29, ఆగస్టు 2016, సోమవారం

Inernet Telugu magazine for the month of 9/2016/33

 ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
GIFS
 
ప్రాంజలి ప్రభ - వార పత్రిక
సర్వేజనా సుఖినోభవంతు

*వర్షపు శబ్దం

మధ్యరాత్రి నన్ను లేపేసింది వర్షపు శబ్దం
మజాగా ఉంది కిటికీలో నుంచీ చూడటం
ప్రియమైన పలక రింపైంది చల్లని సమీరం
బయట చూస్తే వెలుతురులో మెరుస్తోంది ఆ వర్షం

ధారలుగా పడుతూ ఎంతో బాగుంది దృశ్యం
ప్రకృతితో చేసుకుంటోంది సరాగ సౌజన్యం
కురిపించేస్తోంది జల్లుల్లొ మైత్రీ ప్రభంజనం
పూర్తిగా, ఇష్టంగా చేసుకుంటోంది అభిషేకం

వర్షాన్ని చూస్తూ ఐ పోయాను సమ్మోహితం
ప్రకృతి లోఈ వర్షపు సౌందర్యము ఓ అద్భుతం
జల జలా రాలుతున్న ఆ నీటి ప్రవాహం
ఓ మోహన వాయిద్యం మిళితమైన శ్రవణానందం .
అపురూపానుభూతితో తడిమిన నా అంతరంగం ......

ఏకాంతంలో ఓ మాధుర్యం దొరికినట్లుగా
నిద్దురలో లేచినా , చక్కని కల కన్నట్టుగా .
ఆ వర్షం నా నేస్తమై పంచింది ఆహ్లాదం
చల్లనైన మదితో సంతోషం పొందాను ఆతరుణం 

గత బాల్య  స్మృతలు గుర్తుకు వస్తున్నాయి 
జలాల్లో నాట్యాలు, వెన్నెలలో ఉయ్యాలలు 
 పెద్దల ఆర్తనాదాలు, పిల్లల ఆరాటాలు 
 నన్ను జల్లులు పిలుస్తున్నాయి 
సంతోషానికి ఇది ఒక జల్లుల ఆలయం

--((*))--


ఊహలు

ఊహలు గాలి బుడగలు
బుడగలు వర్ణ వివర్ణాలు
వర్ణాలు మనలో ఉషస్సులు
ఉషస్సులు మన ఆశయాలు

ఆశయాలు ఉండు అహర్నిసాలు
అహర్నిసాలు కదిలే ఋతువులు
ఋతువు లో మారు సమీరాలు
సమీరాలు మనిషికి   ప్రాణాలు

ప్రాణముంటే వినవచ్చు గాణాలు  
గాణస్వరాలు గంధర్వ మిలితాలు
మిళితమే జీవితానికి మలుపులు
మలుపులే మనసు యొక్కఆశలు

ఆశలే మానవుల బ్రతుకులు
బ్రతుకులో ఉండాలి ఎప్పుడు విజయాలు
విజయాల్లోఉండాలి సహకారాలు
సహాకారమే ఆదర్శప్రాయాలు
--((*))--


 Photo: Sri Kalyana Venkateswara Swamy
@ www.gotirupati.com







*కొత్త కోక

నాన్న నాన్న నాకు కావలి కొత్త కోక
అమ్మాయి నీవు తొక్కి వచ్చావు నక్క తోక
నీ మొగుడు తెచ్చాడు కొత్త కోక
మీ అమ్మ కొన్నది కొత్త కోక
నేను కొన్నాను కొత్త కోక
మరి ఎప్పుడు కట్టు కుంటావు కోకాలు

అన్నీ కోకలు ఈ శుక్రవారం అమ్మవారికి
సమర్పించి కట్టుకుంటాను నాన్న

నాన్న నన్ను దీవించు అంటూ
పాదాభి వందనం చేయగా
పుత్ర పుత్రాభివృద్ది కలుగు గాక

అమ్మా నన్ను దీవించు అంటూ
నమస్కరించగా చూడమ్మా ఆ అమ్మవారి
దీవెనలు నీకు ఎప్పుడు కలుగు గాక

ఏవండీ నన్ను దీవించండి
ఓలమ్మో నా పెళ్ళాం కట్టింది కొత్త కోక
నేనెందు కుంటాను ముద్దెట్టుకోక
నా జేబును అందుబాటులో పెట్టు కోక
తప్పదంటుంది కొత్త కోక         
 --((*))--

 
ప్రేమకోసం పాట
ఓ ఓ సుందరాంగీ, ఓ ఓ
లయకార లాస్య లావంగీ 
మమకారం చూపవే సంపంగీ
చిర్రు బుర్రు లాడాకే సివంగీ 

చెంతకు చేరి చింతలు తొలగిస్తానే
చిరునవ్వుతో ఒక ముద్దివ్వవే
నా ముద్దుల మోహనాంగీ 

మాయలుచేసే మాయలోడివి మామా
మనసును దోచే మాయ గాడివి మామా
ప్రేమా దోమా అంటూ ముగ్గులోకి లాగావుమామా
కూడు గుడ్డకు ఉద్యోగము ఎతుకు మామా
ముందు త్రాగుడు, పేకాట మాను మామా
నా మాట వినుకొని నడుచుకో మామా
చిరునవ్వుతో మొత్తం అర్పిస్తాను మామా

ఓ సంపంగి, ఓ లావంగి ఓ సివంగి
నీ ప్రేమకోసం అన్ని వదులుతానే,

ఉద్యోగం సంపాయించి మొనగాడ్నిఆవతానే
ఓ మాయాలోడా, ఓ సుందరాంగా, ఓ మనోహరా
నీవు మారిచూపు, నీ మాటకు నేను బానిస నవుతాను
నా నవ్వులు నీకు అందించి సంతోష పెడాతాను     

ఓ సంపంగి, ఓ లావంగి ఓ సివంగి
ఓ మాయాలోడా, ఓ సుందరాంగా, నా మనోహరా
    --((*))--


 
* చిగురించిన ప్రేమ

నీ రూపు నా మెనులో నిల్చి
సతతము నా మనసుని కదల్చి 
నీ ఆధారము నాకు సేద తీర్చి
ఓ మాలినీ నన్ను వదలి పోవుకాదా 

ముందు వెనకాల నీ మూర్తి నిల్చి
నా తనువు వేడి నంతా చల్లార్చి 
సౌందర్యాతి శయముతో జిగర్చి
ఓ లలితాంగి నన్ను వదలి పోవు కదా

కర పద్మములతో కలలో కౌగిలించి
తావులపై ఉన్న పువ్వుల వికసించి
విరహ బాధల తో ప్రకృతిని మించి  
ఓ భామిని నన్ను వదలి పోవు కదా   

జీవిత వాకిటిలో మనసు వికసించి
మమతల కోవెలలో మనసును పంచి
మనో నిగ్రహ శక్తిని మనసుకు అందించి
ఓ స్వేతాంగి నన్ను వదలి పోవు కదా 

--((*))--


 తప్పు కదా నాన్న 
* కొందరి స్త్రీల మానసిక క్షోభ ?

నేను చెప్పేది నీకు అర్ధం కాదని 
అర్ధమైన అమలు చేయటకు ప్రయత్నించవని
నాకోసం అర్ధం అయినట్లు నటిస్తావని
తెలిసినా నిన్ను వదలి నేను పోలేను   

మాట్లాడుకుంటాం, మాటల్లో నవ్విస్తావని
తప్పు పట్టి ఒక మూర్కుడిలా ప్రవరిస్తావని
నవ్వు కుంటాం, నవ్వులో ఎగతాలిని 
పుట్టించి కుళ్లు మాటలతో చంపుతావని 
తిట్టు కుంటాం, తిట్టులోని మాటలని
పదే పదే చెప్పి అనుమానిస్తావని  
తెలిసినా నిన్ను వదలి నేను పోలేను

ఎప్పుడూ కలుసుకుంటాం సుఖం లేదని
కొత్త కొత్త కోరికలతో వాతలు పెడతావని
తలుపులా హృదయాన్ని అందిస్తానని
తెలిసి కూడా మృగంలా ప్రవర్తిస్తావని
మనసును తనువును అర్పిస్తానని
గ్రుడ్డి వాడిలా గడియ తీసి భాదిస్తావని  
తెలిసినా నిన్ను వదలి నేను పోలేను

 సుఖం అందించే ఒక తారగా ఉన్నా
జాబిల్లికి తృప్తి ఉండదని 
పృథ్విలా సహకరించి మనసు అర్పించినా
ఆకాశానికి సంతృప్తి లేదని
శీతల పవనాలతో సుఖపెట్టినా
ఇంకా ఎదో వెలితి ఉందని 
తెలిసినా నిన్ను వదలి నేను పోలేను

మల్లె సొగసుల సువాసనని
అనుభవించి నలిపి పిప్పి చేస్తా వని
సంపెంగ పువ్వు సువాసనని
ఆస్వాదించి మైమరచి చితిపేస్తావని
గులాబీ పూలకు వాసనని
గ్రహించి రేఖలను తొలగిస్తావని  
తెలిసినా నిన్ను వదలి నేను పోలేను

నదిలా వచ్చి నీలో కలుస్తానని
సముద్రుడిలా గుర్తింపులేకుండా చేస్తావని
గ్రుడ్లు అందించి సహకరిస్తానని
పక్షిలా కాపాడక హింసిస్తావని
ఏంతో కష్టపడి మోసి గుడ్లను అందిస్తాను
అయినా పాములా తనగుడ్లను తినేస్తావని  
తెలిసినా నిన్ను వదలి నేను పోలేను

నేటి నా ఆలోచనా భావ కవిత 
ఇదే భారత స్త్రీ ఓర్పు అని భావించి
కొందరి మగబుద్ధిని తెలియపరిచా 
ఈ   కవిత నచ్చితే షేర్ చేయండి
--((*))--



           
* వడియాలు (నవ్వుకోవటానికి ) 

అందరి ముందు నేనొక హీరో  
పెద్దల ముందు నేనొక జీరో 
పిల్లకు ఏంతో నచ్చేది పోగొ 
కొన్ని పనులకు ఉపయోగం రోబో  
  
చెవులను మర్దన చేసేవారు సింగర్స్ 
కాలికి బుద్ధి చెప్పే వారు రన్నర్స్ 
నోటి నిండా పని కోరేవారు యాంకర్స్ 
వండ కుండా అన్నీ తినేవారు బెగ్గర్స్ 

వాడండి, వాడొద్దని చెప్పేది సెల్ 
చూడండి చూడొద్దని చెప్పేది ఫిలిం 
తిలకించండి ఏడిపించండి అనేది T.V.
అవసరాన్ని బట్టి ఉపయోగపడే ధర్మం గీత   

అన్ని వాహనాలకు ఉండాలి బ్రేక్    
కొందరు తినటానికి ఇషపడేది కేక్ 
ఎప్పుడూ ఉండాలి నీ వెంట  లక్        
ఏ విషయంలో ఎప్పుడు కాకు షాక్ 

సినిమా నటులకు ఉండాలి గ్లామర్ 
ఇంగ్లిష్ మాస్టర్ చెపుతారు గ్రామర్
కుటుంబనియంత్రణాధికారి అంటాడు నోమోర్
వ్యవసాయాధికారి అంటాడు గ్రోమోర్

స్త్రీలకు విన్నమాట మనసులో ఉండని దురద
ఉన్నా కనిపించనిది వీలు కానిది వీపు దురద
మందులు వాడినా ఎప్పుడుతగ్గనిది నోటిదురద
నచ్చినా నచ్చక పోయినా పెల్లైతే  ఒకటే దురద
    
--((*))--




పగటి చుక్క  సూర్య బింబం
కంటి చుక్క  కాంతి బింబం
ఎదుట చుక్క ప్రపంచ బింబం
నుదుట చుక్క సింధూరబింబం

రేయి చుక్క చంద్ర బింబం  
నీటి  చుక్క ముత్యం బింబం
రక్తం  చుక్క వజ్ర  బింబం
వెన్న చుక్క  స్వేత బింబం

చీకటిలో వెన్నెల బింబం
వెలుగులో ఆనందాల బింబం
మహర్షులకు ఆదర్శ బింబం
ఆద్యత్ములకు అమృత బింబం

నిత్య సంచార బింబం
వెన్నెల వెలుగుల బింబం
మానవులను తృప్తి పరిచే బింబం  
 సకల ప్రాణులు సంతృప్తి పరిచే బింబం
--((*))--

 
     
* పరిష్కారం ?

ప్రభుత్వాన్ని అడిగే హక్కు మాకు లేదంటారు
ఉంటే మా సమస్యలు తీర్చే వారు ఎవరూ లేరా
గద్దె ఎక్కిన ప్రజా ప్రతినిధులు పట్టించుకోరు 
మా సమస్యలకు పరిష్కారం ఎవ్వరూ చూపలేరా

ఆదాయం కోసం మత్తు పానీయాలు ఎందుకు అమ్ముతారు
మా ఆరోగ్యం చెడిపొమ్మని స్వయముగా చెపుతున్నారా
రోగులకు కావలసిన మందులు దొరక్కపోయినా పట్టించుకోరు
మందులు లేక వసతిలేక చనిపోయేవారిని పట్టించుకోరా

చిన్న వ్యాపారులను దెబ్బకొట్టే బడా వ్యాపురులొస్తున్నారు
పెద్ద వ్యాపారులకు కొమ్ముకాసి చిన్నవారిని గమనించరా
తప్పుడు లక్కలతో టాక్సు ఎగగొట్టేవారిని వదులుతున్నారు
ఒకనెల టాక్సుకట్టకపోతే తిండికే లేక కట్టలేదని తెలుసుకోరా

అంతర్జాలంపై ప్రతి ఒక్కరు ఎందుకు ఆధార పడుతున్నారు
మేధావులను ఉపయోగించుకొనే శక్తి ప్రభుత్వానికి లేదంటారా
పెద్దభవనాలకు నిర్మించుకు పంటపొలాలు మారుస్తున్నారు
పొలాలులేకపోతె తిండికి కష్టంవచ్చి బాధపడకుండా ఉండగలరా

ఆధునిక సౌకర్యాలు ఎన్నిఉన్నా రైళ్లు సకాలంలో నడపలేకున్నారు 
ప్రభుత్వం ఉద్యోగాలు ఎక్కువ కల్పించి నిరుద్యోగులను ఆదుకోలేరా
స్త్రీలు ఎక్కువచదువుకోని, ఉద్యోగం చేస్తున్న పెళ్లికిఖర్చు చేస్తున్నారు
స్త్రీల వివాహముల యందు ఖర్చు లేకుండా సహాయం చేయలేరా      
    --((*))--

Photo: गणपति बप्पा मोरिया,

सभी के जीवन में खुशियां ला।।।।

आप सभी को गणेश चतुर्थी की शुभकामनाएं
*సత్కారం

మనసును అర్ధం చేసుకోని -  వానికి సత్కారమేల
మాతృభూమిని గౌరవించని - వానికి సత్కారమేల

అరచేతి అడ్డు పెట్టి - కిరణాలను ఆపాలని అనుకొనే
నాయకుల చేష్టలు -  గొప్ప వాణి అని మెచ్చి సత్కారమేల

మాయలు, మంత్రాలతో - మరణాలను ఆపగలమనే
బాబాల భోధలను చూసి - మహాత్ములని మెచ్చి సత్కారమేల

సంసారము చేయక - ఔషధముతో  పిల్లలు పుడతారనే
మూడ వైద్యుల మాటలకు - ధనం అర్పించి సత్కారమేల

ఇళ్ళ కొరకు వృక్షములు నరికి, - ఎత్తైన భవనములు కట్టెనే 
పుడమి తల్లికి భారము కల్పించిన - మేధావికి  సత్కారమేల
 
శృంగారాన్ని అద్భుతంగా వర్ణించి - కొందరిని ఆకట్టుకొనే
కవిత చెప్పిన కవికి - గొప్ప కవిత్వమని తలంచి సత్కారమేల
--((*))--      

1 కామెంట్‌:

  1. Thanks for sharing, nice post! Post really provice useful information!

    FadoExpress là một trong những công ty vận chuyển hàng hóa quốc tế hàng đầu chuyên vận chuyển, chuyển phát nhanh siêu tốc đi khắp thế giới, nổi bật là dịch vụ gửi hàng đi đài loan uy tín, giá rẻ

    రిప్లయితొలగించండి