26, ఏప్రిల్ 2017, బుధవారం

**మల్లాప్రగడ రామకృష్ణ కధలు -3

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:

3. సంసారి
విషంక్రక్కే భుజంగం లా, కదంత్రొక్కే తురంగం లా, మదం పట్టిన గజం లా, వలయ విచల ద్విహంగం లా, విలయ సాగర తరంగం లా, చిత్రకార్తి కుక్కలా నావెంట పడ్డా వెందుకు,  నాదగ్గర ఏమి ఆశిస్తున్నావు, ధనమా, సుఖమా, మరి ఏమి కావాలి నీకు, నన్ను వెంబడించ కుండా ఉండాలంటే నేను నేమి చేయాలో చెప్పు, నన్ను వదలి వెళ్ళు, నాదగ్గర నీవు ఏమి ఆశించిన అంతా సూన్యము తప్ప ఏమి దొరకదు అది మాత్రం గుర్తించుకో, నామీద ఆశలు వదులుకో, నీ మాయలో చిక్కే మనిషిని కాదు, ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని అందాలు చూపిన నేను మారి మూర్ఛ పోయే మనిషిని కాదు.

నీకో విషయం తెలియపరుస్తా నిష్టా గరిష్టుడుగా ఉన్న సంసారిని ఎవరూ వేరు చేయలేరు, ప్రలోభాలకు లొంగ దియలేరు ఇది సత్యము ఆది శంకరాచార్యలు ఇవిధముగా తెలియపరిచారు " మోక్షమం దత్వంతా సక్తి గల పురుషుడు శబ్దాది విషయ వాసనలను నిర్మూలించి, సర్వ కర్మలను బరిత్యజించి, గురు వేదంత వాక్యములందు విశేష శ్రద్ధతో  శ్రవణ మననాదుల సభ్య సించిన ఎడల, వట్టి వాని బుద్ది రాజోగుణ రహితమై పరిశుద్ధ మగును "

నేనంత వాడిని కాక పోయినా నీతో వాదన దిగే శక్తి నాకులేదు, నీతో మాట్లాడుతే తప్పు, అయిన ఓర్పుతో ఆడదాని వని ఎటువంటి గట్టి దండన చర్య తీసుకో కుండా నన్ను వెంటాడ వద్దని తెలియ పరుస్తున్నాను.

గులాబీ నెమ్మదిగా ఈ విధముగా అన్నది మాధవ్ తో

ఈ పూట కేమేమి -ఈ రాత్రి వెన్నెల్లొ - నవ్వు ల్లె పువ్వుల్లొ
 నావెల్గు నీవేగ - నాతృప్తి నీ వేగ  - ఈ వేష మెచ్చేన 
 ఈ మాట ఏ తీర్పు- ఈ ఆశ ఏ మాయ- ఈ బొమ్మ నీదేను   
రారాసు రామా- నువే నాప్రియా నిన్ను పొందాలి ఇప్పట్లొ 

   
ప్రాణమ్ము నీదేను, ప్రాణమ్ము మాయేను  - ప్రాణమ్ము బ్రహ్మమ్ము
 ప్రాణమ్ము ధైర్యమ్ము, ప్రాణమ్ము మోక్షమ్ము ప్రాణమ్ము దేహమ్ము    
ను వ్వాడు  యీసంధ్య వెల్గుల్లొ - నమ్మించు యీసృష్టి వెల్గుల్లొ
మాట్లాడు  ఈ మంచి వెల్గు ల్లొ - ప్రేమంత చూపాలి  ఈ రాత్రి వెల్గుల్లొ 


నీవు మొగడివి, మఘధీరుడివి, నా కళ్లకు నీవు గోపాల కృష్ణుడివి, అందుకే ఒక గులాబీ గా నిన్ను అరాదిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. ఈ రోజుకు వెళుతున్నాను, నా ప్రయత్నములు మానను ఏ రోజు కైనా సరే నిన్ను నా పాదాలు పట్టించు కోక పోతానా అని అంటూ వెను తిరిగింది గులాబి.

నెమ్మదిగా ఇంటికి చేరాడు మాధవ్, తలుపు కోట్టాడు, తలుపు తీస్తూనే ఏమిటండి మీ మొఖం అట్లాగుంది, ఎదో మార్పు ఉన్నది అన్నది, ఏమి లేదులే ఎండలో వచ్చాగా అందుకే నీకు నా మొఖము కమిలి నట్లు కనిపించి ఉంటుంది, ఏమి లేదు బాగానే ఉన్నాను, మీకు వంట్లో బాగా లేక పోతే చెప్పండి ఆసుపత్రికి వెళ్దాం, రోగం దాచు కోకండి అన్నది, నాకు పట్టిన రోగం చెపేది కాదు, చెప్ప కూడనిది కాదు అని గొణుక్కున్నాడు, ఏమిటండి అలా గోనుక్కుంటారు ఎమన్నా అనాలంటే మొఖం మీదే అనండి అన్నది. అబ్బా కాసేపు కూర్చొనిస్తావా, మంచి నీల్లెమైనా ఇస్తావా రాధ అని వాలు కుర్చీలో ఫాన్  వేసుకొని నడుం వాల్చాడు మాధవ్ .

ఇదుగోనండి మంచి నీరు అనగా తీసుకోని గడ గడ త్రాగి ఒక 10 నిముషాలు నన్ను లేపకు అని కళ్ళు మూసుకొని పడుకున్నాడు.

నిద్రలేచిన తర్వాత రాధ మాధవ్ తో ఈ రోజు గుడిలో ఒక వింత జరిగింది, ఒక ఆరడుగుల అందకత్తె మంచి పట్టు చీరకట్టుకొని అక్కయ్యగారు బాగున్నారా అని అడిగింది. నాకేం అర్ధం కాలేదు అసలెవరమ్మా మీరు అన్నా, ఏమిటండి నన్ను అమ్మా  అంటారు మీ కన్న చిన్నదాన్ని, మీ వారికి బాగా తెలిసిన దాన్ని నన్ను చెల్లీ అని పిలవండి చాలు అన్నది, మల్లో ఉన్న అంతరార్ధం అర్ధం కాలేదు. మీ వారు చాలా మంచి వారండి,  పరస్త్రీ మొఖం కూడా చూడరు, కానీ మీ వారు మిమ్మల్ని వివాహము చేయక ముందు నుంచి నాకు బాగా తెలుసు, మిమ్మల్ని మోసం చేస్తున్నారామె నని అనుమానం ఉన్నది  అన్నది. నాకు కోపం వచ్చింది పైకియా కనిపించకుండా నేను అసలు విషయం సూటిగా చెప్పండి, డొంక తిరుగుడు వద్దు చెప్పండి, ఏమీ లేదండి మీరు వప్పుకుంటే మీవారిని నేను పెళ్లి చేసుకుంటా, మోకిష్ట మున్న లేకున్నా ఉంచు కుంటా అని గట్టిగా చెప్పిందండి. పేరు చెప్పింది, ఆ గుర్తు రావటంలేదు బంతో, చామంతో ఆ ఆ గుర్తొచ్చింది "గులాబి " అన్నది.

ఏమి తెలియని వాడిలా మాధవ్ ఇంతకీ ఆమెతో ఏమి చెప్పావు
నేనేమి చెప్పలేదు కొందరు మనుష్యులు వచ్చి ఆమెను తీసుకెళ్లారు అదీ జరిగింది.
ఆ మనుష్యులు ఎవరో కనుకున్నావా ఏమో నాకేం తెలుసు
కనుక్కొనే ఉంటావు నా దగ్గర దాస్తున్నావు నీవు
అవునండి తెలుసుకున్నా నేను "ఆమె పిచ్చాసుపత్రి నుండి తప్పించుకొని వచ్చిందట, ఆమె మీద 3 మర్డర్ కేసులు  కూడా ఉన్నాయిట .
పాపం ఏ తప్పు చేసిందో
ఈమెకు మపిచ్చి పెరిగి ఒకర్ని ప్రేమించిందట, పేమించినవాడు దిన్ని మోసం చేసి వేరొకర్ని పట్టుకొచ్చి సర్వం అర్పించ మన్నాడుట అంతే ఆమాటలకు తట్టుకో లేక వచ్చిన వాడ్ని ప్రేమించిన వాడ్ని చెడుగుడు ఆడి మరి చంపి పోలీసులకు లొంగి పోయిన్ది.మానసిక రోగిగా మారింది. ఎర్రగా బుర్రగా అందంగా ఉన్న మగవాడ్ని చూస్తే బుట్టలోకి లాగి మరీ చంపు తున్నదిట, మొన్న జైల్ నుంచి వచ్చాక ఒకర్ని లొంగ దీసుకొని మొగవాళ్ళు మూర్కులు అని మరీ చంపి, తప్పించుకొని వేరొక మొగాడితో తిరుగు తుందట, పెళ్లైనవాడ్ని వారిని సంభందించిన వారిని లొంగ దీసుకొని వేటాడు తుంటూ ఉంటుందట. ఆమె కధ వింటుంటే నా ప్రాణం పైన పోయిన్ దనిపించింది. నామంగళ సూత్రం గట్టిది,
మావారు అలాంటి వారు కాదని నమ్మకము నాకు ఉన్నది అని చెప్పింది.

ఒక్కసారిగా ఊపిరి పీల్చాడు ఇదుగో రాధా ఇక్కడ ఆడవారు చాలా గట్టివారు మోసకారి లాగున్నారు కదూ. ఎందుకండీ అలా అంటారు మగవాళ్ళు గట్టిగా ఉంటే ఏ ఆడది భయపడ నవసరము లేదు.
ఇలాంటి మానసిక వ్యధకు గురైనవారు తటస్థపడితే మనమే జాగర్తగా ఉంటే చాలు, భయపడ నవసరంలేదు.

ఓరాధా  నీవు చెప్పింది మంచి విషయమో, చెడ్డ విషయమే తెలుసు కోలేకున్నాను ఒక స్త్రీ బాధపడితే నామనసు భాదలో ఉంటుంది పాపం ఆమెకు మంచి జరగాలని ఆదేవుడ్ని కోరుకుందాం పదా గుడిదాకా వెళ్లి వద్దాము అన్నాడు మాధవ్ .

అప్పుడను కున్నది రాధ మావారు ఎంత మంచివారు ఇతరులకోసం కోసం కూడా గుడికి వెల్దామంటున్నాడు ఏమిటో  విషయం
ఏమిలేదు మీ ఆడవాళ్ళ బుధ్ధి మాత్రం మార్చుకోరు, ఏది అన్న ఎదో తప్పు పడుతుంటారు
అంతలేదండి నాలో మీరెలా గంటె అలా ..  లేదు లేదు నీవెలా అంటే ఆలా
మహాప్రభూ మీతో మాట్లాడలేను నేను పదండి గుడికి ...  ఆ ఆ వసున్నా