21, జనవరి 2019, సోమవారం



ప్రాంజలి ప్రభ 
ప్లాస్టిక్ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఎటుచూసినా అశ్రద్ధ తీరు 
ఏ వీధి చూసినా అపరిశుభ్రత గా మారు  
ఈనోటా విన్నా నిరుత్సాహత పోరు 
ప్లాస్టిక్ కవర్లు గుమ్మాలకు తగలటం జోరు  

మనుష్యులలో బద్ధకం పెరిగి   
పాలప్యాకెట్లకు వాడుతున్నారు 
నీళ్ల కవర్లు వాడుతున్నారు 
ప్యాకేజీలకు వాడుతున్నారు 

కూరలు తెచ్చుటకు వాడుతున్నారు 
పట్టించుకొనేవారు లేరు 
ప్రభుత్వం వారు పట్టించు కోరు 
ఇంకా పెరిగాయి కవర్ల జోరు 

చెత్తకుప్పలో చేరి దుర్వాసన తీరు 
మూగజీవులు తిని రోగాల్లో జేరు 
ఆవులు గేదలు తిని పాలు రంగు మారు
లంచాలకు లోబడి కవర్లు అమ్మిస్తున్నారు 

కోర్టులు చెప్పిన పట్టించుకోని తీరు  
ఇకనైనా ప్రభుత్వం గట్టి చెర్యలు 
గాజుముక్కలు, ప్లాస్టిక్ ముక్కలు 
జాగర్తగా వేసేటట్లు సహకరించాలి  
ప్లాస్టిక్ స్థానంలో గుడ్డ కవర్లు వాడాలి  
మందపాటి కవర్లు అమ్మేటట్టు చూడాలి  

--((**))--

నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

జాబు ఉన్నది జాడేలేదు
జీత మున్నది  జానేలేదు
ఇల్లు ఉన్నది ఆలేలేదు
ప్రేమ ఉన్నది పెళ్లి లేదు

తెల్వి ఉన్నది తోడే లేదు
భైక్ ఉన్నది భామే లేదు
కారు ఉన్నది కైపు లేదు
డబ్బు ఉన్నది దాబి లేదు

బుద్ది ఉన్నది బోదె లేదు
శక్తి  ఉన్నది టైమే లేదు
మంచి ఉన్నది చెడే లేదు
వెల్గు ఉన్నది నిద్ర లేదు

చెట్టు ఉన్నది నీడ లేదు
భక్తి ఉన్నది స్వేశ్చ లేదు
ఆస్త్రి ఉన్నది  ప్రియ లేదు
విద్య ఉన్నది ఉమా లేదు

ఉన్నది లేదు, ఆశ లేదు
వలపు ఉంది మల్పు లేదు
నాకు ఫేస్  బుక్ లేదు
భార్య వస్తుందని ఆశ లేదు

--((**))--


ప్రేమలీల
మగువే మగాడ్ని కోరితే
ఇలాఉంటుందని ఊహ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

చిరునవ్వుల చిద్విలాసి 
చిరునామా తెల్పవా
మరిచావా  ప్రేమపిపాసి
విధిరాత మార్చవా

కల్పలతల సహవాసి
ప్రేమత్వము తెల్పవా
ప్రాణాలర్పించే స్నేహవాసి
శుభమస్తు తెల్పవా

రసస్వరూప రసవాసి
రహస్యము తెల్పవా
శృంగారరసా దిష్టవాసి
అర్ధమును తెల్పవా

గాలిలో ఉన్నట్టుందా వాసి
స్వాతంత్రము తెల్పవా
గుండె నాకర్పించవా వాసి
స్వర్గమును తెల్పవా

విశేష దర్శక నివాసి
విశ్వాసము తెల్పవా
అపూర్వ విద్యల నివాసి
చైతన్యము తెల్పవా

సర్వాభరణాల నివాసి
చూడామణి తెల్పవా
సర్వత్రా గుణాల నివాసి
విశ్వమణి తెల్పవా

వెన్నల మనోహరవాసి
మమతల్ని తెల్పవా
వన్నెల వినోదాల వాసి
పలుకుల్ని తెల్పవా

--((**))--



తెలుగు భాష నేర్చుకుందాం
ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
           U U I U I I I U I I U U I
నీ కంటిలో నలత వేలుగు నైనాను 
నీ మాటలో మమత మాధవ నైనాను
నీ ఆటలో అలుపు ఆశగ నైనాను
నీ వేటలో అలుక  ఆకలి నైనాను ........

నీ మోములో తెలుపు నీలము ఐనాను 
నీ మేనులో వలపు కోరిక ఐనాను
నీ వేటలో గెలుపు మార్గము ఐనాను   
నీ సేవలో నలిగి కల్సియు ఉన్నాను 

నీ తోడులో కలసి కర్చుయు ఐనాను
నీ ఆటలో అలసి ఆశగ   మారాను
నీ పేరులో తులసి ప్రేమగ మారేను
నీ కళ్ళలో మెరుపు ఆకలి అయ్యెను

--((**))--   

నీవు భూదేవిని ఫూజించు, నీలా ఆకాశాన్ని అర్ధించు
నీవు జలదేవతను ఆరాధించు,  అగ్నిని ఆహ్ఫానించు
మంచిని నలుగురికి పంచు, వంచన లేకుండజీవించు
మంచిమాటను గమనించు, గురువులను  ఆదరించు ..... 9

నీవు ఓర్పుతో  అందరికి   మంచి  మాటలు  భోధించు
ఇతరుల మనస్తత్వమనుసరించి నడుచుట ప్రయత్నించు
నీది గుణం  మంచి  దై తే  సంతోషాల నిలయ మనుచు
మనోనిగ్రహ శక్తిని పెంచే హనుమంతుని నీవు ఆరాధించు ...... 10

కలమి  కలవాడు  కైలాస  వాసున్ని మరచు
స్వంతబలమణి  భావించి  దేవున్నేదూషించు
కలిమిపోయి బీదవాడైననాడు దేవున్నేప్రార్ధించు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట ..... 11

తెరను  దాగిన  సత్యమును  తెలుసుకొనుటకు  ప్రయత్నించు
దూరపు  కొండలు  నునుపు  కావని తెలుసుకొని  సంచరించు
కనులకగుపడు దృశ్యమునుచూసి శాంతించుటకు ప్రయత్నించు
మల్లాప్రగడ  వారు మదిన నిలిచిన సత్యాన్ని  తెలియ  పరుచు ..... 12

నావల్ల  కానిపని ఇది యని గట్టిగా  పలుకుచు
బ్రహ్మ  చెప్పిన  ఈ  పనిని  చేయనని చెప్పుచు
ధర్మముతోఉన్న పనితప్ప ఏపని చేయననుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట ... 13

మంచి  పని  చేసిన  ఎప్పటికి  కీడు   రాదనుచు
చెడ్డ  పని  చేసిన మంచి ఏమిచేయలేక నిద్రించు
ఇది మంచా, చెడా అని ఈ మానవులు బ్రమించు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట .... 14

విద్యలు అన్ని  నేర్చుకొని  సద్వినియోగ  పరచు
విద్యా దానం  చేసి  నలుగుర్ని   సంతోష  పరచు
భాహుసత్కార్యాలు  ఫలితములేదని  గమనించు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట ..... 15

ఎంత చదువు చదివిన పరుల మనసును గ్రహించు
తరచి చదివిన మనుష్యులతో నీ స్నేహాన్ని  పంచు
అందరుచదవాలి, బ్రతికి బ్రతికిన్చేదుకు చదువనుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట  .... 16

 చెట్టు పై ఆకు పచ్చ   పక్షులన్నీ చిలుకలని వాదించు
పువ్వులపై వాలే పురుగులు తుమ్మెదలని వాదించు
 పై వాక్యాలు ధనవంతుడన్న బీదవాడు తలవూపుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట  ..... 17

దేహము భవసాగరమీద లేని కంప అనుచు
రోగము  తో   మ్రగ్గేడి     సేవక గంప అనుచు
శరీరము చలనము చెందేడి దుంప అనుచు
భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట   ......18

శృంగారము వేరు, బంగారం ఒక్కటే  అనుచు
మతములన్నియు వేరు, మార్గం ఒక్కటే అనుచు
జాతి, నీతులు వేరు, అందరి జన్మ ఒక్కటే అనుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట ...19

వస్త్రభేదములు వేరు, దారము ఒక్కటే అనుచు
పశువుల రంగులు వేరు, పాలు రంగు ఒక్కటే అనుచు
పూలు వేరు, దేవునికి సమర్పించే పూలుఒక్కటే అనుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచి మాట ... 20

నీవు దేహాన్ని అనుసరించి మనస్సు చలించక చలించు
అందరిని నీ మనోభావం  తో  అర్ధం చేసుకొని   క్షమించు
ఆత్మ భావంతో ప్రతి  ఒక్కరిని  ఆదుకుంటు పలకరించు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట ..... 21

జీవ జంతువులు  వేరు, జీవుండు  ఒక్కడే   అనుచు
దేవుని రూపాలు వేరు, అందరికి దేవుడొక్కడే అనుచు
పిల్లలబుద్ధి వేరు, తల్లితండ్రులకు అందరు ఒక్కటే అనుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట    .... 22

కలకాలము  కాకి  నిలువక   కాకి వగచు
మనసులో మాట నిలువక స్త్రీలు చెప్పుచు
నిద్రలో కళ్ళు మూసుకొని కలలో నడుచు
వినుము   మల్లాప్రగడ మంచి మాట  ... 23

తామసంబు   విడువకపోతే తత్త్వం తెలియ దనుచు
రాజసంబు  విడువక పొతే భక్తి    భావం  రాదనుచు
సాత్వికంగాఉంటె శాంతముతో మంచిమాట అనుచు
భారతీయులారా  మల్లాప్రగడ    మంచి   మాట .... 24

పురుషుడు  కోర్కలతో వెమ్పర్లాడుతు పలుకుచు
స్త్రీ  పురుషున్ని  కవ్వించి  నవ్వంచి  కనిక  రించు
స్త్రీ పురుషులు కలసి సృష్టి ధర్మానికి సహకరించు
భారతీయులారా  మల్లాప్రగడ  మంచి  మాట ..... 25

నింగిలో  మేఘాలు గాలికి  కదులుచు
నీటిలో   దుంగలు తేలుచు కదులుచు
కాలంతో  ప్రజలు బ్రతకలేక బ్రతుకుచు
వినుము మల్లాప్రగడ మంచిమాట    .... 26

 మతములన్ని ప్రజలకు  మంచిని భోధించు
కలసి ఉండి నీ తెలివితో  మంచిని బ్రతికించు
మనసులు కలిస్తే మాటలన్నీ మంచిదనిపించు
వినుము మల్లాప్రగడ వారి మంచి మాట .... 27

నీవు స్త్రీని ఎప్పుడు అర్ధం చేసుకొని ప్రేమించు
పురుష  అహంకారం వదలి  స్త్రీని   పాలించు
పెద్దలు,గురువులు, కులదైవాలని భావించు
వినుము   మల్లాప్రగడ    మంచి మా ట   .... 28

పెద్ద మనిషి అయిన స్త్రీ కి  పెళ్లి చేయాలని తలచు
అందరికి అందాన్ని  చూసి  మనసు పరుగెత్తించు
మూడు ముళ్ళు భంధం తో  జీవితాలు   చలించు
భారతీయులారా  మల్లాప్రగడ  మంచి  మాట  .... 29

వయస్సులో వస్తున్న  మార్పులకు  కండలు పెంచు
యోగాసనాలు వేస్తు,  పౌష్టికాహారము  తీసుకొనుచు
మదన కోర్కలతో మనసు  మనస్సులో ఉండదనుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట  .... 30

కన్నవారిని కాదను కోవటం అవివేకమని గ్రహించు
భార్యను సంతృప్తి పరచి సంతోషాన్ని  అనుభవించు
నీరు ఎక్కువత్రాగి, నడుస్తూ ప్రకృతి  గాలి  గ్రహించు
భారతీయులారా  మల్లాప్రగడ   మంచి   మాట   .... 31

శిలగా ఉన్న దేవుణ్ణి ప్రార్ధించి, సజీవమ్గా ఉన్నవానిని ప్రేమించు
ఉషోదయకాలాన్ని గమనించి, నీవుఆశలకు పోకుండా జీవించు
నేయి దీపాలు వెలిగించి అందరిని ఆహ్వానించి  వేదాలు పటించు
వినుము భారతీయులారా మల్లాప్రగడ వారి  మంచి  మాట   32

యవ్వనంలో సమయం,శక్తి,  ఉంటాయి  డబ్బు  ఉండ  దనుచు
మద్యవయస్సులో డబ్బు శక్తి ఉంటాయి సమయం ఉండదనుచు
వృద్దాప్యంలో సమయం డబ్బు ఉన్న కష్టపడే శక్తి ఉండ  దనుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ వారి   మంచి  మాట ..... 33

గుమ్మడితీగకు కాయలు పూలు బరువు కాదనుచు
ప్రతి  స్త్రీ 10 నెలలు మోసే గర్భం బరువు కాదనుచు
పిల్లలు తల్లి తండ్రులను పోషించాలంటే బరువనుచు
భారతీయులారా  మల్లాప్రగడ   మంచి   మాట .... 34

చెదలు పుట్టి కొయ్యను తినివేయు,  మందు వాడాలనుచు             నీచులతొస్నేహంకుటుంబంనాశనామ్,మంచినిప్రేమించు                                                   గడియారంలా పైనించి క్రిందకు,క్రిందనుంచి పైకి  సంచరించు
వినుము భారతీయులారా మల్లాప్రగడ వారి   మంచి  మాట  ... 35

ధనం, అహం ఉన్న వారి మాటలు మూర్ఖముగా ఉండుననుచు
ధనం లేనివాడి మాటలు ఎప్పుడు  బీద  పలుకులు   పలుకుచు
మద్యస్తుడు ధనం ఖర్చు చేయుటకు మాటలు తికమక పడుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ వారి   మంచి  మాట  .... 36

లక్ష్యం నిర్దిష్టంగా మనుష్యులు  కృషి చేయాలనుచు
కృషి ద్వారా సంకల్ప  సిద్ధికి  ప్రయత్నిమ్చాలనుచు
సంకల్పంతో దీక్షాబద్ధుడిగాఉన్న తోడు కావాలనుచు
భారతీయులారా  మల్లాప్రగడ   మంచి   మాట   .... 37

మనదేహం వైరు పై ఉండే కవరు లాంటి దనుచు
మన మనసు కవరులో ఉన్నరాగి వైరు అనుచు
విద్యుత్తు ప్రవహించి మనసు తన్మయత్వంచెన్దుచు
భారతీయులారా  మల్లాప్రగడ   మంచి   మాట   .... 38

ప్రశ్నిమ్చనిదే నిజమైన సమాధానము  దొరకదనుచు
ప్రయత్నిమ్చనిదే కోరుకున్నది ఎవ్వరకి  దక్కదనుచు
కాలాన్ని గమనించిమాటలు మాట్లాడితే మంచిదనుచు
వినుము భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట  .... 39

దాంపత్య ధర్మంలో శృంగారం ఒక మెట్టనుచు
చెడుపై పోరాటంలో   వీరత్వమ్    చూపించు
ఎప్పుడునవ్వుల్లో సంతోషపడి సంతోషపరుచు
భారతీయులారా  మల్లాప్రగడ మంచి మాట   ...... 40

హృదయపు లోతు  ఆలోచనలను గమనించు
కొత్త   విష యాలను  అందరికి తెలియ పరచు
దుర్మార్గాన్ని  ఎప్పుడు  నిర్భయంగా ఎదిరించు
భారతీయులారా  మల్లాప్రగడ మంచి మాట ...... 41

నిజాన్ని  మెంగే రాజ్యమేలుతున్నా ధర్మంమనుచు
వెలుగుని మెంగే  వ్యాపారం చీకటి వ్యాపార మనుచు
ప్రకృతిని మింగే కాలచక్రం ఇప్పుడు   వికృతి అనుచు
భారతీయులారా  మల్లాప్రగడ   మంచి   మాట      ..... 42

భర్తే  భార్యకు  నిజమైన   దేవుడనుచు
తల్లితండ్రులు పిల్లలకు గురువులనుచు
ఆదిత్యుడే అందరికి మార్గదర్శకుడనుచు
భారతీయులారా మల్లాప్రగడ మంచిమాట..... 43

అందరికివందనాలుసమర్పిస్తుదీపావళిశుభాకాంక్షలతో                                                                     మదిలో మేదిలన మంచి భావాలను అక్షర రూపములో
ఎందరో మహానుభావులుచేప్పిన వాటినే నేనువ్రాయుటలో
మంచి మాటలను  అర్ధమయ్యె  విధముగ తేట తెలుగులో .... 44
--((**))--





ఆరాధ్య భక్తి లీల - 116



ఆరాధ్య భక్తి లీల  - 116  

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ప్రేమించినా నీ ప్రాబల్యమేనమ్మా 

కామించినా నీ ప్రోత్సాహమేనమ్మా
మోహించినా నీ ప్రోద్బలమేనమ్మా   
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా   ..... 1

మరులుగొన్న మనసు నీదమ్మా

భగ్నమైన హృదయం నీదేనమ్మా  
ఉద్విగ్నమైన ధేయం నీదేనమ్మా
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా .... 2

రోదించిన రోజులు నీదరిమ్మా 

ద్వేషించిన రోజులు నీదరిమ్మా
దూషించిన రోజులు నీదరిమ్మా
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా...... 3

సాధించిన రోజులు నీకృపమ్మా 

స్నేహించిన రోజులు నీకృపమ్మా 
ప్రేమించిన రోజులు నీకృపమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా...... 4

ప్రసవ వేదన మా పాపమమ్మా 

బ్రతుకు వాదన మా దూషణమ్మా   
మెతుకు రోదన మా శాపమమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా .....  5

అక్షర సాధన నీ జ్ఞానమమ్మా 

జీవన సరళి నీ మోక్షమమ్మా 
మధుర భావన నీ రూపమమ్మ 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ...... 6

హృదయ లాలన నీ ధ్యేయమమ్మా 

సాహితీ సాధన నీ ప్రార్ధనమ్మా 
విరహ వేదన నీ వరమమ్మా
నేను వ్రాయుట నీ లక్ష్యమేనమ్మా ..... 7

వినోద ధ్యేయమే నీ కర్తవ్యమమ్మా 

జన్మల ఫలమే  కర్మత్వమమ్మా 
జీవన వేదమే సంసారమమ్మా      
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ...... 8

మనసు మనసు కల్పినావమ్మా 

వయసు వయసు కల్పినావమ్మా
తేజస్సు తేజస్సు కల్పినావమ్మా  
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ....... 9




విద్యా కకార రూపవతివమ్మా 
సమస్త కళ్యాణ రూపిణివమ్మా 
గుణాల నిర్ణయ సుశీలవమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 10

భక్తిని పంచేటి జననివమ్మా 

త్రిమూర్తి కళా స్వరూపిణివమ్మా  
కమల నయన భవానివమ్మా        
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ..... .. 11

పాపాన్ని భరించే కల్మషివమ్మా 

కరుణామృత పరాంబికవమ్మా 
లత లందించిన లలితవమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా...... 12

కదంబ వృక్షాల నివాసివమ్మా  

పంచాక్షరీ మంత్రం నందించావమ్మా 
మన్మధభాణం సంధించవమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా .....  13 

కనక గిరి జగన్మాత వమ్మా 

రత్నాల దీప నివాసిని వమ్మా     
ఇరువైఐదు ప్రాకారాల్లో అమ్మా
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా...... 14 
   
నానా ఫలవృక్షాలలో నీ వమ్మా
నవరత్న మండపాల్లో నీ వమ్మా
మూడు కూపాల్లో శోభిల్లుతా వమ్మా
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ...... 15
  
చంద్రవదన తపస్విని వమ్మా   
మహాపద్మముపై కూర్చున్నా వమ్మా 
శ్రీపుర నివాసిని విన్నా వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ....... 16

కాంచిపురాన నివాసితి వమ్మా   

చాతుర్వర్ణాలకు దేవత వమ్మా 
యజ్ఞ లక్ష్యాన్ని తీర్చేది నీ వమ్మా
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 17

హయగ్రీవ రూపాన్ని కొలిచా వమ్మా 

అగశ్యకి సాక్షాత్త్కరించా వమ్మా    
ఉపదేశించిన లలిత వమ్మా   
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 18



ఏకామ్ర నాధుని నాయకి వమ్మా 

దూర్వాసు నారాధించే తల్లివమ్మా 
అభీష్ట సిద్ధుల్ నొసగి  నావమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 19

అద్యేత సిద్ధాంత రూపిణివమ్మా 

ఆత్మజ్ఞాన నంద రూపిణివమ్మా 
రక్షించు శ్రీ చక్ర వాసిణివమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 20

పృద్వి బీజ నివాస మాతవమ్మ 

అణిమాది సిద్ధు లందించావమ్మా
బ్రహ్మీ శక్తులను మంత్రిమ్చా వమ్మా  
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 21

సర్వ సంక్షోభిణీ రక్షిత వమ్మా 

ముల్లోకాల్ని మోహింప చేస్తావమ్మా 
జాగ్రదా వస్థకు సాక్షి  వైనావమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 22

శివబీజాంశీ భూత మాత వమ్మా  

అష్టదళ పద్మ వాసితి వమ్మా  
సుషుప్తికి సాక్షి భూతురాలమ్మా  
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 23

కామ కళా బీజ రూపిణి వమ్మా 

నిత్య సంప్రదాయ యోగిణి వమ్మా 
పరివేష్టించే సిద్ది మాత వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 24

సర్వ వశంకరుల శక్తి వమ్మా 

సర్వసౌభాగ్య ప్రసాదిత వమ్మా  
బ్రహ్మజ్ఞాన చైతన్య మాత వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 25

విష్ణు బీజ రూపిణి మాత వమ్మా 

త్రిపురా చక్ర నిలయతి వమ్మా    
కులో తీర్ణ యోగినీ మాత వమ్మా
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 26

సర్వసిద్ధుల నిచ్చు ధాత్రి వమ్మా 
వశిత్వ సిద్ధి రూపిణి  నీవమ్మా 
శ్రీ విద్యా దేవతవు నీవేనమ్మా  
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 27


అగ్ని బీజ రూప ధారిణి వమ్మా 

నిత్య ప్రకృతి స్వరూపిణివమ్మా 
త్రిపుర మాలినీ దేవత  వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 28

ప్రాకామ్య సిద్ధి వరూపిణి వమ్మా 
మహాంకుశ ముద్రాధారిణివమ్మా 
సమస్త భక్తుల్ని రక్షిత వమ్మా  
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 29

శ్రవనేంద్రియ రూపవతి వమ్మా   
సృష్టి స్థితి లయ మూలం నీవమ్మా 
త్రిశక్తి బీజ త్రిపురాంబ వమ్మా  
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 30

అతి రహస్యంతో యోగిని  వమ్మా 

ఆయుధాలతో కామేశ్వరి వమ్మా
బీజాలలో వసించుమాత వమ్మా
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 31

సిద్ధిలను ఇచ్చే శ్రీ దేవి వమ్మా     

సమాధి చైతాన్య రూపిణి వమ్మా 
సర్వ కామ సిద్ధి రూపిణి వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 32

సర్వ త్రిఖండ ముద్రవాసి వమ్మా   

తురీయ విద్యా రూపిణి నీవమ్మా 
ధర్మార్ధ కాల స్వరూపిణి వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 33

కొల్చె మహా నిత్య దేవత వమ్మా 

శ్రీ విద్యాత్మ స్వరూపిణి వమ్మా 
త్రికోణమందు శ్రీ లక్ష్మి నీవమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 34

మునులు ఆరాధించే మత వమ్మా 

ఋషులు ప్రార్ధించే దేవత వమ్మా 
దేవతలే కొలిచే దేవి వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 35

వంశ పారం పర్య దేవత వమ్మా 
గురువుల కే మాత వైనవమ్మా  
ముప్పది సోపానాలు దైవమమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 36

Rose GIF Animation | Thread: !! HaPPy BirTHDaY KiSHaaN !!


జీవకోటికి సృష్టి కర్తవమ్మా 

బ్రహ్మాండానికి గాత్రనాదమమ్మా 
లోకల్లో స్వేచ్ఛా విహారిణి వమ్మా   
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 37

అహాన్ని తొలగించు తావమ్మా 

సత్యం ధర్మం న్యాయంకు దైవమమ్మా
 పూజకే సంతృప్తి కారుణి వమ్మా  
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 38 

మనసే మందిరం చేశావమ్మా 

వాక్కు వినసొంపుగా ఉన్నాదమ్మా 
యోగులు నిన్నెరుంగుదురు అమ్మా
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 39 

భోగములిచ్చి ఆడిసున్నా వమ్మా

అభయం బిచ్చె నీరజాక్షి వమ్మా 
దుర్వాసన నాసన కారివమ్మా   
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 40 

దయార్ద హృదయంగా మార్చావమ్మా   

బుద్ధికి సదా జ్ఞానం పంచావమ్మా 
తనువు మార్పు తత్వంబన్నావమ్మా  
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 41 

సర్వ పీఠముల శారద వమ్మా 

సర్వయోగముల నాయకి వమ్మా  
లలితాదేవిగా కోల్చితినమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 42 

మనస్సు మలినం తొల్గిన్చావమ్మా
మనస్సు నిర్మాలంగా మార్చావమ్మా 
జీవకోటికి మాతృదేవతమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 43

పద్మనేత్రాలతో వర్ధిల్లావమ్మా  

అమ్మా ప్రణామాలర్పిస్తున్నా నమ్మా 
ఏకాక్షరీ రూపంతో క్షమించమ్మా    
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 44

మాతృకా పరమేశ్వరిని వమ్మా 

ఇంతే నిర్ణయం లేని దేవి వమ్మా 
నిశ్చయ రూపం లేని దేవి వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 45

╰☆╮HAPPY NEW YEAR!!♡♥❤️★ LET IT BE SPARKLY ❤️ *•.¸¸.•*`*•★ .
భక్తిభావంతో ప్రార్ధించి తి మమ్మా 

ఏకాగ్ర చిత్తం కల్పించితి వమ్మా 
ఆశ లేని భక్తికి లొంగవమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 46

ఏకైక చైతన్య దేవత వమ్మా 

ఏకైక రస స్వరూపిణి వమ్మా 
స్వశక్తి కల్పించే దేవత వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 47

ఏకాంతంగా పూజించే దేవీ వమ్మా 

వర్ధిల్లు తేజస్సు పంచే దేవీ వమ్మా
బ్రహ్మాండానికి  అధీశ్వరీ  వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 48

ధైర్య సాహస శక్తేశ్వరీ  వమ్మా 

సార్వభౌమ పరమేశ్వరీ వమ్మా  
ఈ కారం మాతకు వందనమమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 49

యజమాని స్వరూపిణి వమ్మా 

ఈప్సితార్ధ ప్రదాయిణి వమ్మా 
ఈశ్వ రత్వ అభేదిణి వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 50

పంచముఖేశ్వర ఈశ్వరి వమ్మా 

అష్టసిద్ధి పరమేశ్వరి వమ్మా 
దర్సనంతో సృజించే శక్తివమ్మా  
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 51

ఈశ్వరీ వల్లభా ఈశ్వరివమ్మా  

స్తుతింప తగిన దేవత వమ్మా 
ఈశ్వర ఆర్ధనారీశ్వర వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 52

కామేశ్వర అధి దేవత వమ్మా 

తాండవ సాక్షి స్వరూపిణి వమ్మా 
శివాంక నిలయ కామాక్షివమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 53

ఈతిబాధ మాపే కారుణ్య వమ్మా 

ఈహ కల్గనీయని దేవి వమ్మా 
సర్వ వ్యాపకత్వ ఈశ్వరీ వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 54

Paon


మందస్మితతో విలసిల్లే అమ్మా    
పంచాక్షరీ లకార శక్తి వమ్మా 
లోకాశ్చర్యకర శక్తిని వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 55

లక్షి వాణి మాహేశ్వరీ వమ్మా 

పాపత్రయం నాశన దేవీ వమ్మా    
బ్రహ్మ స్వరూపంగల దేవి వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 56

చైతన్య వికాస శ్రీ మాత వమ్మా 
దానిమ్మ పుష్ప ప్రభ దేవి వమ్మా 
లలంతికల వెల్గు దేవి వమ్మా   
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 57

లలాట నేత్రాన్ని పూజించావమ్మా
దివ్యంగాలు గల మాతశ్రీ వమ్మా   
మహా మాతకు నమస్కారమమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 58

రాజయోగ సాధన మాత వమ్మా 
ముఖ్యార్థ వ్యక్త శబ్దవృత్తివమ్మా
కామప్రేరిత సుఖదాయి వమ్మా  
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 59

సర్వపురుషార్ధ దేవత వమ్మా 
కస్తూరి కుంకం గల తల్లివమ్మా  
ముత్యాలహారాలున్న తల్లివమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 60

గణపతిని కన్న తల్లివమ్మా 
లజ్జాభావంతో ఉన్న తల్లివమ్మా 
లయరహిత స్వరూపిణివమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 61

సింహవాహిని యగు దేవివమ్మా  
లేడి చూపులు గల దేవి వమ్మా 
శివునికి పట్టమహిషి వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 62

హరుని ఆరాధన పొందవమ్మా  
త్రిమూర్తుల సేవలు పొందవమ్మా 
అశ్వమేధ యాగ రక్షితివమ్మా  
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 63

హంసవాహన బ్రహ్మ శక్తి వమ్మా  
దానవుల్ని హతమార్చి నావమ్మా  
హత్యను రూపు మాపే తల్లివమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 64

దేవేంద్రాదులు సేవించే తల్లివమ్మా 
మత్తేభకుంభస్థల స్థనాలమ్మా    
గజచర్మధారి శ్రీమతి వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 65

పసుపు కుంకుమల ప్రీతివమ్మా 
అమరగణంచే పూజితివమ్మా  
పరమశివుని యొక్క సఖివమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 66

సర్వానికీ ఈశ్వరీ మాతవమ్మా 
సర్వ శక్తి కల్గిన దేవి వమ్మా  
నిత్యం సర్వం హరించే దేవీ వమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 67

అవయవ సౌందర్య రాశివమ్మా 
ఆత్మస్వరూపు రాలై ఉన్నావమ్మా  
సర్వం హరించే రాజేశ్వరివమ్మా
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 68

సనాతన ధర్మం నిల్పినావమ్మా
సాముద్రిక సాయత్రం తెల్పావమ్మా 
జగతికి సాక్షిగా ఉన్నావమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 69

ఆత్మ స్వరూపురాలైన స్త్రీవమ్మా 
సర్వము మోహించే మోహినివమ్మా 
సర్వానికి ఆధారమైనవమ్మా        
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 70

జీవాత్మలో ఉన్న శ్రీదేవి వమ్మా 
అవగుణం లేనట్టి తల్లివమ్మా 
అరుణవర్ణ తేజస్సే నీవమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 71

మాతృస్వరూపిణివి నీవేనమ్మా 
శ్వాస శ్వరూప దేవివైనావమ్మా 
జన్మరాహిత్యాన్ని తెల్పినావమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 72

కామాది వికార వర్జితివమ్మా
నారాయణ సహోదరీవమ్మా 
నైసర్గిక స్వభావ తల్లివమ్మా    
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 73

ప్రణవ మంత్రశ్వరూపిణివమ్మ  
జ్ఞానజ్యోతి స్వరూపిణివి వమ్మా 
హవిస్సును భుజించు తల్లివమ్మా 
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 74

ఆనందాన్ని అందించే తలివమ్మా 
దిక్పాలురు ప్రార్ధించే తల్లివమ్మా 
రాక్షసుల్ని అంతం చేసినావమ్మా
నేను పల్కుట నీ లక్ష్యమేనమ్మా ........ 75

--((**))--





ఆరాధ్య భక్తి లీల- 101
రచయత:  మల్లాప్రగడ రామకృష్ణ

శ్రీ వేంకటేశా అంతా నీతలపే నని

- భావించి పూజిస్తున్నా ....   2

కోపంలో సమాధానం చెప్పకా  
- ఎవ్వరినీ ఒప్పించ లేకున్నా    
సంతోషంలో వాగ్దానం చేయకా  
- నమ్మించి వుండలేకున్నా 
ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకా  
- ప్రశాంతి కల్పించలేకున్నా 
అవసరం లేనిచోట అబద్ధం చెప్పకా 
 - నిజాన్ని పంచుకోలేకున్నా 

శ్రీ వేంకటేశా అంతా నీతలపే నని

- భావించి పూజిస్తున్నా 

మనస్సు ఆధీనంలో  ఉంచుకునీ  
- ధర్మంగానే నడుస్తున్నా 
ఆత్మాభిమానాన్ని గౌరవంగా ఉంచీ  
- ఆదర్శ ప్రాణై ఉన్నా  
ప్రతిపని భాధ్యతగా భావిస్తూ
 - రక్షణగా జీవిస్తున్నా 
చేసుకుంటూపోతూ ఫలితాన్నీ  
- ఆశించకుండా జీవిస్తున్నా

శ్రీ వేంకటేశా అంతా నీతలపే నని
- భావించి పూజిస్తున్నా 
నా గుణం ఎదుగు దలకు    
- దైవ నిర్ణయమని భావిస్తున్నా  
భవిష్యత్తు ఆలోచించకా  
- సమయాన్ని నీకే అర్పిస్తున్నా   
నీ నామమే నాకు నిత్య స్మరణగా 
- రక్షించేది నివేనని ఉన్నా  

శ్రీ వేంకటేశా అంతా నీతలపే నని


- భావించి పూజిస్తున్నా 

--((**))--





ఆరాధ్య భక్తి లీల -102

రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ

 మోక్షం, బంధాలకు రెండు దారులున్నాయి. ఓ జీవాత్మా! నీకేది సరైనదో ఎంచుకుని వెళ్లుము.


దారి ఎదో తెలుసుకో జీవుడా - శ్రీ హరిణి ఆరాధిస్తే మోక్షమే

పాప పుణ్యాల పడవే జీవుడా - శ్రీ మాతను ఆరాధిస్తే మోక్షమే   

మానవజన్మ మహిలో ఉత్తమం - సుచి శుభ్రతతోఁమోక్షమే

ప్రతిరోజూ హరినామం ఉత్తమం - ఉపాసనా శాంతి మోక్షమే   
క్షేత్ర గంగాస్నానం ఉత్తమం - చుక్క నాలుకపై పడ్తే మోక్షమే 
నిత్య సుఖం ఉత్తమం - సహధర్మచారితో సంసార మోక్షమే   

ధర్మ ప్రవర్తన ఉత్తమం - మనస్సును మెచ్చే మాట మోక్షమే  

లోకమంతా ఏకం ఉత్తమం - నిత్య ఆనంద లక్ష్యము మోక్షమే   
పరమాత్మ సృష్టి ఉత్తమం - సామాజిక పరివర్తన మోక్షమే  
తల్లితండ్రుల పూజ ఉత్తమం - సచ్చిదానంద తృప్తి మోక్షమే

సర్వతంత్ర స్వరూపిణి ఉత్తమం - మనస్సు ప్రవిత్రం మోక్షమే 

శ్రీ విద్య విస్తరణ ఉత్తమం - ధన్వంతరి రక్షణ మోక్షమే
మేధస్సు మాటలు ఉత్తమం - నవజీవన మార్గము మోక్షమే      
నామ, యజ్ఞ జపం ఉత్తమం - కారణజన్మ సార్ధకం మోక్షమే  
  
దారి ఎదో తెలుసుకో జీవుడా - శ్రీ హరిణి ఆరాధిస్తే మోక్షమే
పాప పుణ్యాల పడవే జీవుడా - శ్రీ మాతను ఆరాధిస్తే మోక్షమే   

--((**))--




ఆరాధ్యా భక్తి లీల- 103

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

ఓ దేవా, నేను నిన్ను అడిగేంతవాడ్ని కాను 

కానీ ప్రశ్న అడగ కుండా ఉండ లేకున్నాను 

పొద్దెటు పొడవాలో నిర్ణయం నీదే అన్నాను   

నిద్దుర పోవాలో వద్దో తెలియక ఉన్నాను 
ప్రేమ, మూఢత్వపు ఆలోచన నీదే అన్నాను 
స్నేహం ద్వేషం వద్దో తెలియక నల్గి ఉన్నాను 

చీకటి తరిమేటి ఉదయం నీదే అన్నాను 

హృదయం వెల్గాలో నల్గాలో  తెల్వక ఉన్నాను 
తనువు తాకే చినుకు సృష్టి నీదే అన్నాను  
స్పృహ, నిస్పృహతో మనస్సు తెల్వక ఉన్నాను   

గుణాల్లో, స్వర్ధ, నిస్వార్ధ సృష్టి నీదే అన్నాను 

భూకంపాలు ఎప్పుడొచ్చునో తెల్వక ఉన్నాను  
 కలుషిత మనస్సును  మార్పు కోరుతున్నాను  
శ్రీ వెంకటేశ్వరా జీవితం నీదే నంటున్నాను 

ఓ దేవా నేను నిన్ను అడిగేంతవాడ్ని కాను 

కానీ ప్రశ్న అడగ కుండా ఉండ లేకున్నాను 

--((**))--









ఆరాధ్య భక్తి లీల 

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

దేవా నీవు కల్పించిన ధర్మాలివి   
కర్త కార్మా క్రియాచెయు ధర్మాలివి     

శాంతి కలవానికి పాపము రాదు   

విరక్తి కలవానికి భయం లేదు
గురుసేవ చేసేప్పుడు కోపం రాదు 
సత్య బోధకులకు దోషం ఉండదు.. దే   

పుట్టు బ్రహ్మచారికి బుద్ధి చెడదు 

ఆశ లేని వానికి అలుపు లేదు  
జ్ఞాన మున్నవానికి దుఃఖము లేదు 
మౌనం పాటిస్తె ఏది కలహం కాదు  ... దే 

సమదృష్టికి చలించటం ఉండదు

నిర్మల మనస్సుకు లోపం తెల్వదు   
వేంకటేశా అనిన మాయ ఉండదు 
జీవితంలో సుఖమే భారం తెల్వదు ... దే 

దేవా నీవు కల్పించిన ధర్మాలివి   

కార్మా కర్త క్రియాచెయు ధర్మాలివి     

--((**))-- (ఇది అనంతపురం నుండి పోస్టు చేసినది) 


ఆరాధ్యా భక్తి లీల-104
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

భావము : భగవంతుని తన తప్పులు, గుణదోషాలు ఎంచక రక్షించుమని వేడుకుంటున్నాడు.


నీవు దేవా దేవుడవు, సర్వ సముడవు కదా 

మాలో ఉన్న గుణ దోషాలను, సరిదిద్ద రాదా  

పుణ్యాత్ములను, నిత్యం కాపాడిన హాని ఉందా 

వెన్నెల పూలపై, ముళ్లపై, పడ్డా హాని ఉందా 
పాపాత్ములను శిక్షతో మారిస్తే.  హాని ఉందా
శ్రీ వేంకటేశ్వరా మాపై నీ చూపు, హాని ఉందా  

గాలి ప్రాణాలన్నింటి కాపాడితే, హాని ఉందా  

నిత్యం ప్రార్ధించే దీనుణ్ణి రక్షిస్తే, హాని ఉందా
దేవతల్లా మానవుల్ని రక్షిస్తే , హాని ఉందా  
శ్రీ వేంకటేశ్వరా మాపై నీ దయ, హాని ఉందా   

ఎండ ఉత్తమ హీనమ్ తలిస్తేనే, హాని ఉందా   

అగ్ని ఎగసి చల్లబడితేనే, హాని ఉందా 
సముద్రం ఉప్పెనలా ముంచితేనే, హాని ఉందా 
శ్రీ వేంకటేశ్వరా అనుగ్రహంల్లో, హాని ఉందా 

భక్తుడిగా హాని అడిగే హక్కు నాకుఉందా  

సంసారంలో కష్టసుఖాలుపొందే హక్కు ఉందా 
నేను నిన్ను వరములను  కోరే స్వేశ్చ ఉందా 
శ్రీనివాసా మొక్కు తీర్చా జాప్యంలో, హాని ఉందా 

సుఖం, హాని, తెలియని అమాయకుణ్ణి కదా

పాపపుణ్యాలు తెలియని మానవుణ్ణి కదా   
నీవు దేవా దేవుడవు సర్వ సముడవు కదా 
మాలో ఉన్న గుణ దోషాలను సరిదిద్ద రాదా  




--((**))--


ఆరాధ్య భక్తి లీల -105
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

నీ నామమునే పఠిస్తూ ఫలితం అధికం
నీ సుముఖం చేరి కీర్తిస్తూ  మరీ అధికం 

నీ పాదాలకు చేస్తున్నా, సంకీర్తనలతో
పూజల ఫలితాన్ని నేను కోరుకో నంటా 
నీకు మధుర కీర్తనలను,  నాలికతో 
పాడి తరగని సంపదగా ఎంచుకుంటా ...  నీ

పరవశం చెందుతావు ఒక్క కీర్తన తో 
కీర్తనలు వ్రాసి  నైవేద్యం పెడుతూ ఉంటా
నీ పాదాలు కంది పోకుండా నవనీతంతో 
సంగీత స్వర మాలికలు అందిస్తూ ఉంటా ... నీ

నన్ను రక్షించు కొనే మార్గమనే నెపంతో 
మనస్సు శాంతcపరిచి ఉడి కిస్తావంటా 
నీవే దయ చూపి అలరించే పాటలతో
ప్రేమతో పుణ్యమనే మూట నందిస్తావంటా .... నీ

గర్వం రాదు నీ మహిమ కొని యాడుటతో
సంతృప్తి చెంది, నిత్యం పరవసిస్తూ ఉంటా
తప్పులు తెల్పవయ్యా వేంకటేశా నాతోఁ
దిద్దుకొని నిత్యమూ తృప్తి పరుస్తూ ఉంటా ...నీ

నీ నామమునే పఠిస్తూ ఫలితం అధికం
నీ సుముఖం చేరి కీర్తిస్తూ మరీ అధికం .... ( 2 )


--((**))--

ఆరాధ్య  భక్తి లీల - 106
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

ఏంతో చక్కనివాడు, అంతా మేలు చేయువాడు 
చుక్కల్లోని  చంద్రుడు, కోనేటి రాయుడు వాడు 
శాంతా కారుడు వాడు, వెన్నెల కురిపించు వాడు 
వేదనలు తీర్చువాడు, వేదాంతాన్ని నేర్పువాడు 

ఎంతో చక్కని వాడు, అంతు చిక్కని వాడు 
ఎద పొంగును సరిదిద్ది, ఆదు కోనెటి వాడు
ఎంతో ధనమున్న వాడు,  వడ్డీ  కట్టు వాడు    
చింతా తొలగించు వాడు, చిన్మయ చరితుడు 

ఎంతో చక్కని వాడు, చూసిన మల్లా చూడమనేవాడు  
కొంతా శక్తిని ఇచ్చు వాడు, కొండతా మెగధీరుడు 
అంతరంగమందు ఉన్నవాడు, అంతా తెల్సినవాడు   
అర్ధాన్ని అర్ధాంగిని ఆదుకొనే, నిత్య కల్యాణరాయుడు  
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేరుడు 



--((**))--

ఆరాధ్య భక్తీ లిల - 107   
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

అమ్మలు గన్న అమ్మువు నీ వేనమ్మా 
అమ్మా అని పిలిస్తే ఆత్రుతతో ఆదు కున్నావమ్మా  
ఆది శక్తులకు మూలం నీ వేనమ్మా 
ఆరాధ్యులకు ఆత్మ దర్సన మిచ్చావమ్మా  

అగస్యని నోట నామాలు పలికించా వమ్మా 

అత్యంత రహసాన్ని మాకు తెలిపా వమ్మా 
అప మృత్యువులను ఆపే శక్తివి నీవే నమ్మా    
అకాలంలో కుడా ధైర్యాన్ని అందించావమ్మా 

ఆయుర్దాయాన్ని అందించి ఆదుకున్నావమ్మా 

ఆదమరచి నిద్రించే వార్ని మేల్కొల్పా వమ్మా 
అత్యాసతో ఉన్న వారని అదుపులో పెట్టావమ్మా 
ఆసక్తిని పెంచి ఆరాధించుట మాకు నేర్పావమ్మా  

ఆది అంతములు నీవే సృష్టిస్తున్నావమ్మా 

అనేన స్తోత్రాలతో సర్వవ్యాధుల్ని తొలగిస్తావమ్మా  
ఆత్రుతగా పారాయణ చేసినా ఆదుకున్నావమ్మా 
అన్ని నీవేనని ఆరాధిస్తే సంతృప్తిని పంచావమ్మా  

అమ్మలు గన్న అమ్మువు నీ వేనమ్మా 
అమ్మా అని పిలిస్తే ఆత్రుతతో ఆదు కున్నావమ్మా  
ఆది శక్తులకు మూలం నీ వేనమ్మా 
ఆరాధ్యులకు ఆత్మ దర్సన మిచ్చావమ్మా  


--((**))--

ఆరాధ్య భక్తి లీల -108
రచాయిట: మల్లాప్రగడ రామకృష్ణ 

కలలు కల్లలౌతాయి గదమ్మా  

కళలను సఫలం చేయాలమ్మా     
కళ్ళల్లో పెట్టుకొని చూడాలమ్మా 
కల్లోలాలు రాకుండా చేయాలమ్మా 

కవ్వంలా కదిలే జన్మ మాదమ్మా   

కష్టంలోన ఉన్నాం కాపాడవమ్మా 
కక్షలు పెర్గు తున్నాయి కదమ్మా 
కనికరం లేని మనుషులమ్మా 

కబళించే మృత్యువు ఆపాలమ్మా 

కదంతొక్కే మృగాలు వచ్చాయమ్మా
కట్టు బట్టలే నల్గి ఉన్నారమ్మా   
కపటంతో బతికే జీవులమ్మా 

కమ్మని మాట చెపుతున్నానమ్మా 

కమ్మిన కష్టాలు తొలగించమ్మా
కమ్ముకున్న చీకట్లు తరమమ్మా 
కమలంపై కూర్చున్న లక్ష్మివమ్మా   

--((**))--


Shiva Shakti
ఆరాధ్య భక్తి లీల -109
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

అర్ధంలో పరమార్ధం చెప్పవమ్మా 
అణు వణువూ ఆకర్షనే నమ్మా 
ఆత్మీయత పంచి పోషించావమ్మా  
అక్షయ పాత్రను అందించావమ్మా 

అలుపు రానియ్యక ఉన్నావమ్మా 

అలరిస్తూ బంధువు ఐనావమ్మా
ఆణిముత్యం ఇచ్చి ప్రేమించావమ్మా
అవధుల్లేని శక్తి నిచ్చావమ్మా 
  
అమృత భాష్యాన్ని అందించావమ్మా 
ఆత్రుత చూపకుండా చేశావమ్మా 
అనృత పల్క కుండా చూశావమ్మా 
ఆశయాన్ని ఫలింప చేసావమ్మా 

అత్యాశకు పోకుండా ఆపావమ్మా 

అదృష్టం కోసం చూడొద్దన్నావమ్మా
అష్ట కష్టాల్లో శక్తి నిస్తావమ్మా  
అందలంపై ఆశ వద్దన్నావమ్మా 

ఆపేక్షతో ఆదుకున్న లక్ష్మమ్మా  

అనుమానాన్నీ మాపేటి లక్ష్మమ్మా 

--((**))--



ఆరాధ్య భక్తి లీల -110

రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

గుణవతిల్లో గుణవతివమ్మా 

రూపవతిల్లో రూపవతివమ్మా 
జ్ఞానవంతుల్లో జ్ఞానవతివమ్మా 
విద్యావంతుల్లో విద్యావతివమ్మా 

దేవతలలో దేవతవమ్మా 

భారతములో భారతివమ్మా 
సేవాపదంలో సేవికవమ్మా 
ధర్మగుణంలో ధార్మికవమ్మా 

సత్యం పల్కులో సత్యవతమ్మా 

న్యాయం పల్కులో న్యాయరాణమ్మా 
నిత్యం పల్కులో ప్రేమపంచమ్మా 
నమ్మ పల్కులో నారాయనమ్మా 

నవ తేజంలో యువతివమ్మా 

నవ రత్నాల్లో రత్నానివమ్మా 
నవ సిద్ధుల్లో   సిద్ధిని వమ్మా 
నవరాగాల్లో  రాగిణివమ్మా 

నమ్మకములో నటివి వమ్మా 

విజ్ఞానములో సరస్వతమ్మా 
వినోదములో విశ్వాసతమ్మా 
వినయములో విశ్వానికమ్మా 

అమ్మా అమ్మ నీవే మాకు పెద్దమ్మా 

మ్మా అమ్మ నీవే మాకు పెద్దమ్మా      

--((**))--


ఆరాధ్య భక్తి లీల -111

రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

జాబిల్లితోనే ఉండే వెన్నెలమ్మా 
మబ్బుల్లలోనే ఉండే మేఘాలమ్మా 
పర్వతంలోనే ఉండే పార్వతమ్మా 
హృదయంలోనే ఉండే సామ్రాజమ్మా 

నిర్మలత్వంలో ఉండే నిర్మలమ్మా  

ఆచరణలో ఉండే అణువమ్మా 
స్ఫురద్రూపంలో ఉండే అరుణమ్మా 
స్ఫూర్తిదాయకంలో ఉండే పూర్ణమ్మా  

ఆరాధ్యుల్లో ఉండే ఆకర్షణమ్మా 

నయనాల్లో ఉండే కామాక్షివమ్మా 
ఆశయంలో ఉండే ధైర్యవతమ్మా  
కోర్కల్లో  అలివేలు మంగవమ్మా 

సద్భావనలో ఉండే స్మృతివమ్మా 

సదుద్దేశంలో ఉండే దృతివమ్మా 
సంకల్పంలో ఉండే హృధ్యవమ్మా 
సంరక్షణలో ఉండే హరివమ్మా 

అమ్మా అమ్మ నీవే మాకు పెద్దమ్మా 
మ్మా అమ్మ నీవే మాకు పెద్దమ్మా      

--((**))--



ఆరాధ్య భక్తి లీల - 112
ప్రాంజలి ప్రభ 




రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

మామిడి తోరణాలు కట్టానమ్మా 

మందిరాన్ని శుబ్రపరిచానమ్మా 
మమతల కోవెల్గా మార్చానమ్మా 
మనసిచ్చే దేవిగా కొల్చావమ్మా  

మాఇంటి మహాలక్ష్మి నివేనమ్మా 

మాంగల్యాన్ని రక్షించే దేవీవమ్మా 
మల్లెపూల మాల వేసితినమ్మా 
మందార పూలతో పూజించావమ్మా 

మాకు పస్పు కుంకుమ ఇచ్చావమ్మా   

మాకు మనోధైర్యాన్ని పంచినావమ్మా
మా ఆశలన్నీ నెర వేర్చవమ్మా 
మా దేశ ఇలవేల్పు నవేనమ్మా 

మాతా పిత లకు మాతృశ్రీవమ్మా  

మాధుర్యాన్ని అందుచే దేవివమ్మా 
మౌనంతో నామ్మాన్ని జపించావమ్మా
మంత్ర స్త్రోత్రాలతో పూజించినామమ్మా 


   --((**))--


ఆరాధ్య భక్తి లీల - 113 

మల్లాప్రగడ రామకృష్ణ 

వికసిత సుమహరితవమ్మా 

విరిహర వాస్య జగతివమ్మా .
వైవిధ్యప్రకృతి చైతన్యవమ్మా 
వర సంతాన రూపవతివమ్మా     

త్రిభువన భావ వనితవమ్మా     

హసిత మనోహర రూపమమ్మా.
ఆహ్లాద శుభశోభస్కర వమ్మా 
విజయ సఫలత నీదే నమ్మా  .

సకలజన రక్ష వతివమ్మా 

హృదయాత్మజంగా ఉన్నావమ్మా  
సుధాకర ప్రేమస్వరూపమమ్మా  
జ్ఞానానంద శాంతి దేవతవమ్మా 

దయామయ కరుణా వతివమ్మ 

సంపూర్ణ సుభాషితా సృజనమ్మా 
గంధ పరిమళ సుమంగళమ్మా 
మహిళను మించి మహిళవమ్మా   
--((**))--

ఆరాధ్య భక్తి లీల - 114  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఉష:కాలమైనది మేల్కోవమ్మా 
మేళతాళాలు మోగుతున్నాయమ్మా 
గాయకుల మధురగానాలమ్మా 
కటాక్ష వీక్షణాలను చూపమ్మా 

విశ్వమంతా చల్లగా ఉంటుందమ్మా 

జగతి సుఖవంతంగా చేయమ్మా   
సువర్ణ కుంభాలతో పూజలమ్మా 
సుందర మణిమయ దీపమమ్మా 

సువర్ణ మైన సింహాసన వమ్మా 

సుఘంధ పరిమళాలు జల్లమ్మా 
మనుల్ ముత్యాల్ హారాలు వేశానమ్మా 
పట్టు వస్త్రాన్ని అర్పిస్తున్నానమ్మా
    
పద్మాల కుసుమాలతో పూజమ్మా  
వరుస ధుపా దీప హారతులమ్మా    
మధురమైన శీతల గంగమ్మా  
అమ్మా జగదాంబ నైవేద్యాలమ్మా 
 --((**))--

.

ఆరాధ్య భక్తి లీల - 115  

రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

చినుకును ముత్యంగా మార్చవమ్మా  

నదిని చైతన్యంగా మల్చావమ్మా  
పుష్పంలో పరిమళం ఉంచావమ్మా  
సమస్త సృష్టికి మూలం నీవేనమ్మా 

మకరందం అమృత మయ్యిందమ్మా  

కాలం అనంతం అని చెప్పావమ్మా 
మనిషి జీవితం అల్పమైందమ్మా   
జీవిత చక్రం మూలం నీవేనమ్మా 

సమాజం వాస్తవంగా ఉండదమ్మా 

ఊహ కవిత్వంగా మారుతుందమ్మా 
ఆకు ఆకు ఆభరణ మేనమ్మా 
మనస్సు నిబ్బరంగా మార్చవమ్మా 

భక్తిలో విస్వాసం కల్పించవమ్మా  

క్షేత్రదర్సనమ్ పుణ్యమన్నావమ్మా
పండుగలలో కల్వమన్నావమ్మా
జాతరలో ఉల్లాసం నీదయమ్మా 

--((**))--


ఆరాధ్య భక్తి లీల - 112
ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఉన్నా లేకున్నా - లేకున్నా ఉన్నా
మనసంతా నిండు సున్నా
అన్నా వద్దన్నా - వద్దన్నా అన్నా
వలపంతా నిండు సున్నా

విన్నా విననన్నా - విననన్నా విన్నా 
మాటలంతా నిండు సున్నా
కన్నా కనలేనన్నా- కనలేనన్నా కన్నా
కలలంతా నిండు సున్నా

తిన్నా తినకున్నా - తినకున్నా తిన్నా
ఆరోగ్యమంతా నిండు సున్నా
అన్నా అన్నన్నా - అన్నన్నా అన్నా
బంధుత్వమంతా నిండు సున్నా

కాలం ఎలాగున్నా - ఎలాగున్నా కాలం
మమతంతా నిండు సున్నా
ప్రకృతి మారుతున్నా - మారుతున్న ప్రకృతి
వయసంతా నిండు సున్నా

అగ్ని ఎలాగున్నా - ఎలాగున్నా అగ్ని
తాపమంతా నిండు సున్నా
నీరు ఎలాగున్నా - ఎలాగున్నా నీరు
దాహమంతా నిండు సున్నా     

లేదన్నా ఉందన్నా ఇది నిత్యం
తిన్నా తినకున్నా  ఇది పత్యం
ధనమున్నా లేకున్నా ఇది భత్యం
ఔనన్నా కాదన్నా ఇది సత్యం

అమ్మ నిన్నే వేడుకుంటున్న 
నాన్న నిన్నే ప్రార్థిస్తున్నా 
శ్రీదేవి భూదేవి సమేత 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 


--((**))--


ఆరాధ్య లీల -113
- ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు  
దైవం నీ హృదయంలోని ఉన్నాడు 
ప్రశ్నించక ప్రార్ధించటమే నీవంతు 
కర్మానుసారం సుఖశాంతులు మెండు  
ఓ మనిషి తెలుసుకో తెలుసుకొని మసలుకో

ఏది సత్యం ఏది నిత్యం
అర్ధం కోసం వెంపర్లాడకు
ఏది పుణ్యం ఏది పాపం
విమర్సతో ప్రయత్నిమ్చకు

ఏది కాలం ఏది ఖర్మం
సమయాన్ని వ్యర్థం చేయకు
ఏది గమ్యం ఏది శాపం
ఆలోచనతో నష్టపోకు

ఏది ప్రేమ ఏది బ్రమ
మనసును వేధించకు
ఏది మమ ఏది తమ
వయసుని కష్ట పెట్టకు

ఏది నిశ్శబ్దం ఏది శబ్దం
మౌనం కన్నా విలువ మాటకు
ఏది బంధం ఏది ఆనందం
ఇంద్రియాలను నిగ్రహించకు

ఏది నవ్వు ఏది శోకం
చూపుతో కన్నీరు తెప్పించకు
ఏది ముద్ర ఏది నిద్ర
నిద్ర రాదు శ్రీరామ జపముకు

ఏది ఉత్సాహం ఏది నిరుత్సాహం
ఆశకి చిక్కి అభాసు పాలు కాకు
ఏది ప్రోత్సాహం ఏది ప్రోద్బలం
పంచభూతాలను వ్యతిరేకించకు

ఏది మనస్సు ఏది యశస్సు
మనస్సే మనుగడకు యశస్సు
ఏది ఉషస్సు ఏది తపస్సు
మనకు వెలుగే తపస్సు

శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు 
దైవం నీ హృదయంలోని ఉన్నాడు 
ప్రశ్నించక ప్రార్ధించటమే నీవంతు 
కర్మానుసారం సుఖశాంతులు మెండు  
ఓ మనిషి తెలుసుకో తెలుసుకొని మసలుకో



--((*))--