12, మార్చి 2015, గురువారం

Pranjali - Daily -Poetic - News w.e.f. 16-03-2016 to 31-03-2015)

Om Sri Raam                                         Om Sri Raam                                        Om Sri Raam

ప్రాంజలి  ప్రభ
సర్వేజనాసుఖినోభవంతు
ఓం శాంతి : ఓం శాంతి :ఓం శాంతి :



1. గొడుగు 

నల్లని కప్పు కలిగి వేడిదగలకుండా అడ్డుగా ఉండే గొడుగు ఇది
వానకు తల, గుడ్డలు తడవకుండా అడ్డుగా ఉండే గొడుగు ఇది 
వయస్సుమీరిన వారికి చేతి వాటంగా,రక్షగా ఉండే గొడుగు ఇది
బ్రహ్మొత్చవాలకు ఊరెగింపులో వేంకటేశ్వరునికి నీడనిచ్చేగొడుగు ఇది  

నడకలు నేర్చిన రమణికి అందాలు పెంచే గొడుగు ఇది
వయసుముదిరిన జవ్వని అందాలనువిరజిమ్మే గొడుగు ఇది
వాహనాలనుండి బురద దుమ్ము పడకుండా అడ్డుగా ఉండే గొడుగు ఇది
అవసరాన్ని బట్టి ఏ ఎండకు ఆగొడుగు పట్టాలని సామెత ఉన్నది

స్నాతకవేళ యందు బావగోడుగు పట్టగా బావమరిది  కాల్లుకడిగేది
వేద పండితులకు గొడుగు పట్టి పాద పూజ చేయుట మంచిది 
వామనుడు గొడుగు పట్టి బలిని మూడడుగులనెలను కోరటం జరిగింది 
పట్టభిషేకమున సీతరాములకు స్వేత ఛత్రం శత్రుఘుడు పట్టడంజరిగింది

గొడుగు కఱ్ఱ కుటుంబ తండ్రిగా భావించటం జరిగింది 
గొడుగు చువ్వలపై గుడ్డ తల్లిగా భావించటం జరిగింది 
గొడుగు లోపలచువ్వలు బిడ్డలుగా భావించటం జరిగింది 
 గొడుగే ఎండకు ,వానకు, మంచుకు, కుటుంబాన్ని కాపాడేదిగా ఉండేది 

 గాలి - నీరు - వెలుతురు- మానవులు - జీవించుటకు -సహకరిస్తాయి = పాదరక్షలు - గొడుగు - కలము - మానవులను - బ్రతికించుకొనుటకు -సహకరిస్తాయి
--((*))--



2. - నిగ్రహశక్తి
మనిషి వయసుకు దగ్గ దుస్తులు వేసుకుంటె
హుందా తనంగా నలుగుర్లో ఒక్కడైన్నట్టే
మనిషి సుఖానికి బానిసగా మారి  ఉంటె 
ఆ మనిషికి  అనారోగ్యుడుగా మారిఉన్నట్టే

ఏ మనిషైన  అభద్ధం ఆడకుండా ఉంటె 
ఆ మనిషి కలియుగంలో బ్రతక లేనట్టే
మనిషికి భేదం లేకుండా నమ్ముతు ఉంటె 
ఆ మనిషికి ఆత్మ విశ్వాసం అందరిపై ఉన్నట్టే

మనిషికి  ఆలోచనలు లేకుండా ఉంటె 
ఆ మనిషి ఇంద్రియాలు జయించి నట్టే
మనిషి మనసు మౌనంగా ఎప్పుడు ఉంచుకుంటే 
ఆ మనిషి దేశంలో అద్బుతాలు సృష్టించినట్టే

మనిషి ప్రవర్తనలు మార్చుకుంటూ ఉంటె
ఆమనిషికి కుటుంబంలో సఖ్యత లేనట్టే 
మనిషికి ఇంటిలో విలువలేకుండా ఉంటె 
ఆమనిషి చాతకాని దద్దమ్మ అయినట్టే

మనిషి- ఊసరవెల్లిలాగా- రంగులు- మారుస్తూ -ఉంటె -
 ఆమనిషి- నిగ్రహశక్తి లేని - చపలచిత్తు - డైనట్టే 
--((*))--


3. -ప్రగతికి- మూలం - స్త్రీ
 స్త్రీలు నవ్వుతూ నవ్వించిన చోట సిరులెల్ల వెలుగొందు 
స్త్రీలు ప్రేమను పంచి ప్రేమను పొందినచోట సుఖము పొందు 
స్త్రీలను గౌరవించినచోట ధనధాన్యాలు మనస్సాంతి పొందు 
జగతియందు  స్త్రీలు అన్నిట యందు ఉన్నారు ముందు
స్త్రీలు లేని ఇంట ప్రగతి కానరాదు 
స్త్రీలు  లేని గృహము నివాసము తగదు
స్త్రీలను గుర్తించక కోపంతో మాట్లాడ రాదు 
జగతి యందు స్త్రీలకు  కష్టాలు పడక  తప్పదు
అమ్మమాటవిని ఆలిని తిట్టరాదు 
ఆలి మాటవిని అమ్మను బయటకు నెట్టరాదు 
అలికూడా అమ్మగా మారుతుంది అవని యందు
జగతియందు అమ్మమాట, ఆలి మాట వినక తప్పదు
కష్టకాలంలో బిడ్డలు పెద్దలను ఆదుకోకతప్పదు
పెద్దలను నాకేమి ఇవ్వలేదని పదె పదె అని వెదించరాదు 
 తల్లి కష్టంతో నిను కన్నది, తండ్రి విద్యనేర్పిన మాట మరువరాదు 
తల్లి తండ్రులను ప్రేమించి పూజించుట ఎప్పటికి మానరాదు

స్త్రీలను - గౌరవించి - ఆదరించాలి = తల్లి- తండ్రులు- కలియుగ- దేవుళ్ళు -వారిని- పూజించాలి
--((*))--

4. శ్రీరామ నవమి
శ్రీరామ శ్రీరామ అనరా భద్రాచలము పోదాం పదరా
గోదావరిని పూజించి భద్రాచలము వేగంగా పోదామురా
కార్యసిద్ధి, విద్యాభివృద్ధి, రుణభాదలు తోలగునురా   
చూద్దామురా సీతారామ కళ్యాణం చూసి వద్దామురా

రంగరంగ వైభవముగా మండపాలు, అలంకారాలు ఉండునురా
ప్రభుత్వం వారు వజ్ర, వైడూర్య,రత్నాలు తలంబ్రాలుగా తెస్తారుటారా
అమ్మవారి తాళి బొట్లు మూడు చూడ ముచ్చటగా ఉండునురా
అశేష ప్రజా సమక్షంలో రాముడే సీతమ్మ మేడలో తాళి కడతాడుటారా ..... శ్రీ రామ
 

మనం కట్టిన పన్నుచే గోపన్నసీతా రాములవారికి దేవాలయము కట్టేనురా 
భద్రగిరిపై కట్టిన భాద్రాచలమే దక్షిణ అయోద్య పుర మంటారురా
కష్టాలుఒర్చి, కన్నీరుతో కట్టిన జగధబి సీతా రాములు ఆలయమురా
భద్రగిరిపై సీతా రాములు కలసిఉన్న రూపమ్ చూడ ముచ్చటరా       ..... శ్రీ రామ

రామ నామం జపం చెస్తూ ఉంటె హనుమంతుడు మనకు తోడు ఉండునురా
శ్రీరామదాసు చేయించిన నగలు అమ్మవారికి అయ్యవారికి అలంకరిస్తారుటారా
వేదమంత్రాలు చెవులారావిని, అమ్మవారి కల్యాణం కనులారచూసి వద్దమురా
తీర్ధప్రసాదాలు తీసుకొని, కళ్యాణ అక్షంతులు తలపై వేసుకుంటే పాపాలు తోలగునురా   

శ్రీమంతమైన అయోధ్యను పాలించినవాడా - చేతియందు ధనస్సును ధరించినవాడా - సీతసమెతముగా- హనుమంతుని-ఉండువాడా-సంసార  సముద్రాన్ని దాటించే నౌక అయినవాడా- మాకు చేయూత నిచ్చి కాపాడుముశ్రీరామ 


5. గొలుసు 

వనాలు ఉండటం వళ్ళ పవనాలు ఎర్పడు తున్నాయి
పవనాలు రావటంవళ్ళ మేఘాలు ఏర్పడు తున్నాయి
మేఘాల రావటం వళ్ళ  వర్షాలు పడుతూ  ఉంటాయి
వర్షాలు పొలాల్లో పడి పంటలు బాగుగా పండుతా యి

చదువులు  ఉండుటవల్ల ఆలోచనలు పెరుగుతున్నాయి
ఆలోచనల వల్ల నిద్రలో భయంకరమైన కలలు వస్తున్నాయి
భయాలు వళ్ళ దేవుని ప్రార్ధనలు ప్రారమ్భమవుతున్నాయి
ప్రార్ధనలను కూడా కొందరి బ్రతుకు మార్గ మవుతున్నాయి

కళలు ఉండటం వళ్ళ కొందరి బ్రతుకులు బాగు పడుతున్నాయి      
బ్రతుకు బ్రతికించు అనే సేవవల్ల కొన్ని జీవితాలు బ్రతుకుతున్నాయి
జీవితమలో స్త్రీ శక్తి తోడు ఉండటంవల్ల సుఖ శాంతులు వస్తున్నాయి
సుఖశాంతులు వళ్ళ కుటుంబములో కలతలు రాకుండా ఉంటాయి

కోరికలవళ్ళ వ్యాపారులు వ్యాపారం చేయుటకు మార్గమవుతాయి
వ్యాపారం అనేది నాణ్యత, పరిశుబ్రతపై ఆధారపడి  ఉంటాయి 
నాణ్యత అనేది ఒక త్ర్రాసు ధర్మం, న్యాయం, సత్యం, బట్టే ఉంటాయి
త్రిసూత్రాన్ని పాటిస్తే దేశ ప్రజల యొక్క ధైర్య సాహసాలు పెరుగుతాయి 
   
గాలి నీరు ఉండుట వళ్ళ ప్రాణులు బ్రకుతున్నాయి
ప్రాణులు కాలుష్యపు గాలిపీల్చుటవల్ల రోగాలు పెరుగుతు
న్నాయి
రోగాలు రావటం వల్ల మరణాలు పెరుగు తున్నాయి
మరణాలు పెరుగుటవల్ల స్మసానాలు పెరుగు తున్నాయి

 యువతి - యువకులు- యవ్వనంలో ఏకమై - పిల్లలకు-తల్లి- తండ్రులుగా మారి - వారి- భవిషత్ -గూర్చి- ఆలోచించి -వృ ద్ధాప్యంలో- గొలుసుగా-  సహకరిస్తూ - బ్రతకటమే - జీవితం    


 6. పసి  మొగ్గ (అనాధ )


గుక్కెడు పాలు పోసేవారు లేరు నాన్న 
 కంట నీరు తుడిచేవారు లేరు నాన్న
గోతిలోనుంచి పైకి తీసెవారు లేరు నాన్న 
దోమలు పీక్కు తిన్న పట్టించుకున్నవారులేరునాన్న 

నా రోదన మీకు వినిపించటంలేదా అమ్మ, నాన్న
వేగిరంగా వచ్చి నన్ను ఎందుకు తీసుకెల్లటం లేదు నాన్న
మృత్యువుతో నిస్సహాయంగా పోరాడ లేకున్నాను నాన్న
కన్నులు మూతబడుతున్నాయి, ఇక నోటితో పలకలేను నాన్న 

 వేడికి విలవిల లాడుతు కొయ్యబారి పొయ్యాను నాన్న 
చెత్తకుప్పలో కుక్కలు నన్ను పీక్కు తింటున్నాయి  నాన్న
గొంతెత్తి బోరు బోరు మని ఏడ్చినా పట్టించుకొనేవారు లేరు నాన్న
దిక్కు మొక్కులేని అనాధవలే చెత్తకుప్పలో పడిఉన్నాను నాన్న

బంగారు బొమ్మలాగుంది అంటున్నారెతప్ప పైకి తీయటం లేదు నాన్న
 పెళ్ళికాకుండా ఏతల్లి కామంతో కని పరేసిందో అని తిడుతున్నారు నాన్న
పరువుకోసం, ఆడపిల్లను  పెంచలేనని భయంతో చెత్తలో పడేసవా నాన్న 
అపద్బాందువుల కోసం అనాధగా ఎదురు చూస్తూ ? సెలవు అమ్మ నాన్న 

సృష్టిని -అతిక్రమించడం -ఎవరితరము- కాదు = తప్పులుచేయటం - 
తప్పు కాదు - పసి మొగ్గను- అనాధగా- వదలటం - తప్పు = 
చూసినా ఆదుకోకుండా- నాకెందుకు- అనితప్పుకుని -తిరిగేవారు ఈ ప్రపంచములో- బ్రతకటం- పెద్ద తప్పు  

--((*))--

7. నిశ్శబ్దం - శబ్దం 

రక్తంలొ కదలిక నిశ్శబ్దం 
 అది గుండెలో చేస్తుంది శబ్దం
నిద్రలో శ్వాస నిశ్శబ్దం 
అది బయటవారికి గురక శబ్దం 

మనసులో కదిలే ఊహ నిశ్శబ్దం 
అది ఆచరణలో చేస్తుంది శబ్దం
పాలు త్రాగుతున్నప్పుడు పాప నిశ్శబ్దం 
ఆకలి తీరనప్పుడు పాప చేస్తుంది శబ్దం 

చెట్టుకున్న మామిడి పండు నిశ్శబ్దం
అది రాలి ఎండుటాకులపై పడి చేస్తుంది శబ్దం
పెళ్ళికి ముందు మనస్సు నిశ్శబ్దం
ఆ పెళ్లి అయిన తర్వాత నిత్యం కీచులాట శబ్దం 

సంతకం చేసేటప్పుడు ఉంటుంది నిశ్శబ్దం 
దాని ప్రబావం తెలిసాక చేస్తారు ఒకటే శబ్దం 
తాళిబొట్టు కట్టేటప్పుడు ఉంటుంది నిశ్శబ్దం 
కట్టాక స్వతంత్రం వచ్చి నాది, నావారు అనే శబ్దం 

మనసు తెలుసుకున్నప్పుడు ఉంటుంది నిశ్శబ్దం 
ప్రేమను అర్ధం చేసుకోలేక ఎప్పుడు చేస్తారు శబ్దం 
కవిత్వపు రాతలు కాగితపై వ్రాస్తున్నప్పుడు నిశ్శబ్దం 
అవి చదివాక కొందరి హృదయాల్లో ఏర్పడును శబ్దం

అమాయకత్వాన్ని సొమ్మి చేసేది నిశ్శబ్దం 
గతజీవితాన్ని గుర్తు చేసి చేస్తారు శబ్దం 
ఉషోదయ కిరణాలు జాలువారు నిశ్శబ్దం
 ఆ వెలుగుల్లో కొందరి జీవన్మరణాల శబ్దం
    
 ఈ-లోకంలో-కాలం-నిశ్శబ్దంగా-కదులుతుంది= ప్రతి-ఒక్కరి-మనస్సు ఎప్పుడా-ఎప్పుడా-అంటూ- కోరికలతో- చేస్తుంది-శబ్దం



8. శరీరములో నీరు లేకపోతె

నీరును రక్షించండి, నీరు మనల్ని రక్షించుతుంది
నీరు అందరికి అవసరం, అదే శక్తికి కారణం అవుతుంది
 జల సిరితో కుటుంబం కళ కళ లాడుతూ ఎప్పుడు ఉంటుంది 
నీరు ఉన్న చోట వృక్షాలు, ప్రాణులు బ్రతాకటానికి మార్గామవుతుంది 

నీరు మనుష్యుల్లో తగ్గితే అలసట పెరుగుతుంది 
నీతి శాతం శరీరమ్ లొ తగ్గితే కొలెస్ట్ర్రాల్ను పెంచుతుంది
నీరు తగ్గితే రక్తం గడ్డకట్టి రక్త పోటు రావటం జరుగుతుంది
నీరు త్రాగాకపొతె కష్టాలకు, కలహాలకు కారణం అవుతుంది

నీటి నిల్వలు శరీరంలొ తగ్గితే మలబద్దకం పెరుగుతుంది
నీరు లేక పొతే మూత్ర పిండాలు దెబ్బతినటం జరుగుతుంది
నీరు తగ్గితే శరీరంలొ వ్యర్ధ పదార్దాలు చేరి గ్యాసు ఏర్పడుతుంది 
నీరు బాగుగాత్రాగక పోవడం వల్ల ఉదరములో మంట ఏర్పడుతుంది 

నీరు మోకాళ్ళ కీల్ల దగ్గర తగ్గితే విపరీతమైన మోకాళ్ళ నెప్పి వస్తుంది
నీరుశరీరములొ తగ్గితే చర్మం నుండి చవటరాదు, రంగు మారుతుంది
నీరు తక్కువత్రాగి ఆహారం ఎక్కువ తింటే ఊబకాయమ్ మారుతుంది
నీటిని ప్రతిఒక్కరు ఎక్కువత్రాగితే ఆరోగ్యం, ఆనందం, శక్తి ఏర్పడుతుంది  

 నీటిని-వ్యర్ధం- చేయవద్దు = ఆ- నీరె -ప్రాణుల్ని- రక్షిమ్చుతుందని- మరువవద్దు
  


9. అంగడి బొమ్మ

అందాల వనితను - విరబూసిన పువ్వును
విటులకు మనస్సును - వికట జీవుల
కు ప్రేమను
కుల మతం అని అనను - కాంక్ష చల్లార్చే మమతను
పగలు  రాత్రి  అనను - పరువాన్నిపంచె అగడి బొమ్మను

నేను చేసిన పుణ్యమును - సమానంగా పంచుతాను
ఆకలి తీరని అలుపును - ఆనందంగా అందిస్తాను
ఎవ్వరిని  వద్దనను  -  చిరునవ్వుతో రోగాన్నిఇస్తాను
బ్రోకర్లకు దారి చూపుతాను - పాపాన్నిపంచె అంగడి బొమ్మను

దేవుడు చూపిన మార్గమును  - వద్దు రావద్దు అనలేను
తల్లి తండ్రులు ఎవరో చెప్పలేను - ఆకలికి బ్రతుకు తెరువును  
వయసున్న లేత వనితను - ఆశాజీవులకు   ఊయలను   
 దిన దిన పోరాట మనను  - అలుపెరగని అంగడి బొమ్మను 
      

బ్రతుకు-తెరుపు-తప్పు-పట్టలేను - అది- ఒక -వ్యాపారం = 
కాంక్ష-తీరె- మార్గమిది -అనను - ఇది-ఒక -రోగ- మార్గం- ఖచ్చితం    
--((*))--


సత్య నాదెళ్లకు మాతృవియోగం మొక్రోసాఫ్టు సీ. ఈ. వో.సత్య నాదెళ్ల తల్లి ప్రభావతి శనివారం 21-03-2015 ఉగాది నాడు కన్ను మూసరు.  కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతూ  హైదరాబాద్ , తెలంగాణా, ఇండియా  లో ఉన్న తన స్వగృహంలో  తుదిశ్వాస విడిచారు. (85) వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియ పరుస్తున్నాను.

9. మహిళల సిగ సింగారం

ముడులేయని కురులు విరబూసి 
        కురులు సింగారం కోసం తైలంవ్రాసి        
కురులపై సిగబిల్లపెట్టి అలంకారం చేసి
అమ్మాయి అందం అదరహో అనిపిచ్చే

జడ సిగపై ఆభరణాలు అలంకారం చేసి
వాలు జడను కుప్పేగా మార్చ
గా మెరిసి
కురులకుప్పెలో సూర్య-చంద్రుల్ని ఉన్చేసి
       జడ నాగారం మెరుపు తో పెళ్లి కళ వచ్చే      

రెపరెపలాడుతున్న కేశాలు మత్తును పెంచేసి
రూపానికి తగ్గ వస్త్రం ధరించి జడను సద్దు చేసి
వంపుసొంపులతో జడ కుప్పెలు కదిలిమ్పచేసి
మన్మధ ప్రవేసించి మదితలపు మహిళకు వచ్చే

కులుకుల నడకతో జడను కదిలించి
కురుల సిగమెరుపులు సెగలు పెంచి 
జడ ఊపుతూ ఆశలతో  పెదవి విరిచి
జడతో సరసమాడి మనసుకు దడపెంచే

జడపిన్నుల రాళ్ళ మెరుపులతో కళ్లను కట్టేసి
జడయందు స్టెప్ బై స్టెప్ పుత్తడి పూలు ఉంచేసి
జడబిగించి నడుము చుట్టి మనసు ఉడికిమ్పచేసి
పెదవి కదలికల తో, జడను త్రిప్పుతూ  ప్రేమను పంచే

 
ఆనాడు జడలో ఉంచిన చూడామణియే సీతారాములను కలిపె

  
హనుమంతుడు సీత జాడ తెలుసుకొని ఉంగరము ఇచ్చి
సీత ఇచ్చిన " చూడామణి " హనుమంతుడు రామునికి
చ్చి
చూడామణి చూసి హత్తుకొని  రాముడు విరహముతొ విలపిం
చి  
హనుమంతుడు చేసిన సేవకు రాముడు ఆలింగనం చేసే

మహిళలకు జడ అలంకారం  భూషణం = ఆశలు నెరవేర్చుకొనుటకు జడ సోపానం      


10.21-03-2015  మన్మధనామ సంవత్చర "ఉగాది "పర్వదినము 

ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే 


ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని 

అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది.

 పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక -
 

బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం
 

ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
 

వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
 

చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
 

పచ్చి మామిడి ముక్కలు - వగరు - కొత్త సవాళ్లు
 

మిరపపొడి – కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు






ఈ ఉగాదిని మన గ్రూప్ సభ్యులందరూ ఆనందంగా జరుపుకోవాలని, 

అందరు సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....


  "జయ" కు వీడ్కోలు చెప్పి " మన్మధ " ను స్వాగతించె
కొత్త చిగురు చూసి,  కోకిలమ్మ గీతాలు ఆలపించె  
 వేప పూవు చూసి, వేప రెమ్మ మత్తు గాలులు వీచె
మామిడి పిందెను చూసి, మావిగొమ్మ ముస్తాబు పెంచె 

చింత పండును చూసి, చింత కొమ్మ చిందులు వేసె 
కొత్త బెల్లము చూసి, కోర్కెతీర ఉగాది పచ్చడి చేసె 
బ్రతుకు లావణ్యము చూసి, తీపి,వగరు,చేదు చూసె
కొత్త ఆశయాలను చూపి, "మన్మధ "ఉగాది పులకింప చేసె

 నిశీధాలను తొలగించాలని, దీపాలు వెలిగించె  
దరిద్రులను ఆదుకోవాలని, దానాలు చేయించె
విద్వేషాలను చల్లార్చాలని, ప్రేమను కురిపించె 
ప్రశాంత జీవితం గడపాలని, మన్మధుని పిలిపించె


పంచాగ శ్రవనమునకు గుర్తింపు కనబడుటలేదు
ఉగాది వసంత వర్ణనలకు కవులే కనబడుటలేదు 
ఉమ్మడి కుటుంబ భంధములు కనబడుటలేదు
పంచాగమును చూసి దేవుణ్ణి ఆరాధించే పనేలేదు

వెపపూవు కానరాదు, మామిడికాయ కొందామన్న లేదు 
చెరకుగడ అసలేలేదు, చేరువులో ఉన్న భంధువులు రాలేదు  
పల్లెల్లో పట్టణంలో కలేలేదు, పండుగ వాతావరణం అసలే లేదు
తెలుగు లోగిళ్ళలో జాతర లేదు, పెద్దల హడావిడి లేనే లేదు 

పాట అలవాట్లు పోలేదు, కొత్త అలవాట్లు రాలేదు
స్రీలలొ నవ్వు కానరాదు, ప్రగతి అనేది లేనే లేదు 
భక్తులకు కొదువలేదు, దేవుళ్ళకు క్షణం తీరకలేదు
ఉగాది వేడుక మారలేదు, తల్లి తండ్రుల ప్రేమ తగ్గలేదు

మన్మధ- స్వాగతమ్ము- ఉత్తమ- ఫలితాలిమ్ము=
నవ్య- కాంతుల- తోడ- నవ- వసంతపు- శోభను - కల్గించుము 
--((*))--
  


11.అనామిక
కలువ పూల కళ్ళతో ఉన్న మేను సరసు
కమలం విప్పారి కనువిందు చేసే  జలసు
పెదాలతో కమ్మని స్వరాలమనసు తడసు
కరుణచూపి కనికరించిన అనామిక మనసు

కల కల్లలు కాకుండా తెలిపావని తెలుసు
కళ్ళ  బొల్లి మాటలకు ఖర్చవని  నలుసు
కళ్ళెదుట కన బడ్డ కోకిల మాట  లాలసు
కరుణచూపి కనికరించిన అనామిక మనసు

కస్సు బస్సు లాడే  సొగసరి  వయసు
కప్పు కొని కళ్ళతో చూసె తొలకరి సొగసు
కళ్ళతో కన్నీరు తెప్పించే కన్నె పరసు   
కరుణచూపి కనికరించిన అనామిక మనసు

కళ్ళలో చూపు కనుపాపల నలుపు
కళ్ళెదుట కలువపూల చూపు తెలుపు
కవ్వించే చూపు కావ్య వనితా వలుపు  
కరుణచూపి కనికరించిన అనామిక మనసు

ఊరు- పేరు- లేని- వనితా - అనామిక= మనసు-సొగసు- ఉన్న- వనితా - అభిసారిక      


12.తోడూ నీడ


 సముద్ర కెరటాన్ని చూసి భయ పడకు
తలవంచి నమస్కారము చేయగా
  నీ నీడను చూసి భయం చెందకు
 నీకు తోడుగా నేనుండగా
ముసురును చూసి ముసుకెందుకు
నీ ప్రక్కన వెచ్చగా నేనుండగా 
కాలమును చూసి కలలెందుకు 
నిన్ను నిముషముకూడ విడవకుండగా

నీకు చీకటిని చూసి భయం ఎందుకు
వెలుగుగా నేనుండగా 
గులాబీని చూసి గుబులెందుకు
ముళ్ళుగా నేనుండగా
ధనమును చూసి దిగులెందుకు
ఖర్చుచేసేవాడిగా నేనుండగా 
పక్కను చూసి పక్కగా పక్క ఎందుకు
నీ మోజును తీర్చె నేనుండగా
నమ్మకము- ఉన్నచోట-తోడూ నీడ- ఉంటుంది =
 అహం - ఉన్నచోట- అంధకారము- ఉంటుంది
   --((*))--

13. చదువు- చదివించు 


చదువే మానసిక పరిపక్వతకు పునాది
చదువే నలుగురికి సహాయపడే జీవనది
చదువే సుఖశాంతి సంతోషాలకు పెన్నిది
చదువే ఆరోగ్యానికి, దేశ ప్రగతికి నాంది

చదివిన చదువుతో ధర్మాన్ని అనుకరించు 
చదివిన తెలివితో అధర్మాన్ని ఎదిరించు 
చదువుని స్వార్ధం లేకుండా నలుగురికి పంచు
చదువే  సంస్కారం నేర్పుతుందని గమనించు

చదువు లేని వాడవని ఎందుకు దిగులుపడితివి 
పక్షులు ఏమిచదివి గాలిలో ఎగురుచున్నవి  
చేపలు ఏమిచదివి   నీటిలొ ఈదు చున్నవి
నెమళ్ళు ఏమిచదివి  నాట్య మాడు తున్నవి 

భవ్య భారత పుణ్య క్షేత్ర చరిత్ర  చదవాలిరా 
చదువులలో ఉన్న మర్మం గమనిమ్చాలిరా
భయ బ్రాంతులను తొలగించేది చదువేరా
మానవులకు తేజస్సు శక్తినిచ్చేది చదువేరా

చదువే జీవితం అను కోవద్దు 
ఎచదువు చదివి భార్య సుఖం అందిస్తుంది 
ఎ చదువు చదివి తల్లి అందరికి ధర్మాన్ని భోధిస్తుంది 
ఎ చదువు చదివి తండ్రి అందరికి మార్గదర్సకుడయ్యాడు  

చదువున్నవారు -తేలికగా -ధనం- సంపాదించగలరు = 
చదువు- లేనివారు- మృగములాగా- కష్టపడ- గలుగుతారు   

14. మత్తు సంబాషణ

 పల్లెటూరు బావ మరదలు కలసి పార్కు పోయారు

వత్తు వత్తు ఇంకా వత్తు మరదల పిల్ల
సాగుతుంది ఇంకా సాగుతుంది బావా
అది తెలియదా ఇంకోసారి చూడు పిల్ల
వత్తితే మెత్తగా గట్టి పడుతుంది బావా

అది ఒక కొత్తరకం బూర మరదల పిల్ల
ముందున్నది పాల పీకా ఏమిటి బావా
వత్తితే పగులుతుంది మరదల పిల్ల
బూర చిల్లు పడి గాలి పోయింది బావా

చెట్టు కాయలుకోద్దామనుకున్నది మరదల పిల్ల

ఎత్తు ఎత్తు బావా పైకెత్తు బావా
ఏమెత్త మంటావు, ఎమెత్త మంటావు, మరదల పిల్ల 
 కిందెత్తు బావా కిందెత్తు మని చెప్పలా బావా
 అబ్బా గట్టిగా పట్టుకో కొమ్మను పట్టుకో పిల్ల

చక్కలగింతలు పెట్టకు  కాయలు దొరికాయి బావా
 నేమ్మదిగాదించ మంటావా మరదల పిల్ల
అది వేరే చెప్పలా బావా
అబ్బ ఎంత కమ్మగా ఉందే మరదల పిల్ల
  
పో బావా నీ కంతా వేళాకోళం
అబ్బా మీదపడి నావళ్ళు చిత్తూ చిత్తూ చేసావే మరదలపిల్ల
అబ్బ నీ వళ్ళు కమ్మగా ఉంది బావా
ఇంకోసారి కిందెత్తి  పట్టుకోమంటావా మరదల పిల్ల

అబ్బా  మల్ల మీద పడదామనుకున్నావా బావా
   దులప మంటావా మరదల పిల్ల
బావా బావా నాకు  కప్పు ఐస్ క్రీమ్ కొనిపెట్టవా
ఇదిగో ఐస్ క్రీమ్ తిను మరదల పిల్ల

మూత తీసి ఐస్ క్రీమ్ నోట్లో పుల్ల తొ పెట్టు బావా
మత్తు గా గమత్తుగా ఉందా  మరదలు పిల్ల 
 తీపిగా చల్లగా రసం కారుతూ ఉంది బావా 
సమయం వృధా చేయకు మరదల పిల్ల 

సరదాగా- నవ్వు కుంటూ- మాట్లాడాలి = 
ఉడుం- పట్టుపట్టి-  సుఖం- పొందాలి  

--((*))--


15. ఇదినిజమా కాదా 

చందమామ పంచుతుంది వెన్నలని 
పుడమి తల్లి గ్రహిస్తుంది వెచ్చదన్నాన్ని 
సెలయేరు చూపుతుంది చెలాకి తనాన్ని
కన్నె పిల్ల పంచుతుంది సొగసుల్ని
సన్నజాజి పంచుతుంది పరిమళాన్ని
మేఘాలు కురిపిస్తాయి స్వచ్చ జలాన్ని 
వృక్షాలు  అందిస్తాయి పూలు ఫలాల్ని 
కన్నె పిల్ల పంచుతుంది అనురాగాన్ని

పశువులు శ్రవించే అమృత క్షీరాన్ని 
తల్లి పిల్లలకు త్రాగిస్తుంది అమృతాన్ని
తండ్రి పిల్లలకు అందిస్తారు ధైర్యాన్ని 
కన్నెపిల్ల పంచుతుంది చిలిపితనాన్న్ని

కన్నె పిల్లకు ప్రేమతో  కొత్త పులకరింత
ప్రేమవళ్ళ మనసులో కొత్త కోర్కల సంత
సంతకాదు అది సంబరంగా పకరింతల వింత
 దీవెనలతొ,చదివింపులతో, ఆనందగా ఉంటారు అంతా    

ప్రకృతి- వనరులతో - జీవితమ్ - గడుపుదాం = 
కన్నె-  పిల్లలకు - వివాహంచేసి - ఒక దారి - చూపిద్దాం  

నేను ఇందు పొందు పరుస్తున్నా కవితలపై మీ అభిప్రాయాలూ తెలుపగలరు, గూగుల్+  షేర్ చేయ గలరు,  చూడ  గలరు
 ఇట్లు తమ విధేయుడు
మల్లాప్రగడ రామకృష్ణ , అసిస్టెంట్ ట్రజరి ఆఫీసర్,  డిస్ట్రిక్ట్  ట్రజరీ, నిజామాబాద్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి