7, ఆగస్టు 2016, ఆదివారం

Inernet Telugu magazine for themonth of 8/2016/30

 ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - వార పత్రిక 
సర్వేజనా సుఖోనోభవంతు 

 *రాధా కృష్ణల మనోహర ప్రేమ

రాధా నా చుట్టూ
బొంగరంలా తిరిగి తిరిగి
 మనసును కదిలించావు
కవ్వములా కదిలి కదిలి
నా గుండెను చిలికావు

చెట్టు కొమ్మల ఊగి ఊగి
వయసు సొగసులు చూపావు 
మనసు గాలిలో తెలి తెలి
పావడా కదిలించి ఉడికించావు

ఆడించి నట్లు ఆడి ఆడి
పెదాలు  విరిచి చూపావు
పాడించి నట్లు పాడి పాడి
ఆధరాలు అందిచావు
  
క్షమించి నట్లు చేరి చేరి
చేతుల్లో చేతులు చేర్చావు 
మనస్సు ఆనందానికి దారి అది
అని చేతులు నలిపేసావు

సవ్యంగా జరిగి జరిగి
దివ్యంగా వెలిగి వెలిగి
మౌనంగా మెదిలి మెదిలి
ఆశలు పండించుకోవటానికి 
 దారి అన్నావు  

నటన తెలియని ప్రేమ
వ్యసనం జోలికి పోని ప్రేమ    
పరువం అందించే ప్రేమ
యవ్వనంలో పొందే ప్రేమ 
రాధా కృష్ణల మనోహర ప్రేమ 
మధుర భాష్యం తెలిపే ప్రేమ
--((*))--

*పకృతి ఘుమ ఘుమలు

సంపెంగ సువాసనలు
చల చల్లని సమీరాలు
వలపు రేపే  జల్లులు
మనసుకు చేరే ఆహ్లాదాలు

మదిని తట్టి మనసు దోచి మధురిమలు
వలపు గెలుపు మరోమలుపుకు తలపులు
మాటలతో మత్తును పెంచే ముఖ కవలికలు
దరి చేరి, దారిచూపే తన్మయ పరిచే తరువులు 

వికసించి వినోద పరిచే మౌన భూమికలు  
విలపించి విన్నవించే విదూష భావాలు 
విశాలమైన కురులతో వింత పోకడలు
వెచ్చని మదన తాపముతో వచ్చే ఆవిరులు

రస రమ్య రాస క్రీడలకు రాజ మార్గాలు
రంగుల కలలతో రంజిల్లే రుస రుసలు
రతీ మన్మధ కామకేళి పలు ఆలోచనలు
రక్తి - అనురక్తి పెంచుటకు వచ్చే తలపులు  

పున్నమి వెన్నెలలో పుడమి చుక్కలు 
సతి పతి సరస సాహిత్య సంగీతస్వరాలు
మగువ ప్రేమకు వెంట వచ్చే వగల సెగలు 
హాయిని గొలిపే ఆరాద్యుని ఆలింగనాలు  
--((*))--


*కలవరింతలు


ఎండకు నేయి కరుగుతుంది కానీ
మూగబోయిన మనసు కరుగదు
ఎండకు మంచు కరుగు తుంది కానీ   
ఎంత చూసిన కాలము కదలదు

అందం తారుమారవుతుంది కానీ
వయసు పెరిగిన వలపు తగ్గదు 
నిప్పులా మనసు మారుతుంది కానీ
చల్లని చేయి తగిలిన చల్ల పడక తప్పదు

ఆశలు నీలో ఎన్ని పెరిగినా కానీ  
కోరికలు తీర్చుకొనే సమయం సరిపోదు
నింగిలో కాంతి శాశ్వితము కాదు కానీ
మానవజాతికి మూలాధారం అనక తప్పదు   

ఆనందం అదృష్టం ఎక్కడో ఉండదు  
మనలోనే నిక్షిప్తమై ఉంటుంది
కానీ కనబడదు 
  తీయటంలో శాస్త్రజ్ఞలు ప్రయోగాలు చేస్తున్నారు కానీ
దేవుని ఆధీనంలోఉన్నదానిని వెతుకుతున్నా దొరకదు 

 అందుకే ఆనందానికి మూలం మన మనసు 
అదృష్టానికి మూలం మన ప్రవర్తన 
ఆశయాలకు మూలం మన సాంప్రదాయం 
జీవనానినికి అధారం మాతృ ప్రేమ, మాతృ భూమి 
--((*))-- 

*ఆశల వలలో చిక్కకన్నా

పున్నమి వెన్నెల నిన్ను ఆవహించిందంటే 
మన్ను తిన్న పాములా మారిపోవాలిసిందే నన్నా 
కన్ను గీటి జాబిల్లిని నీ మనసులో చేరితే
ప్రకాశంగా చేరి హృదయ తాపం పెరుగు తుందన్నా 

చంద్రుడంతటి వాణికి కన్ను చెదిరితే
కాంతా మణుల చుట్టు తిరిగి ముసలి కన్నీరే నన్నా  
కన్నె పిల్లల మనసు కైపుగా మారితే 
కన్నులు చూసి కామించటం ఎక్కడ ధర్మమన్నా

యవ్వన మదంతో ఉన్నా వంటే
ఎవ్వరు ఏమి అన్నా మనసు మార్చ లేమన్నా     
రివ్వున ఉరికే మనసులోని కోరిక
నవ్వుల పాలైన కోరిక కసి మాత్రం తగదన్నా  
 
కోర్కల వలయంలో చిక్కావంటే
మర్కట బుద్దిగా మనసు మార్చుకోక తప్పదన్నా
కర్కశ హృదయంగా మారావంటే
తర్కం ఉపయోగించాలన్నా మనసు రాదన్న

చమత్కార మాటలు పలికావంటే    
తామసం పెరిగి తిప్పు కోలేని పరిస్థితి వస్తుందన్నా
తమాషా పలుకులు పలికా వంటే
అమావాస్యను కుటుంబంలో పిలుచుటెందుకన్నా

సిరి సర్వంగా నిన్ను ఆవహించిం దంటే
కరిమింగిన వెలగపండులా మాయమవుతుందన్నా
నారీమణుల చుట్టూ తిరిగా వంటే 
చంద్రుడిలా అమావాస్య, పున్నమిలా  బ్రతుకులే అన్నా

--((*))-- 


ఇది మూఢ  భక్తికాదు 
కదళీ ఫలములను అలంకరించుటే  భక్తి
భక్తితో శక్తిని గ్రహించన దాత
భక్తి ప్రేమతో తృప్తిగా అలంకరించుట

వస్త్రములుధరించుట మనకెంతావసరమో
భగవంతునికి అలంకరణ అంత అవసరము
దుష్ట గ్రహాలను పారద్రోలే శక్తి మంతుడిని
ఫలములతో పూజించుట తప్పెక్కడుంది

చిరంజీవిని ప్రశ్నించే హక్కు ఎవరికుంది
మనోధైర్యాన్ని ఇచ్చే రామ దూత
ఆత్మా దర్యాన్ని పెంచే ప్రేమ దాత
ఇష్టాన్ని అనుగ్రహించే స్పూర్తి దాత
        --((*))--


ప్రత్యేక హోదా ?(2-08-2016) 
ఆంద్రప్రదేశ్ బ్యాండ్ సందర్భముగా వ్రాసిన కవిత

మాయ మర్మమే తెలియని ప్రజలపై  రాజకీయం
మనుష్యులతో ఆడుకోవటమే రాజకీయ చదరంగం
కాయకష్టం తెలియదు రాజకీయానికి
చెప్పేదొకటి, చేసేది మరొకటి నాయకుల మయం   

ఆశలు చూపి నక్క కొంగ సామెతగా మారింది నాయకత్వం
పళ్లెంలో దాన్నీ కొంగను తినమంటే ఎం తింటుంది
అట్లే కూజాలోదాన్ని తినమంటే  నక్క ఏమి తింటుంది
పాము చావదు కర్ర ఇరగదు సామెతలా ఉన్నది కేంద్రం

మనము బ్రతకటానికి కాదు విడదీసింది
రాజకీయ లబ్ది కోసమే అని గ్రహించలేక పోయాం    
వరములు కాదు కావలసింది శాశ్విత పరిష్కారం
చేసిన వాగ్దానాలు అమలు జరుగపోతే మనుగడ కష్టం  

ఆటు పోటులను తట్టుకొని నిలబడిన ఆంద్రులం
దిగులతో లేము దృఢసంకల్పంతో వున్నమనుష్యులం
అభివృద్ధిని సాధించే దాకా మేమెవ్వరం విశ్రమించాం 
నిధులివ్వండి అభివృద్ధిలో మాకుమేమీ సాటిఅని నిరూపిస్తాం

కేంద్ర నాయకులారా మాటతప్పి వేదనలో దించకండి
కుటిలత్వ బుద్ది వద్దు సేవాదృఖ్పదంతో ఆలోచించండి
జీవుడికి దేవుడిలా రాష్ట్రానికి కేంద్ర సహాయం అవసరమండి
లక్షలెన్నో దాచినా మనము తినేది లవణమన్న మేనండి
చేయవలసిన సహాయము చేయండి ప్రత్యేక హోదా నిల పెట్టండి

--((*))-- 
*ఆత్మీయం

ఆసించటంలో ఉంటుంది ఆత్మీయం 
వయసులో కసి కసిగా ఉండేదే
ఆత్మీయం
మసిబూసి మారేడుకాయ చేసిన మారదు
ఆత్మీయం 
రసిక హృదయాలను ఏకం చేయుటలోనే ఉంది
ఆత్మీయం

భూమికి నీరు ఆత్మీయం
ఒకరి కొకరు చెలిమిలాగా కలసిన బంధం
మనిషికి శక్తి ఆత్మీయం
అంతర్గతంలో చెలిమిలా కలసిన బంధం 

నింగికి సూర్య చంద్రులు ఆత్మీయం
ఒకరి కొకరు వంతులుగా కలవని బంధం
తరువుకు గాలి ఆత్మీయం
ప్రకృతిలో ఒకరికొకరు కలసిన బంధం

మాటకు  మౌనం ఆత్మీయం
చెప్పేవి, చెప్పలేనివి పదాలలోని బంధం
సుఖం స్వార్ధం  ఆత్మీయం 
మనుషుల్లో  కొలిమి లాగా ఉండే బంధం

మనసు కెరటం ఆత్మీయం  
గట్టుకు చేరాలని తపనతో ఉండే బంధం
ప్రకృతి ఆగలేని గాలి ఆత్మీయం
జీవితమ్ ఆశలతో మిళితమైన బంధం

స్త్రీ పురుషుల కళ్ళు ఏకమే ఆత్మీయం
ఆశలు తీర్చుకొనే మెలి కలయిక బంధం .
జీవితంతో కాలం ఆత్మీయం
సుఖదుఃఖ స్పర్శలతో మిళితమైన బంధం
--((*))-- 

 
*పకృతి ఘుమ ఘుమలు

సంపెంగ సువాసనలు
చల చల్లని సమీరాలు
వలపు రేపే  జల్లులు
మనసుకు చేరే ఆహ్లాదాలు

మదిని తట్టి మనసు దోచి మధురిమలు
వలపు గెలుపు మరోమలుపుకు తలపులు
మాటలతో మత్తును పెంచే ముఖ కవలికలు
దరి చేరి, దారిచూపే తన్మయ పరిచే తరువులు 

వికసించి వినోద పరిచే మౌన భూమికలు  
విలపించి విన్నవించే విదూష భావాలు 
విశాలమైన కురులతో వింత పోకడలు
వెచ్చని మదన తాపముతో వచ్చే ఆవిరులు

రస రమ్య రాసక్రీడలకు రాజ మార్గాలు
రంగుల కలలతో రంజిల్లే రుస రుసలు
రతీ మన్మధ కామకేళి పలు ఆలోచనలు
రక్తి - అనురక్తి పెంచుటకు వచ్చే తలపులు  

పున్నమి వెన్నెలలో పుడమి చుక్కలు 
సతి పతి సరస సాహిత్య సంగీతస్వరాలు
మగువప్రేమకు వెంటవచ్చే వగల సెగలు 
హాయిని గొలిపే ఆరాద్యుని ఆలింగనాలు  
--((*))-- 


*జీవన సత్యం

పృథ్విపై పడ్డ బిడ్డ ఏడ్వక తప్పదు
ఏడ్చేవారిని నమ్మి మోసపోక తప్పదు
చీకటి వెలుగులలో జీవితం తప్పదు  

నిశ్శబ్దపు నిటూర్పులను భరించక తప్పుదు
జ్ఞాపకాల చప్పుళ్ల కు గాయపడక  తప్పదు 
చీకటి జాతర భావాలకు లొంగిపోక తప్పదు

అలసిన అంతరంగానికి ఓదార్పు తప్పదు
కాల మార్పులకు తల వంచక తప్పదు
చరిత్ర సంతోషాలు నెమర వేయక తప్పదు 

అవసరాన్ని బట్టి రక్తాన్నిధారపోయాక తప్పదు
స్నేహభావాన్ని పటిష్టం చేసుకోక తప్పదు
మౌన హృదయానికి ఘర్షణల పోటు తప్పదు 

హృదయ తాప వేదన తగ్గించక తప్పదు 
కన్నీరే కల్ముషం కాకుండా జాగర్త తప్పదు
నిగ్రహ శక్తితో కుటుంబములో ఓర్పు తప్పదు

పనికిరాని చరిత్రలు చదివితే కలలురాక తప్పదు
భయానక దృశ్యాల వళ్ళ గుండెకు గాయం తప్పదు
అక్రమ, చీకటి సరస, వ్యాపారాల వళ్ళ చేటు తప్పదు  

పున్నమి వెన్నెల సంతోషం అనుభవించక తప్పదు
భావమాధుర్యంలో మమతను గెలుచు కోక తప్పదు
స్త్రీ-పురుష అంతరంగ శోధనకు సహాయాపడక తప్పదు
సందేహం లేని సందేశం ఇవ్వాలని ఇంకా ఇంకా ఉన్నది

సద్గుణ, సత్య, సౌహార్ద్ర, దయ, క్షమ, మృదుత్వ, ధీరత్వ,
వీరత్వ, గాంభిర్య, శాస్త్రాస్త్రజ్ఞాన, పరాక్రమ, నిర్భయత్వ,
వినయ,  తితిక్ష, ఉపరతి, సంయమము, నిస్పృహత్వ,  

శాంతి, నీతిజ్ఞత, తేజోప్రితి, త్యాగ,పవిత్రత, ప్రజారంజకత్వా
బ్రాహ్మణ భక్తి, మాతృభక్తి, గురుభక్తి, భ్రాత్రుప్రేమ, మైత్రి,
శరణాగత వత్సలత్వం, సరళత్వం, వ్యవహార కుశలత్వం,

ప్రతిజ్ఞాపాలనం, సాధురక్షణం, దుష్టదళసత్వం, నిర్వీర్యత్వం,
లోకప్రియత్వం, పరదోషాన్వేషణ రాహిత్యం, బహుజ్ఞత్వం,
ధర్మజ్ఞత్వం, ధర్మపరాయణత్వం, శ్రీరామునికున్న లక్షణాలు 
ఆచరించి చూపారు, అవే లక్షణాలను మనం కూడా ఆచరణలో పెట్టగలరని, ఆసిస్తూ సందేహంలేని సందేశం ఇవ్వాలని ఇంకా ఇంకా ఉన్నది
సర్వేజనా సుఖినోభవంతు, ఓం శాంతి: శాంతి: శాంతి:     
      --((*))--




*వడియాలు

కత్తి చేస్తుంది హతం
కలం చేస్తుంది హితం
స్నేహం చేస్తుంది సన్నిహితం
మాత్రుశ్రీ నేర్పుతుంది ప్రేమ హితం

సంగీతం మనోల్లాసం
సాహిత్యం మనో విల్లాసం
శృంగారం మనో సల్లాపం 
భయానకం మనో విరసం

మొక్క పెరిగేటప్పుడు తోడు
మెక్క కు ఫలాలు ఉండు
మేక్కకు ప్పుష్పాలు మెండు
మొక్క నరికేటప్పుడు అడ్డు ఉండు

కాలా హరణం వద్దు 
కాల సద్వినియోగం హద్దు
కాల ప్రేమకు ముద్దు
కాలాతీతం చేయ వద్దు
వయసుకు విరహం 
వదలదు మొహం
తీరదు దాహం
చెందకు పరితాపం


తినలేనిది గొడ్డు కారం 
ఉండాల్సింది మమకారం 
చేయాల్సింది ఉపకారం 
చేయకూడనది అపకారం

వ్యాపారంలో ఉండు ఉత్పత్తి 
సంసారంలో ఉండు పునరుత్పత్తి 
తరువుల్లో ఉండు పుష్పోత్పత్తి 
ప్రకృతిలో ఉండు సమయోత్పత్తి 

స్నానం లో దేహశుద్ది
జ్ఞానంతో ఆత్మ శుద్ది
కామంతో ప్రేమ శుద్ది
ద్వేషంతో దేహ శుద్ది
మరచి పోతున్న జ్ఞాపకాలు
వదలి పోతున్న  బంధాలు
తరిగి పోతున్న తరువులు
తరలి పోతున్న గురువులు
__((*))__




ప్రేమ పక్షులు

సంధ్య వేళ గూడు చేరే పక్షులు
కలకలం అది ఒక అద్భుతం
మన నేత్రాలకు అద్భుత దృశ్యం
కళ్లతో చూడగా మనసుకు కలిగే
మరచిపోలేని ఆనంద పారవశ్యం 

ఏన్నొ ఆకృతులు గా మారుతూ
స్నేహ భావంతో పలకరిస్తూ
వింతలూ విశేషాలు ముచ్చటిస్తూ
నింగిన సాగె పక్షుల సమూహము

కనీ విని ఎరుగని అది ఒక శోభయాత్ర
పట్టుదలతో వలస పోయే జీవ యాత్ర
మేఘాల మాటున సాగే విహార యాత్ర
సప్తవర్ణ శోభితంగాఉన్న నింగిలో యాత్ర   

పకృతి అంతా ప్రేమ మయం
హృదయానికి ఆనాడే రమణీయం 
విహంగముల యొక్క విహారం
సమీర సహకారంతో సాగే ప్రయాణం
--((*))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి