గురు అష్టకము
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
“నిజమైన గురువుకి సమానమైనదానిని మూడులోకాలలోను చెప్పలేము. పరుసవేది దేన్నైనా బంగారంగా మార్చుతుందేమో కాని ఇంకొక పరుసవేదిగా మార్చదు. కాని ఒక గురువు తన్ను నమ్మి శరణుజొచ్చిన శిష్యుడిని తనంతటివాడిని చేస్తాడు. కాబట్టి గురువు అసమానుడు. అల్ప బుద్ధి కలవాణ్ణి కూడా పండితుణ్ణి చెయ్యగలడు గురువు.
జగద్గురువులైన ఆదిశంకరులు గురువు గురించి చాలా గొప్పగా చెబుతారు. వారు ఒకచోట అడుగుతారు,“ఎన్ని ఉన్నా, మనస్సు గురు పాదములను పట్టుకోకపోతే ఏమిటి దాని ఉపయోగం?”అని. వారి రచించిన ‘గురు అష్టకం’లో ప్రతి చోట అడుగుతారు. ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? అని. ఎనిమిది శ్లోకములలోను దీన్ని మకుటంగా ఉంచి మనల్ని ప్రశ్నిస్తున్నారు.
శ్రీశంకర భగవత్పాదులు రచించిన గురు అష్టకం శిష్యునికి ఉండాల్సిన ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదిస్తుంది. శిష్యుడికి ఉండాల్సింది గురువు మీద నమ్మకం, విశ్వాసం. మనకు ఎవరిమీద ఐతే గురి కలుగుతుందో వారే గురువు.
శ్రీ శంకరాచార్య విరచిత గురు అష్టకం:-
ॐॐॐॐॐॐॐॐ
1) శరీరం సురూపం తథా వా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్॥
మంచి దేహధారుడ్యము, అందమైన భార్య, పేరు ప్రతిష్టలు, మేరు సమానమైన ధనం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
2)కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం గృహం బాంధవాః సర్వ మేతద్ద్విజాతం!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥
భార్య, ధనము, పిల్లలు, వారి పిల్లలు, ఇళ్ళు, బంధువులు, గొప్ప వంశంలో జన్మ ఉన్నప్పటికి గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
3) షడంగాదివేదో ముఖే శాస్త్రవిద్యా కవిత్వాది గద్యం సుపద్యం కరోతి!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥
ఆరు వేదాంగములు (శిక్ష, చందస్సు, వ్యాకరణం, నిరుక్త, కల్ప, జ్యోతిష్య), నాలుగు వేదాలు, గద్య పద్య రాయగల జ్ఞానం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
4) విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః సదాచారవృత్తేషు మత్తో న చాన్యః!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥
విదేశాలలో మంచి పేరు, స్వదేశంలో హోదా పలుకుబడి, అందరూ మెచ్చే గుణము, మంచి జీవితం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
5) క్షమామండలే భూపభూపాలవృందౌసదా సేవితం యస్య పాదారవిందమ్!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥
గొప్ప రాజ్యానికి చక్రవర్తివైనా, రాజులు మహారాజుల చేత సేవింపబడుతున్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
6) యశో మే గతం దిక్షు దానప్రతాపాత్ జగద్వస్తు సర్వం కరే సత్ప్రసాదాత్!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥
నీ ఖ్యాతి నలుదెశలా వ్యాపించి ప్రపంచమంతా నీ దయాగుణాన్ని ప్రశంచించినా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
7) న భోగే న యోగే న వా వాజిరాజౌ న కాన్తాసుఖే నైవ విత్తేషు చిత్తం!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥
భోగము, యోగము, ఇష్టము, అగ్నికార్యము, విషయ సుఖము, విత్తములపై నీ మనస్సు విరక్తి పొందినా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
8) అరణ్యే న వా స్వస్య గేహే న కార్యే న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥
నీ మనస్సు అరణ్యమున ఉన్నా, ఇంట్లో ఉన్న, సమాన్య విషయములపై తిరుగుతూ ఉన్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
9) అనర్ఘ్యాణి రత్నాది ముక్తాని సమ్యక్ సమాలింగితా కామినీ యామినీషు!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥
వెలకట్టలేని మణులు, రత్నాలు, వజ్రవైఢూర్యాలు సదా నిన్ను అనిగమించే అంటిపెట్టుకునే భార్య ఉన్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
10) గురోరష్టకం యః పఠేత్పుణ్యదేహీ యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ !
లభేత్ వాంఛితార్థ పదం బ్రహ్మసంజ్ఞం గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నం ॥
ఫలశ్రుతి:-
ఎవరైతే ఈ గుర్వాష్టకాన్ని చెదువుతారో,నేర్చుకుంటారో, మననం చేస్తారో, గురువు చెప్పిన విషయాలను నిత్యం స్మరిస్తూ గురు పాదపద్మములపై మనస్సు లగ్నం చేస్తారో,అటువంటివారు యోగి అయినా, సన్యాసి అయినా, రాజు అయినా, బ్రహ్మచారి అయినా, గృహస్
తు అయినా తనికి శాశ్వత పరతత్వమగు పరబ్రహ్మం సిద్ధిస్తుంది.
సదాశివ సమారంభాం, శంకరాచార్య మధ్యమాం!
అస్మదాచార్య పర్యంతం, వందే గురు పరంపరాం!!
🕉🌞🌎🌙🌟🚩
తు అయినా తనికి శాశ్వత పరతత్వమగు పరబ్రహ్మం సిద్ధిస్తుంది.
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 2 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
🌻 1. “శ్రీ మాతా 🌻
“శ్రీ” యనగా లక్షి, సరస్వతి, భూమి, భాగ్యము, సంపద, జయము, కాంతి, జ్ఞానము అను అర్ధములు కలవు.
'శ్రీమాత అనగా వరికి తల్లి అని అర్ధము. అనగా లలితాదెవి లక్ష్మి, సరస్వతి, రుద్రాణిలకు కూడా తల్లియై పరమశివుని పత్నియైన పరాశక్తి, పరాభట్టారిక అని తెలుపబడుచున్నది. అంతటికి అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అట్టి మాతృదెవి మోక్షార్ధులచె కూడ స్తుతింప దగినది. ఈమె వెదములకు, (బ్రహ్మకు కూడ ముందుగ నున్నది.
శ్రీ యన విషము అను అర్ధము కూడ కలదు. మాత యన కంఠమున నుంచుకొనినది. అనగా ఈమె సృష్టి సంహారకారిణి కూడ.
లలితాదేవి సర్వజనయిత్రి. సమస్త భూతములు ఆమె నుండి పుట్టుచున్నవి. సర్వసృష్టికి మూలకారణము. లోకమున బాధ కలిగినపుడు తల్లిని స్మరించుట కద్దు. లోకములోని తల్లులు తాపత్రయములను పోగొట్టు సమర్ధురాండ్రు కారు. సంసార సాగరమందు పడి అన్య రక్షణ లేక భయగ్రస్తులైనవారు దురంత దుఃఖములను పొందుతారు జగన్మాతయగు శ్రీమాతను తలచినచో అభయము కలుగును.
దయావతిగాన మాతృమూర్తిగా స్తుతింప దగినది. సృష్టి మొత్తమును మూలాధారశక్తియె సకల బ్రహ్మాండములు ఈమె యందుండుటచె శ్రీమాతయైనది.
జనులచే ఆశయింపబడిన దగుటచే కూడ శ్రీ మాత అగుచున్నది. నిర్దుణ పరబ్రహ్మమె సృవ్యాదుల నొనర్ప సగుణ బ్రహ్మముగా వచ్చినపుడు శ్రీమాత యగుచున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక
సహస్ర నామముల తత్వ తేటగీతి పద్యాల వివరణ
రఛయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
1. “శ్రీ మాతా
🌻 2. “శీ మహారాజ్ణీ 🌻
సమస్త ప్రపంచముల గుంపును పాలించు అధికారము గలది అని అర్ధము. రాజ శబ్దమునకు పాలించువాడు అని, రాజ్ఞి అను శబ్దమునకు వాలించునది అను అర్ధములు గలవు. ఎవరిచే సమస్త ప్రపంచము పుట్టింపబడి పాలింపబడుచున్నదో ఆ మహాశక్తిని ఇచ్చట స్మరించుట జరుగుచున్నది.
శ్రీ మహారాజ్ఞి పదమును, శ్రీం, అ, హ, రాజ్ఞి అని గ్రహించిన, శ్రీం-షోడశకళగను, అ-పరతత్త్వముగను, హ-అందుండి వెలువడిన వెలుగుగను, రాజ్ఞా-మాయకు అధిదెవతగను తెలియదగును. శ్రీ, శ్రీవిదధ్యలో పరమ రహస్యమైన షోడశాక్షరీ మంత్రము నందు మొదటి అక్షరము.
సద్దురువు నందు పూర్ణభక్తి విశ్వాసములు గల శిష్యునకు మాత్రము ఉపదేశింపదగిన అక్షరము. గురూపదేశము ననే ఈ అక్షరము పదహారు కళలను అంతర్ముఖముగ వికసింప చేయును. చతుర్లక్ష్మి మంత్రములలో కూడ శ్రీ మొదటి వర్ణముగ లల్లుడు వ్యాఖ్యానించెను. అకారము పరతత్త్వమే.
అక్షరములలో అకారము నేనని భగవంతుడు నుడివియున్నాడు కదా! (భగవద్దిత 10వ అధ్యాయము). అకారము శక్తి అని ఇచ్చట సంకేత పద్ధతిలో చెప్పబడినది. అనగా పరతత్త్వము వెలుగు, వెలుగు యొక్క షోడశ కళలుగ ఏర్పడు సృష్టి. దానిని ఆవరించియుండు మాయ ఈ నామమున కీర్తింపబడుచున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక
సహస్ర నామముల తత్వ తేటగీతి పద్యాల వివరణ
రఛయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
3. "శ్రీమత్సింహాసనేశ్వరి"
సింహ పీఠమ్ము నధిష్టించి రాక్ష సులను
హింస జరిపియు జగతి శమింప జేయు
ధర్మ రక్షణ శిక్ష అధర్మ పరులు కిచ్చి
సింహ శబ్ధము తో అమ్మ లోక రక్ష
జ్ణాన మార్గము తొఅజ్ణా నమును నిలిపి
జీవి ధర్మాధర్మఘర్షణ యందు ఉన్న
హింస జరపకుం డక కాపు కాయు సర్వ
లోక మాతకు హృద్యమ్మ వందనమ్మ
స్థితికి పరిణతి వవెకియై చెందు చుండు
మానవడు కొంత హింసకు లోను అయ్యె
బాహ్య జగతియు సంగము ప్రశ్న అయ్యె
హృదయ నందుఉండియు యోగ మివ్వు తల్లి
--(())--
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక
సహస్ర నామముల తత్వ తేటగీతి పద్యాల వివరణ
రఛయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
యజ్ఞ కుండము నుండియే సృష్టి పుట్టి
సృష్టి చైతన్య సంకల్పమేర్పడియును
కోటి సూర్యల మించిన అగ్ని పుట్టె
దేవి సంకల్ప నుద్భవించినదె సృష్టి
నరుల చైతన్య నిద్రలో అగ్ని పుట్టి
మేల్కొ నేటిత త్వపు శక్తి అగ్నిగాను
ప్రేరణయె సత్య వంతుని సృష్టి కలుగు
మరల చైతన్య సంకల్ప మృద్ధి జరుగు
చీకటిహరింప బడుకాంతి గుణము పుట్టి
కాల గతియుయె మడగల శక్తి పుట్టి
సత్వ గుణములు ఉద్భవించి మరల అవి
చేతన అగ్నియు యజ్ఞార్థ మైన సృష్టి
అగ్నిగుండం నుంచి ఉద్భవించే సృష్టి
సృష్టికి మూలం అమ్మలగన్న అమ్మాయే
--(())--
చిదగ్ని యను కుండము నుండి పుట్టినది అని అర్ధము. పరతత్త్వము నుండి ఏర్పడిన మొదటి సంకల్పమే యజ్ఞకుండము. అందుండియే సమస్త సృష్టి ఏర్పడును. సంకల్ప మెర్పడగానె చైతన్యము కూడ ఏర్పడును. ఆ చైతన్యము కోటి సూర్యులను మించిన అగ్నిగా వ్యక్తమగును.
సృష్టి యజ్ఞకుండమున చైతన్యాగ్ని ఈ విధముగ ఉదృవించును. అందుండి సమస్త లోకములు, ఆ లోకములందుండు జీవులు ఉద్భవింతురు. ఉధృవించిన సమస్త లోకములయందు, లోకుల యందు కూడ చైతన్యమను అగ్ని అంతర్హితముగ నున్నది. ఏ అగ్ని నుండి ఈ సమస్తము ఉద్భభవించినదో ఆ చైతన్యాగ్ని కూడ పరబ్రహ్మ స్వరూపిణియైన దేవి నుండి సంకల్పమాత్రముగ ఉద్బవించినదని భావన.
మానవుడు నిద్ర నుండి మెల్కాంచుట ప్రతినిత్యము జరుగు చున్నది. స్థితి లేక సత్యము నందున్నటువంటి తత్త్వము చైతన్యముగ మెల్మాంచుచున్నది. ఈ మెల్కొనుటకు వలసిన సంకల్పము మానవుని ఎరుకలో లేదు. అంతర్హితముగ నున్న తత్త్వము నుండి ప్రేరణ (సంకల్పము) కలిగి, చైతన్యవంతుడుగ మెల్కాంచుచున్నాడు. ఇట్లు సత్యవంతుడు చైతన్యవంతుడగు చున్నాడు. అట్లే పెంజీకటి కవ్వలనున్న తత్త్వము (తమనః వరస్తాత) ఈ మొదటి సంకల్పమును వ్యక్తముజేసి, దాని నాధారముగ గొని చైతన్వాగ్నిగ వ్యక్తమగును.
మెల్మాంచిన మానవుని నుండి మరల సంకల్పములు కలిగి, తన చుట్టును తన జీవితమను సృష్టి నేర్చరచుకొనుచున్నాడు.
అట్లే పరతత్త్వము నుండి సంభవించిన చైతన్యమను అగ్నికూడ మెల్మొనబడినదై సృష్టి కార్యమునకు పూనుకొనును. చైతన్యాగ్ని సంభవించగనే తమస్సను చీకటి హరింపబడి, వెలుగు వ్యాపించును. సత్యవంతుడు చైతన్యవంతుడగుట కూడ తమస్సు (నిద్ర) నుండి పరతత్త్వము చైతన్యముగా మెల్కాంచుటయె. ఇట్లు మెల్మ్కాంచిన తత్త్వము మరల పరతత్త్వములోనికి కాలగతిని యిమడగలదు. అనగా మరల తమోగుణము ఆవరింపగలదు. రాత్రి ఏర్పడగనే జీవులన్నియు నిద్ర యను తమస్సులోనికి తీసుకొనబడి పోవుచున్నవి కదా! కావున యజ్ఞార్థమై
సృష్టి నిర్మాణము చేయుటకు చైతన్వాగ్నిగ సంకల్పము నుండి వ్యక్తమగుట, మరల తిరోధానము చెందుట అనునవి పరతత్త్వ మాధారముగ జరుగుచున్నవి.
తమస్సు కవ్వలనుండు తత్త్వము తమస్సును భేదించు కొని రజస్సుగ నుదృవించును. తిరోధానమున మరల రజస్సును తమస్సు హరించుకొనును. ఆ తమస్సున కవ్వల స్టితి యున్నది. ఆ తమస్సున కివ్వల కూడ స్థితి యున్నది. తమస్సున కివలి స్ధితి సత్త్వగుణము నాశ్రయించి యుందును. తమస్సున కవ్వలిస్థితి త్రిగుణ ములకును ఆశయము.
ఈ చిదగ్ని శోక మోహములను దహింపగలదు. ఇది సమస్త ధర్మములను ధరించియుండును. దీనిని చెరుటయే దేవిని చేరుట. సంభూత అని చెప్పుటలో ఉన్నదే వ్యక్తమైనదని అవగాహన సమ్యక్+భూతు. చైతన్యాగ్ని రూపముగ వ్యక్తమగుటకు పూర్వము ధర్మముగ పరతత్త్వమున నున్నదియె కాని, పుట్టినదని అర్ధము కాదు.
అనగా దేవి యొక్క శాశ్వతత్త్వము సంభూతా అను పదముతో అద్భుతముగ ప్రతిపాదింపబడినది. భూతమనగా ఉన్నది వ్యక్తమైనదని అర్ధము. అనగా గుణాతీత తత్త్వము సగుణమైనదని గ్రహింపవలెను. ఈ నామము అష్టాక్షరీ నామము కనుక ఏడు లోకములకు ఆశ్రయము నిచ్చు ఎనిమిదవది అని కూడ గ్రహింపవలెను.
సశేషం...
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక
సహస్ర నామముల తత్వ తేటగీతి పద్యాల వివరణ
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
దేవి ఉద్యుక్తురాలగ మారకుండి
గాని విశ్రాంతి గొనుటయు లేకవుండు
నరుల మేల్కొల్పి తొలగించు బద్ధకమ్ము
కార్య ములయందు ఉద్యుక్తు మవ్వకుండు
ఈశ్వరార్చనముగ చేయ వలసినపని
తనను తానుగా చైతన్య పరచి యుండు
దేవ కార్యము సిద్దించుట కొరకు తను
అప్రమత్తురాలుగను ఉండకయు ఉండె
ప్రేమ తెలుపు స్వరూపిణి సర్వ శక్తి
తోను, మహిషాసురునిసంహ రించి యుండె
ఆమె దేవ రక్షణ సృష్టి సలిపి యుండి
అవస రమునుబట్టియురూపు శక్తి వమ్మ
సృష్టి యజ్ఞార్ధ కర్మగా జరుగు చుండు
సురులుగాను, వెలుగుల జ్ఞాన పరులు
అసురుల వెలుగున తమస్సు వంటి వారు
సర్వ రక్షగా దేవకార్యముకు రక్ష
దేవి సుర పక్షవాతి యని అనతగదు
సృష్టి నిర్మాణ మునమూడు గుణములుంచు
సృష్టి కాలమున లయను స్థితిని ఇచ్చె
దేవి లోకము లోనిజీ వులను రక్ష
--(())--
🌻 5. 'దేవకార్య సముద్యతా' 🌻
ఈ నామము కూడ అష్టాక్షరియే. దేవతల కార్యమును నిర్వర్తించుటకై వ్యక్తమైనదని అర్ధము. సమస్త దేవతలు వచైతన్యాగ్ని నుండియె వెలువడి, సృష్టి సిర్మాణము చేయుచున్నారు. (బ్రహ్మాది దేవతలందరు కూడ ఈ చైతన్యమనెడి అగ్నికుండము నుండి పుట్టిన వారే.
చైతన్యాగ్నిగ యజ్ఞకుండమున ఆవిర్భవించగనె దేవతా కార్యము నకు దేవి ఉద్యుక్తురాలగును గాని, విశ్రాంతి గొనుట యుండదు. మానవుడు కూడ మెల్కాంచగనే కార్యములందు ఉద్యుక్తు డగుచున్నాడు కదా! ఈ ఉద్యుక్తత మానవులయందు గల దేవీ లక్షణమే. మెల్మాంచి బద్ధకముగ నుండుట, మరల పండుకొనుట తమోగుణ లక్షణము.
దేవి భక్తు డట్లుండడు, మేల్కాంచగనె ఈశ్వరార్చనముగ చేయవలసిన పనులయందు తనను తాను నియమించుకొనును. ఇది చైతన్యవంతుని లక్షణము. దేవి చైతన్యాగ్నిగ వ్యక్తమవగనె దేవకార్యము సిద్దించుటకై తనను తాను నియమించుకొనునని, ఆ విధముగ అత్యంత అప్రమత్తురా లని తెలియవలెను. పిలిచిన వెంటనె ఆలస్యము చెయక ప్రతిస్పందించు ప్రేమ స్వరూపిణియని గమనించవలెను.
సృష్టి అరంభమున వ్యక్తమై త్రిగుణాత్మకముగ తనను తాను విభజించుకొన్నప్పటికీ దేవతల ప్రార్ధనకు ప్రతిస్పందించి తానావిర్భవించి మహిషాసుర, భండాసురాదులను వధించినది.
దేవి ఒక్కరే అయినను ముగ్గురుగ కూడ గోచరించుచుండును. ఆమె నిత్యురాలు. దేవ సృష్టికి, దేవ రక్షణకు, ఏర్పడుట ఆమె 'సి రూప స్థితి. ఆమె అరూప అని కూడ తెలియవలెను. అరూపయె సరూప అగుచుండును. అట్లగుట అవసరమునుబట్ట జరుగును.
సృష్టి అంతయు దేవి నుండి దిగివచ్చిన దేవతలయొక్క యజ్ఞార్ధ కర్మగా జరుగుచూ ఉండును.
అట్లు జరుగు దేవతా యజ్ఞమున అసురులు కూడ ఉద్భవించు చుందురు. సురలనగా వెలుగు ప్రజ్ఞలు. వారి వలననే సృష్టియజ్ఞము జరుగుచుండును. అసురులనగా ఆ వెలుగులను ఆవరించి కమ్ముకొను చీకటి లేక తమస్సు. అట్లు జరిగినప్పుడెల్ల దెవి ఆవిర్భవించుటయు, ఆమె ఆవిర్భావ కారణముగ కమ్మిన చీకట్లు (తమస్సు) హరింబడుటయు జరుగుచుండును.
ఇదియే దేవి యొక్క దేవతారక్షణ స్వభావము. అంతమాత్రము చెత దేవి సుర పక్షవాతి యని అనతగదు. సృష్టి నిర్మాణమున, సృష్టి స్థితి కాలమున ఇట్లు రక్షించినను, తిరోధాన సమయమున తమోగుణమును లెక అసురమును అనుమతించును కదా! అందుచె సృష్టికార్యము జరుగు నపుడు దేవతలను రక్షించుచుండును. ప్రళయ కాలమున తమమును అనుమతించును.
అట్లనుమతించినచో మెల్కాంచిన జీవునకు నిదుర యుండదు. ఈ విధముగ దేవి జీవులను, లోకములను అనురక్షణము చేయుచుండును.
సశేషం...
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక
సహస్ర నామముల తత్వ తేటగీతి పద్యాల వివరణ
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక
సహస్ర నామముల తత్వ తేటగీతి పద్యాల వివరణ
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
🌻. 8. 'రాగస్వరూపపాశాఢ్యా' 🌻
సృష్టి కధకు మూలము పాశ బంధమున్ను
నడుపు ఇచ్ఛా శక్తి యు కీల కముగ నుండు
జీవులలొ శక్తి అత్యంత యోగ శక్తి
కార్య ములొ అనురాగపు శక్తి యుండు
వ్యక్తి గతమైన కోరిక సంభవమ్ము
మూల మేమన ఆరాధ మనెడి శక్తి
ఇచ్ఛా అనునది ధర్మము తోను కలిసి
సహజ నిర్మాణ సౌందర్య మిచ్చు శక్తి
ధనము ఉన్నను వైభవ ములుగ మారు
స్వేశ్చ అనుభూతి పొందియు బుద్ది మారు
ధనము లేకయున్న తృప్తియు కలిగి మారు
ధనము కొరకును దైవము పూజ చేయు
సత్యమును కోరి తపనతో కృషియు చేసి
తీవ్ర మైనట్టి నిష్ఠతో భజన చేసి
రాగ స్వరూప పాశము బంధ ముగను
స్థితి హెచ్చుతగ్గులున్నను పాశ మవ్వు
--(())--
అమ్మవారి సృష్టి నిర్మాణ కార్యక్రమమున అత్యంత ప్రతిభావంతమైనది అనురాగ మను పాశము. ఈ పాశమే లేకున్నచో సృష్టి కథయే లేదు. దేవి నుండి ఈ అనురాగ పాశమే ఇచ్ఛాశక్తిగా స్రవించి సృ ష్టి కథను నడుపును.
జీవునియందు కూడ ఈ శక్తి కోరికగా పనిచేసి, తనదైన జీవితమును అల్లుకొనుచుండును. సమస్త ప్రపంచమును దేవి ఇచ్ఛాశక్తిచే నడుపబడుచున్నది. ప్రతి జీవియును తన వ్యక్తిగతమైన కోరికలచే నడుప బడుచున్నాడు కదా! కోరిక తనదని అనుకొనుచు సృష్టి కార్యమును చేయుచున్నాడు కదా! నిజమునకు తన కోరికగా వ్యక్తమగుచున్నది దేవి ఇచ్ఛాశక్తియే.
ఇచ్ఛ సృష్టి నిర్మాణమునకు గాని, వ్యక్తిగత జీవన నిర్మాణమునకు గాని పునాదిరాయియై నిలచును.
ఇచ్ఛ యుండరాదను కొనుట మెట్ట వేదాంతమగును. ఇచ్ఛను సృష్టి యందు ధర్మముతో జతపరచుట వలన జీవనము ప్రశాంతముగ జరుగగలదు. కోరికయే చెడ్డది
అనుకొనరాదు. ఎట్లు కోరుకొనవలెనో తెలియవలెను.
డబ్బు పాపిష్ఠిది అందురు. ఇది చేతకానివాడు పలుకు మాట. డబ్బు నెట్లు వినియోగ పరచవలెనో తెలిసినవాని చేతిలో అదే ధనము శోభను, వైభవమును కూర్చును. చేతకాని వానిని భ్రష్టుని చేయును.
అట్లే కోరిక కూడ. కోరికయే లేనిచో భగవంతునితో యోగము చెందుట కూడ ఉండదు కదా! సత్యమును కోరి దానికి సంబంధించిన మార్గమును తపనతో అన్వేషించి, మార్గమున అందింపబడిన నియమములను తీవ్రమైన నిష్ఠతో నిర్వర్తించినగాని, దైవమును పొందలేడు కదా
దైవమును పొందు తీవ్రమైన కోరికనే తపస్సందురు. తపన లేని వానికి ఏదియును అందదు. పదార్థము వైపునకుగానీ, పరమార్థము వైపునకు గాని పయనించుటకు వానియందనురాగ ముండవలెను. అనురాగ మనగా ఎడతెరిపిలేని రాగము. ప్రియునికి ప్రేయసిపై ఎట్లహర్నిశలు ఉండునో, అట్లు తాను పొందదలచిన విషయమున రాగ ముండవలెను.
రాగమను పాశమును దేనిపై ప్రయోగింతుమో అది మనకు దక్కగలదు. అట్టి అనురాగము ధర్మబద్ధము కానిచో బంధనమునకు కారణమగును.
బంధకారణమైన అనురాగము పాశమువలె పనిచేయును. బంధ కారణము కాని అనురాగము ఉపకరణమై నిలచును. జీవుల పై మహాత్ముల అనురాగము ఉపకరణముగ కన్పట్టుచున్నది కదా! సంసార జీవుల యొక్క అనురాగము ఎడతెగని బంధములుగ ఏర్పడుచున్నవి కదా! జ్ఞానము నందలి తారతమ్యములే ఇట్టి స్థితులను కలిగించును.
దేవి యొక్క రాగ స్వరూప పాశము బంధస్థితిని హెచ్చరించుచున్నది, మోక్షస్థితిని సూచించుచున్నది అని తెలియవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక
సహస్ర నామముల తత్వ తేటగీతి పద్యాల వివరణ
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
క్రోధ మనెడు గుణమునకు అంకుశమ్ము
ఉజ్వల స్వభావానికి అంకుశమ్ము
మదపు టేనుగులకు సైత అంకుశమ్ము
కరుడు అజ్ఞానములపైన అంకుశమ్ము
లోక ధర్మప్పిదములపై అంకుశమ్ము
యముని రూపముననె దేవి అంకుశమ్ము
కాల రూప దుష్టులపై అంకుశమ్ము
వేద పురుషుల రక్షగ అంకుశమ్ము
జీవ అనుకర తృప్తిగా అంకుశమ్ము
సహజ కాలరూపముననే అంకుశమ్ము
కీర్తి అపకీర్తి మధ్యన అంకుశమ్ము
సంది యమునకు క్రోధము అంకుశమ్ము
ధర్మ మార్గము నిలబెట్టు అంకుశమ్ము
కర్మ ఫలముల ననుభవం అంకుశమ్ము
ఆమె ఆజ్ఞకు లోబడి అంకుశమ్ము
జ్ఞాన మనె టి జ్వాలల అంకుశమ్ము
ఇష్ట కాలము తెచ్చేది అంకుశమ్ము
మౌనమున జీవి బతుకుకు అంకుశమ్ము
రాగ అనురాగ సమ్మోహ అంకుశమ్ము
వాంఛ నిస్పృహల నిరాశ అంకుశమ్ము
--(())--
🌻 9. 'క్రోధాకారాంకుశోజ్జ్వలా' 🌻
క్రోధమనెడు గుణమునకు ఆకారము దాల్చినదిగా దేవి అంకుశమును తెలియవలెను. అట్టి అంకుశమును ధరించిన ఉజ్జ్వల మూర్తిగా ఈ నామము దీనిని ప్రస్తుతి చేయుచున్నది. మదించిన ఏనుగు వంటి స్వభావమును కూడ నియమింపగలనని అంకుశము
తెలుపును. మదించిన వారికి భయము లేదు. భక్తి ఉండదు. అట్టి వారిని సైతము ఉజ్జ్వలమైన తన క్రోధమను అంకుశముతో సర్వశక్తిమయి అయిన దేవి శిక్షించి, రక్షించగలదు.
మదము కరుడుగట్టిన అజ్ఞానము. దానిని పటాపంచలు చేయగల ఆయుధముగ దేవి అంకుశమును భావింపవలెను. యమించునది అంకుశమను సత్యము తెలియవలెను. అంకుశాకారము జ్యోతిషమున శనిగ్రహమునకు వినియోగింతురు. లోకమున ధర్మము తప్పి వర్తించు వారిని యముని రూపమున దేవియే శాసించు చుండును.
కాలక్రమమున ఎంతటి మొనగాడినైనను శనిగ్రహ చారము దేవి బలహీన పరచగలదు. ఏనుగైనను కాలవశమున పీనుగ కాగలదు కదా! కాల రూపమున సమస్త జీవులను నిష్కర్షగా నియమించు శనిగ్రహ తత్త్వమును అంకుశముగా వేదఋషులు సంకేతించిరి. ధర్మమున దేవి జీవులను నియమించునని సందేశ మిచ్చుటకే క్రోధమే ఆకారముగా గల అంకుశమును ధరించినట్లుగా తెలియవలెను. సామాన్యులను కాలము రూపమున దేవి నియమించును.
కొందరిని కష్టముల ద్వారా, మరికొందరిని నష్టముల ద్వారా, ఇంకొందరిని అజపయము, అపకీర్తి రోగముల ద్వారా మరియు పీడల ద్వారా కర్మఫలముల ననుభవింపజేసి, ధర్మమార్గమున నిలబెట్టును. అన్నిటికీ మించి, మృత్యువు రూపమున జీవుల సమస్త సంపాదనములను హరించి, జీవనము పునః ప్రారంభమగునట్లు చేయును.
విశేష ప్రజ్ఞకలిగి అధర్మము నాచరించువారిని తానే అవతారమూర్తిగ దిగివచ్చి శిక్షించును. అతి విశేష శక్తులతో విజృంభించిన మహిష, భండాసురాదులను తానే స్వయముగ దిగివచ్చి శిక్షించును.
ఎవనికి ఏ శిక్ష విధించిన రక్షింపబడునో అట్టి శిక్షను సమతూకముగ అందించగల శక్తియే అంకుశమను దేవి ఆయుధము. త్రిమూర్తులు సైతము ఆమె ఆజ్ఞకు లోబడి సృష్టి నిర్వహణము గావించుచున్నారు.
వారికి సృష్టియం దవరోధము లేర్పడినచో తానే స్వయముగ చక్కదిద్దగలదు.
అజ్ఞానాంధకారమును తగు విధముగ శిక్షించి జీవప్రజ్ఞను జ్ఞానమునందు నిలుపు ఉపకరణముగ అంకుశము వినియోగపడుచున్నది. కావున దేవి భక్తులు క్రోధముతో కూడిన ఈ అంకుశమును జ్ఞాన ప్రదమని భావించి, నమస్కరించి స్తుతింతురు. రాగమను పాశము ఒక హస్తమున ధరించిన దేవి, మరియొక హస్తమున క్రోధమను అంకుశమును ధరించి, సృష్టి జీవుల యందు రాగము మితిమీర కుండునట్లుగ చక్కబెట్టుకొనుచున్నది.
సృష్టియందు ఈ విధముగ రాగమును పెంచునది, మితిమీరినపుడు త్రుంచునది కూడ దేవియే. సత్సాధకుడు వీనిని గమనించి, కష్టనష్టములు, అపజయము కలిగినపుడు దేవియే కాలరూపమున త్రుంచుచున్నదని భావించి, ప్రతీకార వాంఛ లేక, నిరాశా నిస్పృహలు చెందక, దేవిని శరణు పొంది ధర్మమున తనను తాను నియమించుకొనును.
ఇష్టకాలము వచ్చువరకు తలదాచుకొని మౌనముగ జీవించును. నలుడు, ధర్మరాజు, హరిశ్చంద్రుడు వంటి మహాత్ముల జీవితములయందు ఈ సత్యమును గమనింపవచ్చును.
సశేషం...
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక
సహస్ర నామముల తత్వ తేటగీతి పద్యాల వివరణ
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక
సహస్ర నామముల తత్వ తేటగీతి పద్యాల వివరణ
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ