తోటకము స స స స .. 8
చెరిత మార్చను లేరులే చింత లున్న
కరుణ జూపులన్ని కథలు కానలేవు
తరువులన్ని నిత్య సుధలు తహతహలగు
కూరిమి నిడ లేవు, కవచ కుండలములు
వాహాంతరితం..త న భ భ న ల గ.....10
ఏమైనను కథభావమువింతగ మలుపుల గ
మ్యoమైన విధి నాటక పొందుల కళయిక సౌ
మ్యమ్మేను సమభావము నెంచుట సమయము సం
ఘంమ్మేను చరితమ్ముగు నేస్తము పిలుపగుటే
కాలమ్ము మనసు భాగ్యము కావ్యము కథలుగనే
జ్వాలా వెలుగులు రాజ్యము జాడ్యము జయముగనే
లీలా విధిగను సర్వము లాస్యము లహరిగనే
మాలా కధలుగ గమ్యము మార్గము తనువుగనే
సర్వార్ధ సహన మానస సాధ్యము విజయముగా
కార్యార్థ విలువ రాతలు కాలము మధురముగా
ప్రారబ్ధ మలుపు సాధన పాఠము సమయముగా
కారుణ్య తరుణ విద్యగ కామ్యము విధి సమమే
***
బాలకౌముది స జ భ భ స... 8
సమకూర్చ నెంచగా సమరమ్ముయు కధగా
విమలమ్ముగాను ఏవియు యన మలుపే
అమరత్వబుద్ధి సాక్షిగనెంచుట విధిగా
కమనీయ కాలమే కళలౌ సహనముగా
అలవోకగాను సామ గుణాన్విత నిధిగా
పలుకయ్య విద్య ప్రాభవమే నిజ నటనా
విలువే సుహాస విద్య కళే విజయముగా
అలుకే ఎరంగ లేక జయమ్ము సమముగా
సకలమ్ము నిత్యవాస సహాయ మగనులే
ఒకటయ్యి విశ్వమే ఒకరొక్క రగుటయే
నికరమ్ము ధర్మమై నిజహృద్య సమరమే
సుఖమిచ్చు సత్యమే సుమవిద్య సహనమే
***
ద్విపద,తే.గీ, ఆ.వె,తురగవృత్త గర్భస్థ సీసము
తురగము
న న న న స జ జ గ 15 యతి
న న న న స జ జ గ 15 యతి
సురుచి రసుమ ధుర సు లభము వరశోభి తంబు తెలుంగహో తరచి చూడ
మరువపు మొలకగ మణుల నిలయమై నిరంతరమున్ మనున్ రవముగ రవి
కిరణపు వెలుగయి కృతులను జయకేతనంబు విధంబుగా నలుదెసలను
వరలెను కనకపు మురుగుల వలె భాసురంబుగ రమ్యమై సంబరముగ
సురుచి రసుమ ధుర సు లభము వరశోభి
మరువపు మొలకగ మణుల నిలయమై
కిరణపు వెలుగయి కృతులను జయకేత
వరలెను కనకపు మురుగుల వలె భాసు
తే.గీ
తెలుగు భాషయనగ జిలుగుల వరుసలు
నలరు శాశ్వతముగ పలుకుల చెలిగను
విలసిత మగురీతి పిలుపు పిలుపులందు
నిలుచును నిజమిద్ది నిఖిల నెలవుగ ధర !!
ఆ.వె
తెలుగు భాషయనగ జిలుగుల వరుసలు
నలరు శాశ్వతముగ పలుకుల చెలి
విలసిత మగురీతి పిలుపు పిలుపులందు
నిలుచును నిజమిద్ది నిఖిల నెలవు!!
ద్విపద..
తెలుగు భాషయనగ జిలుగుల వరుస
నలరు శాశ్వతముగ పలుకుల చెలిగ
విలసిత మగురీతి పిలుపు పిలుపుల
నిలుచును నిజమిద్ది నిఖిల నెలవుగ!!-31
***
కామలా: న న మ య లగ 7 వ అక్షరం యతి.
అహము పెరుగ నా పూబోడులన్ దాడితో
నహరహముల నాభీలమ్ములన్ గూర్చగా
సహనము విడి చక్కంజేయగా వారలన్ ,
మహిళల కవమానమ్ముల్ తొలంగున్ ధృతిన్! .......
తలపు తలుపు తత్త్వమ్మేనె తాపత్రయం
వలపు తలపు వాత్సాయమ్మె కామమ్ముగా
వలలు తలపు వ్యాధుల్లాగా మారేనులే
పలక పిలుపు పండించే ఫలమ్మేనులే
చిరునగవులు చిన్మాయే సహాయం నేస్తం
తరుణసొగసు తత్వమ్మే సుఖమ్మే వైనం
కరుణ వలపు కర్తవ్యం సుదీప్తీ జాడ్యం
మరులు గొలుపు మాహత్యం సుమంత్రం ధర్మం
****
చిత్రం (చంచలా): ర జ ర జ ర ల, 9 వ అక్షరం యతి.
ప్రేమ పేరు తోడ స్త్రీల వెంబడించి దాడిచేయు
రోమియోల బట్టి ప్రేమ రోగమున్ దహింప జేయు
నీమముల్ వహించు నట్లు నేటి చట్టముల్ యొనర్చి
కామ మన్న దాని జంప కాంత మోద మందు నంత! ..
ప్రేమ పొంద యుక్త మౌను వెంబడించు కన్నుచూపు
నీమముల్ వహించి నట్లు నేటి తల్లి తండ్రి మాట
కామ మైన ప్రేమ వెంట కామ్య మాన ముంచ గల్గు
ప్రేమ యున్న సంఘ నీతి వెంబ డించు కాంతి నెంచ
పల్లవించువేళ ప్రేమ పాఠమున్న మోద మొందు
చల్లనైన వేళ విద్య చక్కజేయు నిర్మలమ్ము
కల్ల లాడు వారి చెంత కక్ష తోడు నీడ గుండు
యెల్లరూమహీన శాంతి యాట ప్రేమ యేను
****
"వాన్మయూర్ -- भ ज स न ग ग ..14/9..
--
భాస్కరుని లీలసమ భావమును జూపే
తస్కరుని ఆట నిధి వేటె మనసు శ్రే
యస్కర ఫలాప్తి గనువిద్య విధిగా శ్రే
యస్కరముగా సమయ త్రప్తి సహనమ్మే
నీ కృప జనించె గమనీ సమత భావం
నీ కళలు మేలు జయమే కృపయ జీవమ్
సోకగను వీధరకు సూటిగన మార్గం
హేకమల నాధ సహ నీభువిగతీర్పే
ఆదియు సమంజశముగామనసు నేలే
కాదనియు జెప్పి సహకారమును తెల్పే
బేధ మవకుండ సమభావమును జూపే
వాదమును చేయకుయు వాసమున నుంచే
***
పంచ చామరము.. జ ర జర జ గ..10 యతి
స్వతంత్ర దేశమందునన్ ప్రశాంతినేల ఏది రా
స్వతంత్ర పౌరులై అనంత సౌఖ్యమై చలించె రా
గతంబు కాలమే వినోదకాంతి నౌను సోద రా
స్వతంత్ర లక్ష్యమే మనోవిశాల భావ మేది రా
మితమ్ము ఏది ఎక్కడైన మేలు కాన రాదు రా
సతంబు ప్రేమపాశమేను స్వేచ్ఛయేలి కేది రా
అతీత భావమేను ఏలు ఆజ్ఞయే యి దేమి రా
హితమ్ము మాటలేవి కాన హీన జీవమౌను రా
వితండ వాదనే సుఖాల వింత పోకడౌను రా
మతాల నీడనే వివాదమాయ మేలు ఏల రా
గతమ్ము లీలలే సహాయ గమ్యమై సుఖమ్ము రా
పతాక మే మనస్సు దేశ బంధమే స్వధర్మ మై
*****
ఆ పాదమస్తక భాగ్య భారత మాత వర్ణన గేయము (నవ సూర్యగణాలు.. యతి.5)
ధరణి దివ్య సుందరమ్ము ధర్మ చరిత సర్వ జనుల తత్త్వ మే
భరత సుగుణ భరిత చరిత భవ్య దివ్య నవ్య భావ సత్య మే
భరత మాత పాదములకు బంధ వందనంబు గాను నిత్య మే
చరిత మేను యిదియు ధరణి జయము పొంద నెంచ గలుగు ధర్మ మే
IIధరణి
సస్య శ్యామలమ్ము రూప సమర సుఖ నిత్య సుందరత్వమే
విశ్వ పవిత్ర పావనమ్ము విజయ పుణ్య భాగ్య చరిత బంధమే
రస్య సుందర కల భావ రమ్య హిమ విశాల సుందరత్వమే
విశ్వ భవ్య మస్తకాంచ వినయ రజిత వేణి విద్య లక్ష్యమే
IIధరణిII
పావన పద పద్మ పాణి ప్రాస పూర్వ పశ్చిమాంగ దివ్యమే
బావ శోభితా సముద్ర భాగ్య నూపురమ్ము వేణి కాలమే
దేవదేవి దేశ భక్త దీన రక్ష పూజితమ్ము కార్యమే
భవిత నిచ్చె ధీర పుణ్య భరత భూమి మాతృ హృదయ తత్త్వమే
IIధరణిII
.....
విభిన్నచందస్సులలో నేను వ్రాసిన సంపుటి లోని పద్యాలలో రెండు:
అంశం: మహిళ
(సామాజికాంశము - 3)
వితానితా
న న న ర ల గ. 7 వ అక్షరం యతి.
అతివల పయి ననుచితమ్ము జూప బో
వ తగదనుచు పసిడి బాలురందరన్
బ్రతి గృహమున వరుసబోధ సేయ వే
గ, తగు విధముగ, యొన కూడు సిద్ధులున్! .............................1
మహిళల కళ మనసు రమ్యతే గతీ
సహనము కళ సమము సాధ్యతే విదీ
అహము వదలి అలక చూపులే సుధీ
మహిమ వెలుగు మమత మౌనమే మదీ..2
చిరునగవుల చెలిత సర్వ సౌఖ్యమై
తరుణము సుఖతపము మోక్ష మార్గమై
అరుణ వెలుగు లహరి దేహ తృప్తియే
కరుణ నయన కళలు భార్య దాహమే..3
***
మనవిశ్రామ
భ భ భ భ భ న య, 13 వ అక్షరం యతి.
స్త్రీల తపస్సుయె నిత్యశుభోదయ చిత్తము సుమధురమాయే
పాలన పోషణ నేస్తముగా విధి పక్కగ పడకకు శోభే
చాలని జీతము నైనను చక్కగ జే యుచు కధలను తెల్పే
వేళకు నిద్రయు మైదున సంతస వీలును తెలిపెడి తోడున్....1
స్త్రీలు మనోభవ అర్ధము శాంతికి చిత్తము సుఖముకు తోడున్
లీలగ వేడిగ చల్లగ దేహము నిర్మల మగుటయు దాహమ్
కాలము బట్టియు మాటను తట్టియు కట్టడి మదిగను జేయున్
బేలయనేనని తక్కువ ఎక్కువ భీకర పలుకులు ఏలన్..2
స్త్రీలకు గౌరవ మివ్వక నేపెడి చిత్తము గలిగిన వారల్
పాలకు లైనను వారల చుట్టము పక్కము హితవరి యైనన్
గూలక తప్పదు శిక్షను పొందుచు ఘోరమగు వ్యథల తోడన్
కాలము చేయగ క్రుళ్ళుచు నేడ్చుచు, కట్టడి దయివమె జేయున్! .........3
****
రాజహంస వృత్తం....త త త త త త త త గ....13 యతి
శ్రీరామ నీనామ మెంతో రుచీవిధి శ్రీ రాగమై ప్రేమ మోహమ్ము ధర్మమ్ముగా
శ్రీ రాగమే జేయగా నాశ భావమ్ము శ్రీకార తత్వమ్ము మార్గమ్ము సత్యమ్ముగా
శ్రీరంజితమ్మేను దేహమ్ము నేపొంద శ్రీలక్ష్య మయ్యే ప్రమోదంబు కాలమ్ముగా
శ్రీరమ్యతా శాంతి సౌభాగ్య మొందేటి శ్రీ దీక్ష శ్రీశ్రావ్య శ్రీ దేవ శ్రీలక్ష్మి నీవేనురా
సంపాదనే ముఖ్య మంటూ సముద్రాన్ని, సందేహమే తెల్ప కుండాను దాటుకుంటూ
పాపాలు ఏమైన ముక్కూమొ గమ్మేను భాషేను రానాట్టి దేశమ్ము కష్టాలుగా
శాపాలు వెన్నంటి పీల్చేది గాలేలె శాతమ్ము ఆహారమే భూమి జీవమ్ముగా
కోపాలు బంధుత్వ ప్రేమమ్ము బంధాలు మోహప్రయాణమ్ము అందర్ని మార్చేనుగా
శ్రీ సుందరాకార! శ్రీకృష్ణ! దేవేరి శ్రీలక్ష్మితో జేరి రావయ్య శీఘ్రమ్ము గా
శ్రీ సేవలే జేయగా నాశతో వేచి శ్రీ పారిజాతాలనే తెచ్చి నిల్చేనురా
నీ సోయగమ్ముల్ కనంగా ప్రమోదంబునే పొంది నీనామ గానమ్ము సేసేనురా
నా సంకటమ్ముల్ సమా ళించ లేనింక నారాయణా! శ్రీహరీ!బ్రోవ రావేలరా!!
*****
షోడశోత్ఫలమాలిక.. ఉత్పలమాల
కాలము లెన్ని మారినను కన్నసుఖాలకు పూజలేల యీ
పాలన వల్లనేల? నుపకారపు వేళలు తీర్చు నేల? ఆ
గాలి సమర్ధతైన విధి గాయము లేకయు పొంత నేల? యీ
గోలల మత్తులేల? వడ గాలిగ చేరెడి శబ్ద మేల? డం
బాలను పల్కు లేల? సరి మార్గము చూపు నసూయ మేల? పం
దాలుగ పొంత నేల? విధి దాహము చూపియు గీతమేల? సా
గే లయ లీల లేల? విరి గాజులు కోరెది బుద్ధి లేల? సం
చాలన ప్రశ్న లేల? గృహ జాడ్య మేల? గీ
తాలయ మున్న వేళ సహతాప మేల? వివాద మేళన్
శీలము నెంచ కాలమగు శీగ్రము నెంచుట వాదులేల? యీ
కాలపు కోప మేల? కలకాలము రక్షగ నుండ లీల వా
చాలపు కొల్వులేల? పలు జ్వాలలు మధ్య వసూలు చేయు టే
***
ద్వాదశపాదోత్పలమాలిక
రచన. మల్లాప్రగడ రామకృష్ణ
కాలపు చల్లగాలవియె కానన కొండల మధ్యబుట్టి సం
చాలము చేయగన్ మనిషి ఛాయలు మారుచు తోడు నీడగా
లీలలు రూపయవ్వనము లేతగ నుండియు ప్రేమ పాశమున్
ఏలిక కోరదాహమును ఎన్నడు గుర్తుగ సంతసమ్ముగన్
కాలము బట్టిదారులను కామిత బుద్ధికి యాత్ర జేయగన్
గాలము కేనుచిక్కి గతి గమ్యము గుఱ్ఱపు వేగమాయనే
శీలము రీతిభట్టిగొని శీఘ్రము గా తన కాలచక్రమున్
నాలము జారునీరువలె నాణ్యత సారధి వెడ్కనేగ యా
మూలము తెల్పగల్గుటయు ముందర కాళ్ళకు బంధమేయగున్
మాలల మాదిరే కదిలె మానస మందు చరించసాగి న
మ్మా లయ సాక్షిగా సహన మార్గము నెంచియు దివ్యవేళలన్
బేలకు బంధు మిత్రుడుగ బీరము లాడక పెద్ద చిన్నలన్
లేలుట పుణ్యకార్య మగు లీలగ భావము సంబరమ్ముగన్
చేలున కంకి యూగువిధి చింతను మాపుచు సంప్రదాయ స
త్కాలపు వేష భాషలగు తాళము వేసియు శ్రద్ధ మీరగన్
కీలక లక్ష్యమంతయును తీరిక వోలెడి తీర్చ గల్గుటన్
చాలని దంటులేదుకళ జాడ్యము మారిన బుద్ధి మాధ్యమున్
వేళలు నెంచగల్గుటయు వీగిన చోద్యము తప్పగుండుటే
ఆలికి ఆటపట్టుగను ఆశలు రేపియు వాదులాటలన్
మాలిని మాటతప్పకయు మానస పందిరి ఇచ్చిపుచ్చుటన్
మేలును కోరి బాధ్యతగను మోక్షము చూపియు సేవభావమున్
వీలుగ చిత్ర మంతయును వీశము నాపక జూపు విద్యలన్
కాలము నెంచి బుద్దిగను కమ్మని సౌక్యము భర్తకిచ్చియిన్
హేళన జెరియున్నను సహేతుగనుండెడి శాంతి దూతయే
***
బారపు చర్య లేల?సరివారల మీద నసూయ లేల? పం
దేరపు చిందు లేల ?తెర తీయగ లేనవి నీతు లేల?శృం
గారపు లీల లేల?పరకామణి ద్రొబ్బుట కాశ లేల?సం
సారపు చిక్కు లేల?గ్రహ శాంతి నివారణ చర్య లేల? స్వీ
కారము లేని వేళ సహకారము లేల? వివా హవేళలన్
గోరెడి కట్న కానుకల గోలలకై తెగ వాదు లేల?నో
రూరెడి కొల్వు లేల?తగ నుబ్బి భజించు పొగడ్త లేల?బే
జారు ఖరీధు లేల? పలు సారులు పెంచి వసూ లు చేయు మో
టారు విలాస యాన శక టాలకు యింధన ఖర్చు లేల ?సం
చారపు దొంగ సాధువుల సాధన దీక్షల కాస్తు లేల !ఊ
రూర ప్రచార మెన్నికల హోరు నబద్దపు బాస లేల జో
హారులు భారతాంబ కివె హాయిని గొల్పని చింత లెన్నియో?
****
విశాలాంతిక - త/త/త/గ UUI UUI - UUIU ...10 పంక్తి 293
ఏమాయ కమ్మింది - మాపైన మే
మేమీ చె సి యున్న - ఇంతా మనో
మార్గమ్ములే ప్రశ్న - లయ్యెనుగా
ఇంతెందు కాలోచనా అందురే
కాలమ్ము మాయగా చుడాలిగా
పంతమ్ము పోకుమా అద్రుష్టమే
ఎవ్వారె మన్నాను మౌనంగ ఉం
డీ దేశ కష్టమ్ము భావించియే
శుబ్రమ్ము చేస్తేను ఆరోగ్యమే
ఏరోగ మూ రాదు భయ్యమ్ములే
కుండంగ జీవించు ఆనందమే
పంచియు ఆహ్లాద మే పొందుటే
ఉద్వేగ ఉద్యోగ సేవార్ధమ్ము
ఎందెందు అందందే ఆరోగ్యమ్ము
బిడ్డల్తొ ఉండేది సౌకర్యమే
ఏరోగ మీదాక రాకుండులే
ఏకష్టమూ రాక సౌఖ్యమ్ములే
ఎంచేసు యున్నానొ ఈమాయలో
***
- కాంత -7 UUIIUIIUIIU
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
జ్ఞానేచ్ఛ కళా నిజ వైభవమే
మానాన్కి మదీయ మరో మలుపే
విజ్ఞానపు కాలువ శోభలుగా
అజ్ఞానపు ఆశలు తొల్గుటయే
విన్న వినకా సవినంగ సహా
యాన్నీ తెలిపేను వయస్సు సదా
మొనంగ మనస్సు ను ఉంచెనులే
నేనేది వచించిన రాగములే
విద్యా వినయం సహనంతొ సహా
యం దాన గుణం కదలల్లెదులే
వేదార్ధ మనో వచనం తరుణం
పాదాంకితమం తలపే సకలం
భేదానికి చింతను చూపలేదు
మోదానికి పొంగియు ఉండలేదు
క్రోధానికి లొంగియు యుండలేదు
కాలానికి ఒగ్గియు ఉండెనులే
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
జ్ఞానేచ్ఛ కళా నిజ వైభవమే
మానాన్కి మదీయ మరో మలుపే
విజ్ఞానపు కాలువ శోభలుగా
అజ్ఞానపు ఆశలు తొల్గుటయే
విన్న వినకా సవినంగ సహా
యాన్నీ తెలిపేను వయస్సు సదా
మొనంగ మనస్సు ను ఉంచెనులే
నేనేది వచించిన రాగములే
విద్యా వినయం సహనంతొ సహా
యం దాన గుణం కదలల్లెదులే
వేదార్ధ మనో వచనం తరుణం
పాదాంకితమం తలపే సకలం
భేదానికి చింతను చూపలేదు
మోదానికి పొంగియు ఉండలేదు
క్రోధానికి లొంగియు యుండలేదు
కాలానికి ఒగ్గియు ఉండెనులే
***
తోదక వృత్తము న జ జ య .. 8 యతి 12/8 (III IUI IUI IUU )
కరుణ దయాగుణ కాలము యంతా
తరుణము యే సమతాలయ మంతా
తరువు లలో చరితం సమభావం
అరుపులలో కధనం సుఖభావం
సుఖమును దారియు సూదిగ మారే
నఖశిఖ పర్యము నాదిగ మారే
శిఖరము దారియు శాంతము కోరే
నఖమున అందము నాణ్యత కోరే
మనకు సుఖాలు సమానము కాదా
మనకు విశేష విమోచన కాదా
మనకు అనేక ఉపాయములేగా
మనకు సకాల సమమ్మున గాథే
***
తోటక వృత్తము ... 4 సుగుణాలు 12/9
శరణం తలపే మన .. సంత కళే
తరుణం తమకం విదితం న కళే
అరుణోదయమే తనువంత కళే
చరణం కరుణాలయమే ను కళే
bha bha bhaa ga ga
కాలము గోప్యము కానుక ఏగా
మల్లిక వాసన మత్తు న ఏగా
గోలలు చేయుట కొత్తగ ఏగా
పెల్లికి సందడి మేళము ఏగా
వెల్గు ల దీపము వేకువ యేగా
వేల్పుల పండుగ వైనము యేగా
కొల్వు ల దేవుడు గొప్పను యేగా
పిల్లలు దేవుడు బిడ్డలు యేగా
చిల్లర మాటలు చెప్పక చెప్పే
చల్లని నీడలు చెప్పక వచ్చే
వచ్చిన వారితొ వాదన వద్దే
నచ్చిన వారితొ నమ్మక మంచూ
సాధన చేయుట సత్యము వల్లే
శోధన జీవి గ నిత్యము వల్లే
వ్యాధికి మందులు వైద్యము వల్లే
సంధికి మూలము సాక్షుల వల్లే
పాటకు ఊపిరి పొందిక నౌతా
మాటతొ ఆశలు మాయము చేస్తా
ఆటకు తోడుగ ఆడుతు ఉంటా
వేటకు నిన్నును వాడుతు ఉంటా
నిద్దుర లోనను నీడగ ఉంటా
సర్దుకు పోదము సందడి గుంటా
మొద్దుగ ఉండను ముద్దుగ ఉంటా
హద్దులు వద్దును హత్తుకు ఉంటా
అక్షర వేదము ఆర్తిగ ఉంటా
అక్షయ తత్వము అద్భుత మంటా
సాక్షిగ నీకును సౌమ్యము గుంటా
కక్షలు లేకయు శిక్షణ ఇస్తా
ఆనతి నీయవె నాకును లక్ష్మీ
వాసిగ నిన్నును వేడితి లక్ష్మీ
సేవిత నీకును సాధన లక్ష్మీ
శోధన చేసితి సాక్షిగ లక్ష్మీ
రోగము వచ్చియు రాగము పల్కే
మందులు వాడక మోనము వీడే
జీవిత మంతయు జాతర గుండే
చెప్పిన మాటలు చేయక ఉండే
నేనును ఆశతొ నీకును తెచ్చా
నీవును ప్రేమతొ నాకును ఇవ్వూ
చేసిన తప్పును చూడక తెచ్చా
తప్పులు ఎంచక నాకును ఇవ్వూ
చేతుల నుండియు జారెను ధర్మం
బాధలు తోనునె మూలిగె వైనం
పెద్దలు చెప్పిన పుట్టిన నైజం
పుణ్యము చేసిన పాపపు రోగం
--(())--
విశాలాంతిక - త/త/త/గ UUI UUI - UUIU ...10 పంక్తి 293
ఏమాయ కమ్మింది - మాపైన మే
మేమీ చె సి యున్న - ఇంతా మనో
మార్గమ్ములే ప్రశ్న - లయ్యెనుగా
ఇంతెందు కాలోచనా అందురే
కాలమ్ము మాయగా చుడాలిగా
పంతమ్ము పోకుమా అద్రుష్టమే
ఎవ్వారె మన్నాను మౌనంగ ఉం
డీ దేశ కష్టమ్ము భావించియే
శుబ్రమ్ము చేస్తేను ఆరోగ్యమే
ఏరోగ మూ రాదు భయ్యమ్ములే
కుండంగ జీవించు ఆనందమే
పంచియు ఆహ్లాద మే పొందుటే
ఉద్వేగ ఉద్యోగ సేవార్ధమ్ము
ఎందెందు అందందే ఆరోగ్యమ్ము
బిడ్డల్తొ ఉండేది సౌకర్యమే
ఏరోగ మీదాక రాకుండులే
ఏకష్టమూ రాక సౌఖ్యమ్ములే
ఎంచేసు యున్నానొ ఈమాయలో
--(())--
లోక సూక్తులు (ఛందస్సు -1
U I U U I U - I U U U I I I I U
నిత్య పారాయణం - మనో లోకానికి పయణం
సత్య వాదాయణం - ఊర్ధ్వ లోకాలికి పయణం
విద్య భోదాయణం - శాంతి లొకాలికి పయణం
మిధ్య ప్రేమాయణం - అంధ లోకానికి పయణం
U I U U U U i U i U I
భార్య మోహంలో జీవితాన్ని చూడు
వీర్య వృద్దిత్తో భాధ్యతల్ని చూడు
కార్య సాధకుడిగా పంచుకొని చూడు
ఆర్య పుత్రునిగా ఆదుకుంటూ ఉండు
నిద్రలో కూడా ఉనికి మరిచి ఉండకు
భద్రము అని లోభికి అన్నగా ఉండకు
రంధ్రము కోసం మూషికములా మారకు
ఛిద్రము అని తక్కువచేసి పలుకకు
అబద్ధము ఆడితే అతికి నట్లు ఉండు
నిబద్దత మరచి నీవు ప్రవర్తించకుండు
సమర్ధత గమనించి మాటలాడుచుండు
నీ స్వార్ధము కొరకు భాధ పెట్టక ఉండు
***
విశాలాంతిక - త/త/త/గ UUI UUI - UUIU 10 పంక్తి 293
ప్రాణమ్ము నిల్పంగ - రావేలరా
గానమ్ము గొంతందుఁ - గల్గించరా
మౌనమ్ముఁ జాలించి - మాటాడరా
యానంద పీయూష - మందించరా -
వేదాలు ఛద్వంగ - బాదేలరా
శోధించి సాధించు - బాదేలరా
సౌర్యమ్ము ధైర్యమ్ము - నీదేనురా
న్యాయమ్ము ధర్మమ్ము - నీవెంటరా
లీలల్ గనన్ రమ్ము - లీలామయా
మాలల్ గొనన్ రమ్ము - మాలీ హరీ
తేలించ రమ్మంటిఁ - దెప్పన్ ననున్
ఆలించి పాలించు - మాశీస్సుతో -
--((**))--
ఝాటల - స/త/జ/గగ IIU UU - IIUI UU
11 త్రిష్టుప్పు 356 ఛందస్సు ( 7 )
శిలగా నుండన్ - జెడు కోప మో నా
చెలికాఁడా నె-చ్చెలిపైన నేలా
కలలోఁ గూడా - కరుణించవా యి
ట్లిలపై నుండన్ - హితమౌనె నాకున్
టలనమ్మా ఝా-టలమందు నీకై
చలిలో నుంటిన్ - స్మరియించుచుంటిన్
లలితోఁ బేరిన్ - లలితప్రియాంగాఁ
దొలి ముద్దీయన్ - దురితమ్ము రావా
(టలనము=తాత్సారము చేయుట)
మనసా వాచా - మహిపైన నిన్నే
వినుమా చేరన్ - బ్రియ దల్చుచుంటిన్
దినముల్ రాత్రుల్ - తిరుగాడుచుండున్
మనమో నీకై - మఱువంగ నౌనా
యమునా తీర - మ్మల సంధ్యవేళన్
రమణుల్ బాడన్ - రసవంతమయ్యెన్
గమనీయమ్మై - కమలాక్షుఁ డూఁదన్
రమణీయ మ్మా - రసరాసకేళుల్
జలజాక్షీ నన్ - జదివించు తల్లీ
పలు ఛందమ్ముల్ - వడి వ్రాయ నెంతున్
మలయై నాకున్ - మహి నుండు మమ్మా
వెలుఁగుల్ నీవై - వెలయంగ రమ్మా తప్త -
--((**))--
UUIU IUUI ఛందస్సు (6 )
మౌన మిదే గమ్య
భావమై దివ్య దీపమై
ప్రేమమ్ముతో సదా నాకు
ధర్మమై నీతి మార్గమే
రావేలకో ప్రియా రమ్య
రావమై రత్నదీపమై
జీవమ్ముతో సదా నాకుఁ
జేవయై నవ్య తేజమై
దేవీ మనస్సులోఁ బూల
తీవెగాఁ బాలపుంతగా
నావైపు చూడవా తేలు
నావగాఁ బిల్చు త్రోవగా
--((***))--
మధువృష్టి - ర/స/ర/జ/జ/గ UIU IIU UI UIU IIU IU
16 అష్టి ౨౩౧౯౫
ప్రార్ధనే వయసంతా
మనోమయం చెయుటే గదా
కోరికే మనసంతా
తపోమయం చేయుటే కదా
మానసంబున దివ్యాను
భావమే నిను పోల్చగా
నీ గుణాలతొ సాహిత్య
సేవలే రమణీ యమే
కాలమే మనలో మాయ
కూర్పులే తలపే కదా
ప్రేమ రాగములే నాలొ
కొత్తగా మెదిలే కలే
నవ్వులే సమయం అంత
పువ్వులే విచ్చెనే కదా
సంబరం సమరం కొంత
సంతసం సుఖమే కదా
పండుగే సహజం చెప్పు
కోవటం సంబరం కదా
పల్కటం సమరం కొంత
జీవితం సుఖమే కదా
--((***))--
IIUII UUI - IIUII UI U
చరణమ్ముల నీపద్మ
చరణమ్ములఁ గొల్తురా
హరియంచిల నేనెప్డు
హరుసమ్మున దల్తురా
తరుణమ్ములు నీవంతు
తరుణమ్ములు చూపరా
మదితెల్పెద నేనెప్డు
మనసమ్మున దల్తురా
సరసమ్ముగ నాడవా
సరసీరుహ నేత్రుఁడా
వరమీయఁగ రారామ్ము
వరదా పరమాత్ముఁడా
సమయమ్ముగ ఆడగా
సమయాసమ నేత్రుడా
మనసీయగ రావమ్ము
సమయా పరమాత్ముడా
--((**))--
ఛందస్సు (3)
IU UII UIU - IU UII UIU
సమానమైన బంధమ్మా
సమానమైన దేహమ్మా
సమానమైన కాలమ్మా
సమానమైన తాప్పమ్మా
సమానమైన మానమ్మూ
సమానమైన వాదమ్మూ
సమానమైన రోగమ్మూ
సమానమైన వేదమ్మూ
అనంతమైన విశ్వమ్మా
అనంతమైన సృష్టియా
అనంతమైన చిత్రమ్మా
అనూహ్యమైన యందమా
అనంతమైన గానమ్మా
అనేకమైన రాగమా
అనంతమైన జీవమా
అనాదియైన భావమా
--((***))--
లెదురుగా ఛందస్సు ( 2 )
UI UI UI UI - UI UI II UI
కాకి ముక్కు దొండ పండు - చూసె యంత లెదురుగా
సాలు లేక సూలు లేక - తల్లి బాధ లెదురుగా
పాలు లేక బోసిపోయె - పృథ్వి మాత లెదురుగాఁ
పూలు లేక బోసిపోయె - భూమిజమ్ము లెదురుగాఁ
జాల శీతలమ్ము గాలి - సర్వమయ్యె జడముగాఁ
కాల మాయ లమ్మ గాలి - పర్వమయ్యె జడముగా
దేశ మాత బిడ్డ లంత - పండు గాయె జడముగా
సర్వ శక్తి ధార పోసె - నిత్య మంది జడముగా
బూలకారు రాదు గాదె - భూమిపైన నెలలకున్
సామ దాన బేధ మందు - నిత్య బత్కు పలుకులన్
వచ్చె పోయె ఒప్పు తప్పు - మంచి చేసె చినుకులన్
తల్లి తండ్రి గుర్వు మాట - నిత్య సత్య చదువులున్
బూలు పూచెఁ గాని నేఁడు - పొంగు నాదు మనసులో
ఆలి పిల్చె చూసి నాను - మంచి చేసె మనసుతో
తప్పు లేదు మాట లోన - ఒప్పు కొంటి మనసుతో
విన్న వారు చెప్పు వారు - లేరు లేరు మనసుతో
అందమైన చందమామ - యాకసాన వెలిఁగెరా
అందమైన కల్వ భామ - చెర్వు లోన వెలిఁగెరా
అందమైన తోట లోన - పువ్వు లన్ని వెలిఁగెరా
అందమైన మౌము లోన - మచ్చ లన్ని వెలిఁగెరా
వంద తీవలందుఁ బూలు - వాయి విప్పి యలరెఁగా
మందమైన మారుతమ్ము - మై రమించఁ గదలెఁగా
నందసూనుఁ డేల రాఁడు - నన్ను జూడ నగవులన్
చుప్ప నాతి మూతి నేడు - బాధ పెట్టె బతుకుటన్
--((***))--
deviram123 (1)
సారంగ - త/త/త/త UUI UUI - UUI UUI
12 జగతి 2341
ప్రాయమ్ము సౌఖ్యమ్ము - ప్రారబ్ధ ప్రాబల్య
మే సామ దానమ్ము - భేధమ్ము ప్రోత్సాహ
మే ప్రేమ సౌలభ్య - సౌందర్య సాహిత్య
మే దేశ కాలమ్ము - ఆదర్శ జీవమ్మె
దేహమ్ము తో సేవ - గానమ్ము తో పాట
పాణమ్ముతో ఆట- బంధమ్ముతో పొందు
ధ్యానమ్ము తో చిందు - బాధ్యతతో విందు
భావమ్ము తో కోర్క - భాగ్యమ్ముతో పిల్పు
లీలల్ వినోదమ్ము - లీలల్ ప్రమోదమ్ము
లీలాల్ విషాదమ్ము - లీలల్ విభేదమ్ము
లీలల్ విశాలమ్ము - లీలల్ సమానమ్ము
లీలల్ సకాలమ్ము - లీలల్ భయానమ్ము
చాలించు మాయాట - దీవించు ఈపూట
పాడింది ఓ పాట - మెచ్చింది ఓ ఆట
కోరింది ఓ కోర్క - తెచ్చింది ఓ మార్పు
ఆనందమే తీర్పు - ఆదర్శమే ఓర్పు
--((***))--
సులేఖా ** ( నూతన వృత్తము )
గణములు - న,న,మ,స,స,గగ
యతి - 10
అరవిరిసిన మందారం బలరించదు డెందాలన్
విరిసినదది పుష్పమ్మే ప్రియమౌ కన నందాలన్
సరసమయిన వాక్యాలన్ సహితంబగు భావాలన్
బరుగులిడెడి పద్యమ్మే ప్రముదంబగు నారీతిన్
కలువకనుల శ్రీవాణీ కవితామయి వాగ్దేవీ
తెలిపి యెపుడు నీ ప్రేమన్ దియనైనది వాగ్ధారన్
బలుకులిడుచు ఛందంబున్ బలికించిన మోదమ్మౌ
కలము సలుప నాట్యాలన్ గనువిందుగ నేనాఁడున్
వివిధగతుల నందమ్మై వినవిందయి పాడంగాఁ
గవులు బుధులు మెచ్చంగా గరిమంబగు వాక్యంబున్
గవనములనుఁ జెప్పంగాఁ గలమియ్యది ధన్యంబౌ
యవనికయిన శ్రేయంబై యవి నిత్యము బంచంగా
కనఁ బదములు స్వచ్ఛంబై కడు దృప్తినిఁ గూర్చంగా
మనము గదుపు భావంబై మహిమెచ్చెడి సత్యంబై
యనవరతము పొంగంగా నభివందనలే నమ్మా
వనజనయన నీకైనన్ వసుధాస్థలిపై నంతన్
ప్రియ జననివి నీవమ్మా ప్రియభాషిణి వీవమ్మా
నయముగ నతిఁ గైకొమ్మా నను నిత్యముఁ బ్రోవమ్మా
జయమె సతము నాకిమ్మా సకలార్థద మాయమ్మా
శ్రియమగునటు చూడమ్మా శివ,సుందర సత్యమ్మా
***
స్రగ్విణి / కామావతార -
92. స్రగ్విణి - ర/ర/ర/ర UIU UIU - UIU UIU
12 జగతి 1171
తూర్పునా ఊడ్చెనే - సుబ్రమే చేసెనే
నీటినీ చల్లెనే - ముగ్గులే పెట్టెనే
రంగులే దిద్దేనే - పువ్వులే చల్లెనే ఓర్పుతో సంతసం - నిత్యధర్మాములే రమ్ము కామావతా - రా ప్రకాశమ్ముగానిమ్ము ప్రేమమ్ముతో -నిప్డు ప్రీతిన్ సదా తమ్మి నీమోము కెం - దమ్మి నీ రూపమే చిమ్ము సోమమ్ము రం - జిల్ల సోముండగా --(())--
93. భ/జ/స/గ UIII UIII UU యతి లేదు
*స్త్రీ తత్త్వం
చాలునులె లీలలను నీతో
మేలునులె నిన్నుగన నెంతో
తేలునులె భాద్యతలు ఎంతో
కాలునులె నీ పలుకు నాకూ
వల్లదను మాటలును వద్దే
చల్లదన మేమనకు ముద్దే
కుల్లుతన మేఎపుడు కద్దే
జల్లులుఏకం చెయును కాదా
మాలికలు పూజలకు కాదా
యాలకుల పాయసము కాదా
యేలికల జీవితము కాదా
మల్లికను వేచినది నీకై
కన్నులలొ కాంతులను చూపే
కన్నకలలే అగుట చూసే
నవ్వులతొ పువ్వులను చూపే
అన్నియును అంతయును తెల్పే
దాపరిక కాఁదునులె నీతో
చెప్పలెను కారణము నీతో
తప్పులను చేయుటను లేదే
వాదనను మానుటయు కాదా
ప్రేమలను పంచుటయు కాదా
వేషములు వేయుటయు లేదే
మాటలను దాచుటయు లేదే
కాలమును బట్టి మనముందాం
--((*))--
మ-న , భ-య , జ-ర, స-త విలోమ గణములు.
UUU-III - IUI-UIU - IIU-UUI
సాహిత్యమ్ము మన - సుసంపదా మరీ - విధి వేదమ్మేను
మాహత్యమ్ము మన - సహాయ సంపదా - మది వేదమ్మేను
ఆహార్యమ్ము మన - సుసంతసం మరీ - తిథి వేదమ్మేను
స్నేహత్వమ్ము మన - అనంత సంపదా - సహ వేదమ్మేను
***
మత్తేభవిక్రీడితము - స/భ/ర/న/మ/య/లగ IIUU IIUI UI IIU - UUI UUIU 20 /14
వినయాన్నీ వివరించి చెప్పు కధలే - వేదాలవల్లేనులే
తనువంతా సహకారమే మనసుతో - తత్వాన్ని తెల్పే నులే
చినికుల్లా చిగురించి తృప్తి పరిచే - చైతన్య భావాలులే
అనుమానం అనుకోక హాయి తలపే - ఆదర్శ భావాలులే
సహనమ్మే మనసిచ్చే మార్గ మవుటే - సంభాషణాలన్నిటా
తహ తాపం తనువిచ్చే కావ్య మవుటే - పొందేనుపాలన్నిటా
అహమంతా వదిలించే సేవ ఇదియే - ఆందోళనాలన్నిటా
స్ప్రుహఉంచే చిరుహాసం తెల్పె మదియే - చిందేనుకాలన్నిటా
***
మత్తేభవిక్రీడితపు విలోమము - త/య/జ/మ/న/భ/గల
UUII UUI UIU - UUI IIUII UI ...20 /11
కాలం ఇదియే నీది నాదియే - సంఘంవదలదే మన ఆట
వేలం మదియే మీది మాదియే - మౌనం వదలదే మనవెంట
గాళం కథయే మాది మీదియే - గాధల్ తలుపులే మన వేట
శీలం తలపే కాదు లేదులే - శాస్త్రం తెలుపుటే మన మాట
నిను జూడన్ మనసయ్యె నాకు నెలఁతా - నీవేల రావేలకో
వనజాక్షీ వనమందు నామని సిరుల్ - భాసించె నొప్పారఁగా
విన నేవేళలఁ గోకిల స్వనములే - వెల్గీను పుష్పమ్ములే
దినమో వ్యర్థము నీవులేక పదముల్ - దీయంగఁ బాడంగ రా
++
మత్తేభవిక్రీడితపు విలోమము - త/య/జ/మ/న/భ/గల
UUII UUI UIU - UUI IIUII UI 20 కృతి 749901
++
ఏమయ్యెనొ యీవేళ నింగిలో - నీరీతి నుడుపమ్ములు వెల్గె
నేమయ్యెనొ యీవేళ డెందమం - దీరీతి నవభావము కల్గె
నేమయ్యెనొ యీవేళ గాత్రమం - దీరీతి నవరాగము పల్కె
నేమయ్యెనొ యీవేళ నీదు రూ-పీరీతి నను వీడక కుల్కె
వనమయూరము (UIII UIII - UIII UU).
* స్త్రీ తత్త్వం
ప్రేమలతొ మోహముయు - దాహముతొ తృప్తీ
స్నేహముతొ సౌఖ్యముయు - సేవలతొ తృప్తీ
ధైర్యముతొ పోరుటయు - దానముతొ తృప్తీ
కార్యములొ ఆదరము - ఆశయము తృప్తీ
సంబరము చేసెదము - శీతలము లందే
అందరము ఆడెదము - ఆకులతొ కూడా
చిందులను వేసెదము - సంతసము తోనే
పందెములు కాసెదము - బాధ్యతల తోనే
నాగరికము సొంతముకు - వాడుటయు తప్పే
వాదములు చేయుటయు - అందరికి తప్పే
తప్పులను తెల్పుటయు - మాత్రమున ఒప్పే
ఒప్పులను తప్పులని - వాదనయు తప్పే
మాటలను మార్చటయు - అన్యులకు తప్పే
బాధలను చెప్పుటయు - శాంతముకు ఒప్పే
కాంతలకు నవ్వులయె - ఆయుధము ఒప్పే
భ్రాంతులకు అంతయును - ఆధరణ ఒప్పే
--((*))--
UIIU UIIU IIUII UIIU
నేటి కవిత్వం -- *స్త్రీ తత్త్వం
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
కాలముతో సర్దుకొనే - మరణానికి అంచులలో
సేవలు అందించుటయే - సహధర్మము అందరిలో
భావముతో రాగముతో - అనురాగము పంచుటలో
జీవమనే సంఘములో - వనితామణి ప్రేమలురా
శారదగా పార్వతిగా - సలహాలను ఇచ్చుటలో
చేరువలో నీడలుగా - ఫలహారము చేయుటలో
వేకువలో సుందరమౌ - మనసేకము తప్పదులే
వేళకు నీ పూజలకై - విరిదండల వేయునురా
భాదలలో ఉండుటయే - సహవాసము ఊపిరిలే
పంచుటలో ముచ్చుటలో - సహకారము అందునులే
ప్రేమలతో భంధముగా - సుఖమిచ్చుట అవ్వునులే
భాద్యతతో భావమునే - మహిళా సమ సౌఖ్యములే
--((*))--
86. వసంత తిలక వృత్తము ...స,శ,ష, చ,జ, యతి మిత్రాక్షరాలు
త భ జ జ గ గ 14 /8 ( UUU UII IUI IUI UU )
సద్భావం నుండిన మనస్సున మందిరమ్మే
విద్వంసం బుద్ధులను మానుట మంచి దయ్యా
ఉధ్యమ్మే జర్పుట సకాలము జీవ రక్షే
ఉద్యోగం పొందియు విశాల్ భయమ్ము వద్దే
దేవానాం సేవలు మనోమయమౌను సర్వా
ర్ధంవేదం పాఠము సరాగమయమౌను విశ్వా
సంవైనం జీవితము సాగరము మల్లె సమ్మూ
హం వ్యాఖ్యే ప్రేమలకు హాయిగను చూపు లక్ష్యం
కర్తవ్యం నేత పలుకుల్లె సమస్య తెచ్చే
ప్రారబ్ధం నేరములు మల్లె వయస్సు మెచ్చే
కారుణ్యం లేకయును కల ఉషస్సు వచ్చే
ఆరాటం తృపి పరచు టే మనస్సు విచ్చే
***
మత్తేభ విక్రీడితము..,,, మత్తేభ - ఆనందం 2.గణాలు,.....
స భ ర న మ య వ (లగ) IIU UII UIU I I I UUU IUU IU
చెలిమే జీవిత శోభయా పరము సాపెక్షా సకాలం కదా
కలిమే కీలక కారణం తరము భావప్యా ప్రధానం కదా
బలిమే భీకర బోధయా కరము మామంచే సుతారం కదా
పలికే మాటల భావమే నిజము మౌనంగా సమాన్యం కదా
సమయానంద వినోదమే సమయ భాషల్లే మనస్సే వరిం
చి మరోమాట పఠించకే వినయ సాహిత్యం తపస్సే భరిం
చి మహావృక్షము వల్లె జ్ఞానమును సాన్నిత్యం యసస్సే కుటుం
బ మహత్తే తరుణోదయం మమత మాటల్లో ఉషస్సే కదా
కలలే కాలము కవ్వమే సమము హృద్యంలో వివాదం కదా
పిలుపే వేదము సవ్యమే సమము తన్మాయే నినాదం కదా
కథయే సాగును నిత్యమే సమము కావ్యంగా వినోదం కదా
జతయే కూడును విద్యయే సమము సంతృప్తే సకాలం కదా
***
నేటి ఛందస్సు త్రి భం గిగా తరంగం వృత్తము
IIU UU U IIUU. UUUUU UU
సమరా సౌమ్యా...... ధారణ వీరా .. సర్వార్ధాన్నేతెల్పేరా
మురలీలోలా .. మోహనలీలా...... ధర్మార్ధాన్నేతెల్పేరా
వరమీయంగా....... ధైర్యము తోనే ప్రశ్నాభావంతెల్పేరా
మదిదోచంగా...... మానసవీణా.... పుణ్యశ్లోకాసచ్ఛీలా
వినయమ్మే ... ధర్మోత్తర మేగా... సమ్మోహమ్మే భాగ్యం గా
సమయమ్మే కార్యోత్తరమేగా ... సంతోషమ్మే భాగ్యం గా
తరుణీ లీలా ... ప్రేమల గోలా .... వాశ్వాసమ్మే భాగ్యం గా
మనసే మాయా ..... ప్రాభవ మంతా ... ధైర్యంగా నే ప్రేమమ్మే
--(())--
మ మ త న న న న లగ .. మత్తాక్రీడ -8 16
UUU UUU UUI III III III IU
నేటి కవిత్వం - మత్తాక్రీడ
సాహిత్యామృత్వమ్మే విశ్వాస వినయ వినమృతము తెలిపే
స్నేహమ్మే నిత్యానందాస్థిత్వ సహజ తరుణ మది తెలిపే
ఆహ్లాదమ్మే ప్రాధాన్యమ్మే సకల వినిమయ వినయ మలుపే
ప్రహ్లాదమ్మే సంసారమ్మే కలసి తనువు తపన మెరుపే
సాధ్యాసాధ్యమ్మే సేవా జీవితమునకు కళలగ మలుపే
ప్రాధాన్యత్వంబే ప్రేమా పోషణ విజయ పరము గెలుపే
విద్యా సాహిత్యమ్మే ఉద్యోగ విలువలు పెరిగిన పలుకే
అంధత్వాన్నీ తర్మే కాంతీ మన బతుకు కదలిక మెరుపే
UUU UUU UUI III III III IU
నేటి కవిత్వం - మత్తాక్రీడ
సాహిత్యామృత్వమ్మే విశ్వాస వినయ వినమృతము తెలిపే
స్నేహమ్మే నిత్యానందాస్థిత్వ సహజ తరుణ మది తెలిపే
ఆహ్లాదమ్మే ప్రాధాన్యమ్మే సకల వినిమయ వినయ మలుపే
ప్రహ్లాదమ్మే సంసారమ్మే కలసి తనువు తపన మెరుపే
సాధ్యాసాధ్యమ్మే సేవా జీవితమునకు కళలగ మలుపే
ప్రాధాన్యత్వంబే ప్రేమా పోషణ విజయ పరము గెలుపే
విద్యా సాహిత్యమ్మే ఉద్యోగ విలువలు పెరిగిన పలుకే
అంధత్వాన్నీ తర్మే కాంతీ మన బతుకు కదలిక మెరుపే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి