మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
[13/03, 05:01] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*268వ నామ మంత్రము* 13.03.2021
*ఓం సంహారిణ్యై నమః*
ఈ జగత్తును అణుస్వరూపంగా నాశనం(లోకసంహారము) చేయు తల్లికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సంహారిణీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం సంహారిణ్యైనమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి సర్వకాల సర్వావస్థలయందును వెన్నంటి ఆయురారోగ్యములు కలుగజేసి శాంతిసౌఖ్యములతో కూడిన జీవనమును ప్రసాదించును.
సృష్టికాలములో తనలో ఇమిడియున్న జగత్తులను వెలికి పంపును. ప్రళయ కాలములో తనచే సృజింపబడిన జగత్తులను ఉపసంహరించుకొనును. అనగా బ్రహ్మాండములను పరమాణు రూపములో తనలో నిక్షిప్తమొనర్చుకొనును. దీనినే సంహారము అందురు. ఈ లయకృత్యమును ఒనర్చుటచేత అమ్మవారు *సంహారిణీ* యని అనబడినది. పరమేశ్వరుడు చేయు మూడు కృత్యములలో (సృష్టి,స్థితి,లయలు) మూడవది అయిన లయకృత్యమునే సంహారము అందురు. శివశక్తులకభేదముండుటచే పరమేశ్వరి *సంహారిణీ* యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సంహారిణ్యై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
[13/03, 05:01] +91 95058 13235: *13.03.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబదియవ అధ్యాయము*
*శ్రీకృష్ణుడు జరాసంధునితో యుద్ధమొనర్చుట - ద్వారకానగరము నిర్మించుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*50.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*
*తస్మాదద్య విధాస్యామో దుర్గం ద్విపదదుర్గమమ్|*
*తత్ర జ్ఞాతీన్ సమాధాయ యవనం ఘాతయామహే॥10282॥*
*కాలయవనుని చూచినంతనే శ్రీకృష్ణుడు బలరామునితో గూడి ఇంకను ఇట్లు ఆలోచించెను*
అందువలన నేడే మానవులకు ప్రవేశింపరాని ఒక జలదుర్గమును నిర్మింతము. మనవారిని అందఱిని అచట సురక్షితముగా నిలుపుదము. పిదప మనము కాలయవనునిపై దెబ్బతీయుదము'
*50.50 (ఏబదియవ శ్లోకము)*
*ఇతి సమ్మంత్ర్య భగవాన్ దుర్గం ద్వాదశయోజనమ్|*
*అంతఃసముద్రే నగరం కృత్స్నాద్భుతమచీకరత్॥10283॥*
ఈ విధముగా బలరామునితో సంప్రదించిన పిమ్మట కృష్ణభగవానుడు సముద్రము మధ్యయుందు అద్భుతము, ఆశ్చర్యకరము ఐన రీతిలో ఒక మహానగరమును పన్నెండు యోజనముల విస్తీర్ణముతో విశ్వకర్మచే నిర్మింపజేసెను.
*50.51 (ఏబది ఒకటవ శ్లోకము)*
*దృశ్యతే యత్ర హి త్వాష్ట్రం విజ్ఞానం శిల్పనైపుణమ్|*
*రథ్యాచత్వరవీథీభిర్యథావాస్తు వినిర్మితమ్॥10284॥*
ఆ నగరము విశ్వకర్మయొక్క విజ్ఞానమునకును, ఆ మహాత్ముని శిల్పకౌశలమునకును నిదర్శనముగా నుండెను. ఆ పురమునందలి రాజమార్గములు, కూడలులు, వీథులు, వాస్తుశాస్త్రప్రకారము నిర్మితములైనవి.
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*843వ నామ మంత్రము* 13.03.2021
*ఓం భవచక్ర ప్రవర్తిన్యై నమః*
సంసారమను చక్రమును (జననమరణ చక్రమును) ప్రవర్తింపజేయు తల్లికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భవచక్రప్రవర్తినీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం భవచక్ర ప్రవర్తిన్యై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంతభక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఆరాధించు సాధకులకు ఆ జగన్మాత పునర్జన్మరాహిత్యమైన ముక్తిని ప్రసాదించును.
సంసారమనగా జగత్తు. ఈ జగత్తుయొక్క సృష్టిస్థితిలయలకు మూలకారణము ఆ జగన్మాతయే. ఆ తల్లి లేనిదే అడవిలో ఆకుగాని, జనసంచారంలో వాయువుగాని కదలడానికి వీలులేదు. పుట్టుట, పెరుగుట, గిట్టుట మరల పుట్టుక...
*పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనమ్*
*ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే*
*భావం*
పుడుతూ, మరణిస్తూ, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పుడుతూ, పుడుతూ దుస్తరమైన ఈ సంసారాన్ని దాటటం సాధ్యం కాకున్నది. మురారీ దయతో నన్ను రక్షించు.
పుట్టుక, మరణం, మరణం - పుట్టుక అంతర్గర్భితమై ఉన్నాయి. మనిషి వస్త్రాలను మార్చినట్లు, జీవాత్మ శరీరాలను మారుస్తుంది. అంటే జీవాత్మ ఒక శరీరం నుండి ఇంకొక శరీరాన్ని ఆశ్రయించడం వల్ల జీవితం అనంతమైన యాత్ర అవుతోంది. మరణం కేవలం దీర్ఘనిద్ర మాత్రమే. కర్మవాసనలు జన్మజన్మలకు వెంటాడుతూ ఉంటాయి. జనన మరణ చక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది.
మనిషి జన్మ పాపపుణ్యాల మిశ్రమం. ఎన్ని జన్మలెత్తినా పరంధాముని దివ్యధామం చేరలేని జన్మవ్యర్ధం. వివేకం, విచక్షణలతో చిగురించిన వైరాగ్యాన్ని పెంచి, ఓ తండ్రీ! బ్రతుకు భారాన్ని మోయలేని నిస్సహాయుడిని. ఇంకా ఇంకా జన్మలెత్తి పరితపించే ఓపిక లేదు. పరంధామా! కరుణతో ఈ జన్మకి ముగింపు పలికి, నన్ను నీదరికి చేర్చుకో స్వామీ..! అని ఆర్తితో తపనతో ప్రతిక్షణం నివేదన చేస్తే తప్పక స్పందిస్తాడు పరమాత్మ.
అటువంటి పరమాత్మ జగన్మాత. సంసారమను చక్రాన్ని ప్రవర్తింపజేయునది ఆ పరమాత్మయే. కాబట్టి ఆ తల్లి *భవచక్రప్రవర్తినీ* యని యనబడినది. ఆ తల్లి ఇష్టమునకు మాత్రమే ఈ జననమరణ చక్రము ప్రవర్తించుచున్నది.
ఆ పరబ్రహ్మస్వరూపిణి అయిన అమ్మవారు పంచమహాభూతములతో కలసి, పంచభూతాత్మకమైన శరీరములు అనగా సకల జీవులయందు తానుంటూ, జననము, వృద్ధి, క్షయము అనెడి సంసారమును ఏర్పరచి, చక్రముత్రిప్పినట్లు త్రిప్పుచున్నది యని మనుస్మృతియందు గలదు. గనుకనే *భవచక్రప్రవర్తినీ* యని అనబడినది.
అనాహతమునే భవచక్రమని యందురు. దహరాకాశ రూపిణియైన పరమేశ్వరి అనాహతమందు ఉంటుంది గనుక, ఆ తల్లి *భవచక్ర ప్రవర్తినీ* యని అనబడినది.
శ్రీచక్రంలోని అయిదు సమద్విబాహు త్రిభుజాలు నిమ్మముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తాయి. అలాగే నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుష శక్తిని సూచిస్తాయి. భవుడు అనగా శివుడు. అందుచే వీటిని శివచక్రములు లేదా భవచక్రములు అని అందురు. ఈ భవచక్రములను ప్రవర్తింపజేయునది పరమేశ్వరి గనుక ఆ తల్లి *భవచక్ర ప్రవర్తినీ* యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భవచక్ర ప్రవర్తిన్యై నమః* అని యనవలెను.
[14/03, 04:57] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*844వ నామ మంత్రము* 14.03.2021
*ఓం ఛందస్సారాయై నమః*
వేదముల సారము తానై విరాజిల్లు వేదస్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ఛందస్సారా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం ఛందస్సారాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు సకల సౌభాగ్యములను ప్రసాదించును.
ఛందస్సు అనగా వేదము అను అర్థము ఉన్నది. జగన్మాత వేదముల సారాంశమై విరాజిల్లుతున్నది గనుక *ఛందస్సారా* యని అనబడినది. సంస్కృత ఛందస్సు, తెలుగు ఛందస్సు అని ఛందశ్శాస్త్రములు గలవు. అసలు వేదములే ఛందోబద్ధమైన నియమములు గలిగియున్నది. తెలుగులో పద్యములు వ్రాయుటకు గల నియమాలను తెలియజేయునది ఛందశ్శాస్త్రము. ఒక శ్లోకముగాని, పద్యముగాని ఛందోనియమములతో వ్రాయబడితే, ఉచ్చారణ ఒక స్వరబద్ధంగా ఉంటుంది. వేదము ఛందోనియమములకు అనుగుణంగా ఉండడంచేతనే, స్వరబద్ధంగా ఉండడం జరుగుతోంది. సకల మంత్రములు వివిధ రకములైన సంస్కృత ఛందస్సులతో చెప్పబడినవి.అందు చేతనే సకల మంత్రస్వరూపిణియైన జగన్మాత *ఛందస్సారా* యని అనబడినది.
ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు. వేదముల యొక్క అంగములనబడు ఆరు వేదాంగములలో ఛందస్సు ఒకటి. వేదత్రయాన్ని ఛందస్సు అని కూడా అంటారు. ఋగ్వేదము, సామవేదము సంపూర్ణముగా పద్య రూపములో నున్నవి. యజుర్వేదములో గద్యము కూడా ఉంది.
వేదములలో సారభూతమయినది. గాయత్రీ, గుప్తగాయత్రీ స్వరూపమైనది. గాయత్రీ స్వరూపములు రెండు. ఒకటి *ప్రకటగాయత్రి*. అందరును స్పష్టముగా చదువుచున్నదే ప్రకటగాయత్రి. రెండవది *గుప్తగాయత్రి*. నాలుగు వేదములందును రహస్యాతి రహస్యముగా సాంకేతిత శబ్దములచే చెప్పబడినది. గుప్తగాయత్రి పరరూపము అనగా శ్రీమాత రెండవ రూపము. దీనిని వేదపురుషుడు గూడ స్పష్టముగా చెప్పక సాంకేతిత పదములతోడనే బోధించెను.
గాయత్ర్యాది సంస్కృత ఛందస్సులలో సారమయినది. సంస్కృత ఛందస్సులు ఇరువది ఆరు. అవి:-
1. ఉక్త 2. అత్యుక్త 3. మధ్య 4. ప్రతిష్ఠ 5. సుప్రతిష్ఠ 6. గాయత్రి 7. ఉష్ణిక్కు 8. అనుష్టుప్పు 9. బృహతి 10. పఙ్త్కి 11. త్రిష్టుప్పు 12. జగతి 13. అతిజగతి 14. శక్వరి 15. అతిశక్వరి 16. అష్టి 17. అత్యష్టి 18. ధృతి 19. అతిధృతి 20. కృతి 21. ప్రకృతి 22. ఆకృతి 23. వికృతి 24. సంకృతి 25. అభికృతి 26. ఉత్కృతి.
లలితా సహస్రనామ స్తోత్రం *అనుష్టుప్ ఛందస్సు* సహస్రనామ స్తోత్రపారాయణ చేయునపుడు ఇలా చదువుతాము 'అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమాలా మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, *అనుష్టుప్ ఛందః*, శ్రీలలితా పరాభట్టారికా మహాత్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం శక్తిః, సౌః కీలకం, సర్వాభీష్ట సిధ్యర్థే జపే వినియోగః'.
శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్రం *గాయత్రీ ఛందస్సు* లో చెప్పబడినది.
మహాగణపతి మంత్రం కూడా *గాయత్రీ ఛందస్సు* లోనే గలదు.
ఇలా సకల మంత్రములు, సకల స్తోత్రములు అన్నియు సంస్కృత ఛందస్సులలోనే గలవు.
పింగళ ఛందస్సులలో చెప్పబడిన మహాత్మ్యము గలది అనగా పింగళుడు వ్రాసిన తంత్ర (ఛందఃశాస్త్ర) మందు ద్వికౌగ్లౌ మిశ్రౌచ రెండు సూత్రములలో మహాప్రస్తారము శ్రీచక్రోద్ధారము చెప్పబడినది.
పంచదశీ స్వరూపురాలు.
ధర్మమయిన స్వేచ్ఛా విహారము గలది.
ఇచ్ఛాశక్తి స్వరూపురాలు.
పరమేశ్వరి వేదరూపంలో ఉన్నది. వైదిక ఛందోబద్ధమైన మంత్రం, మంత్రాల సముదాయమే వేదం గనుక ఆ తల్లి *ఛందస్సారా* యని అనబడినది. ఉపనిషత్తులలో ప్రతిపాదించింపబడిన పరబ్రహ్మస్వరూపమే జగన్మాత గనుక ఆ తల్లి *ఛందస్సారా* యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం ఛందస్సారాయై నమః* అని అనవలెను.
***
*845వ నామ మంత్రము* 15.03.2021
*ఓం శాస్త్రసారాయై నమః*
శాస్త్రముల అన్నిటి సారము తనే అయి భాసిల్లు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శాస్త్రసారా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం శాస్త్రసారాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు బ్రహ్మజ్ఞాన జిజ్ఞాస అధికమై, సాధనా మార్గమును మరింత దీక్షతో కొనసాగించుదురు.
వేదముచే ప్రతిపాదింపబడినది, వేదమే తన బలముగా, వేదమే తన స్వరూపముగా విరాజిల్లునది జగన్మాత.
శాస్త్రము అనగా శాసించునది. విధానములు, నిషేధములు నిర్దేశించు శాస్త్రముల సారమై విరాజిల్లు జగన్మాత *శాస్త్రసారా* యని అనబడినది.
శాస్త్రములు పుణ్యపురుషులచే చెప్పబడినవి అనియును, బ్రహ్మముఖమునుండి వెలువడినవి అనియును రెండు విధములు. పుణ్యపురుషులచే చెప్పబడిన శాస్త్రములు *పౌరుషేయములు* అనియు, బ్రహ్మముఖమునుండి వెలువడినవి *అపౌరుషేయములు* అనియు అందురు. హిందూమతంలో వేదములను అత్యంత మౌలికమైన ప్రమాణంగా గుర్తిస్తారు. వేదములను శృతులు (వినబడినవి) అనీ, ఆమ్నాయములనీ అంటారు. వేదములు ఏ మానవుల చేతను రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదములను *అపౌరుషేయములు* అని అంటారు. .
నిత్యమగు వేదము మనుష్యుల ప్రవృత్తి నివృత్తులను ఉపదేశించుచున్నది. అలాగే కృతకములయిన వానివలనను ప్రవృత్తి నివృత్తులు బోధింపబడుచున్నవి. ఈ విధంగా పౌరుషేయములు, అపౌరుషేయములైన శాస్త్రములు రెండునూ శాసించునవి యగుటచే వీనిని శాస్త్రములని యందురు. అటువంటి శాస్త్రములన్నిటి సారము జగన్మాతయే గనుక, ఆ తల్లి *శాస్త్రసారా* యని అనబడినది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*846వ నామ మంత్రము* 16.03.2021
*ఓం మంత్రసారాయై నమః*
సర్వమంత్రముల సారము తానే అయి విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మంత్రసారా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం మంత్రసారాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి భౌతిక సుఖ సంతోషములతో బాటు,ఆధ్యాత్మికానందానుభూతిని అనుగ్రహించును.
*మననాత్ త్రాయతే ఇతి మంత్ర:* అని అంటారు. అంటే మననం చేయడం వల్ల మనల్ని రక్షించేది మంత్రము అని అర్ధం. మనుషుల్ని మంచి మార్గం వైపు నడిపిస్తున్నాయి. మాన్యుల నుంచి సామాన్యుల దాకా ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక్కటంటే ఒక్కసారైనా అనుభూతిని ఇచ్చేది ఈ మంత్రసాధనే. అలా శక్తిమంతమైన పరమోద్భుత మంత్రాలుగా మారే క్రమం మహాద్భుతంగా కనిపిస్తుంది. మంత్రాల అసలు లక్ష్యం ఏమిటంటే, మన ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడం. క్షుద్రంతో ఉచ్చాటన చేసే తామస మంత్రాలు... యుద్ధంలో గెలుపు కోసం చేసే రాజ మంత్రాలు... ఆధ్యాత్మిక సాధన కోసం జపించే సాత్విక మంత్రాలుగా కాలక్రమంలో ఆవిర్భవించినవి. అన్ని మంత్రాలకు ముందు ఓం కారాన్ని చేర్చి జపిస్తాం. అలా ఓం కారం చేర్చి ఎందుకు పలికాలి? ఎందుకంటే ఓంకారం లేని మంత్రం ఫలవంతం కాదు. అలాంటి మంత్రం ప్రాణ వాయువు లేని జీవం లాంటిది. ఈ ఓం కారం సర్వేశ్వరుని నుంచి జ్యోతిగా ప్రారంభమై అందులో నుంచి ఒక నాదం ధ్వనించింది. ఆ ధ్వనే ఓంకారంగా రూపాంతరం చెందింది. ఓం నుంచి వేదరాశులే ఉద్భవించాయి. ఋగ్వేదం నుంచి *అ* కారం, యజుర్వేదం నుంచి *ఉ* కారం, సామవేదం నుంచి *మ* కారం.... ఈ మూడు కలసి ఓంకారంగా ఏర్పడిందన్నది ఋషివాక్కు. అసలు బీజాక్షరాలు అంటే ఏమిటి?భాషలోని అక్షరాలే బీజాలా? ప్రతీ బీజానికి ప్రత్యేక మహత్తు ఉంటుందా? ఈ బీజాక్షరాల ఏకీకరణమే మంత్ర నిర్మాణమా? మంత్రాల స్పష్టమైన ఉచ్చారణతో అద్భుత ఫలితం సాధ్యమేనా?
ఈ జగత్తు స్థూలమనీ, సూక్ష్మమనీ రెండు విధాలుగా విభజించారు. శరీరం స్థూలమైతే.... మనస్సు సూక్ష్మం. స్థూలమైన దానికంటే సూక్ష్మమైన దానికే శక్తి ఎక్కువ. మన శారీరక శక్తికంటే, మానసికశక్తి చాలా గొప్పది. బలవత్తరమైనది కూడా. సూక్ష్మశక్తుల జాగృతి వల్లే మానవుడు మహాత్ముడై అసాధారణ కార్యాలు చేయగలుగుతాడు. ఈ సూక్ష్మశక్తుల జాగృతికి మంత్ర శబ్ధతరంగాలు తోడ్పడితే అద్భుతం సాధించడం అదేమంత కష్టమేమీ కాదు. జీవులలోని అంతఃశక్తులనే కాదు, ప్రకృతిలో ఆవరించి ఉన్న అనేక అదృశ్య శక్తుల్ని కూడా బీజాక్షరాలు మంత్రాల రూపంలో ప్రేరేపిస్తాయంటారు. వర్షాలు కురిపించడం, దీపాలు వెలిగించడంలాంటి పనులు శబ్ధ తరంగాల ప్రక్రియతో మన పూర్వీకులు సాధించి చూపించారు. కానీ ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మంత్రాలను పలికినప్పుడు చాలా స్పష్టంగా పలకాలి. అలా అయితేనే దాని ఫలితం ఉంటుంది. మనకు కనిపిస్తుంది. జీవులలోని సూక్ష్మశక్తుల్నీ, ప్రకృతిలోని వివిధ శక్తుల్నీ ప్రేరేపించడానికీ, దైవశక్తిని మనకు అనుసంధాన పరచడానికీ మంత్రశబ్ధలు ఉపకరిస్తాయనడంలో అణుమాత్రం కూడా సందేహం లేదు.
ప్రకృతిలోనే కాకుండా, సృష్టిలో కూడా అనంతంగా వ్యాపించి ఉన్న శక్తిని మంత్రాలు సరైన ఉచ్చారణతో మనకు అందిస్తాయి. దైవాంశను మనకు అనుసంధానపరచే శబ్ధమే ఓంకారం. మంత్రానికి త్రికరణ శుద్ధి చాలా అవసరం. మనసా, వాచా, కర్మణా శుద్ధి కలిగిన జీవికే మంత్రోచ్చారణ సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి అక్షరం బీజాక్షరం. ప్రతి బీజాక్షరం దేవతాశక్తి స్వరూపం. విశ్వచైతన్యం దేవతగా అవతరించినపుడు అతి సూక్ష్మంగా కనిపించే అతీంద్రియ శక్తియే మంత్రం. అందుకే మంత్ర నిర్మాణం ఆశ్చర్యకరమే కాక ఆసక్తికరమైన శాస్త్రం కూడా. ఎంతో అపురూపమైన మంత్రాలను ఎవరైనా భక్తితో సాధన చేయవచ్చు. సిద్ధిని, లబ్ధిని, దివ్యానుభూతిని పొందవచ్చు. దేవతానామాన్ని లేదా బీజాక్షరాన్ని స్మరించడాన్ని మంత్ర జపం అంటారు. కొన్ని అక్షరాలను క్రమబద్ధంగా కలిపి వాడటమే. ఇలా వాడటం వల్ల ఉత్పన్నమయ్యే ప్రకంపనలు ఒక లక్ష్యం కోసం వాడటం వల్ల ఆ ఉద్భవించిన శక్తి మనకు అనుకూలంగా (సక్రమంగా ఉచ్చరిస్తే) గాని వ్యతిరేకం (ఉచ్చారణ సక్రమం కాకపోతే) గా గాని మారుతుంది. అది మంత్రానికి ఉన్న మహత్తరశక్తి. తరుచు గా ఉచ్చరించే శబ్ధ తరంగాలే మంత్రాలు. ఆ మంత్ర శబ్ధ తరంగాలు చాలా శక్తివంతమైనవి. శబ్ధ తరంగాలు జీవుల మీదా, ప్రకృతి మీదా, సృష్టి మీదా ప్రభావాన్ని చూపిస్తాయ్. ఇది విజ్ఞానశాస్త్రం కూడా ఒప్పుకున్న సత్యం. శక్తికి ప్రతిరూపాలు. పరమేశ్వరుని అనుగ్రహంతో, పంచభూతాత్మకమైన దేహంతో, అద్భుతమైన మేథా సంపత్తిని పొందిన మానవుడి ఆలోచనాశక్తి అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చేది మంత్రమే. అరణిని (రాచి నిప్పుపుట్టించు జమ్మికొయ్య - యజ్ఞములకు అవసరమైన అగ్నిని ఇలాగే ఉద్భవింపజేస్తారు) మధిస్తే నిప్ఫు పుట్టినట్లు, మంత్రాన్ని జపిస్తే మహత్తరమైన శక్తి జనిస్తుంది. కొన్ని బీజాక్షరాలను సంపుటీకరణ చేయుట ద్వారా మంత్రములు ఏర్పడతాయి. ఆ మంత్రాలను నియమ నిష్ఠలతో అంగన్యాస, కరన్యాస పూర్వకంగా, అనుష్ఠించడం ద్వారా దేవతానుగ్రహం లభిస్తుంది. దేవతల తత్త్వాలకు తగినవిధంగా బీజాక్షరములు ఋషులచే సంపుటీకరింపబడి మంత్రములై ఏర్పడినవి.
ఓం కారము పరమేశ్వరుని బీజాక్షరము.
శ్రీం - లక్ష్మీ బీజం, క్లీం - మన్మథ బీజం, గం - గణపతి బీజం, ఐం - వాగ్బీజం, హ్రీం - మాయాబీజం.
పంచభూతములకు కూడా బీజాక్షరములు గలవు. నిత్యం మనం చేసే మంత్రజపాలలో లమిత్యాది పంచ పూజల సందర్భంగా ఇలా చెపుతాము.
లం - పృథ్వీ బీజం హం - ఆకాశ బీజం, యం - వాయుబీజం, రం - అగ్ని బీజం, వం - అమృత బీజం.
మంత్రములలో వైదికములు, తాంత్రికములు, అపభ్రంశములు. వైదికములు - వేదవిహితములు, కామ్యప్రదమైనవి - కోరికలు తీర్చు తాంత్రిక మంత్రములు, సంస్కృతేతర భాషలలో గల మంత్రాలు అపభ్రంశములు
అంతటి మహత్తర శక్తిగలిగిన సప్తకోటి మంత్రాల స్వరూపమే ఆ జగన్మాత. సకల మంత్రసారములు ఆ జగన్మాత యగుటచే ఆ పరమేశ్వరి *మంత్రసారా* యని అనబడినది.
*851వ నామ మంత్రము* 21.03.2021
*ఓం జన్మమృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిన్యై నమః*
భక్తులకు జననమరణాలు, ముసలితనం మొదలైన వాటిచే కలిగే దుఃఖాలను తొలగించి ఆత్మసుఖాన్ని ప్రసాదించు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *జన్మమృత్రుజరాతప్త జన విశ్రాంతి దాయినీ* యను పదహారు అక్షరముల (షొడశాక్షరీ) నామ మంత్రమును *ఓం జన్మమృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిన్యై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తి ప్రపత్తులతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులను ఆ పరమేశ్వరి ఆయురారోగ్యఐశ్వర్యములతో అనుగ్రహించి , జన్మమృత్యు జరాత్రయముల బాధలనుండి రక్షించును.
పుట్టిన ప్రతీజీవి పెరుగుట, ముసలితనము, అందువలన ఎదురయే బాధలు ఉండుట సహజము. ఆ బాధలు చిన్నవిగాని, పెద్దవిగాని పూర్వజన్మ కర్మల ఫలితం వలన కలుగుచుండును. అవి కర్మఫలం వలన వచ్చే కష్టాలు, మానసిక బాధలు అని రెండు విధములుగానుండును. కర్మఫలం వలన గలిగే బాధలు అనుభవించవలసియుండును. జగన్మాత జన్మమృత్యు జరాత్రయముల బాధలను తొలగించి ఉపశమనము (విశ్రాంతిని) కలిగించుటయేగాక, ఆత్మజ్ఞానాన్ని కలిగించి శాశ్వతానందానుభూతిని ఒసగును. అందుచేతనే పరమేశ్వరి *జన్మమృత్రుజరాతప్త జన విశ్రాంతి దాయినీ* యని అనబడినది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*852వ నామ మంత్రము* 22.03.2021
*ఓం సర్వోపనిషదుద్ఘుష్టాయై నమః*
సకలోపనిషత్తులయందు రహస్యాతి రహస్యముగా బోధింపబడిన శక్తిస్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సర్వోపనిషదుద్ఘుష్టా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం సర్వోపనిషదుద్ఘుష్టాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి అనంతమైన బ్రహ్మజ్ఞాన సంపదలను సంప్రాప్తింపజేసుకొను దిశగా సాధన నిర్విఘ్నంగా కొనసాగునటులు అనుగ్రహించును. భౌతికపరమైన శాంతిసౌఖ్యములు, ఆయురారోగ్యములు ప్రసాదించును.
జగన్మాత అయిన లలితాంబిక సర్వ ఉపనిషత్తులందును రహస్యాతి రహస్యముగా బోధింపబడినది. ఐతరేయ మొదలగు ఉపనిషత్తులందు రహస్యవాక్సముదాయముచే పరమేశ్వరి ప్రతిపాదింపబడినది గనుక *సర్వోపనిషదుద్ఘుష్టా* యని అనబడినది. జీవుడు, ఈశ్వరుడు అను రెండు ద్వైతము. అయితే, అట్టి ద్వైత భావనను పోగొట్టి పరమరహస్యమైన అద్వైతభామును కల్గించునదే ఉపనిషత్తు అని చెప్పబడినది.
గురువు ఎప్పుడును శిష్యునికన్న ఉన్నతుడే అయి ఉండును. శిష్యుడు గురువు కన్న దిగువస్థానంలో కూర్చొని, గురువు బోధించు బ్రహ్మజ్ఞానతత్త్వములను వినవలెను. ఎట్టి పరిస్థితిలోను గురువును, ఏవిషయంలోనూ కూడా తనకన్న తక్కువగా భావించరాదు.
హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగము. వేదముల చివరిభాగములే ఉపనిషత్తులు. ప్రతి వేదంలోను నాలుగు భాగాలున్నాయి. అవి
*సంహితలు* - మంత్ర భాగం, స్తోత్రాలు, ఆవాహనలు
*బ్రాహ్మణాలు* - సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.
*అరణ్యకాలు* వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి.
*ఉపనిషత్తులు*- ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడా అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదహరించారు.
1. ఈశావాశ్యోపనిషత్తు, 2. కేనోపనిషత్తు, 3. కఠోపనిషత్తు, 4. ప్రశ్నోపనిషత్తు, 5. ముండకోపనిషత్తు, 6. మాండూక్యోపనిషత్తు, 7. తైత్తిరీయోపనిషత్తు, 8. ఐతరేయోపనిషత్తు, 9. ఛాందోగ్యము, 10. బృహదారణ్యకము ఈ పది ఉపనిషత్తులు ప్రధానమైనవి అని శ్రీ శంకరులు వీటికా భాష్యము వ్రాసినారు. వేదాల సారమే ఉపనిషత్తులు. ఇందులో పరమాత్మ స్వరూపాన్ని ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నించారు ఆదిశంకరులు.
ఉద్ఘుష్ట అనగా ఉపనిషత్తులవలన భేదరూపమున చెప్పబడిన సగుణ బ్రహ్మోపాసనములన్నిటిచేత అధికముగా ఘోషింప (బోధింప) బడినది అని భావము. ఈ విషయము *సర్వవేదాంతప్రత్యయం* అను సూత్రభాష్యమందు చెప్పబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సర్వోపనిషదుద్ఘుష్టాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*853వ నామ మంత్రము* 23.03.2021
*ఓం శాంత్యతీతకళాత్మికాయై నమః*
ద్వైతభావములేనిది, జ్ఞానానందమును కలిగించునది అగు శాంత్యతీతకళా స్వరూపురాలైన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శాంత్యతీతకళాత్మికా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం శాంత్యతీత కళాత్మికాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు భౌతిక జీవనమునందు శాంతిసౌఖ్యములు, సకల శుభకరములు సంప్రాప్తమగును మరియు ఆధ్యాత్మికానందాను భూతితో పరమానందముకూడ సంప్రాప్తమగును.
*శాంత్యతీతకలా ద్వైతనిర్వాణానంద బోధదే* (సౌభాగ్య భాస్కరం, 960వ పుట) 'ద్వైతభావములేనిది, జ్ఞానానందమును కలిగించునది అగు అవస్థకు శాంత్యతీత కళ' యని శైవాగమనమునందు చెప్పబడినది. ఆకాశమునందున్న కళకు శాంత్యతీతకళయని పేరు. మూలాధారంలో జాగృతం చేయబడిన కుండలినీ శక్తి స్వరూపిణి అయిన జగన్మాత, బ్రహ్మ, విష్ణు, రుద్రగ్రంథుల ఛేదనముతో షట్చక్రముల నధిగమించి సహస్రారంచేరిన పిదప, సహస్రారంలో కనిపించిన కళయే శాంత్యాతీత కళ. అట్టి కళాస్వరూపురాలైన జగన్మాత *శాంత్యాతీత కళాత్మికా* యని అనబడినది. శాంత్యాతీతకళ కళలలో ఉత్తమమైనది. జ్ఞానమే స్వరూపమై విరాజిల్లునది. ఇదే ధృవకళ, సాదాఖ్యకళ, చిత్కళ, బ్రహ్మకళ, పరాకళ యని కూడా చెప్పబడుచున్నది. అట్టి పరమేశ్వరియే *శాంత్యాతీతకళాత్మికా* యని అనబడుతున్నది.
పరమేశ్వరికి నమస్కరించునపుడు ను *ఓం శాంత్యతీత కళాత్మికాయై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*854వ నామ మంత్రము* 24.03.2021
*ఓం గంభీరాయై నమః*
అనంతమైనది గనుక గంభీరంగాను, నిగూఢమైనదై, తెలిసికొనుటకు శక్యం కానిదై విలసిల్లు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *గంభీరా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం గంభీరాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులు జీవితకాలమంతయు సుఖశాంతులతోను, తదనంతరం కైవల్యము సంప్రాప్తించినవారును అగుదురు.
పరమేశ్వరి మహాహ్రదస్వరూపురాలని శివసూత్రములో చెప్పబడినది. శివసూత్రములో మహాహ్రదము, అనుసస్థానము, మన్త్రవీర్యము, అనుభవము అను నాలుగు పదములు గలవు. మహాహ్రదమనగా విమర్శరూపమగు పరాశక్తి, అనుసస్థానమనగా ఆ శక్తితో ఐక్యము, మన్త్రవీర్యమనగా పూర్ణాహంత, అనుభవము అనగా తనకు పూర్ణాహంతాస్ఫురణము స్పష్టముగా కలుగుట అనగా విమర్శరూప పరాశక్తితో ఐక్యమును పొందినచో పూర్ణహంతాస్ఫురణము స్పష్టముగా కలుగుట, పరాభట్టారికా దేవి ఇచ్ఛాశక్తి మొదలుకొని స్థూలమువరకుగల తన లోపల ఉన్న జగత్తులను బహిర్గతముచేయుచు ప్రమాత యొక్క అంతర్బహిరూపముగలదై, విషయములను, ఇంద్రియములను, జీవులను వారి వారి కర్మలయందు ప్రవర్తింపజేయుట. నిర్మలముగా ఉండుట అను ధర్మములచే మహాహ్రదమయినది. ఇందుకు దేశము, కాలము అను పరిచ్ఛేదములు లేవు. ఆ తల్లి జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీర్యము ఇత్యాదులచే నిండి ఉన్నది గనుక *గంభీరా* యని అనబడినది. నిగూఢమైనది, తెలిసికొన శక్యము కానిది గనుకనే *గంభీరా* యని అనబడినది. అట్టి తల్లికి నమస్కరించునపుడు *ఓం గంభీరాయై నమః* అని యనవలెను.
***
*855వ నామ మంత్రము* 25.03.2021
*ఓం గగనాంతస్థాయై నమః*
దహరాకాశ మధ్యమునందున్న పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *గగనాంతస్థా* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం గగనాంతస్థాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు సకలాభీష్టసిద్ధికలుగును.
జగన్మాత హృదయమునందలి దహరాకాశమునందుండును. లేదా పంచభూతములలోని ఆకాశమహాభూతమధ్యమందున విలసిల్లుచున్నది. వృక్షమువలె కదలక ఆకామందొక్కటియై యున్నదని వేదమునందు చెప్పబడినది. గగన అనగా ఆకాశము యొక్క, అన్త అనగా నాశమందు, స్దా అనగా ఉన్నది అనగా మహాప్రళయమునందుకూడ ఆకాశము నశించిననుగూడ, ఆ తల్లి మాత్రము నిలచియుండును. గగన అనగా *హ* కారము, అంతస్థలు అనగా య, ర, ల, వ, లు. ఈ *హ, య, ర, ల, వ* అయిదును పంచభూత బీజములు. అటువంటి ఈ పంచభూత బీజాత్మికమైనది పరమేశ్వరి యగుటచే *గగనాంతస్థా* యని అనబడినది.
పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం గగనాంతస్థాయై నమః* అని యనవలెను.
***
*856వ నామ మంత్రము* 26.03.2021
*ఓం గర్వితాయై నమః*
పరమశివునిలో *నేను* అనే భావనే విశ్వనిర్మాణానికి కారణమైన క్రియా శక్తిగా అభివ్యక్తమై, *గర్విత* యను నామాంకిత యైన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *గర్వితా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం గర్వితాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి ప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి సర్వాభీష్టములను సిద్ధింపజేయును.
జగత్తులను నిర్మించగలననెడి పరాహంత గలిగినది పరమేశ్వరి. స్వాధిష్ఠాచక్రమునందుండు శ్రీమాత పీతవర్ణముతో భాసిల్లుతూ, అతిగర్వితాయని కీర్తింపబడుచున్నది. అటువంటి పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం గర్వితాయై నమః* అని అనవలెను.
***
*857వ నామ మంత్రము* 27.03.2021
*ఓం గానలోలుపాయై నమః*
వీణాదివాద్యచతుష్టయమందు ఆసక్తిగలిగిన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *గానలోలుపా* యను అయిదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం గానలోలుపాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు సాధకులను ఆ తల్లి అనంతమైన ఆధ్యాత్మిక జ్ఞానసంపదలనిచ్చి అనుగ్రహించును మరియు భగవన్నామ స్మరణమునందు ఆసక్తి కలిగించి తరింపజేయును.
వీణ, మృదంగము, తాళము (కంచుతాళము), గాత్రము (గళముతో పాడుట) అను నాలుగింటి మేళవింపుతో గలిగినదే గానము. అమ్మవారికి గొంతెత్తి పాడుటయందుకూడా ఆసక్తి కలిగినది. పరమశివుని కఠోరమైన తపస్సుతో మెప్పించి అమ్మవారు పరిణయమాడినది. అంతమాత్రమే కాక చతుష్షష్టికళలలో ఒకటైన సంగీతాలాపనముతో కూడా ఆయన ప్రేమను పొందినది. సామవేదగానమందు కూడా పరమేశ్వరికి ఆసక్తిగలదు. గనుక ఆ తల్లి *గానలోలుపా* యని అనబడినది. చతుష్షష్ట్యుపచారములలో గానముకూడా ఒక ఉపచారము. సంగీతగానముతో పరమేశ్వరిని ఆరాధించు భక్తులు కూడా కలరు. జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం గానలోలుపాయై నమః* అని యనవలెను.
***
*858వ నామ మంత్రము* 28.03.2021
*ఓం కల్పనారహితాయై నమః*
వికల్పరహిత అయిన (సర్వకాలములందు ఏకాకారముగా ఉండు) పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కల్పనారహితా* యను ఆరక్షరముల (షడక్షరీ) నామ మంత్రమును *ఓం కల్పనారహితాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులను ఆ తల్లి వారిని సర్వకాల సర్వావస్థలయందును కాపాడుచుండును. వారికి ప్రశాంతజీవనమును అనుగ్రహించును.
ఈ ప్రపంచంలో భౌతికపరమైన జీవనంలో వాసనలు అన్నియునూ కేవలం కల్పనలు మాత్రమే. నామ రూపములతో కూడినదంతా కల్పనయే. అనగా మిథ్యయే యగును. కాని జగన్మాత కల్పనకు అతీతమైన పరబ్రహ్మస్వరూపిణి. అటువంటి కల్పనలు లేని పరమేశ్వరి *కల్పనారహితా* యని అనబడుచున్నది. కలియుగమే కల్పనాత్మకమైనది. అంతయును మాయయే. మాయామయమైన జగత్తులో జీవుడు పరమాత్మ చేతిలో కీలుబొమ్మ మాత్రమే. పరమాత్మ ఎలా ఆడించితే అలా ఆడవలసినదే. కాని పరమాత్మకు ఇవి ఏమియును ఉండవు. ఎందుచేతనంటే ఇవి అన్నియును కల్పనలు మాత్రమే. కాని పరమేశ్వరి వీటన్నిటికీ అతీతురాలు. గుణములచే కల్పింపబడిన సంకల్ప వికల్పములందు గాని, భావనాకల్పములందుగాని, రూపకల్పనయందుగాని పరమేశ్వరికి సంబంధములేదు గనుక అమ్మవారు *కల్పనారహితా* యని అనబడినది.
పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం కల్పనారహితాయై నమః* అని యనవలెను.
****
*859వ నామ మంత్రము* 29.03.2021
*ఓం కాష్ఠాయై నమః*
పదునెనిమిది నిమేషముల కాలస్వరూపురాలైన జగన్మాతకు నమస్కారము.
ఉపనిషద్వాక్యార్థనిష్కర్ష స్వరూపురాలైన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కాష్ఠా* యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం కాష్ఠాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ తల్లి సుఖశాంతులతో, సిరిసంపదలతో జీవనముగడుపునట్లను గ్రహించును.
నిమిషము అనగా రెప్పపాటు. పదునెనిమిది నిమిషముల కాలమునకు కాష్ఠయని పేరు. అటువంటి పదునెనిమిది నిమిషముల కాలస్వరూపురాలైన పరమేశ్వరి కాష్ఠాయని అనబడినది. దీనినిబట్టి పరమేశ్వరి కాలభేదస్వరూపురాలు.
సప్తశతిలోని పదకొండవ అధ్యాయంలో తొమ్మిదవ శ్లోకంలో
*కలాకాష్ఠాదిరూపేణ పరిణామప్రదాయని*
*విశ్వస్యోపరితౌ శక్తే! నారాయణి! నమోఽస్తుతే॥*
ప్రపంచమునకు నీవే కల-కాష్ఠ అనెడి కాలప్రమాణ రూపముతో మార్పులు కల్గించి తుదకు అంతము చేయు శక్తి గలిగిన తల్లీ నీకు నమస్కారము.
కాష్ఠ అనగా మ్రానిపసుపు. కుమారస్వామి నాభినాళము మ్రానిపసుపుగా పరిణమించినదనియు, కాబట్టి శివశక్త్యాత్మకమనియు మైలారతంత్రమునందు ఒక కథ చెప్పబడినది. శిశువులు జన్మించినపుడు నాభినుండి వ్రేలాడు ఒక సిరకు నాభినాళము అని అందురు. పార్వతీపరమేశ్వరుల కుమారుడు కుమారస్వామి యొక్క నాభినాళము మ్రానిపసుపుగా పరిణమించెనని చెప్పబడినది. దీనిని బట్టి పరమేశ్వరి మ్రానిపసుపు స్వరూపురాలు. ప్రతీతము - అప్రతీతము, ఇంద్రియగోచరము - ఇంద్రియాతీతము - సమస్తము పరమశివుడే అని వేదాంతవాక్యములన్నియు ఏ తత్త్వమును బోధించుచున్నవో అదియే *కాష్ఠ* యని అనబడినది. శివుని అష్టమూర్తులలో ఆకాశమూర్తికి భీముడని పేరు. ఈయనకు పదిదిక్కులందు (అష్టదిక్కులు, భూమి, ఆకాశము) భార్యలున్నారు. అందులో ఆకాశమూర్తియైన భీమునిభార్యగా పరమేశ్వరి దిక్స్వరూపురాలు. వాయు పురాణమందు భీమదేవుని ఆరవ దేహము ఆకాశము, దిక్కులు భార్యలు, స్వర్గము వారి కుమారుడని చెప్పబడినది. శ్రుతియందు 'పరమేశ్వరి జగత్తును అతిక్రమించినది గనుక *కాష్ఠ* యగును' అని శ్రుతియందు చెప్పబడినది.
పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం కాష్ఠాయై నమః* అని అనవలెను.
***
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*860వ నామ మంత్రము* 30.03.2021
*ఓం అకాంతాయై నమః*
అకమును (పాపములు లేదా దుఃఖములు) రూపుమాపు చేయు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అకాంతా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం అకాంతాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతసు అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి శాంతిసౌఖ్యములు, సకల సంపదలు, ఆయురారోగ్యములు ప్రసాదించి కాపాడును.
అకము అనగా పాపము. దుఃఖము అనికూడా భావించవచ్చును. అంతా అనగా (పాపము లేదా దుఃఖము) అంతము చేయునది. పరమేశ్వరి తన భక్తుల పాపములను, దుఃఖములను ఎడబాపి సుఖసంతోషములు కలుగజేయును గనుక *అకాంతా* యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం అకాంతాయై నమః* అని యనవలెను.
***
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*861వ నామ మంత్రము* 31.03.2021
*ఓం కాంతార్ధవిగ్రహాయై నమః*
కాంతుడైన పరమశివుని అర్ధశరీరాన్ని పొందిన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కాంతార్ధవిగ్రహా* యను ఆరక్షరముల నామ మంత్రమును *ఓం కాంతార్ధవిగ్రహాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఆరాధించు సాధకులు తమ అభీష్టములను నెరవేర్చుకొని బ్రహ్మానందమునందెదరు.
తన కాంతుడైన పరమ శివుని అర్ధశరీరమును తనదిగా చేసికొనిన పరమేశ్వరి *కాంతార్ధవిగ్రహా* యని అనబడినది.
పరమశివుని తన భర్తగా పొందుటకు కఠోరదీక్షతో తపమునాచరించి పరమశివుని తన భర్తగా పొందినది. తన తండ్రియైన దక్షుడు తలపెట్టిన యజ్ఞమునకు తన భర్తయైన పరమశివుని పిలువలేదు. పైగా, దక్షుడు పరమశివుని దుర్భాషలు కూడా ఆడాడు. ఆ దుర్భాషలకు జగన్మాత కలవరపడి, యజ్ఞకుండములో ఆత్మాహుతి చేసుకున్నది. పరమశివుడు అమ్మవారి ఆత్మత్యాగమునకు అబ్బురపడి, అంతకంటెను మిగులవిచారించినవాడై, జగన్మాతకు తన శరీరంలో సగభాగం సమర్పించుకొని అర్ధనారీశ్వర తత్త్వమును లోకమునకు తెలియజేశాడు. నాటి నుండి వివాహమైన ప్రతీ క్రొత్తజంటకు పార్వతీపరమేశ్వరుల జంట ఒక ఆదర్శమై నిలచినది. అలాగే పరమశివుని కుడిభాగం శివునిదైతే, ఎడమ భాగం పరమేశ్వరిదైనది. భర్తకు ఎడమ ప్రక్క భార్య సకల ధర్మకార్యములాచరించుటయందు కూర్చొనుట ఒక విధ్యుక్తధర్మమై నిలచి శివశక్తుల ఐక్యతకు నిదర్శనమైనది. జగమంతా శివశక్తులమయము. శ్రీచక్రము కూడా శివశక్త్యైక్యమునకు నిదర్శనము.
శివశక్తుల సంయోగమే శ్రీ చక్రం. ఈ చక్రం మధ్యలో బిందువైన బీజము నుండి సమస్తలోకాలు, భూతాలు పుట్టినవి. కనుక శ్రీ చక్రము సమస్త కామిత ఫలము. ఆదియందు పరమేశ్వరుడు ఒక్కొక్క కామ్యమునకు ఒక్కొక్కతంత్ర శాస్త్రం చొప్పున తంత్ర శాస్త్రములను చెప్పాడు. .దీనిలోని నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుష శక్తిని సూచిస్తాయి. అయిదు సమద్విబాహు త్రిభుజాలు నిమ్మముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తాయి. ఆ విధంగా అర్ధనారీశ్వర తత్త్వము కామేశ్వరీ, కామేశ్వరులతోనే లోకమునకు వెల్లడియైనది. జగన్మాత శివునిలో సగమై, *కాంతర్ధవిగ్రహా* యను నామ మంత్రముతో స్తుతింపబడుతున్నది.
జగన్మాతకు నమస్కరించునపుడు *కాంతార్ధవిగ్రహాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*283వ నామ మంత్రము* 30.03.2021
*ఓం సహస్రాక్ష్యై నమః*
సహస్ర (అనంతమైన) కన్నులు కలిగియున్న జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సహస్రాక్షీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం సహస్రాక్ష్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులు ఆ పరమేశ్వరి విరాట్స్వరూపమును మనో నేత్రములందు దర్శించి పరమానందభూతిని పొందగలరు.
సహస్రాక్షీ యనగా వేయి కన్నులు అనగా అనంతమైన కన్నులు అని భావింపదగును. చరాచర జగత్తుయొక్క సృష్టికి పరమేశ్వరియే కారణభూతురాలు. తన ప్రమేయంతో సృష్టింపబడిన ఈ సృష్టియందలి సకల అనంతకోటి జీవులయందు తానే ఉంటున్నది. అనంతకోటి జీవరాశులలో అనంతకోటి శిరస్సులు, అనంతకోటి ముఖములతో తానే విరాజిల్లుతూ, అనంతకోటి ముఖములలోని అనంతకోటి నయనములు అన్నియు తనవై తేజరిల్లుచున్నది గనుక పరమేశ్వరి *సహస్రాక్షీ* యని అనబడినది. అటువంటి పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం సహస్రాక్ష్యై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[31/03, 04:55] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*284వ నామ మంత్రము* 31.03.2021
*ఓం సహస్రపాదే నమః*
అనంతమైన పాదాలతో శోభిల్లు తల్లికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సహస్రపాత్* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం సహస్రపాదే నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులు ఆత్మానందానుభూతితో జీవించి తరించుదురు.
పరమేశ్వరి విరాడ్స్వరూపిణి. అనంతమైన శిరస్సులు, వదనములు గలిగినది (సహస్రశీర్షవదనా), అనంతమైన కన్నులు గలిగినది (సహస్రాక్షీ). అదే విధంగా అనంతములగు పాదములు గలిగినది. గనుకనే అమ్మవారు *సహస్రపాత్* యని అనబడినది.
పరమేశ్వరికి నమస్కరించు నపుడు *ఓం సహస్రపాదే నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*50.52 (ఏబది రెండవ శ్లోకము)*
*సురద్రుమలతోద్యానవిచిత్రోపవనాన్వితమ్|*
*హేమశృంగైర్దివిస్పృగ్భిః స్ఫటికాట్టాలగోపురైః॥10285॥*
అందు దివ్యవృక్షములు, లతలతోగూడిన ఉద్యానవనములు, చిత్రవిచిత్రములగు విహార (ఉప) వనములు శోభిల్లుచుండెను. అందలి బంగారపు శిఖరములు ఆకాశమును తాకుచుండెను. స్పటికములతో నిర్మితములైన కోట బురుజులు, గోపురములు దర్శనీయముగా ఉండెను.
*50.53 (ఏబది మూడవ శ్లోకము)*
*రాజతారకుటైః కోష్ఠైర్హేమకుంభైరలంకృతైః|*
*రత్నకూటైర్గృహైర్హైమైర్మహామారకతస్థలైః॥10286॥*
అందలి కోష్ఠములు (ధాన్యాగారములు, అశ్వశాలలు, సామాగ్రి ఉంచెడి గదులు మొదలగునవి) వెండితో, ఇత్తడితో నిర్మింపబడినవి. అవి బంగారు కలశములతో అలంకృతములైనవి. అందలి గృహములు రత్నములు పొదిగిన బంగారు శిఖరములచే ఒప్పుచున్నవి. ఆ భవనముల యందలి స్థలములు మరకత మణులతో శోభిల్లుచున్నవి.
*50.54 (ఏబది నాలుగవ శ్లోకము)*
*వాస్తోష్పతీనాం చ గృహైర్వలభీభిశ్చ నిర్మితమ్|*
*చాతుర్వర్ణ్యజనాకీర్ణం యదుదేవగృహోల్లసత్॥10287॥*
*50.55 (ఏబది ఐదవ శ్లోకము)*
*సుధర్మాం పారిజాతం చ మహేంద్రః ప్రాహిణోద్ధరేః|*
*యత్ర చావస్థితో మర్త్యో మర్త్యధర్మైర్న యుజ్యతే॥10288॥*
అందు దేవతా విగ్రహములు, చంద్రశాలలు మనోజ్ఞముగా తేజరిల్లుచున్నవి. నాలుగు వర్ణములవారికిని అనువగు భవనములు విడివిడిగా నిర్మింపబడినవి. యదువంశశ్రేష్ఠులైన ఉగ్రసేన మహారాజునకును, వసుదేవునకును, శ్రీకృష్ణబలరామాదులకును వేర్వేఱుగా మహాసౌధములు సిద్ధపఱచబడినవి. దేవేంద్రుడు శ్రీకృష్ణునికొఱకై *సుధర్మ* అను పేరుగల సభాభవనమును, పారిజాతవృక్షమును ఆ నగరమున నెలకొల్పెను. ఆ సుధర్మలో ఉన్నవారికి ఆకలి దప్పులయొక్క శోకమోహములయొక్క జరామరణములయొక్క బాధలు లేకుండెను.
*50.56 (ఏబదియారవ శ్లోకము)*
*శ్యామైకకర్ణాన్ వరుణో హయాన్ శుక్లాన్ మనోజవాన్|*
*అష్టౌ నిధిపతిః కోశాన్ లోకపాలో నిజోదయాన్॥10289॥*
*50.57 (ఏబది ఏడవ శ్లోకము)*
*యద్యద్భగవతా దత్తమాధిపత్యం స్వసిద్ధయే|*
*సర్వం ప్రత్యర్పయామాసుర్హరౌ భూమిగతే నృప॥10290॥*
మహారాజా! వరుణదేవుడు శ్రీకృష్ణునకు తెల్లని గుర్రములను పంపెను. వాటికి ఒక చెవి నలుపుగా నుండెను. అవి మనోవేగముతో సాగిపోగలవు. ధనపతియు, లోకపాలుడు ఐన కుబేరుడు అష్టనిధులను సమర్పించెను. శ్రీకృష్ణుడు లోకపాలకులకు అందఱికిని వారి అధికార నిర్వహణమునకు వివిధములగు శక్తులను, సిద్ధులను ప్రసాదించియుండెను. వారు అందఱును ఆ ప్రభువు ఈ లోకమున అవతరించినంతనే వాటిని అన్నింటిని ఆ స్వామికి సమర్పించిరి.
*50.58 ( ఏబది ఎనిమిదవ శ్లోకము)*
*తత్ర యోగప్రభావేణ నీత్వా సర్వజనం హరిః|*
*ప్రజాపాలేన రామేణ కృష్ణః సమనుమంత్రితః|*
*నిర్జగామ పురద్వారాత్పద్మమాలీ నిరాయుధః॥10291॥*
శ్రీకృష్ణుడు తన యోగమాయా ప్రభావముచే ప్రజలను అందఱిని ద్వారకాపురికి చేర్చెను. పిమ్మట ఆ ప్రభువు మథురకు చేరి, బలరామునితో చర్చించి, పద్మమాలాధారియై నిరాయుధుడుగా ఆ పురద్వారమునుండి బయటికి వచ్చెను.
*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే దుర్గనివేశనం నామ పంచాశత్తమోఽధ్యాయః (50)*
ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, ఉత్తర భాగమునందలి *శ్రీకృష్ణుడు జరాసంధునితో యుద్ధమొనర్చుట - ద్వారకానగరము నిర్మించుట* యను నలుబది తొమ్మిదవ అధ్యాయము (50)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
[13/03, 21:44] +91 95058 13235: *13.03.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది ఒకటవఅధ్యాయము*
*కాలయవనుడు భస్మమగుట - ముచుకుందుని వృత్తాంతము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*శ్రీశుకఉవాచ*
*51.1 (ప్రథమ శ్లోకము)*
*తం విలోక్య వినిష్క్రాంతముజ్జిహానమివోడుపమ్|*
*దర్శనీయతమం శ్యామం పీతకౌశేయవాససమ్॥10292॥*
*51.2 (రెండవ శ్లోకము)*
*శ్రీవత్సవక్షసం భ్రాజత్కౌస్తుభాముక్తకంధరమ్|*
*పృథుదీర్ఘచతుర్బాహుం నవకంజారుణేక్షణమ్॥10293॥*
*51.3 (మూడవ శ్లోకము)*
*నిత్యప్రముదితం శ్రీమత్సుకపోలం శుచిస్మితమ్|*
*ముఖారవిందం బిభ్రాణం స్ఫురన్మకరకుండలమ్॥10294॥*
*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! మధురాపురము నుండి బయటికి వచ్చుచున్న శ్రీకృష్ణుడు తూర్పుదిశయందు ఉదయించుచున్న చంద్రునివలె శోభిల్లుచుండెను. శ్యామవర్ణశోభితుడై మిగుల దర్శనీయుడుగా నున్న ఆ స్వామిని కాలయవనుడు చూచెను. ఆ స్వామి ధరించిన పట్టు పీతాంబరముల శోభలు అపూర్వములు. ఆ మహాత్ముని విశాలమైన వక్షస్థలమునందలి శ్రీవత్స చిహ్నము విరాజిల్లుచుండెను. ఆయన కంఠమున అలంకృతమైన కౌస్తుభమణి కాంతులీనుచుండెను. ఆ స్వామియొక్క నాలుగు భుజములును సమున్నతములు, దీర్ఘములు. నేత్రములు అప్పుడే వికసించిన కమలములవలె మనోహరములు. కపోలములు (చెక్కిళ్ళు) అత్యంత మనోజ్ఞములు. వాటిపై ప్రతిఫలించుచున్న కర్ణకుండలముల నిగనిగలు వైభవోపేతములు. సర్వదా చిఱునవ్వులను చిందించుచున్న ఆ ప్రభువు యొక్క ముఖారవిందము చూడముచ్చట గొలుపుచుండెను.
*51.4 (నాలుగవ శ్లోకము)*
*వాసుదేవో హ్యయమితి పుమాన్ శ్రీవత్సలాంఛనః|*
*చతుర్భుజోఽరవిందాక్షో వనమాల్యతిసుందరః॥10295॥*
*51.5 (ఐదవ శ్లోకము)*
*లక్షణైర్నారదప్రోక్తైర్నాన్యో భవితుమర్హతి|*
*నిరాయుధశ్చలన్ పద్భ్యాం యోత్స్యేఽనేన నిరాయుధః॥10296॥*
*51.6 (ఆరవ శ్లోకము)*
*ఇతి నిశ్చిత్య యవనఃప్రాద్రవంతం పరాఙ్ముఖమ్|*
*అన్వధావజ్జిఘృక్షుస్తం దురాపమపి యోగినామ్॥10297॥*
అట్టి ప్రభువును జూచి, కాలయవనుడు ఇట్లు అనుకొనెను. 'ఈ వచ్చుచున్న మహాపురుషుడు శ్రీవత్సలాంఛనుడు, చతుర్భుజుడు, అరవిందాక్షుడు. వనమాలాశోభితుడు, అతిసుందరుడు. నారదుడు తెలిపిన శుభలక్షణములు అన్నియును ఈ మహాత్మునిలో గోచరించుచున్నవి. కనుక, ఇతడే *వాసుదేవుడు* (శ్రీకృష్ణుడు) కావచ్చును. అస్త్రశస్త్రములు లేకుండా కాలినడకన వచ్చుచున్న ఈయనతో నేనును నిరాయుధనై పోరాడెదను' అని అతడు నిశ్చయించుకొనెను. అనంతరము యోగులకును దుర్లభుడైన ఆ పురుషోత్తముడు (శ్రీకృష్ణుడు) పరాఙ్ముఖుడై పరుగెత్తుచుండగా, ఆయనను పట్టుకొనదలచి, కాలయవనుడు ఆ స్వామివెంట పరుగెత్తెను.
*51.7 (ఏడవ శ్లోకము)*
*హస్తప్రాప్తమివాత్మానం హరిణా స పదే పదే|*
*నీతో దర్శయతా దూరం యవనేశోఽద్రికందరమ్॥10298॥*
శ్రీకృష్ణుడు తన లీలలను ప్రదర్శించుచు, ఎప్పటికప్పుడు కాలయవనుని చేతికి అందినట్లే కనబడుచు, అతనిని సుదూరమునగల ఒక పర్వతగుహలోనికి తీసికొనివెళ్ళెను.
*51.8 (ఎనిమిదవ శ్లోకము)*
*పలాయనం యదుకులే జాతస్య తవ నోచితమ్|*
*ఇతి క్షిపన్ననుగతో నైనం ప్రాపాహతాశుభః॥10299॥*
అప్పుడు కాలయవనుడు 'ఓయీ! యదువంశమున జన్మించిన నీకు ఇట్లు పలాయనము చిత్తగించుట ఏమాత్రమూ తగదు' అని ఆక్షేపించుచు ఆయనను అనుసరించెను. ఐనను ఆ ప్రభువు అతనికి చిక్కలేదు. ఏలయన అతని పాపము ఇంకను పండలేదుగదా!
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఏబది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
[14/03, 04:57] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*269వ నామ మంత్రము* 14.03.2021
*ఓం రుద్రరూపాయై నమః*
సంహారమును చేయునట్టి మరియు దుఃఖములను బాపునట్టి సాక్షాత్తు రుద్రరూపిణియైనట్టి జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *రుద్రరూపా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం రుద్రరూపాయై నమః* ఉచ్చరించుచూ, ఆ లలితాంబను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు భక్తులకు భవసాగర దుఃఖములు తొలగి శాంతిసౌఖ్యమయమైన జీవనమును కొనసాగింతురు.
రుద్రుడనగా పరమేశ్వరుడు. సృష్టిస్థితిలయకృత్యములలో మూడవది అయిన లయకృత్యము అనగా సంహారము చేయువాడు. భవసాగర దుఃఖములను బాపువాడు. ప్రళయకాలము నందు వర్షము పరమేశ్వరుని సూర్యుడను నేత్రము నుండి ఉద్భవించినది. అట్టి వర్షోదకము పరమేశ్వరుని కంటినుండి వర్షించుటచే రుద్రుడు (ఈశ్వరుడు) ఏడ్చువాడు అని చెప్పారు. అందుచే రోదనము (ఏడ్చుట) చేసిన వాడు గనుకనే రుద్రుడని పరమేశ్వరుని అన్నారు. పరమేశ్వరునికి సూర్యచంద్రులిద్దరూ రెండు నేత్రములు. రోగమును ద్రవింపజేసిన (నశింపజేసిన)వాడు గనుకనే పశుపతి రుద్రుడని చెప్పబడినాడని శివరహస్యగ్రంథములో చెప్పబడినది. రుద్రులు పదకొండుమంది గనుకనే ఏకాదశరుద్రులు అని యన్నారు.
*1. అజైకపాదుడు, 2. అహిర్బుధ్న్యుడు, 3. త్వష్ట, 4. రుద్రుడు, 5. హరుడు, 6. త్ర్యంబకుడు, 7. వృషాకపి, 8. శంఖుడు, 9. కపర్ది, 10. మృగవ్యాధుడు, 11. శర్వుడు* అనువారు ఏకాదశ రుద్రులు.
శివశక్తులకు అభేదము చెప్పిన కారణంచేత, పరమేశ్వరుడు రుద్రుడని యనబడినాడు మరియు పరమేశ్వరి *రుద్రరూపా* యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం రుద్రరూపాయై నమః* అని అనవలెను.
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
[14/03, 04:57] +91 95058 13235: *14.03.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది ఒకటవఅధ్యాయము*
*కాలయవనుడు భస్మమగుట - ముచుకుందుని వృత్తాంతము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*51.9 (తొమ్మిదవ శ్లోకము)*
*ఏవం క్షిప్తోఽపి భగవాన్ ప్రావిశద్గిరికందరమ్|*
*సోఽపి ప్రవిష్టస్తత్రాన్యం శయానం దదృశే నరమ్॥10300॥*^
ఇట్లు కాలయవనుడు ఆక్షేపించుచున్నను, అతని మాటలను సరకుగొనక కృష్ణభగవానుడు అతనికి అందకుండా పర్వతగుహలో ప్రవేశించెను. ఆ స్వామిని వెంటాడుచున్న కాలయవనుడు ఆ గుహలో ప్రవేశించెను. అచట అతనికి నిద్రించుచున్న మఱియొక పురుషుడు కనబడెను.
*51.10 (పదియవ శ్లోకము)*
*నన్వసౌ దూరమానీయ శేతే మామిహ సాధువత్|*
*ఇతి మత్వాచ్యుతం మూఢస్తం పదా సమతాడయత్॥10301॥*
అప్పుడు కాలయవనుడు 'నన్ను ఇంతదూరము తీసికొనివచ్చియు, ఇతడు ఏమియు ఎఱిగనివానివలె నిద్రను నటించుచున్నాడు' అని అనుకొనెను. వెంటనే ఆ మూర్ఖుడు ఆ నిద్రించు వ్యక్తిని శ్రీకృష్ణునిగా భావించి, అతనిని కాలితో బలముగా తన్నెను.
*51.11 (పదకొండవ శ్లోకము)*
*స ఉత్థాయ చిరం సుప్తః శనైరున్మీల్య లోచనే|*
*దిశో విలోకయన్ పార్శ్వే తమద్రాక్షీదవస్థితమ్॥10302॥*
చాలాకాలమునుండి నిద్రించుచున్న ముచుకుందుడనబడే ఆ పురుషుడు నిద్రనుండి లేచి తిన్నగా కనులు తెరచెను. అతడు అటునిటు పార్శ్వప్రదేశముల యందు చూడగా ప్రక్కనే నిలిచియున్న కాలయవనుడు కనబడెను.
*51.12 (పండ్రెండవ శ్లోకము)*
*స తావత్తస్య రుష్టస్య దృష్టిపాతేన భారత|*
*దేహజేనాగ్నినా దగ్ధో భస్మసాదభవత్క్షణాత్॥10303॥*
పరీక్షిన్మహారాజా! కాలితన్నుకు క్రుద్ధుడైన ఆ ముచుకుందుని దృష్టి పడినంతనే కాలయవనుని దేహమునుండి అగ్ని ప్రజ్వరిల్లగా ఆ జ్వాలలకు అతడు (కాలయవనుడు) వెంటనే మాడిమసియై పోయెను.
*రాజోవాచ*
*51.13 (పదమూడవ శ్లోకము)*
*కో నామ స పుమాన్ బ్రహ్మన్ కస్య కింవీర్య ఏవ చ|*
*కస్మాద్గుహాం గతః శిశ్యే కింతేజో యవనార్దనః॥10304॥*
*పరీక్షిన్మహారాజు నుడివెను* "మహాత్మా! యవనుని భస్మమొనర్చిన ఆ మహాపురుషుడు ఎవరు? అతని పేరేమి? ఏ వంశమువాడు? ఎవరి కుమారుడు? అతని శక్తిసామర్థ్యములు ఎట్టివి? అతడు గుహలో నిద్రించుచుండుటకు కారణమేమి?"
*శ్రీశుకఉవాచ*
*51.14 (పదునాలుగవ శ్లోకము)*
*స ఇక్ష్వాకుకులే జాతో మాంధాతృతనయో మహాన్|*
*ముచుకుంద ఇతి ఖ్యాతో బ్రహ్మణ్యః సత్యసంగరః॥10305॥*
*అప్పుడు శుకుడు ఇట్లనెను* ఆ మహాపురుషుడు ఇక్ష్వాకువంశమున జన్మించినవాడు. మాంధాత మహారాజు యొక్క కుమారుడు. ఆయనపేరు ముచుకుందుడు. బ్రాహ్మణభక్తి కలవాడు. ధర్మయుద్ధములో ఆరితేరినవాడు (ధర్మమునకు కట్టుబడి యుద్ధమొనర్చు వాడు).
*51.15 (పదునైదవ శ్లోకము)*
*స యాచితః సురగణైరింద్రాద్యైరాత్మరక్షణే|*
*అసురేభ్యః పరిత్రస్తైస్తద్రక్షాం సోఽకరోచ్చిరమ్॥10306॥*
పూర్వము ఇంద్రాది దేవతలు అసురులకు భయపడి, 'అసురులనుండి మమ్ము రక్షింపుము' అని ముచుకుందుని వేడుకొనిరి. వారి ప్రార్ధనను మన్నించి అతడు వారిని రక్షించెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఏబది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
[14/03, 21:11] +91 95058 13235: *14.03.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది ఒకటవఅధ్యాయము*
*కాలయవనుడు భస్మమగుట - ముచుకుందుని వృత్తాంతము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*51.16 (పదహారవ శ్లోకము)*
*లబ్ధ్వా గుహం తే స్వఃపాలం ముచుకుందమథాబ్రువన్|*
*రాజన్ విరమతాం కృచ్ఛ్రాద్భవాన్నః పరిపాలనాత్॥10307॥*
*51.17 (పదిహేడవ శ్లోకము)*
*నరలోకే పరిత్యజ్య రాజ్యం నిహతకంటకమ్|*
*అస్మాన్ పాలయతో వీర కామాస్తే సర్వ ఉజ్ఝితాః॥10308॥*
*51.18 (పదునెనిమిదవ శ్లోకము)*
*సుతా మహిష్యో భవతో జ్ఞాతయోఽమాత్యమంత్రిణః|*
*ప్రజాశ్చ తుల్యకాలీయా నాధునా సంతి కాలితాః॥10309॥*
చాలాకాలమునకు పిమ్మట కుమారస్వామి దేవతలకు సేనాపతి అయ్యెను. అప్ఫుడు వారు ముచుకుందునితో ఇట్లనిరి- "రాజా! మమ్ములను రక్షించుటకై నీవు పెక్కుశ్రమలకు ఓర్చితివి. ఇక నీవు ఆ బాధ్యతనుండి విశ్రాంతి తీసికొనుము. మహావీరా! మానవలోకమున నీ పాలనలో రాజ్యమును ఎట్టి శత్రుబాధలేకుండా సురక్షితమొనర్చితివి. మమ్ము రక్షించుటకై నీ కోరికలను అన్నింటిని పరిత్యజించి, ఆ రాజ్యమును వీడివచ్చితివి. అప్పటి నీ కుమారులు, పట్టపురాణులు, బంధుమిత్రులు, ఆమాత్యులు, మంత్రులు, ప్రజలు, సమకాలీనులైన తదితరులెవ్వరును ఇప్పుడు లేరు. వారు అందఱును కాలగర్భములో కలిసిపోయిరి.
*51.19 (పందొమ్మిదవ శ్లోకము)*
*కాలో బలీయాన్ బలినాం భగవానీశ్వరోఽవ్యయః|*
*ప్రజాః కాలయతే క్రీడన్ పశుపాలో యథా పశూన్॥10310॥*
*51.20 (ఇరువదియవ శ్లోకము)*
*వరం వృణీష్వ భద్రం తే ఋతే కైవల్యమద్య నః|*
*ఏక ఏవేశ్వరస్తస్య భగవాన్ విష్ణురవ్యయః॥10311॥*
లోకములో బలిష్ఠులైన వారందఱికంటెను కాలము మిగుల బలీయమైనది. అచ్యుతుడైన (నిత్యుడైన) భగవంతుడు కాలస్వరూపుడు. పశుపాలకుడు పశువులనువలె ఆ పరమేశ్వరుడు సకల ప్రాణులను తన వశములో నుంచుకొని లీలలను జరుపుచుండును. మహాత్మా! నీకు మేలగుగాక! మోక్షమును దప్ప ఇంక ఏ వరమునైనను కోరుకొనుము. షడ్గుణైశ్వర్యసంపన్నుడైన శ్రీమహావిష్ణువు మాత్రమే ముక్తిని ప్రసాదించుటకు సమర్థుడు'.
*51.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*
*ఏవముక్తః స వై దేవానభివంద్య మహాయశాః|*
*అశయిష్ట గుహావిష్టో నిద్రయా దేవదత్తయా॥10312॥*
దేవతలు ఇట్లు పలికిన పిదప మహాయశస్వియైన ముచుకుందుడు వారికి నమస్కరించెను. మిక్కిలి అలసియుండుటవలన అతడు నిద్రను వరముగా కోరుకొనెను. దేవతలనుండి వరమును పొందిన పిమ్మట, అతడు వారు సూచించిన ఒక ప్రశాంతమైన గుహలో ప్రవేశించి, అందు నిద్రించెను.
*51.22 (ఇరువది రెండవ శ్లోకము)*
*స్వాపం యాతం యస్తు మధ్యే బోధయేత్త్వాత్మచేతనః|*
*స త్వయా దృష్టమాత్రస్తు భస్మీభవతు తత్క్ష్ణాత్॥10313॥*
దేవతలు వరమిచ్చు సమయమున ఆయనతో ఇట్లు నుడివిరి- "గాఢనిద్రలో మునిగియున్న నిన్ను మేల్కొలిపినవాడు నీ దృష్టిపడిన మరుక్షణమే భస్మమైపోవును".
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఏబది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
[15/03, 04:48] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
95058 13235: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*270వ నామ మంత్రము* 15.03.2021
*ఓం తిరోధానకర్యై నమః*
నిరవశేషముగా ప్రళయమును కలుగజేయు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *తిరోధానకరీ* యను ఆరక్షరముల (షడక్షరీ) నామ మంత్రమును *ఓం తిరోధానకర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబికను భక్తిప్రపూరిత హృదయంతో ఆరాధిస్తే ఆ తల్లి ఆ భక్తులకు శాశ్వతమైన చిదానందమును ప్రసాదించును.
తిరోధానమనగా సంపూర్ణముగా (నిరవశేషముగా) ప్రళయమును కలుగజేయునది. జగన్మాత యొక్క *పంచకృత్యపరాయణా* (సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు అను పంచకృత్యములను నిర్వహించునది జగన్మాత - 274వ నామ మంత్రము) పంచకృత్యములలో నాలుగవ కృత్యమే తిరోధానము. లయకృత్యము నాశనము చేయుట. కల్పాంతమున చరాచర జగత్తు యొక్క సకల కారణ శరీరములను బీజరూపంలో తనయందు ఇముడ్చుకొని కనబడకుండా ఉంచుకొనుటయే తిరోధానము. గనుకనే పరమేశ్వరి *తిరోధానకరీ* యని అనబడినది. తిరోధానకృత్యమునందు పూర్తిగా ధ్వంసముచేయుట, పరమాణురూపములు కూడ లేకుండునట్లు చేయుట జగన్మాత నిర్వహించును. దీనికే నిరవశేషధ్వంసమని పేరు. ఇదియే సంహారతిరోధానములకు గల భేదము. సంహారము అనునది అవాంతర ప్రళయము. తిరోధానమనునది మహాప్రళయము. తిరోధానమునందు పరమాణువులుగూడ ప్రకృతియందు లయించును. దీనినే దీపనాశనము అందురు. దీపము స్థూలరూపములోనున్న వత్తిని, తైలమును తన స్వరూపముచే నాశనముచేయును. ఇది సంహారము అయితే ఆ దీపము స్థూల రూపములయిన వత్తి, తైలములు అంతరించిన పిదప, తన కాంతిని కూడా తను నాశనము చేసుకొనుట తిరోధానము. ఈ తిరోధానకృత్యము ఘనీభవించిన శుద్ధసత్త్వగుణము ప్రధానముగా గల ఈశ్వరునిది. అటువంటి ఈశ్వర కృత్యమును పరమేశ్వరి చేయుచున్నదిగనుక *తిరోధానకరీ* యని అనబడినది.
త్రిపురా సిద్ధాంతములో ఇలా చెప్పబడినది:-
*అభక్తానాం చ సర్వేషాం తిరోధాన కరీ యతః|*
*శ్రీ తిరస్కరణీ తస్మాత్ ప్రోక్తా సుత్యం వరాననే॥*
భక్తులుగానివారికి భగవత్స్వరూపము కనిపించకుండునట్లు చేయుటచే ఈ దేవి తిరస్కరణియని చెప్పబడుచున్నది.
అనగా జగన్మాత *తిరస్కరణి* యను పేరుగల శక్తిస్వరూపురాలు.
పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం తిరోధానకర్యై నమః* యని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[15/03, 04:49] +91 95058 13235: *15.03.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది ఒకటవఅధ్యాయము*
*కాలయవనుడు భస్మమగుట - ముచుకుందుని వృత్తాంతము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*51.23 (ఇరువది మూడవ శ్లోకము)*
*యవనే భస్మసాన్నీతే భగవాన్ సాత్వతర్షభః|*
*ఆత్మానం దర్శయామాస ముచుకుందాయ ధీమతే॥10314॥*
*51.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*
*తమాలోక్య ఘనశ్యామం పీతకౌశేయవాససమ్|*
*శ్రీవత్సవక్షసం భ్రాజత్కౌస్తుభేన విరాజితమ్॥10315॥*
*51.25 (ఇరువది ఐదవ శ్లోకము)*
*చతుర్భుజం రోచమానం వైజయంత్యా చ మాలయా|*
*చారుప్రసన్నవదనం స్ఫురన్మకరకుండలమ్॥10316॥*
*51.25 (ఇరువది ఆరవ శ్లోకము)*
*ప్రేక్షణీయం నృలోకస్య సానురాగస్మితేక్షణమ్|*
*అపీచ్యవయసం మత్తమృగేంద్రోదారవిక్రమమ్॥10317॥*
*51.27 (ఇరువది ఏడవ శ్లోకము)*
*పర్యపృచ్ఛన్మహాబుద్ధిస్తేజసా తస్య ధర్షితః|*
*శంకితః శనకై రాజా దుర్ధర్షమివ తేజసా॥10318॥*
ముచుకుందుని దృష్టిపాతముతో యవనుడు భస్మమైనంతనే యదువంశ శిరోమణియగు శ్రీకృష్ణభగవానుడు నిష్ఠాగరిష్ఠుడైన ఆ మహాత్మునకు ప్రత్యక్షమయ్యెను. అప్పుడు ఆ పట్టుపీతాంబరధారి వర్షాకాలము నందలి మేఘమువలె శ్యామవర్ణముతో శోభిల్లుచుండెను. వక్షస్థలమునందలి శ్రీవత్స చిహ్నముతో, కంఠమునందలి కైస్తుభమణితో తేజరిల్లుచుండెను. చతుర్భుజములతో దర్శనమిచ్చిన ఆ స్వామి వైజయంతీ మాలతో అలరారుచుండెను. మెఱయుచున్న మకరకుండలములతో ఒప్పుచున్న ఆ ప్రభువుయొక్క ప్రసన్న వదనము మనోహరముగా ఉండెను. ముచ్చట గొలుపుచున్న ఆ పురుషోత్తముని యొక్క దరహాసము, ప్రేమానురాగములతో నిండిన వీక్షణములు మానవాళికి దర్శనీయముగా ఉండెను. తరుణవయస్కుడైన ఆ సుందరుని గమనము మదించిన సింహపు నడకవలె గంభీరముగానుండెను. అంతట ఆ మహారాజు ఆ జ్యోతిర్మయ స్వరూపుని జూచి చకితుడయ్యెను. దివ్యతేజస్సుముందు అప్రతిభుడై (దర్శింపజాలక) శంకించుచు అతడు ఎట్టకేలకు తెప్పరిల్లి సంతోషపూర్వకముగా ఆ పరమపురుషునితో ఇట్లనెను-
*ముచుకుందఉవాచ*
*51.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*
*కో భవానిహ సంప్రాప్తో విపినే గిరిగహ్వరే|*
*పద్భ్యాం పద్మపలాశాభ్యాం విచరస్యురుకంటకే॥10319॥*
*51.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*
*కింస్విత్తేజస్వినాం తేజో భగవాన్ వా విభావసుః|*
*సూర్యః సోమో మహేంద్రో వా లోకపాలోఽపరోఽపి వా॥10320॥*
*ముచుకుందుడు పలికెను* "పూజ్యుడా! నీవు ఎవరు? ముండ్లతో నిండిన ఈ మహారణ్యమునందు పద్మదళములవలె సుతిమెత్తని నీ పాదములతో ఎట్లు సంచరించుచుంటివి? ఇట్టి ఈ పర్వతగుహలోనికి ఎందులకు వచ్చితివి? మహాతేజోమూర్తులకే వన్నెచిన్నెలు దిద్దగలది నీ దివ్యతేజస్సు. పూజ్యుడవైన నీవు అగ్నిదేవుడవా? సూర్యుడవా? చంద్రుడవా? మహేంద్రుడవా? లేదా, వరుణుడవా? ఇంతకును నీవు ఎవరు?
*51.30 (ముప్పదియవ శ్లోకము)*
*మన్యే త్వాం దేవదేవానాం త్రయాణాం పురుషర్షభమ్|*
*యద్బాధసే గుహాధ్వాంతం ప్రదీపః ప్రభయా యథా॥10321॥*
మహాత్మా! ఇంద్రాదిదేవతలకును పూజ్యులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో నీవు శ్రీమన్నారాయణుడవా? ఏలయన దీపము చీకట్లను పారద్రోలునట్లుగా దివ్యములైన నీ తనుకాంతులు ఈ గుహలో వ్యాపించియున్న చిమ్మచీకట్లను రూపుమాపుచున్నవి.
*51.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*
*శుశ్రూషతామవ్యళీకమస్మాకం నరపుంగవ|*
*స్వజన్మ కర్మ గోత్రం వా కథ్యతాం యది రోచతే॥10322॥*
చతుర్భుజుడవైన పురుషోత్తమా! నీకు నమ్మకమైనచో దివ్యములైన నీ జన్మకర్మల గుఱించియు, వంశమును గూర్చి స్పష్టముగా తెలుపుము. నేను వినవలెనను కుతూహలముతో ఉన్నాను.
*51.32 (ముప్పది రెండవ శ్లోకము)*
*వయం తు పురుషవ్యాఘ్ర ఐక్ష్వాకాః క్షత్రబంధవః|*
*ముచుకుంద ఇతి ప్రోక్తో యౌవనాశ్వాత్మజః ప్రభో॥10323॥*
పరమపురుషా! నేను మాత్రము ఇక్ష్వాకు వంశమునకు చెందిన రాజపుత్రుడను. ప్రభూ! యౌవనాశ్వుని పుత్రుడైన మాంధాతయొక్క కుమారుడను. నా పేరు ముచుకుందుడు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఏబది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది ఒకటవఅధ్యాయము*
*కాలయవనుడు భస్మమగుట - ముచుకుందుని వృత్తాంతము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*శ్రీకృష్ణభగవానునితో ముచుకుందుడు పలికిన పలుకులు*
*51.33 (ముప్పది మూడవ శ్లోకము)*
*చిరప్రజాగరశ్రాంతో నిద్రయోపహతేంద్రియః|*
*శయేఽస్మిన్ విజనే కామం కేనాప్యుత్థాపితోఽధునా॥10324॥*
"స్వామీ! చాలకాలము మేల్కొని యుండుటవలన మిగుల అలసిపోయి, ఒడలు తెలియని నిద్రలో మునిగిపోయితిని. నిర్జనప్రదేశమైన ఈ గుహలో హాయిగా పండుకొనియుంటిని. ఇప్పుడే ఎవరో ఒక పురుషుడు నన్ను నిద్రనుండి లేపెను".
*51.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*
*సోఽపి భస్మీకృతో నూనమాత్మీయేనైవ పాప్మనా|*
*అనంతరం భవాన్ శ్రీమాంల్లక్షితోఽమిత్రశాతనః॥10325॥*
*51.35 (ముప్పది ఐదవ శ్లోకము)*
*తేజసా తేఽవిషహ్యేణ భూరి ద్రష్టుం న శక్నుమః|*
*హతౌజసో మహాభాగ మాననీయోఽసి దేహినామ్॥10326॥*
"వాని పాప ఫలితముగా అతడు భస్మమైపోయెను. అనంతరము శత్రుదమనుడైన, పూజ్యుడగు నీ యొక్క దర్శనమైనది. మహానుభావా! సకలప్రాణులకు నీవు ఆదరణీయుడవు. అద్భుతమైన నీ తేజస్సును పూర్తిగా దర్శింపలేకున్నాను. నీ తేజోప్రభావమున నా శక్తియంతయు సన్నగిల్లినది".
*51.36 (ముప్పది ఆరవ శ్లోకము)*
*ఏవం సంభాషితో రాజ్ఞా భగవాన్ భూతభావనః|*
*ప్రత్యాహ ప్రహసన్ వాణ్యా మేఘనాదగభీరయా॥10327॥*
ముచుకుందుడు ఇట్లు పలికిన పిమ్మట సకలప్రాణులలో అంతర్యామియై వెలుగొందుచుండెడి కృష్ణభగవానుడు దరహాసమొనర్చుచు, మేఘగంభీర ధ్వనితో అతనితో ఇట్లు పలికెను-
*శ్రీభగవానువాచ*
*51.37 (ముప్పది ఏడవ శ్లోకము)*
*జన్మకర్మాభిధానాని సంతి మేఽఙ్గ సహస్రశః|*
*న శక్యంతేఽనుసంఖ్యాతుమనంతత్వాన్మయాపి హి॥10328॥*
*51.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*
*క్వచిద్రజాంసి విమమే పార్థివాన్యురుజన్మభిః|*
*గుణకర్మాభిధానాని న మే జన్మాని కర్హిచిత్॥10329॥*
*51.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*
*కాలత్రయోపపన్నాని జన్మకర్మాణి మే నృప|*
*అనుక్రమంతో నైవాంతం గచ్ఛంతి పరమర్షయః॥10330॥*
*51.40 (నలుబదియవ శ్లోకము)*
*తథాప్యద్యతనాన్యంగ శృణుష్వ గదతో మమ|*
*విజ్ఞాపితో విరించేన పురాహం ధర్మగుప్తయే|*
*భూమేర్భారాయమాణానామసురాణాం క్షయాయచ॥10331॥*
*51.41 (నలుబది ఒకటవ శ్లోకము)*
*అవతీర్ణో యదుకులే గృహ ఆనకదుందుభేః|*
*వదంతి వాసుదేవేతి వసుదేవసుతం హి మామ్॥10332॥*
*శ్రీకృష్ణభగవానుడు ఇట్లనెను* "ముచుకుందా! నా జన్మకర్మలు, నామములు (పేర్లు) అనంతములు. అవి అపరిమితములు. కావున వాటిని లెక్కించుటకు నాకును అసాధ్యము. రాజా! ఎవ్వడైనను కొన్ని జన్మల పిమ్మటనైనను భూమియొక్క ధూళికణములను లెక్కింపగలదేమోగాని, నా అవతారములను గుణములను, లీలలను, నామములను (పేర్లను) మాత్రము లెక్కపెట్టజాలదు సుమా! ముకుందరాజా! సనకసనందనాది మహామునులు సైతము త్రికాలములయందలి (భూత భవిష్యద్వర్తమాన కాలముల యందలి) నా జన్మకర్మలను నిరంతరము వర్ణించుచు వచ్చినను నేటికిని వాటిని పూర్తి చేయజాలకున్నారు. రాజా! ఇప్పటి (ఈ అవతారమునకు సంబంధించిన) నా జన్మకర్మలను, నామములను (పేర్లను) తెలిపెదను వినుము. పూర్వము బ్రహ్మదేవుడు 'భూమికి భారమైన అసురులను సంహరించి, ధర్మమును పరిరక్షింపుము' అని నన్ను ప్రార్థించియుండెను. అందువలన నేను యాదవ వంశమున వసుదేవునియింట అవతరించితిని. వసుదేవుని కుమారుడనైన నన్ను *వాసుదేవుడు* అని వ్యవహరించుచున్నారు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఏబది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
[16/03, 09:06] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
[16/03, 09:06] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*271వ నామ మంత్రము* 16.03.2021
*ఓం ఈశ్వర్యై నమః*
ఘనీభవించిన శుద్ధ సత్త్వమే ప్రధానముగా గల ఈశ్వర స్వరూపురాలయిన జగదీశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ఈశ్వరీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం ఈశ్వర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరాశక్తిని ఉపాసించు సాధకుడు నిశ్చలచిత్తుడై నిరంతరము పరమేశ్వరీ నామస్మరణ పారాయణతో బ్రహ్మజ్ఞాన కాసారమున హంసగా జీవించును.
ఈశ్వరుడనగా శుద్ధసత్త్వగుణస్వరూపుడైన పరమేశ్వరుడు. పరమేశ్వరునికి వేరుకాని జగదీశ్వరి *ఈశ్వరీ* యని అనబడినది. మాయను వశమునందుంచుకున్న ఈశ్వరుని శక్తియగుటచే జగన్మాత *ఈశ్వరీ* యని అనబడినది. పంచబ్రహ్మలు (బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు - వీరే సృష్టిస్థితిలయతిరోధానానుగ్రహములను నెఱపువారు). ఇందు నాలుగవ వాడు ఈశ్వరుడు. నాలుగవ కృత్యము తిరోధానము. జగన్మాతను *తిరోధానకరీ* యని అన్నాము గనుక,ఆ నాలుగవ కృత్యము నెఱపువాడు ఈశ్వరుడు గనుక, ఈశ్వరునికి పరమేశ్వరి అభిన్నము గనుక, ఆ తల్లి *ఈశ్వరీ* యని యనబడినది.
ఈశ్వరుడు కల్పాంతములో తిరోధాన మొనర్చును. పిదప కల్పారంభంలో పరమేశ్వరి మాయకు లోనై సృష్టికృత్యమును నిర్వహిస్తాడు. అటువంటి సమయంలో మనసు, పంచ జ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములకు శక్తిగా ఉండునదే *ఈశ్వరి*.
కల్పారంభంలో సృష్టికృత్యమునందు జీవులకు వారి కర్మ ఫలితానుభవమునకు అనుగుణంగా శరీరములను ప్రసాదించు *ఈశ్వరి* యే జగన్మాత.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం ఈశ్వర్యై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[16/03, 09:06] +91 95058 13235: *16.03.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది ఒకటవఅధ్యాయము*
*కాలయవనుడు భస్మమగుట - ముచుకుందుని వృత్తాంతము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*ముచుకుందునితో శ్రీకృష్ణభగవానుడు పలికిన పలుకులు*
*51.42 (నలుబది రెండవ శ్లోకము)*
*కాలనేమిర్హతః కంసః ప్రలంబాద్యాశ్చ సద్ద్విషః|*
*అయం చ యవనో దగ్ధో రాజంస్తే తిగ్మచక్షుషా॥10333॥*
*51.43 (నలుబది మూడవ శ్లోకము)*
*సోఽహం తవానుగ్రహార్థం గుహామేతాముపాగతః|*
*ప్రార్థితః ప్రచురం పూర్వం త్వయాహం భక్తవత్సలః॥10334॥*
*51.44 (నలుబది నాలుగవ శ్లోకము)*
*వరాన్ వృణీష్వ రాజర్షే సర్వాన్ కామాన్ దదామి తే|*
*మాం ప్రసన్నో జనః కశ్చిన్న భూయోఽర్హతి శోచితుమ్॥10335॥*
"ముచుకుందమహారాజా! కంసుడుగా జన్మించిన కాలనేమియు, సాధుపురుషులను బాధించుచుండునట్టి ప్రలంబాది రాక్షసులను నావలననే నిహతులైరి. ఈ కాలయవనుడుగూడ తీవ్రమైన నీ దృష్టిపాతమునకు గుఱియై దగ్ధమైపోవుట నా సంకల్పప్రభావముననే. అట్టి అవతారపురుషుడనైన నేను నిన్ను అనుగ్రహించుటకై ఈ గుహలో ప్రవేశించితిని. భక్తవత్సలుడనైన నన్ను పూర్వజన్మలో నీవు ఎంతగానో ఆరాధించియుంటివి. కనుక రాజర్షీ! నేను నీయెడ ప్రసన్నుడనైతిని. వరములను కోరుకొనుము. నీ కోరికలను అన్నింటిని తీర్చెదను. ప్రవృత్తితో నన్ను సేవించిన వాడెవ్వడైనను మరల దుఃఖమునకు గుఱికాడు".
*శ్రీశుకఉవాచ*
*51.45 (నలుబది ఐదవ శ్లోకము)*
*ఇత్యుక్తస్తం ప్రణమ్యాహ ముచుకుందో ముదాన్వితః|*
*జ్ఞాత్వా నారాయణం దేవం గర్గవాక్యమనుస్మరన్॥10336॥*
*శ్రీశుకుడు నుడివెను* కృష్ణభగవానుని వచనములను వినిన పిదప ముచుకుందుడు మిగుల ఆనందించి అతనికి ప్రణమిల్లెను. పూర్వము గర్గమహర్షి తెలిపిన మాటలు జ్ఞప్తికి వచ్చి తన యెదుటనున్న దివ్యపురుషుడు శ్రీమన్నారాయణుడేనని గ్రహించెను.
*ముచుకుంద ఉవాచ*
*51.45 (నలుబది ఐదవ శ్లోకము)*
*విమోహితోఽయం జన ఈశమాయయా త్వదీయయా త్వాం న భజత్యనర్థదృక్|*
*సుఖాయ దుఃఖప్రభవేషు సజ్జతే గృహేషు యోషిత్పురుషశ్చ వంచితః ॥10337॥*
*ముచుకుందుడు ఇట్లు ప్రార్థించెను* "సర్వేశ్వరా! ఈ లోకములో మానవుడు నీ మాయలోబడి, వ్యర్థ విషయములలో చిక్కుకొని నీ సేవలకు విముఖుడగును. స్త్రీలు, పురుషులు సుఖభ్రాంతితో దుఃఖములకు మూలములైన సంసారబంధములలో చిక్కుపడి వంచితులగుచుందురు.
*51.47 (నలుబది ఏడవ శ్లోకము)*
*లబ్ధ్వా జనో దుర్లభమత్ర మానుషం కథంచిదవ్యంగమయత్నతోఽనఘ|*
*పాదారవిందం న భజత్యసన్మతిర్గృహాంధకూపే పతితో యథా పశుః॥10338॥*
పరమపురుషా! మానవజన్మ భగవదారాధనకు పరమసాధనము. అట్టి నరజన్మ దైవానుగ్రహముచే అప్రయత్నముగా లభించినప్పటికిని మనుష్యుడు నీ పాదారవిందములను సేవింపక అజ్ఞానియై, గడ్డిపఱకలకు ఆశపడి తృణలతాదులచే ఆవృతమైన కూపమున పడిపోవునట్లు, విషయసుఖములకు మూలమైన గృహమనెడి అంధకారకూపమున పడిపోవును.
*51.48 (నలుబది ఎనిమిదివ శ్లోకము)*
*మమైష కాలోఽజిత నిష్ఫలో గతో రాజ్యశ్రియోన్నద్ధమదస్య భూపతేః|*
*మర్త్యాత్మబుద్ధేః సుతదారకోశభూష్వాసజ్జమానస్య దురంతచింతయా॥10339॥*
సచ్చిదానందరూపా! మహారాజును అను మదముతో, గొప్ప సంపన్నుడననెడి గర్వముతో విర్రవీగుచు, నేను అనిత్యమైన ఈ శరీరమే ఆత్మయనుబుద్ధితో కాలము గడపితిని. అంతేగాక భార్యాపుత్రులు, సంపదలు, భూములు (రాజ్యము) మొదలగువాని మోహములోబడి, వాటిని రక్షించుకొనుటకై నిరంతరము చింతాక్రాంతుడనై యుంటిని. ఈ విధముగా నీ స్మరణయే లేక నా అమూల్యజీవితమును వ్యర్థమొనర్చుకొంటిని.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఏబది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
[16/03, 20:29] +91 95058 13235: *16.03.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది ఒకటవఅధ్యాయము*
*కాలయవనుడు భస్మమగుట - ముచుకుందుని వృత్తాంతము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*51.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*
*కలేవరేఽస్మిన్ ఘటకుడ్యసన్నిభే నిరూఢమానో నరదేవ ఇత్యహమ్|*
*వృతో రథేభాశ్వపదాత్యనీకపైర్గాం పర్యటంస్త్వాగణయన్ సుదుర్మదః॥10340॥*
దేవా! ఘటకుడ్యసన్నిభమైన (మృణ్మయమైన, ఆత్మకంటెను వేఱైన) ఈ దేహము నేనే అనెడి భ్రమతో 'నేను మహారాజును' అను గర్వముతో అంధుడనై యుంటిని. రథములు, ఏనుగులు, అశ్వములు, కాల్బలములు అను చతురంగ బలములతోను, సేనానాయకులతోను కూడినవాడనై ఒక దారీతెన్నూలేక ఇటునటు తిరుగుచుంటినే గాని, నిన్ను గూర్చి తెలిసికొనలేకుంటిని.
*51.50 (ఏబదియవ శ్లోకము)*
*ప్రమత్తముచ్చైరితికృత్యచింతయా ప్రవృద్ధలోభం విషయేషు లాలసమ్|*
*త్వమప్రమత్తః సహసాభిపద్యసే క్షుల్లేలిహానోఽహిరివాఖుమంతకః॥10341॥*
భగవత్ప్రాప్తియే తన ముఖ్యకర్తవ్యమని తెలిసికొనలేక మానవుడు యుక్తాయుక్త విచక్షణను మఱచి, నిరర్థకములైన కోరికలు, భోగములు మున్నగు విషయసుఖములలోబడి కొట్టుమిట్టాడుచుండును. నీవు మాత్రము నిరంతరము జాగరూకుడవై, కాలస్వరూపుడవై, ఆకలిగొన్న సర్పము అదనుజూచి ఎలుకను కబళించినట్లు సమయము చూచుకొని, ఆ మానవుని హరించివేయుచుందువు.
*51.51 (ఏబది ఒకటవ శ్లోకము)*
*పురా రథైర్హేమపరిష్కృతైశ్చరన్ మతంగజైర్వా నరదేవసంజ్ఞితః|*
*స ఏవ కాలేన దురత్యయేన తే కలేవరో విట్కృమిభస్మసంజ్ఞితః॥10342॥*
దేవదేవా! ఈ దేహమే బంగారు ఆభరణములతో అలంకృతమై, రథములపై, మదపుటేనుగులపై విహరించుచున్నప్పుడు మహారాజుగా వ్యవహరింపబడును. అనివార్యమగు మృత్యువుపాలైన పిమ్మట ఆ దేహమే కళేబరముగా పిలువబడును. అప్పుడు అది దుర్గంధభూయిష్ఠమై క్రిమికీటకాదులకు ఆహారముగనో, లేక అగ్నికి ఆహుతియై భస్మముగనో మాఱును.
*51.52 (ఏబది రెండవ శ్లోకము)*
*నిర్జిత్య దిక్చక్రమభూతవిగ్రహో వరాసనస్థః సమరాజవందితః|*
*గృహేషు మైథున్యసుఖేషు యోషితాం క్రీడామృగః పూరుష ఈశ నీయతే॥10343॥*
ప్రభూ! పరాక్రమశాలియైన మానవుడు దిగంతముల వఱకునుగల భూమండలము నందలి శత్రువులను జయించి, సార్వభౌమాధికారమును పొంది, మహారాజు సింహాసనమును అధిష్ఠించును. అంతవఱకును అతనితో సమానులైన రాజులుగూడ అతనికి విధేయులై ప్రణమిల్లుచుందురు. ఐనను అట్టి మహాశూరుడుగూడ విషయసుఖలోలుడైనప్పుడు స్త్రీలకు క్రీడామృగమగును (స్త్రీలచేతిలో కీలుబొమ్మయగును).
*51.53 (ఏబది మూడవ శ్లోకము)*
*కరోతి కర్మాణి తపఃసునిష్ఠితో నివృత్తభోగస్తదపేక్షయా దదత్|*
*పునశ్చ భూయేయమహం స్వరాడితి ప్రవృద్ధతర్షో న సుఖాయ కల్పతే॥10344॥*
దేవా! మానవుడు విషయభోగములను త్యజించి, రాజ్యాధికారమును పొందవలెనను కోరికతో దానధర్మాది పుణ్యకార్యములను ఆచరించును. అంతటితో ఆగక ఇంద్రపదవిని కాంక్షించుచు నిష్ఠతో తపశ్చర్యకు పూనుకొనును. ఈ విధముగా అతని పదవీకాంక్ష దినదినప్రవర్ధమానమగుచుండును. అందువలన మితిమీరిన తృష్ణగలవాడు ఇహపర సుఖములు ఎవ్వియు పొందలేడు.
*51.54 (ఏబది నాలుగవ శ్లోకము)*
*భవాపవర్గో భ్రమతో యదా భవేజ్జనస్య తర్హ్యచ్యుత సత్సమాగమః|*
*సత్సంగమో యర్హి తదైవ సద్గతౌ పరావరేశే త్వయి జాయతేమతిః॥10345॥*
ఓ అచ్యుతా! సంసారమునందు చిక్కుకొని పరిభ్రమించే వానికి, ఈ సాంసారిక బంధములనుండి విడిపోవు సమయము వచ్చినప్పుడు, సత్సాంగత్యము లభించును. సత్సంగప్రభావమున వానికి నీయందు భక్తిశ్రద్ధలు ఏర్పడును. నిన్ను భజించుటవలన ముక్తిప్రాప్తించును.
*51.55 (ఏబది ఐదవ శ్లోకము)*
*మన్యే మమానుగ్రహ ఈశ తే కృతో రాజ్యానుబంధాపగమో యదృచ్ఛయా|*
*యః ప్రార్థ్యతే సాధుభిరేకచర్యయా వనం వివిక్షద్భిరఖండభూమిపైః॥10346॥*
పరమేశ్వరా! సత్పురుషులైన రాజులు వివేకముగలవారై నీయందు ధ్యానభక్తి కుదురుకొనుటకై వనమున తపస్సు ఆచరించుటకు రాజ్యాదిబంధనములు తొలగవలెనని ప్రార్థింతురు. కాని, నాకు ఆ రాజ్యాదిబంధనములు అప్రయత్నముగానే తొలగిపోయినవి. అది నీ అనుగ్రహ ప్రభావముననే అని తలంతును.
*51.56 (ఏబది ఆరవ శ్లోకము)*
*న కామయేఽన్యం తవ పాదసేవనాదకించనప్రార్థ్యతమాద్వరం విభో|*
*ఆరాధ్య కస్త్వాం హ్యపవర్గదం హరే వృణీత ఆర్యో వరమాత్మబంధనమ్॥10347॥*
సకల ప్రాణులలో అంతర్యామివై యుండెడి ప్రభూ! నీ పాదసేవనము సకల ప్రయోజనములకును పరమసాధనము. అనగా మోక్షమును గూడ అనుగ్రహించునట్టిది అదియే. అందువలన నీ పాదసేవనమును తప్ప మఱియొకదానిని దేనినీ నేను కోరను. శ్రీహరీ! ముక్తిప్రదుడవైన నిన్ను ఆరాధించి, ప్రసన్నునిగా చేసికొనిన పిమ్మట, వివేకియైనవాడు ఆత్మబంధనమునకు మూలమైన విషయసుఖములను కోరుకొనడుగదా! అట్లు కాంక్షించినచో నిజముగా అతడు మూర్ఖుడే.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఏబది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
5: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
[21/03, 07:12] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*276వ నామ మంత్రము* 21.03.2021
*ఓం భైరవ్యై నమః*
భైరవుని యొక్క భార్య అయిన పరమేశ్వరికి నమస్కారము.
భైరవీ మంత్రస్వరూపురాలైన జగన్మాతకు నమస్కారము.
పన్నెండు వత్సరముల వయస్సు గల కన్యకా స్వరూపిణియైన జగదీశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భైరవీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం భైరవ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధన చేయు భక్తులకు ఆ తల్లి సకలాభీష్టములను సిద్ధింపజేయును.
భైరవుడనగా పరమేశ్వరుడు. .పరమేశ్వరి, చెలుల సమూహంతోనుండుటచే *భైరవీ* యని అనబడినది.
ఎనిమిది పురుషరాగాలలో ఒక రాగం *భైరవి* అను నామంతో ఉన్నది. గనుక పరమేశ్వరి పురుషరాగస్వరూపురాలు.
భైరవి, మాళవి, బంగాళ, హిందోళ, రాజమంజరియు, శ్రీరాగము, గౌళ, భూపాల అను ఎనిమిది పురుషరాగములలో ఒకటిగా పరమేశ్వరి రాజిల్లుచున్నది.
దుర్గాదేవిని భైరవి అనికూడా అందురు.
పండ్రెండు వత్సరముల కన్యకా స్వరూపురాలు *భైరవి* గా జగన్మాత అలరారుచున్నది.
పండ్రెండు దళముల అనాహతపద్మమందు శ్రీమాత భవానిగా, భైరవిగా ఆరాధింపబడుచున్నది.
భైరవులు ఎనిమిది మంది. పరమేశ్వరుడనగా భైరవుడని తెలిసియుంటిమి. ఈ భైరవ శక్తులు ఎనిమిది. వీరిని అష్టభైరవులందురు.
1. అసితాంగభైరవుడు 2. రురుభైరవుడు 3. చండబైరవుడు 4. క్రోధబైరవుడు 5.ఉన్మత్తభైరవుడు 6. కపాలభైరవుడు 7. భీషణభైరవుడు 8. సంహారభైరవుడు. ఈ ఎనిమిది మంచి శ్యామలా, చండీ యంత్రాలలో కూడా పూజింపబడే దేవతలు. వీరు రక్షక స్వరూపాలు. తీవ్రమైన నాదశక్తి, తేజశ్శక్తి కలిగినవారు భైరవులు. మార్తాండభైరవుడు - ఆదిత్య స్వరూపుడు. కాలభైరవుడు - శివస్వరూపం. ఆ భైరవులు అంశలుగా వీరిని భావించవచ్చు. ఈ భైరవుల సమిష్టిరూపమే పరమేశ్వరి గనుక, ఆ తల్లి *భైరవీ* యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భైరవ్యై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[21/03, 07:12] +91 95058 13235: *21.03.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది రెండవ అధ్యాయము*
*జరాసంధుడు ప్రవర్షణగిరిని దహింపజేయుట - బలరామకృష్ణులు ద్వారకకు చేరుకొనుట - బలరాముని వివాహము - రుక్మిణీదేవి బ్రాహ్మణునిద్వారా శ్రీకృష్ణునకు సందేశమును పంపుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*తన దర్శనార్థము, రుక్మిణీ దేవిపంపగా వచ్చిన బ్రాహ్మణోత్తముని పాదసేవచేయుచు, ఆయనతో సానునయముగా శ్రీకృష్ణపరమాత్మ పలికిన పలుకులు:-*
*52.33 (ముప్పది మూడవ శ్లోకము)*
*విప్రాన్ స్వలాభసంతుష్టాన్ సాధూన్ భూతసుహృత్తమాన్|*
*నిరహంకారిణః శాంతాన్నమస్యే శిరసాసకృత్॥10388॥*
స్వలాభసంతుష్టులు, సాధుస్వభావులు, సకలప్రాణులయొక్క హితమును కోరుచుండువారు, అహంకారము లేనివారు, శాంతచిత్తులు ఐనట్టి విప్రోత్తములకు నేను సర్వదా శిరసా ప్రణమిల్లుదును.
*52.33 (ముప్పది నాలుగవ శ్లోకము)*
*కచ్చిద్వః కుశలం బ్రహ్మన్ రాజతో యస్య హి ప్రజాః|*
*సుఖం వసంతి విషయే పాల్యమానాః స మే ప్రియః॥10389॥*
భూసురోత్తమా! మీరు అందఱును కుశలమేనా? తన దేశము నందలి ప్రజలెల్లరును సుఖశాంతులతో వర్ధిల్లు చుండునట్లు ప్రేమానురాగములతో పరిపాలించు చుండునట్టి రాజనిన నాకు చాల ఇష్టము.
*52.35 (ముప్పది ఐదవ శ్లోకము)*
*యతస్త్వమాగతో దుర్గం నిస్తీర్యేహ యదిచ్ఛయా|*
*సర్వం నో బ్రూహ్యగుహ్యం చేత్కిం కార్యం కరవామ తే॥10390॥*
మహాత్మా! నీవు ఏ దేశమునుండి వచ్చితివి? అసాధ్యమైన ఈ (సముద్ర) జలదుర్గమును దాటి ఇచటికి వచ్చుటకుగల కారణము ఏమి? రహస్యముగానిచో విషయములను అన్నింటిని పూర్తిగా తెలుపుము. ఇంతకును నేను నీకు చేయవలసిన సహాయమేమి?
*52.36 (ముప్పది ఆరవ శ్లోకము)*
*ఏవం సంపృష్టసంప్రశ్నో బ్రాహ్మణః పరమేష్ఠినా|*
*లీలాగృహీతదేహేన తస్మై సర్వమవర్ణయత్॥*
రాజా! లీలామానుషవిగ్రహుడు, సర్వజ్ఞుడునగు శ్రీకృష్ణప్రభువు ఇట్లు ప్రశ్నింపగా ఆ విప్రోత్తముడు తాను వచ్చిన కార్యమును గూర్చి ఆ స్వామికి విపులముగా తెలుపుచు, రుక్మిణీ సందేశమును ఇట్లు వివరించెను-
*రుక్మిణ్యువాచ*
*52.37 (ముప్పది ఏడవ శ్లోకము)*
*శ్రుత్వా గుణాన్ భువనసుందర శృణ్వతాం తే నిర్విశ్య కర్ణవివరైర్హరతోఽఙ్గతాపమ్|*
*రూపం దృశామ్ దృశిమతామఖిలార్థలాభం త్వయ్యచ్యుతావిశతి చిత్తమపత్రపం మే॥10392॥*
(ప్రభూ! నా పేరు అగ్నిద్యోతనుడు. విదర్భ రాజకుమారియైన రుక్మిణీదేవి పంపగా వచ్చిన దూతను. ఆ కన్యకామణి విన్నవించుకొనిన సందేశము ఇది)
భువనసుందరా! నా మనవిని ఆలకింపుము. నీ ఉదాత్తగుణములు చెవులసోకినంతనే శ్రోతల (విన్నవారి) యొక్క అంగ (ఆధ్యాత్మిక) తాపములు అన్నియును తీఱిపోవును. నీ రూపవైభవమును కనులార కాంచినంతనే ప్రేక్షకుల (చూచినవారి) పురుషార్థములన్నియును సఫలములగును. అట్టి నీ దివ్యగుణములను, రూపసౌభాగ్యమును గూర్చి వినినప్పటి నుండియు నా చిత్తము ఎట్టి సంకోచమునూ పొందక నీయందే లగ్నమైయున్నది. నేను బిడియమును వీడి చెప్పుచున్న మాట ఇది.
*52.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*
*కా త్వా ముకుంద మహతీ కులశీలరూపవిద్యావయోద్రవిణధామభిరాత్మతుల్యమ్|*
*ధీరా పతిం కులవతీ న వృణీత కన్యా కాలే నృసింహ నరలోకమనోఽభిరామమ్॥10393॥*
పురుషోత్తమా! నీ యొక్క వంశ ఔన్నత్యము, తారుణ్య లాలిత్యములు, సౌజన్య సంపదలు, బలపరాక్రమములు, శౌర్యప్రతాపములు, దయాదాక్షిణ్యములు నిరుపమానములు. అందువలన నీవు సకలజన మనోభిరాముడవు. ముకుందా! సద్గుణవతియు (ఉదారగుణవంతురాలు), స్థిరచిత్తయు (ధైర్యవతియు), ఉత్తమవంశ సంజాతయునై, యుక్త (వివాహ) వయస్సులో ఉన్న ఏ కన్యకామణి నీ వంటి మహితాత్మని పతిగా కోరుకొనదు? ఇక నిన్ను నేను వరించుట దోషము ఎట్లగును?
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఏబది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది రెండవ అధ్యాయము*
*జరాసంధుడు ప్రవర్షణగిరిని దహింపజేయుట - బలరామకృష్ణులు ద్వారకకు చేరుకొనుట - బలరాముని వివాహము - రుక్మిణీదేవి బ్రాహ్మణునిద్వారా శ్రీకృష్ణునకు సందేశమును పంపుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*బ్రాహ్మణోత్తముడు అగ్నిద్యోతుని ద్వారా శ్రీకృష్ణునకు రుక్మిణీదేవి పంపిన సందేశము*
*52.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*
*తన్మే భవాన్ ఖలు వృతః పతిరంగ జాయామాత్మార్పితశ్చ భవతోఽత్ర విభో విధేహి|*
*మా వీరభాగమభిమర్శతు చైద్య ఆరాద్గోమాయువన్మృగపతేర్బలిమంబుజాక్ష॥10394॥*
శ్రీకృష్ణప్రభూ! నా మనస్సు నీకే అర్పితమైనది. కనుక నీవే నా పతివి. నీవు ఇచటికి వచ్చి నన్ను భార్యనుగా స్వీకరింపుము. అంబుజాక్షా! సింహమునకు చెందిన వస్తువుకై గోమాయువు (నక్క) ఆశపడునట్లుగా, మహావీరుడవైన నీకు చెందవలసిన నన్ను మదాంధుడైన శిశుపాలుడు కోరుకొనుచున్నాడు. అతడు నన్ను తాకకముందే నీవు నన్ను గొనిపొమ్ము.
*52.40 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*
*పూర్తేష్టదత్తనియమవ్రతదేవవిప్రగుర్వర్చనాదిభిరలం భగవాన్ పరేశః|*
*ఆరాధితో యది గదాగ్రజ ఏత్య పాణిం గృహ్ణాతు మే న దమఘోషసుతాదయోఽన్యే॥10395॥*
స్వామీ! నేను నా జన్మజన్మల యందును వాపీకూపతటాకాది నిర్మాణములూ, యజ్ఞయాగాదికర్మలు, పాత్రులైనవారికి దానధర్మములు, తీర్థస్నానాది నియమపాలనము, కృఛ్ర, చాంద్రాయణాదివ్రతములు, దేవతలు, భూసురులు, గురువులు మొదలగువారికి అర్చనలు, సకలప్రాణుల హితమునకై పాటుపడుట మొదలగువాటిని సర్వేశ్వరుడైస ఆ శ్రీహరిని భర్తగా కోరియే ఆచరించియున్నచో వెంటనే (రేపే) శ్రీకృష్ణుడు వచ్చి, నన్ను చేపట్టునుగాక! దమఘోషుని పుత్రులగు శిశుపాలాదులు నన్ను తాకకుందురుగాక!
*52.41 (నలుబది ఒకటవ శ్లోకము)*
*శ్వోభావిని త్వమజితోద్వహనే విదర్భాన్ గుప్తః సమేత్య పృతనాపతిభిః పరీతః|*
*నిర్మథ్య చైద్యమగధేంద్రబలం ప్రసహ్య మాం రాక్షసేనవిధినోద్వహ వీర్యశుల్కామ్॥10396॥*
'వీరశిరోమణీ! నీవు అపరాజితుడవు. రేపు వివాహ ముహూర్తమునకు ఒకదినము ముందుగనే నీవు ససైన్యముగా (సేనాధిపతులతో గూడి) రహస్యముగా విదర్భదేశమునకు విచ్చేయుము. నీ పరాక్రమముతో శిశుపాల జరాసంధుల బలములను కకావికలొనర్చి, పరాక్రమమునే కట్నముగా చెల్లించి రాక్షసవివాహపద్ధతిలో నన్ను పరిణయమాడుము'.
*52.42 (నలుబది రెండవ శ్లోకము)*
*అంతఃపురాంతరచరీమనిహత్య బంధూన్ త్వాముద్వహే కథమితి ప్రవదామ్యుపాయమ్|*
*పూర్వేద్యురస్తి మహతీ కులదేవియాత్రా యస్యాం బహిర్నవవధూర్గిరిజాముపేయాత్॥10397॥*
'రుక్మిణీ! నీవు మహాసౌధములోపల ఎక్కడనో ఉందువుగదా! అట్టి స్థితిలో నిన్సు తీసుకొనివచ్చునప్పుడు కావలివారు, నీ బంధువులైన యోధులు నన్ను అడ్డుకొందురుగదా! అప్పుడు నేను వారిని చంపవలసివచ్చును గదా!' అని నీవు భావించినచో, ఓ కమలనయనా! తగిన ఉపాయమును చెప్పెదను వినుము- వివాహమునకు ముందటి దినమున కులదేవత యాత్రచేయుట మా వంశాచారము. అందువలన నగరము వెలుపలనున్న గౌరీదేవికి మ్రొక్కుటకై పెండ్లికి ముందుగనే నన్ను మావారు పంపుదురు. ఆ విధముగా నేను పట్టణము బయటికివచ్చి, విశ్వనాథుని సతియగు గౌరీదేవికి మ్రొక్కులు చెల్లింతును. ఆ సమయమున (అదనుచూచుకొని) నీవు అచటికి వచ్చి, నీ శౌర్యమును శుల్కముగా చెల్లించి, రాక్షసవివాహ పద్ధతిగా పరిణయమాడుటకై నన్ను తీసికొనిపొమ్ము.
*52.43 (నలుబది మూడవ శ్లోకము)*
*యస్యాంఘ్రిపంకజరజఃస్నపనం మహాంతోవాంఛంత్యుమాపతిరివాత్మతమోఽపహత్యై|*
*యర్హ్యంబుజాక్ష న లభేయ భవత్ప్రసాదం జహ్యామసూన్ వ్రతకృశాన్ శతజన్మభిః స్యాత్॥10398॥*
స్వామీ! మహాత్ములు తమ అజ్ఞానము తొలగుటకై, ఉమాపతియగు శంకరునిరీతిగా నీ పాద పద్మములయందలి ధూళికణములలో స్నానమాచరించుటకై కోరుకొందురు. అట్టి మహనీయుడవైన నీ కృపతో నీ పాదధూళి ప్రసాదమును పొందకపోయినచో, కఠోరమగు వ్రతదీక్షను వహించి, శరీరమును శుష్కింపజేసి, ప్రాణములను విడిచిపెట్టెదను. ఈ జన్మలో కాకున్ననూ, వందజన్మలకైననూ నీ అనుగ్రహము తప్పక లభించి తీరును".
*బ్రాహ్మణ ఉవాచ*
*52.44 (నలుబది నాలుగవ శ్లోకము)*
*ఇత్యేతే గుహ్యసందేశా యదుదేవ మయాహృతాః|*
*విమృశ్య కర్తుం యచ్చాత్ర క్రియతాం తదనంతరమ్॥10399॥*
*బ్రాహ్మణోత్తముడు పలికెను* రుక్మిణీ సందేశమును వినిపించిన పిమ్మట ఆ బ్రాహ్మణుడు (అగ్నిద్యోతనుడు) కృష్ణునితో ఇట్లనెను- 'యదువంశ శిరోమణీ! నేను రుక్మిణీదేవినుండి తీసుకొనివచ్చిన గుప్తసందేశము ఇదియే. దీనిని బాగుగా ఆలోచించి, ఈ విషయమున అనంతర కార్యమును నిర్వహింపుము'.
*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే రుక్మిణ్యుద్వాహప్రస్తావే ద్విపంచాశత్తమోఽధ్యాయః (52)*
ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, ఉత్తరార్ధమునందలి *జరాసంధుడు ప్రవర్షణగిరిని దహింపజేయుట - బలరామకృష్ణులు ద్వారకకు చేరుకొనుట - బలరాముని వివాహము - రుక్మిణీదేవి బ్రాహ్మణునిద్వారా శ్రీకృష్ణునకు సందేశమును పంపుట* యను ఏబది రెండవ అధ్యాయము (52)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
[22/03, 04:33] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*852వ నామ మంత్రము* 22.03.2021
*ఓం సర్వోపనిషదుద్ఘుష్టాయై నమః*
సకలోపనిషత్తులయందు రహస్యాతి రహస్యముగా బోధింపబడిన శక్తిస్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సర్వోపనిషదుద్ఘుష్టా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం సర్వోపనిషదుద్ఘుష్టాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి అనంతమైన బ్రహ్మజ్ఞాన సంపదలను సంప్రాప్తింపజేసుకొను దిశగా సాధన నిర్విఘ్నంగా కొనసాగునటులు అనుగ్రహించును. భౌతికపరమైన శాంతిసౌఖ్యములు, ఆయురారోగ్యములు ప్రసాదించును.
జగన్మాత అయిన లలితాంబిక సర్వ ఉపనిషత్తులందును రహస్యాతి రహస్యముగా బోధింపబడినది. ఐతరేయ మొదలగు ఉపనిషత్తులందు రహస్యవాక్సముదాయముచే పరమేశ్వరి ప్రతిపాదింపబడినది గనుక *సర్వోపనిషదుద్ఘుష్టా* యని అనబడినది. జీవుడు, ఈశ్వరుడు అను రెండు ద్వైతము. అయితే, అట్టి ద్వైత భావనను పోగొట్టి పరమరహస్యమైన అద్వైతభామును కల్గించునదే ఉపనిషత్తు అని చెప్పబడినది.
గురువు ఎప్పుడును శిష్యునికన్న ఉన్నతుడే అయి ఉండును. శిష్యుడు గురువు కన్న దిగువస్థానంలో కూర్చొని, గురువు బోధించు బ్రహ్మజ్ఞానతత్త్వములను వినవలెను. ఎట్టి పరిస్థితిలోను గురువును, ఏవిషయంలోనూ కూడా తనకన్న తక్కువగా భావించరాదు.
హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగము. వేదముల చివరిభాగములే ఉపనిషత్తులు. ప్రతి వేదంలోను నాలుగు భాగాలున్నాయి. అవి
*సంహితలు* - మంత్ర భాగం, స్తోత్రాలు, ఆవాహనలు
*బ్రాహ్మణాలు* - సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.
*అరణ్యకాలు* వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి.
*ఉపనిషత్తులు*- ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడా అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదహరించారు.
1. ఈశావాశ్యోపనిషత్తు, 2. కేనోపనిషత్తు, 3. కఠోపనిషత్తు, 4. ప్రశ్నోపనిషత్తు, 5. ముండకోపనిషత్తు, 6. మాండూక్యోపనిషత్తు, 7. తైత్తిరీయోపనిషత్తు, 8. ఐతరేయోపనిషత్తు, 9. ఛాందోగ్యము, 10. బృహదారణ్యకము ఈ పది ఉపనిషత్తులు ప్రధానమైనవి అని శ్రీ శంకరులు వీటికా భాష్యము వ్రాసినారు. వేదాల సారమే ఉపనిషత్తులు. ఇందులో పరమాత్మ స్వరూపాన్ని ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నించారు ఆదిశంకరులు.
ఉద్ఘుష్ట అనగా ఉపనిషత్తులవలన భేదరూపమున చెప్పబడిన సగుణ బ్రహ్మోపాసనములన్నిటిచేత అధికముగా ఘోషింప (బోధింప) బడినది అని భావము. ఈ విషయము *సర్వవేదాంతప్రత్యయం* అను సూత్రభాష్యమందు చెప్పబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సర్వోపనిషదుద్ఘుష్టాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*277వ నామ మంత్రము* 22.03.2021
*ఓం భగమాలిన్యై నమః*
షడ్గుణైశ్వర్యములను ధరించియున్న తల్లికి నమస్కారము.
నిత్యాతిథిస్వరూపురాలు అయిన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భగమాలినీ* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును అత్యంత భక్తితో ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ధ్యానముచేయు భక్తులకు ఆ తల్లి షట్ భగములైన (ఈశత్వం, ధర్మం, కీర్తి, అందం, సర్వజ్ఞత్వం, వైరాగ్యం) అను అదృష్టములను కలుగునటులు అనుగ్రహించును.
*భగమాలిని* అనగా పరమేశ్వరి షడ్గుణైశ్వర్యములను ధరించియున్నది అని భావము. షడ్గుణైశ్వర్యములు అనగా పరిపూర్ణత, వీర్యము, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము అని కూడా చెప్పవచ్చును. వీటిని మాలగా ధరించియున్న జగన్మాత *భగమాలినీ* యని అనబడినది.
జగన్మాత అనాహత పద్మంలో ఉన్నప్పుడు పండ్రెండు దళములలోను పండ్రెండు సూర్యకళలు పరమేశ్వరిని చుట్టి ఉంటారు. వారిని ద్వాదశకళలు అనియు అంటారు.
*సూర్యకళలు*
1. తపిని, 2. తాపిని, 3. ధూమ్ర, 4. మరీచి, 5. జ్వాలిని, 6. రుచి, 7. సుషుమ్న, 8. భోగద, 9. విశ్వబోధిని, 10. ధరణి, 11. క్షమ, 12. ప్రభ. ఈ సూర్యకళలను మాలగా ధరించినది యగుటచే పరమేశ్వరి *భగమాలినీ* యని అనబడినది.
ఈ పండ్రెండు సూర్యకళలను ద్వాదశాదిత్యులుగా కూడా భావించినచో ద్వాదశాధిత్యులు:-
అదితి సంతానం కనుక ఆదిత్యులు. వారు:
*మొదటి పట్టిక ప్రకారం* వరుణుడు, సూర్యుడు, సహస్రాంశుడు, ధాత, తపనుడు, సవితృడు, గభస్తి, రవి, పర్జన్యుడు, త్వష్ట, మిత్రుడు, విష్ణువు. (దేవతలలో ముఖ్యులు ద్వాదశాదిత్యులని ఒక వాదం ఉంది.)
*రెండవ పట్టిక ప్రకారం* అర్యముడు, మిత్రుడు, అరుణుడు, అర్కుడు, భగుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, పూషుడు, పర్జన్యుడు, త్వష్ట, విష్ణువు, అజఘన్యుడు.
*మూడవ పట్టిక*- ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూషుడు, అర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు.
*నాలుగవ పట్టిక* - మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచ్య, ఆదిత్య, సవితృడు (సవిత), అర్క, భాస్కరులు.
ఈ పట్టికలలో చాలా పేర్లు అందులోనూ ఇందులోనూ కనిపిస్తాయి. ఒకటి రెండు పేర్లు తేడా ఉన్న పట్టికలు ఉన్నాయి. వాల్మీకి రామాయణం యుద్ధకాండలో రాముడికి అగస్త్యుడు ఉపదేశించిన ‘ఆదిత్య హృదయం’ స్తోత్రంలో ఈ పేర్లన్నీనూ, ఇవి గాక ఇంకా చాలానూ ఉన్నాయి. అన్నీ సూర్యుడి పేర్లే.
జగన్మాతకు నమస్కరింకరచునపుడు *ఓం భగమాలిన్యై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[22/03, 04:33] +91 95058 13235: *22.03.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది మూడవ అధ్యాయము*
*రుక్మిణీ హరణము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*శ్రీశుక ఉవాచ*
*53.1 (ప్రథమ శ్లోకము)*
*వైదర్భ్యాః స తు సందేశం నిశమ్య యదునందనః|*
*ప్రగృహ్య పాణినా పాణిం ప్రహసన్నిదమబ్రవీత్॥10400॥*
*శ్రీశుకుడు పలికెను* విదర్భదేశ రాకుమారియైన రుక్మిణీదేవియొక్క సందేశమును వినిని పిమ్మట శ్రీకృష్ణుడు అగ్నిద్యోతనుని చేతిని తన చేతితో పట్టుకొని దరహాసమొనర్చుచు ఇట్లు నుడివెను-
*శ్రీభగవానువాచ*
*53.2 (రెండవ శ్లోకము)*
*తథాహమపి తచ్చిత్తో నిద్రాం చ న లభే నిశి|*
*వేదాహం రుక్మిణా ద్వేషాన్మమోద్వాహో నివారితః॥10401॥*
*శ్రీకృష్ణభగవానుడు పలికెను* "బ్రాహ్మణోత్తమా! రుక్మిణి నా యందువలె నేనును ఆమెపై ప్రేమపరవశుడనై యున్నాను. ఆ కారణమున నాకు రాత్రులయందు ఏ మాత్రమూ నిద్రయే పట్టకున్నది. ఆమె యన్నయగు రుక్మి నాపై ద్వేషము వహించియున్నందున మా (ఇరువురి) వివాహమునకు అతడు అడ్డుపడుచున్నట్లు నేనెఱుగుదును.
*53.3 (మూడవ శ్లోకము)*
*తామానయిష్య ఉన్మథ్య రాజన్యాపసదాన్ మృధే|*
*మత్పరామనవద్యాంగీమేధసోఽగ్నిశిఖామివ॥10402॥*
కానీ, విప్రశ్రేష్ఠా! శుభాంగియైన ఆ రుక్మిణి నాయందే తన మనస్సును నిలుపుకొనియున్నది (మత్పరాయణయై యున్నది). అందువలన అరణిని మథించి అగ్నిని గ్రహించు రీతిగా, నాకు అడ్డువచ్చిన శత్రుమూకల పీచమణచి, ఆ తరుణీమణిని తీసికొనివత్తును.
*శ్రీశుక ఉవాచ*
*53.4 (నాలుగవ శ్లోకము)*
*ఉద్వాహర్క్షం చ విజ్ఞాయ రుక్మిణ్యా మధుసూదనః|*
*రథః సంయుజ్యతామాశు దారుకేత్యాహ సారథిమ్॥10403॥*
*శ్రీశుకుడు వచించెను* పరీక్షిన్మహారాజా! రుక్మిణీ వివాహసుముహూర్తము ఎల్లుండి రాత్రియందని శ్రీకృష్ణుడు తెలిసికొనెను. వెంటనే ఆ స్వామి తన సారథియగు దారకునితో 'ఓయీ! శీఘ్రముగా రథమును సిద్ధమొనర్పుము' అని పలికెను.
*53.5 (ఐదవ శ్లోకము)*
*స చాశ్వైః శైబ్యసుగ్రీవమేఘపుష్పబలాహకైః|*
*యుక్తం రథముపానీయ తస్థౌ ప్రాంజలిరగ్రతః॥10404॥*
మఱుక్షణమే దారుకుడు, రథమునకు శైబ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకము అను గుర్రములను చక్కగా పూన్చి, దానిని తీసికొనివచ్చి, ప్రాంజలియై శ్రీకృష్ణుని యెదుట నిలబడెను.
*53.6 (ఆరవ శ్లోకము)*
*ఆరుహ్య స్యందనం శౌరిర్ద్విజమారోప్య తూర్ణగైః|*
*ఆనర్తాదేకరాత్రేణ విదర్భానగమద్ధయైః॥10405॥*
అంతట శ్రీకృష్ణుడు ముందుగా ఆ బ్రాహ్మణోత్తముని (అగ్నిద్యోతనుని) రథమునందు ఆసీనుని గావించెను. పిదప ఆ స్వామి రథమును అధిరోహించెను. రథాశ్వములు వేగముగా సాగిపోవుటవలన ఆ ప్రభువు ఒక్కరాత్రిలోపలనే ఆనర్తదేశమునుండి విదర్భభూములకు చేరెను.
*53.7 (ఏడవ శ్లోకము)*
*రాజా స కుండినపతిః పుత్రస్నేహవశం గతః|*
*శిశుపాలాయ స్వాం కన్యాం దాస్యన్ కర్మాణ్యకారయత్॥10406॥*
కుండిన నగరాధిపతియగు భీష్మకుడు పుత్రప్రేమకారణముగా తన పెద్దకుమారుడైన *రుక్మి* యొక్క మాటలను త్రోసిపుచ్చ జాలకుండెను. అందువలన ఆ మహారాజు రుక్మియొక్క నిర్ణయము ప్రకారము తన కుమార్తెయగు రుక్మిణిని శిశుపాలునకు ఇచ్చి పెండ్లి చేయుటకు ఏర్పాట్లు చేయించుచుండెను.
*53.8 (ఎనిమిదవ శ్లోకము)*
*పురం సమ్మృష్టసంసిక్తమార్గరథ్యాచతుష్పథమ్|*
*చిత్రధ్వజపతాకాభిస్తోరణైః సమలంకృతమ్॥10407॥*
*53.9 (తొమ్మిదవ శ్లోకము)*
*స్రగ్గంధమాల్యాభరణైర్విరజోఽమ్బరభూషితైః|*
*జుష్టం స్త్రీపురుషైః శ్రీమద్గృహైరగురుధూపితైః॥10408॥*
రాజాజ్ఞను అనుసరించి పౌరులు పురమునందలి వీధులయందును రాజమార్గములయందును, కూడలుల యందును చందనాది సుగంధములతో గూడిన కలయంపిని (కలాపిని) చల్లిరి. నగరమును చిత్రవిచిత్రములగు ధ్వజపతాకములతో, తోరణములతో అలంకరించిరి. ఆ పురమునందలి స్త్రీ, పురుషులు ఎల్లరును సంతోషముతో సమయోచితముగా పూలహారములను, సుగంధ మాల్యములను, అమూల్యములగు ఆభరణములను, శుభ్రమైన వస్త్రములను అలంకరించుకొనిరి. గృహములను అందముగా తీర్చిదిద్దిరి. వాటిని అగరు ధూపములతో గుబాళింపజేసిరి.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఏబది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
[22/03, 21:35] +91 95058 13235: *22.03.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది మూడవ అధ్యాయము*
*రుక్మిణీ హరణము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*53.10 (పదియవ శ్లోకము)*
*పితౄన్ దేవాన్ సమభ్యర్చ్య విప్రాంశ్చ విధివన్నృప|*
*భోజయిత్వా యథాన్యాయం వాచయామాస మంగళమ్॥10409॥*
రాజా! భీష్మకమహారాజు ఆశుభసందర్భమును పురస్కరించుకొని, దేవతలను, పితృదేవతలను విధ్యుక్తముగా పూజించెను. భూసురోత్తములను షడ్రసోపేతములగు భోజన పదార్థములతో సంతృప్తులను గావించెను. నియమానుసారము పుణ్యాహవచనాది మంగళకార్యములను జరిపించెను.
*53.11 (పదకొండవ శ్లోకము)*
*సుస్నాతాం సుదతీం కన్యాం కృతకౌతుకమంగళామ్|*
*అహతాంశుకయుగ్మేన భూషితాం భూషణోత్తమైః॥10410॥*
*53.12 (పండ్రెండవ శ్లోకము)*
*చక్రుః సామర్గ్యజుర్మంత్రైర్వధ్వా రక్షాం ద్విజోత్తమాః|*
*పురోహితోఽథర్వవిద్వై జుహావ గ్రహశాంతయే॥10411॥*
చక్కని పలువరుసగల కన్యకామణియగు రుక్మిణికి మంగళస్నానములను చేయించిరి. హస్తములకు ఉత్సాహముతో కంకణములను ధరింపజేసిరి. నూతన వస్త్రద్వయముతోడను, కాంతులు విరజిమ్ముచున్న భూషణములతోను అలంకరించిరి. ఋగ్యజుస్సామ వేదమంత్రములను పఠించుచు భూసురోత్తములు ఆమెకు రక్షాబంధనమును ఏర్పఱచిరి. అధర్వవేద పండితుడైన పురోహితుడు ప్రతికూలగ్రహశాంతికై హోమములను నిర్వహించెను.
*53.13 (పదమూడవ శ్లోకము)*
*హిరణ్యరూప్యవాసాంసి తిలాంశ్చ గుడమిశ్రితాన్|*
*ప్రాదాద్ధేనూశ్చ విప్రేభ్యో రాజా విధివిదాం వరః॥10412॥*
వేదశాస్త్రవిధులను బాగుగా ఎఱిగిన భీష్మకమహారాజు బ్రాహ్మణోత్తములకు వెండి, బంగారములను, నూతన వస్త్రములను, గుడమిశ్రితములైన నువ్వులను, పాడియావులను దానము చేసెను.
*53.14 (పదునాలుగవ శ్లోకము)*
*ఏవం చేదిపతీ రాజా దమఘోషః సుతాయ వై|*
*కారయామాస మంత్రజ్ఞైః సర్వమభ్యుదయోచితమ్॥10413॥*
చేది దేశాధిపతియైన దమఘోషుడును ఇదేవిధముగా తన కుమారుడగు శిశుపాలునకు అభ్యుదయార్థము మంత్రవిదులైన విప్రులచే వివాహసంబంధమైన సకల శుభకార్యములను జరిపించెను.
*53.15 (పదునైదవ శ్లోకము)*
*మదచ్యుద్భిర్గజానీకైః స్యందనైర్హేమమాలిభిః|*
*పత్త్యశ్వసంకులైః సైన్యైః పరీతః కుండినం యయౌ॥10414॥*
పిమ్మట అతడు మదజలములను స్రవించుచున్న గజబలములతోడను, బంగారు మాలలతో అలంకృతములైన రథములతోను, కాల్బలములతోడను, అశ్వదళములతోడను ఒప్పుచున్న తన సైన్యములను వెంటబెట్టుకొని కుండిన నగరమునకు చేరెను.
*53.16 (పదహారవ శ్లోకము)*
*తం వై విదర్భాధిపతిః సమభ్యేత్యాభిపూజ్య చ|*
*నివేశయామాస ముదా కల్పితాన్యనివేశనే॥10415॥*
అంతట విదర్భదేశాధిపతియగు భీష్మక మహారాజు దమఘోషాదులకు ఎదురేగి స్వాగతమర్యాదలను నెఱపి వారిని సముచితముగా పూజించెను. ముందుగా ఏర్పాటు చేయబడిన విడిది గృహములలో వారిని నిలిపెను
*53.17 (పదిహేడవ శ్లోకము)*
*తత్ర శాల్వో జరాసంధో దంతవక్త్రో విదూరథః|*
*ఆజగ్ముశ్చైద్యపక్షీయాః పౌండ్రకాద్యాః సహస్రశః॥10416॥*
ఆ సందర్భమున శిశుపాలునివెంట అతని పక్షమునకు చెందిన సాల్వుడు, జరాసంధుడు, దంతవక్త్రుడు, విదురథుడు, పౌండ్రకుడు మొదలగువారు వేల సంఖ్యలో విచ్చేసిరి.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఏబది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
[23/03, 05:06] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*853వ నామ మంత్రము* 23.03.2021
*ఓం శాంత్యతీతకళాత్మికాయై నమః*
ద్వైతభావములేనిది, జ్ఞానానందమును కలిగించునది అగు శాంత్యతీతకళా స్వరూపురాలైన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శాంత్యతీతకళాత్మికా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం శాంత్యతీత కళాత్మికాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు భౌతిక జీవనమునందు శాంతిసౌఖ్యములు, సకల శుభకరములు సంప్రాప్తమగును మరియు ఆధ్యాత్మికానందాను భూతితో పరమానందముకూడ సంప్రాప్తమగును.
*శాంత్యతీతకలా ద్వైతనిర్వాణానంద బోధదే* (సౌభాగ్య భాస్కరం, 960వ పుట) 'ద్వైతభావములేనిది, జ్ఞానానందమును కలిగించునది అగు అవస్థకు శాంత్యతీత కళ' యని శైవాగమనమునందు చెప్పబడినది. ఆకాశమునందున్న కళకు శాంత్యతీతకళయని పేరు. మూలాధారంలో జాగృతం చేయబడిన కుండలినీ శక్తి స్వరూపిణి అయిన జగన్మాత, బ్రహ్మ, విష్ణు, రుద్రగ్రంథుల ఛేదనముతో షట్చక్రముల నధిగమించి సహస్రారంచేరిన పిదప, సహస్రారంలో కనిపించిన కళయే శాంత్యాతీత కళ. అట్టి కళాస్వరూపురాలైన జగన్మాత *శాంత్యాతీత కళాత్మికా* యని అనబడినది. శాంత్యాతీతకళ కళలలో ఉత్తమమైనది. జ్ఞానమే స్వరూపమై విరాజిల్లునది. ఇదే ధృవకళ, సాదాఖ్యకళ, చిత్కళ, బ్రహ్మకళ, పరాకళ యని కూడా చెప్పబడుచున్నది. అట్టి పరమేశ్వరియే *శాంత్యాతీతకళాత్మికా* యని అనబడుతున్నది.
పరమేశ్వరికి నమస్కరించునపుడు ను *ఓం శాంత్యతీత కళాత్మికాయై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
[23/03, 05:06] +91 95058 13235: *23.03.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది మూడవ అధ్యాయము*
*రుక్మిణీ హరణము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*53.18 (పదునెనిమిదవ శ్లోకము)*
*కృష్ణరామద్విషో యత్తాః కన్యాం చైద్యాయ సాధితుమ్|*
*యద్యాగత్య హరేత్కృష్ణో రామాద్యైర్యదుభిర్వృతః॥10417॥*
*53.19 (పందొమ్మిదవ శ్లోకము)*
*యోత్స్యామః సంహతాస్తేన ఇతి నిశ్చితమానసాః|*
*ఆజగ్ముర్భూభుజః సర్వే సమగ్రబలవాహనాః॥10418॥*
సాల్వాదులు బలరామకృష్ణులయెడ వైరభావము కలిగియుండిరి. రుక్మిణీదేవి శిశుపాలునికే దక్కునట్లు చేయుటకై సిద్ధపడి వారు అచటికి వచ్చిరి. 'ఒక వేళ శ్రీకృష్ణుడు బలరామాదులతోగూడి వచ్చి రుక్మిణిని తీసికొనివెళ్ళుటకు ప్రయత్నించినచో, మనము అందరము అతనితో పోరాడుదము' అని కృతనిశ్చయులై ఆ సాల్వాదులు ఎల్లరును చతురంగబలములతో గూడి వచ్చియుండిరి.
*53.20 (ఇరువదియవ శ్లోకము)*
*శ్రుత్వైతద్భగవాన్ రామో విపక్షీయనృపోద్యమమ్|*
*కృష్ణం చైకం గతం హర్తుం కన్యాం కలహశంకితః॥10419॥*
*53.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*
*బలేన మహతా సార్ధం భ్రాతృస్నేహపరిప్లుతః|*
*త్వరితః కుండినం ప్రాగాద్గజాశ్వరథపత్తిభిః॥10420॥*
శ్రీకృష్ణునకు ప్రతికూలురైన శిశుపాలాదుల పన్నాగములను గూర్చి బలరామునకు తెలియవచ్చెను. రుక్మిణిని తీసికొనివచ్చుటకై శ్రీకృష్ణుడు ఒంటరిగా వెళ్ళినట్లు వినెను. వారితో శ్రీకృష్ణునకు నిశ్చయముగా పోరు జరుగునేమోయని శంకించెను. అంతట బలరాముడు తన సోదరునిపైగల ప్రేమకారణముగా ఆయనకు సహాయ పడుటకై చతురంగబలములను తీసికొని, శీఘ్రముగా కుండిన నగరమునకు బయలుదేరెను.
*53.22 (ఇరువది రెండవ శ్లోకము)*
*భీష్మకన్యా వరారోహా కాంక్షంత్యాగమనం హరేః|*
*ప్రత్యాపత్తిమపశ్యంతీ ద్విజస్యాచింతయత్తదా॥10421॥*
సౌందర్యరాశియైన రుక్మిణీదేవి శ్రీకృష్ణుని ఆగమనమునకై ఎదురుతెన్నులు చూచుచుండెను. తాను సందేశమిచ్చి పంపిన బ్రాహ్మణుడు ఇంకను తిరిగి రానందులకు శంకించుచు ఆమె ఆందోళనతో ఇట్లు తలపోసెను-
*53.23 (ఇరువది మూడవ శ్లోకము)*
*అహో త్రియామాంతరిత ఉద్వాహో మేఽల్పరాధసః|*
*నాగచ్ఛత్యరవిందాక్షో నాహం వేద్మ్యత్ర కారణమ్|*
*సోఽపి నావర్తతేఽద్యాపి మత్సందేశహరో ద్విజః॥10422॥*
అయ్యో! అల్పభాగ్యురాలనగు నా వివాహమునకు మూడుఝాములే, ఇక ఒక రాత్రియే మిగిలియున్నది. అరవిందలోచనుడైన కృష్ణప్రభువు ఇంకను ఇచటికి చేరలేదు. కారణమేమో తెలియరాకున్నది. నా సందేశమును తీసికొనివెళ్ళిన భూసురోత్తముడుగూడ ఇంతవరకు మరలిరాలేదు.
*53.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*
*అపి మయ్యనవద్యాత్మా దృష్ట్వా కించిజ్జుగుప్సితమ్|*
*మత్పాణిగ్రహణే నూనం నాయాతి హి కృతోద్యమః॥10423॥*
శ్రీకృష్ణుని స్వరూపము పరమశుద్ధమైనది. ఆయన ప్రయత్నపూర్వకముగా నన్ను చేపట్టుటకై ఇంతవరకు రాలేదుగదా! నిశ్చయముగా ఆయన నాలో ఏదో ఒక దోషమును చూచియుండవచ్చును.
*53.25 (ఇరువది ఐదవ శ్లోకము)*
*దుర్భగాయా న మే ధాతా నానుకూలో మహేశ్వరః|*
*దేవీ వా విముఖా గౌరీ రుద్రాణీ గిరిజా సతీ॥10424॥*
దురదృష్టవంతురాలనగు నా యెడ బ్రహ్మదేవుడును, పరమశివుడును అనుకూలురుగా లేనట్లున్నది. పర్వతపుత్రియు, శంకరుని పత్నియు, పరమసాధ్వియు ఐన గౌరీదేవియు ఇప్పుడు నాకు ప్రతికూలముగా నున్నట్లున్నది.
*మత్తేభ విక్రీడితము*
ఘను డా భూసురు డేగెనో? నడుమ మార్గశ్రాంతుఁడై చిక్కెనో?
విని కృష్ణుం డిది తప్పుగాఁ దలఁచెనో? విచ్చేసెనో? యీశ్వరుం
డనుకూలింపఁ దలంచునో తలఁపడో? యార్యామహాదేవియున్
నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో? నా భాగ్య మెట్లున్నదో?"
*తాత్పర్యము*
ఆ బ్రాహ్మణుడు అసలు వెళ్ళాడో లేదో? లేకపోతే దారిలో ఎక్కడైనా చిక్కుకు పోయాడేమో? నా సందేశం విని కృష్ణుడు తప్పుగా అనుకున్నాడేమో? పార్వతీదేవి నన్ను కాపాడలనుకుందో లేదో? నా అదృష్టమెలా ఉందో?”
అంటు ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్రాహ్మణుని పంపిన రుక్మిణీదేవి, డోలాయమాన స్థితి పొందుతోంది. ఆ స్థితికి తగ్గ ఈ పద్యం చెప్పిన మన పోతన్నకి ప్రణామములు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఏబది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
[23/03, 05:06] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*278వ నామ మంత్రము* 23.03.2021.
*ఓం పద్మాసనాయై నమః*
బ్రహ్మస్వరూపిణియై, పద్మాసనమందు భాసిల్లు జగదీశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పద్మాసనా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం పద్మాసనాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు సాధకులకు జ్ఞానసంపద అను ఐశ్వర్యమును వారి పుణ్యానుసారముగా ప్రసాదిస్తూ, ఎనలేని బ్రహ్మానందానుభూతిని కలుగజేయును.
బ్రహ్మదేవుని పీఠము పద్మము. పరమేశ్వరి బ్రహ్మస్వరూపురాలు గనుక *పద్మాసనా* యని అనబడినది. అటువంటి బ్రహ్మాసనమునకు ప్రకృతియే రేకులు. పదునారు వికారములు ఆ పద్మములోని కేసరములు. ఆ పద్మమునకు జ్ఞానమే కాడ. అటు వంటి పద్మాసనమందు పరమేశ్వరి కూర్చున్నది గనుక జ్ఞాన *పద్మాసనా* యని అనబడినది. ఇంకను తమ పూర్వజన్మల కర్మల ఫలితముగా, సత్కర్మల పుణ్యానుసారము ఐశ్వర్యములను సాధకులకు ప్రసాదించునది గనుక జగన్మాత *పద్మాసనా* యని అనబడినది. *ఓ తల్లీ! నీవు ఎవనియందు అనుగ్రహమును చూపించుచున్నావో, అతడు సౌభాగ్యమును పొందు చున్నాడు. వాని గృహము శ్రేష్ఠములగు సుఖభోగములకు నివాసమగును. అనేక చిత్రాతి చిత్రమైన లక్ష్మీకరములు నిండినదైయుండును. అత్యధికమైన, సత్యమైన బంగారము నిండినదై యుండును. అతడు కూర్చున్నచొటునుండియే సుఖములనుభవించుచూ, దుఃఖములు దరిజేరని స్థితియందుండువాడగును* అని జగన్మాత కీర్తింపబడినది. ఇది అంతయు పరమేశ్వరి కరుణాసముద్రయై విరాజిల్లినపుడు మాత్రమే. పరమేశ్వరికి ఆగ్రహము వచ్చినచో (సాధారణంగా రాదు), *ఎవనియందు కోపగించియుండునో, వాడు అసౌభాగ్యమును పొందుచుండును. వాని గృహము దుఃఖనిలయమై ఉండును. ఏ విధమైన ఆనంధభరితమైన విచిత్రములూ ఉండవు. వాని గృహము ఎల్లప్పుడూ దుఃఖసంబంధిత వికారధ్వనిభరితమై యుండును. చివరకు భార్యతో అన్యోన్య క్షణములుగూడ యుద్ధతుల్యములై యుండును* అని కూడ చెప్పబడెను.
షట్చక్రములు వివిధ దళములు గలిగిన పద్మములుకాగా, ఆయా పద్మములందు జగన్మాత ఉంటూ ఉంటుంది గనుక, *పద్మాసనా* యని అనబడినది. *పద్మ* యను శబ్దమునకు తామరపూల సముహము అని రభస నిఘంటువులో చెప్పబడినది. ఈ తామరపూల సమూహము పరమేశ్వరికి గల నవనిధులలో ఒక నిధియని చెప్పబడినది. పద్మ అనగా బిందువు. శ్రీచక్రంలోని బిందువు. బిందువునందు పరమేశ్వరి ఉంటుంది గనుక *పద్మాసనా* యని అనబడినది.
అటు వంటి తల్లికి నమస్కరించునపుడు *ఓం పద్మాసనాయై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[23/03, 21:05] +91 95058 13235: *23.03.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది మూడవ అధ్యాయము*
*రుక్మిణీ హరణము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*53.26 (ఇరువది ఆరవ శ్లోకము)*
*ఏవం చింతయతీ బాలా గోవిందహృతమానసా|*
*న్యమీలయత కాలజ్ఞా నేత్రే చాశ్రుకలాకులే॥10425॥*
శ్రీకృష్ణునకే తన మనస్సును అర్పించియున్న కన్యకామణియగు రుక్మిణి ఇట్లు చింతించుచుండెను. 'ఆ ప్రభువు విచ్చేయుటకు ఇంకనూ సమయమున్నది' అని ఆశావహయై యుండెను. కాని ఆమె వ్యాకులతతో అశ్రువులను రాల్చుచు కనులు మూసికొనెను.
*53.27 (ఇరువది ఏడవ శ్లోకము)*
*ఏవం వధ్వాః ప్రతీక్షంత్యా గోవిందాగమనం నృప|*
*వామ ఊరుర్భుజో నేత్రమస్ఫురన్ ప్రియభాషిణః॥10426॥*
మహారాజా! శ్రీకృష్ణుని శూభాగమనవార్తను తీసికొనివచ్చెడు ద్విజుని (అగ్నిద్యోతుని) కొరకై ఇట్లు రుక్మిణి ఎదురు చూచుచుండెను. అప్పుఢు శుభసూచకములుగా ఆమెయొక్క ఎడమ తొడ, భుజము, నేత్రము అదరెను.
*53.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*
*అథ కృష్ణవినిర్దిష్టః స ఏవ ద్విజసత్తమః|*
*అంతఃపురచరీం దేవీం రాజపుత్రీం దదర్శ హ॥10427॥*
రుక్మిణి సందేశమును కృష్ణునికడకు తీసుకొనివెళ్ళిన ఆ భూసురోత్తముడే (అగ్నిద్యోతనుడే) ఆ ప్రభువుయొక్కఆదేశముతో కుండినపురమునకు తిరికివచ్చెను. వెంటనే అతడు అంతఃపురములోపల నున్న రుక్మిణీదేవిని దర్శించెను.
*53.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*
*సా తం ప్రహృష్టవదనమవ్యగ్రాత్మగతిం సతీ|*
*ఆలక్ష్య లక్షణాభిజ్ఞా సమపృచ్ఛచ్ఛుచిస్మితా॥10428॥*
ప్రశాంతచిత్తముతో ప్రహృష్టవదనుడై తనకడకు వచ్చిన అగ్నిద్యోతనుని ఆమె చూచెను. ఆయన ముఖలక్షణములను బట్టి కార్యము సఫలమైనట్లుగా గుర్తించిన ఆ సాధ్వి (రుక్మిణి) చిఱునవ్వు చిందించుచు కార్యసాఫల్యమును గూర్చి ఆ విప్రోత్తముని అడిగెను.
*53.30 (ముప్పదియవ శ్లోకము)*
*తస్యా ఆవేదయత్ప్రాప్తం శశంస యదునందనమ్|*
*ఉక్తం చ సత్యవచనమాత్మోపనయనం ప్రతి॥10429॥*
ఇట్లు తనను అడిగిన రుక్మిణీదేవితో - 'అమ్మా! కృష్ణపరమాత్మ వచ్చియున్నాడు. ఆ స్వామి నిన్ను తీసికొనివెళ్ళి వివాహము చేసికొనుటకు ప్రతిజ్ఞ చేసియున్నాడు' అని ఆ బ్రాహ్మణుడు వివరించెను.
*53.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*
*తమాగతం సమాజ్ఞాయ వైదర్భీ హృష్టమానసా|*
*న పశ్యంతీ బ్రాహ్మణాయ ప్రియమన్యన్ననామ సా॥10430॥*
'కృష్ణభగవానుడు విచ్చేసినాడు' అను మాటను అగ్నిద్యోతనుని నోట విన్నంతనే రుక్మిణీదేవి హృదయము సంతోషముతో పొంగిపోయెను. వెంటనే ఆమె- 'స్వామీ! నీవు చేసిన మహోపకారమునకు తగిన ప్రత్యుపకారమును చేయనేరను. కావున, చేతులు జోడించి, నీ పాదముల చెంత ప్రణమిల్లుచున్నాను' అని పలికి ఆ బ్రాహ్మణోత్తమునకు సాష్టాంగ నమస్కారమొనర్చెను.
*53.32 (ముప్పది రెండవ శ్లోకము)*
*ప్రాప్తౌ శ్రుత్వా స్వదుహితురుద్వాహప్రేక్షణోత్సుకౌ|*
*అభ్యయాత్తూర్యఘోషేణ రామకృష్ణౌ సమర్హణైః॥10431॥*
*53.33 (ముప్పది మూడవ శ్లోకము)*
*మధుపర్కముపానీయ వాసాంసి విరజాంసి సః|*
*ఉపాయనాన్యభీష్టాని విధివత్సమపూజయత్॥10432॥*
తన కుమార్తె వివాహమహోత్సవమును చూచు వేడుకతో బలరామకృష్ణులు కుండిన నగరమునకు ఏతెంచిన వార్తను విన్నంతనే భీష్మకమహారాజు సముచితమగు పూజాద్రవ్యములను గైకొని, తూర్యాది వాద్య ఘోషలతో, మేళతాళములతో ఎదురేగి వారికి స్వాగత మర్యాదలను నెఱపెను. అనంతరము ఆ మహారాజు ఆ మహాత్ములకు మధుపర్కములను (పెరుగు, తేనె కలిపిన మంగళద్రవ్యములు), అమూల్యములైన నూతన వస్త్రములను సమర్పించెను, ఇంకను వారికి సంతోషమును గూర్చెడి కానుకలను అర్పించి, విధ్యుక్తముగా పూజించెను.

[24/03, 04:56] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
[24/03, 04:56] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*279వ నామ మంత్రము* 24.03.2021
*ఓం భగవత్యై నమః*
సర్వోత్కృష్టమైన గుణములు కలిగి, సకల భూతములచే సేవించబడు తల్లికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భగవతీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం భగవత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను సేవించు భక్తులు సద్గుణసంపన్నులై, ఉన్నంతలోనే సంతోషభరితులై, సదా పరమానందస్వరూపులుగా జీవించి తరింతురు.
సంపూర్ణమగు ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, శ్రీ, జ్ఞానము, విజ్ఞానము అను ఈ ఆరింటిని భగమని కాళికాపురాణమునందు తెలియజేయబడినది. భగ శబ్దమునకు నిఘంటువులో ఐశ్వర్యము, మహాత్మ్యము, జ్ఞానము, వైరాగ్యము, యోని, యశస్సు, వీర్యము, ప్రయత్నము, ఇచ్ఛ, ధర్మము, రవి, ముక్తి యను అర్థములు గలవు. ఇన్ని అర్థములు గలిగినది భగవతి యగును అని కూడా చెప్పబడినది. దేవీభాగవతమందు ఉత్పత్తి, ప్రళయము, భూతముల రాకపోకలు, అజ్ఞానతత్త్వము, విద్యాతత్త్వమును తెలియుటచే పరమేశ్వరి *భగవతీ* యని అనబడినది. దేవతలందరు పూజింపబడిన ఈ తల్లిని లోకము పూజించుటచే *భగవతీ* యని అనబడినదని శక్తిరహస్యమందు చెప్పబడినది.
పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం భగవత్యై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[24/03, 04:56] +91 95058 13235: *24.03.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది మూడవ అధ్యాయము*
*రుక్మిణీ హరణము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*53.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*
*తయోర్నివేశనం శ్రీమదుపాకల్ప్య మహామతిః|*
*ససైన్యయోః సానుగయోరాతిథ్యం విదధే యథా॥10433॥*
పిదప బాగుగా లోకమర్యాదలను ఎఱిగిన ఆ విదర్భాధిపతి బలరామకృష్ణుల స్థాయికి తగినట్లుగా విడిదిగృహములను ఏర్పాటు చేసెను. అవి సకల భోగ్యభోగోపకరణములతో సుసంపన్నములై యుండెను. అట్లే వారి సైన్యములకును, అనుచరులకును అతిథి మర్యాదలను గావించెను.?
*53.35 (ముప్పది ఐదవ శ్లోకము)*
*ఏవం రాజ్ఞాం సమేతానాం యథావీర్యం యథావయః|*
*యథాబలం యథావిత్తం సర్వైః కామైః సమర్హయత్॥10434॥*
ఇట్లే ఆ మహారాజు తన ఆహ్వానముపై విచ్చేసిన రాజులందఱికిని వారి వారి బలపరాక్రమములకును, వయోవైభవములకును, సిరిసంపదలకును అనువగునట్లుగా, వారి అభిరుచులను అనుసరించి సకల మర్యాదలను జరిపెను.
*53.36 (ముప్పది ఆరవ శ్లోకము)*
*కృష్ణమాగతమాకర్ణ్య విదర్భపురవాసినః|*
*ఆగత్య నేత్రాంజలిభిః పపుస్తన్ముఖపంకజమ్॥10435॥*
అనంతరము కుండిన నగరమునందలి పౌరులు, శ్రీకృష్ణుని ఆగమనవార్తను విని, సంబరపడుచు ఆ స్వామి విడిది చేసిన భవనమునకు విచ్చేసిరి. వారు ఆ ప్రభువుయొక్క ముఖారవింద మకరందమును తమ కన్నులనెడి దోసిళ్ళతో జుర్రుకొని, పరమానందమును పొందిరి. వారు ఆనందభాష్పములను రాల్చుచు కనులార ఆ స్వామిని దర్శించిరి.
*53.37 (ముప్పది ఏడవ శ్లోకము)*
*అస్యైవ భార్యా భవితుం రుక్మిణ్యర్హతి నాపరా|*
*అసావప్యనవద్యాత్మా భైష్మ్యాః సముచితః పతిః॥10436॥*
తదుపరి వారు (పౌరులు) ఇట్లు అనుకొనిరి. 'ఈ చక్రధారికి అన్నివిధములుగా మన రుక్మిణియే తగిన వధువు. సుమకోమలాంగియైన మన రుక్మిణకి సర్వాంగసుందరుడైన ఈ కృష్ణడే ఈడైనవాడు.
*వివాహశ్చ వివాదశ్చ సమయోరేవ శోభతే|*
అనువైన దాంపత్యమునకు *ఈడు-జోడు* ఎంతయు ముఖ్యము. (నీతిశాస్త్రము)
*53.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*
*కించిత్సుచరితం యన్నస్తేన తుష్టస్త్రిలోకకృత్|*
*అనుగృహ్ణాతు గృహ్ణాతు వైదర్భ్యాః పాణిమచ్యుతః॥10437॥*
త్రిలోక సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు ఈ రుక్మిణీ కృష్ణులకు దాంపత్యమును గూర్చుగాక! ఆ జంటను జూచి ఆనందించుభాగ్యము అబ్బుట మనము చేసికొనిన పుణ్యఫలము. స్వల్పముగానైనను మనము ఏదైన సుకృతము చేసికొనియున్నచో, ఆ సృష్టికర్త సంతోషముతో మనకు ఆ అదృష్టమును ప్రసాదించుగాక! ఈ రుక్మిణీకృష్ణుల దాంపత్యమును జూచి లోకమే మురిసిపోవును. వీరు దంపతులగుట మహాభాగ్యఫలము. వీరిమధ్య ప్రణయమును గూర్చిన బ్రహ్మను మెచ్చుకొనవలయును.
*53.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*
*ఏవం ప్రేమకలాబద్ధా వదంతి స్మ పురౌకసః|*
*కన్యా చాంతఃపురాత్ప్రాగాద్భటైర్గుప్తాంబికాలయమ్॥10438॥*
*53.40 (నలుబదియవ శ్లోకము)*
*పద్భ్యాం వినిర్యయౌ ద్రష్టుం భవాన్యాః పాదపల్లవమ్|*
*సా చానుధ్యాయతీ సమ్యఙ్ముకుందచరణాంబుజమ్॥10439॥*
పౌరులు ఎల్లరును రుక్మిణీకృష్ణుల ప్రణయానురాగములకు మురిసిపోవుచు తమలోతాము ఇట్లు అనుకొనుచుండిరి. ఇంతలో పెండ్లికూతురైన రుక్మిణి గౌరీదేవిని అర్చించుటకై భటుల రక్షణలో తన అంతఃపురమునుండి దుర్గాదేవి మందిరమునకు బయలుదేరెను. ఆమె భవానీపాద పల్లవములను దర్శించుటకై ప్రసన్నమైన శ్రీకృష్ణుని ముఖారవిందమును ధ్యానించుచు కాలినడకతో దేవి ఆలయమునకు సాగిపోవుచుండెను.
*53.41 (నలుబది ఒకటవ శ్లోకము)*
*యతవాఙ్మాతృభిః సార్ధం సఖీభిః పరివారితా|*
*గుప్తా రాజభటైః శూరైః సన్నద్ధైరుద్యతాయుధైః|*
*మృదంగశంఖపణవాస్తూర్యభేర్యశ్చ జఘ్నిరే॥10440॥*
రాజమాతలు, సఖీమణులు చుట్టును చేరియుండగా ఆమె మౌనముగా ముందడుగు వేయుచుండెను. శూరులైన రాజభటులు వివిధ ఆయుధములతో సర్వసన్నద్ధులై ఆమెను రక్షించుచుండిరి. మృదంగములు, శంఖములు, పణవములు (తప్పెటలు) తూర్యములు, ఢంకాలు ఆ మహోత్సవమును పురస్కరించుకొని మ్రోగుచుండెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఏబది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
[24/03, 21:49] +91 95058 13235: *24.03.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది మూడవ అధ్యాయము*
*రుక్మిణీ హరణము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*53.42 (నలుబది రెండవ శ్లోకము)*
*నానోపహారబలిభిర్వారముఖ్యాః సహస్రశః|*
*స్రగ్గంధవస్త్రాభరణైర్ద్విజపత్న్యః స్వలంకృతాః॥10441॥*
ద్విజపత్నులు (బ్రాహ్మణ ముత్తైదువలు) సుగంధచందనాది ద్రవ్యములను అలదుకొని, పూలహారములను, నూతన వస్త్రములను, సువర్ణాభరణములను చక్కగా అలంకరించుకొని ఆమె వెంట నడచుచుండిరి. వారాంగనలు నానావిధములగు నైవేద్యములను, పూజాద్రవ్యములను గైకొని వేలసంఖ్యలో వారిని అనుసరించుచుండిరి.
*53.43 (నలుబది మూడవ శ్లోకము)*
*గాయంతశ్చ స్తువంతశ్చ గాయకా వాద్యవాదకాః|*
*పరివార్య వధూం జగ్ముః సూతమాగధవందినః॥10442॥*
ఆ వధువును అనుసరించి వచ్చుచున్న గాయకులు మంగళగీతములను ఆలపించు చుండిరి. వాద్యకారులు వాద్యములను మ్రోగించుచుండిరి. సూతులు, వందిమాగధులు స్తోత్రపాఠములను కావించుచుండిరి.
*53.43 (నలుబది నాలుగవ శ్లోకము)*
*ఆసాద్య దేవీసదనం ధౌతపాదకరాంబుజా|*
*ఉపస్పృశ్య శుచిః శాంతా ప్రవివేశాంబికాంతికమ్॥10443॥*
ఆలయమునకు చేరినంతనే ఆ నవవధువు కమలములవలె కోమలములైన తన పాదములను, కరములను ప్రక్షాళన చేసికొనెను. పవిత్రాచమనమొనర్చి, శుచియై ప్రశాంతముగా గౌరీసన్నిధికి చేరెను (గౌరీపూజామందిరమున ప్రవేశించెను).
*53.45 (నలుబది ఐదవ శ్లోకము)*
*తాం వై ప్రవయసో బాలాం విధిజ్ఞా విప్రయోషితః|*
*భవానీం వందయాంచక్రుర్భవపత్నీం భవాన్వితామ్॥10444॥*
అంతట పూజావిధి విధానములను బాగుగా ఎరిగిన వయసు మళ్ళిన బ్రాహ్మణ ముత్తైదువలు పరమేశ్వరునితో గూడియున్న గౌరీదేవికి ఆ వధువుచే (రుక్మిణిచే) వందనమాచరింపజేసిరి.
*53.46 (నలుబది ఆరవ శ్లోకము)*
*నమస్యే త్వాంబికేఽభీక్ష్ణం స్వసంతానయుతాం శివామ్|*
*భూయాత్పతిర్మే భగవాన్ కృష్ణస్తదనుమోదతామ్॥10445॥*
అనంతరము రుక్మిణి గౌరీదేవికి నమస్కరించుచు ఇట్లు ప్రార్థించెను- "అంబికాదేవీ! గణపతిని, కుమారస్వామిని ఉత్సంగమున జేర్చుకొని, పరమేశ్వరునితో గూడియున్న నీకు పదే పదే ప్రణమిల్లుచున్నాను. అమ్మా! శ్రీకృష్ణభగవానుడు నాకు పతియగునట్లు నన్ను అనుగ్రహింపుము".
*53.47 (నలుబది ఏడవ శ్లోకము)*
*అద్భిర్గంధాక్షతైర్ధూపైర్వాసఃస్రఙ్మాల్యభూషణైః|*
*నానోపహారబలిభిః ప్రదీపావలిభిః పృథక్॥10446॥*
*53.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*
*విప్రస్త్రియః పతిమతీస్తథా తైః సమపూజయత్|*
*లవణాపూపతాంబూలకంఠసూత్రఫలేక్షుభిః॥10447॥*
పిదప ఆ కన్యకామణి దుర్గాదేవికి పవిత్ర జలములను, సుగంధములను, అక్షతలను, దివ్యవస్త్రములను, పూలమాలలను, అమూల్యములగు ఆభరణములను సమర్పించెను. ఇంకను ధూపదీపములతోను, వివిధములగు నైవేద్యములతోను ఆ దేవికి సేవలొనర్చెను. పిమ్మట ఆ నవవధువు ముత్తైదువలైన విప్రవనితలను పూజాద్రవ్యములతో అర్చించి, వారికి లవణము, అపూపములు, దక్షిణ తాంబూలములు, కంఠహారములు, ఫలములు, ఇక్షఖండములు మొదలగు వాటిని సమర్పించెను.
*53.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*
*తస్యై స్త్రియస్తాః ప్రదదుః శేషాం యుయుజురాశిషః|*
*తాభ్యో దేవ్యై నమశ్చక్రే శేషాం చ జగృహే వధూః॥10448॥*
తదుపరి ఆ భూసుర వనితలు రుక్మిణికి దేవీ ప్రసాదములను ఇచ్చి, ఆమెకు శుభాశీస్సులను పలికిరి. అంతట ఆ రాకుమారి గౌరీదేవికిని, ముత్తైదువలకును ప్రణమిల్లి దైవప్రసాదములను స్వీకరించెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఏబది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
] +91 95058 13235: *25.03.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది మూడవ అధ్యాయము*
*రుక్మిణీ హరణము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*53.50 (ఏబదియవ శ్లోకము)*
*మునివ్రతమథ త్యక్త్వా నిశ్చక్రామాంబికాగృహాత్|*
*ప్రగృహ్య పాణినా భృత్యాం రత్నముద్రోపశోభినా॥10449॥*
పూజావిధులను ముగించుకొనిన పిదప ఆ వధువు మౌనవ్రతమును వీడెను. అంతట ఆమె రత్నపుటుంగరములతో శోభిల్లుచున్న తన చేతితో చెలికత్తె చేతిని పట్టుకొని గౌరీదేవి మందిరమునుండి బయటకు వచ్చెను.
*53.51 (ఏబది ఒకటవ శ్లోకము)*
*తాం దేవమాయామివ వీరమోహినీం సుమధ్యమాం కుండలమండితాననామ్|*
*శ్యామాం నితంబార్పితరత్నమేఖలాం వ్యంజత్స్తనీం కుంతలశంకితేక్షణామ్॥10450॥*
*53.52 (ఏబది రెండవ శ్లోకము)*
*శుచిస్మితాం బింబఫలాధరద్యుతి శోణాయమానద్విజకుందకుడ్మలామ్|*
*పదా చలంతీం కలహంసగామినీం శింజత్కలానూపురధామశోభినా||*
*విలోక్య వీరా ముముహుః సమాగతా యశస్వినస్తత్కృతహృచ్ఛయార్దితాః॥10451॥*
రాజా! అప్పుడు బాలామణియగు రుక్మిణి తన లావణ్యశోభలచే దేవమాయవలె ధీరులైన వీరులను సైతము మోహమున ముంచివేయుచుండెను. సన్నని నడుముగల ఆ బాలయొక్క ముఖము తళుకులీనుచున్న మణికుండలములతో మనోహరముగా ఉండెను. ఆ ముద్దరాలి నితంబములపై రత్నఖచితమైన కటిసూత్రము (మేఖల) మిలమిలమెఱయుచుండెను. ఆమె వక్షస్థలశోభలు యౌవనప్రాదుర్భావదశను ప్రకటించుచుండెను. ముఖమున వ్రేలాడుచున్న అందాలముంగురుల కారణమున ఆమె చూపులు చంచలములై ఒప్పుచుండెను. చిఱునవ్వుల సింగారములు ఆహ్లాదకరములై అలరారుచుండెను. దొండపండువలె విలసిల్లుచున్న ఎర్రని అధరకాంతుల ప్రభావమున ఆమె పలువరుసలు మల్లెమొగ్గలను తలపింపజేయుచుండెను. ఆమె నడకల సోయగములు కలహంస గమనములను స్ఫురింపజేయుచుండెను. కాలియందెల గలగలలు ఆమె పాదపల్లవములకు ప్రత్యేక వైభవములను సంతరింపజేయుచుండెను. ఆ ఒప్పులకుప్పను చూచినంతనే అచటికి వచ్చియున్న పేరుమోసిన వీరుల హృదయములు కామవికారములకు లోనయ్యెను. ఫలితముగా వారెల్లరును మోహమున మునింగిరి.
*53.53 (ఏబది మూడవ శ్లోకము)*
*యాం వీక్ష్య తే నృపతయస్తదుదారహాసవ్రీడావలోకహృతచేతస ఉజ్ఝితాస్త్రాః|*
*పేతుః క్షితౌ గజరథాశ్వగతా విమూఢా యాత్రాచ్ఛలేన హరయేఽర్పయతీం స్వశోభామ్॥10452॥*
రుక్మిణి తన సౌందర్య సర్వస్వమును శ్రీకృష్ణునకు అర్పించియుండెను. గౌరీయాత్రా నెపముతో వచ్చిన ఆ కన్యక పూజామందిరమునుండి వెలువడి మెల్లమెల్లగా నడచుచుండెను. ఒప్పిదమై మనోజ్ఞముగానున్న ఆమె దరహాసకాంతులను, నునుసిగ్గుల పరంపరను దర్శించినంతనే అచటి రాకుమారుల హృదయములు పరవశించిపోయెను. ఆ పారవశ్యములో వారి చేతులలోని అస్త్రములన్నియును జాఱి నేలపై బడెను. అంతేగాక రథగజాశ్వములను అధిరోహించియున్న ఆ వీరులు ఎల్లరును మూర్ఛితులై క్రిందపడిపోయిరి.
*53.52 (ఏబది నాలుగవ శ్లోకము)*
*సైవం శనైశ్చలయతీ చలపద్మకోశౌ ప్రాప్తిం తదా భగవతః ప్రసమీక్షమాణా|*
*ఉత్సార్య వామకరజైరలకానపాంగైః ప్రాప్తాన్ హ్రియైక్షత నృపాన్ దదృశేఽచ్యుతం సా॥10453॥*
ఇట్లు ఆ రుక్మిణి శ్రీకృష్ణునియొక్క శుభాగమనమునకు ఎదురుచూచుచు, పద్మకోశములవలె మృదువైన తన పాదములతో మెల్లమెల్లగా నడచుచుండెను. అప్పుడు ఆమె తన ఎడమచేతి వ్రేళ్ళతో ముంగురులను సవరించుకొని, అచటికి చేరియున్న రాజులను బిడియపడుచు క్రీగంటి చూపులతో కాంచెను. ఇంతలో ఆ బాలారత్నమునకు శ్రీకృష్ణుని దర్శనమయ్యెను.
*53.55 (ఏబది ఐదవ శ్లోకము)*
*తాం రాజకన్యాం రథమారురుక్షతీం జహార కృష్ణో ద్విషతాం సమీక్షతామ్|*
*రథం సమారోప్య సుపర్ణలక్షణం రాజన్యచక్రం పరిభూయ మాధవః॥10454॥*
*53.56 (ఏబది ఆరవ శ్లోకము)*
*తతో యయౌ రామపురోగమైః శనైః|*
*శృగాలమధ్యాదివ భాగహృద్ధరిః॥10455॥*
అంతట ఆ రాకుమారి రథమును ఎక్కుటకు సుముఖముగా నుండుట శ్రీకృష్ణుడు గమనించెను. వెంటనే ఆ ప్రభువు తనయెడ శత్రుభావము వహించియున్న శిశుపాలాది రాజులు అందఱును చూచుచుండగా ఆమెకు చేయూతనిచ్చి, గరుడధ్వజముగల తన రథము మీదికి చేర్చుకొనెను. పిదప సింహము తన ఆహారముతో నక్కల గుంపులను చీల్చుకొని పోవునట్లు శ్రీకృష్ణుడు అచటి రాజులను అందరిని తృణీకరించుచు, బలరామాది యదువీరులతోగూడి తిన్నగా ముందునకు సాగెను.
*53.57 (ఏబది ఏడవ శ్లోకము)*
*తం మానినః స్వాభిభవం యశఃక్షయం పరే జరాసంధముఖా న సేహిరే|*
*అహో ధిగస్మాన్యశ ఆత్తధన్వనాం గోపైర్హృతం కేసరిణాం మృగైరివ॥10456॥*
అప్పుడు దురహంకారులు, వీరులు ఐన జరాసంధాది రాజులు తమకు అపకీర్తికరమైన ఆ పరాభవమునకు తట్టుకొనలేకపోయిరి. పిదప వారు 'ధనుర్ధారులమైన మన పరాక్రమములు కాల్పనా? మన ముందఱనే సింహముల ఆహారమును మృగముల (తోడేళ్ళ) వలె ఈ గోపాలురు మనము ఆశించిన కన్యను ఎత్తుకొనిపోయిరి' అని ఆక్రోశముతో అనుకొనసాగిరి.
*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే రుక్మిణీహరణం నామ త్రిపంచాశత్తమోఽధ్యాయః (53)*
ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, ఉత్తరార్ధమునందలి *రుక్మిణీ హరణము* యను ఏబది మూడవ అధ్యాయము (53)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
[25/03, 05:14] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*280వ నామ మంత్రము* 25.03.2021
*ఓం పద్మనాభ సహోదర్యై నమః*
పద్మనాభుడైన నారాయణుని సోదరియై, నారాయణిగా తేజరిల్లు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పద్మనాభ సహోదరీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం పద్మనాభ సహోదర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ధ్యానించు భక్తులకు ఎనలేని ఆధ్యాత్మిక సంపదలు, అనంతమైన బ్రహ్మజ్ఞాన తత్త్వము సంప్రాప్తమగును. భౌతిక జీవనమునందు శాంతిసౌఖ్యములు ఆ తల్లి కరుణచే సంప్రాప్తమగును.
పద్మము నాభియందుగలవాడు శ్రీమహావిష్ణువు. ఈయనే నారాయణుడు. అటువంటి నారాయణునికి సోదరియై తేజరిల్లు పరమేశ్వరి *పద్మనాభసహోదరీ* యని అనబడినది. విష్ణుమూర్తికి తోబుట్టువగు పరమాత్మయే (శ్రీమాతయే) దుర్మార్గులైన రాక్షసులను సంహరించుటలో తన చేతివ్రేళ్ళ గోళ్ళసందులనుండి నారాయణుని దశావతారములు ఉద్భవింపజేసినది *(కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః)*: పరమాత్మ అయిన శ్రీమాతయే ధర్మము, ధర్మియని రెండురూపములను పొందియున్నది. ధర్మి స్త్రీరూపము. ధర్మము పురుషుడైన విష్ణుతత్త్వము సకల జగత్తులను ఉత్పాదించుటకు పొందెను. స్త్రీ స్వరూపము పరమశివుని భార్య అయ్యెను. ఏ సుభద్రాదేవి పూర్వజన్మమందు హిమవంతునకు మేనాదేవికి పుత్రియై పార్వతియను పేర జన్మించినదో, ఆమెయే ఈ జన్మమందు దేవకీదేవి గర్భమునందు కృష్ణుని తోబుట్టువుగా పుట్టినది అని బ్రహ్మపురాణమునందు పురుషోత్తమక్షేత్రమహాత్మ్యమునందు చెప్పబడినది. ఆ విధముగా పరమేశ్వరి *పద్మనాభసహోదరీ* యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం పద్మనాభసహోదర్యై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[25/03, 21:23] +91 95058 13235: *25.03.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది నాలుగవ అధ్యాయము*
*శ్రీకృష్ణుడు శిశుపాల, జరాసంధాదులను, రుక్మిని ఓడించుట - రుక్మిణీదేవిని పరిణయమాడుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*శ్రీశుక ఉవాచ*
*54.1 (ప్రథమ శ్లోకము)*
*ఇతి సర్వే సుసంరబ్ధా వాహానారుహ్య దంశితాః|*
*స్వైః స్వైర్బలైః పరిక్రాంతా అన్వీయుర్ధృతకార్ముకాః॥10457॥*
*శ్రీశుకుడు పలికెను* శిశుపాల పక్షమునకు చెందిన జరాసంధాది రాజులందరును ఇట్లు పలికిన పిమ్మట వారు మిగుల క్రుద్ధులై కవచములను ధరించి, తమ తమ (అశ్వాది) వాహనములను ఎక్కిరి. పిదప వారు ధనుర్బాణాది ఆయుధమలతో సన్నద్ధులై, తమ సైన్యములతోగూడి యాదవవీరులను వెంబడించిరి.
*54.2 (రెండవ శ్లోకము)*
*తానాపతత ఆలోక్య యాదవానీకయూథపాః|*
*తస్థుస్తత్సమ్ముఖా రాజన్ విస్ఫూర్జ్య స్వధనూంషి తే10458॥*
పరీక్షిన్మహారాజా! యాదవపక్షమునందలి సేనాధిపతులు తమను వెంటాడి వచ్చుచున్న శత్రుసైన్యములను చూచిరి. అంతట వారు ధనుష్టంకారములను గావించుచు శత్రుసేనలకు ఎదురుగా (ఎదిరించి) నిలబడిరి.
*54.3 (మూడవ శ్లోకము)*
*అశ్వపృష్ఠే గజస్కంధే రథోపస్థే చ కోవిదాః|*
*ముముచుః శరవర్షాణి మేఘా అద్రిష్వపో యథా॥10459॥*
అశ్వములపై, గజములపై, రథములయందు చేరియున్న జరాసంధాది సైనికులు ఎంతయు యుద్ధకుశరులు. మేఘములు పర్వతములపై జడివానలు కురిపించినట్లుగా వారు యాదవయోధులపై శరపరంపరను వర్షింపజేసిరి.
*54.4 (నాలుగవ శ్లోకము)*
*పత్యుర్బలం శరాసారైశ్ఛన్నం వీక్ష్య సుమధ్యమా|*
*సవ్రీడమైక్షత్తద్వక్త్రం భయవిహ్వలలోచనా॥10460॥*
శ్రీకృష్ణుని సైనికులు అరివీరుల శరవర్షముచే కప్పబడియుండుటను రుక్మిణీదేవి గమనించెను. అప్పుడు ఆమె భయవిహ్వలయై బెదురుచూపులతో సిగ్గుపడుచు కృష్ణునివైపు చూచెను.
*54.5 (ఐదవ శ్లోకము)*
*ప్రహస్య భగవానాహ మా స్మ భైర్వామలోచనే|*
*వినంక్ష్యత్యధునైవైతత్తావకైః శాత్రవం బలమ్॥10461॥*
అంతట కృష్ణభగవానుడు నవ్వుచు ఇట్లనెను. "సుందరీ! భయపడవలదు. నీ (మన) సైన్యముల ధాటికి శత్రుబలములు ఇప్పుడే (నీవు చూచుచుండగనే) నేలపాలగును".
*54.6 (ఆరవ శ్లోకము)*
*తేషాం తద్విక్రమం వీరా గదసంకర్షణాదయః|*
*అమృష్యమాణా నారాచైర్జఘ్నుర్హయగజాన్ రథాన్॥10462॥*
పిమ్మట బలరాముడు, గదుడు మొదలగు యాదవవీరులు ఆ శిశుపాలాదుల పరాక్రమమును (విజృంభణను) జూచి అసహనమునకు లోనైరి. వెంటనే వారు పరంపరగా బాణములను ప్రయోగించి, శత్రువుల అశ్వములను, గజములను, రథములను నుగ్గునుగ్గు గావించిరి.
*54.7 (ఏడవ శ్లోకము)*
*పేతుః శిరాంసి రథినామశ్వినాం గజినాం భువి|*
*సకుండలకిరీటాని సోష్ణీషాణి చ కోటిశః॥10463॥*
*54.8 (ఎనిమిదవ శ్లోకము)*
*హస్తాః సాసిగదేష్వాసాః కరభా ఊరవోఽఙ్ఘ్రయః|*
*అశ్వాశ్వతరనాగోష్ట్రఖరమర్త్యశిరాంసి చ॥10464॥*
కుండలములతో, కిరీటములతో, తలపాగలతో ఒప్పుచు వేల (అత్యధిక) సంఖ్యలోనున్న శత్రుగజాశ్వరథ యోధుల శిరస్సులు బలరామాదుల శరప్రయోగములకు గుఱియై తెగి నేలపైబడెను. అంతేగాక ఆ యాదవ యోధుల దెబ్బకు ఖడ్గములతో, గదలతో, ధనుర్బాణములతో ఒప్పుచున్న శత్రువీరుల హస్తములు, ముంజేతులు, తొడలు, పాదములు ముక్కలు ముక్కలై నేలగూలెను. మఱియు వారి అశ్వముల, కంచరగాడిదల, ఏనుగుల, ఒంటెల, గాడిదల, కాల్బలముల, శిరస్సులు నుగ్గునుగ్గై మట్టిగఱచెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఏబది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
[28/03, 06:19] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
[26/03, 04:46] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
[26/03, 04:46] +91 95058 13235: *26.03.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది నాలుగవ అధ్యాయము*
*శ్రీకృష్ణుడు శిశుపాల, జరాసంధాదులను, రుక్మిని ఓడించుట - రుక్మిణీదేవిని పరిణయమాడుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*54.9 (తొమ్మిదవ శ్లోకము)*
*హన్యమానబలానీకా వృష్ణిభిర్జయకాంక్షిభిః|*
*రాజానో విముఖా జగ్ముర్జరాసంధపురఃసరాః॥10465॥*
*54.10 (పదియవ శ్లోకము)*
*శిశుపాలం సమభ్యేత్య హృతదారమివాతురమ్|*
*నష్టత్విషం గతోత్సాహం శుష్యద్వదనమబ్రువన్॥10466॥*
విజయోత్సాహముతోనున్న యదువీరుల విజృంభణకు శత్రుసైన్య బలసముదాయములు అన్నియును చావుదెబ్బ తినెను. అంతట జరాసంధాదిరాజులు అందఱును యుద్ధవిముఖులై (వెన్నుచూపి) పలాయనము చిత్తగించిరి. పిమ్మట వారెల్లరును శిశుపాలుని కడకు చేరిరి. అతడు (శిశుపాలుడు) తాను కోరుకొనిన రుక్మిణి తనకు దక్కకు పోవుటచే మానసికముగా కుమిలిపోవుచుండెను. అతడు ఉత్సాహమును కోల్పోయి, తేజోవిహీనుడై యుండెను. ముఖము వాడియున్న ఆ శిశుపాలునితో జరాసంధాదులు ఇట్లు నుడివిరి.
*54.11 (పదకొండవ శ్లోకము)*
*భో భోః పురుషశార్దూల దౌర్మనస్యమిదం త్యజ|*
*న ప్రియాప్రియయో రాజన్ నిష్ఠా దేహిషు దృశ్యతే॥10467॥*
*54.12 (పదకొండవ శ్లోకము)*
*యథా దారుమయీ యోషిన్నృత్యతే కుహకేచ్ఛయా|*
*ఏవమీశ్వరతంత్రోఽయమీహతే సుఖదుఃఖయోః|*
"అయ్యా! శిశుపాలా! నీవు పురుషశ్రేష్ఠుడవు. నీవు దైన్యమును వీడుము. రాజా! మానవులకు సుఖదుఃఖములు వచ్చుచు పోవుచు ఉండును (మానవులకు అనుకూల ప్రతికూల పరిస్దితులు ఏర్పడుచుండుట సహజమే). మిత్రమా వినుము - "దేహధారి (జీవుడు) స్వతంత్రుడుగాడు. యంత్రమును నడపువాని చేతిలో కీలుబొమ్మవలె పరమేశ్వరుని తంత్రమునకు అధీనుడై (పరాధీనుడై - పరాత్పరుడైన భగవంతున. అధీనుడై) సుఖములను, దుఃఖములను అనుభవించుచుండును.
*54.13 (పదమూడవ శ్లోకము)*
*శౌరేః సప్తదశాహం వై సంయుగాని పరాజితః|*
*త్రయోవింశతిభిః సైన్యైర్జిగ్యే ఏకమహం పరమ్॥10469॥*
*54.14 (పదునాలుగవ శ్లోకము)*
*తథాప్యహం న శోచామి న ప్రహృష్యామి కర్హిచిత్|*
*కాలేన దైవయుక్తేన జానన్ విద్రావితం జగత్॥10470॥*
*54.15 (పదిహేనవ శ్లోకము)*
*అధునాపి వయం సర్వే వీరయూథపయూథపాః|*
*పరాజితాః ఫల్గుతంత్రైర్యదుభిః కృష్ణపాలితైః॥10471॥*
*54.16 (పదహారవ శ్లోకము)*
*రిపవో జిగ్యురధునా కాల ఆత్మానుసారిణి|*
*తదా వయం విజేష్యామో యదా కాలః ప్రదక్షిణః॥10472॥*
పూర్వము నేను ఇరువదిమూడు అక్షౌహిణుల సైన్యముతో విజృంభించి, దండెత్తితిని. ప్రతిసారియు, నేను, నా బలములు శ్రీకృష్ణుని చేతిలో ఓటమి పాలైతిమి. నేను బలరాముని చేతికి చిక్కినప్పుడు శ్రీకృష్ణుడు దయతలచి నన్ను విడిపించెను. మరల నేను ఇరువది మూడు అక్షౌహిణుల సైస్యమును సమకూర్చుకొని పదునెనిమిదవసారి అతనిపై దాడిచేసి, శత్రువులను పాఱద్రోలి విజయమును చేకొంటిని. నేను అపజయము పాలైనప్పుడు ఏమాత్రమూ కుంగిపోలేదు. జయమును పొందినప్పుడు సంతోషముతో పొంగిపోలేదు. లోకములోని జనులెల్లరును కాలస్వరూపుఢైన పరమేశ్వరుని యొక్క అధీనములో వారివారి ప్రారబ్ధకర్మ ఫలానుసారము సాగిపోవుచుందురు. మనమును సామాన్యులముగాము. వీరులైన సేనానాయకులకు అధిపతులము. కాని, ఇప్పుడు కృష్ణుని నాయకత్వమున ఉన్న యాదవుల స్వల్పసైన్యము చేతిలోనే పరాజితులమైతిమి. ప్రస్తుతము కాలము కలిసివచ్చుటచే శత్రువులు మనలను జయింపగల్గిరి. అట్లే కాలక్రమమున (కాలము అనుకూలించినప్పుడు) మనమును వారిని జయింపగలము"
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఏబది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
[27/03, 06:18] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*281వ నామ మంత్రము* 27.03.2021
*ఓం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళ్యై నమః*
కన్నులు తెరచినంతనే బ్రహ్మాండాలను సృష్టింపజేస్తూ, కన్నులు మూసినంతనే బ్రహ్మాండాలను లయింపజేసే జగదీశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః* పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యములు, శాంతిసౌఖ్యములు సంప్రాప్తింపజేయును.
దేవతలు అనిమిషులు. రెప్పపాటులుండవు. అమ్మ ఆది పరాశక్తి. ఈ తల్లి దేవత గనుక రెప్పపాటులుండవు. ఉన్మేషము - అంటే కనులు తెరవడం - సృష్టి జరుగు స్థితి. నిమిషము - కనులు మూయుటం - లయకార్యము. పరమేశ్వరి కనులు తెరచినదంటే అనేక బ్రహ్మాండములు సృష్టింపబడినవి. ఆ తల్లి కనులు మూసినచో సృష్టింపబడిన బ్రహ్మాండములు నశించును. అమ్మవారి ఇచ్ఛామాత్రముననే బ్రహ్మాండోత్పత్తి జరుగుచున్నది. అలాగే నశింపజేయుచున్నది. సౌందర్యలహరిలో శంకరభగవత్పాదులవారు ఈ సందర్భంగా 55వ శ్లోకంలో ఇలా చెప్పారు:
*నిమేషోన్మేషాభ్యాం - ప్రలయముదయం యాతి జగతి*
*తవేత్యాహుః సంతో - ధరణిధరరాజన్య తనయే |*
*త్వదున్మేషాజ్జాతం - జగదిదమశేషం ప్రలయతః*
*పరేత్రాతుం శంంకే - పరిహృతనిమేషాస్తవ దృశః ॥*
జగన్మాత కనులు మూయుటవలన లోక సంహారము, తెరచుట వలన సృష్టి జరుగునందురు. సకల జగములను రక్షించుటకొరకై ఆమె రెప్పలు మూయకుండ ఉండునని భావము.
అమ్మా...జగన్మాతా - నీ కనురెప్పలు మూతపడుట చేత ఈ జగత్తుకు ప్రళయం సంభవించుచున్నది. మరల నీవు నీ కనురెప్పలు తెరచుటచేత ఈ జగత్తు ఆవిర్భవించుచున్నది. ఈ ప్రకారం నీ కన్నుల కదలికలతో ఈ జగత్తు ఉత్పత్తి నాశములు జరుగుచున్నవని వ్యాసమునీంద్రుల వంటి సత్పురుషులు చెప్పుచున్నారు.ఈ యావత్ జగత్తును నాశనము కాకుండా కాపాడుటకై నీ కనురెప్పలు మూయకుండా మా మీద దయతో ఎల్లవేళలా తెరచి ఉంచితివని నేను తలంచుచున్నాను.
{ రెప్పవేయు గుణము కలిగిన వారిని నిమిషులు అందురు ( మనుషులు).రెప్పవేయని గుణము కలిగినవారిని అనిమిషులు ( దేవతలు) అందురు. అమ్మ రెప్పవేయని దేవతాగుణాన్ని మనమీద దయగా శ్రీ శంకరులు ఈ శ్లోకములో వర్ణించుచున్నారు. ఇదే భావమును తెలుపుతూ వ్యాస ప్రోక్త బ్రహ్మండపురాణాంతర్గత లలితా సహస్రంలో *ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి* అని చెప్పడం జరిగినది. కలదు.
ఓ తల్లీ, పర్వతరాజపుత్రీ! నీవు కన్నులను మూయటం తెరవటం వల్ల ఈ జగత్తు నశిస్తోంది, జనిస్తోంది - అని సత్పురుషులు చెబుతారు. నీవు కన్నులు తెరవటం వలన జనించిన ఈ సర్వజగత్తు ప్రళయంలో నశించకుండేట్లు నీవు కన్నులను రెప్పవాల్చకుండా ఎప్పుడూ తెరిచే ఉంచుతావు.
జగన్మాతకు నమస్కరించునపుడు
*ఓం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళ్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[27/03, 06:18] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
7/03, 20:54] +91 95058 13235: *27.03.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది నాలుగవ అధ్యాయము*
*శ్రీకృష్ణుడు శిశుపాల, జరాసంధాదులను, రుక్మిని ఓడించుట - రుక్మిణీదేవిని పరిణయమాడుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*54.17 (పదిహేడవ శ్లోకము)*
*ఏవం ప్రబోధితో మిత్రైశ్చైద్యోఽగాత్సానుగః పురం|*
*హతశేషాః పునస్తేఽపి యయుః స్వం స్వం పురం నృపాః॥10473॥*
ఈ విధముగా హతశేషులైన జరాసంధాది రాజులు తమ మిత్రుడైన శిశుపాలునియొక్క మనస్తాపమును తొలగించి, తమ తమ నగరములకు వెళ్ళిపోయిరి. మిత్రుల ప్రబోధముతో తేరుకొనిన శిశుపాలుడును అనుచరులతో గూడి తన పురమునకు చేరెను.
*54.18 (పదునెనిమిదవ శ్లోకము)*
*రుక్మీ తు రాక్షసోద్వాహం కృష్ణద్విడసహన్ స్వసుః|*
*పృష్ఠతోఽన్వగమత్కృష్ణమక్షౌహిణ్యా వృతో బలీ॥10474॥*
బలశాలియగు రుక్మి (రుక్మిణియొక్క అన్న) కృష్ణునియెడ ద్వేషభావము కలిగియున్నాడు. అతడు తన చెల్లెలగు రుక్మిణిని శ్రీకృష్ణుడు రాక్షసవివాహ విధానమున తీసికొని వెళ్ళినందులకు అసహనముతో మిక్కిలి క్రుద్ధుడాయెను. వెంటనే అతడు ఒక అక్షౌహిణీ సైన్యమును వెంటబెట్టుకొని శ్రీకృష్ణుని దెబ్బతీయుటకు ఆయనను వెంబడించెను.
*54.19 (పందొమ్మిదవ శ్లోకము)*
*రుక్మ్యమర్షీ సుసంరబ్ధః శృణ్వతాం సర్వభూభుజామ్|*
*ప్రతిజజ్ఞే మహాబాహుర్దంశితః సశరాసనః॥10475॥*
మహాబాహువైన రుక్మి మనస్సు అసహనముతో ఉడికిపోవుచుండెను. అతడు కవచమును ధరించి, ధనుర్బాణములను చేబూని, సమరమునకు సర్వసన్నద్ధుడై సకలరాజుల సమక్షమున ఇట్లు ప్రతిజ్ఞ చేసెను-
*54.20 (ఇరువదియవ శ్లోకము)*
*అహత్వా సమరే కృష్ణమప్రత్యూహ్య చ రుక్మిణీమ్|*
*కుండినం న ప్రవేక్ష్యామి సత్యమేతద్బ్రవీమి వః॥10476॥*
"మిత్రులారా! శ్రీకృష్ణుని పరిమార్చి నా చెల్లెలగు రుక్మిణిని తీసికొనిరానిచో ఈ కుండిన నగరములో ప్రవేశింపను. మీ యెదుట నేను శపథము చేసి చెప్పుచున్నాను".
*54.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*
*ఇత్యుక్త్వా రథమారుహ్య సారథిం ప్రాహ సత్వరః|*
*చోదయాశ్వాన్ యతః కృష్ణస్తస్య మే సంయుగం భవేత్॥10477॥*
*54.22 (ఇరువది రెండవ శ్లోకము)*
*అద్యాహం నిశితైర్బాణైర్గోపాలస్య సుదుర్మతేః|*
*నేష్యే వీర్యమదం యేన స్వసా మే ప్రసభం హృతా॥10478॥*
ఈ విధముగా ప్రమాణము చేసిన పిమ్మట రథమును అధిరోహించి అతడు సారథితో ఇట్లు పలికెను- "నీవు కృష్ణుడున్న ప్రదేశమునకు రథమును త్వరత్వరగా పోనిమ్ము. అతనితో యుద్ధము చేయవలెను. దురాత్ముడైన శ్రీకృష్ణుడు తనను బలశాలినిగా భావించుకొనుచు నా చెల్లెలిని అపహరించుకొని పోయినాడు. నేడే నేను నిశితములైన నా శరములచే అతని బలగర్వమును రూపుమాపెదను".
*54.23 (ఇరువది మూడవ శ్లోకము)*
*వికత్థమానః కుమతిరీశ్వరస్యాప్రమాణవిత్|*
*రథేనైకేన గోవిందం తిష్ఠ తిష్ఠేత్యథాహ్వయత్॥10479॥*
బుద్ధిహీనుడైన రుక్మి కృష్ణభగవానుని శక్తి సామర్థ్యములను ఏమాత్రమూ ఎఱుగనివాడు. అతడు ఈ విధముగా ప్రగల్బములను పలుకుచు, తన రథముతో శ్రీకృష్ణుని సమీపించి, ''నిలువుము నిలువుము' అని యనుచు పోరునకు ఆహ్వానించెను.
*54.24 (ఇరువది ఐదవ శ్లోకము)*
*ధనుర్వికృష్య సుదృఢం జఘ్నే కృష్ణం త్రిభిః శరైః|*
*ఆహ చాత్ర క్షణం తిష్ఠ యదూనాం కులపాంసన॥10480॥*
*54.25 (ఇరువది ఐదవ శ్లోకము)*
*కుత్ర యాసి స్వసారం మే ముషిత్వా ధ్వాంక్షవద్ధవిః|*
*హరిష్యేఽద్య మదం మంద మాయినః కూటయోధినః॥10481॥*
వెంటనే అతడు దృఢమైన తన ధనుస్సును ఎక్కుపెట్టి, కృష్ణునిపై మూడు బాణములను ప్రయోగించి ఇట్లు నుడివెను- "ఓయీ! నీవు యదువంశమున చెడబుట్టినవాడవు. ఒక్కక్షణకాలముపాటు నా యెదుట నిలువుము. పవిత్రమైన హవిస్సును కాకి ఎత్తుకొనిపోయినట్లు నా చెల్లెలిని (రుక్మిణిని) ఎక్కడికి తీసికొనిపోవుచున్నావు? ఓ మందబుద్ధీ! మాయావీ! నీవు కపట యుద్ధమును బాగుగా ఎఱిగినవాడవు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఏబది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
[28/03, 06:19] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*282వ నామ మంత్రము* 28.03.2021
*ఓం సహస్రశీర్షవదనాయై నమః*
అనంతములైన శిరస్సులు, ముఖములతో విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సహస్రశీర్షవదనా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం సహస్రశీర్షవదనాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ జగజ్జనని కరుణచే శాంతిసౌఖ్యములు, సిరిసంపదలు, ఆధ్యాత్మికజ్ఞాన సిరులు సంప్రాప్తమగును.
పరమేశ్వరి తాను సృష్టించిన ఈ చరాచర జగత్తులో, సర్వము తానై, ప్రతీ జీవిలోనూ తానే విలసిల్లుతూ ఆ జీవుల తలలు, ముఖములు తనివిగానే భావింపబడుతూ, అనంతమైన శిరస్సులు, అనంతమైన ముఖములు కలిగినదిగా చెప్పబడినది గనుకనే, ఆ పరమేశ్వరి *సహస్రశీర్షవదనా* యని అనబడినది. ఇక్కడ సహస్రమను సంఖ్యావాచక ప్రయోగము కేవలము వేయిగా కాకుండా అనంతముగా భావింపదగును. అటువంటి పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం సహస్రశీర్షవదనాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[28/03, 06:19] +91 95058 13235: *28.03.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది నాలుగవ అధ్యాయము*
*శ్రీకృష్ణుడు శిశుపాల, జరాసంధాదులను, రుక్మిని ఓడించుట - రుక్మిణీదేవిని పరిణయమాడుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*54.26 (ఇరువది ఆరవ శ్లోకము)*
*యావన్న మే హతో బాణైః శయీథా ముంచ దారీకామ్|*
*స్మయన్ కృష్ణో ధనుశ్ఛిత్త్వా షడ్భిర్వివ్యాధ రుక్మిణమ్॥10482॥*
"నా బాణము దెబ్బకు హతుడవై నేలగూలకముందే నీవు రాకుమారియైన రుక్మిణిని విడిచిపెట్టుము". రుక్మియొక్క ప్రగల్భవచనములను విన్నపిమ్మట శ్రీకృష్ణుడు దరహాసమొనర్చుచు, రుక్మియొక్క ధనుస్సును ముక్కలు ముక్కలుగావించి, ఆఱుబాణములతో అతనిని గాయపఱచెను.
*54.27 (ఇరువది ఏడవ శ్లోకము)*
*అష్టభిశ్చతురో వాహాన్ ద్వాభ్యాం సూతం ధ్వజం త్రిభిః|*
*స చాన్యద్ధనురాధాయ కృష్ణం వివ్యాధ పంచభిః॥10483॥*
ఎనిమిది శరములచేత అతని రథాశ్వములను నాల్గింటిని, రెండు బాణములచేత రథసారథిని దెబ్బతీసెను. మూడు శరములచే రథధ్వజమును ఛిన్నాభిన్నమొనర్చెను. అంతట రుక్మి మఱియొక ధనుస్సును తీసికొని, శ్రీకృష్ణుని ఐదు బాణములచే నొప్పించెను.
*54.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*
*తైస్తాడితః శరౌఘైస్తు చిచ్ఛేద ధనురచ్యుతః|*
*పునరన్యదుపాదత్త తదప్యచ్ఛినదవ్యయః॥10484॥*
పిదప శ్రీకృష్ణుడు రుక్మియొక్క శరములను తట్టుకొని నిలిచి, తన శరపరంపరచే అతని ధనుస్సును ఖండించెను. అతడు (రుక్మి) మఱియొక శరాసనమును చేబూనగా కృష్ణప్రభువు దానిని గూడ భంగమొనర్చెను.
*54.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*
*పరిఘం పట్టిశం శూలం చర్మాసీ శక్తితోమరౌ|*
*యద్యదాయుధమాదత్త తత్సర్వం సోఽచ్ఛినద్ధరిః॥10485॥*
అప్పుడు రుక్మి పరిఘను, పట్టిశమును, శూలమును, డాలును, ఖడ్గమును, బల్లెమును, తోమరమును ప్రయోగింపగా శ్రీహరి (కృష్ణుడు) వాటిని అన్నింటిని తన బాణాగ్నులకు ఆహుతి చేసెను.
*54.30(ముప్పదియవ శ్లోకము)*
*తతో రథాదవప్లుత్య ఖడ్గపాణిర్జిఘాంసయా|*
*కృష్ణమభ్యద్రవత్క్రుద్ధః పతంగ ఇవ పావకమ్॥10486॥*
పిమ్మట రుక్మి రథమునుండి దిగి, కృష్ణుని హతమార్చుటకై ఖడ్గమును చేబూని, మిగుల క్రుద్ధుడై, అగ్నిమీదకు మిడుతవలె శ్రీకృష్ణునిపై విజృంభించెను.
*54.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*
*తస్య చాపతతః ఖడ్గం తిలశశ్చర్మ చేషుభిః|*
*ఛిత్త్వాసిమాదదే తిగ్మం రుక్మిణం హంతుముద్యతః॥10487॥*
తన మీదికి విజృంభించి వచ్చుచున్న రుక్మియొక్క ఖడ్గమును, డాలును శ్రీకృష్ణుడు తన బాణములచే నువ్వులంత ప్రమాణములో ముక్కలు గావించెను. పిదప ఆ ప్రభువు వాడియైన తన ఖడ్గమును చేబూని, అతనిని (రుక్మిని) చంపుటకు ఉద్యుక్తుడాయెను.
*54.32 (ముప్పది రెండవ శ్లోకము)*
*దృష్ట్వా భ్రాతృవధోద్యోగం రుక్మిణీ భయవిహ్వలా|*
*పతిత్వా పాదయోర్భర్తురువాచ కరుణం సతీ॥10488॥*
శ్రీకృష్ణుడు తన సోదరుని చంపుటకు సిద్ధపడుటను జూచి రుక్మిణి భయవిహ్వలయయ్యెను. పిదప ఆ సాధ్వి తన భర్త పాదములపైబడి దైన్యముతో ఇట్లు విన్నవించెను-
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఏబది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
[28/03, 21:10] +91 95058 13235: *28.03.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది నాలుగవ అధ్యాయము*
*శ్రీకృష్ణుడు శిశుపాల, జరాసంధాదులను, రుక్మిని ఓడించుట - రుక్మిణీదేవిని పరిణయమాడుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*54.33 (ముప్పది మూడవ శ్లోకము)*
*యోగేశ్వరాప్రమేయాత్మన్ దేవ దేవ జగత్పతే|*
*హంతుం నార్హసి కల్యాణ భ్రాతరం మే మహాభుజ॥10489॥*
శ్రీకృష్ణుడు రుక్మిని చంపుటకు సిద్ధపడుటను జూచి రుక్మిణి భయవిహ్వలయయ్యెను. పిదప ఆ సాధ్వి తన భర్తపాదములపైబడి దైన్యముతో ఇట్లు విన్నవించుచుండెను-
"ప్రభూ! నీవు పరమయోగుల యొక్క హృదయములయందు నివసించువాడవు. దేహాభిమానులైన మూఢులు నిన్ను తెలిసికొనజాలరు. నీవు బ్రహ్మాది దేవతలకును దేవుడవు, జగన్నాథుడవు. తిరుగులేని భుజబలము గలవాడవు, కల్యాణ స్వరూపుడవు (మంగళప్రదమైన కల్యాణము చేసికొనబోవు చున్నవాడవు). ఎంత దుష్టుడైనను ఇతడు నాకు అగ్రజుడు, నీకు బావమఱది. ఇతడు నిన్ను శరణుగోరకున్నను ఇతని పక్షమున నేను శరణువేడుచున్నాను. కావున ఇతని చంపుట యుక్తముగాదు".
*శ్రీశుక ఉవాచ*
*54.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*
*తయా పరిత్రాసవికంపితాంగయా శుచావశుష్యన్ముఖరుద్ధకంఠయా|*
*కాతర్యవిస్రంసితహేమమాలయా గృహీతపాదః కరుణో న్యవర్తత॥10490॥*
*శ్రీశుకుడు వచించెను* ఆ సమయమున రుక్మిణీదేవి యొక్కశరీరమంతయును భయముతో కంపించి పోవుచుండెను. అంతులేని శోకమువలన ఆమె నోరు పిడచగట్టిపోవుచుండెను. ఆ స్థితిలో ఆమెకు గొంతు పెగలకయుండెను. కలత చెందియుండుటచే ఆమె మెడలోని బంగారపు హారము జాఱిపోయెను. ఇట్టి స్థితిలో రుక్మిణీసాధ్వి తన పాదములపై వ్రాలుటతో కరుణాళువైన కృష్ణప్రభువు యొక్క హృదయము ద్రవించెను. పిమ్మట ఆ స్వామి రుక్మిని చంపు ప్రయత్నమునుండి విరమించుకొనెను.
*54.35 (ముప్పది ఐదవ శ్లోకము)*
*చైలేన బద్ధ్వా తమసాధుకారిణం సశ్మశ్రుకేశం ప్రవపన్ వ్యరూపయత్|*
*తావన్మమర్దుః పరసైన్యమద్భుతం యదుప్రవీరా నలినీం యథా గజాః॥10491॥*
*54.36 (ముప్పది ఆరవ శ్లోకము)*
*కృష్ణాంతికముపవ్రజ్య దదృశుస్తత్ర రుక్మిణమ్|*
*తథా భూతం హతప్రాయం దృష్ట్వా సంకర్షణో విభుః|*
*విముచ్య బద్ధం కరుణో భగవాన్ కృష్ణమబ్రవీత్॥10492॥*
ఐనను రుక్మి తన మూర్ఖప్రయత్నములను (కృష్ణునిపై పిచ్చిగంతులు వేయుటను) మానుకొనలేదు. అప్పుడు కృష్ణప్రభువు రుక్మివస్త్రముచేతనే అతనిని బంధించి, తన ఖడ్గముతో అతని మీసములను అక్కడక్కడ గొరిగి వికృతరూపుని గావించెను. ఇంతలో మహావీరులైన యాదవయోధులు అపారముగా నున్న శత్రుసేనలను, మదపుటేనుగు కమలములనువలె చావచితుకగొట్టిరి. పిమ్మట వారు (యాదవ శ్రేష్ఠులు) బలరామసహితులై శ్రీకృష్ణుని సమీపమునకు వచ్చి, విరూపుడైన రుక్మినిజూచిరి. అప్పుడు మహాత్ముడైన బలరాముడు మృతతుల్యుడైయున్న రుక్మి దైన్యావస్థకు గుఱియై యుండుటను జూచి, కనికరముతో అతని బంధములను తొలగించి, కృష్ణునితో ఇట్లనెను-
*54.37 (ముప్పది ఏడవ శ్లోకము)*
*అసాధ్విదం త్వయా కృష్ణ కృతమస్మజ్జుగుప్సితమ్|*
*వపనం శ్మశ్రుకేశానాం వైరూప్యం సుహృదో వధః॥10493॥*
"కృష్ణా! నీవు చేసిన ఈ పని మంచిదికాదు. మనవంటివారు నింద్యమైన ఇట్టి కృత్యమునకు పాల్పడరాదు. బంధువులయొక్క మీసములను, తలను ఈ విధముగా గొరిగి విరూపునిగావించుట అతనిని వధించుటవంటిదే".
*54.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*
*మైవాస్మాన్ సాధ్వ్యసూయేథా భ్రాతుర్వైరూప్యచింతయా|*
*సుఖదుఃఖదో న చాన్యోఽస్తి యతః స్వకృతభుక్ పుమాన్॥10494॥*
అనంతరము ఆ బలభద్రుడు రుక్మిణిని ఊఱడించుచు ఇట్లు వచించెను- "సాధ్వీ! రుక్మిణీ! నీ అన్నయగు రుక్మికి ఈ వైరూప్యమును కలిగించినందులకు మా యెడ కినుక వహింపకుము. మానవునకు (ఏ వ్యక్తికైనను) సుఖముగాని, దుఃఖముగాని ఇతరులవలన కలుగునవి కావు. అవి ఆ వ్యక్తి చేసికొనిన సుకృత దుష్కృతములకు ఫలములు. కనుక ఎవని కర్మఫలమును వారు అనుభవింపక తప్పదు.
*సుఖస్య దుఃఖస్య నకోఽపిదాతా, పరోదదాతీతికుబుద్ధిరేషా|*
సుఖము, దుఃఖము అనునవి ఇతరులవలన కలుగునవి కావు. అట్లు భావించుట యుక్తము గాదు (తెలివితక్కువదనమే) - (అధ్యాత్మ రామాయణము).
*54.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*
*బంధుర్వధార్హదోషోఽపి న బంధోర్వధమర్హతి|*
*త్యాజ్యః స్వేనైవ దోషేణ హతః కిం హన్యతే పునః॥10495॥*
పిదప బలభద్రుడు కృష్ణునివైపు తిరిగి ఇట్లనెను- "బంధువు వధింపదగిన అపరాధియేయైనను అతనిని వధించుట తగదు. క్షమించి విడిచిపెట్టవలెను. తాను ఒనర్చిన అపరాధమువలననే అతడు మృతప్రాయుడగును. చచ్చినవానిని మఱల చంపుట ఎందులకు?"
*54.40 (నలుబదియవ శ్లోకము)*
*క్షత్రియాణామయం ధర్మః ప్రజాపతివినిర్మితః|*
*భ్రాతాపి భ్రాతరం హన్యాద్యేన ఘోరతరస్తతః॥10496॥*
*పిమ్మట బలరాముడు రుక్మిణితో ఇట్లు నుడివెను* "అమ్మా! క్షత్రియధర్మము ఎంతయు ఘోరమైనది. సోదరుడు అధర్మపరుడైనచో, రాజు అతనికి తోబుట్టువేయైనను అతనిని వధింపవలసియే యుండును. విధివిధానమే అంత"
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఏబది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
[29/03, 05:10] +91 95058 13235:
[29/03, 05:10] +91 95058 13235: *29.03.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది నాలుగవ అధ్యాయము*
*శ్రీకృష్ణుడు శిశుపాల, జరాసంధాదులను, రుక్మిని ఓడించుట - రుక్మిణీదేవిని పరిణయమాడుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*54.41(నలుబది ఒకటవ శ్లోకము)*
*రాజ్యస్య భూమేర్విత్తస్య స్త్రియో మానస్య తేజసః|*
*మానినోఽన్యస్య వా హేతోః శ్రీమదాంధాః క్షిపంతి హి॥10497॥*
*బలరాముడు శ్రీకృష్ణునితో ఇట్లు వచించెను* "సోదరా! దురభిమానముతో, ధనమదముతో విర్రవీగుచుండెడివారు రాజ్యము కొఱకును, భూమి (ఆస్తి పాస్తుల) కోసము, ధనధాన్యముల కొఱకును, కాంతల విషయమునను, పేరు ప్రతిష్ఠలకోసము, వైభవములను నిలుపుకొనుట కొఱకును, మఱచి, బంధువులను సైతము హింసించుచుందురు.
*54.42(నలుబది రెండవ శ్లోకము)*
*తవేయం విషమా బుద్ధిః సర్వభూతేషు దుర్హృదామ్|*
*యన్మన్యసే సదాభద్రం సుహృదాం భద్రమజ్ఞవత్॥10498॥*
*బలరాముడు మరల రుక్మిణితో ఇట్లనెను* రుక్మిణీ! నీ సోదరుడైన ఈ రుక్మి సకల ప్రాణులయెడ ద్వేషభావమునే కలిగియుండెను. కావున అతని మేలునకే ఇట్లు శిక్షించుట జరిగినది. అజ్ఞానులవలె నీవు 'ఈ దండనము తగని పని' యని తలంచుచున్నావు. ఇది నీ బుద్ధి వైషమ్యమే గాని వేఱుగాదు.
*54.43 (నలుబది మూడవ శ్లోకము)*
*ఆత్మమోహో నృణామేష కల్పతే దేవమాయయా|*
*సుహృద్దుర్హృదుదాసీన ఇతి దేహాత్మమానినామ్॥10499॥*
*54.44 (నలుబది నాలుగవ శ్లోకము)*
*ఏక ఏవ పరో హ్యాత్మా సర్వేషామపి దేహినామ్|*
*నానేవ గృహ్యతే మూఢైర్యథా జ్యోతిర్యథా నభః॥10500॥*
*54.45 (నలుబది ఐదవ శ్లోకము)*
*దేహ ఆద్యంతవానేష ద్రవ్యప్రాణగుణాత్మకః|*
*ఆత్మన్యవిద్యయా కౢప్తః సంసారయతి దేహినమ్॥10501॥*
*54.46 (నలుబది ఆరవ శ్లోకము)*
*నాత్మనోఽన్యేన సంయోగో వియోగశ్చాసతః సతి|*
*తద్ధేతుత్వాత్తత్ప్రసిద్ధేర్దృగ్రూపాభ్యాం యథా రవేః॥10502॥*
*54.47 (నలుబది ఏడవ శ్లోకము)*
*జన్మాదయస్తు దేహస్య విక్రియా నాత్మనః క్వచిత్|*
*కలానామివ నైవేందోర్మృతిర్హ్యస్య కుహూరివ॥10503॥*
*54.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*
*యథా శయాన ఆత్మానం విషయాన్ ఫలమేవ చ|*
*అనుభుంక్తేఽప్యసత్యర్థే తథాఽఽప్నోత్యబుధో భవమ్॥10504॥*
భగవంతుని మాయవలన మోహితులైన వారు దేహాత్మబుద్ధిగలవారై ('దేహమే ఆత్మ' యని భావించుచు) 'ఇతడు మిత్రుడు, ఇతడు శత్రువు, ఇతడు ఉదాసీనుడు' అను భేదబుద్ధిని కలిగియుందురు. అమ్మా! సూర్యుడును, చంద్రుడును ఒక్కొక్కడే ఐనప్పటికిని జలాదులయందు అనేకులుగా భ్రమింపజేయుచుందురు. ఆకాశము ఒక్కటేయైనను ఘటాది భేదముచే వేర్వేఱుగా కన్పట్టుచుండును. అట్లే అన్ని దేహములయందును ఉన్న ఆత్మ ఒక్కటేయైనను ఉపాధి భేదములతో (మానవ పక్ష్యాది దేహములను బట్టి) మూఢులు అనేకములుగా భావించుచుందురు. పంచ మహాభూతములతో, పంచప్రాణములతో, పంచతన్మాత్రలతో, సత్త్వాది త్రిగుణములతో ఒప్పుచుండెడి ఈ దేహము ఆద్యంతములు గలది. అనగా జనన మరణములు గలది. కాని దేహాభిమానము గల జీవుడు అజ్ఞానకారణముగా 'ఈ దేహము శాశ్వతమైనది' అని భావించి సంసారచక్రమున పరిభ్రమించు చుండును. సాధ్వీ! చూచే కన్నులు, చూడబడే రూపములు -ఈ రెండింటినీ ప్రకాశింపచేసేది సూర్యుడు ఒక్కడే. అందువలన సూర్యునితో కన్నులకు, రూపములకు ఎప్ఫుడైనా వియోగము ఉండదు. సంయోగమూ ఉండదు. అదేవిధముగా ఈ జగత్తు అంతయునూ ఆత్మవల్లనే గోచరించును. సమస్త జగత్తును ప్రకాశింపజేయునది ఆత్మయే. కావున అశాశ్వతములైన పదార్థములతో ఆత్మకు ఎటువంటి సంయోగ, వియోగములూ ఉండనే ఉండవు. వృద్ధిక్షయములు చంద్రకళలకేగాని, చంద్రునకు కావు (శుక్లపక్షమున చంద్రకళలు వృద్ధిచెందును. అవి కృష్ణపక్షమున క్షీణించును). అట్లే జన్మాది షడ్వికారములు శరీరమునకేగాని, ఆత్మకు గావు. అమావాస్య దినమున (కుహూ - *సా దృష్టేందుః 'సినీవాలీ' సా నష్టేందుకలా 'కుహూః'* - చంద్రకళ కనిపించిన అమావాస్యను *సినీవాలి* అనియు, చంద్రరేఖ కనబడని అమావాస్యను *కుహువు* అనియు పేర్కొందురు.అటువంటి కుహువు దినమున) చంద్రుడు లేనట్లుగా అనుకొనుచుందురు. కాని చంద్రుడు ఉండును. అట్లే శరీరము నశించినప్పుడు ఆత్మ నశించినట్లు భ్రమపడుచుందురు. రుక్మిణీ! నిద్రించుచున్నవాడు కలలో వచ్చిన సుఖదుఃఖాదులను ఆత్మయే అనుభవించుచున్నది అని భ్రమపడుచుండును. అట్లే అజ్ఞాని నశ్వరమైన విషయాదుల యందు సుఖదుఃఖాదులను పొందుచుండును.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఏబది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
[29/03, 20:05] +91 95058 13235: *29.03.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది నాలుగవ అధ్యాయము*
*శ్రీకృష్ణుడు శిశుపాల, జరాసంధాదులను, రుక్మిని ఓడించుట - రుక్మిణీదేవిని పరిణయమాడుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*54.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*
*తస్మాదజ్ఞానజం శోకమాత్మశోషవిమోహనమ్|*
*తత్త్వజ్ఞానేన నిర్హృత్య స్వస్థా భవ శుచిస్మితే॥10505॥*
సాధ్వీ! అజ్ఞానమువలన ఈ శోకము అంతఃకరణమును శుష్కింపజేసి, మోహములో పడవేయును. కనుక తత్త్వజ్ఞానముద్వారా ఈ శోకమును పరిత్యజించి, స్వస్థచిత్తవగుము". అని బలరాముడు రుక్మిణితో పలికెను.
*శ్రీశుక ఉవాచ*
*54.50 (ఏబదియవ శ్లోకము)*
*ఏవం భగవతా తన్వీ రామేణ ప్రతిబోధితా|*
*వైమనస్యం పరిత్యజ్య మనో బుద్ధ్యా సమాదధే॥10506॥*
*శ్రీశుకుడు నుడివెను* పరీక్షిన్మహారాజా! మహాత్ముడైన బలరాముడు ఇట్లు స్పష్టముగా వివరించిన పిమ్మట రుక్మిణీదేవి తన మనఃపరితాపమును (శోకమును) పరిత్యజించి, చిత్తస్థైర్యమును పొందెను.
*54.51 (ఏబది ఒకటవ శ్లోకము)*
*ప్రాణావశేష ఉత్సృష్టో ద్విడ్భిర్హతబలప్రభః|*
*స్మరన్ విరూపకరణం వితథాత్మమనోరథః॥10507॥*
*54.52 (ఏబది రెండవ శ్లోకము)*
*చక్రే భోజకటం నామ నివాసాయ మహత్పురమ్|*
*అహత్వా దుర్మతిం కృష్ణమప్రత్యూహ్య యవీయసీమ్|*
*కుండినం న ప్రవేక్ష్యామీత్యుక్త్వా తత్రావసద్రుషా॥10508॥*
తనకు శత్రువులైన యాదవవీరులవలన రుక్మి తన సేనలను, తేజస్సును నష్టపోయి, ప్రాణావశిష్టుడై యుండెను. శ్రీకృష్ణుడు తనను వికృతరూపునిగా చేయుటవలన కలిగిన పరాభవమును పదేపదే స్మరించుకొనుచు, తాను పెట్టుకొనిన ఆశలు అడియాసలైపోగా అతడు తన నివాసార్థమై *భోజకటకము* అను మహానగరమును నిర్మింపజేసెను. 'దుర్మతియైన కృష్ణుని వధించి, నా చెల్లెలగు రుక్మిణిని తీసికొని రానంతవఱకు నేను కుండిన నగరమున అడుగు పెట్టను' అని ప్రతినబూని రుక్మి కోపముతో బుసలు కొట్టుచు *భోజకటకము* నందే నివసింపసాగెను.
*54.53 (ఏబది మూడవ శ్లోకము)*
*భగవాన్ భీష్మకసుతామేవం నిర్జిత్య భూమిపాన్|*
*పురమానీయ విధివదుపయేమే కురూద్వహ॥10509॥*
పరీక్షిన్మహారాజా! కృష్ణభగవానుడు ఈ విధముగా తనకు అడ్డువచ్చిన రాజులను అందఱిని జయించి, భీష్మకమహారాజు కుమార్తెయైన రుక్మిణిని ద్వారకానగరమునకు తీసికొనివచ్చి, విధ్యుక్తముగా పరిణయమాడెను.
*54.54 (ఏబది నాలుగవ శ్లోకము)*
*తదా మహోత్సవో నౄణాం యదుపుర్యాం గృహే గృహే|*
*అభూదనన్యభావానాం కృష్ణే యదుపతౌ నృప॥10510॥*
మహరాజా! యదువంశ శిరోమణియైన శ్రీకృష్ణునియెడ అనన్యభక్తి తత్పరులైన ద్వారకానగరపౌరులు ఎల్లరును ఆ పవిత్రమూర్తుల వివాహమును పురస్కరించుకొని, ఇంటింటా నిత్యనూతనోత్సవములను జరుపుకొనిరి.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఏబది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
[30/03, 06:52] +91 95058 13235: *30.03.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది నాలుగవ అధ్యాయము*
*శ్రీకృష్ణుడు శిశుపాల, జరాసంధాదులను, రుక్మిని ఓడించుట - రుక్మిణీదేవిని పరిణయమాడుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*54.55 (ఏబది ఐదవ శ్లోకము)*
*నరా నార్యశ్చ ముదితాః ప్రమృష్టమణికుండలాః|*
*పారిబర్హముపాజహ్రుర్వరయోశ్చిత్రవాససోః॥10511॥*
ఆ వివాహసమయమున అచటి స్త్రీ పురుషులు అందఱును చక్కని మణికుండలములను అలంకరించు కొనిరి. వారు వివాహోచితములైన విశిష్టవస్త్రములను ధరించియున్న ఆ వధూవరులకు (రుక్మిణీకృష్ణులకు) అనువగు కానుకలను సమర్పించిరి.
*54.56 (ఏబది ఆరవ శ్లోకము)*
*సా వృష్ణిపుర్యుత్తభితేంద్రకేతుభిర్విచిత్రమాల్యాంబరరత్నతోరణైః|*
*బభౌ ప్రతిద్వార్యుపకౢప్తమంగలైరాపూర్ణకుంభాగురుధూపదీపకైః॥10512॥*
*54.57(ఏబది ఐదవ శ్లోకము)*
*సిక్తమార్గా మదచ్యుద్భిరాహూతప్రేష్ఠభూభుజామ్|*
*గజైర్ద్వాఃసు పరామృష్టరంభాపూగోపశోభితా॥10513॥*
ఆ వివాహమహోత్సవ సమయమున ద్వారకానగరము అపూర్వమైన శోభలతో తేజరిల్లెను. పురమునందు ఎల్లెడలను ఎత్తుగా ధ్వజపతాకములను ఎగురవేసిరి. ప్రతిగృహమునందును చిత్రవిచిత్రములైన పూలదండలను, నూతన వస్త్రములను, రత్నతోరణములను అలంకరించిరి. ప్రతి ద్వారమూ మంగళకరములైన వట్టివ్రేళ్ళతో, చిగురుటాకులతో, పూలతో అలంకరింపబడెను. పూర్ణకుంభములతోను, అగరు ధూపములతోను, చూడముచ్చుటైన దీపపంక్తులతోడను ఆ నగరము కనులపండువుగా అలరారుచుండెను. ఆహ్వానముపై ఏతెంచిన మహారాజులయొక్క గజేంద్రముల మదధారలతో ఆ నగరరాజవీథులన్నియును తడిసిపోయెను. భవనములయొక్క ముఖద్వారములన్నియును అరటిస్తంభములతోను, పోకచెట్లతోను ఒప్పుచు కనువిందు గావించుచుండెను.
*54.58 (ఏబది ఎనిమిదవ శ్లోకము)*
*కురుసృంజయకైకేయవిదర్భయదుకుంతయః|*
*మిథో ముముదిరే తస్మిన్ సంభ్రమాత్పరిధావతామ్॥10514॥*
ఆ సమయమున కురు, సృంజయ, కైకేయ, విదర్భ, యదు, కుంతి వంశములకు చెందిన బంధుమిత్రులు ఎల్లరును ఉత్సాహముతో అటునిటు సంచరించుచు పరమానందభరితులైయుండిరి.
*54.59 (ఏబది తొమ్మిదవ శ్లోకము)*
*రుక్మిణ్యా హరణం శ్రుత్వా గీయమానం తతస్తతః|*
*రాజానో రాజకన్యాశ్చ బభూవుర్భృశవిస్మితాః॥10515॥*
శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసికొనివచ్చి, పెండ్లియాడిన (పరిణయ) వృత్తాంతము అక్కడక్కడ గానముచేయబడుచుండెను. ఆ గీతాలాపములను విని, రాజులు రాచకన్యలు మిక్కిలి సంభ్రమాశ్చర్యములలో మునిగిపోయిరి.
*54.60 (అరువదియవ శ్లోకము)*
*ద్వారకాయామభూద్రాజన్ మహామోదః పురౌకసామ్|*
*రుక్మిణ్యా రమయోపేతం దృష్ట్వా కృష్ణం శ్రియఃపతిమ్॥10516॥*
రాజా! లక్ష్మీనారాయణుల అవతారమూర్తులైన రుక్మిణీశ్రీకృష్ణులను కనులారగాంచుచున్న ద్వారకానగర పౌరులలో మహానందను వెల్లివిరిసెను.
*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే రుక్మిణ్యుద్వాహే చతుఃపంచాశత్తమోఽధ్యాయః (54)*
ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, ఉత్తరార్ధమునందలి *శ్రీకృష్ణుడు శిశుపాల, జరాసంధాదులను, రుక్మిని ఓడించుట - రుక్మిణీదేవిని పరిణయమాడుట* యను ఏబది నాలుగవ అధ్యాయము (54)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
[30/03, 21:28] +91 95058 13235: *30.03.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది ఐదవ అధ్యాయము*
*ప్రద్యుమ్నుని జననము - శంబరాసురవధ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*శ్రీశుక ఉవాచ*
*55.1 (ప్రథమ శ్లోకము)*
*కామస్తు వాసుదేవాంశో దగ్ధః ప్రాగ్రుద్రమన్యునా|*
*దేహోపపత్తయే భూయస్తమేవ ప్రత్యపద్యత॥10517॥*
*శ్రీశుకుడు నుడివెను* పరీక్షిన్మహారాజా! వాసుదేవుని యొక్క అంశయైన మన్మథుడు పూర్వము శంకరుని క్రోధాగ్నికి భస్మీభూతుడయ్యెను. అతడు మఱల దేహమును పొందుటకై వాసుదేవుని ఆశ్రయించెను.
*55.2 (రెండవ శ్లోకము)*
*స ఏవ జాతో వైదర్భ్యాం కృష్ణవీర్యసముద్భవః|*
*ప్రద్యుమ్న ఇతి విఖ్యాతః సర్వతోఽనవమః పితుః॥10518॥*
అతడు శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవియందు జన్మించి, *ప్రద్యుమ్నుడు* అను పేరుతో ఖ్యాతి వహించెను. అతడు అన్నివిధములుగా (సౌందర్య, వీర్య, సౌశీల్యాది గుణముల యందు) తండ్రితో (శ్రీకృష్ణునితో) సమానుడుగా ఉండెను.
*55.3 (మూడవ శ్లోకము)*
*తం శంబరః కామరూపీ హృత్వా తోకమనిర్దశమ్|*
*స విదిత్వాఽఽత్మనః శత్రుం ప్రాస్యోదన్వత్యగాద్గృహమ్॥10519॥*
కామరూపియైన శంబరాసురుడు ఈ శిశువు (ప్రద్యుమ్నుడు) మున్ముందు తనకు శత్రువు కాగలడని నారదుని వలన వినెను. వెంటనే ఇతరులు గుర్తింపలేని విధముగా అతడు మాఱు రూపమును ధరించి, ఇంకను పది దినములు నిండని ఆ శిశువును అపహరించుకుపోయి సముద్రమునందు ఉంచి, తన గృహమునకు చేరెను.
*55.4 (నాలుగవ శ్లోకము)*
*తం నిర్జగార బలవాన్ మీనః సోఽప్యపరైః సహ|*
*వృతో జాలేన మహతా గృహీతో మత్స్యజీవిభిః॥10520॥*
*55.5 (ఐదవ శ్లోకము)*
*తం శంబరాయ కైవర్తా ఉపాజహ్రురుపాయనమ్|*
*సూదా మహానసం నీత్వావద్యన్ సుధితినాద్భుతమ్॥10521॥*
*55.6 (ఆరవ శ్లోకము)*
*దృష్ట్వా తదుదరే బాలం మాయావత్యై న్యవేదయన్|*
*నారదోఽకథయత్సర్వం తస్యాః శంకితచేతసః|*
*బాలస్య తత్త్వముత్పత్తిం మత్స్యోదరనివేశనమ్॥10522॥*
అనంతరము సముద్రమునందలి ఒక పెద్ద (మిక్కిలి బలిష్ఠమైన) చేప ఆ శిశువును మ్రింగివేసెను. పిదప కొంతకాలమునకు జాలరులు (బెస్తవారు) వేఱే చేపలతోపాటు ఆ మహామత్స్యమునుగూడ పెద్ద వలచేసి పట్టుకొనిరి. పిమ్మట ఆ జాలరులు అ మహామీనమును శంబరాసురునకు కానుకగా సమర్పించిరి. అంతట వంటవారు అ మహామీనమును వంటశాలకు తీసికొనివెళ్ళి, గండ్రగొడ్డలితో (ఒక అస్త్రముతో) దానిని ఖండించిరి. వంటవారు ఆ చేపకడుపులో ఒక బాలుని చూచి, అ విషయమును మాయావతికి నివేదించిరి. ఆ బాలుని జూచి ఆమె మిగుల ఆశ్చర్యపడెను. ఇంతలో నారదుడు అచటికి వచ్చి, ఆ బాలుడు మన్మథుడనియు, శ్రీకృష్ణుని పత్నియైన రుక్మిణియందు జన్మించినాడనియు, అతనిని శంబరాసురుడు సముద్రమునందుంచగా, ఒక మహామీనము ఆ శిశువును మ్రింగివేసెననియు ఆమెకు తెలిపెను.
*55.7 (ఏడవ శ్లోకము)*
*సా చ కామస్య వై పత్నీ రతిర్నామ యశస్వినీ|*
*పత్యుర్నిర్దగ్ధదేహస్య దేహోత్పత్తిం ప్రతీక్షతీ॥10523॥*
ఆ మాయావతి లోగడ మన్మథుని పత్నియైన రతీదేవియే. సాధ్వియైన ఆ యశస్విని, శంకరుని క్రోధాగ్నికి భస్మమైన తన పతియొక్క పునర్ఝన్మకై నిరీక్షించుచుండెను.
*55.8 (ఎనిమిదవ శ్లోకము)*
*నిరూపితా శంబరేణ సా సూదౌదనసాధనే|*
*కామదేవం శిశుం బుద్ధ్వా చక్రే స్నేహం తదార్భకే॥10524॥*
శంబరాసురునిచే వంటశాలలో వంటగత్తెగా నియమింపబడిన ఆ మాయావతి ఆ శిశువు మన్మథుడేయని తెలియుటతో ఆ బాలునిపై మిక్కుటమైన అనురాగమును చూపసాగెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఏబది ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
[31/03, 04:55] +91 95058 13235: *31.03.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఏబది ఐదవ అధ్యాయము*
*ప్రద్యుమ్నుని జననము - శంబరాసురవధ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*55.9 (తొమ్మిదవ శ్లోకము)*
*నాతిదీర్ఘేణ కాలేన స కార్ష్ణీ రూఢయౌవనః|*
*జనయామాస నారీణాం వీక్షంతీనాం చ విభ్రమమ్॥10525॥*
శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడు కొలది కాలములోనే యౌవనవంతుడాయెను. అతని రూపలావణ్యముల వైభవమును వీక్షించిన తరుణీమణులందరికిని ఆయనపై మోహము ఏర్పడుచుండెను.
*55.10 (పదియవ శ్లోకము)*
*సా తం పతిం పద్మదలాయతేక్షణం ప్రలంబబాహుం నరలోకసుందరమ్|*
*సవ్రీడహాసోత్తభితభ్రువేక్షతీ ప్రీత్యోపతస్థే రతిరంగ సౌరతైః॥10526॥*
రాజా! ప్రద్యుమ్నుని నేత్రములు పద్మపత్రములవలె విశాలములై మనోహరముగా ఉండెను. ఆ ఆజానుబాహుని శుభాకారము జగన్మోహనము. ఆ పంచబాణుని (మన్మథుని) జూచి మాయావతి (రతీదేవి) సిగ్గుతో చిఱునవ్వులను చిందించుచు భావగర్భితముగా చూచుచు (హొయలొలికించుచు) అతనిని తనవైపు ఆకర్షించుటకు చేరువయగుచు సేవించుచుండెను.
*55.11 (పదకొండవ శ్లోకము)*
*తామాహ భగవాన్ కార్ష్ణిర్మాతస్తే మతిరన్యథా|*
*మాతృభావమతిక్రమ్య వర్తసే కామినీ యథా॥10527॥*
అంతట మహాత్ముడైన ప్రద్యుమ్నుడు మాయావతితో ఇట్లనెను. "అమ్మా! నేను నీ కుమారుడనుగదా! ఆ మాతృభావమును విస్మరించి, సిగ్గువిడచి, ఒక సామాన్యభామినివలె వలపులను క్రుమ్మరించుచు పలురీతుల విలాసచేష్టలను ప్రదర్శించు చున్నావు. ఇట్లు మోహకృత్యములకు పాల్పడుట ఎంతవఱకు సముచితము?"
*రతిరువాచ*
*55.12 (పండ్రెండవ శ్లోకము)*
*భవాన్ నారాయణసుతః శంబరేణ హృతో గృహాత్|0'*
*అహం తేఽధికృతా పత్నీ రతిః కామో భవాన్ ప్రభో॥10528॥*
*55.13 (పదమూడవ శ్లోకము)*
*ఏష త్వానిర్దశం సింధావక్షిపచ్ఛంబరోఽసురః|*
*మత్స్యోఽగ్రసీత్తదుదరాదిహ ప్రాప్తో భవాన్ ప్రభో॥10529॥*
*రతీదేవి (మాయావతి) ఇట్లనెను* "ప్రభూ! నీవు శ్రీమన్నారాయణుని (శ్రీకృష్ణుని) సుతుడవు. శంబరాసురుడు నిన్ను పురిటింటినుండి అపహరించుకొని వచ్చెను. నేను నీకు ప్రీతిపాత్రు రాలనైన ధర్మపత్నిని. నీవు వాస్తవముగా పూజ్యుడవైన మన్మథుడవు. ఈ శంబరాసురుడు పదిదినములైనను నిండని శిశువుగా ఉన్న నిన్ను దొంగిలించుకొనివచ్చి, సముద్రమునందు ఉంచెను. ఒక మహామీనము నిన్ను మ్రింగెను. దాని ఉదరములోనున్న నీవు ఇక్కడికి చేరితివి.
*55.14 (పదునాలుగవ శ్లోకము)*
*తమిమం జహి దుర్ధర్షం దుర్జయం శత్రుమాత్మనః|*
*మాయాశతవిదం త్వం చ మాయాభిర్మోహనాదిభిః॥10530॥*
ఈ శంబరాసురుడు వందలకొలది మాయలను ఎఱిగినవాడు. ఇతడు ఎదిరింప సాధ్యముకానివాడు. కనుక ఇతనిని జయించుట కష్టము. నేను నీకు మాయావిద్యలను నేర్పెదను. వాటిని ప్రయోగించి, నీ శత్రువైన ఇతనిని మోహమున ముంచి జయింపుము.
*55.15 (పదిహేనవ శ్లోకము)*
*పరిశోచతి తే మాతా కురరీవ గతప్రజా|*
*పుత్రస్నేహాకులా దీనా వివత్సా గౌరివాతురా॥10531॥*
"నీ తల్లియైన రుక్మిణీదేవి నీవు తనకు దూరమగుటతో సంతానమును కోల్పోయిన కురరి (లకుముకిపిట్ట) వలె గోడుగోడుమనుచున్నది. ఆమె పుత్రప్రేమ కారణముగా దూడను కోల్పోయిన ఆవువలె దీనురాలై అంతులేని బెంగతో బావురుమనుచున్నది".
*55.16 (పదహారవ శ్లోకము)*
*ప్రభాష్యైవం దదౌ విద్యాం ప్రద్యుమ్నాయ మహాత్మనే|*
*మాయావతీ మహామాయాం సర్వమాయావినాశినీమ్॥10532॥*
ఇట్లు పలికిన పిమ్మట ఆ మాయావతి మహాత్ముడైన ప్రద్యుమ్నునకు సకలమాయలను వమ్మొనర్చునట్టి మోహనాది మాయావిద్యలను నేర్పించెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఏబది ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి