు ఎవడు గడ్డి నేర్పాటు చేసినారు? జీవకోటులను నీవుగాక పోషిస్తారు?
వేరె దాత ఎవ్వడూ లేడు నరసింహా!
వెలయాలు శిశువ ల్లుడు
నిలయేలిక యాచకుండు నేగురు ధరలో
గలిమియు లేమియు దలపరు
కలియుగమునం గీర్తికామ! కాటయవేమా!
అతిథి ర్బాలక శ్చైవ స్త్రీ జనో నృపతి స్తధా
ఏతే విత్తం న జానంతే జామాతా చైవ పంచమః
అర్థము:--అతిథి, పిల్లలు స్త్రీలు, ప్రభువు (రాజుపన్నులు విధిస్తాడు) వీరంతా గృహస్తు దగ్గర తగిన ధనం ఉందా లేదా అని ఆలోచించరట. కోరికలు తీర్చమని
అడుగు తుంటారట. వీరిలో అల్లుడు ఐదవ వాడుగా చెప్పబడినాడు. ఇది ఎప్పుడో మనువు చెప్పినది. అయినా అందరూ అలా ఉంటారని కాదు. లోక రీతి ఇలా వుంటుందని, "జామాతా దశమ గ్రహః" అనే నానుడి కూడా వుంది కదా!
🌺 మంచి పద్యం.🌺🌺
***********
"కాలము గడిచిన మగుడదు
కాలము కంటెను ధనంబుగలుగదు ధాత్రిన్
కాలమమూల్య పదార్థము
కాలము గడుపకుము వ్యర్థగతిని కుమారా!
🌹🌹🌹 భావం.🌹🌹🌹🌹
"టైములేదు" అని మనం ఎంతో కాలాన్ని వ్యర్థం చేస్తూ వుంటాం. బద్ధకం, సోమరితనం కప్పి పుచ్చుకుంటాం. ఇది మంచి పద్ధతి కాదని అయ్యనకోట పార్థసారధి చెప్పిన పద్యం ఇది".
(1)గడిచిన క్షణం తిరిగి రమ్మంటే రాదు.
(2)నిజం ఆలోచిస్తే కాలాన్ని మించిన ధనం లేదు.
(3)కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే సంపద లభిస్తుంది.
(4)కాలం విలువను మనం కొలువలేము.
(5)కాబట్టి కాలం విలువ తెలుసుకొని ప్రవర్తించకపోతే జీవితం వ్యర్ధమవుతుంది సాధించ వలసింది సాధించలేము.
(6)కాబట్టి కాలం విలువ తెలుసుకొని మెలుగుదాం.
0
వడిఁ దప్పించి కరీంద్రుఁడు
నిడుదకరం బెత్తి వ్రేయ నీరాటంబుం
బొడ వడఁగినట్లు జలములఁ
బడి కడువడిఁ బట్టెఁ బూర్వపదయుగళంబున్।
భావము:- గజేంద్రుడు మొసలి పట్టునుండి తప్పించుకొన్నాడు। తన పొడవైన తొండాన్ని ఎత్తి కొట్టాడు। ఆ దెబ్బకి మొసలి బలం పోయినట్లు నీళ్ళలో పడిపోయింది। అతి వేగంగా అది గజరాజు ముందరి కాళ్ళు పట్టుకొంది।
కంచెర్ల గోపన్న (రామదాసు)తానీషా చెర లోనున్నపుడు ఎన్ని విన్నపాలు చేసినా రాముడు వినడము లేదని దాశరథీ శతకం రాశాడు। అందులోదే ఈ పద్యం।
డాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు నీ
దాసుని దాసుడా గుహుడు తావక దాస్యమొసంగి నావు నే
జేసినా పాపమో వినుతి జేసిన గావవు కావుమయ్య నీ
దాసులలోన నేనొకడ దాశరథీ కరుణాపయోనిధీ!
అర్థము:-- శబరి నీకేమైనా దగ్గరి చుట్టమా?తనను దయతో కాచినావు। గుహుడేమైనా నీ దాసుని దాసుడా?అతడికి నీ సేవాభాగ్యము యిచ్చినావు। నేను జేసిన పాప మెమో గాని యెంత ప్రార్థించినానన్ను రక్షించుట లేదు। కరుణా సముద్రుడివైన రామా నేను నీ దాసులలో నొకడను,రక్షించు తండ్రీ నొకడను,రక్షించు తండ్రీ!
విష బీజం భువిన్యస్య కథం స్వాదు ఫలం లభేత్?
బీజం రుహ్యా త్తధా పుష్పే త్ఫలే దిత్యవాద చ్చ్రుతి:
అర్థము: విష బీజములు భూమిలో నాటి మధురమగు ఫలములు కావలెనన్న యెట్లు దొరుకును?మనుష్యుడు పాప మను బీజములు నాటి (అంటే పాపకర్మలు చేసి) పుణ్యము,మోక్షము ఆశించిన యెట్లు లభించును?ఎటువంటి విత్తనము నాటితే అటువంటి ఫలములే లభించును।
చంద్రోయ ధైకొ బహు వచ్చకోరా:
సూర్యోయ దైకో భహవో ద్రుశస్య:
శ్రీకృష్ణ చంద్రో భగవాం స్తదైవ
భక్తా భగిన్యొ భహవో వయంచ!
అర్థము:--- చంద్రుడు ఒక్కడే అయినప్పటికీ చకోర పక్షులు అనేకములైనట్లు, సూర్యుడు ఒక్కడే అయినప్పటికీ ఆయన్ను దర్శించే నేత్రాలు అనేకము లైనట్లు,కృష్ణ భగవానుడు ఒక్కడే అయినా ఆయన్ను ఆరాధించే భక్తులు అనేకులు కదా!
ఉపాధ్యాయాన్ దశా చార్యః ఆచార్యాణం శతం పితా
సహస్రంతు పితుర్మాతా గౌరవేణా తిరిచ్యతి
అర్థము:--- పది మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు అధికుదు।।నూరు మంది ఆచార్యుల కంటే ఒక తండ్రి అధికుదు। నూరు మంది తండ్రుల కంటే ఒక తల్లి గౌరవము అధికమని చెప్పబడినది।
తనుజులనుం గురు వృద్దుల
జననీజనకులను సాధుజనుల నెవ్వడు దా
ఘనుడయ్యు బ్రోవడో యా
జనుడే జీవన్మృతుడు జగతి కుమారా!
అర్థము:-- ఓ! కుమారా తన కుమారులను,గురువులను,పెద్దవారిని,తల్లిదండ్రులను,సజ్జనులైన వారిని తగిన
సమయమున రక్షింపడో అతడు బతికి యున్నను చచ్చిన వానితో సమానము।
।ధనపతి సఖుడైయుండియు
నెనయంగా శివుడు భిక్ష మెత్తగ వలసెన్
తనవారి కెంత గలిగిన
తన భాగ్యమె తనకు గాగ తధ్యము సుమతీ
అర్థము:ధనపతి అయిన కుబేరుడు స్నేహితుడు అయి నప్పటికీ శివుడు భిక్ష మెత్తవలసి వచ్చెను గదా ! అట్లే తనవారు ఎంత ధనవంతులైనా
తన అదృష్టమే తనకు లభించును। (ఎవరి అదృష్టము వారిదని భావము)
జంతువులకి,పక్షులకి,చెట్లకీ వీటికి దేవుడు లే।డు। అవేమీ దేవుడి కోసం తపించ
లేదు।హాయిగా ప్రశాంతంగా జీవిస్తున్నాయి।మనిషికి లాగా వాటికి ఆశ,దురాశలు లేవు।పులుల్లో(అన్ని జంతువులలో,పక్షులలో ) ఆడపులి,మగ పులే వుంటాయి,తప్ప ముస్లిం పులి,క్రిస్టియన్ పులి వుండవు।బహుశా అవి మనిషిని చూసి నవ్వుకుంటూఉంటాయేమో! మనుషులు మాత్రమే మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప,మా మతం గొప్పది అని వీటన్నిటి కోసం కొట్లాడుకుంటూ,చంపుకుంటూ వుంటారు।
దేహమున్న వరకు మోహసాగరమందు మునుగుచుందురు సుధా మూఢజనులు
సలలితైశ్వర్యముల్ శాశ్వతంబనుకొని షద్భ్రమలను మానజాలరెవరు
సర్వకాలము మాయ సంసారబద్ధులై గురుని కారుణ్యంబు గోరుకొనరు
జ్ఞానభక్తి విరక్తులైన పెద్దలజూచి నింద జేయక తాము నిలవలేరు
మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్ల
నిన్ను గనలేరు మొదటికే నీరజాక్ష
భూషణ వికాస!శ్రీధర్మపురి నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
భావము:-- నరసింహా! బొత్తిగా తెలియనివారు దేహమున్నంత వరకు మోహమును సముద్రమున మునుగుచుందురు। బాగుగా నున్న సంపదలు శాశ్వతమనుకొని కామ,క్రోధ,లోభ,మోహ,మద, మాత్సర్యములు వదలలేరు।ఎల్లప్పుడూ మాయతోగూడిన
సంసారమందు గట్టుబడినవారై గురువు యొక్క దయను గమనించరు।జ్ఞానులు, భక్తులు, కోరికలు లేనివారు యైన పెద్దలను జూచి దూషింపక నిలవలేరు।ఈ దుర్మార్గులు నిన్ను చూడలేరు।
కొఱగాని కొడుకు పుట్టిన
కొఱగామియె కాదు తండ్రి గుణముల జెఱచున్
జెఱకు తుద వెన్ను బట్టిన
జెఱకున తీపెల్ల జెఱచు సిద్ధము సుమతీ!
తా:---చెరకుగడ చివరన వెన్ను పుట్టిన యెడల ఆ చెరకుగడలోని తీపిని చెరచినట్లు
అప్రయోజకుడైన కొడుకు పుట్టిన, ఆ వంశమునకు ఉపకారికాకపోయిననూ, తండ్రి మంచి గుణములను చెరచి యపకీర్తి తెచ్చును।
కులము గలుగువాడు గోత్రంబు గలవాడు
విద్యచేత విఱ్ఱవీగువాడు
పసిడి గలుగు వాని బానిసకొడుకులు
విశ్వదాభిరామ వినురవేమ
తా:-- ఎంతటి కులీనుడైనా మంచి గోత్రములో పుట్టినవాడైనా విద్యచేత విఱ్ఱవీగువాడు
ధనికుల యొక్క బానిసలై చెడిపోతారు।
దర్మార్థ కామ మోక్షాణాం ప్రాణా స్సంస్థితి హేతవః
తాన్నిఘ్నతా కిమ్ న హతం రక్షతాం కిమ్ న రక్షితః
ధర్మార్థ కామ మోక్షములనే నాలుగు పురుషార్థములకును ప్రాణములే సంస్థిత హేతువు లగుచున్నాయి। అట్టి ప్రాణములను పోగొట్టుకొనిన వాడు, సర్వమునూ పోగొట్టుకొన్నవాడవుచున్నాడు। వాటిని రక్షించుకుంటే సర్వమూ రక్షించుకొన్నవాడే
అవుచున్నాడు।।।।
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి