ఓం శ్రీ రామ్ : శ్రీ మాత్రే నమ: ఓం శ్రీ కృష్ణాయనమ:
ప్రాంజలి ప్రభ- భగవద్గీత (అంతర్గత) సూక్తులు -
61. ఏ ప్రాణికైనను ఏవిధముగాను, ఏమాత్రమును కష్టమును కల్గించకుండా ఉండవలెను
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
62. మేలుగూర్చియు భావముతో, కపటము లేకుండా, ప్రియవచనములతో యధార్ధ భాషణం చేయవలెను.
63. ఏ ప్రకాముగానైనను ఎవరి సొత్తును, అధికారమును అపహరించకుండా ఉండవలెను.
64. మానసికముగా గని, వాచికముగా గాని, శారీరకంగా గాని, సర్వావస్థలయందును సదా సర్వదా మైధునములను పరిహరించవలెను.
65. శరీరానిర్వాహణకు మాత్రమేతప్ప మరి ఏ ఇతర భోగ్య వస్తువులను సమకూర్చ కొనకుండా ఉండవలెను.
66. బాహ్యాభ్యన్తర ప్రియాప్రియములు, సుఖదుఃఖములు మొదలగు ప్రాప్తించి నప్పుడు సదా సర్వదా సంతుష్టుడై ఉండవలెను.
67 ఏకాదశి మొదలగు ఉపవాసములు ఆచరించుట ఆరోగ్యమునకు అవసరంగా భా వించ వలెను .
68. లోకహితమును గూర్చు శాస్త్రముల అధ్యయనము దైవ నామగుణ సంకీర్తనము చేయవలెను .
69. భగవంతునకు సర్వస్వమును అర్పించి భగవదా దేశములను పాటించ వలెను.
70. ప్రతివిషయమును అదేపనిగా ఆలోచించక, మనం చేసే పనులలో నిజా నిజాలు గ్రహించి పరులను నొప్పించక, మనం కష్టాలు కొని తెచ్చుకోక, ఆంతర్యాన్ని అర్ధం చేసుకొని అర్ధాన్ని పొందెందుకు నిరంతరమూ శ్రమించవలెను.
71. ఆసనము సుస్థిరంగా ఉంచి గాలిని లోపలకు పీల్చుట, బయటకు వదులుట ప్రాణాయామము చేయాలి ప్రతి నిత్యము.
72. ఎదో ఒక ధ్యేయస్థానమునందు చిత్తమును స్థిరముగా ఉంచిన ఇంద్రియములను నిగ్రహించుకో వచ్చును.
73. మమత, ఆసక్తి,,ఫలేచ్చను వదలి భగవన్నామముతో ప్రాణాయామము చేయవలెను.
74. యోగాభ్యాస అనుకూలగా సాత్వికాహారమును తీసికొనవలెను, అతిగా తిన్న ,, అసలు తినక పోయిన కష్టమే.
75. హృదయము ప్రాణ వాయు స్థానము, అపాన వాయుస్థానము గుదము, నాభి సమాన వాయు స్థానము, కంఠము ఉదాన వాయు స్థానము, శరీర మంతయు వ్యాన వాయుస్థానము వీటినే పంచ ప్రాణులందురు.
76. పరమార్ధ సాధానకు దూరమైనవాడు నిరంతరము చింతాగ్నిజ్వాలలో మసి అవ్వక తప్పదు
77. మానవ జన్మయందు కర్తవ్య కర్మను అనుసరించని వానికి ఏ జన్మ నందును నిజమైన సుఖమును పొందజాలడు.
78. తల్లి తండ్రులను, పతిని, గురువుని దైవముగా భావించి వారికి సేవలు చేయుట నైతిక భాద్యత అని భావించవలెను.
79. నిస్వార్ధ భావముతో సేవించుట వలన బ్రహ్మ ప్రాప్తి కలుగునని భగవంతుడే ఉదహరించెను.
80. కర్తవ్య తత్వమును తెలుసుకొని అనుష్ఠించుట వలన ప్రాపంచక బంధములనుండి సర్వదా విముక్తుడగును.
81. యజ్ఞములన్నింటిని త్రికరణ శుద్ధిగా అమలుజరిపినప్పుడే దేశము సుసంపన్నముగా ఉండును. .
82. ద్రవ్యములను వినియోగించి చేయు యజ్ఞమును ద్రవ్య యజ్ఞము అందురు
83. నేయి, చెక్కర, పాలు, పెరుగు, నువ్వులు, బియ్యము, పండ్లు, చందనము, కర్పూరము, శుఘంధ యుక్తమైన ఓషదులు అగ్నియందు హోమము చేయుట వలన శాంతి కలుగును.
84. జ్ఞానులు నుండి భగవ తత్వమును తెలుసు కొనుట వళ్ళ శ్రద్ధ సమగ్రత పెరుగును.
85. భక్తిశ్రద్ధలతో సాదరముగా దండ ప్త్రణామమును చేయవలెను.
86. దూడను చూచిన గోమాతకు వాత్సల్యముతో పొదుగు పొంగి పాలు కారును.
87. బిడ్డను చూసిన జననికి స్తన్యము చిమ్మి పాలు కారును
88. యోగ్యుడైన వానివద్దకు చేరిన మనుష్యుడు విద్య తప్పుకు వచ్చును
89. కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో జ్ఞానులను సముచిత రీతిలో ప్రశ్నించి పరమాత్మ తత్వమును పొందవలెను
90. లోకవ్యవహారములో జ్ఞాని మనస్సు, బుద్ధి శరీరములో ఉండును.
91. జగతంతయు నీటియందు మంచువలె, ఆకాశమునందు మేఘమువలె, బంగారములో నగ వలె, బ్రహ్మ రూపమై ఉండును.
92. నీవు మహాపాపి అయినా జ్ఞాన నౌక సహాయముతో పాప సముద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా బయట పడగలవు.
93. అగ్ని సమిధులను భస్మము చేసినట్లు జ్ఞానమనే అగ్ని కర్మలను భస్మము చేయును.
94. నీవే పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు అని ప్రార్ధించ వలెను .
95. లోకవ్యవహారమునకు ప్రతి ఒక్కరు ఎదో ఒక వ్యాపారము చేయవలెను.
96. వ్యాపారమందు పూర్తిగా నిమగ్నమైతే ఆకలిడప్పులు, నిద్దరాసుఖములు, విశ్రాన్తి దుమారం పట్టవు.
97. శరీరమునకు క్లెశము కలిగినను పట్టించుకొనక, ధనలాభమువలన చిత్తము పసన్నతను పొందును.
98. ఇంద్రియములు వశమగువరకు (దేశసేవ కొరకు) శ్రద్దగా తీవ్రముగా అభ్యాసము చేయవలెను.
99. సూర్యోదయము ఆయిన వెంటనే గతంలో జరిగినవణ్ణి మరచి, శాంతిని చేకూర్చినవి గుర్తు పెట్టుకొనవలెను .
100. ఎట్టి పరిసస్థితిలలో విస్వాసము కోల్పోయి, సంశయాగ్రస్తుడుగా మారకము, ఇటువంటి వాని జీవితము వ్యర్ధము, ఫలితములను ఈపరిస్థితిలో చూడలేడు.
101. వేదశాస్త్రపారాయణమువలన, మహాపురుషుల వచనములు వినుటవలన మనసులో ఉన్న సంశయములన్ని తొలగించుకొని జీవించ వలెను.
102. స్త్రీ, ఐశ్వర్యము చుట్టూ వచ్చే సందేహాలకు భయము చెందక ధైర్యము వహించి, ఓర్పుతో నిజా నిజాలు గ్రహించిన నాడు మనసుకు శాంతి ఏర్పడును.
103. వివేకా జ్ఞానప్రభావము వలన మనిషిలో ఏర్పడే సంశయములన్ని తొలగి పోవును.
104. ప్రతిఒక్కరు మోహావేశమునకు లొంగక కార్యోన్ముఖులై ( అనగా హృదయ ముందు ప్రేమ నింపుకొని సంశయములు తొలగించుకొని ఇతరులలో ప్రేమను నింపుటకు) యుద్ధము చేయవలెను.
105. మమత, ఆసక్తి, ఫలేచ్చలను త్యజించి యుద్దము చేయుట (సమస్యలనుండి బయట పడుటకు) శ్రేయస్కరమని పరమాత్ముడు తెలిపెను.
జ్ఞాన కర్మ సన్యాసయోగము (నాల్గవ అధ్యాయము సమాప్తము.) .