6, ఏప్రిల్ 2021, మంగళవారం

సంపంగి శాపం!!...

 ఎంతో సువాసన ఇచ్చే సంపంగి పుష్పమును దేవుని పూజ లో ఉపయోగించము,,కారణము ఏమిటో తెలుసుకొందాము,, ఒకానొక కాలంలో ఒక దురాత్ముడు ఉండేవాడు. అయినను అతడు నిత్య శివపూజాసక్తుడు. ప్రతిదినం సంపెంగలచేత శివుని పూజించి ఆయన కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రుడైనవాడు.

 ఆ దేశపు చక్రవర్తినే శాసించగల స్థితికి చేరుకున్నవాడు. చక్రవర్తి అంతటి వాడిని, పాదాక్రాంతుడిగా చేసుకున్న గర్వంతో అతడు ప్రజలను పీడించసాగాడు. కానీ, అతడిపై ఫిర్యాదు చేసినా రాజు పట్టించు కొనేవాడుకాదు.

 ఇలా ఉండగా - అతడు ప్రతిరోజు తన అర్చన (సంపెంగపూలతో) మానివేయకుండా జాగ్రత్త పడుతూవచ్చాడు. ఆ కారణాన అంతులేని శివానుగ్రహానికి పాత్రుడయ్యాడు. నారదుడు ఓసారి భూలోక సంచారార్థం వచ్చినప్పుడు ఈ వైనం అంతా చూశాడు. కానీ ఆయనకు మొదట్లో ఈ దుష్ఠుని అంతర్యం అంతుపట్టలేదు.

 అతడెటువంటివాడని అడగ్గా, సంపంగి బదులివ్వలేదు. కేవలం ఆ దుష్టబుద్ధి అకృత్యాలకు భయపడి సంపంగి మారుపల్కలేదు.

 అయినా దేవర్షి అంతటివాడు అడిగినప్పుడు సత్యం చెప్పాలి కదా! దుష్టుని బెదిరింపు వల్ల చెప్పలేకపోవచ్చు! అసత్యమేల? నారదుడు తరచి తరచి ప్రశ్నించినా తనకేమీ తెలియదంది సంపంగి. అసత్యదోషానికి పాల్పడినందువల్ల 'నేటినుంచీ నీ పూలు శివపూజార్హత కోల్పోవుగాక!' అని శపించాడు నారదుడు.

 అంతవరకు శివప్రీతికరమైన సంపెంగకు శివపాద సన్నిధి చేరే అవకాశం నశించింది.

(శ్రీ శివ మహాపురాణము నుండి సేకరించిన కధ)...🌞🙏🌹🎻

.....🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

🌞కర్మ సిద్థాంతం చాలా కఠినమైనది.అది ఎవ్వరికీ అర్థంకాదు

మహాజ్ఞానులను కూడా మోసం చేస్తుందికర్మ

నుఅనుభవించాలి .నిందిస్తే ప్రయోజనం లేదు .రమణ మహాశయలు వారు ప్రతిదినము  స్నానం కొరకు  నదికి పోతుండేవారు. ఆయన వెంట కృష్ణా  అను భక్తుడు పోయెడివాడు. 

ఒకనాడు రమణ మహాశయులు నదికి పోతుంటే ఉన్నట్టుండి ,తన వెనుకనున్న కృష్ణా  తో " కృష్ణా  ! నేను కట్టుకున్న పంచెను కొంచెం చించు ".అని అన్నారు 

కృష్ణా కు అర్ధం కాలేదు .వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు నడుస్తూనే ఉన్నారు .

ఇంతలో ఒక ఇటుక వచ్చి రమణ మహాశయుల కాలివేలు,మీద పడినది . కాలి వేలు చితికింది .రక్తం కారుతుంది .ఆ రక్తాన్ని ఆపేందుకు రమణ మహాశయులు పంచెను చింపమన్నారని అర్థం చేసుకున్నాడు,కృష్ణా అప్పుడు గ్రహించాడు,వెంటనే రమణ మహాశయుల పంచెను చింపి, కట్టు కట్టాడు ,ఆనుకోకుండా జరిగిన ఆ సంఘటను గుర్తించి ,రమణ మహాశయులతో 

మహారాజ్ ! ఇటుక వచ్చి మీ కాలివేలు మీద 

పడుతుందనే విషయము ముందే మీకు తెలుసు కదా ! మరెందుకు ఆ ఇటుక దెబ్బనుంచి తప్పుకోలేదు ? " అని ప్రశ్నించారు ,అప్పుడు రమణ మహాశయులు కృష్ణా తో " ఆలా  జరగదు కృష్ణా ! పక్కకి తప్పుకొంటే ,ఎప్పుడో 

ఒకప్పుడు వడ్డీతో సహా కర్మను అనుభవించాల్సిందే ,రుణం ఎంత తొందరగా 

తీరిపోతే అంత మంచింది కదా ! "అని అన్నారు.

కర్మ శేషాన్ని ఎవరయినా అనుభవించ వలసిందే.

ఓం శ్రీ అరుణాచల రమణాయ నమో నమః

ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక 

విధేయుడు  మల్లాప్రగడ శ్రీదేవి  రామకృష్ణ 

[05:37, 04/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

774వ నామ మంత్రము 4.1.2021

ఓం మహత్యై నమః

 సర్వలోకపూజిత మరియు మహత్తైన పరిమాణంగలిగన పరబ్రహ్మస్వరూపిణియైన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహతీ యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం మహత్యై నమః అని ఉచ్చరించుచూ, భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని పూజించు భక్తులకు ఐహిక సుఖశాంతులు మరియు ఆముష్మిక సద్గతులను ప్రసాదించును.

భగవంతుడు అంటే అందరికన్నా పెద్దవాడు. అట్టి భగవంతుడిని మహాన్ అని పిలుస్తారు. మహాన్ అనే శబ్దం పుంలింగ శబ్దము. ఈ శబ్దానికీ మహతీ యనునది స్త్రీలింగ శబ్దము. భగవాన్ అని భగవంతుడిని అనినట్లే  భగవతీ అని అమ్మవారిని అంటాము. అలాగే ఈ మహతీ అనే శబ్దం అమ్మవారిని అందరికన్నా పెద్దది అని చెప్పునపుడు అంటాము. ఆ తల్లి మహనీయురాలు. దేవతలందరిచేత పూజ్యురాలు. సృష్టికి ముందే తానున్నది. త్రిమూర్తులకు కూడా ఆదిలోనే ఉన్నది గనుకనే అమ్మవారిని ఆదిపరాశక్తి అని అన్నాము. అలాగే ఇప్పుడు అమ్మవారిని మహతీ యని అన్నాము. బ్రహ్మాండం పరిమాణం ఒక కోటి ఎనబై ఏడులక్షల, డెబ్బై నాలుగువేల, తొమ్మిదివందలఇరవై (1,87,74,920) కోట్ల యోజనములు  ఉంటే, అమ్మవారు ఆ బ్రహ్మాండమంతా తన స్వరూపమై ఉన్నది. అలాంటి బ్రహ్మాండాలు అనేక కోట్లు ఉన్నవి. అటువంటి బ్రహ్మాండము లన్నిటియందూ తానే ఆవరించినది గనుకనే అమ్మవారు మహతీ యని అనబడినది.

మనశరీరంలో గల వెన్నెముక వీణా దండమైతే, ఇడ, పింగళ, సుషుమ్నా నాడులు తంత్రులు కాగా, మూలాధారంలోని కుండలినీ శక్తి ఆ వీణా తంత్రుల నాదమవగా, ఆ వీణానాదమే కచ్ఛపీ యను సరస్వతీ దేవి వీణ. నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ (27వ నామ మంత్రము)    సరస్వతీ దేవి వీణయైన కచ్ఛపీ వీణానాదముకన్నా  అమ్మవారి మధురమైనసల్లాపములు మధురమైనవని అన్నాము. అంటే అక్కడ (27వ నామ మంత్రములో) సరస్వతీ వీణను (కచ్ఛపీ వీణను) ప్రస్తావిస్తే, ఇక్కడ అమ్మవారిని నారదమునీంద్రుని మహతీ వీణగా ప్రస్తావించాము. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓంమహత్యై నమః అని అనవలెను.

 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

200వ నామ మంత్రము 4.1.2021 

ఓం సర్వమంగళాయై నమః

మంగళప్రదములైన వన్నింటినీ ప్రసాదించునది మరియు భక్తుల కష్టములను తొలగించి శుభములను కలిగించు సర్వమంగళస్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వమంగళా యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం సర్వమంగళాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతోను, నిశ్చలచిత్తముతోనూ ఆ జగదీశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ  పరమేశ్వరి వారి జీవనమంతయు మంగళప్రదమొనర్చును మరియు సకలాభీష్టసిద్ధిని ప్రసాదించును.

సర్వమంగళా అనగా సర్వమంగళ స్వరూపిణి. జగన్మాత అష్టాదశ శక్తి పీఠాలలో గయలో ఉన్న సర్వమంగళాదేవి ఒకటి.  పరమేశ్వరి అంటేనే మంగళస్వరూపిణి. స్త్రీలకు సకలసౌభాగ్యాలను చేకూర్చు సౌభాగ్యదేవత మంగళగౌరి. అందుకే వివాహంలో శుభముహూర్తానికి ముందు వధువుచేత గౌరీ పూజ చేయించడం  మన హిందూసాంప్రదాయం. 

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే|

శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే!

సమస్తములైన శుభములకును శుభ కరమగు దానా !శివుని అర్ధాంగి అయిన సమస్తములైన ప్రయోజనములను నెర వేర్చెడి శక్తి గలదానా భక్తులకు పెద్ద దిక్కు అయినదానా ! ముక్కంటి అర్ధాంగి విష్ణుమూర్తి సోదరీ ఓ పార్వతి మాతా ! నీకు నా యీ వందనము చెందును గాక !

భగదారాధన సమయంలో ప్రారంభంలో విఘ్నేశ్వరుని స్మరించుకుంటూ, ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరులను కూడా సంస్మరిస్తు ఇలా అంటాము:-

శ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ 

నామము చేతగాని, రూపము చేతగాని ఏదేవుడు శివుడో, ఏదేవి సర్వమంగళయో ఆ ఇద్దరి స్మరణము సర్వత్ర, సర్వలోకములకూ మంగళకరము. 

దేవాసురులు అమృతము కొఱకై సాగరమథన సమయంలో హాలాహలం ఉద్భవించగా, ఆ హాలాహలాగ్నికి లోకాలు అల్లాడిపోతుంటే జగన్మాత పరమేశ్వరుని ఆ హాలాహల భక్షణము చేయమనినప్పుడు బమ్మెరపోతనా మాత్యులవారు జగన్మాతను సర్వమంగళ యని అన్నారు.

కంద పద్యము

మ్రింగెడి వాఁడు విభుం డని

మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్

మ్రింగు మనె సర్వమంగళ

మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!

భావము

ఆమె సర్వమంగళ కదా మరి; అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ లోకులు అందరికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగు మని పరమశివునికి చెప్పింది.

బ్రాహ్మణుడు, ముత్తైదువ, గోవు, అగ్ని,  బంగారము, నేయి, ఆదిత్యుడు, జలము, రాజు, తులసీదళములు, పుష్పములు, చెరకు, చిక్కుడు, జీలకఱ్ఱ,  ధనియాలు, పాలు, కుంకుమ, ఉప్పు, నల్లపూసలు, పసుపు కొమ్ములు ఇత్యాదులు అన్నియును మంగళకరమైనవి. ఇటువంటివి అన్నియును సదా సమకూరి ఉండునట్లు జగన్మాత అనుగ్రహిస్తుంది గనుక అమ్మవారిని సర్వమంగళా యని అన్నాము. ధనధాన్యములు, పాడిపంటలు, సిరిసంపదలు, అలాగే స్త్రీలకు ఐదవతనమును ప్రసాదించును.

 ఐదవతనము అంటే ఐదు శుభ, మంగళ కర వస్తువులను కలిగి ఉండుట. ఆ అయిదు మంగళ కర వస్తువులు 1.మంగళసూత్రము, 2. పసుపు, 3.కుంకుమ, 4.గాజులు, 5. మట్టెలు. కనుకనే మన హిందూ స్త్రీలు సర్వదా ఈ ఐదు అలంకారములను ధరించి ఉంటారు.  మంగళకరమైస వీటిని స్త్రీలకు సదా కలిగియుండేలా జగన్మాత కరుణించును గనక అమ్మవారిని సర్వమంగళా యని  అన్నాము.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సర్వమంగళాయై నమః అని అనవలెను.

శ్రీలలితా సహస్రనామ భాష్యము

775వ నామ మంత్రము 5.1.2021

ఓం మేరునిలయాయై నమః

మేరు పర్వతము లేదా మేరుప్రస్తారము లేదా మేరు మంత్రము నివాసముగా విలసిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మేరునిలయా యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం మేరునిలయాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు శాంతిసౌఖ్యములు ప్రసాదించును మరియు ఆత్మానందానుభూతిని కలుగజేయును.

పరమేశ్వరిని సుమేరుశృంగమధ్యస్థా యని అన్నాము. మేరు రేవ నిలయో యస్యాః సుమేరు శిఖరం మధ్యలో గొప్పకాంతిగలదై నివాసముగా ఉన్నది లలితాంబ.  ఈ సుమేరు శిఖరం చుట్టూ సూర్యచంద్రులు తిరుగుతూ ఉంటారు. ఈ పర్వతశిఖరం మీద అమ్మవారు మాత్రమే కాకుండా దేవతలు కూడా ఉంటారు. ఈ శిఖరానికి చుట్టూగల సముద్రమధ్యమందు పదునలుగురు నిత్యాదేవతలు కూడా ఉంటారు. బయట పరమాకాశమందు చిత్రాదేవి యను నిత్య ఉంటుంది.

శ్రీచక్రమునకు భూప్రస్తారము, కైలాసప్రస్తారము, మేరుప్రస్తారము అని మూడు ప్రస్తారములు ఉన్నవి. ఈ మూడింటిలో వశిన్యాద్యష్టకముతో (వశినీ, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళినిలతో)  శ్రీచక్రమునకు ఐక్యభావనచేసినచో అది భూప్రస్తారము మాతృకావర్ణములకు (అకారాది క్షకారాంతములు) శ్రీచక్రమునకు ఐక్యభావన చేసినచో అది కైలాసప్రస్తారము. షోడశనిత్యలకు (కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, విచిత్ర, శ్రీవిద్యలకు) శ్రీచక్రమునకు ఐక్యభావనచేసినచో అది మేరుప్రస్తారము. ఇట్టి మేరువే నివాసమై అలరారుచున్నది షోడశనిత్యలలో శ్రీవిద్య అను నిత్యయే పరమేశ్వరి. ఈ మేరుప్రస్తారమే శ్రీచక్రంలోని తొమ్మిదవ ఆవరణ. ఈ విధంగా భావనచేయు విధానము జ్ఞానార్ణవతంత్రంలో తొమ్మిది అక్షరముల మంత్రము నవార్ణవమంత్రము అను పేరుతో మేరువు మంత్రం ఉద్ధరింపబడినది. అట్టి మేరువు మంత్రమే నివాసముగా విలసిల్లినది శ్రీమాత. 

భూమి శ్చంద్ర.శివో మాయా శక్తిః కృష్ణమాదనౌ|

అర్ధచంద్ర శ్చ బిందు శ్చ నవార్ణో మేరు రుచ్యతే॥ (సౌభాగ్యభాస్కరం, 872వ పుట)

1. భూమిః     -   లం

2. చన్ద్రః        -   సం

3. శివః           -   హం 

4.  మాయా    -    ఈం

5.   శక్తిః          -     ఏం

6.   కృష్ణమాద్య -  రం, 

7.   మాదనౌ      -   కం

8.   అర్ధచన్ద్రః -  అః

9.    బిందువు -  అం

ఈ తొమ్మిది వర్ణములు గలదే మేరు మంత్రము. అటువంటి మేరుమంత్ర స్వరూపిణి జగన్మాత. 

విష్ణుపాదాల వద్ద నుండి వెడలిన గంగానది ఈ మేరువునుండే ఉద్భవించినది. అక్కడ నుండి ప్రప్రధమంగా బ్రహ్మలోకానికి వెళ్ళినది. అక్కడ నుండి ధృవపదము, సప్తర్షి మండలాలకు ప్రదక్షిణంగా వెళ్ళి, పిదప చంద్రమండలము దర్శించి, సత్య (బ్రహ్మ) లోకంచేరినది. ఆ తరువాత సీత, అలకనంద, చతుర, భద్ర యను నాలుగు పాయలుగా చీలింది.  జగన్మాత ఈ మేరు శిఖరంమీదే నివాసమైనది గనుక మేరునిలయా యనిఅనబడినది.

ఈ మేరు మంత్రం నుండియే అమ్మవారి మంత్రములన్నియు పుట్టినవని చెప్పబడినది.

ఈ నవార్ణవములనుండి శ్రీచక్రము ఆవిర్భవించిన విధానము

1) ల కారము - పృథివీబీజము - భూపురము

2) స కారము - చంద్రబీజము - షోడశకళాత్మకము - షోడశదళపద్మము

3) హ కారము - శివబీజము - అష్టమూర్త్యాత్మకం - అష్టదళపద్మము

4) ఈ కారము - మాయాబీజము - చతుర్దశభువనాత్మకమైన చతుర్దశారం

5) ఏ కారము - శక్తిబీజము - దశావతారాలకు ప్రతీక అయిన బహుర్దిశారం

6) ర కారం - అగ్నిబీజము - అగ్నికళలతో కూడిన అంతర్దశారం

7) క కారం - మన్మథబీజము వసుకోణాత్మకము - అష్టకోణం

8) అర్ధచంద్రము - త్రిగుణాత్మకము - త్రికోణం

9) బిందువు - పరబ్రహ్మాత్మకము - బిందువు - పరమేశ్వరీ నివాసము.

ఇటువంటి నవార్ణవనిర్మితమైన  మేరువునందు పరమేశ్వరి ఉంటుంది గనుక మేరునిలయా అని అన్నాము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

201వ నామ మంత్రము 05.01.2021

ఓం సద్గతిప్రదాయై నమః

భక్తులకు వారు చేసిన కర్మలననుసరించి, సాధనా పటిమను బట్టి ముక్తిని ప్రసాదించు పరబ్రహ్మస్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సద్గతిప్రదా యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం సద్గతిప్రదాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరాత్పరిని అత్యంత భక్తితత్పరతతో ఉపాసించు సాధకునకు ఆ పరమేశ్వరి భౌతికముగా సుఖశాంతులను ప్రసాదించి, ఆముష్మిక పరమైన సద్గతులకు కావలసిన ధ్యానదీక్షను ప్రసాదించి తరింపజేయును.

సద్గతులు రెండు రకాలు ఒకటి ఇహము, రెండవది పరము. ఐహికమైన వాంఛలతో పరమేశ్వరిని అర్చించిన వాడికి భోగభాగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయి. ఇది ఐహికము. పరము అనగా భగవంతుడు ప్రసాదించి ముక్తి, మోక్షము, ఆత్మానందానుభూతి వంటివి.

పంచబ్రహ్మలు (బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశాన, సదాశివులు) దేవికి అతి సమీపంలో ఉండి ఆమెను సేవించాలి అనుకున్నటువంటి వారై,

బాగా ఆలోచించి సామీప్యముక్తి పొందినట్లైతే అమ్మవారికి అతిసమీపంగా ఉండి ఆ తల్లిని

సేవించవచ్చు అని తలపోసి, విశుద్ధిచక్రంలో ఆమెను ఉపాసించారు. అందువల్ల అమ్మవారికి

సేవకులుగా, అత్యంతదగ్గరగా ఆ తల్లి యొక్క సింహాసనానికి కోళ్ళుగా ఉండగలిగారు.

ఈ విషయాన్ని శంకరభగవత్సాదుల వారు తమ సౌందర్య లహరిలోని 92వ శ్లోకంల వర్ణిస్తూ

గతా స్తే మఞ్చత్వం - ద్రుహిణహరిరుద్రేశ్వరభృతః

శివస్స్వచ్ఛచ్ఛాయా - కపటఘటిత ప్రచ్ఛదపటః|

త్వదీయానాం భాసాం - ప్రతిఫలనరాగారుణతయా

‌శరీరీ శృంగారో - రస ఇవ దృశాం దోగ్ధి కుతుకమ్‌||92||

ఓ జగన్మాతా ! బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు అనే నలుగురు నీవు కూర్చునే

సింహాసనానికి కోళ్ళుకాగా సదాశివుడు నువ్వు కప్పుకునే దుప్పటి అయినాడు. శ్రీచక్రంలో ఐదు ‌శక్తిచక్రాలు, నాలుగు శివచక్రాలు ఉన్నాయి. ఇందులోని శక్తిచక్రాలే పంచబ్రహ్మలు. ఈ శక్తిచక్రాలకు పైన దేవి ఉంటుంది. కాబట్టి ఆమె పంచబ్రహ్మాసనస్థితా అనబడుతోంది. మానవ శరీరంలో షట్బక్రాలున్నాయి. ఆ చక్రాలలో ప్రతిదానికీ అధిదేవతలున్నారు.

ఆధారచక్రానికి అధిదేవత - గణపతి

స్వాధిష్టానానికి అధిదేవత - బ్రహ్మ

మణిపూరానికి అధిదేవత - విష్ణువు

అనాహతానికి అధిదేవత - రుద్రుడు

విశుద్ధిచక్రానికి అధిదేవత - మహేశ్వరుడు

ఆజ్ఞాచక్రానికి అధిదేవత - సదాశివుడు

వీటన్నింటికీ పైన సహస్రారంలో ఆ పరమేశ్వరి ఉంటుంది. కాబట్టి ఆమె

పంచటబ్రహ్మాసనస్థితా అని చెప్పబడుతోంది.

కర్మలఫలితముననుసరించియే సంస్కారము ఏర్పడుతుంది. భగవద్భక్తి అనేది, సత్ప్రవర్తన అనునదికూడా పూర్వజన్మ కర్మలవాసన ననుసరించియే మానవునిలో ఏర్పడుతుంది. హరిద్వేషియైన హిరణ్యకశిపునికి  హరిభక్తుడైన ప్రహ్లాదుడు పుత్రునిగా జన్మించాడు. బోయవాడు వాల్మీకిగా మారి మహాకావ్యాలను వ్రాశాడు. మేకలకాపరి కాళికాదేవిభక్తుడై మహాకవి కాళిదాసుగా సంస్కృతమహాప్రబంధములను సృష్టించాడు. ఇదంతా పూర్వజన్మవాసనేగదా. 

జన్మలలో ఉత్తమమైనది మానవ జన్మ. అందునా భగవద్భక్తితత్పరత కలిగియున్న జన్మ మరింత ఉత్తమం. జగన్మాత నామస్మరణతో జన్మసాఫల్యత సాధించడం అనేది ఉత్తమాతి ఉత్తమం. 

దుర్వాస మహాముని శ్రీచక్ర పూజాఫలాన్ని ఇలా చెప్పడం జరిగింది.

ఆశానాం పూరకం చక్రం అర్చకానాం అహర్నిశం

ఆ దేవిని ఏ కోరికతో అర్చిస్తే అది తీరుతుంది. ఈ జగత్తులో ఇహం కావాలి అంటే పరం ఉండదు. పరం కావాలంటే ఇహం ఉండదు. అనగా భోగభోగ్యాలు కావాలి అంటే ముక్తి ఉండదు. అలాగే ముక్తికావాలంటే భోగభాగ్యాలను త్యజించాలి.

యత్రా పిభోగో న చ తత్ర మోక్షః యత్రా పి మోక్షోన చ తత్ర భోగః

శ్రీ సుందరీ సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ ॥

కాని పరమేశ్వరిని అర్చించిన వారికి భోగము, మోక్షము ఏది కావాలంటే అది దొరుకుతుంది. అందుకే ఆ పరమేశ్వరిని స్వర్గాపవర్గదా అని అన్నాము.

ఈ జగత్తులో చతుర్దశభువనాలున్నాయి. అందులో భూలోకానికి పైన ఆరు లోకాలున్నాయి. మానవుడు చేసిన కర్మ ఆధారంగా అతడు పైలోకాలకుపోతాడు. అవన్నీ సద్గతులే.

మానవుడు తాను చేసిన కర్మఫలాన్ని బట్టి ఉత్తరజన్మ పొందుతాడు. లోకంలో 84 లక్షల రకాల జీవరాసులున్నాయి. క్రిమికీటకాలు, పశువులు, పక్షులు, జంతువులు, మృగాలు, కుక్కలు, పిల్లులు చివరకు మానవుడు అన్ని జన్మలలోకి మానవజన్మ

దుర్లభమైనది.

జగన్మాతను అర్చించిన మానవుడు 

తాను చేసిన కర్మలనునసరించి సద్గతులు ఆ తల్లి ప్రసాదిస్తుంది.    ఆ  సద్గతులు ఐదు రకాలు గా వర్ణించబడినది.

అవి 1. సార్షిరూపముక్తి, 2. సాలోక్యముక్తి, 3. సామీప్యముక్తి, 4. సారూప్యముక్తి, 5. సాయుజ్యముక్తి.

మణిపూరం లో పరమేశ్వరిని అర్చించేవారు ఆ తల్లికి దగ్గరగా ఇంకొక పురము నిర్మించుకుని ఉంటారు. దీన్ని సార్షిరూపముక్తి అంటారు

అనాహతం లో ఆ తల్లిని అర్చించేవారు శ్రీమన్నగరంలోనే నివసించగలుగుతారు.

దీన్ని సాలోక్యముక్తి అంటారు.

  విశుద్ధిచక్రం లో అమ్మవారిని అర్చించేవారు ఆ తల్లికి అతిదగ్గరగా సేవకులుగా ఉంటారు.

దీనినే సామీప్యముక్తి

ఆజ్ఞాచక్రం లో లలితాంబను అర్చించేవారు వేరే దేహం ధరించి దేవితో సమానమైన

రూపంలో ఉంటారు. ఇది సారూప్యముక్తి

 సహస్రారం లో పరమేశ్వరిని అర్చించేవారు జన్మరాహిత్యం పొందుతారు. వీరికి మరుజన్మ

ఉండదు. ఇది శాశ్వతమైన ముక్తి. దీనినే సాయుజ్యం  అంటారు.

ఇవేకాక భక్తులకు వారివారి కర్మానుసారము స్వర్గనరకాలు ప్రాప్తిస్తాయి.

స్వర్గసుఖాలు ఎంతకాలం అనుభవించాలి ? తిరిగి ఎప్పుడు జన్మించాలి ? అనేది

నిర్ణయించేది కూడా ఆ పరమేశ్వరీ. ఈ రకంగా ఆ అమ్మ మానవులకు సద్దతులను ప్రసాదిస్తుంది.

పద్మపురాణంలో చతుర్దశినాడు మూడు కాలములందు శ్రీమాతను ఎవరైతే పూజిస్తారో వారు పరాస్థానము పొందుతారు అని చెప్పబడింది.

ఈ విధంగా సాధకుడు చేసే అర్చనా విధానాన్ని బట్టి అతడికి ముక్తి (సద్గతి) లభిస్తుంది. కాబట్టి ఆ తల్లిని సద్గతిప్రదా అని అన్నాము.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సద్గతిప్రదాయై నమః అని అనవలెను.

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

776వ నామ మంత్రము 06.01.2021

ఓం మందార కుసుమ ప్రియాయై నమః

దేవ పుష్పమైన మందార పుష్పము లేదా తెల్లజిల్లేడు పువ్వు అనిన ప్రీతిగలిగిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మందారకుసుమప్రియా యను  ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం మందార కుసుమప్రియాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ శ్రీమాతను అత్యంత భక్తిప్రపత్తులతో  ఉపాసించు సాధకునకు ఆ పరమేశ్వరి బ్రహ్మజ్ఞానతత్త్వమును తెలియు విధముగా అనుగ్రహించి తరింపజేయును.

సిందూరారుణవిగ్రహాం,  సిందూరం మాదిరిగా ఎర్రని శరీరము గలగి - నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా - ఎర్రని శరీరకాంతితో సమస్త బ్రహ్మాండములను ప్రకాశింపజేయునది,  రక్తోత్పలం బిభ్రతీం-  ఎర్రని కలువను ధరించినది. రత్నఘటస్థ రక్తచరణాం రత్నఘటమునందు ఎర్రని పాదాలు ఉంచినది, అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్కత్కటీ తటీ-  కటిప్రదేశమున ఎర్రని వస్త్రముతో విరాజిల్లునది, ఇంద్రగోప పరిక్షిప్తస్మరతూణాభ జంఘికా-  ఎర్రని రంగుతో ఉన్న ఆరుద్రపురుగులచే చెక్కబడిన మన్మథుని అమ్ములపొదిలా ఉన్న జంఘకలు కలిగినది.  ఇలా సర్వారుణా దేహమంతయూ అరుణ వర్ణమై ప్రకాశించు జగన్మాతకు అదే అరుణవర్ణము గలిగిన మందార పుష్పము అంటే అత్యంత ప్రీతిగలిగియున్నది గనుకనే మందారకుసుమప్రియా యని అనబడినది.   జగన్మాతకు అరుణ వర్ణమనిన అంత ప్రీతిగలిగినది. మందార పుష్పాన్ని జపాకుసుమము అని కూడా అంటారు. ఇంతకు ముందు జపాపుష్పనిభాకృతిః అని 766వ నామ మంత్రముతో  అమ్మవారిని స్తుతించాము.

మందారకుసుమములు దేవఫుష్పములు. దేవతార్చనకు మందారములు అత్యంత ప్రాశస్త్యము గలిగియున్న పుష్పములు. దేవుని మందిరమునకు నిండుతనాన్ని కలిగిస్తుంది. పవిత్రతను చేకూరుస్తుంది. మందారపుష్పంతో చేయు అర్చనలో మనసు ఎంతో ఆనందమనుభవిస్తుంది. 

జగన్మాతకు మందారమనిన అత్యంత ప్రీతిదాయక మగుటచే మందార కుసుమప్రియా యని నామ ప్రసిద్ధమైనది.

అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మందారకుసుమప్రియాయై నమః అని అనవలెను.

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:19, 06/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

202వ నామ మంత్రము 06.01.2020

ఓం సర్వేశ్వర్యై నమః

సకలలోకాలకు ప్రభ్విణియు, త్రిమూర్తులను, త్రిశక్తులను, ఇంద్రాదిదేవతలను, దిక్పాలకులను వారి వారిస్థానములందు నియమించినదియు, వారిచేత ఆరాధింపబడునదియు అయిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వేశ్వరీ యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం సర్వేశ్వర్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు సకల సౌభాగ్యములు, సిరిసంపదలు ప్రసాదించుటయే గాక, సదా ఆ పరమేశ్వరి పాదసేవయే తన భక్తులకు జీవన పరమావధిగా అనుగ్రహించును.

సకల చరాచర జగత్తులకు తానే మూలప్రకృతియై విరాజిల్లుచున్నది ఆ జగన్మాత. సృష్టికి పూర్వమే ఆదిపరాశక్తిగా తానున్నది. సకల జగత్తులను సృష్టించు క్రమములో ప్రణాళిక రచన చేసినది ఆ తల్లియే. సృష్టికి బ్రహ్మ, స్థితికి విష్ణువును, లయకు పరమేశ్వరుడిని, అష్టదిక్కులకు దిక్పాలకులను,   జీవుల జీవనగతులను నియంత్రించ నవగ్రహములను నియోగించి సామ్రాజ్యదాయిని  (692వ నామ మంత్రము) యై వివిధ విభాగములలోని ఆయా లోకపాలుర కార్యక్రమములను తానే పర్యవేక్షణచేయ సమకట్టి రాజరాజేశ్వరి. (684వ నామమంత్రము - బ్రహ్మాది దేవతలకు, లోకపాలురకు ఈశ్వరి) గాను, రాజ్యవల్లభ గాను విరాజిల్లు పరమాత్మ అమ్మవారు.. పంచకోశములకు (అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ) అధికారిణిగా కోశనాథ గా విరాజిల్లుచున్నది ఆ పరమేశ్వరి. సూర్యచంద్రుల  ప్రకాశానికీ, నదీనదముల ప్రవాహానికి, సప్తసాగరములు హద్దులు దాటకుండుటకు, ఆకాశము అక్కడేయుండుటకు, భూమి కంపింపకుండుటకు తన ఆజ్ఞయే కారణము. భూమికంపించినా, వరుణుడు ప్రకోపించినా అది మితిమీరిన పాపంపై తన కోపంగా, తను తెరచిన మూడవకన్నని తెలియజేయు దురాచారశమని ఆ జగన్మాత.

సకలజగత్తును సృజించి, పోషించి, శాసించి పిదప తనయందే లయము  చేసుకొనుచున్నది.

అతఏవ సర్వస్వామిత్యాత్ సర్వేశ్వరీ  సర్వవిశ్వమునకు స్వామినియనది గనుక జగన్మాత సర్వేశ్వరీ యనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సర్వేశ్వర్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

[04:11, 07/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

777వ నామ మంత్రము 07.01.2021

ఓం వీరారాధ్యాయై నమః

శ్రీవిద్యోపాసకులలో శ్రేష్ఠులు, నిరంతరము ఆత్మానందాన్ని అనుభవించేవారు, ద్వైతభావనలేనివారు, పరమజ్ఞానులు - వీరందరిచే ఆరాధింపబడు బ్రహ్మజ్ఞానస్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి వీరారాధ్యా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం వీరారాధ్యాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు  భౌతికముగా సకల సుఖసంతోషములు ప్రసాదిస్తూ, సద్గతులను పొందుటకు కావలసిన నిశ్చలచిత్తముతో కూడిన భగవధ్యాననిమగ్నతను కలిగేలా అనుగ్రహించి తరింపజేయును.

 నేను, ఇది, ఈ శరీరంనాది, ఇదంతా నాకు సంబంధించినదే అను     దేహాభిమానము లేకుండా, ఈ దేహంలోని ప్రాణశక్తే పరబ్రహ్మము అని తెలిసి, దానినే అనుభూతికి తెచ్చుకొనినవాడు వీరుడు. శ్రీవిద్యోపాసకులలో శ్రేష్ఠులు వీరులు అనబడతారు. నిరంతరము ఆత్మానందాన్ని అనుభవించువారు, జీవాత్మ పరమాత్మలు రెండూ ఒకటే అనే అద్యైత భావన కలవారు, పరమజ్ఞానులు వీరులనబడతారు. 

శ్రీవిద్యను మన వరకూ తీసుకువచ్చిన మహానుభావులు పదునాలుగు మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవతా స్థాయి వాళ్ళు. మానవ స్థాయిలో ఉన్న ఋషులు చాలామంది ఉన్నారు. శంకరులు మొదలైన వారెందరో. కానీ దేవతలకు సంబంధించిన మనం వారి సిద్ధ్యౌఘ, దివ్యౌఘ, పాదౌఘ అని కూడా అంటూంటాం. ఇలా అనేకమంది ఉన్నారు. కానీ ప్రధానంగా పద్నాలుగు మంది. వీరిని ఎప్పుడూ తలచుకోవాలి. వీళ్ళు శ్రీవిద్య ఉపాసన వల్ల శక్తి పొంది జగద్రచన చేస్తారు. వాళ్ళు ముందుగా శివుడు - ఆయనొక పెద్ద భక్తుడు. అందుకే శివారాధ్యా అని  అమ్మవారిని అంటున్నాం. విష్ణువు, బ్రహ్మ,  మనువులు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు, స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, మన్మథుడు - మన్మథుడు ఉపాసించిన శ్రీవిద్యే మనకు ప్రసిద్ధి. ఇప్పుడు చేస్తున్న పంచదశీ విద్య అంతా మన్మథుడు చేసినదే. వీళ్ళు ఎలా ఉపాసించారు అన్నది మనకు తెలియదు. వాళ్ళయొక్క మంత్రవిద్యలు వేరు. వాళ్ళందరూ అమ్మను ఉపాసించారు అని తెలుసు కానీ వాళ్ళ పద్ధతులు ఏవో మనకు తెలియవు. మనం ఉపాసిస్తున్నది మన్మథ విద్య - కామరాజ విద్య. అదే ఆత్మ విద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా అమ్మ ఇచ్చాశక్తి స్వరూపిణి కదా! ఆవిడ అనుగ్రహం లేకపోతే మన్మథుడు ఈ ప్రపంచం నడపలేడు. ఇంద్రుడు, బలరాముడు, దత్తాత్రేయుడు, దూర్వాసుడు వీరు కూడా శ్రీవిద్యోపాసకులుగా చెప్పుకుంటాము. కాని మన్మథుడు వరకు చెప్పి ఊరుకుంటారు కొందరు. దత్తాత్రేయుడు పెద్ద శ్రీవిద్యోపాసకుడు. ఆయన పరశురాముడికి శ్రీవిద్యోపాసన తెలియజేశాడు. కనుక వీరందరూ అమ్మవారిని ఆరాధించేవాళ్ళే.  ఇలా వీళ్ళందరి చేతా ఆరాధించబడినది. వీరందరూ మహావీరులుగా చెప్పుకుంటాము.

జగన్మాత ఇటువంటి వీరులచేత, మహావీరులచేత ఆరాధింప బడుతుంది గనుక వీరారాధ్యా యని అనబడినది. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం వీరారాధ్యాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🌸🌸💐💐💐

[04:11, 07/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

203వ నామ మంత్రము 07.01.2021

ఓం సర్వమయ్యై నమః

అన్ని తత్త్వములందును ఇమిడియుండి సర్వతత్త్వమయిగా విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వమయీ యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం సర్వమయ్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి సర్వాభీష్టసిద్ధి కలుగజేయును.

ఇంతకు ముందు, 202వ నామ మంత్రము నందు జగన్మాతను సర్వేశ్వరీ - సకల జగత్తులకు ఆ తల్లియే ఈశ్వరి యని అన్నాము. సర్వాధిపత్యము కలిగినది ఆ జగన్మాత అని చెప్పుకున్నాము. సర్వమయీ యను  నామ మంత్రములో శివుని నుండి పృథివి వరకు గల ముప్పది ఆరు తత్త్వముల స్వరూపురాలుగా జగన్మాత విరాజిల్లుచున్నది యని తెలియజేయబడినది. అందుచే సర్వమయీ యని అనబడినది.

ముప్పది ఆరుతత్త్వములు

పంచభూతములు (5)

+

 1. పృథ్వీతత్త్వము, 2. ఆపస్తత్త్వము, 3. తేజస్తత్త్వము, 4. వాయుతత్త్వము, 5. ఆకాశతత్త్వము.

పంచతన్మాత్రలు (5)

1. శబ్దతత్త్వము, 2. రూపతత్త్వము, 3. రసతత్త్వము, 4. గంధతత్త్వము, 5. స్పర్శతత్త్వము, 

జ్ఞానేంద్రియములు (5)

1. శ్రోత్రము, 2. చర్మము, 3. చక్షుస్సు, 4. జిహ్వ, 5. నాసిక.

 కర్మేంద్రియములు (5)

 1. వాక్కు, 2. హస్తములు, 3. పాదములు, 4. పాయువు, 5. ఉపస్థ.

సప్తధాతువులు (7)

 1. రక్తము, 2. మాంసము, 3. త్వక్కు, 4. మేదస్సు, 5. స్నాయువు, 6. అస్థి, 7. మజ్జ.

మనస్సు (1)

ప్రాగ్ పశ్చిమ దక్షిణ, ఉత్తర వాయువులు (4)

మాయాతత్త్వము,  శుద్ధవిద్యాతత్త్వము, మహేశ్వర తత్త్వము,  సదాశివతత్త్వము - (4)

పైన చెప్పిన పృథివి నుండి శివుని వరకూ గల ముప్పది ఆరు తత్త్వములలో జగన్మాత ఉన్నది గనుక అమ్మవారు సర్వమయీ అని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సర్వమయ్యై నమః అని అనవలెను.

శ్రీలలితా సహస్రనామ భాష్యము

204వ నామ మంత్రము 08.01.2021

ఓం సర్వమంత్రస్వరూపిణ్యై నమః

మూలవిద్యనుండి పుట్టిన సప్తకోటి మంత్రములకు స్వరూపిణియై విరాజిల్లు పరబ్రహ్మస్వరూపిణియైన  జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వమంత్రస్వరూపిణీ  యను ఎనిమిదక్షరముల  (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం సర్వమంత్రస్వరూపిణ్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు సాధకునకు ఆ తల్లి కరుణచే సకలాభీష్టసిద్ధి కలుగును.

 అన్ని విద్యలకూ ఆదివిద్యను మూలవిద్య అందురు. అటువంటి మూలవిద్యనుండి ఉద్భవించిన సప్తకోటి మహామంత్రాలకు మంత్రాధ్వయని అనిపేరు. ఇట్టి మంత్రాధ్యయనియే పరమేశ్వరి స్వరూపము. అందుచే జగన్మాత సర్వమంత్రస్వరూపిణీ యని అన్నాము.

మంత్రము అంటే మననాత్ త్రాయతే ఇతి మంత్రః - దేనిని మననం చేయుకొలదీ రక్షణ చేయగలదో దానిని మంత్రం అన్నాము. 

మంత్రం అనేది బీజాక్షరముల సముదాయముతో ఏర్పడినది.  ఉదాహరణకు మర్రిచెట్టు స్థూలపదార్థమయితే ఆ మర్రిచెట్టుకు మూలమయిన బీజము (మర్రివిత్తనము)  సూక్ష్మమయినది. ఈ సూక్ష్మమయినదే మంత్రము. 

మంత్రము అనేది బీజాక్షరము గాని బీజాక్షరముల సముదాయముగాని అవుతుంది అనుకున్నాంగదా! . ఉదాహరణకు బాలాత్రిపురసుందరీ మంత్రములో ఐం క్లీం  సౌ తీసుకుంటే ఇందులో మొదటి బీజము ఐం ఈ బీజం జపిస్తే వాక్ వస్తుంది. గనుక ఈ ఐం అనేది వాగ్బీజము. తరువాత క్లీం ఇది కామరాజ బీజము. అనగా కోరిన కోరికలు తీర్చు బీజము. ఈ బీజం జపిస్తే  కోరికలు సిద్ధిస్తాయి. మూడవది సౌ అనగా శక్తి బీజము. ఈ బీజం  జపిస్తే మనసుని, శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. 

ఈవిధమైన బీజములు మూలవిద్యలో ఏడు కోట్లు ఉన్నాయి. ఇవి అమ్మవారి స్వరూపంగా భావించి అమ్మవారిని సర్వమంత్రస్వరూపిణీ యని అన్నాము.

జగన్మాత మూలప్రకృతిస్వరూపిణి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు, అష్టదిక్పాలకులు, నవగ్రహములు, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, పంచభూతములు, జీవకోటి ఏర్పడ్డాయి. వీనిలో దేనిని ఆరాధించిననూ, జగన్మాతయే మూలమగుటచే,ఆ తల్లి మూలప్రకృతియనియు అన్నాము. ఏ మంత్రముతో ఏ దేవతను ఆరాధించిననూ, అన్నిటికీ శ్రీమాతయే మూలము గనుక ఆ తల్లిని సర్వమంత్రస్వరూపిణీ యని అన్నాము. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సర్వమంత్రస్వరూపిణ్యై నమః అని అనవలెను.

[05:35, 08/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

778వ నామ మంత్రము 08.01.2021

ఓం విరాడ్రూపాయై నమః

చతుర్దశభువనములలో విస్తరిల్లిన సమిష్టిరూపమై, అదే విరాడ్రూపముగా (విశ్వరూపముగా)  విరాజిల్లు ఆదిపరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి విరాడ్రూపా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామమంత్రమును ఓం విరాడ్రూపాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ శ్రీమాతను ఉపాసించు సాధకునకు పరబ్రహ్మతత్త్వాన్ని తెలియగలిగే దిశగా ధ్యాననిమగ్నుడై తరించును.

ఈ సమస్త విశ్వమే తన స్వరూపంగా విరాజిల్లుతుంది గనుక జగన్మాత విరాడ్రూపా యని అనబడినది. విశ్వము అంటే సృష్టి. గనుక ముందు సృష్టి గురుంచి తెలుసుకుందాము. సృష్టిక్రమంలో మొదట అజ్ఞానము లేక అవ్యక్తము సృష్టింపబడినది. దీనినే తమస్సు అన్నాము. తరువాత మహత్తత్త్వము ఉద్భవించినది. దీనినుండి అహంకారము పుట్టినది. ఈ అహంకారము సత్త్వరజస్తమోగుణాత్మకము.  అనగా  సత్త్వ గుణము - శాంతి, సదాచారము, సద్గుణము మరియు ప్రసన్నత తో ఉంటుంది. రజో గుణము వలన అంతులేని కోరికలు మరియు ప్రాపంచిక అభ్యున్నతి కోసం తృప్తినొందని తృష్ణ, కలుగుతాయి. ఇక తమో గుణము వలన భ్రమ, సోమరితనం, మత్తు మరియు నిద్ర కలుగుతాయి. ఇటువంటి త్రిగుణాత్మకమైన అహంకారమునుండి శబ్దస్పర్శరూపరసగంధములనెడి పంచతన్మాత్రలు వెలువడినవి. వీటిని సూక్ష్మభూతములనికూడా అంటారు. వీటిలోనే జ్ఞానశక్తులు అనగా జ్ఞానేంద్రియములు (శబ్దము నుండి చెవి, స్పర్శ నుండి చర్మము, రూపము నుండి కన్ను, రసము నుండి నాలుక, గంధము నుండి నాసిక) ఏర్పడినవి. జ్ఞానశక్తులయిదింటి సముదాయమునుండి అంతఃకరణము కలిగినది.  అలాగే ఒక్కొక్క క్రియాశక్తినుండి  ఒక్కొక్క ఇంద్రియము చొప్పున అయిదు కర్మేంద్రియములు ఏర్పడినవి. ఈ కర్మేంద్రియములను వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ అని అంటారు. క్రియాశక్తులు అయిదింటినుండి పంచప్రాణములు కలిగినవి. సూక్ష్మభూతములయిన శబ్దాదులనుండి స్థూలములగు ఆకాశాది పంచభూతములు పుట్టినవి.  ఇది సృష్టియొక్క అసలైన స్థితి. ఆత్మచైతన్యము జీవుల స్థూలభూతములతో కలిసనప్పుడు విశ్వుడని. పిలువబడును. సూక్ష్మభూతములతో కలిసినప్పుడు తైజసుడని పిలువబడును. కారణోపాధితోగూడినప్పుడు ప్రాజ్ఞుడనబడును. ఇది జీవుల సృష్టి వివరము. ఆత్మచైతన్యము స్థూలభూతసమిష్టితో గలసినప్ఫుడు వైశ్వానరుడు (విరాట్టు) అనియు, సూక్ష్మభూతసమిష్టితో గూడినప్పుడు హిరణ్యగర్భుడనియు, కారణోపాధి సమిష్టితో గలసినప్పుడు ఈశ్వరుడనియు పిలువబడును. పరమాత్మ అంతఃకరణరూపమగు కారణోపాధితో గూడినపుడు హిరణ్యగర్భుడనియు, ప్రాణములతో గూడినపుడు సూత్రాత్మయనియు, ప్రాణాన్తఃకరణములు రెండును కలసియున్నప్పుడు ఆ సముదాయముతో గూడిన పరమాత్మకు అంతర్యామి అనియు పేర్లు గలవు. మొత్తముగా 1) త్రిగుణాత్మిక, 2) ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి, 3) తమోమహదహంకారరూపిణి, 4) విశ్వతైజసప్రాజ్ఞాత్మిక, 5) వైశ్వానరహిరణ్యగర్భ, విరాడ్రూపిణి, 6) తిరోధానానుగ్రహరూపిణి, 7) జీవబ్రహ్మరూపిణి, 8) విశ్వరూపిణి, 9) సచ్చిదానందరూపిణి, 10) పంచదశీమంత్రరూపిణి, 11) సంజ్ఞానవిజ్ఞానాదిరూపిణి, 12) ప్రస్తుతాదితిథిరూపిణి యని ప్రస్తుతింపబడినది గనుక జగన్మాత విరాడ్రూపిణీ యని అనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం విరాడ్రూపాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

[05:42, 09/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

779వ నామ మంత్రము  09.01.2021

ఓం విరజసే నమః

విగతములైన అనగా పాపరహితురాలైన పరమేశ్వరికి నమస్కారము. 

రజోగుణములేని శుద్ధసత్త్వగుణప్రధానురాలైన శ్రీమాతకు నమస్కారము.

విరజాక్షేత్రాధిష్ఠాన దేవతా స్వరూపిణియైన జగజ్జననికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి విరజా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం విరజసే నమః అని ఉచ్చరిస్తూ, ఆ లలితాంబను ఆరాధించు భక్తులు అరిషడ్వర్గములకు దూరమై, పాపరహితులై ఆ పరమేశ్వరి అనుగ్రహమును పొందగలరు.

విగతం రజః పాపం యస్యాః (సౌభాగ్యభాస్కరం, 876వ పుట). విగతమైనటువంటి అనగా పోయినటువంటి పాపములు గలది. అంటే పాపరహితురాలు. జగన్మాతను చిదగ్నికుండసంభూతా యని అన్నాము. శుద్ధచైతన్యం నుండి ఉద్భవించిన తల్లి జగన్మాత. అలాంటి అమ్మవారికి పాపములుంటాయా? ఆ పాపములు పోయాయా? కాదు. శుద్ధచైతన్యం అంటేనే పాపములనేవి దరిచేరనది. ఆ తల్లి ఇరు పార్శ్వములకు పాపములు రావు. అనగా పాపములు అమ్మవారిని తాకడానికి కూడా భయపడతాయి. 

రజోగుణం గురుంచి భగవానుడు ఇలా చెప్పడం జరిగింది.

రజోరాగ్మాతకంవిద్ధి, తృష్ణాసజ్జిసముద్భవమ్ |

తన్నిభధ్గ్నాతికౌన్తేయ, కర్మసజ్గేనదేహినమ్ ||                          (భగవద్గీత)

ఓ కౌన్తేయ ! రజోగుణము కోరికలయందు అభిమానము అనురాగము పుట్టించి, ఆత్మను బంధించుచున్నది. రజోగుణం ఇంద్రియ విషయాలపై అనురక్తిని, తృష్ణను కలుగజేసి జీవుని నిరంతర కార్య కలాపాలలో బంధించి ఉంచుతుంది.

అటువంటి రజోగుణం జగన్మాతవద్ద ఏమాత్రమును లేదు. ఆతల్లి శుద్ధసత్త్వగుణప్రధానురాలు.  అందుచేతనే జగన్నాతను విరజా యని అన్నాము.

విరజే విరజా మాతా బ్రహ్మాణీ సంప్రతిష్ఠితా|

యస్యాః సందర్శనాన్మర్త్యః పునాత్యాసప్తమం కులమ్||42-1||

విరజక్షేత్రమందు బ్రహ్మదేవుడు విరజ అను దేవిని ప్రతిష్ఠించెను. అట్టి దేవిని దర్శనము చేయు మనుష్యుడు ఏడు తరములవరకూ తనకులములోని వారిని పవిత్రులను చేయును అనిగలదు.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం విరజసే నమః అని అనవలెను.

[05:42, 09/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

205వ నామ మంత్రము 09.01.2021

ఓం సర్వయంత్రాత్మికాయై నమః

సకల యంత్రముల స్వరూపమే ఆత్మగా గలిగిన పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారము. 

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వయంత్రాత్మికా యను ఆరక్షరముల (షడక్షరీ) నామ మంత్రమును ఓం సర్వయంత్రాత్మికాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు సమస్త గ్రహదోషములనుండియు, భూతప్రేతపిశాచ పీడలనుండియు, శత్రుబాధలనుండియు,  ఇంకను మరి ఏ ఇతర దుష్ప్రభావములనుండి రక్షింపబడుదురు.

సర్వేషాం ఘంటార్గళాదీనాం యంత్రాణాం ఆత్మ స్వరూపే వాత్మికా 

ఘంటార్గళాది సకల యంత్రములే ఆత్మగా గల పరమేశ్వరి.

యంత్రములో శక్తికీ శక్తి యొక్క ప్రతిరూపాలకీ సూచికలుగా ఉపయోగించబడే పరికరములు. ఇవి సాధారణంగా రేఖా చిత్రాల రూపంలో ఉంటాయి. ఇవి ద్విమీతీయంగా (two-dimensional) లేదా త్రిమీతీయంగా (three dimensional) ఉంటాయి. ఈ యంత్రాలలోని మధ్యభాగం లో దైవశక్తి కేంద్రీకరించబడి ఉంటుందని ఒక నమ్మకము. 

యంత్రం అనేది ఎవరైనా ఒక దేవతామూర్తి యొక్క బీజాక్షరాల సమూహముతో జ్యోతిష్య మరియు తాంత్రిక శాస్త్రాల రీత్యా ఉన్న మంత్రములతో ఆ ప్రత్యేకమైన చక్రములలో నిక్షేపము చేసి మొత్తానికి ఆ యంత్రములో సర్వ శక్తులను, అష్ట దిగ్పాలకులను ఆవాహనం చేసే ఒక దివ్యమైన చక్రం. యంత్రములో ఉన్నటు వంటి బీజాక్షరాల ప్రభావం వలన ప్రతికూల శక్తులు పూర్తిగా తొలగిపోయి అనుకూలశక్తి పెరుగుతుంది.

ఎక్కడైతే యంత్ర స్థాపన జరుగుతుందో అక్కడి నుండి ప్రతికూల శక్తులు దూరమయి అనుకులశక్తి వచ్చి చేరుతుంది. ఈ యంత్ర సాధనా ప్రభావం మన మనస్సుపై పడుతుంది. మానవుని శరీరమును నిత్యం ప్రభావితం చేసేది మనస్సు మాత్రమే. ఆ మనస్సు పై మానవుని సకల ఆరోగ్యము కూడా ఆధారపడి ఉంటుంది.

మనం ఏదైనా దేవాలయమునకు వెళ్ళినపుడు మన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ దేవాలయము నుండి అడుగు బయట పెట్టగానే ఏదో మాయ కమ్మినట్టు మన మనస్సు యథా విధిగా మారిపోతుంది. దీనికి కారణం ఏమిటంటే దేవాలయములో ప్రతిష్ట చేసిన విగ్రహాల క్రింద వివిధ వేద మంత్రములతో, బీజాక్షరములతో ఒక యంత్రమునకు జీవం పోసి ప్రతిష్ట చేసి స్థాపితం చేస్తారు. అంతటి మాహత్మ్యం గల యంత్ర ప్రభావము చేతనే ఆ ప్రాంతం మొత్తం అనుకూల శక్తితో ఉంటుంది.

ఆ అనుకూల శక్తి మన మనస్సు పై పడి మన మనస్సును ఉత్తేజ పరుస్తుంది. ఏ సమస్య గురించి మనకు బాధలు కలుగుతున్నాయో అలాంటి ప్రతి సమస్యకు ఒక నిర్ధిష్టమైన యంత్రమును తెలియ జేయడం శాస్త్రమును బాగా చదివియున్న  ఒక్క జ్యోతిష్యునికే ఇది సాధ్యపడుతుంది. ఆ నిర్ధిష్టమైన యంత్రమును ప్రత్యేక బీజాక్షరాలతో, నిర్ధిష్టమైన రోజుల కాలము పాటు శ్రద్ధగా పూజించినట్లైతే సమస్యల నుండి విశ్రాంతి లభిస్తుంది.

ఒక విధంగా చెప్పాలంటే యంత్రం అనేది భగవంతునికి ప్రతిబింబం లాంటిది. యంత్రము అనగా నియమ నిష్టలతో నియంత్రించేది అని అర్థం. దేవతలకు నివాసయోగ్యమైన గృహము అని అర్థము. ఈ యంత్రమునే దేవతా నగరం, దేవత ఆవాస స్థానం అని కూడా అంటూ ఉంటారు. యంత్రములో కొలువైయున్న సమస్త దేవతా మూర్తులు సకల దోషములను నివృత్తి చేసి మానవజాతికి శుభములు చేకూరుస్తారు. కాబట్టి యంత్రములను సిద్ధిచేసి పరిపూర్ణమైన పంచోపచార పూజ ప్రక్రియలు అన్నీ శ్రద్ధగా చేసి స్థాపన చేసినట్లైతే యంత్రము యొక్క పరిపూర్ణ ఫలితములు పొందవచ్చు.

యంత్రము, మంత్రము, తంత్రము ఇవన్నీ కలిస్తేనే పూజ అని అంటారు. కొందరు తాంత్రికము అనగానే అది ఏదో చెడు కలిగించే ప్రక్రియ అని అంటారు. కానీ ఇది ఎంత మాత్రము నిజము కాదు. ఇతరులకు చెడు కలిగించే ప్రక్రియను 'కుతంత్రము' అంటారు. ఔషధ ప్రయోగమునకు గృహనిర్మాణమునకు, దేవాలయ నిర్మాణమునకు, దేవాలయ ఉత్సవాలకు, దేవాలయ నిత్య ఆరాధనలు, దేవాలయ ఆగమ శాస్త్రములు, వామాచారము వీటన్నిటిని తంత్రములు అని పిలుస్తారు.

యంత్రములలో  ప్రతిష్ఠాయంత్రములు, పూజాయంత్రములు, ధారణయంత్రములు అని మూడువిధములు. 

యంత్రములన్నిటికీ యంత్రరాజము  శ్రీచక్రము. శ్రీచక్రము సమస్తసృష్టికి ప్రతీక. విశ్వమానవాళికి ప్రతీక.

శ్రీ చక్రమునందు మూలాధార, స్వాదిష్టాన, మణిపూర. అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రములును, సహస్రారము కలవు. ఈ ఆరు చక్రములును సోమ, సూర్య, అనలా(అగ్ని)త్మకములుగా మూడు ఖండములు. ''మూలాధార, స్వాదిష్టాన యుగళమైన ప్రథమ ఖండమునకు పై భాగమున ''అగ్నిస్థానము'' అదియే (రుద్రగ్రంథి). మణిపూర, అనాహత చక్రములు రెండోవ ఖండము. ''సూర్యస్థానము'' అదియే (విష్ణుగ్రంథి). విశుద్ధ, అజ్ఞాచక్రములు మూడోవ ఖండము ''చంద్రస్థానము'' అదియే (బ్రహ్మగ్రంథి)

ప్రథమఖండము పైనున్న అగ్ని తన జ్వాలలచేత ప్రథమఖండమును వ్యాపింపజేయును. 

రెండోవఖండము పైనున్న సూర్యుడు తన కిరణముల చేత రెండోవఖండమును వ్యాపింపజేయును.

మూడవఖండము పైనున్న చంద్రుడు తన కళలచేత మూడవఖండమును వ్యాపింపజేయును🌺🌺🌺పృథ్వీ తత్త్వాత్మిక మూలాధార చక్రమున (పృథ్వీ అగ్ని జ్వాలలు 56), మణిపూర చక్రమున (ఉదక తత్త్వాత్మిక జ్వాలలు 52) కలిపి 108 అగ్ని జ్వాలలు.

అట్లే స్వాధిష్టాన (అగ్ని తత్త్వాత్మిక కిరణములు 62), అనాహత చక్రమున (వాయు తత్త్వాత్మిక కిరణములు 54) కలిపి 116 సూర్య కిరణములు. 

ఆకాశ తత్త్వాత్మకమగు (విశుద్ధ చక్రమున 72), మనస్తత్త్వాత్మకమగు (ఆజ్ఞా చక్రమున 64) కలిసి 136 చంద్రుని కళలు అగుచున్నవి. ఇవి 108+116+136 మొత్తం 360 కిరణములు అగును. ఈ కిరణాలన్నియు అమ్మవారి పాదములనుండి వెడలినవే.

శ్రీచక్రార్చన వలన చరాచర జగత్తునూ అర్చించినట్లవుతుంది. శ్రీచక్రంలోగల వివరణ మరియే ఇతర యంత్రము లందూ ఉండదు.అందుకే శ్రీచక్రము చక్రరాజము అందురు. ఏదైనా యంత్రమును అర్చిస్తే కార్యసిద్ధి కలుగవచ్చు. కాని శ్రీచక్రమును అర్చిస్తే విశ్వమానవ కల్యాణ కారకమవుతుంది.

 సర్వమంత్రస్వరూపిణి యని అమ్మవారిని ఎలా అన్నామో, మంత్రాత్మకమైన సర్వయంత్రములు అమ్మవారి హృదయంలోనే ఉంటాయి గనుక జగన్మాత సర్వయంత్రాత్మికా యని అన్నాము.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సర్వయంత్రాత్మికాయై నమః అని అనవలెను.

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

780వ నామ మంత్రము 10.01.2021

ఓం విశ్వతో ముఖ్యై నమః

ఎక్కడ ధ్యానించాలనుకుంటే అక్కడే, ఏరూపంలో కావాలంటే అలాగే ఆవిర్భవించు నటువంటి అఖిలాండేశ్వరియైన పరమేశ్వరికి నమస్కారము. 

శ్రీలలితా సహస్ర నామావళి యందలి విశ్వతోముఖీ యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం విశ్వతోముఖ్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు సాధకునకు ఆ తల్లి కరుణచే జగన్మాతను దర్శించినంత ఆనందానుభూతిచెందును మరియు సఖశాంతులతో జీవనము గడుపును.

విశ్వతశ్చక్షురుత విశ్వతోముఖః అని వేదములో గలదు. అనగా విశ్వమంతయు నేత్రములు, ముఖములు, హస్తములు, పాదములు గలది భగవద్రూపం. ఉపాసకుడు  ఏ రూపమును మనసులో మనోనేత్రములందు ఉంచుకుని, ఏ ప్రదేశములో ధ్యానించినను పరమాత్మ ఆ ప్రదేశములో, అదే స్వరూపముతో ప్రత్యక్షమగును. అందుచే జగన్మాతను విశ్వతోముఖీ అన్నాము.

సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష స్సహస్రపాత్

ఆ పరమాత్మ అనేకవేల శిరస్సులు, నయనములు, ముఖములు, చేతులు, పాదమములు గలవాడు అని వర్ణింపబడినది. జగత్తంతయూ  పరబ్రహ్మ స్వరూపమే.

అందుకే ప్రహ్లాదుడు ఇలా అన్నాడని పోతనామాత్యులవారు భాగవతంలో చెప్పారు.

మత్తేభ విక్రీడితము

"కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినిం

గలఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం

గలఁ, డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటం

గలఁ, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్.

నాయనా! భగవంతుడు అయిన శ్రీమహావిష్ణువు లేని చోటు విశ్వములో ఎక్కడ లేదు. అంతట వ్యాపించియే ఉన్నాడు. నీటిలో, గాలిలో, ఆకాశంలో ఉన్నాడు. భూమిమీద ఉన్నాడు. అగ్నిలోను ఉన్నాడు. సర్వదిక్కులలోను ఆయన ఉన్నాడు. పగలు రాత్రి సమయాలలో ఉన్నాడు. సూర్యుడు , చంద్రుడు, ఆత్మ, ఓంకారం, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, స్త్రీ పురుష నపుంసక అనే త్రిలింగ వ్యక్తులు అందరు ఇలా బ్రహ్మాది పిపీలక పర్యంతమందు ఆయన ఉన్నాడు. అట్టి సర్వ పూర్ణుడు, సర్వవ్యాపి, సర్వేశ్వరుడు కోసం ఎక్కడెక్కడో వెదకాల్సిన పనిలేదు. సర్వే, సర్వకాల సర్వావస్థలలోను ఉన్నడయ్యా!

కంద పద్యము

ఇందు గలఁ డందు లేఁ డని

సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెం దెందు వెదకి చూచిన

నందందే కలఁడు దానవాగ్రణి! వింటే."

ఓ హిరణ్యకశిప మహారాజా! శ్రీమహావిష్ణువు ఇక్కడ ఉంటాడు; ఇక్కడ ఉండడు; అని చెప్పడానికి లేదు. అయన సర్వోపగతుడు అంటే సర్వకాల సర్వావస్థల అన్నటి యందు ఉండే వాడు. ఈవిషయంలో ఏమాత్రం సందేహం అన్నది లేదు; అందుచేత ఎక్కడైనా సరే వెతికి చూడాలే కాని అక్కడే ఉంటాడయ్యా. రాక్షసరాజా!

పరమేశ్వరి సాక్షాత్తు నారాయణ స్వరూపిణి. ఆ తల్లి సర్వాంతర్యామి. గనుక అమ్మ వారు విశ్వతోముఖీ యని అనబడుచున్నది.

అమ్మవారిని కులదేవతగా, గ్రామదేవతగా కొలవడం చాలా పరిపాటి. ప్రతీ ఊరిలోనూ దుర్గమ్మ, కోటసత్తెమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ, అశిరమ్మ, నూకాలమ్మ, మరిడమ్మ, కనకమహాలక్ష్మి, నీలమ్మ, అంకాళమ్మ, చెంగాళమ్మ, పచ్చాలమ్మ, మజ్జిగౌరమ్మ, శంబరపోలమ్మ, పైడితల్లి, పోలిపల్లి, ఏగులమ్మ, పాదాలమ్మ అని ఇలా ఎన్నో నామములతో, ఎన్నో రూపాలతో ఆరాధిస్తున్నాము. ఇంట్లో చంటి బిడ్డపుడితే, దశరా, ఉగాది, సంక్రాంతి పండుగలకు నైవేద్యాలు, బలులు ఇస్తుంటారు. ఇదంతా ఏమిటి? అమ్మవారేగదా! అందుకే జగన్మాత విశ్వతోముఖీ యని అనబడుచున్నది.

అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం విశ్వతోముఖ్యై నమః అని అనవలెను.

 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

206వ నామ మంత్రము 10.01.2021

ఓం సర్వతంత్రరూపాయై నమః

సర్వతంత్రాలను తన స్వరూపంగా గలిగిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వతంత్రరూపా యను ఆరక్షరముల (షడాక్షరీ) నామ మంత్రమును ఓం సర్వతంత్రరూపాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు ఆ తల్లి కరుణించి సుఖసంతోషములను, ఆయురారోగ్యములను, సిరిసంపదలను ప్రసాదించును.

శివ-పార్వతుల మధ్య జరిగిన సంభాషణలే తంత్ర సూత్రములుగా వ్యవహరింపబడుతున్నవి. శివుడు పార్వతికి తెలిపినవి ఆగమాలుగా, పార్వతి శివుడికి తెలిపినవి నిర్గమాలుగా తెలుపబడుతున్నవి. . హైందవ తంత్రములో శక్తి ముఖ్య దేవతగా కొలవబడుతుంది. ఈ సృష్టి, శివ-శక్తుల దివ్య సంగమముతోనే ఏర్పడినదని నమ్మబడుతుంది. తంత్ర సంప్రదాయాలు, వైదిక సంప్రదాయాలకి సమాంతరంగా ఉంటూనే, ఒక దానితో ఒకటి విడదీయరానివిగా ఉంటాయి. సులువుగా మనకు తెలియాలంటే తంత్రమనేది చేయవలసిన విధానము. సంకల్పం చేసిన దగ్గర నుండి ఆ కార్యక్రమము పరిసమాప్తి అయేవరకూ చేయవలసిన విధానమే తంత్రము అనబడుతుంది. ఖడ్గమాలా స్తోత్ర పారాయణ పూర్తి అయిన తరువాత    చివరలో ఇతిశ్రీవామకేశ్వర తంత్రే, ఉమామహేశ్వర సంవాదే, శ్రీదేవీ ఖడ్గమాలాస్తోత్రం సంపూర్ణమ్ అంటాము. అనగా ఈ ఖడ్గమాలాస్తోత్రము వామకేశ్వర తంత్రములోనిది. శివ-పార్వతుల మధ్య జరిగిన సంభాషణ. 

దేవతలను తృప్తిపరచి, మన కోర్కెల సాధన కోసమే ఈ తంత్రములు చెప్పబడ్డాయి. ఇవి కేవలం ఐహికప్రయోజనముల కొరకు మాత్రమే. వీటి ద్వారా, ఈ లోకంలో మనకు కావలసినవి సంప్రాప్తింపజేసుకోవచ్చును. ఈ విషయాన్ని శంకర భగవత్పాదులవారు సౌందర్యలహరిలో ఇలా చెప్పారు.

చతుఃషష్టయా తంత్రైః -  సకల మతిసంధాయ భువనం

స్థిత స్తత్తత్సిద్ధి - ప్రసవ పరతంత్రైః పశుపతిః |

పునస్త్వన్నిర్బంధా - దఖిల పురుషార్థైక ఘటనా

స్వతంత్రం తే తంత్రం -  క్షితితల మవాతీతరదిదమ్ || 31 ||.

అమ్మా! జగన్మాతా! పశువులైన సకల ప్రాణులను పరిపాలించే, పశుపతియైన శివుడు,  భక్తజనులందరూ నిన్ను ఉపాసించి వారి వారి కామితార్ధములు తీర్చుకొనుటకు మాత్రమే ఉపయోగపడే మహామాయా శాంబర విద్యలైన 64 తంత్రములను నీ ఉపాసనలుగా శంకరుడు ఈ లోకమునకు ప్రసాదించెను. కానీ అవి వామాచార ప్రధానములై మోక్షమునకు ఏమాత్రము దోహద పడకుండా ఉండుటచేత, నీవు భక్తజనులను ఉద్దరింపదలచి ఇహలోకంలో పురుషార్ద ప్రదమైన సకల వాంచితార్ధములను తీర్చి పరలోకమున మోక్షమును ప్రసాదించు విద్యను అందివ్వమని నీవు పరమేశ్వరుని పట్టుపట్టి ప్రోత్సహించి ఆదేశించగా అపుడు ఆ శంకరుడు అన్ని విద్యలకన్నా పరమోత్కృష్టమైన శ్రీవిద్యా తంత్రమును ఈ భూతలమున అవతరింపచేసెను.

లోకంలో మనలను ఉద్దరింప తలచి అమ్మే పరమశివునిచే శ్రీవిద్యోపాసన అను మహా తంత్రమును అందించినది.

 అమ్మా! ఓపరమేశ్వరీ! పరమేశ్వరుడు అరవై నాలుగు విధాలైన మహామాయా శంబరాది తంత్రాలను ఈ భూమండలంలో ప్రవేశపెట్టాడు. సకలసిద్ధి ప్రదాయకమూ, ఐహిక ఫల ప్రదాయికాలూ ఐన ఈ తంత్రాలద్వారా సమస్త ప్రపంచాన్ని మోహింపచేసి మిన్నకున్నాడు. మళ్లా నీ అభీష్టం మేరకు ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించేదైన నీ తంత్రాన్ని అనగా శ్రీవిద్యా తంత్రాన్ని ఈ లోకానికి ప్రసాదించాడు.

ఈ శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు శ్రీవిద్యా తంత్రమును గురించి మనకు తెలియజేస్తున్నారు. పశువులను, ప్రాణులను పరిపాలించు ఆ పశుపతి పూర్వము ఈ సమస్త ప్రపంచమును మోహపెట్ట తలంచి చతుష్షష్ఠి (64) తంత్రములను సృష్టించి ఇచ్చాడు. పశువులైన ఈ మానవులు ఆ కామ్యక మైన తంత్రముల యందు మోజుతో వాటి మత్తులో పడి పరమ పురుషార్ధమైన మోక్షమును మరిచి మోహములో తమను తాము మరిచి వాటి వలన కలిగిన సిద్దులతో ఆడుకొంటూ మూఢులై పరమార్ధము తెలుసుకొనలేక, జీవన్ముక్తులు కాలేక కొట్టుమిట్టా డుతున్నారు ఈ భ్రమణ చక్రములో పడి. బిడ్డలకు తల్లియైన ఆ మహా జగన్మాత  ఓర్వలేక ఒకరోజు ఆ పరమ శివుని దగ్గరకు వెళ్లి అడిగినది.

“ స్వామీ, బిడ్డలు పాడై పోతున్నారు, అజ్ఞానంలో కూరుకు పోతున్నారు మీరు ఇచ్చిన మాయా తంత్రముల చేత, కావున ఎల్ల కోరికలు ఈడేరే తంత్రము, ధర్మార్ధ కామ మోక్షములు ఇచ్చే మహా తంత్రమును, జ్ఞానమును ప్రసాదించే విద్యను  ఒక్కటి ఇవ్వండి చాలు నా బిడ్డలకు” అని.

“పార్వతీ, సకల తంత్రములకు మూలమైన, మిన్నయైన, ధర్మాది చతుర్విధ పురుషార్ధములను ప్రసాదించే సర్వ స్వతంత్రమైన శ్రీవిద్యాతంత్రము నీ పేరు మీదుగా ఇస్తున్నాను.” అని పరమేశ్వరుడు అనుగ్రహించినాడు.

ఈ విధముగా మహాదేవునిచే నిర్మితములైన చతుష్షష్ఠి (64) తంత్రములు మహా పండితులను సైతము మోహ పరుచు చున్నవి. ఐహిక సుఖములను కలిగించే ఈ తంత్రములు వైదిక మార్గ దూరములైనవి. ఆయా జాతులను బట్టి, వర్ణములను బట్టి వీటిని అనుసరించ వలెను అని పెద్దలు చెప్పుదురు. ఇవి అందరికీ అనుష్టించడానికి యోగ్యములు కావని, ప్రపంచాన్ని వంచిస్తాయని  శంకర భగవత్పాదులు పై శ్లోకములో చెప్పియున్నారు.

చతుష్షష్ఠి కళామయి,  చతుష్షష్ఠుపచారాడ్యా  ...అని పరమేశ్వరి పేర్లు. చతుష్షష్ఠి ఉపచారములు, చతుష్షష్ఠి కళలు, చతుష్షష్ఠి తంత్రములు ఇలా 64 మీద చెప్పబడినవి. 

గూడార్ధము:- 64 తంత్రములు జీవుడ్ని మాయా మొహితుడ్ని చేస్తే, శ్రీవిద్యా తంత్రము అనే పరమేశ్వరిని  పట్టుకొన్న వాడికి జ్ఞానము లబిస్తుంది. అంటే పరమ శివుని దర్శనము లభిస్తుంది.

సగుణ బ్రహ్మను గురించి చెప్పే తంత్ర శాస్త్రములను ఆగమాలు అంటారు. వాటిని సమిష్టిగా తంత్ర శాస్త్రము అని అంటారు. ఆగమాలు  (తంత్రములు) మూడు రకములు.

1. వైష్ణవ తంత్రములు,  2. శైవ తంత్రములు,3. శాక్తేయ తంత్రములు.

సాత్వికులు ఆరాధించేది వైదిక దేవతలను. రాజసులు ఆరాధించేది  యక్షరాక్షసులను , తామసులు ఆరాధించేది భూతప్రేత పిశాచాలను.

సాత్వికుల గ్రంథములు ఆగమాలు-ఇహపర సాధనకు తోడ్పడునవి (తంత్రములు), రాజసుల గ్రంథములు  యామళాలు. తామసుల గ్రంథములు డామరాలు అని అంటారు.

ఇహపరసాధనకు తోడ్పడే అరువది నాలుగు (చతుష్షష్టి) తంత్రముల స్వరూపమే జగన్మాత. కాబట్టి ఆ తల్లిని సర్వతంత్రరూపా అని యన్నాము.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సర్వతంత్రరూపాయై నమః  అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది  ఆరవ అధ్యాయము

నందుడు కృష్ణుని ప్రభావమును గూర్చి గోపాలురతో ముచ్చటించుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

మఱియొకసారి శ్రీకృష్ణుడు మిత్రులతోగూడి ఆవుదూడలను మేపుచుండగా ఒక దైత్యుడు కృష్ణుని చంపదలచి, గోవత్సరూపములో ఆ దూడల గుంపులో దూరెను. అంతట కృష్ణుడు అ వత్సాసురుని హతమార్చి వాని కళేబరమును అవలీలగా విసరివేసి ప్రక్కనగల వెలగచెట్లన్నిటిని పడగొట్టెను.

ఒక పర్యాయము గోపాలుర కోరికపై   బలరామునితోగూడి శ్రీకృష్ణుడు ఒక తాళవనమును సమీపించెను. గార్ధభరూపములలో ఉన్న ధేనుకాసురుడు,  అతని అనుయాయులు ఆ వనమునకు వచ్చినవారిని హతమార్చుచుండిరి. అప్పుడు శ్రీకృష్ణుడు, బలరాముడును ఆ ధేనుకాసురుని, అతని అనుచరులను వధించి వేసిరి. ఆ విధముగా కృష్ణప్రభువు అచట రాక్షసబాధలేకుండచేసి, అందఱికిని ఉపయోగము కలుగునట్లు చేసెను.

మహానుభావుడైన శ్రీకృష్ణుడు మిగుల పరాక్రమశాలియైన బలరామునిద్వారా భయంకరుడైన ప్రలంబాసురుని వధింపచేసెను. అంతేగాక హఠాత్తుగా విఱచుకొనుచు మీదికి వచ్చిన దావాగ్ని ప్రమాదమునుండి ఆ స్వామి గోవులను, గోపాలురను రక్షించెను.

యమునానది మడుగులో నివసించుచున్న మహావిషసర్పమగు కాళియుడు ఆ జలములను విషపూరితములను గావించుచుండెను. అంతట శ్రీకృష్ణుడు దాని పడగలపై నిల్చి, వాటిని నుగ్గు నుగ్గు గావించుచు నృత్యమొనర్చి, ఆ కాళియుని మదమును అణచివేసెను. పిదప ఆ ప్రభువు దానిని ఆ మడుగునుండి వెడలగొట్టి, యమునా జలములను విషరహితములు (అమృతతుల్యములు) గావించి లోకోపకారమొనర్చెను.

ఓ నందరాజా! గోకులమునందు నివసించే మాకందరికీ నీ తనయుడగు ఈ కన్నయ్యపై గల ప్రేమ విడువశక్యముగాకున్నది. అట్లే అతనికి కూడా మాపైన సహజసిద్ధమైన ప్రేమగలదు. దీనికి కారణము ఏమైయుండును?

మహారాజా! ఏడు సంవత్సరముల వయస్సులో నున్న ఈ బాలుడెక్కడ? మహాపర్వతమైన ఆ గోవర్ధనగిరిని మోయుట ఎక్కడ? అందువలన నీ కుమారుడు సామాన్యమానవుడు కాడేమో? అని  మాకు అనుమానము కలుగుచున్నది".

నంద ఉవాచ

అంతట నందుడు ఇట్లనెను "గోపాలులారా! మా చిన్నికృష్ణుని విషయమున మీకు ఎట్టి అనుమానము అవసరము లేదు. ఇదివఱలో గర్గమహాముని మా బాలుని గూర్చి నాతో చెప్పియుండెను. విపులముగా వివరించెదను, సావధానముగా వినుడు.

గర్గమహాముని నాతో మా శ్రీకృష్ణుని గూర్చి ఇట్లు వివరించెను-

"నందగోపా! ఈ నీ కుమారుడు ప్రతియుగమునందును శరీరధారియై అవతరించుచువచ్చెను. ఇంతవఱకును ఇతడు తెలుపు, ఎఱుపు, పసుపు వన్నెల తనువులను దాల్చియుండెను. ఇప్పుడు నలుపు వన్నె శరీరమును స్వీకరించెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి    ఇరువది ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది  ఆరవ అధ్యాయము

నందుడు కృష్ణుని ప్రభావమును గూర్చి గోపాలురతో ముచ్చటించుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

గర్గమహాముని నందునితో శ్రీకృష్ణుని    మహిమలను గూర్చి చెప్పిన విధమును నందుడు గోపాలురతో ఇట్లు చెప్పదొడగెను:

ఈ నీకుమారుడు (శ్రీకృష్ణుడు) ఇంతకుమునుపు వసుదేవునకు పుత్రుడై జన్మించెను. అందువలన ఈ రహస్యమును ఎఱిగినవారుఇతనిని వాసుదేవుడు అని పేర్కొందురు. నీ కుమారుని గుణములకును, కర్మలకును అనుగుణముగా పెక్కురూపములు, పలు నామములు ఏర్పడెను. వాటిని నేను ఎఱుగుదును. సామాన్యజనులు ఎఱుగరు.

గర్గమహాముని నందునితో శ్రీకృష్ణుని    మహిమలను గూర్చి చెప్పిన విధమును నందుడు గోపాలురతో  ఇంకను ఇట్లు చెప్పదొడగెను:

ఈ మహాత్ముడు మీకు అందఱికిని శ్రేయస్సును గూర్చును. గోపాలురకును, గోవులకును ఆనందదాయకుడు.ఈ స్వామి అనుగ్రహమున మీరు పెక్కు కష్టములను సులభముగా దాటగలరు.

గర్గమహాముని నందునితో శ్రీకృష్ణుని    మహిమలను గూర్చి చెప్పిన విధమును నందుడు గోపాలురతో  ఇంకను ఇట్లు చెప్పదొడగెను:

నందమహారాజా! పూర్వకాలమున ఒకసారి ఈ భూతలమున అరాజకము ఏర్పడెను. దొంగలు, దోపిడీదారులు చెలరేగి, సాధుపురుషులను పీడింపసాగిరి. ఈ నీ కుమారుడు సజ్జనులను రక్షించెను. నీ తనయుని అండదండలతో వారు ఆ దస్యులపై విజయమును సాధించిరి.

గర్గమహాముని నందునితో శ్రీకృష్ణుని    మహిమలను గూర్చి చెప్పిన విధమును నందుడు గోపాలురతో  ఇంకను ఇట్లు చెప్పదొడగెను:

శ్రీమహావిష్ణువుయొక్క అనుగ్రహమునకు పాత్రులైన దేవతలను అసురులు ఎన్నడును, ఏవిధముగను జయింపజాలనట్లు, నీ కుమారునిపై ప్రేమానురాగములు గలవారై ఆయన కృపకు నోచుకొనిన భాగ్యశాలులకు శత్రుభయము (అంతశ్శత్రువుల వలనను, బాహ్యశత్రువుల వలనను భయము) ఏమాత్రమూ ఉండదు. అందువలన ఈ నీ సుతుడు గుణముల బట్టియు, ఐశ్వర్య, సౌందర్యము చేతను, కీర్తిప్రతిష్ఠల ప్రభావమువలనను శ్రీమన్నారాయణుని యంతటివాడు. కాబట్టి ఈతనియొక్క అద్భుతకర్మల (అలౌకిక కార్యముల)ను జూచి ఆశ్చర్యపడవలసిన పనియే లేదు'

గర్గమహాముని శ్రీకృష్ణునిగూర్చి చెప్పిన వివరములను వివరించిన యనంతరము నందుడు గోపాలురతో ఇట్లనెను:

గర్గమహర్షి ఇట్లు నాకు స్పష్టముగా తెలిపి, తన ఆశ్రమమునకు వెళ్ళెను.అందువలన ఈ కృష్ణుని, ఎట్టి క్లిష్టకార్యములనైనను అవలీలగా నెఱవేర్చునట్టి శ్రీమన్నారాయణుని అవతారముగా నేను భావింతును"

గోపాలురు మిగుల తేజశ్శాలియైన శ్రీకృష్ణునియొక్క మహిమలను ఇదివఱలో స్వయముగా చూచినప్పుడు ఎంతయు ఆశ్చర్యచకితులైరి. ఇప్పుడు ఆ స్వామి తత్త్వమును గుఱించి గర్గమహర్షి పలుకులను నందునిద్వారా చెవులార విన్నపిమ్మట వారి ఆశ్చర్యములు తొలగిపోయెను. అంతేగాక వారు ఆనందభరితులై నందుని, శ్రీకృష్ణుని సాదరముగా కొనియాడిరి.

తనకు తృప్తిని గూర్చుటకై గోపాలురు తలపెట్టిన యజ్ఞము శ్రీకృష్ణుని ప్రోద్బలముచే ఆగిపోవుటవలన ఇంద్రుడు మిగుల క్రుద్ధుడాయెను. అంతట అతడు (ఇంద్రుడు) సంవర్తాది మేఘములచే  కుంభవృష్టిని కురిపించెను. ఆ సమయమున పడిన పిడుగుపాటుల వలనను, వడగండ్లవానలవలనను, ఝంఝామారుతముల ధాటికిని బృందావనము నందలి బాలబాలికలు, గోవులు, స్త్రీలు, పురుషులు మిక్కిలి వ్యథలపాలైరి. అప్ఫుడు వారందఱును శ్రీకృష్ణుని శరణుజొచ్చిరి. వారి దయనీయస్థితిని జూచి, ఆ ప్రభువు హృదయము ద్రవించెను. వెంటనే ఒక లీలను ప్రదర్శింపదలచి,ఆ స్వామి లోలోన నవ్వుకొనెను. పిదప  ఆటలలో బాలురు పుట్టగొడుగును చేబూనినట్లుగా, ఆ నందనందనుడు   గోవర్ధనగిరిని ఒకే ఒక చేతితో పెకలించి పట్టుకొని వ్రజవాసులను రక్షించెను. ఆ విధముగా ఇంద్రుని గర్వమునణచిన ఆ గోవిందుడు మనయెడల ప్రసన్నుడగుగాక!

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే షడ్వింశోఽధ్యాయః (26)

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి ఇరువది ఆరవ అధ్యాయము (26)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

207వ నామ మంత్రము 11.01.2021

ఓం మనోన్మన్యై నమః

ఉన్మని (మనస్సును హృదయమునందు నిలిపి ధ్యానించు) స్థితులైన వారికి లభించే జ్ఞానామృత స్వరూపం తానే అయిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మనోన్మనీ యను నాలుగక్షరముల నామ మంత్రమును ఓం మనోన్మన్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంతభక్తి శ్రద్ధలతో ఉపాసించు ఉపాసకుడు ఆ తల్లి కరుణచే ఆధ్యాత్మికజ్ఞాన సంపదలను సంప్రాప్తింపజేసుకొని, ఆ పరమేశ్వరి పాదసేవలో తరించును.

మనోన్మనీ ఇది స్త్రీలింగ శబ్దము. మనోన్మనః - పుంలింగ శబ్దము - ఈ రెండు శివశక్తుల నామములే. ఈ శబ్దములు ఉపాధిగా చూస్తున్నాము  తప్ప శక్తి మాత్రం అమ్మవారే. మనోన్మనీ అను ఈ నామము  పరమేశ్వరునియొక్క పదిశక్తులు అని తెలుసుకోవాలి. అది రుద్రసూక్తంలో ఈ ప్రసక్తి వస్తుంది. 

వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః  శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః  కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయనమో  బలప్రమథ నాయ నమస్సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః|

వామదేవాయ, జ్యేష్ఠాయ, శ్రేష్ఠాయ, రుద్రాయ, కాలాయ, కలవికరణాయ, బలవికరణాయ, బలాయ, బలప్రమథనాయ, సర్వభుతదమనాయ, మనోన్మ అను ఈ శివునియొక్క పదిశక్తులు అమ్మవారే. గనుక ఈ పదింటినీ స్త్రీలింగ శబ్దములు చేస్తే...

వామా, జ్యేష్ఠా, శ్రేష్ఠా,రౌద్రీ, కాలా (కాళీ), కలవికరిణీ, బలవికరణీ, బలా, బలప్రమథనీ, సర్వభూతదమనీ, మనోన్మనీ.

ఈ పది శక్తులలోనే (పైన చెప్పిన మంత్రంలోనే) సృష్టి, స్థితి, లయకార్యములు ఇమిడి ఉన్నాయి. అవి ఎలాగో గమనిద్దాము.

1. సృష్టి

వామా - వమనత్వం - వెలిగ్రక్కుట అనగా తనలో ఉన్న సృష్టిని వెలికితీయుటచే వామా

2. స్థితి

జ్యేష్ఠా - తను సృష్టించిన ఈ సృష్టికే ప్రథమం గనుక జ్యేష్ఠా.

శ్రేష్ఠా - తను ప్రథమం మాత్రమేగాక శ్రేష్ఠము అగుటచే శ్రేష్ఠా

రౌద్రీ ఈ జగత్తునంతటినీ తన రౌద్రీ శక్తిచే నియంత్రించుటచే రౌద్రీ

కాలా జగత్తునంతటినీ కాలస్వరూపంగాగమనించుటచే కాలా

కలవికరణీ కాలాన్ని జగత్తులో ఒక్కొక్క జీవికి ఒక్కొక్కవిధంగా వెదజల్లడము లేదా పంచడము గనుక కలవికరణీ.

బలవికరణీ సృష్టిలో ఒక్కొక్క వస్తువుకు (ఉపాధికి) ఒక్కొక్క విధంగా ఇచ్చుటచే బలవికరణీ.

బలా ఇన్ని బలములు ఇచ్చిన శక్తిగనుక బలా

బలప్రమథనీ తను ఇచ్చిన బలాన్ని చూసుకొని, విర్రవీగుతూ, ఆ బలాన్నిదుర్వినియోగంచేస్తే ఆ బలాన్ని మథించుట (బలముచే వచ్చు విరగబాటును నిర్మూలించుట) చే బలప్రమథనీ

3. లయం

సర్వభూతదమనీ  కల్పాంతంలో సృష్టినంతటినీ తనలో లయంచేసికొనుటచే సర్వభూతదమనీ

ఈ విధంగా పైమంత్రంలోని పరమేశ్వరుని పదిశక్తులను నిర్వహించునదే మనోన్మనీ అను  నామము కలిగిన జగన్మాత.  గనుక మంత్రం చివరలో మనోన్మనః అని చెప్పబడినది.

ధ్యానధ్యాతృధ్యేయభావో యథా తశ్యతి నిర్భరం తదోన్మనత్త్వం భవతి జ్ఞానామృతనిషేవణా

ధ్యానము, ధ్యేయము (ధ్యానింపదగిన భగవత్స్వరూపము), ధ్యాత అనునది త్రిపుటి. అలాగే  జ్ఞాత, జ్ఞాన, జ్ఞేయ (తెలుసుకొనేవాడు, తెలియబడేది, తెలసికొనుట) ఈ త్రిపుటి యనునది ప్రతీ ఉపాధిలోనూ ఉంటుంది. ఈ (మూడింటి) త్రిపుటిలో జ్ఞాత, జ్ఞేయ అనునవి జ్ఞానములో లీనమైతే (ఏకత్వమైతే) కలిగే ఆనందమే త్రిపురసుందరి. ఈ త్రిపుటి నశించుటయే త్రిపురాసుర సంహారము .ఈ త్రిపుటిలో వ్యాపించినది ఒక్కటే (జ్ఞానమే) అని  తెలిసికొనేదే త్రివిక్రమ ఏ స్థితికి చేరాక ధ్యానము, ధ్యాత, ధ్యేయము మూడూ ఒక్కటైపోతాయో దానినే ఏకత్వము దీనినే జీవబ్రహ్మైక్యము అందురు. ఈ స్థితిలో జ్ఞానామృతమును సేవించుట వలన ఉపాసకునికి ఉన్మనీత్వస్థితి కలుగును. దీనినే మనస్సును ఉత్కృష్టజ్ఞానముతో గూడిన వానినిగా చేయుచున్నది గనుక మనోన్మని యని అనబడినది. ఇటువంటి స్థితిలో ఉండే జగన్మాత మనోన్మనీ అనబడినది.

ఈ మనోన్మనీ స్థితిలో అమ్మవారు ఉంటుంది. అలాగే సాధకుడు ఈ స్థితికి చేరితే ఎలా ఉండడం జరుగుతుంది అంటే...

యోగాభ్యాసంలో ఉన్మన గురుంచి

నేత్రే య యోన్మేషనిమేషయుక్తే

వాయుర్యయా వర్జితరేచపూరః|

మనశ్చ సంకల్ప వికల్ప శూన్యం

మనోన్మనీ సా మయి సన్నిధత్తాం॥

ఉన్మనస్థితిలో కంటికి ఉన్మేషనిమేషములు (రెప్పపాటీలేకుండా) కళ్ళు తెరచియుండే ఉండిపోతాయి. ప్రపంచం చూస్తున్నట్లు అనిపిస్తుంది. కాని ఆ స్థితి అంతర్లక్ష్యం బహిర్దృష్టి అన్నట్లుంటుంది. ప్రాణాయామమందు రేచకము, పూరకములేక కుంభకస్థితిలో ఉండడం జరుగుతుంది. ఈ స్థితి సాధకునికి ఊహమాత్రమే.  కాని సిద్ధునికి అనుభవముగా ఉంటుంది.   మనస్సుకు సంకల్పవికల్పములు ఉండవు. అటువంటి స్థితిని సాధకుడు కోరుకుంటాడు అని భావము.

మన ఉన్మని స్థితి అనగా సాధకుడు పొందిన అత్యంత ఉత్కృష్టస్దితినే మనోన్మని అంటారు. 

 ఆజ్ఞాచక్రమునకు, సహస్రారమునకు నడుమ కొన్ని శక్తులు లేదా సూక్ష్మచక్రములు ఉన్నవి. ఆ శక్తులే పైన చెప్పిన వామదేవాయ నమో.....మనోన్మహః లో చెప్పిన శక్తులు.  ఆజ్ఞాచక్రం నుండి పైకివెళుతున్నకొలదీ సాధకుని ఆనందానుభూతి వర్ణనాతీతము.  అలా పైకి ఈ సూక్ష్మచక్రములను దాటి వెళ్ళగా సహస్రారంలో బిందువు క్రింద ఉన్న స్థానంలో ఉన్నదే మనోన్మనీ.  ఆ స్థితి దాటితే పరమాత్మసన్నిధియే సాధకునికి లభించునది. ఆ స్థితికి చేరితే సంకల్పవికల్ప శూన్యమై, శివశక్తి సమ్మిళితమై, అహోరాత్ర భేదరహితమై, చంద్రమండలమునకు చేరిన స్థితి, భ్రూమధ్యము నుండి ఎనిమిదవ స్థానమువద్ద ఉన్నదే ఉన్మని అదే మనోన్మని. ఆ పై స్థానమే బిందువు. మూలాధారంలో కుండలినీ శక్తిని జాగృతంచేసి, ఊర్ధ్వ ముఖంగా ప్రయాణింపజేస్తూ, గ్రంథిత్రయాన్ని భేదింపజేస్తూ, భ్రూమధ్యమునకు చేరినపిదప అక్కడ నుండి సూక్ష్మచక్రముల ద్వారా కుండలినీ శక్తి ప్రయాణిస్తుంది. ఎనిమిదవది అయిన సుమన దాటిన తరువాత ఉండునదే ఉన్మన. అచ్చట మనసు పనిచెయ్యదు. సంకల్పవికల్పా లుండవు.ఇంకేమియు ఉండని స్థితికి చేరడం జరుగుతుంది. ఆ స్థితి దాటిన తరువాత ఉండేది మహాబిందువు మాత్రమే. ఆ స్థితికి చేరిన తరువాత గోచరించేది పరమేశ్వరి మాత్రమే. మనసు కూడా ఆ స్థితిలో పనిచేయక అంత కన్నా అతీతమైన ఉన్మని స్థితికి చేరడం జరుగుతుంది గనుకనే పరమేశ్వరి  మనోన్మని యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మనోన్మన్యై నమః అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

[04:30, 11/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

781వ నామ మంత్రము  11.01.2021

ఓం ప్రత్యగ్రూపాయై నమః

బహిర్ముఖములగు ఇంద్రియములకు ప్రతికూలముగా నడచునట్టి స్వరూపముగలిగిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి ప్రత్యగ్రూపా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం ప్రత్యగ్రూపాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తితత్పరతతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకునికి    సుఖసంతోషములు, ఇష్టకామ్యసిద్ధియు లభించును.

 జ్ఞానేంద్రియములు (చెవి, 2. చర్మము, 3. కన్ను, 4. నాలుక, 5. ముక్కు),  కర్మేంద్రియములు (1. వాక్కు, 2. హస్తములు, 3. పాదములు, 4. పాయువు, 5. ఉపస్థ) ఇవి అన్నియు దేహమునకు సంబంధించినవి. బహిర్ముఖములు. బాహ్యజగత్తును మాత్రమే చూస్తాయి. బాహ్యజగత్తులోని అంశములనే పరిగణనలోనికి తీసుకుని తత్సంబంధమైన కార్యనిర్వహణనే చేస్తాయి. ఐహిక సుఖవ్యామోహములవైపు మాత్రమే మనసు లగ్నమై ఉంటుంది. వీటికి ఆత్మను దర్శించే శక్తి ఉండదు. దీనినే విషయోన్ముఖము అంటారు. దీనినే బహిర్ముఖత్వము, పరాఙ్ముకత్వము అనికూడా అంటారు. ఇంద్రియములు విషయములను విడిచిపెట్టి అంతరాత్మవైపు త్రిప్పినట్లైతే, అది అంతర్ముఖత్వము, ప్రత్యఙ్ముఖత్వము అంటారు. పరమేశ్వరుడు ఇచ్చిన ఇంద్రియములను బాహ్యజగత్తును చూస్తున్నప్పటికిని ఆత్మను కూడా దర్శించగలవు. అందుకు ఇంద్రియస్వాధీనము అవసరము. కోతికొమ్మచ్చులాడే మనసును అదుపులో ఉంచితే ఆత్మసాక్షాత్కారమవుతుంది. దీనినే ప్రత్యఙ్ముఖము అంటారు. జీవుడు బహిర్ముఖమనుకుంటే ఆత్మ ప్రత్యఙ్ముఖము అవుతుంది. ఆత్మస్వరూపిణియైన జగన్మాత రూపము  ప్రత్యక్ గా అంతరాత్మయందు చూస్తాము గనుక జగన్మాత ప్రత్యగాత్మ,   ఆ  స్వరూపంలో ఉన్న జగన్మాత  ప్రత్యగ్రూపా యని అనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ప్రత్యగ్రూపాయై నమః అని అనవలెను.

   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది  ఏడవ అధ్యాయము

ఇంద్రుడు, కామధేనువు శ్రీకృష్ణుని స్తుతించి, అభిషేకించుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

శ్రీశుకుడు నుడివెను పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చేబూని, జడివాన ప్రమాదమునుండి వ్రజవాసులను రక్షించిన శుభసందర్భమున కామధేనువు ఆ ప్రభువును ప్రస్తుతించుటకై గోలోకమునుండి విచ్చేసెను. అట్లే తన అపరాధమును మన్నింపుమని వేడుకొనుటకై ఇంద్రుడు దేవలోకమునుండి వ్రజభూమికి ఏతెంచెను.

శ్రీకృష్ణుని చులకనగా చూచిన కారణమున ఇంద్రుడు మిగుల పశ్చాత్తప్తుడయ్యెను, సిగ్గుపడెను. అందువలన అతడు ఏకాంతప్రదేశమున శ్రీకృష్ణుని కడకు చేరి, సూర్యకాంతులతో తేజరిల్లుచున్న తన కిరీటము ఆ ప్రభువు పాదములను స్పృశించునట్లుగా ప్రణమిల్లెను.

శ్రీకృష్ణునియొక్క అత్యుద్భుత ప్రతిభాపాటవములను గూర్చి ఇంద్రుడు ఇంతకు ముందు వినియుండుటయేగాక ఇప్పుడు స్వయముగా చూచెను. 'నేను త్రిలోకాధిపతిని' అని విర్రవీగుచున్న తన అహంభావమును అణచిపెట్టి ఆ కృష్ణప్రభువునకు అంజలి ఘటించి, దేవేంద్రుడు వినమ్రుడై ఇట్లు ప్రస్తుతించెను.

ఇంద్ర ఉవాచ

ఇంద్రుడు ఇట్లు స్తుతించెను కృష్ణపరమాత్మా! నీ స్వరూపము శుద్ధసత్త్వమయము. పరమశాంతమైనది. జ్ఞానస్వరూపము. త్రిగుణాతీతము. అజ్ఞానముచే ఉత్పన్నమగు మాయమయమైన గుణముల ప్రవాహరూపమగు ఈ సంసారము నీయందు లేదు.

కావున, ఓ ఈశ్వరా! లోభము, క్రోధము వంటి భావములు అజ్ఞానుల లక్షణములు. ఇవి అజ్ఞానమువలన జనించి సంసారబంధమునకు కారణములు అగును. అజ్ఞానమే లేనట్టి నీయందు  అవి ఎక్కడనుండి, ఎట్లు వచ్చును? అయినప్పటికినీ, ఓ ప్రభూ! దుష్టులను శిక్షించి, ధర్మమును రక్షించుటకొరకే నీవు దండమును ధరించెదవు.

జగత్తునకు తండ్రివి, గురుడవు, అధీశ్వరుడవు నీవే. సమస్త జగత్తును నియంత్రించుటకై దండమును ధరించిన దుస్తరమైన కాలస్వరూపుడవు. లోకములకు కళ్యాణమును చేకూర్చుటకుగాను " ఈ జగత్తునకు మేమే ప్రభువులము" అని విర్రవీగునట్టి వారి దురభిమానమును అణచివేయుటకు గాను, నీవు లీలారూపమును అవతరించి, అందరికి హితమును చేకూర్చెదవు.

స్వామీ! మా వంటి అజ్ఞానులు 'మేమే జగదీశులము' అని గర్వపడుచుందురు. అట్టివారు భయావహస్థితియందును నిర్భయుడనై యుండెడి నిన్ను చూచి, తమ జగదీశాభిమానమును పరిత్యజింతురు. అంతట వారు తమ గర్వమును వీడి సత్పురుషుల మార్గమును అనుసరించుదురు. కనుక నీ లీలలు అన్నియును దుష్టులను దండించి, వారిని సన్మార్గములకు మఱలించుటకే.

ప్రభూ! ఇంద్రాధిపత్య మదముతో నేను కన్నుమిన్ను గానక యుంటిని. అందువలన నీ ప్రభావమును ఎఱుంగక గొప్పతప్పిదమును చేసియుంటిని. నిగ్రహానుగ్రహ సమర్థుడవైన నీవు మూఢాత్ముడవైన నన్ను మన్నింపుము. అంతేగాక, దారితప్పిన (అపమార్గములను బట్టిన) నా మనస్సు మఱల పెడదారి పట్టకుండా దయజూడుము.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి    ఇరువది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

  సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది  ఏడవ అధ్యాయము

ఇంద్రుడు, కామధేనువు శ్రీకృష్ణుని స్తుతించి, అభిషేకించుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

అధోక్షజా! దుష్టులైన రాజులు దేహాభిమానము గలిగి, భూమికి భారముగా పరిణమింతురు. అట్టివారిని వధించి, వారికి ముక్తిని ఒసంగుచుందువు. నీ చరణకమలములను ఆశ్రయించిన భక్తులకు క్రమాభివృద్ధిని గూర్చుచు వారిని ఆదుకొనుచుందువు. ఓ దేవదేవా! నీ అవతారముల పరమలక్ష్యము ఇటువంటిదేగదా!

శ్రీకృష్ణా! వాసుదేవా! నీవు షడ్గుణైశ్వర్యసంపన్నుడవు, పరమపురుషుడవు. భక్తవత్సలుడవు. నీకు పదే పదే నమస్కారములు.

ప్రభూ! నీవు యథేచ్ఛగా అవతారములను స్వీకరించెదవు. సర్వస్వరూపుడవు. శుద్ధజ్ఞానస్వరూపుడవు. సమస్త విశ్వమునకును కారణమైనవాడవు. సకలప్రాణుల యందును ఆత్మస్వరూపుడవు. అట్టి నీకు ప్రణమిల్లుచున్నాను.

సర్వేశ్వరా! నా నిమిత్తమై సంకల్పింపబడిన యజ్ఞము నిలిపివేయబడగా దేహాభిమానినైన నేను మిగుల కోపావిష్టుడను ఐతిని. అందులకు ప్రతిక్రియగా పెనుగాలులతోగూడిన జడివానులను కురిపించితిని. నీ అనుగ్రహమునకు పాత్రులైన వ్రజవాసులను నశింపజేయుటకై పూనుకొంటిని. నేను చేసిన మహాపరాధమిది. ఐనను, నాయెడ కినుక వహింపక నన్ను అనుగ్రహించితివి. స్వామీ! అన్నివిధములుగా మాకు నీవే దిక్కు. నాకు జ్ఞానోదయమును కలిగించిన గురుడవు నీవు. నా ఆత్మస్వరూపుడవైన పరమాత్మా! నిన్ను నేను శరణువేడుచున్నాను".

శ్రీశుక ఉవాచ

శ్రీశుకుడు వచించెను ఇంద్రుడు శ్రీకృష్ణుని ప్రస్తుతించిన పిదప, ఆ పురుషోత్తముడు నవ్వుచు దేవేంద్రుని ఉద్దేశించి, మేఘగంభీర ధ్వనితో ఇట్లనెను.

శ్రీభగవానువాచ

శ్రీకృష్ణభగవానుడు ఇట్లు పలికెను "మహేంద్రా! నీవు ఐశ్వర్యగర్వముతో కన్నుమిన్నుగానక యుంటిని. అట్టి నిన్ను అనుగ్రహించుట కొఱకే నీ యజ్ఞమును భంగపఱచితిని. అందువలన నీవు తెలివితెచ్చుకొని నిత్యము నన్ను స్మరించుచుందువు. ఐశ్వర్యమదముతో నిక్కుచున్నవారు దండధారియగు నన్ను విస్మరింతురు. అట్టి వారిని అనుగ్రహింపదలచినప్పుడు ముందుగా వారి సంపదలను పోగొట్టెదను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి    ఇరువది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

782వ నామ మంత్రము 12.01.2021

ఓం పరాకాశాయై నమః

ఉత్కృష్ట, బ్రహ్మాండ, పిండాండాకాశముల స్వరూపిణియు, సప్తసముద్రముల కావలగల పరాకాశ స్వరూపురాలైన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి పరాకాశా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం పరాకాశాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఐహిక సుఖసంతోషములతోబాటు, పరమపదసోపానములను చేరుటకు కావలసిన మనోనిగ్రహత సంప్రాప్తమగును.

ఉత్కృష్టమగు ఆకాశము నిర్గుణమైనది. పరబ్రహ్మస్వరూపమైనది. దీనినే పరాకాశము అందురు. బ్రహ్మసూత్రభాష్యములో ఆకాశము అనునది పరబ్రహ్మమే గాని పంచభూతములలో చెప్పబడిన ఆకాశముకాదు అని చెప్పబడినది. ఆ పరాశక్తి బ్రహ్మసూత్రభాష్యములో  చెప్ఫబడిన ఆకాశరూపమున ఉన్నది అనిగూడ కూర్మపురాణమందు గలదు. అందుచే ఆ పరాశక్తి పరాకాశా యని అనబడుచున్నది. సర్వజగత్తులకు కారణభూతురాలును,  సర్వాత్మకురాలును, సర్వనియామకురాలు అయిన మహేశ్వరశక్తి అనాదిగా ఆకాశనామముతో కలదై ప్రకాశించుచున్నదని కూడా చెప్పబడినది. ఇట్టి పరాకాశము బ్రహ్మాండమునందునూ గలదు మరియు పిండాండమందునూ (పాంచభౌతిక శరీరమందును) ఉండుటచే రెండుగా తోచుచున్నది. ఈ పరాకాశమందు పరబ్రహ్మ అభివ్యక్తముగుననియు, అందుచే అట్టిది పరాకాశము అనబడుచున్నదనియు చెప్పబడినది. 

ద్వాదశాంతం లలాటోర్థ్వం కపాలోర్థ్వా వసానకమ్|

ద్వ్యంగుళోర్థ్వం శిరోదేశాత్ పరంగ్యోమ ప్రకీర్తితా॥ (స్వచ్ఛంద తంత్రంలో చెప్పబడినది -  సౌభాగ్యభాస్కరం. 879వ పుట)

లలాటమునకు పైన గల ద్వాదశాంతములో గల కపాలము  పైభాగము అంతమయేచోట, శిరస్సుకు రెండంగుళాల పైభాగములో పరాకాశము గలదని చెప్పబడినది.  ఇంకోలా చెప్పాలంటే  సప్తసముద్రములకావల (మేరువు, సప్తద్వీపములు, సప్తసముద్రముల తరువాత) గల ఆకాశమునకు పరాకాశము అందురు. అందులో లలితాంబిక పదహారువర్షముల ప్రాయములో గలదని చెప్పబడినది. కాబట్టి జగన్మాత పరాకాశా యని అనబడినది.

ఇంకను ఇలాగ కూడా చెప్పబడినది:-

కృతయుగమునందు ప్రథమసంవత్సరముస  1.లలిత, 2. కామేశ్వరి, 3. భగమాలిని, 4. నిత్యక్లిన్న, 5. భేరుండి, 6. వహ్నివాసిని, 7. మహావజ్రేశ్వరి, 8. శివదూతి, 9. త్వరిత, 10. కులసుందరి, 11. నిత్య, 12. నీలపతాక, 13. విజయ, 14. సర్వమంగళ, 15. జ్వాలామాలిని, 16. చిత్ర. ఈ పదహారు నిత్యలు క్రమముగా  మహామేరువు, సప్తద్వీపములు, తరువాత సప్తసముద్రములు, పరాకాశము.  వీరు శుక్లపక్షమునందు ఆరోహణక్రమమున ఒక్కొక్కరు పైకి చేరి అచ్చట ఒక సంవత్సరము ఉండి రెండవ సంవత్సరమందు పై స్దానమునకు చేరుచూ, పదహారు వర్షములు పూర్తిఅయినప్పటికి ప్రతినిత్యయూ పరాకాశ స్థానమును  పొంది ఒక సంవత్సరముండి  మరల క్రిందకు దిగుదురు. క్రిందకు దిగునది కృష్ణపక్షమగును. ఈ క్రమము మొదట మేరుస్థితి, తరువాత ద్వీపస్థితి అనంతరము సముద్రస్థితి, ఆపైన పరాకాశస్థితిగా పరావర్తనము జరుగుచుండును. మేరువు, సప్తద్వీపములు, సప్తసముద్రములు  తరువాత ఉండునదే పరాకాశము. అక్కడకు చేరుసరికి పరమేశ్వరికి (లలితకు) పదహారు సంవత్సరముల కన్య అగును. గనుక లలితాంబ పరాకాశం ఉండునప్పటికి పదహారు వత్సరములు గనుక పరాకాశా యని అనబడినది. లేదా కఠినతరమైన, దుఃఖప్రదమైన (పరాకకృచ్ఛ్రవ్రతము అను) ఒకానొక తపస్సు పదహారు వత్సరములు (మేరువు, సప్తసముద్రములు,, సప్తసముద్రములు, చివరగా పరాకాశమును) ఉపలక్షణమనుకొని తపస్సుచే జగన్మాత అనుగ్రహమును పొందవలయును. అట్లైన ఉత్కృష్ఠమైన  పాపములు పోవును. దుఃఖములు శమింపబడును. గనుకనే జగన్మాత పరాకాశా యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం పరాకాశాయై నమః యని అనవలెను.

 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

208వ నామ మంత్రము 12.01.2021

ఓం మహేశ్వర్యై నమః 

ప్రకృతి రూపంలో ఉన్నప్పుడు మాయగాను, ప్రకృతికి అతీతంగానున్నప్ఫుడు మహేశ్వరిగాను విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.

సర్వభూతాలకు ఈశ్వరుడైన మహేశ్వరునికి పత్ని కావున మహేశ్వరి అను నామముతో కీర్తింపబడు తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహేశ్వరీ యను నాలుగక్షరముల నామ మంత్రమును ఓం మహేశ్వర్యై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ లలితాంబను ఉపాసించు సాధకునకు సుఖసంతోషములు, సర్వాభీష్టసిద్ధియు లభించును.

మాయాం తు ప్రకృతిం విద్యాన్మాయినం తు మహేశ్వరమ్ 

అని ఈశ్వర తత్త్వమును శ్రుతి స్పష్టము చేస్తున్నది.  ప్రకృతి మాయా రూపమనియు మహేశ్వరుడే మాయను అధిష్ఠించి ఉన్న ప్రభువని తెలిసికొనవలెను. మహేశ్వరునికి, మహేశ్వరికి భేదములేదు గనుక జగన్మాత మహేశ్వరీ యని అనబడుచున్నది.

త్రిగుణములు అంటే భగవద్గీతలో వర్ణించిన భౌతిక ప్రకృతి యొక్క గుణాలు. ఇవి తామస లేదా తమోగుణం, రాజస లేదా రజో గుణం, సత్త్వ గుణం. ఈ మూడు హిందూ ధర్మశాస్త్రాలలో చెప్పబడిన ప్రధాన గుణములు. భగవద్గీతలో గుణత్రయ విభాగంలో వీటి గురించి వివరణ ఉంది. రజో గుణం వల్ల కోరికలు, ప్రాపంచిక అభ్యున్నతి కోసం తృష్ణ జనిస్తాయి. భగవద్గీత ప్రకారం సత్త్వగుణం వల్ల జ్ఞానం, రజోగుణం వల్ల మోహం, తమోగుణం వల్ల అజాగ్రత్త, అవివేకం, మరపు, పరాకు మొదలైనవి కలుగుతాయి. సత్వ గుణం కలిగిన వారు పై లోకాలకు వెళుతున్నారు. రజోగుణం కలిగిన వారు మానవ లోకంలో జన్మిస్తున్నారు. తమోగుణ ప్రవృత్తి గలవారు అథోలోకాలకు వెళుతున్నారు.

పరమాత్మ తమోగుణసహితుడైనప్పుడు  కాలరుద్రుడనియు, రజోగుణసహితుడైనప్పుడు హిరణ్యగర్భుడనియు, సత్వగుణసహితుడైనప్పుడు శ్రీమహావిష్ణువుగాను చెప్పుదురు. గుణత్రయశూన్యుడైనప్పుడు మహేశ్వరుడౌతాడు. అనగా మహేశ్వరుడు నిర్గుణస్వరూపుడు. అంటే త్రిగుణాతీతుడు. శివశక్తులిరువురికి అభేదమున్నది గనుక శక్తిస్వరూపిణియైన పరమేశ్వరి మహేశ్వరి యని అనబడినది.

ఓంకారము త్రిగుణాత్మకము. అ ఉ మ ఈ మూడక్షరముల సమన్వయమే ఓంకారము అయితే అ కారము సత్త్వగుణము, ఉ కారము  రజోగుణము, మ కారము తమోగుణము. ఆ పరమేశ్వరుడు త్రిగుణాత్మకుడు అయితే  మాయగాను, అలాగే త్రిగుణాతీతమైనప్ఫుడు మహేశ్వరునిగాను మరియు వాతులాగమమందు పంచవింశతి వ్యూహములు గల పరమేశ్వరుడు మహేశ్వరుడనియు, పరమేశ్వరునికి పరమేశ్వరికి అభేదమున్నది (శివశక్త్యైము చెప్పబడుటచే) గనుక అమ్మవారు మహేశ్వరి యని అనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహేశ్వర్యై నమః అని అనవలెను.

[05:11, 12/01/2021] +91 95058 13235: 12.1.2021   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది  ఏడవ అధ్యాయము

ఇంద్రుడు, కామధేనువు శ్రీకృష్ణుని స్తుతించి, అభిషేకించుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీకృష్ణభగవానుడు ఇట్లు పలుకుచుండెను

"సురపతీ! ఇకమీదట మీరు నన్ను అనుక్షణము స్మరించుచుందురు. తత్ప్రభావమున మీకు శుభములు చేకూరుచుండును. అహంభావమును వీడి, మీ మీ అధికారపరిధులకు లోబడి సముచితరీతిలో ప్రవర్తించుచుండుడు. ఈ నా ఆజ్ఞను   శిరసావహించుచు నడచుకొనుడు".

శ్రీకృష్ణుడు ఇంద్రుని ఇట్లు ఆజ్ఞాపించుచుండెను. ఇంతలో సాధుస్వభావముగల (కనికరముతో  భక్తుల వాంఛితార్థములను ఈడేర్చునట్టి) కామధేనువు తన సంతానముతోగూడి, గోపాలుని రూపములో నున్న ఆ సర్వేశ్వరుని సమీపించి, ఆ స్వామికి ఈ విధముగా విన్నవించెను.

సురభిరువాచ

కామధేనువు ఇట్లు పలికెను "కృష్ణా! కృష్ణా! నీవు మహాయోగీశ్వరుడవు. ఈ విశ్వమునందలి సకలచరాచర ప్రాణులకు అంతరాత్మవు. విశ్వముయొక్క ఉత్పత్తికి నీవే కారణుడవు. సకలలోకములకు నాథుడవు నీవే. కనుక మేము సనాథులము ఐతిమి. అచ్యుతా! నీవే! మాకు అందఱిని సర్వదా శరణ్యుడవు.

జగన్నాథా! నీవే మాకు పరమదైవము. నీవే మా ఇంద్రుడవు. సాధుస్వభావముగల గోవులకును, విప్రోత్తములకును, సకల దేవతలకును, ఆ అందఱికిని అభ్యుదయములను అనుగ్రహించెడి రక్షకుడవు నీవే (దేవా! మా అందఱికిని అభ్యుదయములను ప్రసాదించు చుండుము).

విశ్వాత్మా! ఈ భూభారమును తొలగించుటకై అవతరించిన పరమపురుషుడవు నీవు. బ్రహ్మదేవుని ప్రేరణచే మేము నీ సన్నిధికి విచ్చేసితిమి. మా అందఱికిని ప్రభుడవైన నిన్ను గోక్షీరాదులతో అభిషేకించెదము".

శ్రీశుక ఉవాచ

శ్రీశుకుడు నుడివెను పరీక్షిన్మహారాజా! ఆ కామధేనువు ఇట్లు ప్రార్థించి, తన క్షీరములతో శ్రీకృష్ణుని అభిషేకించెను.  అట్లే దేవతలచేతను, దేవమాతయైన అదితిచేతను ప్రేరితుడైన ఇంద్రుడు సురలతోడను, ఋషులతోడను గూడి, ఐరావతము తీసికొనివచ్చిన ఆకాశగంగా జలములతో శ్రీకృష్ణప్రభువునకు అభిషేకమొనర్చెను. పిదప గోవిందనామముతో ఆ స్వామిని కీర్తించెను.

అప్పుడు అచటికి విచ్చేసియున్న తుంబురుడు, నారదుడు మున్నగు గానకళాకోవిదులును, గంధర్వులు, విద్యాధరులు, సిద్ధులు, చారణులు మొదలగు దివ్యజాతులవారును కలికల్మషములను హరించునట్టి (వినిన వారియొక్క, సంస్కరించిన వారియొక్క పాపములను రూపుమాపునట్టి) శ్రీకృష్ణుని యశోవైభవములను తనివిదీర కీర్తించిరి. రంభ, ఊర్వశి మొదలైన అప్సరసలు (దివ్యాంగనలు) సంతోషముతో నృత్యములొనర్చిరి.

అంతట ప్రముఖ దేవతలు ఎల్లరును అద్భుతములైన (నందనవనమునందలి) దివ్య పుష్పములను వర్షించిరి. ముల్లోకములను పరమానందభరితములయ్యెను. గోవులు శ్రీకృష్ణప్రభువును అభిషేకించిన పాలధారలతో భూతలమంతయును ఆర్ద్రమయ్యెను.

ఆనందదాయకమైన శ్రీకృష్ణుని అభిషేక శుభసమయమున నదులన్నియును మధురజలములతో నిండారెను. వృక్షములయందలి పూవులనుండి మకరందములు స్రవించెను. వ్యవసాయాది దోహదక్రియలు లేకుండగనే ఓషధి సమృద్ధి ఏర్పడెను. సకల పర్వతములును, హర్షపులకితములై మణులకాంతులను విరజిమ్మెను.

పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు అభిషిక్తుడైన వేళ క్రూరమృగములు సైతము తమ సహజవైరములను మాని పరస్పర మైత్రితో మెలగసాగెను.

ఈ విధముగా గోవులకును, గోపాలురకును ప్రభువైన గోవిందుని అభిషేకించిన పిమ్మట దేవేంద్రుడు ఆ స్వామి అనుమతిని పొంది, దేవతలు మొదలగువారితో గూడి స్వర్గలోకమునకు చేరెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే సప్తవింశోఽధ్యాయః (27)

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి ఇరువది ఏడవ అధ్యాయము (27)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

  సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది  ఎనిమిద అధ్యాయము

శ్రీకృష్ణుడు వరుణలోకమునుండి నందుని తీసికొనివచ్చుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

శ్రీశుకుడు వచించెను నందుడు కార్తీకశుద్ధ ఏకాదశినాడు దీక్షాపూర్వకముగా ఉపవశించి, భక్తిశ్రద్ధలతో శ్రీహరిని అర్చించెను. పిమ్మట అతడు అది రాక్షసులు సంచరించెడి వేళయని ఎఱుగక ద్వాదశీస్నానమునకై యమునానదీ జలములలో అడుగిడెను. అప్పుడు వరుణ దేవుని భృత్యుడైన అసురుడు ఒకడు నందుని తీసికొని వరుణుని కడకు చేరెను.

పరీక్షిన్మహారాజా! అంతట గోపాలురు తమ ప్రభువైన నందుడు  కనబడకపోవుటచే 'శ్రీకృష్ణా! బలరామా! మీ తండ్రిగారైన నందప్రభువు కనబడుటలేదు. మీరే మాకు దిక్కు' అనుచు విలపింపసాగిరి. అప్పుడు తనను స్మరించిన వారికి అభయమిచ్చునట్టి    శ్రీకృష్ణప్రభువు తమ తండ్రిని (నందుని) వరుణుడు (వరుణుని సేవకుడు) అపహరించుకొని పోయినట్లుగా గ్రహించి, వెంటనే వరుణుని సమీపమునకు వెళ్ళెను.

అంతట లోకపాలురలో ఒకడైన వరుణుడు తన కడకు ఏతెంచిన శ్రీకృష్ణప్రభువును చూచి, ఆయన దర్శనభాగ్యమునకు మిగుల సంతుష్టుడయ్యెను. వెంటనే అతడు  గొప్ప సేవలొనర్చి, ఆ స్వామిని భక్తితో అర్చించి, ఇట్లనెను-

వరుణ ఉవాచ

వరుణుడు ఇట్లు పలికెను "ప్రభూ! పరమపురుషా! నేడు నీ దర్శనము అబ్బుటతో నా జన్మ ధన్యమైనది. నా భాగ్యము ఫలించినది. నీ పాదములను సేవించినవారు సంసారసాగరము నుండి తరింతురు గదా! నిన్ను కనులార వీక్షించిన నా అదృష్టమును ఎంతని కొనియాడగలను?"

వరుణుడు ఇంకను ఇట్లు పలుకుచుండెను

కృష్ణపరమాత్మా! 'నీవు షడ్గుణైశ్వర్యసంపన్నుడవు. సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడవు. దేవమనుష్యాది జీవులను సృష్టించునట్టి నీ యోగమాయ నిన్ను స్పృశింపజాలదు' అని శ్రుతులు (వేదములు) వక్కాణించు చున్నవి.

వరుణుడు ఇంకను ఇట్లు పలుకుచుండెను

మూఢుడైన నా భృత్యుడు నీ తండ్రియగు నందుని ఇక్కడికి తీసికొనివచ్చెను. అతడు యుక్తాయుక్త విచక్షణలేనివాడు. సకలలోకపూజ్యుడవైన నీవు అతడు అజ్ఞానముచే ఒనర్చిన అపరాధమును మన్నింపుము.

వరుణుడు ఇంకను ఇట్లు పలుకుచుండెను

"శ్రీకృష్ణా! నీ పితృభక్తి అనన్యమైనది. నీవు సర్వజ్ఞుడవు. సర్వసాక్షివి. నిగ్రహానుగ్రహ సమర్థుడవైన నీవు ఈ    నా అపరాధమును మన్నించి, నన్ను  అనుగ్రహింపుము. గోవిందా! పూజ్యుడైన నీ తండ్రిని తీసికొని పొమ్ము. స్వామీ! నా భృత్యుడొనర్చిన అపరాధకారణముగా దుర్లభమైన నీ దర్శనము నాకు ప్రాప్తించినది. ఇది నా పురాకృత సకృతఫలము".

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి    ఇరువది ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

783వ నామ మంత్రము 13.01.2021

ఓం ప్రాణదాయై నమః

ప్రాణాపానవ్యానోదానసమాన వాయువులను అనుగ్రహించు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి ప్రాణదా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం ప్రాణదాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబను ఆరాధించు భక్తులకు ఆ తల్లి ఆయురారోగ్యములు ప్రసాదించి అనంతమైన ఆధ్యాత్మిక జ్ఞానసంపదలు పొందుటకు తగిన అర్హతలను అనుగ్రహించును.

చర్మము, రక్తము మాంసము,  ఎముకలు, రోమాలు, గోళ్ళు, మాలిన్యము, కఫము, పిత్తము, వాతము ఇవి అన్నియు శరీరంలోని పదార్థాలు కలిగి జీవించే శరీరము శివం అయితే, జీవించనిది శవం. అంటే జీవించడం అంటే ప్రాణం శరీరంలో ఉండుట. ప్రాణము అంటే పంచప్రాణములు. ఇవే పంచవాయువులు. అసలు మన శరీరమున దశ వాయువులు గలవు, వాయు సంచారమునకు అనువగు సూక్ష్మ నాడుల యందు ఈ వాయువులు వ్వాపించి యుండును. ఇవి ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన అను ముఖ్యమగు ఐదు వాయువులు. వీనినే పంచ ప్రాణములు అందురు. మరియు ఇవి గాక ఐదు ఉప వాయువులు గలవు. ఇవి నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయ అనునవి. ప్రాణ వాయువు హృదయము నందును, అపాన వాయువు మూలాధారమునను సమాన వాయువు నాభి స్థానమునను ఉదాన వాయువు కంఠ స్థానమునను వ్యాన వాయువు స్వాధిష్టాన చక్రమును ఆధారముగా చేసికొని సర్వాంగముల యందును ప్రసరించి యుండును. వాయువు అంతయు ఒకటియే అయినప్పటికీ స్థాన భేధముల చేత వివిధ కార్యములు చేయుచు ప్రవర్తిల్లినవి. నాగ వాయువు వలన ఎక్కిళ్ళు కలుగు చున్నవి. కూర్మ వాయువు కంటి రెప్పలను మూయుటకు తెరచుటకు ఉప యోగ పడు చున్నది. కృకుర వాయువు వలన ఆకలి దప్పులు ఏర్పదును. 

సమస్త జీవరాశులు  ప్రాణం ఉండుటవల్లనే జీవిస్తున్నాయి. శరీరాన్ని జీవింపజేసేవి పంచప్రాణాలు. ఒకవిధంగా చెప్పాలంటే శరీరాన్ని జీవించినప్పుడు నడిపించేవి పంచప్రాణాలు,  జీవం చాలించితే నడిపించేది కూడా ఐదే (పరుండబెట్టిన పాడె ఒకటి, ఆ పాడెను మోసే నలుగురు. వెరసి ఐదు).

ప్రాణం ఉంటేనే కర్మేంద్రియపంచకం, జ్ఞానేంద్రియపంచకం మరియు మనసు పనిజేసేది. ఆత్మ శరీరాన్ని ఆవహించినంతకాలం ప్రాణం ఆధారమవుతుంది. ఆత్మ శరీరాన్ని వదలునప్పుడు ప్రాణంకూడా బయటకు నడుస్తుంది. ఇదే ఆత్మకు, ప్రాణానికి గల అవినాభావబంధం. ఆత్మకు ఉఫాధి (శరీరం) కావాలి. ఆత్మ శరీరంలో ఉండాలంటే ప్రాణంకావాలి. అటువంటి ప్రాణాన్ని జగన్మాత ప్రసాదిస్తుంది గనుక ఆ తల్లిని ప్రాణదా యని అన్నాము.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ప్రాణదాయై నమః అని అనవలెను.

[04:19, 13/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

209వ నామ మంత్రము 13.01.2021

ఓం మహాదేవ్యై నమః

ప్రత్యక్షాది ప్రమాణాములచే అందనిది, తెలియనిది అయిన జగన్మాతకు నమస్కారము.

శివుని అష్టమూర్తులలో చంద్రమూర్తియగు మహాదేవుని భార్యగా తేజరిల్లు పరమేశ్వరికి నమస్కారము.

గండకీ నదియందలి చక్రాధిష్ఠానదేవతా స్వరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాదేవీ యను నాలుగక్షరముల నామ మంత్రమును ఓం మహాదేవ్యై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ శ్రీమాతను ఉపాసించు భక్తులకు సిరిసంపదలు,  సుఖసంతోషములు ప్రసాదించును  మరియు పునర్జన్మ రాహిత్యమైన మోక్షసాధనకు భగవధ్యాన సోపానమును అనుగ్రహించును.

జగన్మాతయొక్క మహత్తత్త్వమును   ఇంత లేదా అంత అని చెప్పు  కొలప్రమాణములు లేవు. ఆ తల్లి స్థూలశరీరము ఇంత అని చెప్పడానికి ఉపమాన శూన్యమైనది.

బృహదస్య శరీరం యత్ అప్రమేయం ప్రమాణతః|

ధాతుర్మహేతి పూజాయాం మహాదేవీ తతః స్మృతః॥

ప్రమాణములచే ఊహింప శక్యముకానంత పెద్దశరీరము గలది.  లేదా మహాపూజాయాం అను ధాతువును బట్టి పూజింపబడుచున్నది. కాబట్టి పరమేశ్వరి మహాదేవీ యని అనబడుచున్నది.

శివుని అష్టమూర్తులు

శివుని పంచభూత లింగములు (పథ్వీలింగము, జలలింగము, అగ్నిలింగము, వాయులింగము, ఆకాశలింగము) గురించి తెలుసు.   వీటితోబాటు ఇంకా మూడు లింగములను చేర్చితే

శివుని అష్టమూర్తులు  సర్వప్రాణకోటి యొక్క సృష్టి, స్థితి మరియు లయములకు మూలమై ఉన్నాయి. అవి :

1. శర్వ: భూ రూపము : శివుడు భూమి తన రూపముగా కలిగి ఉన్నాడు. మనం భూరూపమున ఉన్న శివుని కంచి (తమిళ నాడు) లో ఏకామ్రేశ్వరునిగా దర్శించ వచ్చు 

2. భవ: జల రూపము . శివుడు జలమే తనరూపముగా కలిగి ఉన్నాడు. మనం జలరూపమున ఉన్న శివుని జలగండేశ్వరము/ జంబుకేశ్వరం  (తమిళనాడు) లో జలగండేశ్వరునిగా దర్శించ వచ్చు. 

3. రుద్ర : అగ్ని రూపము. శివుడు అగ్నిని తన రూపముగా కలిగి ఉన్నాడు. మనం అగ్ని రూపమయిన శివుడ్ని అరుణాచలం(తమిళనాడు) లో అరుణాచలేశ్వరుని గా దర్శించవచ్చు 

4. ఉగ్ర వాయు రూపము . శివుడు వాయువే తన రూపముగా కలిగి ఉన్నాడు. మనం వాయురూపంలో ఉన్న శివుని శ్రీ కాళహస్తి (ఆంధ్రప్రదేశ్) లో శ్రీ కాళహస్తీశ్వరునిగా దర్శించవచ్చు. 

5. భీమ : ఆకాశ రూపం . శివుడు ఆకాశమే తన రూపంగా కలిగి ఉన్నాడు. మనం ఆకాశ రూపంలో ఉన్న శివుని చిదంబరం (తమిళనాడు)లో చిదంబరేశ్వరుని గా దర్శించవచ్చు. 

6. పశుపతి : క్షేత్రజ్ఞ రూపం. అంటే ప్రతి జీవిలో ఉండే జీవాత్మరూపం. మనం ఈ క్షేత్రజ్ఞుడయిన రూపమును  ఖాట్మండు (నేపాల్)లో పశుపతినాధ్ గా దర్శించవచ్చు. 

7. ఈశాన : సూర్య రూపం. సూర్యుడు స్వయంగా సూర్యునిగా ఉన్నాడు. మనం ఈ సూర్య రూపంలోని శివుని కోణార్క్ (ఒరిస్సా) లో సూర్య లింగునిగా దర్శించవచ్చు. 

8. మహాదేవ/చంద్ర : సోమ రూపం. శివుడు చంద్ర రూపంలో ఉన్నాడు. మనం సోమరూపంలో శివుని చట్టగావ్ (పశ్చిమ బెంగాల్)లో సోమనాథుని గా దర్శించవచ్చు

పైన చెప్పిన అష్టమూర్తులలో  మహాదేవుని భార్య పేరు మహాదేవి కాబట్టి జగన్మాత మహాదేవీ యని అనబడుచున్నది.

శివుని అష్టమూర్తులలో మహాదేవునికి చంద్రమూర్తియను పేరుగలదు. ఈ చంద్రమూర్తి భార్య రోహిణిదేవి. రోహిణీదేవి కుమారుడు బుధుడు. ఈ రోహిణీదేవి గండకీనదీ తీరమునగల చక్రతీర్థానికి అధిష్ఠానదేవత.  కావున జగన్మాత  మహాదేవి యని అనబడుచున్నది. దేవియొక్క తీర్థములను లెక్కించు క్రమములో గండకీనదీతీరములో సాలగ్రామమునందు మహాదేవి గలదనియు పుష్కరఖండమందు చెప్పబడినది. ఆ మహాదేవిస్వరూపిణి  జగన్మాతయని పద్మపురాణములో పుష్కరఖండమందు చెప్పబడుటచే     జగన్మాత మహాదేవీ యని అనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహాదేవ్యై నమః యని అనవలెను.

🌸🌸💐💐💐

[04:19, 13/01/2

రాసలీలలు

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

29.1 (ప్రథమ శ్లోకము)

భగవానపి తా రాత్రీః శరదోత్ఫుల్లమల్లికాః|

వీక్ష్య రంతుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రితః॥9382॥

శ్రీశుకుడు ఇట్లు వచించెను పరీక్షిన్మహారాజా! ఇదివఱలో కృష్ణభగవానుడు గోపికా వస్త్రాపహరణ సందర్భమున  వారికి 'కన్యలారా! మీ కాత్యాయనీ వ్రతదీక్ష ఫలించినది. ఇప్పుడు మీరు మీ ఇండ్లకు చేరుడు. రానున్న శరద్రాత్రులయందు నాతో విహరించెడి భాగ్యమును నేను మీకు ప్రసాదించెదను' అని మాట ఇచ్చియుండెను. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకొనుటకై స్వామి సంసిద్ధుడాయెను. ఇంతలో శరదృతువు రానే వచ్చెను. మల్లికాది పుష్పములు బాగుగా వికసించి, సుగంధములను వెదజల్లుచుండెను. ఆ రాత్రులయందలి రామణీయకమును జూచి, కృష్ణప్రభువు అచింత్యమహాశక్తియగు తన యోగమాయను ఆశ్రయించి, గోపికలను నిమిత్తమాత్రముగా చేసికొని, రాసక్రీడలను నెఱపుటకు సంకల్పించెను.

29.2 (రెండవ శ్లోకము)

తదోడురాజః కకుభః కరైర్ముఖం ప్రాచ్యా విలింపన్నరుణేన శంతమైః|

స చర్షణీనాముదగాచ్ఛుచో మృజన్ ప్రియః ప్రియాయా ఇవ దీర్ఘదర్శనః॥9383॥

భగవంతుడు ఇట్లు సంకల్పించినంతనే చిరకాల వియోగమును పొందియున్న ప్రియుడు తన ప్రియురాలిని సంతోషపఱచుటకై ఆమె ముఖమున కుంకుమను దిద్దినట్లు, చంద్రుడు మిగుల హాయిని గూర్చెడితన చల్లని కిరణములతో కిరణములతో తూర్పుదిశయందు ఎర్రని రంగును పులిమెను. ఆ విధముగా జనుల తాపమును తొలగించుచు చంద్రుడు ఉదయించెను.

29.3 (మూడవ శ్లోకము)

దృష్ట్వా కుముద్వంతమఖండమండలం  రమాననాభం నవకుంకుమారుణమ్|

వనం చ తత్కోమలగోభిరంజితం జగౌ కలం వామదృశాం మనోహరమ్॥9384॥

ఆ పున్నమినాటి రాత్రి ఉదయించిన చందురుని బింబము కలువలకు వికాసమును గూర్చుచుండెను (భూతలమును ఆనందింపజేయుచుండెను),  లక్ష్మీదేవి ముఖమండలమువలె శోభాయమానముగా ఉండెను, నవకేసరములవలె అరుణకాంతులను విరజిమ్ముచుండెను. కోమలములైన    ఆ చంద్రకిరణముల స్పర్శతో ఆ వనమంతయును రాగరంజితమై కలకలలాడుచుండెను. ఆ వెన్నెల శోభలను, వనరామణీయకమును (మనోహర వాతావరణమును) గాంచి, శ్రీకృష్ణుడు ఆ గోపికల మనస్సులు పారవశ్యమును పొందునట్లు, మధురముగా వేణుగాన మొనర్చెను.

29.4 (నాలుగవ శ్లోకము)

నిశమ్య గీతం తదనంగవర్ధనం వ్రజస్త్రియః కృష్ణగృహీతమానసాః|

ఆజగ్మురన్యోన్యమలక్షితోద్యమాః స యత్ర కాంతో జవలోలకుండలాః॥9385॥

శ్రీకృష్ణుని యందే లగ్నమైయున్న మనస్సులుగల వ్రజభామినులు ఆ కమ్మని మురళీరవమును విన్నంతనే కృష్ణునిపై వారి ప్రేమానురాగములు పొంగిపొరలెను. అట్టి పారవశ్యమున ప్రభుదర్శనమునకై గోపకాంతలెల్లరు తోటివారితో చెప్పకయే ఆ స్వామిని చేరుటకు పరుగులు తీసిరి. అప్పుడు వారి కర్ణకుండలములు వేగముగా అటునిటు అల్లాడుచుండెను. 

29.5 (రెండవ శ్లోకము)

దుహంత్యోఽభియయుః కాశ్చిద్దోహం హిత్వా సముత్సుకాః|

పయోఽధిశ్రిత్య సంయావమనుద్వాస్యాపరా యయుః॥9386॥

అప్పటి ఆ గోపికల తీరు ఆశ్చర్యకరముగా ఉండెను. ఆ గానము చెవి సోకినంతనే ఆ పారవశ్యములో వారికి ఏమి చేయుటకును తోచక యుండెను. పాలను పితుకుతున్న కొందరు గోపికలు, ఆ పనిని సగములో ఆపివేసి, పొయ్యిమీద పెట్టిన పాలను వదలిపెట్టి, పాయసమును చేయుచున్నవారు అట్లే విడిచిపెట్టి వెళ్ళిరి.

29.6 (ఆరవ శ్లోకము)

పరివేషయంత్యస్తద్ధిత్వా పాయయంత్యః శిశూన్ పయః|

శుశ్రూషంత్యః పతీన్ కాశ్చిదశ్నంత్యోఽపాస్య భోజనమ్॥9387॥

అన్నమును వడ్డించుచున్నవారు, పిల్లలకు పాలను త్రాగించుచున్నవారు, భర్తలకు సేవలు చేయుచున్నవారు, భోజనము చేయుచున్నవారు ఆయా పనులను సగములోనే విడిచిపెట్టిపోయిరి.

29.7 (ఏడవ శ్లోకము)

లింపంత్యః ప్రమృజంత్యోఽన్యా అంజంత్యః కాశ్చ లోచనే|

వ్యత్యస్తవస్త్రాభరణాః కాశ్చిత్కృష్ణాంతికం యయుః॥9388॥

చందనాదులను అలదుకొనుచున్న వారు, నలుగు పెట్టుకొనుచున్నవారు, కాటుకలు దిద్ధుకొనువారు అట్లే మధ్యలో వదలి పరుగెత్తిరి. వస్త్రములను, ఆభరణములను ధరించుచున్న మరికొందరు వాటిని వ్యత్యస్తములుగా (తిరగమరగలుగా) ధరించి శ్రీకృష్ణుని చేరుటకు పరుగులు తీసిరి.

29.8 (ఎనిమిదవ శ్లోకము)

తా వార్యమాణాః పతిభిః పితృభిర్భ్రాతృబంధుభిః|

గోవిందాపహృతాత్మానో న న్యవర్తంత మోహితాః॥9389॥

అంతేగాక! వారిని భర్తలు, తలిదండ్రులు, సోదరులు, బంధుమిత్రులు ఎంతగా వారించుచున్నను, గోవిందుడు తమ మనస్సులను దోచుకొనియున్నందున ఆ పారవశ్యములో వారు వెనుదిరుగక ముందునకు సాగిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి    ఇరువది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[04:00, 14/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

784వ నామ మంత్రము 14.01.2021

ఓం ప్రాణరూపిణ్యై నమః

ప్రాణమే బ్రహ్మణస్పతి. ప్రాణమే యజస్సులకు పతి. ప్రాణమే సామము. అట్టి బ్రహ్మస్వరూపమైన  ప్రాణమే తన స్వరూపంగా విరాజిల్లు అమ్మవారికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి ప్రాణరూపిణీ యను ఐదక్షరాల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం ప్రాణరూపిణ్యై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగన్మాతను ఉపాసించు సాధకునికి, జగత్తునందు సర్వప్రాణులకు ప్రాణముపోసి, పోషించి, సత్కర్మలనాచరించు విజ్ఞతనొసగే ఆ జగజ్జనని ఆయురారోగ్యములు ప్రసాదించి, భౌతిక పరమైన సుఖసంతోషములు, ఆముష్మికపరమైన బ్రహ్మజ్ఞాన సంపదలు సంప్రాప్తింపజేసుకునే ఆధ్యాత్మిక శక్తిసంపదలు ప్రసాదిస్తుంది.

జగత్తులోని జీవకోటి సజీవంగా ఉండడానికి కారణమయిన ప్రాణశక్తిని జగన్మాత ప్రసాదిస్తుంది. జీవాత్మ, పరమాత్మ ఒకటే అని చెప్పేదే అద్వైతము. జీవాత్మ, పరమాత్మల ఉపాధి ఈ శరీరము. పరమాత్మ ఉన్నచోటే జీవాత్మ ఉంటుందని దీని భావం గనుక, జీవాత్మ అనేదే ప్రాణశక్తి.   ప్రాణ అను శబ్దమునకు పరమాత్మ అను అర్థము సూత్రభాష్యములో ప్రాణిధికరణమందు నిర్ణయింపబడినది. అమ్మవారిని ప్రాణరూపిణి అన్నాము అంటే ఆ తల్లి పరబ్రహ్మరూపిణి యని అర్థము. అలాగే ప్రాణము, ఇంద్రియములు, ఆకాశము అనునవి బ్రహ్మము. బ్రహ్మస్వరూపురాలు గనుక ప్రాణరూపిణీ యని అనబడినది. నిత్యాతంత్రములో జగన్మాత ప్రాణస్వరూపురాలని ఒక విలక్షణమైన ప్రక్రియనుబట్టి చెప్పారు. అది ఎలాగ అంటే, నిత్యలు పదహారు. నిత్యలకు కాలమునుబట్టి ప్రాణత్వమున్నది. నిత్యలంటే తిథులు. ప్రతీ తిథికి ఇంతకాలము అని నిర్దిష్టత ఉన్నది. ఇదే ప్రాణత్వము అనబడినది. ఇది ఒక శ్వాసకాలము నుండి, దినములు, మాసములు మొదలైనవి లెక్కింపబడినవి. అలాగే ఇరువదిరెండున్నర శ్వాసలు  క్రమముగా పండ్రెండు మేషాదిరాశులు అగును. ఈ రాశులు (నక్షత్రముల వలన) చంద్రగతులు, సూర్యగతులు కూడ శ్వాసములను బట్టియే పుట్టినవి. గనుక శ్వాసకాలమునుబట్టి అమ్మవారికి ప్రాణాత్మత్వము ఉన్నదని తెలియుచున్నది. గనుక జగన్మాత ప్రాణస్వరూపిణీ యని అనబడినది.

అహం బ్రహ్మ అస్మి' అంటే నేను 'బ్రహ్మ' అగుగాక అని, బ్రహ్మ జ్ఞానం సంపాదించాలని అంతరార్థం. నేనే బ్రహ్మను అంటే నాలోనే 'బ్రహ్మ' ఉన్నాడనే భావన రావాలి. నేనే బ్రహ్మను, నేను ఏం చేసిన అది బ్రహ్మాజ్ఞ అంటే కుదరదు!

అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మను

మనం చేసేది మనసా, వాచా, కర్మణా అంతరాత్మ చెప్పిందే అయితే నిశ్చయంగా మనం బ్రహ్మమే దీని ప్రకారం బ్రహ్మ ఎవరో కాదు, నేనే అని ఈ  ఉపనిషత్తు వాక్యం చెబుతుంది. అంటే నీలో ఉన్నది. ప్రాణశక్తి అంటే బ్రహ్మము అనియు, సకల జీవకోటిలోను జగన్మాత ఆయారూపాలలో ప్రాణశక్తిగా  ఉంటున్నది గనుక అమ్మవారు ప్రాణరూపిణీ యని అనబడినది.  

 ఇంతకు ముందు నామ మంత్రంలో అమ్మవారు జీవులకు ప్రాణము పోసినది గనుక జీవుల ఉపాధులు (శరీరములు) కదులుతున్నాయి అని అన్నాము. శరీరంలోని ఇంద్రియముల జీవన వ్యాపారములు ప్రాణశక్తివలననే జరుగుతున్నాయి. ప్రాణశక్తిలేకుంటే ఆ శరీరం మట్టిలో కలవడమే! ప్రాణశక్తి రూపంలో  శరీరములలో ఉందిగనుక  ప్రాణరూపిణీ యని జగన్మాత అనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ప్రాణరూపిణ్యై నమః యని అనవలెను

🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:00, 14/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

210వ నామ మంత్రము 14.01.2021

ఓం మహాలక్ష్మ్యై నమః

సర్వసంపదలనూ ప్రసాదించునదియును, కరవీరపుర నివాసినియును,మహాలసుడను రాక్షసుణ్ణి సంహరించినదియు తానే అయి విరాజిల్లు పరబ్రహ్మస్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాలక్ష్మీః యను నామ మంత్రముసు ఓం మహాలక్ష్మ్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు సాధకునకు సకల ఐశ్వర్యములతోబాటు, బ్రహ్మజ్ఞానసంపదలుకూడా సంప్రాప్తించును.

అష్టాదశ శక్తిపీఠాలలో కరవీరము (కొల్హాపూర్) ఒకటి. ఆ శక్తిపీఠం అధిదేవత మహాలక్ష్మీ. ఈ శక్తిపీఠాలపై ఒక పురాణగాథ కలదు.

ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.

కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి.  

అష్టాదశ శక్తిపీఠస్తోత్రం

లంకాయాం శాంకరీ దేవీ, కామాక్షీ కంచికాపురే, ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే.

అలంపురే జోగులాంబా, శ్రీశైలే భ్రమరాంబికా, కొల్హాపురే మహాలక్ష్మీ, మాధుర్యే ఏకవీరికా.

ఉజ్జయిన్యాం మహంకాళీ, పీఠికాయాం పురుహూతికా, ఓఢ్యాయాం గిరిజాదేవీ, మాణిక్యా దక్షవాటికే.

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ, జ్వాలాయాం వైష్ణవీ దేవీ, గయా మాంగల్యగౌరికా.

వారాణస్యాం విశాలాక్షీ, కాశ్మీరేషు సరస్వతీ, అష్టాదశ సుపీఠాని యోగినా మపి దుర్లభమ్.

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వ శత్రువినాశనం, సర్వ హరం దివ్యం రోగ సర్వ సంపత్కరం శుభం.

మువురమ్మల మూలపుటమ్మ జగన్మాత. ఆ తల్లి పరబ్రహ్మ స్వరూపిణి. ఆమె రూపాంతరాలే మహాకాళీ, మహాలక్ష్మి, మహా సరస్వతి.  ఈ మూడు శక్తులవల్లనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉద్భవించారు. కాబట్టి జగన్మాతను మహాలక్ష్మీః అని యన్నాము.

పార్వతీదేవి అంశచేతనే మహాలక్ష్మిగా వెలసినదని మైలార తంత్రమందు  గలదు. 

మహాలసనామకం దైత్యం స్యతి క్షపయతీతి చ|

మహాలసా మహాలక్ష్మీ రితి చ ఖ్యాతి మాగతా॥

పడమటి సముద్రపు ఒడ్డున ఉన్న సహ్యాద్రి సమీప ప్రదేశమందు మహాలసుడు అను రాక్షసుని సంహరించినది గనుక జగన్మాత మహాలక్ష్మి యను నామముతో ప్రసిద్ధి చెందినది.

శివవామాంకమున కూర్చున్న మహేశ్వరియే మహాలక్ష్మీ యని ప్రసిద్ధి చెందినదని శివపురాణమందు శివుని ప్రస్తావనలో చెప్పబడినది.  

ధౌమ్యుడు కన్యారూపం చెబుతూ త్రయోదశవర్షాత్మక కన్యారూపా - పదమూడు వత్సరముల కన్య అయిన బాలిక మహాలక్ష్మీ యని చెప్పడంజరిగినది. గాన జగన్మాత పదమూడు వత్సరముల మహాలక్ష్మీ యను కన్యాస్వరూపిణి.  

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహాలక్ష్మ్యై నమః అని అనవలెను.

🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:00, 14/01/2021] +91 95058 13235: 14.1.2021   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది తొమ్మిదవ అధ్యాయము

రాసలీలలు

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

29.9 (తొమ్మిదవ శ్లోకము)

అంతర్గృహగతాః కాశ్చిద్గోప్యోఽలబ్ధవినిర్గమాః|

కృష్ణం తద్భావనాయుక్తా దధ్యుర్మీలితలోచనాః॥9390॥

29.10  (పదియవ శ్లోకము)

దుఃసహప్రేష్ఠవిరహతీవ్రతాపధుతాశుభాః|

ధ్యానప్రాప్తాచ్యుతాశ్లేషనిర్వృత్యా క్షీణమంగలాః॥9391॥

29.11 (పదకొండవ శ్లోకము)

తమేవ పరమాత్మానం జారబుద్ధ్యాపి సంగతాః|

జహుర్గుణమయం దేహం సద్యః ప్రక్షీణబంధనాః॥9392॥

ఇండ్లలోపల ఉన్నట్టి కొందరు తరుణీమణులు బయటకు రాలేక ఇండ్లలోనే ఉండిపోయిరి. ఐనను, ఆ గోపికలు కృష్ణభావనలో మునిగిపోయి కన్నులు మూసికొని  ఆయననే ధ్యానించుచుండిరి. సహింపశక్యము గాని తీవ్రమైన కృష్ణవిరహతాపముచే వారిలోని  అశుభసంస్కారములు సమసిపోయెను. ధ్యానముచే పొందబడిన, అచ్యుతుని ఆలింగనమువలన మహదానందమును అనుభవించుటచే వారి పుణ్యకర్మలును క్షయమయ్యెను. అంతేగాక, ఆ పరమాత్మను జారబుద్ధితో కలిసికొన్నవారలు త్రిగుణముల కార్యమగు దేహములను విడిచిపెట్టి, వెంటనే సమస్తకర్మబంధములనుండి విముక్తిని పొంది, భగవంతునిలో ఐక్యము నొందిరి.

రాజోవాచ

29.12 (పండ్రెండవ శ్లోకము)

కృష్ణం విదుః పరం కాంతం న తు బ్రహ్మతయా మునే|

గుణప్రవాహోపరమస్తాసాం గుణధియాం కథమ్॥9393॥

అంతట పరీక్షిన్మహారాజు ఇట్లు ప్రశ్నించెను "మహామునీ! గోపికలు శ్రీకృష్ణభగవానుని కేవలము తమ ప్రియతమునిగా భావించిరి. కాని, ఆయనయెడ వారికి బ్రహ్మభావము లేకుండెను. ఈ విధముగా వారి దృష్టి ప్రాకృతగుణములయందే ఆసక్తమైయున్నట్లుగా అనిపించును. కావున, గుణముల ప్రవాహరూపమగు ఈ సంసారమునుండి వారు విముక్తులగుట ఎట్లు సంభవించినది?

శ్రీశుక ఉవాచ

29.13 (పదమూడవ శ్లోకము)

ఉక్తం పురస్తాదేతత్తే చైద్యః సిద్ధిం యథా గతః|

ద్విషన్నపి హృషీకేశం కిముతాధోక్షజప్రియాః॥9394॥

శ్రీశుకుడు వచించెను పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణునియెడ బ్రహ్మభావన లేనట్టి శిశుపాలుడు వైరభావముతోనైనను ఆ స్వామిని పదే పదే స్మరించుటవలన అతడు ఆ ప్రభువుయొక్క అనుగ్రహముచే ముక్తిని పొందెను. ఇక ప్రేమభావనతో నిరంతరము శ్రీకృష్ణుని స్మరించుచుండెడి గోపికల విషయమును గూర్చి చెప్పవలసినది ఏమున్నది? ఈ సంగతిని గూర్చి నీకు ఇంతకుముందే వివరించి యుంటిని.

29.14 (పదునాలుగవ శ్లోకము)

నృణాం నిఃశ్రేయసార్థాయ వ్యక్తిర్భగవతో నృప|

అవ్యయస్యాప్రమేయస్య నిర్గుణస్య గుణాత్మనః॥9395॥

29.15 (పదిహేనవ శ్లోకము)

కామం క్రోధం భయం స్నేహమైక్యం సౌహృదమేవ చ|

నిత్యం హరౌ విదధతో యాంతి తన్మయతాం హి తే॥9396॥

మహారాజా! శ్రీకృష్ణుడుషడ్గుణైశ్వర్యసంపన్నుడు. షడ్వికారరహితుడు. ప్రత్యక్ష-అనుమానాది ప్రమాణములకు అందనివాడు (అహాఙ్మానసగోచరుడు). సత్త్వాది ప్రాకృతములు లేనివాడు, అనంత కల్యాణ గుణసంపన్నుడు. అట్టి ఆ స్వామి మానవులకు ముక్తిని ప్రసాదించుటకై ఈ భూలోకమున అవతరించెను. కామము, క్రోధము, భయము, స్నేహము, బంధుత్వము, సౌహార్దముమున్నగు వానిలో ఏ భావముతోనైనను నిరంతరము శ్రీకృష్ణునితో సంబంధము కలిగియున్నచో అట్టివారు ఆ స్వామిలో లీనమగుదురు. అనగా అట్టివారికి తప్పక మోక్షము ప్రాప్తించును.

29.16 (పదహారవ శ్లోకము)

న చైవం విస్మయః కార్యో భవతా భగవత్యజే|

యోగేశ్వరేశ్వరే కృష్ణే యత ఏతద్విముచ్యతే॥9397॥

శ్రీహరి (కృష్ణుడు) జన్మరహితుడు, పరమయోగులకును ప్రభువు, అట్టి కృష్ణభగవానుని పాదస్పర్శ కలిగినంతనే చెట్లుచేమలు మొదలగు స్థావరములు సైతము ముక్తిని పొందును. ఇంక అనన్యభావముతో శ్రీకృష్ణుని స్మరించు చుండునట్టి గోపికల విషయమును చెప్పనేల? ఆ పరమాత్ము అనుగ్రహప్రభావము అట్టిది. కనుక నీ వంటి భాగవతోతత్తముడు ఈ విధముగా ఆశ్చర్య పడవలసిన పనియేలేదు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి    ఇరువది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:46, 14/01/2021] +91 95058 13235: 14.1.2021   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది తొమ్మిదవ అధ్యాయము

రాసలీలలు

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

29.17 (పదిహేడవ శ్లోకము)

తా దృష్ట్వాంతికమాయాతా భగవాన్ వ్రజయోషితః|

అవదద్వదతాం శ్రేష్ఠో వాచః పేశైర్విమోహయన్॥9398॥

మిగుల మాటకారియైన శ్రీకృష్ణుడు తనను దర్శించుటకై తన సమీపమునకు వచ్చిన వ్రజభామినులను తన ప్రేమపూరిత వాక్కులతో తనపట్లగల ప్రేమను మరింత గట్టిపరచుటకుగాను, వారి మనస్సులను తెలిసికొనుటకై ఇట్లు పలికెను-

శ్రీభగవానువాచ

29.18  (పదునెనిమిదవ శ్లోకము)

స్వాగతం వో మహాభాగాః ప్రియం కిం కరవాణి వః|

వ్రజస్యానామయం కచ్చిద్బ్రూతాగమనకారణమ్॥9399॥

శ్రీకృష్ణభగవానుడు ఇట్లనెను "భాగ్యశాలినులైన గోపికలారా! మీ శుభాగమనము నాకు సంతోషకరము. మీకు స్వాగతము. వ్రజమంతయును ఆరోగ్యముగ నున్నదికదా! అందఱును కుశలమేనా? ఇంతకును మీ ఆగమనకారణమేమి? మీ ప్రీతికొరకై  ఇప్పుడు నేను ఏమి చేయవలెను? తెల్పుడు.

29.19  (పందొమ్మిదవ శ్లోకము)

రజన్యేషా ఘోరరూపా ఘోరసత్త్వనిషేవితా|

ప్రతియాత వ్రజం నేహ స్థేయం స్త్రీభిః సుమధ్యమాః॥9400॥

సుందరీమణులారా! ఇది భయంకరమైన కాళరాత్రి. ఈ సమయమున ఇచ్చట సింహములు, పులులు మొదలగు క్రూరమృగములు స్వేచ్ఛగా సంచరించుచుండును. కనుక ఇట్టివేళ మీ వంటి కోమలాంగులు ఇచ్చట ఏమాత్రమూ నిలువరాదు. ఐనదేమో ఐనది. ఇక మీరు హాయిగా మీ ఇండ్లకు మఱలిపోవుట మంచిది.

29.20 (ఇరువదియవ శ్లోకము)

మాతరః పితరః పుత్రా భ్రాతరః పతయశ్చ వః|

విచిన్వంతి హ్యపశ్యంతో మా కృఢ్వం బంధుసాధ్వసమ్॥9401॥

మీరు అచట (వ్రజభూమియందు) కనబడకపోవుటవలన మీ తల్లిదండ్రులును, కుమారులును, సోదరులును, భర్తలును, , తదితరులైన మీ ఆత్మీయ బంధువులును మీ కొఱకై ఆందోళనపడుచు వెదకుచుందురు. బాధాకరమైన ఇట్టి సాహసకృత్యములకు దిగుట మీకు ఏమాత్రమూ తగదు.

29.21  (ఇరువది ఒకటవ శ్లోకము)

దృష్టం వనం కుసుమితం రాకేశకరరంజితమ్|

యమునానిలలీలైజత్తరుపల్లవశోభితమ్॥9402॥

ఈ వనమునందు వృక్షలతాదులు అన్నియును చక్కగా వికసించిన పూవులతో నిండారియున్నవి. ఇది  చల్లని వెన్నెలతో ఆహ్లాదకరముగా నున్నది. యమునానదీ జలములమీదుగా వీచుచు వచ్చుచున్న మందమారుతముల కారణముగా కదలాడుచున్న చిగురుటాకుల సోయగములతో ఈ వనము మిగుల ఇంపు గొలుఫుచున్నది. దీని అందచందాలను మీరు చూచితిరిగదా! 

29.22  (ఇరువది రెండవ శ్లోకము)

తద్యాత మా చిరం గోష్ఠం శుశ్రూషధ్వం పతీన్ సతీః|

క్రందంతి వత్సా బాలాశ్చ తాన్పాయయత దుహ్యత9403॥

సాధ్వీమణులారా! ఇక ఏమాత్రమూ ఆలసింపక వ్రజభూమికి చేరుడు. మీ పతులకును, అత్తమామలకును సేవలొనర్పుడు. మీ గృహములలో పసిపిల్లలు ఏడ్చుచుందురు. స్తన్యములిచ్చి వారిని సముదాయింపుడు. ఆవుదూడలు అంబా అంటూ అరచుచుండును. వెంటనే వాటి సంగతి చూడుడు. పొదుగు భారములతో నున్న ఆవులను పితుకుడు.

29.23  (ఇరువది మూడవ శ్లోకము)

అథ వా మదభిస్నేహాద్భవత్యో యంత్రితాశయాః|

ఆగతా హ్యుపపన్నం వః ప్రీయంతే మయి జంతవః॥9404॥

ఆ మాటలను అట్లుంచుడు. మీరు నాపైగల ప్రేమ పారవశ్యముచే ఇచటికి వచ్చియున్నచో, మీ రాక ఎంతో సముచితమైనది. ఏలనన లోకములోని ప్రాణులన్నియును నన్ను ఎంతగానో ప్రేమించుచుండును.

29.24  (ఇరువది నాలుగ శ్లోకము)

భర్తుః శుశ్రూషణం స్త్రీణాం పరో ధర్మో హ్యమాయయా|

తద్బంధూనాం చ కల్యాణ్యః ప్రజానాం చానుపోషణమ్॥9405॥

సాధ్వీమణులారా! తమ భర్తలకును, వారి బంధువులకును (వారి తల్లిదండ్రులకును, సోదరులు మొదలగు వారికిని) నిష్కపటముగా సేవలొనర్చుట, సంతానమును అల్లారుముద్దుగా పెంచి పోషించుట స్త్రీలకు పరమధర్మము.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి    ఇరువది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[05:28, 15/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

211వ నామ మంత్రము 15.01.2021

ఓంమృడప్రియాయై నమః

మృడునకు (పరమశివునికి) ప్రియమును చేకూర్చు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మృడప్రియా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మృడప్రియాయై నమః యని ఉచ్చరించుచూ, ఎనలేని భక్తితత్పరతతో ఆ లలితాంబను  ఆరాధించు భక్తులకు, ఆ తల్లి సిరిసంపదలు, కీర్తిప్రతిష్టలు, సుఖసంతోషములు ప్రసాదించును. 

భక్తులకు ఆనందము నొసగువాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు సత్త్వగుణప్రధానుడు అనగా జ్ఞానగుణసంపన్నుడు.  సత్త్వగుణోద్రేకము కలిగినప్ఫుడు సకల ప్రాణులకు సుఖములను కలిగించు మృడునకు నమస్కారము అని శివమహిమ్నస్తవంలో  చెప్పబడినది. మృడ అంటే ఆనందము అను అర్థము గలదు. గనుక ఆనందాన్ని ఇష్టపడునది జగన్మాత అనికూడా భావించవచ్చును. హృదయంలోని దహరాకాశంలో అమ్మవారిని చిత్రించుకొని, ఆ రూపాన్ని దర్శిస్తూ ఆనందిస్తాము. దీన్ని రూపానందం అనవచ్చు. భక్తునికి భగవంతుని రూపం దర్శించితే రూపానందం. అలాగే రసానందం అనగా నవరసములలో అత్యంత ఆనందకరమైన హాస్యరస సన్నివేశం   చూచినప్పుడు కలిగేది రసానందం, భగవన్నామమును వినుట వలన కలిగేది శ్రవణానందము. అలాగే భగవత్స్వరూపులైన మాతాపితరుల పాదములు తాకినప్పుడు సత్పుత్రుడు ఆనందించేది స్పర్శానందం అవుతుంది. ఈ రసానందం, శ్రవణానందం, స్పర్శానందములు వ్యక్తులలోని సంస్కారాలనుబట్టి, సందర్భాలనుబట్టి కూడా ఉంటుంది. ఈ ఆనందము సత్ప్వరజస్తమో గుణాత్మకమైనది. శరీరంలో పంచకోశములు ఉన్నాయి. అవి, 1. అన్నమయము, 2. ప్రాణమయము, 3. మనోమయము, 4. విజ్ఞానమయము, 5. ఆనందమయము.  

ఆనందమయకోశంలో ఉండేవాడే పరబ్రహ్మ, అదే అమ్మ. ఆమె ఆనందమయకోశమందుంటుంది. అందుచేతనే పంచకోశాంతరస్థితా అనబడుతుంది.

ఆనందమయకోశంలో ఉండేది పరబ్రహ్మ. అంటే అమ్మవారు. ఆమె ఆనందమయకోశమందుంటుంది. అందుచేతనే పంచకోశాంతరస్థితా అనబడుతుంది. ఆనందమయకోశంలో లభించే ఆనందం శాశ్వతమైనది. దీనినే పరలోకానందం అంటారు. ఈ ఆనందం అనేకరకాలు. ఒకదానిని మించిన ఆనందం ఒకటి. అన్నిటికి పరాకాష్ఠ అయినది బ్రహ్మానందం. 

ఇక్కడ ఆనందముల మధ్యగల సంబంధం తెలియాలంటే అది మానుషానందంతో పరిశీలించడం ప్రారంభించాలి. ఆనందములన్నిటికీ   పరాకాష్ఠగా చివరగా బ్రహ్మానందము వరకూ చెప్ఫాలి. అది ఎలాగంటే 

1. వంద మనుష్యానందములు అయితే ఒక మనుష్య గంధర్వానందము.

2. వంద మానుష్య గంధర్వానందములు అయితే ఒక దేవ గంధర్వానందము.

3. వంద దేవ గంధర్వా నందములు అయితే ఒక చిరలోక పితరుల ఆనందము.

4. వంద చిరలోక పితరుల ఆనందములు అయితే ఒక అజానజ దేవానందము.

5. వంద అజానజదేవానందములు అయితే ఒక కర్మదేవానందము.

6. వంద కర్మదేవానందములు అయితే ఒక దేవానందము.

7. వంద దేవానందములు అయితే ఒక ఇంద్రానందము.

8. వంద ఇంద్రానందములు అయితే ఒక బృహస్పతి ఆనందము.

9. వంద బృహస్పతి ఆనందములము అయితే ఒక ప్రజాపతి ఆనందము.

10. వంద ప్రజాపతి ఆనందములు అయితే ఒక బ్రహ్మానందము. 

జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి గనుక  బ్రహ్మానందమనిన ప్రియముగా గలది గనుక మృడప్రియా యని అనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మృడప్రియాయై నమః అని అనవలెను.

🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:28, 15/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

785వ నామ మంత్రము 15.01.2021

ఓం మార్తాండ భైరవారాధ్యాయై నమః

మార్తాండభైరవునిచే ఆరాధింపబడు పరమేశ్వరికి నమస్కారము.

మార్తాండునిచేతను, భైరవులచేతను ఆరాధింపబడు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మార్తాండ భైరవారాధ్యా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం మార్తాండ భైరవారాధ్యాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు ఆ తల్లి అనంతమైన జ్ఞానసంపదలను ప్రసాదించి, పరమేశ్వరీ పాదసేవనమందు తరింపజేయును.

మణిద్వీపమునకు చుట్టుగల ఇరువది రెండవ, ఇరువది మూడవ ప్రాకారముల మధ్య మర్తాండభైరవుడు గలడు. ఇతడు దేవీ ఉపాసకుడు. మార్తాండభైరవునిచే ఆరాధింపబడినది గనుక శ్రీమాత మార్తాండభైరవారాధ్యా యని అనబడినది. ఇతనికి చక్షుష్మతి, ఛాయాదేవి అను ఇద్దరు భార్యలు గలరు.

శివుడు మణిమల్లుడు అను రాక్షసుని సంహరించడానికి అశ్వారూఢుడై భూమిపై అవతరించి ఆ మణిమల్లుడుని సంహరించాడు. ఆ శివుడిని మల్లారి అనియు మార్తాండభైరవుడు అని అన్నారు. ఈ మార్తాండభరవుడను పేరుగల శివునిచే  ఆరాధింపబడుటచే పరమేశ్వరి మార్తాండభైరవారాధ్యా యని అనబడినది. 

మార్తాండుడనగా సూర్యుడు. ఇతడు బ్రహ్మాండమునంతటిని రాత్రి మరణింపజేసి, మరల ఉదయమందు బ్రతికింపజేయబడుటచే సూర్యునకు మార్తాండుడు అని పేరు వచ్చినది. అటువంటి మార్తాండుడనే ఆదిత్యునిచే ఆరాధింపబడుటచే జగన్మాత మార్తాండభైరవారాధ్యా యని అనబడినది. 

వటుకభైరవులు ఎనిమిదిమంది. వారు

1. అసితాంగ భైరవుడు బ్రాహ్మి శక్తీ సమేతం గా తూర్పు దిక్కును పాలిస్తుంటాడు.

2. రురు భైరవుడు మాహేశ్వరి శక్తి సమేతం గా ఆఘ్నేయ దిక్కును పాలిస్తుంటాడు.

3. చండ భైరవుడు కౌమారి శక్తి సమేతం గా దక్షిణ దిక్కును పాలిస్తుంటాడు.

4. క్రోధ భైరవుడు వైష్ణవి శక్తి సమేతం గా నైరుతీ దిక్కును పాలిస్తుంటాడు.

5. ఉన్మత్త భైరవుడు వారాహి శక్తి సమేతం గా పశ్చిమ దిక్కును పాలిస్తుంటాడు.

6. కపాల భైరవుడు ఇంద్రాణి  శక్తి సమేతంగా వాయువ్యం దిక్కున పాలిస్తుంటాడు.

7. భీషణ భైరవుడు చాముండీ శక్తి సమేతంగా ఉత్తర దిక్కును పాలిస్తుంటాడు.

8. సంహార భైరవుడు మహాలక్ష్మి  సమేతం గా ఈశాన్యం దిక్కును పాలిస్తుంటాడు.

సూర్యుని (మార్తాండుడు) చేతను పైన చెప్పిన అష్టభైరవుల చేతను ఆరాధింపబడుటచే జగన్మాత మార్తాండభైరవారాధ్యా యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునఫుడు ఓం మార్తాండ భైరవారాధ్యాయై నమః అని అనవలెను.

🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:37, 16/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

786వ నామ మంత్రము 16.01.2021

ఓం మంత్రిణీ న్యస్త రాజ్యధురే నమః 

తన పదహారు మంత్రులలో అతిముఖ్యురాలైన మంత్రిణి శ్యామల యందు రాజ్య భారమంతయు ఉంచిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మంత్రిణీన్యస్తరాజ్యధూః యను  ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం మంత్రిణీన్యస్త రాజ్యధురే నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ లలితాంబను ఆరాధించు సాధకులకు ఆ పరమేశ్వరి ఐహికంగా మంచి కీర్తి ప్రతిష్టలు, సిరిసంపదలు సంప్రాప్తింపజేసి, ఆముష్మికపరమైన  మోక్షసామ్రాజ్యప్రవేశార్హతలకు కావలసిన ఉపాసనా దీక్షను ప్రసాదించి, దీక్షాబద్ధులను చేసి తరింపజేయును.

తనకున్న పదహారు మంది మంత్రులలో శ్యామలాదేవి యను మంత్రిణియందు జగన్మాత తనయొక్క రాజ్యకార్యా లోచనలను, ఇతర పరిపాలనాభారాన్ని ఉంచినది. గనుక జగన్మాత మంత్రిణీన్యస్తరాజ్యధూః యని అనబడినది.

జగన్మాత యొక్క మంత్రిణులు వీరే:

1) సంగీతయోని, 2) శ్యామా, 3) శ్యామలా, 4) మంత్రనాయికి, 5) సచివేశానీ, 6) ప్రధానేశ, 7) కుశప్రియా, 9) వీణావతి, 10) వైణికీ, 11) మద్రిణీ, 12) ప్రియకప్రియా, 13) నీపప్రియా, 14) కదంబవేశ్యా, 15) కదంబవనవాసినీ, 16) సదామలా.

ఈ పదహారుమంది మంత్రిణులలో శ్యామల యను మంత్రిణిపై ముఖ్యపరిపాలనాభారమును, సమస్త అధికారములను కట్టబెట్టి, మిగిలినవారికి వారి శక్తి సామర్థ్యములననుసరించి శాఖలను ఇచ్చినది. అందుచే జగన్మాత మంత్రిణీన్యస్తరాజ్యధూః యని అనబడినది.

ఇక మంత్రోపదేశముతో మంత్రము గలవారు మంత్రులు అనబడతారు. ఉపాసకులు అనికూడా అనబడతారు. మననము చేయుట రక్షించుటయను ధర్మముగల నిర్మలచిత్తమునకు మంత్రమని అంటారు. అటువంటి చిత్తముగలవారే మంత్రులు అంటే యోగులు. అట్టి యోగులను, ఆయోగుల యోగదీక్షాపటిమను అనుసరించి అమ్మవారియందు ఐక్యము చేయువారిని మంత్రిణియగును. అమ్మవారితో ఏకత్వమును పొందుట అనువిశేషమునకు మంత్రిణి అని అందురు. అట్టి మంత్రిణియందు అనగా ప్రయత్నమునందు ఉంచబడిన ఆత్మసామ్రాజ్యమనెడి ఐక్యరహస్యమును కలిగించు ధర్మముగలిగినది జగన్మాత.  ఈ ఐక్యముగూడ పరమేశ్వరియే ఇచ్చుచున్నది గనుక ఆ ప్రయత్నమంతయు పరమేశ్వరి అధీనమునందున్నదని భావము. ఈ విషయము మూడు శివసూత్రములలో చెప్పబడినది. అవి 1) చిత్తమే మంత్రము, ప్రయత్నమే సాధకుడు, 3) విద్యాశరీరస్ఫురత్తయే మంత్రరహస్యము. ఈ సూత్రములకు భాష్యము పరమమైన ఆత్మతత్త్వవిమర్శనమే చిత్తము అనగా పరమాత్మను, దాని స్ఫురత్తను (ప్రకాశించు చైతన్యమును) నిర్మలత్వాదిగుణములను విమర్శించుట అని భావము. అదే మంత్రము.  అనగా ఇట్టి విమర్శవలన పరమేశ్వరస్వరూపమునకు స్వస్వరూపమునకు భేదములేదను అర్థము ఉన్నది. అనగా మంత్రముగల ఉపాసకులను అమ్మవారితో ఐక్యము పొందించునది మంత్రిణి. నిర్మల చిత్తులను పరమేశ్వరితో ఐక్యము పొందించునది మంత్రిణి.  గాన జగన్మాత మంత్రిణీన్యస్తరాజ్యధూః యని అనబడినది.

పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం మంత్రిణీన్యస్తరాజ్య ధురే నమః యని అనవలెను.

🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:37, 16/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

212వ నామ మంత్రము 16.01.2011

ఓం మహారూపాయై నమః

పరమాత్మయొక్క ఫురుషుడు, అవ్యక్తము, వ్యక్తము మరియు కాలము అను నాలుగు రూపములకు కారణము బృహత్స్వరూపము గలిగినట్టి పరబ్రహ్మస్వరూపిణియగు పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహారూపా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మహారూపాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకునకు పరమేశ్వరియొక్క మహత్తత్త్వము తెలిసి, తన సాధనను మరింత దీక్షాబద్ధతతో కొనసాగిస్తూ, పరబ్రహ్మమును తెలిసికొనే ప్రయత్నంలో పురోగామియగును.

మహా అనగా మహత్తు. మహత్తత్త్వముగల పరమాత్మ. దీనిని బట్టి జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి.  విష్ణుపురాణంలో ఈ విషయం చెప్పబడినది.

పరస్య బ్రహ్మణో రూపం పురుషః ప్రథమం ద్విజ|

వ్యక్తావ్యక్తే తథైవాన్యే రూపే కాల స్థథాపరమ్॥ (సౌభాగ్య భాస్కరం, 389వ పుట)

పురుషుడు, అవ్యక్తము, వ్యక్తము, కాలము అని నాలుగురూపములు. ఇందులో పురుషుడు అను రూపమే  ఈ నాలుగింటిలో ఉత్కృష్టమైనది. ఈ  నాలుగు రూపములను పురుషుడు, వ్యక్తావ్యక్తము, కాలము అను  మూడుగా తీసుకుంటే, ఈ మూడు,  సృష్టిస్థితిలయలకు కారణములు. సృష్టికి ముందు జగత్తంతయు తనలో నిక్షిప్తముచేసుకొనిన విరాట్స్వరూపిణి అమ్మవారు. విరాట్స్వరూపమంటేనే మహారూపము. అందుకని అమ్మవారు మహారూపా యని అనబడినది.

ప్రకృతి నుండి మహత్తత్త్వము, మహత్తత్త్వము నుండి అహంకారము ఇట్లు ఈ క్రమముననుసరించి పరమాత్మ తేజస్సే జగద్రూపముగా విస్తరించును. సర్వజగత్తునకు సాక్షిభూతుడు కాలచక్ర ప్రవర్తకుడు హిరణ్య గర్భుడగు మార్తాండుడు (సూర్యుడు) కూడా పరమాత్మ దేహమునుండి పుట్టినవాడే యని కూర్మపురాణమునందు చెప్పబడినది. ఇదంతా మహద్రూపమనబడుతుంది. జగన్మాత పరమాత్మ, పరబ్రహ్మస్వరూపిణి గనుక పరమేశ్వరి మహారూపా యని అనబడినది.

జగన్మాత విరాడ్రూపముగలది యని   778వ నామ మంత్రములో చెప్పబడినది. విశ్వరూపము గలది. విశ్వంలోని జీవులన్నింటికీ ప్రతీకయైన వైశ్వానరుని రూపం గలిగినది. అంటే  బృహద్రూపిణి. కాబట్టి పరమేశ్వరి మహారూపా యని అనబడినది.

మత్తేభవిక్రీడితము

ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై

పరమామ్నాయము లెల్ల వంది గణమై బ్రహ్మాండ మాకారమై

సిరి భార్యామణి యై విరించి కొడుకై శ్రీ గంగ సత్పుత్రి యై

వరసన్నీ ఘన రాజ సంబు నిజమై వర్ద్ధిల్లు నారాయణా

ఇది బమ్మెరవారి నారాయణ శతకంలోని పద్యము. మత్తేభవిక్రీడితము మేము చిన్నప్పుడు దసరాల్లో గురువులతో శిష్యుల ఇళ్ళకు వెళ్ళునపుడు గిలకలు (బాణములు) చేత ధరించి ఈ పద్యం చదివేవారము. ఇది విరాడ్రూపుని వర్ణన.

జగన్మాత విరాడ్రూపిణి. బృహద్రూపిణి. గనక మహారూపా యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహారూపాయై నమః అని అనవలెను.

🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:37, 16/01/2021] +91 95058 13235: 16.1.2021   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ఇరువది తొమ్మిదవ అధ్యాయము

రాసలీలలు

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

29.41 (నలుబది ఒకటవ శ్లోకము)

వ్యక్తం భవాన్ వ్రజభయార్తిహరోఽభిజాతో దేవో యథాఽఽదిపురుషః సురలోకగోప్తా|

తన్నో నిధేహి కరపంకజమార్తబంధో తప్తస్తనేషు చ శిరఃసు చ కింకరీణామ్॥9422॥

ప్రభూ! సురలోకమును (సమస్త దేవతలను) రక్షించుటకై శ్రీమన్నారాయణుడు ఉపేంద్రుడై (వామనుడై) అవతరించినట్లు మా వ్రజవాసుల ఆర్తిని హరించుటకై నీవు ఈ గోకులమున జన్మించితివి అనుమాట ముమ్మాటికి నిజము.  ఆర్తబంధూ! మేమందఱము నీకు దాసీలము. కనుక నీ కరస్పర్శసుఖమునకై తపన (తహతహ) పడుచున్న మా వక్షస్థలములయందును, మా శిరస్సుల పైనను కోమలములైన నీ చల్లని చేతులను ఉంచి, మా తాపములను చల్లార్చుము.

శ్రీశుక ఉవాచ

29.42 (నలుబది రెండవ శ్లోకము)

ఇతి విక్లవితం తాసాం శ్రుత్వా యోగేశ్వరేశ్వరః|

ప్రహస్య సదయం గోపీరాత్మారామోఽప్యరీరమత్॥9423॥

శ్రీశుకుడు నుడివెను పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు సనకాదిమహాయోగులకును ఈశ్వరుడు. ఆ స్వామి ఆ గోపభామినులు ప్రేమపారవశ్యముతో మొరపెట్టుకొనుచు పలికిన విలాపవచనములను శ్రద్ధగా ఆలకించెను. ఆత్మయందే రమించునట్టి ఆ ప్రభువు ఆ గోపికలపై జాలిగొని, చిఱునవ్వును చిందించుచు అందఱిలోను శ్రీకృవ్ణరూపుడై వారితో క్రీడించెను.

29.43 (నలుబది మూడవ శ్లోకము)

తాభిః సమేతాభిరుదారచేష్టితః  ప్రియేక్షణోత్ఫుల్లముఖీభిరచ్యుతః|

ఉదారహాసద్విజకుందదీధతిర్వ్యరోచతైణాంక ఇవోడుభిర్వృతః॥9424॥

చిరునవ్వును చిందించెడి శ్రీకృష్ణుని సుందర వీక్షణములు ప్రసరించుటతో గొపికల ముఖములు వికసించెను. అప్పుడు భగవానుడు తన భావ-భంగిమలను, చేష్టలను గోపికలకు అనుకూలముగ చేసెను. ఆ సమయమున మనోజ్ఞములైన దరహాసముతో, మల్లెమొగ్గలవంటి దంతదీప్తులతో తేజరిల్లుచు మండలాకారమున గోపికలతో కూడియున్న ఆ స్వామి నక్షత్రమండలమున శోభిల్లుచున్న చంద్రునివలె అలరారుచుండెను.

29.44 (నలుబది నాలుగవ శ్లోకము)

ఉపగీయమాన ఉద్గాయన్ వనితాశతయూథపః|

మాలాం బిభ్రద్వైజయంతీం వ్యచరన్మండయన్ వనమ్॥9425॥

వందలకొణది గోపికలకు స్వామియైన శ్రీకృష్ణుడు వెలుగులను  వెదజల్లుచున్న వైజయంతీ మాలను  ధరించి, వారితో (ఆ గోపాంగనలతో)  విహరించుచు ఆ బృందావనము యొక్క అందచందములను ఇనుమడింప చేయుచుండెను. అప్పుడు గోపవనితలు శ్రీకృష్ణుని గుణగణములను, లీలావైభవములను పారవశ్యముతో కీర్తించుచుండిరి. ఆ కృష్ణప్రభువుగూడ వారి ప్రేమాతిశయములను, రూపలావణ్యములను మెచ్చుకొనుచు గానము చేయుచుండెను.

29.45 (నలుబది ఐదవ శ్లోకము)

నద్యాః పులినమావిశ్య గోపీభిర్హిమవాలుకమ్|

రేమే తత్తరలానందకుముదామోదవాయునా॥9426॥

యమునానదీ తీరమునందు చల్లని ఇసుక తిన్నెలపై చేరి కృష్ణుడు గోపికలతో గూడి విహరింపసాగెను. అప్పుడు శీతలతరంగముల మీదుగా, పరిమళములను వెదజల్లుచున్న కలువలమీదుగా వీచుచు వచ్చుచున్న మందమారుతములు వారికి హాయిని గూర్చుచుండెను.

29.46 (నలుబది ఆరవ శ్లోకము)

బాహుప్రసారపరిరంభకరాలకోరునీవీస్తనాలభననర్మనఖాగ్రపాతైః|

క్ష్వేల్యావలోకహసితైర్వ్రజసుందరీణాముత్తంభయన్ రతిపతిం రమయాంచకార॥9427॥

అంతట కృష్ణప్రభువు చేతులను చాచుచు, కౌగలించుకొనుచు, చేతులతో చేతులు కలుపుచు, వారి ముంగురులను సవరించుచుండెను. ఊరువులను, వక్షస్థలముల యందును కరములతో స్పృశించుచు వారిని పరవశింపజేయుచుండెను. సరసాలాపములు, చల్లనిచూపులు మొదలగు చేష్టలతో ఆ తరుణీమణులను ఆనందింపజేసెను. 

29.47 (నలుబది ఏడవ శ్లోకము)

ఏవం భగవతః కృష్ణాల్లబ్ధమానా మహాత్మనః|

ఆత్మానం మేనిరే స్త్రీణాం మానిన్యోఽభ్యధికం భువి॥9428॥

గోపికలు మహాత్ముడైన కృష్ణభగవానుని చేరి తనివిదీర సుఖానందములను పొందిరి. వారి మనోరథములన్నియును ఈడేరెను. అంతట వారు ఈ లోకములోని స్త్రీలలో తమ యంతటి భాగ్యశాలినులు లేరనియు తామే గొప్పవారమనియు తలంచుచు పొంగిపోసాగిరి.

29.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)

తాసాం తత్సౌభగమదం వీక్ష్య మానం చ కేశవః|

ప్రశమాయ ప్రసాదాయ తత్రైవాంతరధీయత॥9429॥

అప్పుడు శ్రీకృష్ణుడు గోపికలయొక్క సౌభాగ్య మదమును, దురభిమానమును గమనించెను. వారి గర్వమును అణచివేయుట ద్వారా వారిని అనుగ్రహించుటకై అక్కడనే అంతర్ధానమయ్యెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే ఏకోనత్రింశోఽధ్యాయః (29)

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి ఇరువది తొమ్మిదవ అధ్యాయము (29)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:39, 16/01/2021] +91 95058 13235: 16.1.2021   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పదియవ అధ్యాయము

శ్రీకృష్ణుని విరహముతో గోపికల పరితాపము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

30.1 (ప్రథమ శ్లోకము)

అంతర్హితే భగవతి సహసైవ వ్రజాంగనాః|

అతప్యంస్తమచక్షాణాః కరిణ్య ఇవ యూథపమ్॥9430॥

శ్రీశుకుడు పలికెను తాము చూచుచుండగనే శ్రీకృష్ణభగవానుడు  అంతర్హితుడు కాగా గోపికలు ఆ స్వామిని గానక గజరాజు కనబడకపోవుటవలన ఆడుఏనుగులవలె మిగుల తల్లడిల్లసాగిరి.

30.2 (రెండవ శ్లోకము)

గత్యానురాగస్మితవిభ్రమేక్షితైర్మనోరమాలాపవిహారవిభ్రమైః|

ఆక్షిప్తచిత్తాః ప్రమదా రమాపతేస్తాస్తా విచేష్టా జగృహుస్తదాత్మికాః॥9431॥

వ్రజభామినులు కృష్శప్రభువుయొక్క గజగమనములను, ప్రేమ దరహాసములను, మనోజ్ఞములైన సరసాలాపములను, చిత్రవిచిత్రములైన లీలలను, శృంగార రసస్ఫోరకములైన భావ భంగిమలను పదే పదే తలంచుకొనుచు మైమఱచియుండిరి. అట్లు ప్రేమోన్మత్తలై యున్న గోపికలు తమను తాము కృష్ణునిగా భావించుకొనుచు ఆ స్వామి లీలలను అనుకరింపసాగిరి.

30.3 (ప్రథమ శ్లోకము)

గతిస్మితప్రేక్షణభాషణాదిషు  ప్రియాః ప్రియస్య ప్రతిరూఢమూర్తయః|

అసావహం త్విత్యబలాస్తదాత్మికా  న్యవేదిషుః కృష్ణవిహారవిభ్రమాః॥9432॥

అప్పుడు గోపికలు తమకు ప్రియతముడైన శ్రీకృష్ణునియందు తాదాత్మ్యము చెంది, నడకలు, చిఱునవ్వులు, చూపులు, మాటలు మొదలగువాని యందు ఆ స్వామికి ప్రతిరూపులై మెలగసాగిరి. పిదప వారు 'నేనే కృష్ణుడను, నేనే కృష్ణుడను' అని పలవరించుచు, విలాసశోభితములైన కృష్ణలీలా వైభవములను  ప్రదర్శింపసాగిరి.

30.4 (నాలుగవ శ్లోకము)

గాయంత్య ఉచ్చైరముమేవ సంహతా  విచిక్యురున్మత్తకవద్వనాద్వనమ్|

పప్రచ్ఛురాకాశవదంతరం బహిర్భూతేషు సంతం పురుషం వనస్పతీన్॥9433॥

ఆ సమయమున ఆ వనితలు అందఱును గుమిగూడి, ఆ పరమపురుషుని గుణగణములను బిగ్గఱగా గానము చేయుచు పిచ్చివారివలె  ఆయా వనములయందు అంతటను తిరుగుచు ఆ స్వామిని వెదకసాగిరి. ఆ ప్రభువు సమస్త పదార్థముల యందును, వారి (ఆ గోపికల) యందును, ఆకాశమువలె సకలదిశల యందును వ్యాపించియుండెను. కాని వారు ఆయనను ఎచ్చటను చూడజాలక ఉన్మత్తులవలె ఆ కృష్ణుని జాడను గూర్చి చెట్లు చేమలను, పశుపక్ష్యాదులను సైతము అడుగుచుండిరి.

30.5 (ఐదవ శ్లోకము)

దృష్టో వః కచ్చిదశ్వత్థ ప్లక్ష న్యగ్రోధ నో మనః|

నందసూనుర్గతో హృత్వా ప్రేమహాసావలోకనైః॥9434॥

అశ్వత్ద వృక్షములారా! జువ్విచెట్టులారా! మర్రి వృక్షములారా, నందనందనుడైన మా కృష్ణుడు ప్రేమపూరితములైన చిఱునవ్వులతో, విలాసవంతములైన చూపులతో మా మనస్సులను దోచుకొని వెళ్ళినాడు. మీరు ఆయనను చూచితిరా?

30.6 (ఆరవ శ్లోకము)

కచ్చిత్కురబకాశోకనాగపున్నాగచంపకాః|

రామానుజో మానినీనామితో దర్పహరస్మితః॥9435॥

కురవకములారా! అశోకవృక్షములారా! పొన్నలారా! పున్నాగములారా! సంపెంగలారా! ఇంపుగొలిపెడి తన దరహాసములతో అభిమానవతులమైన మా దర్పములను అణచి శ్రీకృష్ణుడు ఇటు వచ్చినాడా? 

30.7 (ఏడవ శ్లోకము)

కచ్చిత్తులసి కల్యాణి గోవిందచరణప్రియే|

సహ త్వాలికులైర్బిభ్రద్దృష్టస్తేఽతిప్రియోఽచ్యుతః॥9436॥

తులసీ! నీ హృదయము మిక్కిలి కోమలము. నీవు ఎల్లరకును శుభములను గూర్చుచుండెడి దానవు. గోవిందుని చరణములపై నీకుగల మక్కువ అపారమైనది. ఆ స్వామికిని నీవనిన ప్రాణము. నీ పరిమళములకు ఆకర్షితములైన తుమ్మెదలు ఎంతగా రొదచేయుచున్నను నిన్ను నిరంతరము ఆ స్వామి తన వక్షస్థలమున ధరించుచునే యుండును. ఆ పురుషోత్తముడు నీకు కనబడెనా?

30.8 (ఎనిమిదవ శ్లోకము)

మాలత్యదర్శి వః కచ్చిన్మల్లికే జాతి యూథికే|

ప్రీతిం వో జనయన్ యాతః కరస్పర్శేన మాధవః॥9437॥

మాలతీలతలారా! మల్లికలారా! జాజిపూవులారా! అడవిమల్లెలారా! తన మృదుహస్తములతో మీకు సుఖస్పర్శను గూర్చుచుండెడి కృష్ణప్రభువు ఇటు వచ్చుటను గమనించితిరా?

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్ఫదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[04:23, 17/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

787వ నామ మంత్రము 17.01.2021

ఓం త్రిపురేశ్యై నమః

స్థూల, సూక్ష్మ, కారణదేహాలకు ప్రభ్విగాను,  దేవశిల్పియైన మయునిచే నిర్మింపబడిన త్రిపురములకు ఈశ్వరిగాను విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి త్రిపురేశీ యను నాలుగక్షరముల నామ మంత్రమును ఓం త్రిపురేశ్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు ఆ తల్లి కరుణచే ఐహికపరముగా సకల సుఖసంతోషములు అనుభవించుచూ, ఆ తల్లికరుణచే బ్రహ్మజ్ఞానాన్వేషణయందు ఏవిధమైన అవరోధములు లేక ముందుకుసాగును.

శ్రీచక్రమునందు రెండవ ఆవరణను సర్వాశాపరిపూరకచక్రమనియు, అక్కడ ఉండే యోగినిని గుప్తయోగిని యని అందురు. ఈ ఆవరణకు అధిదేవత త్రిపురేశి ఈ దేవతతో భేదములేనిది కావున జగన్మాత త్రిపురేశీ యని అనబడినది. ఈ రెండవ ఆవరణమునందు కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి యను యోగినులు ఉంటారు.

నామ, రూప, క్రియలనే ఈ మూడూ త్రిపురములు. ఇందులో జగన్మాత ముఖ్య ప్రాణరూపిణి. త్రిపురములను సృష్టించి, ఆనందమయంగా విహరించే మహోదాత్త శక్తి శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి.  అందుచే జగన్మాతను త్రిపురేశీ యని అన్నాము.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు దేవశిల్పి మయుడు. ఇతడు మూడు పురములను నిర్మించాడు. ఈ మూడు పురములకు జగన్మాతయే ఈశ్వరి యగుటచే త్రిపురేశీ యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం త్రిపురేశ్యై నమః యని అనవలెను.

🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:23, 17/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

213వ నామ మంత్రము 17.01.2021

ఓం మహాపూజ్యాయై నమః

పూజ్యులైన బ్రహ్మోపేంద్రాదులు, మహేశ్వరుడు మొదలైనవారికిగూడా పూజ్యురాలైన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాపూజ్యా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మహాపూజ్యాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిప్రపత్తులతో ఆ జగన్మాతను ఆరాధించు సాధకులకు ఆ తల్లి శాంతిసౌఖ్యములను, సిరిసంపదలనూ ప్రసాదించి, నిత్యమైన, సత్యమైన మోక్షసాధనకు తగినంత సాధనాపటిమను కూడా అనుగ్రహించును.

సామాన్యులు దేవతలను పూజింతురు. ఆ దేవతలందరూ  త్రిమూర్తులను పూజింతురు. అట్టి త్రిమూర్తులే అమ్మవారిని పూజించుచున్నారు. గనుక అమ్మవారు మహాపూజ్యా యని స్తుతింపబడుచున్నది.

సకలజగత్తుల సృష్టికి ముందే తానున్నది. అందుకే జగన్మాత ఆదిపరాశక్తి. సృష్టిస్థితిలయకారిణి. ఆ తల్లి సర్వదేవతా స్వరూపిణి. సర్వమంత్రస్వరూపిణి. సకలయంత్రాత్మిక. ఏరూపంలో పూజించినా, ఏ నామంతో పూజించినా అన్నియు లలితాంబకే చెందుతాయి. దేశకాలాపరిచ్ఛిన్నా - దేశకాలములను అవధులులేకుండా  అన్నికాలములు, అన్ని ప్రదేశములలోనూ తానే విరాజిల్లుతూ పూజింపబడుచున్నది    గనుక మహాపూజ్యా యని అనబడినది.

83వ నామ మంత్రము బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా భండాసుర వధ సమయంలో లలితాంబిక చూపిన పరాక్రమానికి బ్రహ్మాది దేవతలచే స్తుతింపబడినది.

231వ నామ మంత్రము మహాభైరవ పూజితా - మహాభైరవుడైైన పరమశివునిచే పూజింపబడినది. 

237వ నామ మంత్రము మహాచతుష్షష్టికోటి యోగినీ గణసేవితా అరవైనాలుగు కోట్ల యోగినుల (శక్తి గణాల) చే పూజింపబడుచున్నది.

297వ నామ మంత్రము - హరిబ్రహ్మేంద్ర సేవితా - హరి, బ్రహ్మ ఇంద్రాది దేవతలచే సేవింపబడినది.

305వ నామ మంత్రము - రాజరాజార్చితా రాజరాజులచే అనగా కుబేరుడు, మనువు మొదలైన వారిచే పూజింపబడునది.

545వ నామ మంత్రము - పులోమజార్చితా పులోముని పుత్రికయైన ఇంద్రాణి (ఇంద్రుని భార్య) చే పూజింపబడినది 

614వ నామ మంత్రము సచామర రమా వాణీ సవ్యదక్షిణ సేవితా ఎడమ, కుడి భాగాలలో వింజామరలతో కూడిన లక్ష్మీ సరస్వతీలచే సేవింపబడునది

636వ నామ మంత్రము గంధర్వ సేవితా అద్భుత గాయకులైన గంధర్వులుచే వారి గానంతో సేవింపబడునది.

647వ నామ మంత్రము లోపాముద్రార్చితా అగస్త్యుని భార్యయైన లోపాముద్రచే సేవింపబడినది.

726వ నామ మంత్రము సనకాది సమారాధ్యా సనక, సనందన,  సనత్కుమార, సనత్సుజాత అను బ్రహ్మ మానసపుత్రులచే పూజింపబడినది.

785వ నామ మంత్రము మార్తాండ భైరవారాధ్యా మార్తాండ, భైరవులచే పూజింపబడినది.

శ్రీచక్రాన్ని మననం చేస్తే మహాచతుష్షష్టికోటి యోగినీ గణమలన్నియు లలితాంబస్వరూపములై, అనేక విధములుగా మంత్ర, తంత్ర, యంత్ర  సహితముగా పూజలందుకొను మహాదేవి యై గోచరిస్తూ, అత్యంత దీక్షాబద్ధమైన పూజలందుకొనుచూ చతుష్షష్ట్యుపచారాధ్య గా విరాజిల్లుతూ మహాపూజ్యా యని  యనబడుచున్నది.

బ్రహ్మోపేంద్రాది దేవతలు అమ్మవారిని ఏవస్తువులతో చేసిన దేవీ ప్రతిమలతో పూజ చేశారో  ఇక్కడ వివరణ ఈయబడుచున్నది.

1) పరమేశ్వరుడు మంత్రము, 2)  బ్రహ్మ శైలము, 3) విష్ణువు ఇంద్రనీలమణి, 4)  కుబేరుడు - సువర్ణము, 5) విశ్వేదేవులు - వెండి, 6) వాయువు - ఇత్తడి, 7) వసువులు - కంచు, 8) వరుణుడు - స్ఫటికము, 9) అగ్ని - మాణిక్యము, 10) శుక్రుడు (ఇంద్రుడు) - ముత్యము, 11) సూర్యుడు - పగడము, 12) చంద్రుడు - వైడూర్యము, 13) నవగ్రహములలో మిగిలినవారు - తగరము 14) రాక్షసులు - సీసము, 15) పిశాచములు - వజ్రము, 16) మాతృగణము - లోహము ఈ విధముగా ఆయా వస్తువులతో అమ్మవారి రూపమును నిర్మించి పూజించుచున్నారు.

పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం మహాపూజ్యాయై నమః  అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:23, 17/01/2021] +91 95058 13235: 17.1.2021   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పదియవ అధ్యాయము

శ్రీకృష్ణుని విరహముతో గోపికల పరితాపము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

30.9 (తొమ్మిదవ శ్లోకము)

చూతప్రియాలపనసాసనకోవిదారజంబ్వర్కబిల్వబకులామ్రకదంబనీపాః|

యేఽన్యే పరార్థభవకా యమునోపకూలాః శంసంతు కృష్ణపదవీం రహితాత్మనాం నః॥9438॥

ఎల్లరను ఆనందింపజేయుచుండెడి చూత వృక్షములారా! ద్రాక్షతీగెలారా! పనసచెట్టులారా! వేగిస వృక్షములారా! ఎర్రకాంచనములారా! నేరేడు చెట్టులారా! జిల్లేడు మొక్కలారా! మారేడు చెట్టులారా! పొగడలారా! మామిడివృక్షములారా! కడిమిచెట్టులారా! మంకెన చెట్టులారా! అట్లే యమునా తీరమున విలసిల్లుచున్న ఇతర వృక్షములారా! మీ జీవనమంతయు పరోపకారముకొరకే గడచును. శ్రీకృష్ణవిరహకారణముగా మా మనస్సులు ఏమాత్రమూ పనిచేయకున్నవి. కావున, మాకు ఆ ప్రభువు జాడను తెలిపి పుణ్యము గట్టుకొనుడు.

 30.10 (పదియవ శ్లోకము)

కిం తే కృతం క్షితి తపో బత కేశవాంఘ్రిస్పర్శోత్సవోత్పులకితాంగరుహైర్విభాసి|

అప్యంఘ్రిసంభవ ఉరుక్రమవిక్రమాద్వా ఆహో వరాహవపుషః పరిరంభణేన॥9439॥

భూదేవీ! నీవు ఎంతటి తపస్సు చేసితివోగదా! కోమలములైన శ్రీకృష్ణుని పాదముల సుఖస్పర్శచే పరమానందభరితవై, తృణములు, లతలు మొదలగువాని రూపములలో పులకాంకితవై యుంటివి. ఈ నీ ఆనందమునకు కారణము శ్రీహరి చరణస్పర్శయేనా? లేక వామనావతారమున త్రివిక్రముడై ఆ ప్రభువు తన చరణముతో నిన్ను ఆక్రమించినందులకా? లేక వరహావతారమున ఆ స్వామి తన కౌగిలి సుఖములలో నిన్ను ఓలలాడజేసినందులకా? కారణమేదైనను నీవు మిగుల భాగ్యశాలివి. మాకు కృష్ణుని జాడ తెలిపి మమ్ము ఆనందింపజేయుము.

 30.11 (పదకొండవ శ్లోకము)

అప్యేణపత్న్యుపగతః ప్రియయేహ గాత్రైస్తన్వన్ దృశాం సఖి సునిర్వృతిమచ్యుతో వః|

కాంతాంగసంగకుచకుంకుమరంజితాయాః కుందస్రజః కులపతేరిహ వాతి గంధః॥9440॥

తన కనులలో ఆనందాతిరేకమును ప్రదర్శించుచున్న ఒక హరిణిని జూచి, దానితో ఆ గోపికలు ఇట్లు పలికిరి- 'చెలీ! శ్రీకృష్ణుడు తన ప్రియురాలితోగూడి ఇచటికి వచ్చినట్లేయున్నాడు. ఏలయన, సర్వాంగసుందరుడైన ఆ ప్రభువుయొక్క దివ్యదర్శన భాగ్యమునకు నోచుకొనినందువలననే కాబోలు, నీ నేత్రములలో పరమసంతోషము పరవళ్ళు త్రొక్కుచున్నది. నీవు చెప్పుటలేదుగాని, ఆ కృష్ణుడు ఇచటికి వచ్చినాడనుటకు నీ నేత్రాంగమే ప్రబలసాక్షి. ఆ స్వామి తన ప్రియురాలిని కౌగిలింతల సుఖములలో ముంచెత్తునపుడు, ఆమె వక్షస్థలమునందలి కుంకుమలతో నిండిన ఆ ప్రభువు మల్లెపూలమాల పరిమళములను నింపుకొని ఇచటి వాయువులు గుబాళించుచు వీచుచున్నవి. మా మాటలు నిజమేగదా!

 30.12 (పండ్రెండవ శ్లోకము)

బాహుం ప్రియాంస ఉపధాయ గృహీతపద్మో  రామానుజస్తులసికాలికులైర్మదాంధైః|

అన్వీయమాన ఇహ వస్తరవః ప్రణామం కిం వాభినందతి చరన్ ప్రణయావలోకైః॥9441॥

అనంతరము వారు పండ్లబరువుతో వంగియున్న చెట్లనుజూచి, అవి శ్రీకృష్ణునకు నమస్కరించుటకై అట్లు  వినమ్రములై యున్నట్లు భావించి ఇట్లనిరి- "వృక్షములారా! కృష్ణప్రభువు తన కుడిచేతియందు లీలాపద్మమును ధరించి, ఎడమచేతిని తన ప్రియురాలి భుజముపై ఉంచి ఈ మార్గముననే వెళ్ళినట్లున్నది. తన  మెడలోని తులసిమాల పరిమళములకు ఆకర్షితములై తనను అనుసరించుచున్న తుమ్మెదల ఝంకారములకు ఆనందించుచు అతడు ప్రణయపూర్ణములైన తన చూపులను ప్రసరింపజేయుచు, ఇచట సంచరించుచున్నప్పుడు సవినయముగా మీరు ఒనర్చిన నమస్కారములను ఆ స్వామి స్వీకరించినాడా?

 30.13 (పదమూడవ శ్లోకము)

పృచ్ఛతేమా లతా బాహూనప్యాశ్లిష్టా వనస్పతేః|

నూనం తత్కరజస్పృష్టా బిభ్రత్యుత్పులకాన్యహో॥9442॥

అప్పుడు ఆ గోపికలు తమలో తాము ఇట్లు ముచ్చటించుకొనిరి- 'సఖులారా! ఈ లతలను ఒకసారి పరికించి చూడుడు. ఇవి శ్రీకృష్ణ సాంగత్య భాగ్యమును పొందినట్లేయున్నవి. ఇది ముమ్మాటికిని నిజము. ఏలయన, ఇవి తమ పతియగు వృక్షముయొక్క కొమ్మలను పెనవైచుకొనియున్నను, ఆ స్వామియొక్క గోటికొనల సుఖస్పర్శవలననే కాబోలు మొగ్గదొడిగి పులకితములైనట్లు కనబడుచున్నవి.

 30.14 (పదునాలుగవ శ్లోకము)

ఇత్యున్మత్తవచో గోప్యః కృష్ణాన్వేషణకాతరాః|

లీలా భగవతస్తాస్తా హ్యనుచక్రుస్తదాత్మికాః॥9443॥

ఈ విధముగా కృష్ణునియెడబాటుతో నున్న గోపికలు ఆ స్వామిని వెదకుటలో మిగుల అలసిపోయిరి. విహ్వలలైయున్న ఆ గోపివనితలు కృష్ణునితో తాదాత్మ్యము చెందుచు (తమను కృష్ణునిగా భావించుకొనుచు) ఆ ప్రభువుయొక్క లీలలను అనుకరింపసాగిరి.

 30.15 (పదునైదవ శ్లోకము)

కస్యాశ్చిత్పూతనాయంత్యాః కృష్ణాయంత్యపిబత్స్తనమ్|

తోకాయిత్వా రుదత్యన్యా పదాహన్ శకటాయతీమ్॥9444॥

పరీక్షిన్మహారాజా! ఒక గోపిక పూతనగా నటించుచుండగా, మఱియొకతె బాలకృష్ణుడై ఆమె చనుబాలు త్రాగసాగెను. ఒక యువతి చిన్నికృష్ణుని భావముతో ఏడ్చుచు, బండిగా  (శకటాసురుడుగా) నటించుచున్న మఱియొకతెను కాలితో తన్నెను. 

 30.16  (పదహారవ శ్లోకము)

దైత్యాయిత్వా జహారాన్యామేకా కృష్ణార్భభావనామ్|

రింగయామాస కాప్యంఘ్రీ కర్షంతీ ఘోషనిఃస్వనైః॥9445॥

ఒక సుందరి సుడిగాలిగా (తృణావర్తునిగా) ప్రవర్తించుచు బాలకృష్ణునివలె అనుసరించు వేఱొక గోపికను ఎత్తుకొనిపోయెను. ఒక గోపిక మోకాళ్ళపై దోగాడుచుండగా ఆమె కాలి అందెలు ఘల్లుఘల్లున మ్రోగుచుండెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్ఫదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:54, 17/01/2021] +91 95058 13235: 17.1.2021   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పదియవ అధ్యాయము

శ్రీకృష్ణుని విరహముతో గోపికల పరితాపము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

30.17 (పదిహేడవ శ్లోకము)

కృష్ణరామాయితే ద్వే తు గోపాయంత్యశ్చ కాశ్చన|

వత్సాయతీం హంతి చాన్యా తత్రైకా తు బకాయతీ॥9446॥

ఇద్దరు గోపికలు బలరామకృష్ణులైరి. కొందఱు గోపకాంతలు గోపాలురుగా, ఆవు దూడలుగా నటింపసాగిరి. ఒక గోపిక వత్సాసురునిగా, మఱియొక గోపిక బకాసురునిగా నటించుచుండగా, ఇతర గోపికలు వారిని హింసించుచున్నట్లుగా అభినయించిరి.

30.18 (పదునెనిమిదవ శ్లోకము)

ఆహూయ దూరగా యద్వత్కృష్ణస్తమనుకుర్వతమ్|

వేణుం క్వణంతీం క్రీడంతీమన్యాః శంసంతి సాధ్వితి॥9447॥

కొందఱు గోపికలు గోవులుగా నటించుచు దూరమునకు వెళ్ళగా, ఒక గోపిక కృష్ణునివలె ప్రవర్తించుచు వారిని పిలువసాగెను. వేఱొక గోపిక కృష్ణునివలె వేణువును ఊరుచున్నట్లు అభినయించుచుండగా, ఇతర గోపికలు 'భలే భలే' అని పొగడుచుండిరి.

30.19 (పందొమ్మిదవ శ్లోకము)

కస్యాంచిత్స్వభుజం న్యస్య చలంత్యాహాపరా నను|

కృష్ణోఽహం పశ్యత గతిం లలితామితి తన్మనాః॥9448॥

ఒక గోపిక తనను కృష్ణునిగా భావించుకొనుచు, వేఱొక గోపిక భుజములపై చేతులు ఉంచి నడచుచు తక్కినవారితో 'గోపికలారా! నేను కృష్ణుడను. నా నడకల సోయగములను చూడుడు' అని పలుకుచుండెను.

30.20 (ఇరువదియవ శ్లోకము)

మా భైష్ట వాతవర్షాభ్యాం తత్త్రాణం విహితం మయా|

ఇత్యుక్త్వైకేన హస్తేన యతంత్యున్నిదధేఽమ్బరమ్॥9449॥

ఒక తరుణి కృష్ణునివలె ప్రవర్తించుచు 'వ్రజవాసులారా! ఈ సుడిగాలులకు, జడివానలకు మీరు ఏమాత్రమూ భయపడవలదు. వాటినుండి రక్షించుటకు నేను తగిన ఉపాయమును ఆలోచించి యున్నాను' అని పలుకుచు, ఒక చేతితో తన చీరెకొంగును పైకెత్తి నిలుచుండెను.

30.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

ఆరుహ్యైకా పదాఽఽక్రమ్య శిరస్యాహాపరాం నృప|

దుష్టాహే గచ్ఛ జాతోఽహం ఖలానాం నను దండధృక్॥9450॥

పరీక్షిన్మహారాజా! ఒక గోపిక కాళియసర్పముగా నటించుచుండగా, మఱొక వనిత కృష్ణునివలె ఆమె శిరస్సుపై పాదములనుంచి, 'క్రూరసర్పమా! ఇచటినుండి వెళ్ళిపొమ్ము. నేను దుష్టులను హతమార్చుటకే అవతరించితిని' అని పలికెను.

30.22 (ఇరువది రెండవ శ్లోకము)

తత్రైకోవాచ హే గోపా దావాగ్నిం పశ్యతోల్బణమ్|

చక్షూంష్యాశ్వపిదధ్వం వో విధాస్యే క్షేమమంజసా॥9451॥

ఇంతలో ఒక గోపయువతి ఇట్లు నుడివెను- "గోపాలకులారా! చూడుడు, వనములో భయంకరమైన దావాగ్ని చెలరేగినది. మీరు కనులు మూసికొనుడు. నేను మిమ్ములను అందఱిని దానినుండి (దావాగ్ని ప్రమాదమునుండి) అవలీలగా రక్షించెదను'.

30.23 (ఇరువది మూడవ శ్లోకము)

(బద్ధాన్యయా స్రజా కాచిత్తన్వీ తత్ర ఉలూఖలే|)

బధ్నామి భాండభేత్తారం హైయంగవముషం త్వితి|

భీతా సుదృక్ పిధాయాస్యం భేజే భీతివిడంబనమ్॥9452॥

యశోదగా నటించుచున్న మఱియొక గోపిక, 'కృష్ణా! వెన్నలను   దొంగిలించి, ఆ కుండలను పగులగొట్టిన నిన్ను ఇప్పుడే ఈ ఱోటికి కట్టివేసెదను' అని పలుకుచు, ఒక గోపికను పూలమాలతో బంధించెను.  అంతట ఆ రెండవ గోపికను భయపడుచున్నట్లు అభినయించుచు ముఖమును కప్పివేసికొనెను.

30.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

ఏవం కృష్ణం పృచ్ఛమానా వృందావనలతాస్తరూన్|

వ్యచక్షత వనోద్దేశే పదాని పరమాత్మనః॥9453॥

30.25 (ఇరువది ఐదవ శ్లోకము)

పదాని వ్యక్తమేతాని నందసూనోర్మహాత్మనః|

లక్ష్యంతే హి ధ్వజాంభోజవజ్రాంకుశయవాదిభిః॥9454॥

ఈ విధముగా గోపికలు కృష్ణుని లీలలను ప్రదర్శించిన పిదప, మఱల వారు బృందావనమునందలి లతలను, వృక్షములను ఆ ప్రభువు జాడను గూర్చి అడుగుచు అంతటను తిరుగసాగిరి. ఇంతలో వారికి ఆ పరమాత్ముని పాదముల ముద్రలు కనబడెను. అప్పుడు వారు పరస్పరము ఇట్లనుకొనిరి- 'ఈ పాదచిహ్నములు తప్పక నందనందనుడైన ఆ మహాత్మునివే. ఏలనన ఈ కాలిగుర్తులలో ధ్వజము, పద్మము, వజ్రాయుధము, అంకుశము, యవలు, హలము మొదలగువాని రేఖలు స్పష్టముగా గోచరించుచున్నవి'.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్ఫదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[05:41, 18/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

788వ నామ మంత్రము 18.01.2021

ఓం జయత్సేనాయై నమః

మహిషాసుర, భండాసురాది రాక్షసులను సంహరించి విజయము నందించగల పరాక్రమశీలులైన సేనలు కలిగియున్న జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి జయత్సేనా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం జయత్సేనాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ లలితాంబను ఆరాధించు సాధకుడు           తను తలపెట్టిన సకల ప్రయత్నములందునూ విజయము సాధించును. 

భండాసురాది రాక్షసులను సంహరించుటలో జగన్మాతకు అత్యంత పరాక్రమము గలిగి, విజయము నందించగల శక్తిసేన ఉన్నది. 

గజసేనాధ్యక్షురాలు సంపత్కరి,  అశ్వసేన అధ్యక్షురాలు అశ్వారూఢ, అగ్నిప్రాకారములు నిర్మించిన జ్వాలామాలిని, భండాసురునితో యుద్ధంలో తిరులేని పరాక్రమము చూపించిన నిత్యాదేవతలు, ముప్పదిమంది  భండాసురుని పుత్రులు వారి సైన్యమును పటాపంచలు చేసిన బాలాత్రిపురసుందరీదేవి, విషంగుడనే రాక్షసుడిని, అతని సైన్యమును మట్టికరిపించిన మంత్రిణి శ్యామలాదేవి, విశుక్రుడిని అతని వివిధసేనా బలములను నిర్జీవులను చేసిన వారాహీ దేవి, రాక్షసులు ప్రయోగించిన జయవిఘ్నయంత్రాన్ని నాశనంచేసిన మహాగణేశ్వరుడు, భండాసురుడు ప్రయోగించిన వివిధ అస్త్రాలకు సప్తకోటి మహామంత్రయుక్తమైన ప్రత్యస్త్రములు, తన చేతి పదివ్రేళ్ళగోళ్ళసందులనుండి వెడలిన నారాయణుని దశాకృతులు, నారాయణాస్త్రము, పాశుపతాస్త్రము, మహాకామేశ్వరాస్త్రము మొదలైనవన్నియునూ శక్తిసేనలే. కాబట్టి జగన్మాత జయత్సేనా యని అనబడినది.

జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి. సప్తకోటి మహామంత్రాలు, వాటితో చేయగలిగే యంత్రాలు, మహాచతుష్షష్టికోటియోగినీ గణములు - ఇవి అన్నియు అంతఃశత్రువులను అంతం చేయగల  సేనలు. ఆ తల్లికి అనాయాసముగా జయమునందించే ఇటువంటి శక్తిసేనలు ఉండుటచే అమ్మవారు జయత్సేనా యని అనబడినది. జగన్మాత భక్తులకు సప్తకోటి మహామంత్రాల అనుష్ఠానమే వారి అంతఃశత్రువులను జయించగల శక్తిసేనలు.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం జయత్సేనాయై నమః యని అనవలెను.

🌹 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

214వ నామ మంత్రము 18.01.2021

ఓం మహా పాతక నాశిన్యై నమః

పంచమహా పాతకములు (స్త్రీ, హత్య, శిశు హత్య, గో హత్య, బ్రహ్మ హత్య, స్వర్ణస్తేయము) అను పంచమహాపాతకములు కూడా తన నామస్మరణ మాత్రమున శమింపజేయు జగజ్జననికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాపాతకనాశనీ యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం మహాపాతకనాశిన్యై నమః యని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు పంచమహాపాతకములను సైతము శమింపజేసి సద్గతులను ప్రసాదించును.

తన ఉపాసకులకు ఏకారణముచేతనైనను పాపములంటిన వాటిని పోగొట్టునది జగన్మాత.  బ్రహ్మాండ పురాణములో ఇలాచెప్పబడినది.

తస్యచాఖిలపాపస్య జ్ఞానతోఽజ్ఞానతోఽపి వా|

ప్రాయశ్చిత్తం పరం ప్రోక్తం పరాశక్తే పదస్మృతి॥ (సౌభాగ్యభాస్కరం, 390వ పుట)

 వ్యాసులవారిలా చెప్పారు: పాతకములలో ఐదింటిని మహాపాతకాలు అంటారు. ఆ పాపాలకు నిష్కృతి లేదు. వాటి ఫలితాలను అనుభవించే తీరాలి. ఆ మహాపాతకాలు -

1. స్త్రీ హత్య,  2. శిశు హత్య, 3. గో హత్య, 4. బ్రహ్మ హత్య, 5. స్వర్ణస్తేయము (బంగారము దొంగిలించుట),

తెలియక చేసినను, తెలిసి చేసినను  ఫలితాన్ని అనుభవించ వలసినదే. కాని  ప్రమాద వశాత్తూ చేసిన పాపములకు ప్రాయశ్చిత్తంగా విముక్తి సాధనాలున్నాయి. శాస్త్ర ప్రకారంగా, భక్తిపూర్వకంగా ప్రాయశ్చిత్తం చేసుకొంటే ఆ పాపాలు క్రమంగా హరిస్తాయి. 

తెలియక ఒకసారి కోసల దేశపురాజు గోహత్యాపాతకంలో చిక్కుకున్నాడు. కోసలదేశంలో కరువు ఏర్పడినప్పుడు, ఆ రాజు ఇరుక్కొన్న వైనం ఇలా చెప్పబడినది.ఒకప్పుడు కోసలదేశంలో క్షామం సంభవించినపుడు భీమసేనుడు అను ఆ రాజు నగరం వెలుపల ఒక బావి త్రవ్వించాడు. ఆయన ఆ బావికి చుట్టూ గోడ కట్టించలేదు.

ఆ నూతి చుట్టూ, దాహార్తియైన ఒక ఆవు దూడ ఆ నూతిలోపడి మరణించింది. బావిచుట్టూ తిరుగుతూ ఆవు అరుస్తున్నది. ప్రోగైన జనులు దూడ కళేబరాన్ని బయటకు తీశారు. ఈ పాపం ఎవరిదనే చర్చ సాగింది. అజాగ్రత్తగా ఉన్న పశువులకాపరిది తప్పన్నారు కొందరు. దూడ యజమాని తప్పు అని కొందరన్నారు. బావికి గోడ కట్టించని వారిది తప్పని మరి కొందరన్నారు. ఈ సంగతి తెలిసి రాజు పండితులను సంప్రదించాడు. వారు రాజుకు చెప్పిన విషయం ఏమంటే - రాజు బావి త్రవ్వించి అనేకుల ప్రాణాలను రక్షించుటచే ఆ పుణ్యం ఆయనకు దక్కును. కాని గోడ కట్టించాలని తెలియక ఒక ఆవుదూడ మరణానికి కారణమైన పాపం కూడా ఆయనకు చెందుతుంది. కాని ఇది తెలియక చేసిన తప్పు కనుక ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చునన్నారు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం తీర్థయాత్రలు చేసి, దానధర్మములు చేయవలెను. కానీ పరమేశ్వరి నామస్మరణ మాత్రమున ఇట్టి పాపములు తెలిసి చేసినను, తెలియక చేసినను పటాపంచలగును. కాబట్టి జగన్మాత  మహాపాతకనాశినీ యని అనబడినది.

అలాగే శివపూజ నూరు బ్రహ్మహత్యల పాపమును నశింపజేయును. పాపముల హెచ్చు తగ్గులను బట్టి పంచదశీమంత్ర సంఖ్యలో గూడ హెచ్చుతగ్గులు ప్రాయశ్చిత్తముగా జపము చేయవచ్చును.స్వల్ప పాపమునకు స్వల్పజపము, మహాపాపములకు అధికముగాను పంచదశీ జపము చేయవలయును అని సౌభాగ్యరత్నాకరమునందు చెప్పబడినది.

పాపములు పోవుటకు చేయు ప్రాయశ్చిత్తములను శాంతికర్మలు అని పెద్దలు చెప్పారు. సర్వదేవతా స్వరూపిణియైన జగన్మాతను ఆరాధిస్తే సర్వప్రాయశ్చిత్తములకు ఒక శాంతికర్మతో సరిపోవునుగాన జగన్మాతను మహాపాతక నాశనీ యని అన్నాము.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహాపాతకనాశిన్యై నమః యని అనవలెను.

🌹   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పదియవ అధ్యాయము

శ్రీకృష్ణుని విరహముతో గోపికల పరితాపము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

30.26 (ఇరువది ఆరవ శ్లోకము)

తైస్తైః పదైస్తత్పదవీమన్విచ్ఛంత్యోఽగ్రతోఽబలాః|

వధ్వాః పదైః సుపృక్తాని విలోక్యార్తాః సమబ్రువన్॥9455॥

ఆ పాదచిహ్నములనుబట్టి గోపికలు శ్రీకృష్ణుని వెదకుచు ముందునకు సాగిరి. అక్కడక్కడ వారు ఆ ప్రభువుయొక్క పాదముద్రలతోపాటు ఒక తరుణియొక్క కాలి గుర్తులు గూడ ఉండుట గమనించి, వారు మిగుల వ్యాకులచిత్తలై ఇట్లు సంభాషించుకొనిరి.

30.27 (ఇరువది ఏడవ శ్లోకము)

కస్యాః పదాని చైతాని యాతాయా నందసూనునా|

అంసన్యస్తప్రకోష్ఠాయాః కరేణోః కరిణా యథా॥9456॥

గజరాజుతో గూడి ఒక ఆడు ఏనుగు నడచినట్లుగా ఒక యువతి శ్రీకృష్ణునితో కలిసి, ఇచట నడచినట్లున్నది. చూడుడు. ఆమె తన ముంజేతిని ఆ ప్రభువుయొక్క భుజములపై వేసి ముందునకు సాగినట్లున్నది. ఆ భాగ్యశాలినిఎవరై యుండును?

30.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

అనయాఽఽరాధితో నూనం భగవాన్ హరిరీశ్వరః|

యన్నో విహాయ గోవిందః ప్రీతో యామనయద్రహః॥9457॥

నిజముగా ఆ కాంత జగన్నాథుడైన కృష్ణపరమాత్ముని తన భక్తిపూర్వకముగా సేవించియే యుండును. ఏలనన, ఆ గోవిందుడు మనలను అందఱిని విడిచిపెట్టి, ఏకాంతముగా ఆమెతో కలిసి నడచివెళ్ళెను.

30.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

ధన్యా అహో అమీ ఆల్యో గోవిందాంఘ్ర్యబ్జరేణవః|

యాన్ బ్రహ్మేశౌ రమాదేవీ దధుర్మూర్ధ్న్యఘనుత్తయే॥9458॥

సఖులారా! గోవిందుని యొక్క ఈ చరణకమల రేణువులు ఎంతయు పవిత్రములు, దివ్యములు. అందువలన బ్రహ్మ, పరమశివుడు మొదలగు దేవతలును, లక్ష్మీదేవియు ఆ పరమాత్ముని ప్రాప్తికి ఎదురగు ప్రతిబంధకములను అధిగమించుటకై వాటిని (ఆ చరణ ధూళులను) తమ శిరములపై ధరించుచున్నారు. మనముగూడ ఆ దివ్య రేణువులతో మన శిరస్సులను అభిషేకించుకొనినచో,  ఆ పరమ పురుషుని కలయిక సాధ్యమగును.

30.30 (ముప్పదియవ శ్లోకము)

తస్యా అమూని నః క్షోభం కుర్వంత్యుచ్చైః పదాని యత్|

యైకాపహృత్య గోపీనాం రహో భుంక్తేఽచ్యుతాధరమ్॥9459॥

గోవిందునితోగూడి క్రీడించిన ఆ విలాసవతియొక్క పాదచిహ్నములు మనలను మిగుల చిత్తక్షోభకు గుఱిచేయుచున్నవి. ఏలయన, మన గోపికలకు అందఱకును సొంతమైన కృష్ణుని అధరామృతమును ఏకాంతమున తాను ఒక్కతెయే అనుభవించుచున్నది.

30.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

న లక్ష్యంతే పదాన్యత్ర తస్యా నూనం తృణాంకురైః|

ఖిద్యత్సుజాతాంఘ్రితలామున్నిన్యే ప్రేయసీం ప్రియః॥9460॥

 అంతట మఱియొక గోపిక ఇట్లు పలికెను - 'చెలులారా! ఇటు చూడుడు. ఇచట ఆ యువతి యొక్క కాలి గుర్తులు  కనబడుటలేదు. కేవలము మన స్వామియొక్క పాదచిహ్నములే గోచరించుచున్నవి. దీనిని బట్టి చూడగా నిక్కపొడుచుకొనియున్న ఈ తృణములు సుకుమారములైన ఆమె అఱికాళ్ళకు గుచ్చుకొని బాధించునేమోయని తలంచి, ప్రభువు తన ప్రేయసిని భుజములపై చేర్చుకొనినట్లున్నది'.

30.32 (ముప్పది రెండవ శ్లోకము)

ఇమాన్యధికమగ్నాని పదాని వహతో వధూమ్|

గోప్యః పశ్యత కృష్ణస్య భారాక్రాంతస్య కామినః॥9461॥

30.33 (ముప్పది మూడవ శ్లోకము)

అత్రావరోపితా కాంతా పుష్పహేతోర్మహాత్మనా|

అత్ర ప్రసూనాఽవచయః ప్రియార్థే ప్రేయసా కృతః|

ప్రపదాక్రమణే ఏతే పశ్యతాఽసకలే పదే॥9462॥

పిదప వేఱొక గోపిక ఇట్లు నుడివెను - 'వనితలారా! ఈ గోపిక చెప్పినది 'నిజమే' యనిపించుచున్నది. ఏలయన, కృష్ణుడు తనకు ప్రీతిపాత్రురాలైన తరుణియొక్క భారమును వహించుచుండుటచే కాబోలు, ఆచట ఆ స్వామి పాదములు పచ్చికలపై మిక్కిలి దిగబడినట్లు కనబడుచున్నవి. ఇచ్చట తాను పూవులను కోయుటకై  ఆ కాంతను భుజములపై నుండి క్రిందికి దింపినట్లు గోచరించుచున్నది. ఇచట ఆ గోపికాప్రియుడు తన కాళ్ళ మునివ్రేళ్ళపై నిలబడి తన ప్రియురాలి కొఱకై ఎగిరెగిరి పూలు తెంపినట్లున్నది. అందువలననే ఇచట ఆ స్వామి పాదముల గుర్తులు సగము మాత్రమే నేలపై కనిపించుచున్నవి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్ఫదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:05, 18/01/2021] +91 95058 13235: 18.1.2021   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పదియవ అధ్యాయము

శ్రీకృష్ణుని విరహముతో గోపికల పరితాపము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

30.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

కేశప్రసాధనం త్వత్ర కామిన్యాః కామినా కృతమ్|

తాని చూడయతా  కాంతాముపవిష్టమిహ ధ్రువమ్॥9463॥

ఈ ప్రదేశమునందు మన కృష్ణుడు ఆ తరుణిపై మరులుగొని, ఆమెను తన యొడిలో కూర్చుండబెట్టుకొని, చెదరియున్న ఆమె కేశములను సవరించి, కొప్పుపై పూలను అలంకరించినాడనుట నిశ్చయము. ఏలయన, అతడు ఇక్కడ కూర్చున్న గుర్తులు కనబడుచున్నవి.

30.35 (ముప్పది ఐదవ శ్లోకము)

రేమే తయా చాత్మరత ఆత్మారామోఽప్యఖండితః|

కామినాం దర్శయన్ దైన్యం స్త్రీణాం చైవ దురాత్మతామ్॥9464॥

శ్రీకృష్ణుడు ఆత్మారాముడు, పూర్ణకాముడు- (స్త్రీల విలాసచేష్టలకు చలించనివాడు). ఐనను విషయసుఖములను పొందుటకై ఆరాటపడుచుండెడి స్త్రీల పరవశత్వమును, దైన్యస్థితిని ప్రకటించుటకై ఆ ప్రభువు ఒక తరుణితో క్రీడించినట్లు లీలలను ప్రదర్శించెను.

30.36 (ముప్పది ఆరవ శ్లోకము)

ఇత్యేవం దర్శయంత్యస్తాశ్చేరుర్గోప్యో విచేతసః|

యాం గోపీమనయత్కృష్ణో విహాయాన్యాః స్త్రియో వనే॥9465॥

30.37 (ముప్పది ఏడవ శ్లోకము)

సా చ మేనే తదాఽఽత్మానం వరిష్ఠం సర్వయోషితామ్|

హిత్వా గోపీః కామయానా మామసౌ భజతే ప్రియః॥9466॥

ఈ విధముగా ఆ గోపికలు శ్రీకృష్ణుని పాదముద్రలను చూపించుచు, వివేకమును కోల్పోయి ఉన్మత్తలవలె  అటునిటు తిరుగసాగిరి. ఇంతవఱకును వనమునందు ఇతర గోపికలను అందఱిని విడిచిపెట్టి, శ్రీకృష్ణుడు ఏ గోపికను చేరదీసినాడో, ఆమె తనను గూర్చి ఇట్లనుకొనెను - 'గోపికలందఱిలో నేనే శ్రేష్ఠురాలను, ఆ ప్రభువునకు ప్రీతిపాత్రురాలను. అందువలననే  ఆ స్వామి తనపై మరులుగొన్న గోపికలను విడనాడి, నన్నే ఆదరించుచున్నాడు'.

30.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

తతో గత్వా వనోద్దేశం దృప్తా కేశవమబ్రవీత్|

న పారయేఽహం చలితుం నయ మాం యత్ర తే మనః॥9467॥

ఆ విధముగా గర్వితయై స్వోత్కర్షతోనున్న గోపిక కొంతదూరము వెళ్ళిన పిమ్మట శ్రీకృష్ణునితో 'స్వామీ! సుతిమెత్తని నా పాదములు మిగుల కందిపోయినవి. ఇంక నేను ఒక్క అడుగుకూడ వేయజాలకున్నాను. కనుక, నీవు నన్ను నీ ఇష్టము వచ్చినచోటికి తీసికొనిపొమ్ము' అని యనెను.

30.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

ఏవముక్తః ప్రియామాహ స్కంధ ఆరుహ్యతామితి|

తతశ్చాంతర్దధే కృష్ణః సా వధూరన్వతప్యత॥9468॥

ఆ గోపిక ఇట్లు పలికిన పిదప శ్రీకృష్ణుడు ఆమెతో 'ప్రియా! అట్లైనచో నా భుజములపై కూర్చుండుము' అని వచించెను. ఆ మాటలకు పొంగిపోయిన ఆ గోపిక ఆయన భుజములపై చేరుటకు సన్నద్ధురాలగు చుండగానే ఆ ప్రభువు అంతర్ధానమయ్యెను. అంతట గోపవనిత ఏడ్చుచు మిక్కిలి పశ్చాత్తాపపడెను.

30.40 (నలుబదియవ శ్లోకము)

హా నాథ రమణ ప్రేష్ఠ క్వాసి క్వాసి మహాభుజ|

దాస్యాస్తే కృపణాయా మే సఖే దర్శయ సన్నిధిమ్॥9469॥

"నాథా! ప్రియతమా! నీ దర్శనము, భాషణము నాకు ఆనందదాయకము. నీవు మిగుల భుజబలశాలివి. సఖుడా! నీవు ఎక్కడ ఉన్నావు? నేను దీనురాలను, నీ దాసిని. నీ దర్శనమును అనుగ్రహించి, నీ సన్నిధిని ప్రసాదింపుము".

30.41 (నలుబది ఒకటవ శ్లోకము)

అన్విచ్ఛంత్యో భగవతో మార్గం గోప్యోఽవిదూరితః|

దదృశుః ప్రియవిశ్లేషమోహితాం దుఃఖితాం సఖీమ్॥9470॥

30.42 (నలుబది రెండవ శ్లోకము)

తయా కథితమాకర్ణ్య మానప్రాప్తిం చ మాధవాత్|

అవమానం చ దౌరాత్మ్యాద్విస్మయం పరమం యయుః॥9471॥

పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుని చరణ చిహ్నములను బట్టి ఆ స్వామి కొఱకై అన్వేషించుచున్న గోపికలు ప్రియుని ఎడబాటు కారణముగా విహ్వలయై దుఃఖించుచున్న తమ సఖిని తమకు చేరువలోనే యుండుట గమనించిరి. క్రమముగా ఆ గోపిక విహ్వల స్థితినుండి తేరుకొనిన పిమ్మట మాధవుడు తనను ఆదరముతో చేరదీసి సంతోషపెట్టిన సంగతిని, తన అహంకార కారణమున ఆ ప్రభువు  అంతర్ధానమైన విషయమును ఆ గోపికలకు తెలిపెను. ఆమె మాటలను వినినంతనే వారు మిక్కిలి ఆశ్చర్యపడిరి.

30.43 (నలుబది మూడవ శ్లోకము)

తతోఽవిశన్ వనం చంద్రజ్యోత్స్నా యావద్విభావ్యతే|

తమః ప్రవిష్టమాలక్ష్య తతో నివవృతుః స్త్రియః॥9472॥

అనంతరము ఆ సఖితోగూడి వారు వనమున వెన్నెల ప్రసరించు చున్నంతవఱకును శ్రీకృష్ణునికొఱకై వెదకిరి. క్రమముగా వెన్నెల కనుమరుగై చీకట్లు వ్యాపించుట గమనించి ఆ వనితలు అచటి నుండి వెనుదిరిగిరి.

30.44 (నలుబది నాలుగవ శ్లోకము)

తన్మనస్కాస్తదాలాపాస్తద్విచేష్టాస్తదాత్మికాః|

తద్గుణానేవ గాయంత్యో నాత్మాగారాణి సస్మరుః॥9473॥

వారు కృష్ణుని నుండి తమ ధ్యాసను మళ్ళింపలేక ఆయన విషయమునే ప్రస్తావించుకొనుచు ఆ స్వామిలో తాదాత్మ్యము చెంది, ఆయన లీలలను, గుణవైభవములను కీర్తింపసాగిరి. ఆ స్థితిలో వారికి తమ దేహములపైగాని, గృహములపైగాని ఏమాత్రమూ ధ్యాసలేకుండెను.

30.45 (నలుబది ఐదవ శ్లోకము)

పునః పులినమాగత్య కాలింద్యాః కృష్ణభావనాః|

సమవేతా జగుః కృష్ణం తదాగమనకాంక్షితాః॥9474॥

తమ మనస్సులన్నియును కృష్ణభావనలతో నిండియుండుటవలన ఆ గోపికలు కాళిందీనదీతీరమున గల ఇసుక తిన్నెలపై చేరిరి. ఆ స్వామి రాకకై వేయికండ్లతో ఎదురుచూచుచు, వారు అందఱును గలసి, ఆ ప్రభువుయొక్క విశిష్టగుణములను గానము చేయసాగిరి.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే త్రింశోఽధ్యాయః (30)

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి ముప్పదియవ అధ్యాయము (30)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[04:49, 19/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

789వ నామ మంత్రము 19.01.2021

ఓం నిస్త్రైగుణ్యాయై నమః

సత్వరజస్తమోగుణములకు (త్రిగుణములకు)  కారణమైయుండియు, త్రిగుణ రహితయైన జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిస్త్రైగుణ్యా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం నిస్త్రైగుణ్యాయై నమః యని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు త్రిగుణరహితమైన ఆ పరమేశ్వరి కరుణచే ఐహికముగా అన్నవస్త్రములకు, సిరిసంపదలకు, కీర్తిప్రతిష్టలకు లోటులేకుండా అనుగ్రహిస్తూ, జ్ఞానసాధనవైపు మనసును నడిపించి నిత్యము,సత్యమైన పరబ్రహ్మతత్త్వాన్ని తెలిసికొనే శక్తిని అనుగ్రహించును.

త్రిగుణములు అంటే భౌతిక ప్రకృతి యొక్క గుణాలు. ఇవి తమోగుణం, రజో గుణం, సత్వ గుణం.    

రజో గుణం వల్ల కోరికలు, ప్రాపంచిక అభ్యున్నతి కోసం తృష్ణ జనిస్తాయి. సత్త్వగుణం వల్ల జ్ఞానం, రజోగుణం వల్ల మోహం, తమోగుణం వల్ల అజాగ్రత్త, అవివేకం, మరపు, పరాకు మొదలైనవి కలుగుతాయి.

సృష్టియంతయు ఈ మూడుగుణముల సమ్మేళనమే. ప్రకృతి అంటే త్రిగుణాత్మకము. పరబ్రహ్మస్వరూపిణియైన జగన్మాత సృష్టిస్థితిలయకారిణి. అనగా త్రిగుణములకు కారణం తానే. కాని అమ్మవారు పరబ్రహ్మస్వరూపిణి గనుక ఈ మూడుగుణములు ఆ తల్లిని అంటవు. గనక పరమేశ్వరి నిస్త్రైగుణ్యా యని అనబడినది.

తామరాకు నీటిలో ఉంటుంది. తామరాకుపై నీటిబొట్టు ఆ నీటితో సంబంధంలేకుండా ఉంటుంది. 

సర్వసంగపరిత్యాగి అన్నీ వదలి కేవలం పరమాత్మ దర్శనంకోసమే సాధన చేయడం జరుగుతుంది.

సంసారికూడా సంసారంలో ఉంటూ, తనకు సంసారం అంటకుండా పరమాత్మను దర్శించుకోవచ్చు. దీనికి కొంతసాధన అవసరం. ఆ సాధనే అంతర్ముఖసాధన (అంతర్ముఖసమారాధ్యా) ద్వారా పరమేశ్వరి అనుగ్రహం పొందడం. 

భగవద్గీత 2-45

త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున|

నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్॥

 "ఓ అర్జునా ! వేదాలు త్రైగుణ్యవిషయాలను గురించే చెపుతున్నాయి ; నువ్వు త్రిగుణాతీతుడవుకమ్ము. ద్వంద్వాలనూ, యోగక్షేమాలనూ విడిచి సదా శుద్ధసత్వాన్ని అవలంబించి, ఆత్మజ్ఞానివి కావాలి; ఆత్మతత్త్వంలోనే స్థిరపడు". అని శ్రీకృష్ణ భగవానుడు అన్నారు

జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి. శుద్ధసత్త్వస్వరూపురాలు. ఆత్మజ్ఞాని. గనుక నిస్త్రైగుణ్యా యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిస్త్రైగుణ్యాయై నమః యని అనవలెను.

🌹 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

215వ నామ మంత్రము 19.01.2021

ఓం మహామాయాయై నమః 

బ్రహ్మోపేంద్రాది దేవతలను సైతం మాయామోహితులను కావించగల పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహామాయా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మహామాయాయై నమః అని ఉచ్చరించుచూ, భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు మాయామయమైన ఈ జగత్తులో పరబ్రహ్మమాత్రమే సత్యమనునది తెలిసికొని ఆ దిశగా తమ సాధనను  కొనసాగించగల దీక్షాదక్షతను ఆ పరమేశ్వరి అనుగ్రహించును.

 బ్రహ్మాది దేవతలను సైతం  మాయలో పడవేయగలదు పరమేశ్వరి.

జ్ఞానినా మపి చేతాంసి దేవీ భగవతీ హి సా|

బలా దాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి॥ (సౌభాగ్యభాస్కరం, 391వ పుట)స

జీవుడు గర్భములో ఉన్నప్పుడు జ్ఞానముతోనే ఉండును. నవమాసములు నిండి గర్భమునుండి బయటకు వచ్చినతోడనే జ్ఞాని కాస్తా అజ్ఞాని యగును. దానికి కారణము ప్రసూతివాయువుచే మాసములు నిండిన పిదప బయటకు పంపబడతాడు.  ఆ ప్రసూతి వాయువుచే మాయకప్పబడి జీవుడు జ్ఞానంకోల్పోతాడు. ఇదే పరమాత్మ యొక్కమాయ. తదనంతరము పూర్వజన్మల కర్మలను బట్టి యోగ్యతలు ఏర్పడుతాయి. యోగ్యతననుసరించే తిండి, బట్ట, అరిషడ్వర్గములు అన్నీ పెరిగే క్రమంలో ఒకదాని వెంబడి ఒకటి చేరుతాయి. ఇదంతయు మాయాప్రభావమే. ఈ మాయ యొక్క స్థాయి ఆ జీవి పూర్వజన్మల కర్మఫలాలను అనుసరించి ఉంటుంది. ఇది యంతయు సృష్టిస్థితిలయకారిణియైన పరమేశ్వరి యొక్క మహామాయాతత్త్వం చేత జరుగుతుంది. సృష్టి మొత్తం మాయాకు లోబడునదే. 

జీవాత్మ ఎక్కడ ఉన్నదో అక్కడే పరమాత్మ ఉండడం జరుగుతుంది.  కాని జీవాత్మకు, పరమాత్మకు మధ్య మాయ అనేది ఉంటుంది. ఇది ఒకతెర వంటిది. ఈ మాయ అను తెరను తొలగించుకొనే పని జీవుడిదే. అది ఆ జీవుని పూర్వజన్మకర్మలు, ప్రస్తుతజన్మ సాంగత్యప్రభావము. పూర్వజన్మకర్మల ఫలం అనుకూలమైనది అయితే లభించే సాంగత్యం మంచిది అవుతుంది. అప్ఫుడు సాధన తోడవుతుంది. మాయ అనే తెర తొలగించగలగడం  జరుగుతుంది. పరమాత్మదర్శనం పొందడం సంభవిస్తుంది. 

విద్యా (జ్ఞాన) సంబంధమైనది, అవిద్యా (అజ్ఞాన) సంబంధమైనది అని మాయలో వైవిధ్యముగలదు. విద్యా సంబంధమైన మాయ అయితే ఆలోచించగలిగే వివేకము, వైరాగ్యము అనే రెండిటిలో వివేకము భగవధ్యానము, సత్కర్మలనాచరించడం, కర్మఫలాన్ని మెరుగు పరచుకోవడం జరుగుతుంది. వైరాగ్యము అనుననిది అయితే పునర్జన్మ రాహిత్యమైన మోక్షసాధన దిశగా సాధన సాగుతుంది. ఈ దశలో సర్వసంగ పరిత్యాగిగా కొనసాగుతాడు సాధకుడు. 

అవిద్యా సంబంధమైన మాయ అయితే కామక్రోధలోభాది అరిషడ్వర్గములకు బానిసగా జీవించుచూ, నేను, నాది, నా శరీరము అనే భావనలు, కర్మఫలాలు మరింత చెడ్డవిగా అయిపోతాయి. అకృత్యాలు, రాక్షసప్రవర్తన, అనృతములు పలకడం, అనాచారములు పాటించడం జరిగి మళ్ళీ జన్మలో పిల్లిగానో, బల్లిగానో లేదా అంతకన్నా ఘోరమైన క్రిమిగానో పుట్టడం జరుగుతుంది. పునరపి జననం, పునరపిమరణం అనే జననమరణపరిభ్రమణ వలయంలో  చిక్కుకోవడం జరిగిపోతుంది. 

శ్రీమాత మహామాయ. జ్ఞానుల మనస్సులను కూడా బలాత్కారముగా ఆకర్షించి మోహము (అజ్ఞానము) లో పడవేయును. ఆ మహామాయను అధిగమించాలంటే ఆ పరమేశ్వరినే శరణువేడుకోవాలి

కావున ఈ లలితా సహస్రనామ పారాయణయే విద్యామాయకు లోనవుతున్నారు అని అర్థం. ఈ మాయ  భక్తులను పరమేశ్వరీ ఆరాధనవైపు మనసును పయనింపజేయడం జరుగుతుంది. ఇందులో కొనసాగడం వివేకసంబంధిత మాయ అవుతుంది. కర్మఫలాలను మెరుగుపరచుకుంటూ సాధనలో కొనసాగుతూ, జన్మరాహిత్యమైన మోక్షసాధనను కూడా పొందవచ్చు.  

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహామాయాయై నమః అని అనవలెను.

🌹  ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఒకటవ అధ్యాయము

గోపికాగీతలు

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

గోప్య ఊచుః

31.1 (ప్రథమ శ్లోకము)

జయతి తేఽధికం జన్మనా వ్రజః  శ్రయత ఇందిరా శశ్వదత్ర హి|

దయిత దృశ్యతాం దిక్షు తావకాస్త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతే॥9475॥

గోపికలు ఇట్లు నుడివిరి "ప్రియతమా! కృష్ణా! నాథా! నీవు ఇచట అవతరించుటవలన ఈ వ్రజభూమి ఆ వైకుంఠముకంటెను ఎంతయు ప్రాభవమును సంతరించుకొనుచున్నది. శ్రీహరికి నిత్యానపాయినియైన లక్ష్మీదేవియు ఆ పరంధామమును వీడి ఇచట నివసించుచున్నది. అనగా ఈ బృందావనము పుష్కలమైన పాడిపంటలతో వర్ధిల్లుచున్నది. నీ వారమైన మేము నీ యందే ప్రాణములను నిలుపుకొని, నీ కొఱకై నలు దిక్కుల యందును వెదకుచున్నాము. కావున మాయెడ కనికరము చూపుచు మాకు నీ దర్శనమును అనుగ్రహింపుము.

31.2 (రెండవ శ్లోకము)

శరదుదాశయే సాధుజాతసత్సరసిజోదర శ్రీముషా దృశా|

సురతనాథ తేఽశుల్కదాసికా  వరద నిఘ్నతో నేహ కిం వధః॥9476॥

నిరంతరము ఆనందదాయుడవైన ఓ స్వామీ! మేము నీకు మూల్యములేని దాసీలము. నీ దివ్య నేత్రములు శరత్కాలమున సరస్సులలో బాగుగా వికసించిన కమలముల యందలి కర్ణికారముల (దుద్దుల) యొక్క అందచందాలను ధిక్కరించుచున్నవి. మనోజ్ఞములైన నీ చూపులతో మా ప్రాణములను హరించి యుంటివి. ఇది మమ్ము వధించుట కాదా? అస్త్రములతో వధించుటయే వధయగునా?

31.3 (మూడవ శ్లోకము)

విషజలాప్యయాద్వ్యాలరాక్షసద్వర్షమారుతాద్వైద్యుతానలాత్|

వృషమయాత్మజాద్విశ్వతోభయాదృషభ తే వయం రక్షితా ముహుః॥9477॥

పురుషోత్తమా! కాళీయుని వలన కలుషితములైన యమునానదీ విషజలములనుండియు, కొండచిలువ రూపములో వచ్చిన అఘాసురుని నుండియు మమ్ములను కాపాడితివి. ఇంద్రుని ప్రేరణతో ఉప్పతిల్లిన జడివానలవలసను, సుడిగాలులవలనను, అశనిపాతము వలనను సంభవించిన పెనుప్రమాదముల నుండియు, అట్లే దావానలము నుండియు మమ్ము రక్షించితివి. వృషభాసురుని నుండియు, మయుని కుమారుడైన వ్యోమాసురుని నుండియు, అట్లే ఎదురైన పలు విపత్తులనుండియు పదే పదే మమ్ములను ఆదుకొనుచు వచ్చితివి. ఇంతవఱకును మాకు ఆపద్భాందవుడవై నిలిచిన నీవు ఇప్పుడు నీ చూపులతో మమ్ము ఎందులకు బాధించుచున్నావు?

31.4 (నాలుగవ శ్లోకము)

న ఖలు గోపికానందనో  భవానఖిలదేహినామంతరాత్మదృక్|

విఖనసార్థితో విశ్వగుప్తయే సఖ ఉదేయివాన్ సాత్వతాం కులే॥9478॥

సకలలోక పూజ్యుడవైన కృష్ణా! నీవు కేవలము యశోదాసుతుడవు మాత్రమేగాదు, సకలప్రాణుల హృదయములయందును అంతర్యామివై యుండి, సర్వసాక్షివై అలరారుచుందువు. సఖా! బ్రహ్మదేవుని అభ్యర్థనపై సమస్త జగత్తును రక్షించుటకు యదువంశమున అవతరించిన మహాత్ముడవు.

31.5 (ఐదవ శ్లోకము)

విరచితాభయం వృష్ణిధుర్య తే  చరణమీయుషాం సంసృతేర్భయాత్|

కరసరోరుహం కాంత కామదం  శిరసి ధేహి నః శ్రీకరగ్రహమ్॥9479॥

వృష్ణివంశోద్ధారకా! జననమరణరూప సంసార చక్రమునబడి భీతిల్లుచున్న జనులు  నీ చరణకమలములను ఆశ్రయింతురు. వారిని నీ అనుగ్రహవీక్షణములతో అభయమిచ్చి ఆదుకొనుచుందువు. జగన్నాథా! లక్ష్మీదేవిని చేపట్టిన దివ్యహస్తము నీది. ఆ అమృతహస్తము సకల జనుల మనోరథములను ఈడేర్చునట్టిది. అట్టి చల్లని నీ కరకమలమును మా శిరములపై నుంచి, మమ్ము అనుగ్రహింపుము.

 31.6  (ఆరవ శ్లోకము)

వ్రజజనార్తిహన్ వీరయోషితాం  నిజజనస్మయధ్వంసనస్మిత|

భజ సఖే భవత్కింకరీః స్మ నో  జలరుహాననం చారు దర్శయ॥9480॥

సఖా! నీవు వ్రజవాసుల ఆర్తిని నివారించునట్టి వీరశిరోమణివి. నీ దరహాసముతో నీ ఆత్మీయుల గర్వమును రూపు మాపుచు నీ మహత్త్వమును గ్రహించునట్లు చేయుచుందువు. స్వామీ! మేము నిన్నే ఆశ్రయించుకొనియున్న నీ దాసీలముగదా! అబలలమైన మాకు నీ సుందర ముఖారవిందమును దర్శింపజేసి మమ్ము ఆనందింపజేయుము.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[21:13, 19/01/2021] +91 95058 13235: 19.1.2021   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఒకటవ అధ్యాయము

గోపికాగీతలు

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

31.7 (ఏడవ శ్లోకము)

ప్రణతదేహినాం పాపకర్శనం  తృణచరానుగం శ్రీనికేతనమ్|

ఫణిఫణార్పితం తే పదాంబుజం  కృణు కుచేషు నః కృంధి హృచ్ఛయమ్॥9481॥

పరమపురుషా! నీ పాదాబ్జములు నిన్ను శరణుజొచ్చిన వారి పాపములను హరించివేయుచుండును. అవి శుభములకును పెన్నిధులు. లక్ష్మీదేవియే స్వయముగా వాటిని సేవించుచుండును. ఆ దివ్యపాదములతో నీవు అనుగమించుచుండుటతో గోవులు తృణములను మేయుచున్నను అమృతక్షీరములను ప్రసాదించుచుండును. కాళియుని పడగలపై నాట్యమాడిన నీ పవిత్రపాదములను మా వక్షస్థలములయందుంచి, మా హృదయతాపములను చల్లార్చుము.

 31.8 (ఎనిమిదవ శ్లోకము)

మధురయా గిరా వల్గువాక్యయాబుధమనోజ్ఞయా పుష్కరేక్షణ|

విధికరీరిమా వీర ముహ్యతీరధరసీధునాఽఽప్యాయయస్వ నః॥9482॥

కమలాక్షా! నీ పలుకులలోని ప్రతిపదము, ప్రతిశబ్దము, ప్రత్యక్షరము మధురాతి మధురము నీ తీయని వాక్కులలోని పరమార్థములను గ్రహించిన పండితులు పరవశించిపోవుచుందురు. నీ దాసీలమైన మేము ఆ స్వాదువచనములకు మోహములో మునిగిపోవు చుందుము. ప్రభూ! నీ అధరామృతమును మాచే ఆస్వాదింపజేసి, మా ప్రాణములను నిలుపుము.

 31.9 (తొమ్మిదవ శ్లోకము)

తవ కథామృతం తప్తజీవనం  కవిభిరీడితం కల్మషాపహమ్|

శ్రవణమంగలం శ్రీమదాతతం భువిగృణంతి తే భూరిదా జనాః॥9483॥ 

స్వామీ! నీ లీలాకథలు అమృతమయములు, తాపత్రయమగ్నులై  దిక్కుతోచక యున్నవారిని ఉద్ధరించునట్టివి. అవి బ్రహ్మాది దేవతలచే నిత్యము స్తుతింపబడుచుండును. నీ దివ్యగాథలను విన్నవారును, భజించినవారును, స్మరించినవారును సమస్త పాపముల నుండియు బయటపడుదురు. విన్నంత మాత్రముననే అవి శ్రేయస్సును ప్రసాదించుచుండును. అవి సకల కళ్యాణదాయకములు. మిక్కిలి సుందరము మరియు విస్తృతము అగు నీ కథామృతమును ఈ లోకములో వర్ణించువారలే, గొప్ప దాతలు (జ్లానదానము కంటే గొప్పదానము లేదు).

 31.10 (పదియవ శ్లోకము)

ప్రహసితం ప్రియప్రేమవీక్షణం  విహరణం చ తే ధ్యానమంగలమ్|

రహసి సంవిదో యా హృదిస్పృశః కుహక నో మనః క్షోభయంతి హి॥9484॥

ప్రియా! ఇదివఱలో నీ మధురదరహాసములును, ప్రేమపూరితములైన నీ చూపులును, క్రీడావిహారములును ధ్యానించినంత మాత్రమునే మమ్ములను ఆనందమున ముంచెత్తుచు శుభములను చేకూర్చుచుండెడివి. ఏకాంతమున వినోదవచనములతో నీవు మా హృదయములను దోచుకొనెడివాడవు. నయవంచకా! ఇప్పటికి నీ తీరుతెన్నులు వాటికి వ్యతిరేకముగా నున్నవి. అందువలన వాటిని స్మరించినంత మాత్రముసనే అవి మా మనస్సులను క్షోభకు గుఱిచేయుచున్నవి.

 31.11 (పదకొండవ శ్లోకము)

చలసి యద్వ్రజాచ్చారయన్ పశూన్ నలినసుందరం నాథ తే పదమ్|

శిలతృణాంకురైః సీదతీతి నః  కలిలతాం మనః కాంత గచ్ఛతి॥9485॥

నాథా! నీ చరణములు కుసుమ కోమలములు. పరమసుందరములు. నీవు గోవులను తోలుకొనుచు వ్రజభూమినుండి వెళ్ళునపుడు దారిలోగల కంకరరాళ్ళు, మొనదేలియుండెడి తృణములు, కుశలు గ్రుచ్చుకొని, నీ సుతిమెత్తని పాదములు ఎక్కడ కందిపోవునో యని మా మనస్సులు మిక్కిలి వ్యాకులపడు చుండును. అందువలన అట్టి మమ్ము నీవు వంచింపజాలవు.

 31.12 (పండ్రెండవ శ్లోకము)

దినపరిక్షయే నీలకుంతలైర్వనరుహాననం బిభ్రదావృతమ్|

ఘనరజస్వలం దర్శయన్ ముహుర్మనసి నః స్మరం వీర యచ్ఛసి9486॥

ఓ వీరుడా! సాయంకాలము నీవు వచ్చుచున్నప్పుడు పద్మమువంటి నీ  ముఖము రేగినజుట్టుతో కప్పబడి దట్టమైన గోధూళితో పులిమియుండును. అట్టి నీ ముఖమును మాకు పలుమార్లు చూపించి, మా మనస్సులయందు ప్రేమానురాగములను కలిగించుచున్నావు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[05:33, 20/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

790వ నామ మంత్రము 20.01.2021

ఓం పరాపరాయై నమః

పరబ్రహ్మతత్త్వాన్ని తెలిసికోవడానికి, మోక్షసాధనకు సంబంధించిన పరావిద్య, ఐహిక భోగములకు సంబంధించినది అపరావిద్య. తననాశ్రయించిన భక్తులకు ఏది కావాలంటే అదే ప్రసాదించి పరాపరస్వరూపిణి యైన  జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి పరాపరా యను నాలుగక్షరముల (చతురక్షరీ)  నామ  మంత్రమును ఓం పరాపరాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఐహికమైనవి, ఆముష్మిక సంబంధమైనవి కూడా వారి వారి అర్హతలననుసరించి అనుగ్రహించును.

జగన్మాత పర, అపర అను ఈ రెండు శబ్దములను సంధిచేసిన పరాపరా అనగా పరా యను శబ్దము ఆధ్యాత్మికతత్త్వమునకు, భగవంతునిపై ధ్యాసవైపు మనసును మరల్చి కర్మఫలములను   మెరుగుపరచుకోవడానికి చేయు ప్రయత్నమే పరా శబ్దమునకు సంబంధించినది. అపరా అనగా  ఇహలోక బంధములలో కొట్టుమిట్టాడు జీవుడు తనకు, తనవాళ్ళకు కావలసిన సుఖసంతోషములు, తాత్కాలికమైన ఐహికసంబంధమైన కోర్కెలు నెరవేర్చుకొను దిశగా చేయు ప్రయత్నములో పరమేశ్వరిని ఆరాధించుట. జగన్మాత ఈ రెండిటికి కూడా పలుకుతుంది. సాధకుని సాధనా పటిమను అంచనా వేస్తుంది. ధర్మబద్ధతను పరిశీలిస్తుంది. అందుకు తగినవిధంగా అనుగ్రహిస్తుంది. అందుకే పరమేశ్వరి పరాపరా యని అనబడినది.

శౌనకుడు అనే జిజ్ఞాసువు అంగిరస మహర్షి వద్దకు వచ్చి "ఏది తెలుసుకుంటే సర్వమూ తెలుసుకున్నట్లవుతుంది?" అని అడిగిన ప్రశ్నకు అంగిరసుడు "పరావిద్య, అపరావిద్య అని రెండు రకాలు తెలుసుకోవలసినవి ఉన్నాయని బ్రహ్మవిదులు అంటారు. పరావిద్య అంటే పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానం. అపరావిద్య అంటే లౌకికమయిన ధర్మాధర్మాలకు సంబంధించినది. రెండవదానికంటే మొదటిది గొప్పది. దాన్ని తెలుసుకున్నవాడు సంసారచక్రం నుంచి విముక్తుడవుతాడు." అంటూ ఈ ఉపనిషత్తును బోధించాడు.

వేదవిద్య, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము నిరుక్తము ఇవి అన్నీ అపర విద్యయందురు ఈ విద్యలు వృత్తిపరంగా ఉపయోగించుకుని, ధనార్జనకు,  సంఘంలో కీర్తిప్రతిష్టలకు ఉపయోగపడి సంసారసుఖముల నుభవించడానికి ఉపయోగపడుతాయి. ఐహికంగా ఉన్నతస్థితికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంఠే అపరవిద్య ఐహిక సంభంనంధమైన  సుఖసంతోషాలు పొందదగినదే.

పరావిద్య వలన పరమాత్మను తెలుసుకోవడానికి, బ్రహ్మలోక ప్రాప్తికి, మోక్షసిద్ధికి ఉపయోగపడుతుంది. పరావిద్య సాధించాలంటే లౌకిక బంధాలకు డూరంగా ఉందాలి. లైకిక లంపటమలున్నవారికి సాధసకష్టమే. ఈ సాధనకు మార్గము ముక్తిమార్గము. అకుంఠితమైన దీక్షకావాలి. మధ్యలో ఏర్పడే అవరోధాలను అధిగమించాలి.పరమాత్మను దర్శించాలంటే చర్మచక్షులు పనికిరావు. మనోనేత్రాలు మాత్రమే ఉపయోగిస్తాయి.ఇంద్రియాలకు. ఆత్మ సర్వవ్యాపకమైనది అనే భావన కలగించేది పరావిద్య. ఈ మాభావమే బ్రహ్నజ్లాసం.

పరమాత్మను ఆరాధిస్తూ సాష్థాంగపడి అమ్మా నా కుమార్తెకు కళ్యాణయోగం ప్రసాదించుతల్లి, ఉద్యోగంలో ఉన్నస్థితిని కలుగు నట్లు అనుగ్రహించు తల్లి, ఋణబాధలు తీరి ఆర్ధికాభివృధ్ధిని కలిగించుతల్లీ - ఇటువంటికోరికలు అపరవిద్యకు సంబంధింఛినవి.

అమ్మా నీపాదసేవ చేసుకుంటున్నాను. శరీరంలో శక్తియున్నంత వరకూ నిన్నే ఆరాధిస్తాను. ఐహికముగా నాకేవీ కోరికలు లేవు. ఎవరి చేతసేవలు చేయించుకోకుండా అనాయాస మరణము ప్రసాదించి, పునర్జన్మరాహిత్యమైన మోక్షమును ప్రసాదించుతల్లీ. ఇవి పరావిద్యకు సంబంధించినవి.

జగన్మాతకు నమస్కరించునపుదు ఓం పరాపరాయై నమః అని అనవలెను.

🌹 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

216వ నామ మంత్రము 20.01.2021

ఓం మహాసత్త్వాయై నమః

చరాచర జగత్తు పాలించుటకు కావలసిన శక్తి, పరిపాలన దక్షతకు కావలసిన గుణసంపత్తి, చరాచర జగత్తునందు వస్తువులన్నిటియందు   అంతర్లీనంగా ఉనికిని చాటగలిగే మహనీయత గలిగిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాసత్త్వా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మహాసత్త్వాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ కారుణ్యమూర్తిని ఆరాధనచేయు భక్తులకు ఆ తల్లి సదా వారి వెంటనే ఉండి శత్రుభయము, దుష్టగ్రహపీడ వంటి ప్రతికూలతలునుండి కాపాడుతూ, తలపెట్టిన ధర్మబద్ధమైన, సత్కార్యములను నిర్విఘ్నముగా కొనసాగింపజేయును.

అత్యంత భక్తిశ్రద్ధలతో తననారాధించు భక్తుల వెంటే తానుంటూ, తన యునికి వారికి మంగళప్రదమగునదిగా కనికరించు మహా మహిమాన్వితమూర్తి గనుకనే జగన్మాత మహాసత్త్వా యని అనిపించుకొనుచున్నది. 

సత్త్వము అంటే బలము, స్వభావము, ద్రవ్రము, గుణము, పిశాచాది ప్రాణి అను అర్థములు గలవు.

సృష్టిస్థితిలయలకు కారణభూతురాలు జగన్మాత. జీవులయొక్క కర్మఫలానుసారం తదుపరి జన్మలు నిర్ణయించేది జగన్మాతయే. లోక కంటకులైన రాక్షసులు సజ్జనులను హింసలు పెట్టు తరుణంలో, అట్టి రాక్షసులను నాశనము చేయుటకనుగుణముగా  అవతరించి రాక్షసపీడను లేకుండా చేయు శక్తిగలిగనిది గనుకనే మహాసత్త్వా యని అనబడినది.

నిరక్షర కుక్షియైన కాళిదాసును ఒక అద్భుతమైన కవిగా మార్చి శ్యామలాదండకం, దేవిస్తోత్రములు వంటివి  ఎన్నియో సృజింజేసి వాటిని తమ అనుష్ఠానములో వినియోగించు దేవీ భక్తులననుగ్రహించినది. అంతకు మించి అమాయకంగా అతనిని వివాహమాడిన రాజకుమార్తె సౌభాగ్యాన్ని అత్యంత మంగళకరమొనర్చినది. 

ఆ తల్లి  త్రిగుణాత్మిక, గుణాతీక కూడా.  త్రిగుణాత్మికమైన జగత్తును సృష్టించి గుణాతీతయై జీవులకు కావలసినవి సమకూర్చినది. 

సూర్యచంద్రులు వారి గమనములను నియంత్రించుచు జగత్తుకు వైపరీత్యముల కంటకము  లేకుండ చేసినది. నవగ్రహములు జీవులనావహించునపుడు, జీవులకర్మఫలములకనుగుణముగా నవగ్రహముల స్థానములు నిర్దేశించినది.

ఋతుధర్మములు, కాలధర్మములు,  జీవధర్మములు, పురుషార్థముల నిర్వహణ అన్నియు తన కనుసన్నలలోనే జరుగునట్లు చేసినది.

సృష్టిస్థితిలయకార్యనిర్వహణ బ్రహ్మవిష్ణుమహేశ్వరులదైనను సృష్టిస్థితిలయలకు తానే కారణమైనది.

తన ఉనికిని, తన బలమును, తన గుణములను జగత్పరిపాలనానిర్వహణలో తగిన విధంగా వినియోగించింది గనుకనే జగత్తు విపరీతములు లేక, ధర్మసంస్థాపన కుంటుబడక, జీవులను వారి కర్మఫలములకనుగుణంగా ప్రవర్పింపజేయుచూ విశ్వకార్యములను చక్కబెట్!నది గనుకనే ఆ తల్లి మహాసత్త్వా యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహాసత్త్వాయై నమః అని అనవలెను.

🌹

మీ ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఒకటవ అధ్యాయము

గోపికాగీతలు

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

31.13 (పదమూడవ శ్లోకము)

ప్రణతకామదం పద్మజార్చితం  ధరణిమండనం ధ్యేయమాపది|

చరణపంకజం శంతమం చ తే  రమణ నః స్తనేష్వర్పయాధిహన్॥9487॥

మనోహరా! నీ పాదపద్మములు ప్రణమిల్లినవారియొక్క అభీష్టములను నెఱవేర్చుచుండును. లక్ష్మీదేవిచే అవి నిరంతరము సేవింపబడుచుండును. సమస్త భూమండలమునకును అవి అలంకారములు. ఆపన్నులకు సర్వదా శరణ్యములు. భక్తిశ్రద్ధలతో సేవించినవారికి అవి పరమ సుఖావహములు. కనుక, అట్టి నీ దివ్యపాదములను మా హృదయములపై ఉంచి, తీవ్రమైన  మా మనస్తాపమును చల్లార్చుము.

31.14 (పదునాలుగవ శ్లోకము)

సురతవర్ధనం శోకనాశన స్వరితవేణునా సుష్ఠు చుంబితమ్|

ఇతరరాగవిస్మారణం నృణాం వితర వీర నస్తేఽధరామృతమ్॥9488॥

యదువీరా! నీ అధరామృతము ఎల్లరకును నీ సాంగత్యాభిలాషను వృద్ధచేయును. తాపత్రయ దుఃఖములను తొలగించును. మృదుమధురనాద సమయమున ఆ వేణువు నీ అధరామృతమును తనివిదీర గ్రోలుచుండును. దానిని ఆస్వాదించిన మానవాళికి సార్వభౌమాధికారములు మొదలగు  లౌకిక వాంఛలపై మనస్సే పోదు. కావున, పురుషోత్తమా! తీయని నీ అధరసుధలను దయతో మాకు ప్రసాదింపుము.

31.15 (పదునైదవ శ్లోకము)

అటతి యద్భవానహ్ని కాననం  త్రుటిర్యుగాయతే త్వామపశ్యతామ్| .

కుటిలకుంతలం శ్రీముఖం చ తే  జడ ఉదీక్షతాం పక్ష్మకృద్దృశామ్॥9489॥

మోహనాకారా! పగటివేళ నీవు గోవులను మేపుచు వనమునందు ఉన్నప్పుడు మేము నీ శుభదర్శనమునకు నోచుకొనమైతిమి. నిన్ను దర్శింపజాలని ఆ సమయమున ప్రతి అఱక్షణముగూడ మాకు ఒక యుగముగా అనిపించుచుండును. ముంగురుల శోభలతో అందములను చిందించుచుండు నీ ముఖసౌందర్యమును సాయంసమయమునందు నీవు తిరిగి వచ్చుచున్నప్పుడైనను తనివిదీర చూచుటకై తహతహపడుచుండెడి మాకు కనుఱెప్పపాటులు అడ్డము వచ్చుచున్నవి. దానికి మేమే ఓర్చుకొనలేకున్నాము. మాకు ఈ ఱెప్పపాటులను గూర్చిన ఆ బ్రహ్మ ఎంతటి మూర్ఖుడోగదా!

31.16 (పదహారవ శ్లోకము)

పతిసుతాన్వయభ్రాతృబాంధవానతివిలంఘ్య తేఽన్త్యచ్యుతాగతాః|

గతివిదస్తవోద్గీతమోహితాః  కితవ యోషితః కస్త్యజేన్నిశి॥9490॥

ఓ అచ్యుతా! మేము మా పతులను, సుతులను, సోదరులను, బంధువులను, మా వంశమువారిని అందఱిని త్యజించి, వారి ఆజ్ఞలను ధిక్కరించి, నీ సమీపమునకు వచ్చితిమి. నీ ప్రతి కదలికను మేము ఎఱుగుదుము (మేము వచ్చిస విషయముగూడ నీకు తెలియును). నీ మధురగానమును విని మేము పారవశ్యముతో ఇచటికి చేరితిమి. నయవంచకా! ఇట్టి రాత్రివేళ స్వయముగా వచ్చిన వనితలను నీవు తప్ప ఎవరు పరిత్యజించును? (ఎవరు పరిత్యజింపజాలరు).

31.17 (పదిహేడవ శ్లోకము)

రహసి సంవిదం హృచ్ఛయోదయం ప్రహసితాననం ప్రేమవీక్షణమ్|

బృహదురః శ్రియో వీక్ష్య ధామ తే ముహురతి స్పృహా ముహ్యతే మనః॥9491॥

ప్రియతమా! ఏకాంతమున నీవు సలుపుచుండెడి నర్మభాషణములు మా హృదయములయందు నీ కలయికయొక్క ఆకాంక్షను ఱెచ్చగొట్టుచుండెను. నీ ప్రసన్న ముఖమునకు శోభలనుగూర్చెడి నీ దరహాసమును, నీ క్రీగంటి చూపులను, లక్ష్మీదేవికి నివాసస్థానమైన నీ విశాల వక్షస్థలమును తిలకించి, పులకించి యుంటిమి. వాటిని గాంచినప్పటినుండియు నేటి వఱకును మా మనస్సులు నిన్ను పొందవలెనను కాంక్షతో మోహపరవశమగుచున్నవి.

31.18 (పదునెనిమిదవ శ్లోకము)

వ్రజవనౌకసాం వ్యక్తిరంగ తే  వృజినహంత్ర్యలం విశ్వమంగలమ్|

త్యజ మనాక్ చ నస్త్వత్స్పృహాత్మనాం  స్వజనహృద్రుజాం యన్నిషూదనమ్ ॥9492॥

ఓ ప్రియతమా! నీ అవతారము గోకులవాసుల దుఃఖములను పూర్తిగా తొలగించునట్టిది. లోకకళ్యాణదాయక మైనది. మాహృదయములలో నీపైగల అనురాగము మెండైనది. నీవారమైన మా అందరి హృదయతాపములను తీర్చగలిగిన దివ్యౌషధమును కొంచమైననూ మా కొరకు దయచేయుము. అనగా నీ దర్శనమును ప్రసాదించి మా హృదయరోగమును నిర్మూలించుము.

31.19 (పందొమ్మిదవ శ్లోకము)

యత్తే సుజాత చరణాంబురుహం స్తనేషు భీతాః శనైః ప్రియ దధీమహి కర్కశేషు|

తేనాటవీమటసి తద్వ్యథతే న కింస్విత్కూర్పాదిభిర్భ్రమతి ధీర్భవదాయుషాం నః॥9493॥

ఓ ప్రియా! కృష్ణా! సుకుమారమైన నీ పాదపద్మములను, కఠినములైన మా వక్షస్థలములపై చేర్చినప్పుడు అవి ఎక్కడ కందిపోవునేమోయని భీతిల్లుచూ మెల్లగా ధరించెదము. అట్టి పాదములతో నీవు అడవిలో తిరుగుచున్నప్పుడు, మొనదేలిన రాళ్ళు గ్రుచ్చుకొని మెత్తని నీ పాదములకు నొప్పి కలుగుట లేదా అని, నీవే పంచప్రాణములుగా జీవించే మాకు నీగురుంచి ఆలోచించినప్పుడు మా మనస్సులు  మిగుల వ్యథ చెందుచున్నవి. మా జీవనసర్వస్వమూ నీవేసుమా!

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే ఏకత్రింశోఽధ్యాయః (31)

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి ముప్పది ఒకటవ అధ్యాయము (31)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[21:20, 20/01/2021] +91 95058 13235: 20.1.2021   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది రెండవ అధ్యాయము

శ్రీకృష్ణదర్శనము - ప్రభువు గోపికలను ఓదార్చుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

32.1 (ప్రథమ శ్లోకము)

ఇతి గోప్యః ప్రగాయంత్యః ప్రలపంత్యశ్చ చిత్రధా|

రురుదుః సుస్వరం రాజన్ కృష్ణదర్శనలాలసాః॥9494॥

శ్రీశుకుడు వచించెను పరీక్షిన్మహారాజా! గోపికలు కృష్ణదర్శనమునకై ఇట్లు తహతహపడుచు ఆ స్వామియొక్క గుణలీలావైభవములను వివిధరీతులలో కీర్తించుచుండిరి. ఆయనకై పరితపించుచు, కరుణాపూరితమైన స్వరముతో వెక్కివెక్కి ఏడువసాగిరి.

32.2 (రెండవ శ్లోకము)

తాసామావిరభూచ్ఛౌరిః స్మయమానముఖాంబుజః|

పీతాంబరధరః స్రగ్వీ సాక్షాన్మన్మథమన్మథః॥9495॥ 

దయాళువైన ఆ ప్రభువు ఆ సమయమున తన ముఖారవిందమునందు దరహాస శోభలను వెల్లివిరియ చేయుచు, వారి మధ్యలో ప్రత్యక్షమయ్యెను. పీతాంబరధారియైన ఆ మహాత్ముడు కంఠమున వనమాల కాంతులీనుచుండగా మన్మథునిగూడ పరవశింపజేయునట్టి అందచందాలతో అలరారు చుండెను.

32.3 (మూడవ శ్లోకము)

తం విలోక్యాగతం ప్రేష్ఠం ప్రీత్యుత్ఫుల్లదృశోఽబలాః|

ఉత్తస్థుర్యుగపత్సర్వాస్తన్వః ప్రాణమివాగతమ్॥9496॥

తమకు అత్యంత ప్రియుడైన శ్రీకృష్ణుడు తమ కనుల యెదుట నిలిచినంతనే ఆ గోపికల ముఖములు సంతోషముతో వికాసమును పొందెను.అంతట ప్రాణములు తిరిగివచ్చినట్లుగా అవయవములు అన్నియును చైతన్యవంతములగుటతో వారు ఒక్కసారిగా లేచి నిలబడిరి. వారి కనులలో ఆనందము తొణికిసలాడెను.

32.4 (నాలుగవ శ్లోకము)

కాచిత్కరాంబుజం శౌరేర్జగృహేఽఞ్జలినా ముదా|

కాచిద్దధార తద్బాహుమంసే చందనరూషితమ్॥9497॥

అంతట ఒక గోపకాంత ఆ సంతోషములో శ్రీకృష్ణుని యొక్క కరకమలమును తన రెండు చేతులతో పట్టుకొని మురిసిపోయెను. మఱియొక గోపిక చందన పరిమళములతో ఒప్పుచున్న ఆ ప్రభువు బాహువును తన బుజమున చేర్చుకొని ఆనందించెను.

32.5 (ఐదవ శ్లోకము)

కాచిదంజలినాగృహ్ణాత్తన్వీ తాంబూలచర్వితమ్|

ఏకా తదంఘ్రికమలం సంతప్తా స్తనయోరధాత్॥9498॥

వేరొక గోపసుందరి ఆ మహాత్ముడు నమలచున్న తాంబూలమును తన దోసిలిలో తీసికొనెను. కృష్ణవిరహముతో నున్న ఇంకొక తరుణి ఆ పరమపురుషుని చల్లని పాదపద్మమును తన వక్షస్థలమున స్పృశించుచు తన తాపమును తీర్చుకొనెను.

32.6 (ఆరవ శ్లోకము)

ఏకా భ్రుకుటిమాబధ్య ప్రేమసంరంభవిహ్వలా|

ఘ్నంతీవైక్షత్కటాక్షేపైః సందష్టదశనచ్ఛదా॥9499॥

ప్రణయకోపములో విహ్వలయైయున్న మఱియొక భామిని బొమముడివైచి, దంతములతో తన అధరమును అదుముచు, చురుకైన చూపులతో ఆ స్వామిని కొట్టుచున్నదా యనునట్లు చూడసాగెను.

32.7 (ఏడవ శ్లోకము)

అపరానిమిషద్దృగ్భ్యాం జుషాణా తన్ముఖాంబుజమ్|

ఆపీతమపి నాతృప్యత్సంతస్తచ్చరణం యథా॥9500॥

భక్తులు శ్రీహరి చరణములను దర్శించుచు తృప్తిచెందనట్లు, వేరొక తరుణి ఱెప్పవాల్పక చూచుచు ఆ పరమపురుషుని ముఖారవింద మకరందమును ఎంతగా జుర్రుకొనుచున్నను ఆమె సంతృప్తి పడలేకుండెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[04:32, 21/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము్

791వ నామ మంత్రము  21.01.2011

ఓం సత్యజ్ఞానానంద రూపాయై నమః

భూతభవిష్యద్వర్తమాన కాలములకు అతీతమై, వృద్ధిక్షయాలు లేనిది, నిత్యమైనది అయిన పరబ్రహ్మస్వరూపమే తన స్వరూపముగా తేజరిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సత్యజ్ఞానానందరూపా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం సత్యజ్ఞానానందరూపాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ లలితాంబను ఉపాసించు సాధకులకు ఆ తల్లి కరుణచే సత్యము, జ్ఞానము, ఆనందము అను ఈ మూడు రూపముల సమిష్టిరూపమైన పరబ్రహ్మస్వరూపమును తెలియు మార్గాన్వేషణలో సఫలత సాధించుదిశగా ముందుకు సాగుదురు.

వేదాలలో 

సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ"

విజ్ఞాన మానందం బ్రహ్మ

సత్యము అనేది అక్షరము. భూతభవిష్యద్వర్తమానకాలములందు ఏవిధమైన మార్పులు చెందనిది.   అనశ్వరము అనగా నాశనము లేనిది. త్రికాలములందు మార్పులేని  సత్యమునకు నాశనము లేదు. ఎల్లప్పుడు సత్యమై,  సజీవమై ఉంటుంది.

పరమార్థమును పరిపూర్ణముగా తెలిసికొనుటయే జ్ఞానము. ఏవిధమైన లోటుపాట్లు, మార్పులు, చేర్పులు, అవసరంలేక, స్వయంప్రబోధకమై, స్వయంప్రచోదితమై, స్వయంప్రకాశ బుద్ధి వికాసమై ఉండేదే జ్ఞానము అని అనబడుతుంది. సత్యమై, నిత్యమై, జ్ఞానసమృద్ధమై యుండగా కలిగిన ఆనందమే 

 శాశ్వతమైనది,  ఇటువంటి ఆనందమేపరమోత్కృష్టమైనది. అటువంటి ఆనందానికి అవధులుండవు. ఈ ఆనందం పరమానందం. అదే బ్రహ్మానందం అని అంటారు. పరమోత్కృష్టమైన ఆనందాన్ని బ్రహ్మానందమనికూడా చెపుతారు. 

సృష్టికి ముందున్నది పరబ్రహ్మమొక్కటే. ఆ పరప్రహ్మము   స్వయంప్రకాశకము.సూర్యచంద్రులను కూడా ప్రకాశింపజేసినది. అగ్నిని కూడా జ్వలింపజేసినది. అన్నిజీవులయందు చైతన్యమై నిండినది. సంకల్పవికల్ప రహితమైనది. దీనినే సత్యము అని అంటారు. ఇదే జ్ఞానము, ఆనంద స్వరూపము అంటారు. ప్రేమస్వరూపం అనికూడా అంటారు.

ప్రియము అంటే తనవారిని చూసినప్పుడు కలిగేది ప్రియము. తనకు కావలసినది దొరికితే మోదము. కోరకమునుపే లభ్యమైతే  ప్రమోదము. ఈ ప్రియము, మోదము, ప్రమోదములకు అతీతమైనది ఆనందం. ఎల్లప్పుడు ఆనందపడేవాడు దేనినీ కోరడు. హెచ్చుతగ్గులైనా, సంతాపసంతోషములైనా ఒకటిగా భావించేవాడు ఆనందంతో ఉండుట జరుగుతుంది.ఈ ఆనందం మాటలలో చెప్పలేనిది. కేవలం అనుభవైకవేద్యము మాత్రమే. పరమేశ్వరి ఈ స్థితిలోనే ఉంటుంది గనుకు సత్యజ్ఞానానందరూపా యని అనబడుచున్నది.

అజ్ఞానులు గాఢాంధకారంలో ఉంటారు.  అంటే వారు తాత్కాలికానందానికి ఏవేవో కోరుతుంటారు. వాటివల్ల కోరికలు తీరవచ్చు. కాని తరువాత దుఃఖం తప్పదు. ఎందుకంటే ఆ ఆనందం శాశ్వతం కాదు గనుక.  శాశ్వతమైన  ఆనందంకావాలంటే కోరవలసింది కైవల్యము. అదే సాయుజ్యము. ఎవరైతే పరబ్రహ్మను తెలుసుకుంటారో వారు కూడా పరబ్రహ్మే. ఆ స్థితిలో పొందే అనందం బ్రహ్మానందం అనబడుతుంది.

జగన్మాత జీవకోటి పిపీలకంనుండి, బ్రహ్మపర్యంతం ప్రేమస్వరూపిణియై ఉంటుందిగనుకనే సత్యజ్ఞానానందరూపా యని అనబడుచున్నది.

అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు సత్యజ్ఞానానందరూపా యని అనవలెను.

🌹 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

217వ నామ మంత్రము  21.01.2021

ఓం మహాశక్త్యై నమః

సకలలోకములును నిర్వహింపగల అనేక విధములకు సామర్థ్యము గలిగిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాశక్తిః అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మహాశక్త్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో అమ్మవారిని ఆరాధించు భక్తజనులకు ఆ చల్లని తల్లి ఇష్టకామ్యములను సిద్ధింపజేస్తూ, పరమపదమునకు సోపానమార్గము  చేరుటకు ఉపాసనా శక్తినిగూడా కలుగజేయును.

జగన్మాత సకల విధములైన శక్తి సామర్థ్యములు కలది. దుష్టులైన రాక్షసులను ఏ ఆయుధము కూడా అవసరంలేకుండా భుజబలము నుపయోగించి ముష్టిఘాతములతోనే సంహరించగలదు. అంతటి శక్తిసంపదలు కలిగినది. అలాగే వారు ఎటువంటి క్షుద్రమంత్రాస్త్రములు ప్రయోగించినను,తనయొక్క సప్తకోటి మహామంత్ర బలముతో ప్రత్యస్త్రములను ప్రయోగించి నిర్జించగల సామర్థ్యము కలిగినది. ఇక పిపీలకాది బ్రహ్మపర్యంతము సృష్టిస్థితి లయకార్యములందు జీవుల కర్మానుసారము హెచ్చుతగ్గులు కనబడనీయక జీవకోటి జీవన వ్యవహారములు నిర్వహించు పాలనాశక్తి కూడా కలిగినది. అమ్మ ఆయుధశక్తి అంత ఇంత అనికాదు. చక్రరాజరథారూఢగాను, గేయచక్రరథారూఢగాను, కిరిచక్రరథారూఢగాను విరాజిల్లుచూ అటువంటి రథములలో అత్యంతమహిమాన్వితములైన ఆయుధశక్తి సంపదలు కలిగియున్నది. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజముతో (గజబలముతో) నూ, అశ్వారూఢాధిష్టితాశ్వ కోటి కోటీభిరావృత యను అశ్వదళ ములతోను, రణరంగములో అగ్నిప్రాకారములు సృజించి శత్రుసేనలను నిలువరించగల జ్వాలామాలిని వంటి అగ్నిపుత్రికలతోను, అత్యంత పరాక్రమముతో రాక్షససైన్యములను మట్టుబెట్టగల నిత్యాదేవతల పదాతిదళములతోను, భండుని ముప్పది మందిపుత్రులను, వారిసైన్యములతో తుదముట్టించగలిగిన బాలాత్రిపురసుందరి (జగన్మాత అంశయందు జనించిన) యను మహాశక్తితోను, శత్రుసేనల యెత్తులకు పైయెత్తులు వేయు యుద్ధతంత్రమందు ఆరితేరిన శ్యామల మొదలైన పదహారు మంది మంత్రిణీ సమూహ శక్తితోను, రాక్షసులు ప్రయోగించిన మహాశక్తిప్రపూరితమైన జయవిఘ్నయంత్రాన్ని తుత్తునియలు గావించిన మహాశక్తిసంపన్నుడైన గణేశ్వరునితోను, కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతులు అను శక్తిసమూహముతోను, పాశుపతాస్త్రము మరియు కామేశ్వరాస్త్రము వంటి అస్త్ర సంపదతోను శత్రుకూటములకు భయకంపితయై తేజరిల్లు జగన్నాత మహాశక్తిః అని అనబడుచున్నది.   సృష్టిస్థితిలయల సమిష్టి శక్తి, నవావరణలందు యోగినీ శక్తుల సమిష్టి శక్తి, పరివార శక్తుల సమిష్టి శక్తి - ఈ సమిష్టిశక్తులతో ఏర్పడిన ఒక సమిష్టిశక్తియైన పరమేశ్వరియే మహా మహాశక్తి. గనుకనే ఆ అమ్మ మహాశక్తిః అని యనబడినది. కాలచక్రము విపరీత పోకడలకు పోకయుండుటకు, సముద్రములు హద్దులకే పరిమితమై యుండుటకు, నవగ్రహములు జీవుల కర్మఫలముల వరకే స్థానములు కలిగియుండుటకు, అష్టదిక్పాలకులు తమ కార్యనిర్వహణ అకాలముగాకాకుండా సకాలములే యగునట్లును నియంత్రించినశక్తి పరాశక్తియైన జగన్మాతయే. గనుకనే ఆ జగన్మాతయైన పరమేశ్వరి మహాశక్తిః అని యనబడినది.

అటువంటి పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం మహాశక్త్యై నమః యని అసవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[21/01, 04:32] +91 95058 13235: *21.1.2021   ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది రెండవ అధ్యాయము*

*శ్రీకృష్ణదర్శనము - ప్రభువు గోపికలను ఓదార్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*32.8 (ఎనిమిదవ శ్లోకము)*

*తం కాచిన్నేత్రరంధ్రేణ హృదికృత్య నిమీల్య చ|*

*పులకాంగ్యుపగుహ్యాస్తే యోగీవానందసంప్లుతా॥9501॥*

మఱియొక యువతి తన నేత్రరంధ్రములద్వారా ఆ ప్రభువును తన హృదయమున నిలుపుకొని, అచటినుండి ఆ స్వామి తిరిగిబయటపడకుండునట్లు కనులను మూసికొనెను. పిమ్మట ఆమె తన మనస్సుద్వారా ఆ పురుషోత్తముని తన అక్కునజేర్చుకొని, పులకించిపోవుచు ఒక మహాయోగినివలె పరమానందభరితురాలయ్యెను.

*32.9 (తొమ్మిదవ శ్లోకము)*

*సర్వాస్తాః కేశవాలోకపరమోత్సవనిర్వృతాః|*

*జహుర్విరహజం తాపం ప్రాజ్ఞం ప్రాప్య యథా జనాః॥9502॥*

ముముక్షువులు బ్రహ్మజ్ఞాని లేదా పరమాత్మ సాక్షాత్కారమును పొంది, తాపత్రయమునుండి బయట పడినట్లుగా, ఆ గోపికలు అందఱును శ్రీకృష్ణ దర్శనోత్సవముతో పరవశించిపోవుచు, తమ విరహతాపముల నుండి విముక్తలై ఎంతయు మనశ్శాంతిని పొందిరి.

*32.10 (పదియవ శ్లోకము)*

*తాభిర్విధూతశోకాభిర్భగవానచ్యుతో వృతః|*

*వ్యరోచతాధికం తాత పురుషః శక్తిభిర్యథా॥9503॥*

పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుని దర్శనభాగ్యముతో ఆ గోపికల శోకములన్నియును పటాపంచలయ్యెను. అంతట సహజముగనే సౌందర్య మాధుర్యాది గుణములతో  ఒప్పుచుండెడి శ్రీకృష్ణుడు వారితో పరివృతుడై, జ్ఞానబలాది శక్తులతో సేవింపబడుచున్న పరమాత్మవలె ఇంకను శోభాయమానుడై విరాజిల్లెను.

*32.11 (పదకొండవ శ్లోకము)*

*తాః సమాదాయ కాలింద్యా నిర్విశ్య పులినం విభుః|*

*వికసత్కుందమందారసురభ్యనిలషట్పదమ్॥9504॥*

పిమ్మట కృష్ణప్రభువు ఆ గోపికలను అందఱిని తీసికొని యమునానదీతీరమున గల ఇసుక తిన్నెపై చేరి, వారితో గూడి ఆనందించెను. ఆ సమయమున బాగుగా వికసించిన మల్లెలు, మందారములు మొదలగు పుష్పములమీదుగా వీచుచున్న గాలులు వాటి పరిమళములను అంతటను వెదజల్లుచుండెను. ఆ సువాసనలకు ఆకర్షితములైన తుమ్మెదలు ఝంకారముల నొనర్చుచు అటునిటు తిరుగుచుండెను.

*32.12  (పండ్రెండవ శ్లోకము)*

*శరచ్చంద్రాంశుసందోహధ్వస్తదోషాతమః శివమ్|*

*కృష్ణాయా హస్తతరలాచితకోమలవాలుకమ్॥9505॥*

శరత్కాల చంద్రునియొక్క పండువెన్నెల కాంతులతో అచటి చిమ్మచీకట్లు పూర్తిగా తొలగిపోగా, ఆ రాత్రి సుఖావహముగా (హాయిగా) నుండెను. అచటి మెత్తని ఇసుకతిన్నెలు శ్రీకృష్ణప్రభువుయొక్క లీలావిహారములకై యమునానది తన తరంగములనెడి హస్తములతో స్వయముగా సిద్ధపరచిన రంగస్థలమువలె తేజరిల్లుచుండెను.

*32.13  (పదమూడవ శ్లోకము)*

*తద్దర్శనాహ్లాదవిధూతహృద్రుజో  మనోరథాంతం శ్రుతయో యథా యయుః|*

*స్వైరుత్తరీయైః కుచకుంకుమాంకితైరచీకౢపన్నాసనమాత్మబంధవే॥9506॥*

కర్మకాండలును, జ్ఞానకాండలును వేదప్రతిపాదితములే. జ్ఞానకాండ విభాగములోనివే ఉపనిషత్తులు. ఉపనిషద్విజ్ఞానమును పొందిన యోగులు కామ్యకర్మలను ప్రతిపాదించిన కర్మకాండలను ప్రక్కనబెట్టి జ్ఞానసాధనలతో పరమాత్ముని దర్శింతురు. అప్పుడు వారికి బ్రహ్మానందానుభూతి కలుగును. అట్లే శ్రుతుల అంశలతో జన్మించిన గోపికలు శ్రీకృష్ణదర్శనాహ్లాద ప్రభావమున లౌకికములైన తమ విరహవేదనలను అధిగమించి (వారి హృదయ తాపము లన్నియును మటుమాయము కాగా) పరమానందమును పొందిరి. అంతట ఆ గోపాంగనలు వక్షస్థలముల యందలి కుంకుమలచే ముద్రితములైన తమ పమిటెలను పఱచి ఆత్మబంధువైన (ఆత్మకంటెను ప్రియతముడగు) కృష్ణప్రభువు కూర్చుండుటకై ఆసనములను కల్పించిరి.

*32.14 (పదునాలుగవ శ్లోకము)*

*తత్రోపవిష్టో భగవాన్ స ఈశ్వరో యోగేశ్వరాంతర్హృది కల్పితాసనః|*

*చకాస గోపీపరిషద్గతోఽర్చితస్త్రైలోక్యలక్ష్మ్యేకపదం వపుర్దధత్॥9507॥*

మహాయోగీశ్వరులయొక్క హృదయములనెడి సింహాసనములపై అధివసించుచుండెడి శ్రీకృష్ణపరమాత్మ వేలకొలది గోపికలచే పరివృతుడై, వారి కొంగులచే ఏర్పఱచబడిన ఆసనములపై సుఖాసీనుడై కూర్చుండెను. అప్పుడు మూడులోకములలో గల దివ్యసౌందర్యములను అన్నింటిని ఒకే ఒక రాశిగాపోసిన దేహమును దాల్చిన ఆ ప్రభువు వారి పూజలను అందుకొనెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[21/01, 20:15] +91 95058 13235: *21.1.2021   సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది రెండవ అధ్యాయము*

*శ్రీకృష్ణదర్శనము - ప్రభువు గోపికలను ఓదార్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*32.15 (పదునైదవ శ్లోకము)*

*సభాజయిత్వా తమనంగదీపనం సహాసలీలేక్షణవిభ్రమభ్రువా|*

*సంస్పర్శనేనాంకకృతాంఘ్రిహస్తయోః సంస్తుత్య ఈషత్కుపితా బభాషిరే॥9508॥*

అంతట ఆ గోపికలు తమలో మరులును రేకెత్తింపజేసెడి ఆ దివ్యసుందరుని తమ చిఱునవ్వులతోను, ఒయ్యారపు చూపులతోను, చక్కని కనుబొమల కదలికలతోను గౌరవాదరములతో సమ్మానించిరి. పిమ్మట కొందఱు  సుకుమారములైన ఆ స్వామి పాదములను తమ ఒడులలో చేర్చుకొనుచు సుతిమెత్తని తమ చేతులతో ఒత్తుచు, మీదిమీదికి చేరుచు ఆ ప్రభువును మురిపింపజేయుచుండిరి. పిదప వారు అందఱును ఆయనతో చతురోక్తులాడుచు (సరసములాడుచు) చిఱుకోపములను ప్రకటించుచు ప్రేమపూర్వకముగా ఇట్లు పలికిరి.

*గోప్య ఊచుః*

 *32.16 (పదహారవ శ్లోకము)*

*భజతోఽనుభజంత్యేక ఏక ఏతద్విపర్యయమ్|*

*నోభయాంశ్చ భజంత్యేక ఏతన్నో బ్రూహి సాధు భోః॥9509॥*

*గోపికలు ఇట్లు పలికిరి* ఓ కృష్ణా! కొందరు తమను ప్రేమించేవారినే ప్రేమించెదరు. మరికొందరు ఇందుకు వ్యతిరేకముగా తమను ప్రేమించకున్ననూ, వారిని ప్రేమింతురు. ఇంకను కొందరు తమను ప్రేమించువారినిగానీ, ప్రేమించనివారినిగానీ ఆ ఇరువురిని కూడా ప్రేమించరు. ఓ స్వామీ! వీరిలో ఎవరంటే నీకు ఇష్టము?

*శ్రీభగవానువాచ*

 *32.17 (పదిహేడవ శ్లోకము)*

*మిథో భజంతి యే సఖ్యః స్వార్థైకాంతోద్యమా హి తే|*

*న తత్ర సౌహృదం ధర్మః స్వార్థార్థం తద్ధి నాన్యథా॥9510॥*

*కృష్ణభగవానుడు ఇట్లు నుడివెను* "సఖులారా! కొందఱు ప్రతిఫలాపేక్ష గలవారై తమకు మేలు చేసెడివారినే సేవింతురు.ఇందు మైత్రికిగాని, ధర్మమునకుగాని చోటులేదు. వీరిలో స్వార్థబుద్ధి తప్ప మఱి ఏమియు ఉండదు.

 *32.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*భజంత్యభజతో యే వై కరుణాః పితరౌ యథా|*

*ధర్మో నిరపవాదోఽత్ర సౌహృదం చ సుమధ్యమాః॥9511॥*

సుందరీమణులారా! సహజముగనే దయాస్వభావము గల కొందరు తల్లిదండ్రులు తమ తనయులనువలె తమను ప్రేమించని వారినిగూడ సేవింతురు. ఏలయన, వారి ప్రేమలో నిశ్చలమైన  ధర్మము, చక్కని సుహృద్భావము ఉండును.

 *32.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*భజతోఽపి న వై కేచిద్భజంత్యభజతః కుతః|*

*ఆత్మారామా హ్యాప్తకామా అకృతజ్ఞా గురుద్రుహః॥9512॥*

కొందరు తమను సేవించినవారిని గూడ సేవింపరు. ఇక తమను సేవింపని వారిని, వారు సేవించెడి ప్రశ్నే ఉండదుగదా! ఇట్టివారు నాల్గువిధములుగా ఉందురు. 1) కొందఱు ఆత్మనిష్ఠులు అనగా తమలో తామే రమించువారు - వారి దృష్టిలో ద్వైతముండదు. 2) మఱికొందరు ఆప్తకాములు. అనగా కోరికలు అన్నియు నెఱవేఱినవారు కృతకృత్యులు, వారు ఇతరులనుండి ఎట్టి ప్రయోజనమునూ ఆశింపరు. 3) కొందఱు కృతఘ్నులు. అనగా మేలుచేసినవారిని విస్మరించువారు. 4) కఠినాత్ములు. అనగా తమకు మేలుచేసిన గురుతుల్యులైన వారికిగూడ ద్రోహము తలపెట్టువారు.

 *32.20 (ఇరువదియవ శ్లోకము)*

*నాహం తు సఖ్యో భజతోఽపి జంతూన్  భజామ్యమీషామనువృత్తివృత్తయే|*

*యథాధనో లబ్ధధనే వినష్టే  తచ్చింతయాన్యన్నిభృతో న వేద॥9513॥*

చెలియలారా! నేను వీరిలో ఎవ్వడనుగాను. ఐతే నన్ను ప్రేమించేవారిపట్ల అదేవిధమైన ప్రేమను నేను ప్రకటింపను. ఏలనన, వారి చిత్తవృత్తి నాయెడల మరింత అధికమగునట్లుగా, ధారావాహికముగా నిరంతరము నిలిచియుండునట్లుగా, వారియెడల నేను వ్యవహరించెదను. ఒక దరిద్రునకు ఒకప్పుడు ధనము లభించి, వెంటనే ఆ ధనము నష్టమైనచో, అతని చిత్తము నిరంతరము నష్టపోయిన ధనమును గూర్చియే చింతించుచుండును. అట్లే, నేను కూడా కలిసినట్లే కలిసి, కనిపించినట్లే కనిపించి, దాగి-దాగి ఉండెదను.

  *32.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*ఏవం మదర్థోజ్ఝితలోకవేదస్వానాం హి వో మయ్యనువృత్తయేఽబలాః|* 

*మయా పరోక్షం భజతా తిరోహితం మాసూయితుం మార్హథ తత్ప్రియం ప్రియాః॥9514॥*

గోపవనితలారా! లోకమర్యాదను, వేదమర్యాదను పట్టించుకొనక మీ బంధువులను సైతము విడిచిపెట్టి కేవలము నన్నే అనన్యభావముతో ప్రేమించితిరి. అట్టితరి మీ చిత్తవృత్తులు, మరొకవైపు మరలకుండా నాయందే నిలిచియుండుటకుగాను నేను అదృశ్యుడనై పరోక్షముగా మిమ్ములను ప్రేమించుచునే యుంటిని. కనుక, మీరు నా ప్రేమలో తప్ఫులను వెతకవద్దు. మీరు అందరును నాకు ప్రీతిపాత్రులే. అట్లే నేను మీ ప్రేమపాత్రుడను.

  *32.22  (ఇరువది రెండవ శ్లోకము)*

*న పారయేఽహం నిరవద్యసంయుజాం  స్వసాధుకృత్యం విబుధాయుషాపి వః|*

*యా మాభజన్ దుర్జరగేహశృంఖలాః సంవృశ్చ్య తద్వః ప్రతియాతు సాధునా॥9515॥*

ప్రియమైన గోపికలారా! మీ ప్రేమ నిష్కపటమైనది. నాపై మీరు చూపిన ప్రేమకు మీ అమాయకమైన  కృత్యములకు ప్రత్యుపకారము చేయుటకు నేను సమర్థుడను కాను. దేవతల ఆయుర్దాయమును పొందినప్పటికినీ మీ ఋణము తీరేదికాదు. మీరు నన్ను చేరుటకై విడదీయరాని, దృఢమైన ఇండ్లు - వాకిండ్లు అనే సంకెళ్ళను పూర్తిగా తెగగొట్టితిరి. నిర్మలమైన మీ ప్రేమభావమును నాయందే సమర్పించితిరి. కావున, మీరు మీ సాధుస్వభావముతో, నిష్కపటమైన ప్రేమతో నన్ను ఋణవిముక్తుని చేయవచ్చును. కాని, నేను మాత్రము మీ ఋణమును తీర్చుకొనలేను. కాదు, కాదు ఎప్పటికీ నేను మీకు ఋణగ్రస్తుడనయ్యే ఉండెదను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే ద్వాత్రింశోఽధ్యాయః (32)*

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి ముప్పది రెండవ అధ్యాయము (32)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[22/01, 05:21] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*792వ నామ మంత్రము*  22.01.2021

*ఓం సామరస్య పరాయణాయై నమః*

తనకొరకై పరమేశ్వరుడు, పరమేశ్వరుని కొరకై తాను తపమొనరించి, తపః ఫలముగా ఒండొరులు ఒకరికి ఒకరై, జగతికి శివశక్తుల సమరసభావన నందించిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సామరస్యపరాయణా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం సామరస్యపరాయణాయై నమః* అని ఉచ్చరించుచూ, భక్తిప్రపత్తులతో ఆ లలితాంబను ఆరాధించు సాధకులు పలువురిలో స్నేహభావమును పెంపొందించుకొని, శాంతిసౌఖ్యములతో సుఖజీవనము  గడుపుచూ, పరమపదసోపానముల దిశగా మనస్సును మరల్చి తరించుదురు.

పరమేశ్వరుని ఆరాధిస్తే, అది పరమేశ్వరీ ఆరాధనమే. శివశక్తుల ఏకీభావమే ఇందుకు ప్రమాణము. శివ-శక్తి భావములు రెండును హెచ్చుతగ్గులులేక సమముగానుండు సామరస్యమే పరమేశ్వరి విలాసము. పార్వతీపరమేశ్వరులిరువురు ఒకరికోసం ఒకరు తపస్సు చేసుకొన్నారు. శివునికి పార్వతి, పార్వతికి శివుడు లభించగా, జగతికి వారి సామరస్య పరాయణతతో ఆదిదంపతులయారు. 

శివుని అవమానించాలని దక్షుడు తాను చేయు యజ్ఞమునకు  ఆహ్వానించలేదు. ఒక వంక భర్తకు అవమానము కాకూడదనియు, మరొకవంక తన భర్త ఆధిక్యతను తండ్రికి తెలియజేసి, దక్షునికి కనువిప్పు కలుగజేయాలని పార్వతి  దక్షయజ్ఞమునకు పిలవని పేరంటముగా వెళ్ళినది. దక్షుడు కూతురు ఎదుటే అల్లుడైన శివుని నానా దుర్భాషలాడాడు. భర్తకు మరింత అవమానము జరిగినదని భావించి యజ్ఞకుండములో తనను తాను ఆహుతి చేసుకున్నది. శివుడు  భార్యకు జరిగిన అవమానానికి మహారుద్రుడై, తన భార్య దేహముతో శివతాండవముచేసి లోకాలనే తల్లడిల్లచేశాడు. ఆవిధంగా ఒకరికోసం ఒకరై - శివశక్తుల ఏకీభావము ప్రస్ఫుటమైనది. ఆదే సామరస్యము.  అటువంటి సామరస్యము హెచ్చుతగ్గులులేక అధికముగా గలిగియుండుటచే *సామరస్యపరాయణా* యని అనబడినది. ఆ ఆదిదంపతులిరువురు  సత్యజ్ఞానానందముల సామరస్యము గలవారు. కాబట్టి జగన్మాత *సామరస్యపరాయణా*  యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సామరస్యపరాయణాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[22/01, 05:21] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*218వ నామ మంత్రము* 22.01.2021

*ఓం మహారత్యై నమః*

భక్తులకు, యోగులకు, జ్ఞానులకు అత్యంత ప్రీతిపాత్రమైన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహారతిః* యను నాలుగక్షరముల నామ మంత్రమును *ఓం మహారత్యై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ లలితాంబికను ఆరాధించు భక్తులకు, ఆ మహాతల్లి కరుణచే ఆత్మానందానుభూతిని పొందుదురు. 

జ్ఞానులు భౌతిక సుఖసంతోషములకన్న బ్రహ్మజ్ఞాన సముపార్జనపై ఆసక్తి చూపుదురు. నిరంతరము పరమేశ్వరీ ధ్యాననిమగ్నతలో  బ్రహ్మానందానుభూతినే పొందుదురు. బ్రహ్మానందమందిన సాధకుడు ఐహిక విషయములపై ఆసక్తి కనబరచడు. జన్మరాహిత్యమైన మోక్షమునే కాంక్షించును. ఈ విధంగా జగన్మాత వారికి ప్రీతిపాత్రమగుటచే *మహారతిః* అనబడినది.

సాధకుడు యోగసాధనలో మూలాధారమందు నిద్రాణస్థితిలో నున్న కుండలినీ శక్తిరూపిణియైన పరమేశ్వరిని మేల్కొలిపి సుషుమ్నా మార్గంలో ఊర్ధ్వముఖంగా సహస్రారం దిశగా పయనింప జేయును. బ్రహ్మ, విష్ణు, రుద్రగ్రంథులను భేదింపజేస్తూ, షట్చక్రములు దాటించి సహస్రారంలో చంద్రమండలము చేర్చబడిన కుండలినీ శక్తి, తనకు గల సహజమైన అగ్నితత్త్వాముచే ఘనీభవించి ఉన్న సుధారసము ద్రవీభవించును. సుధావృష్టి సంభవించును. ఆ సుధా వృష్టిలో తడిసి ముద్దయిన సాధకుడు పరమేశ్వరితో తాదాత్మ్యం పొంది అమృతస్థితిని చేరుకుంటాడు.  సాధకుడు తన సాధనలో ఈ స్థితినే కోరుతాడు గాని ఐహికసుఖములకు లొంగిపోడు. ఈ విధముగా సాధకులకు ప్రాపంచిక విషయములందు గాక జగన్మాత యందు భక్తితత్పరతతో గూడిన ప్రీతియుండుటచే అమ్మ వారు *మహారతిః* యనబడుచున్నది.

మహాకామేశ్వరుని భార్యయై, ఆయనయందు అత్యంత ప్రీతి కలిగియుండుటచే ఆ పరమేశ్వరి *మహారతి* యని పిలువబడుచున్నది.

 అమ్మవారికి తన బిడ్డలు స్కందుడు, గణేశులపై మాతృప్రేమ,  పరమేశ్వరునిపై దాంపత్యప్రేమ, జగత్తులోని లక్షలాది జీవరాశులయందు జగన్మాతృప్రేమ - ఇదియే మహారతి. గనుకనే పరమేశ్వరి *మహారతిః* అనబడుచున్నది.

పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం మహారత్యై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[22/01, 05:21] +91 95058 13235: *22.1.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది మూడవ అధ్యాయము*

*రాసక్రీడాభివర్ణనమ*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*

*33.1 (ప్రథమ శ్లోకము)*

*ఇత్థం భగవతో గోప్యః శ్రుత్వా వాచః సుపేశలాః|*

*జహుర్విరహజం తాపం తదంగోపచితాశిషః॥9515॥*

*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! ఈ విధముగా శ్రీకృష్ణపరమాత్మయొక్క మృదుమధురవచనములకు గోపికలు ఎల్లరును సంతోషముతో పొంగిపోయిరి. ఆ మహానుభావుని సాంగత్యముతో, మాటలతో వారి విరహతాపములుపూర్తిగా చల్లారెను. వారి మనోరథములు ఈడేరెను.

*33.2 (రెండవ శ్లోకము)*

*తత్రారభత గోవిందో రాసక్రీడామనువ్రతైః|**

*స్త్రీరత్నైరన్వితః ప్రీతైరన్యోన్యాబద్ధబాహుభిః॥9516॥*

స్త్రీ రత్నములైన గోపికలు పరస్పరము చెట్టపట్టాలు వేసికొని (ఒకరి భుజములపై మఱియొకరు చేతులు వేసికొని) ఫరమ ప్రీతితో నుండిరి. తనవలె రసజ్ఞులై , ఉత్సాహముతోనున్న ఆ గోపాంగనలతోగూడి  గోవిందుడు రాసక్రీడను ప్రారంభించెను.

*33.3 (మూదవ శ్లోకము)*

*రాసోత్సవః సంప్రవృత్తో గోపీమండలమండితః|*

*యోగేశ్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోర్ద్వయోః|*

*ప్రవిష్టేన గృహీతానాం కంఠే స్వనికటం స్త్రియః॥9517॥*

*33.4 (నాలుగవ శ్లోకము)*

*యం మన్యేరన్ నభస్తావద్విమానశతసంకులమ్|*

*దివౌకసాం సదారాణామౌత్సుక్యాపహృతాత్మనామ్॥9518॥*

యోగేశ్వరుడైన శ్రీకృష్ణభగవానునితో డను, మండలాకారమున నున్న గోపికలతోడను రాసోత్సవము కొనసాగెను. అప్పుడు మహాత్ముడైన శ్రీకృష్ణుడు చిత్రమగు రీతిలొ పలు అవతారములను దాల్చెను (పెక్కు మంది కృష్ణులుగా మారెను). పిదప ఆ స్వామి ప్రతి ఇద్దరు గోపికలమధ్య తానొకడై వారి భుజములపై తన చేతులు వేయుచు రాసలీలలను నెఱపెను.  ఆ రాసక్రీడలు గోపికాకృష్ణుల మధ్య పలువిధములైన ముఖభంగిమలతో, కంఠాశ్లేషములతో, హస్తవిన్యాసములతో, పాదవిక్షేపములతో వైభవోపేతముగా విరాజిల్లెను. ఆ సంతోషసమయమున ప్రతి గోపికయు కృష్ణప్రభువు తనతోడనే  కూడియున్నాడని భావించుచు ఆనందమున మూనిగి తేలుచుండెను. అప్పుడు  ఇంద్రాదిదేవతలు తమ పత్నులతోగూడి, ఆకాశమున శతాధికముగానున్న విమాసములయం విరాజిల్లుచు ప్రతిక్షణము కూతూహహలమును పెంచుచున్న ఆ మనోహరదృశ్యములను తికించుచు పులకించి పోవుచుండిరి.

*33.5 (ఐదవ శ్లోకము)*

*తతో దుందుభయో నేదుర్నిపేతుః పుష్పవృష్టయః|*

*జగుర్గంధర్వపతయః సస్త్రీకాస్తద్యశోఽమలమ్॥9519॥*

అంతట దివ్యదుందుభులు మ్రోగెను. పుష్పవర్షములు కురిశెను.గంధర్వులు తమకాంతలతోగూడి వెన్నెలవలె స్వచ్ఛమైన, కృష్ణభగవానునియొక్క యశోవైభవమును గానము చేసిరి.

*33.6 (ఆరవ శ్లోకము)*

*వలయానాం నూపురాణాం కింకిణీనాం చ యోషితామ్|*

*సప్రియాణామభూచ్ఛబ్దస్తుములో రాసమండలే॥9520॥*

అంతట దివ్యదుందుభులు మ్రోగెను. పుష్పవర్షములు కురిసెను. గంధర్వూలు తమకాంతలతోగూడి వెన్నెలవలె స్వచ్ఛమైన, కృష్ణభగవానుని యొక్క యశోవైభవమును గానముచేసిరి.

*33.8(ఏడవ శ్లోకము)*

*తత్రాతిశుశుభే తాభిర్భగవాన్ దేవకీసుతః|*

*మధ్యే మణీనాం హైమానాం మహామరకతో యథా॥9521॥*

దేవకీసుతుడైన కృష్ణభగవానుడు తరుణీమణులమధ్య విలసిల్లుచు తళుకు బెళుకులీనుచున్న సువర్ణముణుల మధ్య రాజనీలమణివలె విరాజిల్లుచున్నవాడై, నయనానందకురముగా శోభిల్లుఛుండెను.

*33.8 (ఊనిమిదవవ శ్లోకము)*

*పాదన్యాసైర్భుజవిధుతిభిః సస్మితైర్భ్రూవిలాసైః|*

*భజ్యన్ మధ్యైశ్చలకుచపటైః కుండలైర్గండలోలైః |*

*స్విద్యన్ ముఖ్యః కబరరశనాగ్రంథయః కృష్ణవధ్వో|*

*గాయంత్యస్తం తడిత ఇవ తా మేఘచక్రే విరేజుః॥9522॥*

గోపికలు కృష్ణప్రభువుతోగూడి నెఱపుచున్న రాసలీలలు అద్భుతములు. అప్పటి వారి పాదవిన్యాసములు దర్శనీయములు. నిక్షేపములు, మనోజ్ఞములు. చిఱునవ్వుల సింగారములు చూడముచ్చటైనవి.కనుబొమల విలాసములు హృదయంగమములు, అటునిటు కదులుచున్న నడుముల ఒయ్యారములు ప్రశంసార్హ్యములు,  వక్షస్థలముపై పమిటెల జాఱువాటులు  మానసోల్లాసములను గూర్ఛునట్టివి. చెక్కిళ్ళపై ప్రతిఫలించుచున్న మణికుండలముల మిలమిలలు వర్ణనాతీతములు. వారి ముఖములపై విలసిల్లుచున్న స్వేదకణములు మంచుబిందువులవలె మిలమిలలాడుచుండెను. కటిసూత్రముల ముడులు సడలిపోవుచుండెను. గానాలాపముల నొనర్చుచు, శ్రీకృష్ణునితో గూడి నృత్యములొనర్చుచున్న గోపికలు మేఘమండలము మధ్య మెఱుపుతీగలవలె తేజరిల్లుచుండిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[22/01, 20:52] +91 95058 13235: *22.1.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది మూడవ అధ్యాయము*

*రాసక్రీడాభివర్ణనమ*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*33.9 (తొమ్మిదవ శ్లోకము)*

*ఉచ్చైర్జగుర్నృత్యమానా రక్తకంఠ్యో రతిప్రియాః|*

*కృష్ణాభిమర్శముదితా యద్గీతేనేదమావృతమ్॥9523॥*

గోపికలకు శ్రీకృష్ణునిపైగల ప్రణయములు అపారములు. వారి కంఠస్వరములు మధురాతి మధురములు. శ్రీకృష్ణుని సుఖస్పర్శతో వారు తన్మయత్వమును పొందుచుండిరి. నర్తించుచు, వివిధ రాగములలో వారు అనువైన రీతిలో ఆలపించుచున్న గానములు  ఎంతగా విన్నను తనివితీరకుండెను. ఆ గానాలాపనలు విశ్వవ్యాప్తములై నేటికిని వినిపించుచున్నవనుట ఏ మాత్రమూ అతిశయోక్తికాదు.

*33.10 (పదియవ శ్లోకము)*

*కాచిత్సమం ముకుందేన స్వరజాతీరమిశ్రితాః|*

*ఉన్నిన్యే పూజితా తేన ప్రీయతా సాధు సాధ్వితి|*

*తదేవ ధ్రువమున్నిన్యే తస్యై మానం చ బహ్వదాత్॥9524॥*

ఒకానొక గోపిక కృష్ణునితో కంఠము కలిపి పాడెను. కాని, సప్తస్వరములను వివిధతాళగతులతో, వేర్వేఱు రాగములలో ఆరోహణ-అవరోహణ క్రమములను నడుపుచు గానము చేయుచున్న కన్నయ్యరాగముతో కలిసి పాడకుండా ఆమె ఉచ్ఛైస్వరముతో గానము చేసెను. అప్పుడాయన సంతోషించి 'బాగు బాగు'  అనుచు ఆమెను మెచ్చుకొనెను. వేరొక గోపిక అదే రాగమును ధ్రువతాళమున పాడెను. దానిని కూడా ఆ స్వామి ఎంతయో కొనియాడెను.

*33.11 (పదకొండవ శ్లోకము)*

*కాచిద్రాసపరిశ్రాంతా పార్శ్వస్థస్య గదాభృతః|*

*జగ్రాహ బాహునా స్కంధం శ్లథద్వలయమల్లికా॥9525॥*

మఱియొక గోపాంగన రాసలీలా నృత్యమొనర్చుచు మిగుల అలసిపోయెను. అప్పుడు ఆమె ముంజేతి కంకణములు, కొప్పున అలంకరింకుకొనిన పూలమాలలు జారిపోవుచుండెను. ఆ సమయమున మిగుల బడలియున్న ఆ గోపిక తన ప్రక్కనే యున్న శ్రీకృష్ణుని భుజమును తన చేతితో పట్టుకొనెను.

*33.12 (పండ్రెండవ శ్లోకము)*

*తత్రైకాంసగతం బాహుం కృష్ణస్యోత్పలసౌరభమ్|*

*చందనాలిప్తమాఘ్రాయ హృష్టరోమా చుచుంబ హ॥9526॥*

మంచిగంధపు లేపనములతో ఒప్పుచున్న శ్రీకృష్ణుని బాహువు కలువల సువాసనలను వెదజల్లుచుండెను. శ్రీకృష్ణుడు తన మృదుహస్తమును ఒక గోపిక భుజముపై వేయగా ఆ కరస్పర్శకును, దాని పరిమళముల గుబాళింపులకు పులకించిపోవుచు ఆమె పారవశ్యములో ఆ ప్రభువును ముద్దాడెను.

*33.13 (పదమూడవ శ్లోకము)*

*కస్యాశ్చిన్నాట్యవిక్షిప్తకుండలత్విషమండితమ్|*

*గండం గండే సందధత్యా అదాత్తాంబూలచర్వితమ్॥9527॥*

ఒక గోపిక నాట్యము చేయుచుండెను. అప్పుడు కదలాడే కుండలముల కాంతులు తన గండస్థలములపై ప్రతిఫలించుచుండగా ఆమె మనోహరముగానున్న తన చెక్కిలితో శ్రీకృష్ణప్రభువుయొక్క చెక్కిలిని స్పృశించెను. అందులకు ఆ స్వామి తన తాంబూలచర్వితమును ఆమెకు ప్రసాదించెను.

*33.14(పదునాలుగవ శ్లోకము)*

*నృత్యంతీ గాయతీ కాచిత్కూజన్నూపురమేఖలా|*

*పార్శ్వస్థాచ్యుతహస్తాబ్జం శ్రాంతాధాత్స్తనయోః శివమ్॥9528॥*

ఒక గోపకాంత హాయిగా గానము చేయుచు చక్కగా నృత్యము చేయుచుండగా, ఆమె ధరించిన కాలియందెల సవ్వడులు, మొలనూలు యొక్క సన్నని ధ్వనులు మృదుమధురముగా నినదించుచుండెను.అంతట బాగుగా అలసిపోయియున్న ఆ గోపిక శ్రీకృష్ణుని యొక్క సుఖకరమైన చల్లని కరకమలమును తన వక్షస్థలమున చేర్చుకొని హాయిని పొందెను.

*33.15 (పదునైదవ శ్లోకము)*

*గోప్యో లబ్ధ్వాఽచ్యుతం కాంతం శ్రియ ఏకాంతవల్లభమ్|*

*గృహీతకంఠ్యస్తద్దోర్భ్యాం గాయంత్యస్తం విజహ్రిరే॥9529॥*

లక్ష్మీదేవికి ప్రాణవల్లభుడైన శ్రీహరిని (శ్రీకృష్ణుని) తమ ప్రియునిగా పొందిన గోపికలు ఎంతయు భాగ్యశాలినులు. అంతేగాదు, ఆ స్వామియొక్క కౌగిలిసుఖములకు నోచుకొనిన వారి అదృష్టమే అదృష్టము. అట్టి గోపవనితలు ఆ ప్రభువును బహుధా కొనియాడుచు రాసలీలా విహారములు సలిపిరి.

*33.16  (పదహారవ శ్లోకము)*

*కర్ణోత్పలాలకవిటంకకపోలఘర్మవక్త్రశ్రియ వలయనూపురఘోషవాద్యైః|*

*గోప్యః సమం భగవతా ననృతుః స్వకేశస్రస్తస్రజో భ్రమరగాయకరాసగోష్ఠ్యామ్॥9530॥*

పరీక్షిన్మహారాజా! ఆ రాసలీలా విహారములయందు గోపవనితలు కృష్ణభగవానునితో గూడి సంతోషముతో నృత్యము లొనర్చిరి.  అప్పుడు వారి ముఖములు కర్ణములయందు అలంకృతములైన  కలువలతో, చూడముచ్చట గొలిపెడి ముంగురులతో, చెక్కిళ్ళపైగల స్వేదబిందువులతో శోభిల్లుచుండెను. వారియొక్క ముంజేతి కంకణముల గలగలలు, కాలి అందెల రవములు ఆ నాట్యమునకు వాద్యములు కాగా, మధుర ఝంకారములను ఆలపించుచున్న తుమ్మెదలే గాయకులుగా ఆ రాసలీల రసవంతముగా రంజిల్లుచుండెను. అప్పుడు ఆ గోపికలయొక్క కేశములయందు అలంకృతములైన పూలమాలలు - చెదరి జారిపోవుచుండెను - తాళగతులకు అనుగుణముగా కొనసాగుచున్న పాదవిన్యాస వైభవములకు తలలూపుచుండగా ఆ పుష్పములు  జారి వారి కోమల పాదములకు పుష్పాంజలిని సమర్పించుచుండెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[23/01, 05:42] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*793వ నామ మంత్రము* 23.01.2021

*ఓం కపర్దిన్యై నమః*

అంతటా దట్టముగా వ్యాపించిన జడలు గలిగిన పరాశక్తికి నమస్కారము.

కపర్దికి (శివునికి) భార్య అయిన పరమేశ్వరికి నమస్కారము

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కపర్దినీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం కపర్దిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబను భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి కరుణతో సకలాభీష్టసిద్ధి లభించును.

భగీరథుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగకోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై *నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు?* అని అడిగింది. భగీరధుడు శివునికోసం తపస్సు చేశాడు. అనుగ్రహించిన శివుడు గంగను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు.  అంతటి గంగా ప్రవాహాన్ని తన జటాజూటంలోనికి రప్పించి అక్కడ నుండి హిమలయములద్వారా భూమికి వదిలిన మహాశివుడు  గంగను ఆపగల మహాజటాజూటధారి యగుటచే ఆయనకు *కపర్ది* యను నామమేర్పడినది. ఆయన పత్నియైన జగన్మాత *కపర్దినీ* యని యనబడినది. 

శంకరుని మైరాలావతారమందు, ఆయన భార్యపేరు మహాలస. ఆమె   గిరిజన సాంప్రదాయం ప్రకారం గవ్వలదండలు ధరించేది. కపర్దికా అంటే చిన్నగవ్వలు. గవ్వలు ధరించిన శివపత్ని యగుటఛే జగన్మాత *కపర్దినీ* యని అనబడినది. 

దేవీ పురాణంలో అరువది ఎనిమిది శివక్షేత్రములలో భగలాండమందు *కపర్ది* యను శివుడు ఉన్నాడని చెప్పబడినది. ఆ కపర్ది యను శంకరుని భార్య అయిన పరమేశ్వరి *కపర్దినీ* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం కపర్దిన్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[23/01, 05:42] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*219వ నామ మంత్రము* 23.01.2021

*ఓం మహాభోగాయై నమః*

గంధము, తాంబూలము, పుష్పము, గృహము, వస్త్రము, స్త్రీ, ఆభరణము, శయ్య అను అష్టభోగముల సమిష్టిరూపమై తేజరిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహాభోగా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం మహాభోగాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి ప్రపూరిత హృదయంతో అర్చనచేయు భక్తులకు ఐహికముగా సకలభోగములు, సకల ఐశ్వర్యములను ప్రాప్తింపజేయును మరియు శాశ్వతమగు జన్మరాహిత్యమైన మోక్షసాధనకు తగిన దీక్షాపటిమను  ప్రసాదించును.

మహాభోగా యనగా పృథివ్యాదిరూపమున  మిక్కిలి విస్తారమైనది. *విరాడ్రూపా* యను 778వ నామ మంత్రమును బట్టి పరమేశ్వరి విశ్వరూపిణి అనగా బ్రహ్మాండమే ఆ అమ్మ శరీరము. బ్రహ్మాండమంత విస్తారమైన దేహము గలది గనుక *మహాభోగా* యనిఅనబడినది.  అమ్మవారికి *మనోన్మనీ* యను 207వ నామ మంత్రమును బట్టి పరమేశ్వరి అత్యంతానందానుభూతిలో ఉంటుంది. అది ఎలాగంటే... ఆజ్ఞాచక్రమునకు, సహస్రారమునకు నడుమ కొన్ని శక్తులు లేదా సూక్ష్మచక్రములు ఉన్నవి.   ఆజ్ఞాచక్రం నుండి పైకివెళుతున్న కొలదీ సాధకుని ఆనందానుభూతి వర్ణనాతీతము.  అలా పైకి ఈ సూక్ష్మచక్రములను దాటి వెళ్ళగా సహస్రారంలో బిందువు క్రింద ఉన్న స్థానంలో ఉన్నదే *మనోన్మనీ*.  ఆ స్థితి దాటితే పరమాత్మసన్నిధియే సాధకునికి లభించునది. ఆ స్థితికి చేరితే సంకల్పవికల్ప శూన్యమై, శివశక్తి సమ్మిళితమై, అహోరాత్ర భేదరహితమై, చంద్రమండలమునకు చేరినదే ఆ స్థితి. భ్రూమధ్యము నుండి ఎనిమిదవ స్థానమువద్ద ఉన్నదే ఉన్మని అదే *మనోన్మని*. ఆ స్థితిలో ఉన్న ఆనందం బ్రహ్మానందం. అంత కన్నా అతీతమైన అనుభూతి (సుఖము) వేరొకటి ఉండదు. జగన్మాత ఎల్లప్పుడూ ఆ స్థితిలో ఉంటుంది గనుక *మహాభోగా* యని అనబడినది.    

భోగము అనగా ధనము అను అర్థము గలదు. ధనము అంటే బ్రహ్మజ్ఞాన సంపదయని కూడా భావించవచ్చు. శ్రీవిద్యోపాసకులకు శ్రీవిద్యను మించిన ధనములేదు. అటువంటి శ్రీవిద్యాస్వరూపిణి, బ్రహ్మజ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారు *మహాభోగా* యని స్తుతింపబడుచున్నది.

పాంచభౌతికమైన ఈ శరీరము  మాత్రమే సుఖదుఃఖములను అనుభవిస్తుంది. అందునా మానవ శరీరం మాత్రమే అనుభవిస్తుంది. ఈ  సుఖదుఃఖములు అనునవి కర్మలయొక్క ఫలాలు. కర్మలు చేయునది శరీరధారులు మాత్రమే. దేవతలు అశరీరులు. క్రిమికీటకములు కర్మలు చేయలేవు. మానవునికే కర్మలు చేయు అధికారము గలదు. కర్మల ఫలితంగానే జన్మలు కూడా కలుగుతాయి. సుఖదుఃఖములలో సుఖము అంటే భోగము.  1. గంధము, 2. తాంబూలము, 3. పుష్పము, 4. గృహము, 5. వస్త్రము, 6. స్త్రీ, 7. ఆభరణము, 8. శయ్య అనునవి  అష్టభోగములు. ఈ అష్టభోగములు అనునవి మానవుని కర్మల ఫలితాన్ననుసరించి ఉండడం జరుగుతుంది. ఈ అష్టభోగముల సమిష్టి రూపమే జగన్మాత గనుక ఆ తల్లి *మహాభోగా* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మహాభోగాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐ణ

[23/01, 05:42] +91 95058 13235: *23.1.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది మూడవ అధ్యాయము*

*రాసక్రీడాభివర్ణనమ*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*33.17 (పదిహేడవ శ్లోకము)*

*ఏవం పరిష్వంగకరాభిమర్శస్నిగ్ధేక్షణోద్దామవిలాసహాసైః|*

*రేమే రమేశో వ్రజసుందరీభిర్యథార్భకః స్వప్రతిబింబవిభ్రమః॥9531॥*

ఆ రమారమణుడు (శ్రీకృష్ణుడు) సుందరీమణులైన గోపికలతోగూడి, బిగి కౌగిలింతలతో, కోమల కరస్పర్శలతో, మవ్వంపుచూపులతో (ప్రేమవీక్షణములతో) మిగుల విలాస శోభితములైన దరహాసములతో క్రీడించుచు నిర్వికారుడై ఒక పసిబాలుడు తన ప్రతిబింబములతో ఆడుకొనినట్లుగా   రాసలీలలను నెఱపెను.

ఒక పసివాడు తన ప్రతిబింబములతో ఆడుకొనునప్ఫుడు అతనిలో ఆనందహేల తప్ప ఎట్టి వికారములు ఉండవు. అట్లే శ్రీకృష్ణుడు తన ప్రతిబింబములైన గోపికలతో క్రీడించుచున్నప్పుడు ఆ స్వామిలో ఎట్టి వికారములకు తావేలేకుండెను. ఏలయన, గోపికల హృదయములలో శ్రీకృష్ణుభగవానుడే ప్రతిబింబించుచుండెను. అనగా భగవంతునకును, భక్తులకును మధ్యగల అవినాభావ సంబంధములు అట్టివి.

*33.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*తదంగసంగప్రముదాకులేంద్రియాః కేశాన్ దుకూలం కుచపట్టికాం వా|*

*నాంజః ప్రతివ్యోఢుమలం వ్రజస్త్రియో విస్రస్తమాలాభరణాః కురూద్వహ॥9532॥*

పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుని అంగస్పర్శతో గోపికలయొక్క ఇంద్రియములన్నియును పరమానందములో మునిగి, పరవశించిపోవుచుండెను. వారి కేశబంధములు సడలిపోవుచుండెను. పూలమాలలు, ఆభరణములు అస్తవ్యస్తములగుచుండెను. అట్టిస్థితిలో వారు తమ కేశములనుగాని, వస్త్రములనుగాని, కంచుకములను (రవికెలను) గాని వెంటనే ఎప్పటివలె సవరించుకొన లేకుండిరి.

*33.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*కృష్ణవిక్రీడితం వీక్ష్య ముముహుః ఖేచరస్త్రియః|*

*కామార్దితాః శశాంకశ్చ సగణో విస్మితోఽభవత్॥9533॥*

గోపికా కృష్ణులయొక్క మనోజ్ఞములైన రాసక్రీడలను గాంచి, దేవాంగనలును భగవంతుని కలయికను కోరి  మోహమున మునిగిరి. నక్షత్రగణములతో చంద్రుడును ఆ దృశ్యములను వీక్షించుచు సంభ్రమాశ్చర్య చకితుడగుచుండెను.

*33.20 (ఇరువదియవ శ్లోకము)*

*కృత్వా తావంతమాత్మానం యావతీర్గోపయోషితః|*

*రేమే స భగవాంస్తాభిరాత్మారామోఽపి లీలయా॥9534॥*

శ్రీకృష్ణుడు ఆత్మారాముడు  ఐనప్పటికిని గోపికల సంఖ్యనుబట్టి తానును అన్నిరూపములను దాల్చి వారితో క్రీడించుచు తన లీలలను ప్రదర్శించెను. 

*33.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*తాసామతివిహారేణ శ్రాంతానాం వదనాని సః|*

*ప్రామృజత్కరుణః ప్రేమ్ణా శంతమేనాంగపాణినా॥9535॥*

పరీక్షిన్మహారాజా! చాలాసేపు నృత్యగానాదులతో రాసక్రీడలను నెఱపియున్నందున గోపవనితలు మిగుల అలసిపోయిరి. అప్పుడు కరుణాళువైన శ్రీకృష్ణుడు సఖావహమైన తన కరకమలముతో ప్రేమపూర్వకముగా వారి ముఖములను తుడిచి, బడలికలను పోగొట్టెను.

*33.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*గోప్యః స్ఫురత్పురటకుండలకుంతలత్విడ్గండశ్రియా సుధితహాసనిరీక్షణేన|*

*మానం దధత్య ఋషభస్య జగుః కృతాని పుణ్యాని తత్కరరుహస్పర్శప్రమోదాః॥9536॥*

గోపికలు శ్రీకృష్ణుని కోమలమైన కరస్పర్శచే పరమానందభరితలై యుండిరి. మెఱయుచున్న బంగారు  కుండలముల కాంతులను, అందములు చిందుచున్న ముంగురుల వన్నెలను వారి చెక్కిళ్ళపై ప్రతిఫలించుచుండెను.  అట్టి గండస్థలముల నిగనిగలతోను, అమృతమువలె ఆనందదాయకములైన దరహాసములతోడను, మధుర వీక్షణములతోను వారు ఆ కృష్ణప్రభువును సంతోషపఱచుచుండిరి. అప్పుడు ఆ గోపకాంతలు ఆ స్వామియొక్క పవిత్ర లీలావైభవములను కొనియాడుచు గానము చేయసాగిరి.

*33.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*తాభిర్యుతః శ్రమమపోహితుమంగసంగఘృష్టస్రజః స కుచకుంకుమరంజితాయాః|*

*గంధర్వపాలిభిరనుద్రుత ఆవిశద్వాః శ్రాంతో గజీభిరిభరాడివ భిన్నసేతుః॥9537॥*

వప్రక్రీడతో (ఏనుగులు మున్నగునవి   తమ దంతములతో భూమిని లేదా నదీతటములను పెల్లగించెడి ఆటతో) అలసిపోయిన గజరాజు ఆడు ఏనుగులతోగూడి నదీజలములలో ప్రవేశించినట్లు, రాసక్రీడతో మిగుల అలసిసొలసియున్న శ్రీకృష్ణుడు  గోపకాంతలతోగూడి తమ బడలికలను తొలగించుకొనుటకై యమునానదీ జలములలోనికి దిగెను. అప్పుడు గోపికల అంగముల రాపిడిచే శ్రీకృష్ణుని మెడలోని పూలమాలలు మిగుల నలిగి, వారి వక్షస్థలముల యందలి కుంకుమల సంస్పర్శచే రాగరంజితములై యుండెను. వాటి పరిమళములకు ఆకర్షితములైన తుమ్మెదలు గంధర్వగానమువలె మధురఝంకారములొనర్చుచు వారిని అనుసరించుచుండెను.

*33.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*సోఽమ్భస్యలం యువతిభిః పరిషిచ్యమానః ప్రేమ్ణేక్షితః ప్రహసతీభిరితస్తతోఽఙ్గ|*

*వైమానికైః కుసుమవర్షిభిరీడ్యమానో రేమే స్వయం స్వరతిరత్ర గజేంద్రలీలః॥9538॥*

జలక్రీడా సమయమున  గోపికలు ఆత్మారాముడైన శ్రీకృష్ణునిపై చిఱునవ్వుల పువ్వులను రువ్వుచు, అనురాగ వీక్షణములను క్రుమ్మరించుచు, జలములను చిమ్ముచు ఆ ప్రభువును ఆనందమున ఓలలాడించుచుండిరి. ఆ స్వామియు అట్లే వారిని సంతోషసాగరమున తేలియాడచేయుచుండెను. అప్పుడు ఆకాశమునందు విమానములలోనున్న దేవతలు వారిపై పూవులను వర్షించుచు ఆ ప్రభువును సమ్మానించుచుండిరి. ఆ   ఆనందహేలలో శ్రీకృష్ణుడు గజరాజువలె వారితో జలక్రీడా విహారములను నెఱపెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[23/01, 20:32] +91 95058 13235: *23.1.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది మూడవ అధ్యాయము*

*రాసక్రీడాభివర్ణనమ*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*33.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*తతశ్చ కృష్ణోపవనే జలస్థలప్రసూనగంధానిలజుష్టదిక్తటే|*

*చచార భృంగప్రమదాగణావృతో  యథా మదచ్యుద్ద్విరదః కరేణుభిః॥9539॥*

తుమ్మెదలచేతను, గోపాంగనలతోడను పరివృతుడైయున్న శ్రీకృష్ణుడు, ఆడు ఏనుగులతో గూడి, మదధారలతో ఒప్పుచున్న మత్తగజమువలె నదీ తీరమునందలి ఉపవనమున ప్రవేశించి, అందు సంచరింపసాగెను. అప్పుడు జలస్థలముయందలి పూవులు సువాసనలను వెదజల్లుచుండగా, వాటిమీదుగా వీచుచున్న చల్లని మందమారుతములు అంతటను వ్యాపించుచు వారికి హాయిని గూర్చుచుండెను. గోపికాకృష్ణులు ధరించిన పూలమాలల పరిమళములకు ఆకర్షితములై తుమ్మెదలు వారివెంట తిరుగుచుండెను.

*33.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*ఏవం శశాంకాంశువిరాజితా నిశాః స సత్యకామోఽనురతాబలాగణః|*

*సిషేవ ఆత్మన్యవరుద్ధసౌరతః  సర్వాః శరత్కావ్యకథారసాశ్రయాః॥9540॥*

పరీక్షిన్మహారాజా! ఆ శరత్కాల రాత్రులు అంతటను పండువెన్నెలలను ప్రసరింపజేయుచుండెను. అవి కావ్యమునందు శరత్కాలమును వర్ణించిన సరస సామాగ్రితో ఒప్పుచు మనోరంజకముగా అలరారుచుండెను. అట్టి సుఖావహములైన రాత్రులయందు సత్యసంకల్పుడు, జితేంద్రియుడు ఐన శ్రీకృష్ణుడు తనను అనురాగముతో మురిపించుచున్న యువతీలలామలతో గూడి ఆ ఉపవనమున సంతోషముతో విహరింపసాగెను.

*రాజోవాచ*

*33.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*సంస్థాపనాయ ధర్మస్య ప్రశమాయేతరస్య చ*

*అవతీర్ణో హి భగవానంశేన జగదీశ్వరః॥9541॥*

*33.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*స కథం ధర్మసేతూనాం వక్తా కర్తాభిరక్షితా|*

*ప్రతీపమాచరద్బ్రహ్మన్ పరదారాభిమర్శనమ్॥9542॥*

*33.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*ఆప్తకామో యదుపతిః కృతవాన్ వై జుగుప్సితమ్|*

*కిమభిప్రాయ ఏతం నః సంశయం ఛింధి సువ్రత॥9543॥*

*పరీక్షిన్మహారాజు ఇట్లు నుడివెను* శుకమహర్షీ! జగన్నాథుడైన శ్రీహరి (శ్రీకృష్ణుడు) తన యంశయైన బలరామునితోగూడి అధర్మమును రూపుమాపుచు ధర్మపరిరక్షణకై అవతరించెను గదా! మహాత్మా! శ్రీకృష్ణుడు ధర్మమును నిర్దేశించువాడు, ధర్మమును నడుపువాడు, అంతేగాదు ధర్మస్వరూపుడు, సత్కర్మలను నెఱపుచుండువాడు, ధర్మమును బోధించుటకును, దానిని పరిరక్షించుటకును కారుణ్యముతో భూతలమున అవతరించినవాడు గదా! అట్టి పరమఫురుషుడు పరసతులతో కూడియాడుట ధర్మవిరుద్ధముగదా! ఆప్తకాముడైన ఆ పురుషోత్తముడు ఇట్టి నింద్యమైన కార్యమునకు పాల్పడుట ఏపాటి ధర్మము? దయతో నా ఈ సంశయమును తొలగింపుము.

*శ్రీశుక ఉవాచ*

*33.30 (ముప్పదియవ శ్లోకము)*

*ధర్మవ్యతిక్రమో దృష్ట ఈశ్వరాణాం చ సాహసమ్|*

*తేజీయసాం న దోషాయ వహ్నేః సర్వభుజో యథా॥9544॥*

*శ్రీశుకుడు ఇట్లు వివరించెను* మహారాజా! సర్వసమర్థులైన తేజోమూర్తులు అలౌకిక దృష్టితో ధర్మవిరుద్ధములగు సాహసకృత్యములను నెరపుచుండుట అచ్చటచ్చట కనబడుచుండును. అయితే లౌకికదృష్టితో చూచినవారికి అవి ధర్మవిరుద్ధముగా తోచవచ్చును. కాని, అందులో దోషారోపణకు ఆస్కారమే ఉండదు. ఏలయన, అగ్నిహేయములు, అహేయములు అగు పదార్థములను అన్నింటిని భక్షించుచున్నను ఆయనకు ఎట్టి మాలిన్యమూ అంటుటలేదుగదా! తేజోమూర్తుల శక్తిసామర్థ్యములు కూడా అట్టివే.

*33.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*నైతత్సమాచరేజ్జాతు మనసాపి హ్యనీశ్వరః|*

*వినశ్యత్యాచరన్ మౌఢ్యాద్యథా రుద్రోఽబ్ధిజం విషమ్॥9145॥*

సామాన్యుడు (సమర్థుడు కానివాడు) ఇట్టి కార్యమును గూర్చి మనస్సులోగూడ సంకల్పింపరాదు. మూర్ఖత్వముతో అట్లుచేసినచో, అతడు నశించుట తథ్యము. సర్వేశ్వరుడైన శంకరుడు సముద్రమునుండి పుట్టిన హాలాహలవిషమును పానము చేసినట్లు అసమర్థుడు చేసినచో తత్ క్షణమే అతడు భస్మమగును.

*33.32 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*ఈశ్వరాణాం వచః సత్యం తథైవాచరితం క్వచిత్|*

*తేషాం యత్స్వవచోయుక్తం బుద్ధిమాంస్తత్సమాచరేత్॥9546॥*

పరీక్షిన్మహారాజా! పరమేశ్వరుడు మొదలగువారు సర్వసమర్థులు. వారు పలికినమాటలు సర్వదా సత్యములే. అవి అనుసరింపదగినవే. కాని వారి ఆచరణలు మాత్రము అప్పుడప్పుడు మాత్రమే అనుసరింపబడును. కనుక బుద్ధిమంతుడు వారి ఉపదేశములకు అనుగుణముగా నున్న ఆచరణలను మాత్రమే అనుసరించును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[24/01, 05:27] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*794వ నామ మంత్రము* 24.01.2021

*ఓం కళామాలాయై నమః*

చతుష్షష్టికళలను మాలగా ధరించి విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కళామాలా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం కళామాలాయై నమః* అని  ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో  ఆరాధించు భక్తులకు జ్ఞానసంపదను  ప్రసాదించి వారి వారి వృత్తి, వ్యాపార రంగములలో ప్రతిభావంతులను జేసి, తద్వారా ఐహికముగా సిరిసంపదలతోబాటు,  ఆధ్యాత్మికతయందు జీవనసరళిని పొందుచూ తరించువారిగా అనుగ్రహించును.

పరమేశ్వరి చతుష్షష్టికళా స్వరూపిణి. అరువదినాలుగు కళలను మాలగాధరించి విరాజిల్లుచున్నదియను భావముచే *కళామాలా* యని అనబడినది.

జగన్మాత షోడశకళాప్రపూర్ణ. అనగా

చంద్రుని పదహారు కళలను తనవిగా జేసుకుని విరాజిల్లుచున్నది జగన్మాత. ఆ షోడశ కళలు 1. అమృత, 2. మానద, 3. పూష, 4. తుష్టి, 5. పుష్టి, 6. రతి ధృతి, 7. కామదాయిని, 8. శశిని, 9. చంద్రిక, 10. కాంతి, 11. జ్యోత్స్న, 12. శ్రీ, 13. ప్రీతి, 14. అంగద, 15. పూర్ణ, 16. అపూర్ణ. 15 తిథులకు 16 ఎందుకు అంటే పూర్తి పౌర్ణమి,పూర్తి అమావాస్య ఘడియలు అనేవి స్వల్ప సమయమే ఉంటాయి.

ఈ పదహారు కళలకు నిత్యం ఆరాధింపవలసిన దేవతలు ఉన్నారు. వారే నిత్యాదేవతలు వీరు మొత్తం పదహారు మంది.  పదిహేను నిత్యలను శ్రీచక్రంలోని త్రికోణంలోని ఒక్కొక్క రేఖ యందు ఐదుగురు చొప్పున పూజించగా పదహారవ దైన లలితా త్రిపుర సుందరీదేవిని బిందువు నందు పూజించుతాము. ఆవిధంగా జగన్మాత చంద్రకళలు పదహారింటిని, పదహారు నిత్యాదేవతలుగాను, ఆ నిత్యాదేవతా స్వరూపిణియై ఆ  నామములే మాలగా ధరించు *షోడశకళాప్రపూర్ణ* యై *కళామాలా* యని ఉత్ప్రేక్షించబడుచున్నది. 

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం కళామాలాయై నమః* అనబడుచున్నది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[24/01, 05:27] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*220వ నామ మంత్రము* 24.01.2021

*ఓంమహైశ్వర్యాయై నమః*

నిరతిశయమైన ఈశత్వము, సంపద, ఈశ్వర విభూతి అనంతముగా కలిగిన జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహైశ్వర్యా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం మహైశ్వర్యాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ లలితా పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపూరిత హృదయంతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి అనంతమైన జ్ఞానసంపదలను ప్రసాదించును.

జగన్మాత మువురమ్మల మూలపుటమ్మ. గనుక సాక్షాత్తు లక్ష్మీస్వరూపిణి. అష్టలక్ష్మీ స్వరూపిణిగా ధన లక్ష్మి, ధాన్య లక్ష్మి,  ధైర్య లక్ష్మి, రాజ్య లక్ష్మి, జయ లక్ష్మి,  జ్ఞాన లక్ష్మి, సంతాన లక్ష్మి, శౌర్య (వీర) లక్ష్మిగా భక్తులకు అష్టైశ్వర్యప్రదాయనియై విరాజిల్లుచున్నది. గనుకనే *మహైశ్వర్యా* యని అనబడినది.  

ఒకసారి శంకరాచార్యుల వారు ఒక ఇంటికి బిక్షకు వెళ్ళారు. భిక్ష వేయడానికి ఆ ఇంట ఏమీ ఆహారపదార్ధాలు లేవు. ఇంటి ఇల్లాలు నిరు పేదరాలు. ఆమెకి కట్టుకోడానికి సరైన వస్త్రాలు కూడా లేవు. ఇల్లంతా వెతికిన ఆమెకి ఎలాగో ఒక ఉసిరికాయ లభించింది. ధర్మపరురాలైన ఆ ఇల్లాలు తలుపు చాటునుండే ఉసిరికాయను శంకరునికి సమర్పించింది. పరిస్థితి గ్రహించిన శంకరుడు అమ్మవారిని స్తుతిస్తూ కనకథారాస్తవము చెప్పగా ఆ పేదరాలి యింట బంగారు ఉసిరికాయలు వర్షించాయి. అంటే అష్టైశ్వర్యాలు ఆ పేదరాలికి సంప్రాప్తించాయిగదా! అమ్మవారు తనభక్తులయెడ అవ్యాజమైన కరుణావృష్టిని కురిపిస్తే అంతులేని ఐశ్వర్యం సలలితముగ నారికేళ సలిలమువలె ప్రాప్తిస్తుంది. గనుకనే అమ్మవారు *మహైశ్వర్యా* యని అనబడినది.

దేవీ భాగవతంలో మణి ద్వీపం గురించిన వర్ణన వుంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో వున్నాయి.  కాబట్టి జగన్మాత *మహైశ్వర్యా* యని అనబడినది.

జగన్మాత *ఐహికసంబంధమైన* సిరిసంపదలు, పాడిపంటలు, భోగభాగ్యములు ప్రసాదిస్తుంది. అలాగే ఆముష్మిక సంబంనమైన బ్రహ్మజ్ఞానము, ఆధ్యాత్మికభావములు, జన్మరాహిత్యమైన ముక్తిని జ్ఞానులకు, యోగులకు ప్రసాదిస్తుంది. ఆతల్లి లక్ష్మీస్వరూపిణి గనుక ఐహికసంపదలు, పరబ్రహ్మస్వరూపిణి గనుక ఆముష్మికమైన బ్రహ్మజ్ఞాన సంపదలు ప్రసాదించగలదు గనుకనే అమ్మవారు *మహైశ్వర్యా* యని అనబడినది.

అమ్మవారికి నమస్కరించునపుడు *ఓం మహైశ్వర్యాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[24/01, 05:27] +91 95058 13235: *24.1.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది మూడవ అధ్యాయము*

*రాసక్రీడాభివర్ణనమ*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*33.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*కుశలాచరితేనైషామిహ స్వార్థో న విద్యతే|*

*విపర్యయేణ వానర్థో నిరహంకారిణాం ప్రభో॥9547॥*

మహారాజా! దేహాత్మాభిమానములేనివారు అహంకార రహితులై యుందురు. వారు ఒనర్చెడి శుభకర్మల వలన వారికి సంసారబంధమైన (లౌకికమైన) స్వప్రయోజనము ఏమాత్రమూ ఉండదు. అశుభకర్మలవలన ఎట్టి హానియు కలగదు. వారు చేయునట్టి శుభాశుభ కర్మలన్నియును లోకోపకారార్థమే.  ఏలయన అట్టి మహానుభావులు స్వార్థములకును అనర్థములకును అతీతులై ఉందురు. 

*33.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*కిముతాఖిలసత్త్వానాం తిర్యఙ్మర్త్యదివౌకసామ్|*

*ఈశితుశ్చేశితవ్యానాం కుశలాకుశలాన్వయః॥9548॥*

వారికే కుశలాకుశల కర్మ ప్రయుక్తములైన సుఖదుఃఖాది సంబంధములు లేనప్ఫుడు, పశుపక్ష్యాదులు, మానవులు, దేవతలు మొదలగు చరాచర జీవులకు ఏకైక స్వామియైన ఆ పరమాత్ముని (శ్రీకృష్ణుని) విషయమున (ఇది శుభము, అది అశుభము అని) ఇక చెప్పవలసినది   ఏముండును?

*33.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*యత్పాదపంకజపరాగనిషేవతృప్తా యోగప్రభావవిధుతాఽఖిలకర్మబంధాః|*

*స్వైరం చరంతి మునయోఽపి న నహ్యమానాః స్తస్యేచ్ఛయాఽఽత్తవపుషః కుత ఏవ బంధః॥9549॥*

మహాత్ములైన సనకసనందనాది మహామునులు ఆ శ్రీహరి (శ్రీకృష్ణుని) పాదపద్మముల రేణువులు సేవించుటవలన పరమానందభరితులగుదురు. వారు ఆ స్వామి అనుగ్రహముచే లభించిన యోగశక్తి ప్రభావమున సమస్త కర్మబంధముల నుండియు విముక్తులగుదురు. పిదపవారు లౌకికమైన వ్యవహారములకు అతీతులై మసలుకొను చుందురు. తన పాదరేణువుల స్పర్శచేతనే మహాయోగులకును ముక్తిని ప్రసాదించునట్టివాడు,  తన ఇచ్ఛచే దేహమును స్వీకరించి అవతరించినట్టి ఆ ప్రభువునకు (శ్రీకృష్ణునకు) కర్మబంధము ఎట్లుండును?

*33.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*గోపీనాం తత్పతీనాం చ సర్వేషామేవ దేహినామ్|*

*యోఽన్తశ్చరతి సోఽధ్యక్షః క్రీడనేనేహ దేహభాక్॥9550॥*

సర్వసాక్షియగు భగవానుడు గోపికలకు, వారిభర్తలకు మాత్రమేగాక, సకలప్రాణులకు కూడ అంతర్యామియై ఉన్నాడు. ఆయన ఈ లోకమునందు తన లీలలను నెరపుటకై దేహమును స్వీకరించెను.

*33.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*అనుగ్రహాయ భూతానాం మానుషం దేహమాస్థితః|*

*భజతే తాదృశీః క్రీడా యాః శ్రుత్వా తత్పరో భవేత్॥9551॥*

పరమేశ్వరుడు సకలప్రాణులను అనుగ్రహించుటకొరకే మానవదేహమును ధరించెను. కావున, ఆ దేహమునకు తగినట్టి లీలలనే ప్రకటించును. అట్టి లీలావైభవములను విన్నవారు భగవత్పరాయణులు అగుదురు.

*33.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*నాసూయన్ ఖలు కృష్ణాయ మోహితాస్తస్య మాయయా|*

*మన్యమానాః స్వపార్శ్వస్థాన్ స్వాన్ స్వాన్ దారాన్ వ్రజౌకసః॥9552॥*

గోకులవాసులగు జనులకు శ్రీకృష్ణునియెడల దోషబుద్ధి కలుగనేలేదు. ఏలనన, ఆయన యోగమాయచే మోహితులైనవారికి తమ - తమ భార్యలు తమ ప్రక్కనే ఉన్నట్లుగా తోచెను.

*33.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*బ్రహ్మరాత్ర ఉపావృత్తే వాసుదేవానుమోదితాః|*

*అనిచ్ఛంత్యో యయుర్గోప్యః స్వగృహాన్ భగవత్ప్రియాః॥9553॥*

ఇంతలో బ్రాహ్మముహూర్తము ఆయెను. వసుదేవుని కుమారుడగు శ్రీకృష్ణుడు తనకు ప్రీతిపాత్రులగు గోపికలు వెళ్ళుటకు అనుమతినిచ్చెను. కాని, ఆయనను   విడిచి వెళ్ళుటకు వారి మనస్సు లొప్పకున్నను, ఆ ప్రభువు ఆజ్ఞమేరకు తమ తమ ఇండ్లకు వెళ్ళిరి.

*33.40 (నలుబదియవ శ్లోకము)*

*విక్రీడితం వ్రజవధూభిరిదం చ విష్ణోః శ్రద్ధాన్వితోఽనుశృణుయాదథ వర్ణయేద్యః|*

*భక్తిం పరాం భగవతి ప్రతిలభ్య కామం  హృద్రోగమాశ్వపహినోత్యచిరేణ ధీరః॥9554॥*

పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు వ్రజభామినులతో నెఱపిన ఈ రాసలీలలను గూర్చి పదేపదే శ్రద్ధగా వినినవారు వాటిని ప్రస్తుతించినవారు ఆ పరమాత్ముని పాదపద్మములపై ప్రగాఢమైన భక్తికి నోచుకొందురు. తత్ప్రభావముచే వారు తమ జీవితకాలమున జితేంద్రియులు అగుదురు. అతి శీఘ్రముగా కామవికారాది హృద్రోగములనుండి విముక్తులగుదురు.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధ  రాసక్రీడాభివర్ణనమ్  నామ   త్రయస్త్రింశోఽధ్యాయః (33)*

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి *రాసక్రీడాభివర్ణనము*  అను ముప్పది మూడవ అధ్యాయము (33)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[24/01, 20:36] +91 95058 13235: *24.1.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది నాలుగవ అధ్యాయము*

*సుదర్శనుడను గంధర్వునకు శాపవిమోచనము - కుభేరభటుడైన శంఖచూడునకు మోక్షప్రాప్తి*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*

*34.1 (ప్రథమ శ్లోకము)*

*ఏకదా దేవయాత్రాయాం గోపాలా జాతకౌతుకాః|*

*అనోభిరనడుద్యుక్తైః ప్రయయుస్తేఽమ్బికావనమ్॥9555॥*

*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! ఒకనాటి శివరాత్రి పర్వదినమునందు నందాది గోపాలురు గౌరీశంకరులను ఆరాధించుటకై కుతూహలపడుచు, ఎద్దులబండ్లపై ఎక్కి సంతోషముతో అంబికావనమున ప్రవేశించిరి.

*34.2 (రెండవ శ్లోకము)*

*తత్ర స్నాత్వా సరస్వత్యాం దేవం పశుపతిం విభుమ్|*

*ఆనర్చురర్హణైర్భక్త్యా దేవీం చ నృపతేఽమ్బికామ్॥9556॥*

మహారాజా! వారు ఆ వన సమీపమున గల సరస్వతీనదీ జలములలో స్నానములను ముగించుకొనిరి. పిమ్మట వారు సర్వేశ్వరుడైన పరమశివుని, జగజ్జననియైన పార్వతీదేవిని గంధకుసుమాది పూజాద్రవ్యములతో భక్తిశ్రద్ధాపూర్వకముగా అర్చించిరి.

*34.3 (మూడవ శ్లోకము)*

*గావో హిరణ్యం వాసాంసి మధు మధ్వన్నమాదృతాః|*

*బ్రాహ్మణేభ్యో దదుః సర్వే దేవో నః ప్రీయతామితి॥9557॥*

ఆ గోపాలురు అందఱును ఆ సర్వేశ్వరుని అనుగ్రహప్రాప్తికై భూసురులను పాడియావులను, బంగారములను, నూతన వస్త్రములను, తేనెలను (మధుర పదార్థములను) , పాయసములను సాదరముగ సమర్పించిరి.

*34.4 (నాలుగవ శ్లోకము)*

*ఊషుః సరస్వతీతీరే జలం ప్రాశ్య ధృతవ్రతాః|*

*రజనీం తాం మహాభాగా నందసునందకాదయః॥9558॥*

పిమ్మట నంద, సునందాది మహాత్ములు బ్రహ్మచర్యవ్రతమును పాటించుచు, కేవలము జలమును మాత్రమే సేవించి, ఉపవాసదీక్షతో సరస్వతీనదీ తీరమునందే ఆ రాత్రిని గడపిరి.

*34.5 (ఐదవ శ్లోకము)*

*కశ్చిన్మహానహిస్తస్మిన్ విపినేఽతిబుభుక్షితః|*

*యదృచ్ఛయాఽఽగతో నందం శయానమురగోఽగ్రసీత్॥9559॥*

ఆ అంబికావనమునందే ఆ గోపాలురు ఆ రాత్రివేళ విశ్రాంతికై పరుండియుండిరి. ఆ వనమునందే నివసించుచున్న ఒక మహాసర్పము ఆకలితో నకనకలాడుచు వారు శయనించియున్న చోటికి చేరెను.  పిమ్మట తనకు అప్రయత్నముగా ఆహారము లభించినదని తలంచుచు ఆ సర్పము నందుని తననోట గఱచుకొనెను.

*34.6 (ఆరవ శ్లోకము)*

*స చుక్రోశాహినా గ్రస్తః కృష్ణ కృష్ణ మహానయమ్|*

*సర్పో మాం గ్రసతే తాత ప్రపన్నం పరిమోచయ॥9560॥*

అంతట సర్పగ్రస్తుడైన నందుడు 'కృష్ణా! కృష్ణా! నన్ను ఈ మహోరగము మ్రింగివేయుచున్నది. నాయనా! నీవే మాకు దిక్కు. రమ్ము. రమ్ము. వెంటనే వచ్చి నన్ను కాపాడుము' అని మొఱపెట్టుకొనెను.

*34.7 (ఏడవ శ్లోకము)*

*తస్య చాక్రందితం శ్రుత్వా గోపాలాః సహసోత్థితాః|*

*గ్రస్తం చ దృష్ట్వా విభ్రాంతాః సర్పం వివ్యధురుల్ముకైః॥9561॥*

*34.8 (ఎనిమిదవ శ్లోకము)*

*అలాతైర్దహ్యమానోఽపి నాముంచత్తమురంగమః|*

*తమస్పృశత్పదాభ్యేత్య భగవాన్ సాత్వతాం పతిః॥9562॥*

నందుని ఆర్తనాదములను విన్నంతనే నిద్రలో ఉన్న గోపాలురు అందఱు వెంటనే ఉలికిపడుచు లేచిరి. పిమ్మట ఆపన్నులను ఆదుకొను మహానుభావుడైన శ్రీకృష్ణుడు ఎదురుగా వచ్చి తన పాదములతో ఆ సర్పమును స్పృశించెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[25/01, 03:54] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*795వ నామ మంత్రము* 25.01.2021

*ఓం కామదుఘే నమః*

కోరికలను తీర్చుటలో కామధేనువు వంటి జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కామధుక్* అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం కామదుఘే నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తితో ఆరాధించు సాధకులకు ఆ తల్లి సర్వాభీష్టములను తీర్చును.

జగన్మాత భక్తులకోర్కెలను తీర్చుటలో కామధేనువు వంటిది.

భక్తాభీష్టప్రదాయని. భక్తులకు వారి ధర్మబద్ధమైన కోర్కెలను తీర్చుటలో జగన్మాత కామధేనువు వంటిది. అనగా పరమేశ్వరి కామధేనుస్వరూపురాలు. గోవుల‌న్నింటికీ మూలం కామధేనువు అని పురాణాలు చెబుతున్నాయి. అమృతం కోసం దేవతలు, రాక్ష‌సులు ఆదిశేషువు తాడుగా మంధ‌ర పర్వ‌తాన్ని క‌ర్ర‌గా చేసుకుని క్షీర సాగ‌రాన్ని మ‌థిస్తారు. అయితే ఆ క్షీర సాగ‌ర మ‌థ‌నంలో కామ‌ధేనువు కూడా మ‌థ‌నం నుంచి ఉద్భ‌విస్తుంది. ఈ ఆవునే సుర‌భి అని కూడా పిలుస్తారు. గోమాత అనికూడా అంటాము.  గోమాత, ముక్కోటి దేవతల ప్రత్యక్షదైవము,  గోమాత భూమాత యంతటి ఓరిమిగలిగినది. భూమాత -  పుట్టినది మొదలు గిట్టువరకూ మనను భరిస్తూ మన కాలిముద్రలను సహనముతో భరిస్తూ గిట్టినపుడు తిరిగి తనలో కలుపుకొనునది భూమాత. ఇలా మాత, గోమాత, భూమాతల స్వరూపమే శ్రీమాత గాన.  

అమ్మవారిని *గోమాతా* అని 605వ నామ మంత్రములో  స్తుతించాము. *గో* అనే పదానికి చాలా అర్థములు గలవు. కిరణము అనగా మనకు వెలుగు కిరణములు ప్రసాదించు సూర్యుడు అని తెలియదగును, *గో* అంటే భూమి, అలాగే తల్లి (మాత) అని కూడా అర్థముగలదు. ఇంకను మూలము, నేపథ్యము అని అర్థంగా విశ్లేషిస్తే భూమి మొదలైన వాటికి కారణమైనది అని తెలియవచ్చు. *గో* అంటే తల్లి లేదా *మాత*, మాత అనగా పార్వతి అనగా శ్రీమాత కాబట్టి జగన్మాతను గోమాత అని అన్నాము. పరమేశ్వరి భక్తుల కోర్కెలను తీర్చుటలో కామధేనువు వంటిది గనుక *కామధుక్* అని యనబడినది. గోక్షీరమను ఏవిధముగానైతే పితుకుదుమో,  అత్యంత భక్తితత్పరతతో ప్రసన్నముచేసుకుని మనోరథములను అమ్మవారినుండి గ్రహించుదుము గనుక *కామధుక్* యని అంటాము.

అటువంటి తల్లికి నమస్కరించునపుడు *ఓం కామధుఘే నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

.

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[25/01, 03:54] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*221వ నామ మంత్రము* 25.01.2021

*ఓం మహావీర్యాయై నమః*

అనన్యసామాన్యమైన వీరధర్మము, శౌర్యము, పరాక్రమము మొదలైన మహావీరలక్షణములతో తేజరిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహావీర్యా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం మహావీర్యాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఎనలేని జ్ఞానబలము, బుద్ధిబలము, ఆయురారోగ్యములు ప్రసాదించి, పరిపూర్ణమైన భగవధ్యాననిమగ్నతను కలుగజేసి తరింపజేయును.

జగన్మాత రాక్షస సంహారములో చూపిన శౌర్యపరాక్రమములు, యుద్ధకుశలత, సృష్టి,స్థితి,లయకార్యములను నిర్వహించుటయందు నెరపిన కార్యదక్షత, సకల జగములను పరిపాలించుటలో చూపిన బుద్ధికుశలత - ఇవన్నీ మహిళ అబల కాదు సబల యని తెలియుటకు కావలసిన తార్కాణములు. గనుకనే    అమ్మవారు *మహావీర్యా* యని అనబడినది.

మహిషాసురుడు, భండాసురుడు, విషంగుడు వంటి రాక్షసులు మునిజనాన్ని హింసిస్తూ, స్త్రీలను చెరపడుతూ, యజ్ఞయాగాది క్రతువులను భగ్నంచేస్తూ లోకకంటకులై చెలరేగువేళ జగన్మాత తన శక్తిసేనలతోను, మంత్రశక్తులతోను ఎదుర్కొని వారిని  నాశనంచేసినది కనుకనే *మహావీర్యా* యని అనబడినది.

వీర్యము అనగా వీరలక్షణము. వీర్యము అను శబ్దమునకు బలము, పరాక్రమము, శౌర్యము, ధైర్యము, సామర్థ్యము, రేతస్సు అను అర్థములు గలవు. ఇవి అన్నియు సమష్టిగా ఒకరిలోనే ఉంటే వీరుడు అంటారు. *మహా* అను విశేషణము జతచేస్తే వీరత్వానికి పరాకాష్ఠ అవుతుంది. జగన్మాత అంతటి మహావీరత్వము గలిగినది గనుకనే *మహావీర్యా* యని అనబడినది. సాక్షాత్తు నారాయణునికి కూడా సాధ్యముకాని మహిషుడు, శుంభుడు వంటి రాక్షససంహారము చేసి *మహావీర్యా* యని నామప్రసిద్ధమైనది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మహావీర్యాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[03:54, 25/01/2021] +91 95058 13235: 25.1.2021  ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది నాలుగవ అధ్యాయము

సుదర్శనుడను గంధర్వునకు శాపవిమోచనము - కుభేరభటుడైన శంఖచూడునకు మోక్షప్రాప్తి

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

34.9 (తొమ్మిదవ శ్లోకము)

స వై భగవతః శ్రీమత్పాదస్పర్శహతాశుభః|

భేజే సర్పవపుర్హిత్వా రూపం విద్యాధరార్చితమ్॥9563॥

శ్రీకృష్ణుని యొక్క పరమ పునీతమైన పాదస్పర్శతో ఆ ఉరగముయొక్క పాపములు అన్నియును పటాపంచలైపోయెను. క్షణములో అది సర్పదేహమును వీడి, విద్యాధరులచే అర్చింపబడు దివ్యరూపమును (విద్యాధర ప్రభురూపమును) పొంది, ఆ స్వామి పాదములపై వ్రాలెను.

34.10 (పదియవ శ్లోకము)

తమపృచ్ఛద్ధృషీకేశః ప్రణతం సముపస్థితమ్|

దీప్యమానేన వపుషా పురుషం హేమమాలినమ్॥9564॥

ఆ విద్యాధరుని దేహము దివ్యకాంతులను వెదజల్లు చుండెను. అతని కంఠమున బంగారుహారము తళుకులీనుచుండెను. తనను జేరి, పాదములకు మోకరిల్లి నిలిచియున్న ఆ (విద్యాధర) ప్రముఖునితో కృష్ణభగవానుడు ఇట్లునుడివెను.

34.11 (పదకొండవ శ్లోకము)

కో భవాన్ పరయా లక్ష్మ్యా రోచతేఽద్భుతదర్శనః|

కథం జుగుప్సితామేతాం గతిం వా ప్రాపితోఽవశః॥9565॥

"నీవు ఎవరు? నీ దేహము దివ్యతేజస్సులతో వెలుగొందుచున్నది. నీ రూపము అద్భుతావహమై దర్శనీయముగా ఉన్నది. జుగుప్సితమైన ఈ సర్పజన్మ నీకు ప్రాప్తించుటకు కారణమేమి?"

సర్ప ఉవాచ

34.12 (పండ్రెండవ శ్లోకము)

అహం విద్యాధరః కశ్చిత్సుదర్శన ఇతి శ్రుతః|

శ్రియా స్వరూపసంపత్త్యా విమానేనాచరం దిశః॥9566॥

సర్పమై ఉండిన విద్యాధరుడు ఇట్లనెను "పరమపురుషా! నేను ఒక విద్యాధరుడను. నా పేరు సుదర్శనుడు. భగవదనుగ్రహముతో  నాకు ఈ సౌభాగ్యము లభించెను. సంపదలకు కొదువలేకుండెను. ఒకానొకప్ఫుడు నేను ఆకాశమునందు విమానమున విహరించుచుంటిని.

34.13 (పదమూడవ శ్లోకము)

ఋషీన్ విరూపానంగిరసః ప్రాహసం రూపదర్పితః|

తైరిమాం ప్రాపితో యోనిం ప్రలబ్ధైః స్వేన పాప్మనా॥9567॥

34.14 (పదునాలుగవ శ్లోకము)

శాపో మేఽనుగ్రహాయైవ కృతస్తైః కరుణాత్మభిః|

యదహం లోకగురుణా పదా స్పృష్టో హతాశుభః॥9568॥

అప్ఫుడు సౌందర్యాతిశయమున గర్వితుడనై యున్న నేను కురూపులైన అంగిరస ఋషులను జూచి, హేళనగా నవ్వితిని. అవహేళనకు గుఱియైన ఆ మహామునులు నేను ఒనర్చిన అపరాధమునకు కుపితులై 'ఓరీ! పాపాత్మా! సౌందర్యగర్వముచే విర్రవీగుచు నీవు మమ్ములను పరిహసించితివి. కావున నీవు సర్పరూపమును పొందుము'  అని శపించిరి. కరుణాళువులైన ఆ మహాత్ములు నన్ను శాపమునకు గుఱిచేసినను అది నా పాలిట అనుగ్రహముగా (వరముగా) మాఱినది. ఏలయన జగద్గురుడవైన నీ యొక్క పవిత్ర పాదస్పర్శచే నా పాపములు అన్నియును తొలగిపోయినవి. వారు ఆ విధముగా శపింపనిచో నాకు ఈ అదృష్టము పట్టియుండెడిదికాదు.

34.16 (పదిహేనవ శ్లోకము)

తం త్వాహం భవభీతానాం ప్రపన్నానాం భయాపహమ్|

ఆపృచ్ఛే శాపనిర్ముక్తః పాదస్పర్శాదమీవహన్॥9569॥

ప్రభూ! నీవు సకలపాపములను అంతరింపజేయువాడవు. జననమరణ క్లేశములకు భయపడి నిన్ను శరణుజొచ్చిన వారికి నీవు అభయమిచ్చుచుందువు. నీ పాదస్పర్శతో నేను శాపవిముక్తుడనైతిని. నా లోకమునకు (విద్యాధర లోకమునకు) వెళ్ళుటకు నన్ను అనుమతింపుము.

34.16 (పదహారవ శ్లోకము)

ప్రపన్నోఽస్మి మహాయోగిన్ మహాపురుష సత్పతే|

అనుజానీహి మాం దేవ సర్వలోకేశ్వరేశ్వర॥9570॥

34.17  (పదిహేడవ శ్లోకము)

బ్రహ్మదండాద్విముక్తోఽహం సద్యస్తేఽచ్యుత దర్శనాత్|

యన్నామ గృహ్ణన్నఖిలాన్ శ్రోతౄనాత్మానమేవ చ|

సద్యః పునాతి కిం భూయస్తస్య స్పృష్టః పదా హి తే॥9571॥

పురుషోత్తమా! మహాయోగీ! నీవు సమస్త లోకేశ్వరులకు ప్రభుడవు. దేవాధిదేవుడవు. నేను నిన్ను త్రికరశశుద్ధిగా శరణుజొచ్చితిని. నీ అనుజ్ఞయైనచో వెళ్ళివచ్చెదను. అచ్యుతా! నీ దర్శనప్రభావమున నేను బ్రాహ్మణోత్తముల శాపము నుండి విముక్తి పొందితిని. ఇందులో ఆశ్చర్యపడవలసినది లేనేలేదు. దేవా! పరమపవిత్రమైన నీ నామమును కీర్తించిస వారు, దానిని  విన్నవారును తత్ క్షణమే పునీతులగుదురు. ఇక నీ పాదస్పర్శ భాగ్యమునకు నోచుకొనిన నేను పవిత్రుడను అగుదుననుటలో సందేహము ఏమున్నది?"

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:39, 25/01/2021] +91 95058 13235: 25.1.2021  సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది నాలుగవ అధ్యాయము

సుదర్శనుడను గంధర్వునకు శాపవిమోచనము - కుభేరభటుడైన శంఖచూడునకు మోక్షప్రాప్తి

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

34.18 (పదునెనిమిదవ శ్లోకము)

ఇత్యనుజ్ఞాప్య దాశార్హం పరిక్రమ్యాభివంద్య చ|

సుదర్శనో దివం యాతః కృచ్ఛ్రాన్నందశ్చ మోచితః॥9572॥

ఈ విధముగా సుదర్శనుడు అను పేరుగల ఆ విద్యాధరుడు కృష్ణభగవానుని ప్రస్తుతించి, ప్రదక్షిణపూర్వకముగా ప్రణమిల్లి ఆ స్వామిని వీడ్కొని తన లోకమునకు వెళ్ళెను ఇట్లు నందగోపుడు ఆ సర్పప్రమాదమునుండి విముక్తుడయ్యెను.

34.19 (పందొమ్మిదవ శ్లోకము)

నిశామ్య కృష్ణస్య తదాత్మవైభవం వ్రజౌకసో విస్మితచేతసస్తతః|

సమాప్య తస్మిన్నియమం పునర్వ్రజం  నృపాయయుస్తత్కథయంత ఆదృతాః॥9573॥

పరీక్షిన్మహారాజా! గోపాలురు అందరును శ్రీకృష్ణుని యొక్క అనితరసాధ్యములైన లీలలను స్వయముగా దర్శించి, మిగుల విస్మితులైరి. అనంతరము వారు ఆ అంబికావనమున తమ నియమవ్రత దీక్షలను ముగించుకొనిరి. పిదప వారు శ్రీకృష్ణుని వైభవములను ప్రేమాదరములతో పదేపదే కీర్తించుచు వ్రజభూమికి మఱలివచ్చిరి. 

34.20 (ఇరువదియవ శ్లోకము)

కదాచిదథ గోవిందో రామశ్చాద్భుతవిక్రమః|

విజహ్రతుర్వనే రాత్ర్యాం మధ్యగౌ వ్రజయోషితామ్॥9574॥

ఒకానొకప్ఫుడు అద్భుత పరాక్రమశాలులైన బలరామకృష్ణులు రాత్రివేళ గోపికలచే పరివృతులై ఒక వనమునందు విహరించుచుండిరి.

34.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

ఉపగీయమానౌ లలితం స్త్రీజనైర్బద్ధసౌహృదైః|

స్వలంకృతానులిప్తాంగౌ స్రగ్విణౌ విరజోఽమ్బరౌ॥9575॥

అప్పుడు శ్రీకృష్ణుడు పట్టుపీతాంబరములతో, బలరాముడు నీలాంబరములతో శోభిల్లుచుండిరి. వారి కంఠములయందు సుగంధభరితములైన పూలమాలలు  అలరారుచుండెను. తనువులపై సువాసనలను వెదజల్లుచున్న చందనాది లేపనములు గుబాళించుచుండెను. వారు ధరించిన ఆభరణములు ధగధగమెఱయుచుండెను. అంతట ఆ మహాత్ముల చుట్టును చేరియున్న  వ్రజభామినులు అనురాగ పూర్వకముగా మధురస్వరములతో వారి గుణగణములను గానము చేయుచుండిరి.

34.22 (ఇరువది రెండవ శ్లోకము)

నిశాముఖం మానయంతావుదితోడుపతారకమ్|

మల్లికాగంధమత్తాలిజుష్టం కుముదవాయునా॥9576॥

34.23 (ఇరువది మూడవ శ్లోకము)

జగతుః సర్వభూతానాం మనఃశ్రవణమంగలమ్|

తౌ కల్పయంతౌ యుగపత్స్వరమండలమూర్చ్ఛితమ్॥9577॥

ఆ రాత్రి ప్రారంభసమయమున ఆకసమునందు చుక్కలు మిలమిలలాడుచుండెను. చంద్రుడు ఆహ్లాదమును గూర్చుచు ఉదయించెను. తుమ్మెదలు మల్లెపూల పరిమళములను ఆస్వాదించుచు పరవశించి పోవుచుండెను. జలాశయముల యందు చక్కగా వికసించిన కలువలమీదుగా వీచుచున్న మందమారుతములు అంతటను సువాసనలను వ్యాపింపజేయుచుండెను. అట్టి సంధ్యాసమయమును ప్రశంసించుచు బలరామకృష్ణులు గానము చేయుచుండిరి. ఒకే సమయమున షడ్జాది స్వరమూర్ఛనలతో (ఆరోహణ - అవరోహణక్రమములో) కొనసాగుచున్న వారి రాగాలాపనములు సకలప్రాణుల మనస్సులకు ఆహ్లాదమును గూర్చుచు వీనులవిందొనర్చుచుండెను.

34.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

గోప్యస్తద్గీతమాకర్ణ్య మూర్చ్ఛితా నావిదన్ నృప|

స్రంసద్దుకూలమాత్మానం స్రస్తకేశస్రజం తతః॥9578॥

మహారాజా! గోపికలు వారి మధురగానములు చెవులకు సోకినంతనే పారవశ్యమున తమ్ము తాము మఱచిపోవుచుండిరి. ఆ ఆనందములో సడలిపోవుచున్న పట్టువస్త్రములను, కొప్పులనుండి జారిపోవుచున్న పూలమాలలను గమనింప లేకుండిరి...

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[05:30, 26/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

796వ నామ మంత్రము 26.01.2021

ఓం కామరూపిణ్యై నమః

కామేశ్వరుని రూపమే తన రూపముగా విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.

ఏరూపాన్ని ఊహించుకుంటాడో ఆరూపంలోనే సాధకుని మనోనేత్రాలలో దర్శనమిచ్చే జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి కామరూపిణీ యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం కామరూపిణ్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు,  ఏరూపంలో ఆరాధిస్తే ఆ రూపంలో వారి మనో నేత్రములకు దర్శనమిచ్చి కృతార్థులను చేయును.

పరమేశ్వరునికి ఒకరూపం అంటూ ఏదీ లేని నిర్గుణ స్వరూపుడు. ఆయనను ఏరూపములోనైనా చూడాలనుకుంటే అమ్మవారి ద్వారానే సాధ్యమౌతుంది. పరమేశ్వరుడు ఏరూపంలో కోరితే ఆ రూపంలో కనిపిస్తాడు గనుక కామేశ్వరుడైనాడు. కామేశ్వరుని పత్ని పరమేశ్వరి కామేశ్వరి అయినది. తన భర్త ఏరూపంలో ఉంటే తనూ అదే రూపంలో ఉండగలదు గనుక కామరూపిణీ అయినది.

ఒకసారి మూకాసురుడు అనే రాక్షసుడు వరాహ రూపంలో తిరుగుతుంటాడు. అది ఒకసారి అర్జునుణ్ణి చూసి మీదకు దూసుకురాబోతుంది. అప్పుడు శివుడు ఎరుకలివాని రూపంలో అక్కడికి వస్తాడు. అమ్మవారు కూడా ఎరుకతెగా శివుని వెంట వస్తుంది. అర్జునుడు మరియు ఎరుకలివాని రూపంలో ఉన్న శివుడు ఇద్దరూ కలిసి ఆ వరాహం పైకి ఒకేసారి బాణం వేస్తారు. అది చనిపోతుంది. అయితే ఎవరు బాణం ముందు వేశారో సందిగ్ధం మొదలౌతుంది. చివరకు వివాదంగా మారి యుద్ధానికి దారితీస్తుంది. ఆ యుద్ధంలో ఎంతసేపైనా అర్జునుడు ఎరుకలివాని రూపంలో ఉన్న పరమేశ్వరుడిని ఓడించలేక పోతాడు. ఎరుకతె రూపంలో ఉన్న అమ్మవారు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది. అప్పుడు అర్జునుఢు తాను ఎదురించినది శివుడే అని తెలుసుకుని,  తన తప్పు గ్రహించి శివుణ్ణి శరణు వేడుకుంటాడు. శివుడు అతని పరాక్రమానికి మెచ్చి చాలా శక్తివంతమైన పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు.  అక్కడ పరమేశ్వరుడు ఎరుకలివాడైతే, పరమేశ్వరి కూడా తన భర్తమాదిరిగానే ఎరుకతె అయింది. 

కాశీలో విశ్వేశ్వరునికి విశాలాక్షిగా, శ్రీకాళహస్తి లో వాయులింగేశ్వరునికి  జ్ఞానప్రసూనాంబగా, దక్షారామంలో (ద్రాక్షారామంలో) భీమేశ్వరునికి మాణిక్యాంబగా, శ్రీశైలంలో మల్లికార్జునునికి భ్రమరాంబగా వివిధ రూపాలలో కామేశ్వరుడైన పరమేశ్వరునికి కామేశ్వరియైనది జగన్మాత. గనుకనే కామరూపిణీ యని అనబడినది. 

అమ్మవారు మహాచతుష్షష్టికోటియోగినులచే సేవింపబడుతూ, చతుష్షష్టికోటియోగినుల రూపాలలో      విరాజిల్లినది. శ్రీలలితా సహస్రనామావళి యందు ఒక్కొక్క నామ మంత్రమునకూ ఒక్కొక్క రూపంలో భక్తుల మనోనేత్రములలో దర్శనమిచ్చుచున్నది గనుక కామరూపిణీ  యని అనబడినది. సప్తకోటి మంత్రములందు ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క రూపాన్ని దర్శింపజేయగలది గనుకనే పరమేశ్వరి కామరూపిణీ యని అనబడినది. ఊరు ఊరికీ ఒక్కొక్క గ్రామదేవతగా, వనము వనమునకూ ఒక్కొక్క వనదేవతగా,    కొండకొండకూ కొండంత అండయైన కొండదేవతగా ఒకటేమిటీ విశ్వమంతయూ నిండిన విరాడ్రూపిణి గనుకనే కామరూపిణీ యని అనబడినది. 

అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం కామరూపిణ్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:30, 26/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

222వ నామ మంత్రము 26.01.2021

ఓం మహాబలాయై నమః

మంత్రబలము, యంత్రబలము, తంత్రబలము, సైన్యబలము మొదలైన బలములతో మహాబలగా విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాబలా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మహాబలాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తితత్పరతతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులు జగన్మాతయొక్క అనుగ్రహబలముతో సర్వార్థసిద్ధిని పొందెదరు.

బల అను శబ్దమునకు చాలా అర్థములు గలవు. గంధము, రసము, రూపము, ఆత్మ, లావు, సేన అని అర్థములు చెప్పబడినవి. బలము అను శబ్దమునకు కాకి అనికూడా అర్థము గలదు. 

భుసండుడు అను వాయసము (కాకి) వశిష్ఠునితో ఇట్లు చెప్పినదని యోగవాసిష్ఠమందు చెప్పబడినది. అది ఏమిటంటే "ఓ వశిష్ఠమహర్షీ! మేము చండునికుమారులమైన ఇరువదియొక్క (21) కాకులము. భగవతియగు బ్రాహ్మీదేవిని చిరకాలము ఆరాధించితిమి. అప్పుడు ఆ తల్లి మమ్ములను కరుణించి ముక్తిని ప్రసాదించినది. అనగా భుసండాది వాయసము(బలము)లకు అనుగ్రహించినది" ఆ విధముగా బ్రాహ్మీరూపిణియైన జగన్మాత వాయసము(బలము) లకు ముక్తిని ప్రసాదించినది గనుక  మహాబలా యని అనబడినది.

జగన్మాత బలవంతులకే బలమైనది. తపోబలంగల వారు, యోగబలం గలవారు,  అంగబలం గలవారు, సైన్యబలం గలవారు, ఐశ్వర్యబలం గలవారు, చతుష్షష్టి కళల బలంగల వారు - ఇలా ఎంత మంది ఎన్నివిధాలైన బలంగలవారైనను, అట్టివారు అమ్మవారిలో గల ఆ బలముల సమిష్టి బలముముందు వారు ఏమియు కానేరరు. గనుకనే అమ్మవారు మహాబలా యని అనబడినది.

జగన్మాత ఐదువందల డెబ్బదియారు కోట్లమంది  యోగినులచే (మహాచతుష్షష్టికోటియోగినీ గణసేవిత) సేవింపబడుచున్నది గనుక మహాబలా యని అనబడినది.

సంపత్కరి, అశ్వారూఢ,శ్యామలా మొదలైన పదహారుగురు మంత్రిణులు, నిత్యాదేవతలు, జ్వాలామాలిని వంటి అగ్నిపుత్రికలు, వారాహి, బాలాత్రిపురసుందరి, చక్రరాజరథము, గేయచక్రరథము, కిరిచక్రరథము, మహాగణేశ్వరుడు, సప్తకోటి మంత్రయుత శస్త్రములు, తన చేతిపదివ్రేళ్ళ గోళ్ళ సందులనుండి వెడలివచ్చిన నారాయణుని దశావతారములు, కామేశ్వరాస్త్రము, మహాపాశుపతాస్త్రము వంటి సైన్యబలము, అస్త్రశస్త్ర, మంత్ర, యంత్ర, తంత్ర బలముతో మహాశక్తిమంతురాలైన జగన్మాత మహాబలా యని అనబడినది.

అట్టి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహాబలాయై నమః అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:30, 26/01/2021] +91 95058 13235: 26.1.2021  ప్రాతఃకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది నాలుగవ అధ్యాయము

సుదర్శనుడను గంధర్వునకు శాపవిమోచనము - కుభేరభటుడైన శంఖచూడునకు మోక్షప్రాప్తి

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

34.25 (ఇరువది ఐదవ శ్లోకము)

ఏవం విక్రీడతోః స్వైరం గాయతోః సంప్రమత్తవత్|

శంఖచూడ ఇతి ఖ్యాతో ధనదానుచరోఽభ్యగాత్॥9579॥

ఇట్లు బలరామకృష్ణులు స్వేచ్ఛగా విహరించుచు, పరవశులై గానము చేయుచుండిరి. ఇంతలో కుబేరుని అనుచరుడైన శంఖచూడుడు అను యక్షుడు అచ్చటికి వచ్చెను.

34.26 (ఇరువది ఏడవ శ్లోకము)

తయోర్నిరీక్షతో రాజంస్తన్నాథం ప్రమదాజనమ్|

క్రోశంతం కాలయామాస దిశ్యుదీచ్యామశంకితః॥9580॥

34.27 (ఇరువది ఏడవ శ్లోకము)

క్రోశంతం కృష్ణ రామేతి విలోక్య స్వపరిగ్రహమ్|

యథా గా దస్యునా గ్రస్తా భ్రాతరావన్వధావతామ్॥9581॥

పరీక్షిన్మహారాజా! ఆ శంఖచూడుడు బలరామకృష్ణులు చూచుచుండగనే, వారి రక్షణలోనున్న గోపికలను తన మాయచే హఠాత్తుగా తీసికొని బయలుదేఱెను. అప్పుడు ఆ గోపాంగనలు ఎంతగా గగ్గోలు పెట్టుచున్నను పట్టించుకొనక ఆ యక్షుడు వారిని తీసికొనిపోసాగెను. పులిబాఱిన పడిన గోవులవలె యక్షుని చేతికిచిక్కిన ఆ గోపికలు 'కృష్ణా! బలరామా! రక్షింపుడు, రక్షింపుడు' అని ఎంతగానో మొఱపెట్టుకొనుచుండిరి.అంతట ఆ సోదరులు తమ ఆత్మీయులను ఎత్తుకొనిపోవుచున్న శంఖచూడుడు జూచి, అతని వెంటబడిరి.

34.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

మా భైష్టేత్యభయారావౌ శాలహస్తౌ తరస్వినౌ|

ఆసేదతుస్తం తరసా త్వరితం గుహ్యకాధమమ్॥9582॥

అప్పుడు తేజోమూర్తులైన బలరామకృష్ణులు 'భయపడకుడు, భయపడకుడు' అని అభయవచనములను పలుకుచు, మద్దిచెట్లను చేబూని అతివేగముగా వెంబడించి, ఆ యక్షాధమునిపై ఒక్కక్షణములో దాడిచేసిరి.

34.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

స వీక్ష్య తావనుప్రాప్తౌ కాలమృత్యూ ఇవోద్విజన్|

విసృజ్య స్త్రీజనం మూఢః ప్రాద్రవజ్జీవితేచ్ఛయా॥9583॥

అంతట కాలమృత్యువుల వలె వెంటాడుచు తనమీదికి విజృంభించి వచ్చుచున్న ఆ మహావీరులను గాంచినంతనే శంఖచూడుడు గడగడ వణికిపోసాగెను. అప్పుడు ఆ మూర్ఖుడు శరణుజొచ్చినచో వారు తనను క్షమింతురని తెలియక వెంటనే ఆ గోపికలను విడిచిపెట్టి 'బ్రతుకు జీవుడా!' యనుచు పిక్కబలము చూపెను.

34.30 (ముప్పదియవ శ్లోకము)

తమన్వధావద్గోవిందో యత్ర యత్ర స ధావతి|

జిహీర్షుస్తచ్ఛిరోరత్నం తస్థౌ రక్షన్ స్త్రియో బలః॥9584॥

దిక్కుతోచనిస్థితిలో ఆ యక్షుడు ఎటు పరుగిడుచున్నను విడిచిపెట్టక, శ్రీకృష్ణుడు అతనిని వెంటాడుచుండెను. అతనిని వధించి, అతని శిరోరత్నమును వశపఱచుకొనదలచెను. కాని బలరాముడు మాత్రము గోపవనితల రక్షణకై వారికడనే నిలిచిపోయెను.

34.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

అవిదూర ఇవాభ్యేత్య శిరస్తస్య దురాత్మనః|

జహార ముష్టినైవాంగ సహచూడామణిం విభుః॥9585॥

34.32 (ముప్పది రెండవ శ్లోకము)

శంఖచూడం నిహత్యైవం మణిమాదాయ భాస్వరమ్|

అగ్రజాయాదదాత్ప్రీత్యా పశ్యంతీనాం చ యోషితామ్॥9586॥

పరీక్షిన్మహారాజా!  కొంతదూరము వెళ్ళిన పిదప కృష్ణప్రభువు అతనిని ఎదుర్కొనెను. చూడామణితో ఒప్పుచున్న ఆ దుర్మార్గుని తలపై బలిష్ఠమైన తన పిడికిలితో చావుదెబ్బ తీసెను. ఆ దెబ్బతో శంఖచూడుడు అసువులను కోల్పోయెను. పిమ్మట శ్రీకృష్ణుడు తళతళ మెఱయుచున్న అతని శిరోరత్నమును తీసికొనివచ్చి గోపికలు అందఱును చూచుచుండగా తన యన్నయగు బలరామునకు ప్రేమతో అప్పగించెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే శంఖచూడవధో నామ చతుస్త్రింశోఽధ్యాయః (34)

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి సుదర్శనుడను గంధర్వునకు శాపవిమోచనము - కుభేరభటుడైన శంఖచూడునకు మోక్షప్రాప్తి యను ముప్పది నాలుగవ అధ్యాయము (34)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:58, 26/01/2021] +91 95058 13235: 26.1.2021  సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఐదవ అధ్యాయము

గోపికాయుగళ గీతము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

35.1 (ప్రథమ శ్లోకము)

గోప్యః కృష్ణే వనం యాతే తమనుద్రుతచేతసః|

కృష్ణలీలాః ప్రగాయంత్యో నిన్యుర్దుఃఖేన వాసరాన్॥9587॥

శ్రీశుకుడు పలికెను పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు ఆవులను మేపుటకై వనమునకు వెళ్ళుచున్నప్పుడు, ఆయనవెంట గోపికల చిత్తముకూడా వెళ్ళిపోయెడిది. శ్రీకృష్ణుని యెడబాటునకు ఓర్చుకొనలేక వారు  ఆ పరమపురుషుని లీలావైభవములను కీర్తించుచు అతికష్టముమీద దినములను వెళ్ళబుచ్చుచుండిరి.

గోప్య ఊచుః

35.2 (రెండవ శ్లోకము)

వామబాహుకృతవామకపోలో  వల్గితభ్రురధరార్పితవేణుమ్|

కోమలాంగులిభిరాశ్రితమార్గం  గోప్య ఈరయతి యత్ర ముకుందః॥9588॥

35.3 (మూడవ శ్లోకము)

వ్యోమయానవనితాః సహసిద్ధైర్విస్మితాస్తదుపధార్య సలజ్జాః|

కామమార్గణసమర్పితచిత్తాః  కశ్మలం యయురపస్మృతనీవ్యః॥9589॥

గోపికలు పరస్పరము ఇట్లనుకొనిరి "చెలులారా! శ్రీకృష్ణప్రభువు తనను సేవించువారికి (ప్రియమైనవారికి) ప్రేమానురాగములను పంచియిచ్చెడి మహాత్ముడు. అంతేగాదు ఆ పురుషోత్తముడు తనను ద్వేషించువారికిని మోక్షమును ప్రసాదించుచుండెడి ఉదారుడు. ఆ స్వామి తన ఎడమచేతిపై ఎడమ చెక్కిలిని ఆనించి, చూడముచ్చట గొలిపెడి కనుబొమలను విలాసముగా త్రిప్పుచు, అధరముపై మురళిని చేర్చి, సుకుమారములైన తన వ్రేళ్ళను వేణురంధ్రములపై ఒయ్యారముగా కదల్చుచు మధురముగా గానమొనర్చుచుండెడివాడు. ఆ సమయమున ఆకాశమున విమానములలో తమ భర్తలతోగూడి విహరించుచుండెడి సిద్ధాంగనలు ఆ గానమాధుర్యము చెవులు సోకినంతనే ఆశ్చర్యపడుచు, మైమఱచిపోవుచుండిరి. పతులు ప్రక్కనే యుండుటవలన తమ పారవశ్యములకు బిడియపడుచుండిరి. అంతట తమ చిత్తములు ఆ ప్రభువును చేరుకొను   ఇచ్ఛకు లోనగుటచే వారు తమ నీవీ బంధములు సడలిపోవుచున్న సంగతినే ఎఱుంగక మోహమున మునుగుచుండిరి.

35.4 (నాలుగవ శ్లోకము)

హంత చిత్రమబలాః శృణుతేదం హారహాస ఉరసి స్థిరవిద్యుత్|

నందసూనురయమార్తజనానాం  నర్మదో యర్హి కూజితవేణుః॥9590॥

35.5 (ఐదవ శ్లోకము)

వృందశో వ్రజవృషా మృగగావో  వేణువాద్యహృతచేతస ఆరాత్|

దంతదష్టకవలా ధృతకర్ణా  నిద్రితా లిఖితచిత్రమివాసన్॥9591॥

అబలలారా! ఆశ్చర్యకరమైన ఈ విషయమును వినుడు. ఆ స్వామి దరహాసకాంతులు హారములవలె విలసిల్లుచు ఆహ్లాదకరముగా నుండును. ఆ శ్యామసుందరుని వక్షస్థలమున భాసిల్లెడి శ్రీవత్సశోభలు నల్లని మేఘముపై కాంతులీను చుండెడి మెఱుపుతీగలవలె తేజరిల్లుచుండును. ఆ ప్రభువుయొక్క వేణునాదమధురిమలు ఆర్తజనులకు హాయిని గూర్చుచుండును. అచట గుంపులు గుంపులుగా నున్న  వృషభములు, గోవులు, మృగములు (లేళ్ళు), శ్రావ్యమైన ఆ మురళీరవములను చెవులప్పగించి వినుచు మైమఱచి పోవుచుండును. ఆ స్థితిలో అవి నోటగఱచుకొని యున్న గడ్డిపరకలను నమలుటయే మఱచిపోవుచుండును. నిక్కపొడుచుకొనియున్న చెవులతో ఒప్పెడి ఆ జంతువులు నిద్రించుచున్నవా? లేక చిత్రకారుడు వ్రాసిన చిత్తరువా? అనునట్లు, అలరారుచుండును.

35.6 (ఆరవ శ్లోకము)

బర్హిణస్తబకధాతుపలాశైర్బద్ధమల్లపరిబర్హవిడంబః|

కర్హిచిత్సబల ఆలి సగోపైర్గాః  సమాహ్వయతి యత్ర ముకుందః॥9592॥

35.7 (ఏడవ శ్లోకము)

తర్హి భగ్నగతయః సరితో వై  తత్పదాంబుజరజోఽనిలనీతమ్|

స్పృహయతీర్వయమివాబహుపుణ్యాః ప్రేమవేపితభుజాః స్తిమితాపః॥9593॥

ఓ సఖీ! నందయశోదల ముద్దులపట్టియైన శ్రీకృష్ణుడు శిరస్సుపై నెమలి పింఛములను, ముంగురులపై పూలగుత్తులను ధరించి, సర్వాంగముల యందును గైరికాదిధాతు లేపనములతోను, నవపల్లవములతోను అలంకృతుడై ఒక మల్లయోధునివలె ఒప్ఫుచుండును. అట్టితరి ఆ స్వామి బలరామునితోను, గోపాలురతోను గూడి తన వేణుగానము ద్వారా గోవులను పేరుపేరునను ఆహ్వానించుచుండును. ఆ సమయమున అచేతనములైన నదులు సైతము ఆ మురళీరవ మాధుర్యములను ఆస్వాదించుచు ఆగిపోవుచుండును. మఱియును పవిత్రములైన ఆ ప్రభువుయొక్క పాదధూళులు గాలులకు కొట్టుకొనివచ్చి, తమకు తత్స్పర్శభాగ్యమును కలిగించునని ఆశపడుచుండును సుమా! కాని,  ఆ నదులుగూడ మనవలె అల్పభాగ్యముగలవై యున్నట్లు తోచుచున్నది. అట్లే నదులయొక్క తరంగములనెడి భుజములు కదలుచున్నను అవి ప్రేమవశమున నిశ్చలముగా ఉండిపోవును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[06:08, 27/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

797వ నామ మంత్రము 27.01.2021

ఓం కళానిధయే నమః

సకల కళలకు నిధియైనది. ప్రసన్నమైన వెన్నెలలు విరజిమ్మే చంద్రబింబ స్వరూపురాలు  అయిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి కళానిధిః యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం కళానిధయే నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగన్మాతను ఆరాధించు భక్తులకు ఆ అమ్మవారు సకలకళాసిద్ధియు, సర్వార్థసిద్ధియు అనుగ్రహించును.

పరమేశ్వరి చతుష్షష్టికళామయి  అని 236వ నామములో అనబడినది.  అరువదినాలుగు కళలస్వరూపిణి.

కళలు విద్యాకళలు మరియు వృత్తికళలు అని రెండు విధములుగా ఉన్నవి. శార్గ్ఙధరీయమునందు, కథాకోశమునందు, శ్రీధరీయమందు, లక్ష్మీపీఠికయందును చతుష్షష్టికళలను విభిన్నముగా చెప్పారు. వాటిని పరిశీలించి  సౌభాగ్యభాస్కరంలో ఈయబడిన ప్రకారం వివరాలు సేకరించి చూపబడినది.

1. ఆన్వీక్షకి (ఇందు విజ్ఞానము తెలుపబడును), 2. త్రయి (ఇందు ధర్మాధర్మములు తెలుపబడును), 3. వార్త (ఇందు అర్థానర్థములు తెలుపబడును), 4. దండనీతి (ఇందు నయానయములు తెలుపబడును), 5. ఆకర్షణము, 6. స్తంభనము, 7. మారణము, 8. విద్వేషము, 9. ఉచ్చాటనము, 10. మోహనము, 11. ఋగ్వేదము, 12. యజుర్వేదము, 13. సామవేదము, 14. అధర్వణవేదము, 15. శిక్ష, 16. వ్యాకరణము, 17. ఛందస్సు, 18. నిరుక్తము, 19. జ్యోతిషము, 20. కల్పము, 21. మీమాంస, 22. న్యాయము, 23. పురాణము, 24. ధర్మశాస్త్రము, 25. ఆయుర్వేదము, 26. ధనుర్వేదము,  27. నీతిశాస్త్రము,  28. అర్ధశాస్త్రము, 29. బ్రాహ్మము, 30. పాద్మము, 32. వైష్ణవము, 33. శైవము, 34. భాగవతము, 35. నారదీయము, 36. మార్కండేయము, 37. ఆగ్నేయము, 38. బ్రహ్మవైవర్తము, 39. లైంగము, 40. వారాహము, 41. స్కాందము, 42. గారుడము, 43. వామనము, 44. కూర్మము, 45. మాత్స్యము, 46. బ్రహ్మ, 47. సనత్కుమారము, 48. నారసింహము, 49. స్కాందము, 50. శివధర్మము, 51. దౌర్యసము, 52. నారదీయము, 53. కాపిలము, 54. మానవము, 55. ఔశనము, 56. బ్రహ్మాండము, 57. వారుణము, 58. కౌశికము, 59. లైంగము,60. సాంబము,  61. సౌరము, 62.పారాశరము, 63. మారీచము, 64. భార్గవము. 

 ఆ కళలకు గనియైనది. గనుకనే కళానిధీ యని అనబడినది. ఆత్మయే పదునారవ కళ యని బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడినది. ఇక్కడ చెప్పినట్లు ఆత్మయనగా జీవుడు. జీవులందరికి  నిధి అనగా జీవులందరియందు ఆ తల్లి ఉన్నది. అందుచేతనే కళానిధిః అని యనబడినది. పరమేశ్వరి షోడశకళాప్రపూర్ణుడైన చంద్రుని రూపం గలిగినది. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం కళానిధయే నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[06:08, 27/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

223వ నామ మంత్రము 27.01.2021

ఓం మహాబుద్ధ్యై నమః

ఏ బుద్ధి ఉదయించిన తరువాత, వేరొకటి ఉండక అంతయు తెలిసియుండునో,  అదియే మహాబుద్ధి యనబడును. అటువంటి మహాబుద్ధితో తేజరిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాబుద్ధిః అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మహాబద్ధ్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి ప్రపత్తులతో ఆరాధించు భక్తుల బుద్ధిని ఆ పరమేశ్వరి మళ్ళించి పునర్జన్మరాహిత్యమైన కైవల్యమును పొందదగు అర్హతలదిశగా నడిపించును.

ఏ బుద్ధి ఉదయించిన తరువాత సాధకుడు వేరింకేమియు తెలియవలసినది లేక, అంతయూ తెలిసియున్న స్థితిచేకూరి యుండునో, అట్టిస్థితినే మహాబుద్ధి యని అందురు. జగన్మాత అటువంటి స్థితిలోనే ఉంటుంది గనుక మహాబుద్ధిః అని యనబడినది. 

మహతీ చ సా బుద్ధిశ్చ మహాబుద్ధిః (సౌభాగ్యభాస్కరం, 398వ పుట)

యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం స్యాత్ (సౌభాగ్యభాస్కరం, 398వ పుట)

ఏది అయితే తెలిసియుండిన అంతయు తెలిసిన స్థితి ఉండునో అదియే మహాబుద్ధి అని వేదములో కూడా చెప్పబడినది. 

చరాచర జగత్తులో

పిపీలి కాది బ్రహ్మపర్యంతమూ వున్నటువంటి సమస్త పదవులు, సమస్త శరీరములు, సమస్త వ్యవహారములు, సమస్త భోగములు సమస్త అనుచానమైనటువంటి సాంప్రదాయక విధానములన్నీ, సమస్త అధిష్ఠాన పద్ధతులన్నీ, అధిష్ఠాన ఆశ్రయ పద్ధతిగా వున్న సమస్త వ్యవహారమునంతటిని, పిపీలికాది బ్రహ్మపర్యంతమూ ఎవరైతే కాదనుకోగలుగుతారో, ఎవరైతే నిరసించగలుగుతారో, ఎవరైతే తనకు అవసరం లేనివిగా గుర్తిస్తారో, ఎవరైతే అశాశ్వతముగా గుర్తిస్తారో, ఎవరైతే పరిణమించేవిగా గుర్తిస్తోరో, ఎవరైతే నిరంతరాయముగా చలనశీలమై ఉన్నట్లుగా వీటిని గుర్తించగలుగుతారో, ఎవరైతే అస్థిరమని గుర్తించగలుగుతారో వాళ్ళు మాత్రమే ఆత్మనిష్ఠులు, బ్రహ్మనిష్ఠులు అయ్యేటటువంటి అవకాశం వుంది. పరబ్రహ్మమును తెలియుండే  అవకాశం వుంది.   అటు వంటి పరబ్రహ్మమును తెలిసియుంటే ఇంక తెలియవలసినది వేరేమియు ఉండదు. ఇటువంటి స్థితిని మహాబుద్ధి యని అందురు. జగన్మాత సదా అదే స్థితిలో ఉంటుంది గనుక మహాబుద్ధిః అని అనబడినది. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహాబుద్ధ్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[[27/01, 06:08] +91 95058 13235: *27.1.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఐదవ అధ్యాయము*

*గోపికాయుగళ గీతము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*35.8 (ఎనిమిదవ శ్లోకము)*

*అనుచరైః సమనువర్ణితవీర్య  ఆదిపూరుష ఇవాచలభూతిః|*

*వనచరో గిరితటేషు చరంతీర్వేణునాఽఽహ్వయతి గాః స యదా హి॥9594॥*

*35.9 (తొమ్మిదవ శ్లోకము)*

*వనలతాస్తరవ ఆత్మని విష్ణుం  వ్యంజయంత్య ఇవ పుష్పఫలాఢ్యాః|*

*ప్రణతభారవిటపా మధుధారాః ప్రేమహృష్టతనవః ససృజుః స్మ॥9595॥*

లక్ష్మీదేవితోగూడి సంతోషముతో నున్న  శ్రీమహావిష్ణువు యొక్క పరాక్రమవైభవములను దేవతలు కీర్తించుచుందురు. అట్లేస్థిరమైన అపారసంపదలతో ఒప్పుచున్న శ్రీకృష్ణప్రభువుయొక్క పరాక్రమ వైభవములను ఆయనయొక్క అనుచరులైన గోపాలురు కొనియాడుచుందురు. వనమునందు సంచరించుచున్న శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పరిసరముల యందు మేయుచున్న గోవులను తన వేణునాదముద్వారా పేరు పేరునా పిలుచుచుండును. ఆ సమయమున వనమున వృక్షములు పుష్పఫలభరితములై యుండును. వాటి బరువుచే ఆ చెట్లకొమ్మలు తలలు వంచి శ్రీకృష్ణునకు ప్రణమిల్లుచున్నవా? అనునట్లు భూమిని తాకుచుండును. సర్వవ్యాపకుడైన శ్రీమహావిష్ణువు తమలో ఉన్నట్లు ప్రకటించుచు అవి ప్రేమానురాగములతో పొంగిపోవుచు, ఆ పరమాత్మునకు మకరందధారలను అర్పించుచుండును. నిజముగా వాటి భాగ్యమే భాగ్యము. స్థావరములు సైతము శ్రీకృష్ణుని మధురగానమునకు పరమానందమును పొందుచుండుట విచిత్ర విషయము కదా!

*35.10 (పదియవ శ్లోకము)*

*దర్శనీయతిలకో వనమాలాదివ్యగంధతులసీమధుమత్తైః|*

*అలికులైరలఘుగీతమభీష్టమాద్రియన్ యర్హి సంధితవేణుః॥9596॥*

*35.11 (పదకొండవ శ్లోకము)*

*సరసి సారసహంసవిహంగాశ్చారుగీతహృతచేతస ఏత్య|*

*హరిముపాసత తే యతచిత్తా హంత మీలితదృశో ధృతమౌనాః॥9597॥*

ఓ సఖీ! శ్రీకృష్ణుడు సౌందర్యనిధి. అందగాళ్ళలో మేటి అందగాడైన ఆ స్వామి ధరించిన వనమాలయందలి తులసీదళ దివ్యపరిమళములకు ఆకర్షితములై, వాటి మకరందములను ఆస్వాదించి, తుమ్మెదలు మత్తిల్లియుండును. వాటి అమృత ఝంకారములను ఆదరించుచు, ఆ ప్రభువు వేణువును తన అధరమున చేర్చి,  వాటి నాదమున తన గానమును మేళవించుచు ఆనందించుచుండును. అప్పుడు సరస్సునందలి సారసములు (బెగ్గురు పక్షులు), హంసలు మొదలగు పక్షులు మనోహరమైన ఆ మురళీరవములకు మైమఱచి పోవుచుండును. మఱియు అవి ఆ పురుషోత్తముని సమీపించి, కనులు  మూసికొని, మౌనముగా ఏకాగ్రచిత్తముతో ఆయనను సేవించుచుండును. ఇది ఎంతటి అద్భుతవిషయముకదా!

*35.12 (పండ్రెండవ శ్లోకము)*

*సహబలః స్రగవతంసవిలాసఃసానుషు  క్షితిభృతో వ్రజదేవ్యః|*

*హర్షయన్ యర్హి వేణురవేణ  జాతహర్ష ఉపరంభతి విశ్వమ్॥9598॥*

*35.13  (పదమూడవ శ్లోకము)*

*మహదతిక్రమణశంకితచేతా  మందమందమనుగర్జతి మేఘః|*

*సుహృదమభ్యవర్షత్సుమనోభిశ్ఛాయయా చ విదధత్ప్రతపత్రమ్॥9599॥*

ఓ సఖీ! పూవులను శ్రవణాభరణములుగా (కుండలములుగా) ధరించి, శోభిల్లుచున్న శ్రీకృష్ణుడు బలరామునితోగూడి యున్నవాడై, గోవర్ధనగిరి సానవులయందు నిలిచి, తన వేణుగానముతో విశ్వమునే పులకింపజేయుచుండును. ఆ ప్రభువు మిక్కిలి హర్షముతో తన వేణుగానముద్వారా ఆనందింపజేయుచు విశ్వమును అంతయును కౌగిలించుకొనుచుండును. ఆ సమయమున మేఘము తన సఖుడైన శ్రీకృష్ణునియొక్క వేణురవముకంటెను బిగ్గరగా ధ్వని చేసినచో ఆ స్వామిని అతిక్రమించినట్లగుననియు, అట్లొనర్చుట అపరాధమనియు భావించుచు అది చిన్న చిన్నగా ఆయన స్వరమున తన రవమును మేళవించుచు గర్జించుచుండును. అంతేగాక, మేఘము తన సుహృదుడైన ఆ ప్రభువునకు సూర్యకిరణతాపము తాకకుండునట్లు తన నీడయును గొడుగును పట్టుచుండును. ఇంకను  తన  వర్షబిందువులనెడి పూవులను ఆయనపై చల్లుచుండును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[27/01, 21:58] +91 95058 13235: *27.1.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఐదవ అధ్యాయము*

*గోపికాయుగళ గీతము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*35.14 (పదునాలుగవ శ్లోకము)*

*వివిధగోపచరణేషు విదగ్ధో  వేణువాద్య ఉరుధా నిజశిక్షాః|*

*తవ సుతః సతి యదాధరబింబే  దత్తవేణురనయత్స్వరజాతీః॥9600॥*^

*35.15 (పదునైదవ శ్లోకము)*

*సవనశస్తదుపధార్య సురేశాః  శక్రశర్వపరమేష్ఠిపురోగాః|*

*కవయ ఆనతకంధరచిత్తాః  కశ్మలం యయురనిశ్చితతత్త్వాః॥9601॥*

సాధ్వీలలామా! యశోదాదేవీ! నీ చిన్ని కుమారుడు (శ్రీకృష్ణుడు) గోపబాలురతో గూడి ఆటలాడుటలో మేటి. అతడు ఇతరులకడ అభ్యసింపకున్నను తనలో సహజముగానున్న గాన కౌశలముచే వివిధ రాగములను ఆలపించుచుండును. దొండపండువంటి తన అధరముపై వేణువును ఉంచి, మంద్ర, మధ్యమ, తారస్థాయిలలో గానాలాపన చేయుచుండును. క్రమక్రమముగా కొనసాగుచున్న ఆ వేణుగానమాధుర్యమును ఆస్వాదించిన పరమశివుడు, బ్రహ్మ,  ఇంద్రుడు మొదలగు దేవతలు సంగీత నిపుణులేయైనను ఆ గాన కళావైభవములను వర్ణింపజాలకుందురు. అంతటవారు అవనతముఖులై ఇంతటి మాధుర్యరసామృతముతో నిండిన గానము వినిపించెడు ఈ తత్త్వము ఏమైయుండునో అని వ్యామోహమునకు గురియై అబ్బురపడుచుండిరి.

*35.16 (పదహారవ శ్లోకము)*

*నిజపదాబ్జదలైర్ధ్వజవజ్రనీరజాంకుశవిచిత్రలలామైః|*

*వ్రజభువః శమయన్ ఖురతోదం  వర్ష్మధుర్యగతిరీడితవేణుః॥9602॥*

*35.17 (పదిహేడవ శ్లోకము)*

*వ్రజతి తేన వయం సవిలాస  వీక్షణార్పితమనోభవవేగాః|*

*కుజగతిం గమితా న విదామః  కశ్మలేన కబరం వసనం వా॥9603॥*

ఓ  చెలియా! పద్మదళముల వలె మృదుమనోహరములైన శ్రీకృష్ణుని పాదములయందు ధ్వజము, వజ్రము, కమలము, అంకుశము మొదలగు విచిత్ర చిహ్నములు అలరారుచుండును. వ్రజభూమి అంతయు గోవుల గిట్టలతో త్రొక్కబడి గుంతలు గుంతలుగా నుండును. ఆ స్థితిలో సుకుమారములైన తన చరణములకు నొప్పి కలుగకుండా ఆ స్వామి గజమువలె తిన్నగా నడచుచు మనోజ్ఞముగా వేణువును ఊదుచుండును. ఆ ప్రభువుయొక్క మురళీనాద మధురిమలను, విలాసవీక్షణములను సుందర గమనములను స్మరించుకొనుచు మన హృదయములు ప్రేమార్ధ్రములగుచుండును, ఆ పరమపురుషుని పొందునకై ఆకాంక్షించుచు మనము వృక్షములవలె చేష్టలుడిగి యుందుము. ఆ తన్మయత్వములో (ఆ మోహములో) మన కొప్పులు జాఱిపోవుచుండుటగాని, వస్త్రముల ముడులు సడలిపోవుచుండుటగాని మనకు తెలియ రాకుండెను.

*35.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*మణిధరః క్వచిదాగణయన్ గా  మాలయా దయిత గంధతులస్యాః|*

*ప్రణయినోఽనుచరస్య కదాంసే  ప్రక్షిపన్ భుజమగాయత యత్ర॥9604॥*

*35.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*క్వణితవేణురవవంచితచిత్తాఃకృష్ణమన్వసత కృష్ణగృహిణ్యః|*

*గుణగణార్ణమనుగత్య హరిణ్యో  గోపికా ఇవ విముక్తగృహాశాః॥9605॥*

ఓ సఖీ! ఆ మహాత్ముని కంఠసీమను అలంకరించిన మణిమాల నిగనిగలు అద్భుతములు.  ఆ స్వామి నిరంతరము ధరించుచుండెడి తులసీమాల పరిమళములు అపూర్వములు. శ్రీకృష్ణుడు మణిమాలద్వారా ఆవులను లెక్కించుచు, ఒక ప్రియసఖుని బుజముపై చేయివేసి, మురళీగానము ఒనర్చుచుండును. ఆ వేణుగాన మధురిమలకు ఆకర్షితములైన నల్లని జింకలు, కృష్ణునిపై మరులుగొని, తమ ఇండ్లువాకిళ్ళనే మఱచివచ్చెడి గోపికలవలె పరుగుపరుగున శ్రీకృష్ణుని చేరుచుండెడివి. అవి గుణసాగరుడైన ఆ ప్రభువును తదేకదృష్టితో దర్శించుటలో మునిగి, మఱలివెళ్ళెడి విషయమునే మఱచిపోవుచుండెడివి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[28/01, 05:44] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*798వ నామ మంత్రము* 28.01.2021

*ఓం కావ్యకళాయై నమః*

కావ్యకళా స్వరూపురాలు, కావ్యస్వరూపురాలు మరియు శుక్రాచార్యుని మృతసంజీవినీ కళాస్వరూపురాలు అయిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కావ్యకళా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం కావ్యకళాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి సుఖసంతోషములను ప్రసాదించును. వృత్తి, వ్యాపారములందు నైపుణ్యమును ప్రసాదించును. 

చతుష్షష్టి కళలలో కవిత్వముకూడా ఒక కళ. శ్రీమాత చతుష్షష్టికళారూపిణి గనుక *కావ్యకళా* యని అనబడినది. 

కావ్యకళలో ప్రవేశము ఉన్నవారిని కవులు అంటారు. 

కావ్యములు ముఖ్యంగా మూడురకాలు. 1. వేదములు, 2. పురాణాలు, 3. కావ్యాలు.

*వేదములు* ఇవి కేవలం భగవంతుడు నిర్దేశించిన శాసనం వంటిది. వేదములు సకలశాస్త్రములను, సకల ధర్మములను, ప్రత్యేకముగా భగవంతుని మాటగా వినిపింప బడినవి.  శ్రుతులు అనబడినవి. అందరూ ఆమోదింపదగినవి. ఆచారవ్యవహారములు, భగవదారాధన, యజ్ఞయాగాది క్రతువుల నిర్వహణక్రమములు వేదముల నుండే గ్రహింపదగును. 

*పురాణములు* వేదములలో చెప్పబడిన విషయములు, వేదవిహితములైన ధర్మములను బోధించుచూ, దైవసంబంధమైన, క్షేత్రసంబంధమైన, చారిత్రకసంబంధమైన విషయములను కవితా ధోరణిలో పద్యగద్య మిళితముగా చేయు వివరణలు ఈ కోవలోనికి వస్తాయి.

*కావ్యములు* కవలచే వ్రాయబడిన పురాణగాథలు, ధర్మప్రధానమై, నవరసభరితమై ఉంటాయి. కొన్ని చదవడం వలన, వినుట వలన పుణ్యప్రదాతలుగా, మరల మరల వినదగిన విషయప్రధానంగా కూడా ఉంటాయి.

కావ్యాలలో దృశ్యకావ్యములు  శ్రవ్యకావ్యములు అని రెండు రకములు. 

దృశ్యకావ్యములు అనునవి నాటకములు మొదలైనవి.

శ్రవ్యకావ్యములు - వినడానికి, చదవడానికి వీలుగా ఉంటాయి.

కవిత్వము అనేది ఒక కళ. నవరసభరితముగా ఉంటుంది. మనసులను కదిలించేదిగా, ప్రబోధాత్మకముగా, మానసిక సంఘర్షణనుత్పన్నము చేసేదిగా ఉంటుంది.

ఈ కావ్యములు వ్రాయు కవులకు కేవలం కవితాపటిమయేగాక, వేదవేదాంగములయందు విశేషమైన ప్రతిభతోబాటు, తపస్సంపన్నత, భగవంతుని అనుగ్రహం కూడా ఉంటుంది. 

భారత, భాగవతములను సంస్కృతములో వ్రాసిన వ్యాసుడు మనీంద్రుడు మాత్రమేగాక భగవదంశ గలవాడు. *వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే| నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః॥*

విష్ణురూపుడైన వ్యాసునికి, వ్యాసరూపంతో ఉన్న విష్ణువునకు నమస్కారం. వసిష్ఠుని వంశంలో జన్మించిన బ్రహ్మర్షి అయిన వ్యాసునికి నమస్కారం.

వ్యాస మునీంద్రుడు సాక్షాత్‌ విష్ణు స్వరూపుడు. గురువులకే గురువు. *మునీనాం అహం వ్యాసః* అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని విభూతి యోగంలో చెప్పారు.

వ్యాసమహర్షి భారత, భాగవతములే గాక అష్టాదశపురాణములు కూడా వ్రాశాడు. 

ఇందులో దేవీభాగవతం ఒకటి.

శ్రీదేవీ భాగవత పురాణము, ఒక శాక్తేయ పురాణము. ఇది మార్కండేయ పురాణములోని దేవీ మహాత్మ్యము శక్తి ఆరాధనా సంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నది. ఇది ఒక ఉప పురాణము అని కొందరు అన్నప్పటికీ, గ్రంథంలో మాత్రం ఇది మహా పురాణము అని ఉంది.

ఈ గ్రంథములో పరాశక్తియైన శ్రీమాతయే సకల సృష్టిస్థితిలయకారిణియైన పరబ్రహ్మస్వరూపిణి అని చెప్పబడింది. ఏడవవ స్కంధంలో ముప్పది మూడవ అధ్యాయంలో దేవి విరాట్ స్వరూప వర్ణన ఉంది. ముప్పది ఐదవ, ముప్పది తొమ్మిదవ అధ్యాయాలలో శ్రీమాతను ధ్యానించే, ఆరాధించే విధములు తెలుపబడినాయి. ఇంకా అనేక పురాణ గాథలు, ఆధ్యాత్మిక తత్వాలు, భగవన్మహిమలు ఇందులో నిక్షిప్తం చేయబడినాయి. ఇది త్రిమూర్తులు చేసిన శ్రీదేవీ స్తోత్రాలతో ప్రారంభమౌతుంది.

దీని మూలం వ్యాసుడు రచించిన దేవీ భాగవతము. ఇందులో పద్దెనిమిది వేల శ్లోకాలు, పన్నెండు స్కంధాలు, మూడు వందల పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి. సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము అనే అయిదు లక్షణాలు గల మహా పురాణము.

సంస్కృతంలో వ్యాసమహర్షి వ్రాసిన మహాభారతాన్ని నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ అనువారు తెలుగులో వ్రాశారు. వీరిని కవిత్రయం అని అంటారు.

శ్రీమద్రామాయణ మహాకావ్యాన్ని వాల్మీకి వ్రాశాడు. రామాయణం వ్రాయడానికి ముందు వాల్మీకి బోయవాడు. మహర్షిగా పరివర్తన చెందిన పిదప ఆయన వ్రాసిన మొదటి శ్లోకం

*మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః|*

*యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥*

ఓ కిరాతుడా! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు.

ఎందుకంటే క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపితివి. ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం. అలా మొదలయినది రామాయణ కావ్యం సాంతం రాసేవరకూ సాగింది.

మహా భాగవతం తెలుగులో వ్రాసిన బమ్మెర పోతన శ్రీరామచంద్రుని భక్తుడు. ఆ శ్రీరామచంద్రుని ఆనతిపై  మహాభాగవతాన్ని తెలుగులో వ్రాసి అటు భక్తుడిగా, ఇటు తెలుగువారి హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోయాడు. పోతన మహాకవికి సరస్వతీ అనుగ్రహం కూడా ఉన్నది. ఆయన తన మహాభాగవత కావ్యాన్ని నరులకు అంకితమీయలేదు. సాక్షాత్తు శ్రీరామచంద్రునికే అంకితమిచ్చాడు. 

కాళిదాసు తొలుత ఒక వెర్రి గొల్ల పిల్లవాడు. అతనికి ఒక మహారాజు పుత్రికతో వివాహం జరుగుతుంది. అతడు వెర్రివాడను సంగతి ఆ రాజకుమార్తెకు తెలియదు. తెలిసికొన్న రాజకుమార్తె కాళికాదేవి భక్తురాలు. కాళికా మంత్రం భర్తకు ఉపదేశించింది. ఆ వెర్రిగొల్ల కాళీ ఉపాసనతో ఆ అమ్మవారి అనుగ్రహంపొంది సంస్కృతంలో ఒక మహాకవిగా పరివర్తన చెందుతాడు. కాళికాదేవి అనుగ్రహం పొందిన తక్షణం ఆయన నోటినుండి వెడలినదే *శ్యామలా దండకం* *అభిజ్ఞానశాకుంతలము* అను ఒక సంస్కృత ప్రబంధాన్నికూడా వ్రాశాడు కాళిదాసు.

ఇంకా అల్లసాని పెద్దన, తెనాలి రామలింగకవి, శ్రీనాథుడు వంటి మహాకవులు ఎందరో ఉన్నారు.

వీరందరూ సరస్వతీ స్వరూపిణియైన జగన్మాత అనుగ్రహం పొందినవారే! ఇంకా చెప్పాలంటే వీరిలో చాలామంది శ్రీవిద్యోపాసన చేసినవారే. అందుకే ఆ పరమేశ్వరి *కావ్యకళా* యని అన్నాము. 

అమ్మవారికి నమస్కరించునపుడు *ఓం కావ్యకళాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[28/01, 05:44] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*224వ నామ మంత్రము* 28.01.2021

*ఓం మహా సిద్ధ్యై నమః*

గొప్పవి అయిన అణిమాది అష్థసిద్ధులు కలిగి అలరారుచున్న పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహాసిద్ధిః* అను నాలగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం మహాసిద్ధ్యై నమః* అని ఉచ్చరించుచూ, భక్తిశ్రద్ధలతో ఆ జగన్మాతను ఉపాసించు సాధకునకు ఆ పరమేశ్వరి కరుణించి సకలార్థసిద్ధిని  కలుగజేసి తరింపజేయును.

సిద్ధులలో అణిమాది అష్టసిద్ధులు మరియు రసోల్లాసాది అష్టసిద్ధులు అను ఈ రెండు రకముల సిద్ధులు కలిగియున్న పరమేశ్వరి *మహాసిద్ధిః* యని అనబడినది.

*అణిమాది అష్టసిద్ధులు*

1 . *అణిమ* : యోగి తన స్థూల శరీరమును ఒక అణువుగా కూడ మారగలడు.

2. *మహిమ* యోగి తన స్థూలమును ఎంత పెద్దగానైను మార్చగలడు

3. *గరిమ* - తన బరువును పెంచుకో గలడు

4. *లఘిమ* : యోగి తన బరువు ఇష్ట పూర్వకముగా కోల్పోగలడు

5. *ప్రాప్తి* : యోగి ఎక్కడికైనా సూక్ష్మ శరీరముతో ప్రయాణించగలడు.

6. *ప్రాకామ్య* : యోగి తలిచినది అనుభవములోనికి తీసుకొనగలడు

7. *ఈశత్వ*  ప్రకృతిని శాసించగలడు

8. *వశిత్వ:* ప్రకృతి శక్తులను యోగి తన అధీనములోనికి తీసుకొనును .

*రసోల్లాసాది అష్టసిద్ధులు*

*రసానాం స్వత ఉల్లాసః ప్రథమా సిద్ధి రీరితా*

*ద్వంద్వైరనిభిభూతి శ్చ ద్వితీయా సిద్ధి రుచ్యతే*

*అధమోత్తమతాభావః తృతీయా సిద్ధి రుత్తమా*

*చతుర్థీ తుల్యతా తేషాం ఆయుషః సుఖదుఃఖయోః*

*కాంతే ర్బలస్య బాహుళ్యం విశోకా నామ పంచమీ*

*పరమాత్మపరత్వేన తపో ధ్యాననిష్ఠతా షష్ఠీ*

*నికామచరిత్వం సప్తమీ సిద్ధిరుచ్యతే* 

*అష్టమీ చ తథాప్రోక్తా యత్ర క్వచన  శాయితే* (సౌభాగ్యభాస్కరం, 399వ పుట)

1. రసోల్లాసము, 2. శీతోష్ణాదిద్వంద్వములచే బాధింపబడకుండుట, 3. అధముడు ఉత్తముడను భావము లేకుండుట, 4. సుఖదుఃఖములయందు సమాన బుద్ధి కలిగియుండుట, 5. శరీరమునందధిక బలము, కాంతి కల్గుట, దీనికే విశోకమని పేరుగలదు, 6. పరమాత్మను గూర్చియే తపో ధ్యానాదులు చేయుచు నిష్ఠ (అచంచలత్వము) తో ఉండుట, 7. కామచారిత్వము (తను తలచిన ప్రదేశమునకు వెళ్ళగల్గుట), 8. యుక్తాయుక్త పరిశీలనము జేయక ఎక్కడైనను నిద్రించుట.

ఇవి గాక ఇంకను జన్మసిద్ధి, ఓషధిసిద్ధి, మంత్రసిద్ధి, తపఃసిద్ధి,  సమాధిసిద్ధి అనికూడా గలవు. ఇన్ని  సిద్ధులు తనకు గలవు మరియు సాధకులకు ఆ జగన్మాత  ప్రాప్తింపజేయును గనుకనే ఆ పరమేశ్వరి *మహాసిద్ధిః* యనిఅనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు  *ఓం మహాసిద్ధ్యై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[28/01, 05:44] +91 95058 13235: *28.1.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఐదవ అధ్యాయము*

*గోపికాయుగళ గీతము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*35.20 (ఇరువదియవ శ్లోకము)*

*కుందదామకృతకౌతుకవేషో  గోపగోధనవృతో యమునాయామ్|*

*నందసూనురనఘే తవ వత్సో  నర్మదః ప్రణయిణాం విజహార॥9606॥*

*35.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*మందవాయురుపవాత్యనకూలం మానయన్ మలయజస్పర్శేన|*

*వందినస్తముపదేవగణా యే వాద్యగీతబలిభిః పరివవ్రుః॥9607॥*

యశోదమ్మా! నీ భాగ్యమే భాగ్యము. శ్రీకృష్ణుడు నీకు సుతుడగుట నీవు ఆచరించిన పెక్కునోముల ఫలము. ఆయన మనసు మిగుల సుతిమెత్తనిది. ఆ స్వామి నిరంతరము తన పరిహాసవచనములతో ప్రియమిత్రులకు హాయిని గొలుపుచుండును (ఆనందింపజేయుచుండును). మల్లెపూల మాలలను ధరించుటయందు ఆయనకు గల కుతూహలము మెండైనది. అతడు గోపాలురతో, గోవులతోగూడి యమునానదీ తీరమునందు విహరించు చుండెడివాడు. ఆ సమయమున మయలయపర్వతమునందలి చందన వృక్షములమీదుగా వీచుచు వచ్చుచున్న మందమారుతములు చల్లని సుఖస్పర్శలతో, సుగంధముల గుభాళింపులతో ఆయనను సమ్మానించు చుండును. సిద్ధులు, విద్యాధరులు మున్నగు దివ్యజాతులవారు పరివృతులై ఆ స్వామిని ప్రస్తుతించుచు తమ వాద్యగానములతో వివిధములగు కానుకల సమర్పణతో సేవించుచుందురు.

*35.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*వత్సలో వ్రజగవాం యదగధ్రో  వంద్యమానచరణః పథి వృద్ధైః|*

*కృత్స్నగోధనముపోహ్య దినాంతే  గీతవేణురనుగేడితకీర్తిః॥9608॥*

*35.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*ఉత్సవం శ్రమరుచాపి దృశీనామున్నయన్ ఖురరజశ్ఛురితస్రక్|*

*దిత్సయైతి సుహృదాశిష ఏష దేవకీజఠరభూరుడురాజః॥9609॥* 

ఓ చెలియా! శ్రీకృష్ణునకు వ్రజభూమియందలి గోవుల పైనను, గోపాలురమీదనుగల వాత్సల్యము అపారము. అందువలననే  ఆ స్వామి గోవర్ధనగిరిని తన వ్రేలిపై ధరించి, అందఱిని రక్షించెను. అతడు ఈ సాయంసమయమున అనుచరులెల్లరును తన వేణుగానవైభవములను ప్రశంసించుచుండగా, గోవులను అన్నింటిని ఒకచోట చేర్చి, వాటిని తోలుకొనుచు గృహోన్ముఖుడై బయలుదేఱియే యుండవచ్చును. కాని మార్గమధ్యమున బ్రహ్మాది దేవతల సేవలను అందుకొను చుండుటవలననో యేమో ఆ ప్రభువు యొక్క ఆగమనమునకు విలంబము జరుగుచున్నట్లున్నది. సఖులారా! ఇదిగో అతడు రానేవచ్చెను. అతని దర్శనమునకై తహ తహ లాడుచున్న మనకు నేత్రోత్సవమును కలిగించుటకై వచ్చుచునేయున్నాడు. దినమంతయును వనమునందు తిరిగియుండుటవలన మిగుల డస్సిపోయినట్లున్నాడు.  గోవుల కాళ్ళగిట్టలతాకిడిచే మీదికెగిసిన దుమ్ములవలన ఆయన వనమాల పూర్తిగా ధూసరితమైయున్నది. యశోదా (దేవకీ) గర్భసంజాతుడు, 

*దేవకృత్ర యశోదైవ| సాంత్వనే ప్రవృత్తాభిర్ మాత్రంతర సూచనస్య విరుద్ధత్వాత్| వ్రజరాజత్వాద్దేవ ఏవ దేవకోనందః తత్పత్నీ దేవకీతి యోగసంభవాత్| ద్వేనామ్నీ నందభార్యాయా యశోదా దేవకీతి చేత్యుక్త్యా రూఢిసత్త్వాచ్చ॥* (శ్రీధరీయటీకా)

మన అందరికిని చంద్రునివలె ఆహ్లాదకరుడు ఐన మన ప్రియతముడు ఆత్మీయులమైన మన మనోరథములను ఈడేర్చు అభిలాషతో మనకడకు వచ్చుచున్నాడు.

*35.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*మదవిఘూర్ణితలోచన ఈషన్మానదః స్వసుహృదాం వనమాలీ|*

*బదరపాండువదనో మృదుగండం మండయన్ కనకకుండలలక్ష్మ్యా॥9610॥*

*35.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*యదుపతిర్ద్విరదరాజవిహారో  యామినీపతిరివైష దినాంతే|*

*ముదితవక్త్ర ఉపయాతి దురంతం మోచయన్ వ్రజగవాం దినతాపమ్॥9611॥*

ఆ వనమాలి తనమిత్రులను ఎంతయు అనందింపజేయుచుండును. బంగారు కుండలముల కాంతులు ఆయన లేతబుగ్గలపై ప్రసరించుచుండుటతో ఆ స్వామి ముఖము దోరగా పండిన రేగుపండువలె అలరారుచున్నది. పూదేనెలను ఆస్వాదించి యుండుటచే కాబోలు మత్తిల్లిన కనులతో ఆ ప్రభువు కొంచముగా తూలిపోవుచున్నాడు. పగటివేళ గోవులునూ, మనమూ పొందిన దుర్భరమైన తాపములను తొలగించుటకై ఆ యదుశిరోమణి  సాయంసమయమున ఉదయించుచున్న చంద్రునివలె ఆహ్లాదకరుడగుచు ప్రసన్నవదనుడై గజేంద్రునివలె మందగమనముతో వచ్చుచున్నాడు.

*శ్రీశుక ఉవాచ*

*35.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*ఏవం వ్రజస్త్రియో రాజన్ కృష్ణలీలా ను గాయతీః|*

*రేమిరేఽహఃసు తచ్చిత్తాస్తన్మనస్కా మహోదయాః॥9612॥*

*శ్రీశుకుడు వచించెను* పరీక్షిన్మరాజా! వ్రజభామినులు ఎంతయు భాగ్యశాలినులు. ఏలనన వారి మనస్సులు సర్వదా ఆ యదుశిరోమణిమీదనే లగ్నమై యుండును. వారి అంతఃకరణములయందు ఆ పరమపురుషుడే మెదలుచుండును. ఇంతెందులకు, వారికి శ్రీకృష్ణుడే జీవితము. కృష్ణభగవానుడు పగటివేళల యందు గోవులను మేపుటకై వనమునకు వెళ్ళినప్పుడు వారు ఆ  ప్రభువునే తలంచుకొనుచు ఆ స్వామియొక్క మధురలీలలనే ప్రస్తుతించుచు ఆనందమున ఓలలాడుచుందురు. ఈ విధముగా గోపికలు కృష్ణతన్మయత్వముతో కాలమును గడపుచుండిరి.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే వృందావనక్రీడాయాం గోపికాయుగలగీతం నామ పంచత్రింశోఽధ్యాయః (35)*

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి *గోపికాయుగళగీతము* అను ముప్పది ఐదవ అధ్యాయము (35)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[28/01, 20:49] +91 95058 13235: *28.1.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఆరవ అధ్యాయము*

*అరిష్టాసుర (వృషభాసుర) వధ - కంసుడు శ్రీకృష్ణుని కడకు అక్రూరుని పంపుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*

*36.1 (ప్రథమ శ్లోకము)*

*అథ తర్హ్యాగతో గోష్ఠమరిష్టో వృషభాసురః|*

*మహీం మహాకకుత్కాయః కంపయన్ ఖురవిక్షతామ్॥9613॥*

*శ్రీశుకుడు వచించెను* శ్రీకృష్ణుడు గోకులమునందు ప్రవేశించిన పిదప అరిష్టాసురుడు అను రాక్షసుడు వృషభరూపములో అచటికి ఏతెంచెను. ఆ వృషభాసురుని కాయము, మూపురము, గంగడోలు మిగుల బలిష్టముగా నుండెను. అతని దృఢమైన గిట్టలతాకిడికి భూమి కంపించుచుండెను.

*36.2 (రెండవ శ్లోకము)*

*రంభమాణః ఖరతరం పదా చ విలిఖన్ మహీమ్|*

*ఉద్యమ్య పుచ్ఛం వప్రాణి విషాణాగ్రేణ చోద్ధరన్॥9614॥*

అతడు బిగ్గఱగా ఱంకెలు వేయుచుండెను. కాలితో నేలను త్రవ్వి దుమ్ములు రేపుచు, తోకను మీదికి ఎత్తి పదునైన కొమ్ములతో ఎత్తుగానున్న ప్రదేశములను, పొలముగట్లను క్రుమ్మివేయుచుండెను.

*36.3 (మూడవ శ్లోకము)*

*కించిత్కించిచ్ఛకృన్ముంచన్ మూత్రయన్ స్తబ్ధలోచనః|*

*యస్య నిర్హ్రాదితేనాంగ నిష్ఠురేణ గవాం నృణామ్॥9615॥*

*36.4 (నాలుగవ శ్లోకము)*

*పతంత్యకాలతో గర్భాః స్రవంతి స్మ భయేన వై|*

*నిర్విశంతి ఘనా యస్య కకుద్యచలశంకయా॥9616॥*

*36.5 (ఐదవ శ్లోకము)*

*తం తీక్ష్ణశృంగముద్వీక్ష్య గోప్యో గోపాశ్చ తత్రసుః|*

*పశవో దుద్రువుర్భీతా రాజన్ సంత్యజ్య గోకులమ్॥9617॥*

*36.6 (ఆరవ శ్లోకము)*

*కృష్ణ కృష్ణేతి తే సర్వే గోవిందం శరణం యయుః|*

*భగవానపి తద్వీక్ష్య గోకులం భయవిద్రుతమ్॥9618॥*

*36.7 (ఏడవ శ్లోకము)*

*మా భైష్టేతి గిరాఽఽశ్వాస్య వృషాసురముపాహ్వయత్|*

*గోపాలైః పశుభిర్మంద త్రాసితైః కిమసత్తమ॥9619॥*

*36.8 (ఎనిమిదవ శ్లోకము)*

*బలదర్పహా దుష్టానాం త్వద్విధానాం దురాత్మనామ్|*

*ఇత్యాస్ఫోట్యాచ్యుతోఽరిష్టం తలశబ్దేన కోపయన్॥9620॥*

*36.9 (తొమ్మిదవ శ్లోకము)*

*సఖ్యురంసే భుజాభోగం ప్రసార్యావస్థితో హరిః|*

*సోఽప్యేవం కోపితోఽరిష్టః ఖురేణావనిముల్లిఖన్|*

*ఉద్యత్పుచ్ఛభ్రమన్మేఘః క్రుద్ధః కృష్ణముపాద్రవత్॥9621॥*

పరీక్షిన్మహారాజా! ఆ వృషభాసురుడు మూత్రము విసర్జించుచు కొంచము కొంచముగా పేడ వేయుచు గ్రుడ్లురుముచు నిలబడెను. చెవులు చిల్లులుపడునట్లు మిక్కిలి ఘోరముగా వేయుచున్న అతని ఱంకెలకు గడగడ వణికిపోవుచున్న ఆవులకును, స్త్రీలకును ఆ కాలమున గర్భస్రావములు జరుగుచుండెను.

*ఆచతుర్థాత్ భవేత్ ప్రావః, పాతః పంచమ షష్ఠయోః|* *అతఊర్ధ్వం ప్రసృతిఃస్యాత్ - ఇతి విభాగః॥*

గర్భధారణ పిమ్మట స్త్రీలకు నాలుగునెలలలోపల గర్భము పోయినచో దానిని *గర్భస్రావము* అని యందురు. ఐదవ, ఆఱవనెలలో పోయినట్లయిన దానిని *గర్భపాతము* అని యందురు. అటుపైన జరిగినచో *ప్రసవము* అని యందురు. (శ్రీధరవ్యాఖ్య)

మహారాజా! దాని మూపురమును జూచి పర్వతశిఖరముగా భ్రమపడి, మేఘములు అచట నిలిచిపోవుచుండెను. మొనదేలి మిగుల పదునుగానున్న దాని కొమ్ముల గాంచి, గోపికలును, గోపాలురును, ఎంతయు భయగ్రస్తులైరి. పశువులు భీతిల్లుచు, గోకులమును విడిచి పఱగులు తీయసాగెను. అంతట సమస్త గోవులును, గోపికలును, గోపాలురును, 'కృష్ణా! కృష్ణా!' యని మొఱపెట్టుకొనుచు గోవిందుని శరణుజొచ్చిరి. అప్పుడు కృష్ణభగవానుడు  భయవిహ్వలస్థితులకు లోనైన గోకులవాసుల దైన్యమును గమనించి, 'భయపడకుడు, భయపడకుడు' అని అభయవచనములతో వారిని ఊఱడించెను. దీనజనరక్షకుడైన ఆ ప్రభువు ఆ రాక్షసుని హెచ్చరించుచు ఇట్లు పలికెను - "ఓరీ! మందబుద్ధీ! దుష్టుడా! నోరులేని ఈ గోవులను అమాయకులైన ఈ గోపాలురను భయగ్రస్తులను చేయుట నిజమైన వీరలక్షణముగాదు. దానివలన నీకు ప్రయోజనము శూన్యము. నీ వంటి దురాత్ములయొక్క, దుష్టులయొక్క గర్వమును అణచివేయుటకు నేను సిద్ధముగా ఉన్నాను". ఈ విధముగా పలుకుచు పరాక్రమశాలియైన ఆ ప్రభువు భుజాస్ఫాలనమొనర్చి, కరతాళములతో ఆ అసురుని రెచ్చగొట్టెను. పిదప ఆ శ్రీహరి (శ్రీకృష్ణుడు) పాము పడగవంటి తన దీర్ఘబాహువును చాచి, ఒక ప్రియమిత్రుని బుజముపై ఉంచి నిలబడెను. అంతట ఆ అరిష్టాసురుడు మిక్కిలి ఱెచ్చిపోయెను. గిట్టలతో భూమిని త్రవ్వుచు, తోకను పైకెత్తి మేఘములను చిందరవందరజేయుచు, పట్టరాని క్రోధముతో అతడు ఒక్కయుదుటున  శ్రీకృష్ణుని మీదికి విజృభించెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[29/01, 04:59] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*225వ నామ మంత్రము* 29.01.2021

*ఓం మహాయోగీశ్వరేశ్వర్యై నమః*

గొప్ప యోగీశ్వరులకు కూడా ఈశ్వరి అయిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహాయోగీశ్వరేశ్వరీ*   యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) యను నామ మంత్రమును *ఓం మహాయోగీశ్వరేశ్వర్యై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ తల్లి కరుణించి భౌతికపరమైన సుఖశాంతులతోబాటు, పరమపదసోపానమార్గమును సుగమంజేసి, దీక్షాపటిమను ఇనుమడింపజేసి తరింపజేయును.

యోగాభ్యాసము గలవారు యోగులు. అటువంటి యోగులలో శ్రేష్ఠులు యోగీశ్వరులు. ఇంకను పరమాత్మతాదాత్మ్యము పొందినవారు మహాయోగీశ్వరులు. అటువంటి మహాయోగీశ్వరులకే స్వామిని అయిన జగన్మాత మహాయోగీశ్వరేశ్వరి అయినది.

కర్మఫలాన్ని కోరకుండా చేయవలసిన కర్మలను చేయువాడే నిజమైన సన్యాసి, యోగి. అంతేకాని అగ్నిహోత్రాదికర్మలు మానేసినంత మాత్రాన కాదు. సన్యాసమన్నా, యోగమన్నా ఒకటే. యోగాన్ని కోరేవాడికి మొదట కర్మయే సాధనం. అంటే నీ పని నువ్వు చేయవలసిందే, కొంత సాధన తర్వాత అంటే నీ దేహ ధర్మాలు నిర్వహిస్తూ, ఇంద్రియ విషయాలందు అనగా కామ క్రోధ లోభ మద మాత్సర్యాల యందు వాటి కర్మలయందు కోరికలను, అన్ని సంకల్పాలను వదిలి సాక్షిగా గమనిస్తూ ఉండేవారు యోగిగా చెప్తారు.

యోగము అనేది *భక్తియోగము*, *కర్మయోగము*, *జ్ఞానయోగము* అని మూడురకాలుగా తెలియవచ్చు.

దైవం కోసం చేస్తున్నాననుకోవడం *భక్తియోగము*.

దైవం చేయిస్తున్నాడనుకోవడం *కర్మయోగము*.

అంతా దైవమేనన్న స్థిరభావం *జ్ఞానయోగము*.

భక్తియోగం తామసభక్తి, రాజసభక్తి మరియు సాత్వికభక్తి అని మూడురకాలుగా ఆలోచిస్తే, సాత్విక భక్తియోగం వలన మాత్రమే మానవుడు దైవానుగ్రహానికి పాత్రుడౌతాడు. మానవుడు ఐహికంగా సాధించవలసిన విషయాలలో దైవానుగ్రహం యొక్క పాత్ర లేక దైవం యొక్క పాత్ర స్వల్పమే.  

*అనన్యాశ్చింతయం తో మాం యే జనాః పర్యుపాసతే|*

*తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం ||*

(భగవద్గీత, అధ్యాయం - 9, శ్లోకము - 22)

ఏకాగ్రచిత్తంతో నిరంతరం నన్నే స్మరిస్తూ సేవించే వాళ్ళ యోగక్షేమాలు నేనే చూస్తాను. అంటే తన భక్తుల యోగక్షేమాలను తనే చూసుకుంటానని భగవానుడు మాట ఇచ్చాడు.  

*కర్మయోగం* ఫలితంపై కోరిక లేకుండా పనిచేయడానికి (నిష్కామకర్మకు) భగవద్గీతలో శ్రీకృష్ణుడు పెట్టిన పేరు కర్మయోగం.  ఇక్కడ కర్మయోగం అంటే కర్మ అనే ఉపాయాన్ని పట్టుకొని మరొకదాన్ని సాధించడం. ఆ మరొకటి ఏమంటే అదే ఆత్మజ్ఞానం. ఏ విధమైన ఫలాపేక్ష  లేకుండా జగన్మాత అనుగ్రహంకోసం  నిత్యనైమిత్తిక కర్మలు ఆచరించడం, యజ్ఞయాగాదులు  చేయడమే కర్మయోగం అవుతుంది. .

 బిడ్డపట్ల మమకారం వాత్సల్యమౌతుంది. భగవంతుని పట్ల ఉండే మమకారమే భక్తి. ప్రాపంచికంగా కానీ, పారలౌకికంగా గానీ ఏమీ అక్కరలేని స్థితే జ్ఞానం. తనతో తాను కూడి ఉన్నదే జ్ఞానయోగం. అదే ఆత్మ నిష్ఠ అనబడుతుంది. జ్ఞానము వల్లనే ముక్తి లభిస్తుంది. జ్ఞాని అయినటువంటివాడు బ్రహ్మవిదుడు. *బ్రహ్మవిద్ బ్రహ్మైవభవతి*,  అనగా బ్రహ్మవేత్త కూడా పరబ్రహ్మమే. జ్ఞానమనేది ఒకే జన్మలో కలుగదు. కోట్లకొలది జన్మలెత్తితేనే గాని జ్ఞానం కలుగదు. కనుక సాధకుడు వీలయినంత వరకూ జ్ఞానసముపార్జన చేయాలి.

భక్తి కర్మ జ్ఞాన యోగాలలో దేనిలోనైనా తాదాత్మ్యత ఉండాలి. భక్తిలో కూడా పరమాత్మ సర్వత్రా వ్యాపించి యుంటాడు. కర్మలోనైనా అంతే. ఏ యోగమైనా మనసును నిశ్చలం చేసి భగవధ్యానము చేయాలి. యోగంచేయడంలో నిష్ణాతులైన వారిని యోగీశ్వరులంటారు. వీరిలో శ్రేష్ఠులైన వారిని మహాయోగీశ్వరు లంటారు.  అటువంటి మహాయోగీశ్వరులకే పరమేశ్వరి ఈశ్వరి గనుక *మహాయోగీశ్వరేశ్వరి* అనబడుచున్నది.

పరమేశ్వరికి నమస్కరించునపుడు *మహాయోగీశ్వరేశ్వర్యై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[29/01, 04:59] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*799వ నామ మంత్రము* 29.01.2021

*ఓం రసజ్ఞాయై నమః*

శృంగారాది నవరసములచే తెలియబడు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *రసజ్ఞా* యను మూడక్షరముల(త్ర్యక్షరీ) నామ మంత్రముసు *ఓం రసజ్ఞాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి సకలాభీష్టసిద్ధిని కలుగజేయును.

శృంగారాది నవరసములచే తెలియబడు చైతన్యస్వరూపిణి జగన్మాత. 

నవరసములు అనగా

1.శృంగారము, 2. హాస్యము, 3. కరుణము, 4. రౌద్రము, 5. వీరము, 6. భయానకము, 7. భీబత్సము, 8. అద్భుతము మరియు 9. శాంతము. 

రసం అనునది భావోద్వేగ స్థాయి. ప్రాచీన భారత దేశపు భరతముని తన నాట్య శాస్త్రంలో ఎనిమిది రసాలను నిర్వచించారు. ఈ రసాలను సాధించే కళాకారుడు ఒక్కో రసం ద్వారా (వలన) ఒక్కో భావాన్ని ప్రేక్షకులలో సృష్టించ గలుగుతాడు. తరువాత అవసరాన్ని బట్టి వాడు కోవటానికి అనుగుణంగా ఈ ఎనిమిదింటికీ శాంత రసాన్ని ఉపగుప్తుడు జోడించాడు. నటనకూ నాట్యానికీ సమానంగా ఉపయోగ పడే ఈ రసాలు ఈనాటికీ మన భారతీయ కళలకు మూలాధారం. ప్రతీ కళాకారుడూ ఈ రసాలను ఎరిగి ఉండటం ఎంతైనా అవసరం. ఈ రసాలను సాధించటాన్ని రసాభినయం అంటారు. ఈ తొమ్మిది మాత్రమేగాక భక్తిరసముచే కూడా పరమేశ్వరి తెలియగలుగునది.  అనగా జగన్మాత రసేంద్రియస్వరూపిణి.  రసము అను పదమునకు ఆనందము అని అర్థం తీసుకుంటే జగన్మాత ఆనంద స్వరూపిణి. పరమేశ్వరి సర్వజ్ఞ. అంటే ఆ తల్లికి అన్నియు తెలియును. సర్వతంత్రస్వరూపిణి. సర్వమంత్ర స్వరూపిణి. సర్వయంత్రస్వరూపిణి. సృష్టిమొత్తమూ తానై విరాజిల్లుచున్నది. జీవకోటిలో చైతన్యస్వరూపిణియై, జీవుల కర్మఫలానుసారము, వివిధభావాలను జీవులు అనుభవిస్తుంటే వాటన్నిటిలోనూ తానై విలసిల్లుచున్నది. నవరసములను ఒక్కొక్కదానికి భక్తిరసమును జోడించి అమ్మా! పరమేశ్వరీ! నీ బిడ్డను నేను తల్లీ! నన్ను అనుగ్రహించుమమ్మా అంటే ఆ తల్లి భక్తిరసమునకు జోడింపబడిన నవరసములలో ప్రతీ ఒక్కదానికి బదులు పలుకుతుంది. సాధకుడిని అనుగ్రహిస్తుంది. ఆ విధంగా పరమేశ్వరి అనుగ్రహాన్ని చవిజూచిన సాధకునికి పరమేశ్వరి చైతన్యరూపం తెలియవస్తుంది గనుకనే పరబ్రహ్మస్వరూపిణి అయిన జగన్మాత *రసజ్ఞా* యని అనబడినది. 

శ్రీచక్రములో తొమ్మిది ఆవరణలు ఉన్నవి. ఈ తొమ్మిది ఆవరణలు నవరసాత్మకమై, ఆనందస్వరూపిణియైన పరమేశ్వరితో చైతన్యమై సాధకుని ఆత్మానందానుభూతియందు తరింపజేయును. 

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం రసజ్ఞాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐ADC

[29/01, 04:59] +91 95058 13235: *29.1.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఆరవ అధ్యాయము*

*అరిష్టాసుర (వృషభాసుర) వధ - కంసుడు శ్రీకృష్ణుని కడకు అక్రూరుని పంపుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*36.10 (పదియవ శ్లోకము)*

*అగ్రన్యస్తవిషాణాగ్రః స్తబ్ధాసృగ్లోచనోఽచ్యుతమ్|*

*కటాక్షిప్యాద్రవత్తూర్ణమింద్రముక్తోఽశనిర్యథా॥9622॥*

పిమ్మట వృషభాసురుడు తన కొమ్ములతో మోహరించి, కన్నులెర్రజేయుచు (కనులనుండి చింత నిప్పులను కురిపించుచు) క్రీగంటి చూపులను క్రుమ్మరించుచు, ఇంద్రునిచే ప్రయుక్తమైన వజ్రాయుధమువలె రివ్వున ఆ స్వామిమీదికి దాడికి దిగెను.

*36.11 (పదకొండవ శ్లోకము)*

*గృహీత్వా శృంగయోస్తం వా అష్టాదశ పదాని సః|*

*ప్రత్యపోవాహ భగవాన్ గజః ప్రతిగజం యథా॥9623॥*

అప్పుడు కృష్ణుడు తన చేతులతో దాని రెండు కొమ్ములను గట్టిగా పట్టుకొని, ఒక ఏనుగు తనను ఎదిరించిన మఱొక ఏనుగునువలె పద్దెనిమిది అడుగుల దూరము వెనుకకు నెట్టెను.

*36.12 (పండ్రెండవ శ్లోకము)*

*సోఽపవిద్ధో భగవతా పునరుత్థాయ సత్వరః|*

*ఆపతత్స్విన్నసర్వాంగో నిఃశ్వసన్ క్రోధమూర్చ్ఛితః॥9624॥*

కృష్ణభగవానుని చేతిలో ఎదురు దెబ్బతినిన ఆ వృషభాసురుడు వెంటనే కోలుకొని లేచి నిలబడెను. పిమ్మట అతడు చెమర్చిన శరీరముతో, నిట్టూర్పులను నిగుడించుచు క్రోధవివశుడై మఱల ఆ స్వామిమీదికి చెలరేగెను.

*36.13 (పదమూడవ శ్లోకము)*

*తమాపతంతం స నిగృహ్య శృంగయోః పదా సమాక్రమ్య నిపాత్య భూతలే|*

*నిష్పీడయామాస యథాఽఽర్ద్రమంబరం కృత్వా విషాణేన జఘాన సోఽపతత్॥9625॥*

ఆ విధముగా మిడిసిపాటుతో మఱల తన మీదికి విరుచుకొని పడబోవుచున్న ఆ అరిష్టాసురునియొక్క కొమ్ములను దృఢముగా పట్టుకొని, బలముగా ఒక్క తన్ను  తన్ని అతనిని భూమిపై  పడగొట్టెను. పిదప ఆ స్వామి తడిగుడ్డను పిండినట్లు అతనిని పిండివేసి, కొమ్మును ఊడబెఱికి, దానితో పొడిచి పొడిచి మిగుల గాయపఱచెను. అంతట ఆ రాక్షసుడు నేలగఱచెను.

*36.14 (పదునాలుగవ శ్లోకము)*

*అసృగ్వమన్ మూత్రశకృత్సముత్సృజన్  క్షిపంశ్చ పాదాననవస్థితేక్షణః|*

*జగామ కృచ్ఛ్రం నిరృతేరథ క్షయం పుష్పైః కిరంతో హరిమీడిరే సురాః॥9626॥*

అంతట ఆ అరిష్టాసురుడు నోటినుండి, ముక్కునుండి రక్తమును గ్రక్కుచు మలమూత్రములను విసర్జించుచు, పాదములతో గిలగిలకొట్టుకొనుచు కనులను తేలవేసెను. పిమ్మట అతడు అవసానదశావస్థను అనుభవించుచు, మృత్యుముఖమునకు చేరెను. శ్రీకృష్ణుడు ఆ వృషభాసురుని హతమార్చినందులకు సంతోషించుచు, దేవతలు ఆ స్వామి పై పూవులను జల్లుచు ప్రస్తుతించిరి.

*36.15 (పదునైదవ శ్లోకము)*

*ఏవం కుకుద్మినం హత్వా స్తూయమానః స్వజాతిభిః|*

*వివేశ గోష్ఠం సబలో గోపీనాం నయనోత్సవః॥9627॥*

ఈ విధముగా కృష్ణపరమాత్మ వృషభాసురుని సంహరించిన పిమ్మట మిత్రులైన గోపాలుర ప్రశంసలను అందుకొనుచు, బలరామునితోగూడి గోకులమున ప్రవేశించెను. అప్పుడు గోపికలు కనులపండువుగా ఆ స్వామిని దర్శించుచు సంతోషముతో పొంగిపోయిరి.

*36.16 (పదునారవ శ్లోకము)*

*అరిష్టే నిహతే దైత్యే కృష్ణేనాద్భుతకర్మణా|*

*కంసాయాథాహ భగవాన్ నారదో దేవదర్శనః॥9628॥*

మహారాజా! అద్భుత కార్యములను  నెఱపుటలో దిట్టయైన శ్రీకృష్ణుడు దురాత్ముడైన అరిష్టాసురుని వధించి, వ్రజవాసులను ఆనందింపజేసెను. అంతట భవిష్యత్తును దర్శింపగల దివ్యర్షియగు నారదుడు కంసుని కడకేగి అతనితో  ఇట్లు నుడివెను-

*36.17 (పదిహేడవ శ్లోకము)*

*యశోదాయాః సుతాం కన్యాం దేవక్యాః కృష్ణమేవ చ|*

*రామం చ రోహిణీపుత్రం వసుదేవేన బిభ్యతా॥9629॥*

*36.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*న్యస్తౌ స్వమిత్రే నందే వై యాభ్యాం తే పురుషా హతాః|*

*నిశమ్య తద్భోజపతిః కోపాత్ప్రచలితేంద్రియః॥9630॥*

"కంసమహారాజా! నీ చేతులనుండి తప్పించుకొని, ఆకాశమునకు ఎగిరిన కన్యక నిజముగా యశోద కుమార్తె. వ్రజభూమియందు వర్ధిల్లుచున్న శ్రీకృష్ణుడు దేవకీపుత్రుడు. అచటనే పెఱుగుచున్న బలరాముడు రోహిణీదేవి కుమారుడు. వసుదేవుడు నీకు భయపడి శ్రీకృష్ణుని, బలరాముని తన మిత్రుడైన నందునికడ న్యాసముగా ఉంచెను. నీ ప్రేరణతో వెళ్ళిన రాక్షసులను అందరిని నిహతులను గావించినది ఆ సోదరులు ఇద్దరే". నారదుని వలన బలరామకృష్ణుల ఈ సమాచారములను విన్నంతనే కంసుడు మిగుల క్రోధముతో ఊగిపోయెను. అతని ఇంద్రియము లన్నియు పట్టుదప్ఫెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[29/01, 20:59] +91 95058 13235: *29.1.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఆరవ అధ్యాయము*

*అరిష్టాసుర (వృషభాసుర) వధ - కంసుడు శ్రీకృష్ణుని కడకు అక్రూరుని పంపుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*36.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*నిశాతమసిమాదత్త వసుదేవజిఘాంసయా|*

*నివారితో నారదేన తత్సుతౌ మృత్యుమాత్మనః॥9631॥*

*36.20 (ఇరువదియవ శ్లోకము)*

*జ్ఞాత్వా లోహమయైః పాశైర్బబంధ సహభార్యయా|*

*ప్రతియాతే తు దేవర్షౌ కంస ఆభాష్య కేశినమ్॥9632॥*

వెంటనే అతడు వసుదేవుని చంపదలచి, వాడియైన ఒక ఖడ్గమును చేబూనెను. కాని యుక్తియుక్తములైన నారదుని మాటలకు మెత్తబడి, కంసుడు ఆ ప్రయత్నమును విరమించుకొనెను. వసుదేవుని కుమారులైన బలరామకృష్ణుల వలననే తనకు మృత్యువు ప్రాప్తించునని గ్రహించి, ఆ కంసుడు వెంటనే దేవకీవసుదేవులను ఇనుపసంకెళ్ళతో బంధించి, ఆ ఇరువురిని చెఱసాలపాలుచేసెను. దేవర్షియగు నారదుడు వెళ్ళిపోయిన పిమ్మట కంసుడు *కేశి* యను రాక్షసుని తన కడకు పిలిపించెను.

*36.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*ప్రేషయామాస హన్యేతాం భవతా రామకేశవౌ|*

*తతో ముష్టికచాణూరశలతోశలకాదికాన్॥9633॥*

*36.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*అమాత్యాన్ హస్తిపాంశ్చైవ సమాహూయాహ భోజరాట్|*

*భో భో నిశమ్యతామేతద్వీరచాణూరముష్టికౌ॥9634॥*

పిదప అతడు 'బలరామకృష్ణులను చంపిరావలెను' అని ఆజ్ఞాపించి, ఆ కేశిని గోకులమునకు పంపివైచెను. అనంతరము భోజపతియైన కంసుడు ముష్టికుడు, చాణూరుడు, శలుడు, తోశలకుడు మున్నగు మల్లురను, మంత్రులను, మావటివాండ్లను పిలిపించి, వారితో  ఇట్లనెను. "వీరులైన చాణూరముష్టికులారా! నా మాటలను శ్రద్ధగా వినుడు".

*36.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*నందవ్రజే కిలాసాతే సుతావానకదుందుభేః|*

*రామకృష్ణౌ తతో మహ్యం మృత్యుః కిల నిదర్శితః॥9635॥*

*36.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*భవద్భ్యామిహ సంప్రాప్తౌ హన్యేతాం మల్లలీలయా|*

*మంచాః క్రియంతాం వివిధా మల్లరంగపరిశ్రితాః|*

*పౌరా జానపదాః సర్వే పశ్యంతు స్వైరసంయుగమ్॥9636॥*

"వసుదేవుని కుమారులైన *బలరామకృష్ణులు* అనువారు నందుని గోకులమునందు పెఱుగుచున్నారట. వారు నా మృత్యువునకు కారకులని తెలిసినది. ఏదేని ఉపాయముచే ఆ ఇరువురిని ఇచటికి రప్పించెదను. మీరు వారిని మల్లయుద్ధమున చంపివేయుడు. మల్లరంగస్థలమునకు చుట్టును వివిధములగు మంచెలు (ఎత్తైన స్తంభములతో ఒప్పెడి ఆసనములు) ఏర్పాటు చేయబడుగాక. పౌరులు, జానపదులు మొదలగువారు ఆ మంచెలపై కూర్చుండి స్వేచ్ఛగా జరిగెడి ఆ మల్లయుద్ధమును (కుస్తీపోటీలను) దర్శింతురు".

*36.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*మహామాత్ర త్వయా భద్ర రంగద్వార్యుపనీయతామ్|*

*ద్విపః కువలయాపీడో జహి తేన మమాహితౌ॥9637॥*

"భద్రా! మావటివాడా! నీవు ఏనుగులను నడిపించుటలో చతురుడవు. *కువలయాపీడనము* అను భద్రగజమును మల్లరంగస్థల ప్రవేశద్వార సమీపమున నిలిపియుంచుము. నాకు శత్రువులైన బలరామకృష్ణులు అక్కడికి చేరగనే, ఆ కువలయాపీడమును (భద్రగజమును) పురిగొలిపి వారిని హతమార్చుము".

*36.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*ఆరభ్యతాం ధనుర్యాగశ్చతుర్దశ్యాం యథావిధి|*

*విశసంతు పశూన్ మేధ్యాన్ భూతరాజాయ మీఢుషే॥9638॥*

రాబోవు చతుర్దశినాడు ధనుర్యాగము యథావిధిగా ప్రారంభమగును. మన ధనుర్యాగ సాఫల్యమునకై భూతపతియగు కాలభైరవునకు ప్రీతికరముగా పవిత్రములైన జంతువులను బలిగా సమర్పింపవలెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[30/01, 04:33] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*800వ నామ మంత్రము* 30.01.2021

*ఓం రసశేవధయే నమః*

బ్రహ్మామృతస్వరూపురాలైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *రసశేవధిః* అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం రసశేవధయే నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు జగన్మాత సుఖమయజీవనమును, పరమానందమయిన జీవనమును ప్రసాదించును.

పరమేశ్వరి బ్రహ్మామృత స్వరూపురాలు. 

*రసస్య బ్రహ్మామృతస్య శేవధిః నిధిః* (సౌభాగ్యభాస్కరం, 902వ పుట)

*బ్రహ్మామృతమునకు నిధి వంటిది*  అని బ్రహ్మాండపురాణములో చెప్పబడినది.

బ్రహ్మాండ పురాణంలో:

*రస ఏవ పరం బ్రహ్మ రస ఏవ పరాగతిః*

*రసో హి కాంతిదః పుంసాం రసో రేత ఇతి స్మృతః*

*రసోవై రససంలబ్ధ్యా హ్యానందీ భగవత్యపి* (సౌభాగ్యభాస్కరం, 903వ పుట)

రసమే పరబ్రహ్మ, ఆ రసమే ఉత్తమగతి. ఆ రసమే పురుషులకు కాంతిని గలిగించును. ఆ రసమే  రేతో రూపము - శుక్రధాతు రూపము. వేదప్రామాణ్యమును బట్టి ఆత్మ రసస్వరూపుడనియు, ఆ రసస్వరూపుని పొందినవాడు ఆనందము పొందినవా డగుచున్నాడు. ఆనందము లేనివాడు జీవించలేడు. ఆ రసము ప్రాణాత్మకము మరియు ప్రాణమునిచ్చును.

అందుచే బ్రహ్మము రసస్వరూపము. రసశేవధిః అంటే ఆనంద ఘనస్వరూపము. ఈ ఆనందం అనుభవించుకొలదీ తరుగులేక అధికమగుచుండును. అట్టి ఆనంద ఘనస్వరూపమే పరమేశ్వరి. గనుకనే అమ్మవారు *రసశేవధిః* అని యనబడినది.

అట్టి జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం రసశేవధయే నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[30/01, 04:33] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*226వ నామ మంత్రము* 30.1.2021

*ఓం మహాతంత్రాయై నమః*

అనేక ఫలములనిచ్చు శ్రీవిద్యా తంత్రస్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహాతంత్రా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం మహాతంత్రాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని ఆరాధించు సాధకులకు ఆ తల్లి సుఖశాంతులను ప్రసాదించును. 

*మహాంతి బహుఫలప్రదాని తంత్రాణి కులార్ణవ జ్ఞానార్ణవాదీని..*(సౌభాగ్య భాస్కరం - 400వ పుట).

కులార్ణవము, జ్ఞానార్ణవము అనునవి తంత్రములు. ఈ తంత్రములు అనేక ఫలములను ఇచ్చునవి. జగన్మాత కులార్ణవ, జ్ఞానార్ణవ మొదలైన తంత్రముల స్వరూపిణి.

తంత్ర శాస్త్రము అనేది సాధనా గ్రంథము.   ఇందులో చెప్పబడినదంతా వేదములనుండి సంగ్రహించి విశదపరిచినదే. దీనిని తంత్ర శాస్త్రము అనికూడా అంటారు. తంత్ర శాస్త్రములో శక్తి (స్త్రీ) ఆరాధ్యముఖ్యము. శ్రీ పూజ వేదములలో శ్రీసూక్తం మొదలైన వాటిలో ఉంది. గాయత్రి కూడా స్త్రీయే. యజ్ఞములందు పశుబలులు, సోమపానములున్నవి. తంత్ర శాస్త్రములు దేశాచారములను అనుసరించి అనేక రూపాలుగా ఉన్నాయి. ఈసంప్రదాయములు కల ప్రాంతములను క్రాంతములందురు. వింధ్యకు ఉత్తరాన ఉన్న భూమిని రాధాక్రాంతమంటారు.ఇక్కడ కాశ్మీరి సంప్రదాయం ఉంది.తూర్పున ఉన్న ప్రాంతమును విష్ణు క్రాంతము అంటారు. ఇక్కడ గౌడ (వంగ) సంప్రదాయం ఉంది. దక్షిణ దేశమును అశ్వ క్రాంతమందురు. ఇక్కడ కేరళ సంప్రదాయం ఉంది. ఎవరి ఆచారవ్యవహారములను అనుసరించి ఆసాధనలు ప్రబలినవి.   

అంతకన్నా ప్రధానమైనది శ్రీవిద్యాతంత్రము. శ్రీవిద్య నిరూపింపబడినదే తంత్రశాస్త్రము. పరమేశ్వరుడు అరువదినాలుగు తంత్రములను చెప్పడం జరిగింది. కాని ఇవన్నియు కేవలం వాంఛలు తీర్చునవే అయినవి. కనుక వేరే ఏదైనా తంత్రము చెప్పమని పార్వతి అడుగగా, పరమేశ్వరుడు శ్రీవిద్యాతంత్రాన్ని ఉపదేశించడం జరిగింది. ఇది చాలా గొప్పది. అందుకనే మహాతంత్రమనియు, ఏ తంత్రములకూ అనుసంధానింప బడనిది యగుటచే స్వతంత్రతంత్రము. దీనినే కాదివిద్యాతంత్రము.

 నిరృతి అనే అరూపలక్ష్మికి పుట్టినవాడు మన్మథుడు. రూపంలేని తల్లికి పుట్టినందువల్ల అనంగుడయ్యాడు. నాలుకే లేని అతడు పంచదశీ మంత్రాన్ని బయటకు చెప్పగలిగాడు. దానితో వేళ్లుమొలిచాయి. శ్రీవిద్యామణిని మెడలో ధరించిన ఫలం అతణ్ణి సర్వవ్యాపిని చేసింది. మన్మథుడు దర్శించిన శ్రీవిద్యలో  కామకళ, శివకళ, శక్తికళ, రతికళ, శ్రీకళ అనే అయిదు భేదాలున్నాయి. ఇదే  కాదివిద్య అని అంటారు. ఇందులో యమనియమాలు లేవు.

*యమం* అంటే, నియంత్రణ

మౌలిక ఆధ్యాత్మిక – జీవన సూత్రాల మీద ఆధిపత్యం కలిగి వుండడం. పతంజలి మహర్షి అయిదు యమాలను వివరించారు

ఇవి సత్యం, అహింస, బ్రహ్మచర్యం, ఆస్తేయం (ఇతరుల ఆస్తి పట్ల అసూయ ఉండకపోవడం) అపరిగ్రహం (అవసరం కానిది ఇతరులు ఇచ్చినా తీసుకోకపోవడం)

*నియమం*

తప్పనిసరి దైనందిక కార్యకలాపాలు

మన ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో కొన్ని కార్యకలాపాలు తప్పనిసరి. పతంజలి మహర్షి అయిదు నియమాలను ప్రవచించారు.. అవి: *శౌచం* (శరీరాన్నీ పరిసరాలనూ శుచిగా, శుభ్రంగా వుంచుకోవడం), *సంతోషం* (మనస్సును ఎప్పుడూ ఉల్లాసంగా వుంచుకోవడం), *స్వాధ్యాయం* (చక్కటి ఆధ్యాత్మిక గ్రంథాలను సదా చదువుతూ వుండడం), *తపస్సు*  (నిద్రాహారాదులను క్రమక్రమంగా తగ్గిస్తూ వుండడం), *ఈశ్వరప్రణిధానం* (అంతా ఈశ్వరమయమే అన్న భావనలో ఎప్పుడూ వుండడం)

తంత్రంలో ఎన్నో పారమార్ధిక విషయాలు చెప్పబడతాయి. ఏ కార్యక్రమమైనా చేయాలంటే ఎలాచేయాలి? ఏవిధంగా చేయాలి? ఏ దిక్కుకు ముఖం పెట్టాలి?  ఏ ఆసనం మీద కూర్చోవాలి? నివేదన పదార్థం ఏమిటి? వంటి వివరాలు ఉంటాయి. వామకేశ్వర తంత్రము లాంటి తంత్రములు ఈ కోవలోనికే వస్తాయి.

తంత్రంలో సంకల్పం నుండి సంపూర్తి చేసేవరకూ గల క్రియాభాగమే తంత్రము. వేదాలలో యజ్ఞయాగాదులు చేయు విధానమును తెలియజేసినది కూడా తంత్రమనే అంటారు.

ఈ విధంగా చెప్పిన తంత్రాలు ఎన్నో ఉంటాయి. ఇటువంటి తంత్రాలకన్నిటికీ అధిదేవత  పరమేశ్వరియే. గనుకనే అమ్మవారు *మహాతంత్రా* యని అనబడినది. 

పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం మహామంత్రాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[30/01, 04:33] +91 95058 13235: *30.1.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఆరవ అధ్యాయము*

*అరిష్టాసుర (వృషభాసుర) వధ - కంసుడు శ్రీకృష్ణుని కడకు అక్రూరుని పంపుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*36.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*ఇత్యాజ్ఞాప్యార్థతంత్రజ్ఞ ఆహూయ యదుపుంగవమ్|*

*గృహీత్వా పాణినా పాణిం తతోఽక్రూరమువాచ హ॥9639॥*

పరీక్షిన్మహారాజా! స్వార్థప్రయోజనములకై ఉపాయములను పన్నుటలో మేటియైన కంసుడు ఇట్లు ఆజ్ఞాపించి, ముష్టిక చాణురాదులను పంపివైచిన పిమ్మట యదువంశజులలో ప్రముఖుడైన అక్రూరుని పిలిపించెను. పిదప కంసుడు అక్రూరునితో కరచాలనమొనర్చి, అతనితో ఇట్లనెను.

*36.28 ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*భో భో దానపతే మహ్యం క్రియతాం మైత్రమాదృతః|*

*నాన్యస్త్వత్తో హితతమో విద్యతే భోజవృష్ణిషు॥9640॥*

మహాదాతవైన ఓ అక్రూరుడా! నీవు నాకు ఒక సహాయము చేసిపెట్టవలెను. భోజవృష్ణి వంశముల వారిలో నీవు నాకు పరమమిత్రుడవు, ఎంతయు ఆదరణీయుడవు. నా హితమును కోరెడివారిలో నీవంటివాడు మఱియొకడు లేడు.

*36.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*అతస్త్వామాశ్రితః సౌమ్య కార్యగౌరవసాధనమ్|*

*యథేంద్రో విష్ణుమాశ్రిత్య స్వార్థమధ్యగమద్విభుః॥9641॥*

సౌమ్యుడా! నేను నీకు అప్పగించబోవు కార్యము మిగుల బరువైనది. అందువలన స్వీయప్రయోజనములను సాధించుకొనుటలో సమర్థుడైన ఇంద్రుడు విష్ణువునువలె నేను నిన్ను   ఆశ్రయించుచున్నాను.

*36.30 (ముప్పదియవ శ్లోకము)*

*గచ్ఛ నందవ్రజం తత్ర సుతావానకదుందుభేః|*

*ఆసాతే తావిహానేన రథేనానయ మా చిరమ్॥9642॥*

నీవు వెంటనే నందవ్రజమునకు వెళ్ళుము. అక్కడ వసుదేవుని కుమారులైన బలరామకృష్ణులు కలరు. నీవు ఈ రథముపై ఆ ఇరువురిని తీసికొనిరమ్ము. ఇక ఏమాత్రమూ ఆలసింపకుము.

*36.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*నిసృష్టః కిల మే మృత్యుర్దేవైర్వైకుంఠసంశ్రయైః|*

*తావానయ సమం గోపైర్నందాద్యైః సాభ్యుపాయనైః॥9643॥*

శ్రీమహావిష్ణువును ఆశ్రయించుకొని యుండెడి బ్రహ్మాది దేవతలచే నా మృత్యువు బలరామకృష్ణులద్వారా జరుగవలెనని నిశ్చయింపబడినట్లు వినియున్నాను. అందువలన ఆ ఇరువురిని ఇచటికి తీసికొనిరమ్ము. వారితో గూడి, తమ తమ కానుకలతో పాటుగా నందుడు మొదలగు గోపాలురనుకూడ తీసికొనిరమ్ము.

*36.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*ఘాతయిష్య ఇహానీతౌ కాలకల్పేన హస్తినా|*

*యది ముక్తౌ తతో మల్లైర్ఘాతయే వైద్యుతోపమైః॥9644॥*

బలరామకృష్ణులు ఇచటికి వచ్చిన పిమ్మట మృత్యుతుల్యమైన *కువలయాపీడము* అను ఏనుగుచే వారిని చంపించెదను. ఒకవేళ ఆ మదపుటేనుగు నుండి తప్పించుకొనినచో, పిడుగులవంటి మల్లయోధులచే వారిని నిహతులను గావించెదను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[30/01, 20:30] +91 95058 13235: *30.1.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఆరవ అధ్యాయము*

*అరిష్టాసుర (వృషభాసుర) వధ - కంసుడు శ్రీకృష్ణుని కడకు అక్రూరుని పంపుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️

*36.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*తయోర్నిహతయోస్తప్తాన్ వసుదేవపురోగమాన్|*

*తద్బంధూన్నిహనిష్యామి వృష్ణిభోజదశార్హకాన్॥9645॥*

ఆ ఇరువురు మృత్యువు పాలగుటతో వసుదేవుడు మొదలగువారును, వారి బంధువులును, వృష్ణి, భోజ, దశార్హ వంశములకు చెందిన తదితరులు మిగుల పరితపింతురు.

*36.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*ఉగ్రసేనం చ పితరం స్థవిరం రాజ్యకాముకమ్|*

*తద్భ్రాతరం దేవకం చ యే చాన్యే విద్విషో మమ॥9646॥*

*36.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*తతశ్చైషా మహీ మిత్ర భవిత్రీ నష్టకంటకా|*

*జరాసంధో మమ గురుర్ద్వివిదో దయితః సఖా॥9647॥*

నా తండ్రియగు ఉగ్రసేనుడు వృద్ధుడైనను ఇంకను ఆయనకు రాజ్యకాంక్షతీరలేదు. అతనిని, అతని సోదరుడగు దేవకుని, నాకు శత్రువులైన తదితరులను గూడ చంపితీరెదను. మిత్రుడా! అంతటితో ఈ భూతలమున నాకు శత్రువులే ఉండరు.

*36.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*శంబరో నరకో బాణో మయ్యేవ కృతసౌహృదాః|*

*తైరహం సురపక్షీయాన్ హత్వా భోక్ష్యే మహీం నృపాన్॥9648॥*

మిత్రమా! జరాసంధుడు నాకు గురువు, పిల్లనిచ్చిన మామ. ద్వివిదుడు ప్రాణమిత్రుడు. శంబరుడు, నరకుడు, బాణుడు మున్నగు ప్రముఖులు నా సహాయమును కోరుకొనుచు, నాయందు బద్ధానురాగులై యున్నారు. ఈ అందఱి సహకారముతో నేను దేవతల పక్షమున నిల్చియున్న రాజులను అందఱిని సంహరించి, రాజ్యభోగములను అనుభవించెదను.

*36.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*ఏతజ్జ్ఞాత్వాఽఽనయ క్షిప్రం రామకృష్ణావిహార్భకౌ|*

*ధనుర్మఖనిరీక్షార్థం ద్రష్టుం యదుపురశ్రియమ్॥9649॥*

నేను నీకు చెప్పిన ఈ విషయములు అన్నియును పరమగోప్యములు. ధనుర్యాగమును, మధురానగరశోభలను చూచు నెపముతో బాలురైన బలరామకృష్ణులను వెంటనే ఇచటికి తీసికొనిరమ్ము".

*అక్రూర ఉవాచ*

*36.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*రాజన్ మనీషితం సధ్ర్యక్ తవ స్వావద్యమార్జనమ్|*

*సిద్ధ్యసిద్ధ్యోః సమం కుర్యాద్దైవం హి ఫలసాధనమ్॥9650॥*

*అంతట అక్రూరుడు ఇట్లు పలికెను* "కంసమహారాజా! నీవు మృత్యుముఖము నుండి తప్పించు కొనుటకై చేయుచున్న ఈ ఆలోచన బాగుగనే యున్నది. కాని, తన ప్రయత్నము ఫలించినను, ఫలింపకున్నను మానవుడు ఆ రెండింటిని సమభావముతో చూడవలయును. ఫలమును నిర్ణయించునది దైవమే.

*36.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*మనోరథాన్ కరోత్యుచ్చైర్జనో దైవహతానపి|*

*యుజ్యతే హర్షశోకాభ్యాం తథాప్యాజ్ఞాం కరోమి తే॥9651॥*

దైవానుగ్రహమునకు నోచుకొనని వారును పెద్ద పెద్ద మనోరథములను  ఆశించుచు పగటికలలు కనుచుందురు. వారి ప్రయత్నము నెఱవేఱినచో ఆనందింతురు. లేనిచో, వారు దుఃఖమగ్నులు అగుచుందురు. ఏది ఏమైనను నేను మాత్రము మీ ఆజ్ఞకు బద్ధుడను.

*శ్రీశుక ఉవాచ*

*36.40 (నలుబదియవ శ్లోకము)*

*ఏవమాదిశ్య చాక్రూరం మంత్రిణశ్చ విసృజ్య సః|*

*ప్రవివేశ గృహం కంసస్తథాక్రూరః స్వమాలయమ్॥9652॥*

*శ్రీశుకుడు వచించెను* ఆ కంసుడు అక్రూరుని మరియు మంత్రులను ఇట్లు ఆజ్ఞాపించిన పిమ్మట, వారిని పంపివైచి, తన భవనమున ప్రవేశించెను. అక్రూరుడు గూడ తన ఇంటికి చేరెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే అక్రూరసంప్రేషణం నామ షట్త్రింశోఽధ్యాయః (36)*

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి *అరిష్టాసుర (వృషభాసుర) వధ - కంసుడు శ్రీకృష్ణునికడకు అక్రూరుని పంపుట* యను ముప్పది ఆరవ అధ్యాయము (36)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[31/01, 06:02] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*227వ నామ మంత్రము* 31.01.2021

*ఓం మహామంత్రాయై నమః*

మహోత్తమమైన సప్తకోటి మహామంత్ర స్వరూపిణియైన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహామంత్రా* యను నాలుగక్షరముల నామ మంత్రమును *ఓం మహామంత్రాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు సాధకునకు సుఖసంతోషములను ప్రసాదించును, సకల కార్యార్థసిద్ధియు లభింపజేయును.

జగన్మాత సప్తకోటి మహామంత్రస్వరూపిణి. 

 *మననాత్ త్రాయతే ఇతి మంత్రః* అని అంటారు. అంటే మననం చేయడం వల్ల మనల్ని రక్షించేది అని అర్ధం. అలాంటి మహా శక్తివంతమైన మంత్రాలను మన ఋషులు అమోఘమైన తమ తపశ్శక్తితో, భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలుగా రూపాంతరం చెందాయి.  భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము ఇవి పంచభూతములు. ఇవిస్థూల రూపములు. వీటికిగల సూక్ష్మరూపములే బీజాక్షరములు. లం - పృథివీ బీజం, హం - ఆకాశబీజం, యం - వాయుబీజం, రం - అగ్నిబీజం, వం - అమృతబీజం. ఈ బీజాక్షరములకు గలశక్తి వాటి స్థూలరూపములకన్నా ఎన్నోవేల రెట్లు అధికమయినది. ఉదాహరణకు మర్రి విత్తనం చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది మొలకెత్తి మహావృక్షంగా మారితే ఆ మహా వృక్షానికి  సూక్ష్మరూపం మర్రివిత్తనం.  అంతటి స్థూలరూపమైన వృక్షాన్ని మనం చేతులలో ధరించలేము. ఆ వృక్షాన్ని బీజంగా మన చేతులలో పెట్టుకున్నాము. మంత్రశక్తి కూడా ఇలాంటిదే. నామరూపాత్మకమైన జగత్తు స్థూలరూపమయితే, ఈ జగత్తు ఆవిర్భావానికి కారణం *ఓం* అనే బీజాక్షరమే. ఈ ఓంకారమే పరబ్రహ్మస్వరూపం. అట్టి పరబ్రహ్మస్వరూపమే జగన్మాత గనుక *మహామంత్రా* యని అనబడినది.

సంస్కృతభాషకు గల ఏబై అక్షరములు ఓంకారమునుండి ఉద్భవించాయి. ఆ బీజాక్షరాలకు మహత్తరమైన శక్తి ఉన్నది. ఆ శక్తుల ఆధారంగానే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క విధమైన బీజాక్షరములను సంపుటీకరించి మనకు అనుగ్రహించారు మహాతపస్సంపన్నులైన మన ఋషులు.

ఒక్కొక్క దేవతను ప్రసన్నం చేసుకోవడానికి,అవసరాన్ని బట్టి బీజాక్షరములను మహత్తరమైన తపస్సంపన్నులైన మన ఋషులు సంపుటీకరించి మనకు ప్రసాదించారు.

ఉదాహరణకు బాలామంత్రం లోని ఐం క్లీం సౌ అను బీజాక్షరములను తీసుకుంటే ఐం - వాగ్బీజం - సరస్వతీ కటాక్షం, క్లీం - కామరాజ బీజము అనగా కోరిన కోర్కెలు సిద్ధింపజేసేది, సౌ - శక్తి బీజం అనగా  మనస్సును, శరీరాన్ని శక్తిమంతంగా  ఉంచేది. 

ఇటువంటి మంత్రాక్షరములు (బీజాక్షరములు) ఏడుకోట్లు ఉన్నాయి. ఈ సప్తకోటి మహా మంత్రముల స్వరూపమే పరమేశ్వరి. గనుకనే పరమేశ్వరి *మహామంత్రా* యని అనబడినది.

పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం మహామంత్రాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[31/01, 06:02] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*801వ నామ మంత్రము* 31.01.2021

*ఓం పుష్టాయై నమః*

ముప్పదియారు తత్త్వములతో కూడిన శరీరము గలదియై పుష్టా యనబడు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పుష్టా* యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం పుష్టాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులు ఆ తల్లి కరుణచే, ఆయురారోగ్యములు, శారీరక శక్తి సంపన్నత, కీర్తి ప్రతిష్టలతో విలసిల్లుదురు.

 ముప్పది ఆరు తత్త్వములతో విరాజిల్లునది జగన్మాత.

*ముప్పది ఆరు తత్త్వములు:*

 పంచ కర్మేంద్రియములు (5), పంచ జ్ఞానేంద్రియములు (5),  పంచప్రాణములు (5), పంచ భూతములు (5), పంచ తన్మాత్రలు (5), పంచ విషయములు (5), చతుర్‌ అంతఃకరణములు (4), 35. ప్రకృతి, 36. అవ్యక్తము. 

ఇంతకు ముందు నామ మంత్రములో శ్రీమాతను *రసశేవధిః* అన్నాము. అందుచే ఆ తల్లి *పుష్టా* యని అనబడినది.

అమ్మవారు అనేక గుణములచేగాని, బ్రహ్మానందరసముతోగాని, బ్రాహ్మణులచేగాని పోషింపబడినది. ఈ బ్రహ్మాండములోని సకల గుణములు త్రిగుణాత్మకమయినవి. అమ్మవారు త్రిగుణాత్మకురాలు గనుక ఈ గుణములన్నియు ఆ తల్లి తల్లియందుండుటచే గుణములచే పోషింపబడినది. గనుక బ్రహ్మానందరసముచే పోషింప బడినదని అర్థము. బ్రాహ్మణులచే పోషింపబడినది అనగా బ్రహ్మను ఆ బ్రాహ్మణులు తెలిసికొని, వారి శిష్యులకు బోధించి, శిష్యపరం పరగా బ్రహ్మానుభూతిని లోకములో నిలబెట్టిరి. బ్రాహ్మణులచే బ్రహ్మము ఆయుష్మంతమయి ఉన్నదని వేదములో గలదు. ఇక్కడ బ్రహ్మము  అనగా వేదము అనికూడా అర్థము వచ్చును. అందుచేత పరమేశ్వరి *పుష్టా* యని అనబడినది.

అమ్మవారికి నమస్కరించునపుడు *ఓం పుష్టాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

31/01, 06:02] +91 95058 13235: *31.1.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఏడవ అధ్యాయము*

*శ్రీకృష్ణుడు "కేశి" అను దైత్యుని వధించుట - నారదుడు ఆ స్వామిని స్తుతించుట - కృష్ణప్రభువు వ్యోమాసురుని హతమార్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*

*37.1 (ప్రథమ శ్లోకము)*

*కేశీ తు కంసప్రహితః ఖురైర్మహీం  మహాహయో నిర్జరయన్ మనోజవః |*

*సటావధూతాభ్రవిమానసంకులం కుర్వన్నభో హేషితభీషితాఖిలః॥9653॥*

*37.2  (రెండవ శ్లోకము)*

*విశాలనేత్రో వికటాస్యకోటరో  బృహద్గలో నీలమహాంబుదోపమః|*

*దురాశయః కంసహితం చికీర్షుర్వ్రజం స నందస్య జగామ కంపయన్॥9654॥*.

*శ్రీశుకుడు వచించెను* మహాకాయుడైన *కేశి* అను రాక్షసుడు కంసప్రేరితుడై గుర్రమురూపమున మనోవేగముతో నందవ్రజమునకు బయలుదేఱెను. అతడు తన గిట్టలతో భూమిని చీల్చుచు సాగిపోవుచుండెను. అతనియొక్క జూలు విదలింపులకు ఆకాశమునగల మేఘములు, విమానములు చెల్లాచెదరై పోవుచుండెను. అతని భీకరమైస సకిలింపులకు విశ్వమునందలి ప్రాణులన్నియును గడగడ వణికిపోవుచుండెను. అతని నేత్రములు చాల విశాలమైనవి. వికృతముగానున్న అతని ముఖము  చెట్టుతొర్రవలె కన్పట్టుచుండెను. దృఢమైన మెడగల ఆ *కేశి* నల్లని ఒక మహామేఘమువలె ఒప్పుచుండెను. దుర్మార్గుడైన ఆ రాక్షసుడు శ్రీకృష్ణుని చంపి, తన స్వామియగు కంసునకు హితము చేయగోరినవాడై నందవ్రజమును కంపింపజేయుచు అందు ప్రవేశించెను.

*37.3 (మూడవ శ్లోకము)*

*తం త్రాసయంతం భగవాన్ స్వగోకులం  తద్ధేషితైర్వాలవిఘూర్ణితాంబుదమ్|*

*ఆత్మానమాజౌ మృగయంతమగ్రణీరుపాహ్వయత్స వ్యనదన్మృగేంద్రవత్॥9655॥*

అచట ప్రవేశించిన పిమ్మట గోకులము అంతయును భీతిల్లునట్లు ఆ దైత్యుడు సకిలింపసాగెను. మేఘములు అన్నియును క్రిందుమీదగునట్లుగా తన తోకను గిరగిర త్రిప్పసాగెను. అతడు తనతో పోరాడుటకై శ్రీకృష్ణుని కొఱకు వెదకుచుండెను. అంతట కృష్ణభగవానుడు సింహమువలె గర్జించుచు, ఆ రాక్షసుని యెదుట నిలిచి, అతనిని యుద్ధమునకు కవ్వించెను.

*37.4 (నాలుగవ శ్లోకము)*

*స తం నిశామ్యాభిముఖో ముఖేన ఖం పిబన్నివాభ్యద్రవదత్యమర్షణః|*

*జఘాన పద్భ్యామరవిందలోచనం  దురాసదశ్చండజవో దురత్యయః॥9656॥*

*37.5 (ఐదవ శ్లోకము)*

*తద్వంచయిత్వా తమధోక్షజో రుషా ప్రగృహ్య దోర్భ్యాం పరివిధ్య పాదయోః|*

*సావజ్ఞముత్సృజ్య ధనుః శతాంతరే యథోరగం తార్క్ష్యసుతో వ్యవస్థితః॥9657॥*

అంతట కేశీ రాక్షసుడు తనను యుద్ధమునకు ఱెచ్చగొట్టుచు, ఎదుట నిలిచియున్న శ్రీకృష్ణుని జూచెను. వెంటనే అతడు మిక్కిలి క్రోధోద్రిక్తుడై ఆకాశమును త్రాగుచున్నవానివలె నోటిని తెఱచి, ఆ ప్రభువు మీదికి విజృంభించెను. పరీక్షిన్మహారాజా! ఆ రాక్షసుని వేగము ప్రచండమైనది. ఇతరులు ఎదిరించుటకు శక్యము కానివాడు. ఎంతటివారును అతని సమీపించుటకు వెనుకాడుదురు. అట్టి ఆ రాక్షసుడు తన వెనుక కాళ్ళతో శ్రీకృష్ణుని తన్నబోయెను. కాని, ఆ స్వామి నేర్పుగా ఆ దెబ్బనుండి తప్పించుకొనెను. ఇంద్రియాతీతుడైన ఆ పరమాత్మను ఎవడు దెబ్బతీయగలడు?  అంతట ఆ ప్రభువు కుపితుడై తన రెండు చేతులతో అతని వెనుక కాళ్ళను ఒడిసిపట్టుకొని, అవహేళనగా నవ్వుచు, గరుత్మంతుడు సర్పమునువలె గిరగిర త్రిప్పుచు, అతనిని నాలుగువందల మూరల దూరమునకు విసిరివేసి, నిబ్బరముగా నిలబడెను.

*37.6 (ఆరవ శ్లోకము)*

*స లబ్ధసంజ్ఞః పునరుత్థితో రుషా  వ్యాదాయ కేశీ తరసాఽఽపతద్ధరిమ్|*

*సోఽప్యస్య వక్త్రే భుజముత్తరం స్మయన్ ప్రవేశయామాస యథోరగం బిలే॥9658॥*

అప్పుడు మూర్చితుడైయున్న కేశి రాక్షసుడు క్రమముగా తేఱుకొని, కోపముతో నోఱు తెఱచి, ఆయనను మ్రింగివేయుటకై పరాక్రమించుచు ముందునకు ఉఱికెను. అంతట శ్రీకృష్ణుడు దరహాసమొనర్చుచు, పామును పుట్టలోనికి పంపినట్లు పొడవైన తన ఎడమ చేతిని నిర్భయముగా అతని నోటిలోనికి జొనిపెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[31/01, 21:34] +91 95058 13235: *31.1.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఏడవ అధ్యాయము*

*శ్రీకృష్ణుడు "కేశి" అను దైత్యుని వధించుట - నారదుడు ఆ స్వామిని స్తుతించుట - కృష్ణప్రభువు వ్యోమాసురుని హతమార్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*37.7 (ఏడవ శ్లోకము)*

*దంతా నిపేతుర్భగవద్భుజస్పృశస్తే  కేశినస్తప్తమయః స్పృశో యథా|*

*బాహుశ్చ తద్దేహగతో మహాత్మనో యథాఽఽమయః సంవవృధే ఉపేక్షితః॥9659॥*

సహజముగా ఆ స్వామి హస్తము మిగుల కోమలమైనదేయైనప్పటికి, అతని నోటిలోనికి జొచ్చిన పిమ్మట అది కాల్చబడిన ఇనుపకాడవలె కఠినమై బాధాకరమయ్యెను. దాని స్పర్శమాత్రముననే కేశి రాక్షసుని దంతములు అన్నియును ఊడి జలజల రాలిపోయెను. చికిత్సలేక ఉపేక్షింపబడిన జలోదరవ్యాధి ముదిరినట్లు, ఆ ప్రభువుయొక్క హస్తము క్రమముగా లావెక్కెను.

*37.8 (ఎనిమిదవ శ్లోకము)*

*సమేధమానేన స కృష్ణబాహునా  నిరుద్ధవాయుశ్చరణాంశ్చ విక్షిపన్|*

*ప్రస్విన్నగాత్రః పరివృత్తలోచనః  పపాత లేండం విసృజన్ క్షితౌ వ్యసుః॥9660॥*

*37.9 (తొమ్మిదవ శ్లోకము)*

*తద్దేహతః కర్కటికాఫలోపమాద్వ్యసోరపాకృష్య భుజం మహాభుజః|*

*అవిస్మితోఽయత్నహతారిరుత్స్మయైః  ప్రసూనవర్షైర్దివిషద్భిరీడితః॥9661॥*

శ్రీకృష్ణుని బాహువు లావుగా పెఱిగిపోవుటతో ఆ రాక్షసునకు ఊపిరాడని స్థితి ఏర్పడెను. అతని కాళ్ళు గిలగిలకొట్టుకొనసాగెను. దేహమంతయును చెమటలతో నిండిపోయెను. కండ్లు తిరుగసాగెను (గ్రుడ్లు తేలవేసెను). అంతట అతడు మలమును విసర్జించుచు అసువులను కోల్పోయి నేలపై పడిపోయెను. బాగుగా పక్వమైన నూగు దోసపండువలె ప్రాణములు లేని అతనియొక్క పొట్ట పగిలి పోయెను. అంతట ఆ మహాభాగుడగు శ్రీకృష్ణుడు తన చేతిని అతని నోటినుండి బయటకు లాగికొనెను. తాను ఏమాత్రమూ శ్రమపడకుండగనే, శత్రువు మృతుడైనందులకు ఆ స్వామికి ఎట్టి ఆశ్చర్యము కలుగులేదు. దేవతలు మాత్రము ఆ దృశ్యమునుగాంచి, మిక్కిలి ఆశ్చర్యమునకు లోనై, పూలవర్షమును గురిపించుచు ఆ మహాత్ముని మిగుల కొనియాడిరి.

*37.10 (పదియవ శ్లోకము)*

*దేవర్షిరుపసంగమ్య భాగవతప్రవరో నృప|*

*కృష్ణమక్లిష్టకర్మాణం రహస్యేతదభాషత॥9662॥*

పరీక్షిన్మహారాజా! అప్పుడు భాగవతోత్తముడైన నారదమహర్షి అచటికి చేరెను. పిమ్మట ఆ దేవర్షి, ఎంతటి క్లిష్టకార్యములనైన అవలీలగా సాధింపగల కృష్ణపరమాత్మతో ఏకాంతమున ఇట్లు వచించెను-

*37.11 (పదకొండవ శ్లోకము)*

*కృష్ణ కృష్ణాప్రమేయాత్మన్ యోగేశ జగదీశ్వర|*

*వాసుదేవాఖిలావాస సాత్వతాం ప్రవర ప్రభో॥9663॥*

*37.12  (పండ్రెండవ శ్లోకము)*

*త్వమాత్మా సర్వభూతానామేకో జ్యోతిరివైధసామ్|*

*గూఢో గుహాశయః సాక్షీ మహాపురుష ఈశ్వరః॥9664॥*

"వసుదేవుని తనయుడవైన కృష్ణా! ఓ కృష్ణా! నీవు మనోవాక్కులకు (ఎట్టి ప్రమాణములకును) అందనివాడవు. యోగేశ్వరుడవు. జగత్తును నియంత్రించువాడవు. నీవు సకలప్రాణులలోను అంతర్యామివై యుందువు. ప్రాణులన్నియును నీలోనుండును. భక్తులకు ఏకైక లక్ష్యమైనవాడవు. యదువంశ శిరోమణివి, మాకు ప్రభువుడవు. ఒకే అగ్ని సమిధలన్నింటిలో వ్యాప్తమై యుండునట్లు, నీవు సకలప్రాణులలో ఆత్మస్వరూపుడవై యుందువు. ఐనను పంచకోశమయమైన గుహలయందు   (శరీరములయందు) దాగియుందువు. నీవు పరమపురుషుడవు, అందఱిని నియంత్రించువాడవు. సర్వసాక్షివి నీవే.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[01/02, 04:47] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*228వ నామ మంత్రము* 01.02.2021

*ఓం మహాయంత్రాయై నమః*

పూజాచక్రము, పద్మచక్రము, అమృతఘటము, మేరులింగము అను అనేక విధములయిన యంత్రములే తన స్వరూపమై విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహాయంత్రా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం మహాయంత్రాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు భక్తులకు ధర్మార్థకామములు అను పురుషార్థముల నాచరించుటలో దీక్షాబద్ధతను ప్రసాదించును. పునర్జన్మరాహిత్యమైన మోక్షమునందుటకు మార్గమును సుగమము చేసి అనుగ్రహించును.

పూజాచక్రము, పద్మచక్రము, అమృతఘటము, మేరులింగము అని వివిధములగు యంత్రముల స్వరూపమే తనదిగా జగన్మాత విరాజిల్లుచున్నది.

అన్ని మంత్రములకంటె శ్రీవిద్య సర్వోత్తమమైనది.      

యంత్రము తంత్రము లో శక్తికీ శక్తి యొక్క ప్రతిరూపాలకీ సూచికలుగా ఉపయోగించబడే పరికరములు. ఇవి సాధారణంగా రేఖా చిత్రాల రూపంలో ఉంటాయి. ఇవి ద్విమితీయంగాను (పొడవు, వెడల్పులుగా) త్రిమితీయంగాను (పొడవు, వెడల్పు మరియు ఎత్తులుగా) ఉంటాయి. 

ఉదాహరణకు:- శ్రీచక్రం:

*భూప్రస్తారం*: రేఖాచిత్రం వలె ద్విమితీయంగా ఉంటుంది.

*మేరు ప్రస్తారం* పిరమిడ్ వలె త్రిమీతీయంగా  నిర్మాణించబడితే, (మేరు పర్వతాన్ని సూచించే) మహా మేరు అని అంటారు.

*కైలాస ప్రస్తారం*   ఇది కూడా మేరుప్రస్తారం వలె త్రిమితీయంగా ఉంటుంది. కానీ   కైలాస ప్రస్తారం శ్రీచక్రమేరు ప్రస్తారానికి కొంచం విభిన్నంగా ఉంటుంది. అదేమిటంటే

శ్రీ చక్రాలలో తొమ్మిది చక్రాలు ఉంటాయి. ఇందులో ఐదు దేవి చక్రాలు, నాలుగు శివ చక్రాలు. 

కానీ కైలాస ప్రస్తారంలో ఐదు శివ చక్రాలు, నాలుగు దేవి చక్రాలు ఉంటాయి.

యంత్రము అనేది మంత్రమువలె గురుముఖతా పొందవలసినది. సాంప్రదాయబద్ధంగా ఉండాలి. అప్పుడే  ఆ యంత్రమును పూజించుటకు ఉపయోగించాలి.

ప్రతీ యంత్రమునకు సృష్టిక్రమము, సంహారక్రమము అనేవి ముఖ్యంగా ఉంటాయి. అలాగే స్థితి క్రమం కూడా ఉంటుంది. బిందువునుండి భూపురం వరకూ సృష్టిక్రమమయితే, భూపురం నుండి  బిందువు వరకూ సంహారక్రమము అవుతుంది. యంత్రాన్ని అర్చించునపుడు ఈ రెండు క్రమములలోను అర్చించవలెను. యంత్రానికి జరిగే పూజ సంహారాంతంగా  (భూపురం నుండి బిందువు వద్దకు) ఉండాలి. సర్వమంత్రములు (సప్తకోటి మంత్రములు) పరమేశ్వరి స్వరూపం అని ఎలా అయితే భావించామో, అలాగే సర్వతంత్రములు ఆ పరమేశ్వరి రూపమని భావించామో, ఆ పరమేశ్వరి సర్వయంత్రస్వరూపిణి గనుక అమ్మవారు *మహాయంత్రా* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మహాయంత్రాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[01/02, 04:47] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*802వ నామ మంత్రము* 01.02.2021

*ఓం పురాతనాయై నమః*

సృష్టికి ప్రారంభానికి ముందు ఉన్నది నిర్గుణమైన, నిరాకారమైన పరబ్రహ్మ మొక్కటే. అట్టి పరబ్రహ్మ స్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పురాతనా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం పురాతనాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ ఆది పరాశక్తియైన లలితాంబను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి ఐహికముగా శాంతిసౌఖ్యములు ప్రసాదించి, పునర్జన్మరాహిత్యమైన కైవల్యసాధనకు కావలసిన దైవచింతన, నిశ్చలచిత్తమును అనుగ్రహించును.

ఈ సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త, పరిరక్షకురాలు, వినాశకారి ఆది పరాశక్తే అని సూచించబడింది. ఆమె పరబ్రహ్మస్వరూపిణి. సృష్టికి ప్రారంభానికి ముందు ఆ పరబ్రహ్మ నిర్గుణమైనది, నిరాకారమైసది. లోకాలను సృష్టించింది, లోకపాలకులను ఏర్పరచినది ఆ పరబ్రహ్మమే. ఈ విధంగా సృష్టికి ఫూర్వమే పరబ్రహ్మ స్వరూపిణియైన  అమ్మవారు ఉన్నది గనుక *పురాతనా* యని అనబడినది.  అందుకే ఆ తల్లిని ఆదిపరాశక్తి యని కూడా అన్నాము. పరమేశ్వరి దేశకాలములచేత విభజించలేము (కొలవలేము) - *దేశకాలాపరిచ్ఛిన్నా* (701వ నామ మంత్రము - దేశ  కాల అపరిచ్ఛిన్నా) గనుకనే *పురాతనా* యని అనబడినది. మానవుడు వందసంవత్సరములు జీవించవచ్చు. అలాగే బ్రహ్మ ఆయువు ఒక కల్పం. కాని పరబ్రహ్మకు ఆది, మధ్యము, అంతము లేదు. అనగా పరబ్రహ్మస్వరూపిణియైన అమ్మవారు ఎప్పటి నుంచో ఉన్నారు. ఎప్పుడూ ఉన్నారు. ఎప్పటికీ ఉంటారు. గనుకనే *పురాతనా* యని ఆ తల్లి అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం పురాతనాయై నమః* అని యనబడినది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[01/02, 04:47] +91 95058 13235: *1.2.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఏడవ అధ్యాయము*

*శ్రీకృష్ణుడు "కేశి" అను దైత్యుని వధించుట - నారదుడు ఆ స్వామిని స్తుతించుట - కృష్ణప్రభువు వ్యోమాసురుని హతమార్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*37.13 (పదమూడవ శ్లోకము)*

*ఆత్మనాఽఽత్మాఽఽశ్రయః పూర్వం మాయయా ససృజే గుణాన్|*

*తైరిదం సత్యసంకల్పః సృజస్యత్స్యవసీశ్వరః॥9665॥*

*శ్రీకృష్ణునితో నారదుని పల్కులు:*

స్వామీ! నీవు సకలజగత్తునకును అధిష్ఠాతవు. సర్వాధిష్ఠానమైన నీకు వేఱొక అధిష్ఠాతలేదు. సృష్ట్యాదియందు నీ యోగమాయద్వారా సత్త్వరజస్తమో గుణములను సృష్టింతువు. ఆ గుణములను స్వీకరించి జగత్తుయొక్క ఉత్పత్తి, స్థితి, లయములను  నెఱపుచుందువు. నీవు సర్వశక్తిమంతుడవు. సత్యసంకల్పుడవు.

*37.14 (పదునాలుగవ శ్లోకము)*

*స త్వం భూధరభూతానాం దైత్యప్రమథరక్షసామ్|*

*అవతీర్ణో వినాశాయ సేతూనాం రక్షణాయ చ॥9666॥*

*శ్రీకృష్ణునితో నారదుని పల్కులు:*

పరమపురుషా! భూపతుల రూపములలోనున్న దైత్యప్రముఖులకును, లోకకంటకులైన రాక్షసులను నశింపజేయుటకును, సాధుపుంగవులను (సత్పురుషులను) పరిరక్షించుటకును నీవు అవతరించుచుందువు.

*37.15 (పదునైదవ శ్లోకము)*

*దిష్ట్యా తే నిహతో దైత్యో లీలయాయం హయాకృతిః|*

*యస్య హేషితసంత్రస్తాస్త్యజంత్యనిమిషా దివమ్॥9667॥*

*శ్రీకృష్ణునితో నారదుని పల్కులు:*

దేవా! హయాసురుని యొక్క క్రూరమైన సకిలింపులకు దేవతలు ఎల్లరును భయగ్రస్తులై సురలోకమును వీడి పాఱిపోవుచుండిరి. కాని, అట్టి క్రూరాత్ముడైన కేశి దైత్యుని నీవు అవలీలగా సంహరించితివి. ఇది మా అందఱికిని ఆనందదాయకము.

*37.16 (పదమూడవ శ్లోకము)*

*చాణూరం ముష్టికం చైవ మల్లానన్యాంశ్చ హస్తినమ్|*

*కంసం చ నిహతం ద్రక్ష్యే పరశ్వోఽహని తే విభో॥9668॥*

*శ్రీకృష్ణునితో నారదుని పల్కులు:*

ప్రభూ! ఎల్లుండి (త్వరలోనే) నీవు చాణూరుని, ముష్టికుని, తదితర మల్లయోధులను, *కువలయాపీడము* అను మదపుటేనుగును, కడకు కంసునిగూడ వధించుట నేను చూచెదను.

*37.17 (పదిహేడవ శ్లోకము)*

*తస్యాను శంఖయవనమురాణాం నరకస్య చ|*

*పారిజాతాపహరణమింద్రస్య చ పరాజయమ్॥9669॥*

*శ్రీకృష్ణునితో నారదుని పల్కులు:*

అనంతరము నీవు శంఖాసురుని, కాలయవనుని, మురాసురుని, నరకాసురుని వధింతువు. పిదప నీవు నందనవనము నుండి పారిజాత వృక్షమును తీసికొనవచ్చు చుండగా నిన్ను ఎదురించిన ఇంద్రునకు నీ పరాక్రమమును చవిచూపింతువు (ఇంద్రుని పరాజితునిగావింతువు).

*37.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*ఉద్వాహం వీరకన్యానాం వీర్యశుల్కాదిలక్షణమ్|*

*నృగస్య మోక్షణం పాపాద్ద్వారకాయాం జగత్పతే॥9670॥*

*శ్రీకృష్ణునితో నారదుని పల్కులు:*

కృప, పరాక్రమము, సౌందర్యము మొదలగు నీ గుణములను శుల్కముగాజేసి, రాజకన్యలను (నరకాసురుని నిర్బంధములో నున్న రాజకన్యలను)  వివాహమాడెదవు. నృగమహారాజునకు శాపవిముక్తిని ప్రసాదింతువు. పరమేశ్వరా! నీమహత్త్వమును ప్రకటించునట్టి ఈ కృత్యములను అన్నింటిని నీవు ద్వారకయందే ఉండియే నెఱపుదువు.

*37.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*స్యమంతకస్య చ మణేరాదానం సహ భార్యయా|*

*మృతపుత్రప్రదానం చ బ్రాహ్మణస్య స్వధామతః॥9671॥*

*శ్రీకృష్ణునితో నారదుని పల్కులు:*

జాంబవంతుని జయించి, శ్యమంతకమణిని గైకొని, అతని అభ్యర్ధనపై అతని కూతురగు 'జాంబవతి' ని పెండ్లియాడెదవు. మృతుడైన బ్రాహ్మణ కుమారుని (సాందీపుని కుమారుని) సజీవునిగావించి, యమలోకమునుండి తీసికొనివచ్చి, గురుదక్షిణగా సాందీపునికి అప్పగించెదవు.

*37.20 (ఇరువదియవ శ్లోకము)*

*పౌండ్రకస్య వధం పశ్చాత్కాశిపుర్యాశ్చ దీపనమ్|*

*దంతవక్త్రస్య నిధనం చైద్యస్య చ మహాక్రతౌ॥9672॥*

*శ్రీకృష్ణునితో నారదుని పల్కులు:*

పిమ్మట గర్వితుడైన పౌండ్రకవాసుదేవుని వధించెదవు. నీయెడ ద్వేషభావమును పూని, అపరాధ మొనర్చిన, కాశీరాజగు సుదక్షిణునితో పాటు, అతని నివాసభూమియైన కాశీపురమును గూడ నీ చక్రప్రయోగముతో దగ్ధమొనర్చెదవు. 

సుదక్షిణుడు కాశీ ప్రభువు. ఇతడు పౌండ్రకవాసుదేవునకు మిత్రుడు. గర్వితుడైన పౌండ్రకవాసుదేవుని శ్రీకృష్ణుడు తుదముట్టించెను. ఈ సుదక్షిణుడు తన మిత్రుని చంపిన శ్రీకృష్ణునిపై శత్రుభావము వహించి, తన పగను తీర్చుకొనుటకై అభిచారహోమమును నిర్వహించెను. ఆ హోమాగ్నినుండి పుట్టిన *కృత్య* ద్వారకానగరముపై దాడిచేసి దానిని దహించి వేయసాగెను. అప్పుడు శ్రీకృష్ణుడు చక్రమును ప్రయోగింపగా అది *కృత్య* ను వెంటాడెను. *కృత్య* విధిలేక కాశీనగరము చేరగా, ఆ చక్రము కృత్యను, సుదక్షిణుని, కాశీ నగరమును దహించివేసెను. 

శ్రీకృష్ణా! ధర్మరాజొనర్చెడి రాజసూయ యాగసందర్భమున శిశుపాలుడు (చేది దేశమునకు ప్రభువగు శిశుపాలుడు) నీ యెడ అపరాధము చేయగా అతనిని సంహరించెదవు. అట్లే దుష్టుడగు దంతవక్త్రుడు నిన్ను ఎదిరింపగా అతనిని గూడ నీవు వధించెదవు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[01/02, 21:05] +91 95058 13235: *1.2.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఏడవ అధ్యాయము*

*శ్రీకృష్ణుడు "కేశి" అను దైత్యుని వధించుట - నారదుడు ఆ స్వామిని స్తుతించుట - కృష్ణప్రభువు వ్యోమాసురుని హతమార్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*37.20 (ఇరువదియవ శ్లోకము)*

*యాని చాన్యాని వీర్యాణి ద్వారకామావసన్ భవాన్|*

*కర్తా ద్రక్ష్యామ్యహం తాని గేయాని కవిభిర్భువి॥9673॥*

*నారదుడు శ్రీకృష్ణునితో పలికిన పలుకులు*

పరమపూజ్యుడవైన కష్ణా! ద్వారకలో నివసించుచునే నీవు ఇంకను పరాక్రమోచితములైన పెక్కు ఘనకార్యములను నెఱపెదవు. వాటిని నేను దర్శించెదను. ఈ భూతలమునగల మహాకవులెల్లరును మున్ముందువలె వాటిని ప్రస్తుతింతురు.

*37.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*అథ తే కాలరూపస్య క్షపయిష్ణోరముష్య వై|*

*అక్షౌహిణీనాం నిధనం ద్రక్ష్యామ్యర్జునసారథేః॥9674॥*

*నారదుడు శ్రీకృష్ణునితో పలికిన పలుకులు*

దేవా! అటుమీదట నీవు కురుక్షేత్రయుద్ధమున అర్జునునకు రథసారధిగా కాలరూపుడవై భూభారమును తొలగించు నిమిత్తమున పెక్కు అక్షౌహిణుల సంఖ్యతో సైన్యములను సంహరింపజేసెదవు. ఆ సంఘటనలను అన్నింటిని నేను తిలకింతును.

*37.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*విశుద్ధవిజ్ఞానఘనం స్వసంస్థయా  సమాప్తసర్వార్థమమోఘవాంఛితమ్|* 

*స్వతేజసా నిత్యనివృత్తమాయాగుణప్రవాహం భగవంతమీమహి॥9675॥*

*నారదుడు శ్రీకృష్ణునితో పలికిన పలుకులు*

షడ్గుణైశ్వర్యసంపన్నుడవైన పురుషోత్తమా! నీవు శుద్ధజ్ఞానైక స్వరూపుడవు. నిరతిశయానంద స్వాత్మానుభవ నిష్ఠతో సకల ప్రయోజనములను పొందినవాడవు. అన్నియును అమోఘములు. నీ తేజస్సుతో మాయా ప్రవాహములను నివృత్తము చేయుదువు. అట్టి మహిమాన్వితుడవైన నిన్ను శరణుజొచ్చెదను.

*37.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*త్వామీశ్వరం స్వాశ్రయమాత్మమాయయా  వినిర్మితాశేషవిశేషకల్పనమ్|*

*క్రీడార్థమద్యాత్తమనుష్యవిగ్రహం నతోఽస్మి ధుర్యం యదువృష్ణిసాత్వతామ్॥9676॥*

*నారదుడు శ్రీకృష్ణునితో పలికిన పలుకులు*

నీవు స్వతంత్రుడవై జగత్తును నియమించెదవు. నీ మాయాశక్తిచేత సకలవిశేషముల (నామరూపముల) సమాహారమగు జగత్తును నీవు కల్పించితివి. ఇప్పుడు ఈ కాలమునందు లీలలను ప్రకటించుటకొరకై మానవరూపమున అవతరించితివి. యదు, వృష్ణి, సాత్త్వత వంశజులలో నీవు శ్రేష్ఠుడవు. నీకు నేను నమస్కరించుచున్నాను.

*శ్రీశుక ఉవాచ*

*37.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*ఏవం యదుపతిం కృష్ణం భాగవతప్రవరో మునిః|*

 .

*ప్రణిపత్యాభ్యనుజ్ఞాతో యయౌ తద్దర్శనోత్సవః॥9677॥*

*శ్రీశుకుడు వచించెను* భాగవతోత్తముడైన నారదమహాముని కృష్ణభగవానుని దర్శనభాగ్యమునకు సంతోషముతో పులకరించిపోయెను.ఆ మహర్షి ఈ విధముగా పలురీతుల ప్రస్తుతించి, నమస్కరించి, ఆ స్వామి ఆజ్ఞ గైకొని, స్వస్థానమునకు వెళ్ళిపోయెను.

*37.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*భగవానపి గోవిందో హత్వా కేశినమాహవే|*

*పశూనపాలయత్పాలైః ప్రీతైర్వ్రజసుఖావహః॥9678॥*

శ్రీకృష్ణభగవానుడు యుద్ధమున *కేశి* రాక్షసుని హతమార్చిన పిమ్మట తనకు మిగుల ప్రీతిపాత్రులైన గోపాలురతో గూడి ఎప్పటివలె పశుపాలనమునందు నిమగ్నుడాయెను. ఆ స్వామి తన అద్భుత లీలలతో వ్రజవాసులకు సుఖములను చేకూర్చుచుండెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[02/02, 05:08] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*803వ నామ మంత్రము* 02.02.2021

*ఓం పూజ్యాయై నమః*

అన్నిటికంటే పూర్వమున ఉండి *పురాతనా* యని అనబడుతూ, బ్రహ్మోపేంద్రమహేంద్రాదులే గాక యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ, సిద్ధ, సాధ్య, రాక్షస మొదలైన వారును, మానవులందరిచేతా పూజలందుకుంటున్న ఆదిపరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పూజ్యా* యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం పూజ్యాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఆ జగదీశ్వరి సుఖశాంతులు, సిరిసంపదలు, ఆయురారోగ్యములు ప్రసాదించును.

ఇంతకు ముందు (802వ) నామ మంత్రములో ఆ పరమేశ్వరి *పురాతనా* యని అన్నాము. అంటే సమస్తసృష్టికీ, త్రిమూర్తులకు, ఇంద్రాది లోకపాలురకన్నను ముందు నుంచే ఉన్నదనియు, అన్నిటికీ ఆ శ్రీమాతే ఆది యగుటచేత *పురాతనా* యని అనబడినది.  అందుచేతనే బ్రహ్మోపేంద్రాది దేవతలు మాత్రమేగాక, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు మొదలైవారిచే పూజింపతగినది.

ఈ జగమంతా జగన్మాతయే. శక్తిపీఠములుగాను, ద్వాదశ జ్యోతిర్లింగములయందు పరమేశ్వరునితో అర్ధాంగియై, గ్రామగ్రామానా గ్రామదేవతగా, వనములయందు వనదేవతగా, గిరిశిఖరములందు కొండదేవతగా, జీవకోటియందు పంచప్రాణములుగా విలసిల్లుతూ పూజలందుకొనుచున్నది గనుకనే, ఆ తల్లి *పూజ్యా* యని అనబడినది. ఆ తల్లి సర్వమంత్రస్వరూపిణిగా, సర్వతంత్రాత్మికగా, సర్వయంత్రాత్మికగా విలసిల్లుతూ పుజలందుకొనుటచే *పూజ్యా* యని అనబడినది. 

అటువంటి పరబ్రహ్మ స్వరూపిణికి నమస్కరించునపుడు *ఓం ఫూజ్యాయై నమః* యని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[02/02, 05:08] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*229వ నామ మంత్రము* 02.02.2021

*ఓం మహాసనాయై నమః*

షట్త్రింశత్తత్త్వములను ఆశ్రయించుకొని, వాటినే తన గొప్ప నివేశనముగా, మహాసనముగా విలసిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహాసనా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం మహాసనాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకుడు ఆ తల్లి కరుణచే తన సాధనయందు నిశ్చలచిత్తమును కలిగి, దీక్షాబద్ధుడై      సిద్ధిపొందే దిశగా మనసును మరల్చి పరమేశ్వరి అనుగ్రహమును ప్రాప్తింపజేసుకొనును.

క్షితి మొదలైన తత్త్వములు ముప్పది ఆరు. అవి *మూలప్రకృతి*, *మహదహంకారములు* (జీవాత్మ- పరమాత్మ చర్చలలోనూ, ఇతర తాత్త్విక చింతనలలోనూ ప్రస్తావనకు వచ్చే ఈ రెండు పదాలు ఒక భావాన్ని సూచించే సందర్భం ఉన్నది. మహత్‌ అంటే గొప్ప. మహత్‌తత్త్వం అంటే గొప్పతత్త్వమనీ, మహదహంకారం అంటే గొప్ప అహంకారమనీ నైఘంటుకార్థం. జ్ఞానేంద్రియాలతో కూడిన బుద్ధి వ్యష్టిగానూ, సమష్టిగానూ వ్యక్తం అవుతుంది. వ్యష్టిగా అది కేవలం బుద్ధి. సమష్టిగా అది మహత్తత్త్వం, మహద హంకారం కూడా. బుద్ధికి సంబంధించిన వృత్తులు కలిగి, కర్తృత్వ లక్షణాలతో సంసారాన్ని నిర్వహిస్తుంది), *పంచతన్మాత్రలు* (రూపము, రసము,  గంధము, స్పర్శ, శబ్దము), పంచభూతములు (పృథివి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము), *జ్ఞానేంద్రియములు* (శ్రోత్రము, చర్మము, చక్షుస్సు, జిహ్వ, నాసిక), కర్మేంద్రియములు (వాక్కు, హస్తములు, పాదములు, పాయువు, ఉపస్థ), *పంచప్రాణములు* (ప్రాణము - హృదయమున నుండునది, అపానము -  గుదమున నుండునది, సమానము - నాభి మండలమున నుండునది, ఉదానము - కంఠమున నుండునది, వ్యానము - శరీరమంతట వ్యాపించి యుండునది), *ఉపప్రాణములు* (నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయ), *మనస్సు*, *జీవుడు*, *ఈశ్వరుడు* - ఇవి మొత్తము ముప్ఫది ఆరు. ఈ ముప్పది ఆరు తత్త్వములను తన ఆసనముగా కలిగినది గనుక పరమేశ్వరి *మహాసనా* యని అనబడినది.

*జగన్మాతయొక్క ఆసనములు* 

*పంచప్రణవాసనము* – శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌ: అనునవి పంచప్రణవములు. వీనిపై మంత్రారూపములో వెలయునది.

*పంచకళామయాసనము* – నివృత్తి, ప్రతిష్ట, విద్యా, శాంతి, శాంత్యతీతలు పంచ కళలు. వీని స్థానములకు పైన చిత్కళగా వెలయునది.

*పంచదిగాసనము*– పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, మధ్యలు దిక్కులు. ఈ దిక్కులు ఎల్లలుగా గల బ్రహ్మాండమును అధివసించినది.

*పంచభూతాసనము* – పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనునవి పంచ భూతములు. వీనిని అధివసించి ప్రపంచాకృతిగా వెలయునది.

*పంచముఖాసనము* – సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములు పరమేశ్వర ముఖములు. ఈదిశలు ముఖములు గల ఆసనమధిరోహించునది.

*పంచప్రేతాసనము* – బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు పంచప్రేతలు. వీరి కోళ్ళను పర్యంకముగా గల ఆసనమున వసించునది.

ఇన్ని విధములయిన ఆసనములు కలిగి యున్నది కాబట్టి శ్రీమాత *మహాసనా* యని అనబడినది.

ఇంకనూ పరమేశ్వరి ఇంతకు ముందు నామ మంత్రములో వివిరించినట్లు శ్రీచక్రయంత్రము వంటి మహాయంత్రములు తన నివాసస్థానముగా ఉన్నది గనుక *మహాసనా* యని అనబడినది.

పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం మహాసనాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[[02/02, 05:08] +91 95058 13235: *2.2.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఏడవ అధ్యాయము*

*శ్రీకృష్ణుడు "కేశి" అను దైత్యుని వధించుట - నారదుడు ఆ స్వామిని స్తుతించుట - కృష్ణప్రభువు వ్యోమాసురుని హతమార్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*37.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*ఏకదా తే పశూన్ పాలాశ్చారయంతోఽద్రిసానుషు|*

*చక్రుర్నిలాయనక్రీడాశ్చోరపాలాపదేశతః॥9679॥*

*37.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*తత్రాసన్ కతిచిచ్చోరాః పాలాశ్చ కతిచిన్నృప|*

*మేషాయితాశ్చ తత్రైకే విజహ్రురకుతోభయాః॥9680॥*

పిమ్మట ఒకనాడు గోపాలురు శ్రీకృష్ణునితోగూడి అడవికి వెళ్ళిరి. అక్కడ వారు గోవులను మేపుచు ఒక పర్వత సమీపమున నిలాయనక్రీడలను (మేకల ఆటలను లేక దాగుడు మూతలాటలను) ఆడిరి. ఆ ఆటలలో భాగముగా కొందఱు గొర్రెలుగాను, కొందరు గొర్రెల కాపరులుగను, మఱి కొందరు ఆఱితేఱిన దొంగలుగాను నటించుచు ఆ గోపాలురు తమలో తాము నిర్భయముగా క్రీడలు సలుపుచుండిరి.

*37.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*మయపుత్రో మహామాయో వ్యోమో గోపాలవేషధృక్|*

*మేషాయితానపోవాహ ప్రాయశ్చోరాయితో బహూన్॥9681॥*

*37.30 (ముప్పదియవ శ్లోకము)*

*గిరిదర్యాం వినిక్షిప్య నీతం నీతం మహాసురః|*

*శిలయా పిదధే ద్వారం చతుఃపంచావశేషితాః॥9682॥*

ఆ సమయమున మయుని కుమారుడగు మహామాయావియైన వ్యోమాసురుడు గోపాలుని రూపములో అచటికి వచ్చి వారిలో ఒకడయ్యెను. ఆ మహామాయావి ఆ ఆటలలో చోరుడుగా మాఱి, మేకలుగా నటించుచు ఆడుచున్న పెక్కుమంది గోపాలురను అపహరించుకొని పోయెను. అ మహాసురుడు తాను దొంగిలించుకొని పోయిన గోపాలురను అందఱిని క్రమముగా ఒక పర్వతగుహలో దాచి, ఆ గుహద్వారమును ఒక పెద్ద బండతో మూసివేసెను. చివఱకు గోపాలురలో నలుగురైదుగురు మాత్రమే మిగిలిరి.

*37.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*తస్య తత్కర్మ విజ్ఞాయ కృష్ణః శరణదః సతామ్|*

*గోపాన్ నయంతం జగ్రాహ వృకం హరిరివౌజసా॥9683॥*

*37.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*స నిజం రూపమాస్థాయ గిరీంద్రసదృశం బలీ|*

*ఇచ్ఛన్ విమోక్తుమాత్మానం నాశక్నోద్గ్రహణాతురః॥9684॥*

సజ్జనులకు అభయప్రదుడైన (శరణ్యుడైన) శ్రీకృష్ణుడు అతని దొంగతనమును గమనించెను. పిదప ఆ అసురుడు గోపాలురను దొంగిలించుకొని పోవుచుండగా ఆ స్వామి అతనిని, సింహము తోడేలునువలె బలముకొలది గట్టిగా  పట్టుకొనెను. అప్పుడు వ్యోమాసురుడు పర్వతతుల్యమైన తన నిజరూపమును దాల్చెను. ఆ మాయావి మిగుల బలశాలియే యైనను, శ్రీకృష్ణుడు గట్టిగా పట్టుకొనుటతో గిలగిలలాడుచు ఆ పట్టునుండి బయట పడుటకు మిక్కిలి పెనుగులాడియు విఫలుడాయెను.

*37.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*తం నిగృహ్యాచ్యుతో దోర్భ్యాం పాతయిత్వా మహీతలే|*

*పశ్యతాం దివి దేవానాం పశుమారమమారయత్॥9685॥*

అంతట పరాక్రమశాలియగు శ్రీకృష్ణుడు ఆ వ్యోమాసురుని తన రెండు  చేతులతో బలముగా పట్టుకొని, దేవతలు అందఱును ఆకాశమున ఉండి చూచుచుండగా, నేలపై బడవేసి, ఒక దుష్టమృగమునువలె చంపివేసెను.

*37.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*గుహాపిధానం నిర్భిద్య గోపాన్నిఃసార్య కృచ్ఛ్రతః|*

*స్తూయమానః సురైర్గోపైః ప్రవివేశ స్వగోకులమ్॥9686॥*

పిమ్మట కృష్ణపరమాత్మ గుహాద్వారమునకు అడ్డుగా ఉంచబడియున్న మహాశిలను ముక్కలు గావించెను. అనంతరము ఆ ప్రభువు గుహలో చిక్కుపడి, బాధపడుచున్న గోపాలురను బయటికి తీసికొనివచ్చెను. దేవతలయొక్క, గోపాలురయొక్క ప్రస్తుతులను అందుకొనుచు ఆ స్వామి తన గోకులమునకు చేరెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే వ్యోమాసురవధో నామ సప్తత్రింశోఽధ్యాయః (37)*

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి *శ్రీకృష్ణుడు "కేశి" అను దైత్యుని వధించుట - నారదుడు ఆ స్వామిని స్తుతించుట - కృష్ణప్రభువు వ్యోమాసురుని హతమార్చుట* యను ముప్పది ఏడవ అధ్యాయము (37)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[02/02, 21:19] +91 95058 13235: *2.2.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఎనిమిదవ అధ్యాయము*

*అక్రూరుడు రథముపై గోకులమునకు చేరుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*

*38.1 (ప్రథమ శ్లోకము)*

*అక్రూరోఽపి చ తాం రాత్రిం మధుపుర్యాం మహామతిః|*

*ఉషిత్వా రథమాస్థాయ ప్రయయౌ నందగోకులమ్॥9687॥*

*38.2 (రెండవ శ్లోకము)*

*గచ్ఛన్ పథి మహాభాగో భగవత్యంబుజేక్షణే|*

*భక్తిం పరాముపగత ఏవమేతదచింతయత్॥9688॥*

*శ్రీశుకుడు వచించెను* గొప్ప బుద్ధిశాలియైన అక్రూరుడు ఆ రాత్రిని మథురాపురమునందే గడపి, మఱనాటి ప్రాతఃకాలమున రథమునందు ఆసీనుడై, నందగోకులమునకు బయలుదేఱెను. కృష్ణపరమాత్మయొక్క దర్శనభాగ్యమునకై వెళ్ళుచున్న ఆ అక్రూరుడు ఆ స్వామిపైగల భక్తితో పరవశించిపోవుచుండెను. మార్గమధ్యమున ఆ మహాత్ముడు ఇట్లు తలపోయసాగెను.

*38.3 (మూడవ శ్లోకము)*

*కిం మయాఽఽచరితం భద్రం కిం తప్తం పరమం తపః|*

*కిం వాథాప్యర్హతే దత్తం యద్ద్రక్ష్యామ్యద్య కేశవమ్॥9689॥*

*38.4 (నాలుగవ శ్లోకము)*

*మమైతద్దుర్లభం మన్య ఉత్తమశ్లోకదర్శనమ్|*

*విషయాత్మనో యథా బ్రహ్మకీర్తనం శూద్రజన్మనః॥9690॥*

"నేను పూర్వజన్మలో ఎట్టి పుణ్యకార్యములను చేసికొనియుంటినో? ఎంతటి తపస్సును ఆచరించితినో? అర్హులైన (పాత్రులైన) వారికి ఎట్టి దానధర్మములను ఒనర్చియుంటినో గదా! నాకు ఆ శ్రీహరిని (శ్రీకృష్ణుని) దర్శించు అదృష్టము పట్టనున్నది. లేనిచో శూద్రునకు వేదప్రవచనమువలె నాా వంటి విషయలోలుడగు అజ్ఞానికి (పామరునకు) సర్వలోకస్తుత్యుడైన ఆ పరమపురుషుని దర్శనము లభించుట దుర్లభమని తలంచెదను.

*38.5 (ఐదవ శ్లోకము)*

*మైవం మమాధమస్యాపి స్యాదేవాచ్యుతదర్శనమ్|*

*హ్రియమాణః కాలనద్యా క్వచిత్తరతి కశ్చన॥9691॥*

ఇట్లు తలపోయుట సరికాదు. అధముడనే ఐనప్పటికిని నాకు కూడా శ్రీకృష్ణభగవానుని దర్శనము కలిగితీరును. కాలప్రవాహములో అందరు కొట్టుకొనిపోవుచున్నారు. ఇది యథార్ధమే. కాని, ఎవరో ఒకడు   ఎక్కడో ఒకచోట ఈ (సంసారమనెడు) నదిని తరించిపోవును.

*38.6 (ఆరవ శ్లోకము)*

*మమాద్యాఽమంగలం నష్టం ఫలవాంశ్చైవ మే భవః|*

*యన్నమస్యే భగవతో యోగిధ్యేయాంఘ్రిపంకజమ్॥9692॥*

నేడు నా అశుభములన్నీ నశించినవి. నా జన్మకూడ సఫలమైనది. ఏలనన, యోగులకు, ధ్యానగమ్యములైన శ్రీకృష్ణభగవానుని పాదపద్మములకు నేను ప్రణమిల్లుదును.

*38.7 (ఏడవ శ్లోకము)*

*కంసో బతాద్యాకృత మేఽత్యనుగ్రహం ద్రక్ష్యేఽఙ్ఘ్రిపద్మం ప్రహితోఽమునా హరేః|*

*కృతావతారస్య దురత్యయం తమః పూర్వేఽతరన్ యన్నఖమండలత్విషా॥9693॥*

ఆహా! ఈనాడు కంసుడు నాకు గొప్ప మేలునే చేకూర్చెను. కంసునిచే నందగోకులమునకు పంపబడిన నేను శ్రీకృష్ణునిగా అవతరించిన శ్రీహరి పాదపద్మములను దర్శింపగలను. పూర్వీకులు ఆ శ్రీహరి పాదపద్మముల గోళ్ళకాంతిచే దాటశక్యముకాని అజ్ఞానమనెడు చీకట్లను ఛేదించుకొని దాటిపోయిరిగదా!

*38.8 (ఎనిమిదవ శ్లోకము)*

*యదర్చితం బ్రహ్మభవాదిభిః సురైః శ్రియా చ దేవ్యా మునిభిస్ససాత్వతైః|*

*గోచారణాయానుచరైశ్చరద్వనే  యద్గోపికానాం కుచకుంకుమాంకితమ్॥9694॥*

బ్రహ్మ, శంకరుడు మొదలగు దేవతలును, జగజ్జననియైన లక్ష్మీదేవియు, భక్తులతో కూడిన మహామునులును, పరాత్పరుడైన ఆ శ్రీహరి (శ్రీకృష్ణుని) యొక్క దివ్యపాదములను ఆరాధించుచుందురు. అట్టి పవిత్ర పాదపద్మములతో అవతారపురుషుడైన శ్రీకృష్ణుడు తన అనుచరులైన గోపాలురతోగూడి గోవులను మేపుచు బృందావనమున తిరుగుచుండును (ఆ స్వామి పాదముల స్పర్శకు నోచుకొనిన బృందావనభూమి ఎంతయు ధన్యము). ఆ ప్రభువుయొక్క పాదములను గోపికలు తమ వక్షస్థలముల యందు చేర్చుకొని సేవించుచుందురు. అందువలన ఆ పురుషోత్తముని పాదములు కుంకుమాంకితము లగుచుండును. గోపికలు ఎంతటి భాగ్యశాలినులు? ఆ పరమపురుషుని పాదారవిందములను నేను కనులార దర్శింతును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[03/02, 04:03] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*804వ నామ మంత్రము* 03.02.2021

*ఓం పుష్కరాయై నమః*

సకల జీవకోటికి పోషణము కలిగించు లలితాంబకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పుష్కరా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం పుష్కరాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ శ్రీమాతను భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులు  ఆ తల్లి దయవలన అన్నవస్త్రములకు, సిరిసంపదలకు, కీర్తిప్రతిష్టలకు కొదువగాకుండా జీవించుదురు. 

పుష్కరా అనగా పుష్టిని కలిగించునది. అనగా తనసృష్టిలోని  జీవకోటికి తానే పోషణకర్తయై విలసిల్లుతుంది జగన్మాత. గనుకనే *పుష్కరా* యని అనబడినది.

నారు పోసిన దేవుడు నీరు పోయక మానడు అంటారు. అదేవిధంగా పరమేశ్వరి తన సృష్టిలోని జీవకోటి పోషణకు కావలసిన నీరు, ఆహారము, జీవించుటకు గాలి అన్నియు సమకూర్చుతుంది గనుకనే *పుష్కరా* యని అనబడినది.

*పుష్కరాఖ్యతీర్థరూపా*

పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పన్నెండు ముఖ్యమైన నదులకు పుష్కరాలు వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. గనుక పరమేశ్వరి పుష్కరదేవతయై ఆయా నదీ పుష్కరాలలో భక్తులను పునీతులనుజేస్తుంది గనక పుష్కరమనే తీర్థస్వరూపురాలు అయినది గనుక శ్రీమాత *పుష్కరా* యని అనబడినది.

ర ల అనుఅక్షరములకు భేదము లేదు గనుక *పుష్కలా* యని అంటే సర్వత్రా వ్యాపించియున్నది పరమేశ్వరి అని భావము.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం పుష్కరాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[03/02, 04:03] +91 95058 13235: *3.2.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఎనిమిదవ అధ్యాయము*

*అక్రూరుడు రథముపై గోకులమునకు చేరుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*38.9 (తొమ్మిదవ శ్లోకము)*

*ద్రక్ష్యామి నూనం సుకపోలనాసికం  స్మితావలోకారుణకంజలోచనమ్|*

*ముఖం ముకుందస్య గుడాలకావృతం ప్రదక్షిణం మే ప్రచరంతి వై మృగాః॥9695॥*

శ్రీకృష్ణుని ముఖారవిందము పరమ దర్శనీయము. అందలి చెక్కిళ్ళ నిగనిగలు మరకతమణుల కాంతులను వెదజల్లుచుండును. నాసిక సోయగములు సంపెంగ వైభవములను స్ఫురింపజేయు చుండును. చిఱునవ్వులు సింగారములను ఒలికించు చుండును. చూపులలో కారుణ్యము తొణికిసలాడుచుండును. నేత్రములు పద్మశోభలను తలపింపజేయుచుండును. ఉంగరాల ముంగురులు చూడముచ్చట గొలుపుచుండును. అట్టి ఆ స్వామియొక్క దివ్యముఖమును నేను దర్శింపబోవుచున్నాను. నా చుట్టును లేళ్ళు ప్రదక్షిణ పూర్వకముగా తిరుగుచున్నవి. దీనిని శుభసూచకముగా భావింతును.

*38.10 (పదియవ శ్లోకము)*

*అప్యద్య విష్ణోర్మనుజత్వమీయుషో  భారావతారాయ భువో నిజేచ్ఛయా|*

*లావణ్యధామ్నో భవితోపలంభనం మహ్యం న న స్యాత్ఫలమంజసా దృశః॥9696॥*

శ్రీమహావిష్ణువు భూభారమును తొలగించుటకై స్వసంకల్పముతో మానవుడుగా అవతరించుచుండును. ఆ దేవదేవుని మంగళవిగ్రహము లావణ్యలాలిత్యములకు ఆటపట్టు. ఆ పరమాత్ముని దర్శనము నేడే శీఘ్రముగా లభింపనున్నది. కావున, నా నేత్రములకు అట్టి దివ్యదర్శన భాగ్యమునకు మించి మఱియొకటి ఉండబోదు.

*38.11 (పదకొండవ శ్లోకము)*

*య ఈక్షితాహంరహితోఽప్యసత్సతోః  స్వతేజసాఽపాస్తతమోభిదాభ్రమః|*

*స్వమాయయాఽఽత్మన్ రచితైస్తదీక్షయా ప్రాణాక్షధీభిః సదనేష్వభీయతే॥9697॥*

ఆ పరమేశ్వరుడు ప్రకృతి పురుషులతో గూడిన (కార్యకారణ రూపమైన) ఈ జగత్తునకు ద్రష్ట అయ్యును అహంకార రహితుడు. జీవులలోగల అజ్ఞానమును, దానివలన ఏర్పడిన భేదభావమును ఆ స్వామి తన చిన్మయశక్తిద్వారా తొలగించును. తన యోగమాయా ప్రభావముతో భ్రూవిలాసమాత్రమున ప్రాణములు, ఇంద్రియములు, బుద్ధి మొదలగువాటితో గూడిన జీవులను తన యంశచే సృజించును. అట్లే వారి శరీరరూపమగు గృహములలో నివసించుచుండును. అంతేగాక, ఇప్పుడు ఆ స్వామి బృందావనములోని లతాకుంజములయందును, గోపికల గృహములయందును వివిధములగు లీలలను ప్రదర్శించుచుండును.

*38.12 (పండ్రెండవ శ్లోకము)*

*యస్యాఽఖిలామీవహభిః సుమంగలైర్వాచో విమిశ్రా గుణకర్మజన్మభిః|*

*ప్రాణంతి శుంభంతి పునంతి వై జగద్యాస్తద్విరక్తాః శవశోభనా మతాః॥9698॥*

భగవంతుని గుణములు (వాత్సల్య, సౌశీల్య, సౌలభ్యాది గుణములు), కర్మలు (జగత్తుయొక్క సృష్టి, స్థితి,లయములకు సంబంధించిన కర్మలు), జన్మలు (రామ, కష్ణాది అవతారములు) సమస్త పాపములను రూపుమాపునట్టివి. అవి అద్వితీయములు, మంగళకరములు (నిరతిశయ శ్రేయస్కరములు), వాటిని గూర్చి ప్రస్తుతించెడి వాక్కులు లోకమునకు  స్ఫూర్తిదాయకములు, శోభావహములు. అవి లోకములను పునీతమొనర్చును. భగవద్గుణాది ప్రతిపాదన రహితములైన వచనములు శవతుల్యములు.

*38.13 (పదమూడవ శ్లోకము)*

*స చావతీర్ణః కిల సాత్వతాన్వయే  స్వసేతుపాలామరవర్యశర్మకృత్|*

*యశో వితన్వన్ వ్రజ ఆస్త ఈశ్వరో గాయంతి దేవా యదశేషమంగళమ్॥969x॥*

అట్టి మహిమాన్వితుడైన పరమపురుషుడు తాను ఏర్పఱచిన ధర్మమర్యాదలను తాను పాటించుచు, వాటిని అనుసరించుచుండెడి దేవతలకు శుభములను చేకూర్చుటకై యాదవవంశమున లీలామానుష విగ్రహుడై అవతరించినాడు. ఆ స్వామి వ్రజభూమియందు నివసించుచు తన యశోవైభవములను విస్తరింపజేయుచున్నాడు. అఖిల మంగళకరములైన ఆ స్వామి లీలలను దేవతలు సర్వదా కీర్తించుచుందురు.

*38.14 (పదునాలుగవ శ్లోకము)*

*తం త్వద్య నూనం మహతాం గతిం గురుం త్రైలోక్యకాంతం దృశిమన్మహోత్సవమ్|*

*రూపం దధానం శ్రియ ఈప్సితాస్పదం ద్రక్ష్యే మమాసన్నుషసః సుదర్శనాః॥9700॥*

నేడు నాకు అన్నియును శుభశకునములే కనబడుచున్నవి. కావున ఈ ప్రాతఃకాలము నాకు మిగుల మంగళకరమైనది. ఆ ప్రభువు సాధుపురుషులకును, సకల లోకపాలురకును శరణ్యుడు. పరమహితకరుడు. ఆ మహాత్ముని దివ్యస్వరూపము మిగుల సౌందర్యశోభితము, ముల్లోకములను సమ్మోహపఱచు నట్టిది. చూచెడివారికి కనువిందు గావించునట్టిది. సౌందర్యరాశియైన లక్ష్మీదేవియు ఆ స్వామి అందచందాలకు ముగ్ధురాలగుచు నిత్యానపాయినియై (ఎన్నడును విడువక) ఆశ్రయించి, సేవించుచుండును. అట్టి పరమాత్ముని నేను నేడు తప్పక దర్శింతును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[03/02, 04:03] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*230వ నామ మంత్రము* 03.02.2021

*ఓం మహాయాగ క్రమారాధ్యాయై నమః*

అరువది నాలుగు యోగినీ పూజలతో కూడిన మహాయాగముచే ఆరాధింపబడు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహాయాగక్రమారాధ్యా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం మహాయాగక్రమారాధ్యాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులు ఆ తల్లి కరుణచే భౌతిక జీవనమందు అనూహ్యమైన సత్ఫలితాలను పొంది, శాంతిసౌఖ్యములతో జీవనము గడుపుదురు మరియు ఆ పరమేశ్వరి వారికి సద్గతులను ప్రసాదించును.

బ్రాహ్మి మొదలైన అష్ట మాతృకలు (బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండి, మహాలక్ష్మి) అను వారు 

శివుని పవిత్ర సంకల్పం వల్ల పరాశక్తి అంశలుగా అంధకాసుర సంహారం కొరకు ఆవిర్భవించి అంధకునిలో మూర్తీ భవించిన కామ, క్రోధాది దుష్టశక్తులన్నింటినీ చెండాడారు.  

ఈ అష్టమాతృకలలో ఒక్కొక్కరికి ఎనిమిది మంది యోగినుల చొప్పున అరవైనాలుగు మందియోగినులు ఉంటారు. శ్రీమాత బిందువులో ఉంటుంది. ఈ అరవైనాలుగుమంది యోగినులు ఎనిమిది ఆవరణలలో  ఎనిమిది దిక్కులలో ఉండగా, వీరిచే జగన్మాత సేవింపబడుతూ ఉంటుంది. ఈ అరవైనాలుగుమంది అమ్మవారితో సమానమైన రూపలావణ్యములు కలవారై ఉంటారు. అలాగే అంతటి శక్తి, మహిమలూ కలిగి ఉంటారు. ఈ అరవైనాలుగు మంది, ఒక్కొక్కరు కోటీమంది సేవకులు కలిగి ఉండగా మొత్తం అరవైనాలుగు కోట్లమందిచే  శ్రీమాత సేవింపబడుతూ ఉంటుంది.  అందుకే అమ్మవారికి *మహా చతుష్షష్టికోటి యోగినీ గణసేవితా* (237వ) నామ మంత్రము ఉన్నది.

ఈ అరువదినాలుగుమంది యోగినులనూ పూజించడమనేదే మహాయాగము. ఇలా మహాయాగక్రమముతో పూజింపబడుచున్నది గనుకనే శ్రీమాత *మహాయాగక్రమారాధ్యా* యని అనబడినది. మిగిలిన క్రమములలో చేయబడు ఆరాధనలో ఫలితమునందుట జాప్యమగునేమోగాని, ఈ మహాచతుష్షష్టికోటి యోగినీ గణములను పూజించు మహాయాగక్రమములో చేయు పుజయందు ఫలితము అతి త్వరితము.

భావోపనిషత్తునందు చెప్ఫబడినదియు, మరియు శివయోగులకు మాత్రమే సాధ్యమైనదియు అయిన మిక్కిలి రహస్యమగు యాగమునకు మహాయాగమని యందురు. అటువంటి క్రమమైన మహాయాగముచే పూజింపబడు జగన్మాత *మహాయాగక్రమారాధ్యా* యని అనబడినది.

పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం మహాయాగక్రమారాధ్యాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[03/02, 21:24] +91 95058 13235: *3.2.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఎనిమిదవ అధ్యాయము*

*అక్రూరుడు రథముపై గోకులమునకు చేరుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*38.15 (పదునైదవ శ్లోకము)*

*అథావరూఢః సపదీశయో రథాత్ప్రధానపుంసోశ్చరణం స్వలబ్ధయే|*

*ధియా ధృతం యోగిభిరప్యహం ధ్రువం నమస్య ఆభ్యాం చ సఖీన్ వనౌకసః॥9701॥*

మహాత్ములును, పురుషోత్తములును ఐన బలరామకృష్ణులు దర్శనభాగ్యము కలిగిన వెంటనే రథము నుండి క్రిందికి దిగి, వారి చరణకమలములకు ప్రణమిల్లుదును. మహాయోగులు సైతము ఆత్మసాక్షాత్కారమునకై వారి పాదపద్మములను తమ హృదయములయందు నిలిపి నిరంతరము ధ్యానించుచుందురు. నేను మాత్రము ఆ మహానుభావుల పాదారవిందములను ప్రత్యక్షముగా దర్శించి, వాటిపై సాగిలపడుదును. అంతేగాదు వారి మిత్రులైన గోపాలురకును నమస్కరింతును.

*38.16 (పదునారవ శ్లోకము)*

*అప్యంఘ్రిమూలే పతితస్య మే విభుః శిరస్యధాస్యన్నిజహస్తపంకజమ్|*

*దత్తాభయం కాలభుజంగరంహసా  ప్రోద్వేజితానాం శరణైషిణాం నృణామ్॥9702॥*

నేను శ్రీకృష్ణుని సన్నిధికి చేరి, సాష్టాంగముగా నమస్కరించి, ఆ ప్రభువు పాదారవిందములకు ప్రణమిల్లెదను. అప్పుడు ఆ పురుషోత్తముడు తన అమృతహస్తమును నా శిరస్సుపై ఉంచి, కృపతో నిమురుచు నాకు తప్పక అభయమునిచ్చును. ఏలయన, అనుక్షణము వేగముగా వెంటాడుచుండెడి మృత్యువు అనెడి సర్పధాటికి తపించుచు శరణుజొచ్చుచుండెడి భక్తులయొక్క భయమును తొలగించుచుండెడిది గదా, ఆ స్వామియొక్క దివ్యహస్తము!

*38.17 (పదిహేడవ శ్లోకము)*

*సమర్హణం యత్ర నిధాయ కౌశికస్తథా బలిశ్చాప జగత్త్రయేంద్రతామ్|*

*యద్వా విహారే వ్రజయోషితాం శ్రమం స్పర్శేన సౌగంధికగంధ్యపానుదత్॥9703॥*

శ్రీహరి (శ్రీకృష్ణుని) హస్తము మహిమాన్వితమైనది. అట్టి హస్తమునందు పూర్వము ఇంద్రుడును, బలిచక్రవర్తియు భక్తిశ్రద్ధలతో పూజాద్రవ్యములను సమర్పించి, ముల్లోకాధిపత్యమును పొందగలిగిరి. సౌగంధిక పుష్పమువలె పరిమళభరితమైన ఆ కరముయొక్క స్పర్శచేతనే ఆ స్వామి రాసలీలా విహారములయందు గోపాంగనల బడలికలను తొలగించెను.

*38.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*న మయ్యుపైష్యత్యరిబుద్ధిమచ్యుతః కంసస్య దూతః ప్రహితోఽపి విశ్వదృక్|*

*యోఽన్తర్బహిశ్చేతస ఏతదీహితం క్షేత్రజ్ఞ ఈక్షత్యమలేన చక్షుషా॥9704॥*

తన యెడ వైరభావమును కలిగియున్న కంసుడు పంపుటవలన నేను తన కడకు దూతగా వచ్చితినని ఎఱింగియు, ఆ స్వామి నాపై ఏ మాత్రమూ శత్రుభావమును కలిగియుండడు. ఏలయన, అతడు సర్వసాక్షి; అనగా  ఆ ప్రభువు సకల జనుల హృదయములయందును అంతర్యామియై విలసిల్లుచు వారి సదసద్భావములను గుర్తించునట్టి క్షేత్రజ్ఞుడు, వికారరహితుడు. నేను బాహ్యముగా కంసుని దూతనే యైనను, త్రికరణశుద్ధిగా ఆ మహాత్మునకు పరమ భక్తుడను. కనుక జ్ఞానస్వరూపుడైన ఆ దేవదేవుడు ఎట్టి సంకోచ భావమునకును తావీయక నన్ను అనుగ్రహదృష్టితోనే చూచును.

*38.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*అప్యంఘ్రిమూలేఽవహితం కృతాంజలిం మామీక్షితా సస్మితమార్ద్రయా దృశా|*

*సపద్యపధ్వస్తసమస్తకిల్బిషో  వోఢా ముదం వీతవిశంక ఊర్జితామ్॥9705॥*

నేను అంజలి ఘటించి వినమ్రుడనై, ఆ స్వామిపాదములచెంత మోకరిల్లెదను. అప్పుడు ఆ ప్రభువు దరహాసమొనర్చుచు దయార్ధ్ర హృదయుడై తన చల్లని చూపులను నాపై ప్రసరింపజేయును. పాపములు అన్నియును అప్పుడు నశించిపోవును. నేను నిస్సందేహముగా అంతులేని ఆనందమున మునిగెదను.

 *38.20 (ఇరువదియవ శ్లోకము)*

*సుహృత్తమం జ్ఞాతిమనన్యదైవతం దోర్భ్యాం బృహద్భ్యాం పరిరప్స్యతేఽథ మామ్|*

*ఆత్మా హి తీర్థీక్రియతే తదైవ మే బంధశ్చ కర్మాత్మక ఉచ్ఛ్వసిత్యతః॥9706॥*

నేను ఆ మహాత్ముని వంశమునకు చెందినవాడను, ఆయనకు హితైషిని. ఆ పురుషోత్తముడే నాకు పరమదైవము. కనుక నేను ఆయన పాదములపై వ్రాలినంతనే ఆ మహానుభావుడు తన దీర్ఘబాహువులతో నన్ను ఆత్మీయముగా అక్కున జేర్ఛుకొనును. ఆ దివ్యస్పర్శతో నేను పునీతుడనయ్యెదను. అంతేగాక నా శరీరము ఇతరులను పవిత్రము చేయునదగును. తద్ద్వారా కర్మబంధములన్నియు నశించిపోవును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[04/02, 04:02] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*231వ నామ మంత్రము*  04.02.2021

*ఓం మహాభైరవపూజితాయై నమః*

సృష్టి, స్థితి, సంహార కార్యములను తానొక్కడే నిర్వర్తించి మహత్వమును పొందిన భైరవుడు (శివుడు) మహాభైరవుడయ్యెను. అట్టి మహాభైరవుని (శివుని) చే ఆరాధింపబడిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహాభైరవపూజితా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం మహాభైరవపూజితాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ జగన్మాత సర్వాభీష్టసిద్ధిని అనుగ్రహించును.

పరమశివుడే భైరవుడు. సృష్టి, స్థితి, లయములకు ఈయనే కారణము. ఈ మూడింటినీ తానొక్కడే చేసిన మహత్వముచే మహాభైరవు డయ్యెను. అటువంటి మహాభైరవునిచే ఆరాధింపబడినది గనుక పరమేశ్వరి *మహాభైరవపూజితా* యని అనబడినది. 

*శంభుః పూజయతే దేవీం మంత్రశక్తిమయీం శుభాం|*

*అక్షమాలాం కరే ధృత్వా న్యాసేనైవ భవోద్భవ॥* (సౌభాగ్యభాస్కరం, 404వ పుట)

శివుడు అక్షమాలను చేతియందు ధరించి, న్యాసము చేత శ్రీమాతను పూజించినట్లు పద్మపురాణంలో చెప్పబడినది. 

*మహాశంభునాథో మహాయాగేన చిదగ్నికుండాత్ లలితాం ప్రాదుర్భావయా మాసే* (సౌభాగ్యభాస్కరం, 404వ పుట)

మహాశంభునాథుడు మహాయాగమునుజేసి, చిదగ్నికుండమునుండి లలితాదేవిని  ఉద్భవింపజేయుటచేత అమ్మవారు *మహాయాగక్రమారాధ్యా* యని అనబడినది.

పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం మహాభైరవపూజితాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04/02, 04:02] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*805వ నామ మంత్రము* 04.02.2021

*ఓం పుష్కరేక్షణాయై నమః*

పద్మములవంటి నేత్రములున్న జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పుష్కరేక్షణా* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం పుష్కరేక్షణాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి కరుణచే ఆయురారోగ్యములు, కార్యార్థసిద్ధి కలుగును మరియు భగవధ్యానమునందు నిశ్చల చిత్తము, దీక్షాపటిమ ఏర్పడును.

పుష్కరము అంటే తామర. *పుష్కరేక్షణా* అంటే తామరపువ్వులవంటి కన్నులు గలిగినది పరమేశ్వరి. 

సూర్యుడు విశాఖనక్షత్రమందును, చంద్రుడు కృత్తిక నక్షత్రమందున్నచో ఈ సంభవమునకు పుష్కరయోగము అని అందురు. ఈ యోగము చాలాదుర్లభము.  ఇంతటి మహాయోగ వీక్షణములచే భక్తులను అనుగ్రహించుతుంది గనుక పరమేశ్వరి *పుష్కరేక్షణా* యని అనబడినది. పద్మమునందలి కర్ణిక (బొడ్డును)  దేవతలకు భూమి. ఆ పద్మములోని శ్రేష్ఠభాగములు పర్వతములు, పద్మములోని రేకులు మ్లేచ్చదేశములు. పద్మములోని క్రిందిరేకులు సర్పములు. అంత శ్రేష్ఠముగా ఏర్పడిన ఈ భూమిని పుష్కరమనియు. ఇటువంటి భూమివిషయమువలన వేడుకగలది (క్షణా)  యగుటచే పరమేశ్వరి *పుష్కరేక్షణా* యని అనబడినది. పుష్కర అనగా అంభస్సులు. దేవతలు, మనుష్యులు, పితృదేవతలు, అసురులు అను ఈ నలుగురు అంభస్సులు అందురు. ఈ అభస్సులందు (పుష్కర) చూపుగలిగినది (ఈక్షణమ్) గనుక అమ్మవారు *పుష్కరేక్షణా* యని అనబడినది.

అమ్మవారికి నమస్కరించునపుడు *ఓం పుష్కరేక్షణాయై నమః* అని అనవలెను

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04/02, 04:02] +91 95058 13235: *4.2.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఎనిమిదవ అధ్యాయము*

*అక్రూరుడు రథముపై గోకులమునకు చేరుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*38.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*లబ్ధ్వాంగసంగం ప్రణతం కృతాంజలిం మాం వక్ష్యతేఽక్రూర తతేత్యురుశ్రవాః|*

*తదా వయం జన్మభృతో మహీయసా నైవాదృతో యో ధిగముష్య జన్మ తత్॥9707॥*

ఆ శ్రీకృష్ణుడు నాకు తన కౌగిలి భాగ్యమును ప్రసాదించిన పిమ్మట, నేను ఆ స్వామి యెదుట చేతులు జోడించి నిలబడియుందును. అంతట ఆ ప్రభువు నన్ను 'నాయనా! అక్రూరా!' అని ప్రేమతో సంబోధించును. అట్లు ఆ మహాత్ముడు నన్ను అనుగ్రహించుట వలన నా జన్మ సార్థకమగును. నిజముగా ఆ భగవానుని ఆదరమునకు నోచుకొనినవాని జన్మమే జన్మము. అట్లు కానివాని జన్మము నింద్యము.

 *38.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*న తస్య కశ్చిద్దయితః సుహృత్తమో న చాప్రియో ద్వేష్య ఉపేక్ష్య ఏవ వా|*

*తథాపి భక్తాన్ భజతే యథా తథా సురద్రుమో యద్వదుపాశ్రితోఽర్థదః॥9708॥*

ఆ పరమాత్మునకు ప్రియుడుగాని, అప్రియుడుగాని, పరమమిత్రుడు గాని, ద్వేషింపదగినవాడు గాని (శత్రువుగాని), ఉపేక్షింపదగినవాడుగాని ఉండనే ఉండడు. ఏలనన, ఆ స్వామి దయాసముద్రుడు. ఆశ్రయించిన వారియొక్క కోర్కెలను అన్నింటిని తీర్చునట్టి కల్పవృక్షమువలె ఆ పరమపురుషుడు తన భక్తులను ఎంతయు అనుగ్రహించుచుండును.

 *38.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*కిం చాగ్రజో మావనతం యదూత్తమః స్మయన్ పరిష్వజ్య గృహీతమంజలౌ|*

*గృహం ప్రవేశ్యాప్తసమస్తసత్కృతం  సంప్రక్ష్యతే కంసకృతం స్వబంధుషు॥9709॥*

యదువంశజులలో శ్రేష్ఠుడైన బలరాముడును, తన యెదుట చేతులు జోడించి, వినమ్రుడనైయున్న నన్ను చిఱునవ్వుతో సాదరముగా గుండెలకు హత్తుకొనును. పిదప ఆ మహాత్ముడు నా రెండు చేతులను పట్టుకొని భవనములోనికి తీసికొనివెళ్ళి, సకల స్వాగత సత్కారములను నెఱపి గౌరవించును. అనంతరము అతడు  'బంధువులమైన మా విషయమున కంసుడు ఎట్లు వ్యవహరించుచున్నాడు?' అని ప్రశ్నించును.

*శ్రీశుక ఉవాచ*

 *38.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*ఇతి సంచింతయన్ కృష్ణం శ్వఫల్కతనయోఽధ్వని|*

*రథేన గోకులం ప్రాప్తః సూర్యశ్చాస్తగిరిం నృప॥9710॥*

*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! శ్వఫల్కుని కుమారుడైన అక్రూరుడు మార్గమధ్యమున ఇట్లు ఆలోచించుచు సూర్యాస్తమయ సమయమునకు తన రథముపై గోకులమునకు చేరెను.

 *38.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*పదాని తస్యాఖిలలోకపాలకిరీటజుష్టామలపాదరేణోః|*

*దదర్శ గోష్ఠే క్షితికౌతుకాని  విలక్షితాన్యబ్జయవాంకుశాద్యైః॥9711॥*

లోకపాలురు ఎల్లరును తమ కిరీటములు పవిత్రములైన శ్రీకృష్ణుని  పాదరేణువులు సోకునట్లుగా ఆ స్వామికి ప్రణమిల్లుచు పరవశించి పోవుచుందురు. ఆ భగవానుని పాదములు పద్మ-యవ-అంకుశ-ఆది చిహ్నములతో అలరారుచుండును.  అట్టి చిహ్నములుగల ఆ పాదముల  ముద్రలు భూతలమునకే అలంకారములు. దివ్యచిహ్న శోభితములైన ఆ మహాత్ముని పాదముద్రలను అక్రూరుడు దర్శించెను.

 *38.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*తద్దర్శనాహ్లాదవివృద్ధసంభ్రమః  ప్రేమ్ణోర్ధ్వరోమాశ్రుకలాకులేక్షణః|*

*రథాదవస్కంద్య స తేష్వచేష్టత  ప్రభోరమూన్యంఘ్రిరజాంస్యహో ఇతి॥9712॥*

ఆ స్వామి పాదముద్రలను దర్శించినంతనే అక్రూరునిలో అనందోత్సాహములు పొంగిపొఱలెను. భక్తిపారవశ్యమున అతడు పులకితగాత్రుడయ్యెను. అతని నేత్రములు ఆనందాశ్రువులతో నిండిపోయెను. అప్పుడు అతడు రథమునుండి క్రిందికి దిగి 'అహో! ఇవి శ్రీకృష్ణభగవానుని పాదరేణువులు అని అనుకొనుచు, వాటిపై వ్రాలి పొర్లాడుచు, పరవశించిపోయెను.

 *38.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*దేహంభృతామియానర్థో హిత్వా దంభం భియం శుచమ్|*

*సందేశాద్యో హరేర్లింగదర్శనశ్రవణాదిభిః॥9713॥*

దేహధారులకు ఎల్లరకును గర్వమును (దంభమును), భయమును, దుంఖము మొదలగు అవగుణములను వీడి, శ్రీహరి పవిత్ర వృత్తాంతములను వినుట, కీర్తించుట, ఆ స్వామి స్వరూపమును, చిహ్నములను దర్శించుట మొదలగువాటిని ఆచరించి, పారవశ్యమును పొందుటయే జీవిత పరమార్థము. దీనివలన జీవితములు సార్థకములగును. ఈ సందర్భమున  అక్రూరుడు అట్టి పారవశ్యమునే పొందియుండెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[04/02, 21:41] +91 95058 13235: *4.2.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఎనిమిదవ అధ్యాయము*

*అక్రూరుడు రథముపై గోకులమునకు చేరుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*38.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*దదర్శ కృష్ణం రామం చ వ్రజే గోదోహనం గతౌ|*

*పీతనీలాంబరధరౌ శరదంబురుహేక్షణౌ॥9714॥*

*38.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*కిశోరౌ శ్యామలశ్వేతౌ శ్రీనికేతౌ బృహద్భుజౌ|*

*సుముఖౌ సుందరవరౌ బలద్విరదవిక్రమౌ॥9715॥*

అక్రూరుడు గోకులమున ప్రవేశించిన పిమ్మట, పాలు పితుకు ప్రదేశమైన  గోశాలలో శరత్కాలమున బాగుగా వికసించియున్న  కమలములవలె మనోహరముగా ఉండెను. శ్యామసుందరుడైన కృష్ణుడు పీతాంబరములను, శ్వేతవర్ణముతో శోభిల్లుచున్న బలరాముడు నీలాంబరములను ధరించియుండిరి. కిశోరదశలోనున్న ఆ ఇరువురియొక్క బాహువులు బలిష్ఠములై, దీర్ఘములై కాంతిమంతములై యుండెను. కళకళలాడుచున్న (సంపద్యుక్తములైన) వారి ముఖశోభలు అపూర్వములు. పరమసుందరులైన ఆ ఇరువురియొక్క గమనములు ఏనుగు గున్నల నడకలను తలపింపజేయుచుండెను.

*38.30 (ముప్పదియవ శ్లోకము)*

*ధ్వజవజ్రాంకుశాంభోజైశ్చిహ్నితైరంఘ్రిభిర్వ్రజమ్|*

*శోభయంతౌ మహాత్మానావనుక్రోశస్మితేక్షణౌ॥9716॥*

*38.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*ఉదారరుచిరక్రీడౌ స్రగ్విణౌ వనమాలినౌ|*

*పుణ్యగంధానులిప్తాంగౌ స్నాతౌ విరజవాససౌ॥9717॥*

ఆ ఉభయుల చిఱునవ్వులు మనోజ్ఞములు. వారి చూపులలో కరుణ తొణికిసలాడు చుండెను. ధ్వజము, వజ్రము, అంకుశము, పద్మము మొదలగు శుభచిహ్నములతో విలసిల్లుచున్న ఆ మహాత్ముల పాదములు (పాదముల ముద్రలు) వ్రజభూమిని శోభిల్లుజేయుచుండెను. వారు స్నానములను ముగించుకొని, నిర్మల వస్త్రములను ధరించి, సుగంధానులేపనములతో తేజరిల్లుచుండిరి. వారి లీలలు రుచిరములు, దర్శనీయములు.

*38.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*ప్రధానపురుషావాద్యౌ జగద్ధేతూ జగత్పతీ|*

*అవతీర్ణౌ జగత్యర్థే స్వాంశేన బలకేశవౌ॥9718॥*

ఆ బలరామకృష్ణులు ఇరువురును జగద్రక్షణార్థము తమ తమ విశిష్టాంశలతో  అవతరించిన పురుషోత్తములు. జగత్తుయొక్క సృష్టి స్థితి లయములకు కారకులు, జగన్నాథులు.

*38.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*దిశో వితిమిరా రాజన్ కుర్వాణౌ ప్రభయా స్వయా|*

*యథా మారకతః శైలో రౌప్యశ్చ కనకాచితౌ॥9719॥*

పరీక్షిన్మహారాజా! ఆ ఇద్దరును క్రమముగా సువర్ణమయములైన ఇంద్రనీలాద్రివలె, రజతపర్వతము వలె విరాజిల్లుచు తమ అద్వితీయ దేహకాంతులచే దశదిశలయందలి చీకట్లను పారద్రోలుచుండిరి.

*38.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*రథాత్తూర్ణమవప్లుత్య సోఽక్రూరః స్నేహవిహ్వలః|*

*పపాత చరణోపాంతే దండవద్రామకృష్ణయోః॥9720॥*

బలరామకృష్ణులను దర్శించినంతనే  అక్రూరుడు తన రథమునుండి క్రిందికి దిగెను. అప్పుడు ఆయనలోని ప్రేమ (భక్తి) పరవళ్ళుద్రొక్కెను. అప్పుడు అతడు  ఆ ఆనంద పారవశ్యములో విహ్వలుడయ్యెను. అనంతరము అతడు ఆ మహాత్ముల చరణములపై వ్రాలి సాష్టాంగముగా ప్రణమిల్లెను.

*38.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*భగవద్దర్శనాహ్లాదబాష్పపర్యాకులేక్షణః|*

*పులకాచితాంగ ఔత్కంఠ్యాత్స్వాఖ్యానే నాశకన్నృప॥9721॥*

మహారాజా! భగవద్దర్శన సంతోషాతిరేకమున ఆయన నేత్రములు ఆనందాశ్రువులతో నిండిపోయెను. దేహము పులకితమయ్యెను. ఆ ఉత్కంఠలో (తహతహపాటులో) అతడు వారికి తనను గూర్చి (అక్రూరోఽహమ్, నమస్కరోమి- అని) చెప్పలేకపోయెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[05/02, 04:27] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*232వ నామ మంత్రము* 05.02.2021

*ఓం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణ్యై నమః*

మహాప్రళయకాలమందు పరమేశ్వరుడుచేసిన మహాతాండవ నృత్యమునకు సాక్షీభూతురాలై నిలచిన మహేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణ్యై నమః* యను పదహారక్షరముల నామ మంత్రమును *ఓం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణ్యై నమః* యని ఉచ్చరించుచూ, ఆ మహేశ్వరిని ఆరాధించు భక్తులు ఆ పార్వతీ పరమేశ్వరుల కరుణచే భౌతిక జీవనమునందు శాంతిసౌఖ్యములు, సకల సంపదలు, కీర్తిప్రతిష్టలతోబాటు పారమార్థిక జీవనమునందు భగవధ్యాననిమగ్నత, పరమేశ్వరి పాదసేవనమందు ఎనలేని భక్తితత్పరత సంప్రాప్తించి తరించుదురు.

మహేశ్వరుడు మహాప్రళయకాలంలో లోకములన్నిటినీ లయంచేస్తూ, తానొక్కడే ఉన్నాడను (పరమేశ్వరి ఉన్నప్పటికిని) భావనతో ఆత్మానందానుభూతితో మహాతాండవ చేస్తుంటాడు. లయకాలంలో ఎవరూ లేరు. శ్రీమాత మాత్రం ఉన్నది. మహేశ్వరుని మహాకల్పాంతములో  చేయు మహాతాండవమునకు సాక్షీభూతురాలైనది గనుక జగన్మాత *మహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణీ* యని అనబడినది.

ఇదే విషయం పంచదశీస్తవంలో చెప్పబడిన విషయాన్ని భాస్కరరాయలువారు సౌభాగ్యభాస్కరంలో ఇలా ప్రస్తావించారు.

*కల్పోపసంహరణకల్పితతాండస్య దేవస్య ఖండపరశోః పరభైరవస్య|*

*పాశాంకుశైక్షవశరాసన పుష్పబాణైః సా సాక్షిణీ విజయతే తవ మూర్తి రేకా॥*

మహాప్రళయకాలంలో ఖండపరుశువైన మహేశ్వరుడు నాట్యముచేయుచుండగా, పరమేశ్వరి పాశము, అంకుశము,  ఇక్షుధనస్సు, పుష్పబాణములను ధరించి సాక్షీభూతురాలై నిలచినది.

దేవీ భాగవతములోకూడా ఇలా చెప్పబడినదని భాస్కరరాయలువారు  ప్రస్తావించారు:

*ఏషా సంహృత్య సకలం విశ్వం క్రీడతి సంక్షయే లింగాని సర్వజీవానాం స్వశరీరే నివేశ్య చ* 

శ్రీమాత ప్రళయకాలంలో సకలజీవులను తన శరీరములో ఉంచుకొని క్రీడించుచున్నది.

దీనిని బట్టి సృష్టికి ముందు, ప్రళయకాలంలోకూడా ఉందనియు, మహేశ్వరుడు చేయు మహాతాండవానికి సాక్షీభూతురాలైనది అనియు తెలియుచున్నది. గనుకనే ఆ మహాతల్లి *మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ* యని అనబడినది.

*మహావాసిష్ఠంలో శివపార్వతుల తాండవము ఇలా చెప్పబడినది:* 

యముని వాహనమైన మహిషముయొక్క కొమ్మును రక్తమకరందములతో నింపి, దానిని చేతియందు ధరించి, పూలదండను వక్షమున ధరించి, శిరస్సున గరుడిని రెక్కల ఈకలను కిరీటమువలె ధరించి, శివుని డమరుకధ్వనిని అనుసరించి *డింభం డింభం సుడింభం పచ పచ  ఝమ్య ఝమ్య ప్రఝమ్యం* అని నృత్యం చేస్తూ, మహాప్రళయకారణ ఆనందం పొందెడి కాళరాత్రిచే నమస్కరింపబడిన భైరవుడు మిమ్ములను రక్షించుగాక" 

ప్రళయం అంటే భూమి జలంలో, ఆ జలం అగ్నిలో, ఆ అగ్ని వాయువులో, ఆ వాయువు ఆకాశంలో. ఆ ఆకాశం పరమేశ్వరిలో (మూలప్రకృతిలో) లయమవగా శూన్యం మిగులుతుంది. పరమేశ్వరుడు ఆ ఆ సమయంలో పరమేశ్వరుడు, ఒంటరియై, అత్యంతానందానుభూతితో తాండవచేస్తే, పరమేశ్వరి ముసిముసి నవ్వులు నవ్వుతూ సాక్షీభూతురాలై నిలుస్తుంది గనుకనే  ఆ జగజ్జనని *మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ* యని అనబడినది.

*మహాకల్పం అంటే:*

దేవతల కాల ప్రమాణము మన (మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.

కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు.

త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు.

ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు.

కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు.

మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు. ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)

ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము. దీనినే *మహాకల్పం* అంటారు.

ఈ మహాకల్పాంతమున మహేశ్వరుని మహా తాండవమునకు, మహేశ్వరి సాక్షీభూతురాలైనది గనుకనే జగన్మాత *మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణ్యై నమః* యని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05/02, 04:27] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*806వ నామ మంత్రము* 05.02.2021

*ఓం పరంజ్యోతిషే నమః*

బ్రహ్మాత్మకమైన జ్యోతిస్స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పరంజ్యోతిః* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం పరంజ్యోతిషే నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరబ్రహ్మస్వరూపిణియైన జగన్మాతను అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి ఆత్మానందానుభూతిని ప్రసాదించి తరింపజేయును.

జగన్మాత బ్రహ్మాత్మకమైన జ్యోతిస్స్వరూపము. ఎనిమిదక్షరములు గలిగిన పరంజ్యోతిమంత్రస్వరూపురాలు. ఈ పరబ్రహ్మ జ్యోతిస్సు సమీపంలో సూర్యచంద్రులుగాని, నక్షత్రములుగాని, అగ్నిగాని ప్రకాశించుటలేదు. మెఱుపులు సైతం కాంతులను విరజిమ్మలేవు. అనగా ఇవి ప్రకాశించుతాయి. కాని బ్రహ్మత్మకమైన జ్యోతిస్స్వరూపం దగ్గర, పగటిపూట నక్షత్రకాంతి కనబడనట్లు తమకాంతులను చూపించలేవు.  దీనికి కారణం కొన్నివేలకోట్ల సూర్యచంద్రుల కాంతితో పరమేశ్వరి ప్రకాశించుటయే. 

ఆది శంకరులవారి సౌందర్య లహరి లోని 14వ శ్లోకములో ఇలా వివరించారు.

*క్షితౌ షట్పంచాశ -   ద్ద్విసమధిక పంచాశ దుదకే*

*హుతాశే ద్వాషష్టి - శ్చతురధిక పంచాశ దనిలే |*

*దివి ద్విఃషట్త్రింశ - న్మనసి చ చతుఃషష్టిరితి యే*

*మయూఖాస్తేషామప్యుపరి తవ -  పాదాంబుజయుగమ్ || 14 ||*

*షట్చక్రాలలోని సహస్రారములో ఉండు దేవి పాదప్రకాశ వైభవం.*

అమ్మా! పరమేశ్వరీ! యోగసాధనలో సాధకుడు షట్చక్రాలనూ అధిగమించి, సహస్రారములో ఉన్న నీపాదపద్మాలు చేరాలంటే తన దేహంలో ఉన్న పృధివీతత్వంతో కూడిన మూలాధార చక్రంలో 56 కిరణాలను దాటి,జలతత్వాత్మికమైన మణిపూరక చక్రంలో 52 మయూఖములను దాటి,అగ్నితత్వాత్మికమైన అనాహత చక్రంలో54  కాంతిరేఖలు దాటి,ఆకాశతత్వాత్మికమైన విశుద్దచక్రమునందు 72 కాంతికిరణాలు దాటి, మనస్తత్వంతో కూడిన ఆజ్ఞాచక్రము నందు 64 కిరణపుంజాలు దాటి, ఈ ప్రకారముగా ప్రసిద్ధములైన ఈ మయూఖములు దాటి పైకి చేరుకోగా అచట సహస్ర దళ మధ్యగత చంద్రబింబాత్మకమైన   బైందవ స్థానమున, సుధాసింధువునందు నీయొక్క పాదపద్మముల జంట గోచరమగుచున్నది.

*పై శ్లోకములో ఆది శంకరులు చెప్పిన ప్రకారం*

శ్రీ చక్రమునందు మూలాధార, స్వాదిష్టాన, మణిపూర. అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రములును, సహస్రారము కలవు. ఈ ఆరు చక్రములును సోమ, సూర్య, అనలా(అగ్ని)త్మకములుగా మూడు ఖండములు. ''మూలాధార, స్వాదిష్టాన యుగళమైన ప్రథమ ఖండమునకు పై భాగమున ''అగ్నిస్థానము'' అదియే (రుద్రగ్రంథి). మణిపూర, అనాహత చక్రములు రెండోవ ఖండము. ''సూర్యస్థానము'' అదియే (విష్ణుగ్రంథి). విశుద్ధ, అజ్ఞాచక్రములు మూడోవ ఖండము ''చంద్రస్థానము'' అదియే (బ్రహ్మగ్రంథి)

ప్రథమఖండము పైనున్న అగ్ని తన జ్వాలలచేత ప్రథమఖండమును వ్యాపింపజేయును. రెండవ ఖండము పైనున్న సూర్యుడు తన కిరణముల చేత రెండవ ఖండమును వ్యాపింపజేయును.

మూడవఖండము పైనున్న చంద్రుడు తన కళలచేత మూడవఖండమును వ్యాపింపజేయును. పృథ్వీ తత్త్వాత్మిక మూలాధార చక్రమున (పృథ్వీ అగ్ని జ్వాలలు 56), మణిపూర చక్రమున (ఉదక తత్త్వాత్మిక జ్వాలలు 52) కలిపి 108 అగ్ని జ్వాలలు.

అట్లే స్వాధిష్టాన (అగ్ని తత్త్వాత్మిక కిరణములు 62), అనాహత చక్రమున (వాయు తత్త్వాత్మిక కిరణములు 54) కలిపి 116 సూర్య కిరణములు. 

ఆకాశ తత్త్వాత్మకమగు (విశుద్ధ చక్రమున 72), మనస్తత్త్వాత్మకమగు (ఆజ్ఞా చక్రమున 64) కలిసి 136 చంద్రుని కళలు అగుచున్నవి. ఇవి 108+116+136 మొత్తం 360 కిరణములు అగును. ఈ కిరణములన్నియు అమ్మవారి పాదములనుండి వెడలినవే. 

పై శ్లోకభావముననుసరించి, అమ్మవారు కొన్నివేలకోట్ల సూర్యచంద్రుల కాంతితో ప్రకాశించుచున్నది. అందులో నూటఎనిమిది (108) కిరణములు అగ్ని, నూట పదహారు (116) కిరణములు సూర్యుడు, నూటముప్పదియారు కిరణములు (136) చంద్రుడు గ్రహించుచున్నారు. ఆవిధంగా సూర్యచంద్రులు, అగ్ని, మెఱుపులు,   నక్షత్రములు కూడా ప్రకాశిస్తున్నాయంటే అమ్మవారి బ్రహ్మాత్మికమైన జ్యోతిస్సు వలననే యని భావించవలెను. ఈ విషయం బృహదారణ్యకోపనిషత్తులో *తద్దేవా జ్యోతిషాం జ్యోతిః ఆయుర్హోపాసతేఽమృతం*  - 'మరణశూన్యము, జ్యోతిస్సులకు జ్యోతిస్సు, ఆయుఃస్వరూపమగు ఆ పరమాత్మను దేవతలు ఉపాసించుచున్నారు' అని గలదు. గనుక పరమేశ్వరి *పరంజ్యోతిః* అని యనబడినది.

పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం పరంజ్యోతిషే నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05/02, 04:27] +91 95058 13235: *5.2.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది ఎనిమిదవ అధ్యాయము*

*అక్రూరుడు రథముపై గోకులమునకు చేరుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*38.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*భగవాంస్తమభిప్రేత్య రథాంగాంకితపాణినా|*

*పరిరేభేఽభ్యుపాకృష్య ప్రీతః ప్రణతవత్సలః॥9722॥*

అంతట శ్రీకృష్ణుడు తన యెదుట ప్రణతుడైయున్న  అతనిని, అక్రూరునిగా ఎఱింగి, ఎంతయు సంప్రీతుడయ్యెను. పిదప ఆ భక్తవత్సలుడు చక్రచిహ్నితమైన తన హస్తముతో ఆయనను తన దగ్గఱకు లాగుకొని ఆత్మీయతతో అక్కునజేర్చుకొనెను.

*38.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*సంకర్షణశ్చ ప్రణతముపగుహ్య మహామనాః|*

*గృహీత్వా పాణినా పాణీ అనయత్సానుజో గృహమ్॥9723॥*

బలరాముడును, తనకు ప్రణమిల్లుచున్న ఆ అక్రూరుని చూచినంతనే ఎంతయు సంప్రీతుడయ్యెను. పిమ్మట ఆ బలదేవుడు ఆయనను తన హృదయమునకు హత్తుకొని ఆనందింపజేసెను. అనంతరము బలరామకృష్ణులు అతనికి ఇరువైపుల నిలిచి, అతని చేతులను పట్టుకొని భవనములోనికి తీసికొనివెళ్ళిరి.

*38.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*పృష్ట్వాథ స్వాగతం తస్మై నివేద్య చ వరాసనమ్|*

*ప్రక్షాల్య విధివత్పాదౌ మధుపర్కార్హణమాహరత్॥9724॥*

అంతట వారు ఇరువురును క్షేమసమాచారములను అడిగి తెలిసికొని, స్వాగత మర్యాదలను నెఱపి, ఆయనను ఉన్నతాసనముపై కూర్చుండజేసిరి. పిదప ఆ అక్రూరునకు పాదప్రక్షాళనమొనర్చి, మధుపర్కములను (తేనె గలిపిన పెఱగును, నూతన వస్త్రములను) సమర్పించి ఆయనను సముచితరీతిలో గౌరవించిరి.

*38.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*నివేద్య గాం చాతిథయే సంవాహ్య శ్రాంతమాదృతః|*

*అన్నం బహుగుణం మేధ్యం శ్రద్ధయోపాహరద్విభుః॥9725॥*

పిమ్మట కృష్ణభగవానుడు అతిథిగా వచ్చిన ఆ అక్రూరునకు గోదానమొనర్చి, బడలికలు తొలగునట్లుగా సాదరముగా పాదసేవలు గావించెను. అనంతరము షడ్రసోపేతములైన భోజనపదార్థములను ఆత్మీయతతో నివేదించెను.

*38.40 (నలుబదియవ శ్లోకము)*

*తస్మై భుక్తవతే ప్రీత్యా రామః పరమధర్మవిత్|*

*ముఖవాసైర్గంధమాల్యైః పరాం ప్రీతిం వ్యధాత్పునః॥9726॥*

అక్రూరుడు తృప్తిగ భుజించిన పిమ్మట, పరమ ధర్మజ్ఞుడగు బలరాముడు ఆయనకు కర్పూరము, ఏలకులు మొదలగు వాటితోగూడిన తాంబూలాదులను సమర్పించి, మఱల ఆయనను సుగంధపుష్పమాలలచే అలంకృతుని గావించెను.

*38.41 (నలుబది ఒకటవ శ్లోకము)*

*పప్రచ్ఛ సత్కృతం నందః కథం స్థ నిరనుగ్రహే|*

*కంసే జీవతి దాశార్హ సౌనపాలా ఇవావయః॥9727॥*

అక్రూరునకు అతిథి సత్కారములు ముగిసిన పిమ్మట నందుడు ఆయనతో ఇట్లనెను- "అక్రూరా! క్రూరుడైన కంసుని పాలనలో మీరు ఎట్లు జీవించుచున్నారు? బహుశా అక్కడ మీ పరిస్థితి కటికవాని పోషణలో గొర్రెల, మేకల స్థితివలె ఉండవచ్చును".

*38.42 (నలుబది రెండవ శ్లోకము)*

*యోఽవధీత్స్వస్వసుస్తోకాన్ క్రోశంత్యా అసుతృప్ ఖలః|*

*కిం ను స్విత్తత్ప్రజానాం వః కుశలం విమృశామహే॥9728॥*

"కటిక దుర్మార్గుడు, స్వార్థపరుడు ఐన కంసుడు తన సొంత చెల్లెలగు దేవకి ఎంతగా లబలబలాడుచున్నను పట్టించుకొనక దయమాలినవాడై ఆమెయొక్క పసికందులను పరిమార్చెను. ఇక ఆయన పాలనలో ఉన్న మీరు కుశలముగా ఉన్నట్లు ఎట్లు తలంతును?"

*38.43 (నలుబది మూడవ శ్లోకము)*

*ఇత్థం సూనృతయా వాచా నందేన సుసభాజితః|*

*అక్రూరః పరిపృష్టేన జహావధ్వపరిశ్రమమ్॥9729॥*

నందుడు ఈ విధముగా మధురవచనములు పలికి, సాదరముగా ఊరట గూర్చుటతో, అక్రూరుని ప్రయాణపు బడలికలు పూర్తిగా తొలగిపోయెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే అక్రూరాగమనం నామాష్టాత్రింశోఽధ్యాయః (38)*

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి *అక్రూరుడు రథముపై గోకులమునకు చేరుట* యను ముప్పది ఎనిమిదవ అధ్యాయము (38)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[05/02, 20:15] +91 95058 13235: *5.2.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది తొమ్మిదవ అధ్యాయము*

*బలరామకృష్ణులు అక్రూరునితోగూడి మథురకు బయలుదేరుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*

*39.1 (ప్రథమ శ్లోకము)*

*సుఖోపవిష్టః పర్యంకే రామకృష్ణోరుమానితః|*

*లేభే మనోరథాన్ సర్వాన్ పథి యాన్ స చకార హ॥9731॥*

*శ్రీశుకుడు వచించెను* బలరామకష్ణులు అక్రూరునకు తగినవిధముగా అతిథిసత్కారములను నెఱపిన పిదప ఆయనను సముచితాసనమున సుఖోపవిష్టుని గావించిరి. అక్రూరుడు మార్గమధ్యమున తాను అనుకొనిన  రీతిగా తన మనోరథములు అన్నియును ఈడేరినట్లు భావించెను.

*39.2 (రెండవ శ్లోకము)*

*కిమలభ్యం భగవతి ప్రసన్నే శ్రీనికేతనే|*

*తథాపి తత్పరా రాజన్న హి వాంఛంతి కించన॥9732॥*

పరీక్షిన్మహారాజా! షడ్గణైశ్వర్య సంపన్నుడు శ్రీనివాసుడు (శ్రీకృష్ణుడు) ప్రసన్నుడైన పిమ్మట లభ్యముకాని వస్తువు ఏముండును? సర్వమూ లభించినట్లే. అందువలన భగవత్తత్పరులైనవారు ఇంక లౌకికములైన ఎట్టి సుఖములను, వస్తువులకును ఆశపడరు. భగవద్దర్శనానందమును పొందిన వారికి లౌకిక సుఖములన్నియును తుచ్ఛములే.

*39.3 (మూడవ శ్లోకము)*

*సాయంతనాశనం కృత్వా భగవాన్ దేవకీసుతః|*

*సుహృత్సు వృత్తం కంసస్య పప్రచ్ఛాన్యచ్చికీర్షితమ్॥9733॥*

దేవకీసుతుడైన కృష్ణభగవానుడు సాయంకాల భోజనము చేసిన తరువాత అక్రూరునిచేరి, కంసుడు తనకు దగ్గఱి బంధువులైన వసుదేవాదులయెడ ఎట్లు ప్రవర్తించుచున్నాడు? ఇంకను అతడు ఏమి చేయగోరుచున్నాడు? మున్నగు విషయములను గూర్చి ఇట్లు ప్రశ్నించెను.

*శ్రీభగవానువాచ*

*39.4 (నాలుగవ శ్లోకము)*

*తాత సౌమ్యాగతః కచ్చిత్స్వాగతం భద్రమస్తు వః|*

*అపి స్వజ్ఞాతిబంధూనామనమీవమనామయమ్॥9734॥*

*శ్రీకృష్ణభగవానుడు నుడివెను* నాయనా! మీ హృదయము పవిత్రమైనది, మీ ప్రయాణము సుఖముగా జరిగినదా? మీకు మా హృదయపూర్వక స్వాగతము. మీరందరు క్షేమమే కదా? మీకు మంగళమగుగాక! మథురలోగల మా జ్ఞాతులు, ఆత్మీయులు, బంధువులందరునూ బాగుగా ఉన్నారా? వారందరిని కంసుడు కష్టపెట్టుటలేదుకదా? అందరునూ కుశలముగా ఉన్నారా?

*39.5 (నాలుగవ శ్లోకము)*

*కిం ను నః కుశలం పృచ్ఛే ఏధమానే కులామయే|*

*కంసే మాతులనామ్న్యంగ స్వానాం నస్తత్ప్రజాసు చ॥9735॥*

కంసుడు బంధుత్వమునుబట్టి మాకు మేనమామయే యైనను అతడెన్నడును మా క్షేమమును కోరినవాడు కాడు. పైగా అతడు మన యదువంశమునకే రోగమువంటివాడు. అతడు వృద్ధిచెందుచుండగా (అతని దుర్మార్గము పెచ్చు మీఱుచుండగా) మాకు ఆత్మీయులైన మీ క్షేమములను గూర్చియు, అతని పాలనలోని ప్రజలయొక్క బాగోగులను గుఱించియు ఇంక అడుగవలసినది ఏమున్నది?

*39.6 (ఆరవ శ్లోకము)*

*అహో అస్మదభూద్భూరి పిత్రోర్వృజినమార్యయోః|*

*యద్ధేతోః పుత్రమరణం యద్ధేతోర్బంధనం తయోః॥9736॥*

పూజ్యులైన మా తలిదండ్రులగు దేవకీవసుదేవులు ఇడుముల పాలగుట, వారి కుమారులు (మా సోదరులు) కంసునిచేతిలో మృత్యుముఖమున చేరుట, అంతేగాక, వారు చెఱసాలలో బంధింపబడుట మున్నగునవి అన్నియును నా కారణముగనే సంభవించినవిగదా! ఇవి అన్నియును కడు శోచనీయములు.

*39.7 (ఏడవ శ్లోకము)*

*దిష్ట్యాద్య దర్శనం స్వానాం మహ్యం వః సౌమ్య కాంక్షితమ్|*

*సంజాతం వర్ణ్యతాం తాత తవాగమనకారణమ్॥9757॥*

ఉత్తమ స్వభావముగల అక్రూరా! ఆత్మీయులైన మన బంధువుల దర్శనము కొఱకు ఎప్పటినుండియో నేను తపన పడుచుంటిని. నా అదృష్టముకొలది నేడు నీ ఆగమనముతో ఆ కోరిక నెఱవేఱినది. ఇంతకును నీ రాకకు కారణమేమో? వివరింపుము.

*శ్రీశుక ఉవాచ*

*39.8 (ఎనిమిదవ శ్లోకము)*

*పృష్టో భగవతా సర్వం వర్ణయామాస మాధవః|*

*వైరానుబంధం యదుషు వసుదేవవధోద్యమమ్॥9738॥*

*శ్రీశుకుడు ఇట్లు పలికెను* శ్రీకృష్ణపరమాత్మ అడిగిన విషయములను అన్నింటిని వివరించుచు అక్రూరుడు యదువంశజులయెడ కంసుడు వైరము పూనియున్న విషయములను, దేవకీవసుదేవులను వధించుటకై అతడు ఉద్యమించిన తీరుతెన్నులను గూర్చి విపులముగా తెలిపెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[06/02, 03:54] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*233వ నామ మంత్రము* 06.02.2021

*ఓం మహాకామేశ మహిష్యై నమః*

లోకములన్నిటికి ప్రభువు (రాజు) అయిన పరమేశ్వరునికి (కామేశ్వరునికి) పట్టమహిషి (పట్టపురాణిగా) తేజరిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహాకామేశమహిషీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం మహాకామేశమహిష్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబను అత్యంత భక్తిశ్రద్ధలతో  ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి సర్వాభీష్టములను సిద్ధింపజేయును, పరమార్థసాధనకు దీక్షాపటిమను అనుగ్రహించును.

పరమశివుడు లోకములన్నిటికి మహాప్రభువు. ఆ ప్రభువుకు జగన్మాత పట్టమహిషి గావున *మహాకామేశమహిషీ* యని అనబడినది.

కామము అనే పదానికి అర్థం కోరిక.

కోరికలు ఎన్నో ఉంటాయి. కొందరికి సిరిసంపదలు, మరికొందరికి సంతానము, విద్య, ఆరోగ్యము ఇలా ఎన్నో  కోరికలు ఉంటాయి. ఇవన్నీ భౌతికపరమైనవి. శరీరధారుల కోర్కెలు ఇవి. పుట్టినప్పటి నుండి గిట్టు వరకు ఈ కోరికలు ఒక దాని వెంబడి ఇంకొకటి లేదా పుంఖానుపుంఖములుగా పుడుతూనే ఉంటాయి. కొందరు జన్మరాహిత్యమైన ముక్తి మాత్రమే కోరుకుంటారు. అందుకు నిశ్చలచిత్తముతో పరమాత్మను ధ్యానిస్తూ ఉంటారు. మరికొందరు నిష్కామంగా యోగదీక్షలో ఉంటారు. ఏదేమైనా కోరిక (కామము) కలిగించడానికి మూలపురుషుడు పరమేశ్వరుడే. అందుకే ఆయన కామేశుడు. కోరికలన్నిటి సమిష్టిరూపమయిన కామేశ్వరుని మహాకామేశుడు అంటారు. ఆ మహాకామేశుని రాణి మహాకామేశ్వరి (అమ్మవారు) *మహాకామేశమహిషీ* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మహాకామేశ మహిష్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[06/02, 03:54] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*807వ నామ మంత్రము* 06.02.2021 

*ఓం పరంధామ్నే నమః*

ధామములకు (నిలయములకు) ధామమైన మరియు ఉత్కృష్టధామము అయిన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పరంధామ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రముము *ఓం పరంధామ్నే నమః*  అని ఉచ్చరించుచూ, ఆ జగజ్జననిని భక్తితత్పరులై ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి కరుణించి భౌతికపరమైన కోర్కెలను తీర్చును మరియు పరమపదసోపానములకు మార్గము సుగమము చేసి తరింపజేయును.

*పరం ధామ ఉత్కృష్టం తేజః* ఉత్కృష్టమైన తేజోస్వరూపురాలు శ్రీమాత. భగవద్గీతలో ఇలా చెప్పబడినదని భాస్కరరాయలువారు సౌభాగ్యభాస్కరంలో చెప్పారు.

*న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః*

*య ద్గత్వా న నివర్తంతే త ద్ధామ పరమం మమ* (సౌభాగ్యభాస్కరం, 909వ పుట)

సూర్యుడుగాని, చంద్రుడు గాని, అగ్నిగాని ఆ జ్యోతిని ప్రకాశింపజేయలేదు.  ఏ అవస్థకైతే చేరినవానికి పునర్జన్మ ఉండదో ఆ స్థితియే (ఆ ధామమే) నాది అని భగవద్గీతలో గలదు. ఇక ఈ ధామమును దాటి అనగా తురీయస్థితికి సాధకుడు చేరుకుంటాడో దానిని తురీయస్థితి యందురు. 

జాగ్రత్స్వప్నసుషుప్తి అవస్థలు మూడింటియందును భోగ్యము (అనుభవించదగినది ఏది? భోక్త (అనుభవించువాడు) ఎవడు? అను ఈ రెండిటిని తెలియువాడు కర్మఫలమనుభవించుచున్నసు వానిని కర్మఫలము అంటదు. అనగా తురీయ స్థితికి చేరినవానికి పరమాత్మతప్ప కర్మఫలసంబంధితములు ఏమియు ఉండవు. జాగ్రత్స్వప్నసుషుప్థులనెడి ఈ మూడు ధామములు తెలిసినవాడు ఆత్మస్వరూపుడే. ఆ ఆత్మ దృశ్యము  కాదు. దృశ్యమంతయూ ఆత్మయందు కల్పింపబడియుండును. ఈ మూడు ధామములకు సాక్షీభూతుడును, సత్యజ్ఞానానందములే స్వరూపముగా గలది ధామము. ఈ మూడవస్థలు అతిక్రమించిన పరంధామ (పరంబ్రహ్మ లేక తురీయాతీతావస్థ) స్వరూపురాలు ఆ అమ్మవారు గనుక *పరంధామా* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం పరంధామ్నే నమః* యని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

06/02, 03:54] +91 95058 13235: *6.2.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది తొమ్మిదవ అధ్యాయము*

*బలరామకృష్ణులు అక్రూరునితోగూడి మథురకు బయలుదేరుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*39.9 (తొమ్మిదవ శ్లోకము)*

*యత్సందేశో యదర్థం వా దూతః సంప్రేషితః స్వయమ్|*

*యదుక్తం నారదేనాస్య స్వజన్మానకదుందుభేః॥9739॥*

సందర్భానుసారముగా దేవకీ వసుదేవులకు కుమారుడుగా శ్రీకృష్ణుడు జన్మించిన విషయములను గూర్చి నారదుడు కంసునకు తెలుపుటకును, కంసుడు తనను శ్రీకృష్ణప్రభువు కడకు దూతగా పంపుచు, అతడు ధనుర్యాగనెపముతో తనకు ఇచ్చిన సందేశమును అక్రూరుడు కృష్ణపరమాత్మకు వివరముగా తెలిపెను. 

*39.10  (పదియవ శ్లోకము)*

*శ్రుత్వాక్రూరవచః కృష్ణో బలశ్చ పరవీరహా|*

*ప్రహస్య నందం పితరం రాజ్ఞాఽఽదిష్టం విజజ్ఞతుః॥9740॥*

శత్రువీరులను పరిమార్చుటలో సమర్థులైన శ్రీకృష్ణుడును, బలరాముడును అక్రూరుని వచనములను వినిన పిమ్మట దరహాసమొనర్చుచు, తమ తండ్రియగు నందునకు ధనుర్యాగ నిమిత్తముగా కంసుడు పంపిన ఆదేశమును తెలిపిరి.

*39.11 (పదకొండవ శ్లోకము)*

*గోపాన్ సమాదిశత్సోఽపి గృహ్యతాం సర్వగోరసః|*

*ఉపాయనాని గృహ్ణీధ్వం యుజ్యంతాం శకటాని చ॥9741॥*

*39.12 (పండ్రెండవ శ్లోకము)*

*యాస్యామః శ్వో మధుపురీం దాస్యామో నృపతే రసాన్|*

*ద్రక్ష్యామః సుమహత్పర్వ యాంతి జానపదాః కిల|*

*ఏవమాఘోషయత్క్షత్రా నందగోపః స్వగోకులే॥9742॥*

అంతట నందుడు తోడి గోపాలురను ఇట్లు ఆదేశించెను. "మిత్రులారా! వెంటనే ఆవులపాలను, పెఱుగులను, వెన్నలను, నేతులను సమృద్ధిగా ఒక్కచోట సమకూర్చుడు. కానుకలుగా సమర్పించుటకై ఉత్తమ వస్తువులను తీసికొనుడు. వాటిని అన్నింటిని ఎద్దులబండ్లపై చేర్చుడు. రేపు ప్రాతఃకాలముననే మథురానగరమునకు బయలుదేఱుదము. పాలు మొదలగు వస్తువులను, కానుకలను, కప్పములను అన్నింటిని కంస ప్రభువునకు సమర్పింతము. అచట ఒక మహోత్సవము జరగబోవుచున్నదట. దానిని దర్శించుటకై దేశ ప్రజలందఱును రానున్నారట. మనముగూడ అచటికి వెళ్ళి ఆ ఉత్సవమును కనులార దర్శింతము"  అని ఈ విధముగా నందగోపుడు గ్రామరక్షకులద్వారా గోకులమున చాటింపు జేసెను".

*39.13 (పదమూడవ శ్లోకము)*

*గోప్యస్తాస్తదుపశ్రుత్య బభూవుర్వ్యథితా భృశమ్|*

*రామకృష్ణౌ పురీం నేతుమక్రూరం వ్రజమాగతమ్॥9743॥*

అక్రూరుడు బలరామకృష్ణులను మథురాపురమునకు తీసికొనివెళ్ళుటకు వచ్చిన విషయమును, తదితర వార్తలను విన్నంతనే గోపికలు మిగుల వ్యాకులపాటునకు లోనైరి.

*39.14 (పదునాలుగవ శ్లోకము)*

*కాశ్చిత్తత్కృతహృత్తాపశ్వాసమ్లానముఖశ్రియః|*

*స్రంసద్దుకూలవలయకేశగ్రంథ్యశ్చ కాశ్చన॥9744॥*

*39.15 (పదునైదవ శ్లోకము)*

*అన్యాశ్చ తదనుధ్యాననివృత్తాశేషవృత్తయః|*

*నాభ్యజానన్నిమం లోకమాత్మలోకం గతా ఇవ॥9745॥*

*39.16 (పదహారవ శ్లోకము)*

*స్మరంత్యశ్చాపరాః శౌరేరనురాగస్మితేరితాః|*

*హృదిస్పృశశ్చిత్రపదా గిరః సమ్ముముహుః స్త్రియః॥9746॥*

ఆ వార్తలు చెవి సోకినంతనే కొంతమంది గోపికల హృదయములు మిక్కిలి పరితపింపసాగెను. ఆ తాపముల ప్రభావమున వారి నిట్టూర్పులు వేడెక్కెను. ఆ వేడినిట్టూర్పుల కారణముగా వారి ముఖములు వాడిపోయి, వెలవెలబాఱెను. కొందరు గోపికలు తాము ధరించిన పట్టువస్త్రములు, హస్తకంకణములు, దిద్ది తీర్చుకొనిన కొప్పుముడులు జాఱిపోవుచున్నను గమనింపలేనంతగా దిగులుపడసాగిరి. మఱికొందఱు గోపికలు శ్రీకృష్ణుని ధ్యాసలో మునిగిపోయినందున వారి ఇంద్రియ వ్యాపారములు అన్నియును ఆగిపోయినట్లయ్యెను. ఆత్మసాక్షాత్కారమును పొందిన యోగారూఢులకువలె వారికి తమ శరీరములపైగాని, ఈ బాహ్యలోకము మీదగాని ధ్యాసయే లేకుండెను. వారి మనస్సులలో శ్రీకృష్ణపరమాత్మ స్వరూపమే మెదలుచుండెను. వారి హృదయములను దోచుకొనిన శ్రీకృష్ణుని ప్రేమానురాగములు, మఱిమఱి మురిపించెడి చిఱునవ్వుల కాంతులు, మధురిమల నొలికెడి చిత్రవిచిత్రములైన వచనములను పదేపదే గుర్తునకు వచ్చుచు వారిని సమ్మోహపఱచుచుండెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[06/02, 21:24] +91 95058 13235: *6.2.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది తొమ్మిదవ అధ్యాయము*

*బలరామకృష్ణులు అక్రూరునితోగూడి మథురకు బయలుదేరుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*39.17 (పదిహేడవ శ్లోకము)*

*గతిం సులలితాం చేష్టాం స్నిగ్ధహాసావలోకనమ్|*

*శోకాపహాని నర్మాణి ప్రోద్దామచరితాని చ॥9747॥*

*39.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*చింతయంత్యో ముకుందస్య భీతా విరహకాతరాః|*

*సమేతాః సంఘశః ప్రోచురశ్రుముఖ్యోఽచ్యుతాశయాః॥9748॥*

అప్పుడు శ్రీకృష్ణునితో ఎడబాటు కలుగునేమోయను భావనతో భీతిల్లుచు విహ్వలులైన గోపికలు ఆ స్వామియొక్క మిగుల అందమైన నడకలను, తమను మైమఱపించిన రాసక్రీడాది చేష్టలను, ముగ్ధమనోహరములైన దరహాసములను, ఆకర్షణీయములైన చూపులను, దిగులును దూరము చేసెడి నర్మవచనములను (సరసాలాపములను) అద్భుతములైన లీలలను, వేడుకలను, ప్రతిక్షణము స్మరించుకొనుచు, శ్రీకృష్ణునే తమ చిత్తములయందు నిలుపుకొనినవారై గుంపులు గుంపులుగా గూడి దుఃఖాశ్రువులను రాల్చుచు, ఎంతయు వగచుచు ఇట్లు పలికిరి.

*గోప్య ఊచుః*

*39.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*అహో విధాతస్తవ న క్వచిద్దయా  సంయోజ్య మైత్ర్యా ప్రణయేన దేహినః|*

*తాంశ్చాకృతార్థాన్ వియునంక్ష్యపార్థకం విక్రీడితం తేఽర్భకచేష్టితం యథా॥9749॥*

*గోపికలు ఇట్లు పలికిరి* "అహో! విధాతా! నీవు ఏమాత్రమూ దయలేనివాడవు. జగత్తులోని ప్రాణులను సౌహార్ధముతో, ప్రేమానురాగములతో కలుపుచుందువు.  వారి ముద్దుముచ్చటలు తీరకముందే వారిని వేఱుచేయుచుందువు. నీ పనులన్నియును పిల్లల చేష్టలవలె నిష్ప్రయోజకములు".

*39.20 (ఇరువదియవ శ్లోకము)*

*యస్త్వం ప్రదర్శ్యాసితకుంతలావృతం  ముకుందవక్త్రం సుకపోలమున్నసమ్|*

*శోకాపనోదస్మితలేశసుందరం  కరోషి పారోక్ష్యమసాధు తే కృతమ్॥9750॥*

"బ్రహ్మయ్యా! శ్రీకృష్ణుని సుందరముఖము నిగనిగలాడు చుండెడి నల్లని ముంగురులతోను, నునుపైన చెక్కిళ్ళతోను, చూడముచ్చట గొలిపెడి నాసికతోను తేజరిల్లుచుండును. ఆ స్వామి చిఱునవ్వుల కాంతులు ఎంతటి శోకములనైనను పాఱద్రోలుచుండును. అట్టి ముఖారవిందమును మాచే దర్శింపజేసి, ఇప్ఫుడు మా కనులనుండి మఱుగుపఱచు చున్నావు. నీవు చేసెడివన్నియును ఇట్టి పిచ్చిపనులే. ఇవి ఎంతయో అనుచితములు".

*39.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*క్రూరస్త్వమక్రూర సమాఖ్యయా స్మ నశ్చక్షుర్హి దత్తం హరసే బతాజ్ఞవత్|*

*యేనైకదేశేఽఖిలసర్గసౌష్ఠవం  త్వదీయమద్రాక్ష్మ వయం మధుద్విషః॥9751॥*

"నీవు అక్రూరుని పేరుతో వచ్చిన క్రూరుడవు. నీవు సృష్టించిన ప్రకృతి సౌందర్యమును అంతయును అత్యంత మనోజ్ఞమైన శ్రీకృష్ణుని ప్రత్యంగమునందును మేము కనులార దర్శించి ఆనందించుచుంటిమి. కాని, మాకు నీవు ఇచ్చిన నేత్రములను నీవే ఒక మూర్ఖునివలె హరించివేయుచున్నావు. బహుశా నీ సృష్టి రహస్యము పూర్తిగా మాకు తెలిసిపోయినదను అసూయతో కాబోలు! శ్రీకృష్ణుని మా నుండి వేఱుచేసి, మమ్ములను అంధులనుగా చేయుచున్నావు".

*39.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*న నందసూనుః క్షణభంగసౌహృదః సమీక్షతే నః స్వకృతాతురా బత|*

*విహాయ గేహాన్ స్వజనాన్ సుతాన్  పతీంస్తద్దాస్యమద్ధోపగతా నవప్రియః॥9752॥*

"చెలులారా! చూచితిరా! మనపై ఆ నందనందనునకు గల ప్రేమానురాగములు అస్థిరములు. మనము ఆయనయొక్క చిఱునవ్వుల విలాసములను, క్రీగంటి చూపుల తళుకుబెళకులను చూచి భ్రాంతిపడి, ఆయనపై మరులుగొంటిమి. మన ఇండ్లు వాకిండ్లను, పతులను, సుతులను, ఆత్మీయులగు బంధుమిత్రులను వదలుకొని, ఆ స్వామినే సర్వస్వముగా భావించి, దాసీలమై ఆయనను ఆశ్రయించితిమి. అయ్యో! క్రొత్తవారిపై ప్రేమగల ఆ నందపుత్రుడగు కృష్ణుడు మనవైపు కన్నెత్తియైనను చూడక మథురానగర భామినులను చేరబోవుచున్నాడు".

*39.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*సుఖం ప్రభాతా రజనీయమాశిషః సత్యా బభూవుః పురయోషితాం ధ్రువమ్|*

*యాః సంప్రవిష్టస్య ముఖం వ్రజస్పతేః  పాస్యంత్యపాంగోత్కలితస్మితాసవమ్॥9753॥*

"సఖులారా! రేపటి ప్రాతఃకాలము మథురానగరకాంతలకు నిజముగా మిగుల సుఖావహమగును. వారి మనోరథములన్నియును ఈడేరుట తథ్యము. ఏలయన మన ప్రభువు ఆ పురమున ప్రవేశించినంతనే ఆకర్షణీయమైన ఓరచూపులతోను, మధురదరహాసములతోను ఒప్పుచుండెడి ఆయన ముఖారవిందమునందలి మకరందములను తనివిదీర ఆస్వాదించి వారు ధన్యులయ్యెదరు".

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[07/02, 04:12] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*808వ నామ మంత్రము* 07.02.2021

*ఓం పరమాణువే నమః*

పరమాణు స్వరూపిణి, తెలియ శక్యము కానంత మిక్కిలి సూక్ష్మముల కంటెను సూక్ష్మమైన పరాశక్తి స్వరూపురాలికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పరమాణుః* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం పరమాణువే నమః* యని ఉచ్చరించుచూ,  ఎనలేని భక్తిశ్రద్ధలతో, ఏకాగ్రచిత్తులై కేవలం ఆ పరమేశ్వరి కరుణయే పరమావధిగా ఆ పరబ్రహ్మస్వరూపురాలైన శ్రీమాతను  ఉపాసించు సాధకునకు ఆ జగన్మాత జన్మరాహిత్యమైన కైవల్యమును ప్రసాదించును.

అమ్మవారు పరమాణువు కన్నా మిక్కీలి సూక్ష్మ స్వరూపిణియై తెలియ శక్యముకానిది. కేవలం నిర్మలమైన జ్ఞానచక్షువులకు మాత్రమే దర్శింపదగినది. ఇంతకన్నా ఆంగ్లపదములు నేను (పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం) వ్రాయను . *వొతోగుణవచనాత్* సూత్రముచే  విధింపబడినద జ్ఞీవ్ వికల్పము గనుక అణ్వీ - అణుః అను రెండు రూపములుండవచ్చునని భాస్కరరాయలువారు చెప్పారు. *పరమాత్మ అణువులకన్నా అణువయిన* దని వేదములు వర్ణించినవని కూడా చెప్పారు.

అవును అమ్మవారు అంతే గదా! నిర్మలమైన, తురీయాతీతస్థితి యందున్నప్ఫుడే సాధకుని జ్ఞాననేత్రములకు మాత్రమే తెలియదగును. అందుకే ఆ మహాతల్లిని *పరమాణుః* అని అన్నారు. 

కూర్మపురాణంలో నిరంజనము, శాంతము, సత్యము, సచ్చిదానంద స్వరూపాలైన నా శక్తులే మహేశ్వరి, గౌరి, పరంపదము అని చెప్పబడినది. అట్టి పరాశక్తియే *పరమాణుః* యని అనబడినది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[07/02, 04:12] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*234వ నామ మంత్రము* 07.02.2021

*ఓం మహాత్రిపురసుందర్యై నమః*

మాతృ (కొలుచువాడు), మాన (కొలత), మేయము (కొలువబడునది) - త్రిపుటి అనే సంఖ్యతో తాదాత్మ్యత పొంది, త్రిపురసుందరియై తేజరిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహాత్రిపురసుందరీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం మహాత్రిపుర సుందర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ శ్రీమాతను ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి సర్వార్థసిద్ధిని కలిగించును మరియు ఆత్మానందానుభూతితో తరింపజేయును.

త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి (షోడసి , లలిత , రాజరాజేశ్వరి ) దశ మహావిద్యలలో ఒక స్వరూపము. సాక్షాత్ ఆది పరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావున మహాత్రిపుర సుందరి అంటారు.  

జగన్మాత మూడు రూపాలలో ఉంటుంది.

1. *స్థూల (భౌతికం)*  లలితా సహస్రనామ స్తోత్రంలో ధ్యాన శ్లోకాలలో వివరించబడినది. బహిర్యాగంతో పూజించబడుతుంది.

2. *సూక్ష్మ (సున్నితం)* పంచదశీ వంటి మూల మంత్రాలలో వివరించబడినది.  

*శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖపంకజ* పంకదశీ మంత్రంలో మొదటి ఐదక్షరములను వాగ్భవకూటము అందురు. ఈ వాగ్భవకూటము అమ్మవారి ముఖపంకజముతో చెప్పబడినది. ఇది అమ్మవారి సూక్ష్మ రూపము.

*కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి* పంచదశీ    మంత్రంలో  ఆరవ అక్షరంనుండి పదకొండవ అక్షరం వరకూ గల ఆరు అక్షరములు అమ్మవారి సూక్ష్మ శరీరంలోని కంఠమునుండి దిగువ కటిప్రదేశం వరకు *కామరాజకూటము* గా చెప్పబడినది.

*శక్తికూటైకతాపన్న కట్యధోభాక ధారిణి* పంచదశీ మంత్రంలోని చివరి నాలుగు అక్షరములు అమ్మవారి సూక్ష్మ శరీరంలోని కటిప్రదేశం దిగువనుండి పాదముల వరకు *శక్తికూటము* గా చెప్పబడినది.

పై మూడు కూటములు *వాగ్భవ, కామరాజ, శక్తి కూటములు* మూడింటిని కలిపి *మూలకూటత్రయకళేబరా* యను (89వ) నామ మంత్రముతో అమ్మవారు స్తుతింపబడినది.

అలాగే *మూలమంత్రాత్మికా* యను (88వ) నామ మంత్రములో పంచదశీ మంత్రమే పరమేశ్వరి ఆత్మస్వరూపంగా చెప్పబడినది. 

3. *పర (మహోన్నతం)* అంతర్యాగం (యంత్ర-మంత్ర ప్రయోగాలతో) పూజించబడుతుంది.

శ్రీ చక్రం లో బిందువు ఒకటిగానే కనిపించిననూ శాంతమయి అయిన అమ్మవారు మూడు వివిధ శక్తుల సమాహారము.

*ఇఛ్ఛా శక్తి* వామాదేవి, బ్రహ్మ యొక్క దేవేరి

*జ్ఞాన శక్తి*  జ్యేష్ఠాదేవి, విష్ణువు యొక్క దేవేరి

*క్రియా శక్తి* రౌద్రి, శివుడు యొక్క దేవేరి

ఇవన్నీ సాక్షాత్ శ్రీమాత యొక్క త్రిపురసుందరీ స్వరూపమే.

ధ్యానము, ధ్యేయము (ధ్యానింపదగిన భగవత్స్వరూపము), ధ్యాత అనునది త్రిపుటి. అలాగే  జ్ఞాత, జ్ఞాన, జ్ఞేయ (తెలుసుకొనేవాడు, తెలియబడేది, తెలసికొనుట) ఈ త్రిపుటి యనునది ప్రతీ ఉపాధిలోనూ ఉంటుంది. ఈ (మూడింటి) త్రిపుటిలో జ్ఞాత, జ్ఞేయ అనునవి జ్ఞానములో లీనమైతే (ఏకత్వమైతే) కలిగే ఆనందమే *త్రిపురసుందరి*. ఈ త్రిపుటి నశించుటయే *త్రిపురాసుర సంహారము* .ఈ త్రిపుటిలో వ్యాపించినది ఒక్కటే (జ్ఞానమే) అని  తెలిసికొనేదే *త్రివిక్రమ* ఏ స్థితికి చేరాక ధ్యానము, ధ్యాత, ధ్యేయము మూడూ ఒక్కటైపోతాయో దానినే *ఏకత్వము* దీనినే జీవబ్రహ్మైక్యమనియు,  *మహాత్రిపురసుందరి* యనియు అందురు.

ఇంకనూ సృష్టి, స్థితి లయములు, సత్వ రజ స్తమో గుణములు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి, కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని ఇత్యాదులను కూడా మహాత్రిపురసుందరి స్వరూపంతో సమన్వయించదగును.

అట్టి జగజ్జననికి నమస్కరించునపుడు *ఓం మహాత్రిపురసుందర్యై నమః* అని అనవలెను

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[07/02, 04:12] +91 95058 13235: *7.2.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది తొమ్మిదవ అధ్యాయము*

*బలరామకృష్ణులు అక్రూరునితోగూడి మథురకు బయలుదేరుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*39.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*తాసాం ముకుందో మధుమంజుభాషితైర్గృహీతచిత్తః పరవాన్ మనస్వ్యపి|* 

*కథం పునర్నః ప్రతియాస్యతేఽబలా గ్రామ్యాః సలజ్జస్మితవిభ్రమైర్భ్రమన్ ॥9754॥*

*గోపికలు ఇట్లు పలుకుచున్నారు:*

"సతులారా! మన శ్రీకృష్ణుడు సహజముగా ధీరుడే ఫైగా గురుజనుల ఆజ్ఞలను మీఱనివాడే. ఐనప్పటికిని, మథురానగర తరుణీమణుల యొక్క తేనెలొలికెడి మంజుల భాషణములకును, సిగ్గులతోగూడిన మందహాస విలాసములకును ముగ్ధుడై, తప్పక వారివాడగును.  అట్టిస్థితిలో అబలలము, పల్లెపడుచులము ఐన మన దగ్గఱకు ఆ ప్రభువు ఏల వచ్చును?"

*39.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*అద్య ధ్రువం తత్ర దృశో భవిష్యతే  దాశార్హభోజాంధకవృష్ణిసాత్వతామ్|*

*మహోత్సవః శ్రీరమణం గుణాస్పదం ద్రక్ష్యంతి యే చాధ్వని దేవకీసుతమ్॥9755॥*

"శ్రీకృష్ణుని రూపము ఎంతయు రమణీయము, దర్శనీయము, ఆ ప్రభువు సకలకల్యాణ గుణములకు నిధి. నేడు మథురానగరములోగల దాశార్హ, భోజ, అంధక, వృష్ణి, సాత్వత వంశీయులెల్లరు మన దేవకీసుతుడగు శ్యామసుందరుని దర్శించుటచే, వారి కన్నులకు గొప్ప ఉత్సవమే యగును. ఇంకనూ, రమారమణుడు, గుణసాగరుడు అగు శ్రీకృష్ణుడు దారిలోగల జనులందరికిగూడా కన్నులపండుగను చేకూర్చగలడు".

*39.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*మైతద్విధస్యాకరుణస్య నామ భూదక్రూర ఇత్యేతదతీవ దారుణః|*

*యోఽసావనాశ్వాస్య సుదుఃఖితం జనం  ప్రియాత్ప్రియం నేష్యతి పారమధ్వనః॥9756॥*

"సుదతులారా! ఈ అక్రూరుడు ఏమాత్రమూ దయలేనివాడు. మిక్కిలి కఠినాత్ముడు. ఇచట మనము శ్రీకృష్ణునకై ఇంతగా పరితపించిపోవుచున్నను, మనసు ప్రియాతిప్రియుడైన ఆ స్వామిని ఇతడు దూరతీరములకు తీసికొనిపోవుచున్నాడు. మాటమాత్రముగానైనను ఇతడు మనకు ఊఱట గూర్చుటలేదు. కనుక అత్యంత క్రూరుడైన ఇతడు అక్రూరుడను పేరునకు ఎంతమాత్రమూ తగదు".

*39.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*అనార్ద్రధీరేష సమాస్థితో రథం  తమన్వమీ చ త్వరయంతి దుర్మదాః|*

*గోపా అనోభిః స్థవిరైరుపేక్షితం  దైవం చ నోఽద్య ప్రతికూలమీహతే॥9757॥*

"గోపికలు ఇట్లు అనుకొనుచుండగనే తెల్లవాఱెను. శ్రీకృష్ణుడు ప్రయాణసన్నద్ధుడై, రథారూఢుడైయుండెను. అప్పుడు ఆ గోపకాంతలు ఇంకను ఇట్లు సంభాషించుకొనిరి. "సుదతులారా! అక్రూరుని విషయము అట్లుంచుడు. శ్రీకృష్ణుడుగూడ అక్రూరునికంటె తక్కువ తినలేదు. అతనికివలె ఈ స్వామి మనస్సు గూడ కఠినమైనదే. అందువలననే మన ప్రభువు అప్పుడే రథముపై చేరియున్నాడు. మూర్ఖులైన గోపాలురుగూడ ఆయనను అనుసరించి వెళ్ళుటకై తమ బండ్లను సిద్ధపఱచుకొనుచు త్వరపడుచున్నారు. వృద్ధులు సైతము ఈ విషయమున ఏమాత్రమూ పట్టించుకొనక మిన్నకున్నారు. దైవమే ప్రతికూలముగా ఉన్నప్పుడు మనము మాత్రము ఏమిచేయగలము?

*39.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*నివారయామః సముపేత్య మాధవం కిం నోఽకరిష్యన్భ కులవృద్ధబాంధవాః|*

*ముకుందసంగాన్నిమిషార్ధదుస్త్యజాద్దైవేన  విధ్వంసితదీనచేతసామ్॥9758॥*

"చెలులారా! శ్రీకృష్ణుని సాంగత్యము లేక మనము ఒక్క క్షణకాలమైనను నిలువజాలము. దైవప్రాతికూల్యముచే మన మనస్సులన్నియు పరితాపమునకు లోనై మిగుల దిగాలు పడియున్నవి. కనుక, మనమే ఆ మాధవునికడకు వెళ్ళి, ఆ స్వామి ప్రయాణమును ఆపుటకు పూనుకొందము. ఇక ఈ కులవృద్ధులు, బంధువులు మనలను ఏమి చేయుదురో చూచెదముగాక!"

*39.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*యస్యానురాగలలితస్మితవల్గుమంత్రలీలావలోకపరిరంభణరాసగోష్ఠ్యామ్|*

*నీతాః స్మ నః క్షణమివ క్షణదా వినా తం గోప్యః కథం న్వతితరేమ తమో దురంతమ్॥9758॥*

సఖులారా! రాసక్రీడలలో మునిగియున్న మనకు శ్రీకృష్ణునియొక్క ప్రేమానురాగములతో, మనోహర మందహాసములతో, తీయని సరససల్లాపములతో విలాసశోభితములైన వీక్షణములతో, హాయిని గూర్చెడి గాఢాలింగనములతో పెక్కురాత్రులు ఒక్కక్షణకాలమువలె గడచిపోయినవి. ఇప్పుడు ఆ స్వామికి దూరమై దుర్భరమైన విరహతాపము నుండి  ఎట్లు బయటపడగలము?".

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[07/02, 21:04] +91 95058 13235: *7.2.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది తొమ్మిదవ అధ్యాయము*

*బలరామకృష్ణులు అక్రూరునితోగూడి మథురకు బయలుదేరుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*39.30 (ముప్పదియవ శ్లోకము)*

*యోఽహ్నః క్షయే వ్రజమనంతసఖః పరీతో గోపైర్విశన్ఖురరజశ్ఛురితాలకస్రక్|*

*వేణుం క్వణన్ స్మితకటాక్షనిరీక్షణేన చిత్తం క్షిణోత్యముమృతే ను కథం భవేమ॥9760॥*

"ప్రతిదినము వనమునందు గోవులను మేపుకొని, శ్రీకృష్ణుడు, బలరామునితోను, తోడి గోపాలురతోను సాయం సమయమున గోకులమునకు చేరుచుండెడివాడు. అప్పుడు ఆయనయొక్క నల్లని ముంగురులు, వనమాలికాదిహారములు ఆవులగిట్టల తాకిడిచే పైకి లేచిన దుమ్ములచే నిండి వింత వింత శోభలీనుచుండెడివి. ఆ సమయమున ఆ స్వామి తన మురళీగానమాధుర్యములతో, దరహాసరోచిస్సులతో, ఒయ్యారపు క్రీగంటి చూపులతో మన మనస్సులను దోచుకొనుచుండెడివాడు. అట్టి ఆ ప్రభువు లేకుండా మనము ఎట్లు బ్రతికి యుండగలము?"

*శ్రీశుక ఉవాచ*

*39.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*ఏవం బ్రువాణా విరహాతురా భృశం వ్రజస్త్రియః కృష్ణవిషక్తమానసాః|*

*విసృజ్య లజ్జాం రురుదుః స్మ సుస్వరం గోవింద దామోదర మాధవేతి॥9761॥*

*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! ఇంతవఱకును గోపికలు ఎవరికివారే శ్రీకృష్ణుని సుఖస్పర్శతో, గాఢాలింగన సుఖములతో మైమఱచి పోవుచుండిరి. అప్పుడు వారి మనస్సులన్నియును కృష్ణప్రేమలో తడిసి ముద్దైయుండెడివి. ఇప్పుడు ఆ స్వామి తమకు దూరమై పోవుచున్నాడను భావముతో మిగుల పరితపించుచు సిగ్గునువీడి 'గోవిందా! దామోదరా! మాధవా! అని కన్నీరు మున్నీరగుచు బిగ్గఱగా ఏడ్చుచుండిరి.

*39.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*స్త్రీణామేవం రుదంతీనాముదితే సవితర్యథ|*

*అక్రూరశ్చోదయామాస కృతమైత్రాదికో రథమ్॥9762॥*

గోపకాంతలు ఈ విధముగా గగ్గోలు పెట్టుచునే యుండిరి. ఇంతలో సూర్యోదయమయ్యెను. అంతట అక్రూరుడు ప్రాతఃకాల సంధ్యోపాసనాది నిత్య విధులను ముగించుకొని, రథమును నడుపసాగెను.

*39.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*గోపాస్తమన్వసజ్జంత నందాద్యాః శకటైస్తతః|*

*ఆదాయోపాయనం భూరి కుంభాన్ గోరససంభృతాన్॥9763॥*

నందాది గోపాలురు కూడ పాలు, పెఱుగు, వెన్న, నేయి మొదలగు గోరసములతో నిండిన కుండలను, వివిధములగు పెక్కు కానుకలను, బండ్లపై చేర్చుకొని, అక్రూరుని రథమును అనుసరించిరి.

*39.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*గోప్యశ్చ దయితం కృష్ణమనువ్రజ్యానురంజితాః|*

*ప్రత్యాదేశం భగవతః కాంక్షంత్యశ్చావతస్థిరే॥9764॥*

గోపికలును తమకు ఎంతయు ప్రియతముడైన శ్రీకృష్ణుని అనుసరింపసాగిరి. అప్పుడు కృష్ణభగవానుడు తగినవిధముగా చేసంజ్ఞలతో వారిని నివారింపజూచెను. కాని, గోపవనితలు మాత్రము వెనుకకు మఱలక ఆ స్వామియొక్క ప్రత్యుత్తరము కొఱకు నిరీక్షించుచు అచట నిలిచిపోయిరి.

*39.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*తాస్తథా తప్యతీర్వీక్ష్య స్వప్రస్థానే యదూత్తమః|*

*సాంత్వయామస సప్రేమైరాయాస్య ఇతి దౌత్యకైః॥9765॥*

తాను మథుర. ప్రయాణమై వెళ్ళుచున్న సమయమున మిగుల పరితపించుచు క్షోభ పడుచున్న గోపికలను జూచి, ఆ యదుకుల శిరోమణి 'నేను త్వరలోనే తిరిగి వత్తును' మున్నగు అనురాగ పూరితములైన వచనములను దూతలద్వారా పంపి వారిని ఓదార్చుచు ధైర్యమును గొల్పెను.

*39.36 (ముప్పది రెండవ శ్లోకము)*

*యావదాలక్ష్యతే కేతుర్యావద్రేణూ రథస్య చ|*

*అనుప్రస్థాపితాత్మానో లేఖ్యానీవోపలక్షితాః॥9766॥*

పిమ్మట శ్రీకృష్ణుని రథము మీది ధ్వజపతాకము కనబడుచున్నంత వఱకును, రథాశ్వముల గిట్టల తాకిడికి చెలరేగిన దుమ్ములు గోచరించుచున్నంత వఱకును చూచుచు గోపికలు ప్రతిమలవలె నిశ్చేష్టలై అచటనే నిలిచిపోయిరి. కాని, వారి చిత్తములు మాత్రము ఆ ప్రభువును అనుసరించుచునే యుండెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[08/02, 05:23] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*235వ నామ మంత్రము* 08.02.2021

*ఓం చతుష్షష్ట్యుపచారాఢ్యాయై నమః*

అరువది నాలుగు ఉపచారములతో ఆరాధింపబడు అఖిలాండేశ్వరియైన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *చతుష్షష్ట్యుపచారాఢ్యా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం చతుష్షష్ట్యుపచారాఢ్యాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ శ్రీమాతను అరువది నాలుగు ఉపచారములతో అత్యంత భక్తి శ్రద్ధలతోఉపాసించు సాధకులకు ఆ అమ్మ సర్వాభీష్టసిద్ధిని కలుగజేయుటయేగాక, జన్మజన్మలనుండి సంచితమైన కర్మఫలముల దుష్ప్రభావం శాంతించును, కైవల్యమునకు మార్గము సుగమమవును.

సాధారణంగా షోడశోపచారములతో భగవంతుని ఆరాధిస్తాము. పరమేశ్వరి శ్రేష్ఠమైన దేవత గనుక అరువదినాలుగు ఉపచారములతో ఆరాధించడం జరుగుతుంది. 

1. ధ్యానము, 2. ఆవాహనము, 3. సింహాసనము, 4. అర్ఘ్యము, 5. పాద్యము, 6. ఆచమనీయము, 7. మధుపర్కము, 8. పునరాచమనీయము, 9. ఆభరణారోపణము, 10. అభ్యంగవస్త్రపరిధానము, 11. అభ్యంగ పీఠోపవేశనము, 12. తైలాభ్యంజనము, 13. ఉష్ణోదక స్నానము, 14. పంచామృత స్నానము, 15. ఉద్వర్తనము, 16. దేవీసూక్తపఠన పూర్వక సకల తీర్థాభిషేచనము, 17. ఆలేపన పీఠోపవేశనము, 18. అరుణ దుకూల పరిమార్జనము, 19. రక్తోత్తరీయము, 20. అధోవస్త్రము, 21. కంచుకధారణము, 22. కేశధూపము, 23. గంధానులేపనము, 24. కాటుక, 25. ఆభరణ పీఠోపవేశనము, 26. మణిమకుటము, 27. చంద్రశకలము, 28. సిందూరతిలకము, 29. నాసాభరణము, 30. పాళీయుగము, 31. మణికుండలయుగము, 32. తాటంకయుగము, 33. కనక చింతాకము, 34. మంగళసూత్రము, 35. గ్రైవేయము, 36. తారావళి, 37. ఏకావళి, 38. కటిసూత్రము, 39. కేయూరయుగళ చతుష్టయము, 40. వలయావళి, 41. ఊర్మికావళి, 42. సౌభాగ్యాభరణము, 43. పాదకటకము, 44. నూపురయుగళము, 45. పాదాంగుళీయకము, 46. కరాంగుళీయకము, 47. ఒకచేతి పాశము, 48. అంకుశము, 49. పుండ్రేక్షుపాశము, 50. పుష్పబాణము, 51. పాదుకలు, 52. చక్రాధిరోహణము, 53. తీర్థపూర్ణ కలశము, 54. గంధము, 55. పుష్పపూజ, 56. ధూపము, 57. దీపము, 58. నైవేద్యము, 59. తాంబూలము, 60. నీరాజనము, 61. దర్పణదర్శనము, 62. ఛత్రసీమ, 63. చామరసీమ, 64. తాళవృంతసేవ  (విసనకర్ర) 

ఈ ఉపచారములు సాంప్రదాయాన్ననుసరించి మారుతూ ఉంటాయి.

పరశురామునిచే  కల్పసూత్రమునందు ఈ అరువది నాలుగు ఉపచారములు చెప్పబడినవి. ఇవిగాక ఇంకను ఇతర తంత్రములందు ఎనిమిది ఉపచారములు చెప్పబడినవి. అవి: 

1. శివపాదమందలి పుష్పములను ధరించుట, 2. దేవతాస్వరూపమును ఆత్మయందు ఆరోపించుకొనుట, 3. పరివార దేవతలకు ఉద్వాసన చెప్పుట, 4. గురువులను, భక్తులను అర్చించుట, 5. శైవ పుస్తకములను పూజించుట, 6. శైవాగ్నియందు దేవతలను గూర్చి హోమము చేయుట, 7. శివపాదతీర్థమును స్వీకరించుట, 8. సాంగముగా ప్రాణాగ్నిహోత్రము చేయుట.

గృహమునకు వచ్చిన అతిథికి ఇంట్లోకి రమ్మనమని సాదరంగా లోనికి పిలుపు (ఆవాహన) కాళ్ళుకడుగుకోవడానికి నీళ్ళు (పాద్యం), కూర్చోవడానికి కుర్చీ (ఆసనము)  ఇలా వివిధ సత్కారములతో ఆదరించడం మన సాంప్రదాయం.

అలాకే కోర్కెల సాధనకు (ముక్తి అనేది కూడా ఒక కోరికయే) పరమాత్మను పంచోపచారములతోను లేదా షోడశోపచారములతోను ఆరాధిస్తాము. కాని జగన్మాత శ్రేష్ఠమైన దేవత గనుక అరువది నాలుకు ఉపచారములతోను ఆరాధిస్తాము. ఈ ఉపచారములతో   పరమేశ్వరి అనుగ్రహం పొందడం జరుగుతుంది. 

పరమేశ్వరి అరువది నాలుగు ఉపచారములతో ఆరాధింపబడుతుంది గనుక *చతుష్షష్ట్యుపచారాఢ్యా* యని అనబడినది. 

పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం చతుష్షష్ట్యుపచారాఢ్యాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[08/02, 05:23] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*809వ నామ మంత్రము* 08.02.2021

*ఓం పరాత్పరాయై నమః*

బ్రహ్మాదుల కంటెను ఉత్కృష్టురాలైన  జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పరాత్పరా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం పరాత్పరాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు శాంతిసౌఖ్యములు, ఆయురారోగ్యములు ప్రసాదించును. అన్నిటికన్న ప్రధానమైన కవల్యప్రాప్తికి కావలసిన   ధ్యాననిమగ్నత, దీక్షాబద్ధత అనుగ్రహించును.

బ్రహ్మ, విష్ణు, రుద్రులందరూ ఉత్కృష్టులు. అనగా శ్రేష్ఠమైనవారు. వీరికంటెను జగన్మాత ఇంకను గొప్పది గనుకనే *పరాత్పరా* యని అనబడినది. ఇంకను చెప్పవలెనంటే బ్రహ్మయొక్క ఆయువునకు నిమేషము (రెప్పపాటు) నుండి బ్రహ్మయొక్క ఆయువు అయిన నూరుసంవత్సరముల వరకును లెక్కింపవచ్చును. కాని పరబ్రహ్మకు అటు వంటివి ఏమియులేవు. అనగా ఆద్యంతములు లేవు. పరమేశ్వరి పరంధామ స్వరూపురాలు, పరమాణు స్వరూపురాలు గనుకనే కాలపరిమాణము లెక్కలోనికిరాదు అని కాళీ పురాణములో చెప్పబడినది. బ్రహ్మదేవుని రాత్రింబవళ్ళగు ఆయువునకు పరము అని పేరు. అనగా సగము అనగా పరార్ధము. పరమేశ్వరుడు స్థూలములన్నిటికంటె స్థూలము, సూక్ష్మము లన్నిటికంటె సూక్ష్మము అగుటచే పగలు,రాత్రి, అనియు, సంవత్సరము అనియు కాలపరిమాణములులేవు. ఆవిధంగా పరమేశ్వరి పరమునకే పరమై *పరాత్పరా* యని అనబడినది. 

ఇంద్రియములకన్నను మనస్సు శ్రేష్ఠమైనది, మనస్సు కన్నను బుద్ధి శ్రేష్ఠమైనది, బుద్ధి కన్నను మహత్తు శ్రేష్ఠమైనది,  మహత్తు కన్నను అవ్యక్తము శ్రేష్ఠమైనది, అవ్యక్తము కన్నను పరబ్రహ్మము శ్రేష్ఠమైనది. పరబ్రహ్మము కన్నను శ్రేష్ఠమైనది లేదు గనుక పరమేశ్వరి *పరాత్పరా* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం పరాత్పరాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[08/02, 05:23] +91 95058 13235: *8.2.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది తొమ్మిదవ అధ్యాయము*

*బలరామకృష్ణులు అక్రూరునితోగూడి మథురకు బయలుదేరుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*39.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*తా నిరాశా నివవృతుర్గోవిందవినివర్తనే|*

*విశోకా అహనీ నిన్యుర్గాయంత్యః ప్రియచేష్టితమ్॥9767॥*

'శ్రీకృష్ణుడు కొంతదూరము వెళ్ళిన పిదప మఱల తిరిగివచ్చునేమో' అను ఆశ వారి మనస్సులలో మెదలుచునే యుండెను. కాని, ఆ పురుషోత్తముడు తిరిగి రానందున వారు నిరాశతో ఇండ్లకు చేరిరి. అనంతరము వారు ఆ పరమాత్మలీలలను రాత్రింబవళ్ళు గానము చేయుచు తమ శోకభారమును తగ్గించుకొనిరి.

*39.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*భగవానపి సంప్రాప్తో రామాక్రూరయుతో నృప|*

*రథేన వాయువేగేన కాలిందీమఘనాశినీమ్॥9768॥*

పరీక్షిన్మహారాజా! కృష్ణభగవానుడు బలరామునితోడను, అక్రూరునితోడను గూడి రథముపై వాయువేగమున సాగిపోవుచు, పవిత్రమైన కాళిందీ (యమునా) నదీ తీరమునకు చేరెను.

*39.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*తత్రోపస్పృశ్య పానీయం పీత్వా మృష్టం మణిప్రభమ్|*

*వృక్షషండముపవ్రజ్య సరామో రథమావిశత్॥9769॥*

*39.40  (నలుబదియవ శ్లోకము)*

*అక్రూరస్తావుపామంత్ర్య నివేశ్య చ రథోపరి|*

*కాలింద్యా హ్రదమాగత్య స్నానం విధివదాచరత్॥9770॥*

అంతట బలరామకృష్ణులు నీలమణికాంతులవలె స్వచ్ఛములైన ఆ మధురజలములను ఆచమించి, తృప్తిగా సేవించిరి. పిమ్మట వారు తీరమును చేరి, చెట్లనీడలలోనున్న రథముపై ఎక్కిరి. అప్పుడు అక్రూరుడు శత్రుభయమును శంకించి, ఆ ఇరువురు సోదరులను సాదరముగా రథమునందు కూర్చుండజేసి, వారి ఆజ్ఞతో ఆ నదియందలి బ్రహ్మకుండమునకు చేరెను. అనంతరము అతడు మాధ్యాహ్నిక విధులను ఆచరించుటకై కాళిందీ సరస్సునందు దిగి ఆ జలములలో స్నానము చేయసాగెను.

*39.41 (నలుబది ఒకటవ శ్లోకము)*

*నిమజ్జ్య తస్మిన్ సలిలే జపన్ బ్రహ్మ సనాతనమ్|*

*తావేవ దదృశేఽక్రూరో రామకృష్ణౌ సమన్వితౌ॥9771॥*

అతడు సనాతన బ్రహ్మవాచకమైన *ఓంకారము* ను జపించుచు ఆ జలములలో మునిగెను. అప్పుడు రథమునందు చేరియున్న ఆ బలరామకృష్ణులే ఆయనకు ఆ సలిలములయందును కనబడిరి.

*39.42  (నలుబది రెండవ శ్లోకము)*

*తౌ రథస్థౌ కథమిహ సుతావానకదుందుభేః|*

*తర్హి స్విత్స్యందనే న స్త ఇత్యున్మజ్జ్య వ్యచష్ట సః॥9772॥*

*39.43 (నలుబది మూడవ శ్లోకము)*

*తత్రాపి చ యథా పూర్వమాసీనౌ పునరేవ సః|*

*న్యమజ్జద్దర్శనం యన్మే మృషా కిం సలిలే తయోః॥9773॥*

'వసుదేవుని కుమారులైన ఆ బలరామకృష్ణులు రథమునందు ఉన్నారుగదా! ఇచ్చటికి ఎట్లు (ఎప్పుడు) వచ్చిరి? రథము దిగి ఇచటికి వచ్చినచో వారు అచట ఉండకూడదుగదా!' అని శంకించుచు నీళ్ళలోనుండి పైకి లేచి చూచెను. కాని, వారు ఎప్పటివలె రథమునందుండుట అతడు గమనించెను. అప్పుడు అతడు 'నేను వారిని జలములలో చూచినది నిజము కాకపోవచ్చును - అది నాభ్రమయేమో? అట్లైనచో మఱల చూచెదను' అని తర్కించుకొనుచు అతడు నీటిలో మునిగెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[08/02, 21:06] +91 95058 13235: *8.2.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది తొమ్మిదవ అధ్యాయము*

*బలరామకృష్ణులు అక్రూరునితోగూడి మథురకు బయలుదేరుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*39.44 (నలుబది నాలుగవ శ్లోకము)*

*భూయస్తత్రాపి సోఽద్రాక్షీత్స్తూయమానమహీశ్వరమ్|*

*సిద్ధచారణగంధర్వైరసురైర్నతకంధరైః॥9774॥*

*39.45 (నలుబది ఐదవ శ్లోకము)*

*సహస్రశిరసం దేవం సహస్రఫణమౌలినమ్|*

*నీలాంబరం బిసశ్వేతం శృంగైః శ్వేతమివ స్థితమ్॥9775॥*

మఱల ఆ నీళ్ళలో అపుడు అతడు ఆదిశేషుని దర్శించెను. ఆ సమయమున సిద్ధులు, చారణులు, గంధర్వులు, అసురులు ఆ సర్పరాజును స్తుతించుచుండిరి. ఆ ఆదిశేషుడు వేయి శిరస్సులతో, కిరీట శోభితములైన వేయిపడగలతో  ఒప్పుచు నీలాంబరము ధరించియుండెను. ఆ స్వామి తామరకాడవలె తెలుపు వన్నెతో అలరారుచు, బంగారు శిఖరములతో విలసిల్లుచున్న కైలాసపర్వతమువలె విరాజిల్లుచుండెను.

*39.46 (నలుబది ఆరవ శ్లోకము)*

*తస్యోత్సంగే ఘనశ్యామం పీతకౌశేయవాససమ్|*

*పురుషం చతుర్భుజం శాంతం పద్మపత్రారుణేక్షణమ్॥9776॥*

ఆ ఆదిశేషుని ఒడిలో శ్రీమన్నారాయణుడు (శేషతల్పశాయియైన శ్రీమహావిష్ణువు) ఆ అక్రూరునకు దర్శనమిచ్చెను. 

*వీరరాఘవీయ వ్యాఖ్య:*

బలరామకృష్ణులు పసిబాలురు. కంసుని సేవకులు, మిగుల బలిష్ఠులు ఐన చాణూరముష్టికులతో వారు ఎట్లు పోరాడగలరు? అను శంక అక్రూరుని మనస్సులో మెదలుచుండెను. ఆ శంకను నివారించుటకై ఈసారి అతనికి శ్రీమన్నారాయణుడే స్వయముగా దర్శనమిచ్చెను. దీనితో ఆ 'శ్రీకృష్ణుడు శ్రీమహావిష్ణువే' అని అక్రూరునకు తెలియవచ్చెను. ఈ విధముగనైనను ఆ దేవదేవుని దర్శించిన అక్రూరుని భాగ్యమే భాగ్యము గదా!

ఆ పురుషోత్తముడు మేఘమువలె శ్యామసుందరుడై, పట్టు పీతాంబరములతో శోభిల్లుచుండెను. ఆ చతుర్భుజుడు శాంతగంభీరుడై తామరపుష్పములవలె అరుణకాంతులుగల నేత్రములతో వెలుగొందుచుండెను.

*39.47 (నలుబది ఏడవ శ్లోకము)*

*చారుప్రసన్నవదనం చారుహాసనిరీక్షణమ్|*

*సుభ్రూన్నసం చారుకర్ణం సుకపోలారుణాధరమ్॥9777॥*

ఆ పరమపురుషుని వదనము సుందరము, ప్రసన్నము, నవ్వులు, చూపులు మిగుల ఆహ్లాదకరములు. ఆయన కనుబొమలు నిరుపమానములు, తీరైన ఆ స్వామి నాసిక ఎంతయు దర్శనీయము. కర్ణముల కాంతులు, చెక్కిళ్ళ శోభలు, అపూర్వములు. ఆ వైకుంఠుని అరుణాధరము పరమరమణీయము.

*39.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*

*ప్రలంబపీవరభుజం తుంగాంసోరఃస్థలశ్రియమ్|*

*కంబుకంఠం నిమ్ననాభిం వలిమత్పల్లవోదరమ్॥9778॥*

*39.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*

*బృహత్కటితటశ్రోణికరభోరుద్వయాన్వితమ్|*

*చారుజానుయుగం చారుజంఘాయుగలసంయుతమ్॥9779॥*

జానువులవరకు పొడవైన ఆ మహాత్ముని బాహువులు బలిష్ఠములు. భుజములు సమున్నతములు, లక్ష్మీదేవికి నివాసమైన ఆ పరమపురుషుని వక్షస్థలము వైభవోపేతము. కంఠము శంఖమువలె రేఖత్రయ శోభితమై విలసిల్లుచుండెను. నాభి తీరుతెన్నులు గంభీరములు, ఉదరము వళిత్రయోపేతమై పల్లవసౌందర్యములను విరజిమ్ముచుండెను. కటిప్రదేశము, నితంబము నిండైనవి. ఊరుద్వయము కరభమువలె (ఏనుగుతుండమువలె) చూడముచ్చట గొల్పుచుండెను. మోకాళ్ళు పిక్కలు ఆకర్షణీయములు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     ముప్పది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[09/02, 04:31] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*810వ నామ మంత్రము* 09.02.2021

*ఓం పాశహస్తాయై నమః*

ఎడమవైపున ఉన్న క్రిందిచేతిలో పాశమును ధరించియున్న పరబ్రహ్మస్వరూపిణియైన అమ్మవారికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పాశహస్తా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం పాశహస్తాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని ఆరాధించు సాధకులకు      ఆ తల్లి కామక్రోధాది అరిషడ్వర్గములను లేకుండ జేయును. శత్రుపీడ, ఋణపీడ, నరఘోష తొలగించును. భౌతికపరమైన కోర్కెలతోబాటు, ఆముష్మికపరమైన కోర్కెలుకూడా సిద్ధింపజేయును.

జగన్మాత *చతుర్బాహుసమన్విత* అనగా నాలుగు బాహువులు కలిగి యున్నది. ఆ తల్లి *రాగస్వరూపపాశాఢ్యా* అనగా ఎడమవైపుగల క్రిందిచేతిలో రాగస్వరూపమైన పాశము ఉన్నది. రాగబంధమైన ఈ జీవితాన్ని పూర్తిగా పరమేశ్వరి పాదసేవలో నిమగ్నంచేస్తూ, ఆ పాశమును అర్చించితే, సాధకుడు ఐహికబంధములనుండి క్రమముగా ముక్తుడై, నిత్యమైన, సత్యమైన పరమానందాన్ని తనదిగా చేసుకుంటాడు.  

జగన్మాత చేతిలోని ఈ పాశము వశీకరణ పాశము. ఏదైనా సత్కార్యాచరణగాని సత్ప్రయత్నములకు గాని ముందుగా అమ్మవారి ఈ నామమంత్రమును స్మరించుచూ, పవిత్రహృదయంతో అన్యులకు కీడుతలపెట్టని విధమైన ఆలోచనలతో ముందుకు సాగినట్లయితే తప్పక సత్ఫలితము  లభించుట తథ్యము. ఎదుకంటే జగన్మాత *మనోరూపేక్షుకోదండ* అనగా ఆ తల్లి మనస్సు చెఱకువలె మధురమైన అనురాగ పూరితమైనది. తనను నమ్మిన భక్తులకు సత్కార్యములయందు విజయం తప్పక సిద్ధింపజేస్తుంది. మానవుడు ఏ మోహపాశమునకైతే కట్టుబడి ఉంటాడో ఆ మోహపాశము నుండి దూరముచేసి, నిత్యమైన, సత్యమైన పరమానందాన్ని తనభక్తులకు ప్రసాదించునది అమ్మవారి చేతిలో ఉన్నపాశము. అంతేకాదు, తనలోని మూర్ఖుడు మేల్కాంచి, చెడుతలంపులకు పోయినట్లైతే, ఆ తల్లి ఆ పాశముతో   వెనుకకు లాగి పాపచింతనవైపు సాధకుని పోనీయకుండా కట్టిపడేసే పాశము అమ్మవారిచేతిలోనిది. అందుకే అమ్మవారిని ప్రత్యేకముగా *పాశహస్తా* యను నామముతో స్తుతించుటకు మూల కారణము. చెడుసహవాసములకు పోకుండా, అల్లరిపనులు చేయకుండా తల్లి తన బిడ్డను ఎలా నియంత్రిస్తుందో అదేవిధంగా జగన్మాత మనలను నియంత్రించి సన్మార్గములో నడుపుతుంది. 

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం పాశహస్తాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[09/02, 04:31] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*236వ నామ మంత్రము* 09.02.2021

*ఓం చతుష్షష్టి కళామయ్యై నమః*

అరువది నాలుగు కళల స్వరూప ప్రధానముగా విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *చతుష్షష్టి కళామయీ* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం చతుష్షష్టి కళామయ్యై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ జగదీశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ జగదంబ వృత్తిఉద్యోగాదులయందు ప్రతిభ, కీర్తి ప్రతిష్టలు, సకల సంపదలు అనుగ్రహించును.

పరమేశ్వరి అరువది నాలుగ కళలు తన స్వరూపముగా విరాజిల్లుచున్నది.  ఈ కళలు వివిధ సందర్భములలో వివిధరీతులలో వివరించడం జరిగినది. శార్ఙ్గధరీయమునందు, కథాకోశమునందు, శ్రీధరీయమునందు వివిధరీతులలో వివరించారు. అలాగే వామకేశ్వర తంత్రంలో మరోవిధంగా వివరించడం జరిగినది. 

*చతుష్షష్టి విద్యాకళలు*

1) అన్వక్షకి, 2) త్రయీ, 3) వార్తా, 4) దండనీతి, 5) ఆకర్షణము, 6) స్తంభనము, 7) మారణము, 8) విద్వేషణము, 9) ఉచ్ఛాటనము, 10) మోహనము, 11) ఋగ్వేదము, 12) యజుర్వేదము, 13) సామవేదము, 14) అథర్వణవేదము, 15) శిక్షా, 16) వ్యాకరణము, 17) ఛందము, 18) నిరుక్తి, 19) జ్యోతిషము, 20) కల్పము, 21) మీమాంస, 22) న్యాయశాస్త్రము, 23) పురాణము, 24) ధర్మశాస్త్రము, 25) ఆయుర్వేదము, 26) ధనుర్వేదము,  27) నీతిశాస్త్రము, 28) అర్ధశాస్త్రము, 29) బ్రాహ్మము, 30) పాద్మము, 31) వైష్ణవము, 32) శైవము, 33) భాగవతము, 34) భవిష్యోత్తరము, 35) నారదీయము, 36) మార్కండేయము, 37) ఆగ్నేయము, 38) బ్రహ్మవైవర్తము, 39) లైంగము,  40) వారాహము,41) వాయవ్యము, 42) గారుడము, 43) వామనము, 44) మాత్స్యము,  45) కూర్మము, 46) బ్రహ్మాండము, 47) సనత్కుమారము, 48) నారసింహము,  49) స్కాందము 50) శివధర్మము, 51) దౌర్వాసము, 52) నారదీయము, 53) కాపిలము, 54) మానవము, 55) ఔశనము, 56) బ్రాహ్మము, 57) వారుణము, 58) కైశికము,  59) లైంగము, 60) సాంబము,  61 సౌరము,  62) పారాశరము, 63 మారీచము, 64) భార్గవము.

పరమేశ్వరి చతుష్షష్టి కళాస్వరూపురాలు. ఈ కళలతో నిండియున్నది. కళలనగా తంత్రములు. ఈ తంత్రములు కూడా అరువదినాలుగు గలవని వామకేశ్వర తంత్రంలో చెప్పబడినది. అటువంటి తంత్రములు లేదా కళల ప్రధానంగా ఉండుటచే అమ్మవారు *చతుష్షష్టికళామయీ* అని యనబడినది.

పరమేశ్వరికి నమస్కరించునఫుడు *ఓం చతుష్షష్టికళామయ్యై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[09/02, 04:31] +91 95058 13235: *9.2.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  ముప్పది తొమ్మిదవ అధ్యాయము*

*బలరామకృష్ణులు అక్రూరునితోగూడి మథురకు బయలుదేరుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*39.50 (ఏబదియవ శ్లోకము)*

*తుంగగుల్ఫారుణనఖవ్రాతదీధితిభిర్వృతమ్|*

*నవాంగుల్యంగుష్ఠదలైర్విలసత్పాదపంకజమ్॥9780॥*

*39.51 (ఏబది ఒకటవ శ్లోకము)*

*సుమహార్హమణివ్రాతకిరీటకటకాంగదైః|*

*కటిసూత్రబ్రహ్మసూత్రహారనూపురకుండలైః॥9781॥*

*39.52  (ఏబది రెండవ శ్లోకము)*

*భ్రాజమానం పద్మకరం శంఖచక్రగదాధరమ్|*

*శ్రీవత్సవక్షసం భ్రాజత్కౌస్తుభం వనమాలినమ్॥9782॥*

చీలమండలు ఉన్నతములు, నఖకాంతులు మనోజ్ఞములు, పద్మములవలె మనోహరముగా నున్న పాదములవ్రేళ్ళు, అంగుష్ఠములు నవనవోన్మేషకాంతులను వెల్లివిరియజేయుచుండెను. అమూల్యములగు మణులతో పొదగబడిన కిరీట - కంకణ - భుజకీర్తులు ధగధగమెఱయుచుండెను. ఆ పురుషోత్తముని యొక్క కటిసూత్రము, యజ్ఞోపవీతము, హారములు, కాలియందెలు, కుండలములు దివ్యకాంతులతో విలసిల్లుచుండెను. ఆదిదేవుడు తన చతుర్భుజముల యందు క్రమముగా కమలమును, శంఖమును , చక్రమును, గదను ధరించి తేజరిల్లుచుండెను. ఆ లక్ష్మీపతియొక్క విశాల వక్షస్థలమందు శ్రీవత్సచిహ్నము, కౌస్తుభమణి, వనమాలికలు దివ్యతేజశ్శోభితములు.

*39.53 (ఏబది మూడవ శ్లోకము)*

*సునందనందప్రముఖైః పార్షదైః సనకాదిభిః|*

*సురేశైర్బ్రహ్మరుద్రాద్యైర్నవభిశ్చ ద్విజోత్తమైః॥9783॥*

*39.54 (ఏబది నాలుగవ శ్లోకము)*

*ప్రహ్లాదనారదవసుప్రముఖైర్భాగవతోత్తమైః|*

*స్తూయమానం పృథగ్భావైర్వచోభిరమలాత్మభిః॥9784॥*

నందుడు, సునందుడు మున్నగు పార్షదులు, సనకసనందనాది మహామునులు, సురప్రముఖులు, బ్రహ్మరుద్రాది దేవతలు, మరీచ్యాది తొమ్మిదిమంది ద్విజోత్తములు, ప్రహ్లాద - నారదాది భాగవతోత్తములు, అష్టవసువులు మొదలగువారు ఎవరికివారు నిర్మలచిత్తులై వేదవచనములతో భక్తిపారవశ్యమున ఆ శ్రీమహావిష్ణువును స్తుతించుచుండిరి.

*39.55 (ఏబది ఐదవ శ్లోకము)*

*శ్రియా పుష్ట్యా గిరా కాంత్యా కీర్త్యా తుష్ట్యేలయోర్జయా|*

*విద్యయావిద్యయా శక్త్యా మాయయా చ నిషేవితమ్॥9785॥*

లక్ష్మి, పుష్టి, సరస్వతి, కాంతి, కీర్తి, తుష్టి (అనగా ఐశ్వర్యము, బలము, జ్ఞానము, శ్రీ, యశము, వైరాగ్యములు) అను షడైశ్వర్య రూపశక్తులు, ఇల (పృథ్వీశక్తి), ఊర్జ (లీలాశక్తి), విద్య, అవిద్య (జీవుల మోక్షమునకు - బంధమునకు కారణములైన బహిరంగశక్తులు), హ్లాదిని, సంవిత్తు (అంతరంగశక్తి) ఇంకను మాయ మొదలగు శక్తులు ఆకృతి దాల్చి ఆ పరమాత్మను సేవించుచుండెను.

*39.56 (ఏబది ఆరవ శ్లోకము)*

*విలోక్య సుభృశం ప్రీతో భక్త్యా పరమయా యుతః|*

*హృష్యత్తనూరుహో భావపరిక్లిన్నాత్మలోచనః॥9786॥*

*39.57 (ఏబది ఏడవ శ్లోకము)*

*గిరా గద్గదయాస్తౌషీత్సత్త్వమాలంబ్య సాత్వతః|*

*ప్రణమ్య మూర్ధ్నావహితః కృతాంజలిపుటః శనైః॥9787॥*

ఇట్లు పరమశోభలతో అలరారుచున్న శ్రీమన్నారాయణుని యొక్క దర్శనమైనంతనే అక్రూరుడు పరమానంద భరితుడయ్యెను. భక్తితో పరవశించి పోయెను. ఆ సంతోషములో అతడు పులకితగాత్రుడయ్యెను. దివ్యభావ పరిపూర్ణుడైన అతని లోచనములు ఆనందాశ్రువులతో నిండెను. అట్టి స్థితిలో అతడు సాహసించి (పూనిక వహించి) సాష్టాంగముగా నమస్కరించి, దోసిలొగ్గి, వినమ్రతతో మెల్లగా గద్గదస్వరమున శ్రీహరిని ఇట్లు స్తుతించెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్క్న్ధే పూర్వార్ధే అక్రూరప్రతియానే ఏకోనచత్వారింశోఽధ్యాయః (39)*

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి *బలరామకృష్ణులు అక్రూరునితోగూడి మథురకు చేరుట* యను ముప్పది తొమ్మిదవ అధ్యాయము (39)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[09/02, 21:25] +91 95058 13235: *9.2.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబదియవ అధ్యాయము*

*అక్రూరుడు శ్రీకృష్ణుని స్తుతించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*అక్రూర ఉవాచ*

*40.1 (ప్రథమ శ్లోకము)*

*నతోఽస్మ్యహం త్వాఽఖిలహేతుహేతుం  నారాయణం పూరుషమాద్యమవ్యయమ్|*

*యన్నాభిజాతాదరవిందకోశద్బ్రహ్మాఽఽవిరాసీద్యత ఏష లోకః॥9789॥*

*అక్రూరుడు ఇట్లు స్తుతించెను* శ్రీమన్నారాయణా! అఖిల కారణకారణుడవు అగు నీకు నమస్కరించుచున్నాను (వ్యష్టి ప్రపంచమునకు హేతువులైన మహదాదులకు నీవే మూలము). నీవే ఆదిపురుషుడవు, అవ్యయుడవు, నీ నాభికమలమునుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవునిద్వారా ఈ లోకసృష్టి జరిగినది.

*40.2 (రెండవ శ్లోకము)*

*భూస్తోయమగ్నిః పవనః ఖమాదిర్మహానజాదిర్మన ఇంద్రియాణి|*

*సర్వేంద్రియార్థా విబుధాశ్చ సర్వే  యే హేతవస్తే జగతోఽఙ్గ భూతాః॥9789॥*

పంచమహాభూతములైన భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనునవియు, అహంకారము, మహత్తత్త్వము, ప్రకృతి, పురుషుడు, మనసు, పంచజ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, వాటి అధిష్ఠానదేవతలు, ఇంద్రియార్థములు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు - అను పంచతన్మాత్రలు) అను వీటి అన్నింటితో గూడిన చరాచర జగత్తు, అట్లే వాటి వ్యవహార కారణములు అన్నియును నీ అంగస్వరూపములే.

*40.3 (మూడవ శ్లోకము)*

*నైతే స్వరూపం విదురాత్మనస్తే  హ్యజాదయోఽనాత్మతయా గృహీతాః|*

*అజోఽనుబద్ధః స గుణైరజాయా  గుణాత్పరం వేద న తే స్వరూపమ్॥9790॥*

ప్రకృతి, మఱియు దానినుండి ఉత్పన్నములైన సమస్తపదార్థములు *ఇదంవృత్తి* ద్వారా గ్రహింపబడుట వలన అవి అన్నియును అనాత్మస్వరూపములే. అందువలన అవి జడములు. కనుక ఆత్మస్వరూపుడవైన నిన్ను అవి తెలియజాలవు. బ్రహ్మ వాస్తవముగా నీ స్వరూపమే యైనను ప్రకృతి గుణములతో (సత్ప్వరజస్తమో గుణములతో) సంబంధము కలిగియున్నందున అతడును గుణాతీతమైన నీ స్వరూపమును ఎఱుగజాలడు.

*40.4 (నాలుగవ శ్లోకము)*

*త్వాం యోగినో యజంత్యద్ధా మహాపురుషమీశ్వరమ్|*

*సాధ్యాత్మం సాధిభూతం చ సాధిదైవం చ సాధవః॥9791॥*

సాధుపురుషులైన యోగులు నిన్ను తమ అంతఃకరణములలో ఉన్న అంతర్యామిగను, సమస్త భూతములయందును, భౌతిక పదార్థములయందు వ్యాపించిన పరమాత్మగను, మఱియు సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలగు దేవతలలో ఉన్న ఇష్టదేవతగను, అట్లే వీటికి సాక్షియగు మహాపురుషుడుగను, నియంతయైన ఈశ్వరుడుగను ఉపాసింతురు.

*40.5 (ఐదవ శ్లోకము)*

*త్రయ్యా చ విద్యయా కేచిత్త్వాం వై వైతానికా ద్విజాః|*

*యజంతే వితతైర్యజ్ఞైర్నానారూపామరాఖ్యయా॥9792॥*

ఋగ్యజుస్సామ వేదములలోని కర్మభాగములందు వివిధ యజ్ఞములు ప్రతిపాదింపబడినవి. కర్మకాండను ఆశ్రయించిన ద్విజులు నీ అంగభూతులైన ఇంద్రాదిదేవతల నామములతో ఆ యజ్ఞముద్వారా నిన్ను ఉపాసింతురు.

*40.6 (ఆరవ శ్లోకము)*

*ఏకే త్వాఖిలకర్మాణి సన్న్యస్యోపశమం గతాః|*

*జ్ఞానినో జ్ఞానయజ్ఞేన యజంతి జ్ఞానవిగ్రహమ్॥9793॥*

పెక్కుమంది జ్ఞానులు అహంకారమమకార సహితములైన  సకల కర్మలను సన్న్యసించి, శాంతచిత్తులై మెలగుదురు. అట్టివారు జ్ఞానస్వరూపుడవైన నిన్ను జ్ఞానయజ్ఞముద్వారా ఆరాధింతురు.

*40.7 (ఏడవ శ్లోకము)*

*అన్యే చ సంస్కృతాత్మానో విధినాభిహితేన తే|*

*యజంతి త్వన్మయాస్త్వాం వై బహుమూర్త్యేకమూర్తికమ్॥9794॥*

సంస్కార సంపన్నులైన మఱికొందరు విధ్యుక్తములైన పాంచరాత్రాది నియమములతో తన్మయులై చతుర్వ్యూహ వైభవములతో ఒప్పెడి, పెక్కు రూపములలోను, అట్లే శ్రీమన్నారాయణుడుగా ఏకరూపమునను విలసిల్లుచుండెడి నిన్ను పూజించుచుందురు.

*40.8 (ఎనిమిదవ శ్లోకము)*

*త్వామేవాన్యే శివోక్తేన మార్గేణ శివరూపిణమ్|*

*బహ్వాచార్యవిభేదేన భగవన్ సముపాసతే॥9795॥*

పరమేశ్వరా! పెక్కుమంది పూర్వాచార్యులచే ప్రచలితములైన శైవాగమోక్తములగు విధులను అనుసరించి, నిన్ను శివస్వరూపునిగా ఉపాసింతురు. అదియును నీ ఆరాధనమే అగును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[10/02, 04:32] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*237వ నామ మంత్రము* 10.02.2021

*ఓం మహాచతుష్షష్టికోటి యోగినీ గణసేవితాయై నమః* 

త్రైలోక్యమోహనాది తొమ్మిది చక్రములలో గల అరువదినాలుగుకోట్ల యోగినీ గణములచే సేవింపబడు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహాచతుష్షష్టికోటి యోగినీ గణసేవితా*  యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం మహాచతుష్షష్టికోటి యోగినీ గణసేవితాయై నమః*  అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకులకు అనిర్వచనీయమైన ఆత్మానందానుభూతి కలుగును.

బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారీ, వైష్ణవి, వారాహీ, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి అను వీరు అష్టమాతృకలు. వీరి అంశచే ఒక్కొక్కరికి ఎనిమిది మంది చొప్పున మొత్తం అరువది నాలుమంది యోగినులు ఉంటారు. 

ఈ అరువది నాలుగు మందికి ఒక్కొక్కరికి కోటిమంది చొప్పున అరువది నాలుగు కోట్ల యోగినులు ఉంటారు. ఆవిధంగా నవచక్రాత్మకమైన లలితాచక్రంలో 

త్రైలోక్యమోహన చక్రము మొదలుగా తొమ్మిది చక్రములలోను ప్రతీ చక్రములోని అరువదినాలుగు కోట్లమంది భిన్నభిన్నలై మొత్తం తొమ్మిది చక్రములకు (8 x 8 x 9) అయిదువందల డెబ్బది ఆరు (576) కోట్లమంది యోగినులు ఉంటారు.  అనగా అయిదు (5) పద్మముల, ఏడు(7) అర్బుదముల, ఆరు (6) కోట్లమంది యోగినులు అగుదురు. ఇంత పెద్దసంఖ్యను చెప్పడానికి *మహత్* అను పదమును ప్రయోగించి *మహాచతుష్షష్టికోటి యోగినీగణము* అనియు ఇంతమంది యోగినులచే సేవింపబడు శ్రీమాత *మహాచతుష్షష్టికోటి యోగినీగణసేవితా* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మహాచతుష్షష్టికోటి యోగినీగణసేవితాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[10/02, 04:32] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*811వ నామ మంత్రము* 10.02.2021

*ఓం పాశహంత్ర్యై నమః*

భక్తుల పాశములను నశింపజేయు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పాశహంత్రీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం పాశహంత్ర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ అమ్మవారిని ఉపాసించు సాధకునికి గల వివిధ పాశములనుండి విముక్తిని కలిగించును.

ప్రతీ జీవి  పేగు త్రెంచుకుని పుట్టి ఇలలో వివిధ పాశములకు బంధీ అవడం అనేది సాధారణం.  అందు వల్ల  అరిషడ్వర్గములకు (కామక్రోధలోభమోహమదమాత్సర్యములకు) లోనై జననమరణ చక్రంలో పరిభ్రమిస్తూ ఉండడం పరిపాటి అవుతుంది. ఈ విషయం తెలిసిన బుద్ధిమంతుడు పరమేశ్వరి పాదములను శరణు వేడుకుంటే తను చిక్కుకున్న పాశముల నుండి ముక్తి ప్రసాదిస్తుంది ఆ పరమేశ్వరి. గనుకనే అమ్మవారు *పాశహంత్రీ* యని అనబడినది. 

అలాగే పాపకర్మలు చేసి, మరణకాలం సమీపిస్తే ఆ కాలుడు యమపాశంతో తనను సమీపించినవేళ *శ్రీమాత్రే నమః* అని యనుకుంటే ఆ తల్లి ఆ యమపాశం నుండి రక్షించి సద్గతులను అనుగ్రహిస్తుంది గనుకనే అమ్మవారు *పాశహంత్రీ* యని అనబడినది. 

కష్టాలు తెరలు తెరలుగా వెన్నంటినపుడు *అమ్మా! భగవతీ! రక్షించు అమ్మా!* అని తలచినంతనే ఆ పరమేశ్వరి ఆ ఆర్తుని దుఃఖపాశములను తొలగిస్తుంది గనుకనే జగన్మాత *పాశహంత్రీ* యని అనబడినది.

ఇలా ఎవరు ఏవిధమైన కష్టములలో ఉన్నను ఆ తల్లిని శరణువేడితే అమ్మవారు వారి కష్టములను తొలగించడానికి తన ఎడమప్రక్క క్రింది చేతిలోని పాశముతో ఆకష్టములను నియంత్రిస్తుంది గనుకనే అమ్మవారు    *పాశహంత్రీ* యని అనబడినది.

హరివంశమునందు "ఒకప్పుడు బాణాసురుని పట్టణములో వీరుడయిన అనిరుద్ధుడు నాగపాశముతో బంధింపబడెను. వెంటనే అతడు స్పృహతప్పి పడిపోయెను. అమ్మవారు అతనిని ఓదార్చుచు వజ్రాయుధముతో సమానమయిన నాగపాశమును తన పాశహస్తముతో తొలగించెను" అని గలదు. 

*కొన్ని రకములైన పాశములు ఇక్కడ ఈయబడినవి:*

1. దయ, 2. శంక, 3. భయము, 4. లజ్జ, 5. జుగుప్స, 6. కులము, 7. శీలము, 8. జాతి.

1. పశుపాశము, 2. భవపాశము, 3. బంధపాశము, 4. మోహపాశము, 5. ఆశాపాశము, 6. కర్మపాశము, 7. దుఃఖపాశము, 8. క్లేశపాశము.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం పాశహంత్ర్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

 [10/02, 04:32] +91 95058 13235: *10.2.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబదియవ అధ్యాయము*

*అక్రూరుడు శ్రీకృష్ణుని స్తుతించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*40.9 (తొమ్మిదవ శ్లోకము)*

*సర్వ ఏవ యజంతి త్వాం సర్వదేవమయేశ్వరమ్|*

*యేఽప్యన్యదేవతాభక్తా యద్యప్యన్యధియః ప్రభో॥9796॥*

స్వామీ! ఇతర దేవతలను నీ కంటె వేఱైన వారినిగా భావించి, వారిని కొందఱు ఆరాధించుచుందురు. నీవు సర్వదేవతా స్వరూపుడవు, సర్వేశ్వరుడవు కావున, వాస్తవముగా ఇతర దేవతలను ఆరాధించినను నిన్ను ఉపాసించినట్లే అగును.

*40.10 (పదియవ శ్లోకము)*

*యథాద్రిప్రభవా నద్యః పర్జన్యాపూరితాః ప్రభో|*

*విశంతి సర్వతః సింధుం తద్వత్త్వాం గతయోఽన్తతః॥9797॥*

దేవా! పర్వతములనుండి ప్రవహించిన నదులు అన్నియును వర్షజలములతో నిండి, అన్నివైపులనుండియు సముద్రమునే చేరుచున్నవి. అట్లే వివిధములగు ఉపాసనా మార్గములద్వారా పూజించినను అవి అన్నియును నిన్నే చేరును.

*ఆకాశాత్ పతితం తోయం యథాగచ్ఛతి సాగరమ్| సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి॥*

ఆకాశమునుండి (వర్ష) జలములు ఏ దిక్కున పడినను అవి అన్నియు నదులుగా ప్రవహించి, సముద్రమునే   చేరుచుండును. అట్లే సకల దేవతలకు చేసిన నమస్కారములు అన్నియును కేశవునే (శ్రీమన్నారాయణునే) చేరును.

*40.11 (పదకొండవ శ్లోకము)*

*సత్త్వం రజస్తమ ఇతి భవతః ప్రకృతేర్గుణాః|*

*తేషు హి ప్రాకృతాః ప్రోతా ఆబ్రహ్మస్థావరాదయః॥9798॥*

ప్రభూ! నీ ప్రకృతి సత్త్వరజస్తమో గుణాత్మకమైనది. బ్రహ్మనుండి మొదలుకొని స్థావరపర్యంతము (చెట్లు - చేమలవరకు) సకల చరాచర జీవులు ప్రకృతి నుండి ఉత్పన్నమగును. వస్త్రము దారములతో ఓతప్రోతములై (నిలువుగాను, అడ్డముగాను దారములతో) ఉన్నట్లుగా ఈ సమస్తజీవులు ప్రకృతియొక్క త్రివిధగుణములతో ఓతప్రోతములై (వ్యాపించినవై) ఉన్నవి.

*40.12 (పండ్రెండవ శ్లోకము)*

*తుభ్యం నమస్తేఽస్త్వవిషక్తదృష్టయే  సర్వాత్మనే సర్వధియాం చ సాక్షిణే|*

*గుణప్రవాహోఽయమవిద్యయా కృతః ప్రవర్తతే దేవనృతిర్యగాత్మసు॥9799॥*

పరమపురుషా! నీవు బ్రహ్మాది సకల క్షేత్రజ్ఞులకు (జీవులకు) ను ఆత్మస్వరూడవు. ఐనను క్షేత్రాభిమాన (దేహాభిమాన - క్షేత్రము అనగా శరీరము) రహితుడవు. సకలవృత్తులకును నీవు సాక్షివి. గుణప్రవాహముతో ఒప్పుచున్న ఈ సృష్టి అజ్ఞానమూలకము. ఇది (ఈ గుణప్రవాహము) దేవతలయందును, మనుష్యుల యందును, పశుపక్ష్యాదులయందును వ్యాప్తమైయున్నది. కాని నీవు వాటికి సర్వధా అతీతుడవు (త్రిగుణాతీతుడవు). అట్టి నీకు నమస్కారము.

*40.13 (పదమూడవ శ్లోకము)*

*అగ్నిర్ముఖం తేఽవనిరంఘ్రిరీక్షణం సూర్యో నభో నాభిరథో దిశః శ్రుతిః|*

*ద్యౌః కం సురేంద్రాస్తవ బాహవోఽర్ణవాః  కుక్షిర్మరుత్ప్రాణబలం ప్రకల్పితమ్॥9800॥*

*40.14 (పదునాలుగవ శ్లోకము)*

*రోమాణి వృక్షౌషధయః శిరోరుహా  మేఘాః పరస్యాస్థి నఖాని తేఽద్రయః|*

*నిమేషణం రాత్ర్యహనీ ప్రజాపతిర్మేఢ్రస్తు వృష్టిస్తవ వీర్యమిష్యతే॥9801॥*

*40.15 (పదిహేనవ శ్లోకము)*

*త్వయ్యవ్యయాత్మన్ పురుషే ప్రకల్పితా లోకాః సపాలా బహుజీవసంకులాః|*

*యథా జలే సంజిహతే జలౌకసోఽప్యుదుంబరే వా మశకా మనోమయే॥9802॥*

పురుషోత్తమా! నీవు విరాట్ పురుషుడవు. అగ్ని నీ ముఖము. పృథ్వి నీ పాదయుగము, సూర్యచంద్రులు నీ నేత్రములు, ఆకాశము నీ నాభి, దిక్కులు నీ కర్ణములు, స్వర్గము నీ శిరస్సు, ఇంద్రాది దేవతలు నీ బాహువులు, సముద్రములు నీ ఉదరము, వాయువు నీ ప్రాణశక్తి, వృక్షములు మరియు ఓషధులు నీ రోమములు, మేఘములు నీ శిరోజములు (కేశములు), పర్వతములు నీ ఎముకలు మరియు గోళ్ళు, రాత్రింబవళ్ళు నీ కనురెప్పపాటులు, ప్రజాపతి (బ్రహ్మదేవుడు) నీ జననేంద్రియము, వర్షజలము నీ వీర్యము. అవ్యయుడవైన ఓ ప్రభూ! ఇట్టి నీ అలౌకిక విరాట్ స్వరూపమున సముద్రమునందు జలచరములవలెను, మేడిపండ్లలో సూక్ష్మక్రిములవలెను, లోకములు - లోకపాలురు మొదలగు పెక్కుజీవుల కల్పితములై ఉపాసింపబడుచున్నవి.

*40.16 (పదహారవ శ్లోకము)*

*యాని యానీహ రూపాణి క్రీడనార్థం బిభర్షి హి|*

*తైరామృష్టశుచో లోకా ముదా గాయంతి తే యశః॥9803॥*

శ్రీహరీ! నీ లీలలను ప్రదర్శించుటకై ఈ లోకమున నీవు పెక్కు రూపములను ధరించుచుందువు. ఆ అవతారములన్నియును జనులయొక్క శోకమోహములను (తాపత్రయములను) ప్రక్షాళిత మొనర్చుచుండును. రసజ్ఞులు నీ యశోవైభవములను పరమానందముతో కీర్తించు చుందురు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[10/02, 20:53] +91 95058 13235: *10.2.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబదియవ అధ్యాయము*

*అక్రూరుడు శ్రీకృష్ణుని స్తుతించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*40.17 (పదిహేడవ శ్లోకము)*

*నమః కారణమత్స్యాయ ప్రలయాబ్ధిచరాయ చ|*

*హయశీర్ష్ణే నమస్తుభ్యం మధుకైటభమృత్యవే॥9804॥*

*40.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*అకూపారాయ బృహతే నమో మందరధారిణే|*

*క్షిత్యుద్ధారవిహారాయ నమః సూకరమూర్తయే॥9805॥*

*40.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*నమస్తేఽద్భుతసింహాయ సాధులోకభయాపహ|*

*వామనాయ నమస్తుభ్యం క్రాంతత్రిభువనాయ చ॥9806॥*

*40.20 (ఇరువదియవ శ్లోకము)*

*నమో భృగుణాం పతయే దృప్తక్షత్రవనచ్ఛిదే|*

*నమస్తే రఘువర్యాయ రావణాంతకరాయ చ॥9807॥*

*40.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ|*

*ప్రద్యుమ్నాయానిరుద్ధాయ సాత్వతాం పతయే నమః॥9808॥*

*40.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*నమో బుద్ధాయ శుద్ధాయ దైత్యదానవమోహినే|*

*మ్లేచ్ఛప్రాయక్షత్రహంత్రే నమస్తే కల్కిరూపిణే॥9809॥*

విరాట్స్వరూపా! ప్రళయ సముద్రమునందు మత్స్యావతారమున చరించుచు లోకవిరోధియైన సోమకాసురుని చంపి, వాడు అపహరించిన వేదములను రక్షించిన నీకు నమస్కారము. హయగ్రీవ రూపుడవై మధుకైటభ రాక్షసులను వధించిన నీకు వందనము. బృహద్రూపముగల కూర్మావతారమున దేవతలపైగల అనురాగముతో మందరపర్వతమును అవలీలగా ఉద్ధరించితివి. ఆదివరాహమూర్తివై నీ కోఱలతో హిరణ్యాక్షుని తునుమూడి భూదేవిని కాపాడితివి. నీకు అనేక నమస్కారములు. అద్భుతరూపమున నృసింహుడవై హిరణ్యకశిపుని సంహరించి, పరమభక్తుడైన ప్రహ్లాదునకు పరమానందమును గూర్చి, సాధులోకభయమును పోగొట్టితివి. వామనావతారమున బలిచక్రవర్తిని మూడడుగుల నేలకై యాచించి, త్రివిక్రముడవై నీ దివ్యరూపముతో బ్రహ్మాండమును నింపితివి. అట్టి నీకు వందనములు. పరశురాముడుగా అవతరించి నీ పరశువుతో (గండ్రగొడ్డలితో) గర్వితులైన క్షత్రియులనెడి వనములను ఛేదించితివి. శ్రీరామచంద్రుడవై సీతాదేవి మిషగా లోకకంటకుడైన రావణుని వధించి సాధుపురుషులను ఆదుకొంటివి. నీకు అనేక నమస్సులు, వాసుదేవ - సంకర్షణ - ప్రద్యుమ్న - అనిరుద్ధ రూపములలో ప్రకటితుడవై పరమభక్తులను, యదువంశజులను క్రూరరాక్షసుల బాఱినుండి రక్షించెడి ప్రభూ! నీకు ప్రణామములు. దైత్య, దానవులను మోహింపచేయుటకు అహింసా ప్రవర్తకుడవు అగు బుద్ధరూపుడవైన నీకు నమస్కారము. మున్ముందు కల్కిరూపుడవై మ్లేచ్ఛప్రాయులైన క్షత్రహతకులను హతమార్చి సత్పురుషులను రక్షించెదవు. ఇట్టి పలు దివ్యలీలలను ప్రదర్శించిన విరాట్ పురుషా! నీకు అనంతకోటి నమస్కారములు.

*40.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*భగవన్ జీవలోకోఽయం మోహితస్తవ మాయయా|*

*అహంమమేత్యసద్గ్రాహో భ్రామ్యతే కర్మవర్త్మసు॥9810॥*

కృష్ణ పరమాత్మా! జీవులు ఎల్లరును  నీ మాయచే మోహితులగుచున్నారు. ఆ కారణమున 'నేను', 'నాది' (అహంకార, మమకారములు) అను భావములలో చిక్కుకొని, అనిత్యములైన వాటిని గూర్చి నిత్యములని భ్రమపడుచు విషయసుఖములలో బడి తికమకల పాలగుచున్నారు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[11/02, 04:39] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*812వ నామ మంత్రము*  11.02.2021

*ఓం పరమంత్ర విభేదిన్యై నమః*

తనవద్ద ఉన్న సప్తకోటిమహామంత్రాలు తక్క అన్యమంత్రములేవైనను విభేదించు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పరమంత్రవిభేదినీ*  యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ)  నామ మంత్రమును *ఓం పరమంత్ర విభేదిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు భక్తజనులను కామితార్థములిచ్చును. దుష్టగ్రహపీడలనుండి కాపాడును.

పరమేశ్వరి సప్తకోటి మహా మంత్రములు తనదిగా గలిగిన మహామంత్రస్వరూపిణి. పరమంత్రము అంటే తనను గాని, తన భక్తులను గాని ఇబ్బంది పెట్టు మంత్రములే పరమంత్రములు. పరమంత్రములు, ఆ పరమంత్రముల యొక్క తంత్రయంత్రములను కూడా అమ్మవారు విభేదించుతుంది. గనుక పరమేశ్వరి *పరమంత్రవిభేదినీ* యని అనబడినది.

భండాసురుడు జయవిఘ్నయంత్రమును ప్రయోగించాడు. యంత్రమనగా తంత్రయుక్తమైన మంత్రముతో తయారుచేసినదే అవుతుంది. అటువంటి యంత్రాన్ని మహాగణేశ్వరునిచే భేదింపజేసింది. భండాసురుడు, అతని సేనానులు, అతని పుత్రులు అనేక శస్త్రాలను అనేకవిధములైన క్షుద్రమంత్రయుతముగా ప్రయోగించారు. పరమేశ్వరి తన వద్ద ఉన్న పరమ పవిత్రమైన, వేదవిహితమైన మంత్రములతో ప్రత్యస్త్రములను ప్రయోగించి వారిని మట్టుపెట్టినది. అందుచే శ్రీమాత *పరమంత్రవిభేదినీ* యని అనబడినది. 

*సర్వవ్యాధి నివృత్యర్థం స్పృష్ట్వా భస్మ జపేదిదమ్*

*తద్భస్మధారణాదేవ నశ్యంతి వ్యాధయః క్షణాత్* (లలితా సహస్రనామ స్తోత్ర మహాత్మ్యం ఫలశృతిలోని 24,25వ శ్లోక పాదాలు)

సమస్తరోగాలు పోవడానికి విభూతిని అమ్మవారి నామ మంత్రముతో మంత్రించి ధరిస్తే సమస్తరోగాలు పోతాయి.

*జలం సమంత్ర్య కుంభస్థం నామసాహస్రతో మునే*

*అభిషించే ద్గ్రహ గ్రస్తాన్ గ్రహా నశ్యంతి తక్షణాత్* (లలితా సహస్రనామ స్తోత్ర మహాత్మ్యం ఫలశృతిలోని 25,26వ శ్లోక పాదాలు)

నీటితో కలశాన్ని నింపి, ఆ నీటిని లలితాసహస్రనామపారాయణతో మంత్రించి, ఆ నీటితో స్నానంచేయించితే బాధితులకు గ్రహపీడలు నశిస్తాయి.

తన భక్తులు చేతబడులు, చిల్లంగి, కనుదృష్టి వంటి అనేక క్షుద్రమంత్రములబారినపడి, శరీరంలోని రక్తమాంసములు క్షీణించి చావుబ్రతుకులమధ్యకు వెళితే అమ్మవారి నామమనే మంత్రంతో వారు రక్షింపబడతారు. 

శ్రీవిద్యోపాసకులు పండ్రెండుమంది అనుకున్నాముగదా. వీరందరి విభిన్న సాంప్రదాయముల వలన వారి వారి విభిన్న తంత్రముల కారణముగా పంచదశీ మంత్రము పండ్రెండుగా విభిన్నమయినది. కావును విభిన్న మంత్ర, తంత్ర యుతమైన పంచదశీ మంత్రము కలిగినది గావున అమ్మవారు *పరమంత్ర విభేదినీ* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం పరమంత్ర విభేదిన్యై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[11/02, 04:39] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*238వ నామ మంత్రము* 11.02.2021

*ఓం మనువిద్యాయై నమః*

మనువు మొదలైన పండ్రెండుమంది శ్రీవిద్యోపాసకులు. గనుక శ్రీవిద్యాప్రస్తారము పడ్రెండు విధములుగా నున్నది. మొదటి వాడైన మనువు పేరుతో ప్రశస్తమైన శ్రీవిద్యాస్వరూపిణియైన అమ్మవారికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మనువిద్యా* యను నాలుగక్షరముల నామ మంత్రమును *ఓం మనువిద్యాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి కరుణచే జన్మజన్మలనుండి సంచితమై వచ్చిన కర్మఫలములనుండి విముక్తులై, కైవల్యపదమునకు మార్గము సుగమము చేసికొందురు.

 శ్రీవిద్యోపాసకులు మొత్తం పద్నాలుగు మంది.  కొందరు పన్నెండు అంటారు. కానీ మరొక ఇద్దరిని కూడా ప్రముఖంగా తీసుకొచ్చి పధ్నాలుగురు గురించి మానసోల్లాస గ్రంథం చెప్పింది. శ్రీవిద్యను మనదాకా తీసుకువచ్చిన మహానుభావులు వీరు. వీళ్ళందరూ కూడా దేవతా స్థాయి వాళ్ళు. మానవ స్థాయిలో ఉన్న ఋషులు చాలామంది ఉన్నారు. శంకరులు మొదలైన వారెందరో. దివ్యౌఘ, సిద్ధ్యౌఘ, పాదౌఘ అని కూడా అంటూంటాం.  వాళ్ళు ముందుగా

శివుడు - ఆయనొక పెద్ద భక్తుడు. అందుకే శివారాధ్యా అని అంటున్నాం. ఆ తరువాత విష్ణువు, బ్రహ్మ, మనువులు, చంద్రుడు, కుబేరుడు,  లోపాముద్ర, అగస్త్యుడు, స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి,

మన్మథుడు - (మన్మథుడు ఉపాసించిన శ్రీవిద్యే మనకు ప్రసిద్ధి ఇప్పుడు చేస్తున్న పంచదశీ విద్య అంతా మన్మథుడు చేసినదే.  మనం ఉపాసిస్తున్నది మన్మథ విద్య - కామరాజ విద్య. అదే *ఆత్మ విద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా* అమ్మ ఇచ్చాశక్తి స్వరూపిణి కదా! ఆవిడ అనుగ్రహం లేకపోతే మన్మథుడు ఈ ప్రపంచం నడపలేడు), ఇంద్రుడు, బలరాముడు, దత్తాత్రేయుడు, దూర్వాసుడు.

ఇందులో మన్మథుడు వరకు చెప్పి ఊరుకుంటారు కొందరు. దత్తాత్రేయుడు పెద్ద శ్రీవిద్యోపాసకుడు. ఆయన పరశురాముడికి శ్రీవిద్యోపాసన తెలియజేశాడు.   ప్రస్తుతం మనము  పండ్రెండు మందినే శ్రీవిద్యోపాసకులు అని భావిద్దాము. దీనిని బట్టి శ్రీవిద్య ప్రడ్రెండు విధములు.

మనువులు పదునాలుగు మంది. వీరిని చతుర్దశ మనువులు అంటారు. సృష్టిలో మనువు మొదటి వాడు మనువు. మనువు నుండే మానవలోకం ఉద్భవించింది.

ఆ పదునాలుగు మంది మనువులు వీరే.

 1. స్వాయంభువుడు, 2. స్వారోచిషుడు, 3. ఉత్తముడు, 4. తామసుడు, 5. రైవతుడు, 6. చాక్షసుడు, 7. వైవస్వతుడు, 8.సూర్య సావర్ణి, 9. దక్ష (పాఠాంతరం రౌచ్యక) సావర్ణి, 10. బ్రహ్మ సావర్ణి, 11. రుద్ర సావర్ణి, 12. ధర్మ (అగ్ని) సావర్ణి, 13. ఇంద్ర సావర్ణి, 14. భౌచ్యుడు.

వీరిపేరునే మన్వంతరములు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఏడవ మనువైన వైవస్వతుని మన్వంతరంలో ఉన్నాము. అందుకే సంకల్పంలో *వైవస్వత మన్వంతరే* అని చెపుతూఉంటాము. శ్రీవిద్యా మంత్రమును (పంచదశీ మంత్రమును) ఉపాశించిన వారిలో మనువు ఉపాశించిన శ్రీవిద్యను *మనువిద్య* అని అందురు. జగన్మాత అటువంటి మనువిద్యాస్వరూపిణీ గనుక *మనువిద్యా* యని అనబడినది.

అటువంటి మనువు ఉపాసించిన మంత్ర స్వరూపిణియైన జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మనువిద్యాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[11/02, 04:39] +91 95058 13235: *11.2.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబదియవ అధ్యాయము*

*అక్రూరుడు శ్రీకృష్ణుని స్తుతించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*40.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*అహం చాత్మాఽఽత్మజాగారదారార్థస్వజనాదిషు|*

*భ్రమామి స్వప్నకల్పేషు మూఢః సత్యధియా విభో॥9811॥*

ప్రభూ! నేను గూడ స్వప్న దృశ్యములవలె అనిత్యములైన దేహగేహములు, భార్యాపుత్రులు, బంధుమిత్రులు, సంపదలు మున్నగువాటిని నిత్యములుగా, సత్యములుగా భావించి, వాటి మోహములో చిక్కుకొని అలమటించుచున్నాను.

*40.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*అనిత్యానాత్మదుఃఖేషు విపర్యయమతిర్హ్యహమ్|*

*ద్వంద్వారామస్తమోవిష్టో న జానే త్వాత్మనః ప్రియమ్॥9812॥*

స్వామీ! అజ్ఞానకారణముగా నేను అనిత్యవస్తువులను, నిత్యములుగను, అనాత్మను ఆత్మగను, దుఃఖకారకములైన ఇంద్రియార్థములను సుఖములుగను భావించుచు విపరీతబుద్ధినై సుఖదుఃఖాది ద్వంద్వములలో మునిగి తేలుచున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైనది ఏదియో తెలియలేకున్నాను. 'నాకు నీవే శ్రేయోదాయకుడవు'  అను నిజమును విస్మరించియున్నాను.

*40.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*యథాబుధో జలం హిత్వా ప్రతిచ్ఛన్నం తదుద్భవైః|*

*అభ్యేతి మృగతృష్ణాం వై తద్వత్త్వాహం పరాఙ్ముఖః॥9813॥*

మూర్ఖుడు తన దాహబాధను తీర్చుకొనుటకై జలాశయము ఎదురుగా ఉన్నను, అందలి జలములు తృణాదులచే కప్పబడి యున్నందున అజ్ఞానమువలన అందు జలము లేదని భావించి, దానిని వదలివేయును. అంతేగాక, సూర్యకాంతి ప్రభావమువలన జలములు ఉన్నట్లుగా కనబడెడి మృగతృష్ణలో (ఎండమావులలో) నిజముగా జలము ఉన్నట్లు భ్రమపడి దాని వెంటబడును. అట్లే నేను మోహములోబడి నిజముగా శ్రేయోదాయకుడవైన నిన్ను ఆశ్రయింపక, విషయానుభవముల లోనే సరియైన సుఖమున్నదని తలంచి, వాటివెంట పడుచున్నాను.

*40.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*నోత్సహేఽహం కృపణధీః కామకర్మహతం మనః|*

*రోద్ధుం ప్రమాథిభిశ్చాక్షైర్హ్రియమాణమితస్తతః॥9814॥*

ఇంద్రియార్థముల (ఇంద్రియసుఖముల) ఆకర్షణ పడిన నా మనస్సు వాటిని పొందుటకై వివిధ కామ్యకర్మలలోబడి నలిగిపోయినది. ప్రబలములైనవి, అదుపు చేయుటకు అలవికానివి ఐన ఇంద్రియములు మనస్సును మథించి, మదించి బలవంతముగా వాటివైపు (ఇంద్రియ సుఖములవైపు) లాగుచున్నవి. కనుక ఆ మనస్సును నిరోధించుటకు నేను అశక్తుడను.

*40.28 (ఇరువది ఎనిమిది శ్లోకము)*

*సోఽహం తవాంఘ్ర్యుపగతోఽస్మ్యసతాం దురాపం తచ్చాప్యహం భవదనుగ్రహ ఈశ మన్యే|*

*పుంసో భవేద్యర్హి సంసరణాపవర్గస్త్వయ్యబ్జనాభ సదుపాసనయా మతిః స్యాత్॥9815॥*

స్వామీ! ఈ విధముగా మనస్తాపమునకు లోనైయున్న నేను నీ చరణకమలముల చెంతకు చేరితిని. అది దుష్టులకు దుర్లభము. అట్లు చేరగల్గుట కూడ నీ అనుగ్రహ ప్రభావముననే యని నేను విశ్వసించుచున్నాను. ఏలయన, పద్మనాభా! సాంసారిక తాపముల నుండి బయటపడెడి సమయము ఆసన్నమైనప్పుడే పురుషునియొక్క  చిత్తవృత్తి నీ ఉపాసన వైపునకు మఱలును.

*40.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*నమో విజ్ఞానమాత్రాయ సర్వప్రత్యయహేతవే|*

*పురుషేశప్రధానాయ బ్రహ్మణేఽనంతశక్తయే॥9816॥*

*40.30 (ముప్పదియవ శ్లోకము)*

*నమస్తే వాసుదేవాయ సర్వభూతక్షయాయ చ|*

*హృషీకేశ నమస్తుభ్యం ప్రపన్నం పాహి మాం ప్రభో॥9817॥*

దేవా! నీవు జ్ఞానస్వరూపుడవు, జ్ఞానప్రదుడవు, జీవులయొక్క ప్రారబ్ధకర్మలను అనుసరించి, వారియొక్క సుఖదుఃఖములను నియంత్రించువాడవును. నీవే వాత్సల్య, సౌశీల్య, సౌలభ్యాది గుణములచే విలసిల్లుచుందువు. ఓ  వాసుదేవా! నీవు సకల ప్రాణులయందును అంతర్యామివై విలసిల్లుచు, వారి మనోబుద్ధీంద్రియాదులను నియంత్రించుచుందువు. అట్టి నిన్ను శరణు వేడుచున్నాను. నీకు పదివేల నమస్కారములు. ఓ ప్రభూ! సంసారతాపత్రయములనుండి ఉద్ధరించి, నన్ను రక్షింపుము.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే అక్రూరస్తుతిర్నామ చత్వారింశోఽధ్యాయః  (40)*

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి *అక్రూరుడు శ్రీకృష్ణుని స్తుతించుట* యను నలుబదియవ అధ్యాయము (40)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[11/02, 20:57] +91 95058 13235: *11.2.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఒకటవ అధ్యాయము*

*బలరామకృష్ణులు మథురలో ప్రవేశించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*

*41.1 (ప్రథమ శ్లోకము)*

*స్తువతస్తస్య భగవాన్ దర్శయిత్వా జలే వపుః|*

*భూయః సమాహరత్కృష్ణో నటో నాట్యమివాత్మనః॥9818॥*

*శ్రీశుకుడు నుడివెను* అక్రూరుడు ఇట్లు స్తుతించు చుండగా కృష్ణపరమాత్మ తన దివ్యరూపమును (శ్రీమహావిష్ణుస్వరూపమును) దర్శింపజేసెను. రంగస్థలము నందు ఒక నటుడు తన నటనకు తగిన రూపమును ప్రదర్శించిన పిమ్మట తెఱమఱుగున చేరినట్లు, ఆ వాసుదేవుడు అంతర్హితుడయ్యెను.

*41.2 (రెండవ శ్లోకము)*

*సోఽపి చాంతర్హితం వీక్ష్య జలాదున్మజ్య సత్వరః|*

*కృత్వా చావశ్యకం సర్వం విస్మితో రథమాగమత్॥9819॥*

భగవంతుడు తన రూపమును అంతర్ధానమొనర్చిన పిదప అక్రూరుడు త్వరత్వరగా జలముల నుండి బయటికి వచ్చెను. అనంతరము అతడు తన ముఖ్యవిధులను ముగించుకొని వచ్చి, రథమునందు ఉన్న బలరామకృష్ణులను గాంచి, ఆశ్చర్యపడుచు ఆసీనుడయ్యెను.

*41.3 (మూడవ శ్లోకము)*

*తమపృచ్ఛద్ధృషీకేశః కిం తే దృష్టమివాద్భుతమ్|*

*భూమౌ వియతి తోయే వా తథా త్వాం లక్షయామహే॥9820॥*

అంతట శ్రీకృష్ణుడు అతనిని ఇట్లు ప్రశ్నించెను. "నాయనా! నీవు భూతలముపైనను, ఆకాశమునందును, నీళ్ళలోను ఏవైనా అద్భుతదృశ్యములను గాంచితివా? నీ వైఖరి జూడగా నాకు అట్లనిపించుచున్నది".

*అక్రూర ఉవాచ*

*41.4 (నాలుగవ శ్లోకము)*

*అద్భుతానీహ యావంతి భూమౌ వియతి వా జలే|*

*త్వయి విశ్వాత్మకే తాని కిం మేఽదృష్టం విపశ్యతః॥9821॥*

*అప్పుడు అక్రూరుడు ఇట్లనెను* "శ్రీకృష్ణా! భూమియందును, ఆకాశమునందును, నీటిలోనుగల అద్భుతములు అన్నియును విశ్వస్వరూపుడవైన నీలోనేగలవు. నేను నిన్నే చూచుచున్నప్పుడు ఇంక నేను చూడని అద్భుతములు ఏముండును?"

*41.5 (ఐదవ శ్లోకము)*

*యత్రాద్భుతాని సర్వాణి భూమౌ వియతి వా జలే|*

*తం త్వానుపశ్యతో బ్రహ్మన్ కిం మే దృష్టమిహాద్భుతమ్॥9822॥*

"పరబ్రహ్మస్వరూపా! భూ, గగన, జలములయందుగల సకల అద్భుతములయందు నీవే ఉన్నప్పుడు ఇక చూడదగిన ఇతరాద్భుతములు ఏముండును?"

*41.6 (ఆరవ శ్లోకము)*

*ఇత్యుక్త్వా చోదయామాస స్యందనం గాందినీసుతః|*

*మథురామనయద్రామం కృష్ణం చైవ దినాత్యయే॥9823॥*

ఇట్లు పలికిన పిదప అక్రూరుడు రథమును నడిపింపసాగెను. సాయంకాలము అగునప్పటికి అతడు బలరామకృష్ణులను మథురకు చేర్చెను.

*41.7 (ఏడవ శ్లోకము)*

*మార్గే గ్రామజనా రాజంస్తత్ర తత్రోపసంగతాః|*

*వసుదేవసుతౌ వీక్ష్య ప్రీతా దృష్టిం న చాదదుః॥9824॥*

పరీక్షిన్మహారాజా! బలరామకృష్ణులు అక్రూరునితోగూడి మథురకు పయనించుచున్నప్పుడు మార్గమునగల గ్రామీణులు వారిని సమీపించి, దర్శించి, పరమానందభరితులైరి. వారు ఆ దివ్యపురుషులను కన్నులప్పగించి చూచుచు, తమ చూపులను వారినుండి మఱల్చలేకపోయిరి.

*41.8 (ఎనిమిదవ శ్లోకము)*

*తావద్వ్రజౌకసస్తత్ర నందగోపాదయోఽగ్రతః|*

*పురోపవనమాసాద్య ప్రతీక్షంతోఽవతస్థిరే॥9825॥*

నందుడు మొదలగు గోపాలురు ముందుగనే మథురను సమీపించి, అందలి ఉపవనములలో బసచేసిరి. పిమ్మట వారు బలరామకృష్ణుల కొఱకు నిరీక్షించుచుండిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[12/02, 04:36] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*813 మరియు 814వ నామ మంత్రము* 12.02.2021

*ఓం మూర్తామూర్తాయై నమః*

పంచభూతాత్మకమైన పరమాత్మ స్వరూపమై, భౌతికరూపముతో గోచరించు సగుణ సాకార మూర్తిగను,  ఏ రూపమూ లేక నిర్గుణ, నిరాకారముతోను విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మూర్తామూర్తా* యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం మూర్తామూర్తాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదాంబను అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు సాధకులకు ఆ పరమేశ్వరి సగుణరూపముతో కనులముందు గోచరమైన భావనకలుగును. తద్వారా అంతులేని ఆత్మానందానుభూతితో సాధకులు జన్మధన్యమైనదను భావనతో ఆనందించుదురు.

పంచమహాభూతములలో భూమి, నీరు, నిప్పు కంటితో చూడగలము. గాన ఇవి మూర్తములు.  వాయువు, ఆకాశము గోచరముగావు. గనుక ఇవి అమూర్తములు.  రూపమున్నది  మూర్తము. రూపము లేనిది అమూర్తము. స్థూలము అనునది మూర్తము. సూక్ష్మము అమూర్తము. పంచీకృతములు కానట్టి మహాభూతముల సూక్ష్మాంశలు అమూర్తములు. పంచీకరణము చేయబడిన మహాభూతములకు మూర్తములని పేరు.

*చతుర్బాహు సమన్వితా* అని (7వ) నామ మంత్రములో అమ్మవారు నాలుగు బాహువులు కలిగి యున్నదని అమ్మవారి పంచభూతాత్మకమైన శరీరము గలదిగా చెప్పాము.

*మూలమంత్రాత్మికా* అను  (88వ) నామ మంత్రముతో సర్వానికీ మూలమైన పంచదశాక్షరీ మంత్రమే తన స్వరూపంగా గల పరమేశ్వరి యని అమ్మవారి సూక్ష్మరూపాన్ని వర్ణించాము. 

 *అమ్మవారి స్థూలరూపం మూర్తము, సూక్ష్మరూపము అమూర్తము*  గనుక అమ్మవారిని *మూర్తామూర్తా* (మూర్త + అమూర్తా) యని అన్నాము.

పరబ్రహ్మమునకు గల మూర్తామూర్తములే క్షర, అక్షర రూపమని కూడా అంటాము. దేహము మూర్తము. అది క్షరము (నశించునది) గనుక మూర్తము అందుము. ఆత్మ  అమూర్తమయితే అది *అక్షరము* (నాశనము లేనిది)

ఈ జగత్తు అంతయు క్షరమనియు, కూటస్థుడగు పరబ్రహ్మమే అక్షరము.

*క్షరము* అనగా నామరూపాత్మకమైన జగత్తు. అనగా దానికొక పేరు, రూపము గలవి. ఇదే మర్త్యరూపము. నశించునది.

*అక్షరము* అనగా పరమాత్మ. కంటికి కనిపించడం జరగదు.  అమృతస్వరూపము, నశించనిది.

పంచభూతాలలో భూమి, నీరు, నిప్పు - వీటిని చూడగలము. ఇవి ఇలాఉంటాయి అంటాము. ఇవి నశిస్తాయి. మిగిలిన రెండు, వాయువు, ఆకాశము - వీటికి నాశనంలేదు. కంటికి కనబడవు. వీటికి ఆకారం లేదు. వీటిని నిర్వచించలేము.

పంచప్రాణాలు శరీరంలో ఉన్న అమూర్తములు. ఇవి శరీరాన్ని విడచి మరో శరీరానికి మారుతూ ఉంటాయి.

పరబ్రహ్మస్వరూపిణి సగుణ అని, *చతుర్బాహు సమన్వితా, రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా, మనోరూపేక్షు కోదండా, సర్వారుణానవద్యాంగీ* అంటే స్థూలరూపము. కనిపిస్తోంది అనే భావనలో వర్ణించాము.

*మూలమంత్రాత్మికా, మూలకూటత్రయ కళేబరా* అంటే సూక్ష్మరూపిణి. కంటికి కనిపించదు. నిర్గుణము.

గనుకనే అమ్మవారు *మూర్తామూర్తా* (మూర్త + అమూర్తా) యని అనబడినది.

అమ్మ వారికి నమస్కరించునపుడు *ఓం మూర్తామూర్తాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[12/02, 04:36] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*239వ నామ మంత్రము* 12.02.2021

*ఓం చంద్రవిద్యాయై నమః*

 చంద్రవిద్యా స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *చంద్రవిద్యా* యను నాలుగక్షరముల(చతురక్షరీ) నామ మంత్రమును *ఓం చంద్రవిద్యాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ శ్రీమాతను అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసించు సాధకుడు భౌతిక జీవనములో సుఖసంతోషములతో కొనసాగుచూ, పరమేశ్వరి పాదసేవయందు జన్మ తరింపజేసికొనును.

ఇంతకు ముందు 238వ నామమంత్రములో చెప్పినట్లు పండ్రెండు మంది శ్రీవిద్యోపాసకుల శ్రీవిద్య వారి వారి  ఉపాసనాక్రమం ప్రకారం మనువిద్యా, చంద్రవిద్యా.. అంటూ ఆ విధానముల ననుసరించిచెప్పడం జరిగింది. 

పండ్రెండు మందిలో ఒకడైన మన్మథుడు ఉపాసించిన శ్రీవిద్యే మనకు ప్రసిద్ధి. ఇప్పుడు చేస్తున్న పంచదశీ విద్య అంతా మన్మథుడు చేసినదే. వాళ్ళయొక్క మంత్రవిద్యలు వేరు.  ఉపాసన క్రమం కూడా కొంచం విభిన్నంగా ఉంటుంది. మన్మథ విద్య - కామరాజ విద్య అని కూడా అనుకోవచ్చు. అదే *ఆత్మ విద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా* అని అమ్మవారిని స్తుతిస్తున్నాము.

చంద్రుడు చంద్రమండలక్రమంలో శ్రీమాతను ఉపాసించాడు గనుక చంద్రుడు ఉపాసించిన శ్రీవిద్యను *చంద్రవిద్యా* యని అన్నారు. ఈ చంద్రవిద్యలో చంద్రుని షోడశకళలు, తిథిక్రమములు, పర్వదినములు, నక్షత్రగమనముల ననుసరించికూడా  ఉంటుంది అని భావించవచ్చు. అందుచే చంద్రునిచే ఉపాసింపబడిన చంద్రవిద్యా స్వరూపిణి గనుక శ్రీమాత *చంద్రవిద్యా* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం చంద్రవిద్యాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[12/02, 04:36] +91 95058 13235: *12.2.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఒకటవ అధ్యాయము*

*బలరామకృష్ణులు మథురలో ప్రవేశించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*41.9 (తొమ్మిదవ శ్లోకము)*

*తాన్ సమేత్యాహ భగవానక్రూరం జగదీశ్వరః|*

*గృహీత్వా పాణినా పాణిం ప్రశ్రితం ప్రహసన్నివ॥9826॥*

జగదీశ్వరుడైన శ్రీకృష్ణుడు నందాదులను కలిసిన పిదప వినమ్రుడైయున్న అక్రూరుని చేతితో చేయి కలిపి, నవ్వుచు అతనితో ఇట్లు నుడివెను-

*41.10 (పదియవ శ్లోకము)*

*భవాన్ ప్రవిశతామగ్రే సహ యానః పురీం గృహమ్|*

*వయం త్విహావముచ్యాథ తతో ద్రక్ష్యామహే పురీమ్॥9827॥*

"తండ్రీ! నీవు రథమును తీసికొని, పురమున ప్రవేశించి, తిన్నగా ఇంటికి చేరుము. మేము ఇక రథము నుండి దిగి, ఈ ఉపవనమునందు కొంత విశ్రాంతిగైకొందుము. అనంతరము నెమ్మదిగా నగరమును దర్శించెదము".

*అక్రూర ఉవాచ*

*41.11 (పదకొండవ శ్లోకము)*

*నాహం భవద్భ్యాం రహితః ప్రవేక్ష్యే మథురాం ప్రభో|*

*త్యక్తుం నార్హసి మాం నాథ భక్తం తే భక్తవత్సల॥9828॥*

*41.12 (పండ్రెండవ శ్లోకము)*

*ఆగచ్ఛ యామ గేహాన్నః సనాథాన్ కుర్వధోక్షజ|*

*సహాగ్రజః సగోపాలైః సుహృద్భిశ్చ సుహృత్తమ॥9829॥*

*అక్రూరుడు ఇట్లు పలికెను*  ప్రభూ! మీరు ఇరువురును లేకుండా నేను మథురలో  ప్రవేశింపజాలను. భక్తవత్సలా! నేను నీ భక్తుడను. దయచేసి ఇప్పుడు నన్ను ఒక్కనినే పంపవలదు. పరమాత్మా! నీవు నా హితైషివి. నీవు బలరామునితోడను, నందాది గోపాలురతోను, తదితరులగు ఆత్మీయులతోడను కూడి మా ఇండ్లకు విచ్చేసి, మమ్ము అనుగ్రహింపుము.

*41.13 (పదమూడవ శ్లోకము)*

*పునీహి పాదరజసా గృహాన్నో గృహమేధినామ్|*

*యచ్ఛౌచేనానుతృప్యంతి పితరః సాగ్నయః సురాః॥9830॥*

స్వామీ! మేము గృహస్థులము. నీ పాదధూళితో మా గృహములను పునీతమొనర్చి మమ్ములను ధన్యులను గావింపుము. నీ పాదప్రక్షాళనచే పవిత్రములైన జలములను మేము సేవించుటవలనను, శిరస్సులపై చల్లుకొనుటచేతను, మా పితరులు, అగ్నులు, అట్లే దేవతలు తృప్తి చెందుదురు.

*41.14 (పదునాలుగవ శ్లోకము)*

*అవనిజ్యాంఘ్రియుగలమాసీచ్ఛ్లోక్యో బలిర్మహాన్|*

*ఐశ్వర్యమతులం లేభే గతిం చైకాంతినాం తు యా॥9831॥*

దేవా! నీ పాదప్రక్షాళనముచే పవిత్రములైన తీర్థములను శిరమున ధరించినందున బలిచక్రవర్తియొక్క కీర్తిప్రతిష్ఠలు ఇనుమడించెను. అంతేగాదు, అతడు సాటిలేని ఐశ్వర్యములను పొందెను. మఱియు ప్రసన్నులైన పరమభక్తులకువలె ఆయనకు ఉత్తమగతులు ప్రాప్తించెను.

*41.15 (పదునైదవ శ్లోకము)*

*ఆపస్తేఽఙ్ఘ్ర్యవనేజన్యస్త్రీంల్లోకాన్ శుచయోఽపునన్|*

*శిరసాధత్త యాః శర్వః స్వర్యాతాః సగరాత్మజాః॥9832॥*

ప్రభూ! నీ శ్రీపాదముల నుండి ఉద్భవించిన గంగాజలములు ముల్లోకములను పవిత్రమొనర్చెను. కైలాసాధిపతియగు శంకరుడును వాటిని తన శిరస్సున ధరించెను. వాటి స్పర్శ ప్రభావమున సగరుని పుత్రులకును సద్గతులు లభించెను. కనుక, మహిమాన్వితములైన నీ పాదజలములతో మా గృహములను పావనము చేయుము.

*41.16 (పదహారవ శ్లోకము)*

*దేవ దేవ జగన్నాథ పుణ్యశ్రవణకీర్తన|*

*యదూత్తమోత్తమశ్లోక నారాయణ నమోఽస్తు తే॥9833॥*

బ్రహ్మాదిదేవతలకు ప్రభుడవైన జగన్నాథా! పుణ్యాత్ములైన (మహాత్ములైన) భాగవతోత్తములు నీ దివ్యగాథలను వినుచు, కీర్తించుచు పరమానందమును పొందుచుందురు. నీవు యాదవశ్రేష్ఠులలో ఖ్యాతి వహించిన మహానుభావుడవు. సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడవైన నీకు నమస్కారము.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[12/02, 20:56] +91 95058 13235: *12.2.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఒకటవ అధ్యాయము*

*బలరామకృష్ణులు మథురలో ప్రవేశించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీభగవనువాచ*

*41.17 (పదిహేడవ శ్లోకము)*

*ఆయాస్యే భవతో గేహమహమార్యసమన్వితః|*

*యదుచక్రద్రుహం హత్వా వితరిష్యే సుహృత్ప్రియమ్॥9834॥*

*అంతట కృష్ణభగవానుడు ఇట్లు నుడివెను* "అయ్యా! యాదవులయెడ ద్రోహబుద్ధితో నున్న కంసుని హతమార్చిన పిమ్మట మా అన్నయగు బలరామునితో గూడి మీ ఇంటికి తప్పక విచ్చేయుదును. అప్పుడు సుహృదులైన మీ అందఱికిని ప్రియమును గూర్తును".

*శ్రీశుక ఉవాచ*

*41.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*ఏవముక్తో భగవతా సోఽక్రూరో విమనా ఇవ|*

*పురీం ప్రవిష్టః కంసాయ కర్మావేద్య గృహం యయౌ॥9835॥*

*శ్రీశుకుడు వచించెను* పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు ఇట్లు పలికిన పిమ్మట ఆ అక్రూరుడు అంతగా సంతుష్టుడు కాకున్నను (దుఃఖించుచునే) వారిని వీడ్కొని, మథురా నగరమున ప్రవేశించెను. బలరామకృష్ణులు వచ్చిన విషయమును కంసునకు నివేదించి, తిన్నగా తన ఇంటికి చేరెను.

*41.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*అథాపరాహ్నే భగవాన్ కృష్ణః సంకర్షణాన్వితః|*

*మథురాం ప్రావిశద్గోపైర్దిదృక్షుః పరివారితః॥9836॥*

మరునాటి పగటి సమయమున కృష్ణపరమాత్మ తన అన్నయగు బలరామునితోడను, గోపాలురతోడనుగూడి, మథురానగరము యొక్క అందచందములను చూచుటకై ఆ పురమును ప్రవేశించెను.

*41.20  (ఇరువదియవ శ్లోకము)*

*దదర్శ తాం స్ఫాటికతుంగగోపురద్వారాం  బృహద్ధేమకపాటతోరణామ్|*

*తామ్రారకోష్ఠాం పరిఖాదురాసదాముద్యానరమ్యోపవనోపశోభితామ్॥9837॥*

మథురానగరముయొక్క ఉన్నతములైన పురద్వారములను, గోపురములను తదితర ద్వారములను స్ఫటికమణులతో నిర్మితములైయుండెను. ఆ ద్వారములు మిగుల విశాలములైన బంగారు కవాటములతో (తలపులతో), తోరణములతో విరాజిల్లుచుండెను. అందలి ధాన్యాగారములు మొదలగునవి అన్నియును రాగి, ఇత్తడి లోహములతో నిర్మింపబడి యుండెను. చుట్టునుగల అగడ్తలచే (నీటికందకములచే) ఆ నగరము శత్రువులకు ప్రవేశింపరానిదై యుండెను. ఆ పట్టణము, రమ్యములైన ఉద్యానవనములతోడను, ఉపవనములతోడను ఒప్పుచు దర్శనీయముగా ఉండెను.

*41.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*సౌవర్ణశృంగాటకహర్మ్యనిష్కుటైఃశ్రేణీసభాభిర్భవనైరుపస్కృతామ్|*

*వైదూర్యవజ్రామలనీలవిద్రుమైర్ముక్తాహరిద్భిర్వలభీషు వేదిషు॥9838॥*

*41.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*జుష్టేషు జాలాముఖరంధ్రకుట్టిమేష్వావిష్టపారావతబర్హినాదితామ్|*

*సంసిక్తరథ్యాపణమార్గచత్వరాం  ప్రకీర్ణమాల్యాంకురలాజతండులామ్॥9839॥*

బంగారముతో తీర్చిదిద్దిన వీథుల కూడళ్ళు, సంపన్నుల భవనములు, గృహోద్యానములు చూడముచ్చటగా నుండెను. అందు వివిధవృత్తులవారి గృహములు, సభాభవనములు, సాధారణ పౌరులు నివసించు గృహములు వరుసలు దీఱియుండెను. అందలి ముంజూరులు (చూరు ముందటిభాగము), అరుగులు, ఇంటిలోపలి తలములు అన్నియును వైఢూర్యములు, వజ్రములు, స్వచ్ఛములైన నీలమణులు, పవడములు, ముత్యాలు, పచ్చలు మొదలగు వానితో పొదగబడియుండెను. అందు వాయుప్రసారమునకు అనువుగా నిర్మింపబడిన జాతికట్టడములు గవాక్షములు (కిటికీలు) అన్నియును కనువిందు గావించుచుండెను. వాటిపై చేరియున్న పావురములయొక్క కలకలారావములు, నెమళ్ళ క్రీంకారములు వినసొంపుగా నుండెను. ఆ నగరమునందలి రాజవీథులు, అంగళ్ళతో కూడిన వీథులు, గృహప్రాంగణములు సుగంధజలములచే (కలాపి) తడుపబడి యుండెను. వాటిపై అచ్చటచ్చట పూలమాలలు, అంకురములు (మొగ్గలు), పేలాలు, తండులములు బాగుగా అలంకృతములై యుండెను.

*41.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*ఆపూర్ణకుంభైర్దధిచందనోక్షితైః  ప్రసూన దీపావలిభిః సపల్లవైః|*

*సవృందరంభాక్రముకైః సకేతుభిః స్వలంకృతద్వారగృహాం సపట్టికైః॥9840॥*

ఆ పురమునందలి గృహద్వారముల పైభాగములయందు పెఱుగు, చందనములచే మిశ్రితములగు జలములతో నింపబడిన కలశములు అమర్చబడియుండెను. ఇంకను, ఆ ద్వారములపైన చిగురుటాకులతో, పూవులతో అలంకృతములైన దీపపంక్తులు శోభిల్లుచుండెను. మఱియు ఆ ద్వారములు పండ్లగెలలతో నిండిన అరటిచెట్లతోను, పోకచెట్లతోను, చిన్నచిన్న జెండాలతోను, పట్టుపరదాలతోను ఒప్పుచు రమణీయముగా నుండెను. వైభవోపేతముగా ఉన్న అట్టి మథురానగరమును శ్రీకృష్ణుడు సపరివారముగా దర్శించెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[12/02, 20:56] +91 95058 13235: *🕉️🕉️శ్రీ దుర్గాసప్తశతి🕉️🕉️*

*ప్రథమాధ్యాయము* 12.2.2021

*🙏🙏🙏ఓం నమశ్చండికాయై🙏🙏🙏*

*ఓం ఐం మార్కండేయ ఉవాచ॥001॥*

మార్కండేయ మహర్షి భాగురియను  శిష్యునకిట్లు చెప్పెను.

*సావర్ణిః సూర్యతనయో యో మనుః కథ్యతేఽష్టమః|*

*నిశామయ తదుత్పత్తిం విస్తరాత్ గదతో మమ॥002॥*

సావర్ణి యనువాడు సూర్యుని పుత్రుడు. ఎనిమిదవ మనువయ్యెను. అతని పుట్టు పూర్వోత్తరములను వివరింతును.

*మహామాయానుభావేన యథా మన్వంతరాధిపః|*

*స బభూవ మహాభాగు సావర్ణిస్తనయో రవేః॥003॥*

మహామాయా ప్రభావంతో నాతడు మన్వంతరాధిపతియైన విధమును తెలియుము.

*స్వారోచిషేఽంతరే పూర్వం చైత్రవంశసముద్భవః|*

*సురథో నామ రాజాభూత్సమస్తే క్షితిమండలే॥004॥*

పూర్వము స్వారోచిషమనువు కాలమున చైత్రవంశీయుడు సురథుడు సమస్త భూమండలమునకు రాజయ్యెను.

*తస్య పాలయతః సమ్యక్ ప్రజాః పుత్రానివౌరసాన్|*

*బభూవుః శత్రవో భూపాః కోలావిధ్వంసినస్తదా॥005॥*

ప్రజలను కన్నబిడ్డలవలె పాలించుచున్న ఆ రాజునకు *కోలావిధ్వంసు* లనువారు శత్రువులైరి.

*తస్య తైరభవద్ యుద్ధమతిప్రబలదండినః|*

*న్యూనైరపి స తైర్యుద్ధే కోలావిధ్వంసిభిర్జితః॥006॥*

వారితో ఆ రాజునకు యుద్ధముసంభవించెను. గొప్ప సైన్యము కలిగియు తక్కువబలముగల శత్రువులతో సురథుడోడిపోయెను.

*తతః స్వపురమాయాతో నిజదేశాధిపోఽభవత్|*

*ఆక్రాంతః స మహాభాగస్తైస్తదా ప్రబలారిభి॥007॥*

అంత ఆ రాజు తన రాజధానికి మరలివచ్చి, తన దేశము నేలుకొనుచుండెను. ప్రబలుడైన శత్రువులాతని నాక్రమించిరి.

*అమాత్యైర్బలిభిర్దుష్టైర్దుర్బలస్య దురాత్మభిః|*

*కోశో బలం చాపహృతం తత్రాపి స్వపురే తతః॥008॥*

దుర్భలుడగు ఆ రాజుయొక్క ధనమును, సైన్యమును దుష్టబుద్ధులగు మంత్రులపహరించిరి.

*తతో మృగయావ్యాజేన హృతస్వామ్యః స భూపతిః|*

*ఏకాకీ హయమారుహ్య జగామ గహనం వనమ్॥009॥*

సురథుడు రాచఱికము కోల్పోయి, వేటనెపముతో ఒంటరిగా గుర్రమునెక్కి అడవులకు పోయెను.

*స తత్రాశ్రమమద్రాక్షీద్ ద్విజ వర్యస్య మేధసః|*

*ప్రశాంతశ్వాపదాకీర్ణం మునిశిష్యోపశోభితమ్॥010॥*

అచ్చట సుమేధసుడను బ్రహ్మర్షి ఆశ్రమమును చూచెను. అట శాంతము నలవరచుకొన్న క్రూరమృగములు, మునిశిష్యులు మెలగుచుండిరి.

(తరువాయి వచ్చే శుక్రవారము)

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

[13/02, 04:19] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*240వ నామ మంత్రము* 13.02.2021

*ఓం చంద్రమండల మధ్యగాయై నమః*

చంద్రబింబమధ్యమందున్న శ్రీమాతకు నమస్కారము.

శ్రీచక్రస్వరూపిణియైన లలితాంబకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *చంద్రమండల మధ్యగా* యను ఎనిమిదక్షరముల  (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం చంద్రమందల మధ్యగాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ లలితాత్రిపురసుందరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసించు భక్తులకు జీవితం అత్యంత సుఖప్రదాయంగా కొనసాగును. మరియు ఆ భక్తులు పరమేశ్వరీ నామ మంత్ర జపముతో జీవితము తరింపజేసికొందురు.

సాధకుడు మూలాధారమునందున్న  కుండలినీ శక్తి రూపిణి యైన పరమేశ్వరిని జాగృతము చేసి, షట్చక్రములు, బ్రహ్మ, విష్ణు, రుద్రగ్రంథుల ఛేదనమొనరించి సహస్రార కర్ణికయందున్న చంద్రమండలమును భేదించును. అంటే కుండలినీ శక్తి స్వరూపిణియైన జగన్మాత చంద్రమండలము మధ్యలో ఉన్నదని అర్థము. గనుక జగన్మాత *చంద్రమండలమధ్యగా* యని అనబడినది.

శ్రీచక్రమే చంద్రమండలము.  శ్రీచక్రంలోని రెండవ ఆవరణ షోడశదళపద్మము. షోడశ అనగా పదహారు. ఇదే పదహారు చంద్రకళలు.  

బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. సహస్రార కమల కర్ణిక అందురు. దీనినే బిందు స్థానమనియు అందురు. మన శరీరంలో గల ఈ బిందుస్థానాన్ని ద్వాదశాంతం అని కూడా అంటారు. ద్వాదశాంతం అనగా ఆధారచక్రంనుండి లెక్కించగా (1. అకుల పద్మము, 2. అష్టదళపద్మము, 3. షడ్దళపద్మము, మూలాధారము, 4. స్వాధిష్ఠానము, 6. మణిపూరము, 7. అనాహతము, 8. విశుద్ధిచక్రము, 9. లంబికాగ్రము, 10. ఆజ్ఞాచక్రము, 11. సహస్రకమలము, 12. కులపద్మము) బిందుస్థానం పన్నెండవది అవుతుంది.  అందుచేతనే ద్వాదశాంతం అంటారు. 

ఇదే చంద్రమండలము. ఇదే చంద్రాగ్నుల సంగమస్థానము. ఇదే ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు, దీని చుట్టును మాయ గలదు. ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈస్థానము నెరిగిన నరునకు పునర్జన్మ లేదు. ఇదే చంద్రమండలము అన్నాము గదా! పరమేశ్వరి ఈ చంద్రమండల మధ్యభాగాన ఉంది గనుక *చంద్రమండలమధ్యగా* యని అనబడినది.

అమ్మవారికి నమస్కరించునపుడు *చంద్రమండలమధ్యగా* యని అనవలెను

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[13/02, 04:19] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*815వ నామ మంత్రము* 13.02.2021

*ఓం అనిత్యతృప్తాయై నమః*

అతి సామాన్యమైన ఉపచారముల మాత్రముననే తృప్తి చెందు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అనిత్యతృప్తా* అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం అనిత్యతృప్తాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగజ్జననిని భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులను ఆతల్లి అత్యంత నిరాడంబరులుగాను, అరిషడ్వర్గరహితులుగాను, పరమాత్మ తమకిచ్చినదే మహద్భాగ్యము అనుచు అత్యాశలకుపోనివారుగాను పరివర్తననిచ్చి, కేవలం పరమాత్మ నామస్మరణే పరమావధిగా భావించువారలుగా జేసి తరింపజేయును.

566వ నామ మంత్రము  *నిత్యతృప్తా* యని గలదు. ఈ నామము *మూర్తామూర్తానిత్యతృప్తా* మూర్తామూర్త + *అనిత్యతృప్తా* యని భావించగలరు.

జగన్మాత అనిత్యోపచారములతోనే తృప్తిని పొందును. భక్తితో పూజించితే పరమేశ్వరి తృప్తి పొందుతుంది. 

భక్తకన్నప్ప పరమేశ్వరునికి (శ్రీకాళహస్తీశ్వరునికి) పచ్చిమాంసము తీసుకువచ్చి నైవేద్యం పెట్టాడు. ప్రక్కనే ఉన్న స్వర్ణముఖీ నదీ జలమును నోటితో తెచ్చి లింగనికి అభిషేకం చేశాడు. తన ప్రభువుకు కంటినుండి నీరు కారుతుంటే తన కన్ను ఊడబెరికి పరమేశ్వరునికి పెట్టాడు.రెండవ కన్ను కూడా ఊడబెరికి పెట్టాలనుకున్నాడు. తనకన్ను ఊడబెరికితే కనబడని స్థితిలో తన పాదము బొటనవేలిని పరమేశ్వరుని నీరుగారు కన్నుఉన్న స్థలంలో ఉంచి రెండవ కన్ను పెట్టిన మహాభక్తాగ్రేశ్వరుడు. ఆ స్వామి ఆ మూఢభక్తుని భక్తికి మోక్షము నిచ్చాడు. 

భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు.

*పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి ।*

*తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః ।।*

భక్తితో ఒక ఆకును, ఒక పువ్వును.. అవి లేకపోతే ఓ పండును.. అదీ లేకపోతే నీటిని  సమర్పిస్తే చాలు సంతోషిస్తా అంటాడు కృష్ణభగవానుడు. దేవుణ్ని పూజించడానికి ఖరీదైన సామగ్రి అక్కర్లేదని, భక్తితో ఏది సమర్పించినా చాలని అర్థం.

తనకంటూ ఏదీ లేని పరమశివుడు భక్తుల నుంచి ఏం కోరతాడు? భక్తినే కోరతాడు. ఆ భక్తితో సమర్పించిన ఆకులకు, పూలకు ఆయన ప్రసన్నం అవుతాడు. అటువంటి పరమేశ్వరుని అర్ధాంగి అమ్మవారు కూడా అనిత్యమైన ఉపచారవిధులకే తృప్తిచెంది భక్తులకు మోక్షము నిచ్చునుగాన పరమేశ్వరి *అనిత్యతృప్తా* యని అనబడినది.

ఏ వేదంబు పఠించె లూత , భుజగం బే శాస్త్రముల్సూచె దా

      నే విద్యాభ్యసనం బొనర్చె గరి , చెంచే మంత్ర మూహించె , బో

     ధావిర్భావ నిధానముల్ చదువులయ్యా ? కావు , మీ పాద సం

     సేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీ  కాళహస్తీశ్వరా!

ఓ ఈశ్వరా  ! జ్ఞాన సముపార్జనకు ప్రాణులకు విద్య అవసరం లేదు. నీ పాదసేవయే సమస్తజ్ఞానమును కల్గించును . ఎట్లనగా నిన్ను సేవించిన సాలెపురుగు ఏ వేదాధ్యయనము చేసి,జ్ఞానమును సముపార్జించినది . నిన్ను సేవించిన సర్పము ఏ శాస్త్రమును చదివినది . నిను పూజించిన ఏనుగు   ఏ విద్య నభ్యసించినది .  బోయవాడైన తిన్నడు  ఏ మంత్రమును చదివి   నిన్ను సేవించి ముక్తి పొందినాడు .  కావున నీ పాదములను సేవించాలనే కుతూహలమే సమస్త జ్ఞానమును కల్గించును ప్రభూ

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం అనిత్యతృప్తాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[13/02, 04:19] +91 95058 13235: *13.2.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఒకటవ అధ్యాయము*

*బలరామకృష్ణులు మథురలో ప్రవేశించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*41.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*తాం సంప్రవిష్టౌ వసుదేవనందనౌ వృతౌ వయస్యైర్నరదేవవర్త్మనా|*

*ద్రష్టుం సమీయుస్త్వరితాః పురస్త్రియో హర్మ్యాణి చైవారురుహుర్నృపోత్సుకాః॥9841॥*

రాజా! బలరామకృష్ణులు తమ మిత్రులగు గోపాలురతో గూడి క్రమముగా ముందునకు సాగుచు రాజవీథియందు ప్రవేశించిరి. వారిని దర్శించుటకై తహతహపడుచున్న ఆ నగరస్త్రీలు త్వరత్వరగా అక్కడక్కడ గుంపులు గుంపులుగా చేరిరి. కొందఱు వారిని చూచు వేడుకతో మేడల పైభాగములకు చేరిరి.

*41.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*కాశ్చిద్విపర్యగ్ధృతవస్త్రభూషణా విస్మృత్య చైకం యుగలేష్వథాపరాః|*

*కృతైకపత్రశ్రవణైకనూపురా  నాంక్త్వా ద్వితీయం త్వపరాశ్చ లోచనమ్॥9842॥*

అందాలు రాశిపోసిన ఆ ఇద్దరిని దర్శించు తొందరలో కొంతమంది తరుణీమణులు తమ వస్త్రాభరణములను తాఱుమాఱుగా ధరించిరి. కొందఱు  ఒకే కుండలమును, ఒకే కంకణమును, ఒకే నూపురమును (కాలియుండెను) ధరించి, రెండవ దానిని మరచిరి. కొందరు ఆ ఉబలాటములో మునిగి ఒక్కొక్క కంటికి మాత్రమే కాటుకలను దిద్దుకొనిరి.

*41.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*అశ్నంత్య ఏకాస్తదపాస్య సోత్సవా అభ్యజ్యమానా అకృతోపమజ్జనాః|*

*స్వపంత్య ఉత్థాయ నిశమ్య నిఃస్వనం  ప్రపాయయంత్యోఽర్భమపోహ్య మాతరః॥9843॥*

శ్రీకృష్ణుని దర్శించు ఉత్సుకతతో కొందఱు భోజనము చేయుచున్నవారు భుజించుట మాని, మధ్యలో వదలిపెట్టి బయలుదేఱిరి. మఱికొందరు అభ్యంజన మొనర్చుకొనుచు (తలంటుకొనుచు) స్నానములు చేయకయే పరుగులు తీసిరి. వీధిలో జరుగుచున్న కోలాహలము చెవులబడినంతనే నిద్రించుచున్నవారు లేచివచ్చిరి. పిల్లలకు పాలిచ్చుచున్న కొందఱు తల్లులు పూర్తిగా స్తన్యమియ్యకయే తమ శిశువులను దించి, ఆ స్వామిని దర్శించుటకై ఏతెంచిరి.

*41.27  (ఇరువది ఏడవ శ్లోకము)*

*మనాంసి తాసామరవిందలోచనః ప్రగల్భలీలాహసితావలోకైనైః|*

*జహార మత్తద్విరదేంద్రవిక్రమో  దృశాం దదచ్ఛ్రీరమణాత్మనోత్సవమ్॥9844॥*

కమలలోచనుడైన ఆ శ్రీహరి (శ్రీకృష్ణుడు) మదపుటేనుగువలె గంభీర గమనముతో ముందునకు సాగుచు, తన రూపలావణ్య వైభవముతో ఆ పురభామినులకు నేత్రోత్సవమును గూర్చుచుండెను. ఇంకను ఆ స్వామి అద్భుతములైన తన లీలావిలాసములతో దరహాసశోభలతో, అనురాగపు చూపులతో వారి మనస్సులను దోచుకొనుచుండెను.

*41.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*దృష్ట్వా ముహుః శ్రుతమనుద్రుతచేతసస్తం  తత్ప్రేక్షణోత్స్మితసుధోక్షణలబ్ధమానాః|*

*ఆనందమూర్తిముపగుహ్య దృశాఽఽత్మలబ్ధం హృష్యత్త్వచో జహురనంతమరిందమాధిమ్॥9845॥*

రాజా! ఇంతవరకును ఆ నగర వనితలు కృష్ణభగవానుని లీలామహత్త్వములను గూర్చి పదేపదే వినుచు ఆయన దర్శనమునకై తమ మనస్సులలో మిగుల తహతహ పడుచుండిరి. ఇప్పుడు ఆ స్వామిని ప్రత్యక్షముగా దర్శించుటతో వారిలో సంతోషము పొంగులువాఱెను. ఆ పరమాత్మయు తన చూపులలో వారిని ఆకర్షించుచు, చిఱనవ్వులనెడి అమృతపు జల్లులతో వారి మనస్సులను ఆర్ధ్రమొనర్చుచు వారిని ఎంతయు ఆదరించెను. ఆ పురకాంతలును తమ చూపులద్వారా ఆ స్వామి ఆనందరూపమును తమ హృదయములలో నిలుపుకొని, ఆలింగనసుఖములను అనుభవించిరి. ఆ సంతోషములో వారి శరీరములు పులకించెను. అంతట వారియొక్క తీవ్రమైన మనస్తాపములు చల్లారెను.

*41.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*ప్రాసాదశిఖరారూఢాః ప్రీత్యుత్ఫుల్లముఖాంబుజాః|*

*అభ్యవర్షన్ సౌమనస్యైః ప్రమదా బలకేశవౌ॥9846॥*

శ్రీకృష్ణదర్శనానందముతో ఆ నగరస్త్రీల ముఖారవిందములు చక్కగా వికసించెను. మేడలపై చేరియున్న ఆ ముదితలు హర్షముతో బలరామకృష్ణులపై పూలను వర్షించిరి.

*41.30 (ముప్పదియవ శ్లోకము)*

*దధ్యక్షతైః సోదపాత్రైః స్రగ్గంధైరభ్యుపాయనైః|*

*తావానర్చుః ప్రముదితాస్తత్ర తత్ర ద్విజాతయః॥9847॥*

ఆ పరమ పురుషులను దర్శించుటకై అచ్చటచ్చట చేరియున్న ద్విజులు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు) పెఱుగు, అక్షతలు, జలపాత్రలు, పూలహారములు, చందనములు మొదలగు వానిని, తదితరములగు కానుకలను సమర్పించుచు, సంతోషముతో ఆ మహాత్ములను అర్చించిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[13/02, 21:04] +91 95058 13235: *13.2.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఒకటవ అధ్యాయము*

*బలరామకృష్ణులు మథురలో ప్రవేశించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*41.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*ఊచుః పౌరా అహో గోప్యస్తపః కిమచరన్ మహత్|*

*యా హ్యేతావనుపశ్యంతి నరలోకమహోత్సవౌ॥9848॥*

అప్పుడు పురజనులు తమలో తాము ఇట్లనుకొనిరి- 'గోపికలు నిజముగా ఎంత ధన్యాత్మలోగదా! మానవాళికి పరమానంద దాయకములైన ఈ మహానుభావులను నిత్యము దర్శించెడి భాగ్యమునకు నోచుకొనిన ఆ గోపవనితలు ఎంతటి తపస్సులను ఆచరించిరోయేమో?"

*41.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*రజకం కంచిదాయాంతం రంగకారం గదాగ్రజః|*

*దృష్ట్వాయాచత వాసాంసి ధౌతాన్యత్యుత్తమాని చ॥9849॥*

*41.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*దేహ్యావయోః సముచితాన్యంగ వాసాంసి చార్హతోః|*

*భవిష్యతి పరం శ్రేయో దాతుస్తే నాత్ర సంశయః॥9850॥*

ఇంతలో వస్త్రములను శుభ్రముగా ఉతికెడువాడు, వాటికి రంగులు అద్దెడు వాడైన  ఒక చాకలి శ్రీకృష్ణునకు కనబడెను. అప్పుడు ఆ స్వామి, 'మేలైన ఉతికిన వస్త్రములను ఇమ్ము' అని అడుగుచు అతనితో ఇట్లనెను - "మిత్రమా! అర్హులమైన మా ఉభయులకును కొన్ని మంచి వస్త్రములను ఇమ్ము. గుడ్డలను ఇచ్చినందున నీకు చక్కని శ్రేయస్సు కలుగును. ఇది ముమ్మాటికిని నిజము".

*41.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*స యాచితో భగవతా పరిపూర్ణేన సర్వతః|*

*సాక్షేపం రుషితః ప్రాహ భృత్యో రాజ్ఞః సుదుర్మదః॥9851॥*

పరీక్షిన్మహారాజా! అన్నివిధములుగా పరిపూర్ణుడైన (ఆప్తకాముడైన) కృష్ణభగవానుడు ఇట్లడుగగా, కంసరాజునకు భృత్యుడు మిగుల గర్వితుడు ఐన ఆ రజకుడు ఎంతయు క్రుద్ధుడై ఆ నందనందనుని ఆక్షేపించుచు ఇట్లు నుడివెను-

*41.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*ఈదృశాన్యేవ వాసాంసీ నిత్యం గిరివనేచరాః|*

*పరిధత్త కిముద్వృత్తా రాజద్రవ్యాణ్యభీప్సథ॥9852॥*

*41.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*యాతాశు బాలిశా మైవం ప్రార్థ్యం యది జిజీవిషా|*

*బధ్నంతి ఘ్నంతి లుంపంతి దృప్తం రాజకులాని వై॥9853॥*

గుట్టలలో, అడవులలో తిరుగుచుండెడి గోపాలులారా! మీరు నిత్యము ఇట్టి మేలైన వస్త్రములనే ధరించుచుందురా? మీరు మిగుల మదించియున్నట్లు కనుబడుచున్నారు. మీ కనులు నెత్తికెక్కినవా? రాజుగారు ధరించుచుండెడి ఈ వస్త్రములను కోరుకొనుటకు మీకు ఎన్ని గుండెలు? మూర్ఖులారా! ప్రాణములపై ఆశయున్నచో మీరు ఇట్లు అడుగదగదు. వెంటనే ఇక్కడినుండి పాఱిపొండు. లేనిచో రాజభటులు దుష్టులైన మిమ్ము పట్టి బంధించెదరు. చావగొట్టెదరు. అంతేగాదు, మీ వస్తువులను అన్నింటిని లాగుకొనెదరు".

*41.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*ఏవం వికత్థమానస్య కుపితో దేవకీసుతః|*

*రజకస్య కరాగ్రేణ శిరః కాయాదపాతయత్॥9854॥*

చాకలి యుక్తాయుక్తములను మఱచి ఇట్లు వదరుచున్నందులకు శ్రీకృష్ణుడు మిక్కిలి కుపితుడయ్యెను. వెంటనే ఆ ప్రభువు తన కరాగ్రముతో (చేతి ముందుభాగముతో) ఆ చాకలి శిరస్సు తెగిపడునట్లుగా కొట్టెను.

*41.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*తస్యానుజీవినః సర్వే వాసః కోశాన్ విసృజ్య వై|*

*దుద్రువుః సర్వతో మార్గం వాసాంసి జగృహేఽచ్యుతః॥9855॥*

అంతట ఆ చాకలియొక్క అనుచరులు తమ గుడ్డలమూటలను అక్కడనే పడవేసి, ఎటువారటు కాలికి బుద్ధిచెప్పిరి. పిదప శ్రీకృష్ణుడు తనకు అనువగు వస్త్రములను ఆ చాకలి మూటలనుండి తీసికొనెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[14/02, 04:45] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*241వ నామ మంత్రము* 14.02.2021

*ఓం చారురూపాయై నమః*

అత్యంత రూపలావణ్యములతో ప్రభాసిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *చారురూపా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం చారురూపాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్త భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులను ఆ తల్లి కరుణించి, వారికి మాటలలో అద్భుతమైన చాతుర్యము, చేతలలో పలువురి మెప్పునందగలిగే ప్రతిభావంతమైన కార్యదక్షత కలిగుటతో బాటు కీర్తిప్రతిష్టలకు, సుఖశాంతులకు, సిరిసంపదలకు లోటులేకుండునట్లు అనుగ్రహించును. పారమార్థిక చింతనము కలిగి పవిత్రమైన జీవనము కలిగినవారిగా కూడా అనుగ్రహించును.

జగన్మాత త్రిభువనసుందరి. అద్భుతమైన రూపలావణ్యము గలది. లోకంలోని సర్వజీవులను కూడా వశము చేసుకోగల సౌందర్యరూపిణి. 

15వ నామ మంత్రము *అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థల శోభితా* అమ్మవారి లలాటం అష్టమితిథినాటి చంద్రబింబం మాదిరిగా ప్రకాశిస్తోంది. (శుక్లపక్షం, కృష్ణపక్షంలోనుగూడా అష్టమి చంద్రుడు ఒకేలా ఉంటాడు)

17వ నామ మంత్రము *వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా* మన్మథుని మంగళకరమైస గృహమును బోలిన అమ్మవారి వదనమునకు, ఆ తల్లి కనుబొమలు  గృహతోరణాలవలె ప్రకాశించుచున్నవి.

18వ నామ మంత్రము *వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా* అమ్మవారి ముఖసౌందర్యకాంతి యను ప్రవాహంలో, ఇటునటు కదలాడు మీనద్వయమువలె ఆ తల్లి నయన సౌందర్యము గలదు.

23వ నామ మంత్రము *పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః*  పద్మరాగ శిలలను, అద్దాన్ని తిరస్కరించే సుందరమైన చెక్కిళ్ళు గలిగి యున్న తల్లి అమ్మవారు.

24వ నామ మంత్రము *నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదా* ఆ తల్లి పెదవులు క్రొత్తపగడం, దొండపండుల కాంతినికూడా ధిక్కరించేటంతటి ఎర్రనికాంతితో అందముగా ఉన్నాయి.

25వ నామ మంత్రము *శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా* అమ్మవారి దంతపంక్తులు శ్రీవిద్యయందున్న పదహారు వర్ణములరూపంతో తేజరిల్లుచున్నవి.

29వ నామ మంత్రము *అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజితా* అమ్మవారి చుబుకము వర్ణింపనలవిగాని సౌందర్యముతో విరాజిల్లుచున్నది.

అంతటి రూపలావణ్యములతో ఉన్న శ్రీమాత *సర్వారుణా* శరీరము సర్వమూ అరుణ వర్ణంతో ప్రకాశిస్తూ *అనవద్యాంగీ* దోషరహితమైన (అలాగ ఇలాగ అని  వంకలు పెట్టలేని) అంగములతో వర్ణింప నలవిగాని సౌందర్యముతో విరాజిల్లుచున్నది అమ్మవారు. 

అంతటి సౌందర్యవతి గనుకనే *శివా* పరమేశ్వరుని అర్ధాంగియై, *శివకామేశ్వరాంకస్థా* శివుని వామాంకమును అధివసించి, *స్వాధీన వల్లభా* భర్త అయిన పరమేశ్వరుడిని తన సౌందర్యానికి వశం చేసుకున్నది.

గనుకనే అమ్మవారు *చారురూపా* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం చారురూపాయై నమః* అని అనవలెను

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[14/02, 04:45] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*816వ నామ మంత్రము* 14.02.2021

*ఓం మునిమానస హంసికాయై నమః*

మునుల మనస్సు అనెడి మానస సరోవరము నందు హంసిక (హంస పరమేశ్వరుడు, హంసిక - పరమేశ్వరి) వలె  విహరించు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మునిమానస హంసికా* యను ఎనిమిదక్షరముల  (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం   మునిమానస హంసికాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ శ్రీమాతను ఉపాసించు సాధకులకు ఆతల్లి వారికి నిశ్చలమైన మానస సరోవర జలములవంటి మనసును ప్రసాదించి, దృఢచిత్తముతో, ఏకాగ్రతతో తన నామ మంత్రములను స్మరించునటులును, తద్వారా శాంతిసౌఖ్యములు లభించునటులును, మోక్షసోపానములకు మార్గము సుగమమగునట్లును అనుగ్రహించును.

తన నామమును జపించు మునులయొక్క మానసముల యందు హంసవలె సంచరించు జగన్మాత *మునిమానసహంసికా* యని అనబడినది.

నిశ్చలచిత్తముతో నిరంతరము మంత్రానుష్ఠానమునాచరించి, నిష్ణాతులైన మహాత్ములను మునులు అనబడతారు.  కఠోరమైన అనుష్ఠాన పటిమచే వారి మనసులు మనసులుగా గాక, నిర్మల జలభరితమైన మాసస సరోవరములువుతాయి.  పరమేశ్వరుడు హంసగా, పరమేశ్వరి హంసికగా విహరించుదురు. అట్టి ముని మానసములు అను సరోవరములలో విహరించు పార్వతీ పరమేశ్వరులు,  శివశక్త్యైక్యము ఇచట ప్రతిపాదింపబడిన కారణముచే అమ్మవారు *మునిమానసహంసికా* యని అనబడినది. ఇక్కడ కామేశ్వరీ కామేశ్వరులను హంస, హంసిక అని యన్నాముగదా! ఈ సందర్భముగా శంకరభగవత్పాదులవారి సౌందర్యలహరిలోని ముప్పది ఎనిమిదవ (38వ)  శ్లోకం ఒకసారి మననం చేసుకుందాము.

*సమున్మీలత్సంవి - త్కమల మకరందైక రసికమ్|*

*భజే హంసద్వంద్వం - కిమపి మహతాం మానసచరమ్ |*

*యదాలాపాదష్టా - దశగుణితవిద్యాపరిణతిః*

*యదాదత్తే దోషా ద్గుణ మఖిల మద్భ్యః పయ ఇవ*

అమ్మా! పరమేశ్వరీ! రాజహంస మిధునముగా పిలవబడే ఆ జంట హంసలకు నమస్కరిస్తున్నాను. అవి ఎటువంటివనిన - భక్తిచేత వికసించిన అనాహతకమలమునందలి జ్ఞానమనే మకరందమును గ్రోలుటయందు ఆసక్తి కలిగినటువంటియు,యోగీంద్రుల యొక్క మనస్సనే మానస సరోవరములో నిత్యమూ సంచరించునవియు, హంస క్షీరము నుండి నీటిని వదలి పాలను మాత్రమే గ్రహించినట్లు సాధకుల యొక్క దోషములను వదలి సద్గుణములను మాత్రమే గ్రహించునటువంటియు,అనిర్వచనీయమైన,అవ్యాజరూపమైన, హంసేశ్వరి హంసేశ్వర నామంతో సమ్మిలితమై సంచరించు అటువంటి ఆ రాజహంస మిధునమునకు (పరమేశ్వరీ, పరమేశ్వరులకు) నమస్కరిస్తూ భజిస్తున్నాను.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మునిమానసహంసికాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[14/02, 04:45] +91 95058 13235: *14.2.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఒకటవ అధ్యాయము*

*బలరామకృష్ణులు మథురలో ప్రవేశించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*41.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*వసిత్వాఽఽత్మప్రియే వస్త్రే కృష్ణః సంకర్షణస్తథా|*

*శేషాణ్యాదత్త గోపేభ్యో విసృజ్య భువి కానిచిత్॥9856॥*

అనంతరము శ్రీకృష్ణబలరాములు తమకు బాగుగా నచ్చిన వస్త్రములను ధరించిరి. మిగిలిన వాటిలో కొన్నింటిని తమ అనుచరులగు గోపాలురకు పంచియిచ్చిరి. తక్కిన గుడ్డలను అక్కడనే వదలివేసిరి.

*41.40 (నలుబదియవ శ్లోకము)*

*తతస్తు వాయకః ప్రీతస్తయోర్వేషమకల్పయత్|*

*విచిత్రవర్ణైశ్చైలేయైరాకల్పైరనురూపతః॥9857॥*

*41.41 (నలుబది ఒకటవ శ్లోకము)*

*నానాలక్షణవేషాభ్యాం కృష్ణరామౌ విరేజతుః|*

*స్వలంకృతౌ బాలగజౌ పర్వణీవ సితేతరౌ॥9858॥*

రామకృష్ణులు కొంతముందునకు నడువగా ఒక నేతవాడు వారికి ఎదురయ్యెను. అప్పుడు అతడు వారి దర్శనమునకు ఎంతయు సంతష్టుడయ్యెను. పిదప అతడు, తాను స్వయముగా నేసిన వస్త్రములతో వారి రూపములకు అనువగు రంగురంగుల వస్త్రములతో వారిని అలంకరించెను. అంతట బలరామకృష్ణులు వివిధములగు రంగుల వస్త్రములను దాల్చి, ఉత్సవసమయములయందు బాగుగా అలంకరింపబడిన తెలుపు నలుపువన్నెలుగల ఏనుగు గున్నలవలె శోభిల్లిరి.

*41.42 (నలుబది రెండవ శ్లోకము)*

*తస్య ప్రసన్నో భగవాన్ ప్రాదాత్సారూప్యమాత్మనః|*

*శ్రియం చ పరమాం లోకే బలైశ్వర్యస్మృతీంద్రియమ్॥9859॥*

నేతవాని సేవలకు శ్రీకృష్ణపరమాత్మ ఎంతయు ప్రసన్నుడయ్యెను. పిమ్మట ఆ స్వామి అతనికి ఈ లోకమున (జీవితకాలమున) చక్కని సిరిసంపదలను, బలమును, ఐశ్వర్యమును, భగవద్భక్తిని, జితేంద్రియత్వమును ప్రసాదించెను. అంతేగాక, దేహాంతమున అతనికి తన సారూప్యముగూడ ప్రాప్తించునట్లు అనుగ్రహించెను.

*41.43 (నలుబది రెండవ శ్లోకము)*

*తతః సుదామ్నో భవనం మాలాకారస్య జగ్మతుః|*

*తౌ దృష్ట్వా స సముత్థాయ ననామ శిరసా భువి॥9860॥*

అనంతరము వారు (ఉభయులు) సుదాముడను మాలాకారుని గృహమునకు చేరిరి. వారిని చూచినంతనే ఆ సుదాముడు లేచి నిలబడి, వినమ్రతతో వారికి సాష్టాంగముగా ప్రణమిల్లెను.

*41.44 (నలుబది నాలుగవ శ్లోకము)*

*తయోరాసనమానీయ పాద్యం చార్ఘ్యార్హణాదిభిః|*

*పూజాం సానుగయోశ్చక్రే స్రక్తాంబూలానులేపనైః॥9861॥*

అంతట ఆ మాలాకారుడు వారిని ఉచితాసనములపై కూర్చుండబెట్టి బలరామకృష్ణులకును, వారి అనుచరులైన గోపాలురకును, భక్తిశ్రద్ధాపూర్వకముగా అర్ఘ్యపాద్యములను సమర్పించెను. పిమ్మట వారిని పూలహారములు, చందన తాంబూలములు, అనులేపనములు మొదలగు సముచితములైన పూజాద్రవ్యములతో అర్చించెను.

*41.45 (నలుబది ఐదవ శ్లోకము)*

*ప్రాహ నః సార్థకం జన్మ పావితం చ కులం ప్రభో|*

*పితృదేవర్షయో మహ్యం తుష్టా హ్యాగమనేన వామ్॥9862॥*

పిమ్మట ఆ మాలాకారుడు ఇట్లు విన్నవించుకొనెను- "ప్రభూ! మీ ఇరువురి శుభాగమనమువలన నా జన్మ సార్థకమైనది. మా వంశము ఫునీతమైనది. మా క్షేమములను గోరెడి పితృదేవతలు, దేవతలు, ఋషులు సంతుష్టులైరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[14/02, 21:16] +91 95058 13235: *14.2.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఒకటవ అధ్యాయము*

*బలరామకృష్ణులు మథురలో ప్రవేశించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*41.46 (నలుబది ఆరవ శ్లోకము)*

*భవంతౌ కిల విశ్వస్య జగతః కారణం పరమ్*

*అవతీర్ణావిహాంశేన క్షేమాయ చ భవాయ చ॥9863॥*

"మీరు ఈ సమస్త జగత్తునకు మూలకారణము. ఈ ప్రపంచముయొక్క అభ్యుదయము కొఱకును, సాధుపురుషుల యోగక్షేమముల కొఱకును మీ జ్ఞాన, బల, ఐశ్వర్యాది అంశములతో సంకల్పమాత్రమున మీరు ఈ లోకమునందు అవతరించిన మహాత్ములు".

*41.47 (నలుబది ఏడవ శ్లోకము)*

*న హి వాం విషమా దృష్టిః సుహృదోర్జగదాత్మనోః|*

*సమయోః సర్వభూతేషు భజంతం భజతోరపి॥9864॥*

*41.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*

*తావాజ్ఞాపయతం భృత్యం కిమహం కరవాణి వామ్|*

*పుంసోఽత్యనుగ్రహో హ్యేష భవద్భిర్యన్నియుజ్యతే॥9865॥*

"మీరు ఈ అఖిల జగత్తునకు ఆత్మస్వరూపులు, హితైషులు. మిమ్ములను సేవించెడివారిపై మీకుగల అనుగ్రహము అపారము. ఐనను మీరు ఎవ్వరియెడలను ద్వేషభావమును వహింపక సకలప్రాణులపట్లను సమదృష్టినే కలిగియుందురు. నేను మీ సేవకుడను. నేను మీకు ఎట్టి సేవలు చేయవలెనో ఆజ్ఞాపింపుడు. జీవులను ఏదైనను కార్యమునందు నియోగించుటయనగా మీరు వారిని అనుగ్రహించుటయే యగును".

*41.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*

*ఇత్యభిప్రేత్య రాజేంద్ర సుదామా ప్రీతమానసః|*

*శస్తైః సుగంధైః కుసుమైర్మాలా విరచితా దదౌ॥9860॥*

పరీక్షిన్మహారాజా! ఇట్లు విన్నవించిన పిమ్మట సుదాముడు వారి అభిమతములను గ్రహించి, పరిమళభరితములగు పుష్పములతో సిద్ధపఱచబడిన మాలలను మిగుల భక్తిశ్రద్ధలతో ఆ మహానుభావులకు సమర్పించెను.

*41.50 (ఏబదియవ శ్లోకము)*

*తాభిః స్వలంకృతౌ ప్రీతౌ కృష్ణరామౌ సహానుగౌ|*

*ప్రణతాయ ప్రపన్నాయ దదతుర్వరదౌ వరాన్॥9857॥*

సుదాముడు ప్రేమానురాగములతో సమర్పించబడిన పూలమాలలను బలరామకృష్ణులు తమ అనుచరులతో సహా ధరించిరి. అతని సేవలకు వారు మిగుల సంతృప్తులైరి. భక్తులకు కోరిన వరములను ప్రసాదించెడి ఆ మహాపురుషులు తమకు ప్రపత్తితో ప్రణమిల్లిన ఆ సుదామునకు పెక్కు వరములను అనుగ్రహించిరి. 

*41.51 (ఏబది ఒకటవ శ్లోకము)*

*సోఽపి వవ్రేఽచలాం భక్తిం తస్మిన్నేవాఖిలాత్మని|*

*తద్భక్తేషు చ సౌహార్దం భూతేషు చ దయాం పరామ్॥9868॥*

అప్పుడు ఆ మాలాకారుడు కృష్ణప్రభువును ఇట్లు అర్ధించెను- 'స్వామీ సకల చరాచరాత్మకమైన జగత్తునకు ఆత్మస్వరూపుడవైన నీయందు (నీ పాదారవిందములయందు) అచంచలమైన భక్తిని నాకు ప్రసాదింపుము. నేను నీ భక్తులయందు ప్రగాఢమైన మైత్రియు సకల ప్రాణులయెడ అహేతుక దయను కలిగియుండునట్లు అనుగ్రహింపుము,

ఈ సందర్భమున పోతనమహాకవి  రచించిన ఈ పద్యము తెలుగువారి నాల్కలపై నాని నాని, వారి హృదయములలో అమృతపుసోనలను నింపినది.

*కంద పద్యము*

నీ పాద కమల సేవయు , 

నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం

తాపార భూత దయయను ,

తాపస మందార నాకు దయసేయగదే

*భావము*

"ప్రభూ! నీవు తాపసులకు కల్పవృక్షమువంటివాడవు. నీ పాదకమలములను సేవించుచుండెడి భాగ్యమును నాకు ప్రసాదింపుము. నిన్ను సేవించెడి భక్తులతో మైత్రిని అనుగ్రహింపుము (నన్ను నీ దాసానుదాసునిగా ఆదరింపుము). నాకు ప్రాణులయెడలను అపారమైన దయయుండునట్లుగా చూడుము".

(దశమస్కంధము, పూర్వార్ధము)

*41.52 (ఏబది ఒకటవ శ్లోకము)*

*ఇతి తస్మై వరం దత్త్వా శ్రియం చాన్వయవర్ధినీమ్|*

*బలమాయుర్యశఃకాంతిం నిర్జగామ సహాగ్రజః॥9869॥*

ఇట్లు సుదాముడు వేడుకొనగా, అతడు కోరుకొనిన వరములను ఇచ్చుటయేగాక- శ్రీకృష్ణుడు అతనికి వంశాభివృద్ధికరములైన సకలసంపదలను, చక్కని బలమును, దీర్ఘాయువును, యశస్సును, ఘనమైన తేజస్సును ఒసంగెను. పిమ్మట ఆ స్వామి బలరామునితోగూడి అతని గృహమునుండి బయలుదేఱి వెళ్ళెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే పురప్రవేశో నమైకచత్వారింశోఽధ్యాయః (41)*

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి *బలరామకృష్ణులు మథురలో ప్రవేశించుట* యను నలుబది ఒకటవ అధ్యాయము (41)

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[15/02, 04:04] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*817వ నామ మంత్రము* 15.02.2021

*ఓం సత్యవ్రతాయై నమః*

నిత్యము, సత్యమైన పరబ్రహ్మమే ఇష్టముగా గల తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సత్యవ్రతా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం సత్యవ్రతాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు శాంతిసౌఖ్యములు, సిరిసంపదలు, కీర్తిప్రతిష్టలు అనుగ్రహించును. 

పరబ్రహ్మము అంటేనే సత్యము.  అటువంటి పరబ్రహ్మమే ఇష్టముగా గలిగినది పరమేశ్వరి. ఇంకనూ చెప్పాలంటే సత్యవాక్పరి పాలనయందు ఇష్టముగా గలది.  సత్యవాక్పరి పాలకులైన తన భక్తులు కూడా అమ్మవారికి ఇష్టమే. హరిశ్చంద్రుడు విశ్వామిత్రుని ఋణము తీర్చుటకై వారణాసిలో,  కాశీ విశాలాక్షి శక్తి సాక్షిగా తన భార్యాబిడ్డలను విక్రయించాడు.  దొంగతనము నేరముతో రాజు హరిశ్చంద్రుని భార్యకు మరణ దండన విధించగా,  రాజాజ్ఞను  అనుసరించి తనచేతి కరవాలముతో తన భార్య శిరస్సును తానే ఖండింప సిద్ధమయాడు ఆ హరిశ్చంద్రుడు. అతని సత్యసంధతకు ఆ కాశీవిశాలాక్షి సంతసించి హరిశ్చంద్రుని యొక్క పోగొట్టుకున్న రాజ్యము, చనిపోయిన పుత్రుని జీవమును తిరిగి అనుగ్రహించినది ఆ తల్లి కాశీవిశాలక్షీ స్వరూపురాలైన జగన్మాత. సత్యసంధత (సత్యవ్రతము) అనిన అంత ప్రియము గలిగినది పరమేశ్వరి. గనుకనే అమ్మవారు *సత్యవ్రతా* యని అనబడినది. 

పరబ్రహ్మము అంటేనే నిత్యము, సత్యము, అనంతము. వీనిలో సత్యమునకు అత్యంత ప్రాధాన్యత గలదు. గనుక పరబ్రహ్మ స్వరూఫిణియైన జగన్మాతకు సత్యమనిన ఇష్టమైన వ్రతముగా గలది. గనుక పరమేశ్వరి *సత్యవ్రతా* యని అనబడినది.

*పరమేశ్వరి సత్యవ్రతుడను బ్రాహ్మణ స్వరూపురాలు*

*సత్యవ్రతుని కథ*

కోసల దేశములో దేవదతద్తుడనే వేదవేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అన్ని శాస్త్రాలనూ ఆకళింపు చేసికొని, ప్రశాంత జీవనం గుడుపుతూ వచ్చాడు. నగరంలోని సంపన్నుల ఆదరాభిమానాలకు పాత్రుడైన అతనికి సంపదల విషయంలో కూడా ఏ లోటూ లేదు. కాని, సంతానం లేక అసంతృప్తితో అలమటించి పోయేవాడు దేవదత్తుడు.

ఒకనాడు అతడు తనలో తాను విచారించ సాగాడు. ఏ జన్మలోనో తాను చేసిన పాపానికి ఫలితంగా ఈ జన్మలో తనకు సంతానం లేకుండా పోయినదని విలపించాడు. ఆగామి కర్మలను మంత్రానుష్ఠానం చేత, యజ్ఞాదుల చేత, దానధర్నాల చేత అధిగమించవచ్చు. సంచిత కర్మలను దైవప్రార్థనల చేత , తీర్థయాత్ర చేత, పుణ్యకర్మాచరణం చేత, సత్యవాక్పాలనం చేత జయించవచ్చు, కాని ప్రారబ్ధకర్మను ఎంతటి వారికైనా అనుభవింపక తప్పదు కదా ! అనుకుంటూ, ఇంత వరకు పాపఫలాన్ని అనుభవించిన తాను ఇకపై యథావిధిగా యజ్ఞం చేసి సంతాన ప్రాప్తి ని పొంద గలనని సంకల్పించాడు దేవదత్తుడు.

ఒక సుముహూర్తాన దేవదత్తుడు తమసానదీ తీరంలోఒక వేదికను నిర్మించుకొని, వేదవేదాంగ విదులైన బ్రాహ్మణులను పిలిపించి యాగం ప్రారంభించాడు. పుత్రప్రాప్తిని ఆశించి తాను చేస్తున్న యజ్ఞాన్ని తన చేత శాస్త్రోక్తంగా నిర్వహింప చేయవలసినదని, తాను పుష్కలంగా దక్షిణలిచ్చి, సంతోష పెట్టగలనని వేదవిప్రులకు విన్నవించాడు. గోభిలుడు ఉద్గాతగా, బృహస్పతి హూతగా, యాజ్ఞవల్క్యుడు ఆధ్వర్యుడుగా యజ్ఞం ప్రారంభమైంది.

యజ్ఞం జరుగుతూ ఉండగా, ఉద్గాత అయిన గోభిలుడు మంత్రోచ్ఛారణ చేస్తూండగా, మధ్యలో శ్వాస అడ్డువచ్చి స్వరభంగం కలిగింది. దేవదత్తుడు ఎంతో బాధపడి "మహాత్మా ! పుత్రార్థినై నేను చేస్తున్న ఈ యజ్ఞంలో మీరు పలికిన అపస్వరం వల్ల నాకు సత్ఫలితం లేకుండా పోతుంది. నాపై దయతో స్వరభంగం లేకుండా మంత్రోచ్చారణం సాగించండి" అని కోరాడు. దేవదత్తుని మాటలకు గోభిలుడు కోపగించాడు. "శ్వాస పీల్చే వేళలో వచ్చిన స్వరములోని మార్పుని దోషంగా భావించి నన్ను అవమానించావు. ప్రతి ప్రాణికీ ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలు సహజం కదా! అవి మానవ ప్రయత్నం చేత నివారింప బడేవికావు. అయినా. చేయని తప్పును నా పై మోపి నన్ను అవమానించావు. కనుక నీకు పుట్టబోయే కుమారుడు విద్యావిహీనుడై ముర్ఖుడగు గాక!" అని శపించాడు గోభిలుడు.

శాపం వింటూనే దేవదతేతుడు గొల్లున ఏడ్చాడు, జన్మించబోయే కొడుకు మూర్ఖుడైతే, జీవితమంతా దుఃఖమయమే కదా !దేవదత్తుడు ఈ బాధను తట్టుకోలేక

పోయాడు. "మహాత్మా! మీరు ఇలా శపించడం న్యాయమేనా? మూర్ఖుడైన పుత్రుణ్ణి పొందడం కంటే పుత్రులు లేకపోవడం కొంత ఉపశాంతిని కలిగిస్తుంది కదా ! బ్రాహ్మణునికి విద్యయే సర్వస్వం కదా ! విద్యావిహీనుడు, మూడ్ఢుడు అయిన బ్రాహ్మణుడు సర్వత్రా నిరాదరింప బడతాడు కదా ! ప్రపంచంలో మార్ఖత్వం మరణం కంటే నీచమైనది కదా ! కనుక, నాకు పుట్టబోయే పుత్రుడు మూర్ఖుడు కాకుండా మీ శాపాన్ని ఉపసంహరించి, నన్ను అనుగ్రహించండి. " అని ప్రార్థించాడు.

దేవదత్తుని దీనాలాపాలకు గోభిలుని మనస్సు కరిగిపోయింది ఉత్తముని కోపం క్షణకాలమే కదా ! సామాన్యుని కోపం రెండు ఘడియల కాలం ఉంటుంది. అధముని కోపం రోజంతా ఉంటుంది. పాపాత్ముని కోపం జీవితమంతా కొనసాగుతుంది. వేద విద్యా సంస్కారంతో పునీతమైన మనస్సు గల గోభిలుడు దేవదత్తుని వేదనను అర్థం చేసుకున్నాడు. కోపాన్ని వదలి శాంతించాడు. " నా శాపం వల్ల నీ కుమారుడు పుట్టుకతో మూర్ఖుడైనా, తరువాత తప్పక మహావిద్వాంసుడు కాగలడ " ని అభయమిచ్చాడు.

కొంత కాలానికి దేవదత్తునికి కుమారుడు జన్మించాడు. తండ్రి అతనికి ఉత్యథుడని నామకరణం చేశాడు. దేవదత్తుడు కుమారునికి ఉపనయనం చేసి వేదవిద్యలను అధ్యయనం చేయడానికి గురువు వద్దకు పంపించాడు. గురువు ఎంతగా బోధించినా ఉతథ్యునికి విద్య అబ్బలేదు. మూర్ఖుడై అటూ ఇటూ సంచరిస్తూ వృధా కాలయాపన చేయసాగాడు.

అలాగే పన్నెండు సంవత్సరాల కాలం గడిచింది. ఉతథ్యునకు సంధ్యావందనం అలవడలేదు. చదువు అసలే అంటలేదు. వేదవిద్య అతనికి అందని మ్రాని పండే అయింది. ఉతథ్యుణ్ణి చూచి తోటిబాలురు పరిహాసం చేయసాగారు. తల్లిదండ్రులు కూడా ఉతథ్యుని మూర్ఖత్వానికి బాధపడేవారు. ఇలా అందరూ తనను ఏవగించు కోవడం, చులకనగా చూడడం ఉతథ్యుణ్ణి ఆవేదనకు, తర్వాత ఆలోచనకు గురిచేసింది. అతడు ఎవ్వరికీ చెప్పకుండా గంగా తీరానికిచేరి, ఒకచోట కూర్చొని తనలో తాను ఏదో విత్కరించు కోవడం ప్రారంభించాడు. 'నిత్యమూ సత్యమునే పలుకుతాన'ని సంకల్పించి, నిర్జన అరణ్యాలకు బయలుదేరాడు.

ఉతథ్యునిలో నానాటికీ అంతర్మథనం తీవ్రతరం అయింది.

"నన్ను చదివించి విద్యావంతుణ్ణి చేయాలని, నా తల్లిదండ్రులు భావించారు. గురువు కూడా శ్రద్ధతో నాకు విద్యలను బోధించినా, నాకు విద్యాగంధం బొత్తిగా అంటక పోవడం దైవయోగం తప్ప మరేమీ కాదు. బ్రాహ్మణ జన్మ పొంది కూడా నా జీవితం నిరర్థకమైంది పూర్వజన్మలో సరస్వతీ దానంగా ఏ బ్రాహ్మణునికీ నేను గ్రంథాలను దానం చేయలేదేమో! ఎవరి వద్దనైనా పుస్తకాలను తీసుకొని . తిరిగి ఇవ్వకుండా, లోభంతో ప్రవర్తించి. తిరిగి ఇచ్చానని అసత్యం పలికానేమో! సరస్వతీ స్వరూపమైన గ్రంథాలను అగ్నికి ఆహుతి చేశానేమో! సభల్లో పండితులను పరిహసించానేమో! పండితుడనేగర్వంతో ఎవ్వరినీ లెక్కచేయకుండా, ఎవ్వరికీ విద్యా దానము చేయకుండా విఱ్ఱ వీగుతూ, కాలం గడిపి ఉంటాను. ఇదంతా పూర్వజన్మ కర్మయోగం వల్ల జరిగింది. మానవుని సంకల్పం దైవబలంచేత వ్యర్థమవుతుంది. త్రిమూర్తులైనా కాలానికి లొంగి పోవలసిన వారే. సత్యవ్రతము గొప్పదని పెద్దలు చెప్తున్నారు. సత్యవ్రతాన్ని స్వీకరించి, అరణ్యంలో ఏకాంతంగా జీవనం సాగిస్తాను." అని ఉతథ్యుడు తనలో తాను నిర్ణయించుకొన్నాడు.

ఇలా కృతనిశ్చయుడై ఉతథ్యుడు అడవిలో ఏకాంతంగా కాలం గడుపుతూ ఉండగా, ఒకనాడు ఒక బోయవాడు ఒక అడవి పందిని వేటాడుతూ, తరుముకొంటూ వెళ్ళాడు. ఆ సమయంలో ఆ పంది నోటి నుంచి'ఏ' 'ఏ' అను ధ్వని వెలువడగా విని, ఆ శబ్దము వింతగా ఉన్నదను కొని ఉతథ్యుడు ఆశబ్దాన్నే మాటిమాటికీ పలుమారులు ఉచ్చరించాడు.

ఉతథ్యుని సతవ్రత దీక్షను పరీక్షించాలని భావించిన ఆదిపరాశక్తి శివుణ్ణి కిరాతరూపంలో ఉతథ్యుడున్న ప్రదేశానికి పంపించింది. ఆ మాయా కిరాతుడు పందిని తరుముతూ రాగా, పంది ఉతథ్యుని ఎదురుగానే కిరాతుణ్ణి తప్పించుకొని పోయింది. వెనుక వచ్చిన కిరాతుడు పంది జాడ చెప్పి పుణ్యం కట్టుకోమని ఉతథ్యుడు కోరాడు. తనకు, తన కుటుంబానికి ఆకలి తీరి, ప్రాణం నిలవాలంటే పందిని చంపి తినాలని, కనుక, దాని జాడ చెప్పి పుణ్యం కట్టుకొని , తమ ప్రాణాలను రక్షించవలసిందిగా ఆర్థించాడు.

ఉతథ్యుడు మీమాంసలో పడ్డాడు. పందిజాడ చేప్తే , కిరాతుడు ఆ పందిని చంపేస్తాడు. తన సత్యవ్రత దీక్షవల్ల హింస జరుగుతుంది. చెప్పకపోతే తనకు అసత్యదోషం సంక్రమిస్తుంది. సత్యవ్రతాన్ని పాటిస్తే ప్రాణిహింస జరుగుతుంది. అహింసకు ప్రాధాన్యమిస్తే సత్యవ్రతం భంగమవుతుంది. ఉతథ్యునికి కర్తవ్యం

స్ఫురించలేదు. ఒక్కక్షణం ఆలోచించి" ఓయీ! కిరాతుడా !వరాహం జాడ చెప్పమంచున్నావు కదా! చూచేది కన్ను. దానికి చెప్పే శక్తిలేదు. పలికేది నోరు. దానికి చూడగల లక్షణం లేదు. చూచేది ఒకరు, చెప్పేది మఱొకరు. అందువల్ల నీకు లాభంలేదు. "అన్నాడు అతని సత్యవ్రత దీక్షకు కిరాతరూపంలో ఉన్న పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహించాడు. పరాశక్తి ఆరాధనకు సంబంధించిన వాగ్భవ బీజమైన "ఐ" అను అక్షరములోని అర్థభాగమైన 'ఏ' 'ఏ' అను ధ్వనిని పలుమార్లు ఉచ్చరించిన పుణ్యఫలంగా ఉతథ్యునికి వాగ్భాప బీజాన్ని సంపూర్ణంగా అనుగ్రహించి ఆశీర్వదించి, అంతర్థాన మయ్యాడు పరమేశ్వరుడు.

ఉతథ్యుడు జగన్మాతను వాగ్భవ బీజంతో ఆరాధించి, ఆమె కరుణా కిరమ ప్రసారంచేత "సత్యవ్రతుడు"గా ప్రఖ్యాతిని పొంది, మహా విద్వాంసుడై పరమేశ్వరీ పరిపూర్ణ కృపకు పాత్రుడయ్యాడు.

పరాశక్తి మంత్రాక్షరంలో అర్థబాగాన్ని తెలియకుండా ఉచ్ఛరించిన మాత్రాననే ఆమో అనుగ్రహం కలిగినపుడు, సంపూర్ణంగా యథావిథిగా దేవి మంత్రాక్షరాలను జపిస్తే కలిగే సత్ఫలితం ఎంతటిదో ఆలోచించ వలసినదని సూతుడు శౌనకాది మహామునులకు వివరించాడు.

సత్యవ్రతుని కథను చదివినా , విన్నా పరమేశ్వరి అనుగ్రహం వల్ల అలాంటి వారికి పాండిత్యం ఆలోచనా శక్తి కలుగుతాయని ఫలశ్రుతి ని

అనుగ్రహిస్తూ సూతుల వారు ఈ ఉపఖ్యానాన్ని ముగించారు.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సత్యవ్రతాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాదభూ పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[15/02, 04:04] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*242వ నామ మంత్రము* 15.02.2021

*ఓం చారుహాసాయై నమః*

శరత్కాల పున్నమి బింబము వంటి ముఖ సౌందర్యమున మనోహరమైన మందహాసముతో తేజరిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *చారుహాసా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం చారుహాసాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు, ఆ తల్లి వారి జీవితమంతయు ఆనందమయముగా, పరమానందభరితముగా అనుగ్రహించును.

శరత్కాల పున్నమినాటి చంద్రబింబము వంటి శ్రీమాత ముఖబింబములో పగడముల మరియు దొండపండ్ల నూతన కాంతులు గలిగిన పెదవుల నుండి వెడలు మనోహర మందహాసముతో  పరమేశ్వరి తేజరిల్లుచున్నది. అందుకే అమ్మవారు *చారుహాసా* (మనోహరమైన మందహాసము గలిగినది) యని అనబడినది.

ఆ సుందర వదనం నుండి వెలువడే దరహాస చంద్రికలు భక్తులకు మోక్షానందమును గలిగించును.

28వ నామ మంత్రము *మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా* అవధులు లేని ఆ దరహాస చంద్రికల   కాంతిప్రవాహంలో కామేశ్వరుని (పరమేశ్వరుని) మనసుకూడా దోచుకున్నది.

ఆ తల్లి చిరునవ్వులు సామాన్యుని భక్తినిగాను, ఆ భక్తిని తన్మయునిగాను, ఆ తన్మయత్వంలో బ్రహ్మానందానుభూతులుగాను చేయును. గనుకనే అమ్మవారు *చారుహాసా* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం చారుహాసాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[15/02, 04:04] +91 95058 13235: *15.2.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది రెండవ అధ్యాయము*

*శ్రీకృష్ణుడు కుబ్జపై దయజూపుట - ధనుస్సును విరచి, రక్షకభటులను హతమార్చుట - కంసుడు ఆందోళనకు గురియగుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*

*42.1 (ప్రథమ శ్లోకము)*

*అథ వ్రజన్ రాజపథేన మాధవః స్త్రియం గృహీతాంగవిలేపభాజనామ్|*

*విలోక్య కుబ్జాం యువతీం వరాననాం పప్రచ్ఛ యాంతీం ప్రహసన్ రసప్రదః॥9870॥*

*శ్రీశుకుడు చెప్పెను* పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు సుదాముని అనుగ్రహించిన పిమ్మట ఆత్మీయులతోగూడి రాజమార్గమున సాగిపోవుచుండెను. అప్పుడు ఆ స్వామి ఒకయువతిని జూచెను. ఆమె ముఖము సుందరముగా నుండెను. కాని, ఆమె గూని కలిగి యుండుటవలన *కుబ్జ* అను పేరుతో పిలువబడుచుండెను. ఆమె  తన చేతులలో చందనాది అనులేపన ద్రవ్యములుగల పాత్రలను పట్టుకొని పోవుచుండెను. సకలప్రాణులపై కరుణరసమును ప్రసరింపచేయుచుండెడి ఆ కృష్ణప్రభువు ఆమెపై కృపజూపుటకై నవ్వుచు ఇట్లు ప్రశ్నించెను.

*42.2 (రెండవ శ్లోకము)*

*కా త్వం వరోర్వేతదు హానులేపనం కస్యాంగనే వా కథయస్వ సాధు నః|*

*దేహ్యావయోరంగవిలేపముత్తమం శ్రేయస్తతస్తే న చిరాద్భవిష్యతి॥9871॥*

"సుందరీ! నీవు ఎవరు? ఈ చందనానులేపనములను ఎవరి కొఱకు తీసికొని వెళ్ళుచున్నావు? యథార్థమును తెలుపుము. మేలైన ఈ అంగరాగములను మా ఇరువురికిని ఇమ్ము. ఇచ్చితివేని త్వరలోనే నీకు మిగుల శ్రేయస్సు కలుగును".

*సైరంధ్ర్యువాచ*

*42.3 (మూడవ శ్లోకము)*

*దాస్యస్మ్యహం సుందర కంససమ్మతా త్రివక్రనామా హ్యనులేపకర్మణి|*

*మద్భావితం భోజపతేరతిప్రియం వినా యువాం కోఽన్యతమస్తదర్హతి॥9872॥*

*అంతట కుబ్జ ఇట్లనెను* "సుందరా! నేను కంసుని దాసిని. నన్ను *త్రివక్ర* అని యందురు. నేను అనులేపనములను అలదుటకై నియమింపబడితిని. నేను సిద్ధపఱచిన చందనాది - అంగరాగద్రవములనిన కంసునకు మిక్కిలి ఇష్టము. అందువలన ఆ రాజు నన్ను ఎంతగానో ఆదరించును. ఈ అంగలేపనములను అలదుకొనుటకు నిజముగా మీరే అర్హులు".

*42.4 (నాలుగవ శ్లోకము)*

*రూపపేశలమాధుర్యహసితాలాపవీక్షితైః|*

*ధర్షితాత్మా దదౌ సాంద్రముభయోరనులేపనమ్॥9873॥*

శ్రీకృష్ణుని రూపవైభవమునకును, సౌకుమార్యమునకును, రసికత్వమునకును, సుందర మందహాసమునకును, మధురాలాపములకును, ఆకర్షణీయమైన చూపులకును ఆ కుబ్జ ముగ్ధురాలయ్యెను. వెంటనే ఆమె మనస్సు కృష్ణపరమయ్యెను. అంతట ఆమె చొక్కమైన (మనోహరమైన)  ఆ అనులేపనములను ఆ ఉభయులకును సమర్పించెను.

*42.5 (ఐదవ శ్లోకము)*

*తతస్తావంగరాగేణ స్వవర్ణేతరశోభినా|*

*సంప్రాప్తపరభాగేన శుశుభాతేఽనురంజితౌ॥9874॥*

పిమ్మట వారు ఆ మైపూతలను నాభికి పైభాగమునగల వక్షస్థలాది అంగములయందు అలదుకొనిరి. శ్రీకృష్ణుడు శ్యామవర్ణశోభితమైన తన శరీరముపై పసుపుపచ్చని అంగరాగములను, బలరాముడు శ్వేతవర్ణరంజితమైన తన దేహముపై ఎర్రని అనులేపనములను పూసికొని తేజరిల్లిరి.

*42.6  (ఆరవ శ్లోకము)*

*ప్రసన్నో భగవాన్ కుబ్జాం త్రివక్రాం రుచిరాననామ్|*

*ఋజ్వీం కర్తుం మనశ్చక్రే దర్శయన్ దర్శనే ఫలమ్॥9875॥*

అనులేపనములను సమర్పించిన కుబ్జపై కృష్ణభగవానుడు ప్రసన్నుడయ్యెను. తనను దర్శించినందులకు ప్రత్యక్ష ఫలమును ప్రసాదించుటకై వంకరలు తిరిగియున్న (మువ్వంకలతోనున్న) ఆమె దేహమును చక్కజేయుటకై (సర్వాంగసుందరముగా చేయుటకై) ఆ ప్రభువు నిశ్చయించుకొనెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[15/02, 21:24] +91 95058 13235: *15.2.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది రెండవ అధ్యాయము*

*శ్రీకృష్ణుడు కుబ్జపై దయజూపుట - ధనుస్సును విరచి, రక్షకభటులను హతమార్చుట - కంసుడు ఆందోళనకు గురియగుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*42.7  (ఏడవ శ్లోకము)*

*పద్భ్యామాక్రమ్య ప్రపదే ద్వ్యంగుల్యుత్తానపాణినా|*

*ప్రగృహ్య చిబుకేఽధ్యాత్మముదనీనమదచ్యుతః॥9876॥*

*42.8  (ఎనిమిదవ శ్లోకము)*

*సా తదర్జుసమానాంగీ బృహచ్ఛ్రోణిపయోధరా|*

*ముకుందస్పర్శనాత్సద్యో బభూవ ప్రమదోత్తమా॥9877॥*

పిమ్మట ఆ స్వామి ఆమె యొక్క రెండు పాదాగ్రములను తన పాదములతో అదిమిపట్టి, ఆమె చిబుకము (గడ్డము) క్రింద తన రెండు వ్రేళ్ళను చేర్చి, మీదికెత్తెను. అట్లు ప్రేమను, ముక్తిని అనుగ్రహించే శ్రీకృష్ణభగవానుని కరస్పర్శతో పైకెత్తబడగనే వంకరలు అన్నియును తొలగిపోయి, అవయవములు పూర్తిగా చక్కబడి ఆమె ఒక యువతీ లలామగా రూపొందెను. అంతట ఆమె కటి సౌందర్యము ఇనుమడించెను. వక్షస్థల వైభవము ఇంపెసలారెను.

*42.9 (తొమ్మిదవ శ్లోకము)*

*తతో రూపగుణౌదార్యసంపన్నా ప్రాహ కేశవమ్|*

*ఉత్తరీయాంతమకృష్య స్మయంతీ జాతహృచ్ఛయా॥9878॥*

ఒక్క క్షణములో కుబ్జయొక్క రూపలావణ్యములు మిక్కిలి మనోహరములయ్యెను. నడకలలో, చూపులలో అందములు చిందెను. అంతట ఆ సుందరి శ్రీకృష్ణునిపై మఱులుగొని, ఆ స్వామియొక్క ఉత్తరీయాంచలమును పట్టుకొని లాగుచు దరహాసముతో ఇట్లనెను-

*42.10 (పదియవ శ్లోకము)*

*ఏహి వీర గృహం యామో న త్వాం త్యక్తుమిహోత్సహే|*

*త్వయోన్మథితచిత్తాయాః ప్రసీద పురుషర్షభ॥9879॥*

"మహావీరా! మా ఇంటికి వెళ్ళుదము రమ్ము. నిన్ను ఇచట విడిచి వెళ్ళుటకు నా మనస్సొప్పుటలేదు. నీవు నా చిత్తమును కలవరపెట్టితివి (నిన్ను దర్శించినంతగా నా మనస్సు వశము తప్పినది). పురుషోత్తమా! నన్ను అనుగ్రహింపుము".

*42.11  (పదకొండవ శ్లోకము)*

*ఏవం స్త్రియా యాచ్యమానః కృష్ణో రామస్య పశ్యతః|*

*ముఖం వీక్ష్యానుగానాం చ ప్రహసంస్తామువాచ హ॥9880॥*

బలరాముని సమక్షమున ఆ తరుణి తనను ఇట్లు అర్థించుచుండగా, శ్రీకృష్ణుడు తన అగ్రజుని, తన అనుయాయులు ముఖములను గాంచి, దరహాస మొనర్చుచు ఆమెతో ఇట్లువచించెను.

*42.12 (పండ్రెండవ శ్లోకము)*

*ఏష్యామి తే గృహం సుభ్రూః పుంసామాధివికర్శనమ్|*

*సాధితార్థోఽగృహాణాం నః పాంథానాం త్వం పరాయణమ్॥9881॥*

"సుందరవదనా! నేను వచ్చిన పని పూర్తియైన పిమ్మట నీ ఇంటికి తప్పక వచ్చెదను. నీ గృహము సాంసారిక బాధలను గుఱియైన పురుషులయొక్క మనస్తాపములను తొలగించునట్టిది. ఇండ్లు వాకిండ్లను వీడి వచ్చిన మావంటి బాటసారులకు మీ వదనమే ఆశ్రయమేగదా!

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[16/02, 04:19] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*243వ నామ మంత్రము*  16.02.2021

*ఓం చారుచంద్ర కళాధరాయై నమః*

వృద్ధి క్షయాలు లేని,   జ్ఞానరూపమైన, సొగసైన చంద్రకళను (చంద్రరేఖను) ధరించియున్న లలితాంబకు నమస్కారములు.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *చారుచంద్రకళాధరా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం చారుచంద్ర కళాధరాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకులకు ఆ తల్లి కరుణచే సర్వకామములను నెరవేర్చును మరియు జన్మరాహిత్యమైన మోక్షసాధనకు దీక్షాదక్షతను అనుగ్రహించును.

చంద్రుని కళలు శుక్లపక్షములో పాడ్యమి నుండి క్రమముగా వృద్ధిచెందుచూ, పూర్ణిమ నాడు సంపూర్ణమైన చంద్రబింబము కనిపించును.  దీనిని శుక్లపక్షమనియు, పూర్ణిమ నుండి క్రమముగా ఆ చంద్రకళలు క్షయమవుతూ అమావాస్య నాటికి చంద్రబింబమే కనబడని స్థితికి వచ్చును. దీనిని కృష్ణపక్షమందురు. ఈ విధమైన వృద్ధిక్షయములు లేని చైతన్యస్వరూపమైన సాదాఖ్య (సదా ఉండునది అను పేరు గలది) అగు చంద్రకళను పరమేశ్వరి ధరించి ఉంటుంది. ఆ చంద్రకళ మనోహరమైనదిగా ఉంటుంది. పైగా పరమేశ్వరి ధరించి యుండుటచే ఆ చంద్రకళ మరింత మనోహరమై ఒప్పుతుంది. గనుకనే శ్రీమాత *చారుచంద్రకళాధరా* యని అనబడినది. దేవీభాగవతములో "కాశీరాజుకు *చంద్రకళ* అను కుమార్తె గలదు. ఆమెకు స్వప్నములో అమ్మవారు సాక్షాత్కరించి, *ఓ కన్యకా! నీవు కామరాజబీజము ఉపాసించుము. అందగాడు, శౌర్యవంతుడు, మిగుల పరాక్రమవంతుడు అయిన సుదర్శనుడు అను రాజకుమారుడు  భర్తగా లభిస్తాడు* అని చెప్పినది"  అని గలదు. ఆవిధంగా  సౌందర్యవతి *(చారు)* కాశీరాజు కుమార్తె అయిన *చంద్రకళ* కు, తగినవాడైన భర్త లభించుటకు *ఆధార* భూతురాలు అయిన కారణముచే జగన్మాత *చారుచంద్రకళాధరా* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *చారుచంద్ర కళాధరాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[16/02, 04:19] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*818వ నామ మంత్రము* 16.02.2021

*ఓం సత్యరూపాయై నమః*

త్రికాలములయందును ఒకేతీరున సత్యస్వరూపురాలై యుండు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సత్యరూపా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం సత్యరూపాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ శ్రీమాతను భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి ఆయురారోగ్యములు, సిరిసంపదలు, శాంతిసౌఖ్యములు ప్రసాదించును.

పరమేశ్వరి ఎల్లపుడును అనగా త్రికాలములయందును ఒకేతీరున ఉంటుంది. కారణమేమంటే ఆ తల్లి పరబ్రహ్మస్వరూపురాలు.

పరమేశ్వరి జీవకోటియందంతటనూ ఉన్నది. సత్యమునకు ఎచట రూపముండునో అచట జగన్మాత ఉన్నది.

సత్యహరిశ్చంద్రుడు సత్యమునకై సర్వస్వమును కోల్పోయాడు. అతనిని అనేక విధములుగా పరీక్షించి చివరకు వారణాసిలో, కాశీవిశాలాక్షిగా అతని సత్యసంధతకు  అంతిమ పరీక్షపెట్టి హరిశ్చంద్రుడు కోల్పోయిన దంతయు (భార్యాబిడ్డలతో సహా) తిరిగి ఇచ్చివేసెను. 

హరిశ్చంద్రుడు మూర్తీభవించిన *సత్యము*

శ్రీరాముడు పితృవాక్పరిపాలకుడై మూర్తీభవించిన *సత్యము*

సత్యం పలకడం వల్ల తాత్కాలిక కష్టాలు ఎదురైనా చివరికి విజయం మాత్రం తథ్యం. అసత్యవాది క్షణిక సుఖాలను, భోగాలను అనుభవించవచ్చును. అది కొన్నాళ్ళు మాత్రమే. చివరకు వారు కష్టాలపాలు పడక తప్పదు.

మహాభారతంలో శకుంతలో పాఖ్యానంలో సత్యాన్ని గురించి నన్నయ గారు ఒక మంచి పద్యం చెప్పడం జరిగింది.

మంచి నీటితో నిండిన నూతులు వంద కంటే ఒక బావి మంచిది. అలాంటి వంద బావుల కంటే ఒక మంచి క్రతువు మేలు. అలాంటి వంద క్రతువుల కంటే ఒక మంచి కొడుకు చాలు. అలాంటి వందమంది కొడుకుల కంటే ఒక సత్య వాక్యం మేలు అని నిజానికి ఉన్న గొప్పదనాన్ని వివరించాడు. అని శకుంతల దుష్యంతునికి సత్యవాక్పరిపాలన గురించి వివరిస్తుంది.

ఎక్కడైతే సత్యం ఉన్నదో అక్కడ అమ్మవారు ఉంటుంది గనుక పరమేశ్వరి *సత్యరూపా* యని అనబడినది.

అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సత్యరూపాయై నమః* 

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[[16/02, 04:19] +91 95058 13235: *16.2.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది రెండవ అధ్యాయము*

*శ్రీకృష్ణుడు కుబ్జపై దయజూపుట - ధనుస్సును విరచి, రక్షకభటులను హతమార్చుట - కంసుడు ఆందోళనకు గురియగుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*42.13 (పదమూడవ శ్లోకము)*

*విసృజ్య మాధ్వ్యా వాణ్యా తాం వ్రజన్ మార్గే వణిక్పథైః|*

*నానోపాయనతాంబూలస్రగ్గంధైః సాగ్రజోఽర్చితః॥9882॥*

కృష్ణప్రభువు మృదుమధుర వచనములతో సమాధానపఱచి ఆమెను వీడ్కొనెను. పిదప ఆ స్వామి తన వారితోగూడి రాజమార్గమున వెళ్ళుచుండగా వ్యాపారులు వివిధములగు కానుకలను, చందన, తాంబూలములను, పూలమాలలను సమర్పించి, బలరామకృష్ణులను అర్చించిరి.

*42.14 (పదమూడవ శ్లోకము)*

*తద్దర్శనస్మరక్షోభాదాత్మానం నావిదన్ స్త్రియః|*

*విస్రస్తవాసఃకబరవలయాలేఖ్యమూర్తయః॥9883॥*

శ్రీకృష్ణుని దర్శనమైనంతనే నగరభామినుల మనస్సులు ఆ స్వామిపట్ల ఆకర్షింపబడెను. అంతట వారు తమను తాము మఱచిపోయిరి. ఆ పారవశ్యములో  వారి వస్త్రములు, కొప్పుముడులు, కంకణములు సడలిపోసాగెను. అప్పుడు వారు చిత్తరవులవలె ఎక్కడివారక్కడ నిశ్చేష్టలై ఉండిపోయిరి.

*42.15 (పదునైదవ శ్లోకము)*

*తతః పౌరాన్ పృచ్ఛమానో ధనుషః స్థానమచ్యుతః|*

*తస్మిన్ ప్రవిష్టో దదృశే ధనురైంద్రమివాద్భుతమ్॥9884॥*

*42.16 (పదహారవ శ్లోకము)*

*పురుషైర్బహుభిర్గుప్తమర్చితం పరమర్ద్ధిమత్|*

*వార్యమాణో నృభిః కృష్ణః ప్రసహ్య ధనురాదదే॥9885॥*

అనంతరము శ్రీకృష్ణుడు పౌరులద్వారా ధనుర్యాగ స్థానమును తెలిసికొని అందు ప్రవేశించెను. అచట ఆ స్వామి ఇంద్రధనుస్సువలె అద్భుతమైన ఒక వింటిని చూచెను. స్వర్ణాలంకార శోభితమైన ఆ ధనుస్సును కొందఱు పురుషులు పూజించుచుండిరి. పెక్కుమంది యోధులు కడు జాగరూకులై దానిని రక్షించుచుండిరి.  రక్షకభటులు వారించుచున్నను వారిని లెక్కసేయక శ్రీకృష్ణుడు బలప్రయోగముతో దానిని తన చేతిలోనికి తీసికొనెను.

*42.17 (పదిహేడవ శ్లోకము)*

*కరేణ వామేన సలీలముద్ధృతం  సజ్యం చ కృత్వా నిమిషేణ పశ్యతామ్|*

*నృణాం వికృష్య ప్రబభంజ మధ్యతో యథేక్షుదండం మదకర్యురుక్రమః॥9886॥*

పిమ్మట ఆ ప్రభువు తన వామహస్తముతో దానిని అవలీలగా పైకెత్తి, అచటి జనులందఱును చూచుచుండగనే వింటినారిని సంధించెను. ఒక్కనిమిషములో ఆ స్వామి ఆ అల్లెత్రాడును లాగి, బలమైన మదపుటేనుగు చెఱకుగడను వలె, ఆ ధనుస్సును రెండు ముక్కలు గావించెను.

*42.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*ధనుషో భజ్యమానస్య శబ్దః ఖం రోదసీ దిశః|*

*పూరయామాస యం శ్రుత్వా కంసస్త్రాసముపాగమత్॥9887॥*

కృష్ణభగవానుడు ఆ ధనుస్సును విఱిచివేయునప్పుడు ఏర్పడిన శబ్దము ఆకాశమునందును, అంతరిక్షమునందును, సకల దిక్కులయందును నిండెను. ఆ ధ్వని చెవుల సోకినంతనే కంసుడు భయముతో వణకిపోయెను.

*42.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*తద్రక్షిణః సానుచరాః కుపితా ఆతతాయినః|*

*గ్రహీతుకామా ఆవవ్రుర్గృహ్యతాం వధ్యతామితి॥9988॥*

ఆ ధనుస్సును రక్షించుచున్న యోధులును, వారి అనుచరులును మిగుల కుపితులైరి. పిమ్మట వారు బలరామకష్ణులను హింసింపదలచి సాయుధులై  'పట్టుకొనుడు, బంధింపుడు' అని కేకలు పెట్టుచు, వారిని చుట్టుముట్టిరి.

*42.20 (ఇరువదియవ శ్లోకము)*

*అథ తాన్ దురభిప్రాయాన్ విలోక్య బలకేశవౌ|*

*క్రుద్ధౌ ధన్వన ఆదాయ శకలే తాంశ్చ జఘ్నతుః॥9889॥*

అంతట బలరామకృష్ణులు తమను చంపుటకై ఉద్యుక్తులైన ఆ రాజభటులయొక్క దుడుకుచేష్టలను గమనించి క్రుద్ధులైరి. వెంటనే వారు అచట విఱిగిపడియున్న ధనుస్సుయొక్క ముక్కలను చేబూని, వాటితో ఆ యోధులను చావమోదిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[16/02, 20:42] +91 95058 13235: *16.2.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది రెండవ అధ్యాయము*

*శ్రీకృష్ణుడు కుబ్జపై దయజూపుట - ధనుస్సును విరచి, రక్షకభటులను హతమార్చుట - కంసుడు ఆందోళనకు గురియగుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️

*42.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*బలం చ కంసప్రహితం హత్వా శాలాముఖాత్తతః*

*నిష్క్రమ్య చేరతుర్హృష్టౌ నిరీక్ష్య పురసంపదః॥9890॥*

ఆ సమయమున రక్షకభటులకు తోడుగా నిలుచుటకై కంసప్రేరణతో  వచ్చిన యోధులను గూడ ఆ యదువీరులు హతమార్చిరి. పిదప వారు యజ్ఞశాల ప్రధాన ద్వారమునుండి బయటికి వచ్చి, మిగుల సంతోషముతో మథురాపుర శోభలను గాంచుచు సంచరించిరి.

 *42.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*తయోస్తదద్భుతం వీర్యం నిశామ్య పురవాసినః|*

*తేజః ప్రాగల్భ్యం రూపం చ మేనిరే విబుధోత్తమౌ॥9891॥*

అప్పుడు పురవాసులు అందఱును ఆ మహాపురుషుల యొక్క అద్భుత శౌర్య పరాక్రమములను గూర్చి విని ఎంతయు ఆశ్చర్యపడిరి. పిమ్మట వారు ఆ యదువీరుల యొక్క పటిమను, ధైర్యసాహసములను, నిరుపమాన రూప వైభవములను చూచి, 'వీరు మానవమాత్రులుగారు, దైవాంశ సంభూతులే' అని తలపోసిరి.

 *42.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*తయోర్విచరతోః స్వైరమాదిత్యోఽస్తముపేయివాన్|*

*కృష్ణరామౌ వృతౌ గోపైః పురాచ్ఛకటమీయతుః॥9892॥*

ఆ సోదరులు ఇరువురు నగర వీథులలో స్వేచ్ఛగా సంచరించుచుండిరి. ఇంతలో సూర్యుడు అస్తమించెను. అంతట బలరామకృష్ణులు తోడిగోపాలురతో గూడి నగరమునకు వెలుపల నందాదులు విశ్రమించుచున్న తమ బండ్లకడకు చేరిరి.

 *42.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*గోప్యో ముకుందవిగమే విరహాతురా యాః ఆశాసతాశిష ఋతా మధుపుర్యభూవన్|*

*సంపశ్యతాం పురుషభూషణగాత్రలక్ష్మీం  హిత్వేతరాన్ ను భజతశ్చకమేఽయనం శ్రీః॥9883॥*

పొంకమైన శరీరాంగముల వైభవమును బట్టి లక్ష్మీదేవి జగదేకసుందరి. ఆమె సౌందర్యాతిశయమునకు ముగ్ధులైన బ్రహ్మాదిదేవతలు 'ఆమె తమకు దక్కిన బాగుండును' అని ఎంతగానో కోరికపడిరి. కాని ఆ లక్ష్మీదేవి మాత్రము ఆ శ్రీహరియొక్క సర్వాంగరూప వైభవమునకు ఆకర్షితురాలై ఆ పురుషోత్తముని వరించినది. అనగా శ్రీహరియొక్క లోకాతీతమైన అవయవ సౌభాగ్యము అతిలోక లావణ్యవతియైన లక్ష్మీదేవిని గూడ ముగ్ధురాలిని చేసినదన్నమాట. అట్టి  పరమపురుషుని యొక్క అపురూప సౌభాగ్యములను గాంచుచు ఆనందించెడి భాగ్యము అబ్బుట పెక్కుజన్మల తపఃఫలముగాక మఱేమగును. ఈ విషయమును గూర్చియే శ్రీకృష్ణుడు గోకులమును వీడి మథురకు వచ్చుచున్నప్పుడు విరహాతురలైన గోపికలు ఇట్లు అనుకొనిరి. "రేపటి సుప్రభాతము మథురానగరవాసులకు సుఖావహము కాగలదు". గోపికలు నాడు పలికిన మాటలు నేడు సత్యములైనవి. ఏలయన మథురవాసులు శ్రీకృష్ణుని సౌందర్యమాధుర్యములను తనివిదీర ఆస్వాదించుచు పరమానందభరితులైరి.

 *42.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*అవనిక్తాంఘ్రియుగలౌ భుక్త్వా క్షీరోపసేచనమ్|*

*ఊషతుస్తాం సుఖం రాత్రిం జ్ఞాత్వా కంసచికీర్షితమ్॥9894॥*

విడుదులకు చేరిన పిమ్మట బలరామకృష్ణులు పాదములను,హస్తములను ప్రక్షాళనమొనర్చుకొని, పాయసాన్నములవంటి ఆహారమును ఆరగించిరి. మఱునాడు కంసుడు చేయదలచిన పన్నుగడలను గూర్చి ఎఱింగి, వారు ఆ రాత్రి సుఖముగా గడపిరి.

 *42.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*కంసస్తు ధనుషో భంగం రక్షిణాం స్వబలస్య చ|*

*వధం నిశమ్య గోవిందరామవిక్రీడితం పరమ్॥9895॥*

 *42.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*దీర్ఘప్రజాగరో భీతో దుర్నిమిత్తాని దుర్మతిః|*

*బహూన్యచష్టోభయథా మృత్యోర్దౌత్యకరాణి చ॥9896॥*

బలరామకృష్ణులు అవలీలగా ధనుస్సును విఱిచిన విషయములను, దాని రక్షణకై తాను పంపిన యోధులను వధించిన సంగతులను కంసునకు తెలియవచ్చెను. ఆ యదువీరుల బలపరాక్రమములకు అతడు ఎంతయు భీతిల్లెను. దుశ్చింతలలో మునిగియున్న ఆ దుష్టునకు నిద్రయే కఱవయ్యెను. కనులు మూసినను, తెరచినను మృత్యుసూచకములైన పెక్కు అపశకునములు గోచరింపసాగెను.

 *42.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*అదర్శనం స్వశిరసః ప్రతిరూపే చ సత్యపి|*

*అసత్యపి ద్వితీయే చ ద్వైరూప్యం జ్యోతిషాం తథా॥9897॥*

నీళ్ళలోను, అద్దమునందును చూచుకొనినప్పుడు వాని ప్రతిబింబమునందు అతనికి శిరస్సు లేకుండ మొండెము మాత్రమే కనబడుచుండెను. ఆకాశమున చంద్రుడు ఒక్కడే ఉన్నప్పటికిని ఇద్దఱుగా గోచరించుచుండెను. అట్లే ప్రతి నక్షత్రము రెండుగా కనబడసాగెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[17/02, 04:35] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*244వ నామ మంత్రము* 17.02.2021

*ఓం చరాచర జగన్నాథాయై నమః*

స్థావరజంగమాత్మకమగు జగత్తుకు స్వామినియై విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *చరాచరజగన్నాథా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం చరాచరజగన్నాథాయై నమః* అని ఉచ్చరించుచు, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు భక్తులను ఆతల్లి కరుణించి సుఖశాంతులతో జీవించునటులును, సదా పరమాత్మ నామస్మరణతో తరించునటులును అనుగ్రహించును.

ఈ సృష్టిలో జంగమములు అనగా కదలునవి (చరించునవి), స్థావరములు (కదలనివి లేక చరించలేనివి) అని  రెండు విధములైనవిగా జగత్తునందు గలవు. పర్వతములు, రాళ్ళు ఇలాంటివి కదలవు. కాని ఒకప్పుడు పర్వతములు కదలుతుండెడివి అని  పురాణగాథ కలదు. పూర్వము కృతయుగమున పర్వతములకు అన్నింటికి ఱెక్కలు కలిగి ఉండెను. అప్పుడు అవి ఎల్లయెడల అతిరయముతో తిరుగుచు ఉండినందున ప్రాణులకు మిక్కిలి భయము కలుగుచు ఉండెను. అది నిలుపుటకై ఇంద్రుఁడు తన వజ్రాయుధముచే పర్వతముల ఱెక్కలు తెగకొట్టసాగెను. ఆసమయమున వాయుదేవుని సాహాయమువలన మైనాకుఁడు అసు పర్వతము  తప్పించుకొని పోయి సముద్రములో దాగుకొనెను.

పక్షులు, జంతువులు, మానవజాతి అనేది జంగమములు. అనగా కదలునవి. అయితే వృక్షములు కదలకపోయినను, భూమిలో తమ వ్రేళ్ళను నీరు, పోషకపదార్థముల కొఱకు వ్యాపింపజేసుకుంటాయి గనుక వీటిని స్థావరములు అనడానికి వీలులేదు. ఈ విధంగా జగత్తును స్థావరజంగమాత్మకమైన జగత్తు అందురు. ఇదే చరాచరజగత్తు అని కూడా అంటాము.ఇటు చరాచరజగత్తునకు పరమేశ్వరి సృష్టికర్త. నాథురాలు. గనుక పరమేశ్వరి *చరాచరజగన్నాథా* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం చరాచరజగన్నాథాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[17/02, 04:35] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*819వ నామ మంత్రము* 17.02.2021

*ఓం సర్వాంతర్యామిన్యై నమః*

సర్వజీవులలో వసిస్తూ ఇంద్రియ-అంతఃకరణాలను నియమించు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సర్వాంతర్యామినీ* యను ఆరక్షరముల (షడాక్షరీ) నామ మంత్రమును *ఓం సర్వాంతర్యామిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు సాధకులకు ఆ తల్లి వెన్నంటి ఉంటూ, ఏవిధమైన కష్టములు కలుగకుండా, సర్వము మంగళప్రదముగా యగునట్లుగా అనుగ్రహించుచుండును.

పరమేశ్వరి జగత్తునందు ఇందుగలదందులేదని సందేహము వలదన్నట్లు జీవకోటిలో ఉంటూ, జీవుల రక్షణభారాన్ని వహిస్తూ ఉంటుంది. అమ్మవారు పరమాత్మ. జీవులను సృష్టించునది తానే. ఆ జీవకోటి ఆత్మగా వసించునదిగూడా తానే. *ఈ ఆత్మ అంతర్యామి. ఈ ఆత్మయే అంతటికి కారణభూతుడు* అని మాండూక్యోపనిషత్తులో చెప్పబడినది. *పాంచభౌతికస్వరూపమైన జగత్తును సృష్టించి, ఆ జగత్తునందు  ప్రవేశించి మూర్తముగాను (స్థూలముగాను), పరమాత్మగా (సూక్ష్మముగాను) అమూర్తముగాను    విలసిల్లినది* అని వేదమునందు చెప్పబడినది. *సమస్తము ఎల్లప్పుడు తెలిసికొనుటవలనను, సత్యాసత్య రూపమగు సమస్తము యొక్క ఉత్పత్తి ప్రళయములను చేయుటవలనను సర్వాత్మురాలు* అని స్మృతియందు చెప్పబడియుండుటచే *సర్వాంతర్యామినీ* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపడు *ఓం సర్వాంతర్యామిన్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[17/02, 04:35] +91 95058 13235: *17.2.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది రెండవ అధ్యాయము*

*శ్రీకృష్ణుడు కుబ్జపై దయజూపుట - ధనుస్సును విరచి, రక్షకభటులను హతమార్చుట - కంసుడు ఆందోళనకు గురియగుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*42.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*ఛిద్రప్రతీతిశ్ఛాయాయాం ప్రాణఘోషానుపశ్రుతిః|*

*స్వర్ణప్రతీతిర్వృక్షేషు స్వపదానామదర్శనమ్॥9898॥*

వానికి తన నీడయందు శరీరము శిథిలమైనట్లుగ తోచుచుండెను. చెవులలో చేతుల వ్రేళ్ళు ఉంచినప్పుడు ప్రాణములయొక్క శబ్దములు వినబడకుండెను. వృక్షములు బంగారుఛాయలతో ఒప్పుచున్నట్లు కనబడుచుండెను. దుమ్ములమీదను, బురదపైనను అడుగిడుచున్నప్పుడు పాదముద్రలు కనబడకుండెను.

*42.30 (ముప్పదియవ శ్లోకము)*

*స్వప్నే ప్రేతపరిష్వంగః ఖరయానం విషాదనమ్|*

*యాయాన్నలదమాల్యేకస్తైలాభ్యక్తో దిగంబరః॥9899॥*

స్వప్నములలో ప్రేతలను కౌగలించుకొనుచున్నట్లుగను, గాడిదపై ఎక్కిపోవుచున్నట్లుగను, విషమును భక్షించుచున్నట్లుగను చూచు చుండెను. ఇంకను జపాకుసుమమాలను ధరించినట్లుగను, శరీరమునందు అంతటను నూనెను పూసికొనినట్లుగను, దిగంబరముగా ఉన్నట్లుగను తోచసాగెను.

*42.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*అన్యాని చేత్థం భూతాని స్వప్నజాగరితాని చ|*

*పశ్యన్ మరణసంత్రస్తో నిద్రాం లేభే న చింతయా॥9900॥*

ఈ విధముగా అతనికి స్వప్నజాగ్రదవస్థలయందు ఇంకను పెక్కు అపశకునములు పొడసూపెను. ఆ కారణమున అతని చింత అధికమాయెను. మృత్యుభీతి మెండయ్యెను, కంటికి కునుకు లేకుండెను.

*42.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*వ్యుష్టాయాం నిశి కౌరవ్య సూర్యే చాద్భ్యః సముత్థితే|*

*కారయామాస వై కంసో మల్లక్రీడామహోత్సవమ్॥9901॥*

పరీక్షిన్మహారాజా! ఆ రాత్రి ఎట్లో గడచెను. సూర్యుడు తూర్పుదిక్కున ఉదయించెను. అంతట ఆ కంసుడు మల్లక్రీడా మహోత్సవమునకై ఆదేశించెను.

*42.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*ఆనర్చుః పురుషా రంగం తూర్యభేర్యశ్చ జఘ్నిరే|*

*మంచాశ్చాలంకృతాః స్రగ్భిః పతాకాచైలతోరణైః॥9902॥*

వెంటనే కొంతమంది రాజోద్యోగులు మల్లరంగమును సిద్ధపఱచి, దానిని చక్కగా అలంకరించిరి. తూర్యధ్వనులు, ఢంకాధ్వనులు మొదలయ్యెను. ప్రేక్షకులు కూర్చుండుటకై మంచెలను నిర్మించి, వాటిని పూలమాలలతోడను, పతాకములతోను, వస్త్రములతోను, తోరణములతోడను అలంకరించిరి.

*42.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*తేషు పౌరా జానపదా బ్రహ్మక్షత్రపురోగమాః|*

*యథోపజోషం వివిశూ రాజానశ్చ కృతాసనాః॥9903॥*

బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలగు పౌరులు, జానపదులు రాజాజ్ఞప్రకారము అందు ప్రవేశించి, తమ తమ స్థానములలో కూర్చుండిరి. ఆహ్వానములపై ఇతరదేశముల నుండి వచ్చిన రాజులు యథోచితముగా ఆసనములను అలంకరించిరి.

*42.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*కంసః పరివృతోఽమాత్యై రాజమంచ ఉపావిశత్|*

*మండలేశ్వరమధ్యస్థో హృదయేన విదూయతా॥9904॥*

కంసప్రభువు రాజసింహాసనముపై ఆసీనుడయ్యెను. మంత్రులను, మండలేశ్వరులును అతని చుట్టును  జేరి  కూర్చుండిరి. కాని, అపశకునముల కారణముగా అతని మనస్సు మాత్రము ఆందోళనకు గుఱియైయుండెను.

*42.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*వాద్యమానేషు తూర్యేషు మల్లతాలోత్తరేషు చ|*

*మల్లాః స్వలంకృతా దృప్తాః సోపాధ్యాయాః సమావిశన్॥9905॥*

తూర్యాది వాద్యములు మ్రోగదొడంగెను. అప్పుడు మదించియున్న మల్లయోధులు చక్కగా అలంకృతులై, భుజాస్ఫాలన మొనర్చుచు, తమ మల్లాచార్యులతోగూడి అందు ప్రవేశించిరి.

*42.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*చాణూరో ముష్టికః కూటః శలస్తోశల ఏవ చ|*

*త ఆసేదురుపస్థానం వల్గువాద్యప్రహర్షితాః॥9906॥*

చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, శలుడు, తోశలుడు మొదలగు ప్రముఖ మల్లయోధులు వినసొంపైన వాద్యధ్వనులకు పొంగిపోవుచు రంగస్థలమునకు చేరిరి.

*42.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*నందగోపాదయో గోపా భోజరాజసమాహుతాః|*

*నివేదితోపాయనాస్త ఏకస్మిన్ మంచ ఆవిశన్॥9907॥*

కంసుని ఆహ్వానముపై వచ్చిన నందుడు మొదలగు గోపాలురు అందు ప్రవేశించి, తాము తీసికొనివచ్చిన కానుకలను ఆ కంసరాజునకు సమర్పించిరి. పిమ్మట వారు తమ కొఱకై ఏర్పాటు  చేయబడిన మంచెలపై ఆసీనులైరి.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే మల్లరంగోపవర్ణనం నామ ద్విచత్వారింశోఽధ్యాయః (42)*

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి *శ్రీకృష్ణుడు కుబ్జపై దయజూపుట - ధనుస్సును విరచి, రక్షక భటులను హతమార్చుట - కంసుడు ఆందోళనకు గురియగుట* యను నలుబది రెండవ అధ్యాయము (42)

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[17/02, 20:35] +91 95058 13235: *17.2.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది మూడవ అధ్యాయము*

*బలరామకృష్ణులు "కువలయాపీడము" అను మదపుటేనుగును చంపి మల్లరంగమున ప్రవేశించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*

*43.1 (ప్రథమ శ్లోకము)*

*అథ కృష్ణశ్చ రామశ్చ కృతశౌచౌ పరంతప|*

*మల్లదుందుభినిర్ఘోషం శ్రుత్వా ద్రష్టుముపేయతుః॥9908॥*

*శ్రీశుకుడు పలికెను* అంతశ్శత్రువులను జయించిన పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు, బలరాముడు ప్రాతఃకాలస్నానాది విధులను నిర్వర్తించుకొనిరి. పిమ్మట వారు మల్లయోధుల భుజాస్ఫాలనాది ధ్వనులను, దుందుభి మొదలగు వాద్యముల ఘోషలను విని, రంగస్థల విశేషములను స్వయముగా తిలకించుటకై బయలుదేఱిరి.

*43.2 (రెండవ శ్లోకము)*

*రంగద్వారం సమాసాద్య తస్మిన్ నాగమవస్థితమ్|*

*అపశ్యత్కువలయాపీడం కృష్ణోఽమ్బష్ఠప్రచోదితమ్॥9909॥*

రంగస్థల ద్వారము కడకు రాగానే శ్రీకృష్ణుడు అచటనున్న *కువలయాపీడనము* అను ఏనుగును చూచెను. దానిని ఒక మావటివాడు అదుపు చేయుచుండెను.

*43.3 (రెండవ శ్లోకము)*

*బద్ధ్వా పరికరం శౌరిః సముహ్య కుటిలాలకాన్|*

*ఉవాచ హస్తిపం వాచా మేఘనాదగభీరయా॥9910*

అప్పుడు కృష్ణప్రభువు ఉత్తరీయమును నడుమునకు బిగించి, ముంగురులను సవరించుకొని, మేఘధ్వనులవలె గంభీరములైన వాక్కులతో మావటివానిని ఱెచ్చగొట్టుచు  ఇట్లనెను-

*43.4 (నాలుగవ శ్లోకము)*

*అంబష్ఠాంబష్ఠ మార్గం నౌ దేహ్యపక్రమ మా చిరమ్|*

*నో చేత్సకుంజరం త్వాద్య నయామి యమసాదనమ్॰9911॥*

"ఓరీ మావటీ! వెంటనే తప్పుకొనుము. మా ఇరువురికి మార్గమునిమ్ము. లేనిచో నిన్ను, ఏనుగును ఇప్పుడే మృత్యుముఖమునకు చేర్చెదను".

*43.5 (ఐదవ శ్లోకము)*

*ఏవం నిర్భర్త్సితోఽమ్బష్ఠః కుపితః కోపితం గజమ్|*

*చోదయామాస కృష్ణాయ కాలాంతకయమోపమమ్॥9912॥*

శ్రీకృష్ణుడు హెచ్చరించినంతనే మావటివాడు మిగుల క్రుద్ధుడయ్యెను. పిదప అతడు మృత్యుదేవతవలె భయంకరమైన ఆ మదపుటేనుగును కృష్ణుని మీదికి  ఉసిగొల్పెను.

*43.6 (ఆరవ శ్లోకము)*

*కరీంద్రస్తమభిద్రుత్య కరేణ తరసాగ్రహీత్|*

*కరాద్విగలితః సోఽముం నిహత్యాంఘ్రిష్వలీయత॥9913॥*

వెన్వెంటనే ఆ కువలయాపీడము ఱెచ్చిపోయి, శ్రీకృష్ణుని తన తొండముతో చుట్టివేసెను. అంతట ఆ స్వామి నేర్పుగా ఆ తొండమునుండి జాఱుకొని (తప్పించుకొని) దానిపై పిడికిలితో ఒక్కపోటు పొడిచి, తాను దాని కాళ్ళసందున దాగికొనెను.

*43.7 (ఏడవ శ్లోకము)*

*సంక్రుద్ధస్తమచక్షాణో ఘ్రాణదృష్టిః స కేశవమ్|*

*పరామృశత్పుష్కరేణ స ప్రసహ్య వినిర్గతః॥9914॥*

*43.8 (ఎనిమిదవ శ్లోకము)*

*పుచ్ఛే ప్రగృహ్యాతిబలం ధనుషః పంచవింశతిమ్*

*విచకర్ష యథా నాగం సుపర్ణ ఇవ లీలయా॥9915॥*

శ్రీకృష్ణుడు తన యెదుట ఎక్కడను కనబడకపోవుటతో ఆ మదపుటేనుగు ఒడలు తెలియని కోపముతో తొండముతో వాసన చూచుచు వెదకి వెదకి ఆ పురుషోత్తముని పట్టుకొనెను. అప్పుడు ఆ ప్రభువు శక్తియుక్తులను చూపుచు దాని పట్టునుండి బయటపడెను. పిదప ఆ స్వామి దాని తోకను పట్టుకొని, గరుత్మంతుడు సర్ఫమునువలె అవలీలగా దానిని ఇరువదియైదు బారల దూరము లాగివేసెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[18/02, 04:38] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*245వ నామ మంత్రము* 18.02.2021

*ఓం చక్రరాజ నికేతనాయై నమః*

శ్రీచక్రమే నివాసస్థానముగా విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *చక్రరాజ నికేతనా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం చక్రరాజ నికేతనాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఉపాసించు సాధకుడు ఆ పరాశక్తి కరుణచే బ్రహ్మజ్ఞానసముపార్జనదిశగా తన మనసును మరల్చుకొని దీక్షాబద్ధతతో ప్రవర్తించును.

త్రైలోక్యచక్రము మొదలు తొమ్మిది చక్రములు గల శ్రీచక్రమే తన నివాసస్థానముగా విరాజిల్లుచున్నది  పరమేశ్వరి.

శ్రీ చక్రమును  శ్రీ యంత్రము అనికూడా అంటారు.  దీని జ్యామితీయ నిర్మాణము ఒక బిందువు చుట్టూ వివిధ దిశలలో ప్రయాణిస్తూ ఉన్న చిన్న చిన్న త్రిభుజాలు చివరకు రెండు వ్యతిరేక దిశలలో ఉద్భవించే పెద్ద త్రిభుజాల వలె ఉంటుంది. ఈ యంత్రము శక్తి స్వరూపిణురాలైన శ్రీలలితా దేవి లేదా త్రిపురసుందరి అనే దేవతను సూచిస్తాయి. దీనిలోని నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుష శక్తిని సూచిస్తాయి. అయిదు సమద్విబాహు త్రిభుజాలు నిమ్మముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తాయి. కావున శ్రీ చక్ర యంత్రము వ్యతిరేక దివ్యశక్తుల సంగమముని సూచిస్తుంది. ఇందులో త్రిభుజాలు మొత్తం తొమ్మిది ఉన్నందున దీనిని నవయోని చక్రం అని లేదా నవ చక్రం అని కూడా పిలుస్తారు.

శంకరభగవత్పాదుల వారు శ్రీచక్రమును గూర్చి సౌందర్యలహరిలో పదకొండవ శ్లోకంలో ఇలా చెప్పారు.

*చతుర్భిః శ్రీకంఠైః -  శివయువతిభిః పంచభిరపి|*

*ప్రభిన్నాభిః శంభో ర్నవభిరపి మూలప్రకృతిభిః |*

*చతుశ్చత్వారింశ - ద్వసుదల-కలాశ్చ్త్రివలయ*

 *త్రిరేఖభిః సార్ధం - తవ శరణకోణాః పరిణతాః*

శ్రీచక్రం వర్ణన - నవ చక్రాకృతమై, నలబై నాలుగు (44) అంచులు కలిగి శివశక్త్యుభయరూపముగా వెలయుచున్నది.

*భావము:*

శ్రీచక్రంలో శివకోణములు నాలుగు(4), ( వీటి కోణములు క్రిందకు ఉండును.) శక్తికోణములు ఐదు (5),  శక్తి కోణములు పైకి ఉండును.  మూలప్రకృతులు తొమ్మిది (9), అష్టదళములు ఎనిమిది(8) , షోడశదళములు పదహారు (16) , త్రివలయములు మూడు (3) , భూపురత్రయములు మూడు (3), ఈ విదంగా శ్రీచక్రంలో మొత్తం నలబై నాలుగు (44) కోణములు ఉండును. అటువంటి శ్రీచక్రము నీకు నిలయముగా నీ స్థానమై ఉన్నది తల్లీ. శ్రీచక్రము నందు సృష్టికి  మూల కారణమైన మూల ప్రకృతులను పేరుగల తొమ్మిది త్రికోణములు గలవు. ఇంకను శ్రీచక్రమునందు నలబై నాలుగు కోణములేగాక, ఇరువది ఎనిమిది మర్మ స్థానములు,  ఇరువది నాలుగు సంధులు గలవు.   తొమ్మిది త్రికోణములు గలవు గనుక నవయోన్యాత్మక మందురు. ఈ నవ యోనులు నవ ధాతువులై సృష్టి మూలకము లగుచున్నవి. త్వక్కు, రుధిరము, మాంసము, మేధస్సు, ఆస్థి అనునవి ఐదు శక్తి మూలకములు,  ధాతువులు మజ్,శుక్రము, ప్రాణము, జీవుడు అను నాలుగు ధాతువులు శివ మూలకములు. మన దేహము నవ ధాతుమయము, నవ యోని సముద్భవము. దశమ యోని బైన్ధవ స్థానము. ఇట్లు పిండాండము, బ్రహ్మాండము వీని వలన జనించినది. పంచ మహా భూతములు, పంచ తన్మాత్రలు,

పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు,మనస్తత్వము, మాయ, శుద్దవిద్య, మహేశ్వరుడు,సదాశివుడు, అను పంచ వింశతి తత్వములు శ్రీచక్రమునందంత ర్భూతములై యున్నవి. శివశక్త్యాత్మకమైన శ్రీచక్రము చరాచర జగత్తునకు సృష్టికి మూలమై యున్నది. షట్చక్ర భేదనముచే శ్రీచక్రోపాసన చేసే శ్రీదేవీ భక్తులకు అణిమాది అష్ట సిద్దులు అతి సునాయాసముగా సిద్ధించును. సిద్ధించే ముందు పరీక్షలు చాలా తీవ్రముగా వుండును. మానసిక, శారీరిక పరీక్షలు వుండును. ఎన్నో రకముల భ్రమలు గల్పించబడును. కంటి ముందు మెరుపు తీగలు మెరియును. చెవులు హోరెత్తును. తల పగలి పోవునట్లుగా వుండును. భరించలేని మాడు పోటు, తల గిర్రున తిరుగును. ఒకే సమయములో శీతోష్ణస్థితులు గలుగును. వున్నది లేనట్టుగా లేనిది వున్నట్టుగా అగుపించును. రకరకాల మాయలు గనిపించును. మనస్సు తీవ్ర భయాందోళనలకు లోనగును. శరీరము తీవ్ర కంపనములకు లోను అగును. శరీరము చెమట పట్టును. వెన్నులోని నాడులు తీవ్రముగా స్పందించును. తరువాత శరీరము నెమ్మదిగా తేలిక అగును. నాగ బంధములో కదలిక గల్గును. మూలాధారములో శక్తి చలనము, ఉత్కీలనము, ఆ తరువాత షట్చక్ర భేదనము.

ఆజ్ఞాచక్రములో త్రికోణ దర్శనము, త్రికోణాంతర దీపికా దర్శనము కలుగును.

 ఆ తరువాత ఆనందమే బ్రహ్మానందం. ఇక మిగతా విషయములు చెప్పకూడదు. అవి అతి రహస్యములు. స్వయముగా ఎవరికి వారు అనుభవించి తెలుసుకోవాలి. మొదటి సారి మాత్రమే ఈ సాదృశ్యములు అగుపించును. ఆ తరువాత నీ మానసిక, శారీరిక స్థితిగతులను బట్టి, నీకు తెలియకుండానే కుండలినీశక్తి సహస్రారము వరకు గమనము చేయుచూ వుండును. రహస్యమైన విషయమేమంటే సాధకుడు అఖండ బ్రహ్మచర్య నిష్ఠలో, పంచదశీ మంత్ర పునఃశ్చరణ దీక్షలో  వుండవలెను. అప్పుడే ఇది సాధించగలడు. లేనిచో ఇది కుదరదు. గురు ముఖతః దీక్ష తీసుకొన్నవారిలో మాత్రమే ఈ సిద్ధి కలుగును. ఇతరులు ఈ సాధన చేయకూడదు. చాలా తీవ్ర పరిమాణాలు వుంటాయి.

ఎవరికి వారు తమ్ము తాము ఉద్దరించుకోవడానికి మాత్రమే ఈ సాధన చేయవలెను. అన్యధా తగు మూల్యము చెల్లించుకోక తప్పదు. శ్రీవిద్య మోక్ష సాధనకు మాత్రమే అని గుర్తెరిగి ప్రవర్తించవలయును.

సాధకుడు అమ్మ పెట్టే పరీక్షలకు నిలబడాలి. సాధన తీవ్రముగా వుండాలి. మధ్యలో చలించగూడదు. ఏకోన్ముఖులై వుండాలి. ఎవరికి ఏయే బలహీనతలు గలవో, అవే పరీక్షలకు తావుగా నిలబడును. మెట్టు మెట్టుకూ చిత్ర విచిత్రమైన పరీక్షలు కల్గును.

*మానవశరీరము - శ్రీచక్రము*

*బిందువు* - బ్రహ్మరంధ్రము (గమనిస్తే పసిపిల్లలకు నడునెత్తి లేదా మాడపట్టు మెత్తగా ఉంటుంది. ఇదే బ్రహ్మరంధ్రము) 

*త్రికోణము*- మస్తకము (తల ముందుభాగము)

*అష్టకోణము* - లలాటము (నుదురు)

*అంతర్దశారము* - భృకుటి (కనుబొమల మధ్య)

*బహిర్దశారము* - కంఠము

*చతుర్దశారము*- హృదయము 

*అష్టదళపద్మము*- నాభి

*షోడశదళ పద్మము* - కటి (మొల భాగము)

*వృత్తత్రయము* - ఊరువులు (తొడలు)

*భూపురము* - పాదములు 

బిందువు నందే కామేశ్వరీ, కామేశ్వరులు ఉంటారు. గనుకనే అమ్మవారు *చక్రరాజనికేతనా* యని అనబడినది.

ఇంతటి మహిమాన్వితమైన శ్రీచక్రమే తన నివాసస్థానమై జగన్మాత విలసిల్లుచున్నది గనుక *చక్రరాజనికేతనా* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం చక్రరాజనికేతనాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[18/02, 04:38] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*820వ నామ మంత్రము* 18.02.2021

*ఓం సత్యై నమః*

సత్యస్వరూపిణిగాను, పరమశివుని భార్య సతీదేవిగాను తేజరిల్లు జగజ్జననికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సతీ* యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం సత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు సకలార్థసిద్ధియు, సర్వశుభప్రదము గలుగును.

సతి అనగా పాతివ్రత్యమను సద్రూపత్వముగలిగినది. 

సతీదేవి దక్షప్రజాపతి కూతురు శివుని మొదటి భార్య..ఆష్టాదశశక్తి పీఠాలకు ఆది దేవత పరమశివుని ప్రేమించి తన తండ్రిని ధిక్కరించి కళ్యాణం చేసుకున్నది. అందుకు ధక్షుడు పరమశివుని అవమానించదలచి యజ్ఞం ప్రారంబించి దేవతలనందరినీ అహ్వానించి శివుని మాత్రం ఆహ్వానించడు. పరమేశ్వరుడు ఆగ్రహం చెంది మౌనంగా ఉంటాడు. సతీదేవి పోవాలని పట్టుబడగా తనను ఒక్కదాన్నే ఆమె పుట్టినింటికి పంపుతాడు. ఎంతో సంతోషంగా పుట్టినింటికి పోయిన సతీదేవిని ఎవరూ పట్టించుకోరు. కనీసం పలకరించరు.తండ్రి ఆమెను దూషిస్తాడు.అవమానం భరించలేక సతీదేవి ఆ యజ్ఞం లో ప్రాణత్యాగం చేస్తుంది.ఆ విషయం తెలిసిన శివుడు ఆగ్రహంతో ఆ యజ్ఞ ప్రాంతాన్ని సర్వనాశనం చేసి ధక్షున్ని ఆంతం చేసి సతీదేవి మృత శరీరాన్ని భుజాన వేసుకుని రోధిస్తూ విశ్వాంతరాల వైపు బయలు దేరుతాడు శివుని ఆవేదన తీర్చుటకొరకు తన సుదర్శనచక్రంతో సతీదేవి శరీరాన్ని అనేక ఖండాలుగా ఖండిస్తాడు అ శరీరభాగావు పడిన ప్రధేశాల్లో అమ్మవారు మహాశక్తి గా అవతరించి శక్తి పీఠాలుగా విలసిల్లినవి. అటువంటి శక్తిపీఠాలు ఏబై ఒకటి ఉండగా ప్రధానమైనవి పదునెనిమిది. వీటినే అష్టాదశ శక్తిపీఠాలు అందురు.

అష్టాదశ శక్తిపీఠాలకు ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం ఒకటి ఉన్నది.

*లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే* 

*ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే*

*అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా*

*కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా*

*ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా*

*ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికా*

*హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ*

*జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా*

*వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ*

*అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్*

*సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్*

*సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్*

1. *శాంకరీదేవి*- శ్రీలంక*- ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 

2. *కామాక్షి* - కాంచీపురం, తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

3. *శృంఖల* - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.

4. *చాముండి* - క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.

5. *జోగులాంబ* - ఆలంపూర్, తెలంగాణ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగభద్ర' మరియు కృష్ణా నదులు కలిసే స్థలంలో ఉంది.

6. *భ్రమరాంబిక* - శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లికార్జునస్వామి సమేతులై ఉంది. 

(శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి)

7. *మహాలక్ష్మి*- కొల్హాపూర్, మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.

8. *ఏకవీరిక* మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.

9. *మహాకాళి* - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.

10. *పురుహూతిక* - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.

11. *గిరిజ* - ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒడిషా - వైతరిణీ నది తీరాన ఉంది.

12. *మాణిక్యాంబ* - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.

13. *కామరూప*- హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.

14. *మాధవేశ్వరి* - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.

15. *వైష్ణవి*  జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.

16. *మంగళ గౌరి* - గయ, బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.

17. *విశాలాక్షి*- వారాణసి, ఉత్తర ప్రదేశ్.

18. *సరస్వతి* - జమ్ము, కాష్మీరు - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సత్యై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

18/02, 04:38] +91 95058 13235: *18.2.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది మూడవ అధ్యాయము*

*బలరామకృష్ణులు "కువలయాపీడము" అను మదపుటేనుగును చంపి మల్లరంగమున ప్రవేశించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*43.9 (తొమ్మిదవ శ్లోకము)*

*స పర్యావర్తమానేన సవ్యదక్షిణతోఽచ్యుతః|*

*బభ్రామ భ్రామ్యమాణేన గోవత్సేనేవ బాలకః॥9916॥*

*43.10 (పదియవ శ్లోకము)*

*తతోఽభిముఖమభ్యేత్య పాణినాఽఽహత్య వారణమ్|*

*ప్రాద్రవన్ పాతయామాస స్పృశ్యమానః పదే పదే॥9917॥*

అనంతరము ఆ కువలయాపీడము పుంజుకొని, శ్రీకృష్ణుని పట్టుకొనుటకు ప్రయత్నించెను. ఆ ఏనుగు కుడివైపునకు తిరుగునప్పుడు అతడు ఎడమవైపునకును, అది ఎడమవైపునకు తిరుగునప్పుడు అతడు కుడివైపునకును తిరుగుచు, బాలకుడు ఆవుదూడనువలె ఆటపట్టించుచు ముప్పుతిప్పలు పెట్టెను. పిమ్మట ఆ ఏనుగునకు ఎదుట నిలిచి చేతతో దానిని ఒక దెబ్బకొట్టి పరుగిడసాగెను. ఆ విధముగా ఆ స్వామి దానికి అందినట్లే అందుచు, అందకుండాపోవుచు పదేపదే దానిని వంచింపదొడగెను.

*43.11 (పదకొండవ శ్లోకము)*

*స ధావన్ క్రీడయా భూమౌ పతిత్వా సహసోత్థితః|*

*తం మత్వా పతితం క్రుద్ధో దంతాభ్యాం సోఽహనత్క్షితిమ్॥9918॥*

పిమ్మట కృష్ణభగవానుడు పరుగెత్తుచు ఒకసారి లీలగా భూమిపై పడినట్లు నటించెను. వెంటనే లేచి నిలబడెను. ఆ సమయమున మిగుల ఱెచ్చిపోయియున్న ఆ మదపుటేనుగు నిజముగనే అతడు పడిపోయినాడని భావించి, ఆవేశమున తన దంతములతో నేలను క్రుమ్మసాగెను.

*43.12 (పండ్రెండవ శ్లోకము)*

*స్వవిక్రమే ప్రతిహతే కుంజరేంద్రోఽత్యమర్షితః|*

*చోద్యమానో మహామాత్రైః కృష్ణమభ్యద్రవద్రుషా॥9919॥*

*43.13 (పదమూడవ శ్లోకము)*

*తమాపతంతమాసాద్య భగవాన్మధుసూదనః|*

*నిగృహ్య పాణినా హస్తం పాతయామాస భూతలే॥9920॥*

క్రమముగా మదపుటేనుగు యొక్క శక్తి క్షీణించుచుండెను. తన ప్రయత్నము ఎంతకును ఫలింపకుండుటచే అది రెట్టించిన కోపముతో బుసలు కొట్టుచుండెను. పరిస్థితిని గమనించిన మావటివాండ్రు దానిని గట్టిగా ఉసిగొల్పుటతో అది ఇంకను కినుకబూని కృష్ణునిమీదికి విజృంభించెను. అంతట కృష్ణపరమాత్మ తనపై దాడి చేయుటకై వచ్చుచున్న ఆ మదపుటేనుగును సమీపించి తన చేతితో దాని తొండమును గట్టిగా పట్టుకొని, నేలపై పడవేసెను.

*43.14 (పదునాలుగవ శ్లోకము)*

*పతితస్య పదాఽఽక్రమ్య మృగేంద్ర ఇవ లీలయా|*

*దంతముత్పాట్య తేనేభం హస్తిపాంశ్చాహనద్ధరిః॥9921॥*

అది క్రిందబడినంతనే ఆ ప్రభువు సింహమువలె విజృంభించి, అవలీలగా దానిని తన పాదములతో త్రొక్కిపట్టెను. వెంటనే ఆ స్వామి దాని ఒక దంతమును ఊడబెఱికి, దాని దంతముతోనే ఆ కువలయాపీడమును, మావటివాండ్రను చావగొట్టెను.

*43.15 (పదునైదవ శ్లోకము)*

*మృతకం ద్విపముత్సృజ్య దంతపాణిః సమావిశత్|*

*అంసన్యస్తవిషాణోఽసృఙ్మదబిందుభిరంకితః|*

*విరూఢస్వేదకణికావదనాంబురుహో బభౌ॥9922॥*

ఆ మదపుటేనుగు మృతకళేబరమును అచటనే విడిచిపెట్టి ఆ మహాత్ముడు దాని దంతమును చేబూని రంగస్థలమున  ప్రవేశించెను. అప్పుడు శ్రీకృష్ణుని రూపవైభవము చూడముచ్చట గొలుపుచుండెను. ఏనుగు దంతమును భుజముపై వహించియున్న ఆ ప్రభువు శరీరముపై రక్తబిందువులు, ఏనుగుయొక్క మదజల బిందువులు ప్రస్ఫుటముగా కనబడుచుండెను. మదపుటేనుగుతో పోరాడిన సందర్భమున చెమర్చిన ఆయన ముఖారవిందమునగల చెమటబిందువులు వింతశోభల నీనుచుండెను.

*43.16 (పదహారవ శ్లోకము)*

*వృతౌ గోపైః కతిపయైర్బలదేవజనార్దనౌ|*

*రంగం వివిశతూ రాజన్ గజదంతవరాయుధౌ॥9923॥*

పరీక్షిన్మహారాజా! బలరామకృష్ణుల చేతులలో ఆ ఏనుగు దంతములు ఆయుధములవలె శోభిల్లుచుండెను. కొంతమంది గోపాలురు వారి చుట్టును చేరియుండగా ఆ సోదరులు మల్లరంగమున ప్రవేశించిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[18/02, 20:24] +91 95058 13235: *18.2.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది మూడవ అధ్యాయము*

*బలరామకృష్ణులు "కువలయాపీడము" అను మదపుటేనుగును చంపి మల్లరంగమున ప్రవేశించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*43.17 (పదిహేడవ శ్లోకము)*

*మల్లానామశనిర్నృణాం నరవరః స్త్రీణాం స్మరో మూర్తిమాన్|*

*గోపానాం స్వజనోఽసతాం క్షితిభుజాం శాస్తా స్వపిత్రోః శిశుః|*

*మృత్యుర్భోజపతేర్విరాడవిదుషాం తత్త్వం పరం యోగినామ్|*

*వృష్ణీనాం పరదేవతేతి విదితో రంగం గతః సాగ్రజః॥9924॥*

మల్లరంగమునందు బలరామసహితుడైయున్న శ్రీకృష్ణుడు మల్లురకు మిగుల రౌద్రాకారముతో పిడుగువలె భీకరముగా తోచుచుండెను. సామాన్యజనులకు ఒక మహరాజువలె అద్భుతముగా కన్పట్టుచుండెను. స్త్రీలకు ఆకృతిదాల్చిన నవమన్మథునివలె శృంగార పురుషుడై భాసిల్లుచుండెను. గోపాలురకు ఆత్మీయుడుగా, వారిలో ప్రేమభావమును నింపుచుండెను. కుటిలులైన రాజులకు నియంతగా తోచుచుండెను. తల్లిదండ్రులలో శిశువువలె వాత్సల్య భావమును నింపుచుండెను. కంసునకు మృత్యుదేవతవలె భయానకముగా గోచరించుచుండెను. ఒక అద్భుత పురుషునివలె మూర్ఖులను కలవరపరచు చుండెను. యోగీశ్వరులకు శాంతస్వరూపమున పరతత్త్వముగా భాసిల్లుచుండెను. వృష్ణివంశజులకు పరదేవత వలె పూజ్యభావమును కలిగించుచుండెను. ఇట్లు ఆ పరమపురుషుడు వేర్వేరు వ్యక్తులకు వారి వారి మనోభావములకు అనుగుణముగా వివిధ రూపములలో తేజరిల్లుచుండెను.

పై సందర్భములో పోతనగారి పద్యరత్నము:

*సీస పద్యము*

మహితరౌద్రంబున మల్లుర కశనియై;

నరుల కద్భుతముగ నాథుఁ డగుచు

శృంగారమునఁ బురస్త్రీలకుఁ గాముఁడై;

నిజమృత్యువై కంసునికి భయముగ

మూఢులు భీభత్సమునుఁ బొంద వికటుఁడై;

తండ్రికి దయరాఁగఁ దనయు డగుచు

ఖలులకు విరసంబుగా దండియై గోప;

కులకు హాస్యంబుగాఁ గులజుఁ డగుచు

*ఆటవెలది*

బాంధవులకుఁ బ్రేమ భాసిల్ల వేలుపై

శాంత మొనర యోగి జనుల కెల్లఁ

బరమతత్వ మగుచు భాసిల్లె బలునితో

మాధవుండు రంగమధ్య మందు.

*భావము*

మల్లరంగం నడుమ బలరామ సహితుడైన కృష్ణుడు, రౌద్రరసంతో మల్లురకు పిడుగులా కనిపించాడు; అద్భుతరసంతో పురస్త్రీలకు పంచశరుడుగా భాసిల్లాడు; భయానకరసంతో కంసునికి వాడి పాలిటి మృత్యువుగా మూర్తీభవించాడు; బీభత్సరసంతో మూర్ఖులకు వికటుడుగా కనిపించాడు; కరుణరసంతో తండ్రికి కన్నబిడ్డడుగా కరుణ కలిగించాడు; వీరరసంతో దుర్మార్గులకు విద్వేషం కలిగించాడు; హాస్యరసంతో గోపకులను కులదీపకుడుగా గోచరించాడు; ప్రేమరసంతో చుట్టాలకు దేవుడుగానూ, శాంతరసంతో యోగిజనులకు పరబ్రహ్మ స్వరూపుడుగానూ ప్రకాశించాడు.

*43.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*హతం కువలయాపీడం దృష్ట్వా తావపి దుర్జయౌ|*

*కంసో మనస్వ్యపి తదా భృశముద్వివిజే నృప॥9925॥*

పరీక్షిన్మహారాజా! సహజముగా కంసుడు ధీరుడే యనప్పటికిని, కువలయాపీడము హతమగుట చూచి, బలరామకృష్ణులు దుర్జయులు (అజేయులు) అని గ్రహించి, మిగుల భయగ్రస్తుడయ్యెను.

*43.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*తౌ రేజతూ రంగగతౌ మహాభుజౌ విచిత్రవేషాభరణస్రగంబరౌ|*

*యథా నటావుత్తమవేషధారిణౌ మనః క్షిపంతౌ ప్రభయా నిరీక్షతామ్॥9926॥*

గొప్ప భుజశాలులైన బలరామకృష్ణులు విచిత్రములగు వేషములతో, వస్త్రాభరణములతో, పూలహారములతో రంగస్థలమున విరాజిల్లుచుండిరి. అప్పుడు వారు ఉత్తమ వేషధారులైన నటులవలె తమ దివ్యశోభలతో సందర్శకుల మనస్సులను ఆకట్టుకొనుచుండిరి.

*43.20 (ఇరువదియవ శ్లోకము)*

*నిరీక్ష్య తావుత్తమపూరుషౌ జనా మంచస్థితా నాగరరాష్ట్రకా నృప|*

*ప్రహర్షవేగోత్కలితేక్షణాననాః పపుర్న తృప్తా నయనైస్తదాననమ్॥9927॥*

మహారాజా! రంగస్థలమునందలి మంచెలపై ఆసీనులైయున్న మథురానగరవాసులు, జానపదులు ఆ ఇరువురు మహాపురుషులను జూచినంతనే సంతోషాతిరేకముతో వారి ముఖములు మిగుల వికసించెను. వారు తమ నయనములనెడి పాత్రలద్వారా ఆ సోదరులయొక్క ముఖవర్చస్సులనెడి అమృతమును ఎంతగా గ్రోలుచున్నను వారికి తనివిదీరకుండెను.

*43.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*పిబంత ఇవ చక్షుర్భ్యాం లిహంత ఇవ జిహ్వయా|*

*జిఘ్రంత ఇవ నాసాభ్యాం శ్లిష్యంత ఇవ బాహుభిః॥9928॥*

*43.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*ఊచుః పరస్పరం తే వై యథాదృష్టం యథాశ్రుతమ్|*

*తద్రూపగుణమాధుర్యప్రాగల్భ్యస్మారితా ఇవ॥9929॥*

అప్పుడు బలరామకృష్ణులను దర్శించుచున్నవారు ఆ మహాత్ములయొక్క సౌందర్యరసమును కన్నులద్వారా త్రాగివేయుచున్నట్లుగను, తమ నాలుకలద్వారా రుచిచూచుచున్నట్లు గుటకలు వేయుచును, లావణ్య పరిమళములను ఆఘ్రాణించి పరవశించిపోవుచున్నట్లుగను, ఆ పరమ సుందరులను బాహువులతో హాయిగా కౌగలించు కొనుచున్నట్లుగను ఒప్పిరి. ఇంకను ఆ ప్రజలు గజదంతములను చేబూనియున్న ఆ మహాపురుషుల రూపవైభవములను, శౌర్యపరాక్రమాది గుణములను, దరహాస - భాషణ మాధుర్యములను, నిర్భయత్వమును, గుర్తునకు తెచ్చుకొనుచున్నవారివలె స్వయముగా తాము చూచిన ధనుర్భంగాది దృశ్యములను గూర్చియు. కర్ణాకర్ణిగా తాము వినిన గోవర్ధనోద్ధరణాది లీలలను గుఱించియు పరస్పరము ముచ్చటించుకొనిరి.

*43.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*ఏతౌ భగవతః సాక్షాద్ధరేర్నారాయణస్య హి|*

*అవతీర్ణావిహాంశేన వసుదేవస్య వేశ్మని॥9930॥*

సాక్షాత్తుగా సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడే సంకల్పమాత్రమున శ్రీకృష్ణుడుగను, తదంశతో బలరాముడుగను భూతలమున వసుదేవుని ఇంట అవతరించిరి.

*43.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*ఏష వై కిల దేవక్యాం జాతో నీతశ్చ గోకులమ్|*

*కాలమేతం వసన్ గూఢో వవృధే నందవేశ్మని॥9931॥*

ఈ శ్రీకృష్ణపరమాత్మ మథురలో దేవకీదేవి గర్భమున అవతరించిన వెంటనే వసుదేవునిచే గోకులమునకు చేర్చబడినాడట. ఇప్పటి వఱకును అచటనే గూఢముగా నివసించుచు నందుని గృహమున వృద్ధిపొందెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[19/02, 06:19] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*821వ నామ మంత్రము* 19.02.2021

*ఓం బ్రహ్మాణ్యై నమః*

పంచకోశములలోని ఆనందమయకోశము నందలి ఆనందస్వరూపిణియై, బ్రహ్మాణిగా విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *బ్రహ్మాణీ* యను మూడక్షరముల(త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం బ్రహ్మాణ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తితత్పరతతో ఆరాధించు భక్తులు ఆ తల్లి కరుణచే సుఖసంతోషములతో, ఆయురారోగ్యములతో, కీర్తిప్రతిష్టలతో జీవింతురు మరియు పరమేశ్వరి నామ జపముతో ధన్యతనంది తరింతురు.

ఈ పంచభూతాత్మకమైన చరాచర జగత్తునందు అంతర్యామిగా ఉన్నది బ్రహ్మము. జగన్మాత *పంచకోశాంతరస్థితా* (లలితా సహస్ర నామావళి యందలి 428వ నామ మంత్రము) యని అనబడుచున్నది. పంచకోశములలో చివరిదైన ఆనందమయకోశంలో విలసిల్లుచున్నది పరబ్రహ్మస్వరూపిణియైన పరమేశ్వరి. అట్టి పరమేశ్వరియే *బ్రహ్మాణీ* యని స్తుతింపబడుచున్నది. ఈ బ్రహ్మము సృష్టికర్తయైన చతుర్ముఖబ్రహ్మను పుట్టించినదియగుట చేతను, ఆ బ్రహ్మను బ్రతికించుటచేతను, చతుర్ముఖ బ్రహ్మయొక్క స్త్రీయగుటచేతను పరమేశ్వరి *బ్రహ్మాణీ*  యని అనబడినది. 

*భయాదస్యాగ్నిస్తపతి భయాత్తపతిసూర్యః*

*భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః*  (కఠోపనిషత్తు 2.3.3)

పరమాత్మ యనిన భయంచేత అగ్ని మండుతున్నాడు, సూర్యుడు తేజస్సును ఇస్తున్నాడు, ఇంద్రుడు, వాయువు, అయిదవవాడైన యముడు - తమ తమ నిర్దేశిత కార్యములను నిర్వహించుచున్నారు. అటు వంటి పరమాత్మయే బ్రహ్మము.  సకల మంగళకరము, నిత్యశ్రీకరము. 

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం బ్రహ్మాణ్యై నమః* అని యనవలెను

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[19/02, 06:19] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*246వ నామ మంత్రము* 19.02.2021

*ఓం పార్వత్యై నమః*

పర్వతరాజు (హిమవంతుని) పుత్రిక యగుటచే *పార్వతీ* యను నామముతో విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పార్వతీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం పార్వత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని మనసులో భక్తిప్రపత్తులతో  ధ్యానించుచూ ఎట్టి   సత్కార్యములనాచరించ సంకల్పించుకొనినను తప్పక శుభప్రదమైనవిగాను నెరవేరును.

దక్షుని కుమార్తె అయిన *సతీదేవి* (దాక్షాయణి) శివునికి ఇల్లాలు. కాని దక్షయజ్ఞంలో తనకు, శివునికి జరిగిన అవమానానికి తల్లడిల్లి ఆమె అగ్నిలో ఆహుతి అయినది. తరువాత ఆమె హిమవంతుడు, మేనకల కుమార్తెగా జన్మించింది.

పర్వతరాజు అయిన హిమవంతుని కూతురు గనుక జగన్మాతకు పార్వతి యని నామము గలిగినది.

హిమవంతుని కుమార్తె గనుక హైమావతి అను పేరుకూడా గలదు.  ఈ బాలిక పెద్దదికాగానే, తాను పరమశివుణ్ణి తప్ప అన్యులను వివాహమాడనని సంకల్పించుకుని తపస్సు చేయడానికి అరణ్యములకు వెళ్ళింది.  వివిధ రీతులలో, కఠోరమైన తపస్సు కొనసాగించినది. మహాతాపాన్ని కలిగిస్తున్న ఎండవేళ చుట్టూ నాలుగు అగ్నులు, ఆకాశంలో మండుతున్న సూర్యగోళం, ఆ వేడికి ఎర్రబడి మండుతున్న బండరాయి - ఇవన్నీ నిలువ సాధ్యం కాని పరితాపాన్ని కలిగించే పరిస్థితులు. మనకి ఊహించుకుంటేనే భయం వేసే ఈ సన్నివేశంలో ఆ హైమవతి తపస్సుచేసినది.  

హేమంతశిశిరాల్లో (శీతాకాలంలో) ఆ ఉమ నిరాహారిణి అయి, నిత్యమూ మెడలోతు నీటిలో నిలబడి తపస్సు కొనసాగించింది.

హోరున వర్షం, కొన్నిసార్లు తల పగిలే వడగళ్ళు పడుతున్నప్పుడు కూడా పరమేశ్వరుని తనవాడిగా చేసుకోవడానికి దృఢదీక్షతో తపస్సు కొనసాగించినది.

కొంతకాలం ఒకపూట మాత్రం భోజనం చేస్తూ తపస్సు చేసినది.

మరికొంతకాలం భూమిపై (కటికనేలపై) పరుండినది.

కొంతకాలం ఆహారంగా కాయలు, పళ్ళు తింటూ తపస్సు చేసినది.

కొంతకాలం కేవలం ఆకులు మత్రమే తిని తపస్సుచేసినది.

పరమశివునికి కనికరం కలగక పోవడంతో ఏదైనా ఆహారం మాట అటుంచి ఇంతకు ముందు ఆకులు (పర్ణములు) తినేది కాస్తా ఆ ఆకులు  కూడా తినకుండా తపస్సు మరింత కఠోరం చేయడంతో ఆమె అపర్ణ అను సార్థకనామధేయముతో విరాజిల్లినది. 

చివరకు పరమశివుని చేపట్టి ఆయనదేహంలో సగం తన సొంతంజేసుకుని అర్థనారీశ్వరతత్త్వానికి ప్రతీకగా నిలచినది.

తలపై గంగ ఉన్నా, ఆ గంగను తలదన్నే ప్రేమతో పరమశివుని దేహంలో సగం దేహమై విరాజిల్లినది.

ఎవరో (భగీరథుడు) పిలిచారు. ఎవరికోసమో (సగరచక్రవర్తి కుమారుల శాపవిమోచనార్థమై) పోతూ మధ్యలో మజిలీ వేసిందిగాని సవతిగా కాదని వాదించిన మహా గడసరి పార్వతి.

 పర్వత రాజ కుమార్తె గనుక *పార్వతి* అని ఆమె పిలువబడింది. 

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం పార్వత్యై నమః* అని యనవలెను

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[19/02, 06:19] +91 95058 13235: *19.2.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది మూడవ అధ్యాయము*

*బలరామకృష్ణులు "కువలయాపీడము" అను మదపుటేనుగును చంపి మల్లరంగమున ప్రవేశించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*43.25 (ఇరువది యైదవ శ్లోకము)*

*పూతనానేన నీతాంతం చక్రవాతశ్చ దానవః|*

*అర్జునౌ గుహ్యకః కేశీ ధేనుకోఽన్యే చ తద్విధాః॥9932॥*

*43.26 (ఇరువది యారవ శ్లోకము)*

*గావః సపాలా ఏతేన దావాగ్నేః పరిమోచితాః|*

*కాలియో దమితః సర్ప ఇంద్రశ్చ విమదః కృతః॥9933॥*

*43.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*సప్తాహమేకహస్తేన ధృతోఽద్రిప్రవరోఽమునా|*

*వర్షవాతాశనిభ్యశ్చ పరిత్రాతం చ గోకులమ్॥9934॥*

దివ్యతేజోమూర్తియైన ఈ శ్రీకృష్ణుడు ఒనర్చిన కృత్యములు అద్భుతములు. అతడు రక్కసియైన పూతనను మృత్యుముఖమునకు చేర్చెను. దానవుడగు తృణావర్తుని పరిమార్చెను. మద్దిచెట్లను నేలగూల్చి, నలకూబర మణిగ్రీవులకు శాపవిముక్తిని ప్రసాదించిరి. కుబేరుని భటుడైన శంఖచూడుని హతమొనర్చెను. కేశి రాక్షసుని చెండాడెను. ధేనుకాది అసురులను సంహరించెను. ఈ మహానుభావుడు దావాగ్ని ప్రమాదమునుండి గోవులను, గోపాలురను కాపాడెను. కాళియసర్పమును మర్ధించెను. దేవేంద్రుని  గర్వమును అణచెను. ఒక్కచేతితో గోవర్ధనగిరిని ఎత్తి, దానిని అట్లే నిలిపి, ఏడు దినములపాటు సుడిగాలులతో గూడి, ఏకధాటిగా కురిసిన కుంభవృష్టినుండియు, పిడుగుపాటులనుండియు గోకులమును (గోవులను, గోవత్సములను, గోపికలను, గోపాలురను, పిల్లలను, వృద్ధులను - ఆ బాలగోపాలమును) పరిరక్షించెను.

*43.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*గోప్యోఽస్య నిత్యముదితహసితప్రేక్షణం ముఖమ్|*

*పశ్యంత్యో వివిధాంస్తాపాంస్తరంతి స్మాశ్రమం ముదా॥9935॥*

నిత్యము ఈ మహాత్ముని యొక్క ముదితముఖవికాసములను, దరహాస శోభలను, మధురప్రేక్షణములను గాంచుచు గోపికలు మిగుల ఆనందించుచుండెడివారు. ఆ ఆనందములో వారు తమ వివిధతాపములనుండి బయటపడి హాయిగా ఉండెడివారు.

*43.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*వదంత్యనేన వంశోఽయం యదోః సుబహువిశ్రుతః|*

*శ్రియం యశో మహత్వం చ లప్స్యతే పరిరక్షితః॥9936॥*

"ఈ పరమపురుషుడు దానవాది దుష్టుల బాధలనుండి ఈ యదువంశమును పరిరక్షించెను. ఈయన వలన ఈ వంశము మిగుల ఖ్యాతి వహించెను. ఈ పురుషోత్తముని కారణముగా ఇది మున్ముందు ఇతోధికముగా సిరిసంపదలతోను, యశోవైభవములతోను, మహత్త్వములతోడను వర్ధిల్లును" అని ప్రజలు అనుకొనుచుండిరి.

*43.30 (ముప్పదియవ శ్లోకము)*

*అయం చాస్యాగ్రజః శ్రీమాన్ రామః కమలలోచనః|*

*ప్రలంబో నిహతో యేన వత్సకో యే బకాదయః॥9937॥*

"ఈ మహాత్మునకు అన్నయు, కమలలోచనుడు, శుభలక్షణ సంపన్నుడు ఐన బలరాముడు ప్రలంబాసురుని హతమార్చెను. వత్సాసురుడు, బకాసురుడు మొదలగు దుష్టరాక్షసులను ఈ ప్రభువు సంహరించెను".

*43.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*జనేష్వేవం బ్రువాణేషు తూర్యేషు నినదత్సు చ|*

*కృష్ణరామౌ సమాభాష్య చాణూరో వాక్యమబ్రవీత్॥9938॥*

ప్రజలు ఇట్లనుకొనుచుండగా రంగశాలయందు తూర్యాది వాద్యముల ఘోష మిన్నంటుచుండెను. అంతట చాణూరుడను మల్లయోధుడు బలరామకృష్ణులను సంబోధించుచు ఇట్లు నుడివెను-

*43.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*హే నందసూనో హే రామ భవంతౌ వీరసమ్మతౌ|*

*నియుద్ధకుశలౌ శ్రుత్వా రాజ్ఞాఽఽహూతౌ దిదృక్షుణా॥9939॥*

"నందకుమారా! కృష్ణా! బలరామా! 'మీరు మహావీరులనియు, మల్లయుద్ధమున నిపుణులు' అనియు విని, కంసమహారాజు మీ వల్ల క్రీడాసామార్థ్యములను ప్రత్యక్షముగా చూడగోరి ఇచటికి పిలిపించెను".

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[19/02, 20:30] +91 95058 13235: *19.2.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది మూడవ అధ్యాయము*

*బలరామకృష్ణులు "కువలయాపీడము" అను మదపుటేనుగును చంపి మల్లరంగమున ప్రవేశించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*43.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*ప్రియం రాజ్ఞః ప్రకుర్వంత్యః శ్రేయో విందంతి వై ప్రజాః|*

*మనసా కర్మణా వాచా విపరీతమతోఽన్యథా॥9940॥*

మహారాజునకు త్రికరణశుద్ధిగా (మనసా, వాచా, కర్మణా) ప్రియమును గూర్చెడి ప్రజలు శుభములను పొందెదరు. అట్లుగాక అప్రియమును కలిగించెడివారు కష్టనష్టముల పాలగుదురు.

*43.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*నిత్యం ప్రముదితా గోపా వత్సపాలా యథా స్ఫుటమ్|*

*వనేషు మల్లయుద్ధేన క్రీడంతశ్చారయంతి గాః॥9941॥*

*43.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*తస్మాద్రాజ్ఞః ప్రియం యూయం వయం చ కరవామ హే|*

*భూతాని నః ప్రసీదంతి సర్వభూతమయో నృపః॥9942॥*

*చాణూరుడను మల్లయోధుడు బలరామకృష్ణులను సంబోధించుచు    ఇంకను ఇట్లు నుడువుచుండెను (ముప్పదియవ శ్లోకము నుండి కొనసాగించబడినది)*

"ప్రతిదినము ఆవులను, దూడలను మేపుచు వనములలో తిరుగుచుండునప్పుడు గోపాలురు (మీరు) మల్లయుద్ధములను నెఱపుచు ఆడుకొనుచుండిరి. ఈ విషయము అందఱును ఎఱిగినదే. కనుక యుద్ధక్రీడలలో (కుస్తీపోటీలలో) ఆఱితేఱిన మీరును మేమును ఇప్పుడు ఆ క్రీడలను ఆడి రాజుగారిని సంతోషింపజేయుదము. అట్లొనర్చుట వలన ప్రజలందఱును ప్రసన్నులగుదురు. రాజు సకల ప్రజలకు ప్రతినిధి గదా" అని పల్కెను.

*43.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*తన్నిశమ్యాబ్రవీత్కృష్ణో దేశకాలోచితం వచః|*

*నియుద్ధమాత్మనోఽభీష్టం మన్యమానోఽభినంద్య చ॥9943॥*

పరీక్షిన్మహారాజా! చాణూరుడు పలికిన మాటలను వినిన పిమ్మట, ద్వంద్వయుద్ధము చేయుట తమకుకూడ ఇష్టమైనదేనని శ్రీకృష్ణుడు భావించెను. పిమ్మట ఆ స్వామి వానికి తన అంగీకారమును తెలిపి దేశకాలములకు తగిన మాటలను ఇట్లు బదులుచెప్పెను-

*43.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*ప్రజా భోజపతేరస్య వయం చాపి వనేచరాః|*

*కరవామ ప్రియం నిత్యం తన్నః పరమనుగ్రహః॥9944॥*

*43.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*బాలా వయం తుల్యబలైః క్రీడిష్యామో యథోచితమ్|*

*భవేన్నియుద్ధం మాధర్మః స్పృశేన్మల్లసభాసదః॥9945॥*

"చాణూరా! మీరేగాదు. వనములలో సంచరించుచు జీవించుచున్నట్టి మేమును కంసమహారాజు యొక్క పాలనలోని వారమే. అందువలన ఆయనకు నిరంతరము ప్రియమును గూర్చుచుండుట మాకును కర్తవ్యమే. అంతేగాక! అది మాకు మిగుల శ్రేయోదాయకము గూడా.  కనుక మల్లయోధుడా! మేము పసిబాలురము. మాతో సమానమైన బలముగల బాలురతోడనే యుద్ధక్రీడ సలుపుట ధర్మము. ఒకరు బలవంతులు, మఱియొకరు బలహీనులు ఐన వారిమధ్య ద్వంద్వయుద్ధము  జరుగుట అధర్మము. అధర్మ యుద్ధము వలన  ప్రాప్తించెడి పాపము (పాపఫలము) ప్రేక్షకులను తాకరాదుగదా" అనెను.

*చాణూర ఉవాచ*

*43.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*న బాలో న కిశోరస్త్వం బలశ్చ బలినాం వరః|*

*లీలయేభో హతో యేన సహస్రద్విపసత్త్వభృత్॥9946॥*

*43.40 (నలుబదియవ శ్లోకము)*

*తస్మాద్భవద్భ్యాం బలిభిర్యోద్ధవ్యం నానయోఽత్ర వై|*

*మయి విక్రమ వార్ష్ణేయ బలేన సహ ముష్టికః॥9947॥*

*అంతట చాణూరుడు ఇట్లనెను* "కృష్ణా! నీవు గాని, బలరాముడుగాని, బాలురు గాని కిశోరులు ఎంతమాత్రమూగాదు. మీరు ఇరువురును బలపరాక్రమ సంపన్నులే. ఎందుకనగా, వేయి యేనుగుల బలముగల *కువలయాపీడము* అను మదపుటేనుగును (మేము అందఱమూ చూచుచుండగనే) మీరు అవలీలగా హతమార్చితిరి. అందువలన మిక్కిలి బలిష్ఠులైన మీరు బలసంపన్నులమైన మా వంటివారితో ద్వంద్వయుద్ధము చేయుట న్యాయమే. ఏవిధముగను  అన్యాయము గాదు. కనుక, శ్రీకృష్ణా! నీ పరాక్రమము నాపై చూపుము. బలరాముడు తన బలమును  ముష్టికునిపై ప్రదర్శింపగలడు".

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే కువలయాపీడవధో నామ త్రిచత్వారింశోఽధ్యాయః  (43)*

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి *బలరామకృష్ణులు 'కువలయాపీడము' అను మదపుటేనుగును చంపి మల్లరంగమున ప్రవేశించుట* యను నలుబది మూడవ అధ్యాయము (43)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[19/02, 20:30] +91 95058 13235: *🕉️🕉️శ్రీ దుర్గాసప్తశతి🕉️🕉️*

*ప్రథమాధ్యాయము* 19.2.2021

*🙏🙏🙏ఓం నమశ్చండికాయై🙏🙏🙏*

*తస్థౌ కంచిత్స కాలం చ మునినా తేన సత్కృతః|*

*ఇతశ్చేతశ్చ విచరంస్తస్మిన్మునివరాశ్రమే|011|*

సురథుడా మునిచే సత్కరింపబడి, ఆ యాశ్రయమమున ఇటునటు విహరించుచు కొంతకాలముండెను.

*సోఽచింతయత్తదా తత్ర మమత్వాకృష్టచేతనః|*

*మమత్పూర్వైః పాలితం పూర్వం మయా హీనం పురం హి తత్|012॥*

అతడచ్చట మమకారమునకు లోనై ఇట్లు తలంచెను.

*మద్భృత్యైస్తైరసద్వృత్తైర్ధర్మతః పాల్యతే న వా|*

*న జానే స ప్రధానో మే శూరహస్తీ సదామదః|013॥*

నా పూర్వులేలిన నా పట్టణమునకు నేను వెలి అయితిని. దుస్వభావులు నా భృత్యులు. దానిని న్యాయముగా పాలింతురో లేదో.

*మమ వైరివశం యాతః కాన్ భోగానుపలస్స్యతే|*

*యే మమానుగతా నిత్యం ప్రసాదధనభోజనైః|014|*

నా పట్టపుటేనుగు ఎప్పుడు మదించి యుండునది. వైరుల వశమై ఏమి సుఖములనుభవించునో?

*అనువృత్తిం ధ్రువం తేఽద్యకుర్వంత్యన్యమహీభృతామ్|*

*అసమృగ్వ్యయశీలైస్తైః కుర్వద్భిః సతతం వ్యయమ్|015|*

నా దయకు పాత్రులై నిత్యము ధనభోజనములతో నన్ననునరించువారు పరులసేవలకు పాటుపడిరి.

*సంచితః సోఽతిదుఃఖేన క్షయం కోశో గమిష్యతి|*

*ఏతచ్చాన్యచ్చ సతతం చింతయామాస పార్థివః|016॥*

పెక్కు శ్రమలకు గుఱియై కూర్చిన నా భండారము దుర్వ్యయశీలుర వలన తరిగి నశించిపోవును.

*తత్ర విప్రాశ్రమాభ్యాసే వైశ్యమేకం దదర్శ సః|*

*స పృష్టస్తేన కస్త్వం భో హేతుశ్చాగమనేఽత్రకః|017॥*

మరియు అనేక విధములుగా చింతించుచున్న ఆ రాజునకు ఆ యాశ్రమ ప్రాంతమున ఒక వైశ్యుడగుపడెను.

*సశోక ఇవ కస్మాత్త్వం దుర్మనా ఇవ లక్ష్యసే|*

*ఇత్యాకర్ణ్య వచస్తస్య భూపతేః ప్రణయోదితమ్|018|*

రాజు అతనిని 'నీవెవరు? ఇచటకేల వచ్చితివి? మనసు కలతపడి దుఃఖించుచున్నట్లున్నావు కారణమేమి?' యని అడిగెను.

(తరువాయి వచ్చేవారం)

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

[20/02, 05:24] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*822వ నామ మంత్రము* 20.02.2021

*ఓం బ్రహ్మణే నమః*

పరబ్రహ్మస్వరూపురాలైన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *బ్రహ్మా* యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం బ్రహ్మణే నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరబ్రహ్మ స్వరూపురాలైన పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకునకు ప్రప్రథమముగా ఆ పరమేశ్వరి ఆ సాధకునకు పరబ్రహ్మమును తెలుసుకొను సాధనలో దీక్షాపటిమను అనుగ్రహించి ఐహిక బంధముల వలన ఏర్పడు ప్రతిబంధకములను తొలగించి నిర్విఘ్నముగా సాధన కొనసాగుదిశగా నడిపించును.

*బ్రహ్మ* అనగానే మనకు స్ఫురించు అర్థము చతుర్ముఖబ్రహ్మ.   బ్రహ్మ అంటే అన్నిటికీ మిన్నయైనది, అంతకు ఆవల ఇంకేమియు తెలియవలసినది లేదనే పరబ్రహ్మము మాత్రమే!  జగన్మాత అట్టి పరబ్రహ్మ స్వరూపిణి యగుటచే ఆ తల్లి *బ్రహ్మా* యని అనబడినది. *ఓం బ్రహ్మణే నమః*  యని ఉచ్చరించుచూ నమస్కరింపదగినది. *బ్రహ్మ* యనగా ముక్తులగు వారిచే పొందబడిన *స్వాత్మాభిన్నమైన ఆత్మజ్ఞానస్వరూపము* అని  భాస్కర రాయలు వారు చెప్పారు. . *భేదశూన్యమైన సత్తామాత్రము త్రికాలములందు ఉండునది, వాక్కులకు గోచరించనిది, మాటలతో బోధింపశక్యము కానిది, ఆత్మచేతనే తెలియదగిన ఏ జ్ఞానము కలదో అదియే బ్రహ్మ* యని విష్ణుపురాణము నందు గలదని కూడా చెప్పారు. దీనినే జ్ఞానము అని కూడా అందురు. అటువంటి బ్రహ్మస్వరూపిణి జగన్మాత గనుక *బ్రహ్మా* యని అనబడినది.

పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం బ్రహ్మణే నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[20/02, 05:24] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*247వ నామ మంత్రము* 20.02.2021

*ఓం పద్మనయనాయై నమః*

పద్మములవంటి, సుకుమారములైన , విశాలములైన నేత్రములతో విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పద్మనయనా*  యను అయిదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం పద్మనయనాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ  జగదీశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ కరుణా తరంగితాక్షియైన జగన్మాత వారిని అత్యంతవినయసౌశీల్యులు గాను, భగవద్భక్తిప్రపూరిత హృదయులుగాను ప్రవర్తింపజేయును బ్రహ్మానందమయ జీవనమును ప్రసాదించును.

వ్యాసులవారు, కాళిదాసాది మహాకవులు జగన్మాత యొక్క సౌందర్య సంపదను విశేషంగా వర్ణించి తరించారు. 

 అమ్మవారి నేత్రాలను శంకరభగవత్పాదులవారు సౌందర్యలహరిలోని శ్లోకాలలో ఇలా వర్ణించారు.

 దేవి కుడికన్ను సూర్యునివలె పగటిని, ఎడమకన్ను చంద్రునివలె రాత్రిని చేయుచున్నవి. మూడవ నేత్రము సంధ్యాకాలమును కలిగించుచున్నది.

దేవి చూపు విపులమై, మంగళకరమై, దుర్జయమై, దయారసపూరితమై, అవ్యక్త మధురమై, పరిపూర్ణ భోగవతియై, భక్తులను రక్షించునదై అనేక నగరముల బహుముఖవిజయము కలదై యున్నది. ఆ తల్లి నేత్రద్వయము ఆకర్ణాంతము విస్తరించి నల్లని తుమ్మెదలవలె నున్నవి. కావ్యరస మాధుర్య భరితమైన చెవులనెడు పుష్పములనుండి మకరందము నాస్వాదించుచున్నవి. వాటిని చూచి అసూయచే మూడవ కన్ను కొంచెము ఎరుపెక్కినది.

శ్రీ అమ్మ వారి చూపు శివునియందు శృంగారము గలది. అన్యులయందు బీభత్సము గలది. గంగ (సవతి) యందు కోపము గలది. శివుని చరిత్రయందు అద్భుతము గలది. శివుడు ధరించిన సర్పములవలన భయమొందినది. పద్మమును మించిన సౌందర్యము గలది. చెలులయందు చిఱునగవులు గలది. నాయందు (ఆది శంకరాచార్యుని యందు లేదా భక్తునియందు) దయ గలది.

దేవి కన్నులు ఆమె చెవులవరకు లాగబడిన, రెప్పల వెండ్రుకలనెడు ఈకలు కలిగిన మన్మథ బాణములవలెనున్నవి. ఈశ్వరుని చిత్తమును కలచివేయుటయే ఆ బాణముల లక్ష్యము.

దేవి మూడు కన్నులందును కాటుక ధరించియన్నందున ఎరుపు, తెలుపు, నలుపు వర్ణములు మిళితములైయున్నవి. మహాప్రళయమునందు పరమాత్మలో లీనమైన బ్రహ్మ, విష్ణు, రుద్రులను భవానిదేవి శివునితోగూడి మరల సృజించుటకై ధరించిన సత్వ రజస్ తమో గుణములవలె ప్రకాశించుచున్నవి.

దేవి కన్నులలోని ఎరుపు, తెలుపు, నలుపు రంగులు ఎఱ్ఱని శోణానది, తెల్లని గంగానది, నల్లని యమునానది అనెడు తీర్ధముల పాపహరమైన సంగమము వలె యున్నవి. జగన్మాత కనులు మూయుటవలన లోక సంహారము, తెరచుట వలన సృష్టి జరుగునందురు. సకల జగములను రక్షించుటకొరకై ఆమె రెప్పలు మూయకుండ ఉండునని భావము. అపర్ణాదేవి కన్నులు మీనము లవలెనున్నవని వర్ణన.

శివాని! నీ చల్లని చూపును నాపై ప్రసరింపజేయుమని ప్రార్థన.

పర్వతరాజపుత్రి కనుల అంచులు ధనుస్సులవలెనున్నవి. ఆ దేవి కడగంటి చూపులు బాణములను ఎక్కుపెట్టుచున్నవా అన్నట్లు ఆ కనుల అంచులను దాటి చెవులవరకు పోవుచున్నట్లు భ్రమను కలుగజేయుచున్నవి. (ఆ విశాలాక్షి కన్నులు చెవులవరకు వ్యాపించియున్నవని భావము).

అమ్మవారి ముఖకాంతి యనెడి ప్రవాహంలో ఇటునటు అత్యంత మనోహరంగా చురుకుగా చలించే రెండు చేప పిల్లలతో అమ్మవారి కనులు పోల్చబడినట్లు శ్రీలలితా సహస్ర నామావళిలోని 18వ నామ మంత్రంలో  *వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా* యని ఉన్నవైనం మనందరకూ తెలిసినదేగదా! ఇప్పుడు ఈ నామ మంత్రంలో అమ్మవారి కనులు పద్మములతో పోల్చబడినవి. అదికూడా, అమ్మవారి నేత్రాలు వామనేత్రం శ్వేతవర్ణ పద్మముతోను అనగాచంద్రాత్మకముగాను, దక్షిణ నేత్రం రక్తవర్ణ పద్మముతోను, సూర్యాత్మకంగాను భావించడం జరిగినది. అంతటి మనోహరనేత్రాలతో అమ్మవారు కామేశ్వరుని ముఖమును మనసులో అవలోకించగానే గణేశ్వరుడు ఉద్భవించాడు *కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా* (లలితా సహస్ర నామావళి యందలి 77వ నామ మంత్రము) అని కూడా చెప్పబడినది. అంతటి మువురమ్మల మూలఫుటమ్మయైన ఆ కాత్యాయని మనలనందరినీ చల్లనిచూపులతో బ్రోచుగాక! 

జగన్ళాతకు నమస్కరించునపుడు *ఓం పద్మనయనాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, V సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[20/02, 05:24] +91 95058 13235: *20.2.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది నాలుగవ అధ్యాయము*

*బలరామకృష్ణులు చాణూరముష్టికాది మల్లులను, కంసుని సంహరించుట దేవకీవసుదేవులకు బంధవిముక్తి కలిగించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*

*44.1 (ప్రథమ శ్లోకము)*

*ఏవం చర్చితసంకల్పో భగవాన్మధుసూదనః|*

*ఆససాదాథ చాణూరం ముష్టికం రోహిణీసుతః॥9948॥*

*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! ఈ విధముగా కృష్ణపరమాత్మ చాణూరాది మల్లయోధులను వధించుటకు సంకల్పించుకొనెను. అంతట ఆ ప్రభువు చాణూరినితోను, బలరాముడు ముష్టికునితోడను ద్వంద్వయుద్ధము చేయుటకు సర్వసన్నద్ధులై వారిని సమీపించిరి.

*44.2 (రెండవ శ్లోకము)*

*హస్తాభ్యాం హస్తయోర్బద్ధ్వా పద్భ్యామేవ చ పాదయోః|*

*విచకర్షతురన్యోన్యం ప్రసహ్య విజిగీషయా॥9949॥*

అనంతరము వారు చేతులతో చేతులను పట్టుకొని, పాదములకు పాదములను అడ్డముగా నిలిపి, పరస్పర జయేచ్ఛతో ఒకరినొకరు తమవైపునకు లాగికొనసాగిరి.

*44.3 (మూడవ శ్లోకము)*

*అరత్నీ ద్వే అరత్నిభ్యాం జానుభ్యాం చైవ జానునీ|*

*శిరః శీర్ష్ణోరసోరస్తావన్యోన్యమభిజఘ్నతుః॥9950॥*

ఇంకను వారు పరస్పరము పెనవైచుకొనుచు, మోచేతులపై మోచేతులతోను, మోకాళ్ళపై మోకాళ్ళతోను, శిరస్సులను శిరస్సులతోను, వక్షస్థలములను వక్షస్థలములతోను మోదుకొనుచు ఒకరిపైనొకరు దెబ్బతీయదొడంగిరి.

*44.4 (నాలుగవ శ్లోకము)*

*పరిభ్రామణవిక్షేపపరిరంభావపాతనైః|*

*ఉత్సర్పణాపసర్పణైశ్చాన్యోన్యం ప్రత్యరుంధతామ్॥9951॥*

పరిభ్రమణము (ప్రత్యర్థిని చేతులతో పట్టుకొని చుట్టును గిరగిర త్రిప్పుట), విక్షేపము (దూరమునకు నెట్టివేయుట), పరిరంభణము (బాహువులతో అదిమిపట్టి పీడించుట), అవపాతము (క్రిందబడవేయుట), ఉత్సర్పణము (విడిచిపెట్టి ముందునకు పరుగెత్తుట), అపసర్పణము (వెనుకకు నడచుట) మొదలగు ప్రక్రియలతో కృష్ణచాణురులు, ముష్టిక బలరాములు ద్వంద్వయుద్ధమును జరిపిరి.

*44.5 (ఐదవ శ్లోకము)*

*ఉత్థాపనైరున్నయనైశ్చాలనైః స్థాపనైరపి|*

*పరస్పరం జిగీషంతావపచక్రతురాత్మనః॥9952॥*

ఇంకను ఉత్థాపనము (పాదములను, మోకాళ్ళను పిండి పిండిగావించి పడద్రోసిలేపుట), ఉన్నయనము (ప్రత్యర్థిని చేతులతో పైకెత్తి తీసికొనిపోవుట), చాలనము (నడుము దగ్గఱ పట్టుకొని త్రోసివేయుట), స్థాపనము (చేతులను, పాదములను ఒకటిగాజేసి పీడించుట) మొదలగు రీతులలో పరస్పర జయేచ్ఛతో వారు పోరాడిరి.

*44.6 (ఆరవ శ్లోకము)*

*తద్బలాబలవద్యుద్ధం సమేతాః సర్వయోషితః|*

*ఊచుః పరస్పరం రాజన్ సానుకంపా వరూథశః॥9953॥*

పరీక్షిన్మహారాజా! రంగస్థలము జరుగుచున్న ఆ ద్వంద్వయుద్ధమును గాంచుటకై స్త్రీలు గుంపులు గుంపులుగా అచటికి చేరియుండిరి. బలవంతులైన మల్లయోధులకును, సుకుమారులైన బాలురకును మధ్య 'ఇట్లు బలహీనులకు బలవంతులతో యుద్ధము జరుగుట అన్యాయము' అని నొచ్చుకొనుచు వారు జాలితో తమలో తాము ఇట్లనుకొనిరి.

*44.7 (ఏడవ శ్లోకము)*

*మహానయం బతాధర్మ ఏషాం రాజసభాసదామ్|*

*యే బలాబలవద్యుద్ధం రాజ్ఞోఽన్విచ్ఛంతి పశ్యతః॥9954॥*

"రాజసభలోనున్న వీరు అందఱును బలవంతులకును దుర్బలులకును మధ్య నడచుచున్న ఈ ద్వంద్వయుద్ధమును కనులప్పగించి  చూచుచుండిరేగాని, ఇట్లు జరుగుట అధర్మము  అని పలుకుచు దీనిని నివారింపరైరి. దీనిని ప్రత్యక్షముగా చూచుచున్న రాజుతో పాటు వీరును దీనిని ఆమోదించుచుండిరి.

*44.8 (ఎనిమిదవ శ్లోకము)*

*క్వ వజ్రసారసర్వాంగౌ మల్లౌ శైలేంద్రసన్నిభౌ|*

*క్వ చాతిసుకుమారాంగౌ కిశోరౌ నాప్తయౌవనౌ॥9955॥*

*44.9 (తొమ్మిదవ శ్లోకము)*

*ధర్మవ్యతిక్రమో హ్యస్య సమాజస్య ధ్రువం భవేత్|*

*యత్రాధర్మః సముత్తిష్ఠేన్న స్థేయం తత్ర కర్హిచిత్॥9956॥*

వజ్రములవలె దృఢమైన అంగములు గలిగి, పర్వతములవలె   ఒప్పుచున్న ఈ మల్లుయోధులెక్కడ? ఇంకను యౌవనదశకు చేరక కిశోరావస్థలో సుకుమారులైయున్న ఈ బలరామకృష్ణులెక్కడ? ఈ సమాజము అంతయును (ఇచటివారు అందఱునూ) ఈ విషమయుద్ధమును చూచుచు మిన్నకుండుట ఎంతేని అధర్మము. ఇది ముమ్మాటికిని నిజము. ఇట్లు ఉపేక్ష వహించుట తగదు. దీని వలన పాపములు చుట్టుకొనును. అధర్మము జరుగుచున్న చోట ఒక్క క్షణము గూడ నిలువరాదు. కనుక మనము ఎంతమాత్రమూ ఉండుట తగదు".

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[20/02, 21:28] +91 95058 13235: *20.2.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది నాలుగవ అధ్యాయము*

*బలరామకృష్ణులు చాణూరముష్టికాది మల్లులను, కంసుని సంహరించుట దేవకీవసుదేవులకు బంధవిముక్తి కలిగించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*44.10 (పదియవ శ్లోకము)*

*న సభాం ప్రవిశేత్ప్రాజ్ఞః సభ్యదోషాననుస్మరన్|*

*అబ్రువన్ విబ్రువన్నజ్ఞో నరః కిల్బిషమశ్నుతే॥9957॥*

మఱికొందరు వనితలు ఇట్లు పలికిరి. 'సదస్యుల దోషములను ఎఱింగియున్నప్పుడు ప్రాజ్ఞుడైనవాడు అందు (ఆ సభలో) ప్రవేశింపరాదు. ఒకవేళ ప్రవేశించినచో అచట జరుగుచున్న దోషములను ఎత్తిచూపక మిన్నకుండుటగాని, విపరీతముగా పలుకుటగాని లేక 'ఇది నాకు తెలియదు' అని పలుకుటగాని మూర్ఖలక్షణము. అట్టి వానికి పాపములు అంటును.

*44.11 (పదకొండవ శ్లోకము)*

*వల్గతః శత్రుమభితః కృష్ణస్య వదనాంబుజమ్|*

*వీక్ష్యతాం శ్రమవార్యుప్తం పద్మకోశమివాంబుభిః॥9958॥*

*ఇంకను కొందఱు కాంతలు ఇట్లు వచించిరి* "శత్రువు చుట్టును పరుగిడుచున్న శ్రీకృష్ణుని ముఖారవిందము ద్వంద్వయుద్ధ శ్రమవలన స్వేదబిందువులతో నిండియున్నది. అది జలకణములతో పరివ్యాప్తమైన పద్మకోశము (మొగ్గ) వలె అలరారుచున్నది".

*44.12 (పండ్రెండవ శ్లోకము)*

*కిం న పశ్యత రామస్య ముఖమాతామ్రలోచనమ్|*

*ముష్టికం ప్రతి సామర్షం హాససంరంభశోభితమ్॥9959॥*

"అది సరే! బలరాముని ముఖమును చూచినారా? ముష్టికునిపైగల క్రోధముతో కన్నులు ఎర్రబాఱియున్నవి. ఐనను ఆ స్వామి ముఖము చిఱునవ్వుతో, ఆవేశస్ఫోరకమై విలసిల్లుచున్నది".

*44.13 (పదమూడవ శ్లోకము)*

*పుణ్యా బత వ్రజభువో యదయం నృలింగగూఢః పురాణపురుషో వనచిత్రమాల్యః|*

*గాః పాలయన్ సహబలః క్వణయంశ్చ వేణుం విక్రీడయాంచతి గిరిత్రరమార్చితాంఘ్రిః॥9960॥*

*మఱికొందరు స్త్రీలు ఇట్లు నుడివిరి* "శంకరుడు. బ్రహ్మాదిదేవతలు, జగజ్జననియైన లక్ష్మీదేవియు శ్రీమన్నారాయుణిని పాదపద్మములను నిత్యము భక్తితో అర్చించుచుందురు. అట్టి వైకుంఠపతియే తన దివ్యలక్షణములను మఱుగుపఱచి మానవరూపమున శ్రీకృష్ణుడై అవతరించెను. కృష్ణప్రభువు నిత్యము చిత్రవిచిత్రములైన వనపుష్పమాలలతో విరాజిల్లుచుండును. ఆ స్వామి తన అన్నయగు బలరామునితోగూడి గోవులను పాలించుచుండును. ఆయన వేణువునుండి వెలువడు మధురధ్వనులు వీనులవిందు గావించుచుండును. ఆ స్వామి ఆటలపాటలతో బృందావన భూములయందు విహరించుచుండును. ఆ పురుషోత్తముని పాదస్పర్శకు నోచుకొనుటవలన వ్రజభూమి అంతయును పవిత్రమైనది,  ఆహా! ఎంత ధన్యమైనది".

*44.14 (పదియవ శ్లోకము)*

*గోప్యస్తపః కిమచరన్ యదముష్య రూపం లావణ్యసారమసమోర్ధ్వమనన్యసిద్ధమ్|*

*దృగ్భిః పిబంత్యనుసవాభినవం దురాపమేకాంతధామ యశసః శ్రీయ ఐశ్వరస్య॥9961॥*

*మఱికొందరు స్త్రీలు ఇంకను ఇట్లు నుడివిరి* సఖులారా! గోపికలు నిరంతరము శ్రీకృష్ణునియొక్క రూపమాధుర్యమును తమ నేత్రములద్వారా ఆస్వాదించుచు, ఆనందించుచుందురు. వారు తమ పూర్వజన్మలలో ఎట్టి తపస్సులను ఆచరించిరో? (ఎట్టి నోములను నోచిరో) ఏమో! ఆయన రూపము దివ్యము, ఏకత్రరాశీభూతమైన సర్వలోకలావణ్యసారము. దానితో సమానమైనది లేనేలేదు. ఇక మించినది (అధికమైనది)  ఎట్లుండును? ఆయన రూపలావణ్య వైభవములు వస్త్రాభరణములతో వచ్చినవి కావు, సహజసిద్ధములు. ఆ దివ్యరూపమును ఎంతగా చూచినను తనివి తీరదు. అది నిత్యనూతనము. ఐశ్వర్యమునకు, సౌందర్యమునకు, యశస్సునకు అది నిధానమైనది. ఆ అద్భుతరూప దర్శనభాగ్యము గోపికలను తప్ప ఇతరులకు దుర్లభము. నిజముగా ఆ గోపాంగనల అదృష్టమే అదృష్టము".

*44.15 (పదిహేనవ శ్లోకము)*

*యా దోహనేఽవహననే మథనోపలేప్రేంఖేంఖనార్భరుదితోక్షణమార్జనాదౌ|*

*గాయంతి చైనమనురక్తధియోఽశ్రుకంఠ్యో  ధన్యా వ్రజస్త్రియ ఉరుక్రమచిత్తయానాః॥9962॥*

*మఱికొందరు స్త్రీలు ఇంకను ఇట్లు నుడివిరి* వ్రేపల్లెయందలి గోపికలు పాలు పితుకుచును, ధాన్యాదులను దంచునప్పుడును, పెఱుగులు చిలుకుచున్నప్పుడును, ఇండ్లను అలుకుచును, చిన్నారులను నిద్రపుచ్చుచు, ఉయ్యాలలను ఊపుచున్నప్పుడును, పిల్లలను జోకొట్టుచును (సముదాయించుచును), ఇండ్లముందు ఊడ్చుచున్నప్పుడును, కలాపి చల్లుచున్నప్పుడును, శ్రీకృష్ణప్రభువునందే తమ చిత్తములను లగ్నమొనర్చి, ఆర్ధ్రహృదయముతో ఆనందపరవశులై ఆ స్వామిని కీర్తించుచుందురు. కనుక, వారు ఎంతయో ధన్యురాండ్రు".

*44.16 (పదహారవ శ్లోకము)*

*ప్రాతర్వ్రజాద్వ్రజత ఆవిశతశ్చ సాయం గోభిః సమం క్వణయతోఽస్య నిశమ్య వేణుమ్|*

*నిర్గమ్య తూర్ణమబలాః పథి భూరిపుణ్యాః పశ్యంతి సస్మితముఖం సదయావలోకమ్॥9963॥*

*మఱికొందరు స్త్రీలు ఇంకను ఇట్లు నుడివిరి* "శ్రీకృష్ణుడు ప్రాతఃకాలమునందు గోవులను మేపుటకై గోకులమునుండి వనమునకు వెళ్ళుచుండెడివాడు. సాయంసమయమున గోవులతోగూడి వ్రజభూమికి తిరిగి వచ్చుచుండెడివాడు. అప్పుడు ఆ స్వామి వీనులవిందుగా మురళిని ఊదుచుండెడివాడు. ఆ మధురవేణునాదమును విన్నంతనే గోపికలు తమ పనులను అన్నింటిని ప్రక్కనబెట్టి పరమసంతోషముతో పరుగుపరుగున తమ ఇండ్లనుండి బయటికి వచ్చెడివారు. ఆ సమయమున చిఱునవ్వుల కాంతులతోను, దయాపూర్ణములైన చూపులతో సోయగము లొలుకుచుండెడి ఆ స్వామియొక్క ముఖసౌందర్యమును కన్నులప్పగించి చూచుచు గోపికలు పరమానందభరితులగుచుండెడివారు. యథార్థముగా ఆ గోపాలాంగనలు ఎంతటి పుణ్యాత్ములోగదా".

[21/02, 05:52] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*248వ నామ మంత్రము* 21.02.2021

*ఓం పద్మరాగ సమప్రభాయై నమః*

పద్మరాగ మాణిక్యముతో సమానమైన శరీర కాంతిగల లలితాంబకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పద్మరాగసమప్రభా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం పద్మరాగ సమప్రభాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు సాధకులకు ఈ  పరమేశ్వరి నామ మంత్ర జపముతో  జన్మజన్మాంతర కర్మఫలములు తొలగి, కైవల్యపదమునకు మార్గము గోచరించును.

పరమేశ్వరి పద్మరాగ మణులనుబోలిన ఎర్రని కాంతి గల దేహముతో ప్రభాసిల్లుతున్నది. ఇంతకు ముందు పదునాలుగవ (14వ) నామ మంత్రములో అమ్మవారు *కురువిందమణి శ్రేణీ కనత్కోటీర మండితా* (పద్మరాగమణులు పొదగబడిన కిరీటశోభతో ప్రభాసిల్లుచున్నది) యని స్తోత్రము చేయబడినది. అలాగే " *పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః* (పద్మరాగ శిలలను, అద్దాన్ని సైతం తిరస్కరించే నున్ననైన, నిర్మలమైన చెక్కిలి గలది జగన్మాత" యని ఇరువదియవ (20వ) నామ మంత్రములో స్తుతింపబడినది.

ఈ పద్మరాగమణులు సింహళదేశంలో దొరకునని అంటారు.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం పద్మరాగసమప్రభాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[21/02, 05:52] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*823వ నామ మంత్రము* 21.02.2021

*ఓం జనన్యై నమః*

సకల జగములకు మాతయైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *జననీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం జనన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులను అ పరబ్రహ్మస్వరూపిణి సర్వకాల సర్వావస్థలయందును వెన్నంటి ఆపదలను కలుగనీయక, శాంతిసౌఖ్యములను కలుగజేస్తూ, ఆయురారోగ్యములను ప్రసాదిస్తూ, పరమానందభరితమైన జీవనమును అనుగ్రహించి, సద్గతులను సంప్రాప్తింపజేయును.

లలితా సహస్ర నామావళిలో ప్రథమనామంతోనే *శ్రీమాతా* అని అమ్మవారిని స్తుతిస్తున్నాము.  సకలజగత్తులను సృష్టించి, ప్రాణికోటికి కావలసిన ప్రాణవాయువు, ఆహారము, నీరు మొదలైన జీవనావసరములను సమకూర్చి, ప్రాణికోటి జీవనవ్యాపార గమనమునకు  ఆధారభూతురాలై విరాజిల్లు పరమేశ్వరి జగత్తుకు మాతృస్వరూపిణి గనుకనే *జననీ*  యని అనబడినది. సృష్టికి పూర్వమే తానున్నది. సృష్టికార్యమును తానే సంకల్పించినది. సృష్టికర్తయైనబ్రహ్మను సృష్టించినది తానై బ్రహ్మ *జనని* యైనది. సకల జగత్తులను బ్రహ్మద్వారా సృష్టింపజేసి, స్థితికి విష్ణువును, లయమునకు పరమేశ్వరుడిని నియమించి సృష్టిస్థితిలయ కార్యములను తానే పర్యవేక్షిస్తూ విశ్వజనని యైనది. పరమేశ్వరియే పరబ్రహ్మ స్వరూపమైన వేదములను బ్రహ్మముఖము నుండి ప్రభవింపజేసినది. 

అమ్మవారిని బమ్మెర పోతనామాత్యులవారు ఇలా స్తుతించారు:-

*ఉత్పలమాల*

అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె

ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా

యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.

*భావము*

దుర్గాదేవి తల్లు లందరికి తల్లి; సప్తమాతృకలను కన్నతల్లి; ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి; అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి; రక్కసి మూకలను అణచిన యమ్మ; నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి; అయిన మా అమ్మ దయాసముద్రి అయి ఈ మహాభాగవత తెలుగు ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.

అటువంటి పరమేశ్వరికి నమస్కరించునపుడు  *ఓం జనన్యై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[21/02, 05:52] +91 95058 13235: *21.2.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది నాలుగవ అధ్యాయము*

*బలరామకృష్ణులు చాణూరముష్టికాది మల్లులను, కంసుని సంహరించుట దేవకీవసుదేవులకు బంధవిముక్తి కలిగించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*44.17 (పదిహేడవ శ్లోకము)*

*ఏవం ప్రభాషమాణాసు స్త్రీషు యోగేశ్వరో హరిః|*

*శత్రుం హంతుం మనశ్చక్రే భగవాన్ భరతర్షభ॥9964॥*

*శ్రీశుకుడు ఇట్లు పలుకుచుండెను* పరీక్షిన్మహారాజా! మథురాపురకాంతలు ఇట్లు మాట్లాడుకొనుచుండగా యోగేశ్వరుడైన శ్రీకృష్ణపరమాత్మ ద్వంద్వయుద్ధమున తనకు ప్రత్యర్ధిగా నున్న చాణూరుని హతమార్చుటకు నిశ్చయించుకొనెను.

*44.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*సభయాః స్త్రీగిరః శ్రుత్వా పుత్రస్నేహశుచాఽఽతురౌ|*

*పితరావన్వతప్యేతాం పుత్రయోరబుధౌ బలమ్॥9965॥*

ఇట్లు మథురానగర స్త్రీలు భయాందోళనలతో పలుకుచున్న మాటలను విన్నంతనే దేవకీవసుదేవులు మిగుల భీతిల్లుచు విహ్వలులైరి. బాలురైన బలరామకృష్ణులయొక్క బలపరాక్రమములను ఎఱుగక పుత్రమమకార ప్రభావమున వారు మిక్కిలి ఆందోళనకు లోనైరి.

*44.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*తైస్తైర్నియుద్ధవిధిభిర్వివిధైరచ్యుతేతరౌ|*

*యుయుధాతే యథాన్యోన్యం తథైవ బలముష్టికౌ॥9966॥*

శ్రీకృష్ణ చాణూరులు వివిధములగు ఆయా ద్వంద్వయుద్ధ విధానములతో (పరిభ్రమణ విక్షేపాదులతో) పెనుగులాడుచు పోరాడుచుండిరి. అట్లే బలరామముష్టికులును పోరుసలుపుచుండిరి.

*44.20 (ఇరువదియవ శ్లోకము)*

*భగవద్గాత్రనిష్పాతైర్వజ్రనిష్పేషనిష్ఠురైః|*

*చాణూరో భజ్యమానాంగో ముహుర్గ్లానిమవాప హ॥9967॥*

కృష్ణభగవానుని యొక్క అంగములన్నియును వజ్రములవలె కఠినాతి కఠినములైనవి. ఆ స్వామి బలమైన తన మోచేతులతో, మోకాళ్ళతో పదేపదే తీవ్రముగా పొడుచుచుండుటవలన చాణూరుని దేహమంతయును పూర్తిగా హూనమైపోవుచుండెను. ఆ పోటులకు తాళజాలక ఆ మల్లయోధుడు (చాణూరుడు) ఎంతయు అలసిపోవుచుండెను.

*44.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*స శ్యేనవేగ ఉత్పత్య ముష్టీకృత్య కరావుభౌ|*

*భగవంతం వాసుదేవం క్రుద్ధో వక్షస్యబాధత॥9968॥*

అంతట ఆ చాణూరుడు క్రుద్ధుడై, డేగవేగముతో ఎగిరి, తన రెండు చేతుల పిడికిళ్ళను బిగించి, శ్రీకృష్ణభగవానుని వక్షస్థలముపై బలముగా దెబ్బతీసెను.

*44.22 (ఇరువది రెండవ  శ్లోకము)*

*నాచలత్తత్ప్రహారేణ మాలాహత ఇవ ద్విపః|*

*బాహ్వోర్నిగృహ్య చాణూరం బహుశో భ్రామయన్ హరిః॥9969॥*

*44.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*భూపృష్ఠే పోథయామాస తరసా క్షీణజీవితమ్|*

*విస్రస్తాకల్పకేశస్రగింద్రధ్వజ ఇవాపతత్॥9970॥*

కాని, శ్రీకృష్ణుడు పూలమాలలతో కొట్టబడిన ఏనుగువలె, ఆ శత్రువుయొక్క పిడికిలి పోటులకు ఏమాత్రమూ చలించలేదు. అంతేగాక! ఆ ప్రభువు తన రెండు చేతులతో ఆ చాణూరుని పట్టుకొని,  వేగముగా త్రిప్పి, నేలకేసికొట్టెను. అట్లు త్రిప్పుచున్నప్పుడే ఆ మల్లుని ప్రాణాలు పైకెగిరిపోయెను. ఆ మల్లుని కేశములు, మాలలు చెదరిపోయెను. వేషభూషలు అన్నియును అస్తవ్యస్తము లాయెను. అతడు ఇంద్రధ్వజము (ఇంద్రుని పూజించుటకై నిలిపిన ధ్వజము) వలె పడిపోయెను.

*44.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*తథైవ ముష్టికః పూర్వం స్వముష్ట్యాభిహతేన వై|*

*బలభద్రేణ బలినా తలేనాభిహతో భృశమ్॥9971॥*

*44.25 (ఇరువది యైదవ శ్లోకము)*

*ప్రవేపితః స రుధిరముద్వమన్ ముఖతోఽర్దితః|*

*వ్యసుః పపాతోర్వ్యుపస్థే వాతాహత ఇవాంఘ్రిపః॥9972॥*

అట్లే ముష్టికుడు తన పిడికిలి పోటులతో బలరాముని నొప్పింపజొచ్చెను. కాని పరాక్రమశాలియైన బలరాముడు వాటిని సరకు సేయక తన అఱచేతితో వానిని తీవ్రముగా కొట్టెను. ఆ దెబ్బకు ముష్టికుడు కంపించిపోవుచు నోటినుండి రక్తమును వెళ్ళగ్రక్కుచు, అసువులను కోల్పోయి, పెనుగాలి తాకిడికి మహావృక్షమువలె నేలకూలెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[21/02, 20:40] +91 95058 13235: *21.2.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది నాలుగవ అధ్యాయము*

*బలరామకృష్ణులు చాణూరముష్టికాది మల్లులను, కంసుని సంహరించుట దేవకీవసుదేవులకు బంధవిముక్తి కలిగించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*44.26 (ఇరువది యారవ శ్లోకము)*

*తతః కూటమనుప్రాప్తం రామః ప్రహరతాం వరః|*

*అవధీల్లీలయా రాజన్ సావజ్ఞం వామముష్టినా॥9973॥*

పరీక్షిన్మహారాజా! శత్రువును దెబ్బతీయుటలో మేటియైన బలరాముడు తనమీదికి విజృంభించి వచ్చుచున్న కూటుడను మల్లుని హేళన చేయుచు తన ఎడమచేతి పిడికిలితో బలముగా మోది, అవలీలగా వధించెను.

*44.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*తర్హ్యేవ హి శలః కృష్ణపదాపహతశీర్షకః|*

*ద్విధా విశీర్ణస్తోశలక ఉభావపి నిపేతతుః॥9974॥*

అదే సమయమున శ్రీకృష్ణుడు శలుడను మల్లుని శిరస్సును తన పాదముతో తన్ని వానిని హతమార్చెను. అట్లే ఆ ప్రభువు తోశలకుడను మల్లుని గడ్డిపఱకనువలె   రెండుగా చీల్చివేసెను. ఇట్లు ఆ ఇద్దఱు మల్లులును శ్రీకృష్ణుని చేతిలో మట్టిగఱచిరి.

*44.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*చాణూరే ముష్టికే కూటే శలే తోశలకే హతే|*

*శేషాః ప్రదుద్రువుర్మల్లాః సర్వే ప్రాణపరీప్సవః॥9975॥*

చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, శలుడు, తోశలకుడు అను ఐదుగురును బలరామకృష్ణుల ధాటికి నిహతులు కాగా, మిగిలిన మల్లులు అందఱును ప్రాణములమీది తీపిచే,   బ్రతుకుజీవుడా యనుచు శరవేగముతో పిక్కబలము చూపిరి.

*44.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*గోపాన్ వయస్యానాకృష్య తైః సంసృజ్య విజహ్రతుః|*

*వాద్యమానేషు తూర్యేషు వల్గంతౌ రుతనూపురౌ॥9976॥*

ప్రత్యర్థులైన మల్లురను మట్టిగఱపించిన బలరామకృష్ణులు తమ మిత్రులగు గోపాలురను చేరబిలిచిరి. ఒకవైపు తూర్యములు మొదలగు వాద్యములు మ్రోగుచుండగా వారు గోపాలురతోగూడి నృత్యములొనర్చిరి. అప్పుడు వారికాలి అందెల రవళులు మధురముగా నినదించెను.

*44.30 (ముప్పదియవ శ్లోకము)*

*జనాః ప్రజహృషుః సర్వే కర్మణా రామకృష్ణయోః|*

*ఋతే కంసం విప్రముఖ్యాః సాధవః సాధు సాధ్వితి॥9977॥*

బలరామకృష్ణుల విజయహేలలకు కంసుడు తప్ప జనులు అందఱును మిగుల సంతోషించిరి. బ్రాహ్మణులు మొదలగు సాధుపురుషులు 'బాగుబాగు' అని పలుకుచు విజేతలను ప్రశంసించిరి.

*44.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*హతేషు మల్లవర్యేషు విద్రుతేషు చ భోజరాట్|*

*న్యవారయత్స్వతూర్యాణి వాక్యం చేదమువాచ హ॥9978॥*

చాణూరాది ప్రముఖ మల్లయోధులు  నిహతులుకాగా, మిగిలిన మల్లులు పాఱిపోవుచుండుటను చూచి, కంసుడు వెంటనే తూర్యాది వాద్యములను నిలిపివేయించెను. పిమ్మట అతడు తన సేవకులను ఆజ్ఞాపించుచు ఇట్లనెను-

*44.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*నిఃసారయత దుర్వృత్తౌ వసుదేవాత్మజౌ పురాత్|*

*ధనం హరత గోపానాం నందం బధ్నీత దుర్మతిమ్॥9979॥*

*44.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*వసుదేవస్తు దుర్మేధా హన్యతామాశ్వసత్తమః|*

*ఉగ్రసేనః పితా చాపి సానుగః పరపక్షగః॥9980॥*

"సేవకులారా! దుష్టులైన ఈ బలరామకృష్ణులను వెంటనే పురమునుండి వెళ్ళగొట్టుడు. గోపాలుర ధనములను లాగికొనుచు దుష్టబుద్ధియైన నందుని బంధింపుడు. దుర్జనుడు, దురాత్ముడు ఐన వసుదేవుని వెంటనే చంపివేయుడు. ఉగ్రసేనుడు నాకు తండ్రియే యైనను అతడు శత్రుపక్షపాతియై ఉన్నాడు. కావున అతనిని, అతని అనుచరులను హతమార్చుడు".

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[22/02, 06:09] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*824వ నామ మంత్రము* 22.2.2021

*ఓం బహురూపాయై నమః*

నామరూపాత్మకమైన జగత్తులో సకల జీవకోటిలోతానై,  అంతటనూ తానై అనేకరూపాలలో తేజరిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *బహురూపా* యను నాలుగక్షరముల నామ మంత్రమును *ఓం బహురూపాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ శ్రీమాతను ఆరాధించు భక్తులకు సకలార్థ సిద్ధిని అనుగ్రహించును.

శ్రీలలితా పరమేశ్వరి పరమాత్మ.  సర్వాంతర్యామి. సకల జీవకోటిలోను తానే విరాజిల్లుచున్నది. ఇందు గలదు అందు లేదను సందేహము ఉండనవసరములేదు. అన్నిజీవులలోనూ, అన్నిరూపాలలో  విలసిల్లుచున్నది గనుక *బహురూపా* యని అనబడినది. నామరూపాత్మకమైన జగత్తును సృష్టించినది తానే యగుటచే, జీవకోటికి తానే తల్లియైనది. వ్యక్తమూ తానే. అవ్యక్తమూతానే. సర్వమంత్రస్వరూపిణి, సర్వతంత్ర స్వరూపిణి, సర్వయంత్రస్వరూపిణి. భక్తులు తమ మనోనేత్రములతో ఏరూపములో దర్శించిననూ ఆ తల్లి ఆ రూపంలోనే వ్యక్తమౌతుంది గనుక *బహురూపా* యని అనబడినది. సప్తకోటిమంత్రములందు బీజాక్షరములయందు సూక్ష్మరూపిణియైన అవ్యక్తస్వరూపిణి. ఒక్కొక్క బీజాక్షరమునకు ఒక్కొక్క సూక్ష్మస్వరూపము గలిగియున్నది గనుక ఆవిధముగి ఆ శ్రీమాత *బహురూపా* యని అనబడినది.

*బహూని యస్యా రూపాణి స్థిరాణి చ చరాణి చ*

*దేవమానుషతిర్యంచిబహురూపా తతశ్శివా* 

చరములు, స్థిరములు, దేవతలు, మనుష్యులు, పశుపక్ష్యాదులన్నియు ఈ పరమేశ్వరి రూపమే యగుటచే *బహురూపా* యని అనబడినది అని దేవీ పురాణంలో చెప్పబడినది. పరబ్రహ్మస్వరూపిణి. పరబ్రహ్మము అనిన అవ్యక్తము. రూపములేనిది. భండాసురాది రాక్షసులను సంహరించు క్రియాస్వభావముచే అనేకరూపములు దాల్చినది గనుక జగన్మాత *బహురూపా* యని అనబడినది. 'ఒక విధముగాను, రెండువిధములుగాను, పదునారు విధములుగాను, ముప్పది రెండు విధములుగాను భావింపబడు పరాత్పరురాలికి నమస్కరించుచున్నాను' అని సూతసంహితయందు గలదని భాస్కరరాయలువారు చెప్పారు. *నామపారాయణప్రీతా* యను నామముననుసరించి జగన్మాతకు *ఇరువదివేల ఏడువందల ముప్పదియారు* బీజాక్షరయుత నామములు చెప్పబడినవి. అవియన్నియు ఆ పరమేశ్వరి రూపములని భావించి *బహురూపా* యని ఆ తల్లిని స్తుతింపదగును. భాస్కరరాయలు వారు సౌభాగ్యభాస్కరంలో ఇచ్చిన సూచన మేరకు నేను *(పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం)* 20,736 నామ మంత్రముల సంపుటీకరణ చేసియున్నాను. ఆ విధముగా కూడా ఆ మహాతల్లిని *బహురూపా* యని భావింపదగును. రుద్రులు వేలకొలదియున్నారని వేదమునందు చెప్పబడినది. అన్ని వేలమంది రుద్రులకు అన్నిరూపములలో తానే భార్యగా ఉన్నది గనుక అమ్మవారు *బహురూపా* యని అనగలము. ఆదిశక్తి యనగా మూలప్రకృతి. ఆ మూల ప్రకృతి నుండి ఈ పంచభూతాత్మకమైన జగత్తు ఉద్భవించినది. ఈ ఆదిశక్తి తామస, రాజన, సాత్త్విక భేదములచే మూడువిధములని యన్నాము. ఈ మూడు శక్తులలో తామస శక్తికి రౌద్రి, చాముండ యను నామములు గలవు. ఇందులో చాముండ అను పేరుగల తామస శక్తి తొమ్మిదికోట్ల చాముండ రూపములలో ఉన్నది. రాజసశక్తి వైష్ణవి, పాలనీ అనునామములతో పదునెనిమిది కోట్ల రూపములలో గలదు. సాత్త్విక శక్తికి బ్రహ్మశక్తియనియు, ఈ శక్తి అనంత రూపములను పొందియున్నది. కాబట్టి అమ్మవారు *బహురూపా* యని అనబడినది.   ఇంకనూ బాల, పంచదణి, షోడశి, మహావిద్య, సౌభాగ్యవిద్య, శుద్ధవిద్య, వారాహి, బగళాముఖి, అశ్వారూఢా మొదలైన విద్యలన్నియూ పరమేశ్వరి రూపములే. ఆ విధముగా జగన్మాత  *బహురూపా* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు  *ఓం బహురూపాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[22/02, 06:09] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*249వ నామ మంత్రము* 22.2.2021

*ఓం పంచప్రేతాసనాసీనాయై నమః*

పంచబ్రహ్మలు (బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు) శక్తిహీనులై, ప్రేతలు కాగా, వారిపై అధివసించి, వారికి శక్తినిచ్చిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పంచప్రేతాసనాసీనా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం పంచప్రేతాసనాసీనాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగన్మాతను ఉపాసించు సాధకుడు ఆ తల్లి అనుగ్రహంతో సర్వశక్తిమంతుడై, అన్నిరకములయిన సత్కార్యాచరణలయందు సత్ఫలితాలను పొందుతాడు.

జగన్మాత పంచప్రేతలుగా చెప్పబడే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సధాశివుడు అనువారికి ఆసనముగా ఏర్పడ్డారు.  జ్యేష్ఠా, వామ, రౌద్రి, ఆదిశక్తి, పరాశక్తి   అనువారు పంచశక్తులు. ఈ పంచబ్రహ్మలకు ఈ పంచశక్తులను అమ్మవారు తన యంశనుండి ప్రసాదించినది. ఆ శక్తులు లేనిదే ఈ పంచబ్రహ్మలు ఏ కార్యమును నిర్వహించలేరు. అందుచే  ఈ పంచశక్తుల సహాయంతో తమ కార్యములను నిర్వహించమని పరమేశ్వరి పంచబ్రహ్మలను ఆదేశించినది. ఆ పంచశక్తులను అవమానించవలదని కూడా అమ్మవారు పంచబ్రహ్మలను హెచ్చరించినది.ఏకారణము చేతనైననుఆ పంచశక్తులు ఈ పంచబ్రహ్మలచే అవమానింపబడినట్లైతే, ఆ శక్తులు వారిని విడిచి వెడలిపోవునని కూడా  చెప్పినది.  విష్ణువుకు జ్యేష్ఠాదేవి, బ్రహ్మకు వామాదేవి, రుద్రునకు రౌద్రి, మహేశ్వరునకు ఆదిశక్తి, సదాశివునకు పరాశక్తి కూడి  పంచబ్రహ్మలను శక్తిమంతులుగా చేస్తారు. సదాశివునకు పరాశక్తి లేనపుడు మహాప్రేత అనిపేరు గలదు. ఇదేవిషయాన్ని శంకరభగవత్పాదులవారు తమ ప్రథమశ్లోకంలో ఇలా వివరించారు.

*శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుమ్*

*న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి*

*అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి*

*ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి*

*పై శ్లోకములోని సారాంశము*

భగవతీ! ఈశ్వరుడు కూడా శక్తితో కూడినప్పుడే జగములను సృష్టించగలడు. శివ కేశవ చతుర్ముఖాదులచేత కూడా పరిచర్యలు పొందే నిన్ను నావంటి పుణ్యహీనుడు స్తుతించడం ఎలా సాధ్యమౌతుంది?

ఒకానొక సమయంలో ఈ పంచశక్తులు పంచబ్రహ్మలను వీడి పోయినవి. అప్పుడు పంచబ్రహ్మలు శక్తిహీనులయారు. నిశ్చలులయిపోయారు. అప్పుడు శ్రీమాత బ్రహ్మ, విష్ణు, రౌద్ర, మహేశ్వరులను తన ఆసనానికి నాలుగు కోళ్ళగాను, సదాశివుని ఆసనానికి పలకగాను చేసి, ఆ ఆసనంపై అధిరోహించి వారికి శక్తిని ప్రసాదించినది. అందుచే జగన్మాత *పంచప్రేతాసనాసీనా* యని అనబడినది.

పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం పంచప్రేతాసనాసీనాయై నమః* యని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[22/02, 06:09] +91 95058 13235: *22.2.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది నాలుగవ అధ్యాయము*

*బలరామకృష్ణులు చాణూరముష్టికాది మల్లులను, కంసుని సంహరించుట దేవకీవసుదేవులకు బంధవిముక్తి కలిగించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*44.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*ఏవం వికత్థమానే వై కంసే ప్రకుపితోఽవ్యయః|*

*లఘిమ్నోత్పత్య తరసా మంచముత్తుంగమారుహత్॥9981॥*

కంసుడు ఇట్లు నోటికి వచ్చినట్లుగా ప్రేలుచుండుట చూచి శ్రీకృష్ణుడు ఎంతయో క్రుద్ధుడయ్యెను. పిమ్మట ఆ స్వామి కంసుడు ఆసీనుడైయున్న ఉన్నతాసనము మీదికి వేగముగా లఘిసిద్ధిద్వారా మిక్కిలి తేలికగా మారి పైకెగిరి చేరెను.

*44.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*తమావిశంతమాలోక్య మృత్యుమాత్మన ఆసనాత్|*

*మనస్వీ సహసోత్థాయ జగృహే సోఽసిచర్మణీ॥9982॥*

*44.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*తం ఖడ్గపాణిం విచరంతమాశు  శ్యేనం యథా దక్షిణసవ్యమంబరే|*

*సమగ్రహీద్దుర్విషహోగ్రతేజా  యథోరగం తార్క్ష్యసుతః ప్రసహ్య॥*

*44.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*ప్రగృహ్య కేశేషు చలత్కిరీటం నిపాత్య రంగోపరి తుంగమంచాత్|* 

*తస్యోపరిష్టాత్స్వయమబ్జనాభః  పపాత విశ్వాశ్రయ ఆత్మతంత్రః॥9984॥*

అప్పుడు సమయస్ఫూర్తిగల కంసుడు తన పాలిట మృత్యువైన శ్రీకృష్ణుడు తన మీదికి వచ్చుచుండుటచూచి, ఆసనమునుండి డిగ్గునలేచి, ఖడ్గమును, డాలును చేబూనెను. అంతట అతడు (కంసుడు) ఖడ్గపాణియై, ఆకాశమున డేగవలె ఆ శ్రీకృష్ణునకు కుడియెడమల తిరుగుచు అదనుచూచి ఆయనను చంపుటకై ప్రయత్నించుచుండెను. అప్పుడు గరుత్మంతుడు ఒక మహాసర్పమును పట్టుకొనుటను వలె నిరుపమాన పరాక్రమశాలియైన కృష్ణప్రభువు ఆ కంసుని ఒడిసిపట్టుకొనెను. అంతట కంసుని కిరీటము క్రింద పడిపోయెను. విశ్వమునకు ఆశ్రయమైనవాడు, సర్వతంత్ర స్వతంత్రుడు ఐన ఆ స్వామి వెంటనే   అతని జుట్టు పట్టుకొని, ఎత్తైన ఆ మంచె (గద్దె) పై నుండి రంగస్థలమున పడవేసెను. పిమ్మట ఆ పద్మనాభుడు ఆ కంసునిపై దుమికెను.

*44.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*తం సంపరేతం విచకర్ష భూమౌ  హరిర్యథేభం జగతో విపశ్యతః|*

*హా హేతి శబ్దః సుమహాంస్తదాభూదుదీరితః సర్వజనైర్నరేంద్ర॥9985॥*

మహారాజా! ఆ దెబ్బతో కంసుడు అసువులను కోల్పోయెను. అందఱు  చూచుచుండగనే సింహము ఏనుగునువలె శ్రీకృష్ణుడు అతని కళేబరమును నేలమీద ఈడ్చెను. అచటనున్న సభాసదులు అందఱును మిగుల బిగ్గఱగా 'హాహాకారములు' చేసిరి.

*44.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*స నిత్యదోద్విగ్నధియా తమీశ్వరం పిబన్ వదన్ వా విచరన్ స్వపన్ శ్వసన్|*

*దదర్శ చక్రాయుధమగ్రతో యతస్తదేవ రూపం దురవాపమాప॥9986॥*

ఇంతవఱకును కంసుడు నిరంతరము మృత్యుభయముతో ఆందోళనపడుచున్నవాడై, త్రాగుచు, మాట్లాడుచు, అటునిటు తిరుగుచు, నిద్రించుచు, ఉచ్ఛ్వాసనిశ్వాసలు సలుపుచు ఉన్నప్పుడును అతనియెదుట చక్రధారియైన ఆ పరమేశ్వరుని రూపమే కనబడుచుండెను. కంసుడు అనుక్షణము దోషబుద్ధితోనైనను (శత్రు భావముతో నైనను) శ్రీకృష్ణునే స్మరించుచున్నందున అతడు జ్యోతిస్వరూపముతో ఆ కృష్ణభగవానునియందే లీనమయ్యెను. పరమ యోగీశ్వరులకును దుర్లభమైన సారూప్యమోక్షము అతనికి ప్రాప్తించెను.

*44.40 (నలుబదియవ శ్లోకము)*

*తస్యానుజా భ్రాతరోఽష్టౌ కంకన్యగ్రోధకాదయః|*

*అభ్యధావన్నతిక్రుద్ధా భ్రాతుర్నిర్వేశకారిణః॥9987॥*

అప్పుడు కంసుని సోదరులైన కంకుడు, న్యగ్రోధుడు మొదలగువారు ఎనిమిదిమందియు మిక్కిలి క్రుద్ధులై తమ అన్న ఋణము తీర్చుకొనగోరి (అన్నను హతమార్చిన శ్రీకృష్ణునిపై పగదీర్చుకొనుటకై) ఆ బలరామకృష్ణుల మీదికి దాడిచేసిరి.

*44.41 (నలుబది ఒకటవ శ్లోకము)*

*తథాతిరభసాంస్తాంస్తు సంయత్తాన్ రోహిణీసుతః|*

*అహన్ పరిఘముద్యమ్య పశూనివ మృగాధిపః॥9988॥*

ఆ విధముగా అతివేగముతో సర్వసన్నద్ధులై తమ మీదికి దూసికొనివచ్చుచున్న కంకాదులను జూచి, బలరాముడు ఇనుపకట్ల గుదియను చేబూని, సింహము పశువులను వలె వారిని అందఱిని సంహరించెను.

*44.41 (నలుబది రెండవ శ్లోకము)*

*నేదుర్దుందుభయో వ్యోమ్ని బ్రహ్మేశాద్యా విభూతయః|*

*పుష్పైః కిరంతస్తం ప్రీతాః శశంసుర్ననృతుః స్త్రియః||9989॥*

అప్పుడు శ్రీహరియొక్క విభూతి స్వరూపులైన బ్రహ్మాది దేవతలు ఆనందముతో బలరామకృష్ణులపై పూవులను చల్లుచు ప్రశంసలను కురిపించిరి. ఆకాశమున దుందుభులు మ్రోగెను. అప్సరసలు నృత్యములొనర్చిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[22/02, 20:05] +91 95058 13235: *22.2.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది నాలుగవ అధ్యాయము*

*బలరామకృష్ణులు చాణూరముష్టికాది మల్లులను, కంసుని సంహరించుట దేవకీవసుదేవులకు బంధవిముక్తి కలిగించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*44.43 (నలుబది మూడవ శ్లోకము)*

*తేషాం స్త్రియో మహారాజ సుహృన్మరణదుఃఖితాః|*

*తత్రాభీయుర్వినిఘ్నంత్యః శీర్షాణ్యశ్రువిలోచనాః॥9990॥*

పరీక్షిన్మహారాజా! అంతట కంసునియొక్క, అతని సోదరులయొక్క భార్యలు తమ ప్రాణనాథులు (ఆత్మీయుల) మరణములకు మిగుల వగచిరి. వారు తలలు బాదుకొనుచు, కన్నీరుమున్నీరుగా ఏడ్చుచు అచటికి చేరిరి.

*44.44 (నలుబది నాలుగవ శ్లోకము)*

*శయానాన్ వీరశయ్యాయాం పతీనాలింగ్య శోచతీః|*

*విలేపుః సుస్వరం నార్యో విసృజంత్యో ముహుః శుచః॥9991॥*

ఆ వనితలు వీరమరణమును పొందియున్న తమ పతుల కళేబరములను కౌగలించుకొని, పదేపదే దుఃఖాశ్రువులను రాల్చుచు బిగ్గఱగా విలపింపదొడంగిరి.

*44.45 (నలుబది ఐదవ శ్లోకము)*

*హా నాథ ప్రియ ధర్మజ్ఞ కరుణానాథవత్సల|*

*త్వయా హతేన నిహతా వయం తే సగృహప్రజాః॥9992॥*

*44.46 (నలుబది ఆరవ శ్లోకము)*

*త్వయా విరహితా పత్యా పురీయం పురుషర్షభ|*

*న శోభతే వయమివ నివృత్తోత్సవమంగళా॥9993॥*

*44.47 (నలుబది ఏడవ శ్లోకము)*

*అనాగసాం త్వం భూతానాం కృతవాన్ ద్రోహముల్బణమ్|*

*తేనేమాం భో దశాం నీతో భూతధ్రుక్ కో లభేత శమ్॥9994॥*

*44.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*

*సర్వేషామిహ భూతానామేష హి ప్రభవాప్యయః|*

*గోప్తా చ తదవధ్యాయీ న క్వచిత్సుఖమేధతే॥9995॥*

"ప్రాణనాథా! ప్రియా! ధర్మజ్ఞా! అనాథలను కనికరముతో ఆదుకొనువాడా! నీవు మరణించుటతో మేము అందఱము మృతప్రాయలమైతిమి. గృహములు కళావిహీనములయ్యెను. పిల్లలు ఎల్లరును దిక్కులేనివారైరి.

పురుషశ్రేష్ఠా! ప్రభుడైన నీ వియోగముతో ఈ మథురాపురముగూడ మావలె అనాథయైనది. ఇచటి ఉత్సవములు, శుభకార్యములు అన్నియును ఆగిపోయినవి. ఇప్పుడీ నగరము వెలవెలబోవుచున్నది. స్వామీ! నీవు నిరపరాధులైన ప్రాణులకు (వ్రజవాసులు మున్నగువారికి) తీరని ద్రోహము చేసితివి. ఆర్యా! అందువలన మాకు ఇట్టి దుర్గతి ప్రాప్తించినది. ప్రాణులను హింసించినవానికి సుఖము ఎట్లు లభించును? (అట్టివానికి దుఃఖములు తప్పవు). సమస్త ప్రాణులయొక్క సృష్టి స్థుతి లయములకు ఈ కృష్ణపరమాత్మయే కారకుడు. అట్టి పురుషోత్తమునకు హాని తలపెట్టినవాడు ఎన్నడును సుఖములను పొందజాలడు".

*శ్రీశుక ఉవాచ*

*44.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*

*రాజయోషిత ఆశ్వాస్య భగవాంల్లోకభావనః|*

*యామాహుర్లౌకికీం సంస్థాం హతానాం సమకారయత్॥9996॥*

*శ్రీశుకుడు ఇట్లు నుడివెను* పరీక్షిన్మహారాజా! సమస్త జగత్తునకు శ్రేయస్సులను గూర్చువాడైన శ్రీకృష్ణుడు దుఃఖితులైయున్న ఆ రాజపత్నులను అనునయ వచనములతో ఓదార్చెను. మృత్యువుపాలైన కంసాదులకు ఆ ప్రభువు లోకరీతిని అనుసరించి ఉత్తరక్రియలను జరిపించెను.

*44.50 (ఏబదియవ శ్లోకము)*

*మాతరం పితరం చైవ మోచయిత్వాథ బంధనాత్|*

*కృష్ణరామౌ వవందాతే శిరసాఽఽస్పృశ్య పాదయోః॥9997॥*

పిమ్మట బలరామకృష్ణులు తమ తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను బంధవిముక్తులను గావించిరి. పిదప వారి పాదములకు సాష్టాంగముగా నమస్కరించిరి.

*44.51 (ఏబది ఒకటవ శ్లోకము)*

*దేవకీ వసుదేవశ్చ విజ్ఞాయ జగదీశ్వరౌ|*

*కృతసంవందనౌ పుత్రౌ సస్వజాతే న శంకితౌ॥9998॥*

అంతట దేవకీ వసుదేవులు తమ పాదములకు ప్రణమిల్లిన తమ పుత్రులను (బలరామకృష్ణులను) జగదీశ్వరులుగా ఎఱిగినవారిని అక్కున జేర్చుకొనిరి.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం  దశమస్కంధే పూర్వార్ధే కంసవధో నామ చతుశ్చత్వారింశోఽధ్యాయః (44)*

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి *బలరామకృష్ణులు చాణూరముష్టికాది మల్లులను, కంసుని సంహరించుట, దేవకీవసుదేవులకు బంధవిముక్తి కలిగించుట* యను నలుబది నాలుగవ అధ్యాయము (44)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[23/02, 04:45] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*825వ నామ మంత్రము* 23.02.2021

*ఓం బుధార్చితాయై నమః*

బుధజనులచే (జ్ఞానులచే) అర్చింపబడు తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *బుధార్చితా* యను నాలుగక్షరముల నామ మంత్రమును *ఓం బుధార్చితాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ దేవిని ఆరాధించు భక్తులకు ఆ తల్లి అనంతమైన జ్ఞానసంపద, శాంతిసౌఖ్యయుతమైన భౌతికజీవనమును, శాశ్వతమైన పరమానందమును అనుగ్రహించును.

పరబ్రహ్మమును తెలిసినవారు జ్ఞానులనబడతారు. అటువంటి బ్రహ్మవేత్తలచే ఆరాధింపబడునది గనుకనే ఆ తల్లి *బుధార్చితా* యని అనబడినది.

కొందరు సంపదలకోసం, మరికొందరు ఆపదలనుండి రక్షణకోసం, స్త్రీలు సౌభాగ్యం కోసం అమ్మవారిని ఆరాధిస్తారు. వీరిని నిష్కాములు అనజాలము. వీరిని ఐహికవాంఛాపరులని అందురు. నిష్కాములై, కేవలం బ్రహ్మమును తెలుసుకోవడానికి, పరబ్రహ్మస్వరూపాన్ని మనోనేత్రాలతో దర్శించడానికి, జన్మరాహిత్యమైన ముక్తిని పొందడానికి పరమాత్మను ఉపాసిస్తారు. ఆ ఉపాసనలో నిర్మలచిత్తము, ఏకాగ్రత ఇమిడి ఉంటాయి. పరబ్రహ్మను తెలుసుకునేవరకూ వారి సాధన కొనసాగుతూనే ఉంటుంది. అందుకు కాలపరిమితి నిర్దేశించుకొనరు. అటువంటివారినే జ్ఞానులనియు, పరబ్రహ్మతత్త్వమును తెలిసికొనిన తరువాత బ్రహ్మవేత్తలనియు అందురు. అటువంటి బ్రహ్మవేత్తలను, జ్ఞానులను బుధులు  అందురు. అటువంటి వారిచే ఆరాధింపబడు పరమేశ్వరి *బుధార్చితా* యని అనబడినది. జ్ఞానులు చేయు పూజలను అంతఃపూజలనియు, ఐహికవాంఛలతో చేయు పూజలను బాహ్యపూజలనియు అందురు. అంతఃపూజలు చేయు జ్ఞానులచే ఆరాధింపబడుతుంది గనుక జగన్మాత *బుధార్చితా* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం బుధార్చితాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[23/02, 04:45] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*250వ నామ మంత్రము* 23.02.2021

*ఓం పంచబ్రహ్మ స్వరూపిణ్యై నమః*

బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివులను పంచబ్రహ్మలందు ఐక్యము కలిగి, పంచబ్రహ్మ స్వరూపిణియై విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పంచబ్రహ్మస్వరూపిణీ*   యను ఎనిమిదక్షరముల నామ మంత్రమును *ఓం పంచబ్రహ్మస్వరూపిణ్యై నమః*  అని ఉచ్చరించుచూ, ఆ శ్రీమాతను ఉపాసించు సాధకులకు, ఆ పరమేశ్వరి అనుగ్రహంతో శాంతిసౌఖ్యములు, ఆయురారోగ్యములు, సిరిసంపదలు సంప్రాప్తించి, పరబ్రహ్మమును గూర్చి తెలియు దిశగా సాధనా పటిమ కొనసాగును. 

బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివులను వారు పంచబ్రహ్మలు. వీరి యందు జగన్మాత ఐక్యమై జగన్మాత పంచబ్రహ్మస్వరూపిణియై విరాజిల్లుచున్నది. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అను పంచబ్రహ్మ రూపములను పరబ్రహ్మము పొందినదని లింగపురాణమున చెప్పబడినది. క్షేత్రజ్ఞుడు, ప్రకృతి, మనోబుద్ధ్యహంకారములు, శ్రోత్రత్వక్చక్షుజిహ్వాఘ్రాణములు, వాక్పాణిపాదపాయూపస్థలు, శబ్దస్పర్శరూపరసగంధములు అనునవి పంచబ్రహ్మ స్వరూపములు. వీటినుండి భూమి, నీరు, నిప్పు, నింగి, వాయువు అను పంచమహాభూతములు పుట్టినవి. 'సత్యము, జ్ఞానానంత లక్షణములు గల పరమాత్మ వికారములు లేక పరిశుద్ధమగు అద్వితీయస్వరూపము అయినను, తనయందలి శక్తిచే అయిదు విధములుగా పరమాత్మ వ్యక్తమవడం జరుగుచున్నది' అని యజ్ఞవైభవఖండమందు చెప్పబడినది.  పరమేశ్వరి యొక్క లీలలే పంచపురుషులైనారు. వారందరి స్వరూపమే జగన్మాత గనుక అమ్మవారు *పంచబ్రహ్మ స్వరూపిణి* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం పంచబ్రహ్మస్వరూపిణ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[23/02, 04:45] +91 95058 13235: *23.2.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఐదవ అధ్యాయము*

*బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారములు - వారు గురుకులమున ప్రవేశించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*

*45.1 (ప్రథమ శ్లోకము)*

*పితరావుపలబ్ధార్థౌ విదిత్వా పురుషోత్తమః|*

*మా భూదితి నిజాం మాయాం తతాన జనమోహినీమ్॥9999॥*

*శ్రీశుకుడు వచించెను* శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకీవసుదేవులు తనను పరమేశ్వరునిగా భావించుచున్నట్లు గుర్తించెను. వారు అట్లు తలపోసినచో పుత్రవాత్సల్యానందములకు దూరమగుదురని తలంచి, ఆ ప్రభువు వారిపై జనులను మోహములో ముంచునట్టి తన యోగమాయను ప్రసరింపజేసెను.

*45.2 (రెండవ శ్లోకము)*

*ఉవాచ పితరావేత్య సాగ్రజః సాత్వతర్షభః|*

*ప్రశ్రయావనతః ప్రీణన్నంబ తాతేతి సాదరమ్॥10000॥*

యదువంశ శ్రేష్ఠుడైన శ్రీకృష్ణభగవానుడు బలరామునితో గూడి తల్లిదండ్రుల చెంతకు చేరెను. పిమ్మట ఆ స్వామి వినమ్రుడై సాదరముగా 'అమ్మా', 'నాన్నా' అని సంబోధించి, వారిని సంతోషపఱచుచు ఇట్లు నుడివెను-

*45.3 (మూడవ శ్లోకము)*

*నాస్మత్తో యువయోస్తాత నిత్యోత్కంఠితయోరపి*

*బాల్యపౌగండకైశోరాః పుత్రాభ్యామభవన్ క్వచిత్॥10001॥*

*45.4 (నాలుగవ శ్లోకము)*

*న లబ్ధో దైవహతయోర్వాసో నౌ భవదంతికే|*

*యాం బాలాః పితృగేహస్థా విందంతే లాలితా ముదమ్॥10002॥*

"తల్లిదండ్రులారా! మీ పుత్రులమైన మమ్ము మీ యుత్సంగములలో చేర్చుకొని, ఆనందించుచు, మమకారములను పంచి యిచ్చుటకై మీరు ఇంతవఱకును ఎంతో ఉత్కంఠితులై యుంటిరి. కాని మీరు మమ్ము ఎత్తుకొనుచు, దించుచు, లాలించుచు, పాలించుచు సంతోషపడెడి భాగ్యమునకు నోచుకొనరైతిరి. అట్లే దైవోపహతులమైన కారణముగా మేమును ఒకవిధముగా భాగ్యహీనులమే. ఏలయన, లోకములోని బాలురు తమ తల్లిదండ్రులయెదుట తారాడుచు, వారి ఒడులలో చేరి, నిండు ప్రేమాదరములతో ఆడుచు, పాడుచు హాయిగా పెఱిగి పెద్దవారగుచుందురు. ఆ అదృష్టమునకు మేము దూరమైతిమి.

*45.5 (ఐదవ శ్లోకము)*

*సర్వార్థసంభవో దేహో జనితః పోషితో యతః|*

*న తయోర్యాతి నిర్వేశం పిత్రోర్మర్త్యః శతాయుషా॥10003॥*

*45.6 (ఆరవ శ్లోకము)*

*యస్తయోరాత్మజః కల్ప ఆత్మనా చ ధనేన చ|*

*వృత్తిం న దద్యాత్తం ప్రేత్య స్వమాంసం ఖాదయంతి హి॥10004॥*

ధర్మార్థకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్థములకు సాధనమైన దేహమును ప్రసాదించు వారును, పోషించువారును తల్లిదండ్రులే. అట్టి మాతాపితరుల ఋణమును తీర్చుకొనుటకై మానవునకు యథార్థముగా నూఱేండ్లైనను చాలవు. శక్తియుండియు తన దేహముద్వారా, ధనాదులద్వారా తల్లిదండ్రులను సాదరముగా సేవింపనివాడు ఎంతయు నికృష్టుడు (నీచుడు). అట్టి దుష్టుడు మృతుడైన పిమ్మట యమదూతలు వాని శరీరమాంసమును వానిచేతనే తినిపింతురు.

*45.7 (ఏడవ శ్లోకము)*

*మాతరం పితరం వృద్ధం భార్యాం సాధ్వీం సుతం శిశుమ్|*

*గురుం విప్రం ప్రపన్నం చ కల్పోఽబిభ్రచ్ఛ్వసన్ మృతః॥10005॥*

పూజ్యులైన తలిదండ్రులను, వృద్ధులను, సాధ్వియైన భార్యను, బాల్యావస్థలో నున్న కుమారులను, కుమార్తెలను, ఆరాధ్యుడైన గురువును, సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుని, తనను ఆశ్రయించినవారిని, యథోచితముగా పోషింప సమర్థుడయ్యెను, ఆ విధముగా చేయనివాడు, ఈ లోకములో బ్రతికియుండియు, చచ్చినవానితో సమానుడే.

*45.8 (ఎనిమిదవ శ్లోకము)*

*తన్నావకల్పయోః కంసాన్నిత్యముద్విగ్నచేతసోః|*

*మోఘమేతే వ్యతిక్రాంతా దివసా వామనర్చతోః॥10006॥*

జననీ జనకులారా! దుష్ప్రవృత్తిగల కంసుని ఆగడముల కారణముగా మేము ఉద్విగ్నమనస్కులమై మీకు దూరముగా ఉండవలసి వచ్చుటచే మిమ్ము సేవింపలేకపోయితిమి. అందువలన ఇంతకాలము వ్యర్థముగా గడచిపోయినది.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[23/02, 20:56] +91 95058 13235: *23.2.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఐదవ అధ్యాయము*

*బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారములు - వారు గురుకులమున ప్రవేశించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*45.9 (తొమ్మిదవ శ్లోకము)*

*తత్క్షంతుమర్హథస్తాత మాతర్నౌ పరతంత్రయోః|*

*అకుర్వతోర్వాం శుశ్రూషాం క్లిష్టయోర్దుర్హృదా భృశమ్॥10007॥*

"అమ్మా! నాన్నా! దుష్టుడైన కంసుడు మిమ్ములను మిగుల ఇడుములపాలు చేసెను. ఐనను మేము పరతంత్రులమై యున్నందున కష్టస్థితిలో ఉన్న మిమ్ము ఆదుకొనలేక పోయితిమి. అందువలన మమ్ము క్షమింపుడు".

*శ్రీశుక ఉవాచ*

*45.10 (పదియవ శ్లోకము)*

*ఇతి మాయామనుష్యస్య హరేర్విశ్వాత్మనో గిరా|*

*మోహితావంకమారోప్య పరిష్వజ్యాపతుర్ముదమ్॥10008॥*

*శ్రీశుకుడు వచించెను* విశ్వాత్ముడైనను, స్వసంకల్పముచే లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణునియొక్క మృదుమధుర వచనములకు మోహితులైన దేవకీవసుదేవులు తమ కుమారులను ఒడిలోనికి తీసికొని, అక్కున చేర్చుకొని పరమానందభరితులైరి.

*45.11 (పదకొండవ శ్లోకము)*

*సించంతావశ్రుధారాభిః స్నేహపాశేన చావృతౌ|*

*న కించిదూచతూ రాజన్ బాష్పకంఠౌ విమోహితౌ॥10009॥*

పరీక్షిన్మహారాజా! పుత్రప్రేమ కారణముగా వారు మోహితులై, ఆ మమకారములలో మునిగిపోయిరి. వారు ఆనందాశ్రువులచే తమ కుమారులను అభిషేకించిరి. ఆనందాతిరేకములో గద్గదకంఠులైన  ఆ దేవకీవసుదేవులు గొంతు పెగలక ఏమియు మాటాడలేకపోయిరి.

*45.12 (పండ్రెండవ శ్లోకము)*

*ఏవమాశ్వాస్య పితరౌ భగవాన్ దేవకీసుతః|*

*మాతామహం తూగ్రసేనం యదూనామకరోన్నృపమ్॥16010॥*

కృష్ణభగవానుడు తల్లిదండ్రులను ఈ విధముగా ఓదార్చిన పిమ్మట మాతామహుడైన ఉగ్రసేనుని యదువంశీయులకు రాజుగా జేసెను.

*45.13 (పదమూడవ శ్లోకము)*

*ఆహ చాస్మాన్ మహారాజ ప్రజాశ్చాజ్ఞప్తుమర్హసి|*

*యయాతిశాపాద్యదుభిర్నాసితవ్యం నృపాసనే॥10011॥*

*45.14 (పదునాలుగవ శ్లోకము)*

*మయి భృత్య ఉపాసీనే భవతో విబుధాదయః|*

*బలిం హరంత్యవనతాః కిముతాన్యే నరాధిపాః॥10012॥*

పిమ్మట శ్రీకృష్ణుడు తన మాతామహునితో ఇట్లనెను - 'ఉగ్రసేనమహారాజా! మేము మీ ప్రజలము. మమ్ము నీవు ఆజ్ఞాపింపుము. యయాతి శాపకారణముగా యదువంశీయులు రాజసింహాసనముపై కూర్చుండుటకు (రాజ్యపరిపాలన చేయుటకు) అర్హులు కారు. ఐనను నేను కోరుచున్నాను గనుక, నీవు ఈ  సింహాసనమును అధిష్ఠించుటలో దోషములేదు. నేను భృత్యుడనై నిన్ను సేవించుచుందును గాన, ప్రముఖ దేవతలును వినమ్రులై నీకు కానుకలను సమర్పింతురు. ఇంక ఇతర రాజుల విషయము చెప్పనేల?

*45.15 (పదునైదవ శ్లోకము)*

*సర్వాన్ స్వాన్ జ్ఞాతిసంబంధాన్ దిగ్భ్యః కంసభయాకులాన్|*

*యదువృష్ణ్యంధకమధుదాశార్హకుకురాదికాన్॥10013॥*

*45.16 (పదహారవ శ్లోకము)*

*సభాజితాన్ సమాశ్వాస్య విదేశావాసకర్శితాన్|*

*న్యవాసయత్స్వగేహేషు విత్తైః సంతర్ప్య విశ్వకృత్॥10014॥*

పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు (శ్రీహరి) విశ్వసృష్టికి కారకుడు. కంసుని దురాగతములకు భయపడి నలుదిక్కులకు పాఱిపోయిన యదు, వృష్ణి, అంధక, మధు, దాశార్హ, కుకురాది వంశీయులైన తన బంధువులను అందఱిని ఆ ప్రభువు మథురకు పిలిపించెను. ఇంతవఱకును కాందిశీకులై విదేశములలో బిక్కుబిక్కుమనుచు తలదాచుకొనుచున్న వారినందఱిని సగౌరవముగా ఆహ్వానించి, ఆ స్వామి ఆత్మీయతతో ఓదార్చెను. పిమ్మట వారిని ధనాది సంపదలచే తృప్తిపఱచి, వారివారి గృహములలో నివసింపజేసెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[24/02, 04:03] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*826వ నామ మంత్రము* 24.02.2021

*ఓం ప్రసవిత్ర్యై నమః*

సకల జగత్తును జనియింపజేసిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ప్రసవిత్రీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం ప్రసవిత్ర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు భక్తులకు ఆ తల్లి ఐహిక సంబంధమైన న్యాయబద్ధమైన కోరికలను సిద్ధింపజేయును మరియు పరమపదసోపానమునకు మార్గము సుగమము జేయును.

సకల చరాచర జగత్తునకు ఆ తల్లి జనయిత్రి. అనగా తానే సృష్టింపజేసినది. తల్లివలె ఆహారమును సమకూర్చినది. తల్లి తన బిడ్డలను దుష్టశక్తులకు చిక్కనీయకుండా కాపాడినట్లు ఆ పరమేశ్వరి జీవకోటిని కాపాడుచున్నది. గనుకనే బిడ్డలకు తల్లి ప్రసవిత్రి (కన్న తల్లి) అయినట్లే, జగన్మాత ఈ జగత్తుకు కన్నతల్లి వంటిది గనుక *ప్రసవిత్రీ* యని అనబడినది. పంచమహా భూతములను (భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము),   వాటితో ఏర్పడిన జగత్తును జనియింపజేసినది (ప్రసవించినది) గనుకనే ఆ తల్లి *ప్రసవిత్రీ* యని అనబడినది.ప్రజలను అనగా ప్రాణులను ప్రసవించుటచే *సవిత*  అని చెప్పుచున్నారని విష్ణుధర్మోత్తరమందు గలదని భాస్కరరాయలువారు అన్నారు. 'బ్రహ్మ మొదలు స్థావరము వరకూ గల సమస్తము ఏ దేవినుండి ఉద్భవించినదో, మహత్తత్త్వము మొదలు విశేషా (విభిన్నా) కారములు గల జగత్తంతయు ఏ దేవి వలన ఉద్భవించినదో, సకల వస్తువులను జనియింపజేసిన (ప్రసవింపజేసిన) తల్లికి నమస్కారము' అని భగవతీ పురాణమునందు అనబడినది.

అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం ప్రసవిత్ర్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[24/02, 04:03] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*251వ నామ మంత్రము* 24.02.2021

*ఓం చిన్మయ్యై నమః*

చిత్స్వరూపిణియైన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *చిన్మయీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం చిన్మయ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిప్రపత్తులతో ఆరాధించు సాధకులకు ఆ పరమేశ్వరి కరుణతో ఆనందమయమైన జీవనముకొనసాగించుచూ, అంత్యమున పరమపదస్థానము ప్రాప్తించును.

అమ్మవారు స్వప్రకాశరూపిణి. చిత్తులో భేదములేక యుండునది అని కూడా చెప్ప వచ్చును. *చిత్ భేదాత్ చిన్మయీ* చైతన్యాభిన్నస్వరూపురాలు. నామరూపాత్మకమైన ఈ జగత్తులో జగన్మాత చైతన్యస్వరూపిణి. అమ్మవారు చైతన్యస్వరూపిణి గనుకనే జగత్తంతా చైతన్యము (కదలిక) కలిగియున్నది. జీవమున్న శరీరము శివము, జీవము లేని శరీరము శవము అని చెప్పినట్లు, చైతన్యము లేకుంటే జగమంతా జడమై లయస్థితిలో ఉండును. జగత్తంతా చైతన్యవంతం కలిగి ఉండడానికి కారణమయిన పరమేశ్వరి *చిన్మయీ* యని అనబడినది.  

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం చిన్మయ్యై నమః* అని యనవలెను.

[24/02, 04:03] +91 95058 13235: *24.2.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఐదవ అధ్యాయము*

*బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారములు - వారు గురుకులమున ప్రవేశించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*45.17 (పదిహేడవ శ్లోకము)*

*కృష్ణసంకర్షణభుజైర్గుప్తా లబ్ధమనోరథాః|*

*గృహేషు రేమిరే సిద్ధాః కృష్ణరామగతజ్వరాః॥10015॥*

శ్రీకృష్ణబలరాముల అనుగ్రహముతో వారి మనస్తాపములు తీఱిపోయెను. మనోరథము లన్నియును ఈడేఱెను. ఆ నందకుమారుల బాహు బలచ్ఛాయలో వారు సురక్షితులై యుండిరి. అందువలన ఆ యదు ప్రముఖ వంశీయులందఱును తమ తమ గృహములలో హాయిగా నుండిరి.

*45.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*వీక్షంతోఽహరహః ప్రీతా ముకుందవదనాంబుజమ్|*

*నిత్యం ప్రముదితం శ్రీమత్సదయస్మితవీక్షణమ్॥10016॥*

శ్రీకృష్ణుని ముఖారవిందము చిఱునవ్వుల శోభలతో కలకలలాడుచుండెను. ఆ స్వామి చూపులలో కనికరము తొణికిసలాడుచుండును. అట్టి ఆహ్లాదకరమైన శ్రీకృష్ణుని ముఖకమలమును అనుదినము దర్శించుచు యదువంశీయులు ఎల్లరును ఉల్లాసముతో ఉండిరి.

*45.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*తత్ర ప్రవయసోఽప్యాసన్ యువానోఽతిబలౌజసః|*

*పిబంతోఽక్షైర్ముకుందస్య ముఖాంబుజసుధాం ముహుః॥10017॥*

ఆ మథురానగరమునందలి వృద్ధులు సైతము తమ నేత్రముల ద్వారా శ్రీకృష్ణుని వదనమనెడి పద్మమునందలి మకరందా మృతమును పదేపదే తనివిదీర ఆస్వాదించుచు, తత్ప్రభావమున యువకులవలె జవసత్త్వములు గలిగి తేజరిల్లుచుండిరి.

*45.20 (ఇరువదియవ శ్లోకము)*

*అథ నందం సమాసాద్య భగవాన్ దేవకీసుతః|*

*సంకర్షణశ్చ రాజేంద్ర పరిష్వజ్యేదమూచతుః॥10018॥*

పరీక్షిన్మహారాజా! పిమ్మట కృష్ణభగవానుడు , బలరాముడు నందగోపునిజేరి, ఆయనను కౌగలించుకొని, ఇట్లునుడివిరి.

*45.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*పితర్యువాభ్యాం స్నిగ్ధాభ్యాం పోషితౌ లాలితౌ భృశమ్|*

*పిత్రోరభ్యధికా ప్రీతిరాత్మజేష్వాత్మనోఽపి హి॥10019॥*

*45.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*స పితా సా చ జననీ యౌ పుష్ణీతాం స్వపుత్రవత్|*

*శిశూన్ బంధుభిరుత్సృష్టానకల్పైః పోషరక్షణే॥10020॥*

*45.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*యాత యూయం వ్రజం తాత వయం చ స్నేహదుఃఖితాన్|*

*జ్ఞాతీన్ వో ద్రష్టుమేష్యామో విధాయ సుహృదాం సుఖమ్॥10021॥*

"తండ్రీ! నీవును, తల్లి యశోదయు, మిగుల ప్రేమ వాత్సల్యములతో మమ్ము లాలించి, పోషించితిరి. మాతాపితలు తమ సంతానమును ప్రాణములకంటెను మిన్నగా చూచుకొందురు. అందు ఏమాత్రమూ సందేహము లేదు. కన్న తల్లిదండ్రులను, తదితర బంధువులును తమ శిశువులను పోషించుటకును, రక్షించుటకును (లాలన, పాలనలకు) వీలుకాని పరిస్థితులలో వదలివేసినప్పుడు, వారిని చేరదీసి ప్రేమాదరములతో పెంచి పోషించినవారే, నిజమైన తల్లిదండ్రులు. నాయనా! ఇక మీరు వ్రజభూమికి వెళ్ళిరండు. మేము మీ యెడల లేనందున మీరు మిక్కిలి బెంగపడుదురను మాట వాస్తవమే. అందువలన మేమును ఇక్కడి బంధుమిత్రులకు ఆత్మీయతతో సుఖసంతోషములను గూర్చిన పిదప, మారాకకై అనుక్షణము నిరీక్షించుచు తపనపడుచుండెడి మీ అందఱిని చూచుటకై అక్కడికి మేము తప్పక వత్తుము".

*45.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*ఏవం సాంత్వయ్య భగవాన్ నందం సవ్రజమచ్యుతః|*

*వాసోఽలంకారకుప్యాద్యైరర్హయామాస సాదరమ్॥10022॥*

కృష్ణభగవానుడు నందునకును, తదితర వ్రజవాసులకును ఈ విధముగా ఊఱటగూర్చి, వస్త్రాభరణములను, కంచుపాత్రలను సమర్పించి, వారిని సాదరముగా పూజించెను.

ఈ శ్లోకములో *కుప్యము* అనగా బంగారము, వెండి తప్ప కంచు మొదలగు ఇతర లోహములు అని తెలియగలము.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[24/02, 04:03] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*251వ నామ మంత్రము* 24.02.2021

*ఓం చిన్మయ్యై నమః*

చిత్స్వరూపిణియైన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *చిన్మయీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం చిన్మయ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిప్రపత్తులతో ఆరాధించు సాధకులకు ఆ పరమేశ్వరి కరుణతో ఆనందమయమైన జీవనముకొనసాగించుచూ, అంత్యమున పరమపదస్థానము ప్రాప్తించును.

అమ్మవారు స్వప్రకాశరూపిణి. చిత్తులో భేదములేక యుండునది అని కూడా చెప్ప వచ్చును. *చిత్ భేదాత్ చిన్మయీ* చైతన్యాభిన్నస్వరూపురాలు. నామరూపాత్మకమైన ఈ జగత్తులో జగన్మాత చైతన్యస్వరూపిణి. అమ్మవారు చైతన్యస్వరూపిణి గనుకనే జగత్తంతా చైతన్యము (కదలిక) కలిగియున్నది. జీవమున్న శరీరము శివము, జీవము లేని శరీరము శవము అని చెప్పినట్లు, చైతన్యము లేకుంటే జగమంతా జడమై లయస్థితిలో ఉండును. జగత్తంతా చైతన్యవంతం కలిగి ఉండడానికి కారణమయిన పరమేశ్వరి *చిన్మయీ* యని అనబడినది.  

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం చిన్మయ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[24/02, 21:06] +91 95058 13235: *24.2.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఐదవ అధ్యాయము*

*బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారములు - వారు గురుకులమున ప్రవేశించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*45.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*ఇత్యుక్తస్తౌ పరిష్వజ్య నందః ప్రణయవిహ్వలః|*

*పూరయన్నశ్రుభిర్నేత్రే సహ గోపైర్వ్రజం యయౌ॥10023॥*

శ్రీకృష్ణుడు ఇట్లు పలికిన పిమ్మట నందుడు బలరామకృష్ణులను ఆత్మీయతతో అక్కున జేర్చుకొని, వారిని మథురలో విడిచిపెట్టి వెళ్ళుటకు మనస్సొప్పక మిగుల బాధతో కంటతడిబెట్టెను. ఎట్టకేలకు వారిని వీడ్కొని, తోడి గోపాలురతో గూడి వ్రజభూమికి బయలుదేఱెను.

*45.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*అథ శూరసుతో రాజన్ పుత్రయోః సమకారయత్|*

*పురోధసా బ్రాహ్మణైశ్చ యథావద్ద్విజసంస్కృతిమ్॥10024॥*

పరీక్షిన్మహారాజా! అనంతరము వసుదేవుడు గర్గమహర్షి మొదలగు బ్రాహ్మణులచేత బలరామకృష్ణులకు యథావిధిగా ఉపనయన సంస్కారములను జరిపించెను.

*45.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*తేభ్యోఽదాద్దక్షిణా గావో రుక్మమాలాః స్వలంకృతాః|*

*స్వలంకృతేభ్యః సంపూజ్య సవత్సాః క్షౌమమాలినీః॥10025॥*

అనంతరము వసుదేవుడు గర్గాది విప్రోత్తములను గంధపుష్పాక్షతలతోడను, వస్త్రాభరణములతోడను అలంకరించి, వారికి దూడలతోగూడిన పాడియావులను, దక్షిణలను సమర్పించెను. ముందుగా ఆ గోవులు పట్టువస్త్రములతోడను, సముచితమైన బంగారు హారములతోను అలంకరింపబడినవి.

*45.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*యాః కృష్ణరామజన్మర్క్షే మనోదత్తా మహామతిః|*

*తాశ్చాదదాదనుస్మృత్య కంసేనాధర్మతో హృతాః॥10026॥*

ఇదివఱలో కంసుడు వసుదేవుని గోసంపదను అన్యాయముగా లాగుకొనియుండెను. బలరామకృష్ణులు జన్మించినప్పుడు ప్రజ్ఞాశాలియైన (ధర్మబుద్ధిగల) వసుదేవుడు బ్రాహ్మణులకు గోదానములను చేయుటకు సంకల్పించి యుండెను. ఆ సంకల్పమును అనుసరించి, కంసుని మరణముతో తనకు స్వాధీనమైన ఆ గోవులను ఇప్పుడు భూసురోత్తములకు దానము చేసెను.

*45.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*తతశ్చ లబ్ధసంస్కారౌ ద్విజత్వం ప్రాప్య సువ్రతౌ|*

*గర్గాద్యదుకులాచార్యాద్గాయత్రం వ్రతమాస్థితౌ॥10027॥*

యదువంశమునకు ఆచార్యుడైన (పురోహితుడైన) గర్గమహర్షిచే జరిపింపబడిన ఉపనయన సంస్కారముల ద్వారా బలరామకృష్ణులకు ద్విజత్వము ప్రాప్తించెను. ఆ మహామునినుండి గాయత్రీ మంత్రోపదేశమును పొందిన పిమ్మట ఆ సోదరులు బ్రహ్మచర్యవ్రతమును ఆచరింపదొడగిరి.

*45.30 (ముప్పదియవ శ్లోకము)*

*ప్రభవౌ సర్వవిద్యానాం సర్వజ్ఞౌ జగదీశ్వరౌ|*

*నాన్యసిద్ధామలజ్ఞానం గూహమానౌ నరేహితైః॥10028॥*

*45.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*అథో గురుకులే వాసమిచ్ఛంతావుపజగ్మతుః|*

*కాశ్యం సాందీపనిం నామ హ్యవంతిపురవాసినమ్॥10029॥*

బలరామకృష్ణులు సకల విద్యలకును నిధానములు. వారు జగద్గురువులు, సర్వజ్ఞులు. వారి జ్ఞానము స్వతస్సిద్ధమైనది, లోకోత్తరమైనది. ఐనను, వారు లోకమర్యాదను అనుసరించి, సామాన్యులవలె ప్రవర్తించుచు తమ దివ్యలక్షణములను బయటపడనీయకుండిరి. అంతట వారు గురుకులమునందు విద్యాభ్యాసము చేయుటకై ఇష్టపడిరి. అందువలన ఆ సోదరులు అవంతీపుర (ఉజ్జయిని) వాసియు, కాశ్యప గోత్రజుడును అగు *సాందీపని* అను గురువు కడకు చేరిరి.

*45.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*యథోపసాద్య తౌ దాంతౌ గురౌ వృత్తిమనిందితామ్|*

*గ్రాహయంతావుపేతౌ స్మ భక్త్యా దేవమివాదృతౌ॥10030॥*

పిదప ఆ రామకృష్ణులు సంప్రదాయప్రకారము గురువును ఆశ్రయించిరి. జితేంద్రియులై, లోకమునకు ఆదర్శప్రాయముగా ప్రవర్తించుచుండిరి. వారు గురువును దైవసమానునిగా భక్తిశ్రద్ధలతో సేవించుచు, గురువుయొక్క ఆదరాభిమానములకు పాత్రులైరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[25/02, 05:51] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*827వ నామ మంత్రము* 25.02.2021

*ఓం ప్రచండాయై నమః*

అధర్మవర్తనుల పట్ల ప్రచండయై (భయంకర రూపిణియై) గోచరించు తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ప్రచండా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం ప్రచండాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులను ఆ తల్లి దుష్టగ్రహబాధలనుండియు, భూతప్రేతపిశాచ పీడలనుండియు రక్షించును, ఆకస్మిక ప్రమాదములను సంభవింపనీయక కాపాడుచుండును. ఇంకను, సుఖశాంతులతో తన భక్తులను జీవింపజేయును.

మిక్కిలి కోపము గలిగిన దూతలు కలిగినది పరమేశ్వరి. అలాగే అమ్మవారు కూడా మిక్కిలి కోపముతో ఉంటుంది. కాని, అమ్మవారు గాని, తన దూతలు గాని, వారికి గల మిక్కిలి కోపము భక్తులయెడల గాదు. భక్తుల పాలిట  పీడలుగా ప్రవర్తించు భూతప్రేతపిశాచములు, దుష్టగ్రహములు, దుష్ప్రవర్తన గలిగిన వారిపై మాత్రమే. ప్రచండమైన కోపోద్రిక్తమైన ముఖకవళికలతోనే వ్యతిరేక శక్తులన్నియు పలాయనము చిత్తగించును.  వాయువుగాని, అగ్నిగాని, వరుణుడుగాని, సూర్యచంద్రులుగాని తమ తమ కార్యములను క్రమము తప్పక నిర్వర్తించుటకు కారణము ఆ పరమాత్మయందు వారికి గల భయభక్తులు మాత్రమే. ఆమాత్రం భయము తమ ఏలికయందుండుట సహజము. గనుకనే అమ్మవారు ప్రచండగా గోచరమవుతుంది. అయినను అమ్మవారు *నిండుమనంబు నవ్యనవనీత సమానము* యనునట్లుండుటయే వాస్తవము. తన పాలనలోని వారు తనకు భయపడక యున్నచో ఏలినవారు రాజ్యమేలుట కష్టము గనుకనే జగన్మాత *ప్రచండా* యను నామమునకు సరియైనదిగా అనిపిస్తుంది. భండాసుర, మహిషాసురాది అసురులను మట్టుపెట్టుటకు కారణము అమ్మవారి ప్రతాపమే (ప్రచండ అనగా పరాక్రమము) కారణము. ప్రచండ అను పదమునకు అసాధ్యమయినది అను అర్థముకూడ గలదు. భండాసురాది రాక్షసులకు అమ్మవారు జయింపనసాధ్యురాలు గనుక శ్రీమాత *ప్రచండా* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం ప్రచండాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[25/02, 05:51] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*252వ నామ మంత్రము* 25.02.2021

*ఓం పరమానందాయై నమః* 

ఉత్కృష్టమగు బ్రహ్మానందమే తన స్వరూపమై యలరారు జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పరమానందా* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం పరమానందాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకునికి ఆ తల్లి జీవనమంతయు పరమానందభరితము చేయును.

ఏ ఆనందముకంటే మించిన ఆనందము వేరొకటి ఉండదో అదే పరమానందము అనబడుతుంది. దీనినే బ్రహ్మానందం అని కూడా అంటాము.

తనకు అనుకోకుండా ధనప్రాప్తి కలిగినది. ఆనందం కలుగుతుంది. విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణుడయాడు. ఆనందిస్తాడు. యువతీ యువకులు ఒకరినొకరు ఇష్టపడతారు. వివాహం జరుగుతుంది. అది వారికి ఆనందము. ఇలాంటి ఆనందములు  మనసుకు సంబంధించినవి. మనసు శరీరమునకు సంబంధించినది. శరీరము అశాశ్వతము గనుక ఆ ఆనందము శాశ్వతము కాదు. ఇహంలో ఆనందము అంటే ఇదే. దీనికన్నా అధికమైన ఆనందం ఒకటి ఉన్నది. దానినే పరమ+ఆనందము అనగా పరమానందము, లేదా బ్రహ్మ+ఆనందము అనగా బ్రహ్మానందము అనబడుతుంది. కాని పరమానందము అనేది నిష్కామముతో ఉన్నవాళ్ళు, సదాచార సంపన్నులు అయిన బ్రహ్మవేత్తలు మాత్రమే అనుభవించగలరు. 

అలాగే ఇక్కడ ఆనందముల మధ్యగల సంబంధం తెలియాలంటే అది మానుషానందంతో ప్రారంభించాలి. ఆనందములన్నిటికీ   పరాకాష్ఠగా చివరగా బ్రహ్మానందము వరకూ చెప్ఫాలి. అది ఎలాగంటే 

1. వంద మనుష్యానందములు అయితే ఒక మనుష్య గంధర్వానందము.

2. వంద మానుష్య గంధర్వానందములు అయితే ఒక దేవ గంధర్వానందము.

3. వంద దేవ గంధర్వా నందములు అయితే ఒక చిరలోక పితరుల ఆనందము.

4. వంద చిరలోక పితరుల ఆనందములు అయితే ఒక అజానజ దేవానందము.

5. వంద అజానజదేవానందములు అయితే ఒక కర్మదేవానందము.

6. వంద కర్మదేవానందములు అయితే ఒక దేవానందము.

7. వంద దేవానందములు అయితే ఒక ఇంద్రానందము.

8. వంద ఇంద్రానందములు అయితే ఒక బృహస్పతి ఆనందము.

9. వంద బృహస్పతి ఆనందములము అయితే ఒక ప్రజాపతి ఆనందము.

10. వంద ప్రజాపతి ఆనందములు అయితే ఒక బ్రహ్మానందము.

సాధకుడు కుండలినీ యోగసాధనలో మూలాధారంలో నిద్రాణస్దితిలో ఉన్న కుండలినీ శక్తిని జాగృతము చేసి, సుషుమ్నా మార్గంలో షట్చక్రములు దాటుతూ, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథులను ఛేదించి, సహస్రారమునందలి చంద్రమండలములో అమృతవృష్టిలో ఓలలాడినప్పుడు కలిగే ఆనందము వర్ణనాతీతము. దానికి కలము వలన గాని గళము వలన గాని వర్ణింప నలవిగాదు. కేవలం అనుభవైకవేద్యము మాత్రమే. అటువంటి ఆనందాన్నే పరమానందమనియు, బ్రహ్మానందమనియు అందురు. జగన్మాత తన భక్తులకు అటువంటి పరమానందమును కలిగించును గనుకనే *పరమానందా* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం పరమానందాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[09/03, 04:00] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*839వ నామ మంత్రము* 09.03.2021

*ఓం ముక్తినిలయాయై నమః*

పంచవిధముక్తులకు నివాసమైన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ముక్తినిలయా* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం ముక్తినిలయాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి జన్మరాహిత్యమైన ముక్తిని ప్రసాదించును.

జనన మరణ బంధ విమోచనం ముక్తి. అవిద్య నశించడం ముక్తి. ఇలాంటి ముక్తులు ఐదు విధాలని అంటారు. ఐదు విధాల ముక్తులు అనగా 1. సార్ష్టి (అంటే సృష్టించే శక్తి, సమానాధికారం కలది అనే అర్థాలు ఉన్నాయి), 2. సాలోక్యం, 3. సావిూప్యం, 4. సారూప్యం, 5. సాయుజ్యం. 

జగన్మాతను అర్చించు వారికి, తమ తమ సాధన దీక్షాపటిమను బట్టి మోక్షము లభిస్తుంది. 

మణిపూరంలో అర్చించు సాధకులు *సార్షిరూపముక్తి* ని పొందుతారు. అనగా ఆ తల్లికి దగ్గరలోనే తమకంటు ఇంకొక పురము నిర్మించుకుని ఉంటారు. దీన్ని సార్షిరూపముక్తి అంటారు.

అనాహతంలో శ్రీమాతను ఉపాసించు  సాధకులకు *సాలోక్యముక్తి* సంప్రాప్తింపజేసుకుంటారు. అనగా శ్రీమాత  పురములోనే నివసించువారవుతారు. దీన్ని సాలోక్యముక్తి అంటారు.

విశుద్ధిచక్రంలో జగన్మాతను  ఆరాధించువారికి *సామీప్యముక్తి* విశుద్ధిచక్రంలో దేవిని అర్చించేవారు ఆ అమ్మకు అతిదగ్గరగా, తల్లి పాద సేవకులుగా ఉండేభాగ్యం గలుగుతుంది.

ఆజ్ఞాచక్రంలో ఆ పరబ్రహ్మస్వరూపిణిని ఆరాధించు సాధకులకు *సారూప్యముక్తి* అనగా వేరే దేహం తాము ధరించి పరమేశ్వరితో సమానమైన

రూపంలో ఉంటారు. ఇది సారూప్యముక్తి

సహస్రారంలో దేవిని అర్చించే వారికి *సాయుజ్యము* సహస్రారంలో లలితాంబను పూజించువారు పునర్జన్మలేని ముక్తిని  పొందుతారు. మరల ఇంకో జన్మలేకుండా శాశ్వతమైన ముక్తి అనగా సాయుజ్యమును పొందగలుగుతారు.

ఇంత మాత్రమే గాక వారు చేయు కర్మలఫలితంగా స్వర్గనరకాలు ప్రాప్తిస్తాయి.

పరమేశ్వరి వద్ద ముక్తి అనగా ప్రతిబంధకములు తొలగుట, పంచవిధముక్తులలో ఏదో ఒకటి,  పునర్జన్మ పొందునదైతే సత్కర్మలకు సద్గతులు, దుష్కర్మలకు దుర్గతులు లభిస్తాయి. ఐదువిధములైన ముక్తులకు స్థానమైన పరమేశ్వరి *ముక్తినిలయా* యని అనబడినది.

పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం ముక్తినిలయాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[09/03, 04:00] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*264వ నామ మంత్రము* 09.03.2021

*ఓం సృష్టికర్త్ర్యై నమః*

జగన్నిర్మాణమును నిర్వహించు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సృష్టికర్త్రీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం సృష్టికర్త్ర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకులకు ఆ తల్లి అనుగ్రహముచే ఇష్టకామ్యార్థసిద్ధి కలుగును.

ఈ సమస్త సృష్టికిని పరమేశ్వరియే కారకురాలు. గనుక అమ్మయే సృష్టికర్త. ఆ తల్లియే స్థితికర్త. చివరకు ఆ తల్లియే ప్రళయకర్త. అనగా సృష్టి, స్థితి, లయములకు ఆ తల్లియే కారణము.  మాయను లోబరచుకొనిన ఈశ్వరుడే సృష్ట్యాదికృత్యములచేత ఐదువిధములని చెప్పబడినది. శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరిలో ఇరువది నాలుగవ శ్లోకంలో అమ్మవారి సృష్టిస్థితిలయతిరోదానానుగ్రహ కృత్యములను (పంచకృత్యములను) గూర్చి ఇలా చెప్పారు.

*జగత్సూతే ధాతా -  హరిరవతి రుద్రః క్షపయతే*

*తిరస్కుర్వన్నేతత్ - స్వమపి వపురీశస్తిరయతి |*

*సదా పూర్వస్సరం - తదిద మనుగృహ్ణాతి చ శివ*

*స్తవాఙ్ఞా మాలంబ్య -  క్షణచలితయో ర్భ్రూలతికయోః॥*

అమ్మా! బ్రహ్మ చరాచర విశ్వమును సృష్టించు చున్నాడు, మహా విష్ణువు జగత్తును పోషిస్తూ రక్షణ భారాన్ని వహించుచూ స్థితికర్త అయినాడు. పరమేశ్వరుడు ఆ జగత్తును లయము చేయుచున్నాడు. ఇలా త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయములు జరుపుతూ ఉంటే ఆ అనంతరము ఈ మువ్వురిని మహేశ్వరుడు తనలో లీనము చేసుకొనుచున్నాడు.అలా లీనం చేసుకున్న మహేశ్వరుడు విభుడైన సదాశివునిలో ఐక్యమగుచున్నాడు. అటుల బ్రహ్మాండ ప్రళయం జరిగిన పిమ్మట సర్వం తనలో ఇముడ్చుకున్న నీ నాధుడైన సదాశివునికి మరలా ఈ బ్రహ్మాండములు సృష్టించాలని కోరిక కలిగినది.  నీ ఆజ్ఞ లేనిదే ఆ కోరిక నెరవేరదు. గనుక తల్లీ నీ అనుమతి కొరకై సదాశివుడు ఎల్లప్పుడూ నీ వైపే దృష్టి పెట్టెను. అప్పుడు నీవు నీ భర్త కోరిక తీర్చదలచి నీ కనుబొమలను క్షణకాలం చలింపచేసి కళ్లతోనే నీ సమ్మతిని అందించినావు. నీ ఆనతిని గైకొని మరల సదాశివుడు మహేశ్వరుని, అతని ద్వారా బ్రహ్మ, విష్ణు, రుద్రులను సృష్టించి మరల ఈ సృష్టి స్థితి లయాలను నీ అనుగ్రహంతోనే సదాశివుడు జరుపుతున్నాడు. *ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః* (281వ నామ మంత్రము)  కన్నులు తెరచినంతనే బ్రహ్మాండాలను సృష్టింపజేస్తూ, కన్నులు మూసినంతనే బ్రహ్మాండాలను నశింపజేస్తూ ఉన్నావు కదా తల్లీ.

ఈ శ్లోకములో ఆది శంకరులు  లోక పాలకుల నిర్ణయాధికారములను, అమ్మ యొక్క సామ్రాజ్ఞిత్వాన్ని మనకు తెలియజేశారు.

జగన్మాతకు *పంచకృత్యపరాయణా*  యను (274వ) అను నామ మంత్రం ప్రకారం సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహము అను ఐడు విధములైన (పంచకృత్యములు) కార్యములు నిర్వహిస్తోంది

*సృష్టి* అనగా జగన్నిర్మాణము, అది రజోగుణ ప్రధానుడైన ఈశ్వరుని (బ్రహ్మ) కార్యము. అట్టి సృష్టిని మూల ప్రకృతి రూపమున చేయు చున్నది గనుక శ్రీమాత *సృష్టికర్త్రీ* యని అనబడినది

*స్థితి* సంరక్షణము . ఇది సత్వ గుణ ప్రధానము. ఈ ఈశ్వర కృత్యమును విష్ణు రూపమున నిర్వహిస్తున్నది పరమేశ్వరి. 

*సంహారము* జగత్తును లయము చేయుట. ఇది తమో గుణ ప్రదానుడైన రుద్రుని రూపములో అమ్మ ఈ ఈశ్వర కృత్యమును నెరపుచున్నది.

*తిరోధానము* సకల సృష్టిని పరమాణువుతో సహా నాశనము చేసి బీజ రూపములో తన దగ్గర ఉంచుకొనుచున్నది.  జీవులకు తమ స్వస్వరూపము కూడా తెలియకుండా చేయడము *తిరోధానము*  శుద్ధ సత్వ ప్రధానుడైన ఈశ్వరుని రూపములో అమ్మ ఈ కృత్యమును నిర్వహిస్తున్నది.

*అనుగ్రహము*  బీజ రూపములో, సూక్ష్మ రూపములో వున్న సృష్టిని విస్తరించడానికి, వికాసనము గావించడానికి  సదాశివ రూపములో అనుగ్రహించే కృత్యమును నిర్వహించుచున్నది.

సృష్టి యనగా లోకముల నిర్మాణము. పరబ్రహ్మస్వరూపిణి జగన్మాత తాను ఒక్కతే అయినను,సృష్టికర్త బ్రహ్మగా, స్థితి కర్త విష్ణువుగా, ప్రళయకారకుడు పరమేశ్వరునిగా - మొత్తానికి ఆ త్రిమూర్తుల స్వరూపం తానుగా సృష్టిని నెఱపుచున్నది. కనుకనే జగన్మాత *సృష్టికర్త్రీ* యని అనబడినది

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సృష్టికర్త్ర్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[09/03, 04:00] +91 95058 13235: *09.03.2021  ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది తొమ్మిదవ అధ్యాయము*

*అక్రూరుడు హస్తినాపురమునకు వెళ్ళుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*అక్రూర ఉవాచ*

*49.17 (పదిహేడవ శ్లోకము)*

*భో భో వైచిత్రవీర్య త్వం కురూణాం కీర్తివర్ధన|*

*భ్రాతర్యుపరతే పాండావధునాఽఽసనమాస్థితః॥10219॥*

*అక్రూరుడు నుడివెను* "విచిత్రవీర్యుని కుమారుడవైన ధృతరాష్ట్రమహారాజా! నీవు కురువంశమునకు కీర్తిని తెచ్చిన మహానుభావుడవు. నీ సోదరుడైన పాండుమహారాజు స్వర్గుస్థుడైన పిదప  ప్రస్తుతము రాజ్యభారమును  పూర్తిగా నీవే వహించుచుంటివి.

*49.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*ధర్మేణ పాలయన్నుర్వీం ప్రజాః శీలేన రంజయన్|*

*వర్తమానః సమః స్వేషు శ్రేయః కీర్తిమవాప్స్యసి॥10220॥*

*49.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*అన్యథా త్వాచరంల్లోకే గర్హితో యాస్యసే తమః|*

*తస్మాత్సమత్వే వర్తస్వ పాండవేష్వాత్మజేషు చ॥10221॥*

రాజా! రాజ్యమును ధర్మమార్గమున పరిపాలించుచు, ఎట్టి వైషమ్యభావమునూ చూపక ప్రజలలో అనురాగమును పెంపొందింపజేయుచు, ఆత్మీయులయెడవలె (దుర్యోధనాదుల యందువలె పాండవులు మొదలగు వారియందును), తక్కిన స్వజనుల యందును, నిష్పక్షపాతబుద్ధితో ప్రవర్తించుచున్నచో నీకు ఈ లోకమున చక్కని కీర్తిప్రతిష్ఠలూ,పరలోకమున సద్గతులూ అబ్బును. అట్లుగాక అన్యథా ప్రవర్తించినచో ఈ లోకమున నిందలపాలగుటయే గాక, మరణానంతరము నరకము పాలగుట తథ్యము. అందువలన దుర్యోధనాదులయందు వలెనే పాండవులయందును సమబుద్ధితో ప్రవర్తింపుము.

*49.20  (ఇరువదియవ శ్లోకము)*

*నేహ చాత్యంతసంవాసః కస్యచిత్కేనచిత్సహ|*

*రాజన్ స్వేనాపి దేహేన కిము జాయాత్మజాదిభిః॥10222॥*

మహారాజా! ఈ లోకమున ఏ వస్తువుతోనైనను, ఎవ్వరితోనైనను, శాశ్వతముగా కూడియుండుట అసంభవము (కర్మలకారణముగా సంయోగములు సంభవించుచుండును). అంతేగాక దేహముతోగూడ సంబంధము శాశ్వతముగా ఉండదు. ఇక భార్యాపుత్రాదుల విషయమున ప్రత్యేకముగా చెప్పవలసినది ఏమున్నది?

*49.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*ఏకః ప్రసూయతే జంతురేక ఏవ ప్రలీయతే|*

*ఏకోఽనుభుంక్తే సుకృతమేక ఏవ చ దుష్కృతమ్॥10223॥*

జీవుడు ఒంటరిగానే జన్మించును. ఒంటరిగానే మరణించును (భార్యాపుత్రాదులు ఎవ్వరునూ ఆ వ్యక్తితో గూడి జన్మింపరు, మరణింపరు). ఏ వ్యక్తియైనను తాను చేసికొనిన సుకృతదుష్కృతముల ఫలములను తాను ఒక్కడే అనుభవించును.

*49.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*అధర్మోపచితం విత్తం హరంత్యన్యేఽల్పమేధసః|*

*సంభోజనీయాపదేశైర్జలానీవ జలౌకసః॥10224॥*

ఏ వ్యక్తియైనను భార్యాపుత్రులను తనవారని భావించును. కాని, తల్లి చేపకు జీవనాధారమైన నీటిని దాని పిల్లలు త్రాగివేయునట్లుగా, మూర్ఖుడైన తండ్రి అష్టకష్టాలుపడి సంపాదించిన సంపదలసు అన్నింటిని, అతని కుమారులు కాజేయుచుందురు. అటుపిమ్మట అతడు బ్రతికియున్నను చచ్చిపోయినను వారికి పట్టనే పట్టదు.

*49.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*పుష్ణాతి యానధర్మేణ స్వబుద్ధ్యా తమపండితమ్|*

*తేఽకృతార్థం ప్రహిణ్వంతి ప్రాణా రాయః సుతాదయః॥10225॥*

అజ్ఞానియైనవాడు భార్యాపుత్రాదులను పిచ్చి మమకారముతో తనవారు అని భావించి అడ్డదారులు త్రొక్కియైనను వారిని పోషించుచుండును. కాని, అతడు ఆ సంపదలను అనుభవింప కుండగనే ప్రాణములు, సంపదలు, భార్యాపుత్రాదులు అతనిని త్యజించుట సంభవించుచుండును (అనగా వాటినిఅనుభవింపక ముందే అతడు వాటిని త్యజింపవలసివచ్చును.

*49.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*స్వయం కిల్బిషమాదాయ తైస్త్యక్తో నార్థకోవిదః|*

*అసిద్ధార్థో విశత్యంధం స్వధర్మవిముఖస్తమః॥10226॥*

ధృతరాష్ట్రమహారాజా! స్వధర్మమునెడ విముఖుడైన వాడు, నిజముగా తనకు ఏది హితమో ఎఱుగజాలడు. తనకు ఆత్మీయులనుకొనిన వారికై అధర్మములకు పాల్పడినవాడు కడకు వారి నిరాదరణకు గుఱియై వారిచే త్యజింపబడును. అట్టివాడు ఎన్నడునూ ఏవిధమైన సంతోషమునూ పొందకయే, ప్రాణములను కోల్పోయిన పిమ్మట స్వయంకృతములైన పాపములను మూటగట్టుకొని, అంధతామిస్రాది నరకముల పాలగును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

[09/03, 20:37] +91 95058 13235: *09.03.2021  సాయం కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది తొమ్మిదవ అధ్యాయము*

*అక్రూరుడు హస్తినాపురమునకు వెళ్ళుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*49.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*తస్మాల్లోకమిమం రాజన్ స్వప్నమాయామనోరథమ్|*

*వీక్ష్యాయమ్యాత్మనాఽఽత్మానం సమః శాంతో భవ ప్రభో॥10227॥*

మహారాజా! 'ఈ లౌకిక జీవితమంతయును మూడునాళ్ళ ముచ్చటయే. అంతేగాదు, స్వప్నదృశ్యములవలె అనిత్యములు, మాయామయములు' అను విషయములను గ్రహింపుము. కావున, నిన్ను నీవు నిగ్రహించుకొని, సముడవు, శాంతుడవు కమ్ము.

*ధృతరాష్ట్ర ఉవాచ*

*49.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*యథా వదతి కల్యాణీం వాచం దానపతే భవాన్|*

*తథానయా న తృప్యామి మర్త్యః ప్రాప్య యథామృతమ్॥10228॥*

*49.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*తథాఽపి సూనృతా సౌమ్య హృది న స్థీయతే చలే|*

*పుత్రానురాగవిషమే విద్యుత్సౌదామనీ యథా॥10229॥*

*అంతట ధృతరాష్ట్రుడు ఇట్లు నుడివెను* "పూజ్యుడవైన అక్రూరా! నీవు నా మేలుగోరి మంటిమాటలనే పలుకుచున్నావు. కానీ, చావు దగ్గఱపడినవానికి అమృతము ఇష్టముకానట్లు నీ మాటలు ఏమాత్రమూ నాకు రుచించుటయే లేదు. సౌమ్యా! నీవు చెప్పిన మాటలన్నియును పచ్చి నిజములు. ఐనను మేఘము నందలి మెరుపువలె పుత్రవ్యామోహముతో పక్షపాతధోరణితో నిండి, చంచలమైన నా మనస్సునందు నీ మాటలు ఎవ్వియును నిలచుటలేదు. 

*49.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*ఈశ్వరస్య విధిం కో ను విధునోత్యన్యథా పుమాన్|*

*భూమేర్భారావతారాయ యోఽవతీర్ణో యదోఃకులే॥10230॥*

*49.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*యో దుర్విమర్శపథయా నిజమాయయేదం సృష్ట్వా గుణాన్ విభజతే తదనుప్రవిష్టః|*

*తస్మై నమో దురవబోధవిహారతంత్రసంసారచక్రగతయే పరమేశ్వరాయ॥10231॥*

మానవుడు ఎంతటి వాడైనను విధినిర్ణయమును మార్చజాలడుగదా! ఆ పరమేశ్వరుడు భూభారమును తొలగించుటకై యదువంశమునందు అవతరించినాడని విన్నాను. భగవంతుని మాయాశక్తి అచింత్యమైనది (ఆ శక్తియొక్క తీరుతెన్నులు అనూహ్యములు. దానిద్వారా ఈ లోకమును సృష్టించి, ఆ స్వామి స్వయముగా అందు ప్రవేశించెను. సత్త్వరజస్తమోగుణాత్మకులైన జీవులయొక్క కర్మలను, కర్మఫలములను నిర్ణయించువాడు అతడే. ఈ సంసారచక్రము నిరంతరముగా కొనసాగుటకు ఆ పరమేశ్వరుని లీలాశక్తియే కారణము. అట్టి సర్వశక్తిమంతుడైన  పరమేశ్వరునకు నా నమస్కారములు".

*శ్రీశుక ఉవాచ*

*49.30 (ముప్పదియవ శ్లోకము)*

*ఇత్యభిప్రేత్య నృపతేరభిప్రాయం స యాదవః|*

*సుహృద్భిః సమనుజ్ఞాతః పునర్యదుపురీమగాత్॥10232॥*

*శ్రీశుకుడు పలికెను* ఈ విధముగా అక్రూరుడు ధృతరాష్ట్రుని అభిప్రాయములను తెలిసికొనెను. పిమ్మట పాండవులు మొదలగు ఆత్మీయుల అనుమతిని గైకొని అతడు మఱల మథురానగరమునకు చేరెను.

*49.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*శశంస రామకృష్ణాభ్యాం ధృతరాష్ట్రవిచేష్టితమ్|*

*పాండవాన్ ప్రతి కౌరవ్య యదర్థం ప్రేషితః స్వయమ్॥10233॥*

పరీక్షిన్మహారాజా! ధృతరాష్ట్రుని పాండవులయెడ వ్యవహరించుచున్న పక్షపాతధోరణిని గూర్చి తెలిసికొనివచ్చుటకై సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు అక్రూరుని హస్తినాపురమునకు పంపియుండెను. అక్రూరుడు హస్తినలో కుంతీదేవి ఆవేదనపూర్వకముగా తనతో తెలిపిన మాటలను, ఆమెయు, విదురుడును దుష్టులైన దుర్యోధనాదులు పాండవులపై జరిపిన విషప్రయోగాది దుశ్చర్యలను గూర్చియు, బలరామకృష్ణులకు ఎఱిగించెను. అంతేగాక! తాను ధృతరాష్ట్రునితో పలికిన హితోక్తులను, అందులకు ధృతరాష్ట్రుడు చెప్పిన సమాధానమును అతడు వారికి సమగ్రముగా వివరించెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే వైయసక్యామష్టాదశసాహస్ర్యాం పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే ఏకోనపంచాశత్తమోఽధ్యాయః (49)*

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి *అక్రూరుడు హస్తినాపురమునకు వెళ్ళుట* యను నలుబది తొమ్మిదవ అధ్యాయము (49)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి