19, ఏప్రిల్ 2021, సోమవారం

ఛందస్సు - వసు షట్పది*


గురూత్పలము: 

==

ఉత్పలమాల వృత్తమునకు చివర ఒక గురువునుంచి వ్రాసినది యిది. వృత్త సంఖ్య మారదు, ఛందము మాత్రమే మారుతుంది. 

==

గురూత్పలము - భ/ర/న/భ/భ/ర/య UII UIU III - UII UII UIUIUU

21 కృతి 355799 

==

అందము చూడఁగాఁ గలుగు - హర్షము మిక్కిలి నాకు డెందమం దో 

సుందరి నీవులేక యిల - సొంపుల నీనునె మాధవమ్ము నీకై 

యుందును వేయి జన్మలిట - నొక్కడనై యపుడే విముక్తి నాకే 

సందియ మిందులేదు వర - చారుమతీ ద్యుతీ సద్గతీ విభూతీ 

==

మానసమొక్క మర్కటము - మాయలు సేయును నాట్యమాడు నాలో 

గానము పాడు సుస్వరము - కంఠమునందునఁ బల్కకుండఁ గల్లున్ 

బానము సేసినట్టు లొక - భావము కల్గఁగఁ జేయుచుండు నన్న-

జ్ఞానములోన ముంచి మోదమున - గంతులవేయును జాలునా యివంచున్ 

==

రంగుల రాట్న మీబ్రతుకు - రాట్నము గుండ్రముగాను జుట్టుచుండున్ 

జెంగున లేచు నొక్క తరిఁ - జెచ్చెర క్రిందికి డిగ్గు వేగమై యీ 

శృంగ మధోగతుల్ ప్రభువు - చిత్తము నిక్కము మానవుల్ మనమ్మే 

భంగిని మార్చలేము గద - పావుల మీచదురంగమందు నెప్డున్ 

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


వికసితసుమ లేక సితోత్పల

==

వికసితసుమపు ఆధారము: Old Javanese Metres by AnandjOti bhikku 

సితోత్పల: జూలై 2013లో నా కల్పన

==

UII UIU III UII IIII U - వంశపత్రపతిత 17 అత్యష్టి 64983 

UII UIU III UII IIII UIUIU - వికసితకుసుమ లేక సితోత్పల 21 ప్రకృతి 720343 

వంశపత్రపతితకు చివర IUIU చేర్చగా లభించిన వృత్తము ఇది. ఇందులో ఉత్పలమాలలోని చివరి భ-గణమునకు బదులు నలము. 

==

ఉత్పలమాలవలె అక్షరసామ్య యతితో

==

రేతిరిలో సితోత్పలము - లెల్లెడఁ గొలనులనిండఁ బూయఁగాఁ  

జేతమునందుఁ గ్రొత్తగను - జిందెను సరసపుటాశ తుంపరల్ 

వాతము దెచ్చె మన్మథు సు-వాసన లలరెడు పూలతూపులన్ 

శీతలవేళ దుప్పటిని - జేరుద మతిసుఖ మొంద నిప్పుడే 

==

సంపఁగివలె (4,5,5 - 4,5,5 మాత్రల విఱుపుతో) 

==

ప్రేమము నిక్కమై మనసులో - వికసిత సుమమేమొ చక్కఁగా 

శ్యామల వేళలోఁ శశి రుచుల్ - యవనికి దిగజారె చిక్కఁగా 

కోమల భావముల్ పెదవులన్ - గులుకుల రవమయ్యె గీతిగా 

సీమల దాటునో తురితమై - చెలువపు నది నేఁడు ప్రీతిగా 

==

భావము గల్గె నాకుఁ జెలి యా - వనమున విరియో విలాసినీ 

కావున నీవు నాకెదురుగాఁ - గనుగవ సిరియో కలాపినీ 

దేవుని దల్చుచుంటిని సకీ - దినమున ద్యుతియో విలోలినీ 

మైవిరిసెన్ గదా మధురమై - మనమున స్మృతియో కలామయీ 

==

చివరి పద్యములో గర్భితమై కొన్ని వృత్తములు గలవు. అవి:

==

1) వంశపత్రపతిత:

భావము గల్గె నాకుఁ జెలి యా - వనమున విరియో 

కావున నీవు నాకెదురుగాఁ - గనుగవ సిరియో 

దేవుని దల్చుచుంటిని సకీ - దినమున ద్యుతియో

మైవిరిసెన్ గదా మధురమై - మనమున స్మృతియో 

==

2) కలువ లేక హైమన: భ/ర/న/గ 

10 పంక్తి 471 (ఈ ఉదాహరణములో యతి లేదు)

భావము గల్గె నాకుఁ జెలియా 

కావున నీవు నాకెదురుగాఁ 

దేవుని దల్చుచుంటిని సకీ

మైవిరిసెన్ గదా మధురమై

==

3) మధుమతి: న/న/గ 

వనమున విరియో విలాసినీ 

కనుగవ సిరియో కలాపినీ 

దినమున ద్యుతియో విలోలినీ

మనమున స్మృతియో కలామయీ

==

4) విలాసినీ: జ/గ

విలాసినీ 

కలాపినీ 

విలోలినీ 

కలామయీ 

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

1 Co


రంజితా, చతుష్పదీరంజితా 

==

ఆధారము: మందారమరంద చంపూ

ఇది రథోద్ధత వర్గమునకు చెందినది. 

==

*రంజితా - ర/జ/స/లగ UIUIU - IIIUIU 

11 త్రిష్టుప్పు 747 

==

మందహాసమే - మధుర గానమా 

నందనందనా - నవ కవిత్వమా 

ముందురమ్ము కా-పురుష భంజితా 

ఎందు నీవెగా - హృదయ రంజితా 

==

పూలమాలలే - పులకరింపుగా

ఈల పాటలే - యెపుడు హాయిగా 

తాళ వృత్తమై - తనరు చిత్తమే 

నీలమోహనా - నెనరు ముత్తెమే 

==

చుక్క చుక్కగా - సుమదళమ్ములై 

యక్కజమ్ముగా - నవని సొమ్ములై 

దిక్కుదిక్కులం - దెలి హిమమ్ములే 

యెక్కడుంటివో - యిచట నిమ్ములే 

==

షట్పదివలె చతుష్పదిగా $

(రెండవ భాగము లఘ్వారంభము కావున ఇది షట్పది కాజాలదు) 

చతుష్పదీరంజితా: UIUIU - IIIUIU / UIUIU - IIIU 

==

చందమామతో - సరస మెందుకే 

చందమామ నా - సరసనే 

మందమారుత - మ్మదియు నెందుకే 

మందమారుత - మ్మతఁడెగా 

==

దేవదేవుఁడే - దివికి నాథుఁడే 

కావవచ్చునే - కరముతో 

భూవరాహుఁడే - భువిని దాల్చునే 

జీవమిచ్చునే - చిరముగా 

==

ఏమీ జీవిత - మ్మిది యెఱుంగనే 

ప్రేమ యయ్యెనో - విషముగా 

నామె మారెనా - యది యెఱుంగనే 

నామనస్సులో - నలఁతలే 

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

0

మృగీ - ప్రతిపాదమునకు ఒక్క ర గణము మాత్రమే। పైన ఒకవరుసలో నాలుగు పాదములు మధ్య - గుర్తుతో వ్రాయబడినాయి

మృగీ -1 రగణము

విజోహా - 2 రగణములు

భౌరికమ్ - 3 ర గణములు

స్రగ్విణీ - 4 రగణములు యతి ।

దీనికి మాత్రమే యతి వాడవలసియుంటుంది


మృగీ , విజోహా ,భౌరికమ్ ,స్రగ్విణీ  వృత్తములు  ***

--------------------------------------------------------

*

మృగీ వృ। 

*

ర గణము 

*

*

దైవమే-భావమై-పోవుటే-త్రోవయై

దేవియే-నీవుగా-మోవిపై-పూవులే

*

మేలుగా -శ్రీలుగా-రాలగా-పూలిటుల్

బాలవై - ఖేలగా -తేలిపో -గాలిలో 

*

విద్దెతో -బుద్ధితో- వృద్ధియే -సిద్ధియే

*

శక్తిపై -భక్తితో -సూక్తితో -ముక్తియే


విజోహా వృ।   (ర,ర )

*

నిత్తెమున్ బ్రీతితో

సత్తితో నాడుటే

బత్తితోఁ బాడుటే

మత్తుగాఁ దూగుటే

దాన ధర్మాలతో

దీనులన్ బ్రోచుటే

ప్రాణమే బోనమై 

మౌనిగా నుండుటే

*

చేతమే పూవుగా

మాతకర్పించుటే

పూతవై ధీతవై

బ్రాతితో నొప్పుటే

*

స్తుత్యపైఁ జూపుతో

నిత్యమా యాత్మలో

సత్యమున్ గాంచుటే

ప్రత్యహంబల్లుటే

*

భౌరికమ్ (ర,ర,ర )

*

విద్దెయే సర్వమై సర్వదా

శ్రద్ధతో నేర్వగాఁ బాఠముల్

వృద్ధి చేకూరదా పృథ్విపై

సిద్ధమై కీర్తియున్ మేలుగా

*

అమ్మ చూపించు మార్గమ్ములోఁ 

గమ్మనౌ పద్యముల్ వ్రాయఁగా

సమ్మతిన్ జూపఁబోకుందురే

యిమ్ముగా నిమ్మహీవాసులున్

*

స్రగ్విణి (ర,ర,ర,ర-యతి 7 )

*

శారదా ప్రేమమే సర్వమై యాడుకో 

భారతీ వాక్కులే భాగ్యమై పాడుకో 

ధీరవై మౌనివై దీప్తితో నిండిపో 

ధారుణీ ప్రీతిగా ధర్మివై సాగిపో  

*

నిచ్చలాహారమై నిత్య వాక్యమ్ములే  

సొచ్చెమౌ రూపుతో శుద్ధభావమ్ముతో  

మెచ్చు నీ దారిలో మేలుగా నేగఁగా 

సచ్చిదానందమే సర్వదా ప్రాప్తమౌ



నేటి ప్రకృతి సుగంధి పద్యాలు..ప్రాంజలి ప్రభ
నాడు తెలియ జేయ లేక నేను నవ్వు చూపు లే
నేడు తెలియ జేయ దలచి నాది నమ్మ బుద్ధి యే
ఈడు నాడు తెలియలేదు ఈశ్వర కళ నాకు లే
నేడు జోడు తోను కలిసి ఈశ్వరుడు నె కొల్చె దా....1
ఆస్తి ఏది అనకు నీకు ఆత్మ ఉంటె చాలునే
శాస్తి జరుగ గుండు నీకు సుగుణ ముంచు చాలునే
సిస్తు కట్ట గలిగె ధర్మ సిరులు చాలు చాలునే
త్రాసు మల్లె చెలిమి నుంచి తృణము లాగ ఉండుటే..2
కమలము కమలాప్తుని కళ కనుల మాయలే
కమల నయనములును తెరుచు కొనుట పృకృతి లీలయే
కమల నాధుని కళ లన్ని కామ్య మవ్వు చుండుటే
సుమధుర లత లన్నియు వికసింప చేయుటే.2
మురికి పట్టి ఉన్న అద్దమందు కిరణ ముండ దే
చిరుగు లెన్ని ఉన్న గుడ్డ సిగ్గు అడ్డ మవ్వు టే
కరుడు గట్టి గుండె పోటు కలలు తీర్చ కవ్వు టే
చెరను ఉన్న కధలబుద్ధి చెరచు చుండి నువ్వు టే..3
కాయ పండు గాను మారి కాల చక్ర మవ్వు టే
కాయ మగును పంచ భూత కళల నిత్య మల్లు టే
మాయ చేత రోత బతుకు మహిమ లాగ ఉండు టే
చేయు నిత్య గీత పఠన చేర్చు మోక్ష మవ్వు టే...4
గలగలమని నీరు పారె గమ్య మెదుకు దారి గా
విలువలెరుగ జలచరములు విధిగ జిక్కె ఆశ గా
జల్లు గాను జారు చున్న జలము జాడ్యమవ్వు టే
చెల్లు బాటు లేని దేది జాలి జూపకుండు గా ...5
చక్కనైన చిన్న చూపు చాలు జాత రువ్వుటే
ఎక్కి దూకి ఎత్త మన్న ఎత్తె యదలొ జువ్వనే
ఒక్కమారు వయసు బట్టి ఒత్తి చూసె జాడ్యమే
బక్క చిక్కి ఉన్న ఏమి పడచు చాలు బుద్ధిగా...6
ఎవరిని ఎవరనుటవలదు ఎన్ని చెప్పినాసరే
హావ భావ ఎరుక పరిచి హాయి చెప్పు కాలమే
సేవ చేసి యున్న మనిషి సాధు భావ ముంచినా
నావ లాగ కదలి జీవ నటన ఏల నీకులే...7
కల్పనేన కవిత నచ్చు కన్నె ఊపు వల్లనే
స్వల్పమైన నడ్డి ఊపు సరళ కైపు వల్లనే
శిల్పమేన జగతి నందు సంగ మవుట వల్లనే
వేల్పులైన తెల్పు లైన వేడి వున్న వల్లనే...8
తల్పమేన హాయి గొనుట తప్పు కాక వుండుటే
అల్పమేన జీవి తమ్ము అధిక వేడి వుండుటే
బల్పమేన అక్ష రమ్ము పనికి వచ్చి వుండుటే
పప్పు అన్న మున్న తిండి మనిషికి ఆరోగ్యమే..9
చప్ప నైన కార మైన చొప్ప కూడు చెక్కరే
చిప్ప కూడు బిచ్చగాళ్ల చింత తీర్చు చెక్కరే
తప్పు చేయు వారిక బాధ తిప్ప రొచ్చు చెక్కరే
ఒప్పు వాద నంత నిత్య ఓర్పు వున్న చక్కరే..10
ఆగదు ఎ నిముషము ని కొరకు అర్ధ మయ్యె బత్కులో
వేగము వలదు మెరు పైన వయసు ఆశ దేనికో
భాగ మేది అయిన చెడిన బాగు చేయు ధైర్యమే
సాగు జీవితాన కధలు శాంతి నిచ్చు మార్గమే....11

బ్రహ్మ యు, హరి, శివుడు, నిత్య భక్తి శక్తి నిచ్చునే బాహ్య అంతరములు నయన భావ హర్షిత మ్ముగా అహము వదిలి మనసు పెట్టు ఆట లన్ని తెల్యునే సహన ముంచి సామరశ్యసేవ ఇంటి వెల్గుయే కరుణ జూపె నిత్య గరళ కంఠ ఆదు కోవుటే మరణ రక్ష చూపు ‌శూల పాణి సేవ తప్పదే శరణ మన్న ఆదు కొనును శంకరుండు ఇప్పుడే తరుణ మయ్యె చిన్న పెద్ద చేరి శివుని పూజకై నరుల దృష్టి వల్ల జగతి నాశనమ్ము జర్గు టే సిరుల విషము వైపరీత్యచిత్త చెంచలమ్ముయే భీరు లయ్యె వర్ష నీరు పారి కొంప కూలెనే వరద పొంగు వల్ల హతులు వేల జీవ కర్మయే నేను ఏమిటోను అర్ధ నడక గమ్య మవ్వుటే నేను అన్న పదము సుఖము నివ్వకుండు లోకమే నేను వున్న చోటు నీవు యుండగలగె నవ్వుటే నేను అయిన ఆత్మకు పని నిర్మలమ్ముగా విశ్వ గురువు సత్య వాక్కు వలన మనసులో శాంతి విశ్వ హిందు ధర్మ మంటె విద్య నేర్పుగా శాంతి విశ్వ మందు ఆధునికము వలన తెలివియే శాంతి విశ్వ శాంతి కొరకు మనిషి వింత పోకడే బ్రాంతి మనసు వేదన మధనము యె మమత చుట్టు తిర్గుటే మనము తిరుగు ఎవరి కొరకు మాయ నుండి బత్కటే చనువు భావమందు నీటి చుక్క లోన లోకమే తనను తాను కనుగొనుట యె తప్పు తెల్సి బత్కుటే స్త్రీలలో న వుండు కళలు శీల మగుట కాలమే మల్లె పువ్వు పుట్టగానె మత్తు ఇచ్చు శక్తియే తెల్ల నైన నల్ల నేన తప్పు చేయ కుండుటే కలలను కను చున్న కవిహృదయము నిర్మలం

May be an image of 2 people and outdoors
s


త్రిపద


కన్నయ్య మనసు నే కోరేను యీకళ్లు

వెన్నను పంచి వేడుకలకు కళ్లు

మన్ను నే తిన్న గోపాలా


చిరుదరహాసమ్ము।। జీవిగా యీకళ్లు

మరుమల్లె చూపు।। మేలైన యీకళ్లు

కరుణ చూపె గోపాలా


కాలము నీదిలే ।।కావ్యము వ్రాయుము

గళము ను తెల్పి ।।। గర్వము వీడుము

గోలలు గొప్ప మార్పుయే


లాలన చూపియు ।।।లాశ్యము దేనికి

లలితము చూపి ।।।। లౌక్యంగా ఉండుము

కల్పితం వద్దు కధలులే


కల్పన బతుకులు।।। కావులే జగతిన

స్వల్పము వల్ల ।।। సుచరిత్ర తెలుసుకో

తెల్సిన పనులు తెల్పుటే


పాలన నీదిలే।।। పలుకులు తెలివి గా

హేలనదేనికి ।।  హెచ్చరించి వలదు

బేలగ పలుకు ఏలనూ


జన్మ జన్మల బంధ చెరితము మాదిలే

జన్మ సాహిత్య చెలిమి యే జీవితం

జన్మదినము న వేడుక

౦ 

త్రీ। ఇం ।।ఇం । ।ఇంఇం।।। యతి మరియు ప్రాస 

         ఇం ।।ఇం । ।ఇంఇం।।। 

         ఇం ।।ఇం । ।ఇం

నమ్మ వే నా మాట శశి ముఖీ।। నటన

సమ్మతి తెల్పితీ ప్రియ సఖీ

దమ్మును చూడవే దమయంతి ।।।దడను

ఉమ్మడి గాను లే తీరునూ


కమ్మె నా చీకట్లు నీకు నూ ।।।కరుణ

సమ్మోహన తలపు వుందిలే

చెమ్మా గ కంట నీరెందుకో ।।।చరిత

నమ్మితి కనికరం చూపవే


కమ్మ నీ మాట నూ నమ్మ వే ।।। కలిసి

సమ్మె టా పోటు ను భరిద్దాం

బొమ్మలా కాదు లే జీవితం।। బుడగ

సొమ్ము లా సాగే ను నీడ గా


జీవితంలో ఉన్నత పదవి।। జయము

చవిచూడటం నిర్ణయ బతుకు

భావితరాలకు అందించే।।। చదువు 

భవతి భిక్షాం దేహి మలుపుయు


 మాటల్లో మంచి ని చెడ్డను।।। మనసు

మాట బట్టి నడిచే మానవా

ఆటల్లోను నిజాయితీ చూపు।।అలక

వేటలు దేనికి మానవా


రెండు మాటలు రెండు రకములు।।।రభస

మెండు గా జరుగుట సంభవం

రండు అంటూ తిట్లు తిట్టుటే।।। రణము

అండ పిండ బ్రహ్మాండము నందు


సిరి సంపదలు అమితమ్ము గా ।।।।సమయ

సర్వస్వ మనియు బతకాలి

తరువాత ధనము నిప్పు లగును।। దయతొ

చిరునవ్వుతో సంతో షించుము


 2।(ఇ )(ఇ ) (ఇ )(సూ )/ (ఇ ) (ఇ )(ఇ )  ప్రాస యుండాలి 



సామ దానములు గ

ప్రేమను పంచి

ప్రియసఖి కోరిక యుంచు


విరజాజి పువ్వులే

తరువాత తెచ్చి

కరుణతో సుఖమునే పంచు


మరుమల్లి ఓ ప్రియా

సిరులన్ని పెంచి

చిరునవ్వుతో నన్ను ముంచు


ఆశ పాశములన్ని

స్వాస పాఠాలు

దేశము లోన ప్రేమను పంచు


గిరిజ గిరి పుత్రికా

గీర్వాణీ కళలు

గిరివాసినీ ప్రేమ పంచు


ఆనంద రూపిణీ

మన అన్నపూర్ణ

విన్నపాలఅఖిలాండేశ్వరీ

 

1।ఛందస్సు 2(ఇ )/ (ఇ )(సూ )/ (ఇ ) (ఇ )(సూ ) ప్రాస యుండాలి  

 ఛందస్సు - వసు షట్పది 

8 / 8 / 8 - 6 లేక 7 మాత్రలు 

అష్టపది...పదిలం ప్రేమ


కష్ట పెడుతున్న

ఇష్ట పడుతున్న

నష్ట మౌతున్న పదిలం ప్రేమ


బీద తనమందు

బాధ పడుటందు

సాధు తనమందు పదిలం ప్రేమ


రేపు వెళ్ళొచ్చు

మాపు రావచ్చు

కైపు పోవచ్చు పదిలం ప్రేమ


సంపద వున్నా

ఆపద వున్నా

కోపము వున్నా పదిలం ప్రేమ


నమ్మకము ఉంచు

అమ్మకము పెంచు

అమ్మదయ ఉండి పదిలం ప్రేమ


విశ్వాసం ఇది

సుస్వాగత మది

ఐశ్వర్యము అది పదిలం ప్రేమ


కన్న కడుపులో

విన్న పలుకులో

నాన్న కరుణలో పదిలం ప్రేమ


అమ్మ మాటలో

తమ్ము డాటలో

తుమ్మ చెట్టులో పదిలం ప్రేమ


బేల హృదయంలొ

వీలు తరుణంలొ

చేలు పవణంలొ పదిలం ప్రేమ


నవ్వుల నటనలొ

రవ్వల వెలుగులొ

పువ్వుల బంతిలొ పదిలం ప్రేమ


జననంలోనే

మననంలోనే

వినటం లోనే ఫలితం ప్రేమ


దేహమ్ము లోన

దాహమ్ము లోన

స్నేహమ్ము లోన ఫలితం ప్రేమ

0


మగువ ఎదిరించె 

తెగువ చూపించె 

మగడు నిదురించె - శ్యామ వేళ 

మగడు కేకలను  

మగువ  ఏకమును  

జగము నిదురించె - శ్యామ వేళ    

ఖగము నిదురించె 

మృగము నిదురించె 

జగము నిదురించె - శ్యామవేళ 

కప్పెను నల్లని 

దుప్పటివలె నిశి 

చప్పున నోయుష - చల్లు కాంతి

ఒప్పెను వెల్లువ 

చెప్పెను మక్కువ 

తప్పదు ఈ నిష  - చల్లు కాంతి 

నిప్పుయు అనకుము 

తప్పుయు అనకుము 

ఒప్పుగ ఒరవడి - చల్లు కాంతి

తప్పక సూక్తము 

నిప్పుడు కొనుమా 

మెప్పుల మనసున  - మేము మనఁగ 

నచ్చిన యుక్తియు 

మెచ్చిన శక్తియు 

వచ్చిన మనసుతొ -  మేము మనఁగ

అక్కలు అన్నను 

తక్కువ చేయను 

మక్కువ చూపెద - మేము మనఁగ

నిక్కము పల్కులు 

చుక్కల చూపులు 

చెక్కర తీపియు - మేము మనఁగ

కనులతో వచ్చె 

చనువుతో తెచ్చె 

తనువునే పంచె - ధగధగలతో 

అణకువ మెచ్చె 

మనుగడ నచ్చె 

మనసును పంచె - ధగధగలతో 

చినుకులు పడే 

వణకువ వచ్చె

తొణకిస లాడె - ధగధగలతో

ఎక్కడో పుట్టి

ఇక్కడే పెర్గి

మక్కువ చూపు భార్యా మణి

ఎక్కువ అనక

తక్కువ అనక

తక్కెడ లాగ భార్యా మణి

ఒక్కొక్కటి అని

ఇంక్కొక్కటి విని

కక్కు లా పలుకు భార్యా మణి

ఆకాశ నీడ

రాకాసి లోయ

రకాల వేట - కలకల లాడు

భూమాత భక్తి

గోమాత ముక్తి

శ్రీ మాత శక్తి ., కలకల లాడు

కురిసిన వర్షం

మెరిసిన శ్రీర్షం

జరిపిన హర్షం  కలకల లాడు



చెందస్సు చీకటిలో

వెన్నెల చెప్పే

కన్నెల ముప్పే

వన్నెలు చిందే చీకటిలో

తప్పదు భీతీ

ఒప్పదు నీతీ

చెప్పదు జాతీ చీకటిలో

కది లే చెప్పకు

విధి లే ఒప్పకు

మెదిలే ముప్పుయు చీకటిలో

స్ప్రుశించే జీవి

నశించే జీవి

ఆశించే జీవి చీకటిలో

మారేను లక్ష్యం

చేరేను సాక్ష్యం

కోరేను భిక్ష్యం చీకటిలో

అందుకే నేను

పొందుకే నేను

మందుకే నేను చీకటిలో

ఏనాటిది అది

ఆనాటిది ఇది

మానానికి మది చీకటిలో

పరిష్కార మది

తిరస్కార మది

పురస్కార మది చీకటిలో

తిరుగుడు దృశ్యం

పరుగుడు దృశ్యం

గొరుగుడు దృశ్యం చీకటిలో

ముంజుల కోమలి

నంజుకు తినాలి

రంజుగ రసమలి చీకటిలో

జుర్రుకొన సతియు

జర్రున నె పతియు

జుర్రు జుర్రు అనె చీకటిలో

పెద్దల మాటలు

మద్దెల మువ్వలు

వద్దని చెప్పుట దేని కొరకు

పేదల మాటలు

వేదన ఆటలు

చేదని చెప్పుట దేనికొరకు

పంచు కోవటం

పెంచు కోవటం

తుంచు కోవటం మాటలొద్దు

బ్రతికి నన్నాళ్ళు

వెతిక నన్నాళ్ళు

చితికి నా గుర్తు లేదు నీకు

అనుక్షణము ఇది

మరుక్షణము అది

ఒక క్షణము మది లేదు నీకు

అసంతృప్తి గా

సుసంపన్న గా

విశ్వాసమ్ముగా మదియ లేదు

కోపమున ఘనత

తాపమున వినత

పాపమున నడక ఎవరి కొరకు

పిల్లలతొ చెలిమి

స్త్రీ లతో చెలిమి

చెల్లెలతొ చెలిమి ఎవరికొరకు

నేను అనేదియె

నేను వినేది యె

నేను కనేది యె ఎవరి కొరకు

మనమే అనేది

తనమే వినేది

రణము జరిగేది ఎవరి కొరకు

అదీ ఒక్కటై

ఇదీ ఒక్కటై

ఏది ఒక్కటై ఎవరి కొరకు


తొడగొట్టడమే
పడగొట్టడమే
విడగొట్టడమే ఎవరి కొరకు

కుమ్ములాటలే
దుమ్ము వేటలే
దమ్ము మాటలే ఎవరి కొరకు

 



పుడమి గగనపలకరింపు పుట్టుగిట్టు

0



సరియయిన వారెవరు ?
---------------------------
*


లయవిభాతి  వృత్తము
*
గణములు:  న,స,న - న,స,న - న,స,న - న,స,గ 
ప్రాసయతులు- 2,11,20,29
*
కనుల వెలుగే కదలు అణువు చిలికే నియమ 
వినయ సహనమ్ముగను క్షణ వలయ మేలే 
చినుకు కులుకే కదలు వణుకు చలిలా నియమ 
తనువు తపనే కలిగి కనుము గతి నొప్పన్

ఉనికి తెలిపే మదియు మణిమెరుపుయే విధియు 
వినుత మలుపే కళలు అణువణువు కాంతిన్   
కనుల కథయే కదలు తనువు తపనే మదియు  
జనుల మనసే తలపు తనువు సహనమ్మున్   
    


     
శిరముపయి జాబిలియు సురఝరియు శోభిలఁగఁ   
గఱిమెడను నో యగము సరముగతి నొప్పన్
దరినిలిచి పుత్రులుగ నిరతిమెయి బూజలిడి  
గరిముఖుఁడు షణ్ముఖుఁడు హరుని నుతియింపం
గరుణమెయిఁ గాయుచును నిరతమును జీవులను 
సురనరుల కందఱికి నరుసమలరంగాఁ
బరమశివుఁడాడునట గిరిపయిన మోదముగ 
గిరితనయ వామమున వరల సగమేనై

*
పురహరుఁడు శ్రీధరుఁడు స్మరహరుఁడు నారదుఁడు 
హరిసఖుఁడు భూతినిడు వరదుఁడునుఁ దానే 
వరుఁడయిన రామునిది స్మరణమును సల్పుచును 
గరిమమున ధ్యానమున ముఱిసెడిది తానే 
గురుమహిమ పార్వతికిఁ బెరిమమున దెల్పుమిష   
ధరణిజను లందరికి నెఱుకనిడెఁ దానే
హరుని కృప నెన్నుటకు సరియయిన వారెవరు 
విరిసినను హృత్కమల మరుణరవి కాంతిన్  
*
సుప్రభ 
8:02 PM
05-22-23




ముర


సుగుణ వల్లిని  ప్రేమ చేసితి శుద్ధతత్వము గానులే  సద్దు చేసి కోరాలి 

మగణి మాటకి మాయ వీడి మంచి చేసి తీరాలి 

అరకు ఆశను తీర్చి వేటు నుంచి మార్పు తేవాలి 
చెరకు తీపియు చూసి ఘాటు ప్రేమ తీర్పు ఇవ్వాలి 

మమత అంతయు చూపి కాల మార్పు అందు కోవాలి     
కలల పంతము మాని అన్న దాత ప్రేమ పండాలి
   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి