ఎంత మాత్రమ్మే ఎవ్వరు తలచినా శక్తి నిచ్చు టయే
అంత మాత్రమ్మే అశలు తీర్చినా యుక్తి పెంచుటయే
సొంత మన్నాదే శాంతి నివ్వాదే రక్తి పెంచుటయే
వింత భావ మ్మే విశ్వ మందేనులె ఏల ఆంజనేయ....12
కర్మ సిద్ధాంతం కాలనిర్ణయమ్ము కదలేప్రాణికె
కర్మతో ఆగే కళల సాధ్యమ్మే కలసె బతుకు లీల
కర్మ అంటకయే కలలు తీర్చుటయే ఆత్మ సాధనయే
కర్మ భుక్తి ముక్తి కాల శక్తి యుక్తి తెల్పు ఆంజనేయ.....13
జీవితం పరిణత జీవ పోరాటం బట్టి యుండు చుండు
జీవ పరమానవు చింత చేరు చుండి సేతు సముద్రమ్మే
జీవ లక్ష్యమ్మే జపము జరుగుచునే జాతి భావ ముంచె
జీవ వైవిధ్య మె జాతి కేమి సబబు తెల్పు ఆంజనేయ....14
మరక మట్టి లోన మేను లోన లేదు మనసు లోన వుంది
తరక లాగ కదలి తారుమారు అగుట సహజ మల్లు చుండు
గురక నిద్ర లోన గాలి లాగ వచ్చు గళము కాదు అదియు
అరక పట్టి దున్నె ఆశ ఆరోగ్యము తెల్పు ఆంజనేయ.....15
వీలయి నంతయే వేదన చెందకయె మనిషి లోక మందు
మేలు సంఘర్షణ పుడమి ఆకర్షణ జరుగు లోక మిదియు
గాలి లాగచేరి గళము విప్పి తెలుపు జగతి నందు నీతి
జాలి జీవితమే చేరు వయ్యెజతకు తెల్పు ఆంజనేయ...16
అక్షర సత్యమై ఆదుకొను లోకం ఉంది మనకు తోడు
అక్షరాలు బోని ఆశ పెంచి ఏలు అలుక తీర్చు కొలువు
అక్షరుడుగ మనసు అభిమతం తెలుపే జీవ సాంస్కృతిక యె
కక్ష సాధింపులు కలలు లేని జగతి నుంచు ఆంజనేయ..17
నిత్య చైతన్యము నన్ను కబలిస్తుంది దివ్య వెలుగు లాగ
సత్య ధర్మాలను సూత్ర మగుటయేను సర్వ రక్షణగా
తత్వ భావములే తురుము తమస్సునే నురగ లాగ కలుగు
మత్తు పెర్గేనులె మదినలిగేను లే విధియె ఆంజనేయ..18
స్థూల శరీరమే శాంతి పవిత్రమై పాప రహిత కొలుపు
మూల పాపముయే పుడమి నందు పెరిగి గాఢ నిద్ర పెరుగు
తెల్ల వారుజాము తేట తల్ల మగును బ్రహ్మ ముహూర్తమగు
యెల్లఁ సుఖము నిచ్చు యదలొ హాయి గొలుపు నిత్య ఆంజనేయ.19
స్థూల శరీరమే సోమరితనమ్మే లేక బద్ధకమ్ము
కాల సన్నద్ధము ఉత్సవంగ మారు పనులలో శ్రద్దా
తాల లేక బతుకు దారి దొరక కుండు పెరుగు సన్నద్ధత
వేళ ఉత్సాహం వాద సన్నద్ధం తెల్పు ఆంజనేయ..20
జగతి లోన నిజము చేత కాని దగును, ధర్మ పధము లేదు
ప్రగతి జీవితమ్ము పాప మగుచు మారు, చెప్పఁ నలవి కాదు
సుగతి జూపుటమే సూత్ర మగును ఏల, మనిషి ఘనుడీశుడు
మూగ బతుకు మార్చి మమత పంచు, చెలిమి తెల్పు, ఆంజనేయ .21
లోకసేవకొరకు లోకులకు మేలుగ సర్వమును తెల్పే
భీక రమ్ముగాను భయము పెరుగుచుండి జనుల కష్ట మొచ్చె
స్వీక రించి చెప్పి సూత్ర ములను తెలిపి బుద్ధి వికసించే
ఐక్య మత్యముగా ఐక్య తపెంచుటే తెల్పు ఆంజనేయ..22
పెద్ద చిన్న కలసి ప్రీతి గొలుపు పలుకు మేలు కలుగునెపుడు
వద్దని చెప్పినా వాదన చేసియే నిజము తెల్ప గలిగె
విద్య నేర్చ గలిగి విధిని నమ్మి బతుకు సాగ గలిగి బుద్ధి
గద్దె నెక్కె గలగి గళము విప్పి చెప్పె పఠన ఆంజనేయ ...... 23
కరుణ రసము కొరకు కమ్మని రచన చేసి రామ గాధ తెలిపె
మరల శక్తి కొరకు మరువ లేని బతుకు యుక్తి రామ తెలపె
చెరకు కన్నతీపి చక్కనైన రామ నామ భజన మలుపె
అరుణ ఉదయ మల్లె ఆర్తిగా రామా అనే ఆంజనేయ . ...... 24
చెలిమి లోనవుంది చెలియ తలపు పిలుపు మనసు గెలుపు కొఱకు
కలిమి నిచ్చి నిలుపు కాల మాయ గెలిచి సహన మంతె చూపు
బలము నింపి నడుపు భాగ్య సీమ నంత శోభ నిచ్చె వెలుగు
కాలము వ్రాతలు కధలు తెల్పు చున్న నేను ఆంజనేయ ..... 25
భయము లన్ని తొలిగి బలము చేకూరియు భద్రత కలుగు టే
గేయ రామ నామము గానముగా పాడు గమ్యము తెల్పుటే
మాయ లెమియు చూపు మమత లందు నిలిపె మానవత్వముగా
చేయగల పనులే చేయు బతుకు నేర్పు భక్త ఆంజనేయ .... 26
మంచి చెడ్డ కలసి బెడ్డలతొ బియ్యము బ్రాంతి మనసు మార్చి
ఉచిత అనుచితమై ఊరు ఏకమవు ట సఖ్యత తెలుపు టే
యాచన ఫలితమే యోచన చక్రమై సర్వము రక్ష గా
మచ్చిక వల్లనే మహిమ చూపగలుగు మహిమ ఆంజనేయ .... 27
గుండె నిండ భక్తి కళలు మాకు నింపు చిత్త గించగలను
దండ మెట్టి చెప్పె కోరిక లన్నిటీ, తొందర గా తీర్చు
మొండె బతుకు లోను మనిషి పంతముండు, మాట నేర్పు బట్టి
అండగాఉంటా ఆశ తీర్చి శక్తి నిచ్చు ఆంజనేయ ...... .... . 28
అర్ధము అక్షరం అవ్వ నేర్పేనులె భావ పదాలుగా
పరువు చెప్పు కధలు కవిత కమ్మదనమె పూల సుగంధమై
తరువు లాగ చెలియ తరతమ భేధమే చూపని ప్రేమయె
భీరు చెందకయే భక్తి తోడు నీడ మనసె ఆంజనేయ ... .... 29
విశ్వ మందు కళల విద్య విజ్ఞానం విజయ మూల్యమవ్వు
దృశ్యకాలు వెనుక ధర్మ చరిత ముండు అర్ధ మంత తెలుపు
లాశ్యమాడు మనిషి లలిత మర్గాల్లో లోకము పాలించు
విశ్వ మాత కరుణ వినయ విధేయతలు తెల్పు ఆంజనేయ ... .30
పూనకమ్ము వోలె భక్తి పొంగి పొర్లు జ్ఞాన జిజ్ఞాసి గ
ఆన తిచ్చి మనిషి అడుగు వేయు చుండు అర్ధసత్యముగా
మాన మర్యాదలు మానవత్వమ్ము న నిలిపి చెలిమి పంచు
గాన మాధుర్యము కాల మాయలందు ఉండె ఆంజనేయ ... 31
కోరికలు తీరుట కోసివేయుటయే దేహం భాగమే
కోరుకున్న ఫలము కరిగి పోవు టగును జీవ సమయ ముందు
వారు చేసారని వారిమనసు వుండి ఆత్మ తృప్తి చెందు
వీరును తెల్పినా వారు అన్న జీవి మార్చు ఆంజనేయ.....32
బాధ్యత ఉందిలె భద్రత భారమై భాగ్యము నీడగా
సేద్యపు లక్ష్యము సకల రక్షణకే సమర సంతృప్తే
సాధ్యమైనంత యు సేవభావముగా నిత్య సత్య పలుకు
విద్య ఉద్యోగం ఉన్నవారి తృప్తి తీర్చు ఆంజనేయ.......33
5
దాఁచుకొనను నేను దండమునే చేయు పాదముల చెంతనె
దోచు కొను సర్వము తోడుగా ఉన్నా నీకు సేవకడ్ని
ఆచితూచి అడుగు అనకు దేహమ్మే నీది ఈజన్మకు
పూఁచి నీకీరితి పొదుపు మారదయ్యె అయ్య ఆంజనేయ ...34
వొక్క సంకీర్తన వొద్దికైమిమ్మును వేడు కొంటినిగా
తక్కినవి నామనసు దాఁచి వుంచి నిత్య వేడుకలు చేసితి
వొెక్కనీనామం వేలుసులభముగా ఫలము మధికముగా
దిక్కై నీవుగాను తెలియచేస్తున్నాను మ్రోక్కె ఆంజనేయ ..35
నా మనసు గర్వము నీ మహిమకొనియా డేను ఓప్పుకొనుము
నేమి స్వాతంత్ర్యము నిన్ను వేడు కొనుచు చెప్పినవాఁడఁ గను
నే మనబడేనులె నేరము లెంచకుము నామదితలపుయే
శ్రీమధవననునే రామభక్తుడున్ని దాస ఆంజనేయ....36
భగవతే మునాయ ఫల్గుణప్రియాయ ధర్మ తత్వాయే
పింగకేశాయా పుణ్యవీరాయే పుండరీకాక్షా
జగతి సూరాయే జగతి ఈశ్వరాయె జనుల భాగ్య దాయె
జాగృతి వీరాయె చతుర కపీంద్రాయె నమః ఆంజనేయ..37
వాయు పుత్ర రుద్ర వాక్య తెల్పు నేత్ర సర్వ రక్ష ధాత్రి
జయము తో అనఘాయ చరితతో అజరాయ గ్రామ వాసాయే
భయ జనాశ్రయాయ భద్ర వరదాయే భాగ్య సూరాయే
జయ సనాతనాయ జయమగు వాగ్మినే జయము ఆంజనేయ.38
రంగు రంగులలో రమ్యమైన రంగు తెలుపు నలుపు మలుపు
హంగు ఆర్భాటం హాస్య నట ప్రేమ రంగవల్లి రంగు
మెగ్గ అని తుంపకు పుడమి తల్లి భాధ పెట్టు టెందుకుయే
రంగరించి రాసి రంగు హోళిగాను జూడు ఆంజనేయ..30
దేహ పదార్థమే తల్లిదండ్రులతో ఏర్పడగలిగేను
మనసు పదార్థమే మనసమాజమ్మే దగ్గర నుండియే
బుద్ధి పదార్థమే మా గత జన్మలే జీవ వైవిధ్యం
ఆత్మ పదార్థమే సృష్టికర్త దారి తెల్పె ఆంజనేయ...40
అకట కష్టా లే కడలి పొంగు గాను కోర్కలు గుట్టునే
సకల ఆశలన్ని అడుగు లల్లె కదిలి ఏక్కి దిగవలెను లె
ఒకటి అనుకొంటే ఒకటి పొందుటయే లోక సహజముగా
చీకటి బతుకలో జాతి కి వెల్గునే పంచు ఆంజనేయ..41
పట్టు బట్టకట్టి పుడమి పాదమ్మే మ్రొక్కె భరత భూమి జనులు
చెట్టు నీడ చేరి వినయ భక్తితో ను కొద్ది నిద్ర చేసె
గుట్టు విప్పి చెప్పి గొంతు గొంతు కలిపి పాటలే పాడెను
ఒట్టుతో ప్రేమే ఒడిసిపట్టి మాట తెల్పె ఆంజనేయ..42
కడలినె కడవలో కాలమాయ చేరి ఉంచె బుధ్ధి ఇదియె
వడిలిన వయసైన వేడి ఆశ కుమ్మి బతుకు బుధ్ధి ఇదియె
మడిమ తిప్పి గొప్ప మేలు చేయగలిగి చేయ లేని బుధ్ధి
అడుగు తున్నా నే ఆటకాదు బుధ్ధి మార్చు ఆంజనేయ....43
స్మరహరడవేగా సఖ్యత చూపుమా మామదిలో ఉండి
జ్వరహరుడువేగా జాతి లోజ్వరాన్ని మాపవేమయ్యా
స్ధిరకరుడవేగా సకల చంచలాన్ని మార్చ వేమయ్యా
భరహర శరహరుడె పరవర శురవర హరహర ఆంజనేయ...44
ప్రాంజలి ప్రభ
సంకుచిత స్వార్ధం సంఘటిక శక్తులే చంపు నని అంటే
చీకు చింత లేని జాతి ధనము కొరకు యువత దృష్టి మార్చి
వికట అట్ట హాస వీధిన రాజ్యమై ఏలు అధికారము
డొక్కలు ఎండినా డప్పు కొట్టు వారు చూడు ఆంజనేయ .... ... 45
చీర గాజులతో చీడ పురుగు లాగ జనులను దోచినా
వారు వీరు కలసి వరుస కలిపి దొంగ లాగ దోచారులె
పేరు మార్చి ఊరుమార్చి దోచు గుణము పట్టు వారు లేరు
పరువు అని చుండే ప్రజల ధనము దోచె చూడు ఆంజనేయ ..46
నేను నుండి మనసు నటన భావ మేలు నిత్య ఆలోచన
మేను శుద్ధి కొఱకు మాయ వచ్చి చేరి మనసు పరశీలన యె
భాను కిరణ వెలుగు బాధ్యతను తెలిపే కార్య నిర్ణయమ్ము
మనములో ప్రేమే మనుగడ మార్గమే ప్రేమ ఆంజనేయ .... ... 47
సజ్జనులై మెలుగి సేవ గుణము కలిగి భక్తి భావ ముంచు
మజ్జిగ లో వెన్న ముద్ద తిరుగు నట్లు బుద్ధి మార్చ కుంచు
విజ్ఞత కలిగి యే వినయ ముంచి విద్య నేర్ప కలిగి వుంచు
యజ్ఞము లక్ష్యమూ యోగ విద్య నేర్పు ధ్యాన ఆంజనేయ ... .. 48
పాల లోన నీరు కాని రుచిని మార్చు బిడ్డ బతక నేర్పు
బాలసుఁడగు వాని పొందు వలదు ర జీవి బతుకు మార్చు
తాళ లేని వాని తపన చేయ బుద్ధి బావి లొ కప్పరా
మేళ తాళ భజన పడచు భార్య భక్తి చూడు ఆంజనేయ ... .. 49
నేను అనను ఎపుడు నాది అనేదేది లేదు భక్తి తప్ప
నేను సంకల్పము నాది వికల్పమే చేయ కర్మ తప్ప
నేను బుద్ధి శుద్ధి నాది విచక్షణా జ్ఞాన సేవ తప్ప
నేను చిత్త వృత్తి నాది వినయస్థితి యోగ ఆంజనేయ ... ... 50
నిర్గుణా శివాయ నిర్మల హృద్యా య నిర్వి కల్పాయే
ధర్మ రక్ష కాయ దాన ధర్మ చరిత నిర్వి కల్ప పురుష
సర్వ అర్ధ విపుల కార్య వర్ణ సిద్ధ సూక్ష్మ దైవ రూప
సూర్య శిష్య నిత్య సేవ ధర్మ మూర్తి నీవె ఆంజనేయ ... ... 51
కన్నుల రెప్పలే కాపలాదారు లు జగతి నంత చూడు
కన్నులు చూచేను కాల నిర్ణయమ్ము ప్రకృతి అందాలను
కన్న కలలు తీరు కళ్లు అలసి పోక అందమును జుర్రూ
కన్నులే మనసుకు కావడి కుండలే దృశ్య ఆంజనేయ ... ... 52
పెరుగుతున్న పాప మంత ఏల పోవు ధరణి యందు
విరుగుడు సేవలే వినయ పూర్వకమే భక్తి భావముంచె
జరుగు శుభకార్యం జాతి రక్ష గానె చేయు విధానమ్ము
కరిగి పోవు మనసు మాది సర్వ వేళ లందు ఆంజనేయ ... .. 53
మనసు కలత కలిగి మమత కల భాధగా బతుకు తెరువు మారె
తనువు తపన విరుపు తుదకు అతని కలే చినుకు చినుకు లాగె
మనము అను కొనుటే మానవత్వమే ను జీవసాహిత్యం
చినుకు లాగ కలిసి చలన మగును మనసు చూడు ఆంజనేయ ..54
పాప ఫలము లోన భాగముగొను భరత జనుల తీర్పు
చాప కింద నీరు జేరి కానరాదు గుణము తీరు మార్పు
ఓపలేని బతుకు ఓడిపో వలెనే కలిసి బతుకు నేర్పు
చూపును ప్రేమే చెప్ప నలివికాదు చెలిమి ఆంజనేయ ... ... 55
0
ఓం శ్రీ రామ శ్రీ మాత్రే నమః
సుఖపడ దలఁచి యే, సర్వము అర్పించే, మానవత్వమ్మే
మక్కువ సత్కర్మ మానమర్యాదలు, శాంతి తత్త్వమ్మే
చుక్కల వెలుగులే చిక్క నీయకుండె, ధర్మతత్వమ్మే
మ్రొక్కు కొను భక్తీ, శక్తి నియ్య వయ్య ధర్మ ఆంజనేయ ....56
తత్వ విచారం తొ ధర్మ బుద్ధితోను, వికసితమగు చుండు
తత్వ బుద్దులతో దు:ఖ ము రాకుండ, బద్దుడైన జీవి
తత్వమే జగతిలొ దారి జూప గలదు ,నిర్మల బుద్ధిగా
తత్వము విపత్తునె రాక ఆపు చుండు, రామ ఆంజనేయ 57
ఏది యుక్తమైన ఏది అయుక్తమై తెలుపుటలో గొప్ప
ఏది అర్ధముయో ఏది వాంఛితార్థ, తెల్పి లేక ఉన్న
ఏది మహోత్తరము ఏది స0సారము, ఏది సాగరమో
ఏది యోగమాయ ఏది మోక్షమిచ్చు, భక్త ఆంజనేయ ..58
నీటికి నిప్పు కే నటన తెలియని స్థితి, శిశివు తెలియని దశ
ఏటికి మనసులో ఏర్పాటే సమయం, తెలుసు కొను బా ల్యం
మేటి యవ్వనమే వయసు మంచి చెడుల, నడక జీవితమే
నేటి వార్ధక్యం నడకలు ప్రశ్న గ, సాధు ఆంజనేయ.....59
దేవుడే దిగియే ధైర్యము అందించి, ఆశలను తీర్చే
దేవుని సేవలో దానము ఇచ్చినా, జనులు సంతసమ్ము
దైవ కర్మ యనుచు ధర్మమును వదలక, యుక్తి తెల్పు చుండు
దైవ మాయ ఇదియు దయను చూప దళిచె, భక్త ఆంజనేయ 60
పొరల తెర ఆగదు, పోరు వల్ల బాధలు, ఆగని కెరటాలు
తిరుగు ఊహలేలు, దూరములు మారవు, వెంబడించు గుణము
మాఱుపల్కులలో మమత కాన రాదు, మహిమ అసలు కాదు
చేర్చు గమ్యాన్నీ చావ వున్నవరకు, భక్త ఆంజనేయ .....61
మనిషి ఆలోచన మనసు బీజాలతొ కర్మ మోలకెత్తు
మనిషి కర్మ వల్ల మమత అలవాటును, ఫలము పొందగలిగె
మనిషి భవిషత్తే మనుగడ శీలమై, సుఖము కష్ట మయ్యె
మనిషి నరకంలో మనసు న స్వర్గం, ఏల ఆంజనేయ.....62
సద్గుణాలు వల్ల చల్ల నైన పలుకు, మనసు శాంతి గొలుపు
దుర్గుణాలు వల్ల దూర మంత పెరుగు,సహజ ధనము కరుగు
మార్గ మేదైనను మనసు పంచు గుణము, ధరణియందు శుభము
స్వర్గమే ప్రేమ మనిషి ఆరోగ్యం, ఇవ్వు ఆంజనేయ.......63
మాయ మయ్యె మనసు, మంద బుద్ధి వలన విశ్వమున చీకటి
కాయ మున్న ఫలము కళలు లాగ కదులు, చేదు తీపి పొందు
చేయ కల్గు పనులు చింత వళ్ళ ఆగు, కధయు మళ్ళి మొదలు
మోయ లేని బతుకు పుడమికి భారమే, భక్త ఆంజనేయ .64
మాటతొ ఎడారిని మంచి వనము మార్చి, మనుగడ చూపమా
ఆటతొ సోమరినె యదను మార్చి ,ధైర్య వంతునిగ చేయుము
వేట ఏల నీకు వేడుకలు జరిగే, శిష్ట శిక్షణ గా
తోటలోని వాడ కోరికను తీర్చే, ఘణపు ఆంజనేయ...65
సర్వ రోగహరా సర్వ పాప హరా, నిన్ను నమ్మితి రా
సర్వశక్తి ఇమ్ము సర్వ భక్తి యిమ్ము ,రామదూత వుగా
కార్య సిద్ధి కొరకు కర్మ చేయు వరుకు, కరుణజూపు మయ్య
రామ సుగ్రీవుని, సీత, సంధాత్రే, భక్త ఆంజనేయ........66
ఓం శ్రీరామ ... శ్రీ మాత్రే నమ:
కాల మెప్పుడు నా కర్మ పట్టి లేదు కరకర ల చక్రం
గోల యేల నాకు గతము మరచి నాను కనుల కన్నీరే
వేళ ఐనది నాకు వెన్నెల కవిత్వం చెప్పు హాయిగుంది
సుమధురపరిమళం సుఖపు కలయికగా మెచ్చు ఆంజనేయ ..67
స్వార్ధము వదిలేసి సకల సంతోషం కొరకు సేవ చేసి
సర్వలకు ప్రేమ సహజ సంపదలే అందచేయ దలచి
పరమ పధానికే పాటు పడే బుద్ధి సహన సహకార మది
పేరు నాకు వలదు కరుణ చూపు గుణము ఉంచు ఆంజనేయ ..68
అందరికి, అక్షర ఆశ్రయ మిచ్చియు, సంపద నందించి
అందరి మేలు గా అర్చన పూజలే, మమత మందారం
అందరిలో శక్తి, అద్భుత బుద్ధిగా, మార్చు లక్ష్యముగా
అందని పల్లకీ, మోస్తు బతుకు బండి ఉంది, రక్ష ఆంజనేయ..69
శ్రీ రఘరాము డే శ్రీ కరుణాకరుడు శృతజన పోషకడు
శ్రీ మధు సూధనే శ్రీ మతి ప్రియుడే యుక్తి శక్తి పరుడు
శ్రీ కపిశ్రేష్టాయ శ్రీ రమావల్లభ వేడు కొను చుంటిని
శ్రీ నృపేంద్రుడుగా రామ నామమే ను రక్ష ఆంజనేయ... 70
మనసు తో కలుస్తా మంత్ర మల్లె వుండి జగతి తీర్పు కొరకు
మనసు ఊహలలో మనుగడే ఊపిరి ఇచ్చి ఓర్పు చూపి
మనసు విప్పారిన మన్నన కన్నులే చిత్ర మాయ నేర్పు
జ్ఞాన సముపార్జన జ్ణాపకపు కళ జ్యోతి ఆంజనేయ ..... ....71
నాకు సుఖదుఃఖము నీడ లాగ వుండి నన్ను మార్చేందుకు
నన్ను పాపమ్మే నగ్న సత్య మ్మై నిద్ర పోనియ్యదు
నాలొ లాభంతో నష్ట నాట్యంతో వేదన సహజమే
నాలొ ధైర్యమ్మే నీదు కర్తవ్యం తెలుపు ఆంజనేయ ..... ... 72
వెన్న ముద్ద తినెడి వెన్ను చూపనట్టి వెన్నెల మనిషిగా
వేకువజామున వేద పఠన చేసి తిన్న బుధ్ధి తెలిపె
కన్నవారి లోని కమ్మ దనము తెలిసి సేవ చేయు చుండి
మన్ను తిన్న పాము మత్తు ఉన్న మనిషి మార్చు ఆంజనేయ .73
మార్పు గమ్యంగా మనసు లక్ష్యంగా చెలిమి బంధంవలె
ఓర్పు జయమ్మే గ వేద పరంగాను ధర్మ చరిత మగుటె
నేర్పు విజయమ్మే నేటి విద్య వలన తృప్తి కల్గించుటె
తీర్పు మాత్రమ్మే తేజరిల్లె గుణము తెల్పు ఆంజనేయ.... ... 74
నేను ముందు కదిలె, నటన కాదు ఇదియు శబ్ధ తరంగమై
నా అడుగలన్నీ నియమ నిబంధనలు కెరటము పరుగు వలె
నా కళ పుస్తకం నన్ను నడిపించే హృదయ ధర్మాలగు
నిన్ను నేను నమ్మి శరణముగానె కోరె ఆంజనేయ .... .... 75
నిప్పుల యెడారికి, నీటి చుక్క ఆశ ఆవిరి తో నీడ
ఉప్పు వేయు రుచికి ఉడుకు కూర ఆశ ఉనికి కోల్పోవుటె
తప్పుచే ఊపిరి తారు మారగుటే ఆశ ధనము వుంటె
ఒప్పు తనంతోను గరిక మోక్క ఆశ ఓర్పు ఆంజనేయ .... ... 76
ఉన్న లేకు న్నా, ఊరు మంచి కోరి, ఉదయ కిరణ మల్లె
అన్ని సుద్ద న్నా, ఆశ మరవ కున్న, అదరము చూపేను
ఎన్ని వద్ద న్నా, ఎదను పంచు చున్న, జీవితం సున్నా
తిన్న తినకున్నా, దయయె చాలన్న అన్న ఆంజనేయ ... ... 77
2 Com
ఓం శ్రీ రామ ... ఓం శ్రీ మాత్రే నమ:.
జీవిత ధర్మమే, జీతభత్యాలు గ, సర్వ రక్షణగా
జీవ వైవిధ్యం, జయము నిర్ణయమే, ధర్మ మార్గంగా
జీవ శాస్త్రముగా, జనన మరణాలులె, శివుని ఆజ్ఞలుగా
జీవ సాహిత్యం, హృదయ వాంఛ లేల, తెల్పు ఆంజనేయ......78
గడచి పోవు కలల, కాల పరిమితి యే, తొలగు జక్కగాను
అడుగు లన్ని కళల, ఆట మల్లె సాగి, నియమ సరళి గాను
గొడుగు లాగ ఉండి, గతులు తీర్చు విధము, సేవ పదము గాను
అడుగ లేని మనసు, వయసు బాధ వల్ల, ధీర ఆంజనేయ..79
ఉప్పెనలో మనిషి ఉబికి వచ్చె భయము తోనుయె జీవితం
తప్పుల తడకగా తరతమ భేధమే ఓటమి జీవితం
నిప్పు ఎగసిపడే నిజము దేవుడెరుగు జాతక జీవితం
ఒప్పు కొన్న బతుకు ఒరిగి పోవకుండ చూడు ఆంజనేయ..80
వదిలె ధనేషణమె వైరము వదిలించె విషయ సేకరణే
వదిలె దారేషణ వింత అనుభవమే జీవ వైవిధ్యం
వదిలె పుత్రేషణ వినయ విధేయతలు ధార్మికత భావం
వదిలె ఆహార్యం వదిలె ఆరోగ్యం మాయె ఆంజనేయ..82
చేరు కున్నానులె చరణముల సేవలె వదలలేను నిన్ను
మారు పల్కు లేల మనసు పంచ గలను మాయ కమ్మి ఉన్న
రారు ఎవరెవరు ను రంగుల వల ఇదే మంచులా కరిగే
కోరలేను ఏమి మూగ మనసు నాది భక్త ఆంజనేయ...83
ప్రేమయే నిజమ్ము పేదకు పెన్నిధీ బ్రతుకులో ధనమ్ము
ప్రేమయే విపంచి మానస ప్రీతిగఁ బలుకును వెతలలో
ప్రేమయే సరస్సు విరిసెడు తామరే నింకని పూలతో
ప్రేమయే తపస్సు విరహము వెలుంగే చూడు ఆంజనేయ.....84
ప్రేమయే జ్వాల లు పేరునీరుకారు పెదవి చినుకులుగా
ప్రేమయే సహనము పెనువేయు నీడ కళలలో చీకటి
ప్రేమయే విరహం మదిలొ పులకరింత మహిమ లాగా కరుగు
ప్రేమయే సరసం మేహము తో కలయు భక్త ఆంజనేయ ...... 85
మనసు వేదాంతం మనసు ఏకాంతం మానవుని తత్త్వం
మనసు రాద్ధాంతం మనసు గర్జనలే మానవుని వైనం
తనువు శిద్ధాంతం తనువు అంగాంగం ప్రేమ దాసోహం
అణువు పరమాణువు ఆరనిమంటలే కదా ఆంజనేయ .....86
మనిషి సంపాదన మనుగడ చుట్టూను కమ్ముకుంటుందిలె
మనిషికి దానమ్ము మోక్ష సుఖ యాత్రకు దివ్య ఔషధమ్ము
మనిషిని ప్రేమతొ మాయ బలముతోను చెలిమి తోను పొందు
మనిషికి మమతలతొ మనసు వేధించును కదా ఆంజనేయ ...87
మనిషి పలకరింపు పులకరింతలగును అవును ఆహ్వానం
మనిషి కరచాలన కల్లమెరుపులేలు నిత్య ఆనందం
మనిషి గ ప్రపంచం మనుగడ కు మార్గం మానవుని తత్వం
మనసున ప్రేమలు మారని కొలువులే అగును ఆంజనేయ ....88
0 Com
ఓం శ్రీ రామ .. శ్రీ మాత్రే నమ:
సహన వాసమ్ముయె సౌమ్య సాంగత్యము చక్కటి పూరణం
స్నేహ బంధాల లె సమయ నిర్ణయం విశ్వ విదితమ్మే
దేహ నిర్మాణం దాహతత్వమ్మే దారి వైవిధ్యం
అహము ఆహారము ఆత్రృత పెరిగేను భక్త ఆంజనేయ....89
గతము వర్తమాన గమ్యము తెలుసుకొని జీవ భవిష్యత్తు
గీత చైతన్య మె గురువు శుద్ధ సిధ్ధి విషయ వాంఛలు గా
మాతృ సంస్థ అయిన మనసు మాట లన్ని సహజ సిద్ధమైన
నీతులెన్ని ఉన్న నిజము తెల్పు చున్న భక్త ఆంజనేయ....90
చూడు ఏదైనా చూచి పట్టుకొమ్ము వినియు ఆచరించు
చూడు లక్షణమ్ము చూడు లక్ష్యము నే జ్ణానమార్గముగా
చూడుము స్వరూప చూడు విశ్వ భావ శక్తి ఆనందం
చూడు విచారణను చూడు నిశ్శబ్ధం భక్త ఆంజనేయ....91
నాదమే యోగికి వేదమే పఠనము శబ్ద మాహారం!
ఆది యేధ్యానం ఆదరం యోగి శ్వాస ఆహరం!
సాధు విషయ ఆత్మ సహనము యోగి ఆనంద ఆహారం!
విద్య వినయ వాది విషయ సేకరణే ఇదియు ఆంజనేయ...92
పాప విముక్తికై పనిలొ నిజాయితీ సర్వ ధర్మముగను
ఓపలేని బతుకు ఒడిసి పట్టు కుండ ఓడి పోవుటయే
శాప మేదైనను సహన మాయుధమే సుఖము కొరుకు తెల్పు
ధూపదీపముంచి దూరము గా లేక ఉన్న ఆంజనేయ ...93
జీవితం లోపల జీవితం వెలుపల సమము అని తెలుసుకో
భావ పరంపరలు భయము వెంటాడిన బాధ్యత మారదే
ఎవని అలవాటున ఏర్పడు ఘటనలే ఎంతయినా మార్చు
అవని భారములే మానుషజన్మ లో భక్త ఆంజనేయ ....94
ఎవరు లాభపడును ఎవరికీ నష్టం ఎవరికీ తెలియదు
ఎవరు ఎవరి ఋణము ఎందు వళ్ళ భయము ఏది తెల్పలేరు
ఎవరి వాద నేది ఎవరి సొత్తు కాదు ఎంతవరకు కాదు
ఎవరిలో ప్రేమ ఎంతవరకుండును రామ ఆంజనేయ ....95
చినుకుల సవ్వడే చలనము వేగమే వినయముగానులే
వినిన నయ్యదీను వదన విహారమ్ము వివరము లొద్దులే
స్వనములు చిటపట సరళము లగుటయే జలము కళలు కదిలె
కనుగువకొక తెరలు కనులముందుననే భక్త ఆంజనేయ ... 96
కారుడు నీటిలో కళలు తీర్చు జలము, నిగ్రహించు బతుకు
కోరిక చిన్నదే కారణములేనని నీడకలయక కే
నిరతము కొలుచుటే నియమ మందుననే వరుణ దేవనిన్ను
సారస నేత్రుడా సాధనచూడుమా భక్త ఆంజనేయ ....97
వానల వరదలే వరము చాలులే వలయ విధములేల
హానిగా ప్రకృతియు హరులు నరులు గిరులు సర్వము హరించు
ప్రాణము పోవునే భరించ లేనురా ప్రళయము ఆపురా
ధీనులు చూడరా తరుణమిదేనురా భక్త ఆంజనేయ ...98
దివ్య పానీయం దినదినవృద్ధిగా జరుప గలవు నీవు
భవ్య వెలుగులన్ని భాగ్య సీమలోన చిందులగుటేలే
కావ్య జగతి వెలుగు కర్మ సిద్ధాంతం కళల వృద్ధి జరుగు
నవ్య భావాలే నరుల ఆశయాలు భక్త ఆంజనేయ .... .. 99
0
ఓం శ్రీ రామ
రిప్లయితొలగించండి