ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్
ప్రాంజలి ప్రభ - వార పత్రిక
సర్వేజనా సుఖోనోభవంతు
*శ్రీ మహాగణాధిపతయే నమ:
బ్రమణ తరుణంలో ఉన్నాము గణాధిపాయ
అనుకరణ తోరణంలా ఉన్నాము ఉమాపుత్రాయ
కరుణ అరుణా రుణ గణ కిరణాలతో ఉన్నామయ్యా
గణాల గుణ గణాల్నికరుణించవయ్యా వినాయకాయ
తృణ ప్రాణంతో బ్రతికి బతికించు తున్నామయ్య
గణగణ నాదంతో గణాంకాన్ని సరిచేసే ఈసపుత్రాయ
వాణి నాదాన్ని శ్రవణానందంగా అందించే ఏకదంతాయ
మణిమయ దివ్య మణులను అనుగ్రహించే ఇభవక్త్రాయ
సర్వ సిద్ధులను అనుగ్రహించే వరసిద్ధి ప్రదాయకాయ
బుద్దిని ప్రకాశింపచేయు పరిపూర్ణ మూషికవాహనాయ
యోగుల హృదయముల నందు ఉండే గజాననాయ
సర్వలోకాలను సమదృష్టితో చూసికాపాడే విశ్వనేత్రాయ
శరణాగతులను ఆదుకున్న ఆశ్రీత వత్సలాయ
మాకు విఘ్నాలను తొలగించే విఘ్నహన్తరాయ
సర్వవిద్యా సంపదలను కల్పించే సుప్రదీపాయ
శేషు గణాలను ఆభాణాలుగా ధరించే గణాదక్షాయ
సమస్తలోక మానవులు అది పూజగా కొలిచే శ్రీవిఘేశ్వరాయ
వస్త్రం, గంధం, పుష్పం, దూపం, అందుకో పార్వతీ నందనాయ
ఏకవింశతి (21) పత్రాలతో పూజిస్తున్నాము లంబోదరాయ
మా కణాలను కదిలించి, వనాలను విస్తరించి, ఋణం
తీర్చుకొనే అవకాశము కల్పించవయ్యా శ్రీ గణేశ్వరాయ
--((*))--
*స్పర్శ
వెచ్చని స్పర్శ
నా గుండెను తాకింది
ఒంటరి స్పర్శ
కొంతకాలం వేచి ఉండ మంది
ఆమని స్పర్శ
నా మనసును తాకింది
అద్దపు స్పర్శ
కొంత కాలం నిలబడుతానంటుంది
సుఖాల స్పర్శ
కౌగిళ్లు కోరుకో మంటుంది
నీడల స్పర్శ
ఎంతోకాలం కనిపించలేనంటుంది
సిగ్గుల స్పర్శ
నా మొము వెంటాడుతుంది
కలల స్పర్శ
నిద్రించ నంతసేపు కనబడుతుంది
జ్ఞాపకాల స్పర్శ
నా ఆణు వణువూ వణికిస్తుంది
ఘటాల స్పర్శ
ఎంతకాలం సహకారం అందిస్తుంది
అక్షర స్పర్శ
నాకు మోక్ష మార్గ మవుతుంది
గణాంక స్పర్శ
బ్రతుకుకు మార్గమవుతుంది
ఉదయ స్పర్శ
నా ఆరోగ్యాన్ని భద్ర పరుస్తుంది
వ్యాయామ స్పర్శ
నిగ్రహా శక్తిని పెంచు తుంది
వెన్నెల స్పర్శ
నా మనసు ఉల్లాస పరుస్తుంది
జల్లుల స్పర్శ
హృదయస్పందనకు దారితీస్తుంది
ఇల్లాలు స్పర్శ
జీవితము సుఖమయ చేస్తుంది
దేవుని స్పర్శ
నీలోఉన్న నన్ను మరవద్దంటుది
--((*))--
* కల పుట్టుక
రెండు ఆత్మలు కలిస్తే
వెలుగు కల పుట్టుక
రెండు శిలల రాపిడికి
అగ్ని కల పుట్టుక
భక్తికి దైవం లొంగి
గంగ కల పుట్టుక
సాగరంలో నది కలసి
ముత్యాల కల పుట్టుక
నెల నింగి మధ్య
ప్రకృతి కల పుట్టుక
సంస్కార సాంప్రదాయం కలిస్తే
నిత్య శోభల కల పుట్టుక
మంచి చెడు కలిసి
మనసు కల పుట్టుక
సుఖ దు:ఖాలు కలిసి
జనన కల పుట్టుక
నాలుగు చేతులు కలిసి
జీవిత కల పుట్టుక
వెలుగు నీడలు కలిసి
కరుణ కల పుట్టుక
బాహ్యాన్తరాలు కలిసి
బ్రహ్మ కల పుట్టుక
మనసు మనసు కలిసి
మానవత్వ కల పుట్టుక
--((*))--
పంజలి ప్రభ -జ్ఞాన ప్రభ
సముద్రం
అంతర్వేదిని చేరా
నాలో అంతర్మధనం కలిగింది
అలుపెరుగక అలా అలా వస్తున్నా సముద్రపు
అలలు నాపాదాలు తాకి వెను తిరిగాయి
ఒక్కసారి పాదాల క్రింద భూమి
కదిలినట్లుగా గగుర్పాటు కలిగించింది సంద్రం
నాకళ్ళు ఒక్క సరిగా చెమ్మగిల్లి
మొద్దుబారి కనుపాపలు మధ్య
ఎర్రని నెత్తుటి చెమ్మ వెచ్చగ తగిలింది
కెరటాలు నాలుక బయట పెట్టి వెక్కిరిస్తున్నట్లుగా
నా మనసును వేదనకు గురిచేసింది
అనంత ఖనిజ ఓషదములు ఉంచుకొని
ఒడ్డుకు కళేబరాలను నెట్టివేస్తుంది
నదిని తనలో చేర్చుకొని
నిరంతరం నవ్వుతూ ఉరకలువేస్తూ
వస్తున్నా సముద్రానికి ఒక్క నమస్కారము చేసి
ఓ సముద్రుడా నీకు పునర్ జన్మలేదు
నీ కెరటాల నీటిలో స్నానమాడినాను
నాకు పునర్ జన్మలేకుండా
మనస్సును ప్రశాంతముగా
సహాయక గుణంగా ఉండమని
దీవించు " అర్ణవ "తండ్రి
--((*))--
హాస్య గీతమ్ (కాసేపు నవ్వు కోండి)
అబ్బబ్బ ఎంత బాగున్నావే
నా మనసు లాగేస్తున్నావే
ఏ మాయ చేసావే నా మనసు గుంజేస్తుందే
ఏరువాక పొంగులా, ఎగసి విరసి పడుతున్నావు
పున్నమి వెన్నెలలా నా హృదయాన్ని తాకుతున్నావు
అంత లేదు, ఆ మాయేనిన్ను కమ్మింది
సహజ సౌందర్యమే నాది, వయసులో విరిసిన
సొగసు మత్రామే, పువ్వులా గుబాళిస్తున్నాను అంతే
ఏ మంత్రం వేసావే, నా వళ్ళంతా తడిసి పోతున్నదే
నీవు మంచులా కరిగి పోతున్నావు, చల్ల లో వెన్న ముద్దలా
తేలి పోతున్నావు, ఆ తెల్లదన్నాన్ని చూసి మరువలేకున్నానే
ఏ మంత్రం వేయలేదు, అంత తొందరెందుకు
వేడికి కరిగితే నా తప్పు కాదు, వయసు పొంగు
ముద్దలా తేలితే నా తప్పు కాదు అంతే
ఏ తంత్రం చేసున్నావో నాకళ్ళు నిలవ నంటున్నాయి
నిన్ను వదలి పోలేకున్నాను, ని రూపు నన్ను ఉక్కిరి
బిక్కిరి చేస్తున్నది
ఏ తంత్రం చేయలేదు, నిన్ను చూసి నా మనసు
మార్చుకున్నా, నీ రూపం నా హృదయంలో
పదిలంగా ఉంచాలను కున్నా అంతే
ఏది మాయయో , ఏది మంత్రేమో, ఏది తంత్రమో
నాకు తెలియదు, నిన్ను వదల లేని ప్రేమ నన్ను
వెంటాడుతున్నది, నీవే నా సొంతం కావాలని ఉన్నది
మాయ మాంత్రం, తంత్రం ఏమి లేదు ఈ హృదయ
స్పందన, నిను కోరు కుంటున్నది నీతో 7 అడుగులు
నడవ మంటున్నది, మరి నీ కిష్టమేనా
ఇష్టమీనా అనకు, నీ మీద మరచి పోలేని ప్రేమ
అలాగే నాకు కుడా నీ మీద మరువలేని ప్రేమ
అలాగే కలసి మెలసి వలపులు పంచుకుంటూ సాగి పోదామా
ఓ అట్లాగే కలసి మెలసి సాగి పోదాము అట్లాగే అట్లాగే
ఏ మాయ లేదు మంత్రం లేదు తంత్రం లేదు ఈ ప్రేమకు
అవును ఏ మాయ లేదు మంత్రం లేదు తంత్రం లేదు మన ప్రేమకు
--((*))--
*మానవ జీవన రేఖలు (1)
విధాత జివిత సత్యాలను లిఖించిన నుదుటిపై రేఖలు
లయకారుడు సత్యప్రయాణాలను లిఖించిన పాద రేఖలు
స్థితి కారుడు కష్టానికి ఫలాన్నిచ్చి అర్ధం తెలిపే హస్త రేఖలు
శ్రీ మాతా, ప్రకృతి, ఫంచభూతాలు కదిలించే జీవన రేఖలు
రివ్వున వచ్చి మనసును కదిలించే గాలి రేఖలు
కెరటంలా ఎగసి పడుతూ చేరే అహంకారపు రేఖలు
కుటుంబంలోకాలాన్నిబట్టి మారే సుఖ:దుఃఖ రేఖలు
స్త్రీ ధైర్యముతో పురుషునకు ధైర్యము చెప్పే రేఖలు
చెవులకు వినిపించక పోయిన మనసుకు చేరే దివ్య కాంతి రేఖలు
పెద్దలు వినిపించే ప్రవచనాలవల్ల కుటుంబానికి అందె శాంతి రేఖలు
మంత్రంవల్ల విషం దిగినట్లు స్పర్శ సుఖం వళ్ళ ఆనందాశ్చర్య రేఖలు
వార్ధక్యం వళ్ళ ఇంద్రియాలు నిరుపయోగం చేదాకా భక్తిని రేపే రేఖలు
సామాన్యుని హృదయాలలో తృప్తి మయం కలిగించే రేఖలు
సంపన్న హృదయా ల్లో ఆశా పాశాలను కల్పించే రేఖలు
ఆక్రోశం హృదయాల్లో అసంతృప్తి పోరాటం కల్పించే రేఖలు
కష్టజీవుల హృదయాలలో అనుభవ సారాన్ని తెలిపే రేఖలు
ఒక వీరుడు మరణిస్తే వేలకొద్ది వీరులు ప్రభవించే రేఖలు
ఒక కవి మరణిస్తే వేలకొద్దీ రసజ్ఞులు విలపించే రేఖలు
ఒక నాయకుడు మరణిస్తే కొందరికి ఆశల పెంచే రేఖలు
ఒక బ్రాహ్మణుడు మరనిస్తే వేలకొద్దీ దేవతలు ఆవేదన లేఖలు
--((*))--
*మానవ జీవన రేఖలు (2)
యువకులు ధీరవచనం చెప్పే దివ్య రేఖలు
నదీమ తల్లులు ఉత్సాహముతో పొందే రేఖలు
సాగర కెరటములు వడ్డును తాకాలని రేఖలు
కాల పురుషులు సాగించే కాంతి నౌక రేఖలు
పుడమి పురిడించిన కంకుల జీవబింబ రేఖలు
ఆకాశము పురిడించిన మేఘ జీవబింబ రేఖలు
ప్రకృతి పురిడించిన తరువుల జీవబింబ రేఖలు
కాలయోని పురిడించిన అరుణారుణ జీవబింబ రేఖలు
భయానక కార్పణ్యముతో కలిగిన నలిగిన రేఖలు
క్రియాశీలతలు అరణ్యవాసం నలిగిన రేఖలు
కళాత్మకలను ఎదగలేక కళలానలిగిన రేఖలు
కవిత్వము పటుత్వము ఆదరణ తగ్గిన రేఖలు
అక్షయ జీవనానందానికి అభినందన రేఖలు
అక్షయాభ్యుదయ పరంపరకు ఆహ్వానాల రేఖలు
అక్షర పరంగా తెలుగు విద్య నీతి బోధనల రేఖలు
ఆకాంక్షముగా విలసిల్లే కవుల భావాల రేఖలు
కవి విరజిమ్మే అక్షర కాంతి రేఖలు
సుకవి జీవించే ప్రజల నాల్కులపే ఉండే రేఖలు
జ్ఞాన విజ్ఞాన సంకేత ఆదరణ పొందే రేఖలు
కవి మరణం జీవిత సత్యాలు తెలిపే రేఖలు
జనన మరణాలు కాంతి వెలుగుల రేఖలు
పుణ్య పాపాలు ప్రేకృతి లో తెలిపే లేఖలు
ఊర్ధ్వ అదో దిశలు అన్ని కాలాల్లోచూపే రేఖలు
అక్షర సాహిత్య సంపద ఇంటింట వెలిగే రేఖలు
నీరు చల్లని ఉష్ణం చేరి ఉష్ణత్వం పొందే రేఖలు
స్వభావం శాంతం అహంచేరి అహంకారత్వ రేఖలు
జలంలో వెలుగు చేరి స్వెతతత్వం చెందే రేఖలు
పురుషుల పొందు స్త్రీల చల్లదనం కలసి చేరే రేఖలు
--((*))--
హాస్య గీతం ( కాసేపు నవ్వుకోండి)
అబ్బో:: ఎర్ర కొక కట్టి, నడుం చుట్టూ, చీర చుట్టి
కన్ను కొట్టేటట్టు ఉన్నవే పిట్టా
అట్లాగా
అవునే
కట్టు బొట్టు పెసరట్టులా ఉన్నవే పిట్టా
అట్లాగేట్లా అనకే, ఆట పట్టించకే
అత్తెసరలా, ఉన్నానే పిట్టా
ఉంటె నాకేంటి
నీటుగా సూటు బూటు వేసావు
కంత్రీ బుల్లో డా
మాటలతో చోటు చూసి, కాటు వేయకు
ఖలేజా బుల్లో డా
ఓహో తట్టలో లొట్ట పిట్టలా
తట్టి తట్టి చెప్పకే పిట్టా
ఇట్లా అట్లా అనకే,
నీ వెట్లాగంటే అట్లాగే పిట్టా
నన్ను అట్లా,:: చాటు మాటు చూడకు రా
కందిరీగ బుల్లో డా
వెయిట్ చేస్తే, స్వీట్ రూట్
చూపెట్తా బుల్లో డా
బెస్ట్ చీపెష్టు హోటల్కు
పోదామా పిట్టా
జేష్టు వేస్టు చేయకు టైం
బుల్లో డా
ఎందు కట్లా గంటావ్ " పిట్టా"
ముందు చదువు పూర్తి
చేయరా బుల్లోడా
చక్కని ఉద్యోగం లో చేరి
అప్పుడు కనిపించు బుల్లోడా
అంతే నా ,
అంతే
అయితే వెళ్లొస్తా
మళ్ళెప్పు డొస్తావ్
చక్కని పిట్టకోసం :: ఉద్యోగం వచ్చాక వస్తా
అట్లాగే బుల్లోడా
అట్లాగే వెళ్ళొస్తా పిట్టా
అట్లాగే బుల్లోడా
వెళ్ళొస్తా పిట్టా
అట్లాగే
వెళ్ళొస్తా
--((*))--
* మానవ సేవే మాధవసేవ
మనసు మనసులో లేదండి
కరుణ చూపాలన్నా అవకాసం లేదండి
మనం పెట్టుక్కున్న ఆశలు
అడియాశలు ఆఇనాయి కదండీ
అలా అనుకోకే నేను చెప్పే మాట విను ముందు
*రాధాకృష్ణ ప్రణయ సాగరము
వలపుల తలపులు తెలుపవా
మెరుపుల సొగసులు చూపావా
మనుసున మమతలు పంచవా
ఓ రాధికా నీ మనసు నాదికా
గంధము పూసెద, చందనం పూసెద
తులసి మాలను వేసెద,
మేఘశ్యామ రూప
శిఖ పింఛమౌళి ముకుందా
ద్రాక్షాపాకం త్రాగెదవా
కదళీఫలములను గ్రోలెదవా
మదన కదన కుతూహలముకొరకు
మనసును రంజింపచేయుటకు
ఓ రాధికా నీ మనసు నాదిక
నారికేళములు కావలెనా
కదళీఫలములుకావలెనా
నవనీతము కావలెనా
ఇక్షు రసములను కావలెనా
శిఖ పింఛమౌళి ముకుందా
మూగ మనసుతో కోరుతున్నావు
మౌన గీతములు పడుతున్నావు
నుదుటి రాతలు గురించి చూస్తున్నావు
ప్రేమను పంచుతున్నావు
ఓ రాధికా నీ మనసు నాదిక
మోహనమురళి నీకోసమే ఉన్నా
యదు వంశీకృష్ణ నిన్ను ప్రార్ధిస్తూఉన్నా
అధరామృతాములను అందించాలని ఉన్నా
నంద గోపాల కృష్ణ, గోకులనందా
ఈ రాధిక ఆరాటం తగ్గించుకు రావా
;
వలపుల తలపులు తెలుపవా రాధిక
మెరుపుల సొగసులు చూపావా కృష్ణ
--((*))--
*హాస్య గీతము
నీలి మేలి రంగు గల తుమ్మెదా
అందు కోవా మకరందము
పసిడి వర్ణము గల పుష్పమా
అందు కుంటా అమృతము
నీలిరంగు మేనిలో
నిన్ను చూస్తూ ఉంటే
నాలో దాగి ఉన్న సిగ్గులు
పురి విప్పిన పువ్వులో
దాగినవి దోచుకోవా తుమ్మెదా
పచ్చ పచ్చ ఆకుల మధ్య
పసిడి మేను సింగారాలతో
వయ్యా రంగా ఊపులతో
ఎగిరెగిరి పడుతున్నావే పుష్పమా
తరువు చెంత ఉండ లేకున్నా
పరువు పోయి వాడక ముందే
వెచ్చని పరిమళాన్ని
అందించాలని ఉన్నది తుమ్మెదా
పరిమాళాలు భద్ర పరుచుకో
మధుర స్మృతులు దగ్గ రుంచుకో
మది తలపులు దోచుటకు
తొందర్లో వస్తానే పుష్పమా
వేచి ఉండక తప్పదా తుమ్మెదా
వేచి ఉండాలి పుష్పమా
నీలి మేలి రంగుగల తుమ్మెదా
అందుకోవా మకరందము
పసిడి వర్ణము గల పుష్పమా
అందుకుంటా అమృతము
అందుకోవా మకరందము
అందుకుంటా అమృతము
--((*))--
*మధురవాణి
పట్టుదల ఉన్నది -
విజయం మనదేనంటున్నది
మౌనం వద్దంటున్నది -
సంతోషం పంచుకోమంటున్నది
భావం తెలుప మంటున్నది -
భాషకు విలువ పెంచమంటున్నది
స్త్రీలకు గౌరవం పెరుగుతున్నది -
ధైర్యముగా బ్రతకాలంటున్నది
మనసుతో నవ్వమంటున్నది -
నవ్వులు పంచి బ్రతకమంటున్నది
కన్నీటిని అదుపు చేయద్దన్నది -
వెలుగుకు కన్నీటి సాక్షమన్నది
ప్రమిదకు వెలుగివ్వాలని తపన ఉన్నది-
స్నేహితులతో కలసి వెలుగిస్తున్నది
భంగ పడవద్దన్నది -
ఓర్పుకు అది ఒక పరీక్షయని తలవమన్నది
కాంతి ధార పంచమన్నది -
నిగ్రహశక్తితో నలుగురిని బ్రతికించమన్నది
నేల చినుకును కోరుకుంటుంది -
నింగి సహకారంతో పులకరించిపోతుంది
మధురవాణి మనవెంటే ఉన్నది -
మమతలు పంచుతూ విజ్ఞావంతులుచేయమన్నది
తనువును స్పర్శ అవసరమన్నది -
జిహ్వచాపల్యంనకు స్పర్స్ సుఖమన్నది
రచ్చబండ రాజకీయ మొద్దన్నది
ఉడతలా సహాయ బడమన్నది
వయసుని బట్టి ప్రవర్తించమన్నది
వానరుడిలా సహాయపడుతూ బ్రతకమన్నది
--((*))--
బ్రమణ తరుణంలో ఉన్నాము గణాధిపాయ
అనుకరణ తోరణంలా ఉన్నాము ఉమాపుత్రాయ
కరుణ అరుణా రుణ గణ కిరణాలతో ఉన్నామయ్యా
గణాల గుణ గణాల్నికరుణించవయ్యా వినాయకాయ
తృణ ప్రాణంతో బ్రతికి బతికించు తున్నామయ్య
గణగణ నాదంతో గణాంకాన్ని సరిచేసే ఈసపుత్రాయ
వాణి నాదాన్ని శ్రవణానందంగా అందించే ఏకదంతాయ
మణిమయ దివ్య మణులను అనుగ్రహించే ఇభవక్త్రాయ
సర్వ సిద్ధులను అనుగ్రహించే వరసిద్ధి ప్రదాయకాయ
బుద్దిని ప్రకాశింపచేయు పరిపూర్ణ మూషికవాహనాయ
యోగుల హృదయముల నందు ఉండే గజాననాయ
సర్వలోకాలను సమదృష్టితో చూసికాపాడే విశ్వనేత్రాయ
శరణాగతులను ఆదుకున్న ఆశ్రీత వత్సలాయ
మాకు విఘ్నాలను తొలగించే విఘ్నహన్తరాయ
సర్వవిద్యా సంపదలను కల్పించే సుప్రదీపాయ
శేషు గణాలను ఆభాణాలుగా ధరించే గణాదక్షాయ
సమస్తలోక మానవులు అది పూజగా కొలిచే శ్రీవిఘేశ్వరాయ
వస్త్రం, గంధం, పుష్పం, దూపం, అందుకో పార్వతీ నందనాయ
ఏకవింశతి (21) పత్రాలతో పూజిస్తున్నాము లంబోదరాయ
మా కణాలను కదిలించి, వనాలను విస్తరించి, ఋణం
తీర్చుకొనే అవకాశము కల్పించవయ్యా శ్రీ గణేశ్వరాయ
--((*))--
*స్పర్శ
వెచ్చని స్పర్శ
నా గుండెను తాకింది
ఒంటరి స్పర్శ
కొంతకాలం వేచి ఉండ మంది
ఆమని స్పర్శ
నా మనసును తాకింది
అద్దపు స్పర్శ
కొంత కాలం నిలబడుతానంటుంది
సుఖాల స్పర్శ
కౌగిళ్లు కోరుకో మంటుంది
నీడల స్పర్శ
ఎంతోకాలం కనిపించలేనంటుంది
సిగ్గుల స్పర్శ
నా మొము వెంటాడుతుంది
కలల స్పర్శ
నిద్రించ నంతసేపు కనబడుతుంది
జ్ఞాపకాల స్పర్శ
నా ఆణు వణువూ వణికిస్తుంది
ఘటాల స్పర్శ
ఎంతకాలం సహకారం అందిస్తుంది
అక్షర స్పర్శ
నాకు మోక్ష మార్గ మవుతుంది
గణాంక స్పర్శ
బ్రతుకుకు మార్గమవుతుంది
ఉదయ స్పర్శ
నా ఆరోగ్యాన్ని భద్ర పరుస్తుంది
వ్యాయామ స్పర్శ
నిగ్రహా శక్తిని పెంచు తుంది
వెన్నెల స్పర్శ
నా మనసు ఉల్లాస పరుస్తుంది
జల్లుల స్పర్శ
హృదయస్పందనకు దారితీస్తుంది
ఇల్లాలు స్పర్శ
జీవితము సుఖమయ చేస్తుంది
దేవుని స్పర్శ
నీలోఉన్న నన్ను మరవద్దంటుది
--((*))--
* కల పుట్టుక
రెండు ఆత్మలు కలిస్తే
వెలుగు కల పుట్టుక
రెండు శిలల రాపిడికి
అగ్ని కల పుట్టుక
భక్తికి దైవం లొంగి
గంగ కల పుట్టుక
సాగరంలో నది కలసి
ముత్యాల కల పుట్టుక
నెల నింగి మధ్య
ప్రకృతి కల పుట్టుక
సంస్కార సాంప్రదాయం కలిస్తే
నిత్య శోభల కల పుట్టుక
మంచి చెడు కలిసి
మనసు కల పుట్టుక
సుఖ దు:ఖాలు కలిసి
జనన కల పుట్టుక
నాలుగు చేతులు కలిసి
జీవిత కల పుట్టుక
వెలుగు నీడలు కలిసి
కరుణ కల పుట్టుక
బాహ్యాన్తరాలు కలిసి
బ్రహ్మ కల పుట్టుక
మనసు మనసు కలిసి
మానవత్వ కల పుట్టుక
--((*))--
Children special
పంజలి ప్రభ -జ్ఞాన ప్రభ
పొడుపు కధలు
వినండి - వినమని చెప్పండి
--((*))--
సముద్రం
అంతర్వేదిని చేరా
నాలో అంతర్మధనం కలిగింది
అలుపెరుగక అలా అలా వస్తున్నా సముద్రపు
అలలు నాపాదాలు తాకి వెను తిరిగాయి
ఒక్కసారి పాదాల క్రింద భూమి
కదిలినట్లుగా గగుర్పాటు కలిగించింది సంద్రం
నాకళ్ళు ఒక్క సరిగా చెమ్మగిల్లి
మొద్దుబారి కనుపాపలు మధ్య
ఎర్రని నెత్తుటి చెమ్మ వెచ్చగ తగిలింది
కెరటాలు నాలుక బయట పెట్టి వెక్కిరిస్తున్నట్లుగా
నా మనసును వేదనకు గురిచేసింది
అనంత ఖనిజ ఓషదములు ఉంచుకొని
ఒడ్డుకు కళేబరాలను నెట్టివేస్తుంది
నదిని తనలో చేర్చుకొని
నిరంతరం నవ్వుతూ ఉరకలువేస్తూ
వస్తున్నా సముద్రానికి ఒక్క నమస్కారము చేసి
ఓ సముద్రుడా నీకు పునర్ జన్మలేదు
నీ కెరటాల నీటిలో స్నానమాడినాను
నాకు పునర్ జన్మలేకుండా
మనస్సును ప్రశాంతముగా
సహాయక గుణంగా ఉండమని
దీవించు " అర్ణవ "తండ్రి
--((*))--
హాస్య గీతమ్ (కాసేపు నవ్వు కోండి)
అబ్బబ్బ ఎంత బాగున్నావే
నా మనసు లాగేస్తున్నావే
ఏ మాయ చేసావే నా మనసు గుంజేస్తుందే
ఏరువాక పొంగులా, ఎగసి విరసి పడుతున్నావు
పున్నమి వెన్నెలలా నా హృదయాన్ని తాకుతున్నావు
అంత లేదు, ఆ మాయేనిన్ను కమ్మింది
సహజ సౌందర్యమే నాది, వయసులో విరిసిన
సొగసు మత్రామే, పువ్వులా గుబాళిస్తున్నాను అంతే
ఏ మంత్రం వేసావే, నా వళ్ళంతా తడిసి పోతున్నదే
నీవు మంచులా కరిగి పోతున్నావు, చల్ల లో వెన్న ముద్దలా
తేలి పోతున్నావు, ఆ తెల్లదన్నాన్ని చూసి మరువలేకున్నానే
ఏ మంత్రం వేయలేదు, అంత తొందరెందుకు
వేడికి కరిగితే నా తప్పు కాదు, వయసు పొంగు
ముద్దలా తేలితే నా తప్పు కాదు అంతే
ఏ తంత్రం చేసున్నావో నాకళ్ళు నిలవ నంటున్నాయి
నిన్ను వదలి పోలేకున్నాను, ని రూపు నన్ను ఉక్కిరి
బిక్కిరి చేస్తున్నది
ఏ తంత్రం చేయలేదు, నిన్ను చూసి నా మనసు
మార్చుకున్నా, నీ రూపం నా హృదయంలో
పదిలంగా ఉంచాలను కున్నా అంతే
ఏది మాయయో , ఏది మంత్రేమో, ఏది తంత్రమో
నాకు తెలియదు, నిన్ను వదల లేని ప్రేమ నన్ను
వెంటాడుతున్నది, నీవే నా సొంతం కావాలని ఉన్నది
మాయ మాంత్రం, తంత్రం ఏమి లేదు ఈ హృదయ
స్పందన, నిను కోరు కుంటున్నది నీతో 7 అడుగులు
నడవ మంటున్నది, మరి నీ కిష్టమేనా
ఇష్టమీనా అనకు, నీ మీద మరచి పోలేని ప్రేమ
అలాగే నాకు కుడా నీ మీద మరువలేని ప్రేమ
అలాగే కలసి మెలసి వలపులు పంచుకుంటూ సాగి పోదామా
ఓ అట్లాగే కలసి మెలసి సాగి పోదాము అట్లాగే అట్లాగే
ఏ మాయ లేదు మంత్రం లేదు తంత్రం లేదు ఈ ప్రేమకు
అవును ఏ మాయ లేదు మంత్రం లేదు తంత్రం లేదు మన ప్రేమకు
--((*))--
*మానవ జీవన రేఖలు (1)
విధాత జివిత సత్యాలను లిఖించిన నుదుటిపై రేఖలు
లయకారుడు సత్యప్రయాణాలను లిఖించిన పాద రేఖలు
స్థితి కారుడు కష్టానికి ఫలాన్నిచ్చి అర్ధం తెలిపే హస్త రేఖలు
శ్రీ మాతా, ప్రకృతి, ఫంచభూతాలు కదిలించే జీవన రేఖలు
రివ్వున వచ్చి మనసును కదిలించే గాలి రేఖలు
కెరటంలా ఎగసి పడుతూ చేరే అహంకారపు రేఖలు
కుటుంబంలోకాలాన్నిబట్టి మారే సుఖ:దుఃఖ రేఖలు
స్త్రీ ధైర్యముతో పురుషునకు ధైర్యము చెప్పే రేఖలు
చెవులకు వినిపించక పోయిన మనసుకు చేరే దివ్య కాంతి రేఖలు
పెద్దలు వినిపించే ప్రవచనాలవల్ల కుటుంబానికి అందె శాంతి రేఖలు
మంత్రంవల్ల విషం దిగినట్లు స్పర్శ సుఖం వళ్ళ ఆనందాశ్చర్య రేఖలు
వార్ధక్యం వళ్ళ ఇంద్రియాలు నిరుపయోగం చేదాకా భక్తిని రేపే రేఖలు
సామాన్యుని హృదయాలలో తృప్తి మయం కలిగించే రేఖలు
సంపన్న హృదయా ల్లో ఆశా పాశాలను కల్పించే రేఖలు
ఆక్రోశం హృదయాల్లో అసంతృప్తి పోరాటం కల్పించే రేఖలు
కష్టజీవుల హృదయాలలో అనుభవ సారాన్ని తెలిపే రేఖలు
ఒక వీరుడు మరణిస్తే వేలకొద్ది వీరులు ప్రభవించే రేఖలు
ఒక కవి మరణిస్తే వేలకొద్దీ రసజ్ఞులు విలపించే రేఖలు
ఒక నాయకుడు మరణిస్తే కొందరికి ఆశల పెంచే రేఖలు
ఒక బ్రాహ్మణుడు మరనిస్తే వేలకొద్దీ దేవతలు ఆవేదన లేఖలు
--((*))--
*మానవ జీవన రేఖలు (2)
యువకులు ధీరవచనం చెప్పే దివ్య రేఖలు
నదీమ తల్లులు ఉత్సాహముతో పొందే రేఖలు
సాగర కెరటములు వడ్డును తాకాలని రేఖలు
కాల పురుషులు సాగించే కాంతి నౌక రేఖలు
పుడమి పురిడించిన కంకుల జీవబింబ రేఖలు
ఆకాశము పురిడించిన మేఘ జీవబింబ రేఖలు
ప్రకృతి పురిడించిన తరువుల జీవబింబ రేఖలు
కాలయోని పురిడించిన అరుణారుణ జీవబింబ రేఖలు
భయానక కార్పణ్యముతో కలిగిన నలిగిన రేఖలు
క్రియాశీలతలు అరణ్యవాసం నలిగిన రేఖలు
కళాత్మకలను ఎదగలేక కళలానలిగిన రేఖలు
కవిత్వము పటుత్వము ఆదరణ తగ్గిన రేఖలు
అక్షయ జీవనానందానికి అభినందన రేఖలు
అక్షయాభ్యుదయ పరంపరకు ఆహ్వానాల రేఖలు
అక్షర పరంగా తెలుగు విద్య నీతి బోధనల రేఖలు
ఆకాంక్షముగా విలసిల్లే కవుల భావాల రేఖలు
కవి విరజిమ్మే అక్షర కాంతి రేఖలు
సుకవి జీవించే ప్రజల నాల్కులపే ఉండే రేఖలు
జ్ఞాన విజ్ఞాన సంకేత ఆదరణ పొందే రేఖలు
కవి మరణం జీవిత సత్యాలు తెలిపే రేఖలు
జనన మరణాలు కాంతి వెలుగుల రేఖలు
పుణ్య పాపాలు ప్రేకృతి లో తెలిపే లేఖలు
ఊర్ధ్వ అదో దిశలు అన్ని కాలాల్లోచూపే రేఖలు
అక్షర సాహిత్య సంపద ఇంటింట వెలిగే రేఖలు
నీరు చల్లని ఉష్ణం చేరి ఉష్ణత్వం పొందే రేఖలు
స్వభావం శాంతం అహంచేరి అహంకారత్వ రేఖలు
జలంలో వెలుగు చేరి స్వెతతత్వం చెందే రేఖలు
పురుషుల పొందు స్త్రీల చల్లదనం కలసి చేరే రేఖలు
--((*))--
హాస్య గీతం ( కాసేపు నవ్వుకోండి)
అబ్బో:: ఎర్ర కొక కట్టి, నడుం చుట్టూ, చీర చుట్టి
కన్ను కొట్టేటట్టు ఉన్నవే పిట్టా
అట్లాగా
అవునే
కట్టు బొట్టు పెసరట్టులా ఉన్నవే పిట్టా
అట్లాగేట్లా అనకే, ఆట పట్టించకే
అత్తెసరలా, ఉన్నానే పిట్టా
ఉంటె నాకేంటి
నీటుగా సూటు బూటు వేసావు
కంత్రీ బుల్లో డా
మాటలతో చోటు చూసి, కాటు వేయకు
ఖలేజా బుల్లో డా
ఓహో తట్టలో లొట్ట పిట్టలా
తట్టి తట్టి చెప్పకే పిట్టా
ఇట్లా అట్లా అనకే,
నీ వెట్లాగంటే అట్లాగే పిట్టా
నన్ను అట్లా,:: చాటు మాటు చూడకు రా
కందిరీగ బుల్లో డా
వెయిట్ చేస్తే, స్వీట్ రూట్
చూపెట్తా బుల్లో డా
బెస్ట్ చీపెష్టు హోటల్కు
పోదామా పిట్టా
జేష్టు వేస్టు చేయకు టైం
బుల్లో డా
ఎందు కట్లా గంటావ్ " పిట్టా"
ముందు చదువు పూర్తి
చేయరా బుల్లోడా
చక్కని ఉద్యోగం లో చేరి
అప్పుడు కనిపించు బుల్లోడా
అంతే నా ,
అంతే
అయితే వెళ్లొస్తా
మళ్ళెప్పు డొస్తావ్
చక్కని పిట్టకోసం :: ఉద్యోగం వచ్చాక వస్తా
అట్లాగే బుల్లోడా
అట్లాగే వెళ్ళొస్తా పిట్టా
అట్లాగే బుల్లోడా
వెళ్ళొస్తా పిట్టా
అట్లాగే
వెళ్ళొస్తా
--((*))--
* మానవ సేవే మాధవసేవ
మనసు మనసులో లేదండి
కరుణ చూపాలన్నా అవకాసం లేదండి
మనం పెట్టుక్కున్న ఆశలు
అడియాశలు ఆఇనాయి కదండీ
అలా అనుకోకే నేను చెప్పే మాట విను ముందు
"గతస్మ్రుతులు మరచి
వర్తమానంలో ఉందాము ఒక్కరమై
బిడ్డల కోసం వ్యధ చెందకు
ఉండేదము స్వతంత్రులుగా
మదితలపులు అర్ధం చేసు కుంటూ
మమ కారమతో ఉండెద మమేకమై
మానవ సేవ మాధవ సేవే అని
సేవా దృక్పధముతో ఉందాము
మనోనిగ్రహ శక్తితో మనలో శక్తి
ఉన్నంత వరకు మనం సేవకులమై
మానవాభ్యుదయమునకు,
భగవద్గీతను భొధిస్తూ ఉందాము
ప్రకృతి వనరులను ఉపయోగించండి
ఆరోగ్యమును కాపాడుకోమని హెచ్చరిద్దాము
మనలో ఉన్న ప్రతి రక్త బిందువును
మనభాషను, దేశాన్ని రక్షించుటకు
ఒక ద్యేయముగా జీవిద్దాము
అవునండి మనలక్ష్యం, మన ఔనత్యం
మారకుండా ఆ దేవదేవుని ప్రార్ధించుద్దాం
పాదరసాన్ని పట్టలేనట్లుగా
గాలిని ఎవ్వరూ చూడలేనట్లుగా
అకాశాన్ని కొలవ లేనట్లుగా
హృదయంలో ఉన్న శక్తిని గమనించ లేనట్లుగా
ఎవరు గుర్తించిన గుర్తించక పోయినా
మానవులను విజ్ఞానవంతులుగా
మార్చుటకు శక్తి వంచన లేకుండా
కృషిచేద్దాము, ఆ హనుమంతుని అరద్యులుగా
అందరికి వందనములు సమర్పిస్తూ
ప్రజాసేవ ప్రారంభించుదాము
* మానవ సేవే మాధవసేవగా జీవిద్దాము
--((*))-
వర్తమానంలో ఉందాము ఒక్కరమై
బిడ్డల కోసం వ్యధ చెందకు
ఉండేదము స్వతంత్రులుగా
మదితలపులు అర్ధం చేసు కుంటూ
మమ కారమతో ఉండెద మమేకమై
మానవ సేవ మాధవ సేవే అని
సేవా దృక్పధముతో ఉందాము
మనోనిగ్రహ శక్తితో మనలో శక్తి
ఉన్నంత వరకు మనం సేవకులమై
మానవాభ్యుదయమునకు,
భగవద్గీతను భొధిస్తూ ఉందాము
ప్రకృతి వనరులను ఉపయోగించండి
ఆరోగ్యమును కాపాడుకోమని హెచ్చరిద్దాము
మనలో ఉన్న ప్రతి రక్త బిందువును
మనభాషను, దేశాన్ని రక్షించుటకు
ఒక ద్యేయముగా జీవిద్దాము
అవునండి మనలక్ష్యం, మన ఔనత్యం
మారకుండా ఆ దేవదేవుని ప్రార్ధించుద్దాం
పాదరసాన్ని పట్టలేనట్లుగా
గాలిని ఎవ్వరూ చూడలేనట్లుగా
అకాశాన్ని కొలవ లేనట్లుగా
హృదయంలో ఉన్న శక్తిని గమనించ లేనట్లుగా
ఎవరు గుర్తించిన గుర్తించక పోయినా
మానవులను విజ్ఞానవంతులుగా
మార్చుటకు శక్తి వంచన లేకుండా
కృషిచేద్దాము, ఆ హనుమంతుని అరద్యులుగా
అందరికి వందనములు సమర్పిస్తూ
ప్రజాసేవ ప్రారంభించుదాము
* మానవ సేవే మాధవసేవగా జీవిద్దాము
--((*))-
*రాధాకృష్ణ ప్రణయ సాగరము
వలపుల తలపులు తెలుపవా
మెరుపుల సొగసులు చూపావా
మనుసున మమతలు పంచవా
ఓ రాధికా నీ మనసు నాదికా
గంధము పూసెద, చందనం పూసెద
తులసి మాలను వేసెద,
మేఘశ్యామ రూప
శిఖ పింఛమౌళి ముకుందా
ద్రాక్షాపాకం త్రాగెదవా
కదళీఫలములను గ్రోలెదవా
మదన కదన కుతూహలముకొరకు
మనసును రంజింపచేయుటకు
ఓ రాధికా నీ మనసు నాదిక
నారికేళములు కావలెనా
కదళీఫలములుకావలెనా
నవనీతము కావలెనా
ఇక్షు రసములను కావలెనా
శిఖ పింఛమౌళి ముకుందా
మూగ మనసుతో కోరుతున్నావు
మౌన గీతములు పడుతున్నావు
నుదుటి రాతలు గురించి చూస్తున్నావు
ప్రేమను పంచుతున్నావు
ఓ రాధికా నీ మనసు నాదిక
మోహనమురళి నీకోసమే ఉన్నా
యదు వంశీకృష్ణ నిన్ను ప్రార్ధిస్తూఉన్నా
అధరామృతాములను అందించాలని ఉన్నా
నంద గోపాల కృష్ణ, గోకులనందా
ఈ రాధిక ఆరాటం తగ్గించుకు రావా
;
వలపుల తలపులు తెలుపవా రాధిక
మెరుపుల సొగసులు చూపావా కృష్ణ
--((*))--
*హాస్య గీతము
నీలి మేలి రంగు గల తుమ్మెదా
అందు కోవా మకరందము
పసిడి వర్ణము గల పుష్పమా
అందు కుంటా అమృతము
నీలిరంగు మేనిలో
నిన్ను చూస్తూ ఉంటే
నాలో దాగి ఉన్న సిగ్గులు
పురి విప్పిన పువ్వులో
దాగినవి దోచుకోవా తుమ్మెదా
పచ్చ పచ్చ ఆకుల మధ్య
పసిడి మేను సింగారాలతో
వయ్యా రంగా ఊపులతో
ఎగిరెగిరి పడుతున్నావే పుష్పమా
తరువు చెంత ఉండ లేకున్నా
పరువు పోయి వాడక ముందే
వెచ్చని పరిమళాన్ని
అందించాలని ఉన్నది తుమ్మెదా
పరిమాళాలు భద్ర పరుచుకో
మధుర స్మృతులు దగ్గ రుంచుకో
మది తలపులు దోచుటకు
తొందర్లో వస్తానే పుష్పమా
వేచి ఉండక తప్పదా తుమ్మెదా
వేచి ఉండాలి పుష్పమా
నీలి మేలి రంగుగల తుమ్మెదా
అందుకోవా మకరందము
పసిడి వర్ణము గల పుష్పమా
అందుకుంటా అమృతము
అందుకోవా మకరందము
అందుకుంటా అమృతము
--((*))--
*మధురవాణి
పట్టుదల ఉన్నది -
విజయం మనదేనంటున్నది
మౌనం వద్దంటున్నది -
సంతోషం పంచుకోమంటున్నది
భావం తెలుప మంటున్నది -
భాషకు విలువ పెంచమంటున్నది
స్త్రీలకు గౌరవం పెరుగుతున్నది -
ధైర్యముగా బ్రతకాలంటున్నది
మనసుతో నవ్వమంటున్నది -
నవ్వులు పంచి బ్రతకమంటున్నది
కన్నీటిని అదుపు చేయద్దన్నది -
వెలుగుకు కన్నీటి సాక్షమన్నది
ప్రమిదకు వెలుగివ్వాలని తపన ఉన్నది-
స్నేహితులతో కలసి వెలుగిస్తున్నది
భంగ పడవద్దన్నది -
ఓర్పుకు అది ఒక పరీక్షయని తలవమన్నది
కాంతి ధార పంచమన్నది -
నిగ్రహశక్తితో నలుగురిని బ్రతికించమన్నది
నేల చినుకును కోరుకుంటుంది -
నింగి సహకారంతో పులకరించిపోతుంది
మధురవాణి మనవెంటే ఉన్నది -
మమతలు పంచుతూ విజ్ఞావంతులుచేయమన్నది
తనువును స్పర్శ అవసరమన్నది -
జిహ్వచాపల్యంనకు స్పర్స్ సుఖమన్నది
రచ్చబండ రాజకీయ మొద్దన్నది
ఉడతలా సహాయ బడమన్నది
వయసుని బట్టి ప్రవర్తించమన్నది
వానరుడిలా సహాయపడుతూ బ్రతకమన్నది
--((*))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి