25, ఏప్రిల్ 2017, మంగళవారం

**మల్లాప్రగడ రామకృష్ణ కధలు 1

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రేనమ:
ఓ శ్రీమతి ఇది ప్రేమా - సాధింపా 

ఏమండోయి మీరు నిద్రపోయే ముందు ఒక్కసారి అన్నీ తలుపులు వేసారో లేదో చూడండి, టీవి ప్లగ్ తీసేయండి, మంచినీళ్ళు రాగి చెంబుతో తీసుకొచ్చాను, మీరు కష్ట పడతారని ఆపని చెప్పలేదు. అన్న మాటలకు భర్త మాధవ్ అట్లాగే నీవు ఏమిచెప్తే అదే చేయాలిగా, ఒక్కటి ఆటో ఇటో అయ్యేందనుకో ఇక పస్తే నాకు, ఏమిటండి ఆమాటలు మనమే మన్న చిన్న పిల్లలమా మనవళ్లు ఎత్తుకొనే వయసు మనది. ఆమ్మో ఆపని మాత్రం నాకు పెట్టకు, నాకు అంత ఓపిక లేదు, పిల్లలను మోయటం, వాళ్ళ ఏడుపుని తగ్గించడం నావళ్ల కాదు, ఇది నాకు చాలా కష్టమైన పని, నీవు చెప్పిన పనులే చేయుట చాలా తేలిక అంటూ మంచం చేరాడు.

ఏమిటో అప్పుడే అలసి పోయిన్ది,  ఉషోదయం నుండి బొంగరం తిరిగినట్లు తిరుగుతూ, ఎవరో తాడు పెట్టి ఆడించి నట్లుగా ప్రతిదీ శుభ్రం చేస్తూ ఇంటిని అందంగా ఉంచాలి అని పదే పదే అరుస్తూ, చెప్పులు సర్దుతూ పడిన మట్టిని తుడుస్తూ, అన్నీ ప్రత్యేకంగా ఉండాలని సర్దుతూ ఉంటుంది శ్రీమతి రాధ . భార్యని మెచ్చుకుంటున్నాడు మాధవ్ .

అప్పుడే ఏవండీ ఏమిటి ఆలోచిస్తున్నారు నన్ను గాట్టిగా పట్టుకోండి, నాకు పాడు కలలు వస్తున్నాయి, భయంగా ఉన్నది అంటూ కౌగలించుకొని పడుకున్నది. ఇదండీ నిత్య సత్య కాపురం ఎప్పుడు ఏమి జరుగునో ఎవరూ చెప్పలేరు, కానీ శ్రీమతి జరగబోయే వాటిని ఊహించుకుంటూ దానిలో కష్ట నష్టాలు వర్ణించు కుంటూ భాదను సంతోషం వ్యక్త పరుస్తూ ఉంటుంది. ఎప్పుడు నిద్రపోతుందో, ఎప్పుడు మేల్కొంటుందో నేను మాత్రం గమనించలేను.

ఒకసారి నేను నవ్వు కుంటూ ఉన్నాను, శ్రీమతి నిద్ర పోతున్నది కదా అని, మేల్కొంటు ఏమిటండి ఆ నవ్వుకు అర్ధం చెప్పండి, మీరు చెపితే గాని నాకు నిద్రరాదు, ఆ ఏమి లేదే మనపెళ్ళి విషయం గుర్తు కొచ్చి నవ్వు కుంటున్నాను, 30 ఏళ్ల తర్వాత ఎం వేషాలేద్దా మను కుంటున్నారు నిద్రపోతూ అన్నది, అమ్మతోడు ఎటువంటి దురాలోచన లేదు, వద్దులేండి మీమీద అమాత్రం నమ్మకం నాకున్నది నాతొ మాట్లాడే టప్పుడు అమ్మతోడులు, ఓట్లు మనమధ్య తేకండి, నవ్వుకు కారణం చెప్పండి చాలు, అసలు విషయం చెప్పనీయకుండా నీవంతు నీవు మాట్లాడు తున్నావు, సరేలేండి ఇక చెప్పండి
             
వినండి నామాట వినండి  ఉన్నారంటే మనసు ఊరుకోదు, మనసులో ఉన్న విషయాన్ని నోటితో కక్కేయండి, అలా కక్కలేదనుకో మనసు వాదనకు గురి అవుతుంది, దీపం చుట్టూ తిరిగే పురుగౌతుంది,    అందుకే  స్త్రీ - పురుషులమధ్య అవగాహనం, మౌనం ఉండాలి తెలుసుకోండి . 

మౌనంగా పొరాడటం అంటే, మాట కట్టేసి మనసుతో సంఘర్షణ పడటమే..అది చాలా కష్టతరమే..వేరెవరితోనో పోరాడటం ఒక ఎత్తు..స్వీయంగా మనసుతో పోరాడటం మరో ఎత్తు..ఇక్కడ మౌనం నెగ్గుతుందా మనసు నెగ్గుతుందా అనే అంశం ఆలోచిస్తే ..ఎటూ తేల్చలేని స్థితి.. అవి రెండూ ఒకరి లో జరగటమే ఈ సంఘర్షణకు కారణం.. ఎక్కువ సార్లు మౌనమే గెలవొచ్చు..మనసు ఓడిపోవడం వెనకాల రహస్యం పెద్దగ ఏమీ లేదు..మనసు మాట ను వినక పోవడమే కొన్నిసార్లు మౌనానికి గెలుపునిస్తుంది.. మౌనంగా ఉండటమే గెలుపు..ఆ గెలుపుకు సహకరించిందే  వ్యక్తిత్వం, వ్యక్తిత్వం అర్ధం చేసుకోవటం ఎవరి తరం కాదు, కాలాన్ని బట్టి, ఉషోగ్రత బట్టి, ఆకలి బట్టి మౌనం వీడి మనసు అవగాహన అర్ధం చేస్కోవటానికి ప్రతిఒక్కరు ప్రయత్నం చేయటమే మానవజన్మ సార్ధకం, మనసుని బట్టి అర్ధం చేసుకొని ఒకరికొకరు బ్రతకటమే జీవితం.

ఏమిటండి నవ్వు ఆపేసారు నీమాటలకు నా బుర్ర గిర్రమని తిరిగింది, ఇక నవ్వేక్కడొస్తుంది మౌనం గురించి నిద్రబోతు చెప్పావు, ఇక నాకు నిద్ర వస్తున్నది పడుకుంటా, అదే నేను చెప్పింది గురక పెట్టకుండా మౌనంగా పడుకోండి నాకు నిద్రపట్టదు .. అది ఇట్లాగే ఏమో నాకు తెలియదు ప్రయత్నం చేస్తే సాధింపలేనిది లేదన్నారుగా ప్రయత్నం చేయండి అంటూ నిద్రకు ఉప క్రమించింది రాధ, ఎప్పుడు ఘర్కా వస్తుందో అని భార్యకు భాధ కలిగించ కూడదని తెల్లవార్లూ నిద్రపోకుండా మేల్కొన్నాడు మాధవ్ .