24, ఆగస్టు 2016, బుధవారం

రాధాకృష్ణ లీలలు

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం
 

 సర్వేజనా సుఖినోభవంతు 

ఎందరో మహానుభావులు అందరికి వందనములు 
*--
 ఓం శ్రీ రామ్    ఓం శ్రీ రామ్     ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ - గోకులాష్టమి ( పాటల సంగీత రూపకం)
వినండి - వినమని చెప్పండి 
వ్యాఖ్యానం: మల్లాప్రగడ రామకృష్ణ

ఒకారో టిక్ చేసి సంగీత రూపకం వినండి
సర్వేజనా సుఖినోభవంతు
--((*))--


- రాధాకృష్ణ  ప్ర్రేమ లీలలు 
*సుఖసౌఖ్యాలు పొందవాకృష్ణా

శ్రీ కృష్ణ  నీవు నాకు కనబడకున్నావు 
నా మనసు నీ  వెంట ఉన్నది 
అయినా ఈ రాధను 
కొన్ని శబ్దాలు తాకు తున్నాయి కష్ణా 
నా మనస్సును ఓదార్చుటకు రావా కృష్ణా 

జలపాతాల శబ్దం ఒక నాదాలుగా   
కెరటాల ఉరవడి ఒక వాదనలుగా   
తరంగాల లాస్యాలు ఒక స్పందనలుగా 
చినుకుల విన్యాసాలు ఒక వందనాలుగా 
నన్ను తాకు తున్నాయి కృష్ణా  
    
ఆకుల గల గల శబ్దం ఒక కలగా 
ఊగే చెట్ల కొమ్మలు ఒక గాలిగా  
వాయు తరంగ గాలులు ఒక లాలిగా 
స్వర విహారాలు మనసుకు ఒక జాలిగా 
నన్ను వెంబడిస్తున్నాయి కృష్ణా 

మబ్బుల గర్జనలు ఒక స్వరాలుగా 
హృదయ శబ్దాలు  ఒక ప్రేమలుగా  
స్నేహాల భావాలు ఒక చిహ్నాలుగా 
మాటల కలయకలు ఒక ఆందాలుగా 
నామనస్సును లాగుతున్నాయి కృష్ణా

ఈ రాధను అందుకొని
కనీ వినీ ఎరుగని సుఖ సౌఖ్యాలు 
పొందవాకృష్ణా 
ఈ  తనువు నీకే అర్పించాలని ఉంది కృష్ణా 
ఈ రాధ కోరిక తీర్చగ రావా కృష్ణా
--((*))--
 *రాధా కృష్ణ మనోహరం

కాలి మువ్వలై- నవ్వులు పువ్వులై 
వెన్నెల రాత్రులై -  సవ్వడి చేయవే రాధా

మనసు మంగళమై
తనువు తుంబుర నాదమై
శ్వాస సప్త స్వరమై
ద్యాస దివ్య ధ్యానమై
నాట్య  సుందరి వైన్నావు రాధా

నీ కోసం ఆటు పోట్లతో చిక్కి ఉన్నాను
కుంగుతూ, పొంగుతూ అల్లాడుతూ యున్నాను 
నీ అడుగుల సవ్వడికోసం విలపిస్తూ ఉన్నాను
నీవు ఉండి ఉండ నట్లుగా ఎందుకు ఉంటావు మాధవా

నీ స్పందనలు నా ఊహలై 
నీ ఆలాపనలు నాకు ప్రాణాలై
నీ ప్రణయ చూపులు వరాలై
నీ ప్రేమను నాకు అందించవే రాధా  

నీ కోసం సుధా చందన తాంబూలాలను ఉంచాను
నీ కోసం కళ్ళు విప్పారి ఎదురు చూసాను 
నీ కోసం మనో వనాన పుష్పాలను ఉంచాను 
నీవు స్వప్నంలో కనిపిస్తావు, తెరుస్తే ఉండవు మాధవా   

నీ సుమ సౌరభ రాగాలను వినిపించేవే
నీ లాస్య లీలల్ని  నాకు చూపించవే
నీ హావ భావాలు నన్నుఆకర్షించు తున్నవే
నీ హృదయతాపాన్నినాకోసం ఉంచానే రాధా

నీ  మధురాతి మధుర స్పర్శ కోసం వేచి ఉన్నా
నీ  కౌగిలిలో చిక్కి  తన్మయం చెందాలని ఉన్నా
నిన్నే ఆరాధిస్తూ వేయికళ్ళతో ఎదురుచూస్తున్నా
నామనసులోని కోర్కలను తీర్చవా మాధవా  
--((*))--


* రాదా మాధవ మనోహరం

రాదా నీ మనసు నాకు తెలుసు
మాధవా నీ మనసు నాకు తెలియదా!
అలా సరదాగా పూల సరస్సు ఒడ్డున
విశ్రమించి సరదాగా ఉందామా! ఓ అలాగే !

రాధ ఇటు చూడు
కలువలు రెండు
కల్లప్పగించి చూస్తున్నాయి మనల్ని 
కనికరము చూపుట కొరకా
కార్యసాధనం కొరకా
కాలంతో కలవ లేకా
కోపానికి చెదిరాయ చెప్పు రాధా 

"సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నాయి మాధవా"

మాధవా ఇటు చూడు
చామంతి పువ్వులు రెండు
బుగ్గలు రాసుకుంటూ ఉన్నాయి
చెప్పుకున్న కధల కా
చెలిమి సంభాషణల కా
తన్మయత్వం చెందుట కా
జలచరాల సవ్వాడి కా చెప్పు మాధవా

"తన్మయత్వ తపనలతో తపిస్తున్నాయి రాధా "

రాధ ఇటు చూడు
మల్లెలు మరువం రెండు
పెన వేసుకొని ఉన్నాయి
మనసుని పరవసింప చేయుటకా
మది తలపులను తెలుపుటకా
మృదు మాధుర్యాన్ని అందు కొనుటకా
మాయను చేదించుటకా, చెప్పు రాధా 

"తడి పొడి తపనలతో తపిస్తున్నాయి మాధవా"

మాధవా ఇటు చూడు
గులాబీలు గుభాలిస్తున్నాయి
స్త్రీల కొప్పులో చేరటానికా
కోపానికి నలిగి పోవటానికా
కోరుకున్నవాడి కోరిక తీర్చటానికా
బంతుల్లా ఆడుకోవటానికా చెప్పు మాధవా

"పవలింపులో నలిగి పోవాలని ఉన్నాయి రాధా "

"రాధా పోదామా గూటికి చలికాచు కుందాము
అట్లాగే మాధవా వెచ్చని కబుర్లు చెప్పుకుందాము" 

--((*))--


రాధామాధవ మనోహరం -3

మనసు లయమై తే
తనువంతా తేలిపోతుంది రాధా 
వయసు ముదిరిపోతే
గుర్తింపు లే ఉండవు రాధా

మనసు కు ఖాళీ లేకపోతే 

పరుష వాక్యాలు వచ్చును రాధా 
సొగసు మరిగి పొతే
గుర్తింపే కష్టమై పోవును రాధా

సరసులో నీరు ఎండిపోతే
జల చరాలు బ్రతకలేవు రాధా
కోరికలు తీర్చు కోక పోతే 
బ్రతుకుట కష్టమై పోవును రాధా

ప్రేమ మనసులో ఉండిపోతే
కళ్ళులేని దాన వవుతావు రాధ
దురుసు తనం నీలో పెరిగితే
మాటలు తడబడక తప్పవు రాధా

అలుసు చూసి పోరాడితే
అను కున్నట్లు గెలవ లేవురాధా
తెలుసుకున్న నిజంచెప్పితే
కష్టాలు వచ్చినా నిగ్రహించు కోవాలి రాధా         
 
ఉషస్సు ఇచ్చే మనస్సుతో 

తేజస్సుతో ప్రకాశించితే
యశస్సు సొంత మైతే     
మనస్సు ఉల్లాసమగా 

ఉత్సాహముగా ఉంటుంది 
కదా మాధవా    
అవును రాధా
--((*))--
image not displayed
*రాధాకృష్ణ ప్రణయ సాగరము

వలపుల తలపులు తెలుపవా
మెరుపుల సొగసులు చూపావా
మనుసున మమతలు పంచవా
ఓ రాధికా నీ మనసు నాదికా    

గంధము పూసెద, చందనం పూసెద 
తులసి మాలను వేసెద,   
మేఘశ్యామ రూప
శిఖ పింఛమౌళి ముకుందా

ద్రాక్షాపాకం త్రాగెదవా
కదళీ ఫలములను గ్రోలెదవా
మదన కదన కుతూహలము కొరకు
మనసును రంజింప చేయుటకు  
ఓ రాధికా నీ మనసు నాదిక

నారి కేళములు కావలెనా
కదళీ ఫలములు కావలెనా
నవనీతము కావలెనా
ఇక్షు రసములను కావలెనా 
శిఖ పింఛమౌళి ముకుందా

మూగ మనసుతో కోరుతున్నావు 
మౌన గీతములు పడుతున్నావు 
నుదుటి రాతలు గురించి చూస్తున్నావు 
ప్రేమను పంచు తున్నావు
ఓ రాధికా నీ మనసు నాదిక

మోహన మురళి నీకోసమే ఉన్నా
యదు వంశీకృష్ణ నిన్ను ప్రార్ధిస్తూఉన్నా 
అధరామృతాములను అందించాలని ఉన్నా
నంద గోపాల కృష్ణ, గోకులానందా
ఈ రాధిక ఆరాటం తగ్గించుకు రావా
      ;
వలపుల తలపులు తెలుపవా  రాధిక
మెరుపుల సొగసులు చూపావా కృష్ణ
--((*)--6.రాధ కొరకు కృష్ణుని -పారవశ్యం


కలల అలలపై తేలెను మల్లెపూవై
వలపు వయ్యారంగా మందారమై
మనసు సువాసనల  సంపెంగమై
కలలో తేలుతు కలిసే పారిజాతమై

వయసుకు గుబాళింపు అందించే మకరందమై
తనువు తనువు తపింపచేసే మొగలి  పూవై
వలపు తలపు మెరుపు చల్లబరిచే నందివర్ధనమై
స్వప్నంలో కనిపించే ముద్దాడే ముద్ద బంతివై

మక్కువకు హాయి గొలిపే విరజాజివై
జలకాలాటలకు సైఅన్న కలువ పూవువై
మకరందాన్ని దోచు అన్న తామర పూవువై
ఆధరాలు అందాలను తలపించే గులాబీవై       

చిరునగవులు చిందింస్తూ కదిలే పూల దండవై
వయసు అందాలు చూపిస్తూ బూరుగ పూవువై
తేన రసాలతో తృప్తి పరిచే మధుర మమ్మిడివై
నా మనసుదోచుకున్న అందాల సుందరి నీవే రాధా 
నామదిలో నిలిచిన రాధవు నివే
 ఒక పుష్పమై  
నాహృదయంలో ఉన్నావు
--((*))--


7.గోవిందా గోవిందా గోవిందా

చిరునవ్వులు  చిన్మయ రూపంలో
చూస్తూ ఉంటే తరించు పోవు హృదయం
ఊహలు అనంత వాయువులలో
ఉన్నా తన్మయ రూపానికి
పరవశం చెందే నా హృదయం   

అక్షర దీప దివ్య వెలుగులలో
ఆత్మీయంగా ఆదరించిన దివ్యరూపం 
ఆనంద బాష్పాల కాంతులలో
కావ్య నాయకుడైన అద్భుత రూపం 

కాలానికి అతీతమైన పసిడి కాంతులలో
మనస్సును ఆహ్లాద పరచిన దివ్య రూపం
మనసు తన్మయత్వం పొందే కాలాలలో
సుఖాన్ని అందించే చిద్విలాసం రూపం 
.
రేయి పగలు లో ఆవహిస్తున్న నిట్టూర్పులలో
కనుపాపాను ఒదార్చిన నీ మంగళ స్వరూపం 
విశ్రాంతి ఎరుగని నీ ఆకర్షించే చూపులలో
చిక్కని మానవులు లేరు ఈ కలియుగం లో
  
ఓదార్పుకోసం గాయ పడిన హృదయాలలో
నిరంతరం నీ స్వరణామం చేస్తున్న మాయాలోకం
సర్దుకుంటూ సాగిపోతున్న ఈ సమయంలో
ఆత్మ సంతృప్తినిచ్చే నీ దివ్యమంగళ స్వరూపం

మానసిక మదిని తొలిచే మౌన భాషలలో
మానవులను ఆదుకుంటున్న ఆత్మ స్వరూపం  
కమ్ముకు వస్తున్న కష్టాలలో, తీరని ఆశలలో
మరువని ప్రాణానికి ప్రాణమైన దివ్యాభరణ రూపం 
.
విధిరాత ఎలాఉన్నా నిన్ను మరువలేదు ఏ క్షణంలో
కాలానుగుణంగా నడుస్తున్న ధర్మ ప్రవర్తనలో  
దుష్ట శక్తులు ఎన్నో కమ్ముకు వస్తున్న ఈ తరుణంలో
నివేదిక్కు ఆపద్భాంధవా, అనాదరక్షకా, ఆత్రుతతో
ఆదుకొనే వేంకట రమణా గోవిందా గోవిందా గోవిందా   
   --((*))--

image not displayed 


8*రాధా గోపాలం 

నమ్మినాను, చేరి కొలిచినాను
నల్లని వాడవైనను, మనోహరుడవని
మనసును దోచిన అతి సుదరుడవని
మనసును అర్పించటానికి పిలుస్తున్నాను 'గోపాలా'  

పిలిచినా పలుకవు, నా మీద అలకా
నిన్నే నమ్మినానని, ఎక సెక్కముతో నవ్వులాటా
కపటము నాలో లేదు, నంద కుమారా
కళ్ళు కాయలు కాచినవి, నన్ను చూడవా 'గోపాలా'

మురళి విని నంతనే, పరుగెడి వత్తును    
అల్లరేల చేయుదువురా, వెన్నముద్దలు తెచ్చి ఇచ్చెద
ముద్దులివ్వమని కోరే బేలను నేను బాలను కాను
నా మనసులోని కోరికను తీర్చుటకు రా 'గోపాలా '

ఈ రాధ నీ కోసమే వేచియున్నది మరువకుమా 
నీ తనువూ నా తనువూ పెనవేసుకొని కలసి పోదామా
ఒకరి కొకరు ఐక్యమై ష్వర్గధామాన్ని చేరు  కొందుమా
హృదయాలతో పారవశ్యము చెంది పరవశించుదామా ' గోపాలా'  
గోపాల గోపాలా  ; గోపాల గోపాలా
--((*))--  

9*రాధ కృష్ణుని కోసం ఆలాపన
నా ఏకాంతపు నుదుట గీతలపై
నవ మన్మధాకారునికి లొంగి పోతానని
ఆ బ్రహ్మ వాసి యుండవచ్చు  

నా యద కాగీతం పై నీ సుఖస్పర్శ ఉందని
నిత్య సౌభాగ్యం పొందు తానని
విరంచి విపులంగా వివరించ వచ్చు 

నా నవ్వులు నీ  కోసం దాచి వుంచ మని 
ప్రాణయానందము పొందుటకు సుఖమని
సృష్టికర్త  వెన్నలను కురిపించ వచ్చు   

నా బ్రతుకు నిత్య వసంత మౌతుందని
నల్లనయ్య నవమన్మధుడై వస్తాడని
విధాత విపులీ కరించవచ్చు      

గోమాతలతో కూడి గోపాలుడు వస్తాడని
ఆదమరచి నిదురించక వేచి ఉండమని
పకృతి మాత హెచ్చరించవచ్చు 

మురళితో సరాగాలు పాడుతావని
నీ గాన మాధుర్యంలో నాట్యమాడాలని
నవనీతము అందించి ముద్దు లాడాలని
నవ మాలికలతో నిన్ను అలంకరించాలని
నా మనసును నీకె అర్పించు కోవాలని
నీవే సర్వ భూతములకు నాయకుడవని
సుగుణ పురుషోత్తమ రూపుడ వని
లీలా మానుష రూపములో ఘనుడవని
ఆశ్రీత అంతర్ధాన రూపుడ వని
అక్షరుడవని, శాస్వి తుడవని  ఈ రాధకు
ఆ పరబ్రహ్మ భగవత్ప్రాప్తికి, మోక్షానికి
కృష్ణుడే సరియైన ప్రేమికుడిని చెప్పియుడవచ్చు

ఈ  రాధ మనస్సును ఊరడించుటకు
కృష్ణుడెప్పుడు వచ్చును,
ఈ కలల కోరికలు ఎప్పుడు తీర్చును,
సర్వదా నిన్నే తలుస్తూ నీప్రేమ పొందాలని
 ఆహ్వానిస్తూ వేచి ఉన్నాను కృష్ణా...               
--((*))--  


*రాధ కృష్ణుని కోసం ఆలాపన

ఎవరో కాదు కృష్ణుడే వస్తాడని
నాలో ఆశలు  తీరుస్తాడని
ఎదురు చూపులతో 

ఉన్నాను

నవ నాటక సూత్రధారుడై వస్తాడని
ఈ అమాయకురాలి చూపులను
ఆదు కుంటాడని ఆశతో ఉన్నాను   

నిను విడజాలనునేను, నీ  మనసునై,
నీ ప్రియసఖినై, నీ ప్రేమను పొందుటకై
కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నను

న్యాయమో అన్యాయమో నాకేమి తెలుసు
ఈ విశాల హృదయాన్ని నీకే అర్పించాలని
నీ ఆశలకు నేను బానిస నవ్వాలని
పవిత్ర భావముతో నిన్నే ఆరాధిస్తూ ఉంటానని
సర్వ ధర్మములను ఆచరిస్తూ ఉంటానని
భక్తి భావముతో నిన్నే ఆరాధిస్తూ ఉంటాను
కృష్ణా, కృష్ణా , కృష్ణా
 
ఈ  రాధను కనికరించుటకు మోహనరూపడవై
నా మనసును ఊరడించుటకు రావా కృష్ణ
కృష్ణా, కృష్ణా , కృష్ణా  
 --((*))--

*రాధ కృష్ణ ప్రేమ తత్త్వం

'శ్రీ కృష్ణ 'నీ చిరునగవుల  మోము చూస్తుంటే
నా మనసులో ఉన్న ఆలోచనలన్నీ మటుమాయం
'శ్రీ కృష్ణ 'నీ చిరి మువ్వల గజ్జలు నాదం వింటుంటే
నా మనసు ఆహ్వానిస్తూ తెలియని స్వరమయం

'శ్రీ కృష్ణ 'నీ భావ ప్రకంపనలు చూస్తూ ఉంటే
నా మనసులో ఉన్న కల్లోలాలు ఆవిరి మయం
'శ్రీ కృష్ణ ' నీ మది నుండి వీణ శబ్దాలు వింటుంటే
నా మనసులో అనురాగం విచ్చే పుష్ప మయం 

'శ్రీ కృష్ణ ' నీ మాటలు కవితాక్షరాలుగా మారుతుంటే
నా మనసులో ప్రభా ప్రశాంతత చేకూర్చే మయం     
'శ్రీ కృష్ణ' నీ పెదవులపై గమకాలూ నాట్య మాడుతుంటే
నా మనసంతా  ఆనంద  పారవశ్య నిలయం   

'శ్రీ కృష్ణ ' నీ వలపు పూల వానజల్లులా కురుస్తుంటే
నా మనసంతా ఉష్ణం తగ్గి నవ వసంత మయం 
'శ్రీ కృష్ణ 'నీకు ప్రేమతో పూజించేపువ్వు పరిమళిస్తూ ఉంటే 
నా మనసులోని ప్రేమంతా సర్వ వ్యాపక మయం

'శ్రీ కృష్ణ' నీవు సత్యం జ్ఞానం ప్రేమతత్వం తో ఉంటే
ఈ రాధ హృదయం నీకే అర్పిస్తున్నాను ఇక నీకు సొంతం     
--((*))--  *రాధాకృష్ణ ప్రణయ సాగరము
వలపుల తలపులు తెలుపవా
మెరుపుల సొగసులు చూపావా
మనుసున మమతలు పంచవా
ఓ రాధికా నీ మనసు నాదికా


గంధము పూసెద, చందనం పూసెద
తులసి మాలను వేసెద,
మేఘశ్యామ రూప
శిఖ పింఛమౌళి ముకుందా


ద్రాక్షాపాకం త్రాగెదవా
కదళీఫలములను గ్రోలెదవా
మదన కదన కుతూహలముకొరకు
మనసును రంజింపచేయుటకు
 

ఓ రాధికా నీ మనసు నాదిక
నారికేళములు కావలెనా
కదళీఫలములుకావలెనా
నవనీతము కావలెనా
ఇక్షు రసములను కావలెనా
శిఖ పింఛమౌళి ముకుందా


మూగ మనసుతో కోరుతున్నావు
మౌన గీతములు పడుతున్నావు
నుదుటి రాతలు గురించి చూస్తున్నావు
ప్రేమను పంచుతున్నావు
 

ఓ రాధికా నీ మనసు నాదిక
మోహనమురళి నీకోసమే ఉన్నా
యదు వంశీకృష్ణ నిన్ను ప్రార్ధిస్తూఉన్నా
అధరామృతాములను అందించాలని ఉన్నా
నంద గోపాల కృష్ణ, గోకులనందా
ఈ రాధిక ఆరాటం తగ్గించుకు రావా
;
వలపుల తలపులు తెలుపవా రాధిక
మెరుపుల సొగసులు చూపావా కృష్ణ
. --((*))--