7, ఏప్రిల్ 2017, శుక్రవారం

Interent Telugu Magazine for the month of 4/2017/

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
బంబ అనగా=    ద్వి భవ్య హస్తములు ,
 భగము = జ్ఞానము ,యత్నము

Pastel Succulent Art Print
భంబ  భగము  పద్యాలు
1. ఎక్కడి వక్కడ తక్కువ చెప్పక ఎక్కువ చెప్పుట 
తప్పుల ఒప్పులు తిప్పల ముప్పులు వచ్చుట చెప్పుట 
అన్నలు అక్కలు కెప్పుడు అప్పులు గొప్పలు చెప్పుట 
చక్కని సుక్కలు మక్కువ చూపిన ఒప్పక తప్పదు 
 
2. వక్కల ముక్కలు, ఆకులు, కొబ్బరి చిప్పలు ఉంచుట
పచ్చని ఆకులు, మెచ్చిన బల్బులు, అక్కడ ఉంచుట
అక్షిత పువ్వులు, విచ్చిన మొగ్గలు, కుంకుమ ఉంచుట
గాజుల చప్పుడు, గజ్జల చప్పుడు, పెళ్ళిలొ ఉండుట
 
3. తెల్లని పాలను నల్లని నీళ్ళను నమ్మక తప్పదు
అల్లన చంద్రుడు చల్లని వెన్నెల వీచుట తప్పదు
పిల్లల నవ్వులు  ఏడ్పుల చూపులు చూడక తప్పదు
కుర్సిన వర్షపు నీరును భద్రము చేయక తప్పదు


4
. స్త్రీలకు మానము ప్రాణము, శీలము సౌఖ్యము సిద్ధము
నేర్చిన విద్యలు ఎప్పటి కప్పుడు పంచుట తధ్యము
చూపును సఖ్యత భావము, శాంతము ఓర్పుతొ ఉండును
ప్రేమను పంచుట మంచిని పెంచుట స్త్రీలకు సొంతము


5. తల్లియు తండ్రియు అత్తయు మామను చూడక తప్పదు
పెద్దలు చిన్నలు అందరు పుట్టుట మెట్టుట తప్పదు
మల్లెలు మొల్లలు జాజులు కొల్లలు పూజకు తప్పదు
కమ్మని తెమ్మెర గుమ్మని వాసన పీల్చక తప్పదు

6
. అట్టలు వేసిన, తట్టలు మోసిన, మట్టిని తవ్విన
గుంతలు పూడ్చిన, మొక్కను నాటిన, గుట్టలు కట్టిన
కష్టము తప్పదు, లాభము గిట్టదు, తిండికి కష్టమె
పేదల భాదలు, ఎవ్వరు చూడరు, లోకము తీరులె
lady desidia - Google Search:

7. నిందలు మోపుట, తప్పులు చేయుట, నమ్మక వమ్ములె
కొండలు కూల్చుట, మంటలు పెట్టుట, తొందర చేయుట
మోసము నేర్చుట, రోషము పెంచుట, తాపము నుండుట
ద్వేషము చూపుట, ద్రోహము చేయుట, కొందరి నేర్పులె
 
  8. నిత్యము సత్యము పల్కుట, అచట ముచ్చట వచ్చుట
విత్తము పొత్తుయు నష్టము, మచ్చిక మెచ్చిన మంచిది
భోగము రోగము వేగము, భాగము దానము నెమ్మది
గర్భము వచ్చుట మంచిది, నిర్భయ మిప్పుడు తప్పదు
 
9. మోహిని కామిత చూపులు, మానుష దారులు మార్చును
మాయను కమ్మియు, మౌనము వీడియు, ఆశకు పోవును
మీసము తిప్పియు, వేషము మార్చియు,  చూపెను
ప్రేమలొ ముంచియు, భాగ్యము దోచుట కొందరి నేర్పులె
 
10. నాదియు నీదియు ఏదియు కాదును వేదన వీడుము
వాదన చేయక రోగము పెంచక శాంతిని పొందుము
నిన్నటి మాటలు నమ్మిక పాలకులు మానస ఉంచుకు
మొనము వీడియు మంచిని నమ్ముట జీవిత సౌఖ్యమె
 
11. ఆపద పొంచి ఉన్నది తెల్సుకొ, నిబ్బర శక్తియు
ధైర్యము ఉంచుకొ, సోమరి  పోతుగ ఉండకు, కొంపకు
నిప్పును అంటిన బావిని త్రవ్వుట మూర్ఖుని భావము
అట్టిదె తల్చుట బుద్ధికి మంచిది కాదును మేలుకొ  
 
12. ముందున వెళ్ళెటి వారివి దోషము లెప్పుడు ఎంచకు
పోయిన వారిని  దోషిగ చెప్పకు, తప్పులు పట్టకు
నమ్మిన వారిని దోషిగ  మార్చకు, దోషము లెంచకు
వచ్చిన భాదలు తప్పవు భేదము చూడక మేలుకొ


Image may contain: 1 person


13. రేపటి కోర్కలు కోసము ఆశలు పెంచుట భావ్యము
 కాదులె, మాటల బట్టియు వేదన చెందుట భావ్యము
కాదులె, నాటక మాడుట మూర్ఖుని చేష్టలు భావ్యము
 కాదులె, మంచిని నమ్మియు సత్యము తెల్పుట భావ్యమె

 
13. ఇంటిని చక్కగ దిద్దుట, భర్తకు ప్రేమయు పంచుట
బిడ్డకు విద్యను నేర్పుట, తల్లికి  తండ్రికి అత్తకు
మామకు సేవలు చేయుట నేస్తము నమ్మియు  దేశము
భాద్యత కొంతయు తీర్చుట స్త్రీలకు నిత్యము  సొంతము

14. ఊహల  మాటున, బాసలు చేసిన, నేతల వేషము
రేపటి మాటలు ఈనాడె చెప్పుట, చేసేవి చెప్పక
నమ్మిక పల్కులు, ప్రేమల వర్షము, ఓట్లకు దండము
భాగ్యము పంచియు, నెయ్యము చేసియు, పేదకు దండము


15. విద్యయె మంచిని పంచెటి బుద్దిని,  శీలము సంపద
జాతికి సేవయు, ప్రేమకు బానిస, సజ్జన నెయ్యము
యోగ్యత భావము, నిర్మల నీతిని, దానము చేసియు
భారత పౌరుల శక్తికి మూలము, సత్యము ధర్మము


16. దేవుడు తెల్పిన విద్యకు, సరైన నేత్రము లేదులె 
నిత్యమ సత్యము పల్కుట,  సరైన పూజయు లేదులె   
ప్రేమకు మౌనము చూపుట, సరైన దు:ఖము కాదులె
కర్మల శోభను త్యాగము చేయుట, సౌఖ్యము కాదులె


17. సోఖ్యము త్యాగము చేసిన విద్యయు వచ్చుట తధ్యము
విద్యయె ఆశయ మైనను సౌఖ్యము తగ్గుట సత్యము
సఖ్యత కోరిన వారికి విద్యయు ఎప్పుడు తగ్గులె
విద్యయె కోరిన వారికి సఖ్యత సౌఖ్యము తక్కువ
Image may contain: 1 person, sitting
భంబ  భగము పద్యాలు -18

రాముని నామము నిత్యమ చేసిన బుద్ధిని పెంచును
మారుతి గానము చేసిన మంద మతీపొయి శోభయు  
రాముని చెంతయు అందరి ప్రార్ధన ప్రేమను కోరుట
రాముని గానము మానస సంతస వెన్నెల భావము

19. మానస వీణను మీటిన - ఓర్పుతొ ఉండిన ప్రేమయు ,
 కష్టము చేయక తప్పదు - ఆకలి తీర్చుట తప్పదు,
 స్త్రీయును వేదన పంచును - స్త్రీ యును ప్రేమను పెంచును,
ఏమని చెప్పెద ఇప్పుడు - స్త్రీలకు శాంతియు ఎప్పుడు,


20. లోకులు అన్నను, ఆశలు చూపిన, భాధలు పెట్టిన
 చాటున తిట్టిన, కోపము తెచ్చిన, సేవలు చేసెద
ఆశయ సాధన, శోధన నీపైన ప్రేమయు పంచెద
నన్నును నాప్రజ, పాపపు భావము, వెంటనె మార్చుము   
  
21. స్త్రీ సోభయే మన భాగ్యమె, విద్యయె సంతస సోభలె
స్త్రీ నిధి శ్రీ మతి సేవయె, నిర్మల శాంతము వల్లనె
స్త్రీ వడి జిక్కిన వక్కువె, సన్నుత ప్రేమను పంచియు
స్త్రీ యద చిత్తము నుండియె, ప్రజ్ఞను పొందుట సత్యము    


22. ఆకలి తీరదు, ఆశలు మారవు,  ఆమోర నమ్మరు
ఓపిక తగ్గదు, పోరును మార్చరు, నేతలు మారరు
కేకలు తగ్గవు, మాటలు ఎక్కువ, సేవలు తక్కువ
రోషము వచ్చును, దేహము ఊగును, నమ్మిక పల్కును


23. ఆంద్రయు అంతయు ఎండల వేడియు, బాగుగ పెర్గెను
స్నేహము పెంచియు, చల్లటి నీరును, మజ్జిగ పంచుము     
నందున ఉండియు తల్లిగ నీడను ఇవ్వుము
విశ్వమె వింతగఁ రేయి బవళ్లును వెచ్చనె పంచును

24. ఎండలొ తిర్గుట మంచిది కాదని పెద్దలు చెప్పెను
గర్వము చూపక వంచన చేయక సేవలు పంచుము
హాయిగా సాగును నాడువిహారము రాత్రుల వెన్నెల
శ్రేయము గూర్చును సేవలు చేసెడి వారికి నిత్యము 

25 .          
  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి