ఆదిదంపతులు (కుటుంబ రోజువారీ కధానిక (1 )
రచన : మల్లాప్రగడ రామకృష్ణ, హైద్రాబాదు, 6281190539
అభివృద్ధి చెందు చున్న నగరములో అద్భుతముగా నిర్మించిన దేవాలయ ప్రాంగణములో అనేక మంది భక్తులతో ఆంజనేయుడు ప్రవేశించాడు. ఒక వైపు ఉజారి పూజలు చేస్తూ వున్నాడు మరోవైపు ఆంజనేయుడు ముక్తకంఠంతో పాడుతున్నాడు.
*ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ ।
కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ ।
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ ।
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ ॥
ఓంనమఃశివాయ హరహర మహాదేవ శంభో శంకర
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ !!
వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం
వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం !!
నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహా దేవాయ త్ర్యయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మహాదేవాయ నమః
ఓంనమఃశివాయ
అప్పుడే పూజారి స్వామివారి అభిషేకము గూర్చి భక్తులకు * శివ పూజా విధి వర్ణనము -
ఆరాధ్య దేవుని యొక్క చరణారవిందములపై పాద్యమును, ముఖారవిందమున ఆచమనమును, అర్ఘ్య - దూర్వా - పుష్ప - అక్షతాదులను శిరస్సునను ఉంచవలెను. ఈ విధముగ పది సంస్కారములచే పరమేశ్వరుని సంస్కారము చేసి, గంధ పుష్పాది పంచోపచారములతో యథా విధిగ పూజింపవలెను. మొదట దేవతా విగ్రహమునకు ఉదకముచే అభిషేకము చేసి, రాజికాలవణాదులతో ఉద్వర్తన మార్జనములు చేయవలెను. పిమ్మట అర్ఘ్య జలబిందువులు, పుష్పములు మొదలగు వాటితో అభిషేకము చేసి ఘటములో నున్న ఉదకముతో మెల్లమెల్లగ స్నానము చేయించవలెను.
పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార - వీటిని వరుసగ ఈశానతత్పురుష - అఘోర - వాసుదేవ - సద్యోజాత మంత్రములతో అభిమంత్రించి, వాటితో మాటిమాటికి స్నానము చేయించవలెను. వాటిని కలిపి పంచామృతము చేసి, దానితో భగవంతునకు స్నానము చేయించవలెను. దీనివలన భోగమోక్షములు, లభించును. పైన చెప్పిన క్షీరము మొదలైనవాటిలో జలధూపములు కలిపి, మూలమంత్రముతో శివునకు అభిషేకము చేయవలెను. పిదప యవపిష్టముతో జిడ్డుపోవు నట్లు చేసి శీతలజలముతో స్నానము చేయించవలను. యథాశక్తిగ చందన - కేసరాదయుక్త మగు ఉదకముతో స్నానము చేయించి వస్త్రముతో విగ్రహమును బాగుగా తుడవవలెను. పిదప అర్ఘ్యము సమర్పింపవలెను. దేవత మీద హస్తము త్రిప్పగూడదు. శివలింగము తలపై ఎన్నడును పుష్పము లేకుండ ఉంచగూడదు. పిదప ఇతరోపచారములు సమర్పించి చందనాద్యను లేపనము చేయవలెను. శివమంత్రము జపించుచు పుష్పార్పణ చేసి పూజించవలెను. అస్త్రమంత్రము (ఫట్)తో ధూపపాత్రను ప్రోక్షించి, శివమంత్రముతో ధూపముచే పూజించవలెను. అస్త్రమంత్రముచే పూజింపబడిన ఘంట మ్రోగించుచు గుగ్గులు ధూపము వేయవలెను. ''శివాయ నమః'' అను మంత్రము నుచ్చరించుచు అమృతమధుర మగు జలముతో ఆచమనము సమర్పించవలెను. పిమ్మట ఆరతి ఇచ్చి ఆచమనము చేయించవలెను. నమస్కరించి, దేవత అనుమతి గైకొని భోగాంగముల పూజ చేయవలెను.
మీ ప్రాంజలి ప్రభ ఇంకావుంది (2)
****
*ఆదిదంపతులు* (రోజువారీ కధ ప్రాంజలి ప్రభ (2)
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
దేవాలయంలో మంచివిషయాలు తెలియపరుస్తున్నారు
ఏకోదేవ:సర్వ భూతేషు గూడః సర్వ వ్యాపీ సర్వ భూతాంతరాత్మా
సర్వా ధ్యక్షః సర్వ భూతాది వాసః సాక్షీ చేతా కేవలో నిర్గుణస్య
ఏకోవసీ నిష్క్రియా ణామం ఏకం బీజం బహుధాయః కరోతి
తమ్ ఆత్మస్థం ఏను పశ్యన్తి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం
అర్థము:--ఒకడే దేవుడు అన్ని భూతముల అంతరాత్మ యందు దాగి వున్నాడు.సర్వ వ్యాపి యై వున్నాడు,ఆయనే సర్వాధ్యక్షుడు సాక్షీ భూతమై కేవలం నిర్గుణుడు,నిరాకారుడై వున్నాడు,ఒక్క విత్తనం తోనే ఎన్నో విత్తనాలు సంభవిస్తాయి.ఈ భావనను తన ఆత్మ లో . దర్శించ గలుగు దీరుడికి సుఖం,సంతోషం శాశ్వతముగా దక్కుతాయి.వేరే యే యితరముల వల్లా కాదు.
మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే అసహనానికి లోను కాకండి. అది అబద్ధమైతే పక్కన పెట్టండి. దాన్ని గురించి ఎక్కువగా ఆలోచించ కండి. ఆ విమర్శ నిజమైతే మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. ప్రశంసించే గుణం ఉన్నవారికి విమర్శించే హక్కు వుంటుంది. ఎవరైనా విమర్శించ గలరు. దాన్ని అర్థం చేసుకొని క్షమించేందుకు సహృదయం, స్వయం నియంత్రణ కావాలి.
ప్రకృతితో సహజీవనం. సకల జీవరాశుల తో సహజీవనం. అన్నిటికన్నా ముఖ్యంగా మనం చేసిన కర్మ ఫలాలతో ( సత్ కర్మలు, దుష్కర్మలు) సహజీవనం. లంఖణం పరమౌషధం:-
సామాన్య అర్థం:--ఉదరం ఖాళీగా ఉంటే అది పరమౌషధం అని.
అంతరార్థం :--మనస్సు ఖాళీగా ఉంచితే పరమౌషధం అని.
సత్య వాక్కు ల నిలయమై సమయమందు, నిత్య తృప్తి సేవలతో కవిత్వమే బంధ బాధ్యతల గుటయే సహనముగా ప్రేమ పంచి శ్రీవిద్య,ఆదిశక్తి, భద్ర కాళి సమాంతర దృష్టిగా, వృత్తి ప్రవుర్తి కుటుంబమే బ్రతుకగా ప్రేమ పంచి కోరికలను తీర్చి పట్టుదలతో సేవలే,సరస్వతీ పుత్రికగా నిత్యముగా ప్రేమ పంచి సర్వ సృష్టి సర్వ ధర్మ ఇంద్రియాల లక్ష్యమై, సంపాదన కవిత్వమే తలదించక ప్రేమ పంచి ప్రసన్నముగ ప్రతిభకు ప్రగతిగా దేశం లో సహాయసహకారం అందించే అది దంపతులు. సృష్టికి మూలము కరుణ దయకృప ప్రసన్నత తల్లి చెల్లి అక్క అత్త భామ్మ దేశ రక్ష వీర ధీర మహిమాన్యతమైన కుటుంబ శ్రయస్సే ముఖ్యం.
ప్రాంజలి ప్రభ 02 -08 -2023 ఇంకా వుంది
*ఆదిదంపతులు* (రోజువారీ కధ ప్రాంజలి ప్రభ (3) dt. O3=08=2023ప్రాంజలి ప్రభ
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
దేవాలయంలో ఆంజనేయుడు భక్తుల ముందు శ్లోకాన్ని వివరించారు
శాంతాకారం - శ్లోకంలోని అద్భుత భావన...
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధా(కా)రం గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం!
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైక నాథం!!
ఇందులో సృష్టిక్రమం..
సృష్టిని పాలించే ఈశ్వర స్వరూపం..
ఒక చక్కని క్రమపద్ధతిలో నిబద్ధించారు.
శాంతాకారం
సృష్టికి పూర్వం ఈ జగమంతా శాంత స్థితిలో ఉన్నది.
శాంతం, శమనం – అంటే అన్నీ లయించిన స్థితి.
అనేకంగా ఉన్న వృక్షం, బీజంలో లీనమయినట్లుగా, సర్వ జగతి, పరమాత్మయందే లీనమై ఉన్న స్థితి – శాంతి.
ఏ వికారమూ లేని పరిపూర్ణత్వాన్ని కూడా, ఈ శబ్దం తెలియజేస్తోంది.
శాంతమే తన స్వరూపంగా కలిగిన పరమాత్మ.
భుజగ శయనం
భుజగశయనుడు..అనంత కాలతత్త్వమే అనంతుడు – ఆదిశేషువు – భుజగము.
ఈ కాలానికి ఆవల కాలాన్ని అధిష్ఠించిన ఈశ్వరుడే భుజగశయనుడు.
కాలానికి లొంగి ఉన్నవి లోకాలు.
కాలాతీతుడు, కాలం ద్వారా జగతిని శాసించే భగవానుడు కాలభుజగశయనుడు.
పద్మనాభం
సృష్టికి తగిన కాలాన్ని అధిష్ఠించిన నారాయణుని సంకల్పం మేరకు, సృష్టి బీజాల సమాహార రూపమైన పద్మం, ఆయన నాభీ కమలం నుండి ఆవిర్భవించింది.
సృష్టిగా విచ్చుకుంటున్న బీజ స్వరూపమే పద్మం.
దానికి నాభి (కేంద్రం) విష్ణువే.
అందుకే ఆయన ‘పద్మనాభుడు’.
సురేశం
విశ్వపు తొలిరూపమైన ఆ పద్మమందు,
విష్ణు శక్తియే సృష్టికర్తగా, బ్రహ్మగా వ్యక్తమయింది.
నలువైపులా దృష్టిని ప్రసరించి తన నుండి జగన్నియామక శక్తులైన వివిధ దేవతలను వ్యక్తీకరించాడు బ్రహ్మ.
జగతికి మేలు(సు)కలిగించే వారే సురలు
(సు- అంటే మేలు, ‘రాతి’ అంటే కలిగించు వాడు. సుం-రాతి – మేలును కలిగించువారు సురలు).
ఈ దేవతా శక్తులతో విశ్వమంతా నిర్మితమయింది. నిజానికి దేవతా శక్తులు స్వతంత్రులు కాదు.
ఆ శక్తులన్నీ ఆదిమూలమైన వాసుదేవుని కిరణాలే.
అందుకే ఆ సురలందరికీ తానే నియామకుడై ‘సురేశు’డయ్యాడు.
విశ్వాధారం
కనిపిస్తున్న విశ్వాన్ని నియమించే సూక్ష్మ శక్తులు ‘సురలు’. వారితో పాటు విశ్వానికి సైతం ఆధారమై ఉన్న చైతన్యం ఆ వాసుదేవుడు.
సమస్తమునకు ఆధారమై ఉన్నందున అతడే ‘విశ్వాధారుడు’.
కనిపించే జగమంతా ఆయన చైతన్యంతో నిండి ఉన్నందున ఆతడే ‘విశ్వాకారుడు’ కూడా.
నదిలో అలలన్నిటికీ జలమే ‘ఆధారం’.
అలల ‘ఆకారం’ అంతా జలమే.
జలం అలలకు ఆధారమై, ఆకారమై ఉన్నట్లే..
విశ్వాధారుడై విశ్వాకారుడై పరమాత్మయే ఉన్నాడు.
గగన సదృశం
ఇది ఎలా సంభవం?
ఆకాశంలో వ్యక్తమయ్యే సమస్తము నందూ, ఆకాశమే ఉన్నది.
సమస్తమూ ఆకాశము నందే ఉన్నది.
అదేవిధంగా ఆకాశంతో సహా,
సమస్త విశ్వమూ ఎవరియందు,
ఎవరిచే వ్యాప్తమై ఉందో,
అతడే పరమాత్మ.
అందుకే ఆయన ‘గగనసదృశుడు’(గగనం వంటివాడు).
ఇదే భావాన్ని ‘ఆకాశాత్ సర్వగతః సుసూక్ష్మః’ అంటూ ఉపనిషత్తు ప్రకటిస్తోంది.
ఇది నిరాకారుడైన పరమేశ్వరుని తెలియజేస్తోంది.
మేఘవర్ణం
నిరాకారుడై సర్వవ్యాపకుడైన ఆ పరమాత్మయే..
తన లీలా శక్తితో భక్తులను అనుగ్రహించడానికై దివ్యమంగళ విగ్రహుడై సాకారుడయ్యాడు.
ఆ సాకారం ‘మేఘవర్ణం’ (మబ్బువన్నె)గా ఉన్నది.
శుభాంగం
మేఘం నీటితో నిండి తాపాన్నీ, దాహాన్నీ పోగొడుతుంది. అదేవిధంగా కరుణారసంతో నిండిన విష్ణు మేఘం, సంసార తాపత్రయాల్ని పోగొట్టి, జ్ఞానదాహాన్ని తీర్చుతున్నది.
అందుకే అది నీలమేఘశ్యామం.
ఆ శ్యామల వర్ణ దేహంలో ప్రత్యంగమూ శుభమే. ప్రాపంచిక దేహాలు ప్రకృతి దోషాలతో కూడి ఉంటాయి కనుక అవి అశుభ రూపాలే.
కానీ స్వామి దాల్చిన విగ్రహంలో అవయవాలు శుభ స్వరూపాలు.
తలచే వారికి శుభాలు కలిగించే స్వభావంతో దివ్యమంగళ స్వరూపంగా భాసిస్తున్నాడు భగవానుడు.
అందుకే ఆయన రూపం ‘శుభాంగం’.
లక్ష్మీ_కాంతం
ప్రపంచాన్ని పోషించే ఐశ్వర్యాలన్నీ ఆయనను ఆశ్రయించుకున్నాయి.
ఐశ్వర్యాల అధిదేవత లక్ష్మి ఆయననే చేరి,
ఆయన సంకల్పానుగుణంగా ప్రవర్తిస్తున్నది.
అందుకే ఆ శుభ స్వరూపం ‘లక్ష్మీకాంతం’.
కమల_నయనం
ఐశ్వర్య దేవతకు ప్రీతికరం.
కమలముల వలె విచ్చుకున్న సూర్యచంద్ర కాంతులతో జగతిని గమనిస్తున్న కరుణామయ దృష్టి కల భగవానుడు ‘కమలనయనుడు’.
యోగిహృద్యానగమ్యం
ఇటువంటి విష్ణుతత్త్వం, స్వరూపం అందరూ అందుకోలేరు.
యోగులు మాత్రమే ఏకాగ్రమైన దృష్టితో ధ్యానం ద్వారా తమ హృదయాలలో దర్శించగలుగుతున్నారు.
ఆ కారణం చేతనే అతడు ‘యోగిహృత్ ధ్యానగమ్యుడు’.
వందే విష్ణుం భవ భయహరం
విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడు కనుక ‘విష్ణువు’.
ఈ తత్త్వాన్ని గ్రహించి, శుభాంగాన్ని ధ్యానించే వానికి ఈ సంసారంలో భయాలు తొలగి, అవిద్య నశిస్తున్నది. అందుకే ఆ స్వామి ‘భవభయహరుడు’.
సర్వలోకైకనాథమ్
సర్వలోకములకు ప్రధానమైన నాథుడు అతడే ‘సర్వలోకైకనాథమ్’.
14నామాలతో ‘విశ్వానికీ – విష్ణువునకు’ ఉన్న అభిన్న సంబంధాన్ని, ఈ శ్లోకం స్పష్టపరుస్తోంది.
ఒకే శ్లోకంలో, విశ్వానికి పూర్వ స్థితి నుండి సృష్టి స్థితులను కూడా నిర్వహిస్తున్న భగవత్తత్త్వాన్ని స్పష్టపరచడం, ఆర్ష దృష్టి వైభవం.
ఇంత స్పష్టంగా పరమేశ్వరుని గొప్పతనాన్ని,
ఆయనలోని సాకార నిరాకార తత్వాలను తెలియజేస్తూ యోగపూర్వక ధ్యానం ద్వారా,
మన హృదయాలలోనే ఆయనను దర్శించగలమనే, సాధనా రహస్యాన్ని కూడా, ఈ శ్లోకం అందిస్తోంది.
....
ఆదిదంపతులు* (రోజువారీ కధ ప్రాంజలి ప్రభ (4) dt. O4=08=2023ప్రాంజలి ప్రభ
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
దేవాలయంలో ఆంజనేయుడు భక్తుల ముందు
ఉపన్యాసం చెపుతున్నాడు
ప్రతిఒక్కరు విచక్షణ జ్ఞానాన్ని సంపాదించాలి ఎవరో చెప్పారని చేశానని అనుట కాదు నీ ఆత్మ సాక్షిగా నీ మనఃశాంతి నీతో ఉన్నవారికి శాంతి సౌఖ్యాలు కల్పించటమే మానవ జన్మకు సార్ధకం.
తల్లితండ్రులపై పూర్తిగ భారము వైచి కర్తవ్యము నిర్వర్తింపని వాడు భ్రష్టుడగును. అట్టివానికి స్వశక్తి తగ్గును. నీపై నీవాధారపడుట పెంచుకొనుచు అత్యవసర విషయములనే తల్లితండ్రులకు నివేదించుట నీ పెరుగుదలకు తోడ్పడును. తలితండ్రులేకదా ! అను మితిమీరిన విశ్వాసముతో బాధ్యతలను మరచుట అవివేకము. దీని వలన సాధారణ బాధ్యతలు కూడ నిర్వర్తించలేని స్థితి కలుగును. కనుక తల్లి తండ్రులను పురుషులైతే భార్యా సమేతముగా నిరంతరమూ సేవలు చేయవలెను ఇది ఒక విధమైన ఋణము అటులనే కూతురైతే భర్తను ఒప్పించి తల్లి తండ్రులకు సేవచేయట సమంజసము, పిల్లలలకు పిల్లలు పెరుగుతుంటారు అయినను తాత బామ్మ, అత్త మామ అంటూ పెద్దవారైన వారికి సేవలు చేయుట అందరి కర్తవ్యము.
వేలు పట్టుకొని నడిపించుట ధీమంతులకు తగదు. నీకుగ నీవు నడువుము. కర్తవ్యములను, బాధ్యత లను నీకుగ నీవు మోయుము. కష్ట నష్టముల నోర్చుకొనుము. వేలు పట్టుకొని నడచువాడవు మహత్కార్యము లేమి చేయగలవు? ప్రతిదినము ప్రార్థన సమయమునందు నీకు వలసిన మానసిక సహాయము అందింపబడ గలదు. ధృతి గలిగి నీవే సమస్త బాధ్యతలను నిర్వర్తించుము.
నిన్ను నిన్నుగ చూడగా - నన్ను నేనని తల్పగా
నీవు నాకల దృష్టి గా - నేను ప్రేమ సాక్షిగా
నన్ను నీవని చెప్పగా - కాల మాయకు చిక్కగా
వాన నీటికి తడ్వగా - ఎండ గాలికి మండగా
అగ్ని వాడక నీడగా - రాజ కీయపు రంగుగా
కాయ కష్టము నమ్మగా - మారు పల్కక చెప్పగా
కారు చీకటి కమ్మగా - పాలు నిచ్చు బర్రెగా
ఊలు నిచ్చిన గొర్రెగా - మేలు చేసెడి పెద్దగా
వేలు ఖర్చులు చేయగా- రోజు లన్నియు ఒక్కగా
దేని గూర్చియు ఆశగా - సేవ చేసియు కోర్కగా
ఇలా తడి పొడి మాటలు నిన్ను ఆవహిస్తాయి అయినా కార్వ్యము మరవకు అదే నేను కోరేది
IIU UUU IIU IIU 15/9
సమయానందంమ్మే సుఖసాగరమై
సమ బాధా ప్రేమే సుఖరామయమై
కమనీయంగా నే కరుణా లయమై
రమయాలింగంమ్మే సమరాశయమై
తన సమస్యలను తను స్ఫూర్తివంతముగ పరిష్కరించుకొను వానికి తల్లితండ్రుల సహాయము సద్గురువు సహాయము కూడ వెన్నంటి యుండగలదు. అర్జునుడు స్వయముగ యుద్ధము చేసినాడు. శ్రీకృష్ణుడు తోడ్పడినాడు. మిక్కుటముగ గురువుపై నాధారపడు వాడు ఏమియును చేయజాలడు.
......
*ఆదిదంపతులు* (రోజువారీ కధ ప్రాంజలి ప్రభ (5) dt. O5=08=2023ప్రాంజలి ప్రభ
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
దేవాలయంలో ఆంజనేయుడు భక్తుల ముందు వివరించారు
మానవ ప్రేమ ఉపయోగం - మానవ ప్రేమ విలువ ఎట్టిదైనా, అతని వికాసపథంలో దానికొక స్థానం ఉన్నది. ఏలనంటే, అసత్యమును వీడి సత్యమును, ఆపూర్ణమును వీడి పూర్ణమును, మానవత్వమును వీడి దివ్యత్వమును గ్రహించే యోగ్యత సంపాదించే పర్యంతం తనకు కావలసిన హృదయ భావానుభూతులను హృత్పురుషుడు ఈ మానవ ప్రేమ ద్వారముననే పొందగలుగుతాడు.
*జీవితం ఒక్కటే దేవుడు. వ్యక్తి దాంట్లో జీవించాలి. గాఢంగా జీవించాలి. అనురాగభరితంగా, ఆర్ద్రంగా, హృదయపూర్వకంగా జీవించాలి. వానపాము లాగా కాదు. రెండు వైపులా మంట వున్న కాగడాలా జీవించాలి. అప్పుడు అనంత శాశ్వతత్వం కన్నా ఒక్క క్షణం కూడా అద్భుతమైనది అవుతుంది. ఏ క్షణానికాక్షణం జీవించు. క్షణక్షణం జీవించు. దేన్నీ వెనకనున్న దేన్నీ ఆధారంగా పట్టుకోకు. యిప్పుడు యిక్కడ నిలబడు. ఇదే చివరి క్షణమన్నట్లు వుండు. వ్యక్తి ఈ రకంగా జీవించాలి. ప్రతి సందర్భమూ చివరిదిగా వుండాలి. అన్యమనస్కంగా, అంటీ ముట్టనట్లు ఎందుకుండాలి? నువ్వు యింకో క్షణం వుండకపోవచ్చు.*
ప్రతి అణువులోరహస్యముగా స్పందించే ప్రాణ శక్తి, రహస్యముగా ప్రతి జీవిలోన ప్రకాశించే
కాంతి శక్తి,రహస్యముగా అన్నింటినీ ఏకం చేసే ప్రేమ శక్తి,ఎవరైతే నీవు నేనుఒకటేనని హృదయములో ఎల్లప్పుడూ స్మరిస్తూ సకలమూ, ,తానూ ఒకటని తెలుసుకో గలుగు తాడో అతడే ధన్యుడు..
*కాబట్టి యీ క్షణాన్ని పట్టుకో. యింకో క్షణం సంగతి నీకెందుకు? జీవించే విధానమిది. నువ్వు ఫలితం గురించి పట్టించుకోకుంటే పద్మానివి. మాటిమాటికీ పద్మాన్ని మననం చేయాలి. వర్తమానం లోలోతుల్లోకి వెళ్ళు. యిప్పుడు యిక్కడ నిలబడాలి. కాని అనుబంధం లేకుండా వుండాలి. అతుక్కుపోకుండా వుండాలి. తాకకుండా వుండాలి. భవిష్యత్తు లేదు. అందువల్ల సంపూర్ణంగా జీవిస్తావు. గతం లేదు అందువల్ల అనుబంధముండదు. ఒకసారి అది జరిగితే జీవితం ఆనందం, అంతులేని ఆనందం శాశ్వతపరమానందం!*
ఆదిదంపతులు* (రోజువారీ కధ ప్రాంజలి ప్రభ (6) dt. O6=08=2023ప్రాంజలి ప్రభ
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
దేవాలయంలో ఆంజనేయుడు భక్తుల ముందు వివరించారు
ఇదొక నాటకం అని తెలిసి సుఖదుఃఖాలను అనుభవించడం దైవత్వం.
దేవుడు మనకీయవలసిన వన్నీ ముందే ఇచ్చి ఉన్నాడు. అందుకు మనమాతనికి కృతజ్ఞులమై మన కర్తవ్యమును మనము నిర్వహించి జీవనము సార్థకము చేసుకొనవలెను, అంతేకాని, మన విధులను కూడ ఆయనే చక్కబెట్టవలెనను వెంపరలాట మూర్ఘత్వము.
ఖగోళంలో ఉన్నదేదీ నీ స్వాధీనం లో లేనట్లు,
శరీరంలో ఉన్నదేదీ నీ స్వాధీనంలో లేనట్లు;
జీవితంలో ఉన్నదేదీ కూడా నీ స్వాధీనంలో లేనిదే.
నీ స్వాధీనంలో ఉన్నట్లు అనిపిస్తుంది., అంతే!
కంటి చూపు కరువైన గుడ్డి వానికి కూడ పగలు రాత్రిని గుర్తించగల ప్రజ్ఞ ఈయబడినట్లే, ప్రతి మనిషికి మంచి చెడుల తారతమ్యమును తెలుకొనగల వివక్షణ శక్తి కలదు. దానిని మరిచి పోవుటే ఇడుములకు కారణము!
జల్లు - ఆలోచనలు
కెరటం - మనస్సు (ఆలోచనల సమూహం)
సముద్రం - చిత్తం (ఆలోచనలు పుట్టు చోటు)
కాలము ఎవరి కోసము నిలువదు. ఆగి వెనకకు తిరిగి కుదేలు పడిన వారికి చేయూతనిచ్చిన తార్కాణము లేవియు లేవు! నిలకడలేకుండ నిర్దయగ ఉరకలు వేసే కాలం సమస్యలను తీరుస్తుందని పెట్టకునే ఆశ నిస్సారమైనది. క్షణంలోనే ప్రస్తుతం తనంతట తాను గతంగాను, భావిగానూ రూపుదిద్దుకోగలదు. ప్రస్తుతానికి ఉన్న ఆ ప్రజ్ఞ తెలిసినవాడు మాత్రమే కాలానికి దీటుగా జీవన యాత్ర సాగించగలడు. గతంలో కూరుకుపోకుండా, ప్రస్తుతంలో అప్రమత్తంగా ప్రయంత్నం చేస్తూ, భావిని రూపకల్పన చేసుకోగలిన వాడే నిజమైన ప్రజ్ఞావంతుడు!
అచలరూపుడైనా పరమేశ్వరుడు అనేకం అవ్వాలనే సంకల్పంతోటే, చలనరూపుడై చేసిన తాండవమే ఈ ప్రపంచం.
సముద్రమే అనేక కెరటాలుగా లేచి పడుతున్నట్లు - పరమేశ్వరుడే అనేక జన్మలు ఎత్తి లయిస్తున్నాడు.
* నీవు చూచే ప్రతి దృశ్యం కింద
*నీవు తలచే ప్రతి తలంపు కింద
*నీవు పొందే ప్రతి అనుభవం కింద
"భగవదిచ్ఛ" అనే పదం చేర్చు. ఇక ఏ ఘర్షణకు తావుండదు.
తల్లిదండ్రులు జన్మనిస్తారు,గురువులు బోధిస్తారు, అన్నదమ్ములు అదుపు జేస్తారు,అక్క చెల్లెళ్ళు ప్రేమనిస్తారు, భార్య , భర్త, పిల్లలు ఇలా అందరూ మన బ్రతుకు యానంలో ఒకో విధి నిర్వహిస్తారు, జీవిత నౌకకు తెలచాప అవుతారు.వీరిలో ఏ ఒక్కరు లేకపోయినా వారి లోటు మరొకరు తీర్చలేరు.
ఆదిదంపతులు* (రోజువారీ కధ ప్రాంజలి ప్రభ (8) dt. O8=08=2023ప్రాంజలి ప్రభ
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
దేవాలయంలో ఆంజనేయుడు భక్తుల ముందు వివరించారు
అనభ్యాసే విషం శాస్త్రం అజీర్ణే భోజనం విషం
దరిద్రస్య విషం గోష్ఠీ వృద్ధస్య తరుణీ విషం
శ్రద్ధగా నేర్వనట్టి శాస్త్రము విషమ్ము
తినగ జీర్ణము కాని భోజనము విషము
పేద కన్యులతో గోష్ఠి విషమె యగును
వృద్ధునకు తరుణవయస్క విషము సుమ్ము
ఒక యజ్ఞం జరుగుతోంది యజమానికి యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది.
ఆయన ఆశ్చర్యపోయాడు . అప్పుడు ఆయన భార్య చెప్పింది.
“నిన్న పొరపాటున యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాను. అదే ఈ రోజు బంగారు ముద్ద అయింది.” ఇంటి యజమాని పరీక్షించేందుకు తానూ యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాడు. మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది. ఈ వార్త ఆనోటా ఈ నోటా పాకింది. అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞ కుండంలో ఊసేశారు. బంగారు ముద్దలు పొందారు. ఆశకు అంతు లేదు, చితంగా వచ్చింది ఎప్పటి కైనా నీనుండి పోతుంది, నీది కాని దేది నీ దగ్గర నిలువలేదు అది ప్రతిఒక్కరు గుర్తించుకోవాలి.
మీరు ఊరికే కూర్చుంటే సఫలత మీ ఒడిలో వచ్చి పడదు। మీ మార్గం నిర్ణయించుకొని ధృఢ సంకల్పం ఏర్పరచుకొన్న తరువాత కార్యరూపంలో ప్రయత్నించాలి। అప్పుడు మీ సాఫల్యానికి కావలసినవన్నీ సమకూరుతాయి। ప్రతీదీ మిమ్మల్ని సరియైన దిశలో నడుపుతుంది। దైవ ప్రేరితమైన మీ సంకల్పబలమే మీ ప్రార్ధనకు సమాధానము। మీరు ఆ సంకల్పాన్ని వినియోగించినప్పుడు మీరు మీ ప్రార్ధనలకు సమాధానం వచ్చే మార్గాన్ని తెరుస్తున్నారు।
త్రికరణశుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును, వొకటి కోటిగుణితంబగు మార్గములుండఁగఁ ప్రయాసపడనేలా!!
ఒక్క రామకృష శర్మ గారు తప్ప.
“యజ్ఞం పవిత్రమైనది. యజ్ఞ కుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం. నా కర్తవ్యం. బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు” అన్నాడాయన.
ఊరు ఊరంతా ధనవంతులయ్యారు. ఒక్క రామకృష్ణ శర్మ తప్ప.
ఆయన భార్యకు ఇది నచ్చలేదు. “మనమూ ఉమ్మేద్దాం. బంగారం పొందేద్దాం”
అని నచ్చచెప్పింది. రామకృష్ణ ససేమిరా అన్నాడు. చివరికి ఆమె కోపంతో పుట్టింటికి పయనమైంది. ఆమెకు నచ్చచెబుతూ రామకృష్ణ శర్మ కూడా ఆమె వెనకే వెళ్లాడు. ఊరి పొలిమేర దాటాడో లేదో… ఊళ్లో పెద్దగా గొడవలు మొదలయ్యాయి. బంగారం ముద్దల పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇళ్లు కాలిపోతున్నై. మనుషులు చచ్చిపోతున్నారు. మొత్తం ఊరు ఊరు బూడిదైపోయింది. ఒక్కరూ మిగల్లేదు.
రామకృష్ణ , ఆయన భార్య తప్ప. అప్పుడే కలిపురుషుడు వారికి ఎదురు వచ్చాడు. “ఇన్నాళ్లూ నువ్వున్నావనే ఊరిని వదిలేశా. ఊరు ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా, నువ్వు, నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది. అందుకే నువ్వు ఊళ్లో ఉన్నంత సేపూ ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేయగానే నాపనిని నేను చేసి, ధర్మ హీనులను ధ్వంసంచేశాను.” అన్నాడు కలిపురుషుడు… …
పవిత్రత మరియు మౌనం నుండి వెలువడే మాటకు శక్తి వస్తుంది।
ఇతరులలోని మంచి అంతటినీ గ్రహించండి, మీదైన పద్ధతిలో దాన్ని మీలో లీనం చేసుకోండి, ఎవరిని గుడ్డిగా అనుసరించకండి।
ధర్మం తప్పని వాడు ఎప్పుడూ విజేతే…
ధర్మం ఆచరించే వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు అయినప్పుడు అది చూసి కొందరు మూర్ఖులు నవ్వుతూ హేళన చేస్తూ రక్షాసానందం పొందుతారు..
కానీ చివరకు ధర్మమే గెలుస్తుంది.
** సనాతన ధర్మస్య రక్షిత-రక్షితః 🙏
ఆదిదంపతులు* (రోజువారీ కధ ప్రాంజలి ప్రభ (9) dt. O9=08=2023ప్రాంజలి ప్రభ
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
దేవాలయంలో ఆంజనేయుడు భక్తుల ముందు వివరించారు
సజ్జనులతో సాంగత్యము కలిగిన క్షణములలో మనలో ఎన్నో మార్పులు రావచ్చును. ఎన్నో లోపములు సవరింపబడును. దోషములు తొలగింపబడును.
తాను స్వయముగా సరిచేసుకొనలేని, సవరించుకొనలేని దుస్థితినే శాపమందురు. ఇది పూర్వ దుష్కర్మ ఫలితము కనుక స్వయంకృషితో బాగుపడుటకు అవకాశం లేదు.
జూదమునకు అలవాటు పడినవాడు, వ్యభిచారాదులకు అలవాటు పడినవాడు స్వయంకృషితో భయటకు రాలేడు. ఇంకొకరు యత్నించినను చాలా వరకు ఆ జన్మకు లాభము లేదు.
ఒక్కొక్కప్పుడు ఎవరో మహానుభావుని దర్శించినపుడు అప్రయత్నముగా సంకల్పము మార్పు చెందును.
బ్రహ్మజ్ఞానంతో మోక్షాన్ని అనుభవించే సాధకుడు తాను పరబ్రహ్మ స్వరూపం గా మారి బ్రహ్మానందాన్ని పొందుతాడు. అదే బ్రహ్మీస్థితి. అదే అపరోక్షాను భూతి. ఈ విషయాన్ని అష్టావక్రుడు జనకుడితో…
‘యది దేహం పృథక్కృత్య చితి విశ్రామ్య తిష్ఠసి
అధునైవ సుఖీ శాన్తః బన్ధముక్తో భవిష్యసి’॥
‘దేహం కంటే ఆత్మ వేరని విచారించి, తెలుసుకుని. ఆత్మలోనే మనసును లగ్నం చేస్తే సుఖశాంతులను పొందవచ్చు. ఎంతవరకు ఈ పరస్పర అధ్యాస (మిథ్యా జ్ఞానం) నాశనం కాదో అంతవరకు జీవుడు బందీగానే ఉంటున్నాడు. అధ్యాస గ్రంథి ఎప్పుడు తొలగిపోతుందో ఆ క్షణమే జీవుడు ముక్తి పొందుతాడు’ అని పై శ్లోకానికి భావం.
మోక్షస్య న హి వాసో�సి గ్రామాన్తరమేవ వా
అజ్ఞాన హృదయ గ్రంథినాశో మోక్ష ఇతి స్మృతః॥
‘మోక్షమనేది లోకాంతరంలో ఉండేదో లేదా ఇంటి లోపలగాని, గ్రామంలోగాని ఉండేదో కాదు! మరెక్కడ ఉందది? అజ్ఞానంతో నిండిన కర్తృత్వ, భోక్తృత్వ భావన అనే చిత్‌జడ గ్రంథి నాశనమే ముక్తి’ అని తేల్చింది శివగీత. ఇక భగవద్గీత మోక్షసన్యాస యోగంలో ‘ఆత్మను యథార్థ రూపంలో తెలుసుకున్న వాడు వెంటనే మోక్షస్థితిని పొందుతాడు. సమస్త కర్మలను ఆచరిస్తున్నప్పటికీ, ఆత్మను శరణుపొందిన భక్తుడు శాశ్వతమైన, అవ్యయమైన మోక్షాన్ని అనుభ విస్తాడు’ అని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. అలాంటి నిర్వికార, నిరంజన మనోస్థితే మోక్షం. దానిని అనుభవించేవాడే ముముక్షువు. ఇలాంటివారిలో పాశ్చాత్యుల లో సోక్రటీస్, జోర్డానో బ్రూనో లాంటివారు కనిపించగా, భారతీయులలో సనాతన రుషులు మొదలుకుని ఆదిశంకరులు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షిలాంటివారు కోకొల్లలు ఉన్నారు.
....
ఆదిదంపతులు* (రోజువారీ కధ ప్రాంజలి ప్రభ (1)) dt. 10=08=2023ప్రాంజలి ప్రభ
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
దేవాలయంలో ఆంజనేయుడు భక్తుల ముందు వివరించారు
వరదా విఘ్నవినాయకా ప్రణతి సద్భక్తాళిచింతామణీ
స్థిరసంకల్పము కార్య సిధ్ధియు ప్రభూ చేకూరు గొల్వంగనిన్
గిరిజాపుత్రగణాధిపా సుముఖ నిన్కీర్తింతునిత్యంబునున్
కరుణన్ పాలన సేయూమా సత్సంకల్పార్ధసంధాయకా.
నీకు ఆ విజయం కావాలంటే వెళ్లే మార్గం నీకు అనుకూలంగా ఉండాలని లేదు మార్గానికి అనుకూలంగా నీవు మారాలి. లేదంటే ఆ ప్రయత్నాన్ని మానుకోవాలి, ఆ ప్రయత్నం చేసే ఇతరులను విమర్శించడం మానుకోవాలి, సమాజం యొక్క అసమానతలను అసమర్థతను సక్రమంగా అర్థం చేసుకున్న వాడే సమాజంలో విజయం సాధిస్తాడు.
ఆ విధంగా విజయం సాధించిన వాళ్ళ మీద పడి ఏడవడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు మన:శాంతి పోతుంది కదా!
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ దేవత కరుణా పూర్ణ మగు నేత్రాంత దర్శనము లేక అనగా కడ కంటి చూపు లేక సృష్ఠి స్థితి లయకార్యములు చేయ శక్తి లేని వారో అట్టి పాపనాశమను క్షేత్రమందు కల జగదేకమాత, సర్వ మంగళ, పరప్రకృతి, భగవతి, మహామాయ మూల ప్రకృతి అని కొనియాడ బడుచున్నదేవి మా పాపముల నాశము చేయు కాక.
శుద్ధమైన చైతన్య స్వభావాన్ని తెలుసుకుని, తార్కికమూ, సమత్వమూ కలిగి బుద్ధితో, ప్రపంచంమీద నిర్వేదభావం కలిగి, జనన మరణయుక్తమయిన సంసార చక్రం నుండి ముక్తుడయినవాడు మాత్రమే నిజమైన మార్గదర్శి కాగలడు.
*మన పాపాలకు కారణం మనం ఇతరులకన్నా ఉన్నతంగా ఉండాలనే స్వార్ధపు కోరికలే.*
*రాజహంస నీరు కలసిన పాలనుండి నీటిని వేరుచేసి పాలను మాత్రమే గ్రహిస్తుంది. ఇతర పక్షులు అలా చేయలేవు. భగవంతుడు మాయతో సమ్మిశ్రిత్రుడైనాడు. సామాన్యులు మాయను వేరుపరచి భగవంతుణ్ణి చూడలేరు. పరమ హంసలు మాత్రం మాయను విసర్జించి శుద్ధ బ్రహ్మాన్ని గ్రహించగలుగుతారు.*
ఇతర సాధకులతో ఘర్షణలు - స్త్రీ పురుషుల కామ ప్రవృత్తుల కెట్లో, అట్లే ఇతర సాధకులతో ఘర్షణలకు సైతం యోగసాధన యందు స్థానం లేదు. సామరస్యం, సద్భావం. సహనం, సమత, ఇవే సాధకులకు ఆ ఇతర సాధకుల తోడి సంబంధాలు దానికుండ వలసిన లక్షణాలు.
*పరమాత్మ అనే మహా సముద్రమే నా ఆత్మ అనే చిన్న బుడగ అయ్యింది. జననంలో తేలుతున్నా, మరణంలో అదృశ్యమైనా, విశ్వచైతన్యం అనే సాగరంలో నా జీవితం అనే బుడగ మరణించదు. నేను పరమాత్మ యొక్క అమరత్వ హృదయంలో సురక్షితంగా నున్న నాశరహిత చైతన్యాన్ని.*
****
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి