శ్రీ మూక పంచశతి .. ఆర్యశతకము - మధురిమల పధ్యములుగా వ్రాయటం జరిగింది " కామక్షి అమ్మవారిని "ఆరాధిస్తే సమస్త రోగాలు నిర్మూలించబడి మంచి ఆరోగ్యం లభిస్తుంది. రోజూ చదవండి ఆరోగ్యంగా ఉండండి
(1) కారణ పర చైతన్య రూపిణి
కామ పీఠపు ఆశ్రమ వాసిణి
కాంచీపురం కరుణ స్వరూపిణి
కోమలమైన దయ విహారిణి ---- విహరించు చున్న అమ్మవారికి వందనాలు
(2) కంచన కాంచి పుర తిలకమ్ము
నిత్య ధనుర్భాణ కేశ పాశమ్ము
కఠిన పాలిండ్ల తోన భారమ్ము
కైవల్యా నందముకు కారణమ్ము ...... శ్రేష్ఠ మైన అమ్మవారికి వందనాలు
(3) కాంచీ కామాక్షీచింతామణి గను
చింతింప ఫలము పోషణ గను
చైతణ్యామృత ప్రవాహిని గను
చిత్తం చల్లబర్చు కామక్షి గను ..... .... పోషణ కల్పించే అమ్మవారికి వందనాలు
(4) కామాక్షి మల్లెపువ్వువంటి నవ్వు
వంకర తిరిగి ముంగుర రివ్వు
ముఖము ఎర్రని కుంకుమ పువ్వు
పర్వత చక్రవర్తి సర్వ మవ్వు ...... .... విహరించే అమ్మవారికి వందనాలు
(5) కాంచీ పుర యవ్వనాల కుమారి
కామ మోహయతి శివ శంకరి
సర్వ దృష్టిని సంప్రోక్షణాసిరి
పంచ భూతాలపై అధికారిణి .... .... . దాసుడనైతిని అమ్మవారికి వందనాలు
ఓం శ్రీ మాత్రేనమ:.... ఓం నమ:శివాయ
(6) కమల నయనాల అధినేత్రి
కాంచీ పురాన కుచకుంభధాత్రి
సర్వుల ప్రాణ రక్షణగా నేత్రి
త్రినేత్రుని జయించే హిమపుత్రి ..... ... మోహింప మొహినికి వందనాలు
(7) జీవేశ్వరైక్య జ్ఞానమ్ము హేతువు
ఈశ్వరుని ఐశ్వర్యము హేతువు
వేదాన్ని వివరించేటి హేతువు
శిరస్సున అర్ధ చంద్ర హేతువు ... .... జ్ఞాన సరస్వతి అయిన అమ్మకు వందనాలు
(8) ఆనందాడ్వైత వృక్షపు మొలక
యవ్వన గర్వ పర్వ పు మొలక
శిరోభూషణ వేదాల మొలక
కామాక్షిరక్షణ కాంచీ మొలక ... ...... వృక్షంలా ఉన్న అమ్మకు వందనాలు
(9) శృంగారాద్వైత సాస్త్ర రక్షినిగా
మహా శివునికి విధేయత గా
స్థనములతోను సుందరముగా
నిత్య సిద్ధాంత సూత్ర ధారిణిగా ... .. ఉన్న కాంచీ పుర మాతకు వందనాలు
(10) భువన సమూహమునే చొక్కగా
. భూసీ మనాశ్రయించిన నదిగా
పరమ శివున్కే ధైర్య మిచ్చేదిగా
ఒక ఎఱుపు శిధిల మాత గా ----- సమస్తలోకాలను పాలించే అమ్మకు వందనాలు
ఓం శ్రీ మాత్రేనమ:.... ఓం నమ:శివాయ
(11) కాంచీ పురాణ రత్న భూషణగా
శివ తొడపైన దర్శనమ్ముగా
మన్మధుని ప్రసూతి గృహముగా
కటాక్షము లిచ్చేటి దేవతగా .. ... ... శ్రేష్టమైన కళను చూపే అమ్మకు వందనాలు .
(12) మనస్సుఏ విహార ఉద్యానము
చిద్విలాస సుందర మైన మోము
నివాసము కంపా నది తీరము
కరుణ తోను పంచు కటాక్షము .. .... మనస్సు విహరింపచేసే అమ్మకు వందనములు
(13) సర్వస్వ సంప్రదాయము తోకల్గి
మనసు ఏకాగ్రత చూప కల్గి
శివపీఠమే ఆధారము కల్గి
కామాక్షి మనసునే పంచ కల్గి ....... ... వేదగ్రాహ్యము పంచే అమ్మకు వందనములు
(14) నిత్య తరుణీయమైనట్టి బాల
శివాలింగనమునే పొందు హేల
మది ఉల్లాస భరితపు లీల
నిత్యం కంచి నందు జరుగు గోల.... .. నిత్యతరుణి అయిన అమ్మకు వందనములు
(!5) చతన్య శరీర కాంతి మెఱుపు
చెఱకు విల్లు హృదయ మెఱపు
బంధు జీవముల పుష్ప మెఱుపు
గిరిపై శ్రీ కామాక్షిగ మెఱుపు ...... ....... ఆనదంపొందే అమ్మ చూపులకు వందనాలు
(16) మధుర మైన చిరునవ్వులతో
మంద గమనపు స్థనములతో
మన్మధ సామ్రాజ్య గర్వముతో
శ్రీ కామాక్షి దేవి గ ఆటలతో .... ...... మన్మధసామ్రాజ్యానికున్న తల్లి కి వందనాలు
(17) భూమి ఆకాశం వాయవు వీక్షించే
యజమాన అగ్ని భూమి వీక్షించే
సూర్య చంద్రలు జలము వీక్షించే
రూపాష్టమూర్తి తల్లిని వీక్షించే .... .సమస్త లోకాలు చూసే తల్లికి వందనాలు
(18) తెల తెల్లని మంద హాసముతో
చల చల్లని సృష్టి చూపులతో
సన సన్నని నడుము వంపుతో
నిర్గుణ తత్వముల పలుకుతో .... ..మనకందించిన అమ్మకు నమస్కారములు
ఓం శ్రీ మాత్రేనమ:.... ఓం నమ:శివాయ
(19) కాంచి పురాన్ని పవిత్ర ముగా
శివ పులకిత శరీరముగా
మన్మధ లీలల సరసముగా
శ్రీ కామాక్షి దేవి సాక్షాత్కారంగా .... ... ప్రజలందరిని రక్షించే అమ్మకు వందనాలు
(20) మన్మథునికే రెక్కలు తెప్పించి
ఇసుక తిన్నెలలో విహారించి
యవ్వన రూప శివుని మెప్పించి
సంపదతో పుణ్యవతి దీవించి .... .... సమస్త లోకాలను రక్షించే అమ్మకు వందనాలు .
(21) నిత్యమూ యౌవన సర్వస్వముతో
దేహ తరుణారుణ రేఖలతో
సమాన సాంప్రదాయ కళల తో
శ్రీ కామాక్షి దేవి వెలుగులతో .... ..... కంపానదీ తీరమున ఉన్న అమ్మకు వందనాలు
(22) శివాభ్యుదయం తెలప గలిగి
మన్మధుని శరీర పుష్టిమయం
కంచి కామాక్షి దర్శించగలిగి
పరిణామమైన యోవనమయం ..... తో ఉన్న అమ్మకు వందనాలు
(23) జ్ఞానమయమైన సరస్వతిగా
పరిపూర్ణత గల్గి సహాయంగా
చంద్రునినే శిరోభాషణముగా
కాంచీపురము ఆశ్రయ వాసిగా .... .ఉన్న అమ్మ పరిపూర్ణత లీలలకు వందనాలు
(24) పువ్వుల బాణాన్ని ధరించియు
చెరుకు విల్లునే ధరించియు
కాంచిపురమున ఆటలాడియు
ఎరుపును విశేష౦గా ధ్యానించియు .....దర్శనమిచ్చే అమ్మకు వందనాలు
(25) సంతోష శంభో ప్రవాహమందునా
గర్భమధు ధార గతి యందునా
వేదాంత కమల దివ్య వెల్గునా
స్తనసౌందర్య ముచే తేజంబునా ..... విలసిల్లే అమ్మకు వందనాలు
(26) ఏకామ్రనాధుని జీవిత లీల
శ్రీ కామాక్షి దేవి ఆశ్రీయ లీల
సర్వ పాపములు పోగెట్టే లీల
జింక పిల్ల కన్నుల దేవి లీల ..... .. చూసేవారికి ఆనందం ఇచ్చే తల్లికి వందనాలు
(27) ఆనందామృత సాగరంలో తేలి
అమ్మవారి నవ్వుముఖము హోళి
దయ ప్రేమ లతో చూపెటి జాలి
అనిర్వచన మైన దేవి లాలి ..... ..అందరిపై ప్రేమ దయ చూపు తల్లికి వందనాలు
ఓం శ్రీ మాత్రేనమ:.... ఓం నమ:శివాయ
(28) హిమ వంతుని కుల మణిదీపం
ధరించె చంద్రుని శిరో భూషణం
కాంచీ పురాణ రక్షణా కవచం
అమ్మవారిపై మూక కవి పద్యం...... మూక కవి పద్యంతో అమ్మకు వందనాలు
(29) పగడపు రంగు దేహము గల
పెద్ద కలశము చనులు గల
మనసు పరసింప చేయగల
శ్రీ కామాక్షిదేవి సౌందర్య లీల ..... ..సౌందర్యానికి ప్రతిరూపమైన అమ్మకు వందనాలు
(30) కురువింద మణుల గోత్ర కల్గి
కుండల వంటి కుచములు కల్గి
మన్మధుని వీర్య సారము కల్గి
వేగ రూపిణి శివుని తో కల్గి ....... శివుని మెప్పించిన అమ్మకు వందనాలు
(31) మొగ్గ తొడిగి నట్టి కుచములు
కుంకుమ పూతలతొ మెఱుపులు
శివుని పుణ్య అతిశయములు
నిత్యమూ మంగళ మార్గములు ....నిత్యమూ పూజలనుడుంటున్న అమ్మకు వందనాలు
(32) శిరస్సు న చంద్రుని భూషణం గా
పరమశివ అంతఃపురము గా
కాంచీపుర అలంకారములు గా
శ్రీ కంచి కామాక్షి వైభవమ్ము గా .......మహాద్భుతమంగా కనిపించే అమ్మకు వందనాలు
(33) పర్వత వంశ సంపద వికాసం
కంపా నదీ తీరమున ఆనందం
మహాశివ లాలన నిరంతరం
ఆవిరులు చిమ్మిన ఫాలనేత్రం ...... అమ్మ చూపులకు వందనాలు
(34) ఏకామ్రేశ్వరుని అంకముపైన
సారసత్యమైన అమ్మవారిగా
అంకురించిన స్థనమొగ్గలైన
వేదోపాసముగ ముహుర్తముగా ........ఉన్న అమ్మవారికి వందనాలు
(35) మూలధనము ఆస్తిగా కలదై
పింజరవర్ణాల కాంతి కలదై
పూజ్యనీయ ధ్వని మణి కలదై
ఘనీభ వించిన దయ కలదై .... ....కాంచీపురము నావెలసిల్లినమ్మకు వందనాలు
(36) ఆసక్తమైన హృదయము కల్గి
పరమశివుని భరించ కల్గి
కళ్ళ కన్నీరును తుడవ కల్గి
సౌందర్యామృతమును పంచ కల్గి ...సమస్త ప్రజలను రక్షించే అమ్మకు వందనాలు
ఓం శ్రీ మాత్రేనమ:.... ఓం నమ:శివాయ
(37) తుమ్మెద పోలిక ముంగురుల తో
మదన శాస్త్ర సిద్ధాంత దీక్షతో
మంగళములకు జన్మ లక్షంతో
అమ్మవారి సారూప్య దాహముతో .... ఉన్న తల్లికి వందనాలు
(38) జ్ఞానామృత తరంగమునే పంచి
మూడువిధాల రూపము ధరించి
సంసార సాగరంలోన బంధించి
కాంచీ పురముణ సంచరించించి .... ముగ్గురు పురుషుల ముఖకమల మైన అమ్మకు వందనాలు
(39) సంధ్యా సమయ కిరణములతో
కాంతిగా సమయా దేవి బుద్దితో
నీవు నిత్యమూ ధ్యాన పరులతో
ఇష్టమైనట్టి కామాక్షి దేవితో
బేధ అభేదపు సమస్యలతో ..... .......నిత్యమూ సుఖాలు నందించే అమ్మకు వందనాలు
(40) పాద పూజకు బంధము చూపావా
సముద్రములో రాయిలా తేల్చావా
నాగకన్యకా కోపము చూపావా
చరాచరముల తల్లి వైనవా
గుహా అరణి రూపిణి వైనవా ....... ...ఓ కామాక్షి నీకు నమస్కారాలు
(41) సర్వమును చైతన్య రూపిణిగా
భేదమును చూపని దానివిగా
నీవు అహము లేని దానివిగా
విశ్వమున శాశ్వితమైనది గా
కామాక్షి భ్రమింపచేస్తున్నదిగా ...... లోకాల్ని భ్రమింపచేసే తల్లికినమస్కారాలు
(42) అమ్మ కామాక్షి కటాక్ష కృపగా
అడవి ఇల్లు ఇళ్లే అడవిగా
శత్రువు మిత్ర మిత్ర శత్రువుగా
మట్టి పెడ్డ పడచు పెదవిగా
పడుచు పెదవి మట్టి పెడ్డగా...... అమ్మవారు చేయు పనులకు శివ శివ అంటూ వందనాలు
(43) పరమేశ్వరునకు ప్రియురాలా
కామ పీఠమున ఉన్నదానివి
కోట్లాది కామమలతోను లీల
నిత్యమూ నికారస్వరూపిణివి
భక్తుల కోరికలు తీర్చు లీల ........మాలో ఉన్న కామాన్ని పితికే తలికి వందనాలు
(44) హృదయ మధ్యమున కాంతులతో
ఫాల మధ్యముననె కాంతులతో
శిరస్సు మధ్యమము కాంతులతో
సూర్యని చంద్రునీలో కాంతులతో
శ్రీ కామాక్షిదేవి గా కాంతులతో .... సమస్త కాంతుల మూలమైన అమ్మకు వందనాలు
(45) కాంచీపుర క్రీడలలో ఆసక్తి
మంత్ర యంత్రము లలోన ఆసక్తి
శివుని జీవనో పాయ ఆసక్తి
అమ్మగా హృదయ చల్లని శక్తి
అఖిలాగమనలో తంత్ర శక్తి ..... .జీవనోపాయమైన శక్తులనిచ్చే అమ్మకు వందనాలు
(46) ఎల్లవేళల కాంచీపురమ్ము గా
సూర్య చంద్ర మండల స్తనాలుగా
నిత్యమూ ఆకాశమే నాదముగా
తరుణీ హృదయము శాంతముగా
సమస్త మానంద పరిచేదిగా .... .తరుణీ హృదయాలలో ఉన్న అమ్మకు వందనాలు
(47) మెరుపు తీగవంటి వన్నెగల
సంసార రోగము చికిత్స గల
నిత్య ఔషధము అందించగల
సిద్ధి అందరికీ కల్పించ గల
బుద్ధి మనస్సును రక్షించగల.... సిద్ధి ఔషదము ఇచ్చే అమ్మకు వందనాలు
(48) బ్రహ్మ తత్వ నాడి కలిగియున్న
స్థనములు ఖఠినత తో యున్న
మన్మధుని ప్రతిపాదించు చున్న
ఆనందమును నొసగుతూ వున్న
మహా శివుని ప్రీతి కల్పిస్తున్న .... .అందరికీ ఆనందాన్ని అందిస్తున్న అమ్మకు వందనాలు
(49) పాశము అంకుశము ధరించిన
ముంజేతిలో పుష్పం ధరించిన
వేదవాక్యాలన్నియు పఠించిన
సిద్ధాంతంతో శివుని పూజించిన
కాంతులతోను కాంచీ పురమున .... .ఉన్న శివుని భార్యకు వందనాలు
(50) పరమతాత్పర్యరూపిణి ఐన
నిత్య ధ్యాననిశ్చలత గల్గిన
మునులహృదయాలలో ఉండిన
ఆదివిద్య తంత్రములు నేర్పన -- అమ్మా కామాక్షి కి వందనాలు
(51) వేద వాఖ్యములు సిద్ధాంతమైన
ఒక చేతిలోన అంకుశ మైన
మరోచేతిలోన పాశమ్ము యైన
ఆశ్చర్యము కల్గించు సంఘటన--- తో శివుని భార్య చేసితిని
(52) శిల్పం యొక్క కల్పన రూపము యే
విలాస రీతులు గా భంగిమయే
ఆశ్ర యించిన వార్కి మోక్షముయే
ప్రధమ విస్ఫుర మైన విధ్యయే ---- అమ్మవారు అందించును
(53) కామాక్షీ దేవి మూగడి నైనాను
తీవ్రమైన క్లేశ ము పదశిల్పము
కల్గినాను దు:ఖము అనుభవించు చున్నాను
ఒక్కక్షణం స్మరించ కుండలేను --- నిన్ను స్మరించిన లోకోత్తర కీర్తి
(54) పంచదశీ మంత్ర రూపిణిగా
శివునీనే వంచింప విధముగా
మన్మధుని కళ నైపుణ్యముగా
కాంచీపురము విలసిల్లు చుండగా --- అమ్మవారిని ఆశ్రయించ వలెను
(55) యేబది వర్ణాల పదశిల్పాలు
నాలుగు విధాల పరిణామాలు
విద్వంసుల లో సుషుమ్నా నాడులు
ఎన్నో ఎన్నెనో నిత్య కల్పనలు ---- చూపిన ఆ కామాక్షి దేవిని మ్రొక్కెదను
(56) ఆకారము నుండి క్షకారము గా
తెలుగు అక్షర స్వరూపముగా
విద్యలకు విద్యాస్వరూపిణిగా
పీఠమున చెరకును ధరించగా ------మాతృమూర్తి గురుసార్వభౌమిని కి మ్రొక్కెద
(57) కంపా నదియందు ప్రేమ గలది
యతుల లో స్థిరత్వము గలది
సామవేదము ఇష్టము గలది
హిమవత్పర్వత పుత్రి కైనది ----- నిత్యమూ కామా క్షీ అమ్మవారిని మ్రొక్కెద
(58) జలమందు ఆసనము ధరించి
సంతోషపు మన్మధుని శాసించి
సకల జగములు ప్రకాశించి
కాంచీ పురము భక్తితో శాసించి -- సకలము సంతోష పెట్టు మాతను మ్రొక్కెద
(69) చికాట్లు మరలా రాకుండా చేయు
నిత్య మనస్సును మేల్కొల్ప చేయు
దొండపండు పెదవులు కల్గి యు
చిరునవ్వు మోముతో కామాక్షియు .... ఫలములందించే దేవతకు వందనాలు
(70) శ్రీ చక్ర మధ్యమమున భాగ్యమై
పుష్పపర్యంకముగల మంచమై
పరమ శివునకు సుందరమై
ఉమామహేశ్వరుల దర్శనమై .... పరమశివునితో ఉన్న అమ్మకు నమస్కారాలు
(71) కామ పీఠముయే ఊయలుగాను
దయా జలము వర్షములు గాను
పడచుల మణిహారమ్ము లోను
హిమ పుత్రిక ఆనందము తోను ... ఉన్న మనల్ని రక్షించగలిగే అమ్మ కు నమస్కారాలు
(72) లే జిగురు వలే ఎర్రనైనది
బాధను పోగొట్టగలిగినది
చంద్రుని శిరమున చేర్చినది
మాయ స్వరూపిణి గాను ఉన్నది ... అత్త అమ్మకు పాదాభివందనమ్ములు
(73) ముక్తి కారణమైన శిరముఁయే
చంద్ర పువ్వుని ధరించి నదియే
కంపానదీ తీరమ్ము ఉన్నది యే
మనసు సంతోషం కల్గించుటయే .. అమ్మ ఆరాధించువారికి సంతోషము కల్గును
(74) నిత్య వేద స్వరూపిణిగాను
నిత్య నాదస్వరూపిణిగాను
నిత్య బిందు స్వరూపిణిగాను
నిత్య విశ్వవికార రూపిణిగాను ... మంత్ర , తార శక్తులు గల అమ్ముకు వందనాలు
(75) శివుని పుణ్యముతో రూపమైన
కవి సూక్తులకు నిలయమైన
దయ పరిణామము హస్తమైన
సంప్రదాయాపీఠపు రూపమైన ... అమ్మవారికి హృదయపూర్వకవందనాలు
(76) తెలియరాని ప్రమాణాల వల్ల
వక్రకేశములు చలనం వల్ల
చంచల నేత్రములు తిర్గు వల్ల
విశాలమ్ము జఘనములు వల్ల .... మృదుచరణమూ గల తల్లికి వందనాలు
(77) ఆత్మ సాక్షాత్కారమదృష్టముయే
పర శివోల్లసము సంభవమే
దృష్టిచేత సమస్తము తానుయే
అనుగ్రహ దీపపు మూలక మే ---- ఉన్న అమ్మవారి దర్శనము నకు వందనాలు
(78) ఓ విద్యావతీ, కాళీ, కాత్యాయనీ
ఓ కామకోటీశ్వరి, వాగ్రూపిణీ
ఓ భైరవ ఓ భద్రతా రూపిణీ
శాకినీ శంభుతత్వస్వరూపిణీ ---- మంగళస్వరూపురాలయినా అమ్మకు వందనాలు
(79) మహేశ్వరుని కదిలించు దాన
మాలలతోను ఆడుకొను దాన
శత్రువులను సంహరించుదాన
సురజనులను పాలించు దాన
కాపాలములను ధరించుదాన
పగడమాల ధరించుదాన
సూళము పాశము ధరించుదాన
ఓ దేవి నా శిరస్సును ఇచ్చేన ---- ఆ మహా తల్లికి వందనాలు
(80) అమ్మ నీ యవ్వనమే మహిమగా
మహాశివుని తత్వ రూపిణిగా
ఆదివిద్యా సమయ తంత్రిణిగా
దీక్షశివుని కీ గురుత్వణిగా ---- ఉన్నట్టి అమ్మకు వందనాలు
(81) శివుని కన్నులు ఎర్రగా మారె
అమ్మ మొలసూలు చిక్కులో చేరె
మిక్కిలి పూజ్యనీయురాలై మారె
జనుల దయ చూడ కాంచీ చేరె----- కాంచన మణిని ధరించిన అమ్మకు వందనాలు
(82) పరమ గురిని కృపతో అమ్మ
హిమవంతుని పుత్రికయే అమ్మ
శివుని ఆభరణంగాను అమ్మ
కన్నుల ఎఱ్ఱని అమృతమే అమ్మ ---- శివ పత్నిగాఉన్న అమ్మకు వందనాలు
(84) శివ బ్రహ్మచర్య నిపుణతయే
మన్మధ ప్రేరణ అమ్మ శోభయే
త్రినేత్ర చుపుతో దహనముయే
దేవతల కోరిక ప్రశ్నలాయే ----- బ్రహ్మచర్య నిపుణత గమనించిన అమ్మకు వందనాలు
(88) విద్వజనలకు అమ్మపాదాలు
సంతోషముతోనే పరాగములు
సరస మైన సంభాషణములు
మనోహరమై అందెల శబ్దాలు --- సంభాషణలతో అమ్మకు నమస్కారములు
(89) రంగస్థములో చూపు నర్తనలు
మనస్సులోనా లాస్య కేరింతలు
శివునితో కల్సి తాండవములు
సంసారలోన సుఖానందములు -- నిత్యా ఆనందము చూపే అమ్మకు నమస్కారములు
(90) మృదువైన పాదయుగళములు
బాధతెచ్చెటి మందగమనాలు
వాడి ఐన మునుల మనసులు
అమ్మవారి హృదయ కంపనలు। --హృదయాన్ని కరిగించే అమ్మడు వందనాలు
(91) విశ్వరహస్యాలు తెల్పగలిగి
నిత్య శాంతికి తోడ్పడ గలిగి
యధావిధి ఊపిరిగా మెలిగి
కుటుంబానికి వెలుగువుతున్న --- దేవతలచే పూజించే అమ్మ పాదాలకువందనాలు
నమశ్శివాయ గేయము
పాపా బ్జ వనము దే భా మోక్షప్ర ..దీపకర నమశ్శివాయ
నీపాదకమల సేవ - చే మన .. స్తాపములు.. చల్లారును
కాపాడి రక్షింప వే .. భవదీయ ... కరుణ చే నమశ్శివాయ
శరణు పరమేశ్వరాయా ...రుద్రాయ ... శరణు విశ్వేశ్వరయా
శరణు భద్రప్రదాయా .. కావవే .. శరణ0టి నమశ్శివాయ
త్వన్నామ పంచాక్షరీ .. మంత్రంబు ..దవిలి ... పఠియించువా రీ
భవపాశములు జిక్కకే .. మోక్షంబు .. బడయుదురు నమశ్శివాయ
పలుపాతకములు జేసి నరకభా..దల నొంది కందనేలా?
తలప నీ చరణసేవం ..జేసి ని..ర్మలు డగును నమశ్శివాయ ...... 5
కుజ న సంగతి చేతను నీ పాద భజన మించుక లేకయే
వృజన మా ర్జించు నట్లు సేయకో విశ్వేశ నమశ్శివాయ
వినగోరు వీను లోకరం జన ప్రాకృతోక్తు లందు
నెన యింప కే నీ కథల్ శ్రవణము లు వినిపిం పు నమశ్శివాయ
తను వగరు మాల్యాంబర దుల దాల్ప జననీక నీపదాబ్జ
మననంటు రజముభూతి నా మేన నునుఫవే నమశ్శివాయ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి