25, ఏప్రిల్ 2017, మంగళవారం

**మల్లాప్రగడ రామకృష్ణ కధలు 2

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

2. నడక

ఇతి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే,

శ్రీకృష్ణారునసంవాదే, జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయఃఅని టివిలో 

ఉపన్యాసం వసున్నది, మాధవ్ వింటూ ఉంటాడు 

ఓ శ్రీమతీ నీకు భగవద్గీత ఎమన్నా అర్ధ మవుతున్నదా, నా  బదులు మీరేవింటారు ఎక్కువగా, మీకు అర్ధ మయితే చెప్పండి, అలా నడుచుకుంటూ మాట్లాడు కుంటూ, లోకాభి రామాయణం వింటూ పోదాము, కాస్త ఉండండి చీర కట్టు కొని వస్తా, ఏమిటీ ఇప్పటిదాకా చీరకట్టుకోలేదా, ఏమీ ఇప్పడి దాకా నామోహమే చూడలేదా, ఇక నా వళ్లెం చూస్తారు మీరు, దున్నపోతు నిద్ర మీది, వంటి మీద ఏమి ప్రాకినా మీకు తెలియదు, అన్నీ నేను చూసి చెప్పాలి, అబ్బా ఎందుకే  అన్ని  మాట లంటావు, ఎదో జోకేద్దా మనుకున్నా అంతే , ఆవునులెండి ఈ మొగవాళ్లందరికి ఆడదానిని చూస్తే జోకు లేసి ఏడి పించాలని బుద్ధి వుంటుంది. అబ్బా ఆందరిని ఎందుకు కలుపు తావు, నేను అడిగిన విషయము చెప్పగా, ఇక నడు తాళాలు వేసి, బయలు దేరుదాం, ఆ అట్లాగే వస్తున్నా, తాళం వేసి తాళం జాగర్తగా పెట్టుకోండి, అసలే మతి మరుపు మీకు అంటూ నవ్వు కుంటూ నడవటం మొదలు పెట్టారు మైదానం వైపు.

మైదానం చేరారు, రెండు వృత్తాలుగా తిరగటం జరిగింది, విశ్రాంతిగా ఒక బల్లపై కూర్చొని ఉన్నారు రాధా మాధవ్,   ఆ   ఇప్పుడు చెప్పండి భగవద్ గీత అన్నది మాధవ్ తో రాధ. 

అమ్మో అది చెప్పటం నావల్ల కాదే, గుర్తున్న కొన్ని విషయాలు చెప్పగలను అంతే, అంతవరకు చాలు మన మేమి స్వామిజీలు, కాము పర్వాలేదు చెప్పండి.

1. అగ్ని కట్టెలను ఎలాబూడిదచేయునో, మనిషిలో చేరిన అజ్ఞానము వలన సమస్తము   భాధపడుటకు కారణ మగును, వయసు పెరిగిన కొలది జ్ఞానము పెరుగును, ఆ జ్ఞానమును నలుగురికి పంచకపోతే ఉన్న జ్ఞానము బూడిదలో పోసిన పన్నీరగును, జ్ఞానమనే అగ్ని సమస్త కర్మలను భస్మము చేయును.

2. ఈ లోకములో జ్ఞానానికి మించినది ఏదియు లేదు, అట్టి జ్ఞానమును (కర్మ) యోగస్థితిని బొందినవాడు కాలక్రమమున 

పరమాత్ముని యందే స్వయముగ లినమై పోగలడు. 

3. (గురు, శాస్త్రవాక్యములందు) శ్రద్ధగలవాడును, (ఆధ్యాత్మిక 

సాధనలందు) తదేకనిష్ఠతో గూడినవాడును, ఇంద్రియములను 

లెస్సగా జయించినవాడునగు మనుజుడు జ్ఞానమును 

పొందుచున్నాడు. అట్లు జ్ఞానమును బొందినవాడై యతడు 

పరమశాంతిని శీఘ్రముగ బడయగల్గుచున్నాడు.
 
4.జ్ఞానము లేనివాడు, శ్రద్ధారహితుడు, సంశయచిత్తుడు 

వినాశమునే పొందును. సంశయచిత్తునకు ఇహలోకముగాని, 

పరలోకముగాని, సౌఖ్యముగాని లేవు.
 
 
 5. ఓ అర్జునా! నిష్కామకర్మయోగముచే కర్మ ఫలములను 

త్యజించినవాడును, (లేక ఈశ్వరార్పణ మొనర్చినవాడును), 

జ్ఞానముచే సంశయములు నివర్తించినవాడునగు ఆత్మనిష్ఠుని 

(బ్రహ్మజ్ఞానిని) కర్మములు బంధింపనేరవు. 

6. ఓ అర్జునా! కాబట్టి నీయొక్క హృదయమున నున్నదియు, 

అజ్ఞానమువలన బుట్టినదియునగు ఈ సంశయమును జ్ఞానమను

ఖడ్గముచే చేదించివైచి నిష్కామ కర్మయోగము నాచరించుము. 

లెమ్ము.
 
7. ఓ అర్జునా ! మనిషిని తప్పు దోవ పట్టించే వాటిలో మొహం 

ముఖ్యమైనది. అది లోభానికి దారితీస్తుంది. అహంకారానికి అదే 

కారణం. దీనివల్ల వివేకం నశిస్తుంది. అటువంటి వక్తి దేనికి పనిరాని 

వస్తువు క్రింద ఉన్నట్లే అది గమనించు 

8.ఓ అర్జునా ! ఖ్యాతి కైనా, అపఖ్యాతి కైనా కారణాలు రెండు. ఒకటి

హృదయం రెండవది నాలుక. హృదయ వైశాల్యమే సత్కిర్తికి 

కారణం. నాలుక దురుసుతనం అపకీర్తికి మూలం. ఈ  రెండు 

మనిషిలో ఉంటాయి. మాట విలువ తెలుసుకొని హృదయం 

అర్పించుటలో ఉన్న ముఖము వర్ణించుటలో   కాదు. 
 

భగవంతుడు మనకు తెలియపరిచారు జ్ఞాన సంపదవలన 

అజ్ఞానము తొలగించుకొని కర్మలాచరించమని, ధైర్యముగా 

చేయవలసిన పని చేయమని మనకు హితబోధగా 4వ 

అధ్యాయంలో తెలియపరిచారు, నాకు తెలిసినవి క్లుప్తముగా 

తెలియపరిచాను రాధా రోజుకి. 

చాలండి ఈరోజుకు మీరు చెప్పింది, మంచి విషయాన్ని రెండ్ 

మూడు సార్లు వింటేగాని మనసు కెక్కదు, అదే చెడ్డ విషయమైతే 

వెంటనే మనసును చేరి బాధకు గురిచేస్తున్నది. అందుకే పతి  

మాట సతికి వేదవాక్కు, భర్తను బట్టే భార్యకు గౌరవము 

పెరుగుతున్నది. మీరు చాలా మంచి విషయాలు, ఇక ఇంటికి 

బయలు దేరుదామా, 

ఇంకా చమట పట్టలేదు, ఇంకా కొద్ది సేపు తిరిగావనుకో  

దేవుడెరుగు, కాళ్ళ నెప్పుల బామ్ ఉపయోగించాలి, అదికూడా నేనే 
వ్రాయాలి అవసరమా .. అంతదాకా నేను రానులే,  నీవు చెప్పినట్లుగా బయలు దేరుదాం ....

అంత మాట అనకండి, మీరంటే నాకు ప్రాణం, మీ క్షేమమే నా క్షేమము
ఏమిటే పొగుడు తున్నావా, తిడుతున్నావా ఏమో నాకర్ధం కావటంలేదు, భగవద్ గీతనే అర్ధం చేసుకున్నవారు నామాటలు అర్ధం చేసుకోలేరా ....   ఎందుకు చేసుకోలేను

నీ ఊహలకు ఊపిరి నాది ..., నీ భావాలకు భాండాగారం నాది ..., నీ చిలిపితనానికి చిరునామా నాది ... నీ విరహానికి విహంగం నాది ... నీ ఆర్ద్రతకు ఆలంబన నాది ...నీ వేదనకు వేదిక నాది ...
నీ ప్రతి కదలికకు హంస తూలిక నాది ... నీ ప్రతి స్పందనకూ ప్రతిబింభ తోడు నాది ...
నీ ఒంటరితనానికి ఓదార్పు నాది ...నీ తుంటరి తనానికి ఆటవిడుపు  నా తెలివి ... నీ మొండి తనానికి కారణం నేను - నీ అమాయకత్వానికి తోడు నా ప్రతిభే ...
 
అబ్బా ఏంతో అద్భుతముగా పలికావు, భర్తకు భార్య తోడు, భార్యకు భర్త తోడు జీవితాంతం ఉండాలి అదేనేను కోరుకునేది ...... అయ్యో నేను కూడా అన్నది అదే అన్యదా భావించవద్దు ... మన ఇద్దరి మధ్య ఎదో ఒకటి అనుకోక పోతే అది సంసారమే కాదు .... అట్లాగా అయితే నన్ను 5 స్టార్ హోటల్ కు తీసికెళ్తావా ... నీవు ఎక్కడికి తీసుకెళ్లమంటే అక్కడికి తీసుకోని వెళ్ళగలను ...
ఆమ్మో నన్ను మోస్తూ తీసుకెళ్లొద్దులే . తీసుకెళ్తనన్న మాటేచాలు ....