రామారావు హనుమంతరావు కలసి అక్కడ వున్న బల్లపై కూర్చొని చిన్న నాటి విషయాలు, వయస్సులో కలిగిన మార్పులు, వాకదానికోటి పెనవేసుకుంటూ చెప్పు తున్నాడు.
*మేమే అదృష్టవంతులమ్*!
నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (16)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఏమిటండి మీరు చదివేది
మానవ జన్మలో ఏవి రహస్యంగా ఉంచాలి, ఏవి బహిర్గతం చెయ్యాలి, అనేవిషయంపై అనేకమంది అనేక విధాలుగా తెలియపరిచారు.
ఏమోనండి నాకు మాత్రం ఏమి తెలియదు, మనమధ్య రహస్యాలు ఎందుకండి, ఆ విషయాలు ఇప్పుడు అవసరమా.
అవసరము కాదనుకో, అయినా తెలుసుకుంటే మంచిదనే భావన, మనమధ్య మంచిది కదా, అందుకే నాకు తెలిసిన విషయాలు తెలియపరుస్తాను.
తొమ్మిది విషయాలలో మానవ జన్మ రహస్యంగా ఉంచాల్సిందే, అలా ఉంచకపోతే జీవితం దుర్లభం అది తెలుసుకోవాలి ఇది నా వాక్కు కాదు పెద్దలవాక్కు.
ఈ తొమ్మిదింటిని రహస్యంగా దాచాలంటారు..అవి ఏవి చెప్పండి
ఉడికించాక
అవి
ఆయువు, విత్తము, ఇంటిగుట్టు, మంత్రం, ఔషధం, సంగమం, దానం, మానము, మరియు అవమానం
అనే ఈ తొమ్మి దింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచాల్సినవి.
అందులో " ఆయువు, విత్తము, ఇంటిగుట్టు," ఈరోజు వివరించుతాను తెలుసుకో.
భగవంతుడు మనిషితో పాటు జీవులన్నిటికీ శరీరం ఇచ్చినప్పటికీ ‘వివేకము’ అనే గొప్ప గుణం మనిషికి మాత్రమే ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు.రేపటి గురించి ఆలోచించటం అనవసరం. జరిగేది జరగక పోవచ్చు, జరగంది జరగవచ్చు అన్నీ విషయాలు కాలం పరిష్కరిస్తుందని నమ్మి జీవితం సాగించాలి.
1 . "ఆయువు". జరుగుతున్న సంఘటనలు జన్మపరిపక్వతకు వయసు "ఆయువు" చాలా ముఖ్యమైనది పదే పదే వయసు సుఖానికి అడ్డు రాదు. అనారోగ్యాన్ని బట్టి వయసు బయటపడు.
ప్రతిఒక్కరు రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు. జరిగేది జరగకమానదు అని వివేకంతో ఆలోచిస్తాడు కాబట్టి మనిషి నిబ్బరంగా ఉండ గలుగుతున్నాడు. నిజంగా ఒక వ్యక్తి ఆయుః ప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై అతనిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్త్రకారుడు." బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం," ఇలా చెప్పారు వయసును ఏ పరిస్థితిలో లెక్కించక మనసుని బట్టి కాలాన్ని బట్టి నడుచుకోవాలి.
నిజమేనండి మీరు చెప్పఁది. మరి రేండోది ఏది వివరించండి
2 . విత్తము
ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదు.
‘లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మ్రింగబోడు’ అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే.
‘అతి సంచయేచ్ఛ తగదు’ అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం.అందుకే కదా
అవునండి మీరు చెప్పేది నిజం అందుకే "మొగవారి జీతం ఆడవారి వయసు అడగకుండా
జీవితం సాగించాలన్నారు కదా
అవునే నీవు చక్కగా చెప్పావు
దేనియెడల, ఎవరి యెడలా 'ప్రత్యేకత'ను కలిగి ఉండొద్దు, నీలో ఉన్న దేవుడ్ని గమనించు మంచి మార్గంలో బతక గలిగితే అదే మోక్ష స్థితి. డబ్బు కోసం వెంపర్లాడితే నిన్ను, నీకుటుంబాన్ని , దేశాన్ని నాశనం సుహాసినవాడౌవుతావు.
అందుకే నే చెప్పేది రహాస్యంగా ఉంచటం : 'ఆచరణ' అనేది గొప్ప ఉపన్యాసము..
3 . ఇంటిగుట్టు: ఏ పరిస్థితిలో ఇంటిగుట్టు ఈశ్వరుడు కూడా తెలుసుకోలేనివిధంగా ఉంచాలి
అంటే ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దాన్నే ‘ఇంటిగుట్టు’ అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమపూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని.
సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు.
మగడా వయసు చెప్పద్దన్నావు, దానం గూర్చి వద్దన్నావు, ఇంటిగుట్టు విప్పద్దన్నావు మిగతావి
ఓ నా ఆలోచన పరురాలా, నా ముద్దుల శ్రీమతి
వేడి కాఫీ నా చేతిలో పెడితే "ఉఫ్ ఉఫ్" అనకుండా తాగ్గలనా, ఎదో నాశ్రీమతి తెచ్చింది సానుభూతిగా తాగి నోరు కాల్చుకోగలనా
ఎందుకండీ వెటకారపు మాటలు, మీరు
అట్లాగే రామయాణంలో విభీషణునితో లంకేశ్వరుడు చనిపొయ్యేముందు లంక గుట్టు తెల్పి లంకకేచేటు తెచ్చావురా అని తెల్పాడు
నిజమేనండి మిగతావి " కంచంలో అన్నం తో పాటు కూర పప్పు పచ్చడి పొడులు ఇంకా సాంబారు ఉన్నా అన్ని కలిపి ఒకే సారీతినలేము కదండీ, అట్లాగే
కొన్ని విషయాలు నిదానంగా వింటేనే అర్ధమవుతాయి.
సరి సరే మీ అర్ధపు మాటలు వింటూవుంటే అక్కడ కాఫీ పొంగిపోతుంది తర్వాత మీరు పొంగిపోతారు
నిజమా ..... ఆ నిజమే
--(())--
నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (17)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఏమండి మనం పంజరాన చిలుకల్లా గ బ్రతుకుటేన జీవితం. బావిలోని కప్పలాగ కదలుటేన జీవితం. అని నేను ప్రశ్న వెయ్యను. నీలోపల నీ జ్ఞానం ద్వారా పదిమందికి పంచాలి
గుండెలోన అనురాగం ప్రశ్న ఉదయించి అందరికీ జవాబు తెలియపర్చాలి.
కానీ మంత్రం, ఔషధం, సంగమం రహస్యాంగా ఉంచి మిగతా విషయాలు అందిరికి తెలియపరుచుదాం శ్రీమతి
అని పలికే శ్రీవారు
4 . మంత్రం’: ‘మననం చేసేది మంత్రం’- మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం మన సంప్రదాయం. మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడంవల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడంవల్ల నష్టమని భావన. దానిమీద భక్తిలేని వాడికి చెబితే అది అభాసుపాలవుతుంది. మంత్రంపై అచంచల నమ్మకం ఉండాలి.
నమ్మకం లేనిచోట బంగారం కూడా బూడిదలాగా కనిపిస్తుంది.
మనస్సు ఎంత నిర్మలమైతే, దాన్ని నిగ్రహించడం అంత సులభమవుతుంది. మనస్సును నిగ్రహించాలనుకుంటే, చిత్తశుద్ధికి తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాలి.
అలాగే మంత్రం ఫలించాలంటే ధ్యానం పై స్థిరం ఏర్పడాలి ప్రశాంతత కలిగే విధంగా ఉండే ప్రదేశంలో మంత్రం సాధన చేస్తే ఫలితముంటుంది.మంత్రం నమ్మకం లేనివారికి చెప్పినా చెప్పినవారికే మన:శాంతి ఉండదు "మంత్రానికి శక్తి ఉంటుంది "
మంత్రం అంటే, ఒక నియమిత సమయంలో జపమాల త్రిప్పుతూ జపం చేయటం మాత్రమే అని పొరపడి, దానితో మాత్రమే తృప్తి పడబోకు. ఈ మంత్రం అనుష్ఠానం నీ నిత్యజీవితంలో భాగమై విలీనమైపోవాలి.
అనుష్ఠాన మంత్ర సమయంలో నీకు కలిగే పవిత్ర భావములూ, నీవు జపించే మంత్రం యొక్క అర్థంలోని పవిత్రతా నీవు లోకులతో వ్యవహరించేటప్పుడు ఆచరణలో కనిపించాలి. అదే సరియైన మంత్రా అనుష్ఠానం.
5 .ఔషధ౦:
ఔషధం యొక్క వ్యక్తీకరణ. చైతన్యం పదార్ధము ఈ సృష్టిగా పరిణమించింది, మన మనోదేహాలుగా పరిణమించిందీ చైతన్య స్వరూపంగానే. అవ్యక్తంగా ఉంటే అదే ఔషధం . వ్యక్తమైతే అదే చైతన్యం. విత్తనంగా ఉండి మొలకెత్తి మొక్కగా, చెట్టుగా మారితే అది చైతన్యం. అనారోగ్య మనిషి ఔషధం వల్ల ఆరోగ్యవంతుడుగా మారుతుంటాడు.
ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే. ఇవాళ భయంకర రసాయనాలను ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఇవి అందరికి బహిరంగ పరిస్తే ఎవ్వరంటేవారు తయారుచేస్తారు. ఔషధం రహస్యంగా ఉంచడం మంచిదే.
6 . సంగమం: సంగమం అంటే కలయిక. మనం కొన్ని రహస్యమైన భేటీలు జరుపుతాం. అవి అధికారిక, అనధికారమైనవి ఏవైనా కావచ్చు. రహస్యంగా ఉంచడం ఉత్తమం. అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యలున్న సమావేశాలు ఉంటుంటాయి. అవి బహిర్గతమైనపుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే సంగమం రహస్యంగా ఉంచడం మంచిది.
మీరు చెప్పిన రహస్య విషయాలు తెలిసినవి
కస ఆనందం గూర్చి తెలుపు.
శ్రీమతిగారు అసలు ఆనందం గూర్చి తెలుపుతా విను.
అనందము, పరమానందము. సర్వానందము అనేవి లేవని చెప్పటంలోని ఆంతర్యం... అవి మనకు భిన్నంగా లేవని, గుర్తించమనే బోధమాత్రమే. ఒక గులాబీ చెట్టుకు తన పూల గుభాళింపు విడిగా ఉండదు. ఆస్వాదించే వారికి చల్లని అనుభూతినిచ్చే, వెన్నెల చందమామకు విడిగా ఉండదు. మధుర పదార్ధంలోని తీపి దానిలో అంతర్భాగమై ఉంటుంది. అలానే మనం పరబ్రహ్మ స్వరూపమైతే ఆనందం, పరమానందం, బ్రహ్మానందం మనలోని అంతర్భాగాలే అనుభూతి చెంది ఆనందం పొందే మార్గాలు చూపుతాయి సమయానుకూలంగా పొందేదే నిజమైన ఆనందం అని తెలుసుకో.
--(())--
నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (18)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఏమండి మనం పిల్లల భవిషత్తు ఒకదారిలో పెట్టాము నీకు నేను, నాకు మీరు మిగిలాం కదా అరుచుకున్నా, నవ్వుకున్నా ఇద్దరిమధ్య ఉంటుంది జీవితం. అని నేను ప్రశ్న వెయ్యను. నీలోపల నీ జ్ఞానం ద్వారా పదిమందికి పంచాలి. మనల్ని మనపిల్లలు వేలెత్తి చూపకుండా ఉండాలి అదే నేను కోరుకునేది
అదేనెను కూడా కోరేది.
గుండెలోన అనురాగం ప్రశ్న ఉదయించి అందరికీ జవాబు తెలియపర్చాలి.
కానీ దానం , మానం , అవమానం, రహస్యాంగా ఉంచి మిగతా విషయాలు అందిరికి తెలియపరుచుదాం శ్రీమతి
అని పలికే శ్రీవారు
దానం: దానం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుంది.
అయినా మన దగ్గర ఉన్న ధనం విషయం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం. ధనాన్ని దానం చెయ్యాలి. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. దానం చెయ్యాలి. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు (ప్రభుత్వం) దాన్ని స్వాధీన పరచుకోవడమో, అగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో జరుగు తుంది.
దానం అనేది ఒక్కటే కాదు అనేకం అందులో ముఖ్యమైనవి " అన్నదానం, కన్యాదానం, గోదానం,భూదానం,హిరణ్యదానం, వస్త్రదానం .......
ఇక
మానం: మానం అంటే గౌరవం. దాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఏమీ చేతగాకున్నా నేనింతవాణ్ణి అంతవాణ్ణి అని చెప్పకూడదు. మనం గౌరవాన్ని ఎంత రహస్యంగా ఉంచితే అంత పెరుగుతుంది.
ప్రతి ఒక్కరు కలిగి ఉండవలసిన దివ్య గుణములు : మనిషి యొక్క మానాన్ని కాపాడుతాయి
-దైవం యందు సంపూర్ణ నిష్ట, -ఆత్మలో ధృడత, -ఆలోచనలో పరిపక్వత, -మనుస్సులో సంతుష్టత, -బుద్దిలో పరిపక్వత, -సంస్కారములో శ్రేష్టత, -దృష్టిలో పవిత్రత, మాటలలో మధురత, -కర్మలలో ప్రావీణ్యత, -సేవలో నమ్రత, -వ్యవహారములో సరళత, -స్నేహములో ఆత్మీయత, -ఆహారములో సాత్వికత, -జీవితములో సత్యత, -వ్యక్తిత్వములో రమణీయత
-నిద్రలో నిశ్చింతత.
ఈ గుణాలను మనస్సులో భద్రపరచుకొని, ఆలోచనలను, బుద్దులను, వ్యవహారశైలిని సంపూర్ణంగా మార్చుకొని వాటిని అన్నిటిని పాటించి సాత్విక గుణాన్ని పాటించి ఆ భగవంతుడైన సర్వేశ్వరుడు పరమాత్మస్వరూపుడిని హృదయంలో సాక్ష్యాత్కరించుకోవాలి. మానవ జన్మను సార్థకత చేసుకోవాలి. అసలుసిసలైన మానవ జన్మలక్ష్యాన్ని గుర్వానుగ్రహంతో ఈ జన్మలోనే పొందవచ్చును!!
ఇక చివరిది
అవమానం: అలాగే తనకు జరిగిన అవమానం మరిచిపోవాలి. అవ మానాలను అస్తమానం మననం చేస్తే క్రోధం పెరుగు తుంది. దాంతో పగ.. ప్రతీకారాలు.. ఇక వాటికి అంతమ నేది ఉండదు. ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం కానీ మనం చెప్పులు వేసుకొని వెళ్ళడం సులభం కదా. కుటుంబంలో చిన్న పెద్ద విషయాలు తలుచుకొని అవమానమని భావిస్తే మన:శాంతికి కరువవుతారు, అందరు విరోధులుగా అగుపడుతారు.
చీమ దైవాన్ని ప్రార్ధించి వరం కోరింది కొట్టగానే చావాలని దేవుడు తధాస్తు అంటూ అంతర్ధానమయ్యాడు అంతే ఆ చీమ ఆశతో ఒకడిని కుట్టింది అంతే దెబ్బకు చచ్చింది. అంటే అవమానం బహిర్గపరిసే వాడి చావు వాడు తెచ్చుకున్నట్టే.
అవునే
చాలా చక్కగా చెప్పావు
ఈ తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం అని పెద్దలు చెప్పిన జ్ఞానబోధను మనం తప్పక ఆచరించాలి.
మొత్తానికి రహస్యజ్ఞానం అంటూ నా మెదడుని తినేసావే
చాలా చిక్కని కాఫీ తీసుకురా
తాగాక మరో కధ ఆలోచిద్దాం.
మీకు ఇదేపనే బజారుకు పోయాయి కూరలుతెండి
కడుపులో కాస్త ఆహరం పడితే మెదడుకు పదును వస్తుంది
ఇదేమన్నా వజ్రమా అరగదీస్తే మెరవటానికి దానికన్నా గొప్పది
అయితే కాఫీ తగి వెళతానే
హమ్మయ్యా ఇప్పుడు మీరు దారిలోకి వచ్చారు
ఆ మూడుముళ్ల ఎప్పుడు నీ మెడలో వేసానో అప్పటినుంచి నాదారి నీ దరియే కదే
నోట్లోవేలేసుకున్న చిన్నపిల్లోడికి చెప్పండి మీమాటలు నాకు కాదు అంటూ నవ్వి కాఫీ అందించింది
కాఫీ చాలా చాలా బాగుంది
త్రాగందే
నీ కళ్ళను బట్టి చెప్పగలనే
ఏమన్నారు
నిజమేనే కాఫీ చేదుగా ఉంది
ఐ వంట్లో షుగర్ ఉంది అదేవేసుకొని త్రాగండి
అంటూ ఒకటే నవ్వులు ... నవ్వులే నవ్వులు .. కళ్ళంబడి నీళ్లు
--(()))--
నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (19)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఏమిటండి అలా కూర్చున్నారు
ఎలా కూర్చోవాలె
కూర్చో వటంలో కూడా ని అనుమతి కావాలా
అయ్యో రామ మీరు దేనిగురించో ఆలోచిస్తున్నట్లున్నారు దానిగురించి అడిగా అంతే
మనిషిలో "నేను" అనే అహాన్ని గురించి ఆలోచిస్తున్నాను అంతే.
ఎంత ఆలోచించిన ఇది కలియుగం " దాన్ని తొగించటం ఎవరి వళ్ళ కాదు చివరికి మృత్యువు వళ్ళ కూడా కాదు "
కొంచం వివరిస్తావా
ఒకప్పుడు
ఓ ఆశ్రమవాసి నాతో అన్నాడు దైవం కోసం నేను సర్వస్వాన్నీ పరిత్యజించాను.
ఇపుడు నా వద్ద ఏమీ లేవు. " ఐనా పరిత్యజించాల్సిన మరొకటి ఆయనలో ఇంకా మిగిలే
ఉందనీ నిజంగా పరిత్యజించాల్సినది దాన్నొక్కటేననీ ఆయనతో అన్నాను
అప్పుడు ఆయన ఇలా అన్నారు
ఆయన
తన చుట్టూ చూసుకున్నాడు. ఒక్కసారి, ఆయన వద్ద నిజంగానే బాహ్యంలో ఏమీ లేవు. ఆయన
వద్దనున్న వస్తువు ఆయన అంతరంగంలోనే ఉంది. అది ఆయన చేసిన పరిత్యాగంలో ఉంది.
అది ఆయన కళ్ళలో ఉంది. అది ఆయన సన్యాసంలో ఉంది. అదే ఆయనకున్న "నేను ". ఆ
అహాన్ని పరిత్యజించటమే అసలైన పరిత్యాగం అని తెలుసుకున్నాడు .
తక్కిన వాటిన్నిటినీ
లాగేసుకోవటం సాథ్యమే కనుక మృత్వువు సర్వస్వాన్నీ లాక్కెళ్ళి పోతుంది.ఈ
అహాన్ని మాత్రమే ఎవ్వరూ లాక్కెళ్ళలేరు. ఆఖరుకి మృత్యువుకు కూడా దాన్ని
లాక్కోవటం అసాథ్యం. దాన్నికేవలం వదిలి పెట్టవచ్చు. నిజమైన పరిత్యాగం.
మానవుడి
వద్ద నేను, తప్ప 'అహం' తప్ప దైవానికి సమర్పింప దగ్గది మరేదీ లేదు. తక్కిన
పరిత్యాగాలన్నీ భ్రమలు మాత్రమే. ఆపరిత్యజింపబడిన విషయాలు నిజంగా ఏనాడూ అతడి
స్వంతంగావు గనుక. పైగా తక్కిన పరిత్యాగాలన్నీ మానవుడి అహాన్ని మరింత పెంచి
ఘనీభవింప చేస్తాయి కూడా అవి ప్రేమ చుట్టూ అల్లుకుంటాయి.
నేను అనే కుప్పలోంచి ఆవిర్భవించే
సత్యభ్రమే అజ్ఞానం. కానీ సత్యం కోసం ఈ రాశిలోనే వెదుకుతున్న మానవుడికి ఆ
భ్రమ ధ్వంసమై 'నేను' అనే పూదండలోని పువ్వులన్నీ చెల్లా చెదురుగా రాలి
పోతాయి. అప్పుడు ఆ మథ్యలో నిజంగా ఉన్న దారం పువ్వు లతో అప్పటి వరకూ కప్పబడి
ఉన్న ఆథారం అనే సత్యం కనిపిస్తుంది. ప్రాప్తిస్తుంది.
ఆ
పువ్వులన్నిటినీ తొలగించిన తరువాత ఆ పూదండకు ఆధారంగా ఉన్న దారం నాకు
మాత్రమే ఆథారంగా ఉండక అన్నింట్లోనూ అందరిలోనూ ఆథారంగా ఉందనే విషయం
స్పష్టంగా అర్థం అవుతుంది. నాలో ఉన్నట్లు గానే సృష్టి మొత్తం లోనూ అది ఉండి
అంతర్లీనంగా వ్యాపించి ఉందనే విషయం అర్థం అవుతుంది.
నాకు నేను అనేపదం తప్ప ఏమి అర్ధం కావటం లేదు, వివరిస్తావా
నీవు
'హక్కు లేని స్థితిని' వదిలి పెట్టి ఆ హక్కును సాథించుకోవచ్చు. .'నేను'గా
తయారవడాన్ని విడిచి నపుడే మానవుడు నిజమైన 'మనం ' కాగలడు. తన కేంద్రం లోని
భ్రమను విడిచి పెట్టి మానవుడు నిజమైన కేంద్రాన్ని ప్రాప్తించు కోవచ్చు.
మానవుడి నేను నిజం కాదు. అనేక విషయాల సంయోగమే అది. దానికంటూ ప్రత్యేక మైన
ఉనికి లేదు. అనేక అంశాల సమ్మిశ్రమమే అది.
చివరగా చెపుతున్నా "నేను"
అహంకారపు మరణమే పొందాలి. దివ్యత్వం నుండి దూరపు సత్యం నుండి దూరపు
సృష్టి నుండి .భౌతిక కాయపు మరణాని కన్నా ముందే అహాన్ని వదిలినవాడే వాడే
ధన్యుడు.
అందుకే అంటున్నా నీలో గాని, నాలో గాని "నేను" అనే పదాన్ని
మరచి " మనం" అని అనుకుంటే సర్వులకు శాంతి కలుగుతుంది, చివరకు మృత్యువుకూడా
భయపడుతుంది, అనగా మనలో ఉన్న అహ0కారాన్ని వదలి త్యాగబుద్ధి జీవనమునకు ఆధారం
అని తెలుసుకుంటే మంచిది.
నిజమేనా నీవు చక్కగా చెప్పావు
--(())--
నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (20)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఏమిటండి అదేపనిగా టి.వి. చూడకండి
ఎందుకే ఎట్లాగంటావ్
అవునండి టి.వి లో కొన్ని కార్యక్రమాలు మనిషి మెదడుకుచేరి ఎం జరుగుతుంది అనే ఆవేశం ఏర్పాటుకు కారణం అవుతుంది. కొన్ని చూస్తే గుండెజళ్ళు మనిపిస్తుంది. ఐ వయసులో అవసరమా
అవసరమేనే
సమయానుకూలంగా కొన్ని కార్యక్రమాలు బాగుంటాయి, అవి చుస్తే తప్పుకాదు కదా
అవునండి రోజూ ఒకేమాదిరిగా అడవిరిచుట్టూ కధతిప్పుతూ వాళ్ళే హీరోలు వల్లే విలన్స్ మగవార్ని దద్దమ్మ లు చేసి చూపిస్తున్నారు అది అవసరమా
నచ్చిన పాత సినమాలు, పాటలు, వంటలు ఇలా చెప్పుకుపోతే కొన్ని బాగున్నాయి కొన్ని బాగోలేదు చూడటం తప్ప విమర్శించి హక్కు లేదు, ఇదండీ ఈనాటి టి.వీలు.
సరే సప్త వ్యసనాలు గురించి తెలపగలవు.
ఏ మనిషయినా దుర్వ్యసనాలకి లోనయితే జీవితంలో బాగుపడలేడు.
ఈ వ్యసనాలకి లోనయి నాశనమయ్యేవాళ్ళు ఈ కాలంలోనే కాదు, పూర్వమూ వున్నారు. ముఖ్యంగా దుర్వ్యసనాలు ఏడు అంటారు. అవేమిటంటే
*1.పరస్త్రీ వ్యామోహం – ఏ కాలంలోనైనా మనిషిని అధఃపాతాళానికి తొక్కేసే వ్యసనం ఇది. ఈ వ్యసనంతో సర్వనాశనం తెచ్చుకున్నవాళ్ళల్లో పూర్వ కాలంలో రావణాసురుడు ముఖ్య ఉదాహరణ. సీతాదేవిని అపహరించి, ఎన్నో కష్టాలను కొని తెచ్చుకోవటమేగాక తన కుటుంబాన్నీ, వంశాన్నీ, అయినవారినీ, చివరికి రాజ్యాన్నికూడా కోల్పోయాడు. ఈనాడు ప్రభుత్వం వారే వ్యభిచారులకు అనుమతిస్తున్నారు అందుకే ఆడవాళ్ళ జీవితాలు నాశనమౌతున్నాయి.
*2.జూదం ..ఈ రోజుల్లో ఈ పేకాట వగైరా వ్యసనాలబారినపడి ఎన్ని కుటుంబాలు ఎన్ని అవస్తలు పడుతున్నాయో తెలుసుకోండి అటువంటి వాటిని ప్రోత్సహించేవారిని అరికట్టాలి అవసరమైతే పేకాట మాన్పించాలి. భారతంలో ధర్మరాజు అంతటి వాడు జూదం వల్ల ఎన్ని అగచాట్లు పడ్డాడో అందరికీ తెలుసు. (ఆంతటి గొప్పవాడే ఆ రోజుల్లో అన్ని అవస్తలు తాను పడటమే కాకుండా, తన తమ్ములూ, భార్యా కూడా అవస్తలు పడటానికి కారకుడయ్యాడే, )
*3.మద్యపానం – నేడు ప్రజల ఆరోగ్యం అవసరం లేదు, కేవలం ధనం కావాలి ఆధనంతో ఓట్లకోసం ఈనాచేయవచ్చు కానీ మద్యపానం నిషేధించరు. పురాతన కాలంలో దీనికి ఉదాహరణ శుక్రాచార్యుడు. ఈయన రాక్షసులకు గురువు. ఆయనకి మృత సంజీవినీ విద్య తెలుసు. ఆ విద్యతో చనిపోయిన రాక్షసులను వెంటనే బ్రతికించేవాడు. అలాంటివాడు మద్యపాన మత్తులో ఏమి చేస్తున్నాడో తెలుసుకోకుండా తాను తాగే పానీయంలో కచుడి చితాభస్మం కలిపి సేవిస్తాడు. (పురాతన కధలు అందరికీ వివరంగా తెలియక పోయినా కచుడి చితాభస్మం తాగటం వివరాలు నేనూ ఇప్పుడు తెలుసుకోవాలి) .
*4. వేట -- ఈ రోజుల్లో మాత్రం ఇది , స్ధితి పరులకు వ్యసనమే. దానితో పట్టుబడ్డవారెన్ని కేసులెదుర్కుంటున్నారో పేపర్లల్లో చూస్తున్నాంగా, ఒకవైపు వన్యమృగాలరక్షణ అంటూ మరోవైపు చంపుకు తింటున్నారు. పూర్వం దశరధ మహారాజు వేటకోసం వెళ్ళి, నీటి శబ్దాన్నిబట్టి బాణం వేసి శ్రవణకుమారుడిని చంపుతాడు. ఆయనకి తెలియక చేసిన పాపమయినా శ్రవణుడి వృధ్ధ తల్లిదండ్రుల శాపానికి గురయి తన కుమారుడు శ్రీ రామచంద్రుడికి దూరమయి రాముణ్ణే కలవరిస్తూ మరణిస్తాడు. మృగాలు నగరాలపై వచ్చేవి అప్పుడు ప్రజలను కాపాడటానికి రాజులు వేటాడేవారు.
*5. కఠినంగా, పరుషంగా మాట్లాడటం -- పూర్వకాలంలో కఠినంగా మాట్లాడేవాళ్ళని వేళ్ళమీద లెక్కబెట్టేవాళ్ళు...ఇప్పుడు అలా మాట్లాడనివాళ్ళని....లెక్కపెట్టవచ్చు. శిశుపాలుని వన్దతప్పులదాకా ఓపిక పట్టి మరీ సంహరించాడు కృష్ణుడు.
*6.కఠినంగా దండించటం -- ఈ రోజుల్లోకూడా ఏ కారణంవల్లనైతేనేమి తల్లిదండ్రులు పిల్లల్ని దండించటం, టీచర్లు పిల్లల్ని కఠినంగా దండించటం ఎక్కువైంది.
ఉదాహరణ. ఒకసారి దుర్యోధనుడు తన తాతగారిని, మేనమామలని కూడా బందిఖానాలో పెడతాడు. వారికి ఆహారం అతి కొద్ది మెతుకులు వేయగా అందరూ చనిపోగా శకుని ఒక్కడే తిని ప్రాణాలు నిలుపుకున్నాడు ఇదే కఠిన దండన.
*7.ఆఖరిది డబ్బు. కొందరికి డబ్బు వృధాగా ఖర్చుచెయ్యటం అలవాటు. బాగా డబ్బున్నా, క్రమ శిక్షణా, సరైన ఆలోచన లేకపోవటంవల్ల అవసరముందా లేదా అని కూడా ఆలోచించకుండా డబ్బు దుర్వినియోగం చేస్తారు. దుర్వ్యసనాలకు వినియోగిస్తే దుర్గతే లభిస్తుంది అపజయమే తప్ప జయం వుండదు. అందుకే ధనాన్ని సద్వినియోగం చెయ్యాలి.
మంచీ చెడూ తెలుసుకుని మనుగడ సాగించటమే మనిషి జన్మకి సార్ధకత.
ఈ వ్యసనాలలో వేటిని ఆశ్రయిన్చక నిజాయితీగా కుటుంబానికి దేశానికి రక్షణగా ఉండి కులాన్ని అనుకరించి జీవితం సాగించాలి.
జీవిత సంసారం ఒక నాటకమోరన్నా
జగన్నాటక సూత్రదారిని కనుమురోరన్నా
ప్రకృతి పరిసీలన రహస్యం తెలుసుకోరన్నా
వేషంతీసి వేసి నిర్మల చిత్తంతో మెలగాలన్నా
ప్రపంచంలో ఉన్న మర్మం తెలుసుకోరన్నా
మాయా మోసము ఎరిగి జాగర్త పడాలన్నా
తలుకు బెళుకులు శాశ్వితము కాదన్నా
మూడురోజులు ముచ్చటకే బాధపడకన్నా
మోక్షదామం కొరకు ధర్మం అనుసరించన్నా
దైవకృపకు నిత్యం ప్రయత్నం చేయాలన్నా
బ్రహ్మజ్ఞానం పొందుటకు కృషి చేయాలన్నా
అందరిలో మానవత్వాన్ని బ్రతికించాలన్నా
నరుని దేహము వచ్చుట అదృష్టమన్నా
మానవత్వము ఎల్లవేళల రాదు రారన్నా
దేహంలో పొందే విషయసౌక్యము వద్దన్నా
సుఖాన్నిచ్చే ఆత్మబడసి ముక్తి నొందన్నా
సత్ప్రవర్తన సత్సంకల్పం కలిగి ఉండన్నా
మానసంబున మురికి లేకుండా ఉండన్నా
నిర్మలంబగు నీటిఅడుగు తెల్లగా ఉండన్నా
శుద్ధమైన చిత్తమందు ఆత్మవస్తువు ఉండన్నా
పంచకోశములోన ఆత్మజ్యోతియే ఉండన్నా
దేవదేవుడు నమ్మినవాని చెంతనే ఉండన్నా
దూరదూరము పోయి పోయి వెతుకుటేలన్నా
హృదయం లో ఆత్మజ్యోతిగా నిండి ఉండన్నా
--((**))--
నాతో..నా శ్రీమతి.ప్రాంజలి ప్రభలు..21
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ఏవండోయ్ శ్రీ వారు మీకు తెలుసా
తెలుసా అని అనే బదులు తెలిసినది కక్కేస్తే ఒకపనైయ్ పోతుంది
పనివివరం తెలుసుకోవాలని అనుకోవు ఏదోపనిచేయబోయి మరేదో పనిచేస్తావ్ చెయ్యి కోసుకుంటావ్ ఏమన్నా అంటే అరుచు కుంటావ్.
ప్రపంచంలో సుఖం ఎరుగనివారు
ఎవరైనా ఉన్నారా?
అంటే
ఉన్నారంటున్నాయి శాస్త్రాలు
వారిని "దుఖఃభాగులు"అంటారు
వారి వివరాల్లో కెళితే వారు *ఆరు రకాలు*
*1. ఈర్ష్యాళువు*
వీళ్లు ఎవరి వృద్ధిని లేక ఎదుగుదలను చూడలేరు
అలాంటివారిని ఈర్ష్యాళువు అంటారు.పక్కింటిలో మేళం మ్రేగితే ఏడ్చే వారు.
*2. జుగుప్సావంతుడు*
వీళ్లు దేన్ని చూచినా అసహ్యించుకుంటారు
వారివానికి సుఖం ఎక్కడుంటుంది. శుభ్రం గా ఉన్నా నచ్చదు. తుడిచిందే తుడిచి, కడిగిందే కడిగితే నే కాని తృప్తి పడరు
*3. నిస్సంతోషి*
వీడొక విచిత్రమైన వాడు వీడికి సంతోషమనేది ఉండదు
దాంతో వీనికి సుఖ మెక్కడ. ప్రతి విషయంలో తప్పుపడతాడు సంతోషమోచ్చినా ముందే ఏడుస్తాడు ఎందుకొచ్చిందాయని
*4. క్రోధనుడు*
వీడు ప్రతివిషయానికి చిటపటలాడుతూ ఎప్పుడూ
కోపంతో ఉండే కోపిష్ఠి వీడికి సంతోష మెక్కడ.
బుల్లి అరచి నా, చీమ కుట్టినా, మంచం కిర్రన్నా, పళ్ళు కొరికినా, తుమ్మినా దగ్గినా ఒకటే అరుపు దానిలో కూడా రౌద్రం
*5. నిత్యశంకితుడు*
అన్నిచోట్లా, అందరినీ శంకించేవాడు వీడు
అంటే ప్రతిదీ అనుమానమే ఇంకేముంది
సుఖం. పెళ్ళాం బయటికి పోయినా, మంచి చీర కట్టినా, పిల్లలు ఏడ్చిన అనుమానం
*6. పరభాగ్యోపజీవి*
ఎప్పుడూ ఇతరుల సొమ్ముపై ఆధారపడి బ్రతికేవాడు
వీడికి ఎప్పూ ఎవరోఒకరు ఇస్తూవుంటేనే లేదంటే
దుఖఃమే ఇది సాధ్యమా కాదుకదా అందుకే వీనికీ
సుఖం సున్నా. పెళ్ళాం సంపాదన పై, ఇతరులను మోసపు సంపాదన యే లక్ష్యంగా జీవించేవాడు. అలా చేయక పోతే నిద్రే పట్టదు.
ఈ ఆరుగురురూ ఎప్పుడూ సుఖాన్నీ,
ఆనందాన్ని, లేకుండా బాధతో అసంతృప్తితో
జీవిస్తుంటారు కాబట్టి వీరిని *దుఖఃభాగులు* అంటున్నాయి.
చాలా చక్కగా చెప్పావు ఇప్పుడు నా చేయి కోసుకుంది కదా నా మనసు ఎలాంటి చెప్ప గలవా
ఆ చెప్ప గలను నేను చేయగలనని ధీమా వయసు ఉడికాక ఆధీమా తగ్గించు కుంటే మంచిది
అవునే అది ఎలా తగ్గించుకోవాలి ఇలా..
ఎలా...
ముందు కాఫీ తాగితే తెలుస్తుంది కాస్త ఓపిక వస్తుంది ....
1
--(())--
నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (22)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఏమండి మన చెట్టుని ఎందుకు పూజచేస్తాము ఆ విషయము నీకు తెలుసా అని అడిగింది శ్రీమతి శ్రీవారితో పలికింది.
చెట్టు ఓ ధర్మ వృక్షం అని మాత్రం తెలుసు
మిగతా వివరాలు అన్నినువ్వే చెప్పాలి
అసలు ఏమిటండి
ఏమిటో నీవు చెప్పాలి ముందు ..
ధర్మం అనే మహావృక్షం -
ఈ మహావృక్షానికి అన్ని వైపులా కొమ్మలు నేలకు వంగి ఉన్నాయి. అహింస, భూతదయ, సత్యం, శాంతం -ఇలా ఎన్నో కళ్యాణ నామములతో ఉన్నాయి ఆ కొమ్మలు.
ఆ వృక్షం చిటారు కొమ్మన బ్రహ్మానందం అనే ఫలం.
ఆ ధర్మ వృక్షం అధిరోహించాలంటే, బ్రహ్మానంద ఫలాన్ని పొందాలంటే, ఏదో ఒక కొమ్మని పట్టుకోవాలి. ఆ కొమ్మే నిన్ను పై కొమ్మ వరకూ చేరుస్తుంది.
ఫలం నోటికి అందిస్తుంది. అలాకాక, అదికాదు ఇది అనీ, ఇది కాదు అది అనీ, దేనినీ సరిగా పట్టుకొనక, సందేహాలతో ఉన్నా, అన్ని కొమ్మలనూ ఒక్క పర్యాయమే పట్టుకోవాలి అని ప్రయత్నించినా ఎటూ కాకుండా పోతావు
అట్లాగే తల్లి తండ్రులు తల్లి బిడ్డల్ని మోసి కని యవ్వనాన్ని బిడ్డలకు దారపోస్తుంది. తండ్రి సంపాదన అనే వలయంలో చిక్కి మనస్సును పిల్లలకు పంచి వారి వృద్ధికి సహకరిస్తారు
బ్రహ్మానందం అనే ఫలం తల్లి తండ్రుల " ప్రేమ " ఆప్రేమ అందరూ పొందాలంటే దేశానికి కుటుంబానికి త్యాగబుద్ధి తో ఒకరికొకరు సహకారంతో తల్లి తండ్రుల ప్రేమను పొందాలి అదే నే చెప్పేది.
అసలు సెహతు ఉందా విత్తు ముందు చెప్పు
చెట్టే ముందు
ఎట్లా
సంద్రాన్ని చిలికాక కల్పవృక్షం పుట్టింది అంటే
వేరేచెప్పాలా చేట్టేముందు
మరి స్త్రీ గొప్ప పురుషుడు గొప్ప
స్త్రీనే గొప్ప
ఎలా
ఎలా అనగా ముందు పుట్టింది పల సముద్రంలో లక్ష్మి దేవి అర్ధం చేసుకో
అర్ధమవుతుందిలేవే ఏమాత్రం తెలియదా
నీరు పల్లమెరుగు నిండుగ వున్న తటాకము నుండి క్రిందుగ వున్న ప్రదేశము నకు నీరుపారి వాటిని నింపును. రెండిటి యొక్క సమతలము ఒకటి యగు వరకు నీరు పల్లమునకు పారును. అట్లే పిల్లల లోనికి తల్లితండ్రుల మేధస్సు ప్రవహించును. వారిద్దరి మధ్య కల
అనుబంధముచేత అది సాధ్యపడును. అదే విధముగ అందరి నడుమ కూడ అట్టి చైతన్య ప్రభావము నిర్వర్తింపబడి ఇద్దరునూ సమానమగు చైతన్య స్ఫూర్తి కలవారగుదురు.
ప్రవాహానికి అడ్డు వచ్చిన కొండలు మిట్టలు చెట్లను దాటుకుంటూ కడలి చేరును జలము, అట్లాగే పిల్లల బుద్ధులు మార్చటానికి తల్లితండ్రులు సహకరిస్తారు, ఏంటో ఓర్పు వహిస్తారు, వారు మారేదాకా బోధిస్తూనే ఉంటారు కట్టెకు కాలే వరకు అదే ప్రేమ.
ఆ ప్రేమ బంధమే హిందూ సమాజానికి శ్రేయస్కరం.
.
ఇదే లోకరీతి ధర్మవృక్షం తనసర్వస్వం ప్రజలకే ధారపోస్తుంది, జలము ప్రజల దాహాన్ని తీరుస్తుంది అట్లాగే పిల్ల ఆశలుతీర్చి ధర్మవృక్షం లా జీవిత ఫలం అందించేది తల్లితండ్రులే వారి ప్రేమ అనురాగం ఉన్న కుటుంబానికి పెద్ద వృక్షం
అర్ద మైన దండి
పూస గుచ్చినట్లు చెపితే అర్ధం కాకుండా ఉంటుందా .
ఏమోనే నీవు చెప్పేవి వినాలని ఉంది ఇప్పుడు సూదిలో దారం ఎక్కించ మంటే ఎంతకష్టమో నీమాటలు అర్ధం చేసుకోవటం అనేకన్నా కష్టం.
ముందు ఆ కళ్ళజోడు మార్చండి అప్పుడు మీకు అన్ని కనిపిస్తాయి హాయిగా సూదిలో దారం కూడా ఎక్కించగలరు వయసు పెరిగిందని ఓపికలేదనకండి వయసుతోపాటు బుడ్డి మనసు కూడా పెరుగుతుంది
అవునే చేతికి కఱ్ఱ, కళ్ళకు జోడు,ఉన్నా ఒకరి చేయి ఒకరు పట్టుకొని అలా అలా నడుస్తూ ఉంటే
మీరేమి కుర్రోళ్ళు కాలేరునెనేమి పడచు పిల్లను కాలేను
ఎందుకండీ ఈ పగటి కలలు
అంతేనా ////// అంతే
అవునే ఎదో మర్చిపోయావు ఈరోజు
అయ్యోరామ కాఫీ తెస్తానుండండి
త్రాగాక అలా అలా నడుద్దామా
ముసిముసినవ్వులమధ్య శ్రీమతి ...
--(())--
నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (22)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
శ్రీమతి ఈరోజు భగవద్గీత చదువుతున్నావు ఏమిటి విశేషం
ఏమి లేదండి ఈ శ్లోకం ప్రతిఒక్కరు తెల్సుకోవాలి అందుకనే చెపుదామనుకున్న
చూడండి ముందు కర్మ యొక్క ఫలమే త్రికరణశుద్ధి. భావన, వాక్కు, చేత ఒకే రకముగా ఏర్పాటు చేసుకోవాలి. ఒకే సూత్రము మీదకి ఎక్కించాలి. అపుడే త్రికరణ శుద్ధి కలుగుతుంది. లోపల ఒక మాట, బయట ఒక మాట ఉండకూడదు. అలా ఉండేవారి మీద పరమగురువుల దృష్టి పడదు. ఆశీర్వచనము ఉండదు.
త్రికరణశుద్ధి ఉన్నవాడికి శ్రద్ధ ఉంటుంది. శ్రద్ధ వలన జ్ఞానము నిత్యనూతనముగా నీ యందు భాసిస్తుంది.
కనుక మనం భగవంతునికి సమర్పించవలసినవి:-
మనకు ఏది లభించినది అంతా భగవదనుగ్రహ ఫలితమే. మనం నిజానికి భగవంతుడికి ఏమీ ఇవ్వవలసిన పని లేదు.
భగవంతునికి మనం పత్రమో, పుష్పమో, ఫలమో, తోయమో , సమర్పించడమన్నది మనం భగవంతుని యందు చూపించే కృతజ్ఞత మాత్రమే.
మనకు ఈ దేహాన్నిచ్చి, సంపదలిచ్చి, పుత్ర పౌత్రాదులనిచ్చి కాపాడుతున్న పరమాత్మకు మనం సమర్పించే వస్తువులన్నీ ఆయనకు మనం కృతజ్ఞతను వెల్లడించడానికే, నిజానికి ఆయనకు కావలసిన దేమీ లేదు.
ఆయన సర్వ సంపూర్ణుడు. అయితే భగవంతునికి ఏమి యివ్వాలి అన్న విషయంలో భగవద్గీత ఇలా చెప్పింది.
" పత్రం పుష్పం, ఫలం, తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః "
నిర్మల బుద్ధి తో, నిష్కామ భావంతో పరమ భక్తునిచే సమర్పింపబడిన పత్రమును గానీ, పుష్పమునుగానీ, ఫలమునుగానీ, జలమును గానీ నేను ప్రత్యక్షంగా, స్వయంగా ప్రీతితో ఆరగిస్తాను.
పై శ్లోకంలో ని పత్రపుష్పఫలతోయ శబ్దాలలోని అంతరార్థం
1. పత్రం : "పతతీతి పత్రం". పడిపోయేది పత్రం. మనిషిని పడవేసేది మనస్సు. కాబట్టి పత్రాన్ని సమర్పించాలీ అంటే మనమనస్సును దైవాంకితం చేయాలని దాని అంతరార్థం.
అనగా పుణ్యాలవల్ల స్వర్గం-వస్తాయని శాస్త్రం చెప్తుంది. జీవించి ఉండగానే అనుభవంలోకి వస్తాయి. స్వర్గం అంటే సుఖం. శాంతి పుణ్యాలకు అతీతమైనది. అది మనసుకు శాశ్వతఆస్తి. మనసు మనతోనే ఉంటుంది. మనతోనే ఉన్న మనసు మూలంలో నిరంతరం శాంతిగా ఉంటుంది. శాంతి మనసు అంకితం చెయ్యాలి.
2. పుష్పం: "పుష్యతీతి పుష్పం". వికసించేది పుష్పం, మనిషిలో వికసించేది బుద్ధి కాబట్టి మన బుద్ధి ని దేవునిపై లగ్నం చేయాలని దీని అంతరార్థం.మనలో ఉన్న పరోపకార బుద్ధి, త్యాగబుద్ధి ఆచరిస్తూ దాన్ని పుష్పంగా అంకింతం చెయ్యాలి.
3. ఫలం : "విశీర్యతే ప్రహారైరితి ఫలం" ప్రహారైః అనగా దెబ్బలచే విశీర్యతే అనగా పగిలేది ఫలము. జ్ఞాన బోధము అనే దెబ్బలచే పగిలేది మనస్సులోని అహంకారం. కాబట్టి ఫలాన్ని అనగా అహంకారాన్ని మనం దైవానికి సమర్పించాలని అంతరార్థం.
అహమే జన్మలకు మూలమన్నారు. అట్టి అహమునే ఎరుక అన్నారు. అహంపదార్థరహితమే జన్మరహితమన్నారు.
అయితే అహం అనే పదం ఏ అర్థాన్ని సూచిస్తుందో దాని అర్థాన్ని తెలుసుకుంటే చాలన్నారు. పరిపూర్ణమును తెలియపర్చి అట్టి అహమనే ఎరుకను పోగొట్టేవారే సద్గురువు...
4. తోయం: "తాయతే_పాయతీతి". అనగా రక్షించునది కనుక తోయము. సోహం భావంతో ఉన్నప్పుడు, ధ్యేయాన్ని గుర్తుంచుకొని , రక్షించేది చిత్తము. కాబట్టి తోయము అంటే చిత్తము అని అంతరార్థం. అంటే మన చిత్తాన్ని భగవంతునికి సమర్పించాలని భావము.మన మనసు, మాట, ప్రవర్తనల విషయంలో చేయవలసినవి, చేయకూడనివి తెలుసుకొని తదనుగుణంగా ఉండటమే ధర్మాచరణ.లో తోయమనంగా చిత్తం అంతరార్ధం.
మనస్సు మన పతనానికి మూలకారణము. అందుకే దాన్ని మనం ముందుగా భగవంతు నికి సమర్పించాలి.
పైకి ఎలా కనబడిన సరే.,ప్రతి ఒక్కరూ సృష్టి కార్యాన్ని నెరవేరుస్తున్నవారే, దైవానికి సర్వ అర్పిస్తున్నవారే.
ప్రాణం రెండు విధాలుగా అభివ్యక్తమవుతోంది-- మొదటిది మనిషిలో శ్వాసగా, రెండవది మనిషిలో తలంపుగా (తలంపు అనగా దైవాన్ని తనవంతు అర్పించటం అనేది)
అందుకనే భగవంతుడు ఆకు, పుష్పం, పండు, జలము దేనితో పూజచేసినా మోక్షమిచ్చును అలాగే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము భగవంతునకు అర్పించినా మోక్షమిచ్చును.
అందుకే నేను ఎప్పుడు మిమ్మల్ని త్రికరణాసిద్ధిగా పూజచేయ్యండి అంటూ ఉంటాను
అట్లాగే చేస్తున్నాను కదా ఆ దేవదేవునికి సరే ఇవి ఆదేవుని పాదాల వద్ద ఉంచి నమస్కారం తెలియపరుద్దాం ఇది కలియుగం కదా .
--(())_-
నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (23)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఏమిటండీ అలా ఆలోచిస్తున్నారు
ఏమిలేదె మన పక్కింటి ముకుందరావుగారు గుర్తున్నదా
ఎందుకు గుర్తులేదండి వారి భార్య పిల్లల కు ఎంత కష్టపడిందో, పిల్లలు పుట్టాక వారిని పెంచటానికి ఇంకా కష్టపడింది కానీ చివరకు ఆమె చని పోయాయి0ది, ఆచావు ఎవరూ సరిగా గుర్తించలేదు
అవునే అదే నాకు బాధ కలిగింది.
ఏది ఏమైనా కూతుర్లకు పెళ్ళిచేసాడు, కొడుకు ఉన్నాడు అని ఆ ముకుందరావు తెలిపారుగా
అక్కడే వచ్చిది ఆ కొడుకు పరమ దుర్మార్గుడుగా మారాడు వాడిచేష్టలకు ముకుందరావుగారి కూడా బాధ పెడుతున్నాడు.
కనీసం తల్లికి పిండ ప్రదానముగా చేయవలసి ఉంటుంది.కానీ అలాంటివి చేయకుండా ఉంటున్నాడుట ఎంతసేపు డబ్బు డబ్బు అని వేధించేవాడుట అదే మాట్లాడుతున్నాడు ముకుందరావు.
అందుకే భగవద్గీ తలో అధ్యాయం 1, శ్లోకం ౪౧ ఈ విధంగా ముందే వివరించారు
41
సంకరో నరకాయైవ
కులఘ్నానాం కులస్య చ |
పతంతి పితరో హ్యేషాం
లుప్తపిండోదకక్రియా: ||
తాత్పర్యము : అవాంఛిత సంతానము వృద్ధియగుట వల కుటుంబము వారు మరియు కుటుంబ ఆచారమును నష్టపరచినవారు ఇరువురకిని నరకము సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణముగా ఆపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబాలకు చెందిన పితరులు పతనము నొందుదురు.
భాష్యము : కర్మకాండ సిద్ధాంతాల ప్రకారము విష్ణువుకు అర్పించిన ప్రసాదమును పూర్వీకులకు పిండ ప్రదానముగా చేయవలసి ఉంటుంది. ఆ విధమైన సహాయమును అందించుట పుత్రుల బాధ్యత. అయితే భగవద్భక్తిలో నిమగ్నమైనవారు, వారి భక్తి చేత ఎంతో మంది పూర్వీకులను ఉద్ధరించగలరు.అటువంటి భక్తి పుటులకుఅబ్బలి.
ఏది ఏమైనా మానవజన్మ కు కొన్ని నియమ నిభందనలు మనమే పెట్టుకున్నాము సంస్కరణలు అమలుజరుపుతాము '
ప్రతిఒక్కరు తెలుసుకోవాలి
మనం భూమిని సాగుచేస్తాము. పంటని పెంచుతాము. ఆ పంటను అందరికి పంచుతాము, ఆ విధంగానే, వేదాలలో చెప్పినట్టు మనం నడచుకొంటే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ఈ ఫలితాలని రప్పించటానికి భగవంతుని కోరుతాం మన నడవడిక బట్టే మనచుట్టూ ప్రేమ ఉంటుంది స్నేహము ఉంటుంది ప్రేమ లేనివాడు బాగుపడినట్లు ఎక్కడా లిఖించపడలేదు. .
కర్మని చేయక పోవటమే పాపం. కర్మలు మూడు రకాలు - నిత్య, నైమిత్తిక, కామ్యములు.
ఎల్లవేళలా, ప్రతిరోజూ విధిగా చేయవలసిన కర్మలను నిత్య కర్మలంటారు. ప్రత్యేక సందర్భాలలో చేసే కర్మని నైమిత్తిక మంటారు. ఉదాహరణ - గ్రహణమప్పుడు స్నానం చేసి పితృతర్పణం వదలటం, . నిత్య, నైమిత్తిక కర్మలు అందరూ తప్పకుండా చెయ్యాలి. ''కామ్య'' కర్మలు ఏదో ఒక ఫలాన్ని అపేక్షించి చేసేవి. వర్షాలు కావాలంటే ''వరుణజపం'' చేస్తాము.
నిత్యకర్మల లక్షణాలని కూడ మీమాంసకులు చెప్పారు. '.కర్మలు చేయకపోతే కీడు వాటిల్లుతుంది, కర్మలు అనుష్టిస్తే సత్ఫలితాలు కలుగుతాయి. మంచి గృహమూ, సంపదా, సత్సంతానం, ఖ్యాతి, జ్ఞానం - ఇవన్నీ అభ్యుదయానికి సంబంధించినవి.
కనుక జీవితం సాగాలంటే మనసు ప్రశాంతత తో ప్రతిఒక్కరి హృదయంలో మంచిమాటలతో మార్చ గలరు అదే నేను చెప్పగలను.
ముకుందరావుగారి అబ్బాయిని ఒక్కసారి తీసుకురండి అతనిని మార్చటానికి మనవంతు ప్రయత్నం చేద్దాం. మనవళ్ల కాకపోయినా కాలం మాత్రం ఖచ్చితంగా మార్చుతుంది
నిజమే శ్రీమతి
ఇప్పుడే కబురంపుతాను నా పుట్టినరోజుకు మీ అబ్బాయిని కూడా తీసుకోని రమ్మనమని చెపుతాను
ఏది చిన్న సంబరం జరుపుకుందాం
ఏమిటి మీ పుట్టినరోజా
అవునే ఒకరినిమార్చటానికి మల్లా పుడతాను ఈరోజే
ఆమ్మో మీకు తెలివుందే
అవునే అంతా ని దగ్గరే నేర్చుకున్నాను
ఆ.... ఆ...
--(())--
ఏమండి ఈరోజు భగవంతుడు కులక్షయం గూర్చి వివరించారు అది తెలుసుకుందాం
అట్లాగే
. భగవద్గీత యథాతథం - 1 - 039
అధ్యాయం 1, శ్లోకం 39
39
కులక్షయే ప్రణశ్యంతి
కులధర్మా: సనాతనా: |
ధర్మే నష్టే కులం కృత్స్నమ్
అధర్మో భిభవత్యుత ||
తాత్పర్యము : కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారము నశించిపోవును. ఆ విధంగా వంశమున మిగిలినవారు అధర్మవర్తనులగుదురు.
భాష్యము : వర్ణాశ్రమ వ్యవస్థలో కుటుంబ సభ్యులకు అనేక ధర్మాలు ఇవ్వబడినవి. వాటిని చక్కగా పాటించినచో వారు క్రమేపి ఆధ్యాత్మిక చైతన్యమును పెంపొందించుకొనవచ్చును. పుట్టుక నుండి మరణము వరకు పెక్కు సంస్కారాలు చేయవలసి ఉంటుంది. వాటిని జరిపించుట పెద్దల బాధ్యత. అయితే అటువంటి పెద్దలు తప్పుచేయటం, ఆతప్పుని వాదించటం అనవసరముగా నోటిని వ్యక్తపరచడం అందులో పిల్లలు చూస్తున్నపుడు ప్రవర్తించటం చాలా తప్పు. అదేపనిగా పిల్లలు ప్రవర్తిస్తే తల్లితండ్రులు అరవటం కూడాతప్పు, పిల్లలు సంస్కారాలను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉన్నది. తద్వారా అవలక్షణాలను పెంపొందించుకుని, మానవ జీవితాన్ని దుర్వినియోగము చేసుకుని మోక్ష పథాన్ని కోల్పోగలరు. కాబట్టి, పెద్దలను ఎట్టి పరిస్థితులలో
పిల్లలముందు నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళు వర్ణసంక్రమముగా మారె సూచనలు ఉన్నాయి.
' ''అది చెప్పటం సులభమేగాని చేయటం దుస్సాధ్యం'' అని పాఠకులనవచ్చును. కొంతవర కది నిజమే కాని మనో నిగ్రహం సంపాదించినట్లయితే ఆ ఆత్మవిచారణ లభిస్తుందని వేదాంత గ్రంథములు ఘోషిస్తూ వున్నవి. భగవానులున్నూ ''అత్యంత సులభం ఆత్మ విద్య''
మనస్సును ఇంద్రియముల వెంట పోనీయక అరికట్టి ''ఈ నేను అనువాడెవరు? ఈ శబ్దం ఎక్కడ పుట్టింది? దీనికి మూలాధార మేది?'' అని అంతర్ముఖదృష్టితో విచారిస్తూ హృదయ కేంద్రమును చేరుకోవాలి. మనస్సును ఆ హృదయకేంద్రమున నిలిపి స్వస్థత నందుటయే ముఖ్య కర్తవ్యమనీ, అదియే భక్తీ, యోగమూ, జ్ఞానమూనని భగవాన్ ఉపదేశ సారంలో చెప్పారు.
''హృత్‌ప్థలే మనః స్వస్థతా క్రియా
భక్తియోగ బోధాశ్చ నిశ్చితం'' (ఉప=శ్లో-10.)
ఆ హృదయమునకీ శరీరంలో స్థాన మెక్కడ? అని ప్రశ్నించిన భక్తులకు ''వక్షస్థలమునకు కుడివైపున ఓజస్థానమున్నదనీ, అదియే ఆత్మకు నివాసస్థానమనీ'' భగవాన్ సెలవిచ్చి వున్నారు.
కావున ప్రతి మానవుడున్నూ జిజ్ఞాసువై ''నే నెవడను? నా యథార్థ స్వరూపమేమి?'' అని విచారించి తెలుసుకొన యత్నించుట ముఖ్య కర్తవ్యము. అనంతకోటి జీవరాసులలో మానవునకొకనికే విజ్ఞాన ధనం లభించింది. దానిని సద్వినియోగం చేసుకొని జనన మరణ మహాంబుధిని దాటుటకై యత్నింతురుగాక.
కావున వర్ణసంక్రమము జరగకుండా జాగర్తపడాలి కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారము నశించిపోవును. ఆ విధంగా వంశమున మిగిలినవారు అధర్మవర్తనులగుదురు.
--(())--
నాతో నా శ్రీ మతి... ప్రాంజలి ప్రభలు..25
ఏమండి ఈరోజు మీరు కధ చెప్పాలి
దేని గురించి
అదేనండి రాబోయి ఉగాది గురించి
నేను చెప్పుట కన్నా మన పూర్వీకులు వ్రాసినదే చదువుతాను
మీరు ఎంత తెలివి గలవారు
అవునే ఏ ఎండకు ఆ గొడుగు పెట్టాలన్నారు గా
అవునూ
దానికీ దీనికీ సంబంధం ఏమిటి
ఉగాది గురించి ఘణాపాటి చెప్పిందే చెపితే బాగుంటుంది సొంత కల్పన దేనికి
మన తొలి పండుగ – ఉగాది
సమూహం లోని సభ్యులందరికీ “ప్లవ” నామ సంవత్సర శుభాకాంక్షలు.ఉగాది మన తొలి పండుగ.తెలుగు వారి కొత్త సంవత్సరం.ఉగాది పండుగ చైత్ర మాసం , శుక్లపక్షం లో పాడ్యమి రోజు జరుపుకుంటాము.చైత్ర మాసం తెలగు మాసాలలో మొదటిది, అలాగే ఇది వసంత ఋతువు.ఈ రోజు ప్రకృతి లో వున్న అందాలన్నీకొత్త చిగుర్లు తొడిగే వేళ . ఈ పండుగ విశేషాలు ఓసారి చూద్దాం..
తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై(60).ప్రభవ నామ సంవత్సరం మొదటిది. క్షయ నామ సంవత్సరం చివరిది.రాబోయే రెండు రోజుల్లో మనం "ప్లవ" నామ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము.ఈ మొత్తం 60 సంవత్సరాలలో మనిషి తన జీవిత కాలం మొత్తం మీద రెండు కన్నాఎక్కువ సార్లు ఒకే సంవత్సరాన్నిచూడలేడు.అందుకే తను జన్మించిన సంవత్సరం మళ్ళి చూసిన నాడు అంటే తన అరవయ్యో ఏట(60 పుట్టినరోజు) తనకి అంత ఆయుష్షు ఇచ్చినందుకు గాను “షష్టిపూర్తి మహోత్సవం “జరుపుకుంటాడు.
ఉగాది ప్రాశస్త్యం:
సోమకుడనే రాక్షసుడు వేదాలను దొంగిలిస్తాడు.అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మ కి అప్పగిస్తాడు. బ్రహ్మఅప్పుడు సృష్టి, స్థితి, లయ అనే మూడు పనులలో మొదటిదైన సృష్టి కార్యాన్నిఈ నాడే అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు మొదలుపెట్టాడని మన పురాణాలు చెపుతున్నాయి …యుగానికి ఆది అంటే యుగానికి మొదటి రోజు కావున అది యుగాది గా మనం ఈనాడు జరుపుకుంటున్నాము.
ఉగాది రోజు:
ఉగాది రోజు ఇష్ట దైవాలను పూజించి పెద్దలకు,పిన్నలకు కొత్త బట్టలు ఇవ్వడం ఆనవాయితీ. అలాగే ఉగాది పండుగ రోజు మాత్రమే చేసుకునే ఉగాది పచ్చడి వెనుక కూడా ఎంతో అర్ధంవుంది. జీవితంలో ఎదురయ్యే సుఖ దుఖాలు, ఆశ్చర్యానందాల కి ప్రతి రూపంగా ఆరు రుచుల సమ్మేళనంతో చేసే ఈ పచ్చడిని ఈ రోజు ప్రతి ఒక్కరు తప్పకుండా సేవించాలి.
ఈ పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం మన జీవితంలో ని ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక
బెల్లం – తీపి – ఆనందానికి సంకేతం
ఉప్పు – జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు – పులుపు – కొత్త సవాళ్లు
మిరపపొడి – కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు
శాస్త్రీయకారణం:ఇంతే కాక ప్రకృతి అప్పుడే చలికాలం నుండిఎండాకాలం లోకి మారుతుంది కాబట్టి వాతావరణం మార్పులకి కఫ దోషాలు ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా ఈ పచ్చడి ఎంతో ఉపయోగపడుతుంది.ఉగాది రోజు నుంచి శ్రీ రామ నవమిరోజు వరకు ఈ పచ్చడి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని పెద్దలు చెపుతున్నారు.
పంచాంగ శ్రవణం:
ఈ రోజు పంచాంగ శ్రవణం వినడం ఆనవాయితీ.ఆ సంవత్సరికి గాను తమ పేరున ఆదాయ లాభాలు,
ఖర్చులూ, తమ కుటుంబ స్థితిగతుల మీద ఒక అవగాహన తెచ్చుకుంటారు.పంచాంగం అంటే ఐదు అంగాలు అని అర్ధం.
తిధి,వారం,నక్షత్రం,యోగము,కరణము అనే ఐదు అంగాలతో కూడుకున్నది కాబట్టి అది పంచాంగం అని అంటారు.మనకి మొత్తం 15తిథులు,7 వారాలు,27 నక్షత్రాలూ,27 కరణములు,11 యోగములు వున్నాయి.ప్రతి మనషి యొక్క జన్మ నక్షత్రాన్నిబట్టి అతనికి ఆ సంవత్సరం ఎలా వుందో ,ఏ కార్యక్రమాలు చెయ్యవచ్చో పంచాంగం తెలియచేస్తుంది.మనం ఇంగ్లీష్ క్యాలెండర్ వాడుతున్నప్పటికి.. శుభకార్యాలకి మాత్రం పంచాంగం ప్రకారమే ముహూర్తాలు పెట్టుకుంటాం.
ఇంతే కాకుండా ఈనాడు పండితులూ,కవులూ సాహిత్య సమావేశాల్లో పాల్గుని కవితాగోష్టి నిర్వహిస్తారు కూడా.
ఇన్నివిశేషాలు కలిగిన మన తెలుగు వారి మొదటి పండుగని మీరంతా మీ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకొని ఆనందిస్తారని…ఈ ప్లవ నామ సంవత్సరం మీకు అన్నింటిలో విజయాలు కలిగించాలని కోరుకుంటూ మిత్రులు అందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు…
--(())--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి