17, సెప్టెంబర్ 2014, బుధవారం

177. Mythol'ogical Story-81 (అపరాజితులు)


               ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...                                   

మహాలయ పక్షమున హిందూ మత సాంప్రదాయము  ప్రకారము, చని పోయిన పెద్దలకు (ఎ తిధి  చనిపోయారో ఆ తిధినాడు) పుణ్య  తీర్ధములన్దు వారిని స్మరించుకుంటూ తద్దినములు పెట్టుట, తర్పణాలు వదులుట  ఒక ఆచారము, ఆత్మలు శాంతిస్తాయని  ఒక నమ్మకము. మా నాన్న గారు చెప్పిన మాటలు గుర్తుకొసున్నాయి, ఒక లక్ష్యంతో ముందుకు సాగాలి,  వెనుకకు తిరుగ కూడదు, వెను కడుగు వేయకూడదు, ఎందుకంటే నీ వీపు నివు చూసుకో లేవు, నీ వెనుక ఉన్నవి నీకు తెలియదు,  అందుకే నీకు ఒక తోడు కావాలి. మనం చేసే  మంచి  చెడు  పనులకు వెనుకనుండి ప్రో స్చ హిమ్చేవారు ఉంటారు, వారు ముందు కు నెడుతూ ఉంటారు, అంతా  నేనే చేస్తున్నాను అని బ్రమ కల్పిస్త్తారు, వారే పుణ్య మూర్తులు, ఆత్మలు, గురువులు, పెద్దలు, అపరాజితులు (పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ నారాయణులు) .
 

మన వెనుక ఉండి  మనలో ఉన్న  అ జ్ఞానాన్ని  తొలగించి జ్ఞాన్నాని పెంచే అపరాజితులు వారు,  చని పోయిన వారిని ఒక్క సారి తలుస్తు వారు మనకు  ఏవిధము సహకరిస్తారో అంత్య  ప్రాస భావాలుగా ఇందు పొందు పరుస్తున్నాను, మీ అభిప్రాయాలు తెలుప గలరు.       .

అందరి  కళ్ళల్లో చల్లని కిరణాలు వేదచల్లెవారు
మనస్సు  లో  పరిమళాల్ని  గుభాలిమ్చే వారు 
జననం, మరణం  అంటే  ఎమీ  తెలియని వారు
కల్పనతో  జీవనమ్ గడిపే అపరాజితులువారు

దేశ  చరిత్రకు  మూల    స్థమ్బాల   వంటి వారు
రాజ్య పురోభి  వృద్దికి  కారణ    భూతులు వారు 
మహేంద్రజాలాన్ని  మనుష్యులకు  చూపెవారు
కళాతపస్సులవలె జీవించె అపరాజితులువారు 

నిరంతరం  ధర్మ సూత్రాలు భోధించేవారు
ప్రయాణంలో  నీతి  వాక్యాలు  చెప్పేవారు
స్వప్నాలతో, ఆశలతొ,కాలం కగిడిపేవారు 
నవ్వుతూ,సేద తీర్చె అపరాజితులువారు

 
నిజానికి  అభద్దానికి  మద్య నలిగిన వారు
సుఖ నిద్రలేని   రాత్రులు  గడి    పే  వారు
నరులను రక్షించుటకు గరళం మింగే వారు 
చీకటి,వెలుగును పంచే అపరాజితులు వారు

సమయము  దొరికి నప్పుడు సలహా ఇచ్చేవారు
మనుష్యుల  మనస్సు లో పన్నీరు  చిలికేవారు
మాన వత్వంతో  స్నేహ  భందాన్ని   పెంచేవారు
ప్రపంచానికి సలహా ఇచ్చే  అపరాజితులు వారు  

చూపించి, ఏడ్పించి, భేదించి, నవ్వించే వారు
దేశ మార్పులకు ఎప్పుడు సహకరించే  వారు
మనుష్యుల మేధస్సుకు శ్రమ కల్పించేవారు
నిత్తూర్పలతొ, శ్రమించి అపరాజితులు వారు
 
సత్యము తెలుసుకొని మనుష్యులవలె  భీతి  చెందే వారు
జ్ఞానముతో సంతోషము తెచ్చుకొని దుఖాన్నిమరిచేవారు 
యంత్రములు  వచ్చిన ఆత్మ  జ్ఞానముతో జీవిమ్చె వారు
పరుల సొమ్ము ఆశించక  శ్రమ పడే అపరాజితులు వారు  

అగ్ని, వాయువు, జలమును అందించిన వారు
ఆద్యంత  రహితము   నిత్యము  చలించే  వారు
శక్తి వంతములైన ఆత్మలై సహయంచేసె  వారు
స్నెహ భందాన్ని పెంచే అపరాఅజితులు  వారు

 
ప్రక్రుతి మాయతో మన బుద్ధులను మార్చే  వారు  
లోకంలో జీవశక్తి ఏర్పడుటకు సహకరించే   వారు
తత్వవెక్తలకు మేధస్సు పెంచే ఆత్మీయులు వారు
ధర్మభొధలున్నచోట వచ్చే  అపరాజితులు  వారు 

 
ప్రతిక్షణము మన హృదయ ప్రేరణ కలిగించే వారు
స్వార్ధమును  తొల గించే వాణిని  వినిపించే  వారు
అహంకారం హాని కలిగిస్తుందని హెచ్చరించే వారు
మనుష్యులలో ప్రేమనుపెంచే అపరాజితులువారు 

ఘోర రాక్షస  పరిపాలను  చూసి ఏమి చేయ లేనివారు
మనుష్యులకు    సుఖ  దుఖములు    అందించే వారు 
అగ్నిని ఆహుతికి, ఆకలికి ఉపయొగించు కోమనేవారు
అందరికి పరిపూర్ణత్వమునుపంచె అపరాజితులు వారు

 
మనం అనుభవించే సంపదల యందు ఉన్నా  వారు
సర్వ పదార్ధములందు,  స్తలము లందు ఉన్న వారు
సత్య జ్యోతిని, త్రికరణ శుద్ధిని,  అందరికి పంచె వారు
అశాంతి నుండి శాంతి కల్పించే అపరాజితులు  వారు
  

యదార్ధము తెలిపి  బుద్దిని మార్చే వారు 
ఒక లక్ష్యంతో  ముక్తిని  సహకరించే వారు 
ఇంద్రియ వాన్చల నుండి తప్పించే వారు       
సానుభూతిని పెంచే అపరాజితులు వారు

మనుష్యులకు ధైర్యము,ఉస్చాహము కల్పించేవారు
మనోనిశ్చయము సడలకుండా నిత్యం కాపాడేవారు
మనస్సు  ప్రశాంతముగా ఉండాలని  భావించే వారు
సేవా  సహాకరం  అందిస్తున్న   అపరాజితులు వారు

 గగన  సీమలొ  అందర్నీ గమనిస్తున్న వారు 
 ప్ర కృతి   అంతరాయాలనుండి కాపాడే వారు 
దాస్య  విముక్తికి  బలమును  అందించే వారు
అందరికి సంతోషం పంచే అపరాజితులు వారు 

మధురగానముతో  మనస్సు  ప్రశాంత పరుచువారు
సత్యమును,ధర్మాన్నిభొధించుటకు సహకరించేవారు   
అందరి హృదయ సంశయములను తొలగించే   వారు
సర్వము  యధార్ధము  తెలిపే   అపరాజితులు  వారు

వాక్కు  మనస్సు ఇంద్రియాలను  నిగ్రహించిన వారు 
రాగద్వేషాలకు అతీతంగ మనోధైర్యము కల్పించేవారు
మయా మొహానికి చెక్కకుండ అందరిని  కాపాడేవారు 
ప్రతిఒక్కరికి  ప్రేమలను   పంచె  అపరాజితులు వారు
 కులమతాలు అత్తీతమ్గా చనిపోయిన వారిని జ్ఞాపకము చేసుకొంటూ వారు చనిపోయిన తిధి  న కుటుంబ   సమేతంగా ఒకచోట చేరి  వారిని తలుచుకుంటూ, వారు చేసిన మంచిని గుర్తు చేసుకుంటూ తద్దినాలు పెడ్తూ, బ్రహ్మణు లకు దానాలు ఇవ్వటమే మన సామ్ప్రదాయము.   ఆవిధముగా అందరు చేస్తున్నారు, కొందరు కాశి, ప్రయాగ, గయ పుణ్య క్షే త్రాలు దర్సనము చేసుకొని, పుణ్య తీర్ధాల నన్దు స్నానమాచరించి,  పెద్దలకు తర్పణాలు వదులుతారు, ప్రతి సంవస్చరం చేసే పెద్దలు తలిచే కార్యక్రమము, సక్రమముగా చేసినట్లైతే  వారి దీవెనలు ఎప్పుదూ ఉంటా  యి.
సహజముగా మనం మార్జాలము  వంటి   వారము, మనల్ని నక్కలు వెంబడిస్తున్న కాల  భైరవుడు మనల్ని రక్షించుతు ఉంటాడు కనుక మనం అపరాజితులను ప్రార్ధిస్తూ , పెద్దలను తలుచుకుంటూ జీవితము గడిపితే, అందరికి  సర్వసుఖమయ మవు తుందని   నా  నమ్మకము