16, ఏప్రిల్ 2021, శుక్రవారం

ఛందస్సు



 

పచ్చని చేలు, కాలవలు, పండిత పామర నీతి బోధలున్,

పచ్చిక చేలలో గతికి పాలను ఇచ్చెడి గోవుమాతలున్,

చిచ్చెర బాకులా వురికి చిందులు వేసెడు లేగదూడలున్,

మచ్చిక చేయగా మనకు ప్రాణములిచ్చెడు మూగజీవులున్,


పిచ్చుక కూనిరాగములు, పేలపుగింజల మేళతాళముల్,

ఎచ్చటనుండియో చెవులకింపుగ విన్పడు 'గీత' గానముల్,

ముచ్చట తీర్తుమా యనుచు మోగెడు కోవెల కంచుగంటలున్,

బిచ్చము కోరుచూ మనకు పేయము చెప్పెడు రామదాసులున్,

గుచ్చిన పూలదండలతొ కూర్పడు వాల్జడ కొప్పులందునన్

కుచ్చులందమును గొప్పగ చూపెడు కన్నెపిల్లలున్,

చొచ్చుకుపోవు భావములు, చూపుకు అందని అందచందముల్,

ముచ్చటలాడుచున్ గడప ముంగిట కూర్చుని లోకమంతయున్

ఇచ్చము వచ్చినట్లు చెరిగేసెడు ప్రౌఢలు రంగసానులున్,

మెచ్చినదాని కోసమని మేడలు, భూములు వ్రాయువారలున్,

నచ్చినదాని కోసమని నాన్నను, అమ్మను ఈడ్చువారలున్,

కచ్చెకుపోయి బంధువుల కంఠము నొక్కెడు వారసత్వముల్,

నొచ్చని రీతిగా యెదను నూతులు తవ్వెడు శూలధారులున్,

చిచ్చులు పెట్టుచూ పొరుగు జీవుల కాష్ఠము పేర్చువారలున్,

ఉచ్చులు పన్నుచూ తుటిలొ ఊరును చంకన చుట్టువారలున్,

హెచ్చులు చెప్పుచూ జనుల హేళన చేయువారలున్,

పిచ్చిగ మాటలాడుచునె, పేరును కీర్తియు పొందువారలున్,

గిచ్చియు, జోలపాటలను కేకలువేయుచు పాడువారలున్,

ముచ్చట మాటలాడుచునె మూలము కత్తెర వేయువారలున్,

పచ్చని కాయగూరలును, మామిడి, కొబ్బరి, పండ్లతోటలున్,

నెచ్చెలి వెక్కిరింపులును, నేస్తమునందలి మాధురత్వమున్,

వెచ్చని గుమ్మపాలు, ఇక వెన్నను కాచిన నేతిగారెలున్,

పచ్చడి కల్పినన్నమును, పాకము పట్టిన జీడివుండలున్,

వచ్చని పల్కరింపులును, వేడిగ కాచిన రాగి జావయున్

మచ్చుకు కానరావు కద, పాపము పట్టణ వాసమందునన్!

0 Com

ఈ రోజు ప్రాంజలి ప్రభకు పంపిన సమస్య పూరకం ....?

పండితు  డెందులకు  పనికివచ్చు నృపాలా?.....


ఒడ్డున చేరుటకు ఒడుపులన్ని సకాలం 

తెడ్డును లాగియును పడవ సాగి సుగమ్యం 

అడ్డుగ గాలియును నడువువాని సుకష్టం  

పండితు  డెందులకు  పనికివచ్చు నృపాలా?.....


పండిత పామరుడు కదులుచుండె ఒ వైపే 

చెడ్డను తెల్పుటయు మనసు ఏల ఒ మార్పే  

బిడ్డల బత్కులకు కథలు చెప్పె ఒ మన్ష్యే

పండితు  డెందులకు  పనికివచ్చు నృపాలా?....


ఓడియు గెల్చుటయు మనసుకుండె ఒ బుద్ధే 

పాడిన పాటలకు వరుస కల్పు ఒ బుద్ధే   

వేడిని చల్లఁగను తెలుప కుండు ఒ బుద్ధే

పండితు  డెందులకు  పనికివచ్చు నృపాలా?....


పండుల పక్వముగ రుచిగ ఉండు ఒ మాట 

నీడను ఇచ్చియును చెలిమి చేయు ఒ తెల్వి 

పీడను తొల్చియును మనసుశాంతి  ఒ తండ్రే 

పండితు  డందులకు  పనికివచ్చు నృపాలా?....


విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

      

--(())--



శార్దూలలలితపు విలోమము - న/త/ర - త/స/త III UUI UIU - UUI IIU UUI 27 మాత్రలు 

18 ధృతి 145576 

**   ఆశా పాశం గురించి 

సమయసందర్భ ఆశలే - సమ్మోహ కళలై సంసార 

సమర మందేను జీవితం - శబ్దమ్ము కలిగే బంధమ్ము 

మమత మారేటి పంతమై - మోహమ్ము నలిగే కాలమై 

సమత మానవత్వముయే -  జీవితాన మనోవాంఛలే 


విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ     


విలోమ వృత్తములు - 13

**

శార్దూలలలిత - మ/స/జ/స/త/స UUU IIU IUI IIU - UUI IIU

**

శార్దూలలలిత - మ/స/జ/స/త/స UUU IIU IUI IIU - UUI IIU 27 మాత్రలు 

18 ధృతి 116569

**

లీలల్ నింపెనుగా వనిన్ లలితమై - లేలేఁతగను శా-

ర్దూలమ్మొక్కటి తల్లితో నడచుచున్ - రోమాంచముగ నా 

సాలక్ష్మాజపు నీడలోన జిగితో - సంతోషమున నా

కాలమ్మిట్టుల సాఁగుచుండె ననురా-గమ్ముల్ విరియఁగా  

**

శార్దూలలలితపు విలోమము - న/త/ర - త/స/త III UUI UIU - UUI IIU UUI 27 మాత్రలు 

18 ధృతి 145576 

**

ప్రణయ రాగమ్ము పల్కనా - భావమ్ము మదిలో నాడంగఁ  

బ్రణవ మంత్రమ్ము ప్రేమయే - రాజిల్లు భువిపై మ్రోఁగంగఁ 

గనఁగ నీదివ్య రూపమున్ - గామమ్ము హృదిలో జన్మించు 

వినుము నీదయ్యె ధ్యానమే - వేగాన నెదురై కన్పించు 

**

కలలలో వచ్చు భామినీ - కానంగ నగునా నీమించు 

వెలుఁగులో నిండు యామినీ - ప్రేమాంబునిధిలో నన్ముంచు 

తలఁపులో నాదు భావమా - తాపమ్ము హిమమై మార్పించు 

వలపు సంద్రాన నావికా - వైనమ్ము నొకటిన్ జూపించు 

**

వరము నిమ్మంచు వేడనా - భారమ్ము తొలగంగాఁ జేయ 

స్వరము నిమ్మంచు వేడనా - సంగీతమును బాడం జేయ 

దరిసెన మ్మీయ వేడనా - దారిద్ర్యమును వీడం జేయ 

మురహరా శౌరి మోహనా - మోదమ్మొ వెతయో నీమాయ 

**

116569 + 145576 - 1 = 262144 = 2^18

27 + 27 = 54 = 3x18 మాత్రలు 

**

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

0

పద్యము

కట్టుబాట్లనేవి కుటుంబ సామర్ధ్య కలల పంట

ఒట్టు పట్టుయే జీవితం ప్రేమతో సుఖపు బాట

కట్టు బాట్లూమనలొ సాంప్రదాయపు వినయ వేట

ఆటుపోట్లను తట్టుకోలేకయే సమయ మాట

త భ య జ స ర న గ గుణాలు 8,15 యతి

నీవును నేనును అనే మాట లే సునామి నేర్పుల వలే

నా వ్యధ నీ కధ కనే దేది కాదు రామ నా కలవలే

నావలపే ఇది మనో మాయ కాదు రామ నా వలపులే

నీతలపే అది మనస్సే ను మంత్ర మాయె నీ కధలులేే

శార్దూలము

శ్రీరామామృతమే కటాక్ష పరమై శ్రీ శక్తి కీర్తుల్ సదా

శ్రీ ప్రేమామృతమే సుఖాల మయమై శ్రీ యుక్తి కీర్తల్ సదా

శ్రీరామార్పణతో విశాల హృదయం శ్రీ సత్యమున్ కోరెదన్

శ్రీరమ్యా పరమై స్వరూప కరుణా శ్రీసామర్ధ్యమున్ గోరెదన్

0 Co

ఈ రోజు ప్రాంజలి ప్రభకు పంపిన సమస్య పూరకం ....?

పండితు  డెందులకు  పనికివచ్చు నృపాలా?.....


ఒడ్డున చేరుటకు ఒడుపులన్ని సకాలం 

తెడ్డును లాగియును పడవ సాగి సుగమ్యం 

అడ్డుగ గాలియును నడువువాని సుకష్టం  

పండితు  డెందులకు  పనికివచ్చు నృపాలా?.....


పండిత పామరుడు కదులుచుండె ఒ వైపే 

చెడ్డను తెల్పుటయు మనసు ఏల ఒ మార్పే  

బిడ్డల బత్కులకు కథలు చెప్పె ఒ మన్ష్యే

పండితు  డెందులకు  పనికివచ్చు నృపాలా?....

ఓడియు గెల్చుటయు మనసుకుండె ఒ బుద్ధే 


పాడిన పాటలకు వరుస కల్పు ఒ బుద్ధే   

వేడిని చల్లఁగను తెలుప కుండు ఒ బుద్ధే

పండితు  డెందులకు  పనికివచ్చు నృపాలా?....

పండుల పక్వముగ రుచిగ ఉండు ఒ మాట 


నీడను ఇచ్చియును చెలిమి చేయు ఒ తెల్వి 

పీడను తొల్చియును మనసుశాంతి  ఒ తండ్రే 

పండితు  డందులకు  పనికివచ్చు నృపాలా?....

విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

--(())--

0

నేటి ప్రాంజలి ప్రభ

నరుడు నైనట్టి రామచంద్రుడు మన రక్షకుడు యె

కరుణ కథలతో  రాజ్యము పాలించు కరుణామయి

తరుణ నామమహిమ భూమిపైన ను తరించుటకు

పరులు పావన మగుటకు శ్రీ కర చరణ కృతం

చం

మనిషికి మాయయే మమత మానస బాధలు కాల్చుచుండుటే

వినయము లేకయే వివిధ వాదము లొచ్చియు ఆశ పెర్గుటే

తనపని చేయకే ఇతర తామస భావము తెల్పి బత్కుటే

మనసున పంతమే మరల మాయను చేరుట తెల్వి తగ్గుటే


ఇతడు సమర్ధుడౌ ననుచు ఈశ్వర అంశయు ఆశ పాశమున్

డతడు విమర్శుడై విధిని డశ్వము వల్లెను పర్గు పెట్టుచున్

శతవిధ తప్పులే తలచి సర్వము దోచియు బాధ పెంచియున్

హితమును తెల్పుటే మనసు హావము మార్చుటె దైవ ధర్మమున్

విధేయుడు.మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

0

శ్రీరామనవమి సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు 

 ప్రాంజలి  ప్రభ వారికి పంపిన " సమస్యు "   .......

ఒకనాడా? యొకపక్షమా? యొక నెలా?  యొక్కబ్దమా? చూడగన్...

 నా ఆలోచనా పద్యాలు  


సకలం సౌఖ్యముకై ఒకే సమయ సమ్మోహమ్ముయే చూపగన్ 

తకిలీ లా తిరిగేటిదే గళము తత్వార్ధమ్ము యే బోధగన్     

ఒకనాడా? యొక పక్షమా? యొక నెలా?  యొక్కబ్దమా? చూడగన్.

సకలమ్మూ మది శాంతినే సమత సంతోషమ్ము యే చూపగన్ 


మకుటం కోసము దైర్యమే మనసు  సామర్ధ్యమ్ము యే చూపగన్ 

శకటాలే కరిసైన్యమే సమర  ఉత్త్సాహమ్ము యే చూపగన్   

ఒకనాడా? యొక పక్షమా? యొక నెలా?  యొక్కబ్దమా? చూడగన్...

సకలమ్మే సమయోగమే సమబలం దైవమ్ము యే చూపగన్  


అకటా ఆసమయమ్ము యే హనుమ ధర్మార్ధమ్ము యే తెల్పగన్ 

వికటాట్టాల సమమ్ముయే వినయ విశ్వాసమ్ము యే ఏర్పడెన్      

ఒకనాడా? యొక పక్షమా? యొక నెలా?  యొక్కబ్దమా? చూడగన్...

ఇక రామా యొకభాణమే ఇకమహా మాహాత్యమ్ము యే చూపగన్


విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ


నేటి సమస్యకు .. ఆలోచనా పద్యాలు 

కొత్త ఛందస్సులో


మల్లెపూలతో మనసును రంజిల్లు ముద్దు గుమ్మ

తెల్ల తెల్లని గౌను ముత్యంలా గ ధగధగలు

కల్లలేలాడని పసిపాప నగవు కలకలలు

వల్లమాలిన ప్రేమతో చిన్నారి వున్న నువ్వు


సతిని సంతోష పరిచియు మాటల్లొ శాంతి చూపి

గతిని గూర్చియు ప్రశ్నలు వేయక గమ్య మవ్వు

మతిలొ మాయని మమత ను సొంతము పొదుపు చేసి

అతివ ఆశలు భర్త గా తీర్చుట  ఆది అవ్వు


బాధ మధ్య ను మనసులో హాయిని పొందలేదు

వ్యాధి మధ్యన కలిగిన ఆశలు ఆవిరయ్యె

వేద విద్య యు ప్రేమకు చిక్కియు వేదనయ్యె

ఆది మధ్యాంతరముననే దైవము దారి అయ్యె


మట్టి బొమ్మను చేసియు పలుకులే మ్రాను మల్లె

ఒట్టి మాటలు కాదులే ప్రేమతో ఓర్పు చూపె

గట్టి పోటీ లు ఇవ్వక సేవలే గమ్య మవ్వు

ఉట్టి కొట్టియు భక్తిని చూపియు విద్య సలిపె

.

బేలను చూసిన మగండు ఏమని అనకున్ 

కాలము తీరిన పడంతి ఏడ్పుయు మనియెన్

సీలము కోరిన మగండు తెల్పక తెలిపెన్ 

పాలును చూచిన పడంతి  బావురు మనియెన్....


ఆలన లేకయు మగండు లేకయు మనిషై 

ఏలను బత్కును ముగించు కోకయు జలమై 

కాలము బట్టియు ఆడించు దైవము తెలిపెన్ 

పాలును చూచిన పడంతి  బావురు మనియెన్...


గాలము వేసిన మనస్సు ఏమియు చెయకే 

వేళను తృప్తియు మనస్సు కిచ్చియు బతికే

ఏలన  ఆశల మనస్సు బిడ్డ కనకయే  

పాలును చూచిన పడంతి  బావురు మనియెన్.


ఆలికి శాపము తెగించు వేషము సలిపే 

వేలకు తిండియు లెనందు బిడ్డను నలిపే 

పాలకు పాపము తలంచి కోపము తెలిపే 

పాలును చూచిన పడంతి  బావురు మనియెన్.


రామా అనేదియును రంజిల్లునామమును రమ్యమ్ము నీకొరకు నే 

శ్యామాను శ్రీ హనుమ శ్రీ ఘ్రమ్ము నాతలను శ్రీ మాతృశ్రి దీవెనలు యే

సమ్మోహ సమ్మతము సామాణ్య భావమును సాంఘీక తత్వములు యే

సంతృప్తి నా మనసు సంతోష సమ్మతము సందర్భ  తన్మయముయే


మ-న , భ-య , జ-ర, స-త  విలోమ గణములు.

UUU-III  -  IUI-UIU - IIU-UUI

సాహిత్యమ్ము మన - సుసంపదా మరీ - విధి వేదమ్మేను

మాహత్యమ్ము మన - సహాయ సంపదా - మది వేదమ్మేను

ఆహార్యమ్ము మన - సుసంతసం మరీ - తిథి వేదమ్మేను

స్నేహత్వమ్ము మన - అనంత సంపదా - సహ వేదమ్మేను

***    

మత్తేభవిక్రీడితము - స/భ/ర/న/మ/య/లగ IIUU IIUI UI IIU - UUI UUIU

20 /14

++

వినయాన్నీ వివరించి చెప్పు కధలే - వేదాలవల్లేనులే 

తనువంతా సహకారమే మనసుతో - తత్వాన్ని తెల్పే నులే  

చినికుల్లా  చిగురించి తృప్తి పరిచే - చైతన్య భావాలులే 

అనుమానం అనుకోక హాయి తలపే - ఆదర్శ భావాలులే   


సహనమ్మే మనసిచ్చే మార్గ మవుటే - సంభాషణాలన్నిటా 

తహ తాపం తనువిచ్చే కావ్య మవుటే - పొందేనుపాలన్నిటా

అహమంతా వదిలించే సేవ ఇదియే - ఆందోళనాలన్నిటా  

స్ప్రుహఉంచే చిరుహాసం తెల్పె మదియే - చిందేనుకాలన్నిటా 

   

మత్తేభవిక్రీడితపు విలోమము - త/య/జ/మ/న/భ/గల 

UUII UUI UIU - UUI IIUII UI

20 /11 

కాలం ఇదియే నీది నాదియే - సంఘంవదలదే మన ఆట 

వేలం మదియే మీది మాదియే - మౌనం వదలదే మనవెంట   

గాళం కథయే మాది మీదియే - గాధల్ తలుపులే మన వేట 

శీలం తలపే కాదు లేదులే  - శాస్త్రం తెలుపుటే మన మాట 


నిను జూడన్ మనసయ్యె నాకు నెలఁతా - నీవేల రావేలకో 

వనజాక్షీ వనమందు నామని సిరుల్ - భాసించె నొప్పారఁగా 

విన నేవేళలఁ గోకిల స్వనములే - వెల్గీను పుష్పమ్ములే 

దినమో వ్యర్థము నీవులేక పదముల్ - దీయంగఁ బాడంగ రా 

++

మత్తేభవిక్రీడితపు విలోమము - త/య/జ/మ/న/భ/గల 

UUII UUI UIU - UUI IIUII UI

20 కృతి 749901 

++

ఏమయ్యెనొ యీవేళ నింగిలో - నీరీతి నుడుపమ్ములు వెల్గె 

నేమయ్యెనొ యీవేళ డెందమం - దీరీతి నవభావము కల్గె 

నేమయ్యెనొ యీవేళ గాత్రమం - దీరీతి నవరాగము పల్కె 

నేమయ్యెనొ యీవేళ నీదు రూ-పీరీతి నను వీడక కుల్కె 


ఛందస్సు ౫౭౫ పద్యాలు 


ఇటు వంటి అటు మాటలు పకపకలు 

అటు గాలి ఇటు వీచెనా  చిటపటలు 

పటు కుంటె చటు వేటలు ఎకసెగల 

చిటు అంటె మటు మల్లెలు ఘుమఘుమలు 


వర వనిత విరహపుశృతుల ముసుగులో 

చిరుహాస మదనపు శృతులు వయసులో 

మరుమల్లె  నవయువ శృతులు తనువులో 




మ-న , భ-య , జ-ర, స-త  విలోమ గణములు.

UUU-III  -  IUI-UIU - IIU-UUI


సాహిత్యమ్ము మన - సుసంపదా మరీ - విధి వేదమ్మేను

మాహత్యమ్ము మన - సహాయ సంపదా - మది వేదమ్మేను

ఆహార్యమ్ము మన - సుసంతసం మరీ - తిథి వేదమ్మేను

స్నేహత్వమ్ము మన - అనంత సంపదా - సహ వేదమ్మేను


     


మత్తేభవిక్రీడితము - స/భ/ర/న/మ/య/లగ IIUU IIUI UI IIU - UUI UUIU

20 /14

++

వినయాన్నీ వివరించి చెప్పు కధలే - వేదాలవల్లేనులే 

తనువంతా సహకారమే మనసుతో - తత్వాన్ని తెల్పే నులే  

చినికుల్లా  చిగురించి తృప్తి పరిచే - చైతన్య భావాలులే 

అనుమానం అనుకోక హాయి తలపే - ఆదర్శ భావాలులే   



సహనమ్మే మనసిచ్చే మార్గ మవుటే - సంభాషణాలన్నిటా 

తహ తాపం తనువిచ్చే కావ్య మవుటే - పొందేనుపాలన్నిటా

అహమంతా వదిలించే సేవ ఇదియే - ఆందోళనాలన్నిటా  

స్ప్రుహఉంచే చిరుహాసం తెల్పె మదియే - చిందేనుకాలన్నిటా 

   

మత్తేభవిక్రీడితపు విలోమము - త/య/జ/మ/న/భ/గల 

UUII UUI UIU - UUI IIUII UI

20 /11 

కాలం ఇదియే నీది నాదియే - సంఘంవదలదే మన ఆట 

వేలం మదియే మీది మాదియే - మౌనం వదలదే మనవెంట   

గాళం కథయే మాది మీదియే - గాధల్ తలుపులే మన వేట 

శీలం తలపే కాదు లేదులే  - శాస్త్రం తెలుపుటే మన మాట 

  


నిను జూడన్ మనసయ్యె నాకు నెలఁతా - నీవేల రావేలకో 

వనజాక్షీ వనమందు నామని సిరుల్ - భాసించె నొప్పారఁగా 

విన నేవేళలఁ గోకిల స్వనములే - వెల్గీను పుష్పమ్ములే 

దినమో వ్యర్థము నీవులేక పదముల్ - దీయంగఁ బాడంగ రా 

++

మత్తేభవిక్రీడితపు విలోమము - త/య/జ/మ/న/భ/గల 

UUII UUI UIU - UUI IIUII UI

20 కృతి 749901 

++

ఏమయ్యెనొ యీవేళ నింగిలో - నీరీతి నుడుపమ్ములు వెల్గె 

నేమయ్యెనొ యీవేళ డెందమం - దీరీతి నవభావము కల్గె 

నేమయ్యెనొ యీవేళ గాత్రమం - దీరీతి నవరాగము పల్కె 

నేమయ్యెనొ యీవేళ నీదు రూ-పీరీతి నను వీడక కుల్కె 



ఛందస్సు ౫౭౫ పద్యాలు 


ఇటు వంటి అటు మాటలు పకపకలు 

అటు గాలి ఇటు వీచెనా  చిటపటలు 

పటు కుంటె చటు వేటలు ఎకసెగల 

చిటు అంటె మటు మల్లెలు ఘుమఘుమలు 


వర వనిత విరహపుశృతుల ముసుగులో 

చిరుహాస మదనపు శృతులు వయసులో 

మరుమల్లె  నవయువ శృతులు తనువులో 

అరుదెంచె మనసులొ శృతులు జగతిలో 


ఛందస్సు ౫౭౫ పద్యాలు 


ఇటు వంటి అటు మాటలు పకపకలు 

అటు గాలి ఇటు వీచెనా  చిటపటలు 

పటు కుంటె చటు వేటలు ఎకసెగల 

చిటు అంటె మటు మల్లెలు ఘుమఘుమలు 


వర వనిత విరహపుశృతుల ముసుగులో 

చిరుహాస మదనపు శృతులు వయసులో 

మరుమల్లె  నవయువ శృతులు తనువులో 

అరుదెంచె మనసులొ శృతులు జగతిలో 


   


నేటి పద్యము లు 

హనుమంతుడు రామకార్యమును నెరవేర్చే౦ 

దున లంకకు వెళ్ళదల్చియు మనసు ఏకం  

తనువంతయు సంద్ర మార్గమున పవ నెంద్రా 

వని  లంకను చూచి వచ్చె వసుధ కుమార్తెన్


మనసు మమతలే స్వర్గాన్ని చూపేటి మనుగడాయె

వినయ వివరమే ఔనత్య భావపు మమతలేలు

తనువు తపనలే ఆరోగ్య రక్షణ రాగం భావం

అణువు అణువు యు అర్పణ ఆశల మకుటమాయె


ప్రాణం ఇది దైవ తీర్పుకు లొంగ వలెను 

మానం మది భర్త నేర్పుకు లొంగ వలెను 

వైనం  కధ భార్య మార్పుకు చెప్పఁ వలెను 

ప్రేమే కళ  నిత్య సత్యము తెల్ప వలెనె    


స్వాభావికమైన ఇంద్రియ దృష్టి విడిచి 

సంతృప్తియు ఇచ్చు నిత్యము కర్మ విడిచి 

పాపాలను చేసి ధర్మపు బుద్ధి విడిచి 

ప్రేమామృత మన్న ధీరుని శక్తి తలచె  


ఈ జాగృతి సృష్టి వ్యాప్తియు జీవి తముకు  

బాహ్య కళ దృష్టి పెర్గును  కాలమునకు

ధర్మాత్ముని సేవ  ఆ కలి  జీవమునకు 

సర్వార్ధము కర్మ బంధము  సౌమ్యమునుకె


మనసు మాయయు మర్మము తెలుప వచ్చు

వినయ మేమిటో తెలిపియు వివర మిచ్చు

కనుల కొలనులో స్నానము సలప వచ్చు

తనువుతో మూర్ఖ మానవ్ని తపన తీర్చు


నేటి కొత్త రకం పద్యాలు


గురువు గొప్పతనం ఏమిటో తెల్పి గౌరవించి

గురువు గమ్యాన్ని గమనించి పాఠాల్ని గుణము తెల్పు

గురువు కలలను శిష్యుడు తీర్చియు  కలత మాపు

గురువు కలకాలము తలచు పాఠాలు గురుతు కొచ్చు


అతివ అంతరంగము అర్ధ మవుటయే అసలు నిజం

అతివ ఆనంద వైభవం అందరి అనుకువయే

అతివ అష్టకష్టాలు పడ్డా ప్రేమ పలుకు హాయి

అతివ అనురాగ అనుబంధ ముయెభర్త అనుకరణ


మనసు మనుగడ లో ప్రశ్నలే ఇక మౌన మొవ్వు 

మనసు మర్మము తెల్పినా అర్ధమే మాయ వెంట   

మనసు మమతలు చుట్టును తిరుగుచు మేలు చేయు 

మనసు మానవత్వమ్మును బతికించి మనసె పంచు


మినుకు మినుకు మను కను రెప్పల పిల్పు కనుల పంట   

మినుకు మిన్నన నున్ననా కన్నులు కదలికలే 

మినుకు మరులుకొలుపు చుండి మనసునే మదనపర్చు 

మినుకు మగవతెగువతోను మానము మధురపర్చు


క్రీడలు సేయు సమరమ్ము వెంటాడుటయున్

గాడిలొ పెట్టె సహనమ్ము తోట్పాడుటయున్

వేడిలొ వేట మనసిచ్చు వెంటాడుటయున్

క్రోడము సాయ మొనరించె కోదండునకున్


 ఆడెను ఆట ఎదిరించి సమ్మౌహముగన్

పాడెను పాట విధిఆట ఏట్పాడుటయున్

వేడెను వెంట మదిమాట తోడ్పాడుటయున్

క్రోడము సాయ మొనరించె కోదండునకున్


 కీడును చేయు మనసున్న వాదమ్ముయుగన్

చీడను తర్మి చిగురించు వృక్షమ్ము కధన్

పాడును మాపి ఉపసించు ధర్మమ్ములగున్

క్రోధము సాయ మొనరించె కోదండునకున్


నేటి పద్యాలు చంపమాల 21/11


కరుణయు వమ్ము చేయకయు కమ్మని గాధను తెల్పుపీఠి పై...

భరణము పొంది హాయిగను భాగ్యము గుండుము నిత్య పీఠిపై ..

చిరునగ ఉంచి తాపమును చూపియు తృప్తిని పొందు పీఠిపై ..

పురములు పాట పాడినవి ముద్దుల మేనక పాదపీఠి పై......     


తరుణము తప్పు చేయకయు తాపసి ఒప్పెను పాదపీఠి పై... 

కరముల వళ్ళ కావ్యముతొ కమ్మిన విద్యలు పాదపీఠి పై...  

నరములు నాట్య మాడినవి నమ్మిన పల్కుల పాదపీఠి పై.... 

పురములు పాట పాడినవి ముద్దుల మేనక పాదపీఠి పై......


శికము యు పల్కు మాటలను సిత్రము చూడుము పాద పీఠి పై

పికము యు కూయు కూతలకు మిన్నుయు శబ్ధము పాద పీఠి పై

బకము యు చూపు వేషముకు భయ్యము చెందకు పాద పీఠిపై

రకము లు ఎన్నొ బుధ్ధులకు రమ్యము కల్గును పాద పీఠి పై

 నేటి నా ఆలోచనా పద్యాలు

 భారము వద్దు దేహముయె బంధము నీభవితచ్చిరమ్మరో

అర్పన వద్దు ఆక్రమమె అద్భుత దీవెనల చ్చిరమ్మరో

ధైర్యము ఉంచి తోడ్పడుట దారియె ఆశయమచ్చిరమ్మరో

దారములేని హారము నుదారత నీకెవరి చ్చిరమ్మరో


 నేరము చేసి ఆశలతొ నమ్మిన వారికి మోసమేనురో

బేరము చెప్పి బేధము తొ బాదియు బాదను తెల్పుటేనురో

కారము చల్లు కార్యముతొ కానిది చేయుటేనురో

దారములేని హారము నుదారత నీకెవరిచ్చిరమ్మరో


శౌర్యము చూపి కాలముతొ సమ్మతి తెల్పి తరించురమ్మరో

భార్యను నమ్మి శాంతముతొ బాధ్యత చూపి భరించు భర్తరో

కార్యము చెప్పి ఆశలతొ కమ్మిన నష్ట మనేది నమ్మరో

దారము లేని హారము నుదారత నీకెవరిచ్చిరమ్మరో


నేటి కవిత్వం .. కృష్ణ 

రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


రారమ్మా, రారయ్యా చూడాలి చిన్ని కృష్ణ    

నిర్మల మైనట్టి వాడేనే  మన నవ్వుల కృష్ణ 

శ్రీ రమ్య మైనట్టి వ్రేపల్లెలో కాంతి  కృష్ణ 

చేరి కొలుతుము, మనస్సు ప్రశాంత పరుచే కృష్ణ 


ఎప్పుడు పున్నమి వెన్నెల వెలుగు నందించు కృష్ణ        

ఎప్పటి కప్పుడు మదిలో ప్రశాంతత, కల్పించె కృష్ణ  

తప్పులు చేసిన, మానవులను సరిదిద్దేటి కృష్ణ 

చెప్పుడు మాటలలో నిజము ఉండదని చెప్పె కృష్ణ  


కని విని, ఎరగని కళ్ళతో ఆకర్షించు కృష్ణ 

మురిసే యశోదమ్మకే ముద్దుల అల్లరి కృష్ణ  

కరితో ఆడుకొని ఆనందం పరిచేటి కృష్ణ  

సిరితో సంతోష  పరిచేటి చిన్మయడే కృష్ణ 


అరుణో దయాన్ని అందరికీ పంచేటి  కృష్ణ 

ప్రార్ధించిన వారిని కరుణ చూపి కాపాడే కృష్ణ  

వరములు కోరిన వారికి వెంటనే మోక్ష కృష్ణ  

పరుష వాక్కులకు 100 తప్పుల వరకు రక్షించు కృష్ణ 


కలతీర్చు కామ్య కృష్ణ  , కధ చెప్పు కావ్య కృష్ణ

రసరాజ రమ్యకృష్ణ, తనుభావ తత్వ కృష్ణ

మనసిచ్చు మోన కృష్ణ, మనువాడు మోన కృష్ణ

బస ఇచ్చు భవ్య కృష్ణ, భవబంధి భాగ్యకృష్ణ

--((*))--


   


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి