31, మార్చి 2015, మంగళవారం

Pranjalai-poetic- News - Daily w.e.f 1-04-2015 to 15-04-2015)

Om Sri Ram                                                  Om Sri Ram                                          Om Sri Ram

ప్రాంజలి

సర్వేజనాసుఖినోభవంతు
ఓం శాంతి: ఓం శాంతి:  ఓం శాంతి:

పూల గాలులు గోల చేయగా
పండు వెన్నెల తోడూ ఉండగా
మల్లె చెట్టు ప్రక్క నుండగా
పరిమళాల గుబా లింపగా

పడచు ప్రక్కనుండగా
అందగాడు అండ నుండగా
ఇరువురికి వయసు పండగా   
చూడ కుండా చీకటుండగా

గాలి సవ్వడి చేయగా
పువ్వు విచ్చు కాగా
పరిమళాలు ఎగసి పడగా
స్త్రీ హృదయం వేడెక్కగా

మంచు చినుకులు మంట రేపగా
ఆణువణువూ పోటి  పడగా
మనసు మనసు నాట్యమాడగా
వయసు సొగసు ఒకటి కాగా

సన్నని బుగ్గలు సిగ్గులు కాగా
సన్నజాజులు సూదులు కాగా
కొంటె తలపులు వెంట రాగా
హృదయ తాపం చల్ల పడగా  
  

తెలుగు కవిత

అందాల జాబిల్లి
అందు కోవాలని ఉంది మల్లి మల్లి
అనురాగాల వల్లి
ఆనందాల మల్లి

ఆరాటంతో అల్లి
ఆర్భాటానికి వెళ్లి
ఆశలు చల్లి
ఆత్రుత వద్దు చెల్లి

అరటి పూవు వల్లి
అలుకకు ఎప్పుడు చెల్లి
చిన్న నవ్వు లల్లి
వెన్నులో తోడు మల్లి

చిన్న జల్లు జల్లి
విరజాజిని గిల్లి
మధురాల వల్లి
మనసే దోచుకెళ్ళి

12. ఇవి నిజమా - కాదా

కాలాలు అంతరిస్తాయి అనుకుంటాం
అవి అంకురిస్తూనె ఉంటాయి
ప్రేమ భందాలు తెగిపొతాయి అనుకుంటాం
అవి బలంగా మారుతాయి

ముసలివారు అనవసరం అనుకుంటాం
అనుభవాలు మనసుకు నచ్చుతాయి
వ్రాసే కవితలు పిచ్చి వనుకుంటాం
అవే మనసుకు తృప్తి నిస్తాయి

ఇంటర్వూకు భయాన్ని తోడూ తెచ్చుకుంటాం
మనసు ప్రసాంతతకు లోనుకావాలోయి
జవాబుల కోసం అదేపనిగా ఆలోచిస్తాం
ప్రశ్నలోనే జవాబుందని గుర్తిమ్చాలోయి

ప్రతిమనిషి మేధావి అనుకుంటాం
గుణాన్ని బట్టి తెలుసుకోవాలోయి
మోహనం కోసం మనస్సు ఏడిపిస్తుంటాం
శాంతి కోసం ప్రార్ధన చేయలోయి

మనిషి మాట మౌనంగా ఉంచటం
కొన్ని సమస్యలు పరిష్కారా లౌతాయి
మనిషి ఆలోచన చేయ కుండటం
ఇంద్రియాలు బలపడుతాయి

మనిషి సుఖానికి బానిస అవటం
సర్వనాసన మవతాడోయి
మనషి వయసుకు తగ్గ వానితో స్నేహ చేయటం
           అవసరానికి ఉపయొగ పడతాడోయి 


కొందరు చెప్పే విషయాలు వినాలని పిస్తుంది - అవి మనసుకు హత్తుకొనే విధముగా ఉంటాయి అవి ఆలోచించె విధముగా ఉంటాయి               
--((*))--


11. అర్ధశతాబ్దపు " ఇ-మెయిల్ to జీ-మెయిల్ " 

ఇ -మెయిల్  ప్రజల్లోకి వచ్చి ఏభై సంవస్చరములు నిండాయి  
మిత్రులను సన్నిహితులను  చేస్తూ ఆదు  కుంటున్నాయి 
పోటి ఎంత ఉన్న ప్రజల మద్దతుతో మెయిల్సు జరుగుతున్నాయి 
ఫేసు బుక్, రెడిట్ లు వచ్చిన జీ-మెయిల్ కు ఆదరణ పెరుగుతున్నాయి 

తొలుత 1965 మసాచు సెట్సు ఇనిస్టూట్ ఆఫ్ టెక్నాలజీ మెయి ల్సు పరిచయం చేసింది
కేంద్ర వ్యవస్థలోకి లాగిన్ అవటం వళ్ళ మెయిల్లు పంపించుటకు, చూచుట కు  వీలు కలిగింది 
నేడు ఎదుటి వ్యక్తి యొక్క పర్సనల్ కమ్పూటర్లొకి పంపటం జరుగుతున్నది 
ఇ -మెయిల్ అనేక మార్పులతో జీ మెయిల్ గా మార్చుట జరిగినది

1971 తొలిసారిగా రే థామ్లిన్సన్ తోలి మెయిల్ పంపినట్లు గుర్తించారు 
1976లో  రాణి ఎలిజిబెత్-2 మెయిల్ వాడిన తోలి దేశాధినేతగా నిలిచారు
1978లో ప్రభుత్వ సమాచార వ్యవస్థ కమ్పూటర్ ద్వారా తోలి మెయిల్ జరీ చేసారు
1982 లో ఇ-మెయిల్ అనేపదాన్ని వాడి అదే ఏడాదిలో స్కాట్ వహిమాన్
స్మైలీని కనిపెట్టారు

1996 లో భారత్కు చెందినా నబీర్ భాటియా, జాక్ స్మిత్ తో కల్సి హాట్ మెయిల్ ను ప్రారంభించారు
1997 లో మైక్రోసాప్ట్ సంస్థ దాన్ని 40 కోట్ల డాలర్లు పెట్టి కొనుగోలు చేసారు
1998 లో ఐ-మెయిల్ లో మనకు కనిపించే స్సామ్ అనే పదాన్ని అక్స్ ఫర్డ్ డిక్షనరీలో చేర్చారు
ఇప్పుడు ఎంతగానో మార్పు చేసిన జీ మెయిల్ ను 2007 లో గూగుల్ ప్రజల ముందుకు తెచ్చారు 

జీ - మెయిల్ ను ఓర్పుతో నేర్పుతో ప్రజలు ఉపయోగించుకోవాలి = 
ఆశలతో,  అతి ఆలోచనలతో, సమయాన్ని వ్యర్ధం చేసేవారు దీని జోలుకు పోకుండా ఉండాలి
--((*))--






10. కదిలే కాలం 

కదిలే కాలంలో గుండె 
గాయమైనా కన్నీళ్ళు మింగాలిరా
క్షణం క్షణం నిరీక్షలే 
వేదనతో భాధలు పండునురా 

తియ్యని హృదయ వేదనలో 
మనస్సు కల్లోల పరచునురా 
మాటల జలపాతాలు 
మాయ మొహంగా కమ్మునురా 

వెన్నంటి ఉండే చీకటి 
వెలుగును కమ్మి వేయును రా 
శాస్త్రముము చదివిన పొగడ్తలే 
అగడ్త్తలలోనికి నేటి వేయునురా 

బ్రతుకు అర్ధము తెలిసే 
భాద్యత మరచి ఉన్నావురా 
బ్రమలే నిజమనుకొని 
బ్రమిస్తూ తిరుగు తున్నావురా 

భయబ్రాంతులే 
మనుష్యులను వేదించునురా 
కాలం నీ అధీనంలోకి రాదురా
కాలంతోపాటు నీవు జీవించాలిరా

ఈ కవిత 4నెలల క్రితం సాహితీ కిరణం కి పంపగా ఏప్రిల్ 2015 మాసపత్రికలో ప్రచారించారు, ఆన్లైన్ ప్రేక్షకులకోసం ఇందు పొందు పరుస్తున్నాను 
--((*))--

9.  చిగురించాలని ఉంది

ఆకులు రాల్చుకున్న చేట్టులా,  కొత్తగా చిగురించాలని ఉంది 
కొడుకుపై ఆశలు వదులుకున్న తల్లిలా,  స్వతంత్రంగా జీవించాలనిఉంది 
ఎండిన పంటను చూసిన రైతు డొక్కలా, ప్రకృతిని ప్రార్దిమ్చాలనివుంది
సముద్రములో చిక్కిన నావలా, ఆధారం కోసం వెతుకుతూ తిరగాలని ఉంది 

జ్ఞాపకాలతో నడిచే జీవనదిలా, పాపులను రక్షించాలని ఉంది 
మనిషి అనే అనుభవాల పుట్టలా , మంచి సలహాలివ్వాలని ఉంది 
నీల్లను సుబ్రపరిచే స్పటికలా, కాలుష్యాన్ని తొలగించాలని ఉంది 
కళ్ళకు చల్లదనం ఇచ్చే కాటుకలా, నరదిష్టి తొలగించాలని వుంది 

స్త్రీ కి విలువనిచ్చే తాళి బొట్టులా, ప్రతిఒక్కరిని ప్రేమతో చూడాలనిఉంది 
మంచిమాటకు స్త్రీని గౌరవించే భర్తలా, పిల్లలతో సహకరించాలని ఉంది 
ప్రతిఒక్కరికి ఒక చుక్కానిలా, మార్గదర్సకుడుగా జీవించాలని ఉంది
విద్యను  భోదించె ఉపాధ్యాయునిలా, జీవితమ్ గడపాలిని ఉన్నది

 అనుకున్నవి జరగటానికి ప్రతిఒక్కరు శ్రమ పడ వలసి ఉన్నది -
 ఆదేవుని కృపాకటాక్షముకొరకు ప్రతిఒక్కరు విద్యను దానం, రోగులకు సేవ, చేయవలసి ఉన్నది

8. ఆశలు
 నీ మనసును ఉడికిస్తే, నా నిద్దురకు సహకరిస్తావు
నీ కలలో నేను వెంబడిస్తే,నా ఊహల్లొకి వస్తావు  
నీ స్పర్శను నేను కోరితే, నాకు చిరుగాలిలా సహకరిస్తావు 
 నీ కోసం నేను తపిస్తే, నాకు  నీడగా ఉంటావు 

నేను కడలిని నిన్ను కవ్విస్తే, నీవు నిట్టూరుస్తూ నదిలా ఉంటావు 
నేను నాగుని వెంబడిస్తే, నీవు బూర ఊది నన్ను ఆడిస్తావు
నేను నీ ముద్దును కోరాలనిపిస్తే, నీవు మేఘాలచాటుకు రమ్మంటావు
నేను చిలిపి చేష్టలతో ఉడికిస్తే, నిట్టురుస్తూ సహకరిస్తావు

నా రుచులు నీకు తెలియపరిస్తే, నీకు నచ్చదంటావు 
నా కోర్కను తీర్చమని చెపితే, నీవు  సమయం కాదంటావు 
నా మనసు విప్పి పలకరిస్తే, నీవు మాటలతో నీరుకారుస్తావు 
నావలపు విత్తనాలు చిందిస్తే, నీ కనురేపలు కదిలిస్తావు 

ఆశలు అనంతం - ఫలితాలు పరిమితం
--((*))--


7.  వదలిపోకు
చినుకు చినుకు అని తడుస్తూ తపింపకు 

వణుకు వణుకు అని వనికించకు 
కులుకు కులుకు అని కులికించకు
మినుకు మినుకు మని చూపించకు 

కలదు కలదు అని లేదనకు 
వలదు వలదు అని వద్దనకు
నటన నటన అని నవ్వించకు
రా దరిరా అని పిలువకు

మనసు మనసు మదించకు
మరల మరల అని మురిపించకు 
మనువు మనువు అని వేదించకు 
మధుర మధుర అని మందివ్వకు 

ప్రవరా ప్రవరా అని చర్చించకు 
కలరా కలరా అని ఏడిపించకు 
ప్రయరా ప్రియారా అని పిలువకు
మసి పూసానని వదలిపోకు

చలోక్తులతో మనసును అర్ధం చేసుకోవటంలోనే ఉన్నది అసలైన ప్రేమ 







6. రగిలే పదాలు 

ఇవి పదాలేనా ?
నదులువలె ప్రయాణిస్తున్నాయి
పిడుగుల్ల భయాన్ని పుట్టిస్తున్నాయి 
రాకేట్టు వేగంలా పరుగెదుతున్నాయి
పదాలకు తలలు తిరిగిపొతున్నాయి

ఇవి ప్రేమ పలుకులా ?
మనసుని కలవర పెడుతున్నాయి 
గుండె వేగం పెంచు తున్నాయి 
శాంతాన్ని భగ్నం చెస్తున్నాయి
శక్తి రాక విరక్తి కలిగిస్తున్నాయి 

ఇవి మాటలా నిప్పురవ్వలా?
అవేశ పరులను మండిస్తున్నాయి 
అవకాశవాదులకు దారిచూపుతున్నాయి
అమాయకులను తడిపేస్తున్నాయి
ఆడువారి మాటలకు అర్దాలులేకుండా ఉన్నాయి 

ఇవి మంగళ వాక్యాలా ?
మనస్సును ఊహల్లొకి తీసుకెల్తున్నాయి 
తనువూ తనువూ తపింప చెస్తున్నాయి
మనసును కలిపే అనందాన్నిస్తున్నాయి 
రగిలే పదాలు కావు, శుభకరాలు ఇవి

మాటల మర్మం అర్ధం  చేసుకోవటం ఆ బ్రహ్మకు కూడా చేతకాదు
అర్ధమైనదాన్ని రగిలించకుండా శాంతించి శాంతపరచటంలో ఉన్నది ధర్మం    
--((*))--



5. ఉద్యోగాల్లో జీవప్రక్రియలు
 విద్యార్ధులు కోటి ఆశలతొ చేరి చేస్తారు ఉద్యోగాలు 
తెలుసుకుంటారు రాజకీయ జీవన నైపున్య సూత్రాలు
ఉంటాయి బాసుల పెత్తనాలు, సహోద్యోగులు సాధింపులు
దేశప్రగతికి ఊపందు కుంటున్న కార్పరేట్ ఉద్యోగాలు

తెలివైన వారంత కాలేరు ఉద్యోగాల్లో సమర్ధులు 
ఉద్యోగంలో చేరాక నేర్చుకోవాలి అర్హతబట్టి చిట్కాలు
ప్రతి ఉద్యోగిని గౌరవించితే ఉంటాయి సహాయసహకారాలు  
మనప్రవర్తన, మనమాట, మనతెలివిని,బట్టిఉంటాయిగుర్తింపులు

  తెలియకుండా మనగురించి పొతాయి నివేదికలు 
ప్రతిపని ఇష్టపడి చేస్తే వస్తాయి అవార్డులు, ప్రశంసలు 
రహస్యాన్ని ఉద్యోగధర్మాన్నిబట్టి దాచితే రావు విబేదాలు
కలసిమెలసి పనిచేయుటలో తెలుసుకుంటారు కొందరి కళలు

అనైతిక సంభందాలాతో ఎప్పటికైనా వస్తాయి సమస్యలు
ఉద్యోగంలో ఉన్న భజన బృందాలవళ్ల వస్తాయి కొత్త చిక్కులు 
లంచాలకు అలవాటుబడితే ఎప్పటికైనా వస్తాయి ఉద్వాసాలు
 ఆశపడి అతితెలివి ఉపయోగిస్తే ఉన్న ఉద్యోగం పోయే పరిస్తితులు

జీతాలు ఎక్కువకోసం ఆశపడితే చేయలేక అవతారు రోగులు
మేధస్సు పట్టి, మనస్సునుబట్టి, పరిస్తితిబట్టి చేయాలి ఉద్యోగాలు
సంపాదనే ద్యేయంగా అందరిని నిర్లక్షం చేస్తే ఉండవు పుట్టగతులు
ఆత్మ సంతృప్తిగా చేయలేకపోతే ఉద్యోగానికి ఇవ్వాలి విడాకులు 
  
  ఎప్పటికప్పుడు -అనుకున్న- పనులుచేస్తూ- ఉండు =
 రేపుఎవరో- చేస్తారని -ఆశించి- సమయాన్ని- వ్యర్ధం- చేయకు 
--((*))--




4. సమయాన్ని వ్యర్ధం చేయకు 
ఉషస్సును ఆహ్ఫానిస్తూ, మనస్సును చైతన్యము వైపు మల్లిస్తూ 
 ప్రగతిని ప్రతి ఒక్కరు కాంక్షిస్తూ, తిమిరాన్ని తరిమెస్తూ 
కావ్యాలలోని మంచిని గ్రహిస్తూ, ప్రజలను ఉత్తెజపరిస్తూ 
విశ్వాసాన్ని కల్పిస్తూ, మీలొఉన్నద్వేషాన్ని తొలగించి వేయాలోయ్ 

సత్య సోదనలు సాగిస్తూ, అహం అనే అగ్నిని వదిలెస్తూ
అక్షరాస్యులను తయారుచెస్తూ, సులక్షణంగా బ్రతికేస్తూ
ఏకాగ్రతగా జీవిస్తూ , అంకితస్వభావముగా పనిచేస్తూ
అతివలను ఆదరిస్తూ, మీదీక్ష మాతృధరిత్రికి తోడ్పడాలోయ్  

మాటలతో మనుష్యులను ఆకర్షింస్తూ,కళ్ళతో ప్రేమను చూపిస్తూ 
గుండెలోని  భాదలన్ని తొలగిస్తూ, క్షమాగుణం పాటిస్తూ
అందరికి అభయం ఇస్తూ, ప్రతిఒక్కరికి అమృతాన్ని అందిస్తూ 
మీ పట్టుదల, మీవిద్య దేశప్రగతికి ఉపయోగ పడాలోయ్ 

అర్ధాన్ని సంపాదిస్తూ,  ఆర్ధిక వనరులను అధికం చేస్తూ
ఓడు దుడుకులను ఓదారుస్తూ, అర్ధంలోని పరమార్ధం గ్రహిస్తూ 
అర్ధాంగిని ఆదరిస్తూ, అర్దాంగి మాటలును ఆచరిస్తూ
ధర్మమార్గాన్న నడుస్తూ, న్యాయ పోరాటానికి సహకరించాలోయ్

"ఉత్చాహంతో పరిశ్రమించే మానవులకు ఎదీ అసాద్యం కాదు,  సాధనకు చేసే సర్వయత్నాలు ఫలిస్తాయి, ధర్మమారంలో సంపాదించే ధనాన్ని పేదలకు పంచితే, ముక్తికి మార్గామవుతుంది 


--((*))--




3. కొంటె కుర్రోడి కబుర్లు 
 కలలోకి వచ్చికబుర్లు ఎన్నో చెప్పాడు
కళ్ళు కాళ్ళు కలుపుకుందామన్నాడు
కలలో కన్ను గీటి  కంగారు పెట్టాడు
 కలలో కలల రాణివి నివేనన్నాడు 

మల్లె పూలు తెచ్చి పెట్టు కోమన్నాడు
మంచిఘంధం తెచ్చి పూసుకొమన్నాడు
రవ్వలగాజులు తెచ్చి తోడుక్కోమన్నాడు 
చక్కనైనచీర తెచ్చి, ఇప్పుడే కట్టు కొమన్నాడు

 కలవారి కుర్రోడు  కొంగు పట్టి లాగాడు
పొడిపొడిగా మాట్లాడి పొందుకోరివచ్చానన్నాడు 
ప్రక్క పక్క చేరి పెదవిపై ముద్ర ఇమ్మాన్నాడు 
కొరమీసమున్నవాడు కౌగలించుకోమన్నాడు

కొత్త కొత్త ఆశయాలతో బ్రతుదామన్నాడు 
ఇద్దరం సంపాదిస్తూ సుఖంగా ఉందామన్నాడు
నీ అనుమానాలు తీర్చి సుఖపెట్టగలనన్నాడు
మావారిని చూసి తుర్రుమని ఉడాయించాడు 

కొంటె -కుర్రోళ్ళు- ఉన్నారు- జాగర్త =
 చంకనెక్కి అంతా ఇమ్మని ఆరాట పెడతారు జాగార్తః  

--((*))--

2. విమానం


నేనొక గాలిలో తేలే పక్షిని, గాలిలోనే నా ప్రయాణం 
పక్షులకు తోబుట్టువుని, నాకెవరు ఉండరు సమానం 
రైట్ బ్రదర్స్ సృష్టించిన బిడ్డను, నా పని గగన విహారం
ఆకాశం కదులుతూవెలిగే మేఘాన్ని, నా పేరే విమానం

 డబల్ ఇంజన్లతో పైలెట్ నా మార్గ దర్శకుడు, హొస్టెస్ తోడు
ప్రయాణీకులను మోసిన అలుపురాదెప్పుడు, హల్టులు లేవెప్పుడు 
ఆకాశంలో విహరిస్తున్నాప్పుడు, రేడార్ పైనే నా చూపు ఎప్పుడు 
ఎవరికీ చిక్కను, అదరను, బెదరను, పోటీ పడను ఎప్పుడు 

సైజుకు నేను జింబోను, వేగామునకు రాకెట్టును 
మెరుపుతీగ వెలుగును, మలుపుతిరిగుతూ పోతాను 
సరుకులను మోస్తాను, మనుష్యులను గమ్యానికి చేరుస్తాను 
ఇంధనం బట్టి ప్రయాణం చేస్తాను, లేకపోయిన కూలి పోతాను

వేదేసాశాలకు వెళ్ళేటప్పుడు భీమాలు తీసుకొవటం మరువద్దు
విమానంవెళ్ళేసమయాన్ని గుర్తించుటకు గూగుల్ ఆశ్రయించటం మరువద్దు 
అనుకోని సంఘటనలు జరిగితే ఆ దేవుడే కాపాడుతాడని మరువద్దు
చిరునామాలు క్రమతప్పకుండా ఉంచాలి, అవే భాగస్వాముల రక్షణ హద్దు

ఎయిర్ పోర్టు నా మజలి - టేకాఫ్ తోనే బదిలీ 
నాకు తోడూ ఉంటుంది గాలి - క్రిందపడితే నాలొఉన్నవారందరూ ఖాళి
      
--((*))--


1. గుర్తులు
మరణించాక కనిపించే గుర్తులు -సమాధులు
కనబడే పురాతన కట్టడాలు -శిధిలాలు 
కుప్పకూలుటకు సిద్ధముగా ఉన్న-పాతభవనాలు
అద్బుత కట్టడాలు ప్రేమకు -చిహ్నాలు 

అభాగిని ఆక్రందనలు -ఆత్మరక్షనపోరాటాలు 
ప్రేమికుల విషాదాంతాలు - ప్రేమ చేయలేని పోరాటాలు
ఆరాధన స్మృతులు - అవే ఆస్తికుల ఆవాసాలు 
 దేవుడు లేదని వాదనలు - అవే నాస్తిక మనస్తత్వాలు 

ఎన్నో చీకటి రాత్రులు - మరెన్నో దీపొత్చవాలు 
ఎన్నో పరిశ్రమలు - మరెన్నో ప్రగతి సౌధాలు 
కొందరి ప్రేమలు - మరికొందరితో విద్వేషాలు 
ఎన్నో వాగ్దానాలు - ఆచరణకు సూణ్యాలు 

చనిపోయినవారు- అందరు- మంచివారు = 
వారుచేసిన మంచి పనులు తీపి గుర్తులు
--((*))-- 


షుగర్ వ్యాధి 

అక్కరకు వచ్చే సంపద ఎంత ఉన్న 
వర్తమానానికి వర్తించే వైభవమున్న 
పంచభక్ష పరమాన్నాలు అందుబాటులో ఉన్న  
షుగర్ వ్యాధి ఉన్నవాడు కడుపునిండా తెనలేడన్న 

అనురాగపు కబురు కొందరికి తీపి 
చేదు కబురు షుగర్ ఉన్నవారికి తీపి 
చేదు కాకర రసం షుగర్ ఉన్న వారికీ  తీపి
వారసత్వముగా వచ్చే షుగర్ వ్యాధీ చాలా తీపి

డాక్టర్లు చెపుతారు తీపి ఎక్కువ తినవద్దని 
వారసత్వపు అంపశయ్య అవుతుందని 
శరీరమ్లొ చేరి నెమ్మదిగా విస్పోటనం అవుతుందని 
క్రమంగా తగ్గుతున్న కంటి చూపె దానకి సాక్షి అని 

గడియారము ముళ్ళు తిరిగినట్లు, జీవిత కాలము మందులు వాదుతూ ఉండు 
అద్దంలో చూస్తె మచ్చలు కనబడినట్లు,  షుగర్ తిన్న చిన్నరోగం తగ్గ కుండు 
సూర్యుడు నీడ  కదులు చున్నట్లు,  రక్తంలో షుగర్ కలసి త్రిప్పుచు  ఉండు 
నడక,వ్యయామము, షుగర్ కు నిశ్శబ్ద వైద్యమని రుషులు  చెప్పుచు ఉండు

షుగర్ ఉన్న వారికి జిహ్ఫచాపల్యం ఎక్కువ దాని నుండి జాగర్త  పడు
భోజనములో, మధురలో తీపి లేకుండగా ఎప్పుడు జాగర్త పడుతూ ఉండు 
షుగర్ చేరితే చిన్న పుండు తగ్గక అంగ వికులుడుగా కాకుండా జాగర్త  పడు
షుగర్ మందు వాడకపోతే అనారోగ్యుడై మనసు విరిగిన పతిన్చుకోకుండు 
       

 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి