16, ఏప్రిల్ 2021, శుక్రవారం

గోపాల కృష్ణుడు లీల


రాధాకృష్ణ రాసలీల --1


రాధా రమ్యము...దాహము గదా..రాత్రంత ఉండేదవా

రాధావేగము...దాహచరితం...సొమ్మంత ఇచ్చేదవా


చిత్తం మందును ... చిన్మయముగా.. సేద్యమ్ము చేసేదవా

మత్తింతేనులె...మానసికమే...మధ్యమ్మే చేసేదవా


ఈప్రాణమ్మున..ఈమనసులో ...ఈయంధకారమ్ములో

ఈప్రాముఖ్యము... ఈ వయసులో.. ఈఆశ ప్రేమమ్ములో


ఈ ప్రాబల్యము...ఈసొగసులో...ఈవిద్య సంతృప్తి లో

ఈప్రోత్సాహము...ఈమనసులో... ఈ లక్ష్య భావమ్ముయే


రా దేవీనిను .. ప్రార్ధనలతో ... రక్షించగా వేడెదన్

రా దేవీ విను.. ఆశయముతో..రంజిల్ల పర్చేనులే


రా దేవీ కను... రాత్రికలలో... రమ్యమ్ముగా చూపెదన్

రా దేవీ కళ... రాటుతనతో... రాజ్యమ్ముగా ఎలెవన్


రమ్యమ్మే ఇది... రమ్యతలతో. ...ప్రారబ్ధ మేలే సదన్

కామ్యమ్మే ఇది... కమ్మనిదియే...కారుణ్య భావమ్ముగన్


సౌమ్యమ్మే ఇది సమ్మతముయే...సారూప్య దేహమ్ముగన్

చిన్మాయే ఇది .. చిత్రములు యే.. సామర్ధ్య దాహమ్ముగన్

*****

రాధాకృష్ణ రాసలీల --(2)


గుండె గూటి దివ్య మాట గునపంలా గుచ్చిందా  

మండె మంట గుడ్డి ఆట వెలుగంతా కమ్మిందా


రాధ కొంత ఓర్పు ఉంచి ప్రేమనంతా చూపించు 

పెదవిచాటు మౌన మాట దీపంలా వెలిగిందా   


కనులమాటు కాంతియాట వేదంలా మిగిలిందా 

కళలు వేటు కొంత యాట ప్రేమల్లే ఇక రాధా  


మండె మాట మబ్బు మాట చినుకుల్లా వచ్చిందా

ఆశ యందు సేద తీట ఆట బతుకంతా విచ్చిందా 


రాధ ముందు ఆశ వల్ల నేమి మనసంతా ప్రేమేగా  

పొదలమాటు ప్రేమయేట కోపంలా నలిగిందా   


మరులు గొల్పు ప్రేమ ఆట వినయంగను ఉందా  

తరుణమాయ ప్రేమవేట దాహమ్మే  ఇది రాధా 


ఉండె ఘాటు ప్రేమ మాట మనసుల్లా తాకిందా

కారు మబ్బు ప్రేమ ఆట  వయసంతా పాకిందా 


రాధ నీవు స్వేశ్చ కోరి తనువంతా కోరిందా 

వెసులుబాటు చెప్పుఆట తాపంలా మిగిలిందా 


కరుణమాయ ఒప్పుఆట  పాపంలా మనదందా  

మనసు మాటు చూపు ఓర్పు స్నేహంలా ఇది రాధా 


తిండి దక్కె ఆశ మాట  తనువల్లా వణికిందా 

ఒట్టి మాట ఒప్పుమాట కామంతో పిలిచిందా     


గట్టి పట్టు చూపి నావు నాకెంతో ఇది రాధా 

ఒక ఘాటు సరసం మాట అర్ధ మైతే వర్ష0 కాదా   


ఇక ఘాటు విరహం మొహ మయ్యే ఐతే దాహం కాదా  

చక చిక్కి చరితం మంత తెల్పే ప్రేమే హర్షం రాధా  

--(())--


రాధాకృష్ణ రాసలీల --3


అప్పు కాదులే ప్రేమ మనలో  

గాయ మైనదే  ప్రేమ ఒడిలో 

నిప్పు పుట్టనే  ప్రేమ దడిలో 

చింత లీలనే  రాధ  తోడులో  


అప్పు పెరిగినా మనసు తాపమే 

పేమ ముదిరినా వయసు కోపమే 

గాయ మయినచో తపను మాయమే   

ప్రేమ చెడినచో కళలు ద్రోహమే రాధా  


నిప్పు తగిలినా హృదయ వేదనే 

ప్రేమ చెరిగినా పదము రోదనే 

చింత తలచినా వదన శోధనే 

ప్రేమ తలచినా మదన కోరునే రాధా 


చిన్నదనేది ఏదీ లేదు ప్రేమలో రాధా 

పేద దనేది ఏదిలేదు ప్రేమలో రాధా 

ప్రాణంతో ఉన్న గుణమే మనలో రాధా 

అది పోతే ప్రేమలో స్వార్ధం చేరు రాధా 


జీవితాన్ని పాడుచేసే సామర్ధ్యం ప్రేమ కుంది 

జీవితంలొ స్నేహమిచ్చె ప్రేమార్ధం ప్రేమ కుంది 

 రాధా కృష్ణా .... రాధా కృష్ణా .... రాధా కృష్ణా   

*****

రాధాకృష్ణ రాసలీల-- వేసవిలో (4) 


భగ భగ వేడి తోడైతే రాధ మనకు తోడు ప్రేమ గాలి నీడ  

ధగ ధగ మెర్పు తోడైతే మనకు వెల్గు ప్రేమ జాలి  నీడ 


జీవులు ఆవిరవు తుంటె రాధ మనకు సెగలు తోడు నీడ  

శబ్ద ఘోష చెవులకు వినబడే గాలి మనకు కళలు తోడు నీడ 


ఎటుచూసిన అరుపులుంటె రాధ ప్రేమకు తెలియదు నీడ 

మనసునే చుట్టి నట్టుంటె రాధ ప్రేమ కాంతి వేడిగాలి నీడ 


పంచ భూతాలే ఉంటె రాధ ప్రేమలో ఎగిసిపడే అగ్ని గాలి నీడ 

కార్చిచ్చే రగులుతుoటె రాధ ప్రేమలో శాంతించాలి విశ్వ నీడ 


ప్రేమయే పంచాలంటె రాధ ప్రేమలో సుఖమే యిచ్చి పొందాలి నీడ 

సేవలే చెయ్యా లంటె రాధ ప్రేమలో నిజమే తెల్పి బతకాలి నీడ 


సుఖమ్మే పొందా లంటెరాధ ప్రేమలో నిత్యం శాంతి పొందాలి నీడ 

ఆటలో గెలవా లంటె రాధ ప్రేమలో పోటీ దారులనో డించాలి నీడ  


నీళ్లునే పోశా రంటె రాధ ప్రేమలో తరువుల్లాగ బ్రతకాలి నిత్య నీడ 

జీవితంలో గెలవాలంటె రాధ ప్రేమలో తోటివారిని ప్రేమించు అదే నీడ 


హృదయాన్ని చల్లార్చే మార్గముండాలి ప్రేమలో నిజమైన నీడ 

రాధా కృష్ణా ---రాధా కృష్ణా ----రాధా కృష్ణా 

****రాధాకృష్ణ రాసలీల -5


రారమ్మా రారయ్యా గోపికల లీల      

గోపమ్మా గోపయ్యా  దైవ లీల  

చూడాలి గోపయ్య మాట తీరు లీల    

చేరాలి కొలవాలి చిన్ని కృష్ణ లీల   


మనసు శాంత పరుచు అందరికీ నవ్వుల చూపు 

వయసు వేడి పరచు కొందరికీ నవ్వుల చూపు 


నిర్మల మైన మనసుతో పువ్వులా చిన్న నవ్వు   

నిర్మల మైన కరుణతో  నవ్వులా చిన్న పువ్వు 


శ్రీ రమ్య చరితమ్ము గలగి కాంతుల్ని అందరికీ పంచు 

శ్రీ గమ్య చరణమ్ము కలిగి పున్నమి వెలుగుల్ని పంచు  


సకల చూపులు చూచెడి మనసు దోచెడి కృష్ణలీల   

నయనాల లోను మెరవు మనసు తిప్పేటి కృష్ణ లీల   


యశోదమ్మ ముద్దుల బాలకృష్ణుడు పిల్లలతో అల్లరి చేయు లీల 

నిత్య ముద్దులు కురిపించు మనసులోన మాయ తుంచు లీల   


మదిలోన నుండెటి ప్రశాంతుడు అందరికీ మేలు కల్పించు లీల 

తప్పులన్నిటి సరి దిద్దేవాడు మానవులలొ మనసు పంచు లీల 


అందర్నీ కాపాడు చుండేడి చెప్పుడు మాటలు నమ్మని లీల    

నిజము ఎపుడు చెప్పెయు మనసు మరీ మాయ చేయు లీల  


రారమ్మా రారయ్యా గోపిక లీల      

గోపమ్మా గోపయ్యా  దైవ లీల   

చూడాలి గోపయ్య మాట తీరు లీల    

చేరాలి కొలవాలి చిన్ని కృష్ణ లీల   


****



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి