26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

179. Family Love story 83 (Daughter) 14-08-2020






rachana mallaparagda sridevi ramakrishna 
స్వర్ణ రేఖ.. .చిన్న కధ (1 ) 

అమ్మా నాకు ముందుగా తెలియపరిస్తే, నేనే స్టేషన్ కు వచ్చేవాడిని కదా,  ఎందుకు కన్నా నిన్ను భాధ పెట్టటం అని నాకు తోడుగా ఈ పిల్లను తెచ్చుకొన్నాను, ఈ పిల్ల మన ఇంట్లోనే ఉంటుంది, నేను ఈ అమ్మాయిని పెంచుకుందామని తెచ్చు కున్నాను, నాకు  సేవ చేస్తూ చదువు కుంటుంది, ఈ పాపకు   అయ్యే ఖర్చు అంతా  నేనే భరిస్తాను, నీవు ఒక్క పైసా కుడ పెట్ట నక్కరలేదు బాబు. నాకు పెన్షన్  ఉంది కదా దానిలో ఈ పాప తిండి ఖర్చు క్రింద కొంత, మిగతాది కూడా నీకే   ఇస్తాను,  ఈ పాప గురించి వివరాలు అడగొద్దు, నాకే తెలియదు,  నేను నీ భార్యతో ఎమీ చెప్పను, అంతా  నీవె చెప్పుకో, గుర్తు పెట్టుకో ఈ పాప పని మనిషి మాత్రము కాదు, నా పనులు చేసి పెట్టేందుకే తెచ్చు కున్నాను. అన్నది  తల్లి  సుశీల.  అత్తయ్యగారు బాగున్నారా, ఈ పాప ఎవరు చాలా బాగున్నది, నాకు తోడుగా నా పనులు చేయించు కోవటానికి తెచ్చు కున్నాను, ఈ పాప పేరు  స్వర్ణ రేఖ. 

నేను వంట చేస్తాను స్నానం చేసి రండి అన్నది కోడలు సుభద్ర.

సుభద్ర నీ వంట బాగుంది, పాప నాదగ్గరే ఉంటుంది, నాకు తెలిసిన రామాయణ, భారత,భాగవత కధలు చెప్పుకుం టు  కాలం గడుపుతాను   అన్నది,  మీ ఇష్టం , మీకు ఏది మంచిదను కుంటే అదే చేయండి అన్నది.

బాబు చదువు విషము ఎమన్నా ఆలోచించారా అడిగింది అర్జున్  రావును, ఎందుకు ఆలో చించలేదు,  స్కూల్లో చేర్చుదామనుకున్నా అన్నాడు, మీరు అట్లాగే  అంటారని నేను అనుకున్నా, నేనుచేప్పేది వినండి, మనబాబును ఇంటర్నేషనల్ స్కూల్లొ చేర్పించండి, అక్కడా ఇక్కడా వద్దు, డబ్బులు ఎక్కు వవుతాయి కదా అంత  డబ్బు మనదగ్గర లేదు, మీరేం చెస్తారొ నాకు తెలీదు, మీరు బాబుని చేర్చలేదనుకో నేను మాత్రము మా అమ్మ దగ్గరకి మూట ముళ్ళు సర్దుకొని  వెళతాను అన్నది, ఎందుకె అట్లా బెదిరిస్తావు, నేను చేరిపిస్తానులే అన్నాడు.  
ఆలోచిస్తున్నారు ఎందుకు,  అమ్మతో వచ్చిన పాపను కూడా  స్కూల్లో  చేర్చమని అమ్మ అడిగింది అన్నాడు, అది కూడా  నేను చెప్పాల  డబ్బు విలువ తెలిసినవారు ఏదన్న  గవర్నమేంట్ స్కూల్లో చేర్చండి దాని గురించి ఆలోచించాలా అన్నది    

ప్రొద్దున్నే పాపతో వాకింగ్ వెళ్లి వెనక్కు వచ్చింది, అమ్మా  నన్ను కూడా  లేప పోయావా నేను వచ్చేవాడిని కదా, అన్నడు కొడుకు అర్జున్ రావు, మనసులో నడవాలని, ఆరోగ్యం బాగుండాలని అనుకుంటే నీవె నన్ను లేపి నడుద్దామని అనేవాడవు అన్నది. సరే నమ్మ ఈ రోజు పాప స్కూల్ గురించి అడుగుదా మనుకున్నా, బాబు  గవర్నమెంట్ స్కూల్లొ చేర్పించు, అందులో  తెలుగు మీడియమ్ చేర్పించు నీకు  కుదిరితే, అదేంటమ్మా అందరూ ఇంగ్లిష్ మీడియంలో చెర్పించ మంటారు  నీవెమొ తెలుగు మీడియమ్ లో చెర్పించ మంటావు   

అవును బాబు మనం తెలుగు వారం, మాతృభాషలో చదివిన చదువు నలుగురికి పనికి వస్తుంది, మాట నడవడిక బాగుంటుంది, డాక్టర్ చదివిన్చాలనేది నా ఆకాంక్ష అన్నది, అట్లాగేనమ్మ నీవు చెప్పినట్లుగా మంచి స్కూల్లొ చేరిపిస్తాను, పాప విషయములో మీరిద్దరు కలత చెందకండి ఏదో పెద్ద దానిగా చెబుతున్నాను, అట్లాగేనమ్మ నీవు చెప్పినట్లు చేస్తాను అన్నాడు.

అప్పుడే వచ్చిన భార్య సుభద్ర తల్లి కొడుకులు పొద్దున్నే గుసగుసలా  అన్నాది,  ఎమీలేదు  వాకింగ్ కు పోయి వెనక్కోచ్చాను అన్నది, ఇదిగో కాఫీ త్రాగండి, మీరు  మొహం కడుక్కోలా, కడుక్కోని రండి, కాఫీ కలిపి తెస్తాను

పేపరు చదువుతూ అర్జున్ రావు ఈరొజు స్కూల్లొ అప్లికేషన్ తీసుకొస్తాను అన్నాడు, తీసుకు రావటం కాదు చేర్పించాలి అన్నాది. సరే అట్లాగే.

అర్జున్ రావు టిఫెన్ తిని క్యారేజ్ పట్టుకొని వెళ్ళాడు, అప్పుడే రిజిస్టర్ పోస్ట్ వచ్చింది, సుసీల గారు ఉన్నారా అంటూ

                                                                                             ఇంకా ఉంది (2 )


 అత్త గార్ని పిలవమంటార అని అడిగింది, వాళ్ళ  అబ్బాయి కుడా సంతకం పెట్టాలి, ఇందులో చెక్కు  ఉన్నది అందుకని అన్నాడు, వెంటనే కాఫీ ఇస్తూ ముందు కాఫీ త్రాగు బాబు ఎక్కడ నుంచి వచ్చావో అన్నది , మావారు ఆఫీసుకు వెళ్ళారు మీరు రేపు ఇదే సమయానికి వస్తే ఇద్దరు ఉంటారు.  చెక్కు ఇచ్చి వెళ్ళవచ్చు అన్నది సుభద్ర,. అట్లాగే రేపు తప్పకుండా వస్తానండి  అన్నాడు వచ్చినవాడు, ఎవరు వచ్చింది అంటూ అత్తగారు బయటకు వచ్చింది,  

మీకు 100000 రూపాయలు మనియార్డర్ వచ్చింది, అబ్బాయి కుడా సంతకం పెట్టాలిట అందు కని రేపు రామ్మనమన్నాను. నీవు పిలువు, సంతకము ఎక్కడ  పెట్టాలి అంటే అక్కడ పెడతాను అన్నది,  వచ్చిన దెన్తట  ఆ  రూపయలు కుడా నీవే తీసుకొ అన్నది.

అప్పుడే ఇంటికి ఫోన్ వచ్చింది ఫోన్ తీసిన్ది సుభద్ర, ఎవరూ అన్నది,

"మేము చెప్పేది వినండి మీరు మీ భర్తను మోసం చేస్తున్నారు, మీరు మీ తప్పును వప్పు కోవటము లేదు అన్నారు", అసలు మీరెవరు తరువాత ఫోన్ చేస్తాను అన్నడు అవతలవైపు ఫోన్ కట్ చేశారు.ఎంత సేపు ఆలోచించినా బుర్ర వేడెక్కింది తప్పా.    

" అర్జున్ రావుకు సెల్ ఫోన్ మోగింది,  తీయగా మీ భార్య మంచి దను కుంటున్నారా , ఆమె మీరు పెళ్లి చేసుకోనే టప్పటికి  క ణ్య  కాదు అది తెలుసుకోండి ఇది పచ్చినిజం " , ఇన్తకీ మీరెవరు అన్నాడు, తరువాత ఫోన్ చేస్తాను నేను అన్నాడు..  .

 ఇంటి కి రాగానే రిజిస్టర్ పోస్ట్ గురించి చెప్పింది, మంచిదేగా  తీసుకొని అమ్మకు ఇచ్చేద్దాం అన్నాడు,

ఆ చెక్కులో ఎంత ఉన్నదో  చూసి పిల్లవాడి స్కూల్ ఫీజుకు ఉంచుదామండి, అమ్మకు ఏమి చెపుతావు అది నేను చూసు కుంటా నండి. సరే నీ   ఇష్టం అని లోపలకు వెళ్ళాడు, ప్రొద్దున్నే పోష్టు  రావటం, చెక్కు తీసుకొవటమ్, బ్యాంకులో  వేయటం, చెక్కు డ్రా చేయటం, పిల్లవానిని స్కూల్లొ చేర్చటం జరిగింది. రేఖను గవర్నమెంట్ స్కూల్లొ చేర్చటం జరిగింది.

       రేఖ ఇంటి లో పని మనిషి రాక పోవటం వల్ల  ఇల్లంతా తుడవటం, గిన్నెలు కడగటం, బట్టలు ఉతకటం, బట్టలు సర్దటం అన్ని చేసింది, ప్రక్కనే ఉన్న . టి .వి  ఆన్ చేసి వెళ్ళింది అప్పుడే జేసే దాస్ గారి పాట వస్తున్నది,  పాట కీర్తిశేషులు అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన మేఘసందేశం సినమాలోనిది  

ఆకాశ దేశాన ఆషాడ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం

వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని
కడిమివోలే నిలిచానని

ఉరమని తరమని ఊసులతో ఉలిపీరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి విన్న వేదన నా విరహ వేదన
ఆకాశ దేశాన ఆషాడ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా

రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీది నీడలలో నివురులాగ మిగిలానని
శిధిల జీవినైనానని

తొలకరి మెరుపుల లేఖలతో రుధిర భాష్పజల దారలతో
ఆ. ఆ. ఆ. ఆ..
విన్నవించు నా చెలికి మనోవేదన నా మరణయాతన
ఆకాశ దేశాన ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
                                                                                    ఇంకావుంది (3 )

.చిన్న పిల్లలు  ఈ పాటలు వినకూదదు, వెళ్లి చదువు కో అన్నది సుభద్ర.స్వర్ణ రేఖను 

అప్పుడే అర్జున్ రావు వస్తూనే మంచి పాటే కదా అన్నాడు, చిన్న పిల్లలకు ఆ పాటలెందుకని  అన్నాను . సరే మంచి పని చేసావు అన్నాడు. పని అయిన తర్వాత బెడ్ రూం వచ్చేయి  అన్నాడు. ఏమిటి ఈరొజు కొత్తగా చెపుతున్నారు, ఏదో చెప్పాలని చేప్పాను అంతె, ఇద్దరు ఒకే మంచం మీద కూర్చొన్నారు, ముందు నాకో విషయం చెప్పాలి, మనిద్దరిమద్య దాపరికాలు ఉండ కూడదు అన్నాడు, ఏమి టండి నన్నే అనుమానిస్తున్నార అన్నది సుభద్ర, అనుమానం కాదె నిజం తెలుసుకోవాలని అడుగుతున్నాను అంతె.

నేను నిప్పును, ఎ తప్పు చేయను, చేయలేదు, మీరు గంగలో దూక మంటే  దూకుతాను, ఇపుడే నాప్రాణా లు ఇవ్వమంటే ఇస్తాను అన్నది.

నాకో ఫోన్ వచ్చింది అందులో నిజా నిజాలు తెలుసుకోవాలని అన్నది, మరి నాకు కుడా ఫోన్ వచ్చింది, మీ మీద నేను మిమ్మల్ని అడిగానా మీరె నన్ను నిలదీస్తున్నారు అన్నాది.

మనం ముందు తల్లి తండ్రులను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నాము అంతవరకూ నిజమే కదా, అవును మనం గుడిలో దేవుని సమక్షములో దండలు మార్చుకొని ఇద్దరు ఒక్కరమైనాము, తనువూ తనువూ కలుపుకొని సుఖముగా కాపురము చేసాము కదండీ, అది అంతా నిజమే నేను ఆఫీసు పని నిమిత్తము నీకు చెప్పి అమెరికా వెళ్ళాను అప్పుడు నీకు, నాకు మద్య రిలేషన్ ఆగింది ఎందు ఆగిందో నాకు తెలియాలి అందుకని అన్నాడు. ఆ విషయం గురించి మొత్తం చెపుతాను అన్నది, మీకు ఎన్నో ఉత్తరాలు వ్రాసాను, వాటికి సమాధానము లేవు , అప్పుడే తెలిసింది నేను నెల తప్పానని ఆ సమయాన అమెరికాలో ఉన్నావు, ట్రైనింగ్ పూర్తి కాలేదు త్వరలో వస్తానని ఒక్క ఉత్తరం అందింది, తరువాత ఏ ఉత్తరములు రాలేదు,  మీ వాల్లను కలవాలని ప్రయత్నము చేసాను,  ఉద్యోగమునకు రాజీనామాను పంపించాను,   గత్యంతరం లేక మా తల్లి తండ్రులను కలిసాను , మా ఈ ప్రేమ వివాహాలన్నీ ఇట్లాగే ఉంటాయి, మోజు తీరగానే  చక్క వెళ్లి పోతారు, అని కోపంగా అన్నాడు, పెళ్లి చేసుకున్నాము నాన్న అని చెప్పిన  నీ ఆధారాలు ఈ లోకంలో వారికి చూపలేవు, మీకు మా ప్రేమ విలువ తెలీదు నాన్న అన్నాను,  మానా న్న, అగ్గిమీద  గుగ్గిలమై ఎగిరాడు, అప్పుడే మా   అమ్మ కలగ చేసుకొని  ఇప్పుడే గా వచ్చింది, నిదానంగా వివరాలు తెలుసుకోవచ్చు, అసలే మీరు లాయరు, చిన్న కేసునే సంవస్చరాలు లాగుతారు,  మీ అమ్మాయి విషయం  మాత్రం త్వరలో కనుక్కోండి, అసలే వట్టి మనిషి కాదు అన్నాది.
                                                                                               
                                                                                      ఇంకా ఉంది (4 )


ఆఫీసుకు పోయి కనుగొనగా ఇన్ఫర్మేషన్  రాలేదు, వచ్చిన తర్వాత తెలియ పరుస్తా మన్నారు, వెంటనే  కూతుర్ని డాక్టర్ వద్దకు తీసికెళ్ళి అబార్షన్ చేయిద్దమనుకున్నాడు,  వప్పుకోలేదు. కాలం కదిలి  పోయింది, ఎటువంటి ఉత్తర పత్యత్తరములు లేవు మా ప్రేమ మద్య, నేను ఎన్ని కష్టాలు పడ్డానో, ఎందరి మాటలు  భరించానో, తల్లి తండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు సీత దేవి కుడా అన్ని భాదలు పడలేదను కుంటాను. స్కానింగ్  లో ఆడపిల్ల అని తేలింది. చివరి రోజుల్లో ఆసుపత్రిలో చేరాను తరువాత తెలిసింది మా అమ్మ  చెప్పింది చని పోయిన బిడ్డను కన్నావు, ఇక ప్రేమించిన వారిని  మర్చిపో , మేము మంచి సంభందము చేస్తామని పట్టు పట్టారు, ప్రేమించిన వాణ్ణి  మరచి పోలేక, ఇంటిలో ఉండలేక, ఒక అనాధ ఆశ్రమములో ఆయాగా చేరాను, అదృష్టం కొద్ది 2 సంవస్చరాలుకు మీరు కనిపించారు మా తల్లి తండ్రులకు చూపగ  ఘనంగా  అందరి సమక్షమున మల్లి పెళ్లి చేసారు అది మీకు తెలుసు.

సుభద్ర నన్ను క్షమించు నేను తప్పు  చేసాను, మా క్యాంపు ఆఫీసు దూర మగుట వల్ల వెంటనే నీకు ఉత్తరాలు రాయలేక పోయినాను, నీ దగ్గరనుండి నేను అందుకున్న చివరి ఉత్తరము నీవు నెల తప్పావని వ్రాసిన ఉత్తరము, నేను చాల సంతోష పడ్డాను,  తర్వాత మనచిరునామాకు   పంపిన ఉత్తరాలన్ని తిరిగి  వచ్చాయి ఏమిచేయ్యలేక ఊరుకున్నను.

మేఘసందేశం పాత పాడుకుంటూ కాల వెల్ల బుచ్చాను నేను నీకోసం 

అపాప కుడా బ్రతికుంటే గోపికి అక్కగా ఉండేది అన్నాడు.

ఇందులో నేనేమన్నా తప్పు చేసానా చెప్పండి  అన్నది, ఇందులో అంతా  తప్పు నాదే, డబ్బు జీవతమనుకొని సుఖాన్ని పోగొట్టుకొని, దూర ప్రాంతాలో ఉండి  కష్ట బడ్డాను. మీరు  భాద పడ  కండి అంతా మంచి జరుగు తుంది అదేవుడున్నాడు, మనల్ని కాపాడుతాడు, ప్రేమ జయించి  నట్లుగా మన అమ్మాయి బ్రతికున్నదేమో అని అనుమానముగా మున్నది, ఒక్కసారి అమ్మను కనుకుంటాను అన్నది, సుభద్ర ఆ పని చేయి, నా  మనసు తేలిక పడుతుంది  అన్నాడు. ఏ విషయాలైనా దాపరికం లేకుండా మాట్లాడు కుంటే సమస్య లనేవి ఉండవు.

కాగుతున్నా వేడి పాలు దిన్చబోయి కింద పార బోసింది రేఖ, అపుడే వచ్చిన సుభద్ర కోపంగా చేతకాని  పనులు ఎందుకు చేస్తావు అని ఒక దెబ్బ గట్టిగా వేసింది, ఆ దెబ్బకు కదులుతూ తల  గోడకు కొట్టుకున్నది,  రక్త కారుతూ క్రింద పడి  పోయింది  రేఖ. వెంటనే హాస్పటల్ లో చేర్చారు, రక్తము తక్కువైంది అనిచెప్పారు, డాక్టర్  సలహా ప్రకారము  పరీక్ష చేయగా సుభద్ర రక్తమే కలిసింది, రక్తము ఇవ్వటానికి ముందుకు  వచ్చింది. 
 "మీ పాప విషయం  తెలియాలంటే ఊరు చివర ఉన్న ఆంజనేయస్వామి గుడి దగ్గరకు మీరొక్కరె రండి అని ఫోన్ చేసారు"  , ఆమాటలు సుభద్రకు చెప్పాడు, మన పాప బ్రతికే ఉన్నదట ఇప్పుడే ఫోన్ వచ్చింది, వెళ్లి తెలుసుకుంటా,  జాగర్తగా మాట్లాడండి,   ఎంతైనా సరే మన పాప  మనకు దక్కాలి అన్నది సుభద్ర , మీరొ చ్చె దాక నేను ఇక్కడే ఉంటాను రక్త ము పాపకు ఇచ్చి ఇక్కడే ఉంటాను, అన్నది, సరే డాక్టర్ పిలుస్తున్నట్టున్నారు, సరే జగర్తగ్గా వెళ్లి పాపను తెండి అని లోపలకు వెళ్లి రేఖకు రక్తము ఇస్తూ ప్రక్కన ఉన్న మంచము పై  పడుకొన్నది, బయటకు పోయిన అర్జునరావు ఆంజనేయుని గుడి వద్దకు పోగ అక్కడ దంపతులున్నారు,  అర్జున  రావు అవును నేనే " పాప ఏది", మొన్నటి దాక పాప మా దగ్గరే ఉన్నది కాని ఇప్పుడు మాదగ్గర లేదు అన్నారు,   మరి ఎక్కడున్నది, మాకేం తెలుసు  అన్నారు మా పాపేనని మీరు ఎట్లా చేపగలరు అన్నాడు. 
                                                                                             
                                                                                         ఇంకా ఉంది (5 )

కూర్చొ బాబు అన్ని వివరంగా చెపుతాము, చేసిన పాపము చెప్పుకుంటే పోతుందంటారు  అన్నాడు, 8 సవంశ్చరాలు క్రితమనుకుంటా మేము ఆసుపత్రి లో దొంగ తనానికి బయలు దేరాము, మేము చిల్లర దొంగ తనాలు చేసి పొట్ట గడుపు కుంటాము ,   విజల్ వినబడింది, మమ్మల్ని పట్టు కోవటాని పొలీసులు  వచ్చారని భయపడి మేము ఒక చెత్త కుండి  ప్రక్కన దాక్కు న్నాము,  మాకళ్ళ  ముందే ఒక ముసలావిడ మోఖానికి గుడ్డ చుట్టుకొని వచ్చి చెత్త కుండీలో ఒక పాపను వేయటం చూసాము, చని పోయిన పాపను అనుకున్నాము, కాని బ్రతికున్న పాప, వెంటనే పాపను తీసుకొని ఆ ముసలావిడను వెంబడిన్చాము, వెనకే  లోపలకు పొయి కత్తి  తీసి బెదిరించాము, అప్పుడే చెప్పింది ఈ పాప సుభద్రార్జునుల  కూతురు అని ఒక పెద్దావిడ చెప్పింది, నాకు  డబ్బులు కూడా  ఇచ్చింది,  పారేయమని చనిపోయిందని చెప్పింది,  అందుకే పారేసాను ఈ డబ్బులు తీసుకొని నన్ను వదిలేయండి అన్నది ముసలిది, ఈ డబ్బులు మాకెందుకు నీవె తిను అని మేము పాపను తీసుకొని మా గ్రామానికి వెళ్ళాము , మాదగ్గరే పెరిగింది, సహజంగా మేము దొంగలవటం వళ్ళ  మమ్మల్ని పొలీసులు పట్టు కెళ్ళారు, తరువాత విడిచి పెట్టారు మేము ఇంటిలో లేక పోవుట వలన బయటకు వచ్చింది పాప  ఎటు పోయిందో  తెలీదు, మేము పాప కోసం వెతుకుతున్నాము దొరకలేదు, అందుకనే ఫోన్ చేసి రమ్మనమని నిజం చెప్పాము అన్నారు  దొంగలు. మరి ఆ ముసల్ది ఏమైంది, మొన్ననే చని పోయింది. సరే పాప దొరికితే నన్నుకలవండి, ఇదిగో ఈ డబ్బు ఉంచు కొండి మీరు జాగర్తగా బ్రతకండి అని అర్జున్ వెను తిరిగాడు. 

ఇక్కడ హాస్పటల్ లో  ఇచ్చి బయటకు   సుభద్ర తల్లి వచ్చింది ,  ఏమైందే హాస్పటల్ కు వచ్చావు, ఆ విషయము తరువాత చెపుతా గాని, అడిగినదానికి సమాధానము చెప్పు అని తల్లి చేతిని తలపై పెట్టుకొని నీవు నిజం చెప్పక పొతే నేను చచ్చి పోయినట్లే అన్నాది, ఎందుకె అంత  పెద్ద ఒట్టు పెట్టు కున్నావు ఏమిటో అడుగు, నాకు పుట్టిన పాప ఎక్కడున్నది, అప్పుడే చని పోయిందని చెప్పానుగా అది నిజం కాదు, నీవు బిడ్డలు కన్న తల్లివి, ఒక తల్లిభాద  తెలుసు, నిజం చెప్పు, నీకు పాప పుట్టిన సమయమున నీవు  ప్రేమించిన భర్త వస్తాడో  రాడో  అని తలచి, నీ బాగు కోసం నలుగురిలో మా పేరు  చెడ కూడదని,  తల్లి అని కూడా  చూడ కుండా " ఎంచేసావే రాక్షసి నాకూతుర్ని అని కోపంగా అరిచింది సుభద్ర",   ఆయాకు డబ్బులిచ్చి బయట పారేయ్యమన్నాను అన్నది, అంతే  చెంప చెళ్ళుమని కొట్టింది, నీవు నా  తల్లి వి కాదు, ఈ జన్మలో నీమొఖము నాకు చూపకు, ఇంకా నా ముందున్నా వో  నేను ఏమ్చేస్తానో నాకు తెలీదు అన్నది గట్టిగా సుభద్ర , . 

సుభద్రా మన పాప బ్రతికే ఉన్నది కాని ఇక్కడ పెరుగుతున్నదో  తెలుసుకోవాలి అన్నాడు, నీకు పాప పుట్టిన రోజు గుర్తున్నదా మీ పుట్టినరోజునాడే పుట్టింది, హాస్పటల్ కు పోయి పాప పుట్టు మచ్చలు ఎమన్నా ఉంటె కనుక్కోవచ్చు అన్నాడు, నేను కూడా  వస్తాను నా మనసు మనసులో లేదండి,  అందుకని నేను కుడా వస్తాను మరి ఇక్కడ, మీ అమ్మ గారున్నారుకదా , సరే  వస్తాను అని లోపలకు వెళ్లి పాపను జాగర్తగా చూస్తు ఉండు అని  చెప్పి వెళ్లారు. హాస్పటల్ లలో రేకార్డులు లేవని చెప్పగా తిరిగివచ్చారు ఇద్దరు  

డాక్టర్ సునీత రౌండ్స్ వేస్తూ రేఖ దగ్గరకు వచ్చింది, పాప ఏమైంది అని పరీక్షగా చూసింది  అక్కడ ఉన్న సుశీల గారిని చూసింది ఏమైంది పాపకు, మా కోడలు ఏదో చెన్న దెబ్బ కొట్టింది, చిన్న దెబ్బ అంటారేమిటండి పెద్ద దెబ్బ తగిలితే అని గట్టిగ మంద లించింది వెంటనే  ఐ సి. రూములోకి మార్చింది, మంచి మందులు వ్రాసి వాడుదాము, వెంటనే తగ్గి పోతుంది, ఈ పాపను మీదగ్గరె పెంచండి, ఇంతకీ ఈ పాప ఎవరు అని డాక్టర్ ని సుశీల అడిగింది, "మాకు దగ్గర చుట్టాల్లో ఒకతని భార్య నేప్పులతో మా హాస్పటల్లో చేరింది, తల్లి ప్రాణం కాపాడ లేక పోయినాము, బిడ్డ ప్రాణాన్ని కాపాడాము, అప్పుడే ఆతను పెళ్ళాం పోయిన భాదతో పిల్లను కూడా  అక్కర్లేదు అని ఎటో వెళ్లి పోయాడు", ఇంతవరకూ కనిపించలేదు, ఈ పాపను డాక్టర్ చేయాలని నా ఆశయము,  ఎంత డబ్బులు ఖర్చయినా చదివిద్దామను కుంటున్నాను అన్నది , నా మనవురాలుగా భావించి నేను పెంచుతున్నాను, ఈ పాప నేను పెంచుకుంటున్న పాప మరెవరో కాదు అన్నది.                                                                            

అప్పడే సుభద్ర వచ్చింది పాప కెలా ఉన్నది అని అడిగింది, ఇప్పుడే డాక్టర్ చెప్పారు  " ఏ తల్లి కన్న బిడ్డో ప్రాణాలు గట్టివి అన్నది డాక్టర్  " అన్నారు,  సుశీల పాపకు సేవచేస్తూ ఉండి  పోయింది.

డాక్టర్ సునీత సుశీలకు ఫోన్ చేసి " మీ కోడల పిల్ల కూతురు,  మనవరాలు అమెరికాలో పెరుగుతున్నట్లు మా భందువలబ్బాయి పెంచు తున్నట్లు",  నాకు ఇప్పుడే కబురు వచ్చింది, పాదం మీద పుట్టు మచ్చే మీ మనవురాలని గుర్తు (మీ కోడలుకి పురుడు పోసింది నేనేగా ) ఈ రహస్యము మనలో నే  ఉంచు కుందాం. అన్నది డాక్టర్ 

  డాక్టర్ చెప్పిన స్వర్ణ రేఖ,నేను కోపంతో భయంతో పారేయమన్న పాప ఇదే అనుకున్నది సుశీల.   
దేవుడున్నాడు ఇంకా నిజాము బతికే ఉన్నది అన్నది సుశీల.

సుభద్రార్జునుల్ని డాక్టర్ పిలిచి మితి అంత గాబరాగా ఉన్నారు అని అడిగింది 
విషయమంతా తెలియపరిచారు నెమ్మదిగా.
ఎందుకు భాద పడతారు మి రక్తంతో మల్ల బతికింది ఈ పాపే మి పాపగా పెంచండి డాక్టార్ చదివించండి అన్నది 
అంత కన్నానా అంటూ పాపను దగ్గర అతిసుకోనున్నారు.     
నాన్న రేఖ ఏమవుతుంది.  
నీకు అక్క ,  నీవు అక్క అని పిలవాలి అన్నారు నవ్వుతూ
అప్పుడే ఫోన్ వీడి విడిగా వచ్చింది. మెం తెలుసుకున్నాం ఆ స్వర్ణ రేఖ ఉన్న పాప మీ దగ్గరే ఉన్నది  ఆ ఆంజనేయస్వామి సాక్షిగా చెపుతున్నాము గుడిదగ్గర్ కలిసిన ఆదంపతులం "
అవునే మన పాపే నాకు ఎంతో మన: శాంతిగా ఉందే అవునండి నాకు కూడా 
బాబు నేను కాశీ కి వేలు తున్నాను మీ పాప మీదగ్గరకు చేరితే వస్తానని 
అందరం కలసి వెల్దామా 
వద్దు బాబు నన్ను పోనివండి, ఆ పరమేశ్వరుని దర్శించుకొని వస్తాను    
మీరు మాత్రం పాపను డాక్టర్ చేసాక వస్తామని మొక్కు కోండి      
అట్లాగే నమ్మా  
--(())--

1 కామెంట్‌: